ప్యాంగ్‌యాంగ్: ఉక్రెయిన్-రష్యా సంక్షోభంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న తరుణంలో ఉత్తర కొరియా మరింత ఉద్రిక్తతను పెంచింది. మరోసారి బాలిస్టిక్ క్షిపణిని ప‍్రయోగించి అందరినీ కలవరపాటుకు గురి చేశాడు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.
కొన్ని నెలలుగా ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ఆదివారం మరో బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించింది. ఈ మేరకు దక్షిణ కొరియా, జపాన్ సైనిక అధికారులు క్షిపణి ప్రయోగం జరిగినట్టు వెల్లడించారు. జపాన్ సముద్రంలోకి ఈ మిస్సైల్‌ను ప్రయోగించినట్లు వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. అమెరికా తమ దేశంపై ద్వేషాన్ని పెంచుకున్న కారణంగానే తాము ఈ క్షిపణి పరీక్షలను జరుపుతున్నట్టు ఉత్తర కొరియా అంతకు ముందు ప్రకటించింది.
అయితే, నార్త్ కొరియాకు చైనా మిత్ర దేశంలో కావడంతో అక్కడ(చైనాలో) వింటర్ ఒలంపిక్స్ ప్రారంభమైన తర్వాత ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలను నిలిపివేసింది. ఇటీవలే ఒలంపిక్స్ ముగియడంతో మళ్లీ పరీక్షలను ప్రారంభించినట్టు తెలుస్తోంది. మరోవైపు గత నెలలో కిమ్ ప్రభుత్వం ఏడు రౌండ్ల క్షిపణి ప్రయోగాలు చేపట్టి అమెరికాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment