missile attaks
-
ఉక్రెయిన్‌పైకి దూసుకొచ్చిన 100 డ్రోన్లు
కీవ్: రష్యా శనివారం అర్ధరాత్రి నుంచి తమ భూభాగంపైకి 96 డ్రోన్లు, ఒక గైడెడ్ ఎయిర్ మిస్సైల్‌ను ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. క్షిపణితోపాటు 66 డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. వేర్వేరు ప్రాంతాలపైకి దూసుకెళ్లిన మరో 27 డ్రోన్లను పనిచేయకుండా జామ్ చేశామని తెలిపింది. ఒక డ్రోన్ బెలారస్ గగనతలంలోకి వెళ్లిందని వివరించింది. ఈ దాడులతో తమకెలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. వారం రోజుల వ్యవధిలో రష్యా కనీసం 900 గైడెడ్ ఏరియల్ బాంబులు, 500 డ్రోన్లు, మరో 30 క్షిపణులను ఉక్రెయిన్‌పైకి ప్రయోగించిందని జెలెన్ స్కీ వివరించారు. తమకు తక్షణమే లాంగ్ రేంజ్ మిస్సైళ్లను ప్రయోగించేందుకు అనుమతివ్వాలని అమెరికా, పశ్చిమ దేశాలను ఆయన కోరారు. డ్రోన్లు, మిస్సైళ్ల తయారీలో కీలకమైన పరికరాలు రష్యాకు అందకుండా ఆంక్షలను మరింత ప్రభావవంతంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.కాగా, ఉక్రెయిన్ తమ మూడు రీజియన్లపైకి ప్రయోగించిన 19 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా ఆర్మీ ప్రకటించింది. బెల్గొరోడ్ రీజియన్ ఒక వ్యక్తి గాయాలతో చనిపోయాడని పేర్కొంది. -
ఇజ్రాయెల్ మిలిటరీ కంపెనీపై హెజ్బొల్లా మిసైల్స్ దాడి
ఇజ్రాయెల్, లెబనాన్ హెజ్బొల్లా గ్రూప్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ టెల్ అవీవ్ శివార్లలోని తా అని పిలువబడే ఇజ్రాయెల్ మిలిటరీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌పై హెజ్బొల్లా క్షిపణులతో విరుచుకుపడింది.తాము చేసిన దాడుల్లో మిసైల్స్ ఖచ్చితమైన లక్ష్యాలను చేరుకొన్నాయి. ఈ మేరకు బుధావారం రాత్రి హెజ్బొల్లా ఓ ప్రకటన విడుదల చేసింది. లెబనాన్ నుంచి సెంట్రల్ ఇజ్రాయెల్ వైపు నాలుగు మిసైల్స్‌ను హెజ్బొల్లా ప్రయోగించిందని వాటిలో రెండింటిని అడ్డుకున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తెలిపింది. మరో రెండు నివాసస్థలాలు లేని ప్రాంతాల్లో పడిపోయాయని పేర్కొంది. ఈ మిసైల్స్ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది.#BRAKING Hezbollah claims to have launched rockets at the suburbs of Tel Aviv.The Glilot military industry company in the suburbs of Tel Aviv was hit by a high-quality rocket salvo, which hit the target precisely, Hezbollah announced, as reported by Al Jazeera.The opposing… pic.twitter.com/IqH4WYR8pB— Sujon Ahmed (@SAexploring) October 23, 2024 మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని కాన్ టీవీ న్యూస్.. వెస్ట్ బ్యాంక్‌లోని కల్కిలియా నగరం సమీపంలో ఒక మిసైల్ పడిపోయిందని ప్రసారం చేసింది. ఆ మిసైల్ దాడికి ఒక వ్యక్తికి స్వల్పంగా గాయాలు కాగా, ఒక కారు దెబ్బతిందని పేర్కొంది.ఇక.. సెప్టెంబర్ 23 నుంచి ఇజ్రాయెల్ సైన్యం హెజ్బొల్లాను అంతం చేయటమే టార్గెట్‌గా లెబనాన్‌పై తీవ్రమైన వైమానిక దాడులను ప్రారంభించింది. అక్టోబరు నెల ప్రారంభంలో.. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనీస్ సరిహద్దుకు సమీపంలో ఒక గ్రౌండ్ ఆపరేషన్‌ను కూడా ప్రారంభించింది. హెజ్బొల్లా ఆర్థిక మూలాలు, సామర్థ్యాలను బలహీనపరచటమే లక్ష్యంగా దాడులు చేస్తోంది.చదవండి: ఓటేసిన 2.1 కోట్ల అమెరికన్లు -
యుద్ధానికి ఏడాది పూర్తయిన వేళ...పరస్పర దాడులు
రెయిమ్ (ఇజ్రాయెల్)/బీరూట్: గాజాపై ఇజ్రాయెల్ దాడులకు ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం పశి్చమాసియా దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లింది. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా నిప్పుల వర్షం కురిపించింది. టెల్ అవీవ్‌తో పాటు పోర్ట్ సిటీ హైఫాపై తెల్లవారుజామున ఫాది 1 క్షిపణులు ప్రయోగించింది. తమపైకి 130కి పైగా క్షిపణులు దూసుకొచి్చనట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ‘‘వాటిలో ఐదు మా భూభాగాన్ని తాకాయి. రోడ్లు, రెస్టారెంట్లు, ఇళ్లను ధ్వంసం చేశాయి’’ అని సైన్యం ధ్రువీకరించింది. పది మందికి పైగా గాయపడ్డట్టు పేర్కొంది. అటు హమాస్ కూడా ఇజ్రాయెల్‌పైకి రాకెట్లు ప్రయోగించింది. దాంతో గాజా సరిహద్దు సమీప ప్రాంతాల్లోనే గాక టెల్ అవీవ్‌లో కూడా సైరన్ల మోత మోగింది. జనమంతా సురక్షిత ప్రదేశాలకు పరుగులు తీశారు. దాంతో అటు లెబనాన్, ఇటు గాజాపై ఇజ్రాయెల్ మరింతగా విరుచుకుపడింది. బీరూట్‌తో పాటు దక్షిణ లెబనాన్‌లోని బరాచిత్పై భారీగా వైమానిక దాడులు చేసింది. బీరూట్‌లో పలుచోట్ల ఇళ్లు, నివాస సముదాయాలు నేలమట్టమయ్యాయి. జనం కకావికలై పరుగులు తీశారు. దాంతో విమానాశ్రయం తదితర ప్రాంతాలు శ్మశానాన్ని తలపిస్తున్నాయి. బరాచిత్లో సహాయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న 10 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది వైమానిక దాడులకు బలైనట్టు లెబనాన్ ప్రకటించింది. భవనాల శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారని, మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లో మరో 100 గ్రామాలను ఖాళీ చేయాల్సిందిగా స్థానికులను తాజాగా హెచ్చరించింది. సరిహద్దుల వద్ద సైనిక మోహరింపులను భారీగా పెంచుతోంది. గాజాలో జాబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో విరుచుకుపడింది. దాంతో 9 మంది బాలలతోపాటు మొత్తం 20 మంది దాకా మరణించారు. ఖాన్ యూనిస్ ప్రాంతాన్ని తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. మేం విఫలమైన రోజు ఏడాది కింద హమాస్ ముష్కరులు సరిహద్దుల గుండా చొరబడి తమపై చేసిన పాశవిక దాడిని ఇజ్రాయెలీలు భారమైన హృదయాలతో గుర్తు చేసుకున్నారు. దేశమంతటా ప్రదర్శనలు చేశారు. టెల్ అవీవ్‌లో హైవేను దిగ్బంధించారు. ‘‘ప్రజల ప్రాణాల పరిరక్షణలో మేం విఫలమైన రోజిది’’ అంటూ ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జ్ హలెవీ ఆవేదన వెళ్లగక్కారు. -
ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా కమాండర్ అకీల్ మృతి?
బీరుట్: వాకీటాకీల పేలుళ్లతో మొదలైన ఇజ్రాయెల్, హెజ్బొల్లా ఘర్షణ రోజురోజుకూ క్షిపణులు, డ్రోన్ల దాడులతో మరింత ముదురుతోంది. శుక్రవారం తమ ఉత్తర సరిహద్దు ప్రాంతాలపై హెజ్బొల్లా దాడులు చేసినందుకు ప్రతిగా ఇజ్రాయెల్ ఏకంగా లెబనాన్ దేశ రాజధాని బీరుట్ నగర సమీప ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. శుక్రవారం సాయంత్రం బీరుట్కు దక్షిణాన ఉన్న దహియే జిల్లాలోని జన సమ్మర్ద జామాస్ ప్రాంతంలో జరిపిన దాడుల్లో 12 మంది చనిపోయారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ దాడుల్లో 66 మంది గాయపడ్డారు. హెజ్బొల్లాకు గట్టిపట్టున్న ఈ ప్రాంతంపై జరిగిన ఈ దాడిలో ఒక బహుళ అంతస్తుల భవంతి నేలమట్టమైంది. మృతుల సంఖ్య పెరిగే వీలుంది. హెజ్బొల్లా సీనియర్ మిలటరీ అధికారి, ఆపరేషన్స్ కమాండర్ ఇబ్రహీం అకీల్ సైతం చనిపోయారని ఇజ్రాయెల్ పేర్కొంది. అకీల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశామని ప్రకటించింది. హెజ్బొల్లా ‘రద్వాన్ ఫోర్స్’ సాయుధ యూనిట్‌తో ఇతను సమావేశం అయిన సందర్భంగా దాడి చేసి అంతమొందించామని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి అవిచాయ్ అడ్రేయీ చెప్పారు. అయితే అకీల్, ఇతర కమాండర్ల మరణాన్ని హెజ్బొల్లా ధృవీకరించలేదు. అయితే అదే ప్రాంతంలో అకీల్ ఉన్నమాట వాస్తవమేనని హెజ్బొల్లా అధికార ప్రతినిధి చెప్పారు. బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. జూలైలో జరిపిన దాడుల్లో సీనియర్ హెజ్బొల్లా కమాండర్ ఫాద్ షుక్ర్ చనిపోయారు. 170 రాకెట్లతో విరుచుకుపడిన హెజ్బొల్లాహెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాహ్ గురువారం టెలివిజన్ ప్రసంగం వేళ తమ రాకెట్ లాంఛర్లను ఇజ్రాయెల్ దాడి చేసి ధ్వంసం చేసినందుకు ప్రతిగా హెజ్బొల్లా శుక్రవారం ఉదయం ఉత్తర ఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగింది. ఇజ్రాయెల్‌కు చెందిన గగనతల రక్షణ స్థావరాలు, బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాలపైకి హెజ్బొల్లా పలు దఫాల్లో 170 కత్యూషా రాకెట్లను ప్రయోగించింది. అయితే ఇందులో జరిగిన ప్రాణనష్టంపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఎవరీ ఇబ్రహీం అకీల్? రద్వాన్ ఫోర్స్ ఆపరేషన్స్ కమాండర్. గతంలో హెజ్బొల్లా అత్యున్నత సాయుధ విభాగం ‘జిహాద్ కౌన్సిల్’ సభ్యుడు. ఇతనిపై అమెరికా గతంలోనే ఆంక్షలు విధించింది. 1983లో బీరుట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం, నావికాదళ బ్యారెక్‌లపై ఉగ్రదాడుల్లో 300 మందికిపైగా చనిపోయారు. వీటిలో అకీల్ పాత్ర ఉందని అమెరికా ఆరోపిస్తోంది. 1980 దశకంలో కొందరు జర్మన్లు, అమెరికన్లను బంధించాడని ఇతనిపై ఆరోపణలున్నాయి. తహ్సీన్ అనే మారుపేరుతో తిరిగే ఇతని వివరాలు చెప్పినా, పట్టిచి్చనా రూ.58 కోట్లు ఇస్తానని గతేడాది అమెరికా నజరానా ప్రకటించింది. 2019లోనే ఇతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. -
Russia-Ukraine war: ఉక్రెయిన్ దాడుల్లో ఆరుగురి మృతి
కీవ్: రష్యా భూభాగాలపై ఉక్రెయిన్ ఆదివారం డ్రోన్లు, క్షిపణులతో ప్రతీకార దాడులకు దిగింది. వాటిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. క్రిమియా ద్వీపకల్పంలోని సెవస్టోపోల్ తీరపట్టణంపై ఉక్రెయిన్ ఐదు క్షిపణులను ప్రయోగించింది. రష్యాను ఎదుర్కొనేందుకు అమెరికా, పాశ్చాత్య దేశాలు తమకు మరిన్ని ఆయుధాలివ్వాలని అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి కోరారు. -
G7 Summit 2024: చైనా అండతోనే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం
రోమ్: 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రెండేళ్లకుపైగా దాడులు కొనసాగించే శక్తి రష్యాకు ఎలా వచి్చంది? అమెరికాతోపాటు పశి్చమ దేశాలు డ్రాగన్ దేశం చైనా వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. చైనా అండదండలతోనే ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు చేస్తోందని, సాధారణ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోందని జీ7 దేశాలు ఆరోపించాయి. ఇటలీలో సమావేశమైన జీ7 దేశాల అధినేతలు తాజాగా ఈ మేరకు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా అండ చూసుకొని రష్యా రెచి్చపోతోందని ఆరోపించారు. రష్యా యుద్ధ యంత్రానికి చైనానే ఇంధనంగా మారిందని జీ7 దేశాలు మండిపడ్డారు. రష్యాకు మిస్సైళ్లు డ్రోన్లు చైనా నుంచే వస్తున్నాయని ఆక్షేపించారు. జీ7 దేశాలు సాధారణంగా రష్యాను తమ శత్రుదేశంగా పరిగణిస్తుంటాయి. ఈ జాబితాలో ఇప్పుడు చైనా కూడా చేరినట్లు కనిపిస్తోంది. మారణాయుధాలు తయారు చేసుకొనే పరిజ్ఞానాన్ని రష్యాకు డ్రాగన్ అందిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైన తర్వాత రష్యాకు చైనా నేరుగా ఆయుధాలు ఇవ్వకపోయినా ఆయుధాల తయారీకి అవసరమైన విడిభాగాలు, ముడి సరుకులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సరఫరా చేస్తోందని ఆక్షేపించారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన ఉక్రెయిన్‌లో మారణహోమం సృష్టించేలా రష్యాకు సహకరిస్తున్న దేశాలపై, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోకతప్పదని జీ7 దేశాల అధినేతలు తేలి్చచెప్పారు. ఉక్రెయిన్‌పై చట్టవిరుద్ధమైన యుద్ధానికి మద్దతివ్వడం మానుకోవాలని హితవు పలికాయి. ఉక్రెయిన్‌పై దాడుల తర్వాత రష్యాపై పశి్చమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో తమకు అవసరమైన సరుకులను చైనా నుంచి రష్యా దిగుమతి చేసుకుంటోంది. అలాగే రష్యా నుంచి చైనా చౌకగా చమురు కొనుగోలు చేస్తోంది. ఇరుదేశాలు పరస్పరం సహరించుకుంటున్నాయి. టిబెట్, షిన్‌జియాంగ్‌తోపాటు హాంకాంగ్‌లో చైనా దూకుడు చర్యలను జీ7 సభ్యదేశాలు తప్పుపట్టాయి. చైనా మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతోందని ఆరోపించాయి. మరోవైపు డ్రాగన్ దేశం అనుసరిస్తున్న వ్యాపార విధానాలను అమెరికాతోపాటు యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలు తప్పుపడుతున్నాయి. ఎలక్ట్రికల్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తులు, సోలార్ ప్యానెళ్ల తయారీకి చైనా ప్రభుత్వం భారీగా రాయితీలిస్తోంది. దీంతో ఇవి చౌక ధరలకే అందుబాటులో ఉంటూ విదేశీ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా ఆయా దేశాల్లో వీటిని తయారు చేసే కంపెనీలు గిరాకీ లేక మూతపడుతున్నాయి. ఫలితంగా ఉద్యోగాల్లో కోతపడుతోంది. చైనా దిగుమతులతో పశి్చమ దేశాలు పోటీపడలేకపోతున్నాయి. చైనా ఎత్తుగడలను తిప్పికొట్టడానికి చైనా ఉత్పత్తులపై అమెరికాతోపాటు ఈయూ దేశాలు భారీగా పన్నులు విధిస్తున్నాయి. -
రష్యాకు ఎదురుదెబ్బ
కీవ్: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యాకు బుధవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒక కమాండర్ రాక కోసం శిక్షణాప్రాంతం వద్ద గుమిగూడిన సైనికులపై రెండు క్షిపణిలు వచ్చి పడ్డాయి. దీంతో 60 మంది రష్యా సైనికులు మరణించారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఈ ఘటనపై రష్యా రక్షణ మంత్రి సెర్గియో షొయిగూ నోరు మెదపలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీకి కొద్దిసేపటికి ముందే ఈ దాడి జరగడం గమనార్హం. ఇతర ప్రాంతాల్లో రష్యా సైన్యం విజయాలను పుతిన్‌కు వివరించిన సెర్గియో ఈ దాడి వివరాలను మాత్రం వెల్లడించలేదు. రష్యా ఆక్రమణలో ఉన్న ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం డొనెట్కŠస్ రీజియన్‌లో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. సెర్బియా ప్రాంతంలో ఉండే 36వ రైఫిల్ బ్రిగేడ్ ట్రుడోవ్స్కే గ్రామంలో ఒక మేజర్ జనరల్ రాకకోసం వేచి చూస్తుండగా ఈ దాడి జరిగింది. ఒకే చోట డజన్లకొద్దీ జవాన్లు విగతజీవులుగా పడి ఉన్న వీడియో ఒకటి అంతర్జాతీయ మీడియాలో ప్రసారమైంది. అమెరికా తయారీ హై మొబిలిటీ ఆరి్టలరీ రాకెట్ సిస్టమ్(హిమార్స్) నుంచి దూసుకొచి్చన మిస్సైళ్లే ఈ విధ్వంసం సృష్టించాయని రష్యా చెబుతోంది. మరోవైపు రష్యా వ్యతిరేకంగా సైనిక వార్తలు రాసే బ్లాగర్ ఆండ్రీ మొరజోవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయన టెలిగ్రామ్ చానెల్‌కు లక్ష మంది చందాదారులు ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో చాలా ప్రాంతాల్లో రష్యా తోకముడిచిందంటూ, వేల మంది సైనికులు చనిపోయారని తాను రాసిన విశ్లేషణాత్మక కథనాలను వెంటనే తొలగించాలంటూ రష్యా సైన్యం నుంచి ఈయన చాన్నాళ్లుగా ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాడు. ఇంకెవరో వచ్చి చంపే బదులు తానే కాల్చుకుని చస్తానని తన బ్లాగ్‌లో రాశాడని వార్తలొచ్చాయి. ఇప్పటిదాకా యుద్ధంలో రష్యా 45వేలకుపైగా సైన్యాన్ని కోల్పోయిందని ‘బీబీసీ రష్యా’ తెలిపింది. -
Israel-Hamas war: యుద్ధజ్వాలలకు... 100 రోజులు
క్రైస్తవ, ముస్లిం, యూదు మతాల పవిత్ర స్థలాలకు నెలవైన జెరూసలేంలోని అల్–అక్సా మసీదు ప్రాంతంలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దళాల దాడులతో రాజుకున్న వివాదం చివరకు హమాస్–ఇజ్రాయెల్ యుద్ధంగా తీవ్రరూపం దాల్చి ఆదివారంతో 100 రోజులు పూర్తిచేసుకుంది. అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపై హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడులు, 1,200 మంది ఇజ్రాయెల్ పౌరుల హతం, 200 మందికిపైగా అపహరణతో మొదలైన ఈ ఘర్షణ ఆ తర్వాత ఇజ్రాయెల్ భూతల, గగనతల భీకర దాడులతో తీవ్ర మానవీయ సంక్షోభంగా తయారైంది. వందల కొద్దీ బాంబు, క్షిపణి దాడుల ధాటికి లక్షలాది మంది పాలస్తీనియన్లు ప్రాణభయంతో పారిపోయారు. దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులై తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేక, కనీసం తాగు నీరు లేక జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్నారు. ఈ యుద్ధం 23 వేలకుపైగా ప్రాణాలను బలితీసుకోగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులను మరింత పెంచింది. ఐక్యరాజ్యసమితి మానవీయ సాయం డిమాండ్లు, తీర్మానాలతో కాలం వెళ్లదీస్తోంది. మృత్యు నగరాలు ఇజ్రాయెల్ దాడులతో గాజా స్ట్రిప్‌లోని ప్రతి పట్టణం దాదాపు శ్మశానంగా తయారైంది. మొత్తం 23 లక్షల జనాభాలో 85 శాతం మంది వలసపోయారు. ఉత్తర గాజాపై, ఆ తర్వాత దక్షిణ గాజాపై దాడుల ఉధృతి పెరగడంతో జనం ఈజిప్ట్ చిట్టచివరి సరిహద్దు ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. లెబనాన్‌లోని హెజ్»ొల్లా మిలెంట్లు, యెమెన్‌లోని హౌతీల దాడులతో యుద్దజ్వాలలు పశ్చిమాసియాకు పాకుతున్నాయి. కాల్పుల విరమణ ప్రకటించేదాకా బందీలను వదిలిపెట్టబోమని, దాడులను ఆపబోమని హమాస్, దాన్ని హమాస్‌ను కూకటివేళ్లతో పెకలించేదాకా యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ అంటున్నాయి! ఫలించని దౌత్యం ఖతార్, అమెరికా దౌత్యం తొలుత సఫలమైనట్లే కనిపించింది. ఇజ్రాయెల్, పాలస్తీనా పరస్పరం బందీలను విడుదల చేశాయి. కానీ ఆ వెంటనే మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఈ వంద రోజుల్లో లక్షలాది ఇళ్లు, వేలాది ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉండటం అత్యంత విషాదకరం. రోగాల పుట్టలుగా శరణార్థి శిబిరాలు గాజాలో శరణార్థి శిబిరాలు కిటకిటలాడుతున్నాయి. జనం రోగాలబారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. ఆహార, సరకులు, ఔషధ సాయం అందకుండా ఇజ్రాయెల్ దాడులకు దిగుతుండటంతో అక్కడ ఎటు చూసినా భయానక పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Israel-Hamas war: సెంట్రల్ గాజాపై భీకర దాడులు..
ఖాన్ యూనిస్: ఇజ్రాయెల్ సైన్యం సెంట్రల్ గాజాపై మరోసారి విరుచుకుపడింది. ఆదివారం క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో కనీసం 35 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా అధికారులు వెల్లడించారు. గాజాలో హమాస్ మిలిటెంట్లపై యుద్ధం మరికొన్ని నెలలపాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించిన మరుసటి రోజే సైన్యం దాడులు ఉధృతం చేయడం గమనార్హం. ఆదివారం ప్రధానంగా ఖాన్ యూనిస్ నగరంపై క్షిపణి దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 21,600 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. 55,000 మందికిపైగా క్షతగాత్రులుగా మారారు. ప్రపంచమంతా నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తుండగా పశి్చమాసియాలో మాత్రం ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. యెమెన్‌కు చెందిన హౌతీ ఉగ్రవాదులు పశ్చిమ దేశాల నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నారు. ఎర్ర సముద్రంలో భారీ కంటైనర్ షిప్‌ను ధ్వంసం చేయడానికి హౌతీ ముష్కరులు ప్రయోగించిన రెండు యాంటీ–షిప్ బాలిస్టిక్ క్షిపణులను మధ్యలోనే కూలి్చవేశామని అమెరికా సైన్యం ఆదివారం ప్రకటించింది. కొన్ని గంటల తర్వాత ఇదే నౌకపై దాడి చేయడానికి నాలుగు పడవలు ప్రయతి్నంచాయని వెల్లడించింది. ఈ దాడిని తాము తిప్పికొట్టామని, తమ ఎదురు కాల్పుల్లో సాయుధ దుండగులు హతమయ్యారని పేర్కొంది. -
Israel-Hamas war: ‘అల్–మగజి’పై అసాధారణ దాడులు
గాజా స్ట్రిప్: భీకర గగనతల, భూతల దాడులతో తలో దిక్కూ పారిపోతూ శరణార్ధి శిబిరాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్ క్షిపణులు కనికరం చూపడం లేదు. సోమవారం సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని డెయిర్ అల్–బాలాహ్ పట్టణం సమీపంలోని అల్–మగజి శరణార్ధి శిబిరంపై ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో ఏకంగా 106 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మూడు అంతస్తుల భవంతి పూర్తిగా నేలమట్టమైంది. భవన శిథిలాల నుంచి డజన్ల కొద్దీ మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యాలు అంతర్జాతీయ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మరణాల సంఖ్య పెరగవచ్చని హమాస్ ఆరోగ్య విభాగం తెలిపింది. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దురాక్రమణ మొదలయ్యాక జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇదీ ఒకటి. గాజా స్ట్రిప్‌లో మొత్తంగా గత 24 గంటల్లో 250 మంది మరణించారని, 500 మందికిపైగా పాలస్తీనియన్లు గాయపడ్డారని హమాస్ పేర్కొంది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణను ప్రకటించనుందన్న వార్తలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తోసిపుచ్చారు. త్వరలోనే యుద్ధాన్ని మరింతగా విస్తరిస్తామన్నారు. -
Israel-Hamas war: మరో ఆసుపత్రిపై దాడి
ఖాన్ యూనిస్: గాజా స్ట్రిప్‌లో అతిపెద్దదైన అల్–షిఫా ఆసుపత్రిని దిగ్బంధించి, రోజుల తరబడి తనిఖీలు చేస్తూ హమాస్ ఆయుధాలు, సొరంగాల ఫొటోలు విడుదల చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు ఉత్తర గాజాలోని ఇండోనేసియన్ హాస్పిటల్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో రోగులు, క్షతగాత్రులు, వేలాది మంది సామాన్య పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నారు. సోమవారం క్షిపణులు ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా ఇండోనేసియన్ ఆసుపత్రిపై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో ఆసుపత్రి రెండో అంతస్తు ధ్వంసమైంది. కనీసం 12 మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇండోనేíసియన్ హాస్పిటల్‌కు 200 మీటర్ల దూరంలో ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు మోహరించాయి. సమీపంలోని భవనాలపై ఇజ్రాయెల్ షార్ప్ షూటర్లు మాటు వేశారు. ఆసుపత్రులపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఉధృతం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రుల్లో హమాస్ స్థావరాలు, ఆయుధ నిల్వలు ఉన్నాయని, వాటిని ధ్వంసం చేయక తప్పదని ఇజ్రాయెల్ తేలి్చచెబుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో మృతుల సంఖ్య 13,000కు చేరిందని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈజిప్టుకు 28 మంది శిశువులు అల్–షిఫా నుంచి దక్షిణ గాజాలోని అల్–అహ్లీ ఎమిరేట్స్ హాస్పిటల్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తరలించిన 31 మంది శిశువుల్లో 28 మందిని సోమవారం అంబులెన్స్‌ల్లో ఈజిప్టుకు చేర్చారు. వారికి ఈజిప్టు వైద్యులు సాదర స్వాగతం పలికారు. శిశువుల కోసం ఇంక్యుబేటర్లు సిద్ధంగా ఉంచారు. ఈజిప్టులో వారికి మెరుగైన చికిత్స అందించనున్నారు. శిశువుల్లో కొందరిని గాజా సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలోని అల్–అరిష్ ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న మరికొందరిని కైరోకు తరలించారు. వీరంతా అల్–షిఫాలోనెలలు నిండక ముందు జని్మంచి, ప్రాణాపాయ స్థితికి చేరుకున్నవారే. 31 మందిలో 28 మందిని ఈజిప్టుకు తరలించారు. మిగతా ముగ్గురు గాజాలోనే ఉండిపోయారు. అల్–షిఫాలో బందీలను దాచిపెట్టిన హమాస్! అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 240 మందిని బందీలుగా పట్టుకొని గాజాకు తరలించారు. వారిలో చాలామందిని అల్–షిఫా ఆసుపత్రి కింది భాగంలోని సొరంగాల్లో మిలిటెంట్లు దాచిపెట్టారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారలను తాజాగా బయటపెట్టింది. అల్–షిఫాలో అక్టోబర్ 7న నిఘా కెమెరా చిత్రీకరించిన ఒక వీడియోను ఇజ్రాయెల్ తాజాగా బహిర్గతం చేసింది. ఇందులో ఇద్దరు బందీలను అల్–షిఫాలోకి మిలిటెంట్లు బలవంతంగా లాక్కెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారిద్దరూ థాయ్‌లాండ్, నేపాల్ జాతీయులు. ప్రస్తుతం వారు ఎక్కడున్నారన్నది తెలియరాలేదు. ఇదిలా ఉండగా, బందీలను విడిపించేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. వారిని విడుదల చేసేలా హమాస్‌ను ఒప్పించేందుకు అమెరికా అభ్యర్థన మేరకు అరబ్ దేశాలు రంగంలోకి దిగాయి. మిలిటెంట్ నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. -
Israel-Hamas war: స్కూళ్లపై బాంబుల వర్షం
ఖాన్ యూనిస్ (గాజా): గాజాలో యుద్ధ తీవ్రత ఏ మాత్రమూ తగ్గుముఖం పట్టడం లేదు. ఇటు వసతుల లేమి, అటు ఇజ్రాయెల్ బాంబింగ్‌తో అక్కడి పాలస్తీనియన్ల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. కొద్ది రోజులుగా ఆస్పత్రులను దిగ్బంధిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం శనివారం స్కూళ్లపై విరుచుకుపడింది. పాలస్తీనా శరణార్థుల కోసం ఐరాస సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) నడుపుతున్న అల్ ఫలా స్కూల్‌పై జరిగిన దాడుల్లో 130 మందికి పైగా మరణించారు. గంటల వ్యవధిలోనే జబాలియా శరణార్థి శిబిరంలో వేలాది మంది తలదాచుకుంటున్న అల్ ఫకూరా స్కూల్‌పై యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించడంతో 100 మందికి పైగా మరణించినట్టు సమాచారం. అనంతరం బెయిట్ లాహియాలోని తల్ అల్ జాతర్ స్కూలు భవనం కూడా బాంబు దాడులతో దద్దరిల్లిపోయింది. మూ డు ఘటనల్లో వందలాది మంది పౌరులు దుర్మర ణం పాలైనట్టు చెబుతున్నారు. ఉత్తర గాజాలో ఓ భవనంపై జరిగిన దాడులకు ఒకే కుటుంబానికి చెందిన 32 మంది బలైనట్టు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో 19 మంది చిన్నారులున్నారని పేర్కొంది. దక్షిణ గాజాలో పెద్ద నగరమైన ఖాన్ యూనిస్ శివార్లలో నివాస భవనంపై జరిగిన దాడిలో కనీసం 26 మంది పౌరులు మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. నగరంలో పశి్చమవైపున జరిగిన మరో దాడిలో కనీసం 15 దాకా మరణించారు. మరోవైపు బాంబు, క్షిపణి దాడుల్లో పా లస్తీనా లెజిస్లేటివ్ కౌన్సిల్ భవనం కూడా పాక్షికంగా నేలమట్టమైనట్టు చెబుతున్నారు. ఇజ్రాయెల్ దాడులకు బలైన పాలస్తీనియన్ల సంఖ్య 12 వేలు దాటినట్టు హమాస్ ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇప్పటిదాకా 104 మంది ఐరాస సంస్థల సిబ్బంది కూడా యుద్ధానికి బలవడం తెలిసిందే. ఇంధన సరఫరా తాజాగా గాజాలోని అతి పెద్ద ఆస్పత్రి అల్ షిఫాను ఖాళీ చేయిస్తోంది. దాంతో రోగులు, సిబ్బంది, శరణార్థులు వందలాదిగా ఆస్పత్రిని వీడుతున్నారు. ఏ మాత్రమూ కదల్లేని పరిస్థితిలో ఉన్న 120 మందికి పైగా రోగులు, వారిని కనిపెట్టుకునేందుకు ఆరుగురు వైద్యులు, కొంతమంది సిబ్బంది మాత్రమే ప్రస్తుతం ఆస్పత్రిలో మిగిలినట్టు సమాచారం. తిండికి, నీటికి కూడా దిక్కు లేక గాజావాసుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. ఎక్కడ చూసినా ఆహారం కోసం ఘర్షణలు పరిపాటిగా మారాయి. వారిలో డీహైడ్రేషన్, ఆహార లేమి సంబంధిత సమస్యలు నానాటికీ పెరిగిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వెలిబుచి్చంది. గాజాకు నిత్యావసరాలతో పాటు ఇతర అవ్యవసర సరఫరాలన్నీ నెల రోజులుగా పూర్తిగా నిలిచిపోవడం తెలిసిందే. చలి తీవ్రత పరిస్థితిని మరింత విషమంగా మారుస్తోంది. కాకపోతే గాజాలో రెండు వారాలకు పైగా నిలిచిపోయిన ఇంటర్నెట్, ఫోన్ సేవలు శనివారం తిరిగి మొదలయ్యాయి. దాంతో అక్కడి పాలస్తీనియన్లకు అత్యవసర సేవలను పునరుద్ధరించేందుకు ఐరాస సంస్థలు సమాయత్తమవుతున్నాయి. గాజాకు తాజాగా భారీ పరిమాణంలో ఇంధన నిల్వలు కూడా అందినట్టు అవి వెల్లడించాయి. నోవా ఫెస్ట్ మృతులు 364 మంది ప్రస్తుత యుద్ధానికి కారణమైన అక్టోబర్ 7 నాటి హమాస్ మెరుపు దాడిలో ఇజ్రాయెల్‌లో 1,200 మంది దాకా దుర్మరణం పాలవడం తెలిసిందే. ఆ సందర్భంగా దేశ దక్షిణ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌ను హమాస్ మూకలు దిగ్బంధించి విచక్షణారహితంగా కాల్పులకు దిగాయి. ఆ మారణకాండకు 270 మంది బలైనట్టు ఇజ్రాయెల్ అప్పట్లో ప్రకటించింది. కానీ అందులో ఏకంగా 364 మంది మరణించారని ఆ దేశ మీడియా తాజాగా వెల్లడించింది. ఫెస్ట్‌లో పాల్గొన్న ఇజ్రాయెలీల్లో 40 మందికి పైగా మిలిటెంట్లకు బందీలుగా చిక్కినట్టు పేర్కొంది. పులి మీద పుట్రలా... ఉత్తర గాజాను ఇప్పటికే దాదాపుగా ఖాళీ చేయించిన ఇజ్రాయెల్ ఇప్పుడిక దక్షిణాదిపై దృష్టి పెట్టింది. దక్షిణ గాజాను కూడా తక్షణం ఖాళీ చేసి పశి్చమానికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అక్కడ దాడులను ఉధృతం చేస్తోంది. దాంతో దక్షిణ గాజాలోని లక్షలాది మంది పాలస్తీనియన్ల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఇజ్రాయెల్ ఆదేశాల నేపథ్యంలో 10 లక్షలకు పైగా ఉత్తర గాజావాసులు సర్వం కోల్పోయి చచ్చీ చెడీ దక్షిణానికి వెళ్లడం తెలిసిందే. దాంతో ఆ ప్రాంతమంతా ఒకవిధంగా అతి పెద్ద శరణార్థి శిబిరంగా మారి నానా సమస్యలకు నిలయమై విలవిల్లాడుతోంది. ఇప్పుడు మళ్లీ పశి్చమానికి వలస వెళ్లాలన్న ఆదేశాలు వారి పాలిట పులిమీద పుట్రలా మారుతున్నాయి. -
Israel-Hamas conflict: గాజా సిటీపై దండయాత్ర
ఖాన్ యూనిస్: హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ యుద్ధం మరో మలుపు తిరిగింది. గాజా్రస్టిప్‌లో అతిపెద్ద నగరమైన గాజా సిటీని ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టింది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు తీవ్రతరం చేసింది. బుధవారం అర్ధరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో క్షిపణులు ప్రయోగించింది. 100కుపైగా హమాస్ సొరంగాలను పేల్చేశామని, పదుల సంఖ్యలో మిలిటెంట్లు హతమయ్యారని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ పదాతి దళాలు ఉత్తర గాజాలోని గాజా సిటీలోకి అడుగుపెట్టాయి. వీధుల్లో కవాతు చేస్తూ మిలిటెంట్ల కోసం గాలిస్తున్నాయి. గాజా సిటీలో రోగులు, క్షతగాత్రులతోపాటు వేలాదిగా పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న అల్–షిఫా హాస్పిటల్ యుద్ధక్షేత్రంగా మారింది. ఆసుపత్రి చుట్టూ ఇజ్రాయెల్ సేనలు మోహరించాయి. అల్–షిఫా హాస్పిటల్లోనే హమాస్ ప్రధాన కమాండ్ సెంటర్ ఉందని, సీనియర్ మిలిటెంట్లు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారని, దాన్ని ధ్వంసం చేసి తీరుతామని సైన్యం తేలి్చచెప్పింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ జవాన్లు ఆసుపత్రి చుట్టూ 3 కిలోమీటర్ల దూరంలోనే మోహరించారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే ఆసుపత్రిలోకి చొచ్చుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. గాజాలోని అల్–ఖుద్స్ హాస్పిటల్‌పైనా సైన్యం దృష్టి పెట్టింది. ఇక్కడ వంద మందికిపైగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. హమాస్ మిలిటెంట్లు అల్–ఖుద్స్ ఆసుపత్రి ప్రాంగణంలో మకాం వేశారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. క్షతగాత్రుల ముసుగులో తప్పించుకుంటున్నారని చెబుతోంది. ఆసుపత్రుల్లో మిలిటెంట్లు ఉన్నారన్న ఇజ్రాయెల్ వాదనను హమాస్ ఖండించింది. వెస్ట్‌బ్యాంక్‌పై దాడి.. 11 మంది మృతి గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య గురువారం 10,812కు చేరుకుంది. మరో 2,300 మంది శిథిలాల కిందే ఉండిపోయారు. వారు మరణించి ఉంటారని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోనూ హింసాకాండ కొనసాగుతోంది. గురువారం వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ శరణార్థి శిబిరంపై జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 11 మంది పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు. మరో 20 మంది గాయపడ్డారు. పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఆ ఫొటో జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలి అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని చిత్రీకరించిన ఫొటో జర్నలిస్టుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ గురువారం డిమాండ్ చేసింది. గాజాకు చెందిన ఈ జర్నలిస్టులు అంతర్జాతీయ మీడియా సంస్థల తరఫున పనిచేస్తున్నారు. హమాస్ దాడిని కెమెరాలతో చిత్రీకరించారు. ఫొటోలు తీశారు. మీడియాకు విడుదల చేశారు. హమాస్ దాడి గురించి వారికి ముందే సమాచారం ఉందని, అందుకే కెమెరాలతో సర్వసన్నద్ధమై ఉన్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది. మానవత్వంపై జరిగిన నేరంలో వారి పాత్ర ఉందని మండిపడింది. వారి వ్యవహార శైలి పాత్రికేయ ప్రమాణాలకు విరుద్ధమని ఆక్షేపించింది. సదరు ఫొటోజర్నలిస్టులు పనిచేస్తున్న మీడియా సంస్థకు ఇజ్రాయెల్ లేఖలు రాసింది. ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు.. ఉత్తర గాజా–దక్షిణ గాజాను కలిపే ప్రధాన రహదారిని ఇజ్రాయెల్ సైన్యం వరుసగా ఐదో రోజు తెరిచి ఉంచింది. నిత్యం వేలాది మంది జనం ఉత్తర గాజా నుంచి వేలాది మంది దక్షిణ గాజాకు పయనమవుతున్నారు. పిల్లా పాపలతో కాలినడకనే తరలి వెళ్తున్నారు. కొందరు కట్టుబట్టలతో వెళ్లిపోతున్నారు. ఉత్తర గాజాలో హమాస్ స్థావరాలపై దాడులు ఉధృతం చేస్తామని, సాధారణ ప్రజలంతా దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. గాజాలో జనం సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడానికి, మానవతా సాయం అందించడానికి వీలుగా ప్రతిరోజూ 4 గంటలపాటు దాడులకు విరామం ఇచ్చేందుకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలియజేశారు. -
Israel-Hamas conflict: ఇజ్రాయెల్ ప్రతీకారేచ్ఛ
ఖాన్ యూనిస్/న్యూఢిల్లీ: హమాస్‌పై యుద్ధం పేరిట ఇజ్రాయెల్ సైన్యం కొనసాగిస్తున్న భీకర దాడుల్లో సాధారణ పాలస్తీనియన్లు బలవుతున్నారు. గాజా స్ట్రిప్‌పై దాడులు తక్షణమే ఆపాలని, శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ప్రపంచ దేశాలన్నీ విజ్ఞప్తి చేస్తున్నా ఇజ్రాయెల్ లెక్కచేయడం లేదు. శత్రువులు ఎక్కడ దాగున్నా మట్టుబెట్టడమే తమ లక్ష్యం అంటూ ఇజ్రాయెల్ సైన్యం గురువారం తెల్లవారుజామునే గాజాపై నిప్పుల వర్షం కురిపించింది. ఉత్తర గాజాతోపాటు దక్షిణ గాజాలో ‘సురక్షితమైన ప్రాంతాలు’ అని భావిస్తున్న చోట కూడా దాడులు చేసింది. హమాస్‌పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ పెద్ద సంఖ్యలో క్షిపణులు ప్రయోగించింది. చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎంతమంది చనిపోయారన్నది తెలియరాలేదు. ఖాన్ యూనిస్‌లో దాదాపు 90 మంది ఆశ్రయం పొందుతున్న ఓ భవనం ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో ధ్వంసమైంది. ఈ భవనంలో కనీసం 15 మంది మృతిచెందారని, మరో 40 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు పేర్కొన్నారు. గాజాలో శిథిలాల నుంచి చిన్న పిల్లల మృతదేహాలను బయటకు తీసుకువస్తున్న దృశ్యాలు చూపరులను కలచి వేస్తున్నాయి. ఇప్పటిదాకా ఎంతమంది బలయ్యారో? ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. దాదాపు 23 లక్షల మంది పాలస్తీనియన్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హమాస్ సైతం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్‌పైకి రాకెట్లు ప్రయోగిస్తూనే ఉంది. ఇరుపక్షాల నడుమ ఈ నెల 7న ప్రారంభమైన యుద్ధం గురువారం 13వ రోజుకు చేరింది. ఇప్పటికే గాజాలో 3,785 మంది మరణించారు. దాదాపు 12,500 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ అధికారిక గణాంకాలే. వాస్తవంగా ఎంతమంది బలయ్యారో ఇప్పుడే తెలిసే అవకాశం లేదు. చాలా సమయం పట్టొచ్చు. ఒక్కపూట భోజనం.. మురికి నీరు గాజాలో ఆహారం, నీటి కొరత మరింత పెరిగింది. ఒక్కపూట భోజనం దొరకడమే గగనంగా మారింది. దాహమేస్తే మురికి నీరే దిక్కవుతోంది. ఈజిప్టు నుంచి గాజాకు మానవతా సాయం చేరవేయడానికి ఇజ్రాయెల్ అంగీకరించినప్పటికీ అది ఎప్పటికి అందుతుందో చెప్పలేమని స్థానిక అధికారులు అంటున్నారు. ఈజిప్టు సరిహద్దుల్లోని రఫాలో తమ వైమానిక దాడుల్లో హమాస్ అగ్రశ్రేణి మిలిటెంట్ హతమయ్యాడని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజాలో వందలాది టార్గెట్లపై దాడులు చేశామని, మిలిటెంట్ల సొరంగాలు, నిఘా కేంద్రాలు, కమాండ్ సెంటర్లు, మోర్టార్–లాంచింగ్ పోస్టులను ధ్వంసం చేశామని వెల్లడించింది. మిలిటెంట్లు గాజాలో ఎక్కడ నక్కినా సరే దాడులు తప్పవని హెచ్చరించింది. వారు సాధారణ పౌరుల ముసుగులో తప్పించుకొనేందుకు ప్రయతి్నస్తున్నట్లు సమాచారం ఉందని తెలియజేసింది. హమాస్ చేతికి ఉ.కొరియా ఆయుధాలు! ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు ఉత్తర కొరియా ఆయుధాలు ప్రయోగించారా? అవుననే అంటోంది ఇజ్రాయెల్ సైన్యం. హమాస్ వీడియో దృశ్యాలు, మిలిటెంట్ల నుంచి స్వా«దీనం చేసుకున్న కొన్ని ఆయుధాలను పరిశీలిస్తే ఇవి ఉత్తర కొరియా నుంచి వచి్చనట్లు తెలుస్తోందని నిపుణులు చెప్పారు. మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడికి ఎఫ్–7 రాకెట్ గ్రనేడ్‌తో, షోల్డర్ ఫైర్డ్ వెపన్స్ వాడినట్టు పేర్కొన్నారు. ఇవి ఉత్తర కొరియాకు చెందినవేనని అనుమానిస్తున్నారు. కానీ, హమాస్ మిలిటెంట్లకు ఎలాంటి ఆయుధాలు విక్రయించలేదని ఉత్తర కొరియా తేలి్చచెప్పింది. భూతల దాడులకు సిద్ధంగా ఉండాలి గాజాపై భూతల దాడులకు సిద్ధంగా ఉండాలని తమ సేనలకు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ సూచించారు. గాజాలో అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేసుకోవాలని చెప్పారు. కానీ, భూతల దాడులు ఎప్పటినుంచి ప్రారంభమవుతాయో బహిర్గతం చేయలేదు. ఆయన గురువారం గాజా సరిహద్దులో తమ సైనికులతో సమావేశమయ్యారు. ఆదేశాలు రాగానే ముందుకు కదిలేలా సర్వసన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. గాజాను ఇప్పటిదాకా మనం బయటి నుంచే చూశామని, ఇకపై లోపలికి వెళ్లి చూడబోతున్నామని మంత్రి వ్యాఖ్యానించారు. -
జెలెన్స్కీ సొంత నగరంపై క్షిపణి దాడులు
కీవ్: రష్యా సోమవారం ఉదయం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత నగరం క్రివి్వ్యరిహ్పై రెండు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో పదేళ్ల బాలిక సహా ఆరుగురు చనిపోయారు. ఈ దాడుల్లో ఓ అపార్టుమెంట్, నాలుగంతస్తుల యూనివర్సిటీ భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పదేళ్ల బాలిక, ఆమె తల్లి సహా అయిదుగురు ప్రాణాలు కోల్పోగా మరో 64 మంది గాయాలపాలయ్యారని నీప్రో గవర్నర్ సెర్హీ లిసాక్ తెలిపారు. ఇంకా కొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు చెప్పారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయన్నారు. రష్యా పాక్షికంగా ఆక్రమించిన డొనెట్స్క్ ప్రావిన్స్‌లో జరిగిన దాడిలో ఇద్దరు చనిపోగా మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ దాడికి కారణమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. కాగా, మాస్కోపైకి ఆదివారం డ్రోన్లను ప్రయోగించిన ఉక్రెయిన్ సోమవారం రష్యాలోని బ్రియాన్స్క్పై డ్రోన్ దాడి జరిపింది. ఎవరూ చనిపోయినట్లు సమాచారం లేదని స్థానిక గవర్నర్ చెప్పారు. ఖరీ్కవ్, ఖెర్సన్, డొనెట్స్్కలపై రష్యా శతఘ్ని కాల్పుల్లో ముగ్గురు చనిపోగా మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. -
ఉక్రెయిన్ రెస్టారెంట్‌పై రష్యా క్షిపణి దాడి
కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లో పాపులర్ పిజ్జా రెస్టారెంట్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 11 మంది మరణించారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ దాడిలో మరో 61 మందికి గాయాలయ్యాయి. ఇటీవల కాలంలో ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడుల్లో ఇదే పెద్దది. అయితే ఈ క్షిపణి రెస్టారెంట్ వైపు వెళ్లేలా ప్రయోగించడానికి ఉక్రెయిన్‌కు చెందిన ఒక వ్యక్తి రష్యా మిలటరీకి సాయం చేశాడన్న ఆరోపణలపై ఉక్రెయిన్ అధికారులు ఒక వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. రష్యాలో ప్రైవేటు సైన్యం వాగ్నర్ సంస్థ చీఫ్ ప్రిగోజిన్ తిరుగుబాటు తర్వాత రాజకీయంగా, మిలటరీ పరంగా అంతర్గత సంక్షోభం ఉన్నప్పటికీ ఆ దేశం ఉక్రెయిన్‌పై ఇంకా దాడులు కొనసాగిస్తూనే ఉంది. -
Russia-Ukraine war: ఒడెసాపై ఆగని రష్యా క్రూయిజ్ దాడులు
కీవ్: రణనినాదంతో రంకెలేస్తూ ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దూకిన రష్యా సైన్యం ఒడెసా నగరంపై క్రూయిజ్ క్షిపణి దాడులతో దండెత్తింది. డజన్ల కొద్దీ భవనాలను ధ్వంసం చేసింది. వీటిలో పలు క్షిపణులను ఉక్రెయిన్ దళాలు విజయవంతంగా అడ్డుకుని నేలకూల్చాయి. కానీ రష్యా దాడిలో ఒడెసాలో గిడ్డంగి కూలడంతో అందులో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని ఇళ్లు, దుకాణాలు, కేఫ్‌లు ధ్వంసమయ్యాయి. 13 మందికి గాయాలయ్యాయి. కుప్పకూలిన గిడ్డంగి శిథిలాల కింద ఎవరైనా బతికిఉంటారనే ఆశతో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్రమటోర్క్, కోస్టియాన్టినీవ్కా సిటీలపైనా రష్యా దాడులు చేసింది. క్రమటోర్క్లో ఇద్దరు పౌరులు చనిపోగా 29 ఇళ్లు కూలిపోయాయని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. కోస్టియాన్టినీవ్కాలో ఒకరు చనిపోయారు. 57 ఇళ్లు నేలమట్టమయ్యాయి. దాదాపు 16 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో రష్యా మళ్లీ వైమానిక దాడులను పెంచిందని ఉక్రెయిన్ సైన్యం అధికార ప్రతినిధి బుధవారం చెప్పారు. -
దక్షిణ లెబనాన్, గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు
జెరూసలేం: దక్షిణ లెబనాన్‌తోపాటు పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. ఆయా ప్రాంతాల్లోని హమాస్ ఉగ్రవాద శిబిరాలపై శుక్రవారం తెల్లవారుజామున వైమానిక దాడులు నిర్వహించింది. బాంబుల వర్షం కురిపించింది. దీంతో పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో యూదులు పాస్ఓవర్ అనే వేడుకలు జరుపుకుంటున్నారు. మరోవైపు ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. గురువారం దక్షిణ లెబనాన్ భూభాగం నుంచి ఉగ్రవాదులు ఇజ్రాయెల్ వైపు 30కిపైగా రాకెట్లు ప్రయోగించారు. ఈ ఘటనలో ఇజ్రాయెల్‌లో ఇద్దరు గాయపడ్డారు. స్వల్పంగా ఆస్తి నష్టం వాటిల్లింది. రాకెట్ల ప్రయోగానికి ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌లో పాతుకుపోయిన పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ శిబిరాలే లక్ష్యంగా వైమానిక దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. యుద్ధ విమానాల ద్వారా ఇజ్రాయెల్ సైన్యం ప్రయోగించిన క్షిపణులు లెబనాన్‌లో టైర్ సమీపంలోని రషీదియా పాలస్తీనా కాందిశీకుల క్యాంప్ వద్ద నేలను తాకాయని అసోసియేటెడ్ ప్రెస్ ఫొటోగ్రాఫర్ ఒకరు వెల్లడించారు. లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలీషియాకు ఇరాన్ అండదండలు అందిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యంపై హిజ్బుల్లా మిలీషియా దాడులు చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు. అయితే, తాము కేవలం పాలస్తీనా మిలిటెంట్ల శిబిరాలపైనే వైమానిక దాడులు జరిపామని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులో పాలస్తీనా వాసి ఒకరు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. -
రష్యా క్షిపణుల వాన
కీవ్: ఉక్రెయిన్‌పైకి గురువారం రష్యా మరోసారి క్షిపణుల వాన కురిపించింది. దీంతో ఉదయం నుంచి 7 గంటలపాటు దేశమంతటా ముందు జాగ్రత్తగా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. దేశంలోని 10 ప్రాంతాల్లోని నివాస భవనాలపై రష్యా జరిపిన దాడుల్లో కనీసం ఆరుగురు చనిపోయారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. గత మూడు వారాల్లో రష్యా జరిపిన అతిపెద్ద దాడి ఇదేనన్నారు. ‘ఆక్రమణదారులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది మాత్రమే వాళ్లు చేయగలరు’అని ఆయన ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. -
Russia-Ukraine war: ఒక దురాక్రమణకు, తలవంచని తెగువకు..ఏడాది
ఏడాది క్రితం.. 2022 ఫిబ్రవరి 24... ప్రపంచం ఎన్నటికీ మర్చిపోలేని రోజు. పొరుగు దేశం ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగిన రోజు. రష్యా అపార సాయుధ సంపత్తి ముందు ఉక్రెయిన్ నిలవలేదని, దాని ఓటమితో రోజుల వ్యవధిలోనే యుద్ధం ముగుస్తుందని అంతా భావించారు. దాదాపు ఏడాది గడిచాక... పసికూనగా భావించిన ఉక్రెయిన్ పట్టువీడకుండా తెగించి పోరాడుతూనే ఉంది. పాశ్చాత్య దేశాల సాయుధ, ఆర్థిక సాయం దన్నుతో రష్యాను దీటుగా ఎదిరిస్తోంది. పలు ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యా సేనలను తరిమికొడుతూ మరిచిపోలేని పరాభవాలను పుతిన్‌కు రుచి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసే సూచనలు ఏమాత్రం కన్పించడం లేదు. ఎంతకాలమైనా ఉక్రెయిన్‌కు మద్దతిస్తూనే ఉంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా ఉనికిని కాపాడుకోవడమే లక్ష్యంగా ఎంత దూరమైనా వెళ్తామంటూ పుతిన్ చేసుకున్న తాజా హెచ్చరికలు దీన్ని మరింత బలపరుస్తున్నాయి. ఉక్రెయిన్, రష్యాలనే గాక ప్రపంచ దేశాలన్నింటినీ యుద్ధం తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఐరోపా ఖండంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరుగుతున్న అతిపెద్ద ఘర్షణ కూడా ఇదే. తొలిసారేమీ కాదు.. ఉక్రెయిన్, రష్యా మధ్య ఘర్షణలు ఇదే తొలిసారేమీ కాదు. వెయ్యేళ్ల చరిత్ర, 4.4 కోట్ల జనాభా ఉన్న ఉక్రెయిన్ ఒకప్పుడు సోవియట్ యూనియన్(యూఎస్ఎస్ఆర్)లో అంతర్భాగమే. సోవియట్ పతనానంతరం 1990ల్లో స్వతంత్ర దేశంగా అవతరించింది. పశ్చిమ దేశాల కుట్రల వల్లే ఉక్రెయిన్ తమకు దూరమైందని రష్యా ద్వేషం పెంచుకుంది. పాశ్చాత్య దేశాల చేతుల్లో ఉక్రెయిన్ కీలుబొమ్మ అని పుతిన్ తరచుగా విమర్శిస్తుంటారు. ఉక్రెయిన్ కృత్రిమంగా ఏర్పడ్డ దేశమని, నిజానికి అది, రష్యా ఒకే తల్లి బిడ్డలని ఆయన వాదిస్తుంటారు. రెండు దేశాలను ఎలాగైనా ఒక్కటి చేయాలన్నదే పుతిన్ ఆశయం. అందులో భాగంగానే 2014లో ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఆక్రమించింది. ఆ ఘర్షణలో ఇరువైపులా వేలాది మంది మరణించారు. మరోవైపు ఉక్రెయిన్‌లో గణనీయంగా ఉన్న రష్యన్ మాట్లాడే ప్రజలు రష్యాకు మద్దతుగా తిరుగుబాటుకు దిగారు. పరిస్థితి చెయ్యి దాటిపోతుండడం, రష్యా నుంచి ముప్పు పెరుగుతుండటంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పశ్చిమ దేశాల సాయం కోరారు. రష్యా బారినుంచి కాపాడేందుకు తమను తక్షణం నాటో కూటమిలో చేర్చుకోవాలన్న ఆయన విజ్ఞప్తికి సానుకూలత వ్యక్తమైంది. అదే జరిగితే నాటో సేనలు ఏకంగా రష్యా సరిహద్దుల్లో తిష్టవేసే ఆస్కారముండటం అధ్యక్షుడు పుతిన్‌కు ఆగ్రహం కలిగించింది. వెంటనే రంగంలోకి దిగి 2021 నవంబర్ నాటికే ఉక్రెయిన్ సరిహద్దులకు భారీగా సైన్యాన్ని తరలించారు. 2022 ఫిబ్రవరికల్లా దాన్ని లక్షకు పెంచి తీవ్ర ఉద్రిక్తతలకు తెర తీశారు. ఉక్రెయిన్‌పై దాడి తప్పదన్న వార్తల నడుమ, తీవ్ర పరిణామాలు, కఠిన ఆంక్షలు తప్పవని అమెరికా హెచ్చరించింది. తమకలాంటి ఉద్దేశం లేనే లేదంటూనే ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై పుతిన్ సైన్యం మూడువైపుల నుంచీ విరుచుకుపడింది. శిథిల చిత్రంగా ఉక్రెయిన్ రష్యా దాడుల ధాటికి ఉక్రెయిన్ సర్వం కోల్పోయి శిథిలచిత్రంగా మిగిలింది. ఎక్కడ చూసినా కూలిన భవనాలు, మృతదేహాలతో మరుభూమిని తలపించింది. ఐక్యరాజ్యసమితికి శరణార్థుల హై కమిషనర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారమే 2023 జనవరి 15 నాటికి రష్యా దాడుల్లో 7,000కు పైగా ఉక్రెయిన్ పౌరులు మరణించారు. 11 వేలకు పైగా క్షతగాత్రులయ్యారు. వాస్తవానికి కనీసం 50 వేల మందికి పైగా అమాయక పౌరులు యుద్ధానికి బలయ్యారని, లక్షలాది మంది గాయపడ్డారని అంచనా. 80 లక్షల మందికిపైగా ఉక్రెయిన్ పౌరులు శరణార్థులుగా ఇతర దేశాలకు వలసవెళ్లారు. వారంతా కట్టుబట్టలతో ఇల్లూ వాకిలీ వదిలి తరలిపోతున్న దృశ్యాలు మానవతకే తీరని మచ్చగా మిగిలాయి. మరో 60 లక్షల మంది స్వదేశంలోనే నిరాశ్రయులయ్యారు. రష్యా అతలాకుతలం రష్యా కూడా ఉక్రెయిన్ చేతిలో అవమానకర ఎదురుదెబ్బలు మినహా ఇప్పటిదాకా ఇప్పటిదాకా బావుకున్నదేమీ లేదు. పైపెచ్చు యుద్ధం వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంతగా దిగజారింది. అమెరికా, పాశ్చాత్య దేశాల తీవ్ర ఆర్థిక ఆంక్షలతో పూర్తిగా స్తంభించి కుదేలైంది. ఆర్థిక వృద్ధి నేలచూపులు చూస్తోంది. అంతర్జాతీయ సంస్థలన్నీ దేశం వీడాయి. చమురు మినహా ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా పడకేశాయి. ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు చుక్కలనంటి సామాన్యుల బతుకు దుర్భరంగా మారింది. దాంతో యుద్ధంపై రష్యాలోనే తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఎన్నడూ లేని రీతిలో పౌరులు బాహాటంగానే ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. వేలాదిగా అరెస్టులు జరిగినా వెరవకుండా ఆందోళనలు చేశారు. దేశాల్లో ఆకలి కేకలు గోధుమలు, మొక్కజొన్న ఎగుమతిలో అగ్రస్థానాన ఉన్న రష్యా, ఉక్రెయిన్ నుంచి యుద్ధం కారణంగా తిండి గింజల సరఫరా పూర్తిగా నిలిచిపోయి 50కి పై చిలుకు దేశాలు తీవ్ర ఆహార కొరత బారిన పడి అల్లాడుతున్నాయి. అంతేగాక అటు సంపన్న, ఇటు భారత్ వంటి వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు యుద్ధం వల్ల ఎంతగానో దెబ్బ తిన్నాయి. సాహసి... జెలెన్స్కీ రష్యాకు ఎదురొడ్డి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మొక్కవోని ధైర్య సాహసాలు ప్రదర్శించారు. తనను హతమార్చేందుకు జరిగిన ప్రయత్నాలను కాచుకున్నారు. సురక్షితంగా తప్పిస్తామంటూ అమెరికా ముందుకొచ్చినా కాదన్నారు. సైన్యంతో కలివిడిగా తిరుగుతూ వారిలో స్థైర్యం నింపారు. ప్రపంచ దేశాలను సాయం కోరుతూ ప్రతి అంతర్జాతీయ వేదిక మీదా రష్యాను దునుమాడుతూ సాగారు. పూర్వాశ్రమంలో సినిమాల్లో కమేడియన్‌గా చేసినా నిజ జీవితంలో మాత్రం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తిరుగులేని నాయకత్వ లక్షణాలు ప్రదర్శించి హీరో అనిపించుకున్నారు. ఎవరికెంత నష్టం? యుద్ధంలో విజేతలు ఎవరో ఇప్పటిదాకా తేలకపోయినా ఇరు దేశాలు మాత్రం కనీవినీ ఎరుగని స్థాయిలో నష్టాన్ని చవి చూశాయి. లక్షల సంఖ్యలో సైనికులను, వేల సంఖ్యలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులు, నౌకలను కోల్పోయాయి. ఏ దేశం ఎవరి వైపు... అమెరికా బ్రిటన్ సహా 30 నాటో సభ్య దేశాలు యుద్ధంలో ఉక్రెయిన్‌కు పూర్తిగా వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. భారీగా ఆయుధ, ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నాయి. వీటితో పాటు మరెన్నో దేశాలు రష్యా దాడిని ఖండించి ఉక్రెయిన్‌కు నైతిక మద్దతు ప్రకటించాయి. ఇక రష్యాకు ప్రధానంగా పొరుగు దేశమైన బెలారస్ తొలినుంచీ గట్టి మద్దతుదారుగా ఉంది. చైనాతో పాటు ఉత్తర కొరియా, క్యూబా, వెనెజువెలా, ఇరాన్, సిరియా, కిర్గిస్తాన్ కూడా రష్యాకు మద్దతు ప్రకటించాయి. యూఏఈ, సౌదీ అరేబియా తటస్థంగా నిలిచినా రష్యా దాడిని ఖండించేందుకు తిరస్కరించాయి. యుద్ధానికి తక్షణం ముగింపు పలికి చర్చలు, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్నది తొలినుంచీ భారత్ వైఖరిగా ఉంది. యుద్ధంలో కీలక మలుపులు ఫిబ్రవరి: 24న యుద్ధం ప్రారంభం. ఉక్రెయిన్ నిస్సైనికీకరణకు సైనిక చర్య ముసుగులో తూర్పు, ఉత్తర, దక్షిణాల నుంచి రష్యా ముప్పేట దాడి. మార్చి: ఖెర్సన్ నగరం స్వాధీనమైందన్న రష్యా. యూరప్‌లోకెల్లా పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్కేంద్రం ఆక్రమణ. కీవ్ శివార్లలో ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో అపార నష్టం ధాటికి రష్యా సేనల పలాయనం. రష్యాపై అమెరికా, యూరప్ దేశాల భారీ ఆర్థిక, తదితర ఆంక్షలు. ఏప్రిల్: కీవ్, బుచాల్లో వందలాది పౌరులను రష్యా సైన్యం చిత్రహింసల పాలు చేసి చంపినట్టు వెల్లడి. రష్యాపై యుద్ధ నేరాల అభియోగాలు మోపాలంటూ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు. ఉక్రెయిన్ సైన్యం ఎదురుదాడి. రష్యా యుద్ధ నౌక మాస్క్వాను క్షిపణి దాడితో నల్లసముద్రంలో ముంచి సంబరాలు చేసుకున్న ఉక్రెయిన్. మే: మారియుపోల్‌ను పూర్తిగా ఆక్రమించుకున్న రష్యా. రష్యా దూకుడు పట్ల ఆందోళనతో నాటోలో చేరుతామంటూ దరఖాస్తు చేసుకుని పుతిన్‌కు షాకిచ్చిన ఫిన్లండ్, స్వీడన్. జూన్: ఉక్రెయిన్ దాడుల దెబ్బకు యుద్ధం మొదట్లో నల్లసముద్రంలో ఆక్రమించిన స్నేక్ ఐలాండ్ నుంచి వైదొలిగిన రష్యా సేనలు. జూలై: ప్రపంచ ఆహార భద్రత దృష్ట్యా ఉక్రెయిన్ రేవు పట్టణాల నుంచి ఆహార ధాన్యాల సరఫరా. ఆగస్టు: క్రిమియాపై ఉక్రెయిన్ దాడుల్లో తీవ్రంగా దెబ్బ తిన్న రష్యా వైమానిక స్థావరాలు, ఆయుధాగారాలు. సెప్టెంబర్: ఖర్కీవ్‌లో ఆకస్మిక దాడులతో రష్యా దళాలను తరిమికొట్టిన ఉక్రెయిన్ సైన్యం. రిఫరెండం ముసుగులో డొనెట్స్క్, లుహాన్స్క్, ఖెర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకుంటున్నట్టు పుతిన్ ప్రకటన. అక్టోబర్: క్రిమియాను రష్యాతో కలిపే కీలక బ్రిడ్జిని పేల్చేసిన ఉక్రెయిన్. నవంబర్: రష్యాకు పరాభవం. దాడులకు తాళలేక ఖెర్సన్ నగరం నుంచి పుతిన్ సేనల పలాయనం. డిసెంబర్: రష్యాలోని సరిహద్దు ప్రాంతాలు, పట్టణాలు, నగరాలపై దాడులు, భారీ నష్టం. 2023 జనవరి: మకీవ్కాలో క్షిపణి దాడులతో వందలాది మంది రష్యా సైనికులను మట్టుబెట్టామన్న ఉక్రెయిన్. 89 మంది మరణించారన్న రష్యా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యా క్రూరత్వం.. ఉక్రెయిన్‌పై ఒకేసారి 120 మిసైల్స్‌తో అటాక్!
కీవ్: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై కొద్ది నెలలుగా భీకర దాడులకు పాల్పడుతోంది రష్యా. ప్రధాన వనరులను ధ్వంసం చేస్తూ ఉక్రేనియన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరోమారు క్షిపణుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఒకేరోజు 120 మిసైల్స్‌ను ప్రయోగించింది. ఏ వైపు నుంచి బాంబులు పడతాయోనని అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యేలా చేసింది. భారీ స్థాయిలో మిసైల్స్ ప్రయోగించినట్లు ఉక్రెయిన్ మిలిటరీ వెల్లడించింది. ‘డిసెంబర్ 29. భారీ స్థాయిలో మిసైల్స్‌తో దాడి జరిగింది. ఆకాశం, సముద్రం నుంచి శుత్రు దేశం ఉక్రెయిన్ను చుట్టుముట్టి మిసైల్స్‌తో విరుచుకుపడింది. ’అని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది ఉక్రెయిన్ వైమానిక దళం. మరోవైపు.. 120 మిసైల్స్ ప్రయోగించినట్లు అధ్యక్షుడి సహాయకుడు మైఖైలో పోడోల్యాక్ తెలిపారు. గురువారం ఉదయమే ఉక్రెయిన్ వ్యాప్తంగా రాజధాని కీవ్‌తో పాటు ప్రధాన నగరాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ క్రమంలోనే విద్యుత్తుకు అంతరాయం ఏర్పడొచ్చని, ప్రజలు నీటిని నిలువ చేసుకోవాలని కీవ్ మేయర్ విటాలి క్లిట్స్కో అప్రమత్తం చేశారు. అలాగే.. రెండో పెద్ద నగరం ఖార్కివ్‌లోనూ వరుస పేలుళ్లు జరిగాయి. ఇదీ చదవండి: క్యాసినో హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది సజీవ దహనం.. -
రష్యా మాస్టర్ ప్లాన్.. చలికి గడ్డకట్టుకుపోతున్న ఉక్రేనియన్లు!
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా 76 క్షిపణులతో జరిపిన దాడుల బీభత్సం అంతా ఇంతా కాదు. విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని రష్యా చేసిన దాడులతో పలు నగరాలు అంధకారంలో మగ్గిపోయాయి. గడ్డకట్టించే చలిలో విద్యుత్ సదుపాయం లేకుండా చేస్తే ఆ చలిని తట్టుకోలేక సైనికులు, పౌరులు ఉక్రెయిన్ వీడి వెళ్లిపోతారన్న వ్యూహంతో రష్యా ఈ దాడులకు దిగింది. 76 క్షిపణుల్లో ఎన్నింటిని ఉక్రెయిన్ వాయు సేన అడ్డుకోగలిగిందో స్పష్టమైన అంచనాలు లేవు. క్రివీయ్ రియా ప్రాంతంలో రాకెట్ దాడిలో ఒక ఇల్లుపూర్తిగా ధ్వంసం కావడంతో అందులో ఉన్న కుటుంబసభ్యులు నలుగురు మరణించారు. వారిలో ఏడాదిన్నర వయసున్న బాలుడు ఉండడం అందరినీ కంట తడిపెట్టిస్తోంది. నికోపోల్, మార్హానెట్స్, చెర్వోనోహ్రిహోరి్వకా వంటి నగరాల్లో విద్యుత్ లైన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చాలా నగరాల్లో జీరో కంటే తక్కువకి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. విపరీతమైన చలి వణికిస్తూ ఉన్న సమయంలో విద్యుత్ లేకపోవడంతో హీటర్లు పని చేయక ప్రజలు గడ్డకట్టుకుపోతున్నారు. ప్రస్తుతం అధికారులు విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. మరోవైపు రష్యా మరిన్ని క్షిపణి దాడులు చేస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఇదీ చదవండి: చైనాలో వచ్చే ఏడాది కోవిడ్‌తో 10 లక్షల మంది మృతి? -
పోలండ్‌పైకి క్షిపణులు... రష్యా దాడి కాదు
షెవాడో (పోలండ్): పోలండ్ సరిహద్దుల్లోని పంట పొలాల్లో మంగళవారం ఇద్దరిని బలిగొన్న క్షిపణి దాడులు రష్యా పనేనంటూ వచ్చిన వార్తలు తీవ్ర కలకలానికి దారితీశాయి. దీని ఫలితంగా ఉక్రెయిన్‌కు బాసటగా నాటో రంగంలోకి దిగొచ్చని, దాంతో రష్యా 9 నెలలుగా చేస్తున్న యుద్ధం రూపురేఖలే మారిపోవచ్చని ఒక దశలో ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ దాడితో రష్యాకు సంబంధం లేదని పోలండ్‌తో పాటు నాటో కూటమి కూడా బుధవారం ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ‘‘అది ఉద్దేశపూర్వక దాడి ఎంతమాత్రమూ కాదనిపిస్తోంది. బహుశా తమ విద్యుత్ కేంద్రాలపై రష్యా సైన్యం చేస్తున్న భారీ దాడులను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ ప్రయోగించిన క్షిపణులు దురదృష్టవశాత్తూ సరిహద్దులు దాటి ఉండొచ్చు’’ అని పోలండ్ అధ్యక్షుడు ఆంద్రే డూడ అభిప్రాయపడ్డారు. నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోటెన్‌బర్గ్ కూడా బ్రసెల్స్‌లో జరిగిన నాటో భేటీలో అదే అన్నారు. అయితే, ‘‘ఉక్రెయిన్ను తప్పుబట్టలేం. యుద్ధానికి కారణమైన రష్యాయే ఈ క్షిపణి దాడులకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అంటూ నిందించారు. ఈ ఉదంతంలో కచ్చితంగా ఏం జరిగిందో త్వరలోనే తేలుస్తామన్నారు. రష్యా క్షిపణిని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ బలగాలు ఈ క్షిపణులను ప్రయోగించినట్టు ప్రాథమికంగా తేలిందని అమెరికా అధికారులు చెబుతున్నారు. -
ఉక్రెయిన్‌పై 100 మిసైల్స్‌తో విరుచుకుపడిన రష్యా
కీవ్: ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా పట్టుకోల్పోతోందనే వాదనల వేళ మాస్కో సేనలు రెచ్చిపోయాయి. ఉక్రెయిన్‌పై మంగళవారం మిసైల్స్ వర్షం కురిపించాయి. విద్యుత్తు రంగాలే లక్ష్యంగా రష్యా బలగాలు 100కుపైగా క్షిపణులతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. దీంతో తమ దేశంలో మరోమారు విద్యుత్తుకు అంతరాయం ఏర్పడి అంధకారంలోకి వెళ్లినట్లు ఆందోళన వ్యక్తం చేసింది. ‘100కుపైగా మిసైల్స్‌ను రష్యా బలగాలు ప్రయోగించాయి. అక్టోబర్ 10వ తేదీన అత్యధికంగా 84 మిసైల్స్‌ను ప్రయోగించగా.. ఆ సంఖ్యను మంగళవారం దాటేశాయి మాస్కో సేనలు. వారి ప్రాథమిక టార్గెట్ కీలకమైన మౌలిక సదుపాయాలు. కొన్ని క్షిపణులను కూల్చివేశం. అయితే వాటి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.’ అని పేర్కొన్నారు ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ ప్రతినిధి యూరీ ఇగ్నాత్. ఇదీ చదవండి: చైనా అధ్యక్షుడికి చిరునవ్వుతో షేక్ హ్యండ్ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఇదే తొలిసారి! -
ఉభయ కొరియాల మధ్య...ఉద్రిక్తతలు మరింత తీవ్రం
సియోల్: ఉభయకొరియాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఉత్తరకొరియా శనివారం సరిహద్దు ప్రాంతాల్లోకి 180 యుద్ధ విమానాలను తరలించింది. దక్షిణ కొరియా కూడా దీటుగా అత్యాధునిక ఎఫ్–35 ఫైటర్ జెట్లు సహా 80 మిలటరీ ఎయిర్ క్రాఫ్టులను మోహరించింది. ఉత్తర కొరియా బుధవారం రికార్డు స్థాయిలో 20కిపైగా క్షిపణులను ప్రయోగించడం, వాటిలో ఒకటి దక్షిణకొరియా సరిహద్దుల్లో పడటం తెలిసిందే. ప్రతిగా దక్షిణ కొరియా కూడా మూడు గైడెడ్ మిస్సైళ్లను ప్రయోగించింది. గురువారం కూడా ఉత్తరకొరియా ఆరు క్షిపణులు ప్రయోగించడంతో జపాన్ అప్రమత్తమైంది. అమెరికా, దక్షిణ కొరియా 240 యుద్ధ విమానాలతో చేస్తున్న సంయుక్త విన్యాసాలు శుక్రవారంతో ముగియాల్సి ఉంది. తాజా పరిణామాలతో వాటిని శనివారమూ కొనసాగించనున్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఉత్తరకొరియా ప్రకటించింది. ఈ తప్పిదానికి పశ్చాత్తాప పడతాయంటూ బెదిరించింది. కానీ, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వెల్లడించలేదు. అణ్వస్త్ర దేశంగా గుర్తింపు పొందడంతోపాటు ఆంక్షలను ఎత్తివేసేలా అమెరికాపై ఒత్తిడి పెంచేందుకే ఉత్తరకొరియా ఇటువంటి తెగింపు చర్యలకు పాల్పడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఉక్రెయిన్‌తో యుద్ధంపై పుతిన్ కీలక ప్రకటన
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌పై క్షిపణిదాడులను తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఇకపై రష్యా భీకర దాడులు చేయదని వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా సోమవారం క్షిపణుల వర్షం కురిపించిన తెలిసిందే. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణ నష్టం, భారీ ఆస్తి జరిగింది. క్రెమ్లిన్ బ్రిడ్జిని ఉక్రెయిన్ పేల్చినందుకు ప్రతీకారంతో రష్యా ఈ భీకర దాడులకు పాల్పడి మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఐరోపా సమాఖ్య ఈ దాడులను తీవ్రంగా ఖండించి పుతిన్ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నట్లు విమర్శించింది. అయితే ఉక్రెయిన్ను సర్వనాశనం చేయడం తమ లక్ష్యం కాదని పతిన్ పేర్కొన్నారు. అందుకే క్షిపణి దాడులు ఆపేస్తున్నట్లు చెప్పారు. పుతిన్ ప్రకటనతో కొద్ది రోజులుగా ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కన్పిస్తున్నాయి. మరి ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి. చదవండి: మిరాకిల్.. యుద్ధ ట్యాంక్ కింద నలిగినా చనిపోని సైనికుడు -
Russia-Ukraine war: రష్యా ప్రతీకారం
జపొరిజాజియా: రష్యా–క్రిమియా ద్వీపకల్పాన్ని అనుసంధానించే కీలక వంతెనపై ఉక్రెయిన్ అనుకూల వర్గాలు పేలుళ్లకు పాల్పడిన నేపథ్యంలో పుతిన్ సైన్యం ప్రతీకార చర్యలకు దిగింది. ఉక్రెయిన్‌లోని జపొరిజాజియా సిటీపై నిప్పుల వర్షం కురిపించింది. శనివారం అర్ధరాత్రి తర్వాత వరుసగా రాకెట్లు ప్రయోగించింది. ఈ ఘటనలో 12 మంది పౌరులు మృతిచెందారు. 60 మందికి పైగా గాయపడ్డారు. రష్యా దాడుల్లో 20 ప్రైవేట్ నివాస గృహాలు, 50 అపార్టుమెంట్ భవనాలు దెబ్బతిన్నాయని సిటీ కౌన్సిల్ కార్యదర్శి అనాతోలివ్ కుర్టెవ్ చెప్పారు. జపొరిజాజియాలో రష్యా రాకెట్ దాడులను ఉక్రెయిన్ సైన్యం ధ్రువీకరించింది. పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారని పేర్కొంది. రష్యా దాడుల పట్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. రష్యా అంతర్జాతీయ ఉగ్రవాది అంటూ మండిపడ్డారు. తమను ఎవరూ రక్షంచలేరా? అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అమాయకులను బలి తీసుకున్నారు: జెలెన్స్కీ వాస్తవానికి దక్షిణ ఉక్రెయిన్‌లోని జపొరిజాజియా ప్రస్తుతం రష్యా ఆధీనంలోనే ఉంది. ఈ ప్రాంతాన్ని తమ దేశంలో విలీనం చేస్తూ రష్యా అధినేత పుతిన్ ఇటీవలే సంతకాలు చేశారు. జపొరిజాజియా ప్రావిన్స్ మొత్తం చట్టబద్ధంగా తమదేనని వాదిస్తున్నారు. గత గురువారం ఇదే సిటీపై రష్యా సైన్యం జరిపిన క్షిపణి దాడుల్లో 19 మంది బలయ్యారు. తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని రష్యా ఇటీవల తరచుగా దాడులు చేస్తుండడం గమనార్హం. తాజా రాకెట్ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ దయ, కరుణ లేకుండా అమాయక ప్రజలను పొట్టనపెట్టుకున్నారని దుమ్మెత్తిపోశారు. అది అక్షరాలా రాక్షసకాండ అని ధ్వజమెత్తారు. ఈ దాడులకు ఆదేశాలిచ్చినవారు, వాటిని పాటించినవారు తప్పనిసరిగా చట్టానికి, ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. వంతెన భద్రత పెంచాలని ఆదేశాలు ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా ద్వీపకల్పాన్ని 2014లో రష్యా ఆక్రమించింది. రష్యా–క్రిమియాను అనుసంధానించే వంతెనపై శనివారం భారీ ఎత్తున పేలుళ్లు జరిగాయి. వంతెన కొంతవరకు ధ్వంసమైంది. ఈ పేలుళ్లకు ఇంకా ఎవరూ బాధ్యత వహించలేదు. ఇదంతా ఉక్రెయిన్ అనుకూలవర్గాల పనేనని రష్యా నిర్ణయానికొచ్చింది. ప్రతీకార చర్యల్లో భాగంగా జపొరిజాజియాను లక్ష్యంగా చేసుకుంది. వంతెనకు, అక్కడున్న ఇంధన రంగ మౌలిక సదుపాయాలకు భద్రత పెంచాలంటూ పుతిన్ శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. భద్రత కోసం ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్‌ను రంగంలోకి దించారు. పుతిన్ ‘ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్’ ప్రారంభించారని రష్యా ప్రజాప్రతినిధులు కొందరు తెలిపారు. తూర్పు డొనెట్స్క్ రీజియన్‌లోని బఖ్ముత్, అవ్దివ్కా నగరాల్లో రష్యా, ఉక్రెయిన్ బలగాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ సాగింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ సైనిక దళాల అధికారి ఆదివారం ఉదయం వెల్లడించారు. ప్రస్తుతం రెండు నగరాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ జవాన్ల మధ్య ఘర్షణలో వాటిల్లిన ప్రాణనష్టంపై వివరాలు తెలియరాలేదు. రష్యా సైన్యానికి కొత్త కమాండర్ రష్యా–క్రిమియా వంతెనపై పేలుళ్ల తర్వాత రష్యా ఒక్కసారిగా అప్రమత్తయ్యింది. ఉక్రెయిన్‌లో తమ సైనిక బలగాలకు సారథ్యం వహించడానికి ఎయిర్‌ఫోర్స్ చీఫ్ జనరల్ సెర్గీ సురోవికిన్‌ను నియమిస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఇకపై ఉక్రెయిన్‌లో సైనిక ఆపరేషన్లను ఆయనే ముందుండి నడిపిస్తారని స్పష్టం చేసింది. సురోవికిన్‌ను కొన్ని నెలల క్రితం దక్షిణ ఉక్రెయిన్‌లో రష్యా సేనలకు ఇన్చార్జిగా నియమించారు. ఇప్పుడు పదోన్నతి కల్పించారు. ఆయన గతంలో సిరియాలో రష్యా సైన్యానికి సారథ్యం వహించారు. సిరియాలోని అలెప్పో నగరంలో పెను విధ్వంసానికి సురోవికిన్ ప్రధాన కారకుడన్న ఆరోపణలున్నాయి. -
రష్యా వ్యూహం ఏంటి? యుద్ధ రంగంలో ఏం ప్రయోగిస్తోంది?
యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతోన్న తరుణంలో సైనిక పరంగా ఇప్పటికే బాగా నష్టపోయి ఉన్న రష్యా చిన్నపాటి వ్యూహాత్మక అణ్వస్త్రాలను ప్రయోగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రో మ్యాగ్నటిక్ పల్స్‌తో దాడులు పెంచాలని రష్యా భావిస్తోంది. తమ వద్ద రెండు వేలకు పైగా ఇటువంటి ఆయుధాలు ఉన్నాయని కూడా రష్యా అంటోంది. దీంతో పాటు కొద్ది రోజుల క్రితమే రష్యా దీర్ఘశ్రేణి న్యూక్లియర్ మిసైల్ ను పరీక్షించింది. ఈ పరీక్షలే ఇపుడు ప్రపంచ దేశాలను కంగారు పెడుతున్నాయి. రష్యా పొరపాటున అణ్వాయుధాలు ప్రయోగిస్తే పరిస్తితిని అదుపులోకి తీసుకురావడం ఎవ్వరి వల్లా కాదని అగ్రరాజ్యం భయపడుతోంది. అపుడు జరగబోయే నష్టాన్ని ఊహించడం కూడా కష్టమే అంటున్నారు నిపుణులు. రష్యా చేతిలో కీలక అణు కర్మాగారం జపోరిజియా లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను రష్యా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఈ ప్లాంట్ పై న్యూక్లియర్ వెపన్స్ దాడి చేస్తే పెను విపత్తు సంభవించే ప్రమాదం ఉందంటున్నారు. రష్యా ఇదంతా ఎందుకు చేస్తోందో అర్ధం కావడం లేదంటున్నారు కొందరు చరిత్ర కారులు. అయితే నాటో దేశాలకు చెక్ చెప్పడానికే ఉక్రెయిన్ పై యుద్దానికి కాలుదువ్వింది రష్యా. ఉక్రెయిన్ వార్ సమయంలో అమెరికాతో కలిసి నాటో దేశాలన్నీ కూడా రష్యాపై ఆంక్షలు విధించాయి. తనను ఇబ్బంది పెట్టిన దేశాలకు గట్టిగానే బదులివ్వాలని రష్యా పంతంగా ఉంది. అందుకే అణ్వాయుధాలను తెరపైకి తెచ్చి ఉంటుందని అంటున్నారు. అయితే కేవలం అందరినీ భయపెట్టడానికే రష్యా ప్రయత్నిస్తూ ఉండచ్చని నిజానికి రష్యా ఎలాంటి అణ్వాయుధాలను ప్రయోగించకపోవచ్చునని మేథావులు అభిప్రాయపడుతున్నారు. నలిగిపోతోన్న ఉక్రెయిన్ పెద్ద దేశాల మధ్య పంతాల నడుమ ఉక్రెయిన్ పాపం బాగా నలిగిపోయింది. ఇప్పటికే నగరాలకు నగరాలు నాశనం అయిపోయాయి. కోట్లకు కోట్ల విలువ జేసే ఆస్తులు,భవనాలు బుగ్గిపాలయ్యాయి. శిధిలాల నడుమ ఉక్రెయిన్ గాయాల దిబ్బగా మారిపోయింది.దీన్నుంచి కోలుకుని పూర్వవైబవం తీసుకురావాలంటే ఉక్రెయిన్ ప్రభుత్వానికి చాలా ఏళ్లు పడుతుంది. ఇంతటి నెత్తుటి గాయానికి కారణం మాత్రం రష్యానే. అందుకే అది ఇపుడు ప్రపంచ దేశాల మేథావుల దృష్టిలో ఓ విలన్ గా మిగిలిపోయింది. రష్యా తప్పులపై తప్పులు చేసుకుంటూ పోతోంది. నాటో విస్తరణను అడ్డుకోవాలన్న తలంపుతో ఉక్రెయిన్ పై యుద్దానికి దిగింది రష్యా. అయితే దాని వల్ల నాటో కూటమి మరింతగా విస్తరించింది. అలాగే ఇపుడు అణ్వస్త్రాలు ప్రయోగిస్తామన్న హెచ్చరిక ద్వారా యూరప్ దేశాలు అణ్వాయుధాలను పెంచుకునేందుకు రష్యానే ఓ దారి చూపినట్లయ్యిందంటున్నారు మేథావులు. ఇది ప్రపంచానికి కానీ రష్యాకి కానీ మంచివి కానే కావు. యుద్దానికి వీలైనంత తొందరగా చరమగీతం పాడాలన్నది ప్రపంచం ఆశ. (చదవండి: ప్రపంచానికి పెను సవాల్ విసిరిన పుతిన్.. అదే జరిగితే భారీ విధ్వంసమే..?) -
Ukraine Russia War: ఉక్రెయిన్‌లో మళ్లీ రష్యా క్షిపణి దాడులు
కీవ్: దక్షిణ ఉక్రెయిన్‌లోని జపొరిజాజియా సిటీలో రష్యా క్షిపణులు గర్జించాయి. క్షిపణి దాడుల్లో 40కిపైగా భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారని, కనీసం 12 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు గురువారం వెల్లడించారు. ఒకటి సూర్యోదయానికి ముందు, మరొకటి ఉదయం క్షిపణి దాడి జరిగిందని పేర్కొన్నాయి. యూరప్‌లోనే అతి పెద్దదైన అణు విద్యుత్ ప్లాంట్ జపొరిజాజియాలో ఉంది. ఈ ప్లాంట్ సమీపంలోనే రష్యా సైన్యం క్షిపణి దాడులు నిర్వహించడం గమనార్హం. అణు విద్యుత్ ప్లాంట్‌ను రష్యా గతంలోనే ఆక్రమించుకుంది. రష్యా ఆక్రమించుకున్న తమ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. దీనివల్ల రష్యా అధినేత పుతిన్ అణ్వస్త్ర ప్రయోగానికి పాల్పడతారా? అనేది చెప్పడం కష్టమని అన్నారు. అణు దాడికి పుతిన్ సాహసించకపోవచ్చని తాను భావిస్తున్నాని తెలిపారు. సిడ్నీలో లౌవీ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన ఓ సదస్సులో జెలెన్స్కీ వీడియో లింక్‌లో ప్రసంగించారు. -
Russia Ukraine War: ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు
కీవ్: ఉక్రెయిన్‌లో నాలుగు ప్రాంతాల విలీనం ఒప్పందంపై సంతకాలు చేయడానికి కొన్ని గంటల ముందే రష్యా క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లతో ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై విరుచుకుపడింది. జపోరిజియా నగరంలోని మానవతా కాన్వాయ్‌పై జరిపిన దాడిలో 30 మంది మరణించారు. రష్యా ఆక్రమిత భూభాగంలో ఉన్న తమ బంధువులకి వస్తు సామాగ్రిని అందించడం కోసం వెళుతుండగా ఆ మానవతా కాన్వాయ్‌పై దాడులు జరిగాయి. రష్యాలో తయారైన ఎస్–300 క్షిపణులతో ఈ దాడులు జరిగాయని పోలీసులు వెల్లడించారు. విలీన ఒప్పందంపై పుతిన్ సంతకం ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకునే ఒప్పందంపై అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం సంతకాలు చేశారు. డాంటెస్క్, లుహాన్సŠక్, ఖెర్సాన్, జపోరిజియా ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపామని ఆ ప్రాంత ప్రజలు రష్యాలో విలీనమవడానికి అంగీకరించాయని ఇప్పటికే రష్యా ప్రకటించింది. ఆయా ప్రాంతాలకు చెందిన రష్యా అనుకూల పాలకులు హాజరవగా క్రెమ్లిన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పుతిన్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ తమ దేశంలో విలీనమైన ప్రాంతాలను అన్ని విధాల కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఏడు నెలలుగా సాగుతున్న యుద్ధంపై ఉక్రెయిన్ వెంటనే శాంతి చర్చలకు రావాలని కోరారు. తమ దేశంలో విలీనమైన ప్రాంతాలను మళ్లీ వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదని పుతిన్ తేల్చి చెప్పారు.తమ దేశాన్ని ఒక కాలనీగా మార్చి, తమ ప్రజల్ని పిరికివాళ్లయిన బానిసలుగా మార్చడానికి పశ్చిమ దేశాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని ఆరోపించారు. ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్, పశ్చిమ దేశాలు ఆ విలీనాన్ని అంగీకరింబోమని స్పష్టం చేశాయి. ప్రజాభిప్రాయం పేరుతో వారిపై తుపాకులు పెట్టి బలవంతంగా విలీనం చేసుకున్నారని, ఇది చట్టవిరుద్ధమని పేర్కొన్నాయి. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాటో కూటమిలో తమ దేశాన్ని చేర్చుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రష్యాకి చెందిన వెయ్యి మంది ప్రజలు, సంస్థలు తమ దేశానికి రాకుండా అమెరికా వారి వీసాలపై నియంత్రణ విధించింది. -
Russia Ukraine War: ముట్టడిలో లీసిచాన్స్క్
కీవ్/లండన్: తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్లో రష్యా సైన్యంగురువారం క్షిపణుల మోత మోగించింది. లీసిచాన్‌స్క్‌లో భీకర స్థాయిలో వైమానిక దాడులు సాగించింది. అలాగే లుహాన్స్క్లో 95 శాతం, డోంటెస్క్‌లో 50 శాతం భూభాగాన్ని రష్యా సైన్యం, రష్యా అనుకూల వేర్పాటువాద శక్తులు ఇప్పటికే ఆక్రమించాయి. లీసిచాన్స్క్లోకి ప్రవేశించేందుకు రష్యా సేనలు ప్రయత్నించగా ఉక్రెయిన్ జవాన్లు సమర్థంగా తిప్పికొట్టారని లుహాన్స్క్ గవర్నర్ సెర్హియి హైడై చెప్పారు. లీసిచాన్స్క్ చుట్టూ రష్యా సైన్యం మోహరించించి ఉందని వెల్లడించారు. క్రెమెన్‌చుక్‌లోని భారీ షాపింగ్ మాల్లో రష్యా వైమానిక దాడుల్లో చనిపోయిన 18 మంది మృతదేహాలకు గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. షాపింగ్ మాల్లో అదృశ్యమైన 20 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. స్నేక్ ఐలాండ్ నుంచి రష్యా వెనక్కి ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. నల్ల సముద్రంలోని స్నేక్ ఐలాండ్ నుంచి రష్యా సేనలు ఖాళీ చేస్తున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాయి. కీలక పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్ను హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా దాడులను ఉధృతం చేస్తున్నాయి. సరైన వ్యూహంతోనే స్నేక్ ఐలాండ్ నుంచి వెనక్కి మళ్లినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించగా, తమ దాడులను తట్టుకోలేకే రష్యా సేనలు పారిపోయాయమని ఉక్రెయిన్ అధికార వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ నుంచి ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి వీలుగా ఐక్యరాజ్యసమితి ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తోందని, ఆ ప్రయత్నాలకు ఆటంకం కలగకుండా ఉండడానికే స్నేక్ ఐలాండ్ నుంచి తమ సేనలను వెనక్కి రప్పించామని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ వెల్లడించారు. ఉక్రెయిన్‌లోని ఓడరేవులను రష్యా దిగ్బంధించిందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. డోన్బాస్ విముక్తి పోరాటం: పుతిన్ ఉక్రెయిన్ విషయంలో తమ లక్ష్యాల్లో ఎలాంటి మార్పు లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తేల్చిచెప్పారు. ఆయన గురువారం తుర్క్మెనిస్తాన్లో పర్యటించారు. డోన్బాస్ విముక్తి కోసం, అక్కడి ప్రజల రక్షణ కోసం పోరాడుతున్నామని చెప్పారు. రష్యా భద్రతకు హామీనిచ్చే పరిస్థితులను సృష్టించుకోవాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. కీవ్‌ను స్వాధీనం చేసుకోవడంలో రష్యా విఫలమైందంటూ వస్తున్న విమర్శలను పుతిన్ ఖండించారు. ప్రణాళిక ప్రకారమే తమ సైన్యం పోరాటం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. తుర్క్మెనిస్తాన్లోని అష్గాబాట్‌లో కాస్పియన్ సీ లిటోరల్ స్టేట్స్ శిఖరాగ్ర సదస్సులో పుతిన్ పాల్గొన్నారు. ఉక్రెయిన్‌కు అదనపు సైనిక సాయం ఉక్రెయిన్‌కు మరో బిలియన్ పౌండ్ల విలువైన సైనిక సాయం అందజేస్తామని బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించారు. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో గురువారం నాటో నేతల శిఖరాగ్ర సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సాయం కింద అత్యాధునిక ఆయుధాలు ఇస్తామన్నారు. పౌరుల ప్రాణాలను బలిగొంటున్న రక్కసి పుతిన్ అని దుయ్యబట్టారు. యూరప్ భద్రత, శాంతికి రష్యా పెనుముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. -
G7 summit వేళ.. పుతిన్ ప్రకోపం
కీవ్: జీ7 సదస్సు జరుగుతున్న వేళ.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలనుసారం.. కేవలం గంటల వ్యవధిలోనే క్షిపణులతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడ్డాయి రష్యన్ బలగాలు. తూర్పు ఉక్రెయిన్ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకొనేందుకు చురుగ్గా పావులు కదుపుతున్న రష్యా సేనలు రాజధాని కీవ్‌పైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో నగరాలకు నగరాలే నామరూపాలు లేకుండా పోతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున కీవ్‌లో కనీసం రెండు రెసిడెంట్ కాంప్లెక్స్లపైన క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ విషయాన్ని స్థానిక మేయర్ విటాలీ క్లిట్స్కో ప్రకటించారు. ఈ ఘటనలో పెద్ద ఎత్తున పొగలు వెలువడిన దృశ్యాలు కనిపించాయి. సహాయక సిబ్బంది రంగంలోకి దిగి, భవనాల్లోని పౌరులను బయటకు తరలించారు. రష్యా బాంబు దాడుల్లో నలుగురు గాయపడ్డారు. ఒకరు చనిపోయారు. శిథిలాల నుంచి ఏడేళ్ల బాలికను సురక్షితంగా బయటకు తీశారు. తూర్పు ఉక్రెయిన్‌లో కీలకమైన లుహాన్స్క్పై రష్యా సైన్యం దాదాపు పట్టుబిగించింది. సీవిరోడోంటెస్క్ ఇప్పటికే రష్యా వశమయ్యింది. లీసిచాన్‌స్క్‌లో ఆదివారం రష్యా వైమానిక దాడుల్లో టీవీ టవర్ ధ్వంసమయ్యిందని, ఒక వంతెన తీవ్రంగా దెబ్బతిన్నదని లుహాన్స్క్ గవర్నర్ చెప్పారు. లీసిచాన్స్క్ సిటీ గుర్తుపట్టలేని స్థితికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము సీవిరోడోంటెస్క్ పరిసర గ్రామాలను పూర్తిగా ఆక్రమించుకున్నారని రష్యా సైన్యం వెల్లడించింది. కీవ్ ప్రాంతంలో రష్యా సైన్యం గంటల వ్యవధిలోనే 14 క్షిపణులు ప్రయోగించిందని ఉక్రెయిన్ ఎంపీ ఒలెస్కీ గోంచారెంకో చెప్పారు. స్పెయిన్‌లో త్వరలో జరుగనున్న నాటో సదస్సు నేపథ్యంలో రష్యా ఈ దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నామని అన్నారు. ఈ నెల 5వ తేదీ తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఈ స్థాయిలో దాడులు జరగడం ఇదే మొదటిసారి. నగరంలో మరో రెండు పేలుళ్లు శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. పుతిన్‌ను హేళన చేస్తూ.. జీ7 సదస్సులో.. సభ్య దేశాల ప్రతినిధులు పుతిన్‌ను అవహేళన చేసేలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్‌పై దాడి చేయిస్తుండడంతో.. జర్మనీలో జరుగుతున్న జీ7 సదస్సుల్లో.. ఏడు సంపన్న దేశాల గ్రూప్ నాయకులు ఆదివారం పుతిన్ ఇమేజ్ను ఎగతాళి చేశారు. కోట్లు, చొక్కాలు విప్పేసి మనమందరం పుతిన్ కంటే కఠినంగా ఉన్నామని చూపించాలి అంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కామెంట్ చేశాడు. చొక్కా లేకుండా గుర్రపుస్వారీ చేయాలి అంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ట్రూడో కామెంట్ చేశాడు. గతంలో పుతిన్ చొక్కాలేకుండా గుర్రపు స్వారీ చేసిన ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక వేలాది మందిని చంపి.. లక్షలాది మందిని ఉక్రెయిన్ నుంచి వలస వెళ్లి పోయేలా చేసిన.. రష్యాను మరింత ఒంటరిగా చేసే ప్రయత్నాలపై G7 నాయకులు చర్చించారు. G7 సభ్య దేశాలైన బ్రిటన్, కెనడా, జపాన్, అమెరికాలు రష్యా బంగారం దిగుమతులను నిషేధించే చర్యలను ప్రకటించాయి. ఇక G7లో ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ కూడా సభ్య దేశాలే. -
Russia-Ukraine war: రష్యా భీకర దాడులు
కీవ్/మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడుతోంది. సోమవారం నిర్దేశిత లక్ష్యాలపై లాంగ్–రేంజ్ మిస్సైళ్లు ప్రయోగించింది. ఖర్కీవ్ రీజియన్‌లోని లొజోవాలో ఉక్రెయిన్ సైనిక వాహనాల మరమ్మతు కేంద్రాన్ని ధ్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ ప్రకటించారు. అలాగే మరో 73 ఉక్రెయిన్ సైనిక శిబిరాలు, ఆయుధాగారాలు, మిలటరీ టార్గెట్లపై తమ సేనలు విరుచుకుపడినట్లు తెలిపారు. సెవెరోడొనెట్స్క్లో ఇరు పక్షాల నడుమ హోరాహోరీ పోరాటం సాగుతోందని లుహాన్స్క్ గవర్నర్ సెర్హీవ్ హైడై చెప్పారు. నగరంలో పరిస్థితి నానాటికీ దిగజారుతోందన్నారు. అయినప్పటికీ ఉక్రెయిన్ దళాలు శక్తివంచన లేకుండా పోరాడుతున్నాయని ప్రశంసించారు. సెవెరో డొనెట్స్క్ను కాపాడేందుకు కృషి చేస్తున్నాయని అన్నారు. సెవెరోడొనెట్స్క్తో పాటు సమీపంలోని లీసిచాన్‌స్క్‌పై రష్యా వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రెండు నగరాలను త్వరగా స్వాధీనం చేసుకోవాలన్న ఆరాటం రష్యాలో కనిపిస్తోంది. లీసిచాన్‌స్క్‌లో రష్యా దాడుల్లో ఓ బేకరీ ధ్వంసమయ్యింది. ఇక స్లొవియాన్స్క్, బఖ్ముత్ పట్టణాల్లోకి రష్యా దళాలు అడుగు పెట్టాయి. ఇక్కడి నుంచి సాధారణ ప్రజలకు బయటకు తరలిస్తున్నారు. మారియూపోల్‌లోని అజోవ్‌స్టల్ స్టీల్‌ప్లాంట్ నుంచి తమ సైనికుల మృతదేహాలను వెలికితీసే ప్రక్రియను ఉక్రెయిన్ ప్రారంభించింది. -
Russia Ukraine war: కీవ్‌లో క్షిపణుల మోత
కీవ్: ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు రాకెట్ లాంచర్లు, అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేస్తుండడం పట్ల రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీకార చర్యలు ప్రారంభించింది. పశ్చిమ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేయడమే లక్ష్యంగా రష్యా సైన్యం ఆదివారం తెల్లవారుజామునే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. గత ఐదు వారాలుగా ప్రశాంతంగా ఉన్న కీవ్ మిస్సైళ్ల మోతతో దద్దరిల్లిపోయింది. ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు అందజేసిన యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. తమ సైన్యం అత్యంత కచ్చితత్వం కలిగిన లాంగ్ రేంజ్ మిస్సైళ్లు ప్రయోగించిందని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. యూరప్ దేశాలు ఇచ్చిన టీ–72 యుద్ధ ట్యాంకులు, ఇతర సైనిక వాహనాలు నామరూపాల్లేకుండా పోయాయని పేర్కొంది. అయితే, ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఖండించింది. కీవ్‌లో రైల్వే స్టేషన్లు, ఇతర మౌలిక సదుపాయాలపైనా రష్యా సైన్యం దాడులకు పాల్పడింది. రష్యా క్షిపణులు కీవ్ సమీపంలోని డార్నిట్స్కీ, డినిప్రోవ్స్కీ జిల్లాలను వణికించాయి. కీవ్‌కు 350 కిలోమీటర్ల దూరంలోని అణు విద్యుత్ కేంద్రంపై క్రూయిజ్ మిస్సైల్‌ను ప్రయోగించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్లో పలు నగరాలు, గ్రామాలపై రష్యా సైన్యం మిస్సైళ్లు ప్రయోగించింది. గిర్స్కీలో 13, లీసిచాన్‌స్క్‌లో 5 ఇళ్లు దెబ్బతిన్నాయి. క్రామటోర్‌స్క్‌లోనూ వైమానిక దాడులు కొనసాగాయి. ఖర్కీవ్‌లోని చెర్కాస్కీ తీస్కీ గ్రామంలో రష్యా దళాలు ఫాస్ఫరస్ ఆయుధాలు ప్రయోగించాయని ఉక్రెయిన్ ఆరోపించింది. డోన్బాస్లో కీలకమైన సీవిరోడోంటెస్క్ సిటీలో 80శాతం మేర రష్యా సేనలు ఆక్రమించుకున్నాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మృతిచెందిన ఇరు పక్షాల సైనికుల మృతదేహాలను పరస్పరం మార్చుకొనే ప్రక్రియ అధికారికంగా ప్రారంభమయ్యింది. దక్షిణ జపొరిఝాజియాలో 160 మృతదేహాలను మార్చుకున్నట్లు ఉక్రెయిన్ యంత్రాంగం ప్రకటించింది. దయచేసి యుద్ధం ఆపండి: పోప్ ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఇకనైనా ఆపాలని పోప్ ఫ్రాన్సిస్ రష్యాకు మళ్లీ విజ్ఞప్తి చేశారు. ‘దయచేసి ప్రపంచాన్ని నాశనం చేయకండి’ అని ఆదివారం ఆయన విన్నవించారు. యుద్ధం కారణంగా బాధితులుగా మారుతున్న ప్రజల రోదనలు వినాలని ఉక్రెయిన్, రష్యా అధినేతలను పోప్ కోరారు. -
Russia Ukraine war: డోన్బాస్‌పై రష్యా పిడికిలి
కీవ్/మాస్కో/వాషింగ్టన్: తూర్పు ఉక్రెయిన్‌లో పారిశ్రామికప్రాంతమైన డోన్బాస్‌పై రష్యా పట్టు బిగుస్తోంది. ఈ ప్రాంతంలో కీలకమైన సీవిరోడోంటెస్క్ శివార్లలోకి రష్యా దళాలు సోమవారం అడుగుపెట్టాయి. లీసిచాన్స్క్ దిశగా దూసుకెళ్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఆయుధ సామగ్రిని ఇక్కడికి తరలిస్తున్నాయి. పుతిన్ సేనలు పెద్ద వ్యూహమే పన్నినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని లుహాన్స్క్ ప్రాంతీయ గవర్నర్ సెర్గీ హైడై స్వయంగా ప్రకటించారు. రష్యా సైన్యం దాడుల్లో తాజాగా ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు మరణించారని, ఐదుగురు గాయపడ్డారని చెప్పారు. డోన్బాస్లో మారియుపోల్ ఉదంతమే పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సీవిరోడోంటెస్క్ రష్యా దక్షిణ సరిహద్దుకు 143 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం ప్రస్తుతం ఇక్కడే కేంద్రీకృతమైంది. లుహాన్స్క్ ప్రావిన్స్‌లో ఉక్రెయిన్ అధీనంలో ఉన్న ప్రాంతాలు సీవిరోడోంటెస్క్, లీసిచాన్స్క్ మాత్రమే. లుహాన్స్క్, డోంటెస్క్ను కలిపి డోన్బాస్‌గా పిలుస్తారు. డోంటెస్క్, లైమాన్లోనూ రష్యా, ఉక్రెయిన్ దళాల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఉక్రెయిన్‌లోని డోంటెస్క్, లుహాన్స్క్కి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పారు. ఆ రెండు ప్రాంతాలను తాము స్వతంత్ర రాజ్యాలుగానే చూస్తున్నామని తెలిపారు. మైకోలైవ్ షిప్‌యార్డ్‌లో ఉక్రెయిన్ సైనిక వాహనాలను తాము ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ చెప్పారు. డోన్బాస్లో పరిస్థితి ఇప్పుడు మాటల్లో వర్ణించలేనంత తీవ్రంగానే ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఆయన రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్‌లో సైనికులతో మాట్లాడారు. మా వద్ద ఆ ప్రణాళిక లేదు: బైడెన్ ఉక్రెయిన్‌కు తాము ఆయుధాలు పంపించబోతున్నట్లు వస్తున్న వార్తనలు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. లాంగ్–రేంజ్ రాకెట్ సిస్టమ్స్‌ను ఉక్రెయిన్‌కు ఇవ్వడం లేదని, అలాంటి ప్రణాళికేదీ తమ వద్ద లేదని స్పష్టం చేశారు. బైడెన్ ప్రకటన పట్ల రష్యా భద్రతా మండలి ఉప నేత దిమిత్రీ మెద్వెదేవ్ హర్షం వ్యక్తం చేశారు. కళాకారుల సాయం ఉక్రెయిన్‌కు చేతనైన సాయం అందించేందుకు కళాకారులు సైతం ముందుకొస్తున్నారు. కొన్ని రోజుల క్రితం యూరోవిజన్ పాటల పోటీలో విజేతగా నిలిచిన కలుష్ ఆర్కెస్ట్రా బృందం(ఉక్రెయిన్) సైతం ఈ జాబితాలో ఉంది. కలుష్ బృందానికి లభించిన ట్రోఫీ క్రిస్టల్ మైక్రోఫోన్‌ను క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ ‘వైట్‌బిట్’ 9 లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ సొమ్ముతో ఉక్రెయిన్ సైన్యానికి మూడు డ్రోన్లు, గ్రౌండ్ కంట్రోల్ సిస్టమ్ అందిస్తామని కలుష్ బృందం వెల్లడించింది. అది చరిత్రాత్మక అవకాశం: స్టోల్టెన్‌బర్గ్ మాడ్రిడ్‌లో వచ్చే నెలలో జరగబోయే సదస్సు నాటో కూటమిని బలోపేతం చేసుకోవడానికి ఒక చరిత్రాత్మక అవకాశం అవుతుందని కూటమి సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ సోమవారం చెప్పారు. నాటో కూటమిలోకి స్వీడన్, ఫిన్లాండ్ను ఆహ్వానించేందుకు తాను ఉత్సాహంతో ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. -
Russia-Ukraine war: డోన్బాస్‌పై రష్యా సేనల గురి
కీవ్: ఉక్రెయిన్‌లోని మారియుపోల్ సిటీని విజయవంతంగా స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు ఇక తూర్పున పారిశ్రామిక ప్రాంతమైన డోన్బాస్సై ప్రధానంగా గురిపెట్టాయి. క్షిపణుల వర్షం కురిపించాయి. అత్యాధునిక ఆయుధాలతో దాడికి దిగాయి. డోన్బాస్లో రష్యా అనుకూల వేర్పాటువాదులు అధికంగా ఉండడం పుతిన్ సైన్యానికి కలిసొచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు లుహాన్స్క్ ప్రావిన్స్‌లోని ముఖ్య నగరం సీవిరోడోంటెస్క్‌లో పాగా వేయడానికి రష్యా సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. డోన్బాస్లో ఒక భాగమైన డోంటెస్క్ ప్రావిన్స్‌లోని స్లోవానిస్క్లో మళ్లీ దాడులు ప్రారంభిస్తామని రష్యా సైన్యం ప్రకటించింది. డోంటెస్క్‌లో శనివారం రష్యా బాంబు దాడుల్లో ఏడుగురు పౌరులు మరణించారని, మరో 10 మంది గాయపడ్డారని స్థానిక గవర్నర్ వెల్లడించారు. బొహోరోడిచిన్ గ్రామంలోని ఓ చర్చిలో తలదాచుకుంటున్న 100 మంది క్రైస్తవ మతాధికారులు, పిల్లలను అధికారులు ఖాళీ చేయించారు. ఇక్కడ రష్యా వైమానిక దాడులు సాగిస్తుండడమే ఇందుకు కారణం. మారియుపోల్ అజోవ్‌స్టల్ స్టీల్‌ప్లాంట్ నుంచి 2,500 మంది ఉక్రెయిన్ సైనికులను ఖైదీలుగా అదుపులోకి తీసుకున్నామని రష్యా స్పష్టం చేసింది. దీంతో సదరు సైనికుల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమ వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. త్వరగా ఈయూలో చేర్చుకోండి: జెలెన్స్కీ డోన్బాస్లో ప్రస్తుతం పరిస్థితి ఆందోళకరంగానే ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు. ఆయన తాజాగా దేశ ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశం విడుదల చేశారు. రష్యా సేనలను ఉక్రెయిన్ను దళాల కచ్చితంగా ఓడిస్తాయని పేర్కొన్నారు. రష్యా దండయాత్ర నేపథ్యంలో తమ దేశాన్ని సాధ్యమైనంత త్వరగా యూరోపియన్ యూనియన్(ఈయూ)లో చేర్చుకోవాలని జెలెన్స్కీ మరోసారి కోరారు. ఈ విషయంలో ఈయూలోని 27 సభ్యదేశాలు వెంటనే చొరవ తీసుకోవాలని విన్నవించారు. ఈయూలో ఉక్రెయిన్ చేరికకు కనీసం 20 ఏళ్లు పడుతుందని ఫ్రాన్స్ మంత్రి క్లెమెంట్ బ్యూనీ చెప్పారు. ఏడాది, రెండేళ్లలో ఈయూలో ఉక్రెయిన్ భాగస్వామి అవుతుందనడం ముమ్మాటికీ అబద్ధమేనన్నారు. సిరియా నుంచి బ్యారెల్ బాంబు నిపుణులు సిరియా నుంచి రష్యాకు మద్దతుగా 50 మంది బ్యారెల్ బాంబు నిపుణులు వచ్చినట్లు ఉక్రెయిన్ నిఘా వర్గాలు వెల్లడించాయి. వీరు తయారు చేసిన బాంబులు సిరియాలో పెను విధ్వంసం సృష్టించాయి. రష్యాకు అపజయమే: అండ్రెజ్ డుడా పోలండ్ అధ్యక్షుడు అండ్రెజ్ డుడా ఆదివారం కీవ్‌లో పర్యటించారు. ఉక్రెయిన్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు విజయం దక్కదని జోస్యం చెప్పారు. యుద్ధం ప్రారంభమయ్యాక ఉక్రెయిన్ పార్లమెంట్లో మాట్లాడిన తొలి విదేశీ నేత డుడానే. -
Russia-Ukraine war: రష్యా ధ్వంస రచన
కీవ్/మారియూపోల్: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు దిగుతోంది. దేశంలో మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తోంది. తూర్పు ప్రాంతంలోని రైల్వే కార్యాలయాలు, చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని రష్యా సైన్యం సోమవారం క్షిపణుల వర్షం కురిపించింది. పశ్చిమ ప్రాంతంలోనూ రెండు చమురు కేంద్రాలపై దాడికి దిగింది. మధ్య, పశ్చిమ ఉక్రెయిన్‌లో ఐదు రైల్వే కార్యాలయాలపై దాడులు చేసింది. క్రెమెన్‌చుక్‌లోని చమురు శుద్ధి కర్మాగారాన్ని ధ్వంసం చేశాయి. రష్యా యుద్ధ విమానాలు ఆదివారం రాత్రి 56 చోట్ల దాడులకు పాల్పడినట్లు ఉక్రెయిన్ చెప్పింది. రష్యా ఆయిల్ డిపోలో మంటలు ఉక్రెయిన్ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో రష్యా నగరం బ్రియాన్స్క్లో ఆయిల్ డిపోలో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దానికి కారణాలు తెలియరాలేదు. ఈ అయిల్ డిపో నుంచి యూరప్‌కు పైప్‌లైన్ ద్వారా ముడి చమురు సరఫరా అవుతూంటుంది. పశ్చిమ దేశాల కుట్రలు సాగవు: పుతిన్ తమ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా, దాని మిత్రదేశాలు కుట్ర పన్నుతున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ ఆరోపించారు. రష్యాను అంతర్గతంగా ధ్వంసం చేసేందుకు పశ్చిమ దేశాలు సాగిస్తున్న ప్రయత్నాలు ఫలించబోవన్నారు. యుద్ధ పరిస్థితిపై సోమవారం ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఆ బాలలకు ఈస్టర్ బహుమతులు మారియూపోల్‌లోని అజోవ్‌స్టల్ స్టీల్‌ప్లాంట్ బంకర్లో క్షణమొక యుగంలా గడుతుపున్న ఉక్రెయిన్ బాలల ముఖాల్లో ఈస్టర్ బహుమతులు వెలుగులు నింపాయి. ఉక్రెయిన్ సైన్యం వారికి బహుమతులు అందించింది. మరోవైపు నాటో సభ్యత్వం కోసం స్వీడన్, ఫిన్లాండ్ మే 22 తర్వాత దరఖాస్తు సమర్పించనున్నాయి. ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ సోమవారం టర్కీలో పర్యటించారు. ఆయన మంగళవారం రష్యా వెళ్లి పుతిన్‌తో సమావేశమవుతారు. 28న ఉక్రెయిన్‌కు వెళ్తారు. రష్యా ప్రభుత్వం 40 మంది జర్మనీ దౌత్య అధికారులను తమ దేశం నుంచి బహిష్కరించింది. -
Russia-Ukraine war: ఉక్రెయిన్ ఆయుధాగారాలపై రష్యా ముమ్మర దాడులు
కీవ్: ఉక్రెయిన్‌పై దాడులను ఆదివారం రష్యా తీవ్రతరం చేసింది. సెంట్రల్ ఉక్రెయిన్‌లో పేలుడు పదార్థాలు, మందుగుండు పౌడర్ తయారీ కంపెనీపై అత్యాధునిక మిసైళ్లు ప్రయోగించినట్టు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ తెలిపారు. ఖర్కీవ్ ప్రాంతంలోని బర్వింకోవ్, నోవా ద్మిత్రివ్కా, ఇవనివ్కా, హుతలరివ్కా, వెల్యికాల్లో పలు ఆయుధాగారాలపైనా భారీగా దాడులు చేసినట్టు వివరించారు. 26 ఉక్రెయిన్ సైనిక లక్ష్యాలను ధ్వంసం చేశామన్నారు. మారియుపోల్‌లోని అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంటుపై గగనతల దాడులకు దిగింది. తూర్పున డోన్బాస్లో లుహాన్స్క్ ప్రాంతంలోని పొపాస్నా, సివెరోడొనెట్స్క్, డొనెట్స్క్ ప్రాంతంలోని కురఖీవ్ నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. పశ్చిమ డోన్బాస్లోని ద్నిప్రోలోనూ బాంబు దాడులు జరిగాయి. చెడుపై అంతిమంగా మంచి గెలిచి తీరుతుందని, ఈ వాస్తవం రష్యాకు త్వరలో తెలిసొస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. మరణాన్ని జీవనం, చీకటిని వెలుతురు అధిగమిస్తాయని దేశ ప్రజలకిచ్చిన ఈస్టర్ సందేశంలో చెప్పారు. అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు లాయిడ్ ఆస్టిన్, ఆంటోనీ బ్లింకెన్‌లతో భేటీ కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. -
రష్యా యుద్ధనౌకకు భారీ నష్టం
కీవ్: రష్యాకు చెందిన ప్రముఖ యుద్ధనౌక మాస్కోవాను మిసైళ్లతో పేల్చామని ఉక్రెయిన్ అధికారులు గురువారం ప్రకటించారు. తమ క్షిపణుల ధాటికి నౌక మునిగిపోయిందని ఒక అధికారి చెప్పారు. అయితే తమ నౌకలో అగ్నిప్రమాదం కారణంగా భారీ నష్టం వాటిల్లిందని రష్యా ప్రకటించింది. ప్రమాదం జరిగిన వెంటనే నౌకలో సిబ్బందిని ఖాళీ చేయించామని తెలిపింది. ప్రమాదం పెద్దదే కానీ నౌక మునిగిపోలేదని, దాన్ని దగ్గరలోని నౌకాశ్రయానికి చేర్చామని వెల్లడించింది. ప్రమాదం జరిగినప్పుడు నౌకలో 500మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. నౌకకున్న మిసైల్ లాంచర్లు సురక్షితమేనని పేర్కొంది. మాస్కోవా నౌక ఒకేమారు 16 లాంగ్ రేంజ్ మిస్సైళ్లను మోసుకుపోతుంది. నౌకలో ఆయుధాలు పేలడంతో నిప్పంటుకుందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. యుద్ధం నుంచి ఈ నౌక బయటకు రావడం రష్యాకు ఎదురుదెబ్బగా నిపుణులు భావిస్తున్నారు. నష్టం ఎంతటిదైనా ఈ ఘటన రష్యా ప్రతిష్టకు మచ్చగా అభిప్రాయపడ్డారు. మరోవైపు ఉక్రెయిన్ తేలికపాటి హెలికాప్టర్లను తమ సరిహద్దుల్లోకి పంపి నివాస భవనాలపై బాంబులు కురిపిస్తోందని రష్యా ఆరోపించింది. ఈ దాడుల్లో 7గురు గాయపడ్డారని తెలిపింది. సరిహద్దు వద్ద శరణార్థులు దాటుతుండగా ఉక్రెయిన్ కాల్పులు జరిపిందని అంతకుముందు రష్యా సెక్యూరిటీ సర్వీస్ ఆరోపించింది. మారియుపోల్‌లో రష్యా ముందంజ ఉక్రెయిన్‌లోని కీలక నగరం మారియుపోల్‌లో రష్యా బలగాలు ముందంజ వేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ ప్రతినిధి ఇగార్ కొనషెంకోవ్ చెప్పారు. నగరంలోని ఒక ఫ్యాక్టరీలో 1,026 మంది ఉక్రెయిన్ సైనికులు లొంగిపోయారన్నారు. ఈ మేరకు రష్యా టీవీ ఒక వీడియోను విడుదల చేసింది. అయితే నగరంలో ఇంకా పోరాటం సాగుతూనే ఉందని ఉక్రెయిన్ మంత్రి వాడైమ్ డెనెసెంకో చెప్పారు. ఎంతమంది బలగాలు నగరంలో పోరాటం చేస్తున్నది తెలియరాలేదు. క్రిమియాతో భూమార్గం ఏర్పాటు చేసుకునేందుకు ఈ నగరం రష్యాకు ఎంతో కీలకం. మాస్కోవా నౌకకు నష్టం వాటిల్లడంతో రష్యా ముందంజ ఎంతమేరకు కొనసాగుతుందోనని అనుమానాలున్నాయి. ప్లానెట్ లాబ్ సంస్థ విడుదల చేసిన శాటిలైట్ ఫొటోల్లో సెవెస్టోపోల్ నౌకాశ్రయం నుంచి మాస్కోవా ఆదివారం బయటకు వచ్చినట్లు మాత్రమే కనిపిస్తోంది. నౌక ప్రస్తుత లొకేషన్ తెలుసుకునేందుకు సాంకేతిక ఆటంకాలు రావడంతో ఎవరి వాదన నిజమన్నది తెలియరాలేదు. ఉక్రెయిన్ అధికారుల్లో ఒకరు నౌకపై నెప్ట్యూన్ మిసైళ్లను ప్రయోగించడంతో భారీ నష్టం వాటిల్లిందని పేర్కొనగా, మరొక అధికారి నౌక మునిగిందని చెబుతూ ఒక వీడియోను షేర్ చేశారు. కానీ మరో సీనియర్ అధికారి దీన్ని ధ్రువీకరించకపోవడంతో ఉక్రెయిన్ ప్రకటనపై సందేహాలు తలెత్తుతున్నాయి. అమెరికా సైతం ఘటనపై ఉక్రెయిన్ వాదనను ధ్రువీకరించలేదు. అయితే ఎలా జరిగినా నౌకకు నష్టం వాటిల్లడం రష్యాకు ఎదురుదెబ్బని వ్యాఖ్యానించింది. రెడ్‌క్రాస్ నగదు సాయం ఉక్రెయిన్‌లోని 20 లక్షల మంది ప్రజలకు సాయం చేసేందుకు అతిపెద్ద క్యాష్ అసిస్టెంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తామని రెడ్‌క్రాస్ తెలిపింది. రష్యా యుద్ధంతో ప్రభావితమైనవారికి దాదాపు 10.6 కోట్ల డాలర్లను పంచుతామని సంస్థ ప్రతినిధి నికోల్ చెప్పారు. ఇప్పటికే దాదాపు 10 లక్షలమందికి దుప్పట్లు, ఇతర సామగ్రిని అందించామని చెప్పారు. తాజా నగదు సాయంతో స్థానిక ఎకానమీలో ద్రవ్య లభ్యత పెరుగుతుందన్నారు. పాశ్చాత్యదేశాలు తమనుంచి గ్యాస్ దిగుమతులు నిలిపివేస్తే అది ఆ దేశాలపై నెగెటివ్ ప్రభావం చూపుతుందని రష్యా అధిపతి పుతిన్ హెచ్చరించారు. ఇతర ప్రాంతాల నుంచి చేసుకునే దిగుమతులు యూరప్ దేశాల ఎకానమీలను దెబ్బతీస్తాయన్నారు. పలువురు రష్యా ధనవంతులకు చెందిన 33 ఆస్తులను స్తంభింపజేసినట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. దీంతో ఇంతవరకు ఫ్రాన్స్ స్తంభింపజేసిన రష్యా కుబేరుల ఆస్తుల విలువ 2400 కోట్ల యూరోలకు చేరింది. ఉక్రెయిన్‌లో ఐర్లాండ్ రక్షణ, విదేశాంగ మంత్రి సైమన్ పర్యటించారు. ఉక్రెయిన్‌కు దాదాపు 5.8 కోట్ల డాలర్ల సాయం అందిస్తున్నట్లు చెప్పారు. అమెరికా తాజాగా ప్రకటించిన 80 కోట్ల డాలర్ల సాయానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకింత ప్రత్యేకం? మాస్కోవా నౌక యుద్ధం ఆరంభమైన తొలిరోజుల్లో ఉక్రెయిన్ సైనికులున్న స్నేక్ ఐలాండ్‌ను చుట్టు ముట్టింది. దీవిలోని సైనికులను లొంగిపోవాలని హెచ్చరించింది. అయితే ఉక్రెయిన్ సైనికులు మాత్రం ‘‘రష్యా యుద్ధ నౌకా! నిన్ను నువ్వే పేల్చుకో’’ అని ఎదురుతిరిగారని ఆ దేశం పేర్కొంది. దీనికి సంబంధించిన నిజానిజాలు తెలియరాలేదు. కానీ ఈ ఘటనను ఉక్రెయిన్ దేశస్థులు గర్వంగా చెప్పుకుంటారు. తాజాగా ఘటనను గుర్తు చేసుకుంటూ ఒక పోస్టల్‌స్టాంపును కూడా ఉక్రెయిన్ విడుదల చేసింది. -
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై ఆగని బాంబుల వర్షం
బుచా/కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒడెసా సమీపంలో ఆదివారం క్షిపణుల వర్షం కురిపించాయి. ఉక్రెయిన్ సైన్యం ఉపయోగిస్తున్న చమురు శుద్ధి కర్మాగారాన్ని, మూడు చమురు డిపోలను ధ్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. కోస్తియాన్టినివ్కా, ఖ్రేసిచేలో ఆయుధ డిపోలను సైతం ధ్వంసం చేశామని తెలియజేసింది. మారియుపోల్ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఖర్కీవ్‌పై 20 వైమానిక దాడులు జరిగాయి. బలాక్లియా పట్టణంలో ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడికి పాల్పడింది. మరోవైపు ఇరు దేశాల మధ్య చర్చలు సోమవారం మళ్లీ మొదలవనున్నాయి. బుచాలో దారుణ దృశ్యాలు కొన్ని వారాలుగా రష్యా సైన్యం నియంత్రణలో ఉన్న రాజధాని కీవ్ ఉత్తర ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. కీవ్‌కు 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుచా పట్టణం ఇప్పటికే ఉక్రెయిన్ అధీనంలోకి వచ్చింది. అక్కడ శవాలు వీధుల్లో చెల్లాచెదురుగా దర్శనమిచ్చాయని మీడియా ప్రతినిధలు చెప్పారు. వాటికి సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తూర్పు ప్రాంతంలో రష్యా భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. ఉత్తర ఉక్రెయిన్ నుంచి సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించింది. ఉక్రెయిన్‌లో మందుపాతర్ల బెడద రష్యా జవాన్లు తమ భూభాగంలో ఎక్కడిక్కడ మందుపాతరలు ఏర్పాటు చేశారని అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. రోడ్లపై, వీధుల్లో, ఇళ్లలో, అఖరికి శవాల లోపలా మందుపాతరలు పె ట్టారన్నారు. మరిన్ని ఆధునిక ఆయుధాలు, యుద్ధ విమానాలివ్వాలని పశ్చిమ దేశాలను కోరారు. రంజాన్‌పై యుద్ధ ప్రభావం యుద్ధంతో చమురు, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగినందున ఈసారి రంజాన్ జరుపుకోవడం కష్టమేనని లెబనాన్, ఇరాక్, సిరియా, సూడాన్, యెమెన్ తదితర దేశాల్లో జనం వాపోతున్నారు. వాటికి గోధుమలు, బార్లీ గింజలు, నూనె గింజలు రష్యా, ఉక్రెయిన్ నుంచే వెళ్తాయి. లిథువేనియాకు చెందిన ప్రముఖ సినీ దర్శకుడు రావిసియస్ మారియుపోల్‌లో కాల్పుల్లో మృతి చెందారు. రష్యా సైన్యంలో తిరుగుబాటు! సుదీర్ఘ యుద్ధంతో ఉక్రెయిన్‌లో రష్యా సైనికులు నీరసించిపోతున్నట్లు చెప్తున్నారు. ముందుకెళ్లడానికి వారు ససేమిరా అంటున్నారు. సొంత వాహనాలు, ఆయుధాలనూ ధ్వంసం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఉత్తర్వులను లెక్కచేయడం లేదు. సైనికుల్లో తిరుగుబాటు మొదలైందని, పుతిన్ మొండిపట్టుపై వారు రగిలిపోతున్నారని ఉక్రెయిన్ అంటోంది. ‘‘సహచరుల మరణాలు రష్యా సైనికులను కలచివేస్తున్నాయి. స్థైర్యం సన్నగిల్లి ఆస్త్ర సన్యాసం చేస్తున్నారు’’ అరని నాటో కూటమి అంటోంది. యుద్ధానికి రష్యా సైన్యం విముఖత వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. 1905 జూన్‌లో రూసో–జపనీస్ యుద్ధంలోనూ వారు ఇలాగే సహాయ నిరాకరణ చేశారు. ఉన్నతాధికారులపై తిరగబడ్డారు. వారి ఆదేశాలను ధక్కిరించారు. -
నార్త్ కొరియా కిమ్ సంచలన ప్రకటన.. టెన్షన్లో అమెరికా!
సియోల్: వరుస క్షిపణి ప్రయోగాలతో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే రికార్డు స్థాయిలో 11 క్షిపణి ప్రయోగాలు చేపట్టిన ఉత్తర కొరియా తాజాగా మార్చి 25వ తేదీన అతి పెద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి హ్వాసాంగ్–17ను విజయవంతంగా పరీక్షించింది. ఇది 67 నిమిషాల పాటు ప్రయాణించి 1,090 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉత్తర కొరియా, జపాన్ మధ్య సముద్ర జలాల్లో లక్ష్యంపై పడిందని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్ మరో సోమవారం మరో సంచలన ప్రకటన చేశారు. తన సైన్యాన్ని మరింత శక్తివంతం చేసేందుకు అత్యాధునిక క్షిపణులను తయారు చేసి ప్రయోగించనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్బంగా కిమ్.. ఎవరూ ఆపలేని అఖండ సైనిక శక్తి సామార్థ్యాలు కలిగి ఉన్నప్పుడే.. ఓ వ్యక్తి యుద్ధాన్ని నిరోధించగలడని అన్నారు. అప్పుడే సామ్రాజ్యవాదుల బెదిరింపులకు, బ్లాక్‌మెయిల్స్ అన్నింటినీ అదుపులో ఉంచగలడంటూ వ్యాఖ్యలు చేసినట్టు కేసీఎన్ఏ పేర్కొంది. దీంతో పరోక్షంగా అమెరికాకు కిమ్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే కిమ్ తమ ఆత్మరక్షణ దళాలను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. మరోవైపు.. క్షిపణి ప్రయోగాల పట్ల దక్షిణ కొరియా, జపాన్, అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉత్తరకొరియా ధిక్కరిస్తోందంటూ అమెరికా అభ్యంతరం తెలిపింది. బాల్లిస్టిక్ క్షిపణుల ప్రయోగాలకు ఉత్తర కొరియా పాల్పడుతోందని, ఖండాంతర మిస్సైల్‌ను టెస్ట్ ఫైర్ చేయడాన్ని క్షమించలేమని జపాన్ పేర్కొంది. కాగా, అణ్వస్త్రాల ప్రయోగాలు, ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడంపై ఇది వరకే అమెరికా, ఉత్తర కొరియా మధ్య చర్చలు జరిగాయి. 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కిమ్ జోంగ్ ఉన్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. కొన్ని కీలక విషయాల్లో ఏకాభిప్రాయం కుదురకపోవడంతో చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. ఆ తరువాత ఉత్తర కొరియాపై అమెరికా కొన్ని ఆంక్షలను విధించింది. దీంతో కిమ్ జోంగ్ ఉన్ క్షిపణి ప్రయోగాలను వేగవంతం చేసింది. -
Russia-Ukraine War: లివీవ్ ముట్టడి
లివీవ్: పోలండ్‌కు అతి సమీపంలో ఉండే ఉక్రెయిన్ నగరం లివీవ్‌పై రష్యా రెండు రోజులుగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలండ్ పర్యటనలో భాగంగా శనివారం ఇక్కడికి సమీపంలోని శరణార్థుల శిబిరాన్ని సందర్శిస్తున్న సమయంలోనే లివీవ్‌పై భారీగా క్షిపణి దాడులు జరిగాయి. తద్వారా అమెరికాకు రష్యా ఓ హెచ్చకరిక సంకేతం పంపిందని భావిస్తున్నారు. లివీవ్‌లోని అక్కడి రక్షణ శాఖ ఇంధన ప్లాంటును క్రూయిజ్ మిసైళ్లతో ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ ఆదివారం ప్రకటించారు. కీవ్‌లోనూ మరో ఇంధన డిపోను యుద్ధ నౌక నుంచి ప్రయోగించిన మిసైల్ ద్వారా ధ్వంసం చేశామన్నారు. నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతంపైనా రెండు రాకెట్లు పడ్డాయి. అక్కడ గంటల తరబడి దట్టమైన పొగ రేగుతూ కన్పించింది. కీవ్‌లో వెయ్యేళ్ల చరిత్ర ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన సెయింట్ సోఫియా కేథడ్రల్ దాడుల్లో ఏ క్షణమైన నేలమట్టమయ్యేలా కన్పిస్తోంది. కీవ్‌కు ఉత్తరంగా ఉన్న స్లావ్యుచ్ నగరాన్ని రష్యా సైన్యం ఆక్రమించిందని కీవ్ ప్రాంత గవర్నర్ ప్రకటించారు. కీవ్‌లో కర్ఫ్యూను సోమవారం దాకా పొడిగించారు. పొట్ట చేతపట్టుకుని వలస పోతున్న ఉక్రేనియన్లకు ఇంతకాలంగా లివీవ్ మజిలీగా ఉపయోగపడుతూ వస్తోంది. దేశంలోని పలు ప్రాంతాలకు నిత్యావసరాలు ఇక్కడి నుంచే సరఫరా అవుతూ వచ్చాయి. లివీవ్‌పైనా రష్యా దాడులను ఉధృతం చేయడం ఉక్రెయిన్‌లో మరింత సంక్షోభానికి కారణమయ్యేలా కన్పిస్తోంది. ఖర్కీవ్‌లోని అణు పరిశోధన సంస్థపైనా మరోసారి బాంబుల వర్షం కురిసింది. మరోవైపు రష్యాలో చేరడంపై రెఫరెండం నిర్వహిస్తామని లుహాన్స్క్ వేర్పాటువాద నేతలు చెప్తున్నారు. రష్యా–ఉక్రెయిన్ మరో దఫా చర్చలు సోమవారం జరగనున్నాయి. జెట్లు, ట్యాంకులివ్వండి: జెలెన్స్కీ యూరప్, పశ్చిమ దేశాలు కాస్త తెగువ చూపి తమకు సకాలంలో యుద్ధ విమానాలు, యుద్ధట్యాంకులు ఇస్తే రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ పరిస్థితి మరోలా ఉండేదని అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ అన్నారు. ఈ విషయంలో అవి కనీసం ఒక్క శాతం ధైర్యం చూపినా బాగుండేదని వాపోయారు. యూరోపియన్ యూనియన్ను, నాటోను రష్యా నడుపుతోందా అంటూ మండిపడ్డారు. ‘‘మీరు పంపుతున్న షాట్ గన్లు, మెషీన్ గన్లతో రష్యా క్షిపణులను అడ్డుకోవడం అసాధ్యం. ఇప్పటికైనా యుద్ధ విమానాలు, ట్యాంకులు ఇవ్వండి. లేదంటే పోలండ్, స్లొవేకియా తదితర బాల్టిక్ దేశాలపైనా రష్యా దాడి చేయడం ఖాయం’’ అని జెలెన్స్కీ అన్నారు. యుద్ధం ద్వారా రష్యన్లపై ఉక్రెయిన్ ప్రజల్లో పుతిన్ తీవ్ర విద్వేషం నింపుతున్నారని దుయ్యబట్టారు. డోన్బాస్ ప్రాంతంలోని ఉక్రెయిన్ సైన్యాన్ని చుట్టుముట్టేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఇంగ్లండ్ రక్షణ శాఖ వర్గాలంటున్నాయి. ఖర్కీవ్, మారియుపోల్ నగరాల నుంచి రష్యా పటాలాలు ఇందుకోసం ఇప్పటికే బయల్దేరినట్టు చెప్పింది. అదే సమయంలో ఉక్రెయిన్ నగరాలపై దాడిని కూడా రష్యా తీవ్రస్థాయిలో కొనసాగిస్తోందని వివరించింది. తమ దేశాన్ని ఆక్రమించడం అసాధ్యమని తేలిపోవడంతో కనీసం రెండు ముక్కలైనా చేయాలని రష్యా చూస్తోందని మిలిటరీ ఇంటలిజెన్స్ చీఫ్ బుడనోవ్ ఆరోపించారు. రష్యా సైన్యాలకు చుక్కలు చూపిస్తామన్నారు. ఆటవిక యుద్ధం ఇకనైనా ముగియాలని పోప్ ఫ్రాన్సిస్ మరోసారి ప్రార్థనలు చేశారు. బైడెన్ ఉద్దేశం వేరు: అమెరికా వ్లాదిమిర్ పుతిన్ అధికారంలో కొనసాగరాదన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యలకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వివరణ ఇచ్చారు. పుతిన్‌ను గద్దె దించేందుకు అమెరికా ప్రయత్నించడం లేదన్నారు. పొరుగు దేశాలపై యుద్ధానికి దిగకుండా పుతిన్‌ను కట్టడి చేయాలన్నదే బైడెన్ వ్యాఖ్యల ఉద్దేశమన్నారు. రష్యాలో గానీ, ఇంకే దేశంలో గానీ నాయకత్వ మార్పులకు అమెరికా ఎన్నటికీ పూనుకోదన్నారు. బైడెన్ వ్యాఖ్యలను సమర్థించబోనని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అన్నారు. ‘‘నేనలాంటి పదజాలం ఉపయోగించను. సంక్షోభానికి తెర దించేందుకు పుతిన్‌తో చర్చలు కొనసాగిస్తా’’ అని చెప్పారు. మరోవైపు, రష్యా తమపై సైబర్ దాడికి దిగొచ్చని ఫిన్లండ్ అధ్యక్షుడు సాలీ నినిస్టో అన్నారు. ఫిన్లండ్ నాటో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తోంది. రష్యాతో 1,340 కిలోమీటర్ల మేర సరిహద్దును కూడా పంచుకుంటోంది. మరోవైపు పుతిన్ సన్నిహితుడైన రష్యా కుబేరుడు ఎవగెనీ ష్విల్డర్కు చెందిన రెండు జెట్ విమానాలను ఇంగ్లండ్ జప్తు చేసింది. -
Russia-Ukraine war: రెచ్చిపోతున్న రష్యా
కీవ్: నెల రోజుల యుద్ధంలో సాధించిందేమీ లేదన్న నిస్పృహతో రష్యా నానాటికీ మరింత హేయంగా ప్రవర్తిస్తోందని ఉక్రెయిన్ దుయ్యబట్టింది. నిర్బంధంతో అల్లాడుతున్న మారియుపోల్ నగరానికి బుధవారం ఆహారం తదితర అత్యవసరాలను తీసుకెళ్తున్న హ్యుమానిటేరియన్ కాన్వాయ్‌ని, 15 మంది రెస్క్యూ వర్కర్లను రష్యా సైన్యం నిర్బంధించిందని ఆరోపించింది. ఇరుపక్షాలూ అంగీకరించిన మానవీయ కారిడార్లను గౌరవించడం లేదంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దుమ్మెత్తిపోశారు. నగరంపై భూ, గగనతల దాడులకు తోడు నావికా దాడులకూ రష్యా తెర తీసింది. అజోవ్ సముద్రం నుంచి ఏడు యుద్ధ నౌకల ద్వారా బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఐదు రోజులుగా ఐదు సెకన్లకో బాంబు చొప్పున పడుతున్నట్టు నగరం నుంచి బయటపడ్డవారు చెప్తున్నారు. కీవ్‌లో ప్రతిఘటన కీవ్‌పైనా రష్యా దాడుల తీవ్రత బుధవారం మరింత పెరిగింది. నగరం, శివార్లలో ఎటు చూసినా బాంబు, క్షిపణి దాడులు, నేలమట్టమైన నిర్మాణాలు, పొగ తప్ప మరేమీ కన్పించని పరిస్థితి. కానీ ఉక్రెయిన్ దళాల ప్రతిఘటన నేపథ్యంలో రష్యా సేనలు నగరానికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉండిపోయాయని చెప్తున్నారు. ఉత్తరాది నగరం చెర్నిహివ్‌ను కీవ్‌కు కలిపే కీలక బ్రిడ్జిని రష్యా సైన్యం బాంబులతో పేల్చేసింది. దాంతో నగరానికి అత్యవసరాలను చేరేసే మార్గం మూసుకుపోయింది. తిండీ, నీరూ కూడా లేక నగరవాసుల పరిస్థితి దుర్భరంగా ఉంది. ఉక్రెయిన్ గెరిల్లా యుద్ధం ఉక్రెయిన్ సైన్యం దూకుడు మరింతగా పెరిగిందని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు. పలు నగరాల్లో రష్యా సైన్యాన్ని విజయవంతంగా నిలువరిస్తున్నట్టు చెప్పారు. వారి గెరిల్లా యుద్ధరీతులకు రష్యా సైన్యం దీటుగా బదులివ్వలేకపోతోందన్నారు. దక్షిణాదిన రష్యా ఆక్రమించిన ఖెర్సన్ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉక్రెయిన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. ఉక్రెయిన్ను రోజుల వ్యవధిలోనే ఆక్రమించేస్తామన్న అతివిశ్వాసమే రష్యాను దెబ్బ తీసిందని పాశ్చాత్య సైనిక నిపుణులు అంటున్నారు. ‘‘పరాయి దేశంలో తీవ్ర ఆహార, ఇంధన కొరతతో రష్యా సైన్యం అల్లాడుతోంది. అతి శీతల వాతావరణం సమస్యను రెట్టింపు చేస్తోంది. మంచు దెబ్బ తదితర సమస్యలతో సైనికులు నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పటికే వేలాదిమంది చనిపోయారు’’ అని చెబుతున్నారు. మొత్తమ్మీద రష్యా తన యుద్ధపాటవంలో పదో వంతు దాకా కోల్పోయిందని అమెరికా అంచనా. ఆకలికి తాళలేక రష్యా సైనికులు దుకాణాలు, ఇళ్లను లూటీ చేస్తున్నారని ఉక్రెయిన్ చెబుతోంది. చర్చల్లో పురోగతి రష్యాతో చర్చల్లో కాస్త పురోగతి ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. పలు కీలకాంశాలపై రెండువైపులా ఏకాభిప్రాయం దిశగా పరిస్థితులు సాగుతున్నాయన్నారు. పశ్చిమ దేశాలు మాత్రం రష్యా దిగొస్తున్న సూచనలేవీ ఇప్పటిదాకా కన్పించడం లేదంటున్నాయి. జీ–20 నుంచి రష్యాకు ఉద్వాసన! ఆంక్షలతో అతలాకుతలమవుతున్న రష్యాను ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక శక్తుల బృందమైన జీ–20 గ్రూప్ నుంచి తొలగించడంపై మిత్రపక్షాలతో అమెరికా చర్చలు జరుపుతోందని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ తెలిపారు. ‘‘ఉక్రెయిన్‌పై ఏకపక్షంగా అన్యాయమైన యుద్ధానికి దిగినందుకు పర్యవసానాలను రష్యా అనుభవించాల్సి ఉంటుంది. ఇకపై అది అంతర్జాతీయంగా ఏకాకిగానే మిగిలిపోతుంది’’ అన్నారు. రష్యాకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాల మద్దతును మరింతగా కూడగట్టేందుకు నాలుగు రోజుల యూరప్ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం బయల్దేరారు. తొలుత బ్రెసెల్స్‌లో దేశాధినేతలతో ఆయన వరుస చర్చలు జరుపుతారు. నాటో అత్యవసర శిఖరాగ్ర భేటీలో, యూరోపియన్ యూనియన్, జీ–7 సమావేశాల్లో పాల్గొంటారు. శుక్రవారం పోలండ్ వెళ్లి మర్నాడు అధ్యక్షుడు ఆంద్రే డూడతో భేటీ అవుతారు. -
ముట్టడిలో మారియుపోల్.. నగరంలో 20 వేలకు పైగా పౌరుల మృతి?
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా ముట్టడి తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. రేవుపట్టణం మారియుపోల్‌ను ఆక్రమించే ప్రయత్నాలను రష్యా సైన్యం తీవ్రతరం చేసింది. నగరం వీడాల్సిందిగా ఉక్రెయిన్ దళాలకు సోమవారం సూచించింది. ‘‘తెల్ల జెండాలు ఎగరేసి, ఆయుధాలు వదిలి వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డవాళ్లంతా హ్యుమానిటేరియన్ కారిడార్ల గుండా సురక్షితంగా వెళ్లిపోయేలా చూస్తాం. మరుక్షణమే నగరంలోకి అత్యవసరాల సరఫరాను అనుమతిస్తాం’’ అని కల్నల్ జనరల్ మిఖాయిల్ మిజింట్సెవ్ చెప్పారు. ఉక్రెయిన్ అందుకు నిరాకరించింది. దాంతో రష్యా దళాలు రెచ్చిపోయాయి. ఎడాపెడా క్షిపణి, బాంబు దాడులతో కనీవినీ ఎరగని రీతిలో నగరంపై విరుచుకుపడుతున్నాయి. ఒక్క మారియుపోల్‌లోనే కనీసం 20 వేల మంది దాకా మరణించి ఉంటారన్న వార్తలు అందరినీ కలచివేస్తున్నాయి! దీనిపై యూరోపియన్ యూనియన్ తీవ్రంగా స్పందించింది. రష్యా తీవ్ర యుద్ధ నేరాలకు పాల్పడుతోందంటూ దుమ్మెత్తిపోసింది. మారియుపోల్‌లో వేలాదిగా పౌరులను అతి కిరాతకంగా, విచక్షణారహితంగా పొట్టన పెట్టుకుంటున్న తీరు దుర్మార్గమని ఈయూ విదేశీ విధాన చీఫ్ జోసెఫ్ బోరెల్ విమర్శించారు. ‘‘రష్యా నైతికంగా అధఃపాతాళానికి దిగజారింది. యుద్ధంలోనూ నీతీ నియమాలుంటాయని మర్చిపోయింది’’ అంటూ దుయ్యబట్టారు. రష్యా యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు సాక్ష్యాలను సేకరిస్తోంది. కీవ్... కదనరంగం: రాజధాని కీవ్‌ను ఆక్రమించే ప్రయత్నాలను రష్యా మరింత ముమ్మరం చేసింది. ఆదివారం అర్ధరాత్రి రష్యా సైన్యం జరిపిన బాంబు దాడుల్లో జనసమ్మర్ధ ప్రాంతంలోని ఓ షాపింగ్ సెంటర్ నేలమట్టమైంది. కనీసం ఎనిమిది మంది చనిపోయినట్టు సమాచారం. రాజధానిని చుట్టుముట్టి స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వీటిని ఉక్రెయిన్ సైనికులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. సమీలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో 50 టన్నుల భారీ ట్యాంక్ నుంచి అమోనియా లీకయింది. దాంతో చుట్టుపక్కల రెండున్నర కిలోమీటర్ల మేర వాతావరణం బాగా కలుషితమైనట్టు సమాచారం. తీవ్ర ప్రయత్నాల తర్వాత లీకేజీని అరికట్టారు. ఇతర నగరాలనూ సుదూరాల నుంచి క్షిపణి దాడులతో రష్యా బెంబేలెత్తిస్తోంది. ఉక్రెయిన్ దళాలు రష్యా సైన్యంపై చాటునుంచి దాడులు చేసి పారిపోతూ గెరిల్లా వ్యూహం అనుసరిస్తున్నాయి. ఆహారం తదితర అత్యవసర సరఫరాలను అడ్డుకుంటున్నాయి. రివెన్ సమీపంలో సైనిక శిక్షణ కేంద్రంపై క్షిపణులతో దాడి చేసి 80 మందికి పైగా ఉక్రెయిన్, కిరాయి సైనికులను చంపేసినట్టు రష్యా చెప్పింది. రేవు పట్టణం ఒడెసాపై దాడులను తీవ్రతరం చేయాల్సిందిగా పుతిన్ ఆదేశించారు. దాంతో రష్యా సేనలు యుద్ధ నౌకల నుంచి పౌరులపైకి కూడా క్షిపణులు ప్రయోగిస్తున్నాయి. బెనెట్‌కు థాంక్స్: జెలెన్స్కీ చర్చల కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెనెట్ చేస్తున్న ప్రయత్నాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ట్ స్కూలుపై బాంబు వేసిన పైలట్‌ను హతమార్చి తీరతామన్నారు. చర్చల్లో సానుకూల సంకేతాలు కన్పిస్తున్నాయని బెనెట్ చెప్పారు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లను రష్యా స్థానిక కోర్టు నిషేధించింది! మొరాయించిన చెర్నోబిల్ మానిటర్లు ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రంలోని రేడియేషన్ మానిటర్లు పని చేయడం లేదు! ఉక్రెయిన్ అణు నియంత్రణ సంస్థ సోమవారం ఒక ప్రకటనలో ఈ మేరకు వెల్లడించింది. ‘‘వాతావరణం క్రమంగా వేడెక్కుతున్న నేపథ్యంలో ప్లాంటు సమీపంలోని అడవులను కాపాడేందుకు అవసరమైన సంఖ్యలో అగ్నిప్రమాపక సిబ్బంది కూడా అందుబాటులో లేరు. ఫలితంగా రేడియేషన్ లీకేజీని అడ్డుకోవడం కష్టం కావచ్చు’’ అని హెచ్చరించింది. శనివారం పోలండ్‌కు బైడెన్ అత్యవసర చర్చల కోసం ఈ వారాంతంలో యూరప్ రానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ట్రిప్‌లో భాగంగా శనివారం పోలండ్‌లో కూడా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. గురువారం నాటో నేతలతో శిఖరాగ్ర భేటీలో బైడెన్ పాల్గొంటారు. తర్వాత బ్రసెల్స్ నుంచి పోలండ్ వెళ్తారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జాన్ సాకీ తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మనీ చాన్సలర్ షోల్జ్, ఇటలీ, ఇంగ్లండ్ ప్రధానులు మారియో డ్రాగీ, బోరిస్ జాన్సన్‌లతో కూడా సోమవారం బైడెన్ చర్చలు జరిపారు. -
బడిపై రష్యా బాంబుల వర్షం.. 150 మంది సేఫ్.. మిగతావారి పరిస్థితి!
మాస్కో: ఉక్రెయిన్‌లో విధ్వంసమే లక్ష్యంగా పెట్టుకున్న రష్యా నానాటికీ విచక్షణారహితంగా వ్యవహరిస్తోంది. రేవు పట్టణం మారియుపోల్‌లో కనీసం 400 మంది తలదాచుకున్న ఓ ఆర్ట్ స్కూల్‌పై ఆదివారం బాంబుల వర్షం కురిపించింది. దాడిలో స్కూలు నేలమట్టమైంది. అందులోంచి 150 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. మిగతా వారంతా శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం. మారియుపోల్‌లో 1,300 మందికి పైగా తలదాచుకున్న ఓ థియేటర్ మీద బుధవారం రష్యా బాంబులు వేయడం తెలిసిందే. మరోవైపు రష్యా సైన్యం వరుసగా రెండో రోజూ ఉక్రెయిన్‌పైకి కింజల్ హైపర్సోనిక్ క్షిపణులు ప్రయోగించింది. రేవు పట్టణం మైకోలేవ్ సమీపంలో ఇంధన డిపోను కింజల్ మిసైల్ ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ చెప్పారు. యుద్ధ నౌకల పై నుంచి కాలిబర్ క్రూయిజ్ మిసైళ్ల ప్రయోగం ద్వారా చెహిర్నివ్ సమీపంలోని నిజిన్ వద్ద ఆయుధ మరమ్మతు ప్లాంటును కూడా నేలమట్టం చేసినట్టు చెప్పారు. ఉత్తరాన ఓవ్రుచ్లోని ఉక్రెయిన్ ప్రత్యేక దళాలు, విదేశీ కిరాయి సైనికుల స్థావరంపైనా భారీగా మిసైళ్ల వర్షం కురిపించామన్నారు. మారియుపోల్‌లోకి రష్యా సైన్యాలు మరింతగా చొచ్చుకెళ్లి అన్నివైపుల నుంచీ చుట్టుముట్టాయి. ఆహారం, తాగునీరు తదితర సరఫరాలు పూర్తిగా ఆగిపోయి పౌరులు నరకయాతన పడుతున్నారు. నగరంలో ఇప్పటికే కనీసం 3000 మందికి పైగా అమాయకులు కాల్పులకు బలయ్యారని సమాచారం. దాడిలో నగరం సర్వనాశనమైందని, రూపురేఖలు సైతం కోల్పోయిందని సమాచారం. ఖర్కీవ్‌లోనూ భారీ దాడుల్లో కనీసం ఐదుగురు మరణించారని సమాచారం. 10 మానవీయ కారిడార్ల గుండా వేలాది మంది వలస బాటపట్టారు. యుద్ధంలో ఇప్పటిదాకా 15 వేలకు పైగా సైనికులను, 1,500కు పైగా యుద్ధ ట్యాంకులతో పాటు ట్రక్కులు, భారీ సాయుధ వాహనాలను రష్యా నష్టపోయిందని అంచనా. మరోవైపు, రష్యాతో లింకులున్నాయంటూ 11 పార్టీలపై జెలెన్స్కీ నిషేధం విధించారు. ఉక్రెయిన్ తన గగన తలాన్ని సమర్థంగా రక్షించుకుంటోందని ఇంగ్లండ్ అభిప్రాయపడింది. గగనతలంపై రష్యా ఇప్పటిదాకా ఆధిక్యం సాధించలేకపోయిందని చెప్పింది. తమవారి చేతుల్లో మరణించిన సైనికుల మృతదేహాలను తీసుకెళ్లే ప్రయత్నం కూడా రష్యా చేయడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ అన్నారు. పలుచోట్ల రష్యా దాడిని ఆరేడుసార్లు తిప్పికొట్టామన్నారు. ఉక్రెయిన్ను పూర్తిగా వశపరచుకుని నియంత్రించాలంటే రష్యాకు కనీసం 8 లక్షల సైన్యం కావాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంటే రష్యా తన సైన్యమంతటినీ ఉక్రెయిన్‌లోనే నియోగించాల్సి వస్తుంది. -
భారత్‌తో పాక్ పోటీ.. చివరకు ఇలా పరువు తీసుకుంది.. వీడియో వైరల్
సాక్షి , న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. పాక్ ప్రయోగించిన ఓ మిసైల్ విఫలమై సింధ్ జంషోర్ ప్రాంతంలో ఆకాశం నుంచి కింద పడిపోయినట్టు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వివరాల ప్రకారం.. కొద్ది రోజుల క్రితం భారత రక్షణ వ్యవస్థకు చెందిన ఓ క్షిపణి పొరపాటుగా పాక్ భూ భాగంలో పడిపోయింది. దీంతో మరోసారి రెండు దేశాల మధ్య వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో పాక్ క్షిపణి ప్రయోగానికి రెడీ అయ్యింది. దీంతో గురువారం ఉదయం 11 గంటలకు క్షిపణి ప్రయోగం చేపట్టాలని ప్లాన్ చేసింది. కానీ, సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగం ఓ గంట ఆలస్యమైంది. కాగా, మధ్యాహ్నం 12 గంటలకు క్షిపణి ప్రయోగం జరిగింది. ఆకాశంలోకి దూసుకెళ్లిన క్షిపణి కొన్ని సెకన్ల వ్యవధిలోనే పొగలు కక్కుతూ కిందకు పడిపోయింది. ఇదంతా కొందరు వ్యక్తులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వీడియో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ భూభాగంలో భారత క్షిపణి పడిపోవడంతో పాక్ కూడా అదే తరహాలో పోటీపడి ఈ మిసైల్‌ను ప్రయోగించినట్టు తెలుస్తోంది. కానీ, టార్గెట్‌ను చేరేలోపే ఆ క్షిపణి కిందికి పడిపోవడంతో పాక్ ఇలా పరువు తీసుకుంది. మరోవైపు.. క్షిపణి ప్రయోగం విఫలమైందన్న వార్తలను స్థానిక అధికారిక వర్గాలు ఖండించాయి. అది మిసైల్ కాదని, సైన్యం ప్రయోగించే సాధారణ మోర్టార్ అని తెలిపాయి. #Breaking: An unidentified object or SAM missile fallen from Sky in Jamshoro, Pakistan. #Jamshoro#Pakistan pic.twitter.com/1y5ZhgoUMb — Wᵒˡᵛᵉʳᶤᶰᵉ Uᵖᵈᵃᵗᵉˢ𖤐 (@W0lverineupdate) March 17, 2022 -
జనంపై బాంబుల మోత
కీవ్/వాషింగ్టన్/మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం పాశవిక దాడులు కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ సైనిక దళాలతోపాటు సామాన్య ప్రజలను కూడా వదిలిపెట్టడం లేదు. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న వారిపై క్షిపణుల మోత మోగిస్తోంది. రాజధాని కీవ్ శివార్లలోని కాలీనివ్కా, బ్రోవరీ పట్టణాలపై గురువారం క్షిపణులు ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు కార్యాలయం పేర్కొంది. కీవ్‌లో 16 అంతస్తుల ఓ అపార్ట్ మెంట్ భవనంపై రష్యా సైన్యం రాకెట్ దాడులు జరిపింది. ఒకరు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి అపార్ట్మెంట్ మొదటి అంతస్తు నుంచి 30 మందిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. మంటలను ఆర్పేశారు. ఖర్కీవ్ సమీపంలో ఉన్న మెరెఫా పట్టణంలో ఓ పాఠశాల, కమ్యూనిటీ కేంద్రంపై రష్యా దాడికి దిగింది. ఈ ఘటనలో 21 మంది మరణించారు. మరో 25 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. చెర్నీహివ్లోని ఓ హోటల్‌పై రష్యా బాంబులు ప్రయోగించడంతో ముగ్గురు పిల్లలతో సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మారియుపోల్ సిటీలో మహిళలు, చిన్నారులు ఆశ్రయం పొందుతున్న నెప్ట్యూన్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ కాంప్లెక్స్‌పైనా రష్యా సైన్యం విరుచుకుపడింది. గగనతలం నుంచి క్షిపణి దాడులు జరిపింది. ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారన్నది ఇప్పటివరకు తెలియరాలేదు. పోర్ట్ సిటీ మారియుపోల్‌లో దాదాపు 1,000 మంది తలదాచుకున్న ఓ థియేటర్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. మూడంతస్తుల ఈ థియేటర్ చాలావరకు ధ్వంసమయ్యింది. ముఖద్వారం పూర్తిగా కుప్పకూలింది. ఎంతమంది చనిపోయారన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. కొందరు గురువారం క్షేమంగా బయటపడినట్లు ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యుడు, డొనెట్స్క్ మాజీ గవర్నర్ సెర్గీ టరూటా చెప్పారు. అయితే, థియేటర్‌పై దాడి అంటూ వస్తున్న వార్తలను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. థియేటర్‌పై తాము దాడి చేయలేదని వెల్లడించింది. మారియుపోల్‌లో ఎక్కడా దాడులు జరపలేదని పేర్కొంది. తిరిగి వస్తున్న శరణార్థులు! ఉక్రెయిన్ నుంచి పొరుగుదేశాలకు శరణార్థుల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 30 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులు వలసబాట పట్టారు. ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. రైళ్ల రాక కోసం పడిగాపులు గాస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లిన వారిలో కొందరు అక్కడ ఉండలేక తిరిగి వస్తున్నట్లు ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్ గగనతలాన్ని నో–ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న ప్రతిపాదనకు మద్దతు తెలుపుతూ లిథువేనియా పార్లమెంట్ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇప్పటికే ఎస్తోనియా, స్లొవేనియా కూడా ఇలాంటి తీర్మానాన్ని ఆమోదించాయి. ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి: జెలెన్స్కీ రష్యా దండయాత్ర నుంచి మాతృదేశాన్ని కాపాడుకొనేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రపంచ దేశాల సాయం అర్థిస్తున్నారు. బుధవారం అమెరికా పార్లమెంట్‌ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన గురువారం జర్మనీ చట్టసభ సభ్యులకు మొరపెట్టుకున్నారు. జర్మనీ ఫెడరల్ పార్లమెంట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తమ దేశానికి మరింత సాయం అందించాలని కోరారు. రష్యా రాక్షసకాండ సాగిస్తోందని, వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోతున్నారని, ఇప్పటివరకు 108 మంది చిన్నారులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాపై ఆంక్షలు విధించకుండా జర్మనీ ఎందుకు వెనుకాడుతోందో చెప్పాలన్నారు. మెలిటోపోల్ మేయర్ విడుదల తమ సైన్యం వారం రోజుల క్రితం అపహరించిన ఉక్రెయిన్‌లోని మెలిటోపోల్ నగర మేయర్ ఇవాన్ ఫెడోరోవ్‌ను రష్యా విడుదల చేసింది. ఇందుకు ప్రతిఫలంగా ఉక్రెయిన్ తమ నిర్బంధంలో ఉన్న 9 మంది రష్యా సైనికులకు స్వేచ్ఛ కల్పించింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయం అధికార ప్రతినిధి డారియా జరీవ్నా ధ్రువీకరించారు. ‘నాటో’లో ఉక్రెయిన్ భాగమే: కమల ట్వీట్ నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్(నాటో)లో ఉక్రెయిన్ కూడా సభ్య దేశమేనంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ చేసిన రెండు ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి. నాటో కూటమిని రక్షించుకోవడంలో భాగంగా ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా అండగా నిలుస్తుందంటూ మొదట ఒక ట్వీట్ చేశారు. దీనిపై విమర్శలు రావడంతో తొలగించారు. గంట తర్వాత మరో ట్వీట్ చేశారు. ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని, నాటో సభ్యదేశాలను రక్షించుకుంటామని రెండో ట్వీట్లో పేర్కొన్నారు. నేడు బైడెన్, జిన్‌పింగ్ చర్చలు ఉక్రెయిన్‌లో రష్యా దాడులు, తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ శుక్రవారం చైనా అధినేత జిన్‌పింగ్‌తో చర్చించనున్నారని శ్వేతసౌధం తెలియజేసింది. అమెరికా–చైనా పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపైనా వారు చర్చిస్తారని పేర్కొంది. రష్యాకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని, ఆ దేశాన్ని ఏకాకిని చేయాలని అమెరికా, నాటో దేశాలు చైనాపై ఒత్తిడి పెంచుతున్నాయి. -
ఉక్రెయిన్‌లో రష్యా బాంబుల మోత
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా బాంబుల మోత మోగిస్తోంది. రాజధాని కీవ్ సహా పలు కీలక నగరాలపై రష్యా సైన్యం దాడులు సోమవారం మరింత పదునెక్కాయి. కీవ్‌ను ఆక్రమించేందుకు రష్యా దళాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. నగరాన్ని, శివార్లను లక్ష్యం చేసుకుని క్షిపణులు, బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దాంతో ఇర్పిన్, బుచా, హోస్టొమెల్ వంటి శివారు ప్రాంతాలు దద్దరిల్లిపోతున్నాయి. దాడుల్లో నగరంలోని ఒక పెద్ద అపార్ట్మెంట్ కూలిపోగా ప్రపంచంలోనే అతి పెద్ద రవాణా విమానాలు తయారు చేసే కీవ్‌లోని ఆంటొనోవ్ ఫ్యాక్టరీ దెబ్బ తిన్నది. ప్లాంటులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మారియుపోల్, మైకోలెయివ్, ఖర్కీవ్ సహా పలు నగరాలు దాడుల ధాటికి అల్లాడుతున్నాయి. మైకోలెయివ్, ఖర్కీవ్‌ల్లో రష్యా వైమానిక దాడుల్లో పలు నివాస భవనాలు, రివైన్ ప్రాంతంలో ఓ టీవీ టవర్ నేలమట్టమయ్యాయి. పౌర మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఒక్క మారియుపోల్‌లోనే కనీసం 2,500 మందికి పైగా యుద్ధానికి బలైనట్టు నెక్స్టా మీడియా పేర్కొంది. ఉక్రెయిన్ నుంచి వలసలు 28 లక్షలు దాటాయని ఐరాస పేర్కొంది. సంక్షోభంపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్, చైనా విదేశాంగ శాఖ సలహాదారు యాంగ్ జీచీ రోమ్‌లో చర్చలు జరిపారు. మా అంచనాలు తప్పుతున్నాయి: రష్యా యుద్ధం తాము ఆశించినట్టుగా సాగడం లేదని రష్యా తొలిసారి అంగీకరించింది. తమ సేనలు అనుకున్న దానికంటే నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయని రష్యా నేషనల్ గార్డ్స్ చీఫ్ విక్టర్ జొలొటోవ్ అన్నారు. మరోవైపు రష్యా జీఆర్యూ మిలిటరీ ఇంటలిజెన్స్ అధికారి కెప్టెన్ అలెక్సీ గుల్చక్ సోమవారం మారియుపోల్‌లో దాడుల్లో మరణించారు. దీంతో యుద్ధంలో ఇప్పటిదాకా మరణించిన రష్యా సైనికాధికారుల సంఖ్య 12కు చేరింది. ఎటూ తేల్చని నాలుగో రౌండ్ చర్చలు భీకర దాడుల మధ్యే సోమవారం రష్యా, ఉక్రెయిన్ మధ్య సోమవారం నాలుగో రౌండ్ చర్చలు జరిగాయి. గంటల తరబడి జరిగిన చర్చలు చెప్పుకోదగ్గ ఫలితమేదీ లేకుండానే ముగిశాయి. ముట్టడిలో ఉన్న నగరాలకు సాయం అందించడం తదితరాలకే చర్చలు పరిమితమైనట్టు సమాచారం. చర్చలు మంగళవారం కొనసాగనున్నాయి. శాంతి, కాల్పుల విరమణ, తక్షణం సైన్యాల ఉపసంహరణ, భద్రత హామీలను తమ ప్రధాన డిమాండ్లుగా ఉంచినట్టు ఉక్రెయిన్ చెప్పింది. చైనా సైనిక సాయం కోరిన రష్యా! ఉక్రెయిన్‌పై పట్టు సాధించేందుకు మిత్రదేశం చైనాను రష్యా సైనిక సాయం అర్థిస్తోందని అమెరికా సీనియర్ అధికారి ఒకరన్నారు. ఆయుధాలు, సైనిక సామాగ్రి కోరుతోందని వెల్లడించారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షల భయంతో చైనా ఎటూ తేల్చుకోలేకపోతోందని సమాచారం. ఇది తప్పుడు ప్రచారమని, చైనాతో పాటు రష్యా కూడా ఖండించింది. ఆహార విపత్తును ఎదుర్కొంటాం: ఐరాస చూçస్తుండగానే ఉక్రెయిన్ శ్మశానంగా మారిపోతోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆవేదన వెలిబుచ్చారు. అణు యుద్ధ ప్రమాదం వెన్నులో చలి పుట్టిస్తోందన్నారు. ప్రపంచ ఆహార భద్రతపైనా యుద్ధం పెను ప్రభావం చూపుతోందన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆహార, ఇంధన విపత్తు స్పందన కూటమిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 30 వేల సైన్యంతో నాటో విన్యాసాలు ఉక్రెయిన్‌పై రష్యా దాడితో అంతర్జాతీయంగా నానాటికీ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నాటో భారీ బల ప్రదర్శనకు దిగింది. యూరప్, ఉత్తర అమెరికా నుంచి 25కు పైగా సభ్య దేశాలకు చెందిన 30 వేల మంది సైనికులు, 200 యుద్ధ విమానాలు, 50కి పైగా యుద్ధ నౌకలతో ఉత్తర నార్వేలో సోమవారం భారీ కవాతు జరిపింది. ఇది యుద్ధానికి చాలా ముందే ఖరారైన షెడ్యూల్ అని, రష్యాకూ వీటిపై సమాచారముందని నార్వే చెప్పింది. రెండేళ్లకోసారి జరిగే ఈ విన్యాసాలు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 1న ముగియాలి. ప్రత్యక్ష చర్చలు జరపాలి: భారత్ యుద్ధం ఆగాలని ఐరాసలో భారత ప్రతినిధి ఆర్.రవీంద్ర ఆకాంక్షించారు. ఇరు దేశాలు ప్రత్యక్షంగా చర్చలు ప్రారంభించాలని కోరారు. ఆయన సోమవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్‌తో తాము సంప్రదింపులు కొనసాగిస్తామని అన్నారు. ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాలు, దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను అన్ని దేశాలు గౌరవించాలని సూచించారు. నిండు చూలాలు దుర్మరణం రష్యా దాడికి ఓ నిండు చూలాలు బలైన వైనం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. మారియుపోల్‌లో ఓ ప్రసూతి ఆస్పత్రిపై జరిగిన దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. అంబులెన్సుతో తరలిస్తుండగా నొప్పితో అల్లాడుతున్న వీడియో వైరలైంది. హుటాహుటిన మరో ఆస్పత్రికి తరలించి సిజేరియన్ చేసినా లాభం లేకపోయింది. పాప దక్కదని అర్థమయ్యాక ‘నన్ను చంపేయండి’ అంటూ ఆమె రోదించిన తీరు డాక్టర్లను కూడా కలచివేసింది. నాతో ఫైటింగ్‌కు రా పుతిన్‌కు ఎలాన్ మస్క్ చాలెంజ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనతో ద్వంద్వ యుద్ధానికి రావాలని టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ సవాలు చేశారు. ఉక్రెయిన్ను పందెంగా ఒడ్డాలంటూ ట్వీట్ చేశారు. పుతిన్‌కు వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ లేకపోవడంతో, తన సవాలుకు రష్యా అధ్యక్షుని అధికారిక అకౌంట్ ద్వారా స్పందించాలని సూచించారు. ‘‘నాతో ఫైటింగ్‌కు ఒప్పుకుంటారా?’’ అని పుతిన్‌ను ప్రశ్నించారు. అందులో పుతిన్, ఉక్రెయిన్ పేర్లను రష్యన్లో రాశారు. యుద్ధం వల్ల ఇంటర్నెట్ సేవలకు దూరమైన ఉక్రెయిన్‌కు తన స్టార్‌లింక్ కంపెనీ శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని మస్క్ అందజేయడం తెలిసిందే. -
అమెరికాకు బిగ్ షాక్.. రాయబార కార్యాలయంపై మిస్సైల్స్ దాడి
బాగ్దాద్: ఓ వైపు ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ అంతర్జాతీయంగా మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇరాక్‌లో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయంపై ఆదివారం మిస్సైల్ దాడులు జరిగాయి. ఈ దాడులతో ఒక్కసారి అగ్రరాజ్యం అలర్ట్ అయ్యింది. వివరాల ప్రకారం.. ఉత్తర ఇరాక్‌లోని ఇర్బిల్ పట్టణంలో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయ భవనం వైపు దాదాపు 12 మిస్సైల్స్ దూసుకొచ్చినట్లు అమెరికా భద్రతా వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇరాన్‌కు సమీప దేశాల నుంచి మిస్సైల్స్ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. మిస్సైల్ దాడుల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అమెరికా భద్రతా సిబ్బంది ఒకరు మీడియాకు చెప్పారు. అయితే, ఈ దాడులపై బైడెన్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఈ దాడులు ఎవరు చేశారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ దాడులను ఖండిస్తున్నట్టు ఇరాన్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. మిస్సైల్స్ దాడుల వల్ల అమెరికా రాయబార కార్యాలయం పరిసరాల్లో మాత్రమే నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే అది కొత్త భవనమని అందులో ప్రస్తుతానికి ఎవరూ ఉండటం లేదని సమాచారం. -
పాకిస్తాన్ పై భారత్ క్షిపణి ప్రయోగం... ప్రమాదవశాత్తు జరిగిందని వివరణ
Defence Ministry said Technical Malfunction: భారత్ ప్రమాదవశాత్తు పాకిస్థాన్‌పైకి క్షిపణిని ప్రయోగించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్షిపణి పాకిస్తాన్లో ల్యాండ్ అవ్వడానికి ముందు గగనతలంలో సుమారు 100 కి.మీ పైగా వేగంతో దాదాపు 40 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించిందని పేర్కొంది. సాంకేతిక లోపం కారణంగా ఈ సంఘటన జరింగిందని తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈ క్షిపణి మార్చి 9, 2022న, సాధారణ నిర్వహణ సమయంలో, సాంకేతిక లోపం కారణంగా ప్రమాదవశాత్తూ ఈ క్షిపణి పేలిందని రక్షణ శాఖ వివరణ ఇచ్చింది. అంతేకాదు భారత ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఇస్లామాబాద్‌లోని భారత్ ఛార్జ్ డి'అఫైర్స్‌ను పిలిపించి భారత్‌కి చెందిన సూపర్-సోనిక్ ఫ్లయింగ్ క్షిపణి సూరత్‌గఢ్ నుంచి పాకిస్తాన్లోకి ప్రవేశించిందని తెలిపింది. ఈ చర్యను గగనతలంలో అకారణ ఉల్లంఘనగా పేర్కొంటూ నిరసన వ్యక్తం చేసింది. అంతేకాదు ఇలాంటి చర్యల వల్ల పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అందువల్ల ఈ ఘటనపై భారత్ సత్వరమే విచారణ జరపాలని పాకిస్థాన్ కోరింది. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతం కాకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ భారత్‌ను హెచ్చరించింది. అంతేకాదు ఈ క్షిపణి పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్ చున్ను నగరం సమీపంలో సాయంత్రం 6:50 గంటల సమయంలో కూలిందని తెలిపింది. దీని వలన పౌర ఆస్తులకు నష్టం వాటిల్లిందని కూడా పేర్కొంది. (చదవండి: ఉగ్రవాదుల ఏరివేత.. జమ్ముకశ్మీర్‌లో హైఅలర్ట్) -
ఉక్రెయిన్‌లో అదే విధ్వంసం
కీవ్: ఉక్రెయిన్‌పై దాడులను రష్యా మరింత తీవ్రతరం చేస్తోంది. దేశంలోని పలు నగరాలు, పట్టణాలపై ఆదివారం మరింత భారీ స్థాయిలో క్షిపణి, బాంబు దాడులకు దిగింది. సెంట్రల్ ఉక్రెయిన్‌లోని వినిటిసా నగరంలో విమానాశ్రయం రష్యా క్షిపణి దాడుల్లో ధ్వంసమైంది. కాల్పుల విరమణకు రెండు రోజుల వ్యవధిలో రెండోసారి రష్యా తూట్లు పొడిచింది. రేవు పట్టణం మారియుపోల్, వోల్నోవఖా నగరాల నుంచి పౌరులు సురక్షితంగా తరలిపోయేందుకు వీలుగా కొద్ది గంటలు కాల్పులు ఆపుతామని ప్రకటించి, కాసేపటికే భారీ కాల్పులతో వాటిపైకి విరుచుకుపడింది. శనివారం కూడా రష్యా ఇలాగే మాటిచ్చి తప్పడం తెలిసిందే. కీవ్‌కు ఉత్తరాన ఉన్న చెర్నిహివ్‌లో 500 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత శక్తిమంతమైన ఎఫ్ఏబీ–500 బాంబులను జనావాసాలపై రష్యా ప్రయోగించింది. దుర్భేద్యమైన కట్టడాలను పేల్చేసేందుకు సైనిక, పారిశ్రామిక లక్ష్యాలపై మాత్రమే వీటిని ప్రయోగిస్తుంటారు. ఖర్కీవ్‌లో అణు పదార్థాలు, రియాక్టర్ ఉన్న ఓ పరిశోధన సంస్థపై కూడా రష్యా రాకెట్లు ప్రయోగించినట్టు ఉక్రెయిన్ పేర్కొంది. దాడుల్లో వాటికేమైనా అయితే భారీ వినాశనం తప్పదని ఆందోళన వెలిబుచ్చింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య సోమవారం మూడో రౌండ్ చర్చలు జరగవచ్చని తెలుస్తోంది. యుద్ధం నేపథ్యంలో కనీసావసరాలు తీరక విపరీతమైన చలి, ఆహారం, తాగునీటి కొరతతో ఉక్రెయిన్‌వాసులు అల్లాడుతున్నారు. కీవ్ సమీపంలోని ఇర్పిన్ వద్ద వేలాది మంది పొట్ట చేతపట్టుకుని పోలండ్, రొమేనియా, మాల్డోవా వైపు వెళ్లిపోతూ కన్పించా రు. వీరిలో పలువురు రష్యా తూటాలకు బలయ్యారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది! ముప్పేట దాడిలో నగరాలు మరోవైపు ఖర్కీవ్, చెర్నిహివ్తో పాటు కీవ్, మికోలేవ్, సమీ తదితర నగరాలను కూడా రష్యా సైన్యం పూర్తిగా చుట్టుముట్టి ముప్పేట దాడులు చేస్తోంది. వీటిని ఉక్రెయిన్ సైనికులు శాయశక్తులా అడ్డుకుంటున్నారు. కీవ్ పరిసరాల్లో కందకాలు తవ్వి, నానా వస్తువులతో రోడ్లను బ్లాక్ చేసి రష్యా సేనలను నిలువరిస్తున్నారు. అయినా నగరంపైకి రష్యా క్షిపణులు, బాంబులు నిరంతరం వచ్చి పడుతూనే ఉన్నాయి. పరిసర ప్రాంతాలు, గ్రామాలపై కూడా భారీగా దాడులు కొనసాగుతున్నాయి. ఏ క్షణమైనా భారీ దాడి జరగవచ్చనే భయాల మధ్య జనం భారీగా రాజధాని వదిలి వెళ్లిపోతున్నారు. అయితే కీవ్ ముట్టడి కోసం కొద్ది రోజుల క్రితం బయల్దేరిన 64 కిలోమీటర్ల పొడవైన రష్యా పటాలం ఇప్పటికీ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయి ఉందని సమాచారం. ఆదివారం మరో రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసిట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. దేశంలోని అతి పెద్ద రేవు పట్టణమైన ఒడెసాలో కూడా రష్యా దళాలను ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ప్రతి నగరంలోనూ రష్యా సేనలపై దాడికి దిగాలని పౌరులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పిలుపునిచ్చారు. వారిపై వీధి పోరాటాలకు దిగాలని సూచించారు. భారీగా సైన్యాలు దూసుకొస్తున్నా ప్రజలు ఉక్రెయిన్ సైనికులతో కలిసి వారిని ఎదుర్కొంటున్న తీరును ఎంత పొగిడినా తక్కువేనన్నారు. స్టార్‌లింక్ సిస్టమ్ ద్వారా తమ దేశానికి ఇంటర్నెట్ సేవలు అందిస్తూ రష్యా దుర్మార్గాన్ని బయటి ప్రపంచానికి చూపించేందుకు తోడ్పడుతున్న స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ...అప్పటిదాకా పోరే: పుతిన్ ప్రస్తుత పరిస్థితికి ఉక్రెయినే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. తమ డిమాండ్లకు ఉక్రెయిన్ అంగీకరించే దాకా యుద్ధం కొనసాగి తీరుతుందన్నారు. తీరు మారకపోతే ఉక్రెయిన్ స్వతంత్ర దేశ హోదా ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఆదివారం టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ పుతిన్‌తో గంటకు పైగా జరిగిన ఫోన్ చర్చల్లో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలపైనా పుతిన్ మరోసారి మండిపడ్డారు. అవి తమపై యుద్ధం ప్రకటించడమేనన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెనెట్ ఆకస్మికంగా రష్యా వెళ్లి పుతిన్‌తో మూడు గంటల పాటు చర్చలు జరిపారు. తర్వాత జెలెన్స్కీతో కూడా ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్‌కు అమెరికా ఫైటర్ జెట్లు? ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల మద్దతు కొనసాగుతూనే ఉంది. ఆయుధాలు, యుద్ధ పరికరాలతో పాటు సహాయ సామగ్రి దాకా భారీగా అందుతోంది. తమకు ఫైటర్ జెట్లు అందజేయాలన్న జెలెన్స్కీ విజ్ఞప్తిపై అమెరికా సానుకూలంగా స్పందిస్తోంది. ఈ విషయమై పోలండ్‌తో మాట్లాడుతున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. ఉక్రెయిన్‌లో మరో అణు విద్యుత్కేంద్రాన్ని కూడా ఆక్రమించేందుకు రష్యా సేనలు ప్రయత్నిస్తున్నట్టు జెలెన్స్కీ ఆరోపించారు. వెంటనే ఉక్రెయిన్ను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని నాటోకు మరోసారి విజ్ఞప్తి చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ నుంచి 15 లక్షల మంది వలస బెర్లిన్: ఉక్రెయిన్ నుంచి ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకొని 15 లక్షల మంది వలస వెళ్లినట్టుగా ఐక్యరాజ్య సమితి శరణార్థ సంస్థ వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అత్యంత వేగంగా పెరిగిపోతున్న వలసల సంక్షోభం ఇదేనని తెలిపింది. మీడియాపై రష్యా ఉక్కుపాదం మాస్కో: ఉక్రెయిన్‌పై దాడితో సొంత దేశంలో వెల్లువెత్తుతున్న నిరసన గళాల్ని రష్యాలో పుతిన్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తోంది. స్వతంత్రంగా వ్యవహరించే మీడియాపై ఉక్కుపాదం మోపుతోంది. న్యూస్ వెబ్సైట్లను బ్లాక్ చేస్తోంది. యుద్ధానికి వ్యతిరేకంగా ఎవరైనా నిరసన తెలిపితే అరెస్ట్ చేస్తోంది. ఆదివారం పలు స్వతంత్ర ఆన్లైన్ న్యూస్ వెబ్ సైట్లను రష్యా ప్రభుత్వం బ్లాక్ చేసింది. మరికొన్ని మీడియా సంస్థలపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి మూత పడేలా చేసింది. అలాంటి సంస్థల్లో అమెరికా నిధులతో నడుస్తున్న రేడియో ఫ్రీ యూరప్ కూడా ఉంది. బెలారస్ ఉప రక్షణ మంత్రి రాజీనామా కీవ్: బెలారస్ ఉప రక్షణ మంత్రి మేజర్ జనరల్ విక్టర్ గులేవిచ్ తన పదవికి రాజీనామా చేశారు. ఉక్రెయిన్ దురాక్రమణలో పాలుపంచుకోవడం ఇష్టంలేక పదవిని వీడుతున్నట్లు తెలిపారు. తన రాజీనామాను రక్షణమంత్రి కార్యాలయానికి పంపినట్లు తెలిపారు. రష్యా బలగాలను తమ సరిహద్దుల్లో మోహరించడానికి అనుమతించినవారిలో గులేవిచ్ కూడా ఉన్నారు. ఆయనపై యూకే పలు ఆర్థిక ఆంక్షలు విధించింది. -
ఉక్రెయిన్-రష్యా యుద్ధం: విడిచి వెళ్లాలా? వద్దా?
న్యూఢిల్లీ: నగరం విడిచి, దేశ సరిహద్దులకు వెళ్దామంటే దాడుల భయం.. ఎప్పుడు ఏ క్షిపణి దాడికి బలైపోతామో తెలియదు. ఇక్కడే ఉందామంటే తినడానికి తిండిలేదు, తాగడానికి నీరులేదు. పైగా రక్తం గడ్డ కట్టించే చలి పులి భయపెడుతోంది. ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో తలదాచుకుంటున్న భారతీయుల దీనస్థితి ఇది. ఉండాలో వెళ్లిపోవాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. సుమీపై రష్యా దాడులు ఉధృతమవుతున్నాయి. క్షిపణుల వర్షం కురిపిస్తోంది. జనం అండర్‌గ్రౌండ్ స్టేషన్లలో, బంకర్లలో ఉం టూ బిక్కుబిక్కుమంటూ భారంగా కాలం గడుపుతున్నారు. బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేదని చెబుతున్నారు. మరోవైపు ఆహారం డొక్కలు ఎండిపోతున్నాయి. ప్రాణాలు దక్కాలంటే తిండి కావాలి. ఎలాగోలా సరిహద్దులకు చేరుకుంటే తప్ప తిండి దొరకదు. కానీ, భీకర యుద్ధం సాగుతున్న ఇలాంటి పరిస్థితుల్లో అనవసరంగా రిస్క్ చేయొద్దని భారత విదేశాంగ శాఖ సూచించింది. సుమీలో దాదాపు 700 మంది భారత విద్యార్థులు ఉన్నారు. వారిని బయటకు తరలించడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. విద్యార్థులు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నారు. మంచు కరిగించి, నీటిగా మార్చి తాగుతున్నామని వారు చెప్పారు. ఇంకా ఇక్కడే ఉండలేమని, తమను వెంటనే రక్షించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. నేడు భారత్‌కు 2,200 మంది రాక! ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి ఆదివారం 13 విమానాలు భారత్‌కు రానున్నాయని, వీటిలో 2,200 మంది భారతీయులు స్వదేశానికి చేరుకుంటారని పౌర విమానయాన శాఖ తెలియజేసింది. శనివారం 15 విమానాల్లో 3,000 మందిని భారత్‌కు తీసుకొచ్చినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. వీటిలో 12 ప్రత్యేక పౌర విమానాలు, 3 భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విమానాలు ఉన్నాయని వెల్లడించింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా, స్పైస్‌జెట్ సంస్థలు పౌర విమానాలను పంపిస్తుండగా, ఐఏఎఫ్ సి–7 సైనిక రవాణా విమానాలను ఉక్రెయిన్ పొరుగు దేశాలైన హంగేరి, రొమేనియా, స్లొవేకియా, పోలండ్‌కు పంపిస్తోంది. (చదవండి: పుతిన్ సైన్యం వీళ్లే!) -
అగ్నికీలల్లో ఉక్రెయిన్ అణుప్లాంట్.. పేలితే పెనువిషాదమే!
రష్యా వైమానిక దాడుల్లో యూరప్‌లోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ జాపోరిజ్జియా అగ్నికీలల్లో చిక్కుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా అధికారికంగా ప్రకటించారు. ఉక్రెయిన్‌కు ఆగ్నేయం వైపు నైపర్ నదీ తీరాన ఉంది జాపోరిజ్జియా పారిశ్రామిక నగరం. ఇక్కడే యూరప్‌లోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్‌ను నెలకొల్పారు. భారత కాలమానం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి దాటాక రష్యా దళాలు ఈ ప్లాంట్‌పై రాకెట్ లాంఛర్లతో దాడికి తెగబడ్డాయి. నలువైపులా దాడులు చేయడంతో.. ప్లాంట్ మంటల్లో చిక్కుకుంది. Russian RPG attack on #Zaporizhzhia nuclear power plant #UkraineRussianWar #Ukriane ⚠️⚠️🚨🚨⚠️🚨🚨🌎🚀🇺🇦 pic.twitter.com/EPz6nH4Ug8 — UKRAİNİAN 💎 (@donetekk) March 4, 2022 ఉక్రెయిన్‌కు దాదాపు 40 శాతం అణు విద్యుత్ ఈ స్టేషన్ నుంచే సరఫరా అవుతోంది. ఇప్పటికే చెర్నోబిల్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా.. ఇప్పుడు ఉక్రెయిన్‌లోని అణు ప్లాంట్లను టార్గెట్ చేసింది. జాపోరిజ్జియా గనుక పేలిందంటే.. చెర్నోబిల్ విషాదం(1986లో జరిగిన పెను విషాదం) కంటే ఘోరంగా డ్యామేజ్ ఉంటుందని, రేడియేషన్ ఎఫెక్ట్ చెర్నోబిల్ కంటే పదిరెట్లు ఎక్కువ ప్రభావం చూపెడుతుందని కుబేలా ప్రకటించారు. రష్యన్లు వెంటనే దాడుల్ని ఆపివేయాలి, అగ్నిమాపక సిబ్బందిని అనుమతించాలి, ఆ ప్రాంతాన్ని సేఫ్ జోన్‌గా ఏర్పాటు చేయాల్సిందే అని ట్వీట్ చేశారు కుబేలా. #Ukraine tells IAEA that fire at site of #Zaporizhzhia Nuclear Power Plant has not affected “essential” equipment, plant personnel taking mitigatory actions. — IAEA - International Atomic Energy Agency (@iaeaorg) March 4, 2022 మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్న సమయంలోనూ రష్యా దాడులు కొనసాగినట్లు సమాచారం. అయితే జాపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ ప్రదేశంలో జరిగిన అగ్నిప్రమాదం.. కీలకమైన విభాగాల్ని ప్రభావితం చేయలేదని, ప్లాంట్ సిబ్బంది ఉపశమన చర్యలు తీసుకుంటున్నారని ఉక్రెయిన్ ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి (IAEA) వెల్లడించింది. ఈ దాడులపై అమెరికా, ఉక్రెయిన్ను ఆరా తీసింది. మరోవైపు ఉక్రెయిన్ సహా పాశ్చాత్య దేశాలు న్యూక్లియర్ ప్లాంట్లపై దాడుల్ని చేయొద్దంటూ రష్యాను కోరుతున్నాయి. -
కిమ్ వార్నింగ్.. మిస్సైల్ ప్రయోగించి టెన్షన్ పెట్టిన నార్త్ కొరియా
ప్యాంగ్యాంగ్: ఉక్రెయిన్-రష్యా సంక్షోభంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న తరుణంలో ఉత్తర కొరియా మరింత ఉద్రిక్తతను పెంచింది. మరోసారి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి అందరినీ కలవరపాటుకు గురి చేశాడు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. కొన్ని నెలలుగా ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ఆదివారం మరో బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించింది. ఈ మేరకు దక్షిణ కొరియా, జపాన్ సైనిక అధికారులు క్షిపణి ప్రయోగం జరిగినట్టు వెల్లడించారు. జపాన్ సముద్రంలోకి ఈ మిస్సైల్‌ను ప్రయోగించినట్లు వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. అమెరికా తమ దేశంపై ద్వేషాన్ని పెంచుకున్న కారణంగానే తాము ఈ క్షిపణి పరీక్షలను జరుపుతున్నట్టు ఉత్తర కొరియా అంతకు ముందు ప్రకటించింది. అయితే, నార్త్ కొరియాకు చైనా మిత్ర దేశంలో కావడంతో అక్కడ(చైనాలో) వింటర్ ఒలంపిక్స్ ప్రారంభమైన తర్వాత ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలను నిలిపివేసింది. ఇటీవలే ఒలంపిక్స్ ముగియడంతో మళ్లీ పరీక్షలను ప్రారంభించినట్టు తెలుస్తోంది. మరోవైపు గత నెలలో కిమ్ ప్రభుత్వం ఏడు రౌండ్ల క్షిపణి ప్రయోగాలు చేపట్టి అమెరికాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. -
రక్తంతో తడిసిన ముఖం!..నా మాతృభూమి కోసం ఏమైనా చేస్తా!
Russian missile attack: ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలో నివశిస్తున్న ఉపాధ్యాయురాలు ఒలేనా కురిలో ఇంటిపై రష్యా క్షిపిణి దాడి చేసింది. ఈ దాడిలో ఆమె రక్తంతో తడిచిన ముఖంతో ప్రాణాలతో బయటపడింది. అంతేకాదు రక్తంతో తడిసిన తన ముఖం తన దేశంపై దాడికి ప్రతీకగా ఉంటుందని ఆమె ఊహించి ఉండుండరు. ఈ మేరకు ఫిబ్రవరి 24న ప్రత్యేక సైనిక చర్యలో భాగంగా వ్లాదిమర్ పుతిన్ ఉక్రెయిన్‌లోకి ప్రవేశించాలని తన దళాలకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రష్యా బలగాలు భూ, వాయు, జల మార్గాలలో వైమానిక క్షిపణి దాడులతో ఉక్రెయిన్ పై విరుచుకు పడుతున్నాయి. ఇందులో భాగంగానే రష్యా దళాలు ఖార్కివ్ ప్రాంతంలోని చుగెవ్తో సహా అనేక ఉక్రెయిన్ నగరాలపై బాంబుల వర్షం కురిపించాయి. అయితే చుగేవ్లో నివశిస్తున్న ఒలేనా కురిలో ఉపాధ్యాయురాలి ఇంటిపై కూడా క్షిపిణి దాడి జరిగింది. ఈ మేరకు ఆ దాడి నుంచి రక్తపు ముఖంతో బయటపడిన ఆ మహిళ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఆమె మాత్రం అంత బాధలోనూ తన మాతృభూమి కోసం ఏమైనా చేస్తానని చెప్పడం విశేషం. అంతేకాదు ఉక్రెయిన్ పై రష్యా ఈ విధంగా దాడి చేస్తుందని తాను కలలో కూడా అనుకోలేదని ఆవేదనగా చెబుతోంది. తనకు ఉన్నంత శక్తి మేర తన దేశం కోసం ఏమైన చేస్తానని కూడా చెప్పింది. అయితే ఈ ఘటన ఉక్రెయిన్ రాజధాని నగరానికి సుమారు 30 కి.మీ దూరంలో జరిగి ఉండవచ్చని బ్రిటిష్ రక్షణ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. మరోవైపు వందల సంఖ్యలో రష్యా దళాలు కైవ్‌కు చేరుకుంటున్నాయి. అయినప్పటికీ ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, మిలియన్ల మంది పౌరులు తమ రాజధాని నగరాన్ని ఏవిధంగానైనా కాపాడుకోవాలని ధృఢంగా నిర్ణయించుకున్నారు. (చదవండి: తాను సైతం అంటూ... ఆయుధం చేత బట్టిన ఉక్రెయిన్ మహిళా ఎంపీ!) -
మాట తప్పిన రష్యా.. జనావాసాలపై క్షిపణి దాడి
ఉక్రెయిన్‌పై రష్యా బలగాల మిస్సైల్స్ దాడి కొనసాగుతోంది. ఉక్రెయన్ రాజధాని నగరంలో కీవ్‌లోని ఓ భారీ అపార్ట్‌మెంట్‌పై రష్యా మిస్సైల్ దాడి చేసింది. ఈ దాడిలో సుమారు ఐదు ఫ్లోర్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అపార్ట్మెంట్ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలిపాయి. బాధితుల సంఖ్య పెరుగుతోందని వెల్లడించాయి. ప్రస్తుతం ఈ వీడియో షోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొదటి నుంచి ఉక్రెయిన్‌లోని సైనిక స్థావరాలే తమ టార్గెట్ అంటూ చెప్పుకొస్తున్న రష్యా.. జనావాసాల మీద కూడా బాంబులతో విరుచుకుపడుతోంది. రాజధాని నగరం కీవ్‌లోని ఓ భారీ భవనంపై రష్యా సైన్యం క్షిపణి ప్రయోగించిందని కీవ్ మేయర్ విటాలీ క్లిట్ష్కో తెలిపారు. రాత్రి పూట రష్యా దళాలు.. దాడులకు దిగడంతో కీవ్‌లో భయనక పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. కీవ్‌లోకి ప్రవేశించడానికి రష్యా సైన్యం అన్ని దిశలను నుంచి దాడులు చేస్తూ వస్తోందన్నారు. దెబ్బతిన్న అపార్ట్మెంట్ ఫొటోను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ట్విటర్లో పోస్ట్ చేశారు. శాంతియుతమైన కీవ్ నగరం.. రష్యా బలగాలు క్షిపణుల దాడులతో అట్టుడుకుతోందని అన్నారు. రష్యా ప్రయోగించిన మిస్సైల్ ఒకటి కీవ్‌లోని అపార్ట్‌మెంట్‌ను ఢీకొట్టిందని తెలిపారు. అంతర్జాతీయ సమాజం రష్యాపై తీవ్రమైన ఆంక్షలు విధించాలని ఆయన కోరారు. Kyiv, our splendid, peaceful city, survived another night under attacks by Russian ground forces, missiles. One of them has hit a residential apartment in Kyiv. I demand the world: fully isolate Russia, expel ambassadors, oil embargo, ruin its economy. Stop Russian war criminals! pic.twitter.com/c3ia46Ctjq — Dmytro Kuleba (@DmytroKuleba) February 26, 2022 WATCH: Video shows the moment a high-rise building in Kyiv is hit by a missile pic.twitter.com/adrd6LSfIL — BNO News (@BNONews) February 26, 2022 Russia attacks and kills civilians in Ukraine. Our army continues to defend our territory and every civilian. 🇺🇦 resists and strives for peace. The world must stop Russian war criminals.#StandWithUkraine! 📍Kyiv, Residential Area, building near Maternity Hospital and Schools. pic.twitter.com/JGNUQUGulX — MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) February 26, 2022 -
శత్రు ట్యాంకులను ఎలా ధ్వంసం చేస్తామంటే!
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లోని తైవాంగ్ సెక్టార్లో భారత్ ఆర్మీకి చెందిన యాంటీ ట్యాంక్ స్క్వాడ్ బృందం శత్రు ట్యాంకులను ఎలా దాడి చేసి నాశనం చేయాలో పైరింగ్ డెమో చేసి చూపిస్తుంది. అంతేకాకుండా అక్కడ పర్వతాలపై దట్టమైన మంచు వ్యాపించి ఉన్న సమయంలో క్షిపిణి ఫైరింగ్ ఏవిధంగా చేయాలో, పర్వత శిఖరంపై శత్రు లక్ష్యాన్ని ఎలా చేధించాలో చేసి చూపిస్తోంది. ఈ క్రమంలో భారీగా సాయుధ బలగాలు పర్వత శిఖరంపై బంకర్ల స్థానాల్లో మోహరించినట్లు కనిపిస్తారు. (చదవండి: మొసలిని తిప్పితిప్పి తుక్కుతుక్కు చేసింది..!) అంతేకాదు రహదారిపై శత్రువుల కదిలికలను మంచు కారణంగా సరిగా కనిపించడం లేదన్న ఆ విషయాన్ని కమాండర్‌కి తెలియజేస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ సైనికులు బంకర్ వద్దకు చేరుకుని క్షణాల్లో యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి(ఏటీజీఎం) ఏర్పాటు చేయడం. తదనంతరం కొండపై ఉన్న మిగతా ఆర్మీ సిబ్బంది సహాయంతో సమాచారం తెలుసుకుంటూ కాల్పులు జరుపుతారు. ఈ క్రమంలో ఒక సైనికుడు ఏటీజీఎం సిస్టమ్‌ని అన్ ఇన్స్టాల్ చేసి ఏ విధంగా ఫైరింగ్ పోజిషన్ తీసుకుంటూ శత్రువులపై కాల్పులు జరపాలో కూడా వివరిస్తుంటాడు. ఈ మేరకు అధికారులు అరుణాచల్ ప్రదేశ్‌లోని తైవాంగ్ సెక్టార్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వెంట పర్వతాలలో అప్‌గ్రేడ్ చేసిన ఎల్70 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్, ఎం-777 హోవిట్జర్లు, స్వీడిష్ బోఫోర్స్ గన్లతో భారత్ సైన్యం మోహరించి ఉదని తెలిపారు. అంతేకాదు తూర్పు లడఖ్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో భారత సైన్యం తన ఫైర్ పవర్‌ను పెంచడమే లక్ష్యంగా ఈ డెమో నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు భారత సైన్యం క్షిపిణి పైరింగ్ డెమోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మీరు కూడా ఆ దృశ్యాలను వీక్షించండి.. (చదవండి: 900 ఏళ్ల నాటి పురాతన కత్తి) #WATCH Indian Army soldiers demonstrate battle drill to destroy enemy tanks in the Tawang sector near the Line of Actual Control (LAC) #ArunachalPradesh pic.twitter.com/3XYvYjB1hY — ANI (@ANI) October 21, 2021 -
చైనా కావరం.. అణు బాంబులేస్తామని బెదిరింపులు
డ్రాగన్ కంట్రీ మరోసారి తన తలపొగరును ప్రదర్శించింది. సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటే న్యూక్లియర్ వార్ తప్పదని జపాన్ను గట్టిగానే హెచ్చరించింది. ఈ మేరకు ఏకంగా కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక ఛానెల్ ఓ వీడియోను ప్రసారం చేసింది. తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే గనుక ఊరుకునేది లేదని చెబుతూ.. అవసరమైతే అణు ఆయుధాలు ప్రయోగిస్తామని జపాన్ను హెచ్చరించింది చైనా. ‘‘తైవాన్ విషయంలో కలుగజేసుకున్నందుకు జపాన్‌పై మేం బాంబులు వేస్తాం. ఆ తర్వాత లొంగిపోయామని జపాన్ మమ్మల్ని బతిమాలుకునేదాకా రెండోసారి బాంబులేస్తాం. తైవాన్ విముక్తి మా చేతుల్లో ఉన్న అంశం. జపాన్ జోక్యం సహించే ప్రసక్తే లేదు. జపాన్‌కు సంబంధించి ఒక్క యుద్ధ విమానం, ఒక్క సైనికుడు తైవాన్ సరిహద్దులో కనిపించినా ఆ దేశాన్ని(జపాన్) నామరూపాల్లేకుండా సర్వనాశం చేస్తామని’ని ఆ వీడియోలో కొందరు సైనికులు మాట్లాడినట్లు ఉంది. #CCP Vows to Nuke #Japan if Japan defends #Taiwan. As Japan is the only country that has been nuked, so nuking Japan "will get twice the result with half the effort." 中共軍事頻道威脅對日本實施連續核打擊,直到日本第二次無條件投降。 pic.twitter.com/dp45R2LXtD — Jennifer Zeng 曾錚 (@jenniferatntd) July 13, 2021 పైగా చైనా అధికారిక ఛానెల్ సీసీపీకి సంబంధించిన ఓ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోనే ఈ వీడియో ప్రదర్శితం కావడం విశేషం. అయితే 2 మిలియన్ల వ్యూస్ తర్వాత ఆ వీడియోను ఛానెల్ డిలీట్ చేయగా.. యూట్యూబ్, ట్విటర్లో మాత్రం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తైవాన్ సార్వభౌమాధికారం-సౌభ్రాతృత్వం కాపాడేందుకు తాము ముందు ఉంటామని జపాన్ రెండు వారాల కిందట ప్రకటన చేసింది. బయటి శక్తులు తైవాన్‌పై ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తే.. అండగా నిలబడతామని జపాన్ డిప్యూటీ పీఎం తారో అసో ప్రకటించారు కూడా. ఈ పరిణామాల నేపథ్యంలో మిలిటరీ ఫ్యాన్ బాయ్స్ పేరిట చైనా నుంచి ఈ వీడియో రిలీజ్ అయ్యింది. -
పొంచివున్న చైనా కొత్త ముప్పు
చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో 119 అధునాతనమైన భూగర్భ క్షిపణి వేదికల ప్రయోగ కేంద్రాలను చైనా నిర్మిస్తున్నట్లు మోంటెరీలోని జేమ్స్ మార్టిన్ అణుపరీక్షల నిషేధ అధ్యయన సంస్థకు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. చైనా నిర్మిస్తున్న అత్యధునాతనమైన డీఎఫ్–41 అనే పేరున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల నిల్వ కేంద్రాలుగా ఈ నిర్మాణాలను ఉపయోగించవచ్చు. ఈ క్షిపణుల పరిధి 15,000 కిలోమీటర్లు. ప్రపంచంలో ఏ ప్రాంతాన్నయినా ఇవి ధ్వంసం చేయగలవు. ఇప్పటికే ఉనికిలో ఉన్న అణ్వాయుధాల వ్యవస్థలో భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా, ఆమెరికా అణ్వాయుధ ఆధిక్యతను ఎదుర్కోవాలనే ప్రయత్నంలో భాగంగా చైనా ఈ భూగర్భ క్షిపణి ప్రయోగ కేంద్రాలను నిర్మిస్తున్నట్లు అంచనా. ఈ పరిణామాలన్నింటినీ మూడు కారణాల వల్ల భారత ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంది. మొదటగా, అమెరికా, చైనా మధ్య పోటీ... అంతర్జాతీయ రాజకీయాల్లో అణ్వాయుధాల పాత్రకు అత్యంత ప్రాధాన్యత కలిగించనుంది. అణ్వాయుధాలు దేశాల మధ్య యుద్ధం విషయంలో మహా సమానత (ఈక్విలైజర్)ను ఏర్పర్చేవని చెబుతుంటారు. ఎందుకంటే శక్తిలేని దేశాల చేతికి చిన్నస్థాయి అణ్వాయుధం వచ్చినా సరే.. బలమైన శత్రుదేశాలను అది అడ్డుకోగలదు. భారతగడ్డపై అతిపెద్ద సంప్రదాయ ఆయుధాలతో దాడులు జరిపించిన తర్వాత కూడా భారత్ నుంచి భారీ ప్రతీకార దాడులతో దెబ్బతినకుండా పాకిస్తాన్‌ను కాపాడింది.. అది సేకరించి పెట్టుకున్న అణ్వాయుధాలేనని చెప్పాలి. భారత్, చైనా వివాదాల్లో అణ్వాయుధాల ప్రభావం తక్కువే కానీ, భారత్ కూడా అణ్వాయుధాలను సాధించినప్పటినుంచి, చైనా 1962 నాటి సైనిక విజయాలను ఇకపై కొనసాగిస్తుందని ఊహించడానికి కూడా సాధ్యం కాకుండా పోయింది. అణ్వాయుధాలు చిన్నస్థాయి విజయాలు తెచ్చిపెడతాయనే అంశాన్ని తోసిపుచ్చలేం. అయితే బాలిస్టిక్ క్షిపణులలో అత్యంత కచ్చితత్వం విషయంలో సాధించిన విప్లవం కానీ, ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో రిజల్యూషన్ పెరగడం, అత్యంత తక్కువ ధ్వనితో ప్రయాణించే జలాంతర్గాములను కనుగొనడంలో సాధించిన నైపుణ్యం కానీ, అణ్వాయుధాలను సాధించడంద్వారా శక్తిహీనమైన దేశాలు పొందిన ఈ మహా సమానత అవకాశాన్ని తోసిపుచ్చాయి. అమెరికా వంటి సాంకేతికంగా సంపన్న దేశాలు ఇప్పుడు తమ ప్రత్యర్థి దేశాల అణ్వాయుధ శక్తులను సులభంగా కనుగొనేలా తమ ఉపగ్రహాలను ఉపయోగించగలవు. అంతేకాకుండా కఠినతరమైన ఆయుధ షెల్టర్లను కూడా ధ్వంసం చేసే అత్యంత నిర్దిష్టమైన క్షిపణులను ఇవి ప్రయోగించగలవు. అమెరికా సాంకేతిక ఆధిపత్యం ముందు తాను నిలబడలేనని చైనా గుర్తించిన తర్వాతే అనేక ప్రతిఘటనా వ్యవస్థల నిర్మాణం వైపు చైనా పురోగమించింది. భూగర్భ క్షిపణి ప్రయోగ కేంద్రాలు కూడా దాంట్లో భాగమే. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్, చైనాకు వ్యతిరేకంగా భారత్ కూడా ఈ కోవలోనే సాగే అవకాశం ఉంది. చైనా అణ్వాయుధాల దుర్భేద్యం అనేది భారత్‌కి శుభసూచకం కాకపోవచ్చు. ఎందుకంటే, చైనా అణ్వాయుధాలు అమెరికా రక్షణకే ప్రమాదం అనుకున్నప్పుడు, దాంతో పోలిస్తే భారత్‌కు మరీ ప్రమాదకరం. భారతీయ జలాంతర్గాములను నిర్మూలించ డానికి హిందూ మహాసముద్రంపై అణ్వాయుధాలతో కూడిన జలాంతర్గాములను మోహరించే లక్ష్యంతో.. అధునాతన కౌంటర్ ఫోర్స్ ప్లాట్‌ఫామ్‌లపై పెట్టుబడి పెట్టాలని చైనా నిర్ణయించుకుంటే అది భారత్‌కు నిజంగా ప్రమాదకరమే. శత్రుదాడులనుంచి తట్టుకోగల అణ్వాయుధ శక్తిని చైనా మోహరించగలదా లేదా అనే అంశంపై నిపుణులకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులపై పెట్టుబడి పెట్టిన చైనాకు పూర్తి రక్షణతో కూడిన అణ్వాయుధ శక్తిని నిర్మించుకునే సామర్థ్యం ఉంటుందని కొందరు అణ్వాయుధ నిపుణులు చెబుతుండగా, మరికొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఒక్క స్పష్టమైన దాడితో చైనావద్ద ఉన్న దీర్ఘ శ్రేణి క్షిపణులను తుడిచిపెట్టగలనని అమెరికా నమ్ముతున్నట్లయితే, అవసరమైతే ఆ దేశం అంత పనీ చేయగలుగుతుంది. ప్రత్యేకించి అమెరికా నగరాలను ధ్వంసం చేయగల అణ్వాయుధాన్ని మొట్టమొదటగా చైనా ప్రయోగించే ప్రమాదం ఉందని అమెరికా భావిస్తోంది. చైనాపై భారీస్థాయి అణుదాడికి పూనుకోవాలని అమెరికా నిర్ణయించి ఒకమేరకు ఆ ప్రయత్నంలో విజయం సాధించిన పక్షంలో, చైనా వద్ద మిగిలి ఉన్న మధ్య, స్వల్ప శ్రేణి క్షిపణులు అమెరికాతోపాటు జపాన్, దక్షిణ కొరియా, భారత్ వంటి దాని వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలను కూడా చేరుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అమెరికా ప్రత్యర్థులు దీర్ఘ శ్రేణి క్షిపణులను సేకరించి పెట్టుకున్న ప్పుడు, అణ్వాయుధాల ప్రయోగం నుంచి తన మిత్రదేశాలకు అమెరికా కల్పించే రక్షణ ఛత్రం బలహీనపడిపోతుందని కొందరు వాదిస్తున్నారు. ఎందుకంటే అమెరికా ప్రభుత్వం తన మిత్రదేశాలకు అనుకూలంగా జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకుంటే, దాని ప్రత్యర్థులు నేరుగా అమెరికా భూభాగంపైనే దాడికి దిగే అవకాశం ఉంది. అణ్వాయుధాల ప్రయోగం నుంచి బయటపడే పద్ధతి కొన్ని అంశాలతో ముడిపడి ఉంటుంది. అమెరికాకు చెందిన క్షిపణి రక్షణ వ్యవస్థల, ఎదురుదాడి ప్రమాదంతో చైనా వ్యవహరించాల్సి వచ్చినప్పుడు భూగర్భ క్షిపణి వ్యవస్థలను నిర్మించతలపెట్టడం కాస్త ఆశ్చర్యం కలిగించకమానదు. ఒకే చోట స్థిరంగా ఉంచిన ఈ తరహా క్షిపణులను రాడార్ ఉపగ్రహాలను ఉపయోగించి రాత్రింబవళ్లు పర్యవేక్షించవచ్చు. బహుశా అమెరికా అణ్వాయుధ దాడిని సంక్లిష్టం చేయడానికి తన భూగర్భ క్షిపణి వ్యవస్థలను చైనా అటూఇటూ తరలించే ప్రయత్నం చేయవచ్చు లేక వీటిలో కొన్నింటిని డమ్మీలుగా ఉపయోగించవచ్చు. ఒకే సమయంలో అసలు క్షిపణి వ్యవస్థలను, వీటిని కూడా ఉపయోగించవచ్చు. తీవ్రస్థాయిలో ఎదురుదాడి సామర్థ్యం కలిగిన బలమైన ప్రత్యర్థులతో ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయి అనే విషయంలో చైనా ఒక ఉదాహరణగా నిలుస్తోంది. భారత్ వద్ద ఉన్న ఎదురుదాడి క్షిపణి వ్యవస్థలను పాకిస్తాన్ ఎదుర్కొవలసి వస్తున్నప్పటికీ భూగర్భ క్షిపణి వ్యవస్థల విషయంలో చైనా అనుసరిస్తున్న పద్ధతిని పాక్ పాటించకపోవచ్చు. ఎందుకంటే చైనా లాగా కాకుండా, పాక్ సైన్యం అణ్వాయుధాలపై అధికంగా నియంత్రణ కలిగి వుంది. పైగా అమెరికాతో ఘర్షించే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయని చైనా గ్రహిస్తున్నందువల్లే భూగర్భ క్షిపణి వ్యవస్థల నిర్మాణం దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇదే భారత్‌పై, దాని విదేశాంగ విధానంపై అనేక ప్రభావాలను కలిగిస్తోంది. చైనా ఇంతకుముందు కూడా భూగర్భ క్షిపణి వ్యవస్థలను కలిగి ఉండేది కానీ ఇంత పెద్ద స్థాయిలో నిర్మించటం గతంలో ఎన్నడూ లేదు. ఈ నూతన పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలించాల్సి ఉంది. ఎందుకంటే అణ్వాయుధాల భవిష్యత్తు మొదలుకుని, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో యుద్ధం జరిగి అవకాశం వరకు అన్నింటిపై వీటి ప్రభావం తప్పక ఉంటుంది. కునాల్ సింగ్, పీహెచ్డీ స్కాలర్ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -
సొంత నౌకను పేల్చేసిన ఇరాన్
టెహ్రాన్: నావికాదళాలు విన్యాసాలు చేస్తున్న సమయంలో ఇరాన్ పొరపాటున తన స్వంత నౌకను పేల్చేసింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శిక్షణలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం పర్షియన్ గల్ఫ్ జలాల ప్రాంతంలో ఇరాన్ యుద్ధ నౌక జమరాన్ క్షిపణిని ప్రయోగించింది. ఆ క్షిపణి సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న కొనరాక్ అనే నౌకను పొరపాటున టార్గెట్ చేసి పేల్చేసింది. ఈ దాడిలో గాయపడిన సిబ్బందిని సిస్తాన్, బలూచిస్తాన్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు ఫ్రావిన్స్ మెడికల్ యూనివర్సిటీ వైద్యుడు మహమ్మద్ మెహ్రాన్ తెలిపారు. (ఆ విమానాన్ని మా రెండు క్షిపణులు కూల్చాయి: ఇరాన్ ) అయితే ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో ఎంతమంది సిబ్బంది ఉన్నారనేది స్పష్టంగా తెలియరాలేదు. కాగా నెదర్లాండ్స్ తయారు చేసిన కొనరాక్ నౌకను 1979 సంవత్సరం కన్నా ముందే ఇరాన్ కొనుగోలు చేసింది. ఆ నాటి నుంచి దీని సేవలను వినియోగించుకుంటోంది. ఇదిలా వుండగా ఈ ఏడాది తొలినాళ్లలో టెహ్రాన్ సమీపంలో ఉక్రెయిన్‌కు చెందిన ఎయిర్ లైన్స్ విమానాన్ని సైతం ఇరాన్ పొరపాటున పేల్చేసిన సంగతి తెలిసిందే. ఇక అమెరికా నౌకలకు అడ్డు తగిలితే ఇరాన్ నౌకలను కాల్చి పారేయాలంటూ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలివ్వగా ఇరాన్ తన సొంత నౌకపైనే క్షిపణి ప్రయోగించింది. (కాల్చిపారేయండి: ట్రంప్ వార్నింగ్) -
వైరల్ : విమానాన్ని కూల్చిన ఇరాన్ మిస్సైల్..!
టెహ్రాన్ : ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వెళ్తున్న ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ 737 విమాన ప్రమాదంపై సంచలన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అగ్రరాజ్యం అమెరికా- ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న వేళ.. విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై అమెరికా, కెనడా, ఉక్రెయిన్‌తో పాటు పలు అగ్ర దేశాలు తొలినుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. విమానంపై ఇరాన్‌కు చెందిన టోర్ మిస్సైల్ దాడి చేసిందని ఆరోపిస్తున్నాయి. కానీ ఆ దేశాల ఆరోపణలు ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ వస్తోంది. అయితే ఈ సమయంలో విమానంపై క్షిపణి దాడి చేసినట్లు ఉన్న ఈ వీడియో బయటపడింది. క్షిపణి దాడి తర్వాతే విమానం కుప్పకూలినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ ఆ వీడియో ప్రామాణికతపై పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. (మీరే కూల్చారు... సమాచారం ఇవ్వండి!) వీడియోలో మిస్సైల్ ఢీ కొట్టినట్టు కనిపిస్తున్నప్పటికీ అది ఉక్రేయిన్ విమానమని నిర్థారణకు రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ క్షిపణి దాడివల్లే తమ విమానం కూలిపోయి ఉంటుందని ఉక్రెయిన్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇరాన్ జనరల్ ఖాసిం సులేమాని మృతికి ప్రతీకారంగా ఇరాన్.. ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు ప్రయోగించిన క్రమంలో ఉక్రెయిన్ విమానం కుప్పకూలిందని అభిప్రాయపడుతోంది. దీనిపై ఆ దేశ జాతీయ భద్రత సంఘం కార్యదర్శి ఒలెక్సీ డానిలోవ్ మీడియాతో మాట్లాడుతూ.. విమాన ప్రమాదంపై క్షిపణి దాడి సహా అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నామన్నారు. విమానం కూలిపోయిన ప్రాంతానికి సమీపంలో ఈ క్షిపణుల ఆనవాళ్లు దొరికాయని పలువురు చెప్పినట్లు ఆయన తెలిపారు. బోయింగ్ ఎయిర్‌లైనర్‌ను ఇరాన్ కూల్చివేసిందని తమకు ఇప్పటికే పలు ఇంటలెజిన్స్ నివేదికలు అందాయన్నని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. టెహ్రాన్ నుంచి బయల్దేరగానే విమానం కుప్పకూలడం వెనుక ఇరాన్ దాడుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇక బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలను సమర్థించారు. ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కూల్చకపోయినా.. దాడుల్లో భాగంగానే ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు మరోవైపు ప్రమాద స్థలిలో దొరికిన బ్లాక్ బాక్స్‌లను తయారీ కంపెనీ బోయింగ్ సంస్థకు కానీ, అమెరికాకి కానీ ఇచ్చేదిలేదని ఇరాన్ ఇదివరకే తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తాజా వీడియోపై ఉక్రేయిన్, కెనడా ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వీడియో నిజమని తేలితే ఇరాన్‌కు కొంచె ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
కూలిన విమానం
టెహ్రాన్: అగ్రరాజ్యం అమెరికాతో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఇరాన్లో ఓ విమానం కుప్పకూలింది. ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన పౌర విమానం టెహ్రాన్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన రెండు నిమిషాలకే కూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 176 మంది మృతి చెందారు. బోయింగ్ 737 విమానం టెహ్రాన్ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వెళ్లాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. విమాన ప్రమాదంలో మృతి చెందినవారిలో ఇరాన్, కెనడా దేశస్తులే అత్యధికంగా ఉన్నారు. ఇరాన్‌కి చెందినవారు 82 మంది, కెనడా దేశస్తులు 63 మంది ఉన్నారు. ప్రయాణికుల్లో 15 మంది చిన్నారులు కూడా ఉన్నారు. రెండు నిమిషాల్లోనే రాడార్ నుంచి అదృశ్యం ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు (యూఐఏ) చెందిన పీఎస్ 752 విమానం టెహ్రాన్ విమానాశ్రయంనుంచి ఉదయం 6:10 గంటలకి టేకాఫ్ అయింది. ఆ తర్వాత రెండు నిమిషాలకే రాడార్‌తో సంకేతాలు తెగిపోయాయి. టెహ్రాన్ విమానాశ్రయానికి వాయవ్య దిశగా 45 కి.మీ. దూరంలో షారియార్లోని పంట పొలాల్లో విమాన శిథిలాలు కనిపించినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది. విమానంలో ప్రయాణిస్తున్న 176 మందిలో ఎవరూ జీవించే అవకాశమే లేదు. ఇరాన్ మీడియా ప్రసారం చేసిన వీడియోలో విమానం కూలిన ప్రాంతంలో మంటలు, దట్టమైన పొగ అలము కొని ఉన్నాయి. సహాయ సిబ్బంది మృతదేహాలను, ప్రయాణికుల వస్తువులను మోసుకొస్తున్న దృశ్యాలు అందరి హృదయాల్ని కలిచివేశాయి. కూలిపోయిందా ? కూల్చేశారా ? ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈ విమానాన్ని కూల్చివేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇరాన్ దేశానికి చెందిన క్షిపణి పొరపాటున విమానాన్ని కూల్చేసిందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలైంది. విమానం ప్రమాదవశాత్తూ కూలిపోకుండా, వేరే ఏదైనా కుట్ర కోణం ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ జెలెంస్కీ హెచ్చరించారు. సందేహాలు ► ఇరాక్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసిన కొద్ది సేపటికే విమానం ప్రమాదానికి గురైంది. ఇరాన్ క్షిపణులకి పొరపాటున తగలడం వల్లే విమానం ప్రమాదానికి గురైందన్న అనుమానాలున్నాయి. ► బోయింగ్ 737 విమానం 2016లో తయారు చేశారు. ప్రమాదానికి గురైన రెండు రోజుల ముందే దానిని తనిఖీ చేశారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చెందిన ఈ ఎయిర్‌లైన్స్ విమానం ప్రమాదానికి గురికావడం ఇదే మొదటి సారి. విమానం పూర్తిగా పనిచేసే సామర్థ్యంలోనే ఉందని యూఐఏ అధ్యక్షుడు యెవగనీ వెల్లడించారు. తాము నడిపే విమానాల్లో ఇదే అత్యుత్తమమైనదనీ కన్నీళ్ల మధ్య చెప్పారు. ► విమానం కుప్పకూలాక మంటల్లో చిక్కుకుం దని ఇరాన్ మీడియా వెల్లడించింది. కానీ గాల్లోనే విమానం మంటల్లో చిక్కుకున్నట్టుగా ప్రమాద దృశ్యాల్లో కనిపిస్తోంది. ► విమానంలో టిక్కెట్ బుక్ చేసుకొని ఆఖరి నిముషంలో ఇద్దరు ప్రయాణికులు రద్దు చేసుకున్నారని ఉక్రెయిన్ జాతీయ భద్రతా మండలి చీఫ్ ఒలెక్సీ డేనిలవ్ అంటున్నారు. ► ప్రమాద స్థలిలో దొరికిన బ్లాక్ బాక్స్‌లను తయారీ కంపెనీ బోయింగ్ సంస్థకు కానీ, అమెరికాకి కానీ ఇరాన్ ఇంకా ఇవ్వలేదు. విమాన ప్రమాదంపై విచారణ ఏ దేశం చేస్తుందో స్పష్టత లేదని అందుకే ఇవ్వలేదని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. ► ఈ విమాన ప్రమాదంలో మానవ తప్పిదం ఉన్నట్టుగా తాము భావించడం లేదని బోయింగ్ సంస్థ చెబుతోంది. అంతకు ముందు ఇరాన్లో ఉక్రెయిన్ దౌత్యకార్యాలయం తన వెబ్సైట్లో ఈ ప్రమాదం వెనుక ఎవరి హస్తం లేదని, ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే ఇంజిన్ వ్యవస్థ పనిచేయకపోవడమే కారణమని భావిస్తున్నట్టు వెల్లడించింది. -
ఆ క్యాంప్‌ల కహానీ
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఇరాక్‌లో అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణి దాడులకు దిగామంటూ ఇరాన్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. అగ్రరాజ్యం ముఖం మీద చెంపదెబ్బకొట్టినట్టుగా రెండు స్థావరాలపై దాడి చేశామని ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేని వ్యాఖ్యానించడంతో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఇరాన్ లక్ష్యంగా చేసుకున్న అమెరికా స్థావరాలేవి? ఎందుకు వాటికంత ప్రాధాన్యత ? అల్ అసద్ స్థావరం పశ్చిమ బాగ్దాద్‌కు 100 మైళ్ల దూరంలో ఎడారి మధ్యలో 1980 సంవత్సరంలో ఇరాక్ మిలటరీ ఈ వైమానిక స్థావరాన్ని నిర్మించింది. ఇరాకీయుల విముక్తి కోసం 2003లో వచ్చిన అమెరికా సైన్యానికి అదే అతి పెద్ద సైనిక స్థావరంగా మారింది. ఈ స్థావరంలో సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చాయి. చిన్న టౌన్ మాదిరిగా అమెరికా ఈ స్థావరాన్ని తీర్చిదిద్దింది. 2009–10లో అమెరికా సైన్యం వెనక్కి వెళ్లాక తిరిగి ఇరాక్ స్వాధీనంలోకి వచ్చింది. అరబ్ దేశాల్లో ఐసిస్ ఉగ్రవాదుల్ని నియంత్రించడానికి 2014లో అమెరికా బలగాలు తిరిగి ఇరాక్‌కి వచ్చాయి. సిరియా, ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదుల్ని నియంత్రించడంలో ఈ స్థావరమే కీలక పాత్ర పోషించింది. గత రెండేళ్లలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఇద్దరూ ఆకస్మికంగా ఈ స్థావరాన్ని సందర్శించారు. ఇర్బిల్ స్థావరం కుర్దిస్తాన్ ప్రాంతంలో ఇర్బిల్ స్థావరం ఉంది. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఏరివేతకు అమెరికా ఈ స్థావరాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుంది. 2018 క్రిస్మస్ సెలవుల్లో ట్రంప్ అనూహ్యంగా ఇరాక్‌కు వచ్చి ఈ స్థావరాన్ని సందర్శించారు. డెల్టా ఫోర్స్ కమాండోలు ఈ స్థావరాన్నే ప్రధాన కేంద్రంగా చేసుకొని నిర్వహించిన ఆపరేషన్‌లో గత ఏడాది అక్టోబర్‌లో ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబు బకర్ అల్ బాగ్దాది హతమయ్యాడు. అమెరికా బలగాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్ని అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ నుంచే వీక్షించారు. 2015లో ఐసిస్ తీవ్రవాదులు పలుమార్లు ఈ స్థావరాన్నే లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగారు. 13 దేశాలకు చెందిన సంకీర్ణ బలగాలు, ఇతర సిబ్బంది ఇక్కడ ఉన్నారు. ఇరాక్‌లో మొత్తం అమెరికా బలగాలు: 6,000 అల్ అసద్ స్థావరంలో అగ్రరాజ్యం సైనికులు: 1,500 ఇర్బిల్ స్థావరంలో బలగాలు: 3,000 జనరల్ సులేమానీ హత్య తర్వాత ఇరాక్ పార్లమెంటు అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోవాలంటూ తీర్మానించింది. కానీ అల్ అసద్ స్థావరాన్ని ఆధునికంగా తీర్చిదిద్దడానికి అమెరికా వందల కోట్ల డాలర్లు ఖర్చు చేసిందని, వాటిని తిరిగి చెల్లించే వరకు ఇరాక్ నుంచి కదిలే ప్రసక్తే లేదని ట్రంప్ అంటున్నారు. -
ఇరాన్ క్షిపణుల వర్షం అమెరికా శాంతి మంత్రం
టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్–అమెరికాల మధ్య ఉద్రిక్తతలు బుధవారం కీలక మలుపు తీసుకున్నాయి. ఒకవైపు, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మంగళవారం రాత్రి క్షిపణుల వర్షం కురిపించగా, మరోవైపు, అమెరికా అనూహ్యంగా శాంతి మంత్రం జపించింది. ఇరాన్ క్షిపణి దాడిలో తమ సైనికులెవరూ చనిపోలేదని, తమ మిలటరీ స్థావరాలకు కొంత నష్టం మాత్రం వాటిల్లిందని బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. శాంతిని కోరుకునే అందరితో శాంతియుత సంబంధాలనే కోరుకుంటామన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థను నిర్మూలించేందుకు కలసిరావాలని ఇరాన్‌ను కోరారు. దీంతో, తీవ్ర స్థాయికి చేరిన ఉద్రిక్తతలు కొంతమేరకు చల్లబడ్డాయి. అమెరికా సైనికులు, సంకీర్ణ దళాలు ఉన్న అల్ అసద్, ఇర్బిల్ మిలటరీ స్థావరాలపై ఇరాన్ డజనుకు పైగా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో 80 మంది అమెరికా సైనికులు చనిపోయారని ప్రకటించింది. ఈ దాడి అమెరికాకు చెంపపెట్టులాంటిదని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించారు. ‘అమెరికాకు భయపడి వెనక్కువెళ్లబోం’ అని ఈ దాడి ద్వారా స్పష్టం చేశామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక జనరల్ సులేమానీని అమెరికా చంపినందుకు ప్రతీకారంగానే ఈ క్షిపణి దాడి జరిగిందని ఇరాన్ అధికార టీవీ ప్రకటించింది. ‘ఈ దాడుల్లో అమెరికాకు చెందిన 80 టెర్రరిస్ట్ సైనికులు హతమయ్యారు’ అని వ్యాఖ్యానించింది. ‘అమెరికా సైనికులు ఉన్న రెండు స్థావరాలపై 22 క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడిలో ఇరాకీ సైనికులకు గాయాలు కాలేదు’ అని ఇరాక్ మిలటరీ ప్రకటించింది. ‘నేరానికి పాల్పడితే.. తగిన జవాబు సిద్ధంగా ఉంటుందని ఆమెరికాకు తెలియాలి’ అని హసన్ రౌహానీ పేర్కొన్నారు. ‘వారు తెలివైన వారైతే.. ఈ పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకోరు’ అని అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భయాందోళనలకు తెర ఇరాన్ క్షిపణి దాడులపై అమెరికా ఎలా స్పందిస్తుందన్న ఉత్కంఠ, మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేవనుందనే ఊహాగానాల మధ్య బుధవారం ట్రంప్ అమెరికా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘శాంతిని కోరుకునే అందరితో అమెరికా సామరస్యపూర్వక సంబంధాలనే కోరుకుంటుంది’ అని ఇరాన్ నాయకత్వానికి, ప్రజలకు స్పష్టం చేశారు. ‘ఇరాన్ ప్రజలు, ఆ దేశ నాయకులు కోరుకున్న భవిష్యత్తు, గొప్ప భవిష్యత్తు లభించాలనే మేమూ కోరుకుంటున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో, ఇరాన్‌ను అణ్వాయుధ దేశంగా మారనివ్వబోనని ప్రతినబూనారు. ‘నేను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంతవరకు ఇరాన్ అణ్వాయుధ దేశం కాబోదు’ అన్నారు. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని తక్షణమే విడనాడాలన్నారు. ప్రస్తుతం ఇరాన్‌తో ప్రపంచ దేశాలు మరింత సమర్ధవంతమైన అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉందన్నారు. సులేమానీని క్రూరుడైన ఉగ్రవాదిగా ట్రంప్ మరోసారి అభివర్ణించారు. అమెరికా, ఇరాన్ రక్తంతో సులేమానీ చేతులు తడిచాయన్న ట్రంప్.. అతడిని అంతమొందించడం ద్వారా ఉగ్రవాదులకు కఠిన సందేశమిచ్చామన్నారు. ఉగ్ర సంస్థ ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీని అంతమొందించడం వల్ల ఇరాన్‌కు మంచి జరిగిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇరాన్‌పై తక్షణమే మరిన్ని ఆర్థిక ఆంక్షలను విధించనున్నామని ప్రకటించారు. ఇరాన్ తన తీరును మార్చుకునే వరకూ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇరాన్ దాడి చేసిన సైనిక కేంద్రాల్లోని తమ సైనికులంతా క్షేమంగా ఉన్నారని ట్రంప్ తెలిపారు. ఇరాన్ దాడులకు తెగబడే అవకాశముందన్న సమాచారం నేపథ్యంలో ఇరాక్‌లో తమ దళాలున్న అన్ని మిలటరీ స్థావరాల్లో తగిన ముందు జాగ్రత్తలు తీసుకున్నామని అమెరికా మిలటరీ కేంద్రం పెంటగన్ అధికార ప్రతినిధి జొనాథన్ హాఫ్మన్ తెలిపారు. తమ దళాలు, మిత్ర పక్షాల సంకీర్ణ దళాల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరోవైపు, ట్రంప్ బుధవారం ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానికి ఫోన్ చేసి ఇరాన్ – ఇరాక్ పరిస్థితిపై చర్చించారు. జర్మనీ చాన్సెలర్ మెర్కెల్‌తో ఉద్రిక్త పరిస్థితిపై ట్రంప్ చర్చించారు. చావుదెబ్బ తీస్తాం: ఇజ్రాయెల్ మాపై దాడికి దిగితే చావుదెబ్బ తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తమ బద్ధ శత్రువు ఇరాన్‌ను హెచ్చరించారు. సులేమానీని హతమార్చినందుకు అమెరికాకు అభినందనలు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్లో ఘర్షణల్లో అమెరికాకు తమ సంపూర్ణ మద్దతుంటుందన్నారు. ఇజ్రాయెల్ నగరాలను నేలమట్టం చేస్తామని ఇటీవల ఇరాన్ మిలటరీ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో నెతన్యాహూ పై వ్యాఖ్యలు చేశారు. ఇరాక్ వెళ్లకండి న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరాక్ వెళ్లాలనుకునే పర్యాటకులకు భారత్ పర్యాటక సూచన జారీ చేసింది. ‘అంతగా అవసరం లేని ప్రయాణమైతే రద్దు చేసుకోండి’ అని ఇరాక్ వెళ్లే భారత ప్రయాణీకులకు భారత విదేశాంగ శాఖ సూచించింది. ఇరాక్‌లోని భారతీయులు సైతం జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలు అస్సలు చేయవద్దని సూచించింది. శాంతికి భారత్ కృషి చేయాలి ఇరాన్–అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ తీసుకునే ఎలాంటి శాంతి చర్యలనైనా ఇరాన్ స్వాగతిస్తుందని భారత్‌లో ఆ దేశ రాయబారి అలీ చెగెనీ పేర్కొన్నారు. ఇరాన్–అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగబోవని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. సులేమానీకి నివాళులర్పించేందుకు ఇరాన్ ఎంబసీలో బుధవారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. -
యుద్ధ మేఘాలు
-
ఎప్పుడో చంపేయాల్సింది
వాషింగ్టన్/బాగ్దాద్/టెహ్రాన్: ఇరాన్లో అత్యంత శక్తిమంతమైన నాయకుడు, ఆ దేశ రివల్యూషనరీ గార్డ్ కమాండర్ జనరల్ ఖాసీం సులేమాని అమెరికా జరిపిన దాడుల్లో మృతి చెందారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున సులేమాని ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై గగనతలం నుంచి డ్రోన్ల సాయంతో క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సులేమానితోపాటు ఇరాక్‌కు చెందిన హషద్ అల్ షాబి పారామిలటరీ బలగాల డిప్యూటీ చీఫ్, ఇరాన్‌కు మద్దతుగా వ్యవహరించే కొందరు స్థానిక మిలిమెంట్లు మరణించినట్టు బాగ్దాద్ మీడియా వెల్లడించింది. లెబనాన్ లేదంటే సిరియా నుంచి బాగ్దాద్‌కు వచ్చినట్టుగా భావిస్తున్న సులేమాని విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి రెండు కార్లలో తన సన్నిహితులతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. ఇరాక్‌లో అమెరికా సిబ్బంది రక్షణ కోసమే తాము వైమానిక దాడులకు దిగామని పెంటగాన్ ప్రకటించింది. ఈ దాడుల్లో సులేమాని మరణించారని ధ్రువీకరించింది. ఎప్పుడో చంపేయాల్సింది: ట్రంప్ విదేశాల్లో నిఘా కార్యకలాపాలు నిర్వహించే ఇరాన్ అల్ ఖుద్స్ చీఫ్ జనరల్ సులేమానిని కొన్నేళ్ల క్రితమే చంపేయాల్సి ఉండేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాక్‌తో పాటు మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాల్లో అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులకి, వేలాది మంది అమెరికన్ సిబ్బంది మృతికి సులేమాని కారకుడని ధ్వజమెత్తారు. ఈ మధ్యకాలంలో ఇరాక్‌లో అమెరికా దౌత్యకార్యాలయం దగ్గర జరిగిన దాడుల వెనుక సులేమాని హస్తం ఉందని అన్నారు. అమెరికా రాయబారులు ఇతర అధికారులు, సైనికులపై మరిన్ని దాడులకు సులేమాని వ్యూహాలు పన్నుతున్నారని ఆరోపించారు. సులేమాని మృతి వార్త తెలిసిన వెంటనే అధ్యక్షుడు ట్రంప్ అమెరికా జాతీయ జెండా ఇమేజ్‌ని తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. కొద్ది గంటల తర్వాత మరో ట్వీట్లో ‘‘ఇరాన్ ఎప్పుడూ యుద్ధం గెలవలేదు. అలాగే సంప్రదింపుల్ని ఎప్పుడూ వదులుకోలేదు’’అని పేర్కొన్నారు. 2018లో అమెరికా ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నప్పట్నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడితో మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతలు చెలరేగాయి. అమెరికాలో ట్రంప్‌పై అవిశ్వాసం ప్రబలుతోన్న సందర్భంలో ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఈ దాడులకి దిగారన్న విమర్శలు ఉన్నాయి. ఇరాక్ నుంచి వెనక్కి రండి ఇరాక్‌లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే వెనక్కి తిరిగి రావాలని అమెరికా విదేశాంగ శాఖ పిలుపునిచ్చింది. ఇరాన్ మద్దతున్న మిలిటెంట్లు అమెరికా దౌత్యకార్యాలయం దగ్గర జరిపిన దాడులతో ఎంబసీలో కార్యకలాపాలు నిలిపివేశామని, పౌరులెవరూ అక్కడికి వెళ్లవద్దని ట్వీట్ చేసింది. ఈ పరిణామాలతో మధ్య ప్రాచ్యానికి అమెరికా మరో 3,500 మంది బలగాలను తరలించింది. ఇరాకీల సంబరాలు బాగ్దాద్‌లో జరిగిన దాడుల్లో జనరల్ సులేమాని మృతి చెందడంతో ఇరాక్‌లో ప్రభుత్వ వ్యతిరేకులు సంబరాలు చేసుకున్నారు. మరో యుద్ధం భరించలేం: ఐరాస గల్ఫ్‌లో మరో యుద్ధాన్ని ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్ వ్యాఖ్యానించారు. సులేమాని మృతి చెందడంతో అమెరికా, ఇరాన్‌ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యుటెరస్ పై విధంగా స్పందించారు. ఎవరీ ఖాసీం సులేమాని? 1955లో ఇరాన్లో ఒక నిరుపేద రైతు కుటుంబంలో సులేమాని జన్మించారు. మొదట్లో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేశారు. 1979లోఇరాన్ విప్లవం సమయంలో రివ్యల్యూషనరీ గార్డ్‌లో చేరారు. 1980లో ఇరాన్, ఇరాక్ యుద్ధంలో పాల్గొని ధైర్యసాహసాలు కలిగిన కమాండర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌లో కీలకమైన నిఘా విభాగం అయిన ఖుద్స్ ఫోర్స్‌కి 1998 సంవత్సరం నుంచి సులేమాని మేజర్ జనరల్‌గా ఉన్నారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాబల్యాన్ని పెంచడానికి, దానిని బలమైన దేశంగా నిలపడానికి చాలా ఏళ్లుగా శ్రమిస్తున్నారు. సులేమాని విదేశాల్లో కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించడంలో దిట్ట. సమయానుకూలంగా మిత్రపక్షాల్ని మార్చేయడంలోనూ, చుట్టుపక్కల ముస్లిం దేశాల్లో షియా అనుకూల ప్రభుత్వ ఏర్పాట్లలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్‌పై పోరాటంలోనూ సులేమాని ప్రధాన పాత్ర పోషించారు. ఇరాన్ సరిహద్దులు దాటి జరిగే దాడులన్నింటి వెనుక వ్యూహ ప్రతివ్యూహాలు ఆయనే రచిస్తారు. ఇరాన్ సుప్రీం నాయకుడు అయోతల్లా ఖామినేయీ తర్వాత దేశంలో అంతటి శక్తిమంతుడిగా అల్–ఖుద్స్ బలగాల చీఫ్ అయిన జనరల్ సులేమానికి పేరుంది. ఇరాన్ ప్రజలు ఆయనని ఆరాధ్య దైవంగా కొలుస్తారు. 2017లో టైమ్ మ్యాగజైన్ ఆయనని అత్యంత ప్రభావశీలుర జాబితాలో చేర్చింది.జేమ్స్ బాండ్, ఎర్విన్ రోమెల్, లేడీ గాగా ఒక రూపంలోకి వస్తే అదే సులేమాని అంటూ కీర్తించింది. అయితే ఎన్నో దేశాల్లో మిలటరీ దాడుల వ్యూహకర్త అయిన సులేమానిని అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్ సులేమాని చంపేసినందుకు అమెరికాపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయోతొల్లా అలీ ఖమేనియా హెచ్చరించారు. ఇస్మాయిల్ ఖానీని సులేమాని స్థానంలో ఖుద్స్ బలగాల చీఫ్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇరాన్ గుండెకు గాయం చేసిన వారిని విడిచిపెట్టమని తమకు సహకరించే దేశాలతో కలిసి బదులు తీర్చుకుంటామని అధ్యక్షుడు హసన్ రౌహని హెచ్చరించారు. -
‘ఇప్పుడే పాకిస్తాన్ వదిలి పారిపోండి’
ఇస్లామాబాద్: కశ్మీర్ విషయంలో భారత్‌కు అండగా నిలిచే దేశాలపై క్షిపణులు ప్రయోగిస్తామని పాకిస్తాన్ కశ్మీర్ వ్యవహారాల మంత్రి అలీ అమిన్ గందపర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. భారత్‌తో తమ దేశం కచ్చితంగా యుద్ధానికి దిగుతుందని, క్షిపణులతో దాడి చేస్తామని అలీ అమిన్ అన్నారు. ఈ విషయంలో తమకు కాకుండా భారత్‌కు మద్దతుగా నిలిచే దేశాలపై కూడా క్షిపణులు ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఈ వీడియోను పాకిస్తాన్ జర్నలిస్టు నైలా ఇనాయత్ ట్వీట్ చేయడంతో నెటిజనులు కామెంట్లు, ఫొటోలతో సెటైర్లు వేశారు. ‘గుడ్ జోక్’ అంటూ అలీ అమిన్ వ్యాఖ్యలపై ట్విటర్లో కామెంట్లు వచ్చాయి. ఆయన అణ్వాయుధాల గురించి మాట్లాడుతున్నారా లేక స్వీట్ల గురించా మరొకరు ఆట పట్టించారు. అల్లాటప్పాగా పేల్చడానికి క్షిపణులు ఏమైనా దీపావళి టపాసులు అనుకుంటున్నారా అని ఇంకొరు చురక అంటించారు. యుద్ధం మొదలైతే ఎక్కడ తలదాచుకుంటారు? ముందుగానే పాకిస్తాన్ విడిచి పారిపోండి అంటూ సలహా కూడా ఇచ్చారు. యుద్ధమంటే ఆయనకు ఆటలా ఉందని వ్యాఖ్యానించారు. బుల్లి మిస్సైల్స్ ఫొటో పెట్టి.. ‘ఇవేనా మీరు ప్రయోగించేవి పావ్ కిలో వాలే’ అంటూ కామెంట్ చేశారు. పాకిస్తాన్ నుంచి ఒక్క క్షిపణి వస్తే 10 క్షిపణులతో బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. (చదవండి: భారత్, ఆ దేశాలపై మిసైల్ వేస్తాం: పాక్) -
భారత్‌పై క్షిపణితో దాడి చేస్తాం: పాక్
ఇస్లామాబాద్ : దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి దుందుడుకు బుద్ధిని ప్రదర్శించింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కయ్యానికి కాలు దువ్వింది. కశ్మీర్ అంశంలో భారత్‌తో పాటు భారత్‌కు మద్దతుగా నిలిచిన దేశాలన్నింటిపై క్షిపణి దాడి చేస్తామని పాక్ కశ్మీర్ వ్యవహారాల మంత్రి అలీ అమిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రదాడి, పాకిస్తాన్‌లోని జైషే ఉగ్ర క్యాంపులపై భారత వైమానిక దళ మెరుపు దాడుల నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇక జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను భారత కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన క్రమంలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ అంశంలో భారత్ తీరును తీవ్రంగా విమర్శించిన పాక్.. అంతర్జాతీయ సమాజంలో భారత్‌ను దోషిగా నిలబెట్టాలని చూసింది. అయితే ఇది తమ అంతర్గత విషయమని భారత్ తేల్చిచెప్పడంతో పాక్ మిత్రదేశం చైనా సహా ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, ఫ్రాన్స్, యూకే తదితర దేశాలు భారత్‌కు అండగా నిలిచాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన అలీ అమిన్... ‘కశ్మీర్ విషయంలో భారత్‌తో ఉద్రిక్తతలు తీవ్రమైన క్రమంలో పాకిస్తాన్ తప్పక యుద్ధానికి దిగుతుంది. భారత్‌పై క్షిపణి దాడులతో విరుచుకుపడతాం. అంతేకాదు ఈ విషయంలో మాకు కాకుండా భారత్‌కు మద్దతుగా నిలిచిన దేశాలపై కూడా క్షిపణి దాడులు చేస్తాం. ఇకపై వారిని ఎల్లప్పుడూ పాకిస్తాన్ శత్రువులుగానే భావిస్తాం’ అంటూ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను పాక్ జర్నలిస్టు నైలా ఇనాయత్ ట్వీట్ చేయడంతో అలీ అమిన్ విద్వేషపూరిత ప్రసంగం వెలుగులోకి వచ్చింది. ఇక కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సమాజం నుంచి తమకు మద్దతు రాకపోవడంతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఇదే తరహా బెదిరింపులకు దిగిన విషయం తెలిసిందే. సెప్టెంబరులో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ... ‘ రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం జరిగితే దాని ప్రభావం ఏమేరు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మిమ్మల్నందర్నీ హెచ్చరిస్తున్నా. అయితే నిజానికి ఇవి నా బెదిరింపులు కావు..మీ గురించి బెంగ మాత్రమే. ఏదైనా జరగకూడనిది జరిగితే ఎదురయ్యే తీవ్ర పరిణామాలకు మీరంతా సిద్ధంగా ఉండాలి. పొరుగుదేశం(భారత్) కంటే ఏడు రెట్లు చిన్నదైన పాకిస్తాన్ లొంగిపోతుందా.. లేదా స్వాతంత్ర్యం కోసం యుద్ధం చేస్తుందా అనేది త్వరలోనే స్పష్టమవుంది’ అని పేర్కొన్నారు. -
గెట్ రెడీ రష్యా: ట్రంప్ తాజా వార్నింగ్
వాషింగ్టన్: అమెరికా రష్యా మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకంపనలు పుట్టించారు. తన చిరకాల ప్రత్యర్థి రష్యాపై మరోసారి కయ్యానికి కాలు దువ్వుతూ సోషల్ మీడియాలో స్పందించారు. సిరియాకు వ్యతిరేకంగా రష్యాకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసి దుమారాన్నే లేపారు. ప్రజల్ని చంపి, పైశాచికానందాన్ని పొందుతున్న సిరియాకు మద్దతుగా నిలవొద్దు. సిరియాపై క్షిపణి దాడులకు సిద్ధంగా ఉండాలంటూ రష్యానుద్దేశించి ట్రంప్ ట్వీట్ చేశారు. వరుస ట్వీట్లలో ఆయన రష్యాపై తన దాడిని ఎక్కుపెట్టారు. రష్యాతో అమెరికా సంబంధాలు ఇంతకుముందెన్నడూ లేనంత అధ్వాన్నంగా ఉన్నాయి. ఇది ప్రచ్ఛన్నయుద్ధానికి దారి తీయనుంది. పరస్పర సహకారం అవసరం. ఇది చాలా సులభం. దీనికి అన్ని దేశాలు కలిసి పనిచేయాలి. ఆయుధ పోటీని ఆపాలా? అంటూ ఆయన వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. డమాస్కస్ సమీపంలో జరిగిన రసాయన దాడికి ప్రతిస్పందనగా ఆయన ఇలా స్పందించినట్టు తెలుస్తోంది. గ్యాస్‌తో ప్రాణాలు తీస్తున్న క్రూరమైన జంతువుకు రష్యా మద్దతు ఇవ్వడం అభ్యంతరకమని డోనాల్డ్ ట్రంప్ రష్యాను తీవ్ర స్థాయిలో మందలించారు. ఒక వేళ మీరు తమతో తలపడాలని చూస్తే నూతన, శక్తివంతమైన, స్మార్ట్ మిస్సైల్స్ మీకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ మధ్య సిరియాలో జరుగుతున్న మారణకాండకు రష్యా పరోక్ష మద్దతునివ్వడంతో పాటు ఇలాంటి చర్యలను అణచివేస్తామని చెప్పిన అమెరికాపై కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు తాజాగా రష్యాపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి స్టాక్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపే ప్రమాదం పొంచి వుంది. ట్రంప్ ట్వీట్లపై రష్యా ఎలా స్పందిస్తుంది, తర్వాత ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ....doing things that nobody thought possible, despite the never ending and corrupt Russia Investigation, which takes tremendous time and focus. No Collusion or Obstruction (other than I fight back), so now they do the Unthinkable, and RAID a lawyers office for information! BAD! — Donald J. Trump (@realDonaldTrump) April 11, 2018 Our relationship with Russia is worse now than it has ever been, and that includes the Cold War. There is no reason for this. Russia needs us to help with their economy, something that would be very easy to do, and we need all nations to work together. Stop the arms race? — Donald J. Trump (@realDonaldTrump) April 11, 2018 Much of the bad blood with Russia is caused by the Fake & Corrupt Russia Investigation, headed up by the all Democrat loyalists, or people that worked for Obama. Mueller is most conflicted of all (except Rosenstein who signed FISA & Comey letter). No Collusion, so they go crazy! — Donald J. Trump (@realDonaldTrump) April 11, 2018 -
పసివాళ్ల నెత్తుటితో తడుస్తున్న సిరియా
డమాస్కస్: ఒక్క దృశ్యం గుండెల్ని పిండేసింది. కరడు గట్టిన హృదయాల్ని కరిగించింది. సిరియాలో అంతర్యుద్ధం ముక్కుపచ్చలారని బాల్యాన్ని ఎలా ఛిద్రం చేస్తోందో ఒక్క చిత్రంతో తెలుసుకున్న ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. 2011 నుంచి అంతర్యుద్ధంతో అతలాకుతలమైపోతున్న సిరియా నుంచి పొట్ట చేత్తో పట్టుకొని ఎన్నో కుటుంబాలు వివిధ దేశాలకు వలస వెళ్లిపోతున్నాయి. సరిగ్గా మూడేళ్ల క్రితం అలా యూరప్‌కు పడవలో వెళుతూ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకొని టర్కీ బీచ్‌లోకి కొట్టుకొని వచ్చిన మూడేళ్ల చిన్నారి అలన్ కుర్దీ నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి ప్రపంచమే కన్నీరు పెట్టింది. నీలం రంగు ప్యాంటు, ఎర్ర షర్టు వేసుకొని ఇసుక మేటల్లో విగతజీవిగా పడిఉన్న ఆ బాలుడి చిత్రం ఇప్పటికీ ఎందరినో వెంటాడుతోంది. సిరియాలో పువ్వులాంటి బాల్యం ఆధిపత్య పోరులో ఇంకా నలిగిపోతూనే ఉంది. పసివాళ్ల నెత్తుటితో నేలను తడిపేస్తున్నారు. బాంబుల మోతలు, క్షిపణుల గర్జనల మధ్య చిన్నారుల ఏడుపులు, వారి తల్లిదండ్రుల ఆక్రందనలు గాల్లో కలిసిపోతున్నాయి. బాల్యం రక్తమోడుతున్న ఎన్నో దృశ్యాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. క్షిపణి దాడులతో ఘాటా విధ్వంసం.. సిరియా రాజధాని డమాస్కస్‌కు సమీపంలో తిరుగుబాటుల అధీనంలో ఉన్న తూర్పు ఘాటా ప్రాంతాన్ని తిరిగి వశం చేసుకోవడానికి ప్రభుత్వ నేతృత్వంలోని సైనికులు చేస్తున్న దాడులు, తిరుగుబాటుదారుల ప్రతిదాడులు ఏ పాపం తెలీని పసివాళ్ల ఉసురు తీస్తున్నాయి. ఘాటాలో దాదాపుగా నాలుగు లక్షల మంది జనాభా ఉంటే..అందులో మూడో వంతు మంది చిన్నారులే. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయాలన్న తీర్మానాన్ని సిరియా ప్రభుత్వం అటకెక్కించింది. సిరియా ప్రభుత్వ సైన్యం, దానికి మద్దతుగా రష్యా సైన్యం జరుపుతున్న వైమానిక దాడుల్లో గత రెండు నెలల్లోనే 342 మంది పసివాళ్లు ప్రాణాలు కోల్పోగా, 803 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షిపణి దాడులతో శిథిల భవనాల కింద నలిగిపోతున్న చిన్నారుల్ని చూసి నెటిజన్లు చలించిపోతున్నారు. ప్రే ఫర్ సిరియా హ్యాష్ ట్యాగ్‌తో గాయపడిన పసివాళ్ల ఫోటోలను షేర్ చేస్తూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సేకరించిన వివరాల ప్రకారం.. సిరియాలో ఆపన్న హస్తం కోసం 86 లక్షల మంది బాలలు ఎదురుచూస్తున్నారు. శరణార్థి శిబిరాల్లో సుమారు 30 లక్షల మంది పిల్లలు ఆవాసం పొందుతున్నారు. 28 లక్షల మంది చిన్నారులు బడి ముఖం కూడా చూడటం లేదు. కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేక గడ్డకట్టే చలిలో వేలాది మంది పిల్లలు వణికిపోతూ కాలం గడుపుతున్నారు. రసాయన దాడులకు గురై వేల మంది చిన్నారులు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. యూనిసెఫ్‌కు చెందిన 200 మందికి పైగా సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెడుతూ సిరియా చిన్నారుల్ని కాపాడటానికి తమ వంతు శ్రమిస్తున్నారు. శిబిరాల్లో 30 లక్షల మంది ► సిరియాలో రెండు నెలల్లో ప్రాణాలు కోల్పోయిన 342 మంది చిన్నారులు ► 803 మంది పసివాళ్లకు తీవ్ర గాయాలు ► ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న బాలలు 86 లక్షలు ► శరణార్థి శిబిరాల్లో ఉన్న చిన్నారులు 30 లక్షలు ► బడి ముఖం కూడా చూడని బాలలు 28 లక్షలు -
అమెరికాపై మిస్సైల్ దాడులా!
- ఉత్తరకొరియాకు అంత సీస్ లేదన్న ట్రంప్ - చైనాపైనా సంచలన వ్యాఖ్యలు వాషింగ్టన్: ఖండాంతర విధ్వంసక క్షిపణి(ఐసీబీఎం)తో అమెరికాపై దాడులు చేస్తామన్న ఉత్తరకొరియా హెచ్చరికలపై అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు. ఉత్తరకొరియా హెచ్చరికలను తేలికగా కొట్టిపారేశారు. ఆ దేశ మిస్సైళ్లకు అమెరికాపై దాడులు చేయగల సామర్థ్యం లేదని, ఈ విషయంలో ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చని అన్నారు. కొరియాకు సహకరిస్తున్న చైనాపైనా ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పక్షపాత వాణిజ్య విధానాన్ని అనుసరిస్తూ చైనా.. అమెరికాను నిలువునా దోచుకుంటున్నదని, అలా డ్రాగెన్ దేశం ఇప్పటికే భారీ మొత్తాన్ని, సంపదను పోగేసిందని ట్రంప్ ఆరోపించారు. చైనాతో వాణిజ్యం, ఉత్తరకొరియా అణుహెచ్చరికల నేపథ్యంలో సోమవారం ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన కామెంట్లు మరోసారి ప్రధానవార్తలుగా నిలిచాయి. అమెరికా సంపదను కొల్లగొడుతోన్న చైనా.. ఉత్తరకొరియాకు సహాయం చేయడంలేదని చెప్పుకోవడంపై ట్రంప్ వ్యంగ్య ధోరణిలో ‘నైస్’అని కామెంట్చేశారు. అణ్వస్త్రదేశంగా తమను గుర్తించాలన్న ఉత్తరకొరియా డిమాండ్ ఎన్నటికీ నెరవేరదని, చైనా అండతోనే కొరియా పేట్రేగుతోందన్న ఆయన.. సమగ్రవిధానాలతోనే ఆ రెండుదేశాలకు సమాధానం చెబుతామని అన్నారు. అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చెప్పుకుంటున్నట్లు ఉత్తరకొరియా అణ్వాయుధాలను తయారుచేసిందనే వాదనను తేలికగా తీసుకోవాలని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికే ఆ దేశం(ఉత్తరకొరియా) జరిపిన ఖండాంతర క్షిపణి ప్రయోగాలు విఫలమయ్యాయని, అక్కడి నుంచి అమెరికాపైకి దాడులు చేసేంత సీన్ లేదని గుర్తుచేశారు. (ఎంత బలమైన దేశమైనా వణికిపోవాలి: ఉత్తరకొరియా) (కిరాతకులకే కిరాతకుడు కిమ్) (బటన్ నొక్కితే అమెరికా, కొరియా బూడిదైపోతాయి) North Korea just stated that it is in the final stages of developing a nuclear weapon capable of reaching parts of the U.S. It won't happen! — Donald J. Trump (@realDonaldTrump) 2 January 2017 China has been taking out massive amounts of money & wealth from the U.S. in totally one-sided trade, but won't help with North Korea. Nice! — Donald J. Trump (@realDonaldTrump) 2 January 2017