Kim Jong-un
-
‘పట్టుబడితే.. ఆ నరకం కన్నా చావడమే నయం!’
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కి.. పాశ్చాత్య దేశాలకు మధ్య ఉన్న వైరం గురించి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యాకు చేరువయ్యారు ఆయన. అయితే.. మిత్ర దేశం రష్యా కోసం ఇప్పుడు ఆయన ఎంతకైనా తెగించడానికి వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే తన సైన్యాన్ని బలి పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులు(North Korea Soliders) ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్నారు. అయితే.. ఇటు ఉకక్రెయిన్గానీ, అటు రష్యా గానీ ఆ విషయాన్ని కొట్టిపారేస్తున్నాయి. మరోవైపు.. ఉక్రెయిన్ సైన్యానికి పట్టుబడడం ఇష్టంలేక తమను తాము పేల్చేసుకుని ఆత్మాహుతి దాడులకు తెగబడుతున్నారు ఉత్తర కొరియా సైనికులు!. తాజాగా..గత వారం రోజులుగా ఉక్రెయిన్ ప్రత్యేక దళాలు దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో కుర్సుక్ రీజియన్‌లో దాడులు జరిపి ప్రత్యర్థి బలగాలను మట్టుబెట్టింది. ఆపై ఉక్రెయిన్ సైన్యం కొన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. అయితే అందులో ఓ సైనికుడు సజీవంగానే ఉండగా.. ఉక్రెయిన్ సైనికులను చూసి గ్రెనేడ్‌తో తనను తాను పేల్చేసుకున్నాడు. అయితే ఈ పేలుడులో ఉక్రెయిన్ సైనికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఉక్రెయిన్ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.Watch how Ukraine’s SOF repel North Korean troops assault in russia’s Kursk region.The special forces eliminated 17 DPRK soldiers. One North Korean soldier had set an unsuccessful trap for the rangers of the 6th Regiment and blew himself up with a grenade. pic.twitter.com/nObBOMnusI— SPECIAL OPERATIONS FORCES OF UKRAINE (@SOF_UKR) January 13, 2025మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంలో.. ఉత్తర కొరియా మాస్కోకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ సైనికులు తీవ్ర చర్యలకు పాల్పడుతున్నట్లు కీవ్ వర్గాలు ఇప్పుడు ఆధారాలతో సహా చెబుతున్నాయి.యుద్ధంలో ఒకవేళ ఉక్రెయిన్‌కు పట్టుబడితే.. యుద్ధ ఖైదీగా ఉండిపోవాలి. అంతేకాదు.. యుద్ధ నేరాల్లో ప్యాంగ్యాంగ్ పాత్ర కూడా నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. అందుకే పట్టుబడి ఉక్రెయిన్‌లో యుద్ధ ఖైదీలుగా ఉండడం కన్నా.. ఆత్మాహుతికి పాల్పడడం మేలు అని వాళ్లు భావిస్తున్నారు అని కీవ్ వర్గాలు భావిస్తున్నాయి.‘‘పట్టబడకుండా ప్రాణం తీసుకోవడం.. ఇదే నార్త్ కొరియా నేర్పేది’’ అని ఉత్తర కొరియా మాజీ సైనికుడు కిమ్(32) చెబుతున్నాడు. రష్యాలో నిర్మాణ ప్రాజెక్టులకు కాపలాగా ఉత్తర కొరియా సైన్యం తరఫు నుంచి వెళ్లి కిమ్ ఏడేళ్లపాటు పని చేశాడు. ఆపై 2022లో దక్షిణ కొరియాకు పారిపోయి తన ప్రాణం రక్షించుకున్నాడతను.‘‘ఉత్తర కొరియా సైన్యంలో చేరాలంటే.. ముందుగా అన్ని బంధాలను తెంచుకోవాలి. ఇళ్లు, భార్యాపిల్లలు అన్నింటిని వదిలేసుకోవాలి. సైన్యంలో వాళ్లకు బ్రెయిన్‌వాష్ చేస్తారు. కిమ్ జోంగ్ ఉన్(Kim Jong-Un) కోసం అవసరమైతే తమ ప్రాణాలను కూడా వదులుకోవాల్సి ఉంటుంది’’ అని కిమ్ రాయిటర్స్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. పట్టుబడి తిరిగి ప్యాంగ్యాంగ్కు వెళ్తే చావు కన్నా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెబుతున్నాడతను. ఉత్తర కొరియా దృష్టిలో యుద్ధంలో పట్టుబడడం అంటే రాజద్రోహానికి పాల్పడినట్లే. ఆఖరి తూటా దాకా అతని శరీరంలో దిగాల్సిందే.. ఇదే అక్కడి సైన్యంలో అంతా చర్చించుకునేది అని కిమ్ తెలిపాడు.రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా సైనికులు రంగంలోకి దిగారని ఉక్రెయిన్ ఆరోపిస్తూ వస్తోంది. సుమారు 11,000 వేల మంది సైనికులను ఉత్తర కొరియా మోహరింపజేసిందనేది కీవ్ ఆరోపణ. ఇందులో 3 వేల మంది ఇప్పటికే మరణించినట్లు ప్రకటించింది. అందులో వారి పేర్లు, వివరాలను మార్చేసి రష్యాకు చెందిన వారిగా తప్పుడు పత్రాలను గుర్తించినట్లు తెలిపింది. ‘‘వారు తప్పుడు గుర్తింపు కార్డులతో రష్యా సైనికుల తరహా దుస్తుల్ని ధరించి పనిచేస్తున్నారు. చూడడానికి మాస్కో దళాల మాదిరిగానే కనిపిస్తున్నారు. వాళ్ల సంభాషణల్ని రహస్యంగా విన్నప్పుడు వారు ఉత్తర కొరియా భాషలో మాట్లాడుతున్నట్లు బయటపడింది’’ అని కీవ్‌కు చెందిన ఓ సైన్యాధికారి తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ప్యాంగ్యాంగ్ వర్గాలు కొట్టిపారేశాయి. మాస్కో మాత్రం ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు.రష్యానే కాల్చిపారేస్తోందా?ఉత్తరకొరియా సైనికులను సజీవంగా పట్టుకోవడం అంత సులభం కాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. ఉత్తర కొరియా పాత్ర బయటపడకూడదనే ఉద్దేశంతో గాయపడిన ఆ దేశ సైనికులు తమకు చిక్కకుండా ఉండేందుకు వారిని రష్యా కాల్చి చంపేస్తోందని ఆరోపించారాయన. ఈ పట్టుబడిన సైనికుల గురించి ఉక్రెయిన్ భద్రతా సర్వీస్.. ఎస్‌బీయూ మరిన్ని వివరాలను వెల్లడించింది. ఒక సైనికుడు దగ్గర ఎలాంటి ధ్రువపత్రం లేదని, మరో సైనికుడి దగ్గర రష్యా మిలిటరీ కార్డు ఉందని తెలిపింది. Communication between captured North Korean soldiers and Ukrainian investigators continues. We are establishing the facts. We are verifying all the details. The world will learn the full truth about how Russia is exploiting such guys, who grew up in a complete information vacuum,… pic.twitter.com/CWcssQjr94— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) January 14, 2025‘‘బందీలకు ఉక్రేనియన్, ఇంగ్లిష్, రష్యన్ భాషలు రావు. దక్షిణ కొరియా అనువాదకుల సాయంతో వారితో మాట్లాడుతున్నాం’’అని పేర్కొంది. మరోవైపు.. రష్యాలో బందీగా ఉన్న తమ సైనికులను విడుదల చేస్తే.. ఉత్తర కొరియా సైనికులను వారి అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు అప్పగిస్తామని జెలెన్స్కీ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.ప్రపంచంలోనే తనది అత్యంత శక్తివంతమైన సైన్యంగా కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) ఆ మధ్య ప్రకటించుకున్నారు. 1950-53 కొరియన్ వార్ తర్వాత నార్త్ కొరియా సైన్యాన్ని రష్యాలో మోహరించడం ఇదే. అలాగే.. వియత్నాం యుద్ధం, సిరియా అంతర్యుద్ధంలోనూ ఉత్తర కొరియా సైన్యం పాలు పంచుకుంది. -
పుతిన్, కిమ్ మధ్య కుదిరిన డేంజర్ డీల్..
మాస్కో: రష్యా, ఉత్తరికొరియా మధ్య మరో కీలక ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య మిలిటరీ ఒప్పందం అమలులోకి వచ్చింది. ఈ మేరకు నార్త్ కొరియాకు చెందిన అధికారిక న్యూస్ ఏజెన్సీ కేసీఏన్ఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మిలటరీ తమకు అవసరమైన సమయాల్లో సాయం చేసుకోనుంది.రష్యా, ఉత్తర కొరియా మిలిటరీ ఒప్పందం అమల్లోకి వచ్చింది. పరస్పరం మిలిటరీ సాయం చేసుకోవడానికి ఈ ఏడాది జూన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఒప్పందం చేసుకున్నారు. అయితే, పశ్చిమ దేశాలు విధించే ఆంక్షలను సంయుక్తంగా ఎదుర్కోవడం, ఆపత్కాల సమయంలో తక్షణ మిలిటరీ సాయం చేసుకునేలా రెండు దేశాల ఒప్పందం కుదిరింది. ఇక, అణ్వాయుధాలు కలిగిన ఉత్తర కొరియా తన బలగాలను పంపించి రష్యాకు సాయం చేస్తోందని అమెరికా, ఉక్రెయిన్ దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో రక్షణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. పుతిన్‌కు సాయం చేసేందుకు రష్యా సైన్యంలోకి నార్త్ కొరియాకు చెందిన దాదాపు పది వేల మంది సైనికులను పంపినట్టు అమెరికా ఆరోపించింది. మరోవైపు.. రష్యా, కొరియా దేశాల మధ్య జరిగిన ఈ కీలక ఒప్పందానికి ప్రతిఫలంగా మాస్కో.. కిమ్‌కు అధునాతన టెక్నాలజీ అందజేయనుందని వార్తలు వెలువడ్డాయి. పైగా యుద్ధభూమిలో పోరాడటం వల్ల కిమ్ సైనికులు రాటుదేలే అవకాశం ఉందని ఆయా దేశాలకు చెందిన నేతలు చెబుతున్నారు. ఇక, ఇప్పటికే వేల సంఖ్యలో నార్త్ కొరియా సైనికులు ట్రైనింగ్ తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఉక్రెయిన్‌తో రష్యా పోరులో భాగంగా పుతిన్‌కు ఉత్తర కొరియా బలగాలు ఎంతో సాయం చేసే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌పై మరింత ధీటుగా దాడులు చేసేందుకు పుతిన్ ప్లాస్ చేసినట్టు సమాచారం. #BREAKING North Korea, Russia defence treaty has come into force: KCNA pic.twitter.com/3ODW1bg5Bl— AFP News Agency (@AFP) December 4, 2024 -
అమెరికా రెచ్చగొడుతోంది.. కిమ్ సంచలన ఆరోపణలు
సియోల్: అగ్ర రాజ్యం అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. తమ దేశం విషయంలో శత్రుత్వ విధానం ప్రదర్శించడంలో అమెరికా ముందు స్థానంలో ఉందన్నారు. అలాగే, కొరియా ద్వీపకల్పంలో అమెరికా ఉద్రిక్తతలను పెంచుతోందని చెప్పుకొచ్చారు.ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తాజాగా ప్యాంగ్యాంగ్లో నిర్వహించిన మిలటరీ ఎగ్జిబిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ.. అమెరికా మమ్మల్ని బాగా రెచ్చగొడుతోంది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచే నిర్ణయాలు తీసుకుంటోంది. ఇంతటి ఘర్షణ వాతావరణాన్ని ఇంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు. ప్రస్తుత పరిస్థితులు థర్మో న్యూక్లియర్ యుద్ధంలా మారే వరకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.కొరియా ద్వీపకల్పం ఇప్పటివరకు అణుయుద్ధ ప్రమాదాలే ఎరుగదు. అమెరికాతో చర్చలు జరిపేందుకు నేను ఎప్పుడో ముందుకు వచ్చాను. చర్చల కోసం నేను చాలా దూరం వెళ్లినప్పటికీ అక్కడి నుంచి సరైన స్పందన రాలేదు. అమెరికా.. మాపై దూకుడు, శత్రుత్వ విధానం ప్రదర్శించడంలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదని చెప్పుకొచ్చారు. అయితే, ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో ఆయనతో కిమ్ మూడు సార్లు భేటీ అయ్యారు. 2018-19 మధ్య కాలంలో సింగపూర్, హనోయ్, కొరియా సరిహద్దుల్లో వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చలు జరిపినా.. సఫలం కాలేదు. అనంతరం, రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. North Korean leader says past diplomacy only confirmed US hostilityNorth Korean leader Kim Jong Un says past negotiations with the United States only confirmed Washington's"unchangeable" hostility towardPyongyang and described his nuclear buildup as the only way to counter pic.twitter.com/OenQzQLlu4— Simo saadi🇲🇦🇵🇸🇺🇸 (@Simo7809957085) November 22, 2024 ఇదిలా ఉండగా.. నార్త్ కొరియా కిమ్ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. త్వరలో అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టనున్న నేపథ్యంలో కిమ్ అలర్ట్ అయ్యారు. మళ్లీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉన్న క్రమంలో నార్త్ కొరియా సైన్యం అలర్ట్‌గా ఉండాలన్నారు. దీంతో, అమెరికాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కిమ్ జోంగ్ ఉన్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలను తయారు చేయాలని నార్త్ కొరియా అధికారులకు కిమ్ ఆదేశాలు జారీ చేశారు. కిమ్ ఆర్ఢర్తో కొరియా అధికారులు అణ్వాయుధాలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. -
ఆత్మాహుతి డ్రోన్లను పరీక్షించిన ఉ.కొరియా
సియోల్: లక్ష్యాలపైకి దూసుకెళ్లి పేలిపోయే ఆత్మాహుతి డ్రోన్లను ఉత్తరకొరియా పరీక్షించింది. వీటి దాడులను ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఆత్మాహుతి డ్రోన్లను భారీ ఎత్తున తయారు చేయాలని కిమ్ ఆదేశించారు. అంతర్జాతీయ జలాల్లో అమెరికా, దక్షిణకొరియా, జపాన్‌లు ఉమ్మడి సైనిక విన్యాసాలు చేపట్టిన తరుణంలో ఉత్తరకొరియా ఈ డ్రోన్ల సామర్థ్యాన్ని పరీక్షించడం గమనార్హం. ఈ మానవరహిత ఏరియల్ వెహికిల్స్‌కు ‘ఎక్స్’ ఆకృతిలో రెక్కలు, తోక భాగం ఉన్నాయి. ఆగస్టులో పరీక్షించిన డ్రోన్లను పోలి ఉన్నాయని ఉత్తరకొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అధ్యక్షుడు కిమ్ సైనిక అధికారులతో మాట్లాడుతున్న ఫొటోలను విడుదల చేసింది. ఈ డ్రోన్లు ఒక బీఎండబ్ల్యూ కారును, పాత యుద్ధ ట్యాంకులను ఢీకొని పేలి్చవేసిన దృశ్యాలను ప్రసారం చేసింది. వివిధ దిశల్లో ఈ డ్రోన్లు దూసుకెళ్లి లక్ష్యాలను ఛేదించాయి. వీటి పనితీరు పట్ట కిమ్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ డ్రోన్ల తయారీని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కిమ్ అధికారులను ఆదేశించారు. సైనిక అవసరాల నిమిత్తం పెద్ద ఎత్తున తయారు చేయాలని, చవకైన ఈ డ్రోన్లు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. -
అన్లిమిటెడ్ ఇంటర్నెట్! ‘అశ్లీలం’లో మునిగిపోయి..
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు మంట తెప్పించే పని చేశారట ఆ దేశ సైనికులు. అన్లిమిటెడ్ ఇంటర్నెట్ దొరికిందనే ఆనందంలో అశ్లీలంలో మునిగిపోయి.. మిత్రదేశంలో నార్త్ కొరియా పరువు తీసేశారట. ఈ విషయాన్నిఆంగ్ల మీడియా ప్రముఖంగా ప్రచురించింది. రష్యా-ఉత్తర కొరియాల మధ్య బంధం ఎంతగా బలపడిందో తెలిసిందే. ఈ క్రమంలో.. మిత్రదేశానికి సహాయంగా ఉత్తర కొరియా సైన్యం ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటోంది. అయితే ఆ యుద్ధం కోసం వెళ్లిన సైనికులకు అపరిమితంగా ఇంటర్నెట్ అందించారట. దీంతో స్వేచ్ఛ దొరికినంతగా ఫీలైపోయి.. వాళ్లు ఎగబడి అడల్ట్ కంటెంట్ చూస్తూ ఉన్నారంటూ ఆధారాల్లేని కథనాలను బ్రిటిష్ పత్రికలు పబ్లిష్ చేశాయి. ఇక.. సోమవారం సుమారు ఏడు వేల మంది ఉ.కొ. సైనికులను ఉక్రెయిన్ సరిహద్దు గుండా ఉన్న పాయింట్లలో మోహరింపజేయించింది రష్యా. దానికంటే ముందు.. వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. అయితే బుధవారం జరిగిన తొలిసారిగా ఉక్రెయిన్ బలగాలతో నార్త్ కొరియా సైన్యం తలపడింది. -
ప్రపంచంలోనే శక్తిమంతమైన క్షిపణి పరీక్ష.. ఉక్రెయిన్ సరిహద్దుల్లో 8 వేల కొరియా సైనికులు
సియోల్: అత్యంత శక్తివంతమైన, బలీయమైన ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ (ఐసీఎంబీ)ను పరీక్షించామని శుక్రవారం ఉత్తరకొరియా ప్రకటించింది. ఇది ప్రచారయావ తప్పితే.. వాస్తవ యుద్ధ పరిస్థితుల్లో ఇంతటి భారీస్థాయి క్షిపణి ఉపయుక్తకరంగా ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాను చేరుకోగల ఖండాంతర క్షిపణుల అభివృద్ధి చేయడంలో సాంకేతిక అడ్డంకులను ఉత్తరకొరియా అధిగమించినట్లు తాజా క్షిపణి పరీక్ష ఎక్కడా రుజువు చేయలేకపోయిందని నిపుణులు పేర్కొన్నారు. గురువారం తాము పరీక్షించిన ఖండాంతర క్షిపణి హ్వాసాంగ్–19 .. ఇదివరకు ఎన్నడూ లేనంత దూరానికి, ఎన్నడూ లేనంత ఎత్తులో ప్రయాణించిందని ఉత్తరకొరియా ప్రకటించింది. దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ ఈ పరీక్షను దగ్గరుండి పరిశీలించారని వెల్లడించింది. రష్యా, అమెరికా వద్దనున్న అత్యాధునిక ఖండాంతర క్షిపణుల పొడవు 20 మీటర్ల లోపే ఉంటుందని, హ్వాసాంగ్–19 పొడవు 28 మీటర్లు ఉండటం మూలంగా.. ప్రయోగానికి ముందుగానే దీన్ని దక్షిణకొరియా నిఘా సంస్థలు కనిపెట్టగలిగాయని దక్షిణకొరియా వ్యూహ నిపుణుడు చాంగ్ యంగ్–కెయున్ తెలిపారు. ల్యాంచ్‌పాడ్ల పరిమాణం పెరుగుతుందని, పొడవు అధికంగా ఉన్నందువల్ల శత్రుదేశాల నిఘా రాడార్లకు ఈ తరహా క్షిపణులు సులభంగా చిక్కుతాయని వివరించారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో 8 వేల కొరియా సైనికులు ఎనిమిది వేల మంది ఉత్తరకొరియా సైనికులను ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా మొహరించిందని అమెరికా వెల్లడించింది. రష్యాలోని కస్క్‌లో ఉక్రెయిన్ సేనలు పాగా వేయడం తెలిసిందే. కస్క్ నుంచి ఉక్రెయిన్ సేనలు వెనక్కి మళ్లించడానికి వీలుగా 8 వేల మంది ఉత్తరకొరియా సైనికులను తరలించిందని వివరించింది. -
దక్షిణ కొరియా శత్రు దేశమే, రాజ్యాంగంలో మార్పులు: నార్త్ కొరియా
గత కొద్ది రోజులుగా ఉత్తర- దక్షిణ కొరియా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దక్షిణ కొరియాకు చెందిన డ్రోన్లు తమ దేశంలోకి వచ్చాయని ఆరోపిస్తూ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కఠిన చర్యలు దిగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఉత్తర కొరియా కీలక నిర్ణయం తీసుకుంది.దక్షిణకొరియాను శత్రుదేశంగా పరిగణిస్తూ తమ రాజ్యాంగంలో మార్పులు చేపట్టినట్లు ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాల మేరకు రాజ్యాంగంలో మార్పులు చేసినట్లు పాగ్యాంగ్ వెల్లడించింది. దక్షిణ కొరియాను శత్రుదేశంగా పరిగణించడం అనివార్యమైన, న్యాయపరమైన చర్యగా కిమ్ సర్కార్ పేర్కొంది. 1991లో ఉత్తర- దక్షిణకొరియా దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించింది. అయితే రాజ్యాంగ మార్పుల గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.రెండు కొరియా దేశాల మధ్య సంబంధాలు అత్యల్ప స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణ కొరియాతో తమకున్న సరిహద్దును పూర్తిగా మూసివేస్తున్నట్లు కిమ్ సర్కారు నిర్ణయించింది. అంతేగాక ఈ ఏడాది జనవరిలో కిమ్ దక్షిణ కొరియాను తమ దేశానికి ప్రధాన శత్రువుగా నిర్వచించారు. అధ్యక్షుడు పిలుపునిచ్చిన చట్టపరమైన మార్పులను ప్యోంగ్యాంగ్ మొదటిసారిగా గుర్తించింది.కాగా ఇటీవల దక్షిణ కొరియాను అనుసంఘానం చేసే సరిహద్దులోని రోడ్లను, రైల్వేలను కిమ్ సైన్యం బాంబులతో పేల్చివేసిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. తమ దేశంలోకి సౌత్ కొరియాకు చెందిన ఏ ఒక్క డ్రోన్ వచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కిమ్ హెచ్చరించారు. తమ ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదన్నారు. కవ్వింపు చర్యలు మానుకోవాలని పొరుగు దేశానికి సూచించారు. -
కొరియా దేశాల మధ్య హైఅలర్ట్.. కిమ్ ఆర్మీలోకి భారీ చేరికలు
సియోల్: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దక్షిణకొరియాతో అనుసంధానం చేసే సరిహద్దులోని రోడ్డు, రైల్వే మార్గాలను ఉత్తర కొరియా ధ్వంసం చేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మరోవైపు.. ఒక్క వారం వ్యవధిలోనే 14 లక్షల మంది యువత ఉత్తర కొరియా సైన్యంలో చేరడంతో దాడులు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ఉత్తర కొరియాలో యుద్ధ వాతావరణం చోటుచేసుకుంది. లక్షలాది మంది విద్యార్థులు, యూత్ లీగ్ అధికారులు ఆర్మీలో చేరినట్టు.. మరి కొందరు సర్వీసులోకి తిరిగి వచ్చినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. ఒక్క వారంలోనే సైన్యంలో 14 లక్షల మంది యువత సైన్యంలో చేరినట్టు చెప్పుకొచ్చింది. యువకులు పవిత్ర యుద్ధంలో పోరాడాలని నిర్ణయించుకున్నారని, వారు విప్లవ ఆయుధాలతో శత్రువును నాశనం చేస్తారని వెల్లడించింది. దీంతో, దక్షిణ కొరియాపై దాడులకు నార్త్ కొరియా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. తమ దేశ రాజధానిపైకి దక్షిణ కొరియా డ్రోన్లను పంపుతోందని ఉత్తర కొరియా ఇటీవల ఆరోపించడంతో రెండు దేశాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే దక్షిణకొరియాతో అనుసంధానం చేసే సరిహద్దులోని రోడ్డు, రైల్వే మార్గాలను ఉత్తర కొరియా పేల్చేసింది. ఇక, కిమ్ చర్యతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఉత్తర కొరియా చర్యకు కౌంటర్‌గా దక్షిణ కొరియా సైన్యం సరిహద్దు వద్ద హెచ్చరిక కాల్పులు జరిపింది. ఇదే సమయంలో తమ ప్రజల భద్రత ప్రమాదంలో పడితే మాత్రం ఉత్తర కొరియాను తీవ్రంగా శిక్షిస్తామని హెచ్చరించింది.అయితే, 2000 సంవత్సరం ఉభయ కొరియాల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో రోడ్లను నిర్మించారు. దీంతోపాటు రెండు రైలు మార్గాలను ఏర్పాటు చేసుకొన్నారు. వీటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కానీ, ఉత్తరకొరియా అణ్వాయుధాల అభివృద్ధి, ఇతర కారణాల వల్ల ఆ తర్వాత ఈ మార్గాలను మూసివేశారు. ఇది కూడా చదవండి: పాకిస్తాన్లో జై శంకర్.. ప్రధాని షరీఫ్‌తో కరచాలనం -
కిమ్ కాదు, సోరోస్ కాదు.. ఉపవాసానికే నా ఓటు!
ఓవైపు అంతర్జాతీయ అంశాలపై అనర్గళంగా మాట్లాడి ఆకట్టుకునే విదేశాంగ మంత్రి ఎస్.జైశకంర్ తనలోని సరదా కోణాన్ని ఆవిష్కరించారు. వాక్చాతుర్యంతో సభికులను కడుపుబ్బా నవ్వించారు. ఒక కార్యక్రమంలో ముఖాముఖి సందర్భంగా వ్యాఖ్యాత ఆయనకు ర్యాపిడ్‌ఫైర్ ప్రశ్న సంధించారు. ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్, భారత్‌ను విమర్శించే హంగరీ అమెరికన్ కుబేరుడు జార్జ్ సోరోస్ల్లో మీరు ఎవరితో భోజనం చేస్తారని అడిగారు. జైశంకర్ ఏ మాత్రం తడుముకోకుండా, ‘దుర్గా నవరాత్రులు కదండీ! నేను ఉపవాస దీక్షలో ఉన్నా!’ అంటూ బదులివ్వడంతో అంతా పగలబడి నవ్వారు. ఐరాస.. ఓ పాత కంపెనీ ఐక్యరాజ్యసమితి ప్రస్తుత పరిస్థితిపై జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో స్థలాన్ని ఆక్రమించుకుని, మార్కెట్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చలేని పాత కంపెనీలా మారిందంటూ ఆక్షేపించారు. ఆదివారం ఆయన కౌటిల్య ఆర్థిక సదస్సులో మాట్లాడారు. ‘‘ప్రపంచ దేశాలను నేడు రెండు తీవ్ర సంక్షోభాలు తీవ్రంగా ఆందోళన పరుస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఐరాస ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. కీలకాంశాలను పట్టించుకోకుంటే దేశాలు తమ దారి చూసుకుంటాయి. కోవిడ్ కల్లోలంలోనూ ఐరాస చేసింది చాలా తక్కువ’’ అన్నారు. – న్యూఢిల్లీ -
కిమ్ కర్కశత్వం.. ఇద్దరు మహిళలకు ఉరిశిక్ష
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తన కర్కశత్వాన్ని ప్రదర్శించారు. ఆ దేశానికి చెందిన ఇద్దరు మహిళల్ని ఉరితీయించారు.ఉత్తర కొరియాకి చెందిన రీ,కాంగ్ అనే ఇద్దరు మహిళలు చైనాలో ఉంటున్నారు. చైనాలో ఉంటూ ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు పారిపోవాలనుకునే వారికి సహరిస్తున్నారు. అయితే ఈ అంశం కిమ్ ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీంతో కోపోద్రికుడైన కిమ్.. రీ, కాంగ్ ఇద్దరిని చైనా నుంచి ఉత్తర కొరియాకు రప్పించాడు. అనంతరం ఆ ఇద్దరిని ఉరితీయించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.మహిళలకు ఉరిశిక్ష విధించడంపై కిమ్ ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కిమ్ ప్రభుత్వం ఆ ఇద్దరు మహిళలకు మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారని ఆరోపించింది. తాము నిర్వహించిన బహిరంగ విచారణలో నేరం రుజువు కావడంతో చర్యలు తీసుకున్నట్లు సమర్ధించుకుంది. చదవండి : మీకు అర్థమయ్యిందా? హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ హెచ్చరిక -
మరిన్ని అణ్వాయుధాలపై దృష్టి: కిమ్
సియోల్: ఉత్తరకొరియా మొట్టమొదటి సారిగా రహస్య యురేనియం శుద్ధి కేంద్రాన్ని బయటి ప్రపంచానికి చూపింది. ఆదేశాధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ ఇటీవల అణ్వాయుధాల తయారీలో వినియోగించే యురేనియం శుద్ధి కేంద్రాన్ని సందర్శించినట్లు అధికార కేసీఎన్ఏ తెలిపింది. ‘నిపుణుల కృషిని కిమ్ కొనియాడారు. పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా, మిత్ర దేశాల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు మరిన్ని అణ్వాయుధాల అవసరం ఉంది. వీటి తయారీకి ప్రయత్నాలు సాగించాలంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు’అని వెల్లడించింది. యురేనియం శుద్ధి కేంద్రంలోని పొడవైన బూడిదరంగు పైపుల వరుసల మధ్య కిమ్ తిరుగుతున్న ఫొటోలను కేసీఎన్ఏ బయటపెట్టింది. ఈ కేంద్రం ఎక్కడుంది? కిమ్ ఎప్పుడు పర్యటించారు? అనే వివరాలను మాత్రం పేర్కొనలేదు. అయితే, యోంగ్బియోన్లోని ప్రధాన అణుశుద్ధి కేంద్రమా కాదా అనే విషయాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. ఫొటోల్లోని వివరాలను బట్టి ఉత్తరకొరియా సిద్ధం చేసిన అణు బాంబులు, శుద్ధి చేసిన ఇంధనం పరిమాణం వంటి అంశాలపై ఒక అంచనాకు రావచ్చని చెబుతున్నారు. ఉత్తరకొరియా మొదటిసారిగా 2010లో యోంగ్‌బియోన్ యురేనియం శుద్ధి కేంద్రాన్ని గురించిన వివరాలను వెల్లడించింది. -
అణుబాంబుల సామర్థ్యం భారీగా పెంచుకుంటాం: కిమ్
ప్యాంగ్యాంగ్: భవిష్యత్తులో తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని భారీగా పెంచుకోనున్నట్లు ఉత్తరకొరియా నియంత కిమ్‌జోంగ్‌ఉన్ తెలిపారు. దేశ 76వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కిమ్ మాట్లాడారు. ‘యుద్ధంలో వాడేందుకు వీలుగా దేశ అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటాం. ఎంత పెంచాలనేదానికి హద్దే లేదు. దీనికి సంబంధించి పాలసీ రూపొందిస్తున్నాం. ఉనికిని కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని కిమ్ చెప్పారు. కొరియా ద్వీపకల్పంలో ఇటీవలి కాలంలో దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ మధ్య సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో కిమ్ అణుబాంబుల పెంపు నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. నవంబర్‌లో అమెరికా ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తరకొరియా న్యూక్లియర్ బాంబు పరీక్ష జరిపే ఛాన్సుందని దక్షిణకొరియా అధ్యక్షుని భద్రతాసలహాదారు ఇటీవలే వెల్లడించారు. ఇదీ చదవండి.. ట్రంప్ వర్సెస్ కమల..హోరాహోరీ -
కిమ్ అరాచకం: 30 మంది ప్రభుత్వ అధికారులకు ఉరి.. ఎందుకంటే!
ఉత్తర కొరియాలో ఇటీవల భారీ స్థాయిలో వర్షాలు, వరదలు ముంచెత్తాయి కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. ఆ ఘటనల్లో సుమారు 4 వేల మంది మరణించినట్లు, దాదాపు 5 వేల మందికి పైగా నిరాశ్రయులు అయినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అయితే వరదల వల్ల సంభవించిన ప్రాణనష్టాన్ని నివారించడంలో ప్రభుత్వ అధికారులు విఫలం అయ్యారు.ఈ నేపథ్యంలో ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 30 మంది అధికారులను ఉరి తీయాలని ఆయన ఆదేశాలు జారీ చేసిట్లు దక్షిణ కొరియా మీడియా పేర్కొంది. దేశానికి, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లడానికి కారణమయ్యారనే వారికి మరణ శిక్ష విధించినట్లు తమ కథనాల్లో వెల్లడించింది.కాగా ఇటీవల చాగాంగ్ ప్రావిన్సులో వచ్చిన భారీ వర్షాలు, వరదల కారణంగా వేలాది మంది మరణించారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యటించారు. మోకాలు లోతు నీటిలో తన కారులో ప్రయాణించిన కిమ్.. వరదనీటిలో బోటుపై వెళ్లారు. వరదల తీవ్రతను, ప్రజలపై వాటి ప్రభావాన్ని స్వయంగా చూశారు.ఈ భారీ విపత్తు నుంచి కోలుకుని, తిరిగి నిర్మాణాలు చేపట్టడానికి రెండు మూడు నెలలు పడుతుందని అధికారులు తెలిపారు. ఇంతటి భారీ విపత్తుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని కిమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.మరణశిక్ష విధించిన అధికారుల వివరాలను స్థానిక మీడియా వెల్లడించలేదు. అయితే గత నెలాఖరులోనే ఈ శిక్ష అమలు చేశారని నార్త్ కొరియా అధికారిక మీడియాను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. -
కిమ్‌కు పుతిన్ గిఫ్ట్..ఈ సారి ప్రత్యేకంగా..
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదమీర్ పుతిన్..ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కి 24 మేలిమి జాతి గుర్రాల్ని బహుమతిగా ఇచ్చారు.ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తుంది. అయితే ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు తమకు యుద్ధ సామాగ్రిని సరఫరా చేయాలని కొద్ది రోజుల క్రితం పుతిన్.. కిమ్ జోంగ్ ఉన్ని కోరారు. పుతిన్ విజ్ఞప్తితో వెను వెంటనే కిమ్ జోంగ్ ఉన్ ఆఘమేఘాల మీద రష్యాకు యుద్ధ సామాగ్రిని పంపించారు. అందుకు ప్రతిఫలంగా పుతిన్.. ఉత్తర కొరియా అధ్యక్షుడికి గుర్రాల్ని బహుకరించినట్లు అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి. రష్యా పంపిన గుర్రాల్లో కిమ్‌కు అత్యంత ఇష్టమైన ఓర్లోవ్ ట్రోటర్ జాతికి చెందిన 19 స్టాలియన్లు, ఐదు మరే జాతి గుర్రాలు ఉన్నట్లు టైమ్స్ నివేదించింది. ఈ ఏడాది జూన్‌లో పుతిన్ ఉత్తర కొరియాలో 24 ఏళ్ల తర్వాత తొలిసారి పర్యటించారు. ఈ పర్యటనలో పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ మధ్య సైనిక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పంగ్సన్ అనే తెల్లటి వేటాడే శునకాలను పుతిన్‌కు కిమ్ గిఫ్ట్‌గా ఇచ్చారు కిమ్. అందుకు.. రష్యా అధ్యక్షుడు కూడా ఆరుస్ లిమోసిన్ కారును బహుకరించారు.ఆ తర్వాత కిమ్‌కు 447 మేకలను ఇచ్చారు. తాజాగా మేలి జాతికి చెందిన గుర్రాలను నియంత కిమ్‌కు బహుమతిగా ఇచ్చారు. -
నార్త్ కొరియా: వరద సహాయక చర్యల్లో కిమ్
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఖరీదైన బ్లాక్ లెక్సస్ కారులో వెళ్లి వరద పరిస్థితిని అంచనా వేశారు. దేశంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, పోటెత్తిన వరదల పరిస్థితిని అంచనావేసేందుకు కిమ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. గడిచిన కొన్నిరోజులుగా ఉత్తరకొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి వరదలు వచ్చి వేల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఉత్తరకొరియాలో చైనాకు సరిహద్దులో ఉన్న సినాయ్జూ, యిజు అనే పట్టణాలు వరదలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిస్థితి తీవ్రతను అంచనా వేయడానికి కిమ్ ఆ ప్రాంతాల పర్యటనకు వెళ్లినపుడు నడములోతు నీటిలో ఉన్న బ్లాక్ లెక్సస్ కారు, అందులోని కిమ్ చిత్రాలను స్థానిక మీడియా ప్రచురించింది. అధ్యక్షుడే దిగివచ్చి నేరుగా వరద సహాయక చర్యల్లో భాగస్వామి అయ్యారని ఆ కథనాల సారాంశం. విమానాలు, హెలికాప్టర్లు ఉండగా కిమ్ కారులోనే ఎందుకు వెళ్లారన్న అంశం చర్చనీయాంశమవుతోంది. తాజాగా విరుచుకుపడ్డ వరదలు ఉత్తరకొరియాలో ఆహార సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తాయని నిపుణులు భయపడుతున్నారు. ఇక్కడ నీటి పారుదల వ్యవస్థ దారుణంగా ఉండటంతో నష్టం తీవ్రంగానే ఉంటుందని అంచనా. -
కిమ్ మనసు గెల్చుకున్న పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మనసు గెల్చుకున్నారు. తన ప్యాంగ్యాంగ్ పర్యటన సందర్భంలో రష్యన్ మేడ్ లగ్జరీ కారు ఒకదానిని కిమ్‌కు బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ధృవీకరించగా.. ఓ టీవీ ఛానెల్ ఇందుకు సంబంధించిన ఫుటేజీని ప్రదర్శించింది. రష్యాలో తయారైన ఆరస్ లిమోసిన్ కారు.. తన కాన్వాయ్‌లోనూ ఉపయోగిస్తున్నారు పుతిన్. అదే కారును ఆయన గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు స్వయంగా కారును పుతిన్ నడపగా, పక్కనే కిమ్ కూర్చుని ఆ ప్రయాణాన్ని ఆస్వాదించారు.Russia’s Vladimir Putin drives North Korea’s Kim Jong-un in Russian Limousine#Ytshorts #Russia #Northkorea #Putin #KimJonun #RussianLimousine pic.twitter.com/qJvVrKMoR7— Business Today (@business_today) June 20, 2024VIDEO CREDITS: Business Today గతేడాది సెప్టెంబర్‌లో కిమ్, రష్యాలో పర్యటించారు. ఆ టైంలో తన కాన్వాయ్‌లోని వాహనాలను పుతిన్ స్వయంగా కిమ్‌కు చూపించి.. ఇద్దరూ సరదాగా ప్రయాణించారు. ఆ టైంలో కిమ్ ఈ కారుపై మనుసు పారేసుకున్నారని, దీంతో ఇప్పుడు పుతిన్ ఇప్పడు ఆ కారును సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి.ఇదిలా ఉంటే.. కిమ్ విలాస ప్రియుడనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖరీదైన వస్తువులు, కార్లను ఆయన తన ఖాతాలో ఉంచుకున్నారు. అయితే.. ఉత్తర కొరియాలోకి విలాసవంతమైన గూడ్స్ వెళ్లకుండా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిషేధం విధించింది. అయినప్పటికీ అక్రమ మార్గంలో కిమ్ వాటిని తెప్పించుకుంటారని దక్షిణ కొరియా ఆరోపిస్తుంటుంది.Caption this...pic.twitter.com/ilIUhnxxw1— Mario Nawfal (@MarioNawfal) June 20, 2024ఇదిలా ఉంటే.. దాదాపు 24 సంవత్సరాల తర్వాత నార్త్ కొరియాలో అడుగుపెట్టారు పుతిన్. కొరియా జనం కేరింతలతో అట్టహాసంగా పుతిన్‌కు ఆహ్వానం లభించింది. ఈ సందర్భంగా ఇరు దేశాల అధినేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. మరోవైపు.. అమెరికా ఒత్తిడి, ఆంక్షలను ఎదుర్కోవడంలో భాగంగా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడమే లక్ష్యంగా వీళ్లిద్దరూ పని చేస్తున్నట్లు వాళ్ల వాళ్ల ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది. -
Russia-North Korea relations: మరింత బలమైన మైత్రీబంధం
సియోల్: పశ్చిమ దేశాల ఆంక్షల కత్తులు వేలాడుతున్నా రష్యా, ఉత్తర కొరియాలు మైత్రిబంధంతో మరింత దగ్గరయ్యాయి. శత్రుదేశం తమపై దాడి చేస్తే తోటి దేశం సాయపడేలా కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. ద్వైపాక్షిక అంశాలపైనా విస్తృతస్తాయి చర్చలు జరిపి కొన్ని కీలక ఉమ్మడి ఒప్పందాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉ.కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ సంతకాలు చేశారు. ఘన స్వాగతం పలికిన కిమ్సరిగ్గా 24 ఏళ్ల తర్వాత ఉ.కొరియాలో పర్యటిస్తున్న పుతిన్‌కు ప్యాంగ్యాంగ్ నగర శివారులోని ఎయిర్‌పోర్ట్‌లో కిమ్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత కిమ్–2 సంగ్ స్క్వేర్‌లో వేలాది మంది చిన్నారులు బెలూన్లు ఊపుతూ పుతిన్‌కు ఆహ్వానం పలికారు. సైనికుల నుంచి పుతిన్ గౌరవవందనం స్వీకరించారు. తర్వాత అక్కడే తన సోదరి కిమ్ యో జోంగ్‌ను పుతిన్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అక్కడి విమోచనా స్మారకం వద్ద పుతిన్ నివాళులర్పించారు.పలు రంగాలపై ఒప్పందాలు‘కుమ్సుసాన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్’ అధికార భవనానికీ పుతిన్, కిమ్‌లు ఒకే కారులో వచ్చారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సంస్కృతి, మానవ సంబంధాల రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 1991లో సోవియట్ రష్యా పతనం తర్వాత ఇంతటి విస్తృతస్థాయిలో ఒప్పందాలు కుదర్చుకోవడం ఇదే మొదటిసారి. ‘ఈ ఒప్పందం అత్యంత పటిష్టమైంది. కూటమి అంత బలంగా ఇరుదేశాల సత్సంబంధాలు కొనసాగుతాయి. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి పూర్తి మద్దతు, సాయం ప్రకటిస్తున్నా’’ అని కిమ్ అన్నారు. అయితే ఉ.కొరియా ఎలాంటి సాయం చేయబోతోందనేది కిమ్ వెల్లడించలేదు. ‘‘ మైత్రి బంధాన్ని సమున్నత శిఖరాలకు చేర్చే విప్లవాత్మకమైన ఒప్పందమిది. అయితే ఉ.కొరియాకు సైనిక సాంకేతిక సహకారం అనేది ఈ ఒప్పందంలో లేదు’ అని పుతిన్ స్పష్టంచేశారు. ఇరుదేశాల సరిహద్దు వెంట వంతెన నిర్మాణం, ఆరోగ్యసంరక్షణ, వైద్య విద్య, సామాన్య శాస్త్ర రంగాల్లోనూ ఒప్పందాలు కుదిరాయని రష్యా ప్రకటించింది.కారు నడిపిన పుతిన్, కిమ్కుమ్సుసాన్ ప్యాలెస్‌కు బయల్దేరిన సందర్భంగా వారు ప్రయాణించిన లిమో జిన్ కారును పుతిన్ స్వయంగా నడిపారు. మార్గ మధ్యంలో ఒక చోట ఆగి పచ్చిక బయళ్లపై కొద్దిసేపు నడుస్తూ మట్లాడు కున్నారు. మార్గమధ్యంలో మరో చోట ఆగి పుతిన్‌కు కిమ్ టీ పార్టీ ఇచ్చారు. తర్వాత సంగీత కచేరీకి వెళ్లారు. తర్వాత కిమ్ సైతం పుతిన్‌ను వెంటబెట్టుకుని ఆ కారును నడిపారు. ఒప్పందాల తర్వాత పుతిన్ చిత్రప టం ఉన్న కళాఖండాలను పుతిన్‌కు కిమ్ బహూకరించారు. కిమ్‌కు పుతిన్ రష్యాలో తయారైన ఆరాస్ లిమోజిన్ కారు, టీ కప్పుల సెట్, నావికా దళ ఖడ్గాన్ని బహుమ తిగా ఇచ్చారు. కిమ్‌కు పుతిన్ లిమోజిన్ కారును బహుమతిగా ఇవ్వడం ఇది రెండోసారి. -
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పూర్తి మద్ధతు: ఉత్తర కొరియా
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానం మేరకు రెండు రోజులు (ఈనెల18,19) అక్కడ పుతిన్ పర్యటిస్తున్నారు. ప్యోంగ్యాంగ్ విమానాశ్రయానికి స్వయంగా వెళ్లిన కిమ్, పుతిన్‌కు ఆహ్వానం పలికారు. అనంతరం ప్యోంగ్యాంగ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇరువురు పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ద్వైపాక్షిక చర్చలు జరిపారు.ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యాకు తమ పూర్తి మద్ధతు ఉంటుందని కిమ్ హామీ ఇచ్చారు. ఇరుదేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి, అమెరికా ఆధిప్యత విధానాలకు వ్యతిరేకంగా పోరేండేందుకు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు పుతిన్ పేర్కొన్నారు. ఇరు దేశాల మద్య ఆర్థిక, సైనిక సహకారాన్ని విస్తరించేందుకు అంగీకరించినట్లు తెలిపారు.యుద్ధంలో తమ పాలసీలకు మద్ధతు ప్రకటించడంపై కిమ్‌కు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. అయితే యుద్ధంలో తమకు ఆయుధాలను పంపాలని కిమ్‌ను కోరినట్టు తెలుస్తోంది. దీనికి బదులుగా ఉత్తర కొరియాకు ఆర్థికంగా, సాంకేతికంగా రష్యా సాయం చేయనున్నట్టు సమాచారం.ఇక ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర సమయంలో పుతిన్ పర్యటనకు రావడం.. అమెరికా సహా దాని మిత్రదేశాలను ఆందోళనకు గురిచేసింది. అణ్వాయుధాలు, క్షిపణి పరీక్షలతో నిత్యం శత్రు దేశాలను కవ్వించే ఉత్తర కొరియా చేతికి రష్యా అత్యాధునిక సాంకేతికత అందితే మరింత ప్రమాదమని పశ్చిమ దేశాల్లో ఆందోళన నెలకొంది.ఇదిల ఉండగా అంతర్జాతీయంగా ఇరుదేశాలపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఒకవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు.. ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలు, ఇతర దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఈ పరిణామాల నడుమ.. వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటించడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి. కాగా గత ఏడాది సెప్టెంబరులో కిమ్ జోంగ్ ఉన్ రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. -
ఆంక్షలపై సమష్టి సమరం
సియోల్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తరకొరియాలో రెండు రోజుల పర్యటనకుగాను బుధవారం ఉదయం ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమెరికా సారథ్యంలో రష్యా, ఉ.కొరియాలపై కొనసాగుతున్న ఆంక్షలను ఇరుదేశాలు సమష్టిగా ఎదుర్కొంటాయని పుతిన్ ప్రకటించారు. ఉ.కొరియా పర్యట నకు కొద్ది గంటల ముందు ఆయన ఆ దేశ అధికారిక వార్తా సంస్థకు రాసిన వ్యాసంలో పలు అంశాలను ప్రస్తావించారు.‘‘ ఉక్రెయిన్ విషయంలో మా సైనిక చర్యలను సమర్థిస్తూ, సాయం చేస్తున్న ఉ.కొరి యాకు కృతజ్ఞతలు. బహుళ «ధ్రువ ప్రపంచం సాకారం కాకుండా అవరోధాలు సృష్టిస్తున్న పశ్చిమదేశాలను అడ్డుకుంటాం. పశ్చిమదేశాల చెప్పుచేతల్లో ఉండకుండా సొంత వాణిజ్యం, చెల్లింపుల వ్యవస్థలను రష్యా, ఉ.కొరియాలు అభివృద్ధి చేయనున్నాయి. పర్యాటకం, సాంస్కృతికం, విద్యారంగాలకూ ఈ అభివృద్ధిని విస్తరిస్తాం’’ అని పుతిన్ అన్నారు.ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధ జ్వాలలను మరింత రగిల్చేందుకు కావాల్సిన ఆయుధ సంపత్తిని ఉ.కొరియా సమకూర్చుతుండగా, ఆ దేశానికి అణ్వస్త్ర సామర్థ్యం, క్షిపణుల తయారీ, సాంకేతికతలను రష్యా అందిస్తోందని అమెరికాసహా పశ్చిమ దేశాలు ఆరోపిస్తుండటం తెల్సిందే. ఈ ఆరోపణలను రష్యా, ఉ.కొరియా కొట్టిపారేశాయి. పుతిన్ పర్యటన వేళ ఈ ఆయుధ సాయం, టెక్నాలజీ సాయం మరింత పెచ్చరిల్లే ప్రమాదముందని అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది. ఉక్రెయిన్‌తో ఆగదు: అమెరికా‘ఉ.కొరియా బాలిస్టిక్ క్షిపణు లే ఉక్రెయిన్ను ధ్వంసంచేస్తున్నాయి. రష్యా, ఉ.కొరియా బంధం దుష్ప్ర భావం ఉక్రెయిన్‌కు మాత్రమే పరిమితం కాబోదు కొరియా ద్వీపకల్పంపై పడు తుంది’ అని అమెరికా ప్రతినిధి జాన్ కిర్బీ ఆందోళన వ్యక్తంచేశారు. ‘మండలి తీర్మానాలు, శాంతి, సుస్థిరతలకు విఘాతం కల్గించే రీతిలో రష్యా, ఉ.కొరియా సహకారం పెరగొద్దు’ అని దక్షిణకొరియా హెచ్చరించింది. చెత్త నింపిన బెలూన్లను ద.కొరియా పైకి ఉ.కొరియా వదలడం విదితమే. -
ఉత్తర కొరియా కిమ్ సంచలన వ్యాఖ్యలు
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాలో నెలకొన్న అస్థిరమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం తప్పదని అన్నారు. యుద్ధాన్నికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆయన బుధవారం దేశంలోనే కీలకమైన కిమ్ జోంగ్-ఇల్ మిలిటరీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ యూనివర్సిటీ కిమ్ తండ్రి పేరు మీద 2011లో స్థాపించారు. దేశంలో మిలిటరీ విద్యలో అత్యధికంగా సీట్లు ఉన్న యూనివర్సిటీ ఇది. యూనివర్సిటీ సందర్శన సమయంలో విద్యార్థులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడారు. ‘ఉత్తర కొరియా చుట్టూ.. అంతర్జాతీయంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో దేశంలో నెలకొన్న అస్థిరమైన పరిస్థితుల నడుమ యుద్ధం తప్పదు. శత్రు దేశాలు యుద్ధ కవ్వింపు చర్యలకు పాల్పడితే.. ఎలాంటి సంకోచం లేకుండా యుద్ధం చేయడానికి నార్త్ కొరియా సిద్ధంగా ఉంది’ అని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యానించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఇప్పటికే నార్త్ కొరియా రాజకీయంగా, ఆయుధ తయారీలో రష్యాతో సంబంధాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు వ్యూహాత్మక మిలిటరీ ప్రాజెక్టుల్లో నార్త్ కొరియా సాయం అందిస్తోంది. ఇటీవల కొరియా ఘన ఇందనంతో మధ్యశ్రేణి సూపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే ఇది ద్రవ ఇందనంతో పోల్చితే చాలా శక్తివంతమైందని నిపుణులు పేర్కొన్నారు. తరచూ అమెరికా, దక్షిణ కొరియా తమ సైనిక విన్యాసాలతో ఉత్తర కొరియాను కవ్విస్త్ను విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. -
యుద్ధ ట్యాంక్‌ను నడిపిన కిమ్
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ స్వయంగా ట్యాంకును నడిపారు. బుధవారం ఆయన దేశ సైనిక దళాల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. యుద్ధానికి సిద్ధం అయ్యేందుకు పెద్ద ప్రయత్నాలు చేయాలని సేనలకు పిలుపునిచ్చారు. అధికార వార్తా సంస్థ(కేసీఎన్ఏ) గురువారం ఈ విషయం వెల్లడించింది. పొరుగుదేశం దక్షిణ కొరియా, అమెరికా 11 రోజులుగా కొనసాగిస్తున్న భారీ సైనిక విన్యాసాలు గురువారంతో ముగియనున్నాయి. అందుకు బదులుగా అన్నట్లు కిమ్ యుద్ధ ట్యాంకుల పోరాట సన్నద్ధతను పరిశీలించారు. -
ఉత్తరకొరియా యుద్ధానికి సిద్ధమవుతోందా?
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. దక్షిణ కొరియా- యునైటెడ్ స్టేట్స్ సంయుక్త విన్యాసాల ముగింపునకు ముందు కొరియాలో నూతన సైనిక ప్రదర్శన జరిగింది. దీనికి కిమ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా కిమ్ జాంగ్ ఉన్ కమాండర్లతో మాట్లాడుతూ ఈ విన్యాసాలకు నిజమైన యుద్ధంలా కసరత్తు చేయాలని ఆదేశించారు. ఈ సమయంలో ఒక నూతన యుద్ధ ట్యాంక్ తన మొదటి ప్రదర్శనలో విజయవంతంగా మందుగుండు సామగ్రిని ప్రయోగించింది. తన కమాండర్ల పనితీరుకు కిమ్ సంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఈ విన్యాసాల వివరాలను వెల్లడించిన ఒక నివేదికలో ‘యుద్ధ పరిస్థితులలో సమర్థవంతంగా పనిచేసే ఈ భారీ యుద్ధ ట్యాంకులు ఒకే సారి లక్ష్యాలపై దాడి చేసి, చిధ్రం చేస్తాయని’ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్‌తో పాటు రక్షణ మంత్రి కాంగ్ సున్నామ్తో పాటు సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. సైనిక విన్యాసాల సందర్భంగా కొరియా మీడియా పలు ఫోటోలను విడుదల చేసింది. ఒక ఫోటోలో కొరియన్ నియంత యుద్ధట్యాంక్‌ను పరీక్షించడాన్ని చూడవచ్చు. కిమ్ స్వయంగా ట్యాంక్‌ను నడిపినట్లు మీడియా పేర్కొంది. మరొక ఫోటోలో కిమ్ లెదర్ జాకెట్ ధరించగా, కమాండర్లు అతని చుట్టూ ఉన్నట్లు కనిపించారు. ఉత్తర కొరియా జెండా కలిగిన యుద్ధ ట్యాంకులు కూడా ఫొటోలలో కనిపిస్తున్నాయి. దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక ఉమ్మడి సైనిక విన్యాసం ముగియనున్న తరుణంలో ఈ కసరత్తు కనిపించింది. నవంబర్‌లో ప్యోంగ్యాంగ్ ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో 2018 అంతర్-కొరియా సైనిక ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత తొలిసారిగా ఈ సైనిక విన్యాసాలు జరిగాయి. ఈ విన్యాసాలకు ఫ్రీడమ్ షీల్డ్ ఎక్స్‌ర్‌సైజ్’ అని పేరు పెట్టారు. లైవ్ ఫైర్ డ్రిల్‌లో పలు యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు, ఎఫ్ఏ-50 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. -
కిమ్‌కు పుతిన్ గిఫ్ట్.. కారు కంపెనీపై అమెరికా కొరడా
వాషింగ్టన్: ఉత్తర కొరియా, రష్యా మధ్య పెరుగుతున్న సంబంధాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌కు బహుమతిగా విలాసవంతమైన లిమోసిన్ కారు ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. ఈ కారు ఉత్పత్తి చేసిన కంపెనీపై అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి రెండేళ్లు పూర్తవడం, అలెక్సీ నావల్ని మృతిపై రష్యాపై అమెరికా తాజాగా విధించిన 500 ఆంక్షల జాబితాలో లిమోజిన్ కారు కంపెనీ ఆరస్‌ను కూడా అగ్రరాజ్యం చేర్చడం గమనార్హం. ఉత్తర కొరియాకు రష్యా ఆర్టిలరీ బాంబులు సరఫరా చేస్తుండటం, కొరియా ద్వీపకల్పంలో ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలపై చైనా, అమెరికా ఉన్నతస్థాయి అధికారులు వీడియోకాన్ఫరెన్స్‌లో శుక్రవారం చర్చించారు. కాగా, ఇటీవలి కాలంలో దక్షిణ కొరియా సరిహద్దులో ఉత్తర కొరియా ఆర్టిలరీ బాంబుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రాంతంలోని దక్షిణ కొరియాకు చెందిన ఐలాండ్‌లో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతేకాక అత్యాధునిక ఆయుధాలు, క్షిపణులను పరీక్షిస్తూ ఎప్పటికప్పుడు దక్షిణకొరియాను ఉత్తర కొరియా రెచ్చగొడుతోంది. ఇదీ చదవండి.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. రెండేళ్లు -
క్రూయిజ్ క్షిపణులు పేల్చిన నార్త్ కొరియా
ప్యాంగ్యాంగ్: కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పొరుగు దేశం దక్షిణ కొరియాను రెచ్చగొట్టే విధంగా నార్త్ కొరియా చర్యలుండటమే ఉద్రిక్తతలకు కారణమవుతోంది. తాజాగా ఆదివారం(జనవరి 28) ఉదయం 8 గంటలకు ఉత్తర కొరియా తన భూభాగంలోని సింప్నో ప్రాంతానికి సమీపంలో ఉన్న సముద్ర జలాల్లోకి క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ‘ఆదివారం ఉదయం 8 గంటలకు ఉత్తర కొరియా గుర్తు తెలియని కొన్ని క్రూయిజ్ క్షిపణులను సముద్రంలోకి ప్రయోగించినట్లు మా ఆర్మీ గుర్తించింది’ అని సౌత్ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కూడా ఉత్తర కొరియా సముద్రంలో ఆర్టిలరీ బాంబులు వేసి ద్వీపకల్పంలో ఉద్రిక్తలకు కారణమైన విషయం తెలిసిందే. ఇదీచదవండి..బ్రిటీష్ నౌకపై హౌతీ మిలిటెంట్ల దాడి -
Kim Jong Un: ద.కొరియా మన శత్రువు
సియోల్: గతంలో ఉత్తరకొరియా నేతలు దక్షిణకొరియా, ఉత్తరకొరియాలను కలిపేందుకు పునరేకీకరణ పనుల కోసం ఏర్పాటుచేసిన ప్రభుత్వసంస్థలను శాశ్వతంగా మూసేయాలని ఉ.కొరియా నియంత కిమ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం ఉ.కొరియా పార్లమెంట్ అయిన సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో కిమ్ ప్రసంగం వివరాలను అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ‘‘ అమెరికా, జపాన్ల అండతో కయ్యానికి కాలు దువ్వుతున్న దక్షిణ కొరియాతో స్నేహబంధం అనే మాటే లేదిక. దక్షిణ కొరియాతో స్నేహబంధం అనే భావనను రాజ్యాంగం నుంచి తొలగించండి. పునరేకీకరణ, సయోధ్యను ప్రోత్సహిస్తూ అందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వ సంస్థలను మూసేయండి. దక్షిణకొరియాను శత్రుదేశంగా ప్రకటించండి. యుద్ధాన్ని మేం కోరుకోవట్లేదు. తప్పని పరిస్థితి ఎదురైతే యుద్ధానికి దిగుతాం’’ అని పార్లమెంట్‌సభ్యులకు కిమ్ ఆదేశాలిచ్చారు. రైల్వే బంధం తెంపేద్దాం, స్మారకం కూల్చేద్దాం కిమ్ ఆదేశాల మేరకు కమిటీ ఫర్ ది పీస్ఫుల్ రీయూనిఫికేషన్, నేషనల్ ఎకనమిక్ కోఆపరేషన్ బ్యూరో, ఇంటర్నేషనల్ టూరిజం అడ్మిని్రస్టేషన్ సంస్థలను మూసేయనున్నారు. ‘‘ ద.కొరియా, అమెరికాల సంయుక్త సైనిక విన్యాసాలు, అమెరికా వ్యూహాత్మక సైనిక బలగాల మొహరింపు, ద.కొరియా, అమెరికా, జపాన్ల త్రిముఖ భద్రతా సహకారం.. కొరియా ద్వీపకల్పాన్ని యుద్ధం అంచుకు నెట్టుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ద.కొరియాతో స్నేహం, సహకారం అసంభవం. ద.కొరియా, ఉ.కొరియాల మధ్య ఉన్న రైల్వే రైళ్లను మూసేయండి. ప్యాంగ్యాంగ్లోని పునరేకీకరణ స్మారకాన్ని కూల్చేయండి’’ అని కిమ్ ఆదేశాలిచ్చారు. ‘ ద్వీపకల్పంలో అణు యుద్ధం మొదలైతే ద.కొరియాను ఈ భూపటంపై లేకుండా చేస్తాం. అమెరికా కనీవినీ ఎరుగని అపార నష్టాన్ని చవిచూస్తుంది’ అని కిమ్ హెచ్చరించారు. దీనిపై ద.కొరియా స్పందించింది. ‘‘ అతను జాతి వ్యతిరేకి. చరిత్రను ఒప్పుకోని మనిíÙ. కవి్వంపు చర్యలకు దిగితే అంతకు మించి సైనిక చర్యలతో మట్టికరిపిస్తాం’’అని ద.కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ మంగళవారం కేబినెట్ భేటీలో అన్నారు.