G20 New Delhi summit 2023: ప్రపంచ దేశాలు నేడు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ రోజు, రేపు (2023 సెప్టెంబర్ 9, 10) జీ20 సమావేశాలు (G20 Summit) దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతాయనే విషయం అందరికి తెలుసు. ఈ సమావేశాలకు 30 మంది దేశాధినేతలతో పాటు 14 మంది అంతర్జాతీయ సంస్థల అధినేతలు హాజరుకానున్నారు. దీని కోసం కేంద్రం ఎంత ఖర్చు చేసిందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కేంద్రం జీ20 సమావేశాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కావున న భూతో న భవిష్యత్ అనే రీతిలో ఏర్పాట్లను అంగరంగ వైభవంగా చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, బంగ్లాదేశ్ ప్రధానితో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నాయకులు హాజరవుతున్నారు.
మొత్తం ఖర్చు..
కొన్ని నివేదికల ప్రకారం.. జీ20 సమ్మిట్ కోసం కేంద్రం రూ. 4100 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు సమాచారం. రోడ్లు, సెక్యూరిటీ, ఫుట్‌పాత్‌లు, లైటింగ్‌తో పాటు ఇతర పనుల కోసం ఈ డబ్బును ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది. మేక్ఓవర్ ప్రక్రియలో భాగంగా దేశ రాజధానిలోని వివిధ ప్రదేశాలలో అనేక శిల్పాలు కూడా ఏర్పాటు చేశారు. జరుగుతున్న ఈవెంట్‌కు సంబంధించిన ఇతర ఖర్చులు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: రూ.20 వేలతో మొదలై ప్రపంచ స్థాయికి.. వావ్ అనిపించే 'వందన' ప్రస్థానం!
జీ20 శిఖరాగ్ర సమావేశాల కోసం గతంలో ఇతర దేశాలు కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేశాయి. 2018లో బ్యూనస్ ఎయిర్స్ సమ్మిట్ ఖర్చు $112 మిలియన్స్ కాగా.. 2010 టొరంటోలో జరిగిన సమ్మిట్ కోసం కెనడా CAD 715 మిలియన్స్ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. చివరి శిఖరాగ్ర సమావేశం 2022 నవంబర్‌లో ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. 2024 జీ20 సమావేశాలు బ్రెజిల్ నగరంలో జరగనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment