సియోల్: అగ్ర రాజ్యం అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. తమ దేశం విషయంలో శత్రుత్వ విధానం ప్రదర్శించడంలో అమెరికా ముందు స్థానంలో ఉందన్నారు. అలాగే, కొరియా ద్వీపకల్పంలో అమెరికా ఉద్రిక్తతలను పెంచుతోందని చెప్పుకొచ్చారు.
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తాజాగా ప్యాంగ్‌యాంగ్‌లో నిర్వహించిన మిలటరీ ఎగ్జిబిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ.. అమెరికా మమ్మల్ని బాగా రెచ్చగొడుతోంది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచే నిర్ణయాలు తీసుకుంటోంది. ఇంతటి ఘర్షణ వాతావరణాన్ని ఇంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు. ప్రస్తుత పరిస్థితులు థర్మో న్యూక్లియర్ యుద్ధంలా మారే వరకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
కొరియా ద్వీపకల్పం ఇప్పటివరకు అణుయుద్ధ ప్రమాదాలే ఎరుగదు. అమెరికాతో చర్చలు జరిపేందుకు నేను ఎప్పుడో ముందుకు వచ్చాను. చర్చల కోసం నేను చాలా దూరం వెళ్లినప్పటికీ అక్కడి నుంచి సరైన స్పందన రాలేదు. అమెరికా.. మాపై దూకుడు, శత్రుత్వ విధానం ప్రదర్శించడంలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదని చెప్పుకొచ్చారు. అయితే, ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో ఆయనతో కిమ్ మూడు సార్లు భేటీ అయ్యారు. 2018-19 మధ్య కాలంలో సింగపూర్, హనోయ్, కొరియా సరిహద్దుల్లో వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చలు జరిపినా.. సఫలం కాలేదు. అనంతరం, రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
North Korean leader says past diplomacy only confirmed US hostility
North Korean leader Kim Jong Un says past negotiations with the United States only confirmed Washington's
"unchangeable" hostility toward
Pyongyang and described his nuclear buildup as the only way to counter pic.twitter.com/OenQzQLlu4— Simo saadi🇲🇦🇵🇸🇺🇸 (@Simo7809957085) November 22, 2024
ఇదిలా ఉండగా.. నార్త్ కొరియా కిమ్ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. త్వరలో అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టనున్న నేపథ్యంలో కిమ్ అలర్ట్ అయ్యారు. మళ్లీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉన్న క్రమంలో నార్త్ కొరియా సైన్యం అలర్ట్‌గా ఉండాలన్నారు. దీంతో, అమెరికాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కిమ్ జోంగ్ ఉన్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలను తయారు చేయాలని నార్త్ కొరియా అధికారులకు కిమ్ ఆదేశాలు జారీ చేశారు. కిమ్ ఆర్ఢర్‌తో కొరియా అధికారులు అణ్వాయుధాలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment