మోదీ చాలా తెలివైన వ్యక్తి: పుతిన్ | 'PM Modi A Very Wise Man': Vladimir Putin's Huge Praise | Sakshi
Sakshi News home page

మోదీ చాలా తెలివైన వ్యక్తి: పుతిన్

Published Thu, Oct 5 2023 10:29 AM | Last Updated on Thu, Oct 5 2023 10:44 AM

PM Modi A Very Wise Man Vladimir Putin Huge Praise - Sakshi

మాస్కో: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. మోదీని "చాలా తెలివైన వ్యక్తి" అని అభివర్ణించారు. మోదీ నాయకత్వంలో భారతదేశం గొప్ప పురోగతి సాధిస్తోందని చెప్పారు. ఆర్థిక భద్రత, సైబర్ నేరాలకు వ్యతిరేక పోరాటంలో రష్యా , భారతదేశం మధ్య మరింత సహకారం కొనసాగిస్తామని వ్లాదిమిర్ పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

వ్లాదిమిర్ పుతిన్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. "ప్రధాని మోదీతో మేము చాలా మంచి రాజకీయ సంబంధాలను పంచుకుంటున్నాము. ఆయన చాలా తెలివైన వ్యక్తి. మోదీ నాయకత్వంలో భారతదేశం గొప్ప పురోగతిని సాధిస్తోంది" అని పుతిన్ అన్నారు. G20 సమ్మిట్‌లో న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించిన అనంతరం ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసలు కురిపించడం ఇదే మొదటిసారి.

ఉక్రెయిన్‌లో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో శాంతిని నెలకొల్పాలని డిక్లరేషన్ పిలుపునిచ్చింది. అయితే రష్యాపై మాత్రం నిందలు వేయలేదు.ఈ క్రమంలో న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను మాస్కో కూడా స్వాగతించింది. ప్రపంచ జీ20 చరిత్రలో ఇదో మైలురాయి అని పేర్కొంది. G20 దేశాల్లో గ్లోబల్ సౌత్‌ను ఏకీకృతం చేయడంలో భారత అధ్యక్ష పదవిలో క్రియాశీల పాత్రను ప్రశంసించింది.

ఇదీ చదవండి: Lumbini and Pokhara Airport Issue: చైనా ఆటలకు నేపాల్‌లో భారత్‌ కళ్లెం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement