G20 summit
-
ముందుకు కదలని ముచ్చట
మరో ఏడాది గడిచింది. మరో జీ20 సదస్సు జరిగింది. భారత ప్రధాని మోదీ సహా ప్రపంచ దేశాల పెద్దలు కలిశారన్న మాటే కానీ, ఏం ఒరిగింది? బ్రెజిల్లో రెండు రోజులు జరిగిన సదస్సు తర్వాత వేధిస్తున్న ప్రశ్న ఇది. ఈ 20 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల కూటమి ఓ సమష్టి తీర్మానం చేసింది కానీ, తీర్మానంలోని భాషపై అర్జెంటీనా అభ్యంతరాలతో ఏకాభిప్రాయ సాధన కుదరలేదు. ఆకలిపై పోరాటానికి ఒప్పందం, ప్రపంచంలో అత్యంత సంపన్నులపై పన్ను లాంటి అంశాలపై సదస్సులో మాటలు సాగాయి. కానీ, ఉక్రెయిన్‌లో, మధ్యప్రాచ్యంలో... జరుగుతున్న ప్రధాన యుద్ధాల క్రీనీడలు సదస్సుపై పరుచుకున్నాయి. చివరకు సదస్సు చివర జరపాల్సిన విలేఖరుల సమావేశాన్ని సైతం బ్రెజిల్ దేశాధ్యక్షుడు ఆఖరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. రష్యాపై ఉక్రెయిన్ క్షిపణి దాడులు, పరిమిత అణ్వస్త్ర వినియోగానికి మాస్కో సన్నద్ధతతో ఉద్రిక్తతలు పెరిగినా అమెరికా అధ్యక్షుడు ఏమీ మాట్లాడకుండానే పయనమయ్యారు. వెరసి, అధికారులు అంటున్నట్టు ఈ ‘జీ20 సదస్సు చరిత్రలో నిలిచిపోతుంది’ కానీ, గొప్పగా చెప్పుకోవడానికేమీ లేనిదిగానే నిలిచిపోతుంది. మాటలు కోటలు దాటినా, చేతలు గడప దాటడం లేదనడానికి తాజా జీ20 సదస్సు మరో ఉదాహరణ. నిజానికి, పర్యావరణ పరిరక్షణకు కార్యాచరణ, నిధులు అనేవి ఈ సదస్సుకు కేంద్ర బిందువులు. పర్యావరణ మార్పులను ఎదుర్కోవాల్సిన ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, పరస్పర సహకార ప్రయత్నాలకు కట్టుబడినట్టు సదస్సు పేర్కొంది. కానీ, శిలాజ ఇంధనాల వినియోగం నుంచి క్రమంగా పక్కకు మరలేందుకు స్పష్టమైన ప్రణాళికలేమీ చేయలేకపోయింది. పర్యావరణ పరిరక్షణ నిధులకు సంబంధించీ పురోగతి లేకుండానే ఈ జీ20 ముగిసింది. ప్రపంచ దేశాల నేతలు కృత నిశ్చయాన్ని ప్రకటిస్తూ, బలమైన సూచన ఏదో చేస్తారని ‘కాప్–29’ ఆశించినా, అలాంటిదేమీ జరగనేలేదు. కాకపోతే, ‘జీ20’ సదస్సు తుది తీర్మానంలో నిర్దిష్టమైన ఆర్థిక వాగ్దానాలేమీ లేనప్పటికీ, మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంకుల సంస్కరణలపై దృష్టి పెట్టినందున అది పరోక్షంగా పర్యావరణ నిధులకు ఉపకరిస్తుందని కొందరు నిపుణుల మాట. కాగా, ప్రపంచం నుంచి దారిద్య్రాన్ని పూర్తిగా నిర్మూలించాలంటూ జీ20 దేశాలు వచ్చే అయిదేళ్ళను కాలవ్యవధిగా పెట్టుకోవడం సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకపోయినా, సత్సంకల్పమని సంతోషించాలి. 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం వాషింగ్టన్లో జరిగిన జీ20 నేతల తొలి సమావేశానికి హాజరయ్యానని గుర్తు చేసుకుంటూ, పదహారేళ్ళ తర్వాత ఇప్పటికీ ప్రపంచం ఘోరమైన పరిస్థితిలో ఉందని బ్రెజిల్ అధ్యక్షుడన్న మాట నిష్ఠురసత్యం. ఆకలి, దారిద్య్రం ఇప్పటికీ పీడిస్తూనే ఉన్నాయి. దీనికి తప్పుడు రాజకీయ నిర్ణయాలే కారణమన్న ఆయన మాట సరైనదే. ఆకలి, దారిద్య్రంపై పోరాటానికి ప్రపంచ కూటమి స్థాపన మంచి ఆలోచనే. కానీ, ఇన్నేళ్ళుగా ఇలాంటివెన్నో సంకల్పాలు చేసుకున్నా, ఎందుకు నిర్వీర్యమయ్యాయన్నది ఆలోచించాల్సిన అంశం. పేరుకు కూటమి అయినా జీ20లోని సభ్య దేశాల మధ్య యుద్ధాలు సహా అనేక అంశాలపై భిన్నాభిప్రాయాలున్నా యన్నది సదస్సు ఆరంభం కాక ముందు నుంచీ తెలిసినదే. అందుకే, ఈ సదస్సును అతిగా అంచనా వేస్తే ఆశాభంగమే. కొన్ని విజయాలున్నా అధిక శాతం అంతర్జాతీయ శక్తుల మధ్య విభేదాలే సదస్సులో బయటపడ్డాయి. ఏ దేశాల పేర్లూ ఎత్తకుండా శాంతి సూక్తులకే జీ20 పరిమితమైంది. సమష్టి లక్ష్యం కోసం పలుదేశాలు కలసి కూటములుగా ఏర్పడుతున్నా, అవి చక్రబంధంలో చిక్కుకొని అడుగు ముందుకేయలేని పరిస్థితి ఉందని అర్థమవుతోంది. ఇటీవలి ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సదస్సు ‘కాప్29’, ఇరవై ఒక్క ఆసియా – పసిఫిక్ దేశ ఆర్థిక వ్యవస్థల వేదిక ‘ఆసియా – పసిఫిక్ ఆర్థిక సహకార మండలి’, జీ20ల్లో ఎదురైన ప్రతిష్టంభనలే అందుకు తార్కాణం. అవి ఇప్పుడు సమష్టి సవాళ్ళను పరిష్కరించే వేదికలుగా లేవు. వ్యాపార సంరక్షణవాద విధానాలు, భౌగోళిక – రాజకీయ శత్రుత్వాల యుద్ధభూములుగా మారిపోయాయి. ఈ వైఫల్యం వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు అశనిపాతం. అమెరికా, యూరోపియన్ యూనియన్ లాంటివి స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతం నుంచి పక్కకు జరిగాయి. ఫలితంగా తక్కువ కూలీ ఖర్చు, సరళమైన పర్యావరణ ప్రమా ణాలున్న వర్ధమాన దేశాలకు మునుపటి సానుకూలత ఇప్పుడు లేదు. పారిశ్రామికీకరణ వేళ సరళ తర నిబంధనలతో లబ్ధి పొందిన పెద్ద దేశాలు, తీరా ఇప్పుడలాంటి ఆర్థిక అవకాశాలేమీ లేకుండానే వర్ధమాన దేశాలను సుస్థిరాభివృద్ధి వైపు నడవాలని కోరడం అన్యాయమే. ప్రపంచాన్ని పీడిస్తున్న అంశాలపై దృష్టి సారించడంలో జీ20 విఫలమవడం విషాదం. పర్యావరణ సంక్షోభం, దారిద్య్రం, ఉత్పాతాల లాంటి అనేక సవాళ్ళు కళ్ళెదుటే ఉన్నా, వాటి పరిష్కారం బదులు రష్యా, చైనాలను ఏకాకుల్ని చేయాలన్నదే జీ7 దేశాల తాపత్రయం కావడమూ తంటా. భౌగోళిక – రాజకీయ వివాదాలు అజెండాను నిర్దేశించడంతో జీ20 ప్రాసంగికతను కోల్పోతోంది. సమాన అవకాశాలు కల్పించేలా కనిపిస్తున్న బ్రిక్స్ లాంటి ప్రత్యామ్నాయ వేదికల వైపు పలు దేశాలు మొగ్గుతున్నది అందుకే. జీ20 లాంటి బహుళ దేశాల వ్యవస్థల కార్యాచరణను ఇతరేతర అంశాలు కమ్మివేస్తే అసలు లక్ష్యానికే చేటు. పరస్పర భిన్నాభిప్రాయాల్ని గౌరవిస్తూనే దేశాలు సద్భావంతో నిర్మాణాత్మక చర్చలు జరిపితే మేలు. ఏ కూటమైనా శక్తిమంతులైన కొందరి వేదికగా కాక, అంద రిదిగా నిలవాలి. పశ్చిమదేశాలు ఆ సంగతి గ్రహిస్తేనే, జీ20 లాంటి వాటికి విలువ. విశ్వ మాన వాళికి ప్రయోజనం. వచ్చే ఏడాది సౌతాఫ్రికాలో జరిగేనాటికైనా జీ20 వైఖరి మారుతుందా? -
G20 Summit: మళ్లీ ఎఫ్‌టీఏ చర్చలు
రియో డి జనిరో: బ్రిటన్, భారత్ మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై నెలకొన్న అనుమానాలకు తెర పడింది. దీనిపై చర్చలను పునఃప్రారంభిస్తామని బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ స్పష్టం చేశారు. బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం ఆయన ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా నేతలిద్దరూ సమావేశమయ్యారు. బ్రిటన్‌లో లేబర్ పార్టీ గెలుపుతో ఎఫ్‌టీఏ భవితవ్యం అయోమయంలో పడటం తెలిసిందే. దానికి నేతలిద్దరూ తాజాగా తెర దించారు. పరస్పరం లాభసాటిగా ఉండేలా ఎఫ్‌టీఏ విధివిధానాలు రూపొందుతాయని ఆశాభావం వెలిబుచ్చారు. బెల్ఫాస్ట్, మాంచెస్టర్ నగరాల్లో నూతన కాన్సులేట్లు తెరవాలని నిర్ణయించారు. పరారీలో ఉన్న వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని స్టార్మర్‌కు మోదీ విజ్ఞప్తి చేశారు.మెరుగైన భవితకు కృషి మెరుగైన భవిష్యత్తు కోసం చర్యలు చేపట్టాల్సిందిగా జీ20 సభ్య దేశాలకు మోదీ పిలుపునిచ్చారు. సదస్సులో రెండో రోజు సుస్థిరాభివృద్ధి, ఇంధన రంగంలో మార్పులపై ఆయన ప్రసంగించారు. అభవృద్ధి చెందుతున్న దేశాలకు ఇచి్చన హామీలను అమలు చేయడం సంపన్న దేశాల బాధ్యత అని గుర్తు చేశారు. పర్యావరణ సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కోవడం మానవాళి మనుగడకు చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. గాజాకు మరింత మాన వతా సాయం అందించాలని, ఉక్రెయిన్ యుద్ధానికి తెర పడాలంటూ సదస్సు డిక్లరేషన్ విడుదల చేసింది. వీటితో పాటు పలు అంశాలపై బుధవారం సదస్సు చివరి రోజు ఉమ్మడి తీర్మానం చేసే అవకాశముంది. దేశాధినేతలతో మోదీ భేటీలుఆతిథ్య దేశం బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వాతో పాటు పలువురు దేశాధినేతలతో మోదీ వరుస భేటీలు జరిపారు. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (ఫ్రాన్స్), గాబ్రియెల్ బోరిక్ ఫోంట్ (చిలీ), జేవియర్ మెయిలీ (అర్జెంటీనా), జార్జియా మెలోనీ (ఇటలీ), ప్రబోవో సుబియాంటో (ఇండొనేసియా), పెడ్రో శాంచెజ్ (స్పెయిన్), అబ్దెల్ ఫతా ఎల్ సిసీ (ఈజిప్ట్), యూన్ సుక్ యోల్ (దక్షిణ కొరియా), జోనాస్ గర్ స్టోర్ (నార్వే), లూయీస్ మాంటెనెగ్రో (పోర్చుగీస్), లారెన్స్ వాంగ్ (సింగపూర్), యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లియన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్ తదితరులు వీరిలో ఉన్నారు. -
G20 సదస్సులో బిజీ బిజీగా PM మోడీ
-
జీ20 సదస్సులో ఫొటో.. బైడెన్, ట్రూడో మిస్సింగ్!
ప్రపంచ దేశాధినేతలు కలిసి దిగిన ఓ ఫోటోలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో జరిగిన జీ 20 శిఖరాగ్ర సదస్సులో ఈ పరిమాణం వెలుగుచూసింది. ఈ సమ్మిట్‌లో భాగంగా సోమవారం దేశాధినేతలంతా కలిసి ఓ ఫోటో దిగారు. ఇందులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా తదితర నేతలంతా ఉన్నారు. వారందరూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు.అయితే ఈ ఫోటోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలు లేరు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌కు చివరి జీ20 సదస్సు అయినందున ఆయన లేకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. మరోవైపు ఈ శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గైర్హాజరు కావడం గమనార్హం. తాజాగా ఈ ఫోటోపై అమెరికా అధికారులు స్పందిస్తూ.. తీవ్రంగా త ప్పుబట్టారు. ఫోటో దిగే సమయంలో బైడెన్.. కెనడా ప్రధాని జస్టిన్ట్రూడోతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. చర్చలు ముగించుకొని వస్తుండగా బైడెన్ రాకముందే తొందరగా ఫోటో తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల నాయకులంతా రాకముందే పలువురు దేశాధినేతలు ఫొటో దిగేశారని, అందుకే అందరూ నేతలు అక్కడ లేరని చెప్పారు. కాగాఫోటోలో మిస్ అయిన బైడెన్, ట్రూడో, మెలోనీలు తరువాత ప్రత్యేకంగా ఫొటో దిగారు.ఇదిలా ఉండగా మరో రెండు నెలల మాత్రం అమెరికా అధ్యక్ష హోదాలో కొనసాగనున్నారు బైడెన్.. యూఎస్ ప్రెసిడెంట్‌గా ఆయనకు ఇదే చివరి జీ 20 సదస్సు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. -
గ్లోబల్ సౌత్‌ను పట్టించుకోవాలి
రియో డిజనిరో: ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల కమ్ముకున్న యుద్ధ మేఘాలు దక్షిణార్ధ గోళ (గ్లోబల్ సౌత్) దేశాలను అతలాకుతలం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫలితంగా ఆహార, ఇంధన, ఎరువుల సంక్షోభాలతో అవి సతమతమవుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. వాటిని తక్షణం పరిష్కరించడంపై జీ20 కూటమి ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. ‘‘గ్లోబల్ సౌత్ సవాళ్లు, అవసరాలకు ముందుగా పెద్దపీట వేయాలి. అప్పుడు మాత్రమే జీ20 జరిపే ఏ చర్చలైనా, తీసుకునే ఏ నిర్ణయాలైనా ఫలవంతం అవుతాయి’’ అని స్పష్టం చేశారు.రెండు రోజుల జీ20 శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో సోమవారం మొదలైంది. తొలి రోజు సదస్సును ఉద్దేశించి ‘ఆకలి, పేదరికంపై పోరు–సోషల్ ఇంక్లూజన్’ అంశంపై మోదీ ప్రసంగించారు. గ్లోబల్ సౌత్ సమస్యలు, సవాళ్లను ప్రధానంగా ప్రస్తావించారు. ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ గతేడాది ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సులో పలు నిర్ణయాలు తీసుకున్న వైనాన్ని గుర్తు చేశారు. ‘‘గ్లోబల్ సౌత్‌కు ప్రాధాన్యం పెంచే చర్యల్లో భాగంగా ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం కలి్పస్తూ ఢిల్లీ శిఖరాగ్రం నిర్ణయం తీసుకుంది.అన్ని దేశాలనూ కలుపుకునిపోయేలా సుస్ధిరాభివృద్ధి లక్ష్యాలకు ప్రాథమ్యమివ్వాలని నిర్ణయించింది. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిత’ అన్నదే మూలమంత్రంగా సదస్సు జరిగింది. ఆ ఒరవడిని మరింతగా కొనసాగించాలి’’ అని సదస్సులో పాల్గొన్న పలువురు దేశాధినేతలను ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి మొదలుకుని పలు అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమన్న భారత వైఖరిని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత్ తీరు ఆచరణీయం పేదరికం, ఆకలి సమస్యలపై పోరులో భారత్ ముందుందని మోదీ వివరించారు. ‘‘ప్రజలందరినీ కలుపుకుని పోవడమే ప్రధాన లక్ష్యంగా మా ప్రభుత్వ పదేళ్ల పాలన సాగింది. 80 కోట్లకు పై చిలుకు ప్రజలకు ఆహార ధాన్యాలను ఉచితంగా అందజేస్తున్నాం. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆరోగ్య బీమా, పెద్ద పంటల బీమా, పంట రుణాల పథకాలు అమలు చేస్తున్నాం. తద్వారా 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయట పడ్డారు’’ అని వివరించారు. గ్లోబల్ సౌత్‌తో పాటు ఇతర దేశాలు కూడా వీటిని అనుసరిస్తే అద్భుత ఫలితాలుంటాయన్నారు. పేదరికం, ఆకలిపై పోరాటానికి అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేయాలని జీ20 శిఖరాగ్రంలో తొలి రోజు నిర్ణయం జరిగింది.బైడెన్‌తో మోదీ భేటీజీ20 శిఖరాగ్రం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ సోమవారం సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం వారి మధ్య ఇది తొలి భేటీ. వారిద్దరూ పలు ద్వైపాక్షిక అంశాలు మాట్లాడుకున్నట్టు సమాచారం.ఘనస్వాగతం జీ20 భేటీ కోసం బ్రెజిల్ వెళ్లిన మోదీకి ఘనస్వాగతం లభించింది. ప్రవాస భారతీయుల సంస్కృత శ్లోకాలాపన, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోని యో గుటెరస్, స్పెయిన్ అధినేత పెడ్రో శాంచెజ్, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తదితరులతో ప్రధాని భేటీ అయ్యారు. -
అదనంగా 14.8 కోట్ల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ‘ఉపాధి కల్పనలో భారత్ జీ20 దేశాలలో వెనుకబడి ఉంది. జనాభా పెరుగుదల దృష్ట్యా 2030 నాటికి దేశం అదనంగా 14.8 కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉంది’ అని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఫస్ట్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ శనివారం తెలిపారు. 2010–20 మధ్య భారత్ సగటున 6.6 శాతం వృద్ధిని సాధించిందని, అయితే ఉపాధి రేటు 2 శాతం కంటే తక్కువగా ఉందని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వజ్రోత్సవంలో పాల్గొన్న సందర్భంగా గీత చెప్పారు. మరిన్ని ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రైవేట్ పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడం, నియంత్రణ వాతావరణాన్ని మెరుగుపరచడం, ట్యాక్స్ బేస్‌ను విస్తృతం చేయడం అవసరమని తెలిపారు. ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్ ఒక కీలక దేశంగా ఉండాలనుకుంటే దిగుమతి సుంకాలను తగ్గించాల్సిందేనని స్పష్టం చేశారు. -
క్రిప్టోలను కరెన్సీగా గుర్తించం..
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలపై భారత్ విధానం మారబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కరెన్సీలను ప్రభుత్వం లేదా సెంట్రల్ బ్యాంకులే జారీ చేయాలే తప్ప క్రిప్టోలను కరెన్సీగా గుర్తించే ప్రసక్తే లేదన్నారు. ఇటువంటి అసెట్స్‌ను నియంత్రించే దిశగా సమగ్రమైన ఫ్రేమ్‌వర్క్ రూపొందించే అంశాన్ని జీ20 కూటమి పరిశీలిస్తోందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, ప్రపంచ మార్కెట్లు అనేక ఒడిదుడుకులకు లోనవుతున్నా దేశీయంగా స్టాక్ మార్కెట్ స్థిరంగానే వ్యవహరిస్తోందని ఆమె పేర్కొన్నారు. కాబట్టి మార్కెట్‌ను దాని మానాన వదిలేయాలని అభిప్రాయపడ్డారు. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్‌లో బబుల్ తరహా పరిస్థితులు ఉన్నాయని, వాటిపై చర్చాపత్రాన్ని తెచ్చే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవి పురి ఇటీవల తెలిపిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు జీ20 వర్చువల్ సమావేశం
ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు జీ-20 వర్చువల్ సమావేశం జరగనుంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ భేటీకి దూరంగా ఉండనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరుకానున్నారు. ఢిల్లీ డిక్లరేషన్ అమలు, ఇజ్రాయెల్- హమాస్ వివాదం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఆర్థిక పురోగతి సహా ప్రపంచ నూతన సవాళ్లపై చర్చించనున్నారు. సమ్మిట్‌లో సభ్య దేశాల నాయకుల నుంచి అద్భుతమైన భాగస్వామ్యం ఉంటుందని భావిస్తున్నట్లు జీ20 షెర్పా అమితాబ్ కాంత్ చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావడం లేదు. ఆయనకు బదులుగా ప్రీమియర్ లీ కియాంగ్ చైనాకు ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు, ప్రపంచ ఆర్థిక పునరుజ్జీవనానికి సానుకూలంగా దోహదపడేందుకు ఈ సదస్సు సహకారాన్ని పెంపొందిస్తుందని చైనా ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. వర్చువల్ సమ్మిట్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొంటారని క్రెమ్లిన్ ప్రకటించింది. సెప్టెంబరులో జరిగిన న్యూ ఢిల్లీ G20 సమ్మిట్‌లో ఆయన గౌర్హజరైన విషయం తెలిసిందే. అంతకుముందు ఏడాది జరిగిన జీ20 బాలి సదస్సుకు కూడా పుతిన్ దూరమయ్యారు. ప్రస్తుతం పుతిన్ హాజరువుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ జరిగే అవకాశం ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి: బందీల విడుదలకు హమాస్‌తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం -
ప్రపంచాభివృద్ధికి జీ20 భారత్ ప్రెసిడెన్సీ దిశా నిర్దేశం
న్యూఢిల్లీ: భారత్ ప్రెసిడెన్సీలోని జీ20 గ్రూప్ ప్రపంచ జనాభాలో మెజారిటీ అవసరాలను పరిష్కరించడానికి స్పష్టమైన విధాన దిశను నిర్దేశించుకున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. బహుళజాతి సదస్సులో పలు దేశాల అవసరాలు, ఎదుర్కొంటున్న సవాళ్లకు సహజంగా చోటుండదని పేర్కొన్న ఆమె, అయితే భారత్ నేతృత్వంలో జీ20 భేటీలో ఈ సమస్యను కొంతమేర అధిగమించినట్లు వివరించారు. అయితే ఈ దిశలో కర్తవ్యం ఇంకా కొంత మిగిలే ఉందని పేర్కొన్నారు. ఆర్థిక, కారి్మక, వాణిజ్య మంత్రిత్వశాఖలు ‘‘బలమైన, స్థిరమైన, సమతుల్య, సమగ్ర వృద్ధిపై ఇక్కడ నిర్వహించిన ఒక సెమినార్లో సీతారామన్ ప్రారం¿ోపన్యాసం చేశారు. 2022 డిసెంబర్ 1వ తేదీన ఏడాది కాలానికి భారత్ జీ20 ప్రెసిడెన్సీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆయా అంశాల గురించి సీతారామన్ తాజా సెమినార్లో మాట్లాడుతూ... ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లను పరిష్కరించాలని, ప్రజలు కేంద్రంగా సంక్షేమ చర్యలు, విశ్వాస ఆధారిత భాగస్వామ్యాలతో భవిష్యత్తు కోసం విధాన మార్గదర్శకాలను రూపొందించాలని జీ20 న్యూ ఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ (ఎన్డీఎల్డీ)లో గ్రూప్‌లో దేశాలన్నీ ఏకగ్రీవంగా అంగీకరించాయి. ► ఈ డిక్లరేషన్‌లో పేద దేశాల పురోగతికి పరస్పర సహకారం, సాంకేతిక పురోగతి నుంచి ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రయోజనం పొందడం, ప్రపంచ పురోగతికి బహుళజాతి సంస్థలు తగిన విధాన చర్యలు చేపట్టడం వంటివి ఇందులో ఉన్నాయి. ► ఈ నెలాఖరు నాటికి జీ20 అధ్యక్ష స్థానంలో భారత్ పాత్ర ముగిసిపోతున్నప్పటికీ, డిక్లరేషన్‌లోని విధాన మార్గదర్శకాల అమలును వేగాన్ని కొనసాగించాలి. ► మహమ్మారి నుండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక సంక్షోభాలతో సతమతమవుతోంది. ప్రపంచ వృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. రికవరీ జరుగుతున్నప్పటికీ, ఇది నెమ్మదిగా అసమానంగా ఉంటోంది. ► ప్రపంచ వృద్ధి ప్రస్తుత వేగం చాలా బలహీనంగా ఉంది. వృద్ధి రేటు మహమ్మారికి ముందు రెండు దశాబ్దాలలో సగటు 3.8 శాతం కంటే చాలా తక్కువగా ఉంది. మధ్యస్థ కాలానికి సంబంధించి, వృద్ధి అవకాశాలు మరింత బలహీనపడ్డాయి. ► వృద్ధి తిరిగి తగిన బాటకు రావడానికి– బలంగా, స్థిరంగా, సమతుల్యంగా కొనసాగడానికి దేశీయంగా, అంతర్జాతీయంగా పరస్పర సహకారం, సమన్వయం కీలకం. వేగంగా పురోగమిస్తున్న విమానయానం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో న్యూఢిల్లీలో బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తే, బోయింగ్ ఇండియా చీఫ్ ఆఫ్ స్టాఫ్ ప్రవీణా యజ్ఞంభట్ సమావేశం అయ్యారు. దాదాపు 7% వృద్ధి రేటుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారత్ విమానయానరంగం అభివృద్ధి చెందుతోందని సలీల్ గుప్తే ఈ సందర్భంగా పేర్కొన్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. భారతదేశం స్థూలదేశీయోత్పత్తి జీడీపీ వేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో.. విమానయాన రంగ పురోగతి కూడా దేశంలో అంతే వేగంగా పురోగమించే అవకాశం సుస్పష్టమని పేర్కొన్నారు. అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలోని మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత్ ఉందన్నారు. ఈ రంగంలో ప్రధాన మౌలిక సదుపాయాల పెరుగుదల, విమాన సేవల విస్తరణ బాటన పటిష్టంగా కొనసాగుతోందన్నారు. సమగ్ర వృద్ధిపై ఇక్కడ నిర్వహించిన ఒక సెమినార్లో ఆర్థికమంత్రి తదితర సీనియర్ అధికారులు -
విదేశాలకు మన అత్తరు
యురోపియన్, అమెరికన్ పెర్ఫ్యూమ్స్ మన దేశీయ అత్తర్ల తయారీపైన తీవ్ర ప్రభావం చూపాయి. మనదైన కళారూపం కనుమరుగవుతోందని గమనించిన క్రతి, వరుణ్ టాండన్ లు అనే అన్నాచెల్లెళ్లు మన దేశీయ సాంస్కృతిక పరిమళ ద్రవ్యాల తయారీని సంరక్షించాలని పూనుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జి20 సమ్మిట్‌లో వీరి బ్రాండ్ అఫీషియల్ కానుకల జాబితాలో చేరింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కనౌజ్ నగరంలో చాలా కుటుంబాలు అత్తరు తయారీ కళను తరాలుగా కొనసాగిస్తున్నాయి. అయితే, ఈ సంప్రదాయ పద్ధతుల అత్తరు వాడకాలు విదేశీ బ్రాండ్ పర్ఫ్యూమ్లతో తగ్గిపోయాయి. కనౌజ్లో ఉంటున్న క్రతి, వరుణ్ టాండన్‌లు మనసుల్లో ఈ నిజం ఎప్పుడూ భారంగా కదలాడుతుండేది. తమ ఆలోచనలను కార్యరూపంలో పెట్టడానికి, చేస్తున్న కృషిని ఈ సోదర ద్వయం ఇలా మన ముందుంచుతున్నారు. ‘‘మా చిన్ననాటి నుంచీ ఈ కళను చూస్తూ పెరిగాం. ఈ ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, ప్రోత్సహించడం పట్ల మా ఆలోచనలు, చర్చలు మా ఇంట్లో ఎప్పుడూ ఉండేవి. కోవిడ్ మహమ్మారి మన దేశీయ పరిమళ ద్రవ్యాలపైన కోలుకోలేనంత దెబ్బ వేసింది. దీంతో మా ఆలోచనలను అమల్లో పెట్టాలని రెండేళ్ల క్రితం ‘బూంద్’ పేరుతో పరిమళ ద్రవ్యాల కంపెనీ ప్రారంభించాం. మనదైన సాంస్కృతిక కళపై చిన్న డాక్యుమెంటరీ రూపొందించి, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాం. దీంతో ఆర్డర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది’ అని వివరిస్తుంది క్రతి. చేస్తున్న ఉద్యోగాలు వదిలి... జర్మనీలోని కార్పొరేట్ కంపెనీలో పని చేసే క్రతి అక్కడి నుండి స్వదేశానికి చేరుకుంది. ముంబైలో చిత్రనిర్మాణ రంగంలో ఉన్న వరుణ్ కూడా స్వస్థలానికి చేరుకున్నాడు. ‘మేం మొదట ఈ బ్రాండ్‌ను ఏర్పాటు చేయాలనుకోలేదు. అత్తరు తయారీ కళాకారులకు జీవనోపాధి కల్పించాలనుకున్నాం. వీరు ఆదాయవనరుల కోసం అన్వేషిస్తే ఏదైనా పని దొరుకుతుంది. కానీ, మనదైన కళ కనుమరుగవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని బ్రాండ్ తీసుకొచ్చాం. ఒకేరోజులో 100 ఆర్డర్లు వచ్చాయి. ఏడాదలో యాభై శాతం వృద్ధి వచ్చింది. ఆ తర్వాత నెలవారీ ఆర్డర్లు వెయ్యికి మించిపోయాయి. సెలబ్రిటీలు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌లతో సహా బాలీవుడ్ వివాహాలలో మా అత్తరు పరిమళాలు వెదజల్లింది. ముఖ్యంగా ఢిల్లీలో నిర్వహించిన జి 20 సమ్మిట్‌లో 2023కి అధికారిక కానుకల భాగస్వామ్యంలో బూంద్ బ్రాండ్ ఒకటిగా ఎంపికయ్యింది. జి20 సమ్మిట్‌లో పాల్గొనడం, మా చిన్న వ్యాపారానికి గొప్ప ముందడుగుగా పనిచేసింది’అని వివరిస్తారు వరుణ్. ఒక ఆలోచనను అమలులో పెట్టడంతో వారి కుటుంబాన్నే కాదు మరికొన్ని కుటుంబాలకు ఆదాయ వనరుగా మారింది. మన దేశీయ వారసత్వ కళ ముందు తరాలకు మరింత పరిమళాలతో పరిచయం అవుతోంది. కుటుంబ సభ్యులు కూడా... కనౌజ్ పరిమళ ద్రవ్యాల కళాకారులు అత్తర్లను తయారుచేయడానికి ‘డెగ్–భాష్కా’ పద్ధతిని ఉపయోగిస్తారు. సంప్రదాయ ప్రక్రియలో సుగంధవ్య్రాల ముడిపదార్థాలను ఉపయోగించి, మట్టి పాత్రలలో తయారుచేస్తారు. మార్కెట్లోని ఇతర బ్రాండ్స్ ధరలతో పోల్చితే తక్కువ, సువాసనల ఉపయోగాలు ఎక్కువ. పెరుగుతున్న డిమాండ్‌ను బట్టి ధరలలో మార్పు ఉంటుంది. యుఎస్, యూరోప్, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాలకు 20 వేల కంటే ఎక్కువ ఆర్డర్లు పంపించాం. ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయించడమే కాకుండా, ముంబై, జైపూర్లలో రిటైల్ స్పేస్‌లోకి కూడా ప్రవేశించాం. మా నాన్న రచనలు చేస్తుంటారు. తన అందమైన కవిత్వాన్ని ఈ అత్తరు పరిమళాలతో జోడిస్తాడు. దీంతో సువాసనలకు మరింత అకర్షణ తోడైంది. ఇప్పుడు మా బ్రాండ్‌కి 12 మంది కళాకారులతో పాటు మా కుటుంబసభ్యులు కూడా కొత్త పరిమళాలను తయారుచేసేందుకు కృషి చేస్తున్నారు’ అని వివరిస్తున్నారు ఈ సోదర సోదరీ ద్వయం. -
ఉగ్రవాదమే అసలైన సమస్య.. పీ20 మీటింగ్‌లో ప్రధాని మోదీ
ఢిల్లీ: 2001 నాటి పార్లమెంట్‌పై ఉగ్రదాడిని గుర్తు చేశారు ప్రధాని మోదీ. ప్రపంచం మొత్తం ఉగ్రవాదంతో బాధపడుతోందని చెప్పారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఉగ్రవాద నిర్వచనంపై ఏకాభిప్రాయం సాధించకపోవడం బాధాకరమని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మనం ఎలా కలిసి పని చేయాలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పార్లమెంటులు ఆలోచించాలని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో 9వ G20 పార్లమెంటరీ స్పీకర్ల సమ్మిట్ (P20)ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత్ సరిహద్దులో ఉగ్రవాదంతో ఎన్నో ఏళ్లుగా పోరాడుతోందని చెప్పిన ప్రధాని మోదీ.. ఉగ్రవాదంతో ప్రపంచం మొత్తం అతిపెద్ద సవాళును ఎదుర్కొంటోందని అన్నారు. మానవత్వానికి ఇది వ్యతిరేకమని చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై స్పందించిన మోదీ.. ఘర్షణలు, నిర్బంధాలు సరైన ప్రపంచాన్ని సృష్టించబోవని తెలిపారు. పార్లమెంటరీ విధానాల పట్ల ప్రధాని మోదీ స్పందించారు. ప్రపంచం పార్లమెంటరీ విధానాల సంగమమని అన్నారు. ఈ విధానాలు మరింత బలోపేతమవుతున్నాయని చెప్పారు. జీ20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో ఏడాదంతా మనం సంబరాలు చేసుకున్నామని గుర్తుచేశారు. భారత్ 17 సార్వత్రిక ఎన్నికలను నిర్వహించిందని, 300 సార్లు రాష్ట్ర ఎన్నికలు జరిపినట్లు స్పష్టం చేశారు. పాన్ ఆఫ్రికన్ పార్లమెంట్ కూడా మొదటిసారి పీ20 సమ్మిట్‌లో పాల్గొంది. జీ20 విభాగంలో పాన్ ఆఫ్రికన్ ఇటీవలే చేరిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరిన మొదటి విమానం -
భారత్ స్వరం మరింత బలపడుతోంది
పితోర్‌గఢ్: సవాళ్లతోనిండిన ప్రపంచంలో భారత్ వాణి మరింత బలపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇటీవల ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించి భారత్ సత్తా చాటుకుందని తెలిపారు. గురువారం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి గత 30, 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కీలక అంశాలపై సైతం తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. చంద్రయాన్–3 మిషన్ విజయవంతమైందని తెలిపిన ప్రధాని మోదీ, చంద్రుడిపై వేరే ఏ దేశమూ చేరుకోని ప్రాంతంలోకి మనం వెళ్లగలిగామన్నారు. ‘ఒక సమయంలో దేశంలో నిరాశానిస్పృహలు ఆవరించి ఉండేవి. వేల కోట్ల రూపాయల కుంభకోణాల చీకట్ల నుంచి దేశం ఎప్పుడు బయటపడుతుందా అని ప్రజలు ప్రార్థించేవారు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిని అప్పటి ప్రభుత్వాలు విస్మరించాయి. వెనుకబడిన ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల ప్రజలు వలస బాట పట్టారు. పరిస్థితులు మారి అలా వెళ్లిన వారంతా ఇప్పుడు తిరిగి సొంతూళ్లకు వస్తున్నారు’అని ప్రధాని చెప్పారు. ‘ప్రపంచమంతటా సవాళ్లు నిండి ఉన్న ప్రస్తుత తరుణంలో భారత్ వాణి గట్టిగా వినిపిస్తోంది. ప్రపంచానికే భారత్ మార్గదర్శిగా మారడం మీకు గర్వకారణం కాదా? ఈ మార్పు మోదీ తీసుకువచ్చింది కాదు. రెండోసారి మళ్లీ అధికారం అప్పగించిన 140 కోట్ల దేశ ప్రజలది’అని ప్రధాని అన్నారు. గత అయిదేళ్లలో 13.50 కోట్ల ప్రజలను పేదరికం నుంచి తమ ప్రభుత్వం బయటకు తీసుకువచ్చిందన్నారు. పేదరికాన్ని అధిగమించగలమని దేశం నిరూపించిందని చెప్పారు. ఉత్తరాఖండ్ ప్రజలు తనను కుటుంబసభ్యునిగా భావించారని చెప్పారు. రూ.4,200 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఆదికైలాస శిఖరంపై ప్రధాని ధ్యానం అంతకుముందు, రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉదయం జోలింగ్‌కాంగ్ చేరుకున్న ప్రధాని మోదీకి సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘన స్వాగతం పలికారు. జోలింగ్‌కాంగ్‌లోని పార్వతీ కుండ్ వద్ద ఉన్న శివపార్వతీ ఆలయంలో ఆరతిచ్చి, శంఖం ఊదారు. గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించిన ప్రధాని పరమేశ్వరుని నివాసంగా భావించే ఆది కైలాస పర్వత శిఖరాన్ని సందర్శించుకున్నారు. అక్కడ కాసేపు ధ్యానముద్రలో గడిపారు. అనంతరం అక్కడికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిహద్దు గ్రామం గుంజికి చేరుకున్నారు. అక్కడి మహిళలు ఆయనకు స్వాగతం పలికారు. స్థానికులను ప్రధాని ఆప్యాయంగా పలకరించారు. ఉన్ని దుస్తులు, కళారూపాలతో ఏర్పాటైన ప్రదర్శనను తిలకించారు. భద్రతా సిబ్బందితోనూ ప్రధాని ముచ్చటించారు. అక్కడ్నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్మోరా జిల్లాలో పురాతన శివాలయం జగదేశ్వర్ ధామ్‌కు వెళ్లారు. అక్కడున్న జ్యోతిర్లింగానికి ప్రదక్షిణలు, పూజలు చేశారు. అక్కడి నుంచి ప్రధాని పితోర్‌గఢ్‌కు చేరుకున్నారు. అత్యల్పానికి నిరుద్యోగిత: మోదీ న్యూఢిల్లీ: నానాటికీ దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఫలితంగా ప్రస్తుతం దేశంలో నిరుద్యోగిత గత ఆరేళ్లలో అతి తక్కువగా నమోదైందని తెలిపారు. తాజాగా జరిపిన ఓ సర్వేలో ఈ మేరకు తేలిందని వివరించారు. స్కిల్ డెవలప్మెంట్, ఆంట్రప్రెన్యూర్షిప్ శాఖ కౌశల్ దీక్షాంత్ సమారోహ్ను ఉద్దేశించి గురువారం ఆయన వీడియో సందేశమిచ్చారు. భారత్‌లో కొన్నేళ్లుగా ఉపాధి కల్పన కొత్త శిఖరాలకు చేరుతోందంటూ హర్షం వెలిబుచ్చారు. ‘‘దేశంలో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిరుద్యోగిత బాగా తగ్గుముఖం పడుతోంది. అభివృద్ధి ఫలాలు పల్లెలను చేరుతున్నాయనేందుకు ఇది నిదర్శనం. ప్రగతిలో అవిప్పుడు పట్టణాలతో పోటీ పడుతూ దూసుకుపోతున్నాయి. అంతేకాదు, పనిచేసే మహిళల సంఖ్య భారీగా పెరుగుతుండటం మరో సానుకూల పరిణామం. ఇదంతా మహిళా సాధికారత దిశగా కొన్నేళ్లుగా కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాల పర్యవసానమే’’ అని మోదీ చెప్పారు. -
Vishala Reddy Vuyyala: విశాల ప్రపంచం
ఈ ఏడాది మనదేశంలో జీ 20 సదస్సులు జరిగాయి. దేశదేశాల ప్రతినిధులు మనదేశంలో అడుగుపెట్టారు. వారికి మనదేశం గురించి సరళంగా వివరించాలి. ఆ వివరణ మనకు గర్వకారణంగా సమగ్రంగా ఉండి తీరాలి. అందుకు ఒక గిఫ్ట్ బాక్స్‌ను రూపొందించారు విశాల రెడ్డి. మిల్లెట్ బ్యాంకు స్థాపకురాలిగా తన అనుభవాన్ని జోడించారు. మన జాతీయ పతాకాన్ని గర్వంగా రెపరెపలాడించారు. విశాలాక్షి ఉయ్యాల. చిత్తూరు జిల్లాలో ముల్లూరు కృష్ణాపురం అనే చిన్న గ్రామం ఆమెది. ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరైన జీ 20 సదస్సులో సమన్వయకర్తగా వ్యవహరించారు. మనదేశంలో విస్తరించిన అగ్రికల్చర్, కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్, కళావారసత్వాలను కళ్లకు కట్టారు. అంత గొప్ప అవకాశం ఆమెకు బంగారు పళ్లెంలో పెట్టి ఎవ్వరూ ఇవ్వలేదు. తనకు తానుగా సాధించుకున్నారు. ‘ఆడపిల్లకు సంగటి కెలకడం వస్తే చాలు, చదువెందుకు’ అనే నేపథ్యం నుంచి వచ్చారామె. ‘నేను బడికెళ్తాను’ పోరాట జీవితంలో ఆ గొంతు తొలిసారి పెగిలిన సమయమది. సొంతూరిలో ఐదవ తరగతి పూర్తయిన తర్వాత మండల కేంద్రంలో ఉన్న హైస్కూల్‌కి వెళ్లడానికి ఓ పోరాటం. కాళ్లకు చెప్పుల్లేకుండా పదికిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి చదువుకున్నారు. ఆ తర్వాత కాలేజ్... కుప్పంలో ఉంది. రోజూ ఇరవై– ఇరవై నలభై కిలోమీటర్ల ప్రయాణం. డిగ్రీ కర్నాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో. అప్పటికి ఇంట్లో పోరాడి కాలేజ్‌కి వెళ్లడానికి ఒక సైకిల్ కొనిపించుకోగలిగారామె. ప్రయాణ దూరం ఇంకా పెరిగింది. మొండితనంతో అన్నింటినీ గెలుస్తూ వస్తున్నప్పటికీ విధి ఇంకా పెద్ద విషమ పరీక్ష పెట్టింది. తల్లికి అనారోగ్యం. క్యాన్సర్‌కి వైద్యం చేయించడానికి బెంగుళూరుకు తీసుకువెళ్లడం, డాక్టర్లతో ఇంగ్లిష్‌లో మాట్లాడగలిగిన చదువు ఉన్నది ఇంట్లో తనకే. బీఎస్సీ సెరికల్చర్ డిస్కంటిన్యూ చేసి అమ్మను చూసుకుంటూ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిస్టెన్స్‌లో బీఏ చేశారు. అమ్మ ఆరోగ్యం కోసం పోరాటమే మిగిలింది, అమ్మ దక్కలేదు. ఆమె పోయిన తర్వాత ఇంట్లో వాళ్లు ఏడాది తిరక్కుండా పెళ్లి చేసేశారు. మూడవ నెల గర్భిణిగా పుట్టింటికి రావాల్సి వచ్చింది. ఎనిమిది నెలల బాబుని అక్క చేతిలో పెట్టి హైదరాబాద్‌కు బయలుదేరారు విశాలాక్షి ఉయ్యాల. ‘తొలి ఇరవై ఏళ్లలో నా జీవితం అది’... అంటారామె. ‘మరో ఇరవై ఏళ్లలో వ్యక్తిగా ఎదిగాను, మూడవ ఇరవైలో వ్యవస్థగా ఎదుగుతున్నా’నని చెప్పారామె. హైదరాబాద్ నిలబెట్టింది! ‘‘చేతిలో పదివేల రూపాయలతో నేను హైదరాబాద్‌లో అడుగు పెట్టిన నాటికి ఈవెంట్స్ రంగం వ్యవస్థీకృతమవుతోంది. ఈవెంట్స్ ఇండస్ట్రీస్ కోర్సులో చేరిపోయాను. ఇంగ్లిష్ భాష మీద పట్టుకోసం బ్రిటిష్ లైబ్రరీ, రామకృష్ణ మఠం నుంచి పుస్తకాలు తెచ్చుకుని చదివేదాన్ని. మొత్తానికి 2004లో నెలకు మూడు వేల జీతంతో ఈవెంట్ మేనేజర్‌గా ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత నోవాటెల్‌లో ఉద్యోగం నా జీవితానికి గొప్ప మలుపు. ప్రపంచస్థాయి కంపెనీలలో ఇరవైకి పైగా దేశాల్లో పని చేయగలిగాను. నా పేరుకు కూడా విశాలత వచ్చింది చేసుకున్నాను. హైదరాబాద్‌లో రహగిరి డే, కార్ ఫ్రీ డే, వన్ లాక్ హ్యాండ్స్ వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాను. ప్రదేశాలను మార్కెట్ చేయడంలో భాగంగా హైదరాబాద్‌ని మార్కెట్ చేయడంలో భాగస్వామినయ్యాను. ఒక ప్రదేశాన్ని మార్కెట్ చేయడం అంటే ఆ ప్రదేశంలో విలసిల్లిన కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్ అన్నింటినీ తెలుసుకోవాలి, వచ్చిన అతిథులకు తెలియచెప్పాలి. అలాగే రోడ్ల మీద ఉమ్మడం, కొత్తవారి పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి పనులతో మన ప్రదేశానికి వచ్చిన వ్యక్తికి చేదు అనుభవాలు మిగల్చకుండా పౌరులను సెన్సిటైజ్ చేయాలి. ఇవన్నీ చేస్తూ నా రెండవ ఇరవై ముగిసింది. అప్పుడు కోవిడ్ వచ్చింది. హాలిడే తీసుకుని మా ఊరికి వెళ్లాలనిపించింది. అప్పుడు నా దగ్గరున్నది పదివేలు మాత్రమే. నాకు అక్కలు, అన్నలు ఏడుగురు. నా కొడుకుతోపాటు వాళ్ల పిల్లలందరినీ చదివించాను. అప్పటికి నేను పెట్టిన స్టార్టప్ మనుగడ కూడా ప్రశ్నార్థకమైంది. పదివేలతో వచ్చాను, ఇరవై ఏళ్ల తర్వాత పదివేలతోనే వెళ్తున్నాను... అనుకుంటూ మా ఊరికెళ్లాను. ఊరు కొత్త దారిలో నడిపించింది! నా మిల్లెట్ జర్నీ మా ఊరి నుంచే మొదలైంది. మా అక్క కేజీ మిల్లెట్స్ 15 రూపాయలకు అమ్మడం నా కళ్ల ముందే జరిగింది. అవే మిల్లెట్స్ నగరంలో యాభై రూపాయలు, వాటిని కొంత ప్రాసెస్ చేస్తే వంద నుంచి రెండు– మూడు వందలు, వాటిని రెడీ టూ కుక్‌గా మారిస్తే గ్రాములకే వందలు పలుకుతాయి. తినే వాళ్లకు పండించే వాళ్లకు మధ్య ఇంత అగాథం ఎందుకుంది... అని ఆ అఖాతాన్ని భర్తీ చేయడానికి నేను చేసిన ప్రయత్నమే మిల్లెట్ బ్యాంక్. ఈ బ్యాంక్‌ను మా ఊరిలో మొదలు పెట్టాను. ఒక ప్రదేశం గురించి అక్కడి అగ్రికల్చర్, కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్ అన్నీ కలిస్తేనే సమగ్ర స్వరూపం అవగతమవుతుంది. నేను చేసింది అదే. మా మిల్లెట్ బ్యాంకు జీ 20 సదస్సుల వరకు దానంతట అదే విస్తరించుకుంటూ ఎదిగింది. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, చేర్యాల పెయింటింగ్స్, ఉత్తరాది కళలు, మన రంగవల్లిక... అన్నింటినీ కలుపుతూ ఒక గిఫ్ట్ బాక్స్ తయారు చేశాను. ప్రతినిధులకు, వారి భాగస్వాములకు భారతదేశం గురించి సమగ్రంగా వివరించగలిగాను. జీ20 ద్వారా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న నా మిల్లెట్ బ్యాంకు మరింతగా వ్యవస్థీకృతమై ఒక అమూల్లాగా ఉత్పత్తిదారుల సహకారంతో వందేళ్ల తర్వాత కూడా మనగలగాలనేది నా ఆకాంక్ష. మిల్లెట్ బ్యాంకుకు అనుబంధంగా ఓ ఇరవై గ్రీన్ బాక్స్‌లు, సీడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయాలి. రైతును తన గింజలు తానే సిద్ధం చేసుకోగలిగినట్లు స్వయంపోషకంగా మార్చాలనేది రైతు బిడ్డగా నా కోరిక’’ అని మిల్లెట్ బ్యాంకు, సీడ్ బ్యాంకు స్థాపన గురించి వివరించారు విశాలరెడ్డి. స్త్రీ ‘శక్తి’కి పురస్కారం టీసీఈఐ (తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ) నిర్వహిస్తున్న ‘స్త్రీ శక్తి అవార్డ్స్ 2023’ అవార్డు కమిటీకి గౌరవ సభ్యురాలిని. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్, గచ్చిబౌలిలో పురస్కార ప్రదానం జరుగుతుంది. గడచిన ఐదేళ్లుగా స్త్రీ శక్తి అవార్డ్స్ ప్రదానం జరగనుంది. ఇప్పటి వరకు తెలంగాణకు పరిమితమైన ఈ అవార్డులను ఈ ఏడాది జాతీయస్థాయికి విస్తరించాం. పదిహేనుకు పైగా రాష్ట్రాలతోపాటు మలేసియా, యూఎస్‌లలో ఉన్న భారతీయ మహిళల నుంచి కూడా ఎంట్రీలు వచ్చాయి. అర్హత కలిగిన ఎంట్రీలు 250కి పైగా ఉండగా వాటిలో నుంచి 50 మంది అవుట్ స్టాండింగ్ ఉమెన్ లీడర్స్ పురస్కారాలందుకుంటారు. జీవితంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారు, ఆత్మస్థయిర్యం కోల్పోకుండా ముందుకు సాగిన వైనం, వారు సాధించిన విజయాలు– చేరుకున్న లక్ష్యాలు, ఎంతమందికి ఉపాధినిస్తున్నారు, వారి భవిష్యత్తు ప్రణాళికలు కార్యాచరణ ఎలా ఉన్నాయనే ప్రమాణాల ఆధారంగా విజేతల ఎంపిక ఉంటుంది. – విశాల రెడ్డి ఉయ్యాల ఫౌండర్, మిల్లెట్ బ్యాంకు – వాకా మంజులారెడ్డి ఫొటోలు: ఎస్. ఎస్. ఠాకూర్ -
మోదీ చాలా తెలివైన వ్యక్తి: పుతిన్
మాస్కో: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. మోదీని "చాలా తెలివైన వ్యక్తి" అని అభివర్ణించారు. మోదీ నాయకత్వంలో భారతదేశం గొప్ప పురోగతి సాధిస్తోందని చెప్పారు. ఆర్థిక భద్రత, సైబర్ నేరాలకు వ్యతిరేక పోరాటంలో రష్యా , భారతదేశం మధ్య మరింత సహకారం కొనసాగిస్తామని వ్లాదిమిర్ పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్లాదిమిర్ పుతిన్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. "ప్రధాని మోదీతో మేము చాలా మంచి రాజకీయ సంబంధాలను పంచుకుంటున్నాము. ఆయన చాలా తెలివైన వ్యక్తి. మోదీ నాయకత్వంలో భారతదేశం గొప్ప పురోగతిని సాధిస్తోంది" అని పుతిన్ అన్నారు. G20 సమ్మిట్‌లో న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించిన అనంతరం ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసలు కురిపించడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్‌లో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో శాంతిని నెలకొల్పాలని డిక్లరేషన్ పిలుపునిచ్చింది. అయితే రష్యాపై మాత్రం నిందలు వేయలేదు.ఈ క్రమంలో న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను మాస్కో కూడా స్వాగతించింది. ప్రపంచ జీ20 చరిత్రలో ఇదో మైలురాయి అని పేర్కొంది. G20 దేశాల్లో గ్లోబల్ సౌత్‌ను ఏకీకృతం చేయడంలో భారత అధ్యక్ష పదవిలో క్రియాశీల పాత్రను ప్రశంసించింది. ఇదీ చదవండి: Lumbini and Pokhara Airport Issue: చైనా ఆటలకు నేపాల్‌లో భారత్ కళ్లెం! -
ఐటీ హబ్‌గా విశాఖ
సాక్షి, అమరావతి: రానున్న కాలంలో విశాఖ నగరం ఐటీ ఉద్యోగాలకు కేంద్రంగా మారనుంది. ఈ రంగంలో కొత్తగా కెరీర్ ప్రారంభించే వారికి అది అవకాశాల గని కానుంది. ముఖ్యంగా ఐటీ, ఐటీ ఆధారిత రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. వచ్చే ఐదేళ్ల కాలంలో ఐటీ రంగంలో ఒక్క విశాఖపట్నంలోనే ఐదులక్షలకు పైగా ఉపాధి అవకాశాలు వస్తాయని పల్సస్ గ్రూపు తన అధ్యయన నివేదికలో వెల్లడించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో పాటు ఇక్కడ ఉపాధి అవకాశాలపై అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించడంతో ఐటీ హబ్‌గా విశాఖ వేగంగా ఎదుగుతోందని పల్సస్ గ్రూపు సీఈఓ శ్రీనుబాబు గేదెల తెలిపారు. ఇప్పటికే ఇన్ఫోసిస్, రాండ్‌స్టాండ్, అమెజాన్, అదానీ డేటాసెంటర్ వంటివి రావడంతో పాటు ఆంధ్రయూనివర్సిటీలో ఆర్టీఫిన్ యల్ ఇంటెలిజెన్స్‌పై సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ, పారిశ్రామిక రంగంలో నాలుగో తరం టెక్నాలజీని ప్రోత్సహించేందుకు కల్పతరువు పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీలు ఇక్కడ ఏర్పాటుకావడంతో అంతులేని ఉపాధి అవకాశాల నిధిగా విశాఖ ఎదుగుతోందన్నారు. ఈ ఏడాది భారతదేశం జీ20 సమావేశాలకు వేదికగా ఎంపిక కావడంతో ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని ఫార్మాస్యూటికల్, హెల్త్‌కేర్, ఐటీ, ఐటీ ఆధారిత సేవల్లో విశాఖపట్ననికి ఉన్న అవకాశాలు, అందుబాటులో ఉన్న మానవ వనరులను ప్రపంచ దేశాలకు వివరించినట్లు తెలిపారు. రాష్ట్రం నుంచి ఏటా మూడు లక్షలకు పైగా విద్యార్థులు డిగ్రీ పట్టాలను అందుకుంటుంటే అందులో ఒక్క విశాఖ చుట్టుపక్కల నుంచే 1.5 లక్షల మంది వస్తున్నారు. ఉపాధి అవకాశాలు కల్పించడంలో విశాఖకు ఇది కలిసొచ్చే అతిపెద్ద అంశమని ఆ నివేదికలో పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో కొలువుల పండగ.. ఇక రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు రానుండగా అందులో ఒక్క విశాఖలోనే 5 లక్షల ఉద్యోగాలు రానున్నట్లు పల్సస్ గ్రూపు అంచనా వేసింది. ఇందులో ఒక్క ఆర్టీఫిన్ యల్ ఇంటెలిజెన్స్ రంగంలోనే విశాఖలో 50,000 ఉద్యోగాలు వస్తాయని ఆ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం విశాఖలోని ఐటీ రంగం 25,000 మందికి ఉపాధి కల్పిస్తుంటే హెల్త్‌కేర్, ఫార్మా, మెరైన్ ఇండస్ట్రీస్, పర్యాటకం, రక్షణ, విద్య వంటి రంగాలు లక్ష మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ సంఖ్య ఐదేళ్లలో ఐదు లక్షలకు చేరుతుందని శ్రీనుబాబు వివరించారు. -
మన దౌత్యం...కొత్త శిఖరాలకు
న్యూఢిల్లీ: గత నెల రోజుల్లో భారత దౌత్య ప్రతిభ నూతన శిఖరాలను తాకిందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా 21వ శతాబ్దిలో ప్రపంచ గతిని నిర్ణయించే పలు కీలక నిర్ణయాలకు ఢిల్లీ వేదికగా ఇటీవల జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు వేదికైందన్నారు. నేటి భిన్న ధ్రువ ప్రపంచంలో అన్ని దేశాలను ఒకే వేదిక మీదికి తేవడం చిన్న విషయమేమీ కాదన్నారు. ‘దేశ వృద్ధి ప్రస్థానం నిర్నిరోధంగా సాగాలంటే స్వచ్ఛమైన, స్పష్టమైన, సుస్థిరమైన పాలన చాలా ముఖ్యం. ప్రస్తుతం దేశంలో చోటుచేసుకుంటున్న సానుకూల పరిణామాలు, మార్పులకు రాజకీయ స్థిరత్వం, విధాన స్పష్టత, పాలనలో ప్రతి అడుగులోనూ పాటిస్తున్న ప్రజాస్వామిక విలువలే ప్రధాన కారణం‘ అని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఇక్కడ జీ20 కనెక్ట్ లో విద్యార్థులు, బోధన సిబ్బంది, విద్యా సంస్థల అధిపతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అవినీతిని, వ్యవస్థలో లీకేజీలను అరికట్టేందుకు, దళారుల జాడ్యాన్ని నిర్మూలించేందుకు, పథకాల అమలుకు టెక్నాలజీని గరిష్టంగా వాడుకునేందుకు గత తొమ్మిదేళ్లలో తమ సర్కారు చిత్తశుద్ధితో ప్రయతి్నంచిందని చెప్పారు. భారత్, ద హ్యాపెనింగ్ ప్లేస్! భారత్ ఇప్పుడు ఎన్నో కీలక సంఘటనలకు వేదికగా మారుతోందని మోదీ అన్నారు. ‘గత నెల రోజుల ఘటనలే ఇందుకు నిదర్శనం. దానిపై ప్రగతి నివేదిక ఇవ్వదలచుకున్నా. అప్పుడు నూతన భారతం వృద్ధి పథంలో పెడుతున్న పరుగుల తాలూకు వేగం, తీవ్రత అర్థమవుతాయి. గత నెల వ్యవధిలో నేను ఏకంగా 85 దేశాల అధినేతలతో భేటీ అయ్యా. ఇక ఆగస్టు 23ను మనమెప్పటికీ గుర్తుంచుకోవాలి. అది భారత్ సగర్వంగా చంద్రుని మీద అడుగు పెట్టిన రోజు. ప్రపంచమంతా మన వాణిని విన్న రోజు. మనందరి పెదవులపై గర్వంతో కూడిన దరహాసం వెలిగిన రోజు. అందుకే జాతీయ అంతరిక్ష దినంగా ఆగస్ట్ 23 మన దేశ చరిత్రలో అజరామరంగా నిలవనుంది. ఆ విజయపు ఊపులో వెనువెంటనే సౌర యాత్రకు మనం శ్రీకారం చుట్టాం‘ అన్నారు. ఇక మామూలుగా కేవలం ఒక దౌత్య భేటీగా జరిగే జీ20 సదస్సును మన ప్రయత్నాలతో పౌర భాగస్వామ్యంతో కూడిన జాతీయ ఉద్యమంగా మలచుకున్నాం. ఢిల్లీ డిక్లరేషన్‌కు జీ20 దేశాల నుంచి 100 శాతం ఏకాభిప్రాయం దక్కడం ప్రపంచ స్థాయిలో పతాక శీర్షికలో నిలిచింది. ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్య దేశంగా చేరింది. ఇలాంటివన్నీ ఆ సదస్సు సారథ్య సందేశంగా మనం సాధించిన ఘనతలే. అంతేకాదు, భారత ప్రయత్నాల వల్ల మరో ఆరు దేశాలు బ్రిక్స్ కూటమిలో చేరాయి‘ అని వివరించారు. వీరికి అందలం, వారికి అరదండాలు! నేడు మన దేశంలో నిజాయితీపరులకు గుర్తింపు, అవినీతిపరులకు తగిన శిక్ష దక్కుతున్నాయని మోదీ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మధ్య తరగతి శ్రేయస్సు కోసం గత నెల రోజుల్లో కేంద్రం ఎన్నో పథకాలు తెచ్చింది. పీఎం విశ్వకర్మ యోజన, రోజ్ గార్ మేళాతో లక్ష మంది యువతకు ఉపాధి వంటివన్నీ వాటిలో భాగమే‘ అన్నారు. ‘మన దేశం మీద అంతర్జాతీయంగా భరోసా ఇనుమడిస్తోంది. విదేశీ పెట్టుబడుల వెల్లువ రికార్డులు తాకుతోంది. కేవలం ఐదేళ్లలో 13.5 కోట్ల భారతీయులు పేదరికం నుంచి బయటపడి నూతన మధ్య తరగతిగా రూపుదాల్చారు‘ అని వివరించారు. యువతా! కలసి నడుద్దాం...! జీ20 సదస్సు ఘన విజయానికి యువత భాగస్వామ్యం ప్రధాన కారణమని మోదీ అన్నారు. లోకల్ నినాదానికి ఊపు తెచ్చేందుకు కాలేజీ, వర్సిటీ క్యాంపస్ లు కేంద్రాలుగా మారాలని ఆశాభావం వెలిబుచ్చారు. ‘ఖాదీ దుస్తులు ధరించడం ద్వారా వాటికి ప్రాచుర్యం కల్పించండి. క్యాంపస్‌లలో ఖాదీ ఫ్యాషన్ షోలు పెట్టండి’ అని యువతను కోరారు. ‘మన స్వాతంత్య్ర యోధుల్లా దేశం కోసం మరణించే అదృష్టం మనకు లేదు. కనీసం దేశం కోసం జీవితాలను అంకితం చేసే సదవకాశం మాత్రం మనందరికీ ఉంది’ అని గుర్తు చేశారు. వందేళ్ల క్రితం యువత స్వరాజ్య భారతం కోసం కదం తొక్కింది. మనమిప్పుడు సమృద్ద భారతం కోసం పాటుపడదాం. రండి, కలసి నడుద్దాం!‘ అని పిలుపునిచ్చారు. -
ప్రెసిడెన్షియల్ సూట్ వద్దన్నాడు.. విమానాన్ని కాదన్నాడు!
న్యూఢిల్లీ: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌లో జీ20 సదస్సుకి వచ్చినప్పుడు కాస్త విభిన్నంగా వ్యవహరించినట్టుగా ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. వివిధ దేశాల అధినేతల కోసం కేంద్ర ప్రభుత్వం హోటల్స్‌లో భారీగా భద్రత ఏర్పాట్లు చేసిప్రెసిడెన్షియల్ సూట్లను సిద్ధం చేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కోసం హోటల్ లలిత్‌లో ప్రెసిడెన్షియల్ సూట్ ఏర్పాటు చేశారు. ట్రూడో దానిని తిరస్కరించి అదే హోటల్లో సాధారణ గదిలో బస చేశారు. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని అభాండాలు వేస్తున్న ట్రూడో తన భద్రతాధికారుల సూచన మేరకే ఇలా చేసినట్టుగా తెలుస్తోంది. అదే విధంగా ట్రూడో సొంత విమానానికి సాంకేతిక లోపాలు తలెత్తి ఆయన ప్రయాణం వాయిదా పడింది. అప్పుడు భారత్ ఎయిర్ ఇండియా వన్ విమానాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినా ట్రూడో తిరస్కరించారు. తన విమానం సిద్ధమయ్యాక రెండు రోజుల తర్వాత సెప్టెంబర్ 12న బయల్దేరి వెళ్లారు. -
Live: ముగిసిన కేబినెట్ భేటీ
Updates.. ►కేబినెట్ భేటీ ముగిసింది. ఏ అంశంపై చర్చించారనే విషయం బయటకు వెలువరించలేదు. పలు కీలక బిల్లులపై చర్చ జరిగినట్లు సమాచారం. రేపటి నుంచి పార్లమెంట్ కొత్త భవనంలో నిర్ణయాత్మకమైన బిల్లులపై చర్చ జరగనుంది. ►పార్లమెంట్ భవనంలో కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభం అయింది. ► ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. రేపు మధ్యాహ్నం 1:15 గంటలకు లోక్ సభ, 2:15 గంటలకు రాజ్య సభ ప్రారంభం అవుతాయని స్పీకర్ వెల్లడించారు. ►ప్రధాని మోదీ నిర్ణయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 6:30కు ప్రారంభం కానున్న కెబినెట్ భేటీకి ముందు కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ కీలక సమావేశాలు నిర్వహించారు. అమిత్ షాతో భేటీ అనంతరం ఇద్దరు కేంద్ర మంత్రులతో సమావేశం జరిపారు. కేంద్ర మంత్రుల భేటీ అజెండాపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎలాంటి ముందస్తు నోట్ లేకుండానే కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ► చంద్రబాబు అరెస్టుపై లోక్‌సభలో టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ తప్పుడు ప్రచారాన్ని అడ్డుకున్న వైఎస్ఆర్సీపి ఎంపీలు మిథున్ రెడ్డి, మార్గాన్ని భరత్. స్కిల్ స్కాంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడని లోక్ సభలో మిథున్ రెడ్డి అన్నారు. ఫేక్ జీవోలు ఇచ్చి, రూ.371 కోట్ల రూపాయల లూటీ చేశారని మండిపడ్డారు. దోచిన మొత్తాన్ని 80 షెల్ కంపెనీలకు పంపారని అన్నారు. ఈ కేసులో నగదు ఎక్కడెక్కడికి వెళ్లిందో ఈడీ స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. చిట్టచివరికి చట్టానికి చంద్రబాబు చిక్కారు. ఐటీ కేసులో సైతం నోటీసులు అందుకున్నారని తెలిపిన మిథున్ రెడ్డి.. చంద్రబాబు పీఏ దేశం విడిచి పారిపోయాడని చెప్పారు. ► కొత్త పార్లమెంట్లోనైనా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఫన్నీగా ఉన్నాయని చెప్పారు. విశ్వాసమున్న నేతలనే ప్రజలు నమ్ముతారని అన్నారు. సీఎం కేసీఆర్‌ను ప్రజలు మూడోసారి ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ► పాత పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఎంపీ నామా నాగేశ్వర్ రావు అన్నారు. తెలంగాణ ఏర్పాటు చేదు అనుభవం మిగిల్చిందని ప్రధాని మోడీ అన్నట్లు గుర్తు చేసిన నామా.. ప్రస్తుతం తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. తలసరి ఆదాయంలో మొదటి స్థానంలో ఉన్నామని చెప్పారు. ఇద్దరు ఎంపీలతో పార్లమెంట్లో అడుగుపెట్టి అందర్ని కూడగట్టారని సీఎం కేసీఆర్‌ని కొనియాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, బీసీ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. ► సాయంత్రం 6:30 కు పార్లమెంట్ భవనంలో కేంద్ర క్యాబినెట్ సమావేశం కానుంది. నూతన బిల్లులపై చర్చించే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ► పార్లమెంటు రాజ్యాంగ సభ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ► 75 ఏళ్ల పార్లమెంటు ప్రస్థానంపై లోక్ సభలో చర్చ జరిగింది. వైఎస్ఆర్సీపి తరఫున చర్చలో పాల్గొన్న ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్ర ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా హామీ ఇచ్చి పదేళ్లు గడుస్తున్న ఇంకా ఇవ్వలేదని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం గొప్ప పరిణామం అని అన్నారు. పార్లమెంటు పని దినాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలకు 30శాతం సమయం కేటాయించాలని కోరారు. ► పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ సెషన్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. ఈ నెల 20న మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో కొంత కాలంగా పెండింగ్‌లో ఉంది. ► పార్లమెంట్ ఎదుట గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఎంపీల నిరసన. #WATCH | BRS MPs hold a protest demanding the Women's Reservation Bill, near the Gandhi statue on Parliament premises. pic.twitter.com/XI0ccy1ymI — ANI (@ANI) September 18, 2023 ► కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ చెప్పినట్లుగా ఈ భవనం చాలా జ్ఞాపకాలతో నిండి ఉంది, ఇది చరిత్రతో నిండి ఉంది. ఇది విచారకరమైన క్షణం. కొత్త భవనంలో మెరుగైన సౌకర్యాలు, కొత్త సాంకేతికత, మరిన్ని సౌకర్యాలు ఉండాలని ఆశిద్దాం. పార్లమెంట్ సభ్యులు.. చరిత్ర, జ్ఞాపకాలతో నిండిన భవనాన్ని విడిచిపెట్టడం ఎల్లప్పుడూ భావోద్వేగ క్షణం అని అన్నారు. #WATCH | Congress MP Shashi Tharoor says, "Well this building is full of memories as the PM also said, it is full of history. It will be a sad moment. Let's hope that the new building has better facilities, new technology and more convenience for the members of the… pic.twitter.com/u6fVbLyBMq — ANI (@ANI) September 18, 2023 ► రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు నిరసనలు చేపట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని నిరసనలు తెలిపారు. ► లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన సమయమిది. చారిత్రక పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతున్నాం. ఈ 75 ఏళ్ల ప్రయాణం ఎంతో గర్వకారణమైంది. ఈ ప్రయాణంలో ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నాం. భారతీయులు స్వేదం, డబ్బుతో ఈ భవనాన్ని నిర్మించాం. ఈ పార్లమెంట్ భవనం మనల్ని ఎప్పుడూ ఉత్తేజపరుస్తూనే ఉంటుంది. మనం కొత్త భవనంలోకి వెళ్తునప్పటికీ పాత భవనం భావితరాలకు స్ఫూర్తినిస్తుంది. చంద్రయాన్-3 విజయం దేశాన్ని సాంకేతికంగా అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తుంది. ఇది మన శాస్త్రవేత్తల సామర్థ్యానికి ప్రతీక. చంద్రయాన్-3 విజయంతో మన సత్తా చాటాం. భారత్ అభివృద్ధి ప్రపంచమంతా ప్రకాశిస్తోంది. ► ఈ భవనానికి వీడ్కోలు పలకడం భావోద్వేగానికి గురిచేస్తోంది. పాత పార్లమెంట్‌తో ఎంతో అనుబంధం ఉంది. పార్లమెంట్లో తొలిరోజు నేను భావోద్వేగానికి గురయ్యాను. ప్రజల సందర్శనకు పాత పార్లమెంట్ భవన్ తెరిచే ఉంటుంది. ప్రారంభంలో మహిళా ఎంపీల సంఖ్య తక్కువగా ఉండేది. క్రమంగా వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ► పార్లమెంట్‌లోకి వెళ్తే గుడిలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ప్రజాస్వామ్యానికి జీవాత్మలాంటిదైన పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగింది. పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడిని భారత్ ఎప్పటికీ మరిచిపోదు. ఉగ్రదాడి నుంచి పార్లమెంట్‌ను రక్షించిన సైనికులకు సెల్యూట్. ఇంద్రజిత్ గుప్తా 43 ఏళ్లు ఈ భవనంలో సేవలందించారు. దళితులు, ఆదివాసీ, మధ్య తరగతి మహిళలకు ఈ సభ అవకాశమిచ్చింది. ► నెహ్రు, అంబేద్కర్ నడయాడిన సభ ఇది. ఓ పేదవాడు పార్లమెంట్లో అడుగుపెడతారని ఎవరైనా ఊహించారా?. నెహ్రు నుంచి మన్మోహన్ సింగ్ వరకూ ఎందరో ప్రధానులు సమావేశాలకు నాయకత్వం వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మన హీరోలను గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది. ఈ 75ఏళ్లలో 7500 మంది ఎంపీలు, 17 మంది స్పీకర్లు పనిచేశారు. ► 1996లో పార్లమెంట్లో వాజ్‌పేయి ప్రసంగం పాపులర్ అయ్యింది. నెహ్రు, వాజ్‌పేయి ప్రసంగాలు పార్లమెంట్లో ప్రతిధ్వనిస్తుంటాయి. ఈ పార్లమెంట్‌లోనే ఆర్టికల్ 370 రద్దు చేశాం. వన్ నేషన్-వన్ ట్యాక్స్ తీసుకొచ్చింది ఇక్కడే. జీఎస్టీకి తీర్మానం చేశాం. తెలంగాణ ఏర్పాటు కూడా ఈ భవనంలోనే జరిగింది. #WATCH | Special Session of Parliament | In Lok Sabha, PM Modi says, "...All of us are saying goodbye to this historic building. Before independence, this House was the place for the Imperial Legislative Council. After independence, this gained the identity of Parliament House.… pic.twitter.com/GRWUlr69U2 — ANI (@ANI) September 18, 2023 సమిష్టి కృషి వల్లే జీ20 విజయవంతం.. ► సమిష్టి కృషి వల్లే జీ20 విజయవంతమైంది. భారత్ నిర్మాణాన్ని గర్వంగా చెప్పుకోవాలి. జీ20 విజయం దేశ ప్రజలందరిది. జీ20 విజయాన్ని ప్రపంచం మొత్తం కీర్తిస్తోంది. జీ20 విజయం ఫెడరల్ స్ఫూర్తికి నిదర్శనం. జీ20లో ఆఫ్రికా యూనియన్ను భాగస్వామిని చేశాం. అనేక రంగాల్లో భారత్ గణనీయంగా అభివృద్ధి చెందింది. భారత్ ఇప్పుడు అన్ని దేశాలకు విశ్వమిత్రగా మారుతోంది. ►ప్రత్యేక సమావేశాల సందర్బంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జీ20 సక్సెస్‌ను సభకు వివరించారు. లోక్‌సభలో ఓం బిర్లా మాట్లాడుతూ.. జీ20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించుకున్నాం. జీ20 విజయవంతం దేశ ప్రజలందరికీ గర్వకారణం. గ్లోబల్ ఆఫ్ ది సౌత్ వాయిస్‌ను భారత్ వినిపించింది. ప్రపంచ దేశాలు భారత్‌ను మెచ్చుకున్నాయి. జీ20 కీలక నిర్ణయాలు తీసుకుంది. మోదీ సమర్థతతోనే జీ20 విజయవంతమైంది. భారత్-యూరప్ ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు విప్లవాత్మక చర్య. #WATCH | Special Session of the Parliament | Lok Sabha Speaker Om Birla says "I want to congratulate each and every Indian for the successful organisation of the G20 Summit. I also appreciate PM Modi's vision to dedicate this Summit to the people of the country. India's… pic.twitter.com/og2faC7xeX — ANI (@ANI) September 18, 2023 ► రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ ఎంపీ దినేశ్ శర్మ ప్రమాణం చేశారు. #WATCH | Special Session of Parliament | BJP leader Dinesh Sharma takes oath as a Member of the Parliament (MP) in Rajya Sabha. pic.twitter.com/avCL5Ws1qX — ANI (@ANI) September 18, 2023 ► లోక్‌సభ ప్రారంభంలోనే టెక్నికల్ ఇష్యూ కారణంగా సభలో కాసేపు గందరగోళం నెలకొంది. ►పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగునున్నాయి. ఈ సమావేశాల్లో పార్లమెంట్ ప్రస్థానంపై ఉభయసభల్లో చర్చ జరుగనుంది. ► పార్లమెంట్ సమావేశాలకు హాజరైన అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ ఎంపీలు. Union Home Minister Amit Shah and Defence Minister Rajnath Singh arrive at the Parliament. pic.twitter.com/lmJ7M5okdg — ANI (@ANI) September 18, 2023 ► పార్లమెంట్ సమావేశాలకు హాజరైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. #WATCH | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrives at the Parliament. pic.twitter.com/FP3nhi430m — ANI (@ANI) September 18, 2023 ► పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఇండియా కూటమి సభ్యులు పాల్గొననున్నారు. ఈ సందర్బంగా అవసరమైన విషయాలపై తమ వాదనలు వినిపించనున్నారు. INDIA bloc parties decide to participate in the special session of Parliament and will raise important issues: Sources — ANI (@ANI) September 18, 2023 జీ20 సక్సెస్ భారత్‌కు గర్వకారణం: మోదీ ► పార్లమెంట్లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఈ పార్లమెంట్ భవనం చారత్రక కట్టడం. పార్లమెంట్ దేశ ప్రతిష్టను పెంపొందించింది. పార్లమెంట్ భవనంపై మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలి. పార్లమెంట్లో గందరగోళ పరిస్థితులు లేకుండా సజావుగా జరుపుకుందాం. పాత పార్లమెంట్లో ఇది చివరి సమావేశం. రేపటి నుంచి కొత్త పార్లమెంట్లో సమావేశాలు జరుగుతాయి. #WATCH | Prime Minister Narendra Modi says "Tomorrow, on Ganesh Chaturthi, we will move to the new Parliament. Lord Ganesha is also known as ‘Vighnaharta’, now there will be no obstacles in the development of the country... 'Nirvighna roop se saare sapne saare sankalp Bharat… pic.twitter.com/P2DZmG3SRF — ANI (@ANI) September 18, 2023 ► వినాయక చతుర్థి సందర్భంగా కొత్త పార్లమెంట్లో అడుగుపెడుతున్నాం. ఎలాంటి విఘ్నాలు కలుగకుండా గణేషుడు చూడాలని ప్రార్థిస్తున్నాను. ► సకల వసతులతో యశోభూమిని నిర్మించుకున్నాం. యశోభూమి అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ కూడా నిన్న దేశానికి అంకితం చేయబడింది. చంద్రయాన్-3 విజయవంతం కావడంతో భారత్ జెండా చంద్రుడిపై రెపరెపలాడుతోంది. శివశక్తి పాయింట్ కొత్త స్ఫూర్తి కేంద్రంగా మారింది. తిరంగా పాయింట్ మనలో గర్వాన్ని నింపుతోంది. ఇటువంటి భారత్ కీర్తి పెంచుతున్నాయి. దీంతో, అనేక అవకాశాలు భారత్ ముందుకు వస్తున్నాయి. #WATCH | Before the commencement of the Special Session of Parliament PM Narendra Modi says, "Success of Moon Mission --- Chandrayaan-3 has hoisted our Tiranga, Shiv Shakti Point has become a new centre of inspiration, Tiranga Point is filling us with pride. Across the world,… pic.twitter.com/sUTPpqCaXu — ANI (@ANI) September 18, 2023 ► జీ20 విజయాన్ని ప్రపంచాధినేతలు ప్రశంసించారు. భారత్ సత్తా ఏంటో చూపించాం. భారత్ పురోగతిని ప్రపంచమంతా కొనియాడుతోంది. జీ20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించాం. ఆధునిక భారత్ సాకారమవుతోంది. భారత్ పురోగతిని ప్రపంచం కొనియాడుతోంది. ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్యత్వం పొందినందుకు భారత్ ఎప్పుడూ గర్వపడుతుంది. ఇవన్నీ భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతం. #WATCH | Prime Minister Narendra Modi says "...India will always be proud that we became the voice of the Global South during the G20 Summit and that the African Union became a permanent member of the G20. All this is a signal of India's bright future. 'YashoBhoomi' an… pic.twitter.com/UXhtqEZ0GJ — ANI (@ANI) September 18, 2023 ► పార్లమెంట్ వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ.. #WATCH | Prime Minister Narendra Modi arrives at the Parliament. pic.twitter.com/FvnJlu1yxH — ANI (@ANI) September 18, 2023 సాక్షి, ఢిల్లీ: నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగునున్నాయి. ప్రత్యేక సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలు లేకుండానే నేరు పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవనున్నాయి. ఈ సందర్భంగా 75 ప్రస్థానంపై చర్చ జరుగనుంది. ► ఈ క్రమంలో పార్లమెంట్ 75 ఏళ్లలో సాధించిన విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, పాఠాలు అనే అంశంపై చర్చ జరుగనుంది. ► ఇక, రేపు కొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రవేశం జరుగుతుంది. ► రేపు ఉదయాన్నే 9:30 గంటలకు ఎంపీలతో గ్రూప్ ఫొటో ఉంటుంది. -
సనాతన ధర్మాన్ని అంతం చేసేందుకు కుట్రలు
బీనా/రాయ్‌గఢ్: ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిని దురంహకారి కూటమిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివరి్ణంచారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ఇండియా కూటమి లక్ష్యంగా పెట్టుకుందని, వెయ్యి సంవత్సరాల బానిసత్వంలోకి దేశాన్ని నెట్టివేయాలని చూస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతమైందని, ఈ ఘనత 140 కోట్ల మంది భారతీయులకు దక్కుతుందని పేర్కొన్నారు. ఈ విజయం దేశ ప్రజల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెప్పారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ గురువారం పర్యటించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలోని బీనా రిఫైనరీలో రూ.49 వేల కోట్లతో నిర్మించే పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. దాంతోపాటు మరో 10 పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధానమంత్రి ప్రసంగించారు. అలాగే చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లా కొండతరాయి గ్రామంలో ‘విజయ్ శంఖనాథ్’ సభలోనూ మాట్లాడారు. రెండు సభల్లో ఆయన ఏం చెప్పారంటే... కుట్రలను అడ్డుకోవాలి ‘‘దురహంకారి కూటమి ఇటీవలే ముంబైలో సమావేశమైంది. ఆ కూటమికి ఒక విధానం లేదు, ఒక నాయకుడు లేడు. సనాతన ధర్మంపై దాడి చేసి, నాశనం చేయాలన్న రహస్య ఎజెండా మాత్రమే ఉంది. సనాతన ధర్మం నుంచి జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తి పొందారు. స్వాతంత్య్రం కోసం ఆయన సాగించిన పోరాటం సనాతన ధర్మం చుట్టూ కేంద్రీకృతమైంది. మహాత్ముడు జీవితాంతం సనాతన ధర్మాన్ని పాటించారు. ఆయన చివరిసారిగా ‘హే రామ్’ అంటూ నెలకొరిగారు. రాణి అహిల్యాబాయి హోల్కర్, ఝాన్సీ లక్ష్మీబాయి, స్వామి వివేకానంద, లోకమాన్య తిలక్ వంటి మహనీయులు సనాతన ధర్మ నుంచి స్ఫూర్తి పొంది ముందుకు నడిచారు. విపక్ష కూటమి నాయకులు బహిరంగంగా మాట్లాడడం ప్రారంభించారు. వారు మనపై దాడికి పదును పెడుతున్నారు. దేశంలో సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ, దేశాభిమానులు ఈ విషయం గమనించాలి. అప్రమత్తంగా ఉండాలి. సనాతన ధర్మాన్ని నిర్మూలించేందుకు సాగుతున్న కుట్రలను మనమంతా కలిసికట్టుగా అడ్డుకోవాలి. మనం ఐక్యంగా ఉంటే వారి ఆటలు సాగవు. వారి ప్రయత్నాలనీ విఫలమవుతాయి. మన లక్ష్యం ‘ఆత్మనిర్భర్ భారత్’ జీ20 సదస్సు విజయంతో దేశ ప్రజల హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి. ఈ ఘనత మోదీకి కాదు, ముమ్మాటికీ 140 మంది భారతీయులదే. చిన్నపిల్లలకు కూడా జీ20 గురించి తెలిసింది. బృంద స్ఫూర్తితో పని చేయడం వల్ల ఈ సదస్సు విజయవంతమైంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ చాలా ఏళ్లు అధికారంలో ఉంది. కానీ, ఆ పార్టీ చేసిందేమీ లేదు. అవినీతికి, నేరాలకు పాల్పడడంతోనే కాంగ్రెస్‌కు సమయం సరిపోయింది. కాంగ్రెస్ హయాంలో నేరగాళ్లు రాజ్యమేలారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకివచ్చాక అవినీతి అంతమైంది. సుపరిపాలన కొనసాగుతోంది. పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామివేత్తలు తరలివస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించుకోవాలి. పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోకెమికల్ ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితి మారాలి. దిగుమతులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. స్వయం స్వావలంబన దిశగా బీనా రిఫైనరీ ఒక ముందడుగు అవుతుంది. దళారుల ప్రమేయాన్ని అంతం చేశాం బానిస మనస్తత్వం నుంచి దేశం బయట పడింది. ‘న్యూ ఇండియా’ సగర్వంగా ముందడుగు వేస్తోంది. ప్రభుత్వ పథకాల అమలులో దళారుల ప్రమేయాన్ని అంతం చేశాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందజేస్తున్నాం. ఈ పథకం కింద ఇప్పటిదాకా రూ.2.60 లక్షల కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాల్లో జమచేశాం. వ్యవసాయ రంగంలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నాం. రైతులపై భారం తగ్గిస్తున్నాం. ఎరువులను చౌకగా అందజేయడానికి సబ్సిడీ రూపంలో గత తొమ్మిదేళ్లలో రూ.10 లక్షల కోట్లకుపైగా వెచి్చంచాం. అమెరికాలో ఒక యూరియా సంచి ధర రూ.3,000 ఉంది. మన దగ్గర మాత్రం రైతులకు కేవలం రూ.300కే లభిస్తోంది. దేశంలో గత నాలుగేళ్లలో కొత్తగా 10 కోట్ల కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చాం. మొఘల్ రాజులపై పోరాటం చేసిన గిరిజన పాలకురాలు రాణి దుర్గావతి 500వ జయంతి వేడుకలను అక్టోబర్ 5న ఘనంగా నిర్వహిస్తాం. ‘ఇండియా’ పట్ల జాగ్రత్త భారత్‌ను, ప్రాచీన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కనుమరుగు చేయాలని చూస్తున్న విపక్ష ‘ఇండియా’ కూటమి కుయుక్తుల పట్ల ప్రజలు నిత్యం జాగరూకులై ఉండాలి. మన దేశానికి, మన విశ్వాసాలకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది. కొందరు వ్యక్తులు అధికారం నుంచి దూరమయ్యాక ప్రజల పట్ల ద్వేషం పెంచుకున్నారు. అందుకే ప్రజల గుర్తింపుపై, సంస్కృతిపై దాడి చేస్తున్నారు. దేశంలో వేలాది సంవత్సరాలుగా అవిచి్ఛన్నంగా కొనసాగుతున్న సంస్కృతిని విచి్ఛన్నం చేయాలని చూస్తున్నారు. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్నదే వారి అసలు లక్ష్యం. సనాతన ధర్మం వ్యక్తుల జన్మకు కాదు, వారి కర్మ(చేసే పనులు) ప్రాధాన్యం ఇస్తుంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. -
జీ20 నేతలకు అరకు కాఫీ గిఫ్ట్.. ఆనంద్ మహీంద్రా పోస్టు వైరల్..
జీ20 సమ్మిట్‌కు హాజరైన విదేశీ నేతలకు అరకు కాఫీలను కేంద్రం గిఫ్ట్‌గా ఇచ్చింది. దీనిపై వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయగల భారతదేశ సామర్థ్యానికి ప్రధాన ఉదాహరణ అరకు కాఫీ అని ప్రశంసించారు. అరకు బోర్డు ఛైర్మన్‌గా ఈ ఘనత తనకు ఎంతో గర్వకారణమని అన్నారు. 'అరకు బోర్డు ఛైర్మన్‌గా నాకు ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. అరకు కాఫీని గిఫ్ట్‌గా ఇవ్వడంపై నేను ఎక్కువ మాట్లాడలేను. ప్రపంచంలోనే అత్యంత కాఫీ ఉత్పత్తుల్లో ఇండియా అరకు కాఫీ కూడా ఒకటి. ఇది మనకు ఎంతో గర్వకారణం' అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. జీ20 సమావేశం నుంచి వెనుదిరుగుతున్న విదేశీ నేతలకు కేంద్రం అరకు కాఫీలను గిఫ్ట్‌గా ఇస్తున్న వీడియోను షేర్ చేశారు. As the Chairman of the Board of Araku Originals, I can’t argue with this choice of gift! It just makes me very, very proud. Araku Coffee is the perfect example of ‘The best in the World, Grown in India’… https://t.co/VxIaQT6nZL — anand mahindra (@anandmahindra) September 12, 2023 అరకు కాఫీ ఎంతో ప్రత్యేకమైనది. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు కొండ ప్రాంతాల్లో సేంద్రీయ తోటల్లో దీనిని ఎక్కువగా పెంచుతారు. ప్రత్యేకమైన సుగంధ లక్షణాలు కలిగి రుచికి ప్రసిద్ధి చెందింది. అరకు కాఫీని గిరిజన రైతులు ఉత్పత్తి చేస్తారు. భారతదేశంలోని తూర్పు కనుమలలో ఉన్న సుందరమైన అరకు లోయ పర్యాటకంగా కూడా చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. 2008లో ఏర్పాటు చేసిన నంది ఫౌండేషన్ అరకు కాఫీని ప్రపంచ స్థాయికి తీసుకుపోవడంలో తోడ్పాటునిచ్చింది. ఇదీ చదవండి: భారతదేశాన్ని సూర్యుడు మొదట ముద్దాడే ప్రదేశం.. నాగాలాండ్ మంత్రి వీడియో వైరల్.. -
బీజేపీ కార్యాలయం వద్ద ప్రధానికి ఘన స్వాగతం
న్యూఢిల్లీ: ఇటీవల భారత్ సారథ్యంలో జీ20 శిఖరాగ్ర భేటీని విజయవంతంగా నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఘన స్వాగతం లభించింది. బుధవారం సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశానికి హాజరైన సందర్భంగా ప్రధానికి కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తదితరులు స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో హాజరైన పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ప్రధానిపై పూల వర్షం కురిపిస్తూ కార్యాలయంలోకి ఆహా్వనించారు. జీ20 విజయవంతంగా ముగియడం, ప్రపంచ నేతలు మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించడం తెలిసిందే. ఈ భేటీ తర్వాత బీజేపీ ప్రధాన కార్యాలయంలోకి ప్రధాని రావడం ఇదే మొదటిసారి. -
PM Ujjwala Scheme: మరో 75 లక్షల ‘ఉజ్వల’కనెక్షన్లు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై)కింద అదనంగా 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.1,650 కోట్లు కేటాయించింది. దీంతోపాటు, ఈ కోర్ట్స్’ ప్రాజెక్టు మూడో దశకు అనుమతి మంజూరుచేసింది. ఇందుకు గాను రూ.7,210 కోట్లు వెచి్చంచాలని తీర్మానించింది. ఇటీవల ముగిసిన జీ20ని విజయవంతం చేసి, భారత్ ప్రతిష్టను ఇనుమడింప జేసిన ప్రధాని మోదీని ఈ సమావేశం అభినందించింది. ఈ వివరాలను భేటీ అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. కొత్తగా జారీ అయ్యే 75 లక్షల ఉజ్వల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను 2023–24 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరం వరకు అందజేస్తామని తెలిపారు. వీటితో కలిపి ఉజ్వల లబి్ధదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుకుంటుందన్నారు. దిగువ కోర్టుల్లో రికార్డుల డిజిటైజేషన్, క్లౌడ్ స్టోరేజీ, వర్చువల్ కోర్టుల ఏర్పాటు తదితరాల కోసం నాలుగేళ్లపాటు అమలయ్యే ఈకోర్ట్స్ ప్రాజెక్టు ఫేజ్–3కి రూ.7,210 కోట్లు కేటాయించేందుకు కూడా కేబినెట్ అంగీకరించిందని ఠాకూర్ చెప్పారు. ఇందులో భాగంగా 3,108 కోట్ల డాక్యుమెంట్లు డిజిటల్ రూపంలోకి మారుతాయని అంచనా. -
చేజేతులా చేసుకున్నదే!
జీ20 ముగిసినా దాని ప్రకంపనలింకా తగ్గలేదు. ఢిల్లీ శిఖరాగ్ర సదస్సుకు హాజరై, భారత ఆత్మీయ ఆతిథ్యాన్ని అందుకున్న మిగతా ప్రపంచ నేతలందరికీ ఇది చిరస్మరణీయ అనుభవమేమో కానీ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు మటుకు ఇది పీడకలగా పరిణమించింది. భారత ప్రధాని నుంచి సాదర స్వాగతం అందకపోగా, ఖలిస్తానీ తీవ్రవాదులకు అడ్డుకట్ట వేయకపోవడంపై ద్వైపాక్షిక చర్చల్లోనూ భారత్ ఆయనకు తలంటి పంపినట్టు వార్త. ఎలాగోలా సదస్సు ముగియగానే తిరుగు ప్రయాణం అవుదామంటే ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్యలు. భారత్‌లో కెనడా ప్రధాని చేదు అనుభవాలన్నీ సొంత గడ్డపై ప్రతిపక్షాలకు కావాల్సినంత మేత ఇచ్చాయి. మంగళవారం ట్రూడో తిరుగు పయనమయ్యారు కానీ, భారత్ పర్యటనలో ఆయనకు వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. భారత్ నుంచి పంజాబ్‌ను వేరుచేయాలని కోరుతున్న ఖలిస్తానీ ఉద్యమకారులు, వారి మద్దతు దార్లపై కెనడా మెతకగా వ్యవహరిస్తోందని భారత వాదన. ట్రూడో మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ తమ దేశీయ విధానమని సమర్థించుకుంటున్నారు. తమ అంతర్గత రాజకీయాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందనేది కెనడా సర్కార్ ఆరోపణ. జీ20 వేళ ఆదివారం ట్రూడో, మోదీల మధ్య భేటీలో ఇరుపక్షాలూ తమ తమ ఆందోళనలు వ్యక్తం చేశాయి. భారత– కెనడా సంబంధాలు ఇటీవల అంత కంతకూ దిగజారుతున్నాయనడానికి ఆ భేటీ వార్తలే తార్కాణం. ఇరుదేశాల మధ్య చర్చల్లో ఉన్న వాణిజ్య ఒప్పందమూ నత్తనడకన సాగే ప్రమాదంలో పడింది. ఇది ఎవరికీ శ్రేయోదాయకం కాదు. గతంలో 2018లో ప్రధానిగా ట్రూడో తొలి భారత సందర్శన సైతం ఘోరంగా విఫలమైంది. శిక్ష పడ్డ తీవ్రవాదిని విందుకు ఆహ్వానించి, అప్పట్లో ఆయన గందరగోళం రేపారు. అప్పటితో పోలిస్తే, ఇప్పటి పర్యటన మరీ ఘోరం. కీలక మిత్రదేశాల నుంచి దూరం జరిగిన కెనడా, భారత్‌తో తనబంధాన్ని మరింత బలహీనపరుచుకుంది. వెరసి, ఈ ప్రాంతంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, భారత్‌లు రెంటికీ కెనడా దూరమైంది. ఎన్నికల్లో జోక్యం, కెనడియన్ పౌరుల కిడ్నాప్, ఆర్థిక యుద్ధతంత్రం వగైరాల వల్ల చైనాకు దూరం జరగడం అర్థం చేసుకోదగినదే. కానీ, రాజకీయ కారణా లతోనే ట్రూడో భారత్‌ను దూరం చేçసుకుంటున్నట్టు కనిపిస్తోంది. కెనడా జనాభా 4 కోట్ల యితే, భారత జనాభా 140 కోట్లు. కెనడా ఆర్థిక వ్యవస్థకు భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు రెట్టింపు. అలా చూస్తే, భారత్‌తో బంధం కెనడాకు అవసరం, లాభదాయకం. ఆ సంగతి ట్రూడో విస్మరించారు. మునుపటి ప్రధాని స్టీఫెన్ హార్పర్ హయాంలో ఢిల్లీతో వాణిజ్యాన్ని ఒటావా విస్తరించింది. వ్యవసాయ సామగ్రి, ఎరువులు, అణువిద్యుత్‌కు అవసరమయ్యే యురేనియమ్ భారత్‌కు కెనడా అందిస్తూ వచ్చింది. ట్రూడో హయాంలో ఎలాంటి వివరణా ఇవ్వకుండానే ఇటీవలే సరికొత్త వాణిజ్య ఒప్పందంపై చర్చల్ని ఆపేశారు. భారత్‌లో మోదీ విధానాలు కెనడాలో తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తాయని ట్రూడో భావన. అందుకే, వీలైనంత దూరం జరగాలని చూస్తున్నారు. కెనడాలో ఎక్కువగా ప్రవాసీ సిక్కులుండడంతో, వారి మద్దతుకై తంటాలు పడుతున్నారు. భారత్‌లో 2020 నాటి రైతుల ఆందోళనలపై ట్రూడో మాట్లాడుతూ ఇప్పుడు జీ20లో అన్నట్టే భావప్రకటన స్వేచ్ఛల్ని ప్రబోధించారు. తీరా కెనడాలో అలాంటి నిరసనలే ఎదురైతే, అత్యవసర చట్టం ప్రయోగించారు. మైనారిటీలపై మోదీ ప్రభుత్వ కఠిన వైఖరిని తప్పుపడుతున్న ట్రూడో కెనడాలో చేస్తున్నది అదే! అంతర్జాతీయ సంబంధాల్లో కెనడా ఇప్పుడు దోవ తప్పింది. ఐరాస భద్రతామండలి తాత్కాలిక సభ్యత్వం కోసం ఆ దేశం చేసిన గత రెండు ప్రయత్నాలూ విఫలమయ్యాయి. 20వ శతాబ్దిలో శాంతి పరిరక్షణ ప్రయత్నాలకు మారుపేరుగా, ఐరాస శాంతిపరిరక్షక దళానికి సృష్టికర్తగా నిలిచిన కెనడా ఇప్పుడు ఆ ఊసే ఎత్తని స్థితికి చేరింది. ఒకప్పుడు వర్ణవివక్షపై పోరాటంలో, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఏర్పాటులో ముందుండి, మానవ భద్రతకై మందుపాతరల నిషేధ ఒప్పందం కావాలని కూడా పోరాడిన దేశం గత రెండు దశాబ్దాల్లో ఊహించని మార్గం పట్టింది. 2005 తర్వాత ఆ దేశం తన విదేశాంగ విధానాన్ని సమీక్షించుకోనే లేదు. దేశంలో, ప్రపంచ పరిస్థితుల్లో శరవేగంతో మార్పులు వచ్చినా ఎప్పటికప్పుడు తాత్కాలిక ప్రతిస్పందనతోనే విదేశాంగ వాహనాన్ని నెట్టుకొస్తోంది. ఫలితంగా ప్రపంచంలో కెనడా పేరుప్రతిష్ఠలే కాదు... ప్రభావమూ దెబ్బతింటోంది. తక్షణమే కెనడా విదేశాంగ విధానానికి దశ, దిశ కావాలని విశ్లేషకులు అంటున్నది అందుకే! గత ఇరవై ఏళ్ళలో డయాస్పొరా రాజకీయాలు, వ్యక్తిగత రాగద్వేషాలతో కెనడా విదేశాంగ విధానం తప్పటడుగులు వేస్తోంది. మధ్యప్రాచ్యంపై మునుపటి హార్పర్ ప్రభుత్వం, భారత్‌తో వ్యవహారంలో ఇప్పటి ట్రూడో సర్కార్ వైఖరి అందుకు మచ్చుతునక. చమురు, సహజవాయువు, జలవిద్యుచ్ఛక్తి ఉత్పత్తిలో కెనడాది అగ్రపీఠం. అలాగే, యురేనియమ్, అనేక కీలక ఖనిజాలు అక్కడ పుష్కలం. దాన్ని సానుకూలంగా మలుచుకొని విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దుకొనే అద్భుత అవకాశం ఉన్నా అక్కడి పాలకులు ఆ పని చేయట్లేదు. ఇప్పటికైనా కెనడా బయటి ఒత్తిళ్ళను బట్టి నడవడం మానాలి. దేశాన్ని కలసికట్టుగా నిలిపే స్పష్టమైన లక్ష్యాలను పౌరులకు అందించాలి. కీలక అంతర్జాతీయ అంశాల్లో తమ వైఖరిని స్పష్టం చేయాలి. భారత్‌తో బంధాన్ని మళ్ళీ బలోపేతం చేసుకోవడంతో ఆ పనికి శ్రీకారం చుట్టాలి. ఎందుకంటే, పాలకుల పనికిమాలిన చర్యల వల్ల కెనడాకు ఆర్థిక నష్టం కలిగితే అది పాలకుల పాపమే. ట్రూడో ఇకనైనా స్వార్థ రాజకీయ ప్రయోజనాలు వదిలి, విశ్వవేదికపై సమస్త కెనడియన్ల ప్రయోజనాలపై దృష్టి పెడితే మంచిది. -
450 మంది పోలీసులకు ప్రధాని విందు
ఢిల్లీ: భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశం G20 Summit.. సక్సెస్‌లో కీలకంగా వ్యవహరించిన ఢిల్లీ పోలీసులకు ప్రధాని నరేంద్ర మోదీ విందు ఇవ్వనున్నారు. ఈ వారంలోనే.. అదీ జీ20 సమ్మిట్ జరిగిన భారత్ మండపంలోనే ఈ విందు కార్యక్రమం ఉండనుందని సమాచారం. ఈ మేరకు కానిస్టేబుల్స్ నుంచి ఇన్స్పెక్టర్ల దాకా.. సదస్సు సమయంలో విధి నిర్వహణ అద్భుతంగా నిర్వహించిన సిబ్బంది జాబితాను ఢిల్లీ కమిషనర్ సంజయ్ అరోరా సిద్ధం చేస్తున్నారు. వాళ్లతో కలిసి అరోరా, ప్రధాని మోదీ ఇచ్చే డిన్నర్లో పాల్గొంటారు. దాదాపు 40 దేశాల అధినేతలు పాల్గొన్న ఈ కీలక సదస్సును అత్యంత పటిష్టమైన భద్రత నడుమ విజయవంతంగా నిర్వహించింది భారత్. హైలెవల్ సెక్యూరిటీ నడుమ ఉండే ప్రముఖుల సంరక్షణ అనే అత్యంత కష్టతరమైన బాధ్యతను.. మరీ ముఖ్యంగా ఢిల్లీ పోలీసులు సమర్థవంతంగా నిర్వహించడంపై అభినందనలు కురుస్తున్నాయి. ప్రధాని మోదీ ఇలా క్షేత్రస్థాయి సిబ్బంది కష్టాన్ని గుర్తించడం కొత్తేం కాదు. గతంలో కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంలో.. నిర్మాణ కూలీలను ఆయన సత్కరించారు. -
ఢిల్లీ హోటల్లో హైడ్రామా సృష్టించిన జీ20 చైనా బృందం
న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత వైభవంగా జరిగిన జీ20 సమావేశాలకు దాదాపు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశాలు విజయవంతంగా ముగిశాక వారంతా తమతమ దేశాలకు తిరిగి పయనమయ్యారు. అయితే సమావేశాలు ముగిసిన మూడు రోజులకు ఢిల్లీ తాజ్‌లో జరిగిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. జీ20 సమావేశాల్లో హాజరయ్యేందుకు వచ్చిన చైనా ప్రతినిధుల బృందం బ్యాగుల్లో అనుమానాస్పద పరికరాలు కనిపించడంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని నిలదీయగా బ్యాగులను స్కాన్ చేయడానికి నిరాకరించారు. భారత అధికారులు జోక్యం చేసుకున్నాక 12 గంటల పాటు సాగిన ఈ హైడ్రామాకు తెరపడింది. సమావేశాల సమయంలో చైనా ప్రతినిధుల బృందం తాజ్ ప్యాలెస్‌లో బస చేశారు. హోటల్ కు వస్తూనే వారి బ్యాగులను తనిఖీ చేయగా రెండు బ్యాగుల్లో అనుమానాస్పద పరికరాలు కనిపించడంతో వారిని అక్కడే నిలిపివేశారు తాజ్ సెక్యూరిటీ సిబ్బంది. ఆ రెండు బ్యాగులలో దౌత్య సంబంధమైన సామాన్లు ఉన్నట్లు చైనా బృందం వెల్లడించగా అనుమానమొచ్చి హోటల్ సెక్యూరిటీ బ్యాగులను స్కానర్ పై ఉంచాల్సిందిగా కోరారు. అందుకు వారు నిరాకరించడంతో 12 గంటలపాటు పెద్ద డ్రామా నడిచింది. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చివరికి అధికారులు కల్పించుకున్నాక వారి లగేజీని చైనా ఎంబసీకి తరలించడానికి వారు అంగీకరించడంతో హైడ్రామాకు తెరపడింది. భారత్‌లో జరిగిన ఈ సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గైరుహాజరవ్వగా ఆయన స్థానంలో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ చైనా ప్రతినిధిగా హాజరయ్యారు. ఢిల్లీ తాజ్ హోటల్లో బస చేసిన చైనా ప్రతినిధి బృందానికి ఆయనే నాయకత్వం వహించారు. ఇది కూడా చదవండి: Libya Floods: లిబియాలో వరద బీభత్సం