శాంతి, సౌభాగ్యం | G20 Summit: G20 summit adopts New Delhi Declaration calls for Peace, prosperity, sustainable growth | Sakshi
Sakshi News home page

శాంతి, సౌభాగ్యం

Published Sun, Sep 10 2023 4:02 AM | Last Updated on Sun, Sep 10 2023 6:09 AM

G20 Summit: G20 summit adopts New Delhi Declaration calls for Peace, prosperity, sustainable growth - Sakshi

ఢిల్లీలో జీ20 సమ్మిట్‌లో నిర్వహించిన గ్లోబల్‌ బయో ఫ్యూయెల్స్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో సింగపూర్‌ ప్రధాని లీ హీన్‌ లూంగ్, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, ఇటలీ ప్రధాని గియోర్గియా మెలోని, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో, అర్జెంటీనా అధ్యక్షుడు అల్జెర్టో ఫెర్నాండెజ్, మారిషన్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌ జుగ్‌నాథ్, యూఏఈ విదేశాంగ మంత్రి షేక్‌ అబ్దుల్లాతో భారత ప్రధాని మోదీ

న్యూఢిల్లీ:  ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలతో కూడిన జీ20 కూటమికి ఈ ఏడాది సారథ్యం వహిస్తున్న భారత్‌కు ప్రశంసనీయమైన విజయం దక్కింది. శనివారం ఢిల్లీలో ప్రారంభమైన జీ20 శిఖరాగ్ర సదస్సులో, ప్రపంచ శాంతి, సౌభాగ్యమే ధ్యేయంగా వివిధ కీలక అంశాలతో కూడిన ‘న్యూఢిల్లీ జీ20 సమ్మిట్‌ లీడర్స్‌ డిక్లరేషన్‌’కు కూటమి సభ్యదేశాల ఆమోదం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.

డిక్లరేషన్‌పై కూటమి దేశాల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైందని, వెంటనే ఆమోదం పొందిందని వెల్లడించారు. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం విషయంలో దేశాల మధ్యనున్న భేదాభిప్రాయాలను అధిగమించి మరీ డిక్లరేషన్‌పై ఆమోద ముద్ర పడడం గమనార్హం. డిక్లరేషన్‌ ఆమోదం పొందడానికి కృషి చేసిన జీ20 దేశాల మంత్రులు, అధికార ప్రతినిధులు(òÙర్పాలు), అధికారులకు నరేంద్ర మోదీ కృతజ్ఞ తలు తెలిపారు. వారంతా ప్రశంసలకు అర్హులని  పేర్కొన్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో శనివారం ఢిల్లీలో అట్టహాసంగా ఆరంభమైంది.

భారత ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధానమంత్రి రిషి సునాక్, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్, బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలా డా సిల్వా తదితరులు పాల్గొన్నారు. చైనా అధినేత షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హాజరు కాలేదు. ఉక్రెయిన్‌లో సంఘర్షణ, ఉగ్రవాదం, అవినీతి, ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులు, ప్రపంచ ఆర్థిక ప్రగతి, విద్య, నైపుణ్యాల వృద్ధి, పునరుత్పాదక ఇంధనాల వినియోగం తదితర కీలక అంశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో చోటుచేసుకున్నాయి.  

ఉక్రెయిన్‌లో శాంతికి పాటుపడాలి  
ఉక్రెయిన్‌లో నెలకొన్న సంఘర్షణపై న్యూఢిల్లీ డిక్లరేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. నేటి యుగం యుద్ధాల యుగం కాదని తేలి్చచెప్పింది. ప్రాదేశిక సమగ్రత, సార్వ¿ౌమత్వంతో కూడిన అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని పేర్కొంది. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదని వెల్లడించింది. శాంతియుత చర్చలు, దౌత్యమార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది.

శాంతి తీర్మానం ముఖ్యమని తెలిపింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, సాధారణ సభలో చేసి న తీర్మానాలకు కట్టుబడి ఉండాలని, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ సూత్రాలను అన్ని దేశాలు పాటించాలని వెల్లడించింది. ఇతర దేశాల భూభాగా లను ఆక్రమించుకోవడం, అందుకోసం బెదిరింపులకు దిగడం లేదా బలప్రయోగానికి పాల్పడ డం ఆమోదనీయం కాదని స్పష్టం చేసింది. అణ్వాయుధాలను ప్రయోగిస్తామని బెదిరించడం లేదా ప్రయోగించడం ఆక్షేపణీయమని పేర్కొంది.

ఉక్రెయిన్‌లో సుస్థిర శాంతి కోసం అన్ని దేశాలూ చొరవ తీసుకోవాలని పిలుపునిచి్చంది. ‘‘ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే ఖండించాల్సిందే. అంతర్జాతీయ శాంతికి, భద్రతకు ఉగ్రవాదం తీవ్రమైన ముప్పుగా మారింది. మతం, జాతి పేరిట ప్రజల మధ్య చిచ్చు రేపడం క్షమార్షం కాదు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలి. ఆయుధాల అక్రమ రవాణా కూడా ఆందోళనకరంగా మారింది. ఈ అవాంఛనీయ ధోరణిని అరికట్టాల్సిందే. ఆయుధాల ఎగుమతులు, దిగుమతులపై అన్ని దేశాలు గట్టి నిఘా పెట్టాలి’’అని డిక్లరేషన్‌ సూచించింది.  

మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యం
ప్రపంచంలో అందరికీ సమాన స్థాయిలో, నాణ్య మైన విద్య, నైపుణ్య శిక్షణను అందించాల్సిన ఆవశ్యకతను న్యూఢిల్లీ డిక్లరేషన్‌ నొక్కిచెప్పింది. మానవ వనరుల అభివృద్ధికి అత్యధిక ప్రాధా న్యం ఇవ్వాలని సూచించింది. ప్రజల మధ్య డిజి టల్‌ అంతరాలను తొలగించడానికి డిజిటిల్‌ సాంకేతికలను సమర్థంగా ఉపయోగించుకోవా లని జీ20 దేశాలు తమ డిక్లరేషన్‌లో తీర్మానించు కున్నాయి. కృత్రిమ మేధ సహా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొనేలా విద్యాసంస్థలకు, టీచర్లకు సహకరించాలని నిర్ణయించుకున్నాయి.

విద్యార్థులు, నిపుణులు, పరిశోధకులు, సైంటిస్టులు పరిశో« దనా సంస్థలతో, ఉన్నత విద్యా సంస్థలతో కలిసి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు. దుర్బల పరిస్థితుల్లో ఉన్నవారికి సైతం సమగ్ర, సమాన, నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఉన్నత విద్య, ఉద్యోగాల సాధనకు ఫౌండేషనల్‌ లెరి్నంగ్‌ ప్రాముఖ్యతను తాము గుర్తించామని పేర్కొన్నారు. హై–క్వాలిటీ టెక్నికల్‌ అండ్‌ వొకేషనల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌(టీవీఈటీ)ని డిక్లరేషన్‌లో ప్రస్తావించారు.  

స్వేచ్ఛాయుత, పారదర్శక వాణిజ్యం  
ప్రపంచమంతటా నిత్యావసరాల ధరలు, జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయం, ఆహారం, ఎరువుల రంగంలో స్వేచ్ఛాయుత, పారదర్శక, నిబంధనల ఆధారిత వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో పేర్కొ న్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలకు అనుగుణంగా ఎగుమతులపై నిషేధం విధించరాదని ఉద్ఘాటించారు. ఆహార భద్రత సవాళ్లను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు సాగిస్తున్న ప్రయత్నాలకు, వాటి సామర్థ్యాలకు మద్దతు ఇవ్వాలని తీర్మానించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం చౌకగా అందేలా కలిసి పని చేయాలని నిర్ణయించారు.

చాలినంత ఆహారం అనేది అందరి హక్కు అని పేర్కొన్నారు. ప్రపంచ ఆహార భద్రతను మరింత పెంచడానికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అలాగే అగ్రికల్చరల్‌ మార్కెట్‌ ఇన్ఫర్మేషన్‌ వ్యవస్థ(ఏఎంఐఎస్‌)లోకి ఎరువులు, వెజిటబుల్‌ ఆయిల్స్‌ను కూడా తీసుకోవాలని నిర్ణయించారు. ఆహార ధరల్లో హెచ్చుతగ్గులను అరికట్టడానికి గ్రూప్‌ ఆన్‌ ఎర్త్‌ అబ్జర్వేషన్స్‌ గ్లోబల్‌ అగ్రికల్చరల్‌ మానిటరింగ్‌(జియోగ్లామ్‌) వ్యవస్థను తీసుకురానున్నారు. ఏఎంఐఎస్‌ పరిధిలో ప్రస్తుతం బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, సోయా ఉన్నాయి. మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం మహిళా ఆహార భద్రత, పౌష్టికాహారం ప్రాధాన్యతను డిక్లరేషన్‌ వివరించింది.  
 
నైపుణ్యాల అంతరాలను తొలగించాలి  
ప్రపంచవ్యాప్తంగా జనంలో నైపణ్యాల అంతరాలను తొలగించి, నిపుణులను తయారు చేయడానికి కార్యాచరణ చేపట్టాలని న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో కూటమి నేతలు ప్రతిన బూనారు. సమీకృత సామాజిక రక్షణ విధానాలను అందరికీ వర్తింపజేయాలని తీర్మానించారు. సామాజిక భద్రత ప్రయోజనాలను ద్వైపాక్షిక, బహుముఖీన ఒప్పందాల ద్వారా అర్హులకు అందించేందుకు అంగీకరించారు. బాల కారి్మక వ్యవస్థను, వెట్టి చాకిరి వ్యవస్థను నిర్మూలించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలని నిర్ణయించారు. సమగ్ర ఆర్థిక ప్రగతి కోసం గ్లోబల్‌ స్కిల్స్‌ పెంచడం చాలా ముఖ్యమంత్రి డిక్లరేషన్‌ తేలి్చచెప్పింది. డిజిటల్‌ అప్‌స్కిల్లింగ్, రీస్కిల్లింగ్‌ కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని సూచించింది. గిగ్, ప్లాట్‌ఫామ్‌ కారి్మకులకు సామాజిక పరిరక్షణ పథకాలు, మెరుగైన పని వసతులు కల్పించాలన్న ప్రతిపాదనను కూటమి నేతలు ఆమోదించారు.  
 
అవినీతిపై యుద్ధమే  
అవినీతి సహించడానికి ఎంతమాత్రం వీల్లేదని జీ20 నేతలు తీర్మానించారు. అవినీతికి యుద్ధం సాగించాలని డిక్లరేషన్‌లో ప్రస్తావించారు. ఈ విషయంలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని, సమాచారాన్ని ఇచి్చపుచ్చుకోవాలని నిర్ణయానికొచ్చారు. అవినీతిని ఎదుర్కొనే దిశగా ఆస్తులను స్వా«దీనం చేసుకొనే యంత్రాంగాలను బలోపేతం చేయాలన్నారు. అవినీతిపై పోరాడే బాధ్యతలను నిర్వర్తించే ప్రభుత్వ సంస్థలు, అధికారులు మరింత ప్రభావవంతంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని తీర్మానంలో పేర్కొన్నారు. అవినీతిని అరికట్టడానికి అంతర్జాతీయ స్థాయిలో జరిగే ప్రయత్నాలకు మద్దతు ఇస్తామన్నారు.  
 
శిలాజ ఇంధనాల వాడకం తగ్గించుకుందాం  
పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వాడకాన్ని దశల వారీగా తగ్గించుకొనే ప్రయత్నాలను మరింత వేగవంతం చేయాలంటూ న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించారు. అలాగే 2009లో పిట్స్‌బర్గ్‌లో చేసిన ప్రతిజ్ఞ ప్రకారం శిలాజ ఇంధనాలపై సబ్సిడీలను హేతుబద్దీకరించాలని నిర్ణయించారు. అతితక్కువ ఉద్గారాలతో కూడిన ఇంధన వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవడానికి టెక్నాలజీని వాడుకోవాలని పేర్కొన్నారు.

కాలుష్య రహిత, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లేలా పేద దేశాలకు సహకరించాలని తీర్మానించారు. వాతావరణ మార్పుల నియంత్రణ లక్ష్యాల సాధనకు శుద్ధ ఇంధనాల వాడకాన్ని పెంచుకోవాలని, ఇందుకోసం ఉమ్మడి ప్రయత్నాలు కొనసాగించాలని జీ20 నాయకులు డిక్లరేషన్‌ను ఆమోదించారు. నవీన ఆవిష్కరణలకు ఊతం ఇచ్చేలా, టెక్నాలజీ ప్రయోజనాలను పరస్పరం పంచుకొనేలా సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవాలని తీర్మానించారు. ఇంధన భద్రతను, మార్కెట్‌ స్థిరత్వాన్ని పెంచుకోవడానికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.  
 
డిజిటల్‌ ప్రజా మౌలిక సదుపాయాలు  
ప్రజలకు సేవలు అందించడానికి, నూతన ఆవిష్కరణలకు భద్రమైన, నమ్మకమైన, పారదర్శకతతో కూడిన సమగ్ర డిజిటల్‌ ప్రజా మౌలిక సదుపాయాల(డీపీఐ) అవసరాన్ని జీ20 నేతలు గుర్తించారు. ‘ఇంటర్నేషనల్‌ గవర్నెన్స్‌ ఫర్‌ ఆరి్టఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’పై అంతర్జాతీయ స్థాయిలో పరస్పరం సహకరించుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు. డిజిటల్‌ మౌలిక సదుపాయాల కోసం జీ20 ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్న సూచనను డిక్లరేషన్‌ స్వాగతించింది.

గౌరవప్రదమైన మానవ హక్కులు, వ్యక్తిగత డేటా, గోప్యత, మేధో సంపత్తి హక్కుల గురించి కూడా డిక్లరేషన్‌లో ప్రస్తావించారు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని, భద్రతను పెంపొందించాలని తెలిపారు. ‘మంచి కోసం, అందరి కోసం’అనే నినాదంతో కృత్రిమ మేధ(ఏఐ)ను వాడుకోవాలన్నారు. ఏఐతో లాభాలు అందరికీ సమానంగా దక్కాలని, రిస్‌్కను సైతం సమానంగా పంచుకోవాలని అభిప్రాయపడ్డారు. గ్లోబల్‌ డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రెస్పిరేటరీ(జీడీపీఐఆర్‌) ఏర్పాటు చేస్తామన్న భారత్‌ ప్రకటన పట్ల డిక్లరేషన్‌ సానుకూలంగా స్పందించింది. మలీ్టలేటరల్‌ డెవలప్‌మెట్‌ బ్యాంకులు అవసరమని తెలియజేసింది.  
 
సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ కావాలి  
ప్రపంచ ఆర్థిక రంగానికి ఎదురవుతున్న సవాళ్లు, నెలకొన్న సంక్షోభాలపై జీ20 డిక్లరేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక వృద్ధిలో దేశాల మధ్య అసమానతలను తగ్గించడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి ఆర్థిక సహకార విధానాలు, నిర్మాణాత్మక చర్యలు ప్రారంభించాలని పేర్కొంది. ధరల్లో స్థిరత్వం కోసం సెంట్రల్‌ బ్యాంకులు సహకరించాలని పేర్కొంది. దీర్ఘకాలిక వృద్ధికి ప్రోత్సాహం ఇవ్వాలంటే సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ, నిర్మాణాత్మక ప్రభుత్వ విధానాలు అవసరమని ఉద్ఘాటించింది. ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ బోర్డు(ఎఫ్‌ఎస్‌బీ) తీసుకున్న చర్యలను డిక్లరేషన్‌ ప్రశంసించింది. పాలసీ క్రెడిబిలిటీని కొనసాగించాలంటే సెంట్రల్‌ బ్యాంకులకు స్వతంత్ర ప్రతిపత్తి చాలా అవసరమని అభిప్రాయపడింది. దేశాల అభివృద్ధిలో స్టార్టప్‌ కంపెనీలు, ఎంఎస్‌ఎంఈల పాత్ర చాలా కీలకమని స్పష్టం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement