హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపార నిర్వహణ సాఫ్ట్‌వేర్ సంస్థ టాలీ తాజాగా ఏపీఐ ఆధారిత టాలీప్రైమ్ 5.0 వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. జీఎస్‌టీ పోర్టల్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండా ‘కనెక్టెడ్ జీఎస్‌టీ’ ఫీచరు పొందుపర్చిన ఈ సమగ్ర వెర్షన్‌తో సంస్థలకు సమయం ఆదా అవుతుంది. అలాగే కచి్చతత్వం పెరుగుతుందని కంపెనీ సౌత్ జోన్ జీఎం అనిల్ భార్గవన్ తెలిపారు.
ప్రస్తుతం తమకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.20 లక్షల పైచిలుకు కస్టమర్లు ఉన్నారని చెప్పారు. వచ్చే మూడేళ్లలో 30–40 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 25 లక్షలుగా ఉన్న కస్టమర్లను 2026–27 నాటికి 35 లక్షలకు పెంచుకోనున్నట్లు వివరించారు. ఇందుకోసం ఏటా మరిన్ని కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నట్లు అనిల్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment