API
-
చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం
ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ సేవలకు సంబంధించి వినియోగదారులు తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం కలిగినట్లు వినియోగదారులు గుర్తించారు. ఈ విషయాన్ని పలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. చాట్‌జీపీటీతోపాటు ఓపెన్ఏఐకు చెందిన ఏపీఐ, సొర(sora-రియల్‌టైమ్ ఇమేజ్ జనరేట్ చేసే ఏఐ) సేవలు కూడా ప్రభావితం చెందినట్లు తెలిపారు.చాట్‌జీపీటీతోపాటు ఇతర అనుబంధ సంస్థల్లో తలెత్తిన సమస్యను ఓపెన్ఏఐ అంగీకరించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ పోస్ట్ చేసింది. ‘ప్రస్తుతం కంపెనీ సేవల్లో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాం. సమస్యను గుర్తించాం. దాన్ని పరిష్కరించేందుకు పని చేస్తున్నాం. మీకు కలిగిన అంతరాయానికి క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఈ విషయంపై త్వరలో మీకు అప్డేట్ చేస్తాం’ అని ఓపెన్ఏఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఆన్లైన్ సర్వీసులను ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ ప్రకారం, చాట్‌జీపీటీ ఆఫ్‌లైన్‌లో ఉండటంపై భారీగానే ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపింది.We're experiencing an outage right now. We have identified the issue and are working to roll out a fix.Sorry and we'll keep you updated!— OpenAI (@OpenAI) December 12, 2024ఇదీ చదవండి: రూ.5 కోట్ల వాచ్‌తో జుకర్‌బర్గ్.. ప్రత్యేకతలివే..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్మెటా ఆధ్వర్యంలోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవల్లో యూఎస్‌లో ఇటీవల అంతరాయం ఏర్పడింది. దాదాపు 27,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఫేస్‌బుక్‌తో సమస్య ఏర్పడినట్లు తెలిపారు. 28,000 కంటే ఎక్కువ మంది యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. -
టాలీ నుంచి ప్రైమ్ 5.0
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపార నిర్వహణ సాఫ్ట్వేర్ సంస్థ టాలీ తాజాగా ఏపీఐ ఆధారిత టాలీప్రైమ్ 5.0 వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. జీఎస్టీ పోర్టల్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండా ‘కనెక్టెడ్ జీఎస్టీ’ ఫీచరు పొందుపర్చిన ఈ సమగ్ర వెర్షన్‌తో సంస్థలకు సమయం ఆదా అవుతుంది. అలాగే కచి్చతత్వం పెరుగుతుందని కంపెనీ సౌత్ జోన్ జీఎం అనిల్ భార్గవన్ తెలిపారు. ప్రస్తుతం తమకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.20 లక్షల పైచిలుకు కస్టమర్లు ఉన్నారని చెప్పారు. వచ్చే మూడేళ్లలో 30–40 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 25 లక్షలుగా ఉన్న కస్టమర్లను 2026–27 నాటికి 35 లక్షలకు పెంచుకోనున్నట్లు వివరించారు. ఇందుకోసం ఏటా మరిన్ని కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నట్లు అనిల్ వివరించారు. -
మైక్రోసాఫ్ట్‌పై ట్విటర్ సంచలన ఆరోపణలు!
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సోషల్ మీడియా డెవలపర్ నిబంధనల్ని ఉల్లంఘించి తమ డేటాను వినియోగిస్తుందంటూ ట్విటర్ సంచలన ఆరోపణలు చేసినట్లు ‘ఏఎఫ్‌పీ’ నివేదిక తెలిపింది. గతంలో పలు మార్లు నిబంధనల్ని ఉల్లంఘించి మైక్రోసాఫ్ట్ డేటాను సేకరించిందని మస్క్, అటార్నీ అలెక్స్ స్పైరో (మస్క్ తరుపు న్యాయవాది) సంతకంతో కూడిన లెటర్‌ను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు పంపినట్లు తెలుస్తోంది. చదవండి👉 ‘AI’ వల్ల ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా?.. సత్య నాదెళ్ల ఏమన్నారంటే? ఆ లెటర్ ఆధారంగా..ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ట్విటర్ నుంచి మైక్రోసాఫ్ట్ డేటా సేకరించడాన్ని నిలిపివేసింది. అయితే అప్పటి వరకు తమ సంస్థ యూజర్ల డేటాను వినియోగించుకున్నందుకు గాను మైక్రోసాఫ్ట్ రుసుము చెల్లించాలని, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ (ఏపీఐ) ఫోరం డెవలపర్ల తరుపున మస్క్ డిమాండ్ చేశారు. అంతేకాదు రెండేళ్ల నుంచి మైక్రోసాఫ్ట్ ట్విటర్ కంటెంట్‌ను గుర్తించి, నియంత్రించే ప్రయత్నించినట్లు ట్విటర్ ఆరోపించింది. అయితే, ఆ డేటాను ఎక్కడ స్టోర్ చేశారు? స్టోర్ చేసిన డేటాతో ఏం చేశారో? జూన్ 7లోగా వివరణ ఇవ్వాలని సూచించింది. తాజాగా, ట్విటర్ పంపిన లెటర్‌పై మైక్రోసాఫ్ట్ స్పందించింది. మస్క్ తమకు లెటర్ పంపినట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే, ఆ లెటర్‌పై రివ్యూ జరిపి తగిన విధంగా స్పందిస్తామని, ఆ సంస్థతో తాము సఖ్యతతో ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. మైక్రోసాఫ్ట్, గూగుల్‌ను ఎదుర్కొనేలా మైక్రోసాఫ్ట్ కృత్తిమ మేధ ఆధారిత టూల్ చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్‌కు పోటీగా అమెరికాలోని నెవడా రాష్ట్రంలో ఎక్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. పరోక్షంగా చాట్‌జీపీటీని వ్యతిరేకిస్తున్నారు. గత ఏప్రిల్‌లో మైక్రోసాఫ్ట్ చట్ట విరుద్దంగా ట్విటర్ డేటా సాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు శిక్షణ ఇస్తుందని, దావా వేసేందుకు సమయం ఆసన్నమైందని ట్వీట్ చేశారు. కాగా, డెవలపర్ల ఫోరం తరుపున మాట్లాడుతున్న మస్క్.. మైక్రోసాఫ్ట్ నుంచి ఫీజులు వసూలు చేసి తద్వారా ఆదాయాన్ని గడించనున్నారని వెలుగులోకి వచ్చిన రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 అమ్మకానికి సుందర్ పిచాయ్ ఇల్లు.. కొనుగోలు చేసిన యాక్టర్.. ఎవరో తెలుసా? -
కంపెనీలకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: ఇటీవల కొద్ది రోజులుగా సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రైమరీ మార్కెట్ కొంతమేర నెమ్మదించింది. అయితే తిరిగి మరోసారి ఊపందుకోనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దోహదపడనుంది. నిధుల సమీకరణకు తాజాగా సెబీ నుంచి అనుమతి పొందిన కంపెనీల జాబితాలో ఏపీఐ హోల్డింగ్స్, వెల్నెస్ ఫరెవర్ మెడికేర్, సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ చేరాయి. కాగా.. మరోవైపు స్పెషాలిటీ మెరైన్ కెమికల్ తయారీ కంపెనీ ఆర్కియన్ కెమికల్స్ ఐపీవో ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ సాధించే యోచనలో ఉంది. వివరాలు చూద్దాం.. ఫార్మ్ఈజీ.. ఫార్మసీ ప్లాట్‌ఫామ్ ఫార్మ్‌ఈజీకి మాతృ సంస్థ ఏపీఐ హోల్డింగ్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. తద్వారా రూ. 6,250 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా తాజా ఈక్విటీని జారీ చేయనుంది. ఐపీవో నిధుల్లో రూ. 1,929 కోట్లు రుణ చెల్లింపులు, వృద్ధి అవకాశాలకు రూ. 1,259 కోట్లు, కొనుగోళ్లు తదితర వ్యూహాలకు రూ. 1,500 కోట్లు చొప్పున వెచి్చంచనుంది. వెల్నెస్ మెడికేర్ అదార్ పూనావాలాకు పెట్టుబడులున్న వెల్నెస్ ఫరెవర్ మెడికేర్ ఐపీవో ద్వారా రూ. 1,600 కోట్లవరకూ సమకూర్చుకునే యోచనలో ఉంది. ఓమ్నిచానల్ రిటైల్ ఫార్మసీ కంపెనీ రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో 1.60 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ఇటీవలే బోర్డులో కొత్తగా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లను నియమించుకుంది. సీఎంఆర్ గ్రీన్ మెటల్ రీసైక్లింగ్ కంపెనీ సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. దీనిలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 3.34 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులతోపాటు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఐపీవోకు ఆర్కియన్ కెమ్ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు న్యూఢిల్లీ: స్పెషాలిటీ మెరైన్ కెమికల్ తయారీ కంపెనీ ఆర్కియన్ కెమికల్స్ పబ్లిక్ ఇష్యూకి సిద్ధపడుతోంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 2,200 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.9 కోట్ల షేర్లను సైతం కంపెనీ ప్రమోటర్లు, ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఇన్వెస్ట్మెంట్ సంస్థలలో పిరమల్ గ్రూప్, బెయిన్ క్యాపిటల్ మధ్య ఏర్పాటైన భాగస్వామ్య సంస్థ రిసర్జెన్స్ ఫండ్ ప్రధానంగా వాటాను ఆఫర్ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులను మారి్పడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) చెల్లింపులకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. 2021 మార్చితో ముగిసిన ఏడాది కంపెనీ దాదాపు రూ. 741 కోట్ల టర్నోవర్ సాధించింది. -
సుప్రియా లైఫ్‌సైన్స్ ఐపీవో సక్సెస్
న్యూఢిల్లీ: ఫార్మా రంగ ఆర్అండ్డీ కార్యకలాపాలతోపాటు.. ఏపీఐలను రూపొందిస్తున్న కంపెనీ సుప్రియా లైఫ్‌సైన్స్ ఐపీవో విజయవంతమైంది. ఇష్యూ చివరి రోజు సోమవారానికల్లా 71 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.45 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. దాదాపు 104 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వెల్తువెత్తాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం సంపన్న వర్గాల విభాగంలో 161 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 56 రెట్లు అధికంగా బిడ్స్ లభించాయి. ఇక అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలోనూ 32 రెట్లు స్పందన కనిపించింది. షేరుకి రూ. 265–274 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 700 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని వాటాదారులు, ప్రమోటర్లు ఆఫర్ చేయడంతోపాటు, మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను కంపెనీ తాజాగా జారీ చేయనుంది. గత బుధవారం(15న) యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల జారీ ద్వారా కంపెనీ రూ. 315 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. తాజా ఈక్విటీ నిధులను పెట్టుబడి వ్యయాలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. -
పబ్లిక్ ఇష్యూకి ఫార్మ్ఈజీ
న్యూఢిల్లీ: ఫార్మసీ ప్లాట్‌ఫాం ఫార్మ్ఈజీ మాతృ సంస్థ ఏపీఐ హోల్డింగ్స్ తాజాగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా రూ. 6,250 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి బుధవారం ముసాయిదా ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఈ ఇష్యూ పూర్తిగా కొత్త షేర్ల జారీ రూపంలోనే ఉంటుందని, ప్రస్తుత వాటాదారులెవరూ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో షేర్లు విక్రయించడం లేదని సంస్థ తెలిపింది. సుమారు రూ. 1,250 కోట్లకు ప్రీ–ఐపీవో ప్లేస్మెంట్ కింద షేర్లు కేటాయిస్తే.. ఇష్యూ పరిమాణాన్ని తగ్గించే అవకాశం ఉందని పేర్కొంది. ఐపీవో ద్వారా సమీకరించే నిధుల్లో కొంత భాగాన్ని రూ. 1,929 కోట్ల రుణభారాన్ని తిరిగి చెల్లించేందుకు, వ్యాపార వృద్ధికి రూ. 1,259 కోట్లు, ఇతరత్రా అవసరాలకు రూ. 1,500 కోట్లు వినియోగించనున్నట్లు ఫార్మ్ఈజీ పేర్కొంది. జొమాటో, నైకా, పాలసీబజార్ తదితర ఐపీవోలు విజయవంతమైన నేపథ్యంలో ఫార్మ్ఈజీ కూడా పబ్లిక్ ఇష్యూకి వస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీఐ హోల్డింగ్స్ సంస్థ టెలీకన్సల్టేషన్, డయాగ్నోస్టిక్స్, రేడియాలజీ టెస్టులు వంటి సర్వీసులు కూడా అందిస్తుంది. -
మహమ్మారి ఎఫెక్ట్: రెండేళ్లు తగ్గిన భారతీయుల ఆయుర్దాయం
న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారతీయుల ఆయుర్దాయం దాదాపు రెండేళ్లు పడిపోయిందని ముంబైలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ నిర్వహించిన అస్టాటిస్టికల్ స్టడీ వెల్లడించింది. ఐఐపీఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సూరయకాంత్ యాదవ్ ప్రకారం, పురుషులు, స్త్రీల ఆయుర్దాయం 2019 సంవత్సరంలో 69.5 సంవత్సరాలు, 72 సంవత్సరాల ఉండగా.. 2020లో అది వరుసగా 67.5 సంవత్సరాలు, 69.8కి తగ్గిందని తెలిపారు. మహమ్మారి కారణంగా గడిచిన రెండేళ్లలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనివల్ల దేశవ్యాప్తంగా మరణాల నమూనాలపై కరోనా మహమ్మారి ప్రభావాన్ని విశ్లేషించడానికి ఈ అధ్యయనం నిర్వహించారు. 35-69 ఏళ్లలోపు పురుషులపై కోవిడ్ ప్రభావం అత్యధికంగా ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది. కోవిడ్ కారణంగా ఈ వయస్సు వారు అధికంగా మరణించడంతో వారి ఆయుర్దాయం గణనీయంగా పడిపోయినట్లు స్టడీ తెలిపింది. (చదవండి: యూకేను వణికిస్తున్న కరోనా వైరస్ కొత్తరకం వేరియెంట్) ఐఐపీఎస్ 145 దేశాల గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీజ్ స్టడీ అండ్ కోవిడ్-ఇండియా అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ (ఏపీఐ) పోర్టల్ ద్వారా సేకరించిన డేటాపై నిర్వహించిన స్టడీ ఆధారంగా ఈ విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా యాదవ్ మాట్లాడుతూ.. ‘‘కోవిడ్ ప్రభావం గత దశాబ్దంలో ఆయుర్దాయం వయసును పెంచడానికి మేము చేసిన కృషిని, సాధించిన పురోగతిని కోవిడ్ తుడిచిపెట్టేసింది. మహమ్మారి ఫలితంగా ప్రస్తుతం భారతదేశ ఆయుర్దాయం ఇప్పుడు 2010లో ఉన్నట్లే ఉంది. దానిని చేరుకోవడానికి మాకు సంవత్సరాలు పడుతుంది’’ అని తెలిపారు. (చదవండి: డెల్టా వేరియంట్‌పై కోవిషీల్డ్ 90% రక్షణ) అయితే, ఆఫ్రికాతో సహా దేశాల్లో గతంలో వచ్చిన అంటువ్యాధులు ఆయుర్దాయంపై తీవ్ర ప్రభావం చూపాయని, అయితే కొన్ని సంవత్సరాల్లో అది తిరిగి పూర్వ స్థితికి వచ్చిందని ఐఐపీఎస్ డైరెక్టర్ డాక్టర్ కేఎస్ జేమ్స్ తెలిపారు. చదవండి: కరోనా ఎండమిక్ స్టేజ్‌కు చేరుకుంటున్నట్టేనా? -
రూ.1000 లోపే ప్రాణాధార ఔషధాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డయాబెటిక్, క్యాన్సర్, గుండె సంబంధిత దీర్ఘకాలిక ఔషధాలన్నీ చౌక ధరలకే లభించనున్నాయి. ఆయా మందుల తయారీకి అవసరమైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ)ను హైదరాబాద్‌లోని ఐఐసీటీ అభివృద్ధి చేయనుంది. స్థానిక రసాయనాలు, వనరులతో అభివృద్ధి చేసిన ఏపీఐలతో తుది ఔషధ తయారీ ఖర్చు తగ్గుతుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో చెప్పారు. ఇప్పటికే 53 రకాల దీర్ఘకాలిక ఔషధాల ఏపీఐలకు కేంద్రం ఓకే చెప్పిందని ఆయన తెలిపారు. తొలి దశలో కరోనా వైరస్ నియంత్రణ మందుల ఏపీఐలను అభివృద్ధి చేస్తున్నామని, వచ్చే 3 నెలల్లో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. చైనా దిగుమతిని తగ్గించడమే లక్ష్యం.. ప్రస్తుతం దేశీయ ఫార్మా కంపెనీలు ఔషధాల తయారీకి అవసరమైన ఇంటర్మీడియట్స్‌ను 68–70 శాతం వరకు చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. దీంతో మందుల ధరలు పెరుగుతున్నాయి. దీనికి పరిష్కారం చూపించేందుకే దేశీయంగా లభ్యమయ్యే ముడి పదార్థాలు, వనరులతోనే ఇంటర్మీడియట్స్‌ను తయారు చేసి.. ఔషధా లను అభివృద్ధి చేయాలని ఐఐసీటీ నిర్ణయించింది. పేటెంట్ పూర్తి కాకముందే సంబంధిత డ్రగ్ మేకర్స్ నుంచి వీటి తయారీకి అనుమతి తీసుకుంటారు. స్థానికంగానే రసాయనాలు, ముడి పదార్థాలు, టెక్నాలజీని అభివృద్ధి చేస్తారు. ‘‘తుది ఔషధాల తయారీ కోసం సన్‌ఫార్మా, సిప్లా వంటి ఫార్ములేషన్ ఫార్మా కంపెనీలతో ఐఐసీటీ ఒప్పందం చేసుకుంది. 3–5 వేల వరకు ధర ఉండే ఔషధాలను వెయ్యి రూపాయల కంటే తక్కువ ధరకు తీసుకురావటమే ప్రధాన లక్ష్యమని చంద్రశేఖర్ తెలిపారు. వైజాగ్‌లో డైక్లోరో యాసిడ్ తయారీ.. రక్త కణాలు, విటమిన్లకు సంబంధించిన ఔషధాల తయారీలో ఉపయోగించే లిపోయిక్ యాసిడ్ ఏపీఐ తయారీకి డైక్లోరో యాక్టినో యాసిడ్ అనే ముడి పదార్థం కావాలి. ప్రస్తుతం దీన్ని ఫార్మా కంపెనీలు పెద్ద మొత్తంలో చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే ఐఐసీటీ ఏం చేస్తుందంటే.. పారిశ్రామిక ఉత్పత్తుల నుంచి వెలువడే క్లోరిక్ గ్యాస్, ఓలినమైట్ అనే రెండు రసాయన మిశ్రమాలతో డైక్లోరో యాసిడ్‌ను తయారు చేస్తుంది. దీన్ని బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ ఫార్మా కంపెనీకి విశాఖపట్నంలో ఉన్న అనుబంధ యూనిట్లో ప్రాసెస్ చేస్తుంది. ఇక్కడి నుంచే ఫార్మా కంపెనీలకు అవసరమైన డైక్లోరో యాక్టినో యాసిడ్‌ను అందించనుంది. దీంతో ముడిసరుకు ధర రెండు రెట్లు తగ్గిపోతుంది. రెమిడిస్‌విర్ ధర తక్కువలోనే.. ప్రస్తుతం కరోనా వైరస్ చికిత్సలో ఉపయోగించే ఔషధాల తయారీకి అవసరమైన ఏపీఐల అభివృద్ధి మీద దృష్టిసారించింది. ఇప్పటికే రెమిడిస్‌విర్, ఫెపిఫిరావిర్, ఆర్బిటాల్ ఏపీఐలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రూ.4–5 వేలుగా ఉన్న రెమిడిస్‌విర్ ధర.. వెయ్యి లోపు తీసుకొచ్చేందుకు స్థానిక వనరులతో ఇంటర్మీడియట్స్‌ను తయారు చేస్తోంది. దీంతో పాటూ సాక్వినావేర్, డపాలిప్లోజన్, డలార్జిన్ వంటి కరోనా మెడిసిన్స్ మాలిక్యూల్స్‌ను కూడా డెవలప్ చేస్తోంది. వచ్చే 3 నెలల్లో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని ఐఐసీటీ సీనియర్ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ఎంపిక చేసిన 53 ఏపీఐలతో కొన్ని.. అమోక్సిసిలిన్, సెపాలెక్సిన్, డోక్సిసైలిన్, ఆస్ప్రిన్, రిఫాంపిసిన్, విటమిన్ బీ1, బీ6, సిప్రోఫ్లోక్సిన్, కార్బిడోపా, పారాసిటమాల్, లూపినవిర్, రిటోనవిర్. వీటి తయారీకి మూడేళ్ల సమయం పడుతుంది. సుమారు 15 మంది శాస్త్రవేత్తల బృందం పనిచేస్తున్నారు. -
చేతులు కలిపిన ఐఐసీటీ, లాక్సాఐ
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఫార్మా రంగానికి కీలకమైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్ (ఏపీఐ) విషయంలో స్వావలంబన సాధించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఏపీఐల విషయంలో ఇప్పటివరకు మనదేశం చైనా పై అధికంగా ఆధారపడుతోంది. అయితే కరో నా కష్టకాలంలో చైనా నుంచి ముడిసరుకులు, ఏపీఐలు తేవడంలో ఇబ్బందులు ఏర్పడటం తో ప్రభుత్వం సొంతంగా తయారు చేసుకుం టేనే మేలన్న అంచనాకు వచ్చింది. ఈ నిర్ణయాన్ని అమల్లో పెట్టేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) లాక్సాఐ ఇంటర్నేషనల్ అనే దేశీ కంపెనీతో జత కట్టిం ది. ముందుగా కరోనా వైరస్ చికిత్సకు ఐఐసీటీ అభివృద్ధి చేస్తున్న మందు తయారీ కోసం రెండు కంపెనీలూ పనిచేయనున్నాయి. యుమిఫెనోవిర్, రెమిడెస్విర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లను కూడా ఈ భాగస్వామ్యంలో తయారు చేయనున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మలేరియా చికిత్సకు ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు భారత్ ఈ మందు తయారు చేసేందుకు కూడా చైనా సరఫరా చేసే రసాయనాలపై ఆధారపడుతోంది. ఐఐసీటీ, లాక్సాఐల భాగస్వామ్యం కారణంగా ఇకపై ఈ మందులు సొంతంగా, చౌకగా తయారు చేసుకోవచ్చునని అంచనా. ఏపీఐలతోపాటు ఫార్మా రంగానికి కీలకమైన మరిన్ని రసాయనాలను సొంతంగా అభివృద్ధి చేయడం ఈ భాగస్వామ్యపు లక్ష్యం. 2007లో ఏర్పాటైన లాక్సాఐ ఇంటర్నేషనల్ కొత్త కొత్త రసాయనాలను గుర్తించడంతోపాటు ప్రపంచస్థాయి కంపెనీలకు విక్రయిస్తోంది. -
చైనా మందులకు చెక్
చైనాకు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోందా? ప్రధానంగా దిగుమతులపై దాడికి ధోవల్ రెడీ అవుతున్నారా? అనేక విషయాల్లో భారత్‌కు తలనొప్పులు తెస్తున్న చైనాను చావు దెబ్బ కొట్టేందుకు భారత్ సన్నాహాలు చేస్తోందా? ఇంతకూ భారత్ మదిలో ఏముంది? తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చదవాల్సిందే. భారత్‌కు దశాబ్దాలుగా పక్కలో బల్లెంలా తయారైనా చైనాకు గట్టి గుణపాఠం చెప్పేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ముఖ్యంగా డోక్లాం వివాదం అనంతరం ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో చైనా దిగుమతుల మీద ఆధాపరపడ్డటం మంచిది కాదన్న అభిప్రాయంతో భారత్ ఉంది. ఇప్పటి వరకూ భారత్ చైనా నుంచి ఎలక్ట్రానిక్, మెడికల్ ఎక్విప్మెంట్స్ను అధికంగా దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఫార్మాస్యుటికల్స్, వాటి తయారీకి ఉపయోగించే ముడి సరుకు, మెడికల్ ఎక్విప్మెంట్స్ను అధికంగా భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో వీటి నాణ్యతపై మరిన్ని కఠిన పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం చైనా నుంచి 70 నుంచి 80 శాతం యాక్టివ్ ఫార్మాసుటికల్స్ ఇంగ్రీడియంట్ (ఏపీఐ)లు దిగుమతి అవుతున్నాయి. చైనా నుంచి ఇంత మొత్తంలో ఏపీఐలను దిగుమతి చేసుకోవడం దేశానికి మంచిది కాదని 2014లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రభుత్వానికి సూచించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తెలెత్తితే.. ప్రజారోగ్యం ఇబ్బందుల్లో పడుతుందని అప్పట్లోనే ఆయన చెప్పారు. ధోవల్ వ్యూహం అజిత్ ధోవల్ సూచనలతో భారత ప్రభుత్వం మేకిన్ ఇండియాలో భాగంగా ఏపీఐలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం నిపుణులతో కూడిన ఒక కమిటిని ప్రభుత్వం నియమించింది. నిత్యం దేశంమీద విషం కక్కే చైనా నుంచి ఏపీఐలను దిగుమతి చేసుకోవాలనుకోవడం లేదని డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా డీసీజీఐ జీఎన్ సింగ్ అన్నారు. ప్రస్తుతం దేశీయంగా ఉన్న ఔషధ సంస్థలకూ ఏపీఐలను తయారు చేసే లైసెన్స్‌లు ఇస్తే.. మన దగ్గరే నాణ్యమైన వస్తువులు, మందులు తయారవుతాయని అన్నారు. ఇప్పటివరకూ ఉన్న డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ చట్టాల్లో పలు మార్పులు చేసేందుకు ప్రభుత్వం ప్రాణాళికలు సిద్ధం చేస్తోందని జీఎన్ సింగ్ తెలిపారు. ధరలు తగ్గే అవకాశం ఏపీఐలను చైనా నుంచి భారత్‌కు దిగుమతి చేసుకోవడం కన్నా.. వాటిని ఇక్కడే రూపొందిచుకుంటే.. ధరల్లో 15 నుంచి 20 శాతం తగ్గుతాయని ఇండియన్ ఫార్సాస్యుటికల్స్ అలయన్స్ సెక్రెటరీ జనరల్ డీజీ షా తెలిపారు. ప్రస్తుతం చైనా నుంచి చేసుకునే దిగుమతులపై సుంకాన్ని మరింతగా పెంచితే.. దేశీయంగా ఇప్పటికే ఉన్న ఏపీఐలతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన చెప్పారు. -
నాట్కో విస్తరణ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి
న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మా కంపెనీ నాట్కో విస్తరణ ప్రాజెక్టుకు పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని మేకగూడ గ్రామంలో నాట్కో ఫార్మా కంపెనీకి ప్రస్తుతమున్న 34 ఎకరాల స్థలంలో రూ.480 కోట్ల వ్యయ అంచనాతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తయితే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియెంట్స్ (ఏపీఐ), ఏపీఐ ఇంటర్మీడియెట్ల తయారీ సామర్థ్యం వార్షికంగా ప్రస్తుతమున్న 115.5 టన్నుల నుంచి 645 టన్నులకు వృద్ధి చెందనుంది. దీని ద్వారా 1,200 మందికి ప్రత్యక్షంగా, 300 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ‘‘నాట్కో ఫార్మా విస్తరణ ప్రాజెక్టుకు పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది’’ అని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. కొన్ని షరతులకు లోబడి ఈ ఆమోదం ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఏపీఐ, ఏపీఐ ఇంటర్మీడియెట్స్ తయారీ సామర్థ్య విస్తరణ ప్రాజెక్టుతో థెరప్యూటిక్ ఔషధాల అందుబాటును పెంచడమే కాకుండా, దిగుమతుల భారాన్ని తగ్గిస్తుందని నాట్కో ఫార్మా తెలిపింది. నాట్కోకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదుచోట్ల తయారీ కేంద్రాలున్నాయి. -
ఔషధ ముడి సరుకు దిగుమతులు ఆందోళనకరం
♦ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ♦ గ్లోబల్ బయోటెక్నాలజీ సదస్సు ప్రారంభం న్యూఢిల్లీ: ఔషధ ముడి సరకు (ఏపీఐ- యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్) దిగుమతులు భారీగా పెరిగిపోతుండడం పట్ల వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. దిగుమతులపై ఆధారపడని వ్యవస్థ దిశగా నడవడానికి నిపుణులు, ఫార్మా పరిశ్రమ వర్గాలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘‘మనం ఫార్మా, బయోటెక్నాలజీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. అయినా ఏపీఐ దిగుమతులు భారీగా పెరుగుతుండడం పట్ల నాకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ’’ అని ఇక్కడ జరిగిన గ్లోబల్ బయోటెక్నాలజీ సదస్సులో ఆమె పేర్కొన్నారు. జనరిక్ మందులకు కేంద్రంగా ఉంటూ... బయోటెక్నాలజీలో ఎంతో విజయం సాధించిన భారత్‌కు ఈ రంగంలో అపార అనుభవం ఉందన్నారు. ఇలాంటి దేశం దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితులు అధికమవరాదని అన్నారు. 2010-11లో 3 బిలియన్ డాలర్ల ఏపీఐ దిగుమతులు జరిగితే ఇందులో చైనా వాటానే 1.88 బిలియన్ డాలర్లు ఉండడం గమనార్హం. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు చౌక ధరకు లభించే జనరిక్ మందులకు భారత్‌పై ఆధారపడుతున్నాయని ఆమె ఈ సందర్భంగా వివరించారు. స్పెషల్ ఎకనమిక్ జోన్లలో ఫార్మా సంబంధ యూనిట్లకు అదనపు రాయితీలు ఇవ్వాలని రాష్ట్రాలను వాణిజ్యమంత్రిత్వశాఖ కోరుతున్నట్లు తెలిపారు. ఐటీ, ఈ-కామర్స్ రంగాల్లోనే కాకుండా బయోటెక్నాలజీ విభాగంలో కూడా స్టార్టప్స్‌కు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందని అన్నారు. రానున్న ఐదేళ్లలో బయోటెక్నాలజీ రంగంలో 1,000 నుంచి 1,500 వరకూ స్టార్టప్స్ వస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయమంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ, ఐటీ రంగం విప్లవం వచ్చిన 25 సంవత్సరాల తర్వాత వచ్చే దశాబ్దంలో దేశంలో బయోటెక్నాలజీ విప్లవం రాబోతోందని అన్నారు. ఈ రంగం అభివృద్ధిలో కేంద్రం, రాష్ట్రాలు, పరిశ్రమ, ఎన్జీఓల సహకారం అవసరం అని పేర్కొన్నారు. -
వైజాగ్ లారస్ ల్యాబ్స్‌లో వార్బర్గ్ పింకస్ పెట్టుబడి
రూ. 550 కోట్లతో మైనారిటీ వాటా ముంబై: విశాఖపట్టణం కేంద్రంగా పనిచేస్తున్న ఏపీఐ తయారీ సంస్థ లారస్ ల్యాబ్స్‌లో గ్లోబల్ పీఈ సంస్థ వార్బర్గ్ పింకస్ సుమారు రూ. 550 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. తద్వారా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన ఫిడిలిటీగ్రోత్ పార్ట్నర్స్, ఫిడిలిటీ బయోసెన్సైస్ జాబితాలోకి చేరింది. ఈ రెండు కంపెనీలూ 2012లో లారస్ ల్యాబ్స్‌లో ఇన్వెస్ట్ చేశాయి. కాగా, వార్బర్గ్ పెట్టుబడి విషయాన్ని లారస్ పేర్కొన్నప్పటికీ ఎంత వాటాను కొనుగోలు చేసిందీ వెల్లడించలేదు. కంపెనీ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రెడియంట్స్(ఏపీఐలు)ను అభివృద్ధి చేయడంతోపాటు, తయారు చేస్తుంది. యాంటీరిట్రోవైరల్(ఏఆర్వీ), కేన్సర్(అంకాలజీ), గుండె సంబంధిత జబ్బులు(కార్డియోవాస్కులర్), చక్కెర వ్యాధి చికిత్స(యాంటీ డయాబెటిక్) తదితర విభాగాల ఏపీఐలను లారస్ తయారు చేస్తోంది. వీటితోపాటు న్యూట్రాస్యూటికల్స్ తదితరాలను సైతం తయారు చేస్తుంది. వీటిని దేశ, విదేశీ జనరిక్ ఫార్మా దిగ్గజాలకు అందిస్తుంది. ఏపీఐలకు తోడు వేగంగా వృద్ధి చెందుతున్న కాంట్రాక్ట్ తయారీ బిజినెస్‌లోనూ కంపెనీకి ప్రవేశముంది. 2008లో కార్యకలాపాలు షురూ కంపెనీ 2008లో పూర్తిస్థాయిలో వాణిజ్య కార్యకలాపాలను మొదలుపెట్టింది. గడిచిన ఆర్థిక సంవత్సరం(2013-14) ముగిసేసరికి రూ. 1,200 కోట్ల ఆదాయాన్ని సాధించింది. వృద్ధి బాటలో ఉన్న ప్రస్తుత దశలో వార్‌బర్గ్‌తో జతకట్టడం సంతోషదాయకమని కంపెనీ సీఈవో డాక్టర్ సత్యనారాయణ చవా పేర్కొన్నారు. చౌక ధరల్లో ఉత్పత్తులు, సర్వీసులను అందించేందుకు వీలుగా కొత్తదనం, తయారీ నైపుణ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. తద్వారా కొత్త విభాగాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. వార్బర్గ్కున్న డొమైన్ నైపుణ్యం, గ్లోబల్ నెట్‌వర్క్‌లను వినియోగించుకోవడం ద్వారా కొత్త మార్కెట్లలో ప్రవేశిస్తామని, కస్టమర్లను పెంచుకుంటామని చెప్పారు. కొత్తదనం, పటిష్ట నిర్వహణ వంటి అంశాల ద్వారా లారస్ అభివృద్ధికి కృషి చేస్తున్న యాజమాన్యంపట్ల ఆసక్తిగా ఉన్నామని వార్బర్గ్ పింకస్ ఇండియా ఎండీ నితిన్ మల్హన్ వ్యాఖ్యానించారు.