జీఎస్టీ పోర్టల్ రడీ
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) అమలు కోసం సాఫ్ట్వేర్ దాదాపు సిద్ధంగా ఉందని జీఎస్టీఎన్ ఛైర్మన్ నవీన్ కుమార్ వెల్లడించారు. క్రెడిట్ / డెబిట్ కార్డులు ద్వారా సులభంగా పన్ను చెల్లింపులు, రిటర్న్స్ కోసం ఉద్దేశించిన జీఎస్టీ పోర్టల్ ను మంగళవారం ప్రారంభించినట్టు తెలిపారు. www.gst.gov.in పేరుతో దీన్ని లాంచ్ చేసినట్టు చెప్పారు. ఈ పోర్టల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పని దాదాపు 60 శాతం పూర్తయిందని డిసెంబర్ నాటికి హార్డ్‌వేర్ పని పూర్తి కానుందని వివరించారు. అనంతరం ఈ సాఫ్ట్వేర్ ను డాటా సెంటర్లకు అందించి టెస్టింగ్ కోసం ఉంచుతామన్నారు. కేంద్ర రాష్త్ర ప్రభుత్వాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఒకే దేశం ఒకే పన్ను విధానం అమల్లోకి రానున్న విధానానికిగాను సాఫ్ట్వేర్ టెస్టింగ్ ప్రారంభమైనట్టు వెల్లడించారు.
2015 నవంబరులో పని ప్రారంభించిన తాము ఈ మేరకు పని పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. డాటా భద్రత కోసం న్యూఢిల్లీ, బెంగళూరులలో డాటా సెంటర్లను నెలకొల్పనున్నట్టు వెల్లడించారు. 65 లక్షల వ్యాట్ చెల్లింపుదారుల, సుమారు 20 లక్షల సేవా పన్ను చెల్లింపుదారులు, 3-4 లక్షల సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ చెల్లింపుదారులను ఈ కొత్త పోర్టల్‌కు బదిలీచేసే ప్రక్రియ ప్రారంభమైందని నవీన కుమార్ పీటీఐకి తెలిపారు. జీఎస్టీఎన్ (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ నెట్వర్క్) పిలిచే తాత్కాలిక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తున్నట్టు చెప్పారు. జీఎస్టీ కింద కింద కొత్త రిజిస్ట్రేషన్ల ఏప్రిల్ 2017 నుంచి ప్రారంభంకానున్నాయి.