ఇజ్రాయెల్, లెబనాన్ హెజ్‌బొల్లా గ్రూప్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ టెల్ అవీవ్ శివార్లలోని తా అని పిలువబడే ఇజ్రాయెల్ మిలిటరీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌పై హెజ్‌బొల్లా క్షిపణులతో విరుచుకుపడింది.తాము చేసిన దాడుల్లో మిసైల్స్ ఖచ్చితమైన లక్ష్యాలను చేరుకొన్నాయి.
ఈ మేరకు బుధావారం రాత్రి హెజ్‌బొల్లా ఓ ప్రకటన విడుదల చేసింది. లెబనాన్ నుంచి సెంట్రల్ ఇజ్రాయెల్ వైపు నాలుగు మిసైల్స్‌ను హెజ్‌బొల్లా ప్రయోగించిందని వాటిలో రెండింటిని అడ్డుకున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తెలిపింది. మరో రెండు నివాసస్థలాలు లేని ప్రాంతాల్లో పడిపోయాయని పేర్కొంది. ఈ మిసైల్స్ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది.
#BRAKING Hezbollah claims to have launched rockets at the suburbs of Tel Aviv.
The Glilot military industry company in the suburbs of Tel Aviv was hit by a high-quality rocket salvo, which hit the target precisely, Hezbollah announced, as reported by Al Jazeera.
The opposing… pic.twitter.com/IqH4WYR8pB— Sujon Ahmed (@SAexploring) October 23, 2024
మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని కాన్ టీవీ న్యూస్.. వెస్ట్ బ్యాంక్‌లోని కల్కిలియా నగరం సమీపంలో ఒక మిసైల్ పడిపోయిందని ప్రసారం చేసింది. ఆ మిసైల్ దాడికి ఒక వ్యక్తికి స్వల్పంగా గాయాలు కాగా, ఒక కారు దెబ్బతిందని పేర్కొంది.
ఇక.. సెప్టెంబర్ 23 నుంచి ఇజ్రాయెల్ సైన్యం హెజ్‌బొల్లాను అంతం చేయటమే టార్గెట్‌గా లెబనాన్‌పై తీవ్రమైన వైమానిక దాడులను ప్రారంభించింది. అక్టోబరు నెల ప్రారంభంలో.. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనీస్ సరిహద్దుకు సమీపంలో ఒక గ్రౌండ్ ఆపరేషన్‌ను కూడా ప్రారంభించింది. హెజ్‌బొల్లా ఆర్థిక మూలాలు, సామర్థ్యాలను బలహీనపరచటమే లక్ష్యంగా దాడులు చేస్తోంది.
చదవండి: ఓటేసిన 2.1 కోట్ల అమెరికన్లు
Comments
Please login to add a commentAdd a comment