
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌పై క్షిపణిదాడులను తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఇకపై రష్యా భీకర దాడులు చేయదని వెల్లడించారు.
ఉక్రెయిన్‌పై రష్యా సోమవారం క్షిపణుల వర్షం కురిపించిన తెలిసిందే. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణ నష్టం, భారీ ఆస్తి జరిగింది. క్రెమ్లిన్ బ్రిడ్జిని ఉక్రెయిన్ పేల్చినందుకు ప్రతీకారంతో రష్యా ఈ భీకర దాడులకు పాల్పడి మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఐరోపా సమాఖ్య ఈ దాడులను తీవ్రంగా ఖండించి పుతిన్ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నట్లు విమర్శించింది.
అయితే ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేయడం తమ లక్ష‍్యం కాదని పతిన్ పేర్కొన్నారు. అందుకే క్షిపణి దాడులు ఆపేస్తున్నట్లు చెప్పారు. పుతిన్ ప్రకటనతో కొద్ది రోజులుగా ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కన్పిస్తున్నాయి. మరి ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.
చదవండి: మిరాకిల్.. యుద్ధ ట్యాంక్ కింద నలిగినా చనిపోని సైనికుడు
Comments
Please login to add a commentAdd a comment