Ukraine-Russia
-
నేడు యూరప్ అధినేతల అత్యవసర భేటీ!
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు ఇప్పటికే సంకేతాలిచ్చారు. చెప్పిన మాట వినకపోతే ఉక్రెయిన్‌కు ఆయుధ, ఆర్థిక సాయం నిలిపివేస్తామని హెచ్చరించారు. గతవారం రష్యా అధినేత పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. గంటకుపైగా సుదీర్ఘంగా చర్చించారు. ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతిని నెలకొనాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్రంప్ స్పష్టంచేశారు. ట్రంప్ పోద్బలంతో ఉక్రెయిన్–రష్యా మధ్య జరిగే శాంతి చర్చల్లో యూరప్ భాగస్వామ్యం ఉండబోదని అమెరికా ప్రతినిధి కీథ్ కెల్లాగ్ తేలి్చచెప్పారు. ఈ పరిణామాలన్నీ యూరప్ దేశాలకు మింగుడుపడడం లేదు. విజేత ఎవరో తేలకుండానే యుద్ధం ముగించాలన్న ప్రతిపాదనను కొన్ని ఐరోపా దేశాలు పరోక్షంగా వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ తమను లెక్కచేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అంశంలో చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై చర్చించడానికి అత్యవసరంగా భేటీ కావాలని నిర్ణయించుకున్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో సోమవారం ఈ సమావేశం జరగబోతున్నట్లు తెలుస్తోంది. యూరప్ జాతీయ భద్రతకు ఈ భేటీ చాలా ముఖ్యమని యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ చెప్పారు. అమెరికా, యూరప్ మధ్య సంబంధాలు ఎప్పటిలాగే బలంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ దిశగా తమవంతు కృషి చేస్తున్నామని వెల్లడించారు. తమ కూటమిలో విభజనలను అంగీకరించబోమని పేర్కొన్నారు. ఉక్రెయిన్–రష్యా వ్యవహారంలో ఐరోపా దేశాలు ఒంటరవుతున్నాయని, అమెరికాకు దూరంగా జరుగుతున్నాయన్న వాదనను ఆయన ఖండించారు. మరోవైపు ఉక్రెయిన్‌కు మద్దతుగా నూతన చర్యలతో ముందుకు రాబోతున్నట్లు యూరోపియన్ యూనియన్(ఈయూ) ఫారిన్ పాలసీ చీఫ్ కాజా కెల్లాస్ ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. యూరప్ భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. అయితే, యూరప్ ఆదేశాల అధినేతల అత్యవసర భేటీని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ ఇంకా ధ్రువీకరించారు. ఆయన ప్రతినిధుల సైతం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, భేటీ కచ్చితంగా జరుగుతుందని యూరోపియన్ అధికారులు అంటున్నారు. -
మా ప్రమేయం లేని ఒప్పందాలను అంగీకరించం: జెలెన్స్కీ
కెమెల్నిత్స్కీ (ఉక్రెయిన్): యుద్ధ విరమణపై తమ ప్రమేయం లేని ఎలాంటి చర్చలు తమకు ఆమోదయోగ్యం కాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. వాటిని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్– రష్యా యుద్ధ విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రష్యా అ« ద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన జెలెన్స్కీతోనూ చర్చలు జరిపారు. చర్చలకు చొరవ తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించాక.. జెలెన్స్కీ గురువారం దీనిపై తొలిసారిగా స్పందించారు. ‘ప్రతీది పుతిన్ ప్రణాళిక ప్రకారం జరగడానికి వీల్లేదు. దీన్ని మేము అంగీకరించం, అనుమతించం’ అని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఒక స్వతంత్ర దేశంగా మా ప్రమేయం లేని ఎలాంటి చర్చలూ మాకు ఆమోదయోగ్యం కాదని మా మిత్రదేశాలకు స్పష్టం చేస్తున్నాని తెలిపారు. శాంతి చర్చలకు ఉక్రెయిన్, యూరప్‌లను దూరంగా పెట్టడం సబబు కాదని నాటో దేశాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం అసాధ్యమని, రష్యా ఆక్రమిత భూభాగాలను ఉక్రెయిన్ వదులుకోవాల్సి ఉంటుందని అమెరికా రక్షణ మంత్రి పీటే హెగ్సెత్ బుధవారం వ్యాఖ్యానించడంతో.. నాటో దేశాలు చర్చలు ఏకపక్షంగా ఉంటాయేమోనని ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్‌కు అన్యాయం చేస్తున్నారనే వాదనను హెగ్సెత్ గురువారం ఖండించారు. ‘ఉక్రెయిన్ ప్రమేయం లేకుండా ఉక్రెయిన్ గురించి చర్చలు ఉండకూడదు. ఉక్రెయిన్ వాదనకు చర్చల్లో ప్రాధాన్యం దక్కాలి’ అని బ్రిటన్ రక్షణమంత్రి జాన్ హీలి అన్నారు. -
పశ్చిమ దేశాలకు రష్యా న్యూక్లియర్ వార్నింగ్
-
Russia-Ukraine war: 150పైగా డ్రోన్లు కూల్చేశాం: రష్యా
మాస్కో: ఉక్రెయిన్ తమపైకి భారీ సంఖ్యలో డ్రోన్ల దాడికి పాల్పడిందని రష్యా పేర్కొంది. శనివారం రాత్రి మొత్తం 158 డ్రోన్లను కూల్చేశామని రష్యా ఆర్మీ తెలిపింది. ఇందులో రాజధాని మాస్కోపైకి రెండు, పరిసరప్రాంతాలపైకి మరో దూసుకువచ్చిన తొమ్మిది డ్రోన్లు కూడా ఉన్నాయంది. సరిహద్దులకు సమీపంలోని ఉక్రెయిన్ బలగాలు ప్రస్తుతం తిష్ట వేసిన కస్క్ ప్రాంతంలో 46 డ్రోన్లు, బ్రియాన్‌స్‌్కలో 34, వొరెనెజ్‌లో 28 డ్రోన్లతోపాటు, బెల్గొరోడ్పైకి వచి్చన మరో 14 డ్రోన్లను కూలి్చనట్లు వివరించింది. సుదూర ట్వెర్, ఇరనొవో సహా మొత్తం 15 రీజియన్లపైకి ఇవి దూసుకొచ్చాయని తెలిపింది. మాస్కో గగనతలంలో ధ్వంసం చేసిన డ్రోన్ శకలాలు పడి ఆయిల్ డిపోలో మంటలు రేగాయని మేయర్ చెప్పారు. బెల్గొరోడ్ రాజధాని ప్రాంతంలో ఉక్రెయిన్ ప్రయోగించిన క్షిపణితో 9 మందికి గాయాలయ్యాయి. ఇలా ఉండగా, ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ రిజియన్‌లోని పివ్నిచ్నె, వ్యింకా పట్టణాలు తమ వశమయ్యాయని రష్యా రక్షణ శాఖ ఆదివారం ప్రకటించింది. కురకోవ్ నగరంపై రష్యా క్షిపణి దాడుల్లో ముగ్గురు చనిపోగా మరో 9 మంది క్షతగాత్రులయ్యారు. శనివారం రాత్రి రష్యా ప్రయోగించిన 11 క్షిపణుల్లో ఎనిమిదింటిని కూలి్చవేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. ఖరీ్కవ్పై రష్యా ఆర్మీ ఆదివారం చేపట్టిన దాడుల్లో 41మంది గాయపడ్డారు. -
శాంతియత్నాలు ఆపొద్దు!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పరిసమాప్తికి భిన్న మార్గాల్లో జరుగుతున్న ప్రయత్నాలు కాస్తా ఆ రెండు పక్షాల మొండి వైఖరులతో స్తంభించినట్టే కనబడుతోంది. రష్యాపై మరిన్ని దాడులు జరిపితే అది చర్చలకు సిద్ధపడుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భావిస్తుండగా... దాన్ని పూర్తిగా లొంగ దీసుకునే వరకూ యుద్ధం ఆపే ప్రసక్తి లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి తాజాగా తేల్చిచెప్పారు. యుద్ధం మొదలయ్యాక రెండు దేశాలతోనూ ఐక్యరాజ్యసమితితోపాటు భిన్న సంస్థలూ, దేశాలూ చర్చలు సాగిస్తూనే ఉన్నాయి. కానీ ఎవరికి వారు అంతిమ విజయం తమదేనన్న భ్రమల్లో బతుకున్నంత కాలం సమస్య తెగదు. అలాగని ఏదో మేరకు సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నది వాస్తవం. ఉదాహరణకు హోరాహోరీ సమరం సాగుతున్నప్పుడు రెండేళ్ల క్రితం ఉక్రెయిన్ నుంచి ఆహారధాన్యాలు, ఎరువులు, పొద్దుతిరుగుడు నూనె ఉత్పత్తుల ఎగుమతులు నిలిచి పోగా ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకుని రష్యా, ఉక్రెయిన్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించింది. అప్పటికి యుద్ధం మొదలై ఆర్నెల్లు దాటింది. ఫలితంగా నిరుడు జూలై నాటికి దాదాపు మూడు న్నర కోట్ల టన్నుల ఆహారధాన్యాలు ఎగుమతయ్యాయి. ప్రపంచానికి ఆహార సంక్షోభం తప్పింది. ఇటీవలే ఈ రెండు దేశాల మధ్యా యుద్ధ ఖైదీల మార్పిడి కూడా జరిగింది. ఇరువైపులా చెరో 115 మంది సైనికులకూ చెర తప్పింది. తెర వెనక తుర్కియే సంక్షోభ నివారణకు ప్రయత్నిస్తుండగా ప్రధాని మోదీ అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ సందర్శించి ఇరు దేశాల అధినేతలతోనూ మాట్లాడారు. వచ్చే నెలలో ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లినప్పుడు ఆయన మరోసారి జెలెన్స్కీని కలవ బోతున్నారు. అలాగే అక్టోబర్‌లో బ్రిక్స్ సమావేశాల కోసం రష్యా వెళ్లబోతున్నారు. మోదీ ఉక్రెయిన్ వెళ్లినందుకు పుతిన్ కినుక వహించినట్టే, అంతక్రితం రష్యా వెళ్లినందుకు జెలెన్స్కీ నిష్ఠూరాలాడారు. ఇప్పటికైతే ఉక్రెయిన్ ఒకవైపు నువ్వా నేనా అన్నట్టు రష్యాతో తలపడుతున్నా... డ్రోన్లతో, బాంబులతో నిత్యం దాడులు చేస్తున్నా చర్చల ప్రస్తావన తరచు తీసుకొస్తోంది. రష్యా చర్చలకు వచ్చి తీరుతుందని జెలెన్స్కీ ఇటీవల అన్నారు. అయితే ఇదంతా ఊహలపై నిర్మించుకున్న అంచనా. నిరంతర దాడులతో రష్యాకు గత్యంతరం లేని స్థితి కల్పిస్తే... ఆ దేశం చర్చలకు మొగ్గుచూపుతుందన్నది ఈ అంచనా సారాంశం. నిజానికి నాటో దేశాలు నిరంతరం సరఫరా చేస్తున్న మారణా యుధాలతో, యుద్ధ విమానాలతో ఉక్రెయిన్ దాదాపు మూడేళ్లుగా తలపడుతూనే ఉంది. పర్యవనసానంగా గతంలో కోల్పోయిన కొన్ని నగరాలను అది స్వాధీనం చేసుకుంది కూడా! కానీ రష్యా ప్రతిదాడులతో అవి ఎన్నాళ్లుంటాయో, ఎప్పుడు జారుకుంటాయో తెలియని స్థితి ఉంది. అత్యుత్సాహంతో ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలను, ఎఫ్–16 యుద్ధ విమానాలను తరలించిన అమెరికా నెలలు గడుస్తున్నా వాటి వినియోగానికి ఇంతవరకూ అనుమతినివ్వనే లేదు. ఉదాహరణకు ఉపరితలం నుంచి ప్రయోగించే సైనిక వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థ (ఏటీఏసీఎం) 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని అవలీలగా ఛేదిస్తుంది. బ్రిటన్–ఫ్రాన్స్ సంయుక్తంగా రూపొందించిన స్టార్మ్ షాడో 250 కిలోమీటర్ల దూరంలోని దేన్నయినా ధ్వంసం చేస్తుంది. ఈ రకం క్షిపణుల్ని గగనతలం నుంచి ప్రయోగిస్తారు. మరోపక్క జర్మనీ తయారీ టారస్ క్షిపణి కూడా ఇటువంటిదే. పైగా ఇది అమెరికా తయారీ క్షిపణిని మించి శక్తిమంతమైంది. 500 కిలోమీటర్లకు మించిన దూరంలోని లక్ష్యాన్ని గురిచూసి కొడుతుంది. ఇవన్నీ ఇంచుమించు ఏడాదిగా ఉక్రెయిన్ సైనిక స్థావరాల్లో పడివున్నాయి. ఎందుకైనా మంచిదని కాబోలు అమెరికా తన ఎఫ్–16లను నేరుగా ఉక్రెయిన్‌కు ఇవ్వకుండా నెదర్లాండ్స్, డెన్మార్క్‌లకు పంపి వారి ద్వారా సరఫరా చేసింది. వీటి వినియోగానికి ఉక్రెయిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని బ్రిటన్, ఫ్రాన్స్ పట్టుబడుతుండగా అమెరికాతోపాటు జర్మనీ కూడా ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అదే జరిగితే యుద్ధ తీవ్రత మరింత పెరిగి, రష్యా ఎంతకైనా తెగించే పరిస్థితి ఏర్పడొచ్చునని అమెరికా, జర్మనీ ఆందోళన పడుతున్నాయి. తన భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తున్నా రష్యా నిర్లిప్తంగా ఉండిపోతుండగా ఈ అనవసర భయాలేమిటన్నది బ్రిటన్, ఫ్రాన్స్‌ల వాదన. కానీ ఒకసారంటూ ఎఫ్16లు వచ్చి పడితే, అత్యాధునిక క్షిపణులు విధ్వంసం సృష్టిస్తే రష్యా ఇలాగే ఉంటుందనుకోవద్దని పెంటగాన్ హెచ్చరిస్తోంది. తప్పనిసరైతే ఉక్రెయిన్ సరిహద్దుల ఆవల ఉన్న రష్యా స్థావరాలను లక్ష్యంగా చేసుకోమంటున్నది. ఈమధ్య క్రిమియాపై దాడికి అనుమతించింది. కానీ కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదిరితే తప్ప రష్యా నగరాల జోలికి పోవద్దని చెబుతోంది. అంతగా భయపడితే అసలు ఇలాంటి ఆయుధాలు, యుద్ధ విమానాలు తరలించటం దేనికి? అవేమైనా ఎగ్జిబిషన్‌కు పనికొచ్చే వస్తువులా? వాటిని చూసి రష్యా ‘పాహిమాం’ అంటూ పాదాక్రాంతమవుతుందని అమెరికా నిజంగానే భావించిందా? యుద్ధం ఏళ్లతరబడి నిరంతరం కొనసాగుతుంటే ఎప్పుడో ఒకప్పుడు పరిస్థితి చేజారే ప్రమాదం ఉంటుంది. కనుక అమెరికా, పాశ్చాత్య దేశాలు వివేకంతో మెలగాలి. యుద్ధ విరమణకు సకల యత్నాలూ చేయాలి. దాడులతో ఒత్తిడి తెస్తే రష్యా దారికొస్తుందనుకుంటున్న ఉక్రెయిన్‌కు తత్వం బోధపడాలంటే ముందు అమెరికా సక్రమంగా ఆలోచించటం నేర్చుకోవాలి. ఉక్రెయిన్–రష్యా ఘర్షణ, గాజాలో ఇజ్రాయెల్ ఊచకోతలు ఆగనంతవరకూ ప్రపంచం సంక్షోభం అంచున ఉన్నట్టే లెక్క. అందుకే ప్రపంచ దేశాలు అప్రమత్తం కావాలి. శాంతి నెలకొల్పడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. -
Rahul Gandhi: యుద్ధాలను ఆపే మోదీ పేపర్ లీకేజీలు ఆపలేరా?
న్యూఢిల్లీ: నీట్–యూజీ, యూజీసీ–నెట్ పరీక్షల్లో అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్–రష్యా, హమాస్–ఇజ్రాయెల్ యుద్ధాలను ఆపేసే శక్తి ఉందని చెప్పే ప్రధాని నరేంద్ర మోదీకి మన దేశంలో పేపర్ లీకేజీలను ఆపే శక్తి లేదా? అని ప్రశ్నించారు. లీకేజీలను ఆపాలని మోదీ కోరుకోవడం లేదని ఆక్షేపించారు. దేశంలో ఉన్నత విద్యా సంస్థలను అధికార బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ చెరబట్టాయని, అందుకే పేపర్ లీక్‌లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితి మారనంత వరకు పేపల్ లీక్‌లు అగవని తేలి్చచెప్పారు. రాహుల్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. లక్షలాది మంది నీట్ అభ్యర్థుల ఆందోళనలను నరేంద్ర మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆయన దృష్టి మొత్తం ఇప్పుడు పార్లమెంట్లో స్పీకర్‌ను ఎన్నుకోవడంపైనే ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మోదీ మానసికంగా కుప్పకూలిపోయారని, ఇకపై ఆయన ప్రభుత్వాన్ని నడిపించేందుకు మరింత ఇబ్బంది పడుతారని చెప్పారు. పార్లమెంట్లో లేవనెత్తుతాం.. ‘‘నరేంద్ర మోదీకి ఇప్పుడు ఎవరూ భయపడడం లేదు. గతంలో ఆయన ఛాతీ 56 అంగుళాలు ఉండేది. ఇప్పుడది 32 అంగుళాలకు కుదించుకుపోయింది. భయపెట్టి, బెదిరించి పని చేయించుకోవడం మోదీకి అలవాటు. ఇప్పుడు ప్రజల్లో మోదీ అంటే భయం పోయింది. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉంది. ప్రశ్నపత్రాల లీకేజీ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతాం’’. అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నీట్‌పై ఆందోళన అవసరం లేదు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీ: నీట్–యూజీ పరీక్ష విషయంలో ఆందోళన అవసరం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఎక్కడో జరిగిన చిన్నాచితక సంఘటనలు ఈ పరీక్ష సక్రమంగా రాసిన లక్షలాది మంది అభ్యర్థులపై ఎలాంటి ప్రభావం చూపబోవని చెప్పారు. యూజీసీ–నెట్ ప్రశ్నపత్రం డార్క్‌నెట్‌లో లీక్ అయ్యిందని, అందుకే పరీక్ష రద్దు చేశామని ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేశారు. -
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పూర్తి మద్ధతు: ఉత్తర కొరియా
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానం మేరకు రెండు రోజులు (ఈనెల18,19) అక్కడ పుతిన్ పర్యటిస్తున్నారు. ప్యోంగ్యాంగ్ విమానాశ్రయానికి స్వయంగా వెళ్లిన కిమ్, పుతిన్‌కు ఆహ్వానం పలికారు. అనంతరం ప్యోంగ్యాంగ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇరువురు పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ద్వైపాక్షిక చర్చలు జరిపారు.ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యాకు తమ పూర్తి మద్ధతు ఉంటుందని కిమ్ హామీ ఇచ్చారు. ఇరుదేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి, అమెరికా ఆధిప్యత విధానాలకు వ్యతిరేకంగా పోరేండేందుకు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు పుతిన్ పేర్కొన్నారు. ఇరు దేశాల మద్య ఆర్థిక, సైనిక సహకారాన్ని విస్తరించేందుకు అంగీకరించినట్లు తెలిపారు.యుద్ధంలో తమ పాలసీలకు మద్ధతు ప్రకటించడంపై కిమ్‌కు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. అయితే యుద్ధంలో తమకు ఆయుధాలను పంపాలని కిమ్‌ను కోరినట్టు తెలుస్తోంది. దీనికి బదులుగా ఉత్తర కొరియాకు ఆర్థికంగా, సాంకేతికంగా రష్యా సాయం చేయనున్నట్టు సమాచారం.ఇక ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర సమయంలో పుతిన్ పర్యటనకు రావడం.. అమెరికా సహా దాని మిత్రదేశాలను ఆందోళనకు గురిచేసింది. అణ్వాయుధాలు, క్షిపణి పరీక్షలతో నిత్యం శత్రు దేశాలను కవ్వించే ఉత్తర కొరియా చేతికి రష్యా అత్యాధునిక సాంకేతికత అందితే మరింత ప్రమాదమని పశ్చిమ దేశాల్లో ఆందోళన నెలకొంది.ఇదిల ఉండగా అంతర్జాతీయంగా ఇరుదేశాలపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఒకవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు.. ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలు, ఇతర దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఈ పరిణామాల నడుమ.. వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటించడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి. కాగా గత ఏడాది సెప్టెంబరులో కిమ్ జోంగ్ ఉన్ రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. -
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ వాసి మృతి
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై.. రెండు సంవత్సరాలు అవుతోంది. తొలుత ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేసి రష్యా ఆధిపత్యం చెలాయించగా.. ఆ తర్వాత ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల సహకారంతో ఎదురుదాడుల్ని పెంచింది. మొదట్లో రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాల్ని ఒక్కొక్కటిగా తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. దీంతో రష్యా తన దాడుల్ని మరింత తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌ని బలహీనపరిచేందుకు ప్రధాన కార్యాలయాలను టార్గెట్ చేసుకొని, డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. ఇటు ఉక్రెయిన్ సైతం ఈ దాడుల్ని తిప్పికొడుతోంది. తాజాగా రష్కా- ఉక్రెయిన్ పోరులో హైదరాబాద్ వాసి మృతి చెందాడు.. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడుతూ నగరానికి చెందిన మహ్మద్ అఫ్సాన్(30) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు. అయితే ఉద్యోగం విషయంలో మోసపోవడంతో ఆఫ్సాన్ రష్యన్ ఆర్మీలో బలవంతంగా చేరాల్సి వచ్చినట్లు సమాచారం. కాగా రష్యా సైన్యానికి సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న దాదాపు 20 మంది భారతీయులను తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన కొద్ది రోజులకే ఈ విషాదం వెలుగుచూసింది. మరోవైపు మహ్మద్ అస్ఫాన్‌ను రష్యా నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు సాయం కోసం అతడి కుటుంబుం ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని సంప్రదించింది. ఈ క్రమంలో ఎంఐఎం మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా.. అస్ఫాన్ మరణించినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. మృతిడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: గర్భవతైన భార్యను, కూతురును వదిలి ఇజ్రాయెల్‌కు.. అంతలోనే -
గగనతల రారాజు ‘జిర్కాన్’.. ఎన్నో ప్రత్యేకతలు
రష్యా వద్ద ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలున్నట్లు వస్తున్న వార్తలకు బలం చేకూరేలాగా తాజా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రష్యా అత్యాధునిక అస్త్రాన్ని ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. ఈ విషయాన్ని మాస్కో బహిర్గతం చేయకపోయినా కీవ్ ఫోరెన్సిక్ పరిశోధనా సంస్థ బృందం గుర్తించింది. ఇటీవల కీవ్‌పై జరిగిన ఒక దాడిలో రష్యా జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని వాడినట్లు ఆ బృందం వెల్లడించింది. జిర్కాన్ ప్రత్యేకతలు.. ఒక్కసారి జిర్కాన్ క్షిపణి గాల్లోకి ఎగరడం మొదలుపెడితే దాన్ని ప్రపంచంలోని ఏ అత్యున్నత గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకోలేదు. అమెరికాకు చెందిన మిసైల్ డిఫెన్స్ అడ్వొకసి అలయన్స్ అంచనా ప్రకారం ఈ క్షిపణి గంటకు 9,900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒకవేళ ఇలా వస్తున్న వార్తలు నిజమైతే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణి జిర్కాన్. దాన్ని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. ఈ క్షిపణి ప్రయాణించే సమయంలో దాని చుట్టూ ప్లాస్మా మేఘంతో వలయం ఏర్పడుతుంది. గగనతల రక్షణ వ్యవస్థల నుంచి వచ్చే రాడార్ సంకేతాలను అది తనలో కలిపేసుకుంటుంది. దీంతో ఈ క్షిపణిని గుర్తించడానికి వీలుండదు. అమెరికాకు చెందిన ‘ఏజిస్ క్షిపణి రక్షణ వ్యవస్థ’కు శత్రు అస్త్రాలను నేలకూల్చడానికి 8-10 సెకన్ల సమయం అవసరం. ఇంత స్వల్ప వ్యవధిలో జిర్కాన్ 20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అందువల్ల ఏజిస్ క్షిపణికి కూడా అది అందదని రష్యా నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే.. -
పుతిన్ పైశాచికత్వం.. ఉక్రెయిన్‌లో 51 మంది మృతి..
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏడాదిన్నరకు పైగా రష్యా సైన్యం దాడులు.. ఉక్రెయిన్‌పై కొనసాగుతున్నాయి. తాజాగా రష్యా రాకెట్లో ఉక్రెయిన్‌లో భారీ ప్రాణనష్టం చోటుచేసుకుంది. రాకెట్ దాడిలో 51 మంది మృతిచెందినట్టు సమాచారం. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్టు ఉక్రెయిన్ దేశ అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. ఉక్రెయిన్‌పై దాడులను రష్యా కొనసాగిస్తున్నది. ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలో రష్యా రాకెట్ దాడులు చేసింది. గురువారం మధ్యాహ్నం కుప్యాన్స్క్ జిల్లాలోని హ్రోజా గ్రామంలో ఒక షాపు, కేఫ్‌పై రష్యా రాకెట్ల దాడి జరిగినట్లు ఆ ప్రాంత గవర్నర్ తెలిపారు. ఈ రాకెట్ దాడిలో సుమారు 51 మంది మరణించినట్లు చెప్పారు. బిల్డింగ్ శిథిలాల్లో కొందరు చిక్కుకున్నట్లు వెల్లడించారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిన్నట్లు టెలిగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ⚡️Yermak: Russia attacks village in Kharkiv Oblast, killing 49 people. Russian forces attacked a grocery store in the village of Hroza in Kharkiv Oblast’s Kupiansk district, killing at least 49 people, Andriy Yermak, the head of the Presidential Office, reported on Oct. 5. 📷… pic.twitter.com/rKOmYg8i07 — The Kyiv Independent (@KyivIndependent) October 5, 2023 మరోవైపు.. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ రిజియన్‌లోని బెరిస్లావ్ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిపై రష్యా దాడులకు తెగబడింది. ఆసుపత్రి, మెడికల్ ఎమర్జెన్సీ స్టేషన్‌పై రష్యా బాంబు దాడులు ప్రయోగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 😥Russian bomb hits hospital and emergency medical station in Beryslav, Kherson region#UkraineWar #Ukraina #UkraineRussiaWar #Russia pic.twitter.com/GNXABLsXpr — Hieu Nguyen (@HieuTraderPro) October 5, 2023 కాగా, స్పెయిన్‌లో జరుగనున్న యూరప్ నేతల సదస్సులో పాల్గోనున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్కీ తాజా రష్యా దాడిపై స్పందించారు. గ్రోసరీ షాపుపై జరిగిన రష్యా రాకెట్ దాడిని క్రూరమైన ఉగ్రవాద దాడి అని ఆరోపించారు. ఈ సంఘటనలో 48 మందికిపైగా మరణించినట్లు తెలుస్తున్నదని వెల్లడించారు. మరోవైపు 19 నెలలుగా ఉక్రెయిన్‌పై దాడులను రష్యా కొనసాగిస్తున్నది. స్వాధీనం చేసుకున్న కొన్ని ప్రాంతాలను రష్యాలో కలుపుకున్నది. ఇది కూడా చదవండి: పార్లమెంట్ సాక్షిగా ట్రూడో చిల్లర చేష్టలు -
శాంతి, సౌభాగ్యం
న్యూఢిల్లీ: ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలతో కూడిన జీ20 కూటమికి ఈ ఏడాది సారథ్యం వహిస్తున్న భారత్‌కు ప్రశంసనీయమైన విజయం దక్కింది. శనివారం ఢిల్లీలో ప్రారంభమైన జీ20 శిఖరాగ్ర సదస్సులో, ప్రపంచ శాంతి, సౌభాగ్యమే ధ్యేయంగా వివిధ కీలక అంశాలతో కూడిన ‘న్యూఢిల్లీ జీ20 సమ్మిట్ లీడర్స్ డిక్లరేషన్’కు కూటమి సభ్యదేశాల ఆమోదం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. డిక్లరేషన్‌పై కూటమి దేశాల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైందని, వెంటనే ఆమోదం పొందిందని వెల్లడించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం విషయంలో దేశాల మధ్యనున్న భేదాభిప్రాయాలను అధిగమించి మరీ డిక్లరేషన్‌పై ఆమోద ముద్ర పడడం గమనార్హం. డిక్లరేషన్ ఆమోదం పొందడానికి కృషి చేసిన జీ20 దేశాల మంత్రులు, అధికార ప్రతినిధులు(òÙర్పాలు), అధికారులకు నరేంద్ర మోదీ కృతజ్ఞ తలు తెలిపారు. వారంతా ప్రశంసలకు అర్హులని పేర్కొన్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో శనివారం ఢిల్లీలో అట్టహాసంగా ఆరంభమైంది. భారత ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధానమంత్రి రిషి సునాక్, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా తదితరులు పాల్గొన్నారు. చైనా అధినేత షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరు కాలేదు. ఉక్రెయిన్‌లో సంఘర్షణ, ఉగ్రవాదం, అవినీతి, ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులు, ప్రపంచ ఆర్థిక ప్రగతి, విద్య, నైపుణ్యాల వృద్ధి, పునరుత్పాదక ఇంధనాల వినియోగం తదితర కీలక అంశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో చోటుచేసుకున్నాయి. ఉక్రెయిన్‌లో శాంతికి పాటుపడాలి ఉక్రెయిన్‌లో నెలకొన్న సంఘర్షణపై న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. నేటి యుగం యుద్ధాల యుగం కాదని తేలి్చచెప్పింది. ప్రాదేశిక సమగ్రత, సార్వ¿ౌమత్వంతో కూడిన అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని పేర్కొంది. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదని వెల్లడించింది. శాంతియుత చర్చలు, దౌత్యమార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. శాంతి తీర్మానం ముఖ్యమని తెలిపింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, సాధారణ సభలో చేసి న తీర్మానాలకు కట్టుబడి ఉండాలని, ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలను అన్ని దేశాలు పాటించాలని వెల్లడించింది. ఇతర దేశాల భూభాగా లను ఆక్రమించుకోవడం, అందుకోసం బెదిరింపులకు దిగడం లేదా బలప్రయోగానికి పాల్పడ డం ఆమోదనీయం కాదని స్పష్టం చేసింది. అణ్వాయుధాలను ప్రయోగిస్తామని బెదిరించడం లేదా ప్రయోగించడం ఆక్షేపణీయమని పేర్కొంది. ఉక్రెయిన్‌లో సుస్థిర శాంతి కోసం అన్ని దేశాలూ చొరవ తీసుకోవాలని పిలుపునిచి్చంది. ‘‘ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే ఖండించాల్సిందే. అంతర్జాతీయ శాంతికి, భద్రతకు ఉగ్రవాదం తీవ్రమైన ముప్పుగా మారింది. మతం, జాతి పేరిట ప్రజల మధ్య చిచ్చు రేపడం క్షమార్షం కాదు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలి. ఆయుధాల అక్రమ రవాణా కూడా ఆందోళనకరంగా మారింది. ఈ అవాంఛనీయ ధోరణిని అరికట్టాల్సిందే. ఆయుధాల ఎగుమతులు, దిగుమతులపై అన్ని దేశాలు గట్టి నిఘా పెట్టాలి’’అని డిక్లరేషన్ సూచించింది. మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యం ప్రపంచంలో అందరికీ సమాన స్థాయిలో, నాణ్య మైన విద్య, నైపుణ్య శిక్షణను అందించాల్సిన ఆవశ్యకతను న్యూఢిల్లీ డిక్లరేషన్ నొక్కిచెప్పింది. మానవ వనరుల అభివృద్ధికి అత్యధిక ప్రాధా న్యం ఇవ్వాలని సూచించింది. ప్రజల మధ్య డిజి టల్ అంతరాలను తొలగించడానికి డిజిటిల్ సాంకేతికలను సమర్థంగా ఉపయోగించుకోవా లని జీ20 దేశాలు తమ డిక్లరేషన్‌లో తీర్మానించు కున్నాయి. కృత్రిమ మేధ సహా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొనేలా విద్యాసంస్థలకు, టీచర్లకు సహకరించాలని నిర్ణయించుకున్నాయి. విద్యార్థులు, నిపుణులు, పరిశోధకులు, సైంటిస్టులు పరిశో« దనా సంస్థలతో, ఉన్నత విద్యా సంస్థలతో కలిసి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు. దుర్బల పరిస్థితుల్లో ఉన్నవారికి సైతం సమగ్ర, సమాన, నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఉన్నత విద్య, ఉద్యోగాల సాధనకు ఫౌండేషనల్ లెరి్నంగ్ ప్రాముఖ్యతను తాము గుర్తించామని పేర్కొన్నారు. హై–క్వాలిటీ టెక్నికల్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్(టీవీఈటీ)ని డిక్లరేషన్‌లో ప్రస్తావించారు. స్వేచ్ఛాయుత, పారదర్శక వాణిజ్యం ప్రపంచమంతటా నిత్యావసరాల ధరలు, జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయం, ఆహారం, ఎరువుల రంగంలో స్వేచ్ఛాయుత, పారదర్శక, నిబంధనల ఆధారిత వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో పేర్కొ న్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలకు అనుగుణంగా ఎగుమతులపై నిషేధం విధించరాదని ఉద్ఘాటించారు. ఆహార భద్రత సవాళ్లను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు సాగిస్తున్న ప్రయత్నాలకు, వాటి సామర్థ్యాలకు మద్దతు ఇవ్వాలని తీర్మానించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం చౌకగా అందేలా కలిసి పని చేయాలని నిర్ణయించారు. చాలినంత ఆహారం అనేది అందరి హక్కు అని పేర్కొన్నారు. ప్రపంచ ఆహార భద్రతను మరింత పెంచడానికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అలాగే అగ్రికల్చరల్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ(ఏఎంఐఎస్)లోకి ఎరువులు, వెజిటబుల్ ఆయిల్స్‌ను కూడా తీసుకోవాలని నిర్ణయించారు. ఆహార ధరల్లో హెచ్చుతగ్గులను అరికట్టడానికి గ్రూప్ ఆన్ ఎర్త్ అబ్జర్వేషన్స్ గ్లోబల్ అగ్రికల్చరల్ మానిటరింగ్(జియోగ్లామ్) వ్యవస్థను తీసుకురానున్నారు. ఏఎంఐఎస్ పరిధిలో ప్రస్తుతం బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, సోయా ఉన్నాయి. మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం మహిళా ఆహార భద్రత, పౌష్టికాహారం ప్రాధాన్యతను డిక్లరేషన్ వివరించింది. నైపుణ్యాల అంతరాలను తొలగించాలి ప్రపంచవ్యాప్తంగా జనంలో నైపణ్యాల అంతరాలను తొలగించి, నిపుణులను తయారు చేయడానికి కార్యాచరణ చేపట్టాలని న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో కూటమి నేతలు ప్రతిన బూనారు. సమీకృత సామాజిక రక్షణ విధానాలను అందరికీ వర్తింపజేయాలని తీర్మానించారు. సామాజిక భద్రత ప్రయోజనాలను ద్వైపాక్షిక, బహుముఖీన ఒప్పందాల ద్వారా అర్హులకు అందించేందుకు అంగీకరించారు. బాల కారి్మక వ్యవస్థను, వెట్టి చాకిరి వ్యవస్థను నిర్మూలించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలని నిర్ణయించారు. సమగ్ర ఆర్థిక ప్రగతి కోసం గ్లోబల్ స్కిల్స్ పెంచడం చాలా ముఖ్యమంత్రి డిక్లరేషన్ తేలి్చచెప్పింది. డిజిటల్ అప్‌స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని సూచించింది. గిగ్, ప్లాట్‌ఫామ్ కారి్మకులకు సామాజిక పరిరక్షణ పథకాలు, మెరుగైన పని వసతులు కల్పించాలన్న ప్రతిపాదనను కూటమి నేతలు ఆమోదించారు. అవినీతిపై యుద్ధమే అవినీతి సహించడానికి ఎంతమాత్రం వీల్లేదని జీ20 నేతలు తీర్మానించారు. అవినీతికి యుద్ధం సాగించాలని డిక్లరేషన్‌లో ప్రస్తావించారు. ఈ విషయంలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని, సమాచారాన్ని ఇచి్చపుచ్చుకోవాలని నిర్ణయానికొచ్చారు. అవినీతిని ఎదుర్కొనే దిశగా ఆస్తులను స్వా«దీనం చేసుకొనే యంత్రాంగాలను బలోపేతం చేయాలన్నారు. అవినీతిపై పోరాడే బాధ్యతలను నిర్వర్తించే ప్రభుత్వ సంస్థలు, అధికారులు మరింత ప్రభావవంతంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని తీర్మానంలో పేర్కొన్నారు. అవినీతిని అరికట్టడానికి అంతర్జాతీయ స్థాయిలో జరిగే ప్రయత్నాలకు మద్దతు ఇస్తామన్నారు. శిలాజ ఇంధనాల వాడకం తగ్గించుకుందాం పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వాడకాన్ని దశల వారీగా తగ్గించుకొనే ప్రయత్నాలను మరింత వేగవంతం చేయాలంటూ న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించారు. అలాగే 2009లో పిట్స్‌బర్గ్‌లో చేసిన ప్రతిజ్ఞ ప్రకారం శిలాజ ఇంధనాలపై సబ్సిడీలను హేతుబద్దీకరించాలని నిర్ణయించారు. అతితక్కువ ఉద్గారాలతో కూడిన ఇంధన వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవడానికి టెక్నాలజీని వాడుకోవాలని పేర్కొన్నారు. కాలుష్య రహిత, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లేలా పేద దేశాలకు సహకరించాలని తీర్మానించారు. వాతావరణ మార్పుల నియంత్రణ లక్ష్యాల సాధనకు శుద్ధ ఇంధనాల వాడకాన్ని పెంచుకోవాలని, ఇందుకోసం ఉమ్మడి ప్రయత్నాలు కొనసాగించాలని జీ20 నాయకులు డిక్లరేషన్‌ను ఆమోదించారు. నవీన ఆవిష్కరణలకు ఊతం ఇచ్చేలా, టెక్నాలజీ ప్రయోజనాలను పరస్పరం పంచుకొనేలా సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవాలని తీర్మానించారు. ఇంధన భద్రతను, మార్కెట్ స్థిరత్వాన్ని పెంచుకోవడానికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు ప్రజలకు సేవలు అందించడానికి, నూతన ఆవిష్కరణలకు భద్రమైన, నమ్మకమైన, పారదర్శకతతో కూడిన సమగ్ర డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల(డీపీఐ) అవసరాన్ని జీ20 నేతలు గుర్తించారు. ‘ఇంటర్నేషనల్ గవర్నెన్స్ ఫర్ ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్’పై అంతర్జాతీయ స్థాయిలో పరస్పరం సహకరించుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు. డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం జీ20 ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్న సూచనను డిక్లరేషన్ స్వాగతించింది. గౌరవప్రదమైన మానవ హక్కులు, వ్యక్తిగత డేటా, గోప్యత, మేధో సంపత్తి హక్కుల గురించి కూడా డిక్లరేషన్‌లో ప్రస్తావించారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని, భద్రతను పెంపొందించాలని తెలిపారు. ‘మంచి కోసం, అందరి కోసం’అనే నినాదంతో కృత్రిమ మేధ(ఏఐ)ను వాడుకోవాలన్నారు. ఏఐతో లాభాలు అందరికీ సమానంగా దక్కాలని, రిస్‌్కను సైతం సమానంగా పంచుకోవాలని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెస్పిరేటరీ(జీడీపీఐఆర్) ఏర్పాటు చేస్తామన్న భారత్ ప్రకటన పట్ల డిక్లరేషన్ సానుకూలంగా స్పందించింది. మలీ్టలేటరల్ డెవలప్మెట్ బ్యాంకులు అవసరమని తెలియజేసింది. సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ కావాలి ప్రపంచ ఆర్థిక రంగానికి ఎదురవుతున్న సవాళ్లు, నెలకొన్న సంక్షోభాలపై జీ20 డిక్లరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక వృద్ధిలో దేశాల మధ్య అసమానతలను తగ్గించడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి ఆర్థిక సహకార విధానాలు, నిర్మాణాత్మక చర్యలు ప్రారంభించాలని పేర్కొంది. ధరల్లో స్థిరత్వం కోసం సెంట్రల్ బ్యాంకులు సహకరించాలని పేర్కొంది. దీర్ఘకాలిక వృద్ధికి ప్రోత్సాహం ఇవ్వాలంటే సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ, నిర్మాణాత్మక ప్రభుత్వ విధానాలు అవసరమని ఉద్ఘాటించింది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు(ఎఫ్ఎస్బీ) తీసుకున్న చర్యలను డిక్లరేషన్ ప్రశంసించింది. పాలసీ క్రెడిబిలిటీని కొనసాగించాలంటే సెంట్రల్ బ్యాంకులకు స్వతంత్ర ప్రతిపత్తి చాలా అవసరమని అభిప్రాయపడింది. దేశాల అభివృద్ధిలో స్టార్టప్ కంపెనీలు, ఎంఎస్ఎంఈల పాత్ర చాలా కీలకమని స్పష్టం చేసింది. -
Vladimir Putin: చూపు మందగించిందా?
ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై రకరకాల వదంతులు వినవస్తున్నాయి. వాటిని ధృవీకరిస్తూ కొన్ని వీడియోలు, ఫొటోలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే.. క్రెమ్లిన్ వర్గాలు మాత్రం ఎప్పటికప్పుడు ఆ వందతుల్ని కొట్టిపారేస్తూ వస్తున్నాయి. తాజాగా బ్రిటిష్ టాబ్లాయిడ్ ‘మెట్రో’ ఓ సంచలన కథనం ప్రచురించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాడని, ఆయన చూపు కూడా మందగించిందని, నాలుక తిమ్మిరి సమస్యతోనూ ఇబ్బంది పడుతున్నారని సదరు కథనం పేర్కొంది. అంతేకాదు.. పుతిన్‌కు కుడివైపు భాగం సైతం స్వల్పంగా స్పర్శ కోల్పోయిందని పేర్కొంది. రోజు రోజుకీ ఆయన ఆరోగ్యం దిగజారుతోందన్న తాజా వరుస కథనాల నడుమ.. ఈ కథనం వెలువడడం గమనార్హం. పైగా రష్యన్ అవుట్లెట్ ద్వారానే తాము ఆ సమాచారం సేకరించినట్లు మెట్రో ప్రచురించింది. ఈ పరిణామాలతో ఆయన వ్యక్తిగత వైద్యుల బృందం.. కొన్నిరోజులు అబ్జర్వేషన్లో ఉండమని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో కొన్నివారాల పాటు ఆయన మీడియా కంట పడరంటూ తెలుస్తోంది. మరోవైపు ఫిబ్రవరిలోనూ ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందంటూ ఓ వైరల్ విపరీతంగా చక్కర్లు కొట్టింది. Putin - Lukashenko: "Thank you for agreeing to come - As if I couldn't agree!"😊 Vladimir Putin met Alexander Lukashenko. The main statements of the President of 🇧🇾: - "Peace-loving" countries failed to suppress 🇷🇺 and 🇧🇾 sanctions, import substitution progresses⤵️ pic.twitter.com/gDgSefUBqs — ☭ Сама deZan..⚡️ (@Worchestra_) February 17, 2023 -
యుద్ధాన్ని ఆపే దమ్ము చైనాకి ఉందా?
కీవ్/బీజింగ్: ఏడాది కాలంపాటు జరిగిన విధ్వంసకాండ.. నరమేధం తర్వాత ఉక్రెయిన్ యుద్దం ముగింపు దశకు చేరుకోబోతోందా?.. అదీ వీలైనంత తర్వలోనేనా?. దురాక్రమణను నిలిపేసి.. బలగాలను వెనక్కి రప్పించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరిస్తారా?.. ఒక బాధిత దేశంగా శాంతి చర్చలకు తామే తొలి అడుగు వేస్తామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించిన వేళ.. చైనా చేస్తున్న ప్రయత్నాలపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను మొదటి నుంచి చైనా వ్యతిరేకించడం లేదు. అలాగని సమర్థించడమూ లేదు. కానీ, ఉన్నపళంగా శాంతి చర్చల రాగం అందుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు శుక్రవారం.. ఇరుదేశాలు సమన్వయం పాటించాలని సూచిస్తూ పొలిటికల్ సెటిల్మెంట్ పేరుతో 12 పాయింట్ల పేపర్‌ను విడుదల చేసింది చైనా ప్రభుత్వం. ఆ వెంటనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సైతం.. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో భేటీకి సిద్ధమంటూ ప్రకటించారు. వెనువెంటనే.. రష్యా సైతం చైనా శాంతి చర్చల పిలుపును స్వాగతించింది కూడా!. చైనా శాంతి ప్రణాళిక నేపథ్యంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను కలవనున్నట్లు ప్రకటించారు. జింగ్‌పిన్‌ను కలిసి చర్చించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపిన ఆయన.. ఇది ప్రపంచ భద్రతకు సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారించాలంటే రష్యాకు చైనా నుంచి ఆయుధాలు సరఫరా కాకుండా చూస్కోవడమే ఇప్పుడు తన ముందున్న కర్తవ్యమని, చైనా కూడా ఈ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారాయన. మరోవైపు.. జెలెన్స్కీ-జిన్‌పింగ్ భేటీ ఎప్పుడన్నదానిపై స్పష్టత లేకున్నా.. ఈ పరిణామంపై రష్యా కూడా స్పందించింది. రష్యా విదేశాంగ ఒక ప్రకటనలో.. చైనా శాంతి ప్రయత్నాలను అభినందించింది. బీజింగ్ అభిప్రాయాలను మేం గౌరవిస్తాం అంటూ అందులో స్పష్టం చేసింది రష్యా విదేశాంగ శాఖ. ఈ తరుణంలో శాంతి చర్చలకు బీజింగ్ వేదిక కాబోతోందని, త్వరలోనే యుద్ధానికి పుల్‌స్టాప్ పడొచ్చని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు విశ్లేషణాత్మక ప్రత్యేక కథనాలు ప్రచురిస్తున్నాయి. పుతిన్ వార్నింగ్‌ను తప్పుబట్టిన చైనా! ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఫిబ్రవరి 24వ తేదీతో.. సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. ఒకవైపు ఉక్రెయిన్ భారీగా నష్టపోయింది. రష్యా సైతం భారీగా బలగాల్ని కోల్పోయింది. అయినప్పటికీ రష్యా మాత్రం ‘తగ్గేదేలే..’ అనుకుంటూ రెండో ఏడాదిలోకి అడుగుపెట్టేసింది. అసలు యుద్ధానికి ముగింపు ఎప్పుడు? అనేదానిపై ఎవరూ అంచనా వేయలేని స్థితి. ఈ తరుణంలో.. బుధవారం మాస్కోలోని చైనా దౌత్యవేత్త వాంగ్ యూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ను కలిశాడు. ఆ తర్వాత చైనా నుంచి శుక్రవారం శాంతి ప్రణాళిక బయటకు రావడం గమనార్హం. చైనా ఇరు దేశాలకు శుక్రవారం కీలక సూచన చేసింది. రెండు దేశాలు సంయమనం పాటించాలి. తక్షణ శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి అని చైనా తన శాంతి ప్రకటనలో సూచించింది. పొలిటికల్ సెటిల్మెంట్లో.. ఉక్రెయిన్-రష్యాలు ముఖాముఖి చర్చలకు ప్రయత్నించాలని చైనా, యావత్ ప్రపంచాన్ని కోరింది. పుతిన్ అణ్వాయుధాల ప్రయోగం హెచ్చరికల నేపథ్యంలో.. అణ్యాయుధాలను వాడడమే కాదు, వాటిని యుద్ధ క్షేత్రంలో మోహరించడం కూడా పెను విపత్తేనని పుతిన్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. అంతర్జాతీయ మానవతా చట్టానికి ఇరు దేశాలు కట్టుబడి ఉండాలని సూచించింది. పౌరులు/ పౌర సౌకర్యాలపై దాడులు చేయకూడదని చెప్పింది. అత్యవసరంగా శాంతి చర్చలకు ముందుకు రావాలని అందులో పేర్కొంది చైనా. చైనా వెరీ డేంజర్: వెస్ట్రన్ కంట్రీస్ ఇదిలా ఉంటే.. చైనా చేసిన శాంతి ప్రతిపాదలను ఉక్రెయిన్‌కు మద్ధతు ఇస్తున్న పాశ్చాత్య దేశాల్లో చాలావరకు తిరస్కరించాయి. పైగా మాస్కోతో బీజింగ్‌కు ఉండే సన్నిహిత సంబంధాల దృష్ట్యా.. జాగ్రత్తగా ఉండాలని ఉక్రెయిన్ను, జెలెన్స్కీని హెచ్చరించాయి. ‘‘రష్యా.. చైనాకు వ్యూహాత్మక మిత్రదేశం. అలాంటి దేశంలో సన్నిహితంగా ఉంటూనే.. దురాక్రమణ విషయంలో తటస్థంగా ఉంటూ వస్తోంది. ఇది ఉక్రెయిన్ గమనించాలి. ఇదేకాదు.. 12 పాయిట్ల పొలిటికల్ సెటిల్మెంట్లో.. ఎక్కడా కూడా రష్యా బలగాలు ఉక్రెయిన్ గడ్డ నుంచి వెనక్కి వెళ్లిపోవాలని చైనా చెప్పలేదు. పైగా రష్యాపై సానుకూల ధోరణి ప్రదర్శిస్తూ.. ‘‘ఏకపక్ష ఆంక్షల’’ను తీవ్రంగా ఖండించింది కూడా’’ అని పాశ్చాత్య దేశాలు చెప్తున్నాయి. ఇక చైనా శాంతి చర్చల పిలుపుపై నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ స్పందించారు. బీజింగ్‌ను నమ్మడానికి వీల్లేదని, ఎందుకంటే అది ఉక్రెయిన్‌పై దురాక్రమణను ఏనాడూ ఖండించలేదని తెలిపారు. మరోవైపు రష్యాకు బీజింగ్ నుంచి ఆయుధాల సరఫరా జరుగుతోందని అమెరికా ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. బీజింగ్ ఆ ఆరోపణను ఖండించింది. -
జో బైడెన్‌తో జెలెన్స్కీ భేటీ.. భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించిన అమెరికా
వాషింగ్టన్: ఉక్రెయిన్‌కు అమెరికా మరో భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించింది. 180 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయం అందజేయనుంది. ఇందులో ఒక బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు, 800 మిలియన్ డాలర్ల నిధులున్నాయి. పేట్రియాట్ క్షిపణులు, ఉక్రెయిన్ యుద్ధ విమానాల కోసం అత్యంత కచ్చితత్వంతో కూడిన గైడెడ్ బాంబులను తొలిసారిగా ఉక్రెయిన్‌కు ఇవ్వనుంది. ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడులు ముమ్మరం చేస్తోంది. డ్రోన్లు ప్రయోగిస్తోంది. వాటిని తిప్పికొట్టడానికే కొత్త ఆయుధాలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బుధవారం అమెరికాకు చేరుకున్నారు. అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కానున్నారు. అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగిస్తారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత జెలెన్స్కీ మరో దేశంలో అధికారికంగా పర్యటిస్తుండడం ఇదే తొలిసారి. -
Russia Ukraine War: పులిని చూసిన మేకల్లా పారిపోయారు!
కీవ్: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేపట్టిన రష్యాకు కీవ్ సైన్యం ప్రతిఘటన ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. దీంతో ఆక్రమించుకున్న కీలక నగరాలను విడిచి వెనక్కి వెళ్తున్నాయి రష్యా సేనలు. ఇటీవలే ఖేర్సన్ నగరాన్ని తమ బలగాలు ఖాళీ చేసినట్లు రష్యా ప్రకటించింది. మాస్కో బలగాలు తిరిగి వెళ్లిపోయిన క్రమంలో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విషయంపై సంతోషం వ్యక్తం చేసిన ఓ పౌరుడు.. రష్యా సేనలు పులిని చూసిన మేకల వలే పారిపోయాయని ఓ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. ‘పుతిన్ మమ్మల్ని చంపాలనుకున్నాడు. కానీ తన సొంత దేశాన్ని నాశనం చేసుకున్నాడు. ఖేర్సన్ నుంచి తిరిగి వెళ్లిపోవటం రష్యాకు ఘోర పరాభవం.’ అని పేర్కొన్నాడు ఖేర్సన్ పౌరుడు. మరోవైపు.. రష్యా బలగాలు వెళ్లిపోయిన క్రమంలో స్థానికులు బ్లూ అండ్ ఎల్లో ఫ్లాగ్స్ పట్టుకుని వీధుల్లో తిరుగుతూ సంబరాలు చేసుకున్నారు. ఖేర్సన్కు స్వతంత్రం వచ్చిందంటూ నినాదాలు చేశారు. గత శనివారం పోలీసు, టీవీ, రేడియో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. స్థానిక పరిపాలన భవనం వద్ద డ్యాన్సులు చేస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఉక్రెయిన్ సాయుధ బలగాలకు చెందిన జెడ్-ఎస్-యూ అనే అక్షరాలను పలుకుతూ హోరెత్తించారు. మరోవైపు.. రష్యా బలగాలు తిరిగి వెళ్లిపోయినప్పుటికీ నగరాన్ని పునరుద్ధరించటంలో చాలా సవాళ్లు ఎదురుకానున్నాయి. రష్యాతో యుద్ధంలో ఖేర్సన్ నగరం భారీగా దెబ్బతిన్నది. నీరు, విద్యుత్తు, ఔషధాలు, ఆహారం వంటి వాటి కొరత తీవ్రంగా ఉంది. రష్యా బలగాలు వెళ్తూ వెళ్తూ కీలక మౌలిక సదుపాయాలైన సమాచార, నీటి సరఫరా, విద్యుత్తు వంటి వాటిని ధ్వంసం చేసి వెళ్లినట్లు అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఇదీ చదవండి: మోదీ ప్రారంభించిన 15 రోజుల్లోనే భారీ పేలుడు.. తప్పిన పెను ప్రమాదం! -
ఉక్రెయిన్‌పై రష్యా రాకెట్ల వర్షం.. ఆ నగర ప్రజలకు హెచ్చరిక!
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా సేనలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. తమ దేశంపై రష్యా బలగాలు అర్ధరాత్రి రాకెట్లతో విరుచుకుపడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. ప్రముఖంగా విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. దాని ద్వారానే దేశంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందన్నారు. పవర్ కట్‌తో కీవ్ సహా చాలా ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. ‘మా దేశంపై ఉగ్రవాద చర్యలను రష్యా తీవ్రతరం చేసింది. రాత్రి మా శత్రుదేశం భారీ స్థాయిలో దాడి చేసింది. 36 రాకెట్లు ప్రయోగించింది. అయితే, అందులో చాలా వరకు కూల్చేశాం. కీలకమైన మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులపై దాడులు చేస్తోంది. ఇవి ఉగ్రవాద వ్యూహాలే.’ అని సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు జెలెన్స్కీ. ఖేర్సన్ నగరాన్ని వీడండి.. రష్యా విలీనం చేసుకున్న ఉక్రెయిన్‌లోని దక్షిణ ప్రాంతం ఖేర్సన్ నగరాన్ని వీడి ప్రజలు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రష్యా అనుకూల అధికారులు హెచ్చరించారు. ఉక్రెయిన్ ప్రతిదాడులు పెంచిన క్రమంలో ఈ మేరకు హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన కారణంగా నగరంలోని ప్రజలంతా నైపెర్ నదికి అవతలివైపు వెళ్లాలని సూచించారు. ఇదీ చదవండి: ‘బ్రిటన్ ప్రధానిగా బోరిస్ సరైన వ్యక్తి’.. భారత సంతతి ఎంపీ మద్దతు -
కీవ్‌పై రష్యా భీకర దాడులు
కీవ్: వ్యూహాత్మకంగా కీలకమైన క్రిమియా వంతెనపై జరిగిన బాంబు పేలుడును ఉగ్ర చర్యగా అభివర్ణించిన రష్యా.. ఉక్రెయిన్ వ్యాప్తంగా సోమవారం వరుసగా రెండో రోజు భీకర దాడులు కొనసాగించింది. కొద్ది నెలలుగా ప్రశాంతంగా ఉన్న రాజధాని కీవ్ సహా నగరాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. దాడులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉదయం ఏకధాటిగా నాలుగు గంటలపాటు సైరన్లు మోగాయి. దాడుల్లో కనీసం 10 మంది మృతి చెందగా 60 మంది వరకు గాయపడినట్లు సమాచారం. కీలక ఇంధన, సైనిక వ్యవస్థలను టార్గెట్‌గా గగనతలం, సముద్రం, భూమిపై నుంచి తమ సైన్యం దాడులు సాగించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ ఉగ్రదాడులు కొనసాగిస్తే అందుకు తామిచ్చే జవాబు అత్యంత కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. అంతకుముందు ఆయన సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. మరో పరిణామం..రష్యా, బెలారస్ ఉమ్మడి బలగాలను మోహరించనున్నట్లు బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో ప్రకటించారు. బెలారస్‌పై దాడి చేసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అయితే, బలగాలను ఎక్కడ మోహరించేదీ లుకషెంకో వివరించలేదు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో పోరాటం కొనసాగుతున్నా రాజధాని కీవ్‌లో జనజీవనం యథాప్రకారం కొనసాగుతోంది. కీవ్ ప్రజలు కొద్ది నెలలుగా ప్రశాంతతకు అలవాటుపడ్డారు. సోమవారం ఉదయం ఆ పరిస్థితి మారిపోయింది. ఒక్కసారిగా మొదలైన సైరన్ల మోతతో జనం ఉలిక్కిపడ్డారు. బాంబు షెల్టర్లలోకి పరుగులు తీశారు. అధికారులు రైలు సర్వీసులను రద్దు చేశారు. జనం రైల్వే స్టేషన్లనే షెల్టర్లుగా చేసుకున్నారు. -
రష్యాకు గట్టి షాక్.. ఉక్రెయిన్ చేతికి ‘విలీన’ ప్రాంతాలు!
కీవ్: ఉక్రెయిన్‌పై కొన్ని నెలలుగా సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేస్తోంది రష్యా. ఈ క్రమంలోనే నాలుగు కీలక ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఆ ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకుంటున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అయితే.. ఉక్రెయిన్ తెగువకు రష్యాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పుతిన్ సేనలను చుట్టుముడుతూ.. ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది ఉక్రెయిన్. కీవ్ వ్యూహరచనతో రష్యా సేనలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కీలక ప్రాంతాలను వదిలి వెనక్కి మళ్లుతున్నట్లు రష్యా సైతం ఒప్పకోవటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. తాజాగా మరో రష్యాకు గట్టి షాక్ ఇచ్చింది ఉక్రెయిన్. క్రెమ్లిన్ విలీనం చేసుకుంటున్నట్లు ప్రకటించిన నాలుగు ప్రాంతాల్లోని 400 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి చేజిక్కించుకున్నట్లు ప్రకటించింది. ‘అక్టోబర్ నెల మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఖేర్సన్ ప్రాంతంలో సుమారు 400 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్ బలగాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.’ అని ఉక్రేనియన్ దక్షిణ ఆర్మీ కమాండ్ ప్రతినిధి నటాలియా గుమెనియుక్ వెల్లడించారు. మరోవైపు.. ఈ వాదనలను తోసిపుచ్చింది రష్యన్ ఆర్మీ. రష్యా సరిహద్దు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ సేనలను మరింత వెనక్కి పంపించినట్లు పేర్కొంది. దడ్చనీ, సుఖనోవ్, కడాక్, బ్రుస్కినస్కో ప్రాంతాల్లో చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా.. తమ బలగాలు అడ్డుకుంటున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: విలీనానికి రష్యా చట్టసభ సభ్యుల ఆమోదం -
‘అణు’ పల్లవి!
కొన్ని మొదలుపెట్టడం సులభమే. ముగించడమే కష్టం. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఇప్పుడు ఆ సంగతి బాగా తెలిసొచ్చినట్టుంది. సరిగ్గా 7 నెలల క్రితం ఫిబ్రవరి 24న లక్షన్నర పైగా సైనికులతో, వివిధ మార్గాల ద్వారా ఉక్రెయిన్‌పై ‘ప్రత్యేక సైనిక ఆపరేషన్’కు సిద్ధమైనప్పుడు ఆ దేశాన్ని లొంగ దీసుకోవడం ఆయన సులభమనుకున్నారు. తీరా అమెరికా, ఐరోపాల ఆర్థిక, సైనిక అండదండలతో ఉక్రెయిన్ ఎదురుదెబ్బకి దిగేసరికి పీటముడి పడింది. పాశ్చాత్యలోకం నుంచి ముప్పు ఉందంటూ, 3 లక్షల మందితో పాక్షిక సైనిక సమీకరణకు సిద్ధమవుతున్నట్టు బుధవారం పుతిన్ చేసిన ప్రకటన మొదట అనుకున్న వ్యూహం విఫలమైందనడానికి స్పష్టమైన సంకేతం. జాతిని ఉద్దేశించి టీవీలో ప్రసంగిస్తూ, అణుదాడులకు సిద్ధమన్న ఆయన మాట ఇప్పుడు ప్రపంచ దేశాల్ని కలవరపెడుతోంది. ఇవి ఉత్తుత్తి మాటలు కావనడంతో ఆయన బెదిరింపు ధోరణి బాధ్యతారహితమనీ, ఐరాస నిబంధనావళికి విరుద్ధమనీ అమెరికా అధ్యక్షుడు ఖండించాల్సి వచ్చింది. వెరసి, అంతులేని కథగా సాగుతున్న ఉక్రెయిన్ అంశం మళ్ళీ ఒక్కసారిగా అందరిలో వేడి పెంచింది. అణ్వస్త్ర దేశాల్లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాతో పాటు రష్యా ఒకటి. అణుయుద్ధం చేయరాదంటూ ఈ జనవరి 3న రష్యా సహా ఆ దేశాలన్నీ సమష్టి ప్రకటన చేశాయి. ఆ తర్వాతే ఉక్రె యిన్‌పై పుతిన్ ఆకస్మిక దాడి ఆరంభించారు. సమయానికి తగ్గట్టు మాటలు, చేష్టలు మార్చేయడం సోవియట్ యూనియన్ విచ్ఛిన్నాన్ని ఇప్పటికీ జీర్ణం చేసుకోలేకపోతున్న ఈ మాజీ రష్యన్ గూఢ చారికి మంచినీళ్ళ ప్రాయం. ఉక్రెయిన్‌లో తాము పట్టు బిగించిన తూర్పు, దక్షిణ ప్రాంతాలపై దృష్టి నిలపడానికి ఆ మధ్య కీవ్, ఖార్కివ్‌ల నుంచి రష్యా సేనల్ని ఉపసంహరించుకున్నారు. తీరా ఈ నెల మొదట్లో ఉక్రెయిన్ మెరుపుదాడితో ఈశాన్యంలో దెబ్బతిని, సైన్యం తిరోగమించింది. ప్రతీకారంతో రగిలిపోతున్న పుతిన్ ‘అణు’పల్లవి అందుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలి సారి సైనిక సమీకరణకూ దిగారు. అదేమంటే సోవియట్‌లా రష్యా విచ్ఛిత్తికీ కుట్ర జరుగుతోందన్నారు. ఒక పక్క ఇలా సమరం చేస్తూనే, మరోపక్క ఉక్రెయిన్‌లో తమ స్వాధీనంలోకి వచ్చిన కీలక ప్రాంతాల్లో రష్యన్ సమాఖ్యలో చేరికపై ప్రజాభిప్రాయ సేకరణలు జరిపించాలని పుతిన్ ప్రయత్నం. ఆ కంటితుడుపు రిఫరెండమ్‌ల వెనుక ఉద్దేశం, వచ్చే ఫలితం ఇట్టే ఊహించవచ్చు. వాటిని అడ్డుపెట్టు కొని, ఉక్రెయిన్‌లో పట్టుబిగించిన ప్రాంతాలను కలిపేసుకొని ముందరికాళ్ళకు బంధం వేయాలని రష్యా వ్యూహం. గురువారం ఐరాస భద్రతామండలి సైతం రిఫరెండం ప్రతిపాదనల్ని ఖండిస్తూ, కనుచూపు మేరలో యుద్ధానికి ముగింపు కనపడకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇక, యుద్ధభూమిలో ఎక్కడ, ఎవరిది, ఎంత పైచేయి అన్నది పక్కనపెడితే ఉక్రెయిన్‌కు సైతం భరించ లేని ఉక్కపోత ఉంది. అమెరికా, ఐరోపా దేశాల అండ చూసుకొని బరిలో నిలిచిన ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీకి సైతం ఇప్పుడు తగిలిన దెబ్బలతో తత్త్వం తలకెక్కుతోంది. బుధవారం ఐరాస సర్వప్రతినిధి సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, తమ దేశ శాంతిభద్రతల పరిరక్షణకు అంతర్జాతీయ సమాజం పంచసూత్రాలు పాటించాలని ఆయన అభ్యర్థించడం అందుకు తాజా ఉదాహరణ. ఉక్రెయిన్ బాధ... ప్రపంచపు బాధగా భావించాలనేదే ఇప్పటికీ జెలెన్స్కీ ధోరణి. చిత్రం ఏమిటంటే, ఆంక్షల వల్ల రష్యాపై పెద్దగా ప్రభావం పడకపోయినప్పటికీ, పాశ్చాత్య ప్రపంచం మాత్రం అదే మంత్రాన్ని నమ్ముకున్నట్టుంది. తాజాగా 8వ విడత ఆంక్షలను రష్యాపై విధించింది. నిజానికి, పలు పాశ్చాత్య ఆహార, వస్తూత్పత్తి బ్రాండ్లు తమ భూభాగాన్ని వీడినా, రష్యా సొంత బ్రాండ్లు సృష్టించుకుంటోంది. చైనా నుంచి సరకుల సరఫరా సాగుతుండడంతో ఆ విధమైన నొప్పి కూడా తెలియడం లేదు. రష్యా నుంచి గ్యాస్ సరఫరాకు ఆంక్షలు పెట్టి, పాశ్చాత్య ప్రపంచమే ఇరు కున పడింది. ఐరోపా, అమెరికాలతో పోలిస్తే రష్యాలోనే ద్రవ్యోల్బణం తక్కువగా ఉంది. నిజానికి, రష్యా గడపలోకొచ్చి ‘నాటో’ రెచ్చగొట్టడం వల్లే పుతిన్ దూకుడు చూపారు. కానీ, అరకొర వ్యూహం, అతిగా బలాన్ని అంచనా వేసుకోవడంతో తంటా వచ్చింది. ‘నాటో’కు ముకుతాడు వేయాలన్న వ్యూహం ఫలించకపోగా, బలహీనపడుతున్న కూటమి ఫిన్లాండ్, స్వీడన్ లాంటి కొత్త చేరికలతో బలం పుంజుకుంది. లేని ప్రాసంగికతను సమకూర్చుకుంది. ఇది పుతిన్ వ్యూహాత్మక తప్పిదమే! పరిమిత యుద్ధంతో సైనిక లక్ష్యాలు సాధించాలని మొదలుపెట్టిన పుతిన్ వెనక్కి రాలేనంత దూరం వెళ్ళారు. ఈ ప్రక్రియలో తడబడి కిందపడ్డా, తనదే పైచేయిగా చూపాలని తాపత్రయపడు తున్నారు. నిన్నటి దాకా ‘నిస్సైనికీకరణ’ అన్న రష్యా ఇప్పుడు సమష్టి పాశ్చాత్య ప్రపంచంపై యుద్ధం అంటోంది. అతివాద జాతీయతతో పుతిన్ రేపిన ఈ యుద్ధం రష్యా యుద్ధమనే రంగు అద్దుకుంది. కానీ, ఇప్పటికే వేల సంఖ్యలో సైనికుల్ని కోల్పోయిన రష్యాలో తాజా సైనిక సమీకరణ యత్నంపై వందల మంది నిరసనకు దిగారు. మొదట నల్లేరుపై బండి నడక అనుకున్న ఉక్రెయిన్‌పై విజయం ఇప్పుడు పుతిన్‌కు ముగింపు తెలియని పీడకలగా మారింది. ఈ పరిస్థితుల్లో ఈ గాయపడ్డ పులి ఎలాంటి దుందుడుకు చర్యలకు దిగుతుందో? ఐరాసను ఆడిస్తున్న పాశ్చాత్య ప్రపంచం సైతం భేషజాలతో అగ్నికి ఆజ్యం పోసే కన్నా, సామరస్య పరిష్కారానికి కృషి చేస్తే మేలు. ఇటీవల సమర్కండ్లో పుతిన్‌ను కలిసినప్పుడు భారత ప్రధాని చెప్పినట్టు ప్రపంచంలో ‘‘సమరానికి ఇది సమయం కాదు.’’ కరోనా అనంతర క్లిష్టపరిస్థితుల్లో కావాల్సింది శాంతి, సామరస్యం, సౌభాగ్యాలే! -
పుతిన్ ప్రకటనతో రష్యాలో అల్లకల్లోలం!
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటనతో ప్రపంచమంతా అల్లకల్లోలం చెలరేగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. దాదాపు అంతటి స్థాయిలో ‘మొబైలైజేషన్’ కోసం పుతిన్ పిలుపు ఇవ్వడమే ఇందుకు కారణం. అంటే.. బలగాలను రంగంలోకి దించి యుద్ధ పరిస్థితులకు సన్నద్ధం కావడం అన్నమాట. ఈ నేపథ్యంలో.. మార్షల్ లా విధిస్తారనే భయాందోళన రష్యా అంతట నెలకొంది. ముఖ్యంగా యుద్ధంలో పాల్గొనే వయస్కున్నవాళ్లంతా.. రష్యాను వీడుతున్నారు. ఈ క్రమంలో.. రష్యా నుంచి విమానాలు బయటకు వస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అవియాసేల్స్ అనే వెబ్సైట్ గూగుల్‌లో ట్రెండ్ కావడం, అది రష్యాలో విమాన టికెట్లు అమ్మే సైట్ కావడంతో అక్కడి పరిస్థితిని తెలియజేస్తోందని రాయిటర్స్ ఒక కథనం ప్రచురించింది. మరోవైపు ఫైట్‌రాడార్24 సైతం మాస్కో, సెయింట్‌పీటర్‌బర్గ్ నుంచి దేశం విడిచి వెళ్తున్న విమానాలకు సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను ట్విటర్లో విడుదల చేసింది. ఎయిర్‌ట్రాఫిక్ సంబంధిత దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు.. రద్దీ నేపథ్యంలో టికెట్ల ధరలు సైతం ఆకాశాన్ని అంటినట్లు తెలుస్తోంది. ఈ వారం మొత్తం టికెట్లు ఇప్పటికే బుక్ అయిపోయినట్లు ట్రావెల్ ఏజెన్సీలకు సంబంధించిన గణాంకాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ స్పెషల్ మిలిటరీ చర్యల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ నుంచి రష్యాకు విమాన రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. Flights departing Moscow and St. Petersburg today. The @AP is reporting international flights departing Russia have either sold out or skyrocketed in price after Putin announced a mobilization of reservists. Search SVO, VKO, DME for Moscow airports and LED for St. Petersburg. pic.twitter.com/LV2PrkwPD9 — Flightradar24 (@flightradar24) September 21, 2022 ఇక బుధవారం ఏకంగా 3 లక్షల రిజర్వు దళాలను తక్షణం యుద్ధ రంగానికి తరలించాలని రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు సమగ్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఎదురైనప్పుడు.. రష్యాను, రష్యా ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుందని, ఇదేం దాష్టికం కాదని పుతిన్ స్వయంగా ప్రకటించారు కూడా. మళ్లీ పరిస్థితులు మొదటికే వస్తే.. తమ పరిస్థితి కుదేలు అవుతుందని రష్యా ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే.. ఉక్రెయిన్ దురాక్రమణ ఆంక్షల ప్రభావంతో విదేశీ కంపెనీలు తరలిపోగా.. నిరుద్యోగ శాతం పెరిగింది అక్కడ. మరోవైపు ధనికులపై కూడా పన్ను భారం అధికంగా పడుతోంది. అందుకే ముందుగానే దేశం వీడిపోవాలని భావిస్తున్నారు. మరోవైపు ఆంక్షల నడుమ నలిగిపోతున్న రష్యాపై యూరోపియన్ యూనియన్ మళ్లీ కొత్తగా ఆంక్షలు విధించాలని భావిస్తోంది. ఈ తరుణంలో వెనక్కి తగ్గకుండా కవ్వింపు దిశగా నిర్ణయాలు తీసుకుంటున్న పుతిన్ తీరుపై సొంద దేశ ప్రజలే మండిపడుతున్నారు. ఇదీ చదవండి: శాశ్వత సభ్యదేశంగా ‘భారత్’కు లైన్‌క్లియర్! -
పుతిన్ సన్నిహితుడే లక్ష్యంగా కారు బాంబు దాడి.. పాపం ఆయన కుమార్తె
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు, ఉక్రెయిన్‌పై యుద్ధం వ్యూహకర్త అలెగ్జాండర్ డుగిన్ కుమార్తె కారు బాంబు దాడిలో దుర్మరణం పాలయ్యారు. పుతిన్ ఆలోచనలను ప్రభావితం చేసే వ్యక్తిగా అలెగ్జాండర్ డుగిన్కు పేరుంది. అయితే.. ఈ దాడి అలెగ్జాండర్‌ను లక్ష్యంగా చేసుకొని చేయగా.. అతడి కుమార్తె డార్యా డుగిన్ మరణించినట్లు రష్యా మీడియాలు వెల్లడించాయి. శనివారం రాత్రి మాస్కో శివారు ప్రాంతంలో ఈ కారు బాంబు దాడి జరిగింది. సీసీటీవీ కెమెరాల్లో డార్యా డుగిన్ కారు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు నమోదయ్యాయి. అలెగ్జాండర్ కుమార్తె డార్యా డుగిన్‌ను ఉక్రెయిన్ ఉగ్రవాదులే హత్య చేశారని ఆరోపించారు డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ అధినేత డెనిస్ పుషిలిన్. ‘అలెగ్జాండర్ డుగిన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించి.. ఆయన కూతురిని హత్య చేశారు ఉక్రెయిన్ ప్రభుత్వ ఉగ్రవాదులు. ఆమె నిజమైన రష్యా యువతి.’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు. డార్యా తన కారులో ఇంటికి బయల్దేరగా.. మొజస్కౌయి హైవేపై బోల్షియా అనే గ్రామం వద్దకు రాగానే కారులో భారీ పేలుడు సంభవించింది. దాడిలో ధ్వంసమైన కారు వాస్తవానికి అలెగ్జాండర్‌ది. ఆయనే అసలైన లక్ష్యమని రష్యా అధికారులు అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి అలెగ్జాండర్ వాదన కూడా కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ఈ యుద్ధం విషయంలో పుతిన్‌ను అలెగ్జాండర్ బాగా ప్రభావితం చేశారు. ఆయన కుమార్తె కూడా రచయిత. కొద్ది రోజుల క్రితం అమెరికా ట్రెజరీస్ ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ ఆంక్షల జాబితాలో డార్యా కూడా ఉన్నారు. ⭕️🇷🇺#Russia: Alexander #Dugin at the scene pic.twitter.com/oyHMxnVHkc — 🅻-🆃🅴🅰🅼 (@L_Team10) August 20, 2022 ఇదీ చదవండి: Russia - Britain: రష్యాకు ఆ నైతిక హక్కు లేదు.. జెలెన్స్కీ అన్ని విధాల అర్హుడు! -
Russia Ukraine War: యుద్ధ రక్కసికి బలైన బాల్యం
కీవ్: రష్యా యుద్ధకాంక్షకు బలైన తన చిన్నారి పాపాయి మృతదేహాన్ని చూస్తూ గుండెలవిసేలా రోదించాడు ఓ తండ్రి. ఆ దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఉక్రెయిన్‌లోని వినిట్సియా సిటీలో గురువారం ఈ చిన్నారిని ఆమె తల్లి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా రష్యా సేనలు బాంబులతో దాడిచేశాయి. చిన్నారితో పాటు 24 మంది దుర్మరణం పాలవగా తల్లి తీవ్రంగా గాయపడి ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది! ఇదీ చదవండి: బాలిక అనుమానాస్పద మృతితో... రణరంగమైన స్కూలు -
2022 ఆరంభం నుంచి రూపాయి ఎన్నిసార్లు, ఎంత పతనమైందంటే!
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి పతనానికి అంతూ పొంతూ లేకుండా పోతోంది. వరుస రికార్డు పతనానికి చేరుతున్న రూపాయి గురువారం వరుసగా నాల్గవ సెషన్లో ఆల్ టైం కనిష్టాన్ని టచ్ చేసింది. 79.90 వద్ద కొత్త కనిష్ట స్థాయికి పడిపోయింది. బుధవారం కనిష్ట స్థాయి 79.66ను తాకి, చివరికి రికార్డు కనిష్ట స్థాయి 79.62 వద్ద ముగిసింది. అంతేకాదు సమీప కాలంలో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 82 కి పడిపోవచ్చని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారి, లాక్డౌన్ ఆంక్షలు దేశీయ కరెన్సీని అతలాకుతలం చేశాయి. ఫిబ్రవరిలో ఉక్రెయిన్-రష్యా వార్ తరువాత రూపాయి ఏకంగా 27 సార్లు అత్యంత కనిష్టానికి పడిపోయింది. ఈ నెలలో ఇప్పటివరకు రూపాయి ఐదుసార్లు కొత్త జీవిత కాల కనిష్ట స్థాయిని తాకింది. 2022 ప్రారంభంలో డాలరకు 74 వద్ద ఉన్న రూపాయి డాలర్‌తో పోలిస్తే రూపాయి 6.4 శాతం నష్టపోయి 80 స్థాయికి చేరేందుకు అతి సమీపంలో ఉంది. మరోవైపు ఆరు కరెన్సీల గ్రీన్‌బ్యాక్‌ను కొలిచే డాలర్ ఇండెక్స్ సోమవారం 20 సంవత్సరాల గరిష్ట స్థాయి 107.74కి పెరిగిందని బ్లూమ్‌బెర్గ్ డేటా తెలుపుతోంది. ఇకవైపు ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలరు బలం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, భారత కరెన్సీపై మరింత ఒత్తిడి పెంచుతోంది. దీనికి తోడు అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోతోందన్న ఆందోళనలు, ద్రవ్యోల్బణం గణాంకాలు ఊహించిన దానికంటే భిన్నంగా ఉండటంతో ఫెడరల్ రిజర్వ్ పాలసీ మరింత కఠినంకానుందన్న అంచనాలు మధ్య డాలరుపై ఇన్వెస్టర్ల దృష్టి పెరిగింది. బుధవారం నాటి డేటా ప్రకారం జూన్‌లో అమెరికా వినియోగదారుల ధరల సూచిక 9.1 శాతంతో 41ఏళ్ల గరిష్టానికి పెరిగింది. ప్రపంచమాంద్య భయాలు, యూరప్‌లో ఇంధన సంక్షోభం తీవ్రతరం, దేశీయంగా కరెంట్ ఖాతా లోటు లాంటివి రూపాయిని దెబ్బ తీస్తున్నాయి. రూపాయి పతనం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పటికీ పతనాన్ని అడ్డుకోలే పోతున్నాయి. రూపాయిని రక్షించేందుకు బంగారం దిగుమతులపై పన్ను, స్పాట్ అండ్ ఫ్యూచర్స్ ఫారెక్స్ మార్కెట్లలో జోక్యం, ఫారెక్స్ ఇన్‌ఫ్లోలను నేరుగా పెంచడానికి చర్యలతోపాటు, అంతర్జాతీయ వాణిజ్య పరిష్కారాల కోసం రుపీ సెటిల్మెంట్ విధానాన్నిఇటీవల ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నాటో భద్రతకు రష్యాతో ముప్పు
మాడ్రిడ్ (స్పెయిన్): నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గజేషన్ (నాటో) సభ్య దేశాల శాంతిభద్రతలకు రష్యా నేరుగా ముప్పుగా పరిణమించిందని అమెరికా సహా పలు దేశాలు ఆందోళన వెలిబుచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద భద్రతా ముప్పుని ఎదుర్కొంటున్నామన్నాయి. యూరప్‌లో ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత కుదుర్చుకున్న భద్రతాపరమైన ఒప్పందాలను రష్యా తుంగలోకి తొక్కి ఉక్రెయిన్‌పై దండెత్తిందని ధ్వజమెత్తాయి. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో బుధవారం నాటో సభ్య దేశాల వార్షిక సదస్సు జరిగింది. అనంతరం 30 దేశాల నాటో కూటమి ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు రాజకీయంగా, ఆచరణీయంగా మద్దతిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యూరప్‌లో శాంతిని విచ్ఛిన్నం చేశారని నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోటెన్‌బెర్గ్ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాటో సభ్య దేశాలకు భద్రతాపరంగా పెను సవాళ్లు విసురుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలండ్‌లో శాశ్వత సైనిక కేంద్రం యూరప్‌కు మరిన్ని అమెరికా బలగాలను తరలిస్తామని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ప్రాంతీయ భద్రత కోసం పోలండ్‌లో తొలి శాశ్వత మిలటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అమెరికాకు చెందిన లక్ష బలగాలు నిరంతరం యూరప్‌లో ఉండేలా చూస్తామన్నారు. -
నేను రష్యన్‌ను కాను.. నన్ను వింబుల్డన్ ఆడనివ్వండి..!
Natela Dzalamidze: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాను క్రీడా ప్రపంచం మొత్తం సామూహికంగా బహిష్కరించిన నేపథ్యంలో ఓ టెన్నిస్ క్రీడాకారిణి తన కెరీర్ కోసం రష్యా పౌరసత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమైన వార్త ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 27 నుంచి ప్రారంభంకానున్న వింబుల్డన్-2022 పాల్గొనేందుకు రష్యాకు చెందిన నటేల జలమిడ్జే ఏకంగా తన జాతీయతను మార్చుకోవాలని డిసైడైంది. తాను రష్యన్ కాదని.. జార్జియా తరఫున ఆడతానని నటేల వింబుల్డన్ నిర్వాహకులను మొరపెట్టుకుంది. Tennis player Natela Dzalamidze, who was born in Moscow, will be able to get around the ban on Russians at Wimbledon this year Because she now represents the country of Georgia https://t.co/DySjBJtdIz — Bloomberg UK (@BloombergUK) June 20, 2022 రష్యా ఆటగాళ్లెవరూ వింబుల్డన్‌లో పాల్గొనడానికి వీళ్లేదని టోర్నీ నిర్వహకులు స్పష్టం చేసిన నేపథ్యంలో నటేల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 29 ఏళ్ల నటేల అలగ్జాండ్ర క్రునిక్ (సెర్బియా)తో కలిసి మహిళల డబుల్స్‌లో పాల్గొనేందుకు తన పేరును రిజిస్టర్ చేసుకుంది. కాగా, ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాను, ఆ దేశానికి వంతపాడుతున్న బెలారస్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం సహా తైక్వాండో, ఫిఫా, ఎఫ్1 రేస్ వంటి ప్రఖ్యాత క్రీడా సంఘాలు ఇదివరకే వెలివేసిన (నిషేధం) విషయం తెలిసిందే. చదవండి: కోచ్‌పై గట్టిగా అరిచిన ప్రపంచ నంబర్1 ఆటగాడు.. వీడియో వైరల్..! -
Sakshi Cartoon: ప్రపంచాన్ని కూడా ఖతం చేద్దామనుకుంటున్నారా సార్!
ఈ మూడేండ్లలో ప్రపంచాన్ని కూడా ఖతం చేద్దామనుకుంటున్నారా ఏంటీ సార్! -
రష్యాలో చిక్కుకుపోయిన దేశీ ఆయిల్ కంపెనీల ఆదాయం
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై యుద్ధానికి ప్రతిగా రష్యాపై ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలు ప్రస్తుతం భారత ఆయిల్ కంపెనీలకు తలనొప్పిగా మారాయి. ఆర్థిక ఆంక్షల నుంచి గట్టెక్కడంలో భాగంగా రష్యా తన దగ్గరున్న డాలర్లను భద్రపర్చుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. విదేశాలకు డాలర్లను పంపడంపై ఆంక్షలు విధించింది. దీంతో రష్యాలో ఇన్వెస్ట్ చేసిన దేశీ ఆయిల్ కంపెనీలకు రావాల్సిన 8 బిలియన్ రూబుళ్ల (రూ. 1,000 కోట్ల) మేర డివిడెండ్ ఆదాయం చిక్కుబడిపోయింది. ‘ఇన్వెస్ట్ చేసిన ప్రాజెక్టుల నుంచి మాకు తరచుగా డివిడెండ్ వచ్చేసేది. కానీ, ఉక్రెయిన్‌తో యుద్ధంతో విదేశీ మారకం రేట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ దేశం నుంచి డాలర్లను ఇతర దేశాలకు పంపడంపై రష్యా ఆంక్షలు విధించింది. ఫలితంగా భారత కన్సార్షియంకు రావాల్సిన దాదాపు 8 బిలియన్ రూబుళ్ల డివిడెండ్ ఆదాయం రష్యాలో ఆగిపోయింది‘ అని ఆయిల్ ఇండియా డైరెక్టర్ హరీష్ మాధవ్ తెలిపారు. యుద్ధం మొదలు కావడానికి ముందు డివిడెండ్ ఆదాయం అంతా వచ్చేసిందని, కానీ ఆ తర్వాత నుంచి ఆగిపోయిందని పేర్కొన్నారు. అయితే, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పరిస్థితి చక్కబడిన తర్వాత నిధులు తిరిగి రాగలవని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, తమ పెట్టుబడులపై రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావమేమీ లేదని ఓఐఎల్ (ఆయిల్ ఇండియా) చైర్మన్ ఎస్సీ మిశ్రా తెలిపారు. ఓఐఎల్, ఐవోసీ, ఓఎన్జీసీ విదేశ్ తదితర దేశీ చమురు కంపెనీలు రష్యాలో నాలుగు వేర్వేరు అసెట్లలో 5.46 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసాయి. వాంకోర్‌నెఫ్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ క్షేత్రం లో 49.9 శాతం, టీఏఏఎస్–యూర్యాఖ్ క్షేత్రంలో 29.9 శాతం వాటాలు కొనుగోలు చేశాయి. ఆయా క్షేత్రాల గ్యాస్, చమురు విక్రయాల ద్వారా వచ్చే లాభాలపై డివిడెండ్లు అందుకుంటున్నాయి. -
గెలుపునకు చేరువలో ఉక్రెయిన్! రష్యా సరిహద్దుకు చేరుకున్న బలగాలు
Mr President, We Made It: ఉక్రెయిన్ పై రష్యా గత రెండు నెలలకు పైగా దాడులు కొనసాగిస్తునే ఉంది. ఈ నేపథ్యంలో యూకే రక్షణ మంత్రిత్వ శాఖ నిరవధిక పోరును ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ పరిస్థితి గురించి ఒక నివేదిక విడుదల చేసింది. భూ, గగన, జల మార్గాలలో దాడులు సాగించిన రష్యా బలగాలు ఈ యుద్ధంలో భారీ నష్టాన్నే చవిచూశాయని పేర్కొంది. ప్రస్తుతం యుద్ధంలో రష్యా కాస్త వెనకబడిందని తెలిపింది. రష్యా బలగాల పోరాట సామర్థ్యం తగ్గిందని, చాలామంది సైనికులు పట్టుబడుతున్నారని వెల్లడించింది. యూకే రక్షణ మంత్రిత్వ శాఖ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం రానున్న రోజల్లో రష్యా దళాలు వేగవంతంగా దాడులు చేసే అవకాశం లేదని అంచనా వేసింది. అంతేగాదు ఖార్కివ్ ప్రాంతంలో కీవ్ దళాలు ఉక్రెయిన్-రష్యా సరిహద్దుకు చేరుకున్నట్లు ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహదారు వాడిమ్ డెనిసెంకో తెలిపారు. ఆస్ట్రియా ఉక్రెయిన్ మాజీ రాయబారి ఒలెగ్జాండర్ షెర్బా "మిస్టర్ పుతిన్ మేము సాధించాం". "శత్రు రాజ్య సరిహద్దుకు చేరుకున్నాం" అనే క్యాప్షన్ జోడించి మరీ ఉక్రెయిన్, రష్యా సరిహద్దుకు చేరుకున్న ఉక్రెయిన్ సైనికులను చూపించే వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంతేగాదు బెర్లిన్‌లో జరిగిన నాటో విదేశాంగ మంత్రుల సమావేశంలో జర్మనీకి చెందిన అన్నలెనా బేర్బాక్ ఉక్రెయిన్‌కి తమ మాతృభూమి రక్షణ కోసం తమవంతు మద్దతుగా సైనిక సహాయం అందిస్తామని చెప్పారు. మరోవైపు నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఉక్రెనియన్లు తమ ధైర్య సాహసాలతో తమ మాతృభూమిని రక్షించుకోవడమే కాకుండా ఈ యుద్ధంలో తప్పక విజయం సాధిస్తారని ధీమాగా చెప్పారు. Latest Defence Intelligence update on the situation in Ukraine - 15 May 2022 Find out more about the UK government's response: https://t.co/VBPIqyrgA5 🇺🇦 #StandWithUkraine 🇺🇦 pic.twitter.com/n6dBVZHAos — Ministry of Defence 🇬🇧 (@DefenceHQ) May 15, 2022 “Mr. President, we reached Ukraine’s state border with the enemy state. Mr. President, we made it!” Glory to #Ukraine! Glory to Heroes!#StandWithUkraine️ #UkraineWillWin #RussiaUkraineWar pic.twitter.com/kdD6kD1w3x — olexander scherba🇺🇦 (@olex_scherba) May 15, 2022 (చదవండి: రష్యాకు మరో షాక్! నాటోలో చేరనున్న మరోదేశం) -
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఎఫెక్ట్, 23.2శాతం పెరిగిన వంట నూనెల ధరలు!
యుద్ధం కారణంగా ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న నల్ల సముద్రం మీదిగా ప్రపంచ దేశాల నుంచి ఎగుమతులు, దిగుమతులు ఆగిపోయాయి. తద్వారా ప్రపంచ ఆహార పదార్ధాల ధరలు మార్చి నెలలో ఆకాశాన్నంటినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) వెల్లడించింది. ►ఎఫ్ఏఓ ఆహార ధరల సూచీ మార్చిలో సగటున 159.3 పాయింట్లు నమోదు కాగా ఫిబ్రవరితో పోలిస్తే 12.6శాతం పెరిగింది. ►ఇక ఫిబ్రవరిలో కంటే మార్చిలో ఫిబ్రవరిలో కంటే మార్చిలో ఎఫ్ఏఓ తృణధాన్యాల ధరల సూచీ 17.1 శాతం అధికంగా ఉంది. ఉక్రెయిన్‌లో యుద్ధం ఫలితంగా గోధుమలు, ఇతర ధాన్యం ధరలు ఎక్కువగా పెరిగాయి. ►గత మూడేళ్లలో ప్రపంచ గోధుమ, మొక్కజొన్న ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్లు వరుసగా 30 శాతం, 20 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అయితే యుద్ధం కారణంగా ఆ రెండు దేశాల నుంచి ఎగుమతులు ఆగిపోవుడంతో మార్చి నెలలో ప్రపంచంలో గోధుమ ధరలు 19.7 శాతం పెరిగాయి. ఎగుమతులు ఆగిపోవడంతో యూఎస్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ►ఇదిలా ఉండగా, మొక్కజొన్న ధరలు నెలవారీగా 19.1 శాతం పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. బార్లీ, జొన్నలతో పాటు మొక్క జొన్న ధర గరిష్ట రికార్డ్‌ను తాకాయి. ►వెజిటబుల్ ఆయిల్ ప్రైస్ ఇండెక్స్ 23.2 శాతం పెరిగింది. పొద్దుతిరుగుడు విత్తన నూనె ఎక్కువగా ధరకే అమ్మకాలు జరుగుతున్నాయి. ►అధిక పొద్దుతిరుగుడు, విత్తన చమురు ధరలు, పెరుగుతున్న ముడి చమురు ధరల ఫలితంగా పామ్, సోయా,రాప్సీడ్ చమురు ధరలు కూడా గణనీయంగా పెరిగాయి, . ముడి సోయా చమురు ఎగుమతులు తగ్గడంతో దక్షిణ అమెరికాలో ఆందోళలు మరింత బలపడ్డాయి. ►ఎఫ్ఏఓ చక్కెర ధరల సూచీ ఫిబ్రవరి నుండి 6.7 శాతం పెరిగింది. ఇటీవల పెరిగిన ధర గతేడాది మార్చి కంటే..ఈ ఏడాది 20శాతం ఎక్కువగా పెరిగాయి. విచిత్రంగా భారత్‌లో మాత్రం ఉత్పత్తి అవకాశాలు కారణంగా నెలవారీ ధరల పెరుగుదలను నిరోధించాయి. -
కీవ్ స్వాధీనం దిశగా దూసుకెళ్తున్న రష్యా..షాకిచ్చిన హ్యాకర్లు!
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను ఎలాగైనా స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా నగరంలో రష్యా సైన్యం కల్లోలమే సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా ప్రభుత్వ తీరును తప్పు బట్టిన ఆ దేశ హ్యాకర్లు అధ్యక్షుడు పుతిన్‌కు షాకిస్తున్నారు. ఈ వారంలో రష్యా సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన రహస్యాల్ని బహిర్గతం చేశామని గుర్తు తెలియని హ్యాకర్స్ గ్రూప్ అధికారికంగా ట్వీట్ చేసింది. నెల రోజుల క్రితమే వార్నింగ్ తాజాగా Anonymous అనే హ్యాకర్స్ గ్రూప్ చీకటి ఒప్పందాలకు సంబంధించి 35వేల పేపర్లను బహిర్ఘతం చేస్తామని ట్వీట్ చేసింది "జస్ట్ ఇన్ #Anonymous కలెక్టివ్ రష్యా సెంట్రల్ బ్యాంక్‌ను హ్యాక్ చేశాం.48 గంటల్లో 35,000 కంటే ఎక్కువ రహస్య ఒప్పంద పత్రాలు విడుదల చేయబడతాయి" అని ట్వీట్లో పేర్కొంది. నెల రోజుల క్రితం ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు వ్యతిరేకంగా..రష్యన్ హ్యాకర్లు హెచ్చరికలు జారీ చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉద్దేశిస్తూ.. త్వరలో మీరు ప్రపంచ హ్యాకర్ల ఆగ్రహానికి గురవుతారని ప్రకటించారు. JUST IN: The #Anonymous collective has hacked the Central Bank of Russia. More than 35.000 files will be released within 48 hours with secret agreements. #OpRussia pic.twitter.com/lop140ytcp — Anonymous TV 🇺🇦 (@YourAnonTV) March 23, 2022 అన్నట్లుగానే ఈ వారం ప్రారంభంలో ఉక్రేనియన్ భవనాలపై దాడికి గురైన దృశ్యాలను ప్రజలకు చూపించేందుకు రష్యన్ స్టేట్ టీవీ నెట్‌వర్క్‌లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో రష్యన్లు అయోమయానికి గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా రష్యా సైన్యం కీవ్‌ను స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తుండగా.. రష్యా తీరును వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాల్ని బట్టబయలు చేస్తున్నారు. భవిష్యత్‌లో హ్యాకింగ్ కొనసాగుతుందని ట్వీట్ల ద్వారా పుతిన్‌ను హెచ్చరిస్తున్నారు. -
ఉక్రెయిన్‌పై యుద్ధం: భారతీయ విద్యార్థి మృతి తర్వాత ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం
Live Updates: ►మరో సారి రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు.. రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండవ రౌండ్ చర్చలు మార్చి 2 న జరగనున్నాయని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. అయితే ఈ చర్చలకు సంబంధించి ఎక్కడ జరగనున్నాయి, దీనికి ఎవరు హాజరుకానున్నారన్న పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ►భారతీయ విద్యార్థి మృతి తర్వాత ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం ఉక్రెయిన్‌లో ఖార్కివ్ కాల్పుల్లో భారతీయ విద్యార్థి మృతి చెందడంతో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గత రెండు రోజుల్లో ప్రధాని ఇలా నిర్వహించడం ఇది నాలుగోసారి. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌లోని పరిస్థితులతో పాటు భారత విద్యార్థులను త్వరగతిన స్వదేశానికి రప్పించే ప్రక్రియ మరింత వేగవంతం చేసే చర్యలు గురించి చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ► 660,000 కంటే ఎక్కువ మంది శరణార్థులు పొరుగు దేశాలలో ఆశ్రయం పొందేందుకు ఉక్రెయిన్ నుంచి వెళ్లిపోయారని యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ తెలిపింది. ►మా లక్ష్యాలు పూర్తయ్యే వరకు దాడిని కొనసాగుతుంది: రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ రష్యా తన లక్ష్యాలను సాధించే వరకు ఉక్రెయిన్‌పై దాడిని కొనసాగిస్తుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా దాదాపు వారం రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తోంది. ►2022 వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు ఆతిథ్యం ఇవ్వకుండా రష్యాపై నిషేధం 2022లో వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు రష్యా అతిధ్యం ఇవ్వనుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రష్యా అతిధ్యాన్ని నిషేదిస్తున్నట్లు ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి వాలీబాల్ ప్రకటించింది. ►ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆరుగురు ఏపీ విద్యార్థులు విమానాశ్రయం నుంచి నేరుగా వారి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు ►ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో భారతీయ విద్యార్థి మృతి ఖార్కీవ్లో రష్యన్ బలగాలు కాల్పుల్లో విద్యార్థి మృతి కర్నాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్‌గా గుర్తింపు With profound sorrow we confirm that an Indian student lost his life in shelling in Kharkiv this morning. The Ministry is in touch with his family. We convey our deepest condolences to the family. — Arindam Bagchi (@MEAIndia) March 1, 2022 ► ఖార్కివ్, చెర్నిహివ్(ఉక్రెయిన్)పై రష్యా బలగాల దాడులు. ఒకిట్రికా ఎయిర్‌బేస్‌పై దాడిలో 70మంది దుర్మరణం. ► భారతీయ విద్యార్థుల బృందం ఒకటి పోల్యాండ్‌లోకి ప్రవేశించింది. A group of Indian students stranded in Ukraine has entered Poland, to undertake the onward journey to India pic.twitter.com/Rm3YvumzoC — ANI (@ANI) March 1, 2022 ► వాయుసేనను రంగంలోకి దించిన కేంద్ర ప్రభుత్వం.. భారతీయుల తరలింపు వేగవంతం చేయాలని చూస్తోంది. ► కీవ్‌లోని భారతీయులు అర్జెంట్‌గా నగరం వీడాలని భారత ఎంబసీ కీలక సూచన చేసింది. ► రష్యా బలగాలు కీవ్ నగరంవైపు వేగంగా కదులుతున్నాయి. దీంతో ఏం జరుగుతుందా? అనే టెన్షన్ నెలకొంది. ► ఓఖ్టిర్కా (ఉక్రెయిన్) సైనిక స్థావరంపై రష్యా ఫిరంగిదళం దాడి చేయడంతో 70 మందికి పైగా ఉక్రేనియన్ సైనికులు మరణించినట్లు సమాచారం. ► రష్యాకు అమెరికా ఊహించని దెబ్బ: ఆంక్షల మీద ఆంక్షలతో రష్యా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ తరుణంలో తాజాగా అమెరికా.. రష్యాకు ఊహించని షాక్ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితిలో రష్యా దౌత్య మిషన్‌లోని 12 మంది సభ్యులను యునైటెడ్ స్టేట్స్ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితిలో రష్యా శాశ్వత ప్రతినిధి వాసిలీ నెబెంజియా విలేకరుల సమావేశంలో తెలిపారు. అమెరికా చేష్టల్ని ఖండిస్తున్నట్లు మీడియా ముఖంగా ప్రకటించారాయన. #WATCH 12 members of Russia's diplomatic mission to the UN have been expelled by the United States, said Russia's Permanent Representative to the United Nations Vassily Nebenzia during a press conference (Source: UN Web TV) pic.twitter.com/0JVT66C3nu — ANI (@ANI) March 1, 2022 ► కీవ్ నుంచి 64 కిలోమీటర్ల మేర రష్యన్ దళాల మోహరింపు. శాటిలైట్ చిత్రాలు వైరల్. ► ఉక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరం ఖార్కివ్‌లోని అనేక నివాస ప్రాంతాలపై రష్యన్ ఫిరంగిదళం దాడి చేసింది. ఖార్కివ్‌లో జరుగుతున్న షెల్లింగ్‌లో కనీసం 11 మంది పౌరులు మరణించినట్లు సమాచారం. ► ఉక్రెయిన్ సంక్షోభం.. ఆపరేషన్ గంగలో భాగంగా ముంబైకి చేరిన ఏడో విమానం. సురక్షితంగా 182 మంది స్వదేశానికి రాక. ► ఆరవ రోజు యుద్ధంలో భాగంగా.. జనావాస ప్రాంతాల్లో రష్యా దాడులకు పాల్పడుతోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. దాడుల్లో 350 మంది పౌరులు మరణించినట్లు చెబుతోంది. చర్చలు అసంపూర్తిగా ముగిసిన వేళ .. ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ కొనసాగుతోంది. ఉక్రెయిన్ సైన్యం ధీటుగా ఎదుర్కొంటుండటంతో ఆరో రోజు రష్యా దళాలు ముందుకు సాగలేకపోతున్నాయి. అయితే కీలక పట్టణాలను మాత్రం సమర్థవంతంగా చుట్టుముట్టగలిగాయి రష్యా బలగాలు. ఈ క్రమంలో.. ► రష్యా తమపై వాక్యూమ్ బాంబ్ ప్రయోగించినట్లు ఆరోపిస్తోంది ఉక్రెయిన్. ఈ మేరకు అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మరకరోవా సోమవారం అమెరికా కాంగ్రెస్(చట్ట సభ)లో ప్రకటించారు. జెనీవా కన్వెక్షన్ నిషేధించిన వాక్యూమ్ బాంబ్‌ను దురాక్రమణలో భాగంగా రష్యా మాపై(ఉక్రెయిన్) ప్రయోగించింది అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా పెను విధ్వంసం చేయాలనుకుంటోంది అని ఆమె ఆరోపించారు. వాక్యూమ్ బాంబు అనేది ఒక రకమైన పేలుడు పదార్థం. ఇది అధిక-ఉష్ణోగ్రత పేలుడును ఉత్పత్తి చేయడానికి చుట్టుపక్కల గాలి నుండి ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటుంది. ఆ ఒత్తిడి కారణంగా భారీ పేలుడు సంభవించి.. లక్క్ష్యం తునాతునకలు అయిపోతుంది. ఇదిలా ఉండగా.. రష్యా వాక్యూమ్ బాంబ్‌ను ప్రకటించినట్లు ధృవీకరణ రావాల్సి ఉంది. అయితే శనివారం మధ్యాహ్నాం ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలో థర్మోబారిక్ బహుళ రాకెట్ లాంచర్‌ను గుర్తించినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రకటించింది. -
లైవ్మ్యాచ్లో కన్నీటి పర్యంతమైన ఉక్రెయిన్ ఫుట్‌బాలర్
Ukraine-Russia Crisis: రష్యా-ఉక్రెయిన్ల యుద్ధం ప్రపంచంలోని ప్రతీ ఒక్కరిని కదిలిస్తోంది. తమ స్వలాభం కోసం యుద్ధం చేస్తూ ఉక్రెయిన్‌లోని అమాయక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న రష్యా వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. క్రీడాలోకం సైతం ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తూ తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా శనివారం ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మాంచెస్టర్ సిటీ, ఎవర్టన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఉక్రెయిన్‌కు చెందిన ఒలెక్సాండర్ జించెంకో మాంచెస్టర్ సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మ్యాచ్ మధ్యలో తమ దేశం పరిస్థితి గుర్తుకువచ్చిందేమో.. ఢిఫెండర్ ఒలెక్సాండర్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. అతను వెక్కి వెక్కి ఏడ్వడం మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానులను కలిచివేసింది. దీంతో రెండు జట్ల అభిమానులు ఆ ఆటగాడికి ఓదార్పునిస్తూ.. సంఘీభావంగా లేచి నిలబడి అతనికి మద్దతిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా మ్యాచ్ ప్రారంభానికి ముందు మాంచెస్టర్ సిటీ ఆటగాళ్లు.. ఉక్రెయిన్‌పై జరుగుతున్న దాడిని నిరసిస్తూ తమ టీషర్ట్‌పై ఉక్రెయిన్ జెండాను ముద్రించుకొని ..'' నో వార్'' అని సంఘీభావం తెలపగా.. మరోవైపు ఎవర్టన్ ఆటగాళ్లు ఉక్రెయిన్ జెండాను కప్పుకొని మద్దతిచ్చారు. చదవండి: Russia Ukraine War: 'యుద్ధం ఆపేయండి'.. సొంత దేశాన్ని ఏకిపారేసిన టెన్నిస్ స్టార్ Ukrainian footballer Zinchenko brought to tears as Everton and Man City players show support for Ukraine. pic.twitter.com/qxvHoItDxz — Richard Chambers (@newschambers) February 26, 2022 -
మరో ప్రచ్ఛన్న యుద్ధ సైరన్!
దౌత్యనీతిలో భావోద్వేగాలకు తావు లేదంటారు. ఆ రంగం లోని ప్రవక్తలందరిదీ ఇదే మాట. ఈ రహస్యం తెలియకపోవడం వలన మనవాళ్లు చాలామంది ఉక్రెయిన్ యుద్ధంపై ఉద్రేక పడుతూ సోషల్ మీడియాను ఉడుకెత్తిస్తున్నారు. ఈ యుద్ధంపై భారత్ వైఖరి ఎలా ఉండాలన్న దాని గురించి మూడు నాలుగు స్రవంతులుగా చీలిపోయారు. లక్షలాది క్యూసెక్కుల ఆవేశం ఆ స్రవంతుల గుండా ప్రవహిస్తున్నది. కష్టకాలాల్లో మనకు అండగా నిలబడిన దేశం రష్యా. ఇప్పటికీ మన దేశ రక్షణకు ఆలంబన రష్యా. అణుపాటవ పరీక్ష చేసినప్పుడు ఐక్యరాజ్యసమితిలో మనకు వ్యతిరేకంగా ఓటేసిన దేశం ఉక్రెయిన్. కశ్మీర్ అంశంపై కూడా ఆ దేశానిది మనకు వ్యతిరేక వైఖరి. ఈ నేపథ్యంలో మనం స్పష్టమైన వైఖరి తీసుకుని మిత్రునికి అండగా నిలబడాలి కదా... ఇది ఒకటవ భావస్రవంతి! బలహీనునిపై బలవంతుని దౌర్జన్యం అమా నుషం. బలాఢ్యుడైన రష్యావాడు అర్భకుడైన ఉక్రెయిన్వాడిపై జరిపిన దండయాత్రను ఖండించాలనేది రెండో మానవీయ స్రవంతి! రష్యా, చైనాలతో కలిసి భారతదేశం కూడా ఒక కూటమిగా ఏర్పడి అమెరికా సామ్రాజ్యవాదులనూ, వారి ఏజెంట్లయిన ‘నాటో’ కూటమి దేశాలనూ ఆటాడించడానికి ఇదే సరైన అదను – ఇది ‘ఎర్ర’ సముద్రపు సూయెజ్ కాలువ ప్రవాహం! మన చదువుల దగ్గర్నుంచి కొలువుల దాకా, మాట్రిమోనియల్ కాలమ్స్ నుంచి పచ్చడి జాడీల దాకా మన జీవితాలతో ముడిపడిన దేశం అమెరికా. ఈ బంధాన్ని ఇలాగే కొనసాగించడం మేలన్నది నాలుగవ డాలర్ కెనాల్! ఈ రకమైన జనచైతన్యం ఇప్పుడు సోషల్ మీడియాలో తెప్పలుగా పారుతున్నది. మంచిదే. నూరు పువ్వులు వికసించాలి. వెయ్యి ఆలోచనలు పోటీపడాలి. అధికారికంగా భారతదేశం ఇప్పుడు శరణుజొచ్చిన వ్యూహం – మౌనం. దౌత్యవర్గాలు ఇప్పుడు దీన్ని ‘వ్యూహాత్మక మౌనం’ అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. ఎవరీ మాటను కాయిన్ చేశారో తెలియదు కానీ చాలా సందర్భాల్లో భారత్ అవసరాలకు ఈ ‘వ్యూహాత్మక మౌనం’ సరిగ్గా సరిపోతున్నది. ఈ మౌనవ్యూహం మనకు వేదంతో పెట్టిన విద్య. ఇవ్వాళ్టిది కాదు. ఎవరి మోవిపై వాలితే మౌనమే మంత్రమగునో... వారే మునులు. ఆ ముని పరంపర నుంచి అత్యవసర సమయాల్లో ఆశ్రయించడానికి మౌనం, ధ్యానం అనే విద్యలు మనకు సంక్రమించాయి. మహాభారత యుద్ధకాలంలో ఉపఖండంలోని చాలా రాజ్యాలు అటు కౌరవుల పక్కనో, ఇటు పాండవుల పక్కనో చేరి యుద్ధంలో పాల్గొన్నాయి. ఏ పక్కనా చేరకుండా మౌనాన్ని ఆశ్రయించి, తటస్థంగా ఉండిపోయిన రాజ్యాలు కూడా చాలానే ఉన్నాయట! వీటికి ‘విబంధ రాజ్యాలు’ అనే పేరు భారతంలో ఉన్నదట! పండిత జవహర్లాల్ నెహ్రూ అలీనోద్యమాన్ని (Non-Aligned Movement) ప్రారంభించినప్పుడు తెలుగు పత్రికల్లో ఈ ‘విబంధ రాజ్యాల’ చర్చ జరిగిందట. అప్పట్లో ఆంగ్ల భాషలో ఉన్న ఏ కొత్త విషయాన్ని చెప్పవలసి వచ్చినా తెలుగులో అనువదించడానికి తంటాలుపడేవారు. ఇప్పటి మాదిరిగా ఆంగ్ల మాటల మీదనే తెలుగు తీర్థం చల్లి, యథాతథంగా వాడేసుకునే సాహసం అప్పట్లో చేసేవాళ్లు కాదు. ‘నాన్ అలైన్డ్ మూవ్మెంట్’ అనే మాటను ‘అలీనోద్యమం’గా నార్ల వెంకటేశ్వరరావు స్థిర పరిచారు. దీనికి ‘ఆంధ్రపత్రిక’ వారు అంగీకరించలేదు. మహా భారతం స్ఫూర్తితో ‘విబంధ రాజ్య ఉద్యమం’గా వ్యవహరిద్దా మన్నారు. నార్ల శిబిరం ఒప్పుకోలేదు. కాలక్రమంలో ‘ఆంధ్రపత్రిక’ వాదన వీగిపోయింది. ‘అలీనోద్యమం’ అనే మాట నిలబడిపోయింది. ఈ మాట నెహ్రూ గారితో ముడిపడి ఉన్నందువలన, నెహ్రూ ఇంటి మీద వాలిన కాకి కనిపించినా ఇప్పుడు కాల్చివేసే పరిస్థితులున్న కారణంగా– మన ప్రస్తుత వైఖరి అలీనోద్యమ వారసత్వంగా చెప్పే సాహసం ఎవరికీ లేదు. పైగా ఏక ధ్రువ ప్రపంచంలో అలీనమేముంటుంది... విలీనం తప్ప అనే వాదన కూడా ఉన్నది. వ్యూహాత్మక మౌనం కాకుండా ఈ సంక్షోభంలో భారత్ క్రియాశీలకంగా వ్యవహరించాలంటే ఏం చేయాలి? ఒకటవ ప్రత్యామ్నాయం – మిత్రధర్మంగా రష్యాను సమర్థించడం! ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్ర చేసినట్టు ఇండియా మీద చైనా చేయడానికి వారికి చాలా సాకులున్నాయి. లద్దాఖ్‌లో గానీ, అరుణాచల్‌ప్రదేశ్‌లో గానీ నిర్దిష్టమైన అంగీకృత సరిహద్దులు ఇప్పటికీ లేవు. లద్దాఖ్‌లో చైనా వాళ్లు మరిన్ని గల్వాన్ ఘర్షణలకు దిగితే రష్యా దండయాత్రను సమర్థించిన నోటితో చైనాకు వ్యతిరేకంగా ఏమని పిలుపునివ్వగలం? రెండో ప్రత్యా మ్నాయంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉక్రెయిన్‌కు బాసటగా నిలవడం! ఒక స్వతంత్ర, సార్వభౌమాధికార దేశంగా ఏ కూటమిలోనైనా చేరే స్వేచ్ఛ ఉక్రెయిన్‌కు ఉన్నదని మనం గట్టిగా వాదిస్తే మనదేశ ప్రజాస్వామ్య పిపాసను లోకం మెచ్చుకోవచ్చు. కానీ రేప్పొద్దున భారత్ వల్ల తన భద్రతకు ముప్పు ఉన్నదని ప్రకటించి నేపాల్ దేశం చైనా సైనిక కూటమిలో చేరి మన కాశీకి, కలకత్తాకు గురిపెట్టి సరిహద్దుల్లో మిసైళ్ళను పేర్చితే? లోకానికి ఫిర్యాదు చేసే అవకాశం భారత్‌కు మిగులుతుందా? కనుక ఉక్రె యిన్ సంక్షోభంలో భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనం సరైనదిగానే భావించాలి. ప్రధానమంత్రిగా మోదీ ఉన్నా, లేక పీలూమోదీ వున్నా ఇంతకు మించిన తరుణోపాయం లేదు. రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్ పుతిన్ వ్యక్తిత్వంపైన కూడా చాలా రకాల కథనాలు వస్తున్నాయి. జార్ చక్రవర్తులకున్నంత అహంకారం, అత్యాశ ఉన్నాయనీ, సోవియట్ యూనియన్ పతనం తర్వాత కోల్పోయిన భూభాగాలను మళ్లీ సాధించాలనే విస్తరణ కాంక్ష అతనికున్నదనీ చాలా ప్రచారం జరిగింది. ఉక్రెయిన్‌పై జరిగిన దాడిని కూడా ఈ కోణంలో నుంచి చూసే వారున్నారు. జరిగిన పరిణామాలను రష్యా వైపు నుంచి కూడా చూస్తేనే సమస్య సమగ్ర స్వరూపం మనకు అర్థమవుతుంది. 1991లో సోవియట్ యూనియన్ పతనమైంది. రష్యాతోపాటు మరో 14 రిపబ్లిక్లు సోవియట్ యూనియన్‌లో అంతర్భాగంగా ఉండేవి. ఇవన్నీ స్వతంత్ర దేశాలుగా ప్రకటించు కున్నాయి. వీటిలో కజక్‌స్థాన్, తజికిస్థాన్, తుర్క్మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిర్ఘిజిస్థాన్లు సెంట్రల్ ఆసియా రిపబ్లిక్లు. యూరప్, పశ్చిమాసియా ఖండాలను విభజించే కాకేసస్ పర్వత శ్రేణుల సమీపంలో జార్జియా, ఆర్మేనియా, అజర్బైజాన్ రిపబ్లిక్లున్నాయి. రామాయణంలో కైకేయి పుట్టిన కేకయదేశం ఇదేనని మనవాళ్ల నమ్మకం. మిగిలిన ఆరు రిపబ్లిక్లు రష్యాకు పశ్చిమ సరిహద్దుగా పైన బాల్టిక్ తీరం నుంచి కింద బ్లాక్‌సీ తీరం వరకు విస్తరించి ఉన్నాయి. బాల్టిక్ తీరంలో లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియా, నల్ల సముద్ర తీరంలో మాల్డోవా, ఉక్రెయిన్, రెండు తీరాల నడుమ మైదాన సరిహద్దుగా బెలారూస్లున్నాయి. పశ్చిమ యూరప్ నుంచి చూస్తే రష్యాకు ఈ ఆరు రిపబ్లిక్‌లూ ఒక కవచంలాగా ఉంటాయి. వాస్తవానికి ఇది రెండో కవచం. సోవియట్ యూనియన్‌గా ఉన్నప్పుడు ఈ కవచంపైన ఎనిమిది తూర్పు యూరప్ దేశాలతో కూడిన మరో రక్షణ కవచం ఉండేది. అమెరికా – పశ్చిమ యూరప్‌ల ‘నాటో’ సైనిక కూటమికి దీటుగా ఈ ఎనిమిది తూర్పు యూరప్ దేశాలతో ‘వార్సా ప్యాక్ట్’ పేరుతో సోవియట్ ఒక సైనిక కూటమిని ఏర్పాటు చేసుకున్నది. తూర్పు జర్మనీ, పోలండ్, చెకోస్లోవేకియా (ఇప్పుడు చెక్, స్లోవేకియా), హంగెరీ, రుమేనియా, యుగోస్లావియా (ఇప్పుడు స్లోవేనియా, క్రొయేషియా, బోస్నియా, సెర్బియా, కొసావో, మాంటెనిగ్రో), బల్గేరియా, అల్బేనియాలు ఈ ‘వార్సా ఒప్పందం’లో సభ్యదేశాలు. సోవియట్ యూనియన్ పతనానికి ముందూ వెనక ఈ ఎనిమిది దేశాల్లో తిరుగుబాట్లు తలెత్తి, కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూలిపోయాయి. బెర్లిన్ గోడ బద్దలై తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీలో విలీనమైంది. మిగిలిన ఏడు దేశాలకు కూడా అమెరికా ఆధిపత్యంలోని ‘నాటో’ కూటమి సభ్యత్వాన్నిచ్చింది. ఈ రకంగా రష్యా బాహ్యకవచం తెగిపడింది. 1990లో పతనా వస్థలో ఉన్న సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్కు అమెరికా విదేశాంగ కార్యదర్శి జేమ్స్ బేకర్‌కు మధ్య చర్చలు జరిగాయి. ‘నాటో’ కూటమిని ఈ ఎనిమిది దేశాలకు విస్తరించినట్లయితే రష్యా భద్రతకు ప్రమాద మని గోర్బచెవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఒక్క అంగుళం మేరకు’ కూడా ‘నాటో’ కూటమిని తూర్పు వైపునకు విస్తరించ బోమని, కూటమి తరఫున బేకర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ నమ్మకద్రోహం జరిగింది. ఆ తర్వాత కాలంలో సోవి యట్లో అంతర్భాగంగా ఉండి విడిపోయిన ఆరు యూరప్ రిపబ్లిక్లపైన కూడా ‘నాటో’ కన్ను పడింది. బాల్టిక్ తీర దేశాలైన లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియాలను ‘నాటో’లో చేర్చు కున్నారు. రష్యా రెండో కవచం సగం తెగింది. మిగిలిన మూడు దేశాల్లో బెలారూస్ రష్యాకు సన్నిహితంగా, మాల్డోవా తటస్థంగా ఉన్నాయి. మిగిలిన ఉక్రెయిన్‌కూ, కాకేసస్ ప్రాంతంలోని జార్జియాకు ‘నాటో’ సభ్యత్వం ఇవ్వాలని అమెరికా, బ్రిటన్ ప్రయత్నాలు ప్రారంభించాయి. దీనికి వ్యతి రేకంగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీలకు రష్యా పలుమార్లు విజ్ఞప్తి చేసింది. రష్యా సమస్యను జర్మనీ, ఫ్రాన్స్‌లు అర్థం చేసు కున్నాయి. కానీ, అమెరికా, బ్రిటన్లు వాటి ప్రయత్నాలను కొనసాగిస్తూనే వచ్చాయి. ఈ నేపథ్యంలో 2014లో ఉక్రెయిన్ దక్షిణ సరిహద్దులో నల్లసముద్రంలోకి విస్తరించిన క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఆక్రమించింది. క్రిమియాలో పెద్దసంఖ్యలో ఉన్న రష్యన్ మైనారిటీలను ఉక్రెయిన్ అణచివేస్తున్నదని రష్యా ఆరోపిం చింది. రష్యన్ల అణచివేత ఆరోపణల సంగతెట్లా ఉన్నా ఉక్రెయిన్‌లోని నల్లసముద్ర తీరం ఒడెసాలోనూ, అజోవ్ సముద్ర తీరంలోనూ సైనిక స్థావరాల ఏర్పాటుకు బ్రిటన్ ఏర్పాట్లు చేసింది. రష్యా నౌకాదళానికి ఇది పూర్తిగా ప్రాణ సంకటం. ఈ మార్గం నుండే మధ్యధరా సముద్రంలోకి రష్యా ప్రవేశించగలిగేది. అందుకే రష్యా వేగంగా స్పందించింది. వెంటనే ‘నాటో’ సభ్యత్వం కోసం ఉక్రెయిన్ మరోమారు పరుగెత్తింది. ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని ఉక్రెయిన్ – రష్యా సరిహద్దులోని రష్యన్లు గణనీయంగా ఉన్న డాన్బాస్ ప్రాంతంలో డానెట్స్క్, లూహాన్స్క్‌లను స్వతంత్ర రాజ్యాలుగా రష్యా ప్రకటించింది. రష్యా నుంచి డాన్బాస్ మీదుగా క్రిమియా వరకు ఒక మైదాన కారిడార్ రష్యా చేతికి ఇప్పుడు దొరికింది. ఈ యుద్ధ పరిణామాలు ఏ విధంగా ఉన్నా, డాన్బాస్ ప్రాంతంపై రష్యా తన ఆధిపత్యాన్ని వదులుకోకపోవచ్చు. ఉక్రెయిన్, రష్యాల వైరం జాతి వైరంగా పరిణమించడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే రష్యా ఆధిపత్యంలోని సోవియట్ యూనియన్‌లో అంతర్భాగంగా ఉన్న 14 రష్యనేతర జాతులు ఏనాడూ వివక్షకు గురయినట్లు ఆరోపణలు రాలేదు. మూడు దశాబ్దాల పాటు సోవియట్ యూనియన్ను గుప్పెట్లో పెట్టుకొని, దాన్నొక మహత్తర శక్తిగా మలిచిన జోసఫ్ స్టాలిన్... రష్యన్ కాదు. జార్జియన్! స్టాలిన్ తర్వాత దశాబ్దానికి పైగా నాయకత్వం వహించి ప్రచ్ఛన్న యుద్ధ సన్నాహా లతో అమెరికాను వణికించిన నికటా కృశ్చేవ్... రష్యా – ఉక్రెయిన్ సరిహద్దు గ్రామంలో పుట్టినవాడు. రెంటికీ చెందిన వాడు. ఆ తర్వాత పదిహేనేళ్లపాటు రష్యాను శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరుగులెత్తించిన లియోనిద్ బ్రెజ్నేవ్ స్వయంగా ఉక్రేనియన్. రష్యన్ల కంటే నాన్–రష్యన్లే ఎక్కువ కాలం సోవియట్ వ్యవహారాలను నడిపించారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం బహుశా జెలెన్స్కీ సర్కార్‌ను కూలదోసి రష్యన్ అనుకూల ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడంతో ఆగిపోవచ్చు. కానీ ఈ యుద్ధం ఇంతటికే పరిమితం కాదు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నిలబెట్టి కాపాడడం రష్యాకు సులభమైన పనేమీ కాదు. అఫ్గానిస్తాన్‌లో ఇటువంటి ప్రయత్నం వల్లనే సోవియట్ యూనియన్ కుప్పకూలిన సంగతి అది మరిచిపోయి ఉంటుందని అనుకోలేము. ఈ మిషన్‌లో దానికి ఇంకేదో అండ కావాలి. అటువంటి రహస్య అండ లభించిన తర్వాతనే రష్యా అడుగు ముందుకు వేసి ఉండవచ్చు. గ్లోబ్‌కు లిఖిత రాజ్యాంగం ఉండకపోవచ్చు కానీ, అలిఖితమైన ఆట నియమావళి ఒకటుంది. దాన్నే ‘వరల్డ్ ఆర్డర్’ (World Order) అంటున్నారు. ఆ ప్రపంచ ఆట నియమావళిని అన్ని దేశాలూ అర్థం చేసుకుని మసలుకుంటాయి. ‘సూపర్ పవర్’ అభీష్టం మేరకు ఆట నియమావళి ఉంటుంది. కాలక్రమంలో ‘సూపర్ పవర్’ బలహీనపడుతున్నట్టు కనిపిస్తే ఎదుగుతున్న మరో దేశం దాన్ని ఛాలెంజ్ చేస్తుంది. ఆట నియమావళి మారాలని డిమాండ్ చేస్తుంది. త్యుసిడుడీజ్ ట్రాప్ విసురుతుంది. ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలైన ఏథెన్స్, స్పార్టాలను దృష్టిలో పెట్టుకొని తయారుచేసిన ఈ సూత్రం ప్రకారం... బలహీనపడుతున్న సూపర్ పవర్‌తో బలపడుతున్న శక్తికి యుద్ధం తప్పదు. చైనా తన చేతికి మట్టి అంటకుండా విసిరిన ట్రాప్‌లో అమెరికా ఘోరంగా చిక్కుకుంది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత 1990 నుంచి 2008 వరకు ప్రపంచ ఆట నియమావళి ఏక ధ్రువ ప్రపంచంగా సాగింది. అమెరికా ఆడింది ఆట, పాడింది పాట. సద్దామ్ హుస్సేన్ ధిక్కార స్వరానికి ఉరి వేసి, ఇరాక్‌ను అతలాకుతలం చేసినా చెల్లింది. కల్నల్ గడాఫీని మట్టుబెట్టినా చెల్లింది. అఫ్ఘానిస్తాన్‌ను ఆక్రమించినా నడిచింది. ఆర్థిక వ్యవస్థలతో ఆడుకున్నా అడిగేవాడు లేడు. 2008 నాటి ప్రపంచ ఆర్థిక మందగమనం, అమెరికా బలహీనతల్ని బయటపెట్టింది. అదే సమయానికి ఒక గొప్ప ఆర్థిక శక్తిగా చైనా శరవేగంగా ఎదిగింది. అమెరికా స్వరం కొద్దిగా బలహీనపడటం, చైనా గొంతులో దర్పం ధ్వనించడం మొదలైంది. ఈ పధ్నాలుగేళ్లలో చైనా ఆర్థికంగా, మిలటరీ పరంగా మరింత బలపడింది. అమెరికా మరింత బలహీనపడింది. ఇప్పుడు ‘వరల్డ్ ఆర్డర్’ మారాల్సిన అవసరం చైనాకు ఉన్నది. రష్యా వ్యవహారంలో అమెరికా తెలివితక్కువగా వ్యవహరించింది. ఇప్పటికీ అమెరికా, చైనాల తర్వాత మూడో బలమైన సైనిక శక్తి – రష్యా. అటువంటి శక్తి తటస్థంగా ఉండకుండా నంబర్ టూ చెంతకు చేరేలా వేటాడి వెంటాడింది. ఇప్పుడు ఆర్థిక ఆంక్షలు ప్రయోగించినా రష్యాకు తక్షణం వచ్చే ఇబ్బందేమీ లేదు. ఆర్థిక నిపుణుల అంచనా మేరకు 630 బిలియన్ డాలర్ల విదేశీ మారకం రష్యా దగ్గర ఉన్నది. కొంతకాలం వరకు ఢోకా లేదు. గ్యాస్ కొనుగోలుకు యూరప్ కస్టమర్లు దూరమైతే దాన్ని భర్తీ చేయడానికి చైనా అభయమిచ్చింది. ఈ గ్యాస్ డీల్‌తో నష్టపోయేది యూరప్ కస్టమర్లే తప్ప రష్యా కాదు. ఇప్పుడు తనకు తెలియకుండానే చైనా డిజైన్‌లో రష్యా భాగమైంది. ‘నీవే తప్ప నితఃపరం బెరుగ’నన్న రీతిగా ఇప్పుడు రష్యాకు చైనాయే సర్వస్వం. మాజీ సూపర్ పవర్ హోదాతో స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడే రష్యాను చైనా క్యాంప్‌కు తరిమింది అమెరికాయే! దీంతో చైనా మరింత బలపడింది. ఇండో పసిఫిక్‌లో తనను అడ్డుకునేందుకు ‘క్వాడ్’ కూటమి ఏర్పాటుతో అమెరికా వేసిన ఎత్తుకు యురేషియాలో రష్యా ద్వారా చైనా పైఎత్తు వేసింది. ఇప్పుడు ఉక్రెయిన్‌లో వినిపిస్తున్న శతఘ్నుల మోత బహుశా మరో ప్రచ్ఛన్న యుద్ధపు సైరన్ కూత కావచ్చు! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఉక్రెయిన్-రష్యా వివాదం: సంయమనం పాటించాలని పిలుపునిచ్చిన తాలిబన్లు!
Russia Ukraine conflict through “peaceful means: అఫ్గనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై ఒక ప్రకటన విడుదల చేసింది.ఈ మేరకు ఇరుదేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరింది. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గనిస్తాన్ ఉక్రెయిన్‌లో పరిస్థితిని నిశితంగా పరిశీలించడమే కాక పౌరుల ప్రాణ నష్టం పై ఆందోళన వ్యక్తం చేసింది. హింసను తీవ్రతరం చేసే విధానాలను ఇరు పక్షాలు మానుకోవాలని సూచించింది. అంతేకాదు అఫ్గాన్ తటస్థ విదేశాంగ విధానానికి అనుగుణంగా ఉందని అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది నెలరోజుల క్రితం అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో ఇస్లామిక్ మిలిటెంట్లు ఇదే విధమైన సైనిక దాడిని ఉపసంహరించుకుని అధికారాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు 20 ఏళ్ల తర్వాత అమెరికా సైన్యం ఉపసంహరించుకోవడంతో అష్రఫ్ ఘనీ ఎన్నికైన ప్రభుత్వం పడిపోయిన నేపథ్యంలో గత ఏడాది ఆగస్టు 15న అఫ్గాన్ అధ్యక్ష భవనాన్ని తాలిబాన్ స్వాధీనం చేసుకున్నారు. Statement concerning crisis in #Ukraine pic.twitter.com/Ck17sMrAWy — Abdul Qahar Balkhi (@QaharBalkhi) February 25, 2022 (చదవండి: రష్యా మిలటరీ కాన్వాయ్కి అడ్డుగా నిలుచుని ఆపేందుకు యత్నం!) -
రక్తంలో స్నానం.. పుతిన్ అసలు రూపం ఇదే!
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం.. ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్యలను తప్పుబడుతూ చాలామంది రష్యాను తిట్టిపోస్తున్నారు. ముఖ్యంగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేష్టలను తప్పుబట్టేవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. గగన, వాయు, భూతలాల గుండా తన సైన్యం పంపిస్తూ.. ఉక్రెయిన్ ఆక్రమణలో ముందుకెళ్తున్నాడు పుతిన్. అగ్ర రాజ్యం సహా పాశ్చాత్య దేశాలనే పట్టించుకోని ఈ మొండి ఘటం.. ఇంత పవర్‌ఫుల్‌గా ఎలా ఎదిగాడో తెలుసా? ►1952 లెనిన్గ్రాడ్ (సెయింట్ పీటర్స్బర్గ్)లో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన పుతిన్.. ఇప్పుడు అసాధారణ వ్యక్తిగా ప్రపంచానికి తెలుసు. ►పుతిన్ చదివింది లా. చదువు పూర్తయ్యాక సొవియట్ యూనియన్ సీక్రెట్ ఏజెన్సీ కేజీబీ (Komitet Gosudarstvennoy Bezopasnosti)కి 1975 నుంచి 1990 మధ్య ఏజెంట్‌గా, లెఫ్టినెంట్ కల్నల్‌గా పని చేశాడు. ►సోవియట్ యూనియన్ పతనంతో క్రెమ్లిన్‌లో కొంతకాలం పని చేశాడు. 1991లో పుతిన్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. ► 1999 నుంచి ప్రధానిగా ఏడాదిపాటు.. ఆ మరుసటి ఏడాదిలోనే అధ్యక్షుడిగా పగ్గాల చేపట్టి.. అధికార పదవుల్లో కొనసాగుతూ వస్తున్నాడు. ►2008 దాకా అధ్యక్షుడిగా కొనసాగి.. ఆపై 2008 నుంచి 2012 వరకు ప్రధానిగా ఉన్నాడు. 2012 నుంచి తిరిగి అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నాడు. మార్చి 2018లో పుతిన్ నాలుగోసారి రష్యా అధ్యక్షుడిగా తిరిగి ఎంపికయ్యాడు. ►అధ్యక్ష పదవిలో రెండుసార్లు మాత్రమే కొనసాగాలన్న నిబంధన ఉండడంతో దిమిత్రి మెద్వెవ్.. పరస్సరం వాళ్ల స్థానాలు మార్చుకునేవాళ్లు. ఆ తర్వాత సుదీర్ఘ కాలం పదవిలో కొనసాగేలా రష్యా రాజ్యాంగానికి సవరణ చేశాడు. ►పుతిన్ తెలివిగా రాజ్యాంగ సవరణ ద్వారా 2036 వరకు తానే అధ్యక్షుడిగా ఉండేందుకు స్కెచ్ వేశాడు. కానీ, ఇది ప్రజావ్యతిరేకతకు కారణమైంది. ►రష్యాకు చెందిన గాజ్ప్రోమ్.. యూరోపియన్ యూనియన్‌కు అతిపెద్ద గ్యాస్ సప్లయర్. EUకి గ్యాస్ పైపుల ద్వారా సప్లయ్ అనేది పుతిన్‌కు అంతలా అంతర్జాతీయ ప్రాధాన్యతను కట్టబెట్టిందనడంలో ఆశ్చర్యం అక్కర్లేదు. ►2013-16 మధ్య నాలుగు సార్లు ప్రపంచంలోనే పవర్ఫుల్ వ్యక్తిగా పుతిన్ ఎన్నుకోబడ్డాడంటే.. అర్థం చేసుకోవచ్చు. ►అగ్రరాజ్య హోదా పోరులో ఏకంగా అమెరికానే టార్గెట్ చేస్తుంటుంది రష్యా. 2017లో ఏకంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నాడనే ఆరోపణ పుతిన్ మీద ఉంది. ఈ ఆరోపణను ఇటు పుతిన్, అటు ట్రంప్.. ఇద్దరూ ఖండించారు. ►రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, 69 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ఉండడానికి బోలెడు కారణాలు ఉన్నాయి. డైట్, వ్యాయామాల నుంచి ఆఖరికి దుప్పి కొమ్ముల నుంచి తీసిన రక్తంలో స్నానం చేయడం వల్లే బలిష్టంగా ఉంటాడని చెప్తుంటారు. ఇందుకోసమే పుతిన్ తరచూ రష్యాలోని అల్తాయ్ పర్వత ప్రాంతాలకు వెళ్తారు. ►రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2014 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యాడు. సిరియాపై అమెరికా క్షిపణి దాడిని నివారించడంలో కీలక పాత్ర పోషించినందుకు.. రసాయనిక ఆయుధాలను సిరియా ధ్వంసం చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నందుకు నామినేట్ అయ్యాడు. ►పుతిన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. స్వతహాగా బలశాలి అయిన పుతిన్.. తరచూ కొత్త అవతారాలతో అభిమానుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ►సిక్స్ ప్యాక్ ప్రియుడైన పుతిన్.. తన డైట్‌ను అస్సలు బయటకు పొక్కనియడు. విహార యాత్రలకు తక్కువ సెక్యూరిటీతోనే వెళ్తుంటాడు. రష్యా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పటిష్టంగా ఉండడం వల్లే అలా ధైర్యంగా తిరిగే వాడు. ►పుతిన్ యుద్ధం రుచి మరిగిన వ్యక్తి. ఈయన హయాంలో నాలుగు యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు ఉక్రెయిన్ వార్ ఐదవది. ►కరోనా టైంలో వైరస్ బారినపడకుండా.. డిస్ఇన్ఫెక్షన్ భారీ టన్నెల్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు స్థానిక మీడియా సంస్థలు కథనాలు రాశాయి. ►రష్యన్ సామ్రాజ్యం విస్తరించాలనే ఆకాంక్షతోనే వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ దండయాత్రను మొదలుపెట్టాడని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారుల ఆరోపణ. 2021లో ఉక్రెయిన్ను రష్యా కిరీటంగా అభివర్ణించిన పుతిన్ వ్యాఖ్యలనే అందుకు ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు వాళ్లు. ►ల్యూడ్మిలా అలెకస్సాంద్రోనా పుతినాతో 1983లో వివాహం, 2014లో విడాకులు. ఈ జంటకు మరియా, కటేరినా అనే కూతుళ్లు ఉన్నారు. రష్యా మీడియా మొఘల్ రూపర్ట్ మర్డోర్ మాజీ భార్య వెండి డెంగ్‌తో పాటు పలువురు టీనేజర్లతో పుతిన్ డేటింగ్ చేసినట్లు పుకార్లు ఉన్నాయి. ►పుట్‌బాల్ అంటే పుతిన్‌కు విపరీతమైన పిచ్చి. పెంపుడు జంతువులంటే మమకారం. మీడియాను మ్యానేజ్ చేయడంలో దిట్ట. ►పాలనాపరంగా పుతిన్ మీద ఫిర్యాదులు లేకపోయినా.. ఫారిన్ పాలసీలు, ఆయుధ ఒప్పందాల విషయంలో, విదేశీ వ్యవహారాల్లో జోక్యంపై మాత్రం సొంత ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. ►పుతిన్ ఊహకు అందని వ్యక్తి. ఆయన ముఖకవళిలను అర్థం చేసుకోవడం ఎంతో కష్టం. హవభావాలతో ఎదుటివాళ్లను బోల్తా కొట్టించడం పుతిన్ నైజం. ►అధ్యక్ష భవనం కంటే.. బయటే ఎక్కువగా తిరిగే పుతిన్, కావాలనే తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడనే వాదన ఉంది. గడ్డకట్టే చలిలో.. మంచు గడ్డల మధ్య చన్నీటి స్నానం, గ్రౌండ్లోకి దిగి ఆటలు, అడవి జంతువుల వేట, కరాటే, పవర్ పంచ్‌లు.. ఇలా అసాధారణమైన, ప్రమాదకరమైన స్టంట్లతో తానొక మ్యాచో మ్యాన్, సూపర్ హీరో అనే ముద్ర వేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ►పుతిన్‌ను గ్రిగోరి రస్పుతిన్(జార్ నికోలస్ 2 సలహాదారు, మిస్టరీమ్యాన్గా ప్రసిద్ధి) వారసుడిగా భావిస్తుంటారు కొందరు. కానీ, వాళ్లిద్దరికీ సంబంధం లేదు. పుతిన్ మీద రష్యాలో పాటలే కాదు.. జోకులు, మీమ్స్ విపరీతంగా వైరల్ అవుతుంటాయి. -
మరో ప్రమాదం అంచున ఉక్రెయిన్, ఇది రష్యా పనేనా?!
ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ప్రకటించింది. ఉక్రెయిన్‌కు మూడువైపుల బలగాల్ని మోహరించింది. ఉక్రెయిన్‌కు సరిహద్దులకు యుద్ధ ట్యాంక్‌లను పంపించింది. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలకు తమ బలగాల్ని పంపిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ మరో ప్రమాదం అంచున పడినట్లు తెలుస్తోంది. సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈఎస్ఈటీ నివేదిక ప్రకారం..ఉక్రెయిన్ను టార్గెట్ చేస్తూ ఆ దేశ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు చెందిన కంప్యూటర్లలో ప్రమాదకరమైన వైరస్‌ను పంపినట్లు తేలింది. గత రెండు నెలలుగా దేశంలోని వందలాది కంప్యూటర్లలో ఈ వైరస్‌ను ఇన్స్టాల్ చేసినట్లు వెల్లడించింది. ఈ వైరస్ సాయంతో హ్యాకర్లు ఉక్రెయిన్ కు సంబంధించిన దేశ అంతర్గత మిలటరీ రహస్యాలు, ఇరుదేశాలతో ఉన్న సత్సంబంధాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని సమాచారం. మరోవైపు రష్యా తన సరిహద్దుల చుట్టూ దళాలను మోహరించడంతో ఉక్రెయిన్ ఇప్పటికే గత కొన్ని వారాలుగా హ్యాకర్ల బారిన పడుతోంది. ఈ వారం మాస్కో తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు దళాలను ఆదేశించిన తర్వాత పూర్తి స్థాయి హ్యాకింగ్ భయాలు పెరిగాయి. దీంతో వైరస్ దాడుల్ని ఎవరు చేశారనే విషయాన్ని తెలుసుకునేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రయత్నాల్లో భాగంగా హెర్మెటికా డిజిటల్ లిమిటెడ్ అనే కంపెనీకి జారీ చేసిన సర్టిఫికెట్ తో వైపింగ్ సాఫ్ట్వేర్ సాయంతో హ్యాకింగ్ కార్యకలాపాలు జరిగినట్లు గుర్తించారు. అయితే దాదాపు ఏడాది క్రితం సైప్రియాట్ రాజధాని నికోసియాలో ఏర్పాటు చేసిన హెర్మెటికా సంస్థ గురించి ఆరా తీయగా.. ఆ కంపెనీ వివరాలు కానీ, వెబ్సైట్ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వైరస్ ఎలా పనిచేస్తుంది? టెక్ నిపుణులు అభిప్రాయం ప్రకారం..ఉక్రెయిన్ కంప్యూటర్లపై దాడి చేసిన సాఫ్ట్వేర్...కంప్యూటర్ హార్డ్ డ్రైవ్‌లోని మొత్తం డేటాను చదవలేని విధంగా అందించడం, స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లో స్టోర్ చేసిన డేటాను యాక్సెస్ చేసేందుకు వీలు లేకుండా సాఫ్ట్వేర్ పనిచేస్తుండగా.. హానికరమైన ప్రోగ్రామ్‌ను కంప్యూటర్ల నుంచి వేరు చేసేందుకు సైబర్ సెక్యూరిటీ నిపుణులు పోటీ పడుతున్నారు. మాకేం సంబంధంలేదు ఉక్రెయిన్‌పై జరుగుతున్న సైబర్ దాడులపై ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులు రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో రష్యా సైబర్ దాడులకు పాల్పడుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ రష్యా మాత్రం ఉక్రెయిన్ ఆరోపణల్ని ఖండించింది. -
రష్యాపై అమెరికా ఆంక్షల కొరడా!
వాషింగ్టన్/ఐరాస: ఉక్రెయిన్‌పై రష్యా దూకుడును అడ్డుకునేందుకు ఆ దేశంపై కఠిన ఆంక్షలకు అమెరికా తెర తీసింది. పాశ్చాత్య దేశాలతో రష్యా ప్రభుత్వ అభివృద్ధి సంస్థ (వీఈబీ), సైనిక బ్యాంకు లావాదేవీలపై పూర్తి నిషేధం విధించింది. రష్యా సావరిన్ రుణాలకు కూడా తమ ఆంక్షలు వర్తిస్తాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అమెరికా, పాశ్చాత్య దేశాలతో రష్యా ఇకపై ఎలాంటి వర్తక, వాణిజ్యాలూ జరపలేదన్నారు. తమ మార్కెట్లకు రష్యా ఇక పూర్తిగా దూరమైనట్టేనన్నారు. తమ పాశ్చాత్య మిత్రులతో సన్నిహితంగా చర్చించిన మీదటే ఈ మేరకు సంయుక్త నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. అతి త్వరలో మరిన్ని వరుస ఆంక్షలుంటాయని హెచ్చరించారు. అవి రష్యా సంపన్నులు, వారి కుటుంబీకులను లక్ష్యం చేసుకుని ఉంటాయని వెల్లడించారు. రష్యా అవినీతిమయ విధానాలతో భారీగా లాభపడే ఈ కుబేరులు ఇప్పుడు నొప్పిని కూడా భరించాల్సి ఉంటుందన్నారు. అలాగే జర్మనీతో కలిసి రష్యా తలపెట్టిన నార్డ్ స్ట్రీమ్ 2 పైప్‌లైన్ ముందుకు సాగే ప్రసక్తే ఉండబోదని స్పష్టం చేశారు. రష్యా చర్యలన్నింటికీ అంతకు మించిన ప్రతి చర్యలతో తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర హోదా ఇచ్చే అధికారం రష్యాకు ఎవరిచ్చారంటూ బైడెన్ దుయ్యబట్టారు. ‘‘ఉక్రెయిన్‌లోని ఒక పెద్ద భూభూగానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ తనంత తానుగా స్వతంత్రం ప్రకటించారు! తద్వారా అంతర్జాతీయ చట్టాలను, న్యాయాలను తుంగలో తొక్కారు. అక్కడితో ఆగకుండా మరింత ముందుకు వెళ్తామని తన ప్రసంగంలో చెప్పకనే చెప్పారు. ఇది కచ్చితంగా ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దాడికి ఆరంభమే’’ అంటూ బైడెన్ మండిపడ్డారు. ఇందుకు ప్రతి చర్యగా ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియాలతో కూడిన బాల్టిక్ ప్రాంతానికి మరిన్ని అమెరికా దళాలను, ఆయుధాలను పంపుతున్నట్టు కూడా బైడెన్ ప్రకటించారు. అయితే రష్యాతో యుద్ధానికి దిగే ఉద్దేశమేదీ అమెరికాకు లేదని స్పష్టం చేశారు. కాకపోతే నాటో సభ్య దేశాలకు చెందిన ప్రతి అంగుళాన్నీ కాపాడి తీరతామని రష్యాకు గట్టి సందేశమివ్వడమే తమ ఉద్దేశమన్నారు. రష్యా దూకుడు మానకుంటే మరిన్ని ఆంక్షలు తప్పవని ఇంగ్లండ్ కూడా మరోసారి హెచ్చరించింది. సంక్షోభం నుంచి బయట పడేందుకు ఉక్రెయిన్‌కు 50 కోట్ల డాలర్ల దాకా రుణ సాయం చేస్తామని పునరుద్ఘాటించింది. ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాలు కూడా బుధవారం రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. రష్యాపై ఆంక్షలను చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధాలిస్తూ సమస్యను అమెరికాయే ఎగదోస్తోందని ఆరోపించింది. సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నించడం తక్షణావసరమని సూచించింది. మరోవైపు ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై గురువారం జరగాల్సిన అమెరికా, రష్యా విదేశాంగ మంత్రుల భేటీ రద్దయింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ మేరకు ప్రకటించారు. కాకపోతే సంక్షోభ నివారణకు చర్చలకు తామిప్పటికే సిద్ధమేనని బైడెన్ స్పష్టం చేశారు. రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతలు ప్రపంచ శాంతికి విఘాతమంటూ పోప్ ఫ్రాన్సిస్ ఆవేదన వ్యక్తం చేశారు. అతి పెద్ద సంక్షోభమిది: గుటెరెస్ రష్యా దూకుడుతో ప్రపంచ శాంతి, భద్రత పెను సంక్షోభంలో పడ్డాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. తూర్పు ఉక్రెయిన్‌లోకి సైన్యాన్ని పంపుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న నిర్ణయాన్ని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ దుయ్యబట్టారు. ఇది అంతర్జాతీయ నిబంధనలకు, ఐరాస నియమావళికి గొడ్డలి పెట్టేనన్నారు. పొరుగు దేశంలోకి జరిపిన సైనిక చొరబాటుకు శాంతి పరిరక్షణ అని పేరు పెట్టడం దారుణమన్నారు. తన దూకుడు చర్యల నుంచి తక్షణం వెనక్కు తగ్గాలని రష్యాను హెచ్చరించారు. లేదంటే ఇరు దేశాలూ అంతమంగా తీవ్రంగా నష్టపోతాయని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌కు ఐరాస పూర్తి మద్దతుంటుందని చెప్పారు. తిరిగొస్తున్న మన విద్యార్థులు న్యూఢిల్లీ: ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో వైద్య విద్య చదువుతున్న భారత విద్యార్థులు స్వదేశానికి తిరిగొస్తున్నారు. ఢిల్లీ, గుజరాత్‌లకు చెందిన విద్యార్థులు మంగళవారం రాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి టర్కీకి, అక్కడి నుంచి కతార్ మీదుగా ఢిల్లీకి వచ్చారు. తామున్న చోట్ల ఉద్రిక్త పరిస్థితులేమీ లేకున్నా భారత ఎంబసీ సూచన మేరకు తిరిగొచ్చినట్టు చెప్పారు. అదే ఉద్రిక్తత కీవ్: రష్యా దూకుడు నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉద్రిక్తత రాజ్యమేలుతోంది. వేర్పాటువాద ప్రాంతాల వద్ద సైన్యానికి, రెబెల్స్‌కు మధ్య కాల్పులు పెరుగుతున్నాయి. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యాన్ని అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదేశించారు. రష్యాతో సహా పలు దేశాలు ఒక్కొక్కటిగా ఉక్రెయిన్‌లోని తమ దౌత్య కార్యాలయాలను మూసేస్తున్నాయి. యుద్ధ భయాల దెబ్బకు పరిశ్రమలతో పాటు వర్తక వాణిజ్యాలు పడకేశాయి. దాంతో కొద్ది వారాల వ్యవధిలో వందల కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు హరించుకుపోయి ఆర్థికంగా దేశం అల్లాడుతోంది. రష్యా పథకం ప్రకారం ఉక్రెయిన్ను ఆర్థికంగా కోలుకోలేనంతగా దెబ్బ తీస్తోందని విశ్లేషకులంటున్నారు. ప్రపంచ గోధుమ సరఫరాల్లో 12 శాతం, మొక్కజొన్నలో 16 శాతం వాటా ఉక్రెయిన్‌దే. వాటి ఎగుమతులపై దెబ్బ పడేలా కన్పిస్తోంది. పారిశ్రామికవేత్తలు, సంపన్నులు దేశం వీడుతున్నారు. జనం తమ బ్యాంకు ఖాతాలన్నింటినీ ఉన్నపళంగా ఖాళీ చేసుకుంటున్నారు. జనవరిలో 1,250 కోట్ల డాలర్లు విత్‌డ్రా అయ్యాయని అధ్యక్షుడు జెలెన్స్కీ వాపోయారు. రష్యాపై దేశాల ఆంక్షలు ► అమెరికా వీఈబీ, సైనిక బ్యాంకు, వాటి 42 సబ్సిడరీలపై నిషేధం. ఐదుగురు రష్యా కుబేరుల ఖాతాల స్తంభన. డోన్బాస్ రీజియన్‌తో అమెరికావాసులెవరూ వర్తక లావాదేవీలు చేయొద్దని ఆదేశాలు. ► జర్మనీ రష్యా నుంచి నార్డ్ స్ట్రీమ్ 2 పైప్‌లైన్‌కు అనుమతుల నిలిపివేత ► ఇంగ్లండ్ ఐదు రష్యా బ్యాంకులపై నిషేధం. ముగ్గురు ఆ దేశ సంపన్నుల ఖాతాల స్తంభన. ► యూరోపియన్ యూనియన్ రష్యా పార్లమెంటు దిగువ సభ డ్యూమాలోని 351 మంది సభ్యుల ఆస్తుల స్తంభన, వీసాలపై నిషేధం. ► ఆస్ట్రేలియా రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌లోని 8 మందిపై, సైనిక సంబంధాలున్న రష్యా బ్యాంకులపై నిషేధం ► జపాన్ రష్యా ప్రభుత్వ బాండ్ల జారీ, వర్తకంపై నిషేధం ► కెనడా రష్యా బ్యాంకులపై, సావరిన్ రుణ లావాదేవీల్లో కెనడావాసులు పాల్గొనడంపై నిషేధం. -
ఇది పుతిన్ సైతం ఊహించని పరిణామం
Russia-Ukraine Crisis: ఉక్రెయిన్ పరిణామాలను ప్రపంచం ఒకవైపు ఆసక్తిగా గమనిస్తోంది. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై పాశ్చాత్య దేశాలు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధానికి తహతహలాడుతున్నాడంటూ తిట్టిపోస్తున్నాయి. ఈ తరుణంలో ఊహించని ప్రశంసలు పుతిన్‌పై పడ్డాయి. చేసింది ఎవరో కాదు.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఉక్రెయిన్ పరిణామాల ఆధారంగా.. పుతిన్ మహా మేధావి అంటూ వ్యాఖ్యానించాడు ట్రంప్. రైట్ వింగ్ రేడియో ప్రోగ్రామ్.. ది క్లే ట్రావిస్ అండ్ బక్ సెక్స్టాన్ షోలో పాల్గొన్న ట్రంప్, పుతిన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుతిన్ గురించి నాకు బాగా తెలుసు. అతని నాకు మంచి స్నేహితుడు. మహా మేధావి కూడా. ఉక్రెయిన్ లోని డానెట్స్క్, లుహాన్స్క్ లను స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించడం తెలివైన చర్య అంటూ పేర్కొన్నాడు ట్రంప్. ‘‘ఉక్రెయిన్ లోని భారీ భూభాగాన్ని స్వతంత్ర రాజ్యాలుగా పుతిన్ ప్రకటించడాన్ని టీవీలో చూశా. వావ్.. అది అద్భుతమైన చర్య అన్నారు. ఆ నిర్ణయం ఎంత తెలివైనదంటే.. రెండు స్వతంత్ర రాజ్యాలుగా విడగొట్టి పుతిన్ శాంతి కాముకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఉక్రెయిన్ సరిహద్దులో మోహరింపు.. అత్యంత శక్తిమంతమైన శాంతి కాముక బలగమ’ని ట్రంప్ వ్యాఖ్యానించాడు. పుతిన్ చేపట్టిన తరహా చర్యలు.. అమెరికా దక్షిణాది సరిహద్దుల్లోనూ అవసరమని ట్రంప్ అభిప్రాయపడ్డాడు. ఇక పుతిన్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని, ఆయన గురించి తనకు బాగా తెలుసని ట్రంప్ చెప్పారు. తన హయాంలో ఇలాంటి పరిణామాలేవి జరగలేదని, కానీ, ఇప్పుడు జరుగుతున్నాయన్నారు. మొత్తంగా పుతిన్ కూడా ఈ పొగడ్తలను ఊహించి ఉండడు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ పరిణామాలతో ఇప్పటికే అమెరికా, బ్రిటన్, కెనడా, ఐరోపా దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
సరిహద్దు సంక్షోభం: ఉక్రెయిన్‌లో ఎమర్జెన్సీ విధింపు
Russia-Ukraine crisis: ఉక్రెయిన్-రష్యా సరిహద్దుల్లో నెలకొన్న తీవ్రమైన ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఉక్రెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో 30 రోజుల పాటు అత్యవసర పరిస్థితి కొనసాగుతుందని ప్రకటించింది. అప్పటి వరకు ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోతే అత్యవసర పరిస్థితిని మరికొన్ని రోజులు పొడిగించవచ్చని తెలిపింది. వేర్పాటువాద ప్రాంతాలైన డొనెట్స్క్, లుహాన్స్క్లో తప్ప.. దేశంలోని మిగతా అన్ని ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి 30రోజుల పాటు కొనసాగుతుందని ఉక్రెయిన్ ఉన్నత భద్రతాధికారి వెల్లడించారు. ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్, లుహాన్స్క్ వేర్పాటువాద ప్రాంతాలను.. రష్యా నేరుగా తన అధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. రష్యా అనుకూల రెబెల్స్ అధీనంలో ఉన్న ఆ ప్రాంతాలకు ‘స్వతంత్ర హోదా’ ఇస్తున్నట్టు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) ప్రకటించారు. -
Ukraine-Russia Standoff: యుద్ధ మేఘాలలో ఉక్రెయిన్
ఉక్రెయిన్ వ్యవహారంలో రోజు రోజుకూ ఉద్రిక్తత పెరుగుతోంది. ఆ దేశం నుంచి విడివడి, తిరుగు బాటుదార్ల ఆధిపత్యంలో ఉన్న డాన్బాస్ ప్రాంతంలోని రెండు స్వయంప్రకటిత వేర్పాటువాద రిపబ్లిక్లను రష్యా గుర్తించింది. పార్లమెంట్ వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్ మంగళవారం తీసుకున్న ఈ నిర్ణయం కథలో కొత్త మలుపు. ఉక్రెయిన్ సమగ్రత, సార్వభౌమాధికారాలను దెబ్బ తీసే ఈ చర్య ద్వారా పూర్తి స్థాయి దురాక్రమణకు రష్యా సిద్ధమవుతోందనే భావన ప్రబలుతోంది. ఫలితంగా మాస్కోపై వివిధ దేశాల ఆంక్షల పర్వమూ మంగళవారం మొదలైంది. యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారత పౌరులను సురక్షితంగా స్వదేశానికి తెచ్చేం దుకు భారత్ ప్రత్యేక విమాన సర్వీసులు మొదలుపెట్టింది. వెరసి, ఉక్రెయిన్ సంక్షోభం చివరకు అగ్రరాజ్యాలు అమెరికా – రష్యాల మధ్య మరో దీర్ఘకాల పోరాటానికి ప్రధానాంశమయ్యేలా ఉంది. ఉక్రెయిన్‌లో 30 శాతం ఉండే డాన్బాస్ ప్రాంతంలోని రెండు రిపబ్లిక్‌లూ 2014 మార్చి నుంచి వివాదాస్పదమే. అప్పట్లో రష్యా దాడి చేసి, క్రిమియన్ ద్వీపకల్పాన్ని తనలో కలుపుకొంది. రష్యా అండ ఉన్న డాన్బాస్ ప్రాంత వేర్పాటువాదులు ఉక్రెయిన్ నుంచి తమ ప్రాంతానికి స్వాతంత్య్రం కోరుతూ అదే ఏప్రిల్‌లో రిఫరెండమ్ పెట్టారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలోని తిరుగుబాటుదారు లకూ, ఉక్రేనియన్ సేనలకూ మధ్య చిన్నపాటి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి 14 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 15 లక్షల మంది దేశంలోనే అంతర్గత నిరాశ్రయులయ్యారు. యుద్ధ విరమణ, రాజకీయ పరిష్కారానికి ఉక్రెయిన్‌తో 2014–15ల్లో కుదుర్చుకున్న మిన్స్క్ ఒప్పందాలను పక్కనపెట్టి, రష్యా ఆ రిపబ్లిక్ల స్వాతంత్య్రాన్ని గుర్తించడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ‘నాటో’లో ప్రవేశంతో పాశ్చాత్య ప్రపంచానికి ఉక్రెయిన్ దగ్గర కారాదని పట్టుదల మీద ఉన్న రష్యా ప్రవర్తనను ఐరాస భద్రతామండలి అత్యవసర సమావేశం తప్పుబట్టింది. తాజా పరిణామా లపై జర్మనీ తక్షణమే స్పందించింది. రష్యాతో ‘నోర్డ్‌స్ట్రోమ్2’ గ్యాస్ పైప్‌లైన్‌కు ఇచ్చిన అనుమతు లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆఖరి వరకు దౌత్య మార్గంలో పరిష్కారానికి ప్రయత్నిస్తామంటూనే, అయిదు రష్యన్ బ్యాంకుల పైనా, పుతిన్ సన్నిహితుడితో సహా కొందరు ప్రముఖ వ్యక్తుల పైనా తొలి విడత ఆంక్షలు ప్రకటించారు. అమెరికా సైతం కొద్ది గంటల్లో ఆంక్షలు ప్రకటించనుంది. యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రులు సమావేశమై, రష్యాపై విధించాల్సిన ఆంక్షలను చర్చించనున్నారు. వరుస చూస్తుంటే, రష్యాకు ఆంక్షల సెగ బాగానే తగిలేలా ఉంది. కానీ, ముడి చమురు కోసం రష్యాపై ప్రధానంగా ఆధారపడాల్సిన అగత్యం ఐరోపాది. ఐరోపా ముడి చమురు దిగుమతుల్లో దాదాపు 50 శాతం రష్యా నుంచి వచ్చేవే. కాబట్టి, రష్యా పట్ల ఐరోపా అతి కఠినంగా ఉండడం అంత సులభమేమీ కాదు. అసలు పుతిన్ ఇంత దూకుడు దేనికి ప్రదర్శిస్తున్నారని ఆలోచించాల్సిన విషయం. 1991 డిసెంబర్లో విచ్ఛిన్నమైన మునుపటి సోవియట్ యూనియన్ను పునఃస్థాపించాలన్నది పుతిన్ అంతరంగమని విశ్లేషకుల మాట. అందుకు తగ్గట్టే, తూర్పు ఉక్రెయిన్‌లో తాము అండగా నిలిచిన రెండు వేర్పాటువాద ప్రాంతాలకు రష్యన్ సేనలను పంపి, ఆ ప్రాంతాల స్వాతంత్య్రాన్ని గుర్తిస్తున్నట్టు ప్రకటించి, మొత్తంగా ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్నే సవాలు చేశారాయన. కానీ, ఇంతా చేసి, మునుపటి రష్యన్ సామ్రాజ్యాన్ని పునఃప్రతిష్ఠించాలనే యోచన ఏమీ తమకు లేదనే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కయ్యానికి కాలుదువ్వుతూనే, దౌత్య పరిష్కారానికి సిద్ధమనీ పదే పదే అనడం విడ్డూరం. దౌత్యమార్గంలో ఏ ప్రయోజనం దక్కితే రష్యా తన జోరు తగ్గి స్తుందన్నది ఇప్పుడు కీలకం. ఉక్రెయిన్ను ‘నాటో’లో చేర్చుకోకూడదనేదే ఆది నుంచీ రష్యా ప్రధాన డిమాండ్. ఒకప్పుడు అందరూ అంగీకరించిన ఆ మాటకు భంగం కలిగే పరిస్థితి రావడమే ఇప్పుడు ఇంత దాకా తీసుకువచ్చిందని ఓ వాదన. ఉక్రెయిన్ సరిహద్దుల్లో లక్షన్నర మంది రష్యన్ సైనికులున్నారని అమెరికా, 1945 తర్వాత ఐరోపాను అతి పెద్ద యుద్ధంలోకి రష్యా నెడుతోందని బ్రిటన్ ఆరోపిస్తున్న వేళ... భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఉక్రెయిన్ పక్షాన నిలిచి చిరకాల మిత్ర దేశం రష్యాను దూరం చేసుకోవడం మన దేశానికి ఇష్టం లేదు. అలాగని రష్యా ధోరణిని సమర్థించి, అమెరికాతో కొత్త మైత్రిని చెడగొట్టుకొనే పరిస్థితి లేదు. అందుకే, సంయమనంతో, సమస్యను దౌత్య చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే విశ్వశాంతి వైఖరినే భారత్ ప్రదర్శిస్తోంది. శాంతి వచనాలెలా ఉన్నా, తాజా పరిణామాలతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. చమురు ధర చుక్కలనంటుతోంది. ఏడెనిమిదేళ్ళుగా ఎన్నడూ లేని రీతిలో 100 డాలర్లను తాకిన ధర ఇంకా‡పైపైకి పాకవచ్చు. ఒకవేళ పాశ్చాత్య దేశాలు ప్రచారంలో పెడుతున్నట్టు పోరు అనివార్యమైతే అది మరీ దుర్భరం. అమెరికా – రష్యా కూటములుగా ప్రపంచ దేశాలు చీలే ప్రచ్ఛన్న యుద్ధం కాలపు పరిస్థితి పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. కరోనా సహా అనేక విపత్తులతో మానవాళి సతమతమవుతున్న వేళ ఇది ఏ రకంగా చూసినా నివారించవలసినదే. అసలు సమస్యలను వదిలేసి, అగ్రరాజ్యాలు అనాలోచితంగా అహంభావ ప్రదర్శనకు దిగితే కష్టం. దాని వల్ల ఆఖరికి నష్టపోయేది అధినేతలు కాదు... అతి సామాన్యులు. ఇప్పుడు కావాల్సిందల్లా – ప్రాంతీయ సామరస్యం, ప్రపంచ సుస్థిరతల శాంతిమంత్రం. అగ్రరాజ్యాలు ఆలకిస్తాయా? -
రష్యా దాడి ఖాయమే: బైడెన్
వాషింగ్టన్/మ్యూనిచ్/మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడం ఖాయమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ దాకా చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా వచ్చే వారంలోనే దాడి జరుగుతుందని నమ్ముతున్నానని చెప్పారు. రష్యా బలగాలు ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద జోరుగా ఫ్లాగ్ ఆపరేషన్లు జరుపుతూ కవ్విస్తున్నాయని చెప్పుకొచ్చారు. అవసరం లేని ఈ వినాశకర దాడికి దిగితే రష్యా పశ్చాత్తాపపడేలా చేసి తీరతామని ఆయన హెచ్చరించారు. రష్యాలో సైనిక విన్యాసాల్లో భాగంగా ప్రయోగించిన ఇస్కండర్–కె క్షిపణి. ఉక్రెయిన్‌కు సాయంగా అమెరికా సైన్యాలను పంపబోమంటూనే, నాటో సభ్య దేశాలతో కలిసి ఆ దేశ ప్రజలకు అన్నివిధాలా మద్దతుగా నిలుస్తామంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలతో కలిసి రష్యాపై కనీవినీ ఎరగనంతటి కఠినాతి కఠినమైన ఆర్థిక, దౌత్య తదతర ఆంక్షలు విధిస్తామని బైడెన్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హెచ్చరించారు. చర్చలకు సిద్ధమంటూనే దౌత్యానికి ఒక్కొక్కటిగా దారులను రష్యా మూస్తూ వస్తోందని జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో కమల మండిపడ్డారు. రష్యా సైనిక విన్యాసాల్లో భాగంగా ప్రయోగించిన ఓ క్షిపణి. రష్యా దూకుడుకు సమాధానంగా నాటో దళాలు ఆ దేశ లోగిలి దాకా దూసుకెళ్లినా ఆశ్చర్యం లేదని హెచ్చరించారు. జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆమె భేటీ కానున్నారు. ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద లక్షన్నర పైచిలుకు సైన్యాన్ని రష్యా మోహరించి ఉంచిందని ఐరాస భద్రతా మండలికి అమెరికా తాజాగా నివేదించింది. కాగా, రష్యా శనివారం అణు, సైనిక విన్యాసాలు జరిపింది. అణ్వాయుధాలను మోసుకెళ్లగల హైపర్సోనిక్, క్రూయిజ్ క్షిపణులను భూ, సముద్ర లక్ష్యాలపై విజయవంతంగా ప్రయోగించినట్టు ప్రకటించింది. పుతిన్ వీటిని బెలారుస్ అధ్యక్షునితో పాటు వీక్షించారు. సైన్యం వర్సెస్ రెబెల్స్ ఉక్రెయిన్ సైన్యంపై దాడికి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని తూర్పు ఉక్రెయిన్‌లోని డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల్లోని రష్యా అనుకూల రెబల్ ప్రభుత్వాధినేతలు తమ సైన్యాలను ఆదేశించారు. అక్కడి ప్రజలను లక్షలాదిగా ఇప్పటికే రష్యాకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్, రెబెల్ సైన్యాల మధ్య కాల్పులు, ఘర్షణలు నానాటికీ పెరిగిపోతున్నాయి. శనివారం ఉక్రెయిన్ సైనికాధికారులను లక్ష్యం చేసుకుని రెబెల్స్ భారీగా కాల్పులకు దిగారు. -
ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తున్న రష్యా!
కీవ్: ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైనిక బలగాల కదలికలపై ప్రపంచాన్ని రష్యా తప్పుదోవ పట్టిస్తోందని నాటో కూటమి దేశాలు ఆరోపించాయి. సరిహద్దుల నుంచి కొన్ని బలగాలను వెనక్కు పంపుతామని అసత్యాలు ప్రచారం చేస్తోందని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ విమర్శించారు. బలగాలు ఉపసంహరిస్తామని చెబుతూ మరో 7వేలకు పైగా బలగాలను సరిహద్దుల్లోకి రష్యా తరలించిందని యూఎస్, మిత్రపక్షాలు ఆరోపించాయి. శాటిలైట్ చిత్రాల్లో రష్యా బలగాల మోహరింపు పెరిగినట్లు తెలుస్తోందని మాక్సర్ టెక్నాలజీస్ అనే వాణిజ్య సంస్థ తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్ సరిహద్లుల్లో ఉద్రిక్తతలు గురువారం కూడా కొనసాగాయి. ఉక్రెయిన్ బలగాలకు, రష్యా మద్దతున్న వేర్పాటువాదులకు మధ్య ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో దాడులు జరిగాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో దాదాపు 1.5 లక్షల మంది బలగాలను రష్యా మోహరించింది. అయితే చర్చలకు తాము సిద్ధమని, ఆక్రమణ ఉద్దేశాలు లేవని, కొంతమేర బలగాలను ఉపసంహరిస్తున్నామని రష్యా వారం ఆరంభంలో పక్రటించింది. అయితే రష్యా మాటలు కార్యరూపం దాల్చలేదని నాటో చీఫ్ ఆరోపించారు. రష్యా చెప్పేదానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, తాజాగా 7వేల బలగాలను సరిహద్దుకు తరలించిందని బ్రిటన్ డిఫెన్స్ సెక్రటరీ బెన్ వాలెస్ చెప్పారు. ఎలాంటి బలప్రయోగం జరిగినా రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని హెచ్చరించారు. రష్యా బలగాల ఉపసంహరణ తప్పుడు సమాచారమని బ్రిటన్ సాయుధ బలగాల మంత్రి జేమ్స్ హ్యాపీ విమర్శించారు. ఇప్పటికీ ఉక్రెయిన్ ఆక్రమణ అవకాశాలు అధికంగానే ఉన్నాయని నాటోదేశాలు భావిస్తున్నాయి. అందుకే ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు బలగాలను తరలిస్తున్నాయి. ఉక్రెయిన్ మాత్రం చర్చలతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. నాటోలో తమ చేరికను కొన్ని సభ్యదేశాలు అంగీకరించడంలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్పారు. ఏ క్షణమైనా ఉక్రెయిన్ ఆక్రమణ ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించడం ఏ క్షణమైనా జరగవచ్చని వైట్‌హౌస్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మాస్కోకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను ఏకం చేసేందుకు ఉద్దేశించిన మ్యూనిచ్ సదస్సుకు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్‌ను అధ్యక్షడు బైడెన్ పంపిస్తారని తెలిపాయి. ఈనెల 18– 20లో మ్యూనిచ్ సదస్సు జరగనుంది. రష్యా వ్యతిరేక ప్రదర్శనలు ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించడం ఖాయమని పాశ్చాత్య దేశాలు చెబుతున్న నేపథ్యంలో ఉక్రేనీయులు రష్యాకు వ్యతిరేకంగా తమ దేశ జెండాలతో ప్రదర్శనలు నిర్వహించారు. ఉక్రెయిన్ బలగాలు ప్రజలను చంపేస్తున్నాయని, అమెరికాతో కలిసి ఉక్రెయిన్ సొంత ప్రజలపై రసాయన ఆయుధాలు ప్రయోగిస్తోందని రష్యా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఉక్రెయిన్ను ఆక్రమించే ముందు రంగం సిద్ధం చేయడానికి రష్యా ఇలాంటి కథనాలు వెలువరిస్తోందని యూఎస్ ఆరోపించింది. రష్యాతో బలమైన మిలటరీ భాగస్వామ్యం కొనసాగిస్తామని వెనిజులా ప్రకటించింది. ఇండియా మద్దతు మాకే.. ఒకవేళ రష్యా గనుక ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడితే భారత్ తమ పక్షానే నిలుస్తుందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘క్వాడ్’ దేశాల విదేశాంగ మంత్రుల సదస్సులో రష్యా, ఉక్రెయిన్ అంశంపై విస్తృతంగా చర్చ జరిగిందని, దౌత్యమార్గాల ద్వారా శాంతియుత పరిష్కారం అవసరమని ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు. ఉక్రెయిన్ నుంచి తక్షణ తరలింపుల్లేవు! ఉక్రెయిన్ నుంచి భారతీయులను తక్షణమే స్వదేశానికి తరలించే యోచన లేదని భారత విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. ఉక్రెయిన్‌లో నివసిస్తున్న భారతీయుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని, ప్రస్తుతం దానిపైనే దృష్టి పెట్టామని తెలిపింది. నాటో, రష్యా మధ్య చర్చలతోనే ఈ సమస్యకు పరిష్కారమని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు. కీవ్‌లోని భారతీయ ఎంబసీ అక్కడి భారతీయ విద్యార్థులతో టచ్‌లో ఉందనిచెప్పారు. ఉక్రెయిన్‌లో నివసించే భారతీయులు తాత్కాలికంగా ఆ దేశాన్ని వీడాలని గత మంగళవారం భారత్ సూచించింది. మరోవైపు ఉక్రెయిన్, భారత్ మధ్య తిరిగే విమానాల సంఖ్యపై విధించిన పరిమితులను పౌరవిమాన యాన శాఖ తొలగించింది. ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల మధ్య తిరిగే విమనాలు, వాటిలో సీట్ల సంఖ్యపై ఇంతవరకు పరిమితులున్నాయి. వీటిని తాజాగా తొలగించారు. వీలైనంత మంది భారతీయులు స్వదేశానికి తొందరగా వచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. -
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం.. అనూహ్య పరిణామం!
Ukraine Border Crisis: ఉక్రెయిన్ సరిహద్దు పరిణామాలు ఒక్కసారిగా వేడేక్కాయి. రేపు ఏం జరగబోతుందో అనే ఆందోళన ప్రపంచమంతా నెలకొంది. ఉక్రెయిన్ ఆక్రమణలో భాగంగా బుధవారం రష్యా బలగాలు దాడికి దిగుతాయని తమకు పక్కా సమాచారం అందినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలన్ స్కీ ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా సైతం ఇదే హెచ్చరికను జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ సరిహద్దులోని కొన్ని రష్యన్ దళాలు వెనక్కి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ కాసేపటి క్రితం అధికారిక ప్రకటన వెలువరించింది. అయితే ఇది వెనక్కి తగ్గే చర్యలో భాగమా? లేదా? అనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు డ్రిల్ పూర్తైందని, బలగాలు కొన్నింటిని వెనక్కి రప్పించామని మాత్రమే రష్యా రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సరిహద్దు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ పశ్చిమ భాగంలో లక్షకు పైగా సైన్యంతో మోహరించిన రష్యా.. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం ఉదయం నుంచి చాలావరకు సైన్యాన్ని? బేస్‌కు రప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంత మేర సైన్యాన్ని వెనక్కి రప్పించింది, ఎందుకు రప్పించింది అనే విషయాలపై రాత్రికల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జర్మనీ చర్చల నేపథ్యంలో? ఇదిలా ఉండగా.. దౌత్యపరమైన చర్చల్లో భాగంగానే రష్యా ఈ నిర్ణయం తీసుకుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రష్యాకు గత మూడు రోజులుగా ఈ వ్యవహారంలో జర్మనీ మెత్తగా హెచ్చరికలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. జర్మన్ ఛాన్స్లర్ ఒలప్ స్కోల్జ్ ఇవాళ మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే దళాల వెనక్కి నిర్ణయం తీసుకుందేమోనన్న వాదనా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ సరిహద్దు పరిణామాలు రష్యా చేష్టలతో వేడేక్కుతున్నాయి. ఒకవైపు రష్యా బలగాల మోహరింపు చేస్తుంటే.. అమెరికా, బ్రిటన్ ఇతర దేశాలు మాత్రం దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. అప్రమత్తమైన భారత్ India Alert It's Citizens In Ukraine: ఉక్రెయిన్‌లో పరిస్థితులు వేడెక్కిన తరుణంలో.. భారతీయులు స్వదేశానికి వచ్చేయాలని పేర్కొంది. ప్రధానంగా ఉక్రెయిన్‌లో ఉండడం తప్పనిసరికాని భారతీయులు వెంటనే భారత్ వచ్చేయాలని సూచించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి ఈ ప్రకటన విడుదలయింది. రేపు(బుధవారం) ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని అమెరికా కూడా ఇప్పటికే ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో యూనిటీ డేగా శాంతి ర్యాలీలు నిర్వహించాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒక ప్రకటన సైతం వెలువరించడం గమనార్హం. ఉక్రెయిన్‌తో సహా మాజీ సోవియట్ యూనియన్ దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వకూడదంటూ పశ్చిమ దేశాలను రష్యా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా సిద్ధపడింది. -
ఉక్రెయిన్ ఉద్రిక్తతలు చల్లార్చే యత్నాలు
మాస్కో: ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్న ఉక్రెయిన్ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు సోమవారం అంతర్జాతీయంగా పలు ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. వీటిలో భాగంగా మాస్కోలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చర్చలు జరపగా, జర్మన్ చాన్స్‌లర్ అమెరికాలో శాంతి యత్నాలు ఆరంభించారు. మరోవైపు యథావిధిగా ఉక్రెయిన్ను ఆక్రమిస్తే తీవ్ర చర్యలు తప్పవని రష్యాను యూఎస్ హెచ్చరించగా, తమకు అలాంటి ఉద్దేశాల్లేవని రష్యా పేర్కొంది. ఈ నేపథ్యంలో మాక్రాన్ సోమవారం పుతిన్‌తో సమావేశమవుతున్నారు. అనంతరం ఆయన ఉక్రెయిన్‌కు వెళ్లి చర్చలు జరుపుతారు. రష్యాతో చర్చలు జరిపి ఉద్రిక్తతలు నివారించడమే తన ప్రాధాన్యాంశమని మాక్రాన్ పలుమార్లు చెప్పారు. పుతిన్‌తో సమావేశానికి ముందు ఆదివారం ఆయన బైడెన్‌తో ఫోన్లో మాట్లాడారు. పలు అంశాలపై వీరి మధ్య చర్చలు సాగాయని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ సార్వభౌమత్వం కాపాడడంపై రాజీ లేదని, ఇదే సమయంలో రష్యాకు స్వీయ రక్షణపై ఉన్న సందేహాలు తీర్చాల్సిందేనని మాక్రాన్ చెప్పారు. మరోవైపు అమెరికాలో బైడెన్‌తో చర్చించిన అనంతరం జర్మన్ చాన్స్‌లర్ షుల్జ్ ఈ నెల 14– 15లో రష్యా, ఉక్రెయిన్‌లో పర్యటిస్తారు. అప్పట్లో కూడా ఆ రెండే క్రిమియా ఆక్రమణ అనంతరం తూర్పు ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు ఫ్రాన్స్, జర్మనీ 2015లో మధ్యవర్తిత్వం చేశాయి. అప్పటికి రాజీ కుదిరినా, పలు అంశాలపై రష్యా, ఉక్రెయిన్ మధ్య విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి. 2019లో చివరిసారి ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఉక్రెయిన్ నాయకులు చర్చల కోసం కలిశారు. కానీ ఎలాంటి ఫలితం రాలేదు. మరోమారు నాలుగు దేశాల నేతలు సమావేశం కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెనెస్కీ కోరుతున్నారు. కానీ ఉక్రెయిన్ తూర్పు ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడంపై స్పష్టత వస్తేనే చర్చలని రష్యా మొండిపట్టు పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఫ్రాన్స్, జర్మనీల దౌత్యం ఎంతమేర ఫలిస్తుందో చూడాలని అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
రష్యా సహజవాయువు సరఫరా ఆపేస్తే?
ఉరిమి ఉరిమి ఎక్కడో పడిందని.. రష్యా, అమెరికా పంతాలకు పోవడం తమకు చేటు తెస్తుందని సన్నకారు యూరప్ దేశాలు భయపడుతున్నాయి. ఉక్రెయిన్ వంకతో అమెరికా ఆంక్షలు పెంచితే ప్రతిగా రష్యా సహజవాయువు సరఫరా నిలిపివేయవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆంక్షలకు నిరసనగా యూరప్‌కు రష్యా మొత్తం గ్యాస్ సరఫరా నిలిపివేస్తుందా? అలాంటప్పుడు యూరప్‌లో ఇంధన సంక్షోభం తప్పదా? చూద్దాం.. ఉక్రెయిన్ను రష్యా ఆక్రమిస్తే తమకు ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని యూరప్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్ను ఆక్రమిస్తే రష్యాపై యూఎస్ ఆంక్షలు తీవ్రతరం చేస్తుందని, ఇందుకు ప్రతిగా యూరప్‌కు సరఫరా అయ్యే సహజవాయువును రష్యా నిలిపివేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరప్ దేశాలు సహజవాయువు కోసం రష్యాపై ఆధారపడుతున్నాయి, యూరప్ సహజవాయు అవసరాల్లో మూడింట ఒక వంతు రష్యా సరఫరా తీరుస్తోంది. పైగా ప్రస్తుతం యూరప్ వద్ద సహజవాయు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. రష్యా గ్యాస్ సరఫరా నిలిపివేస్తే తాము ఎగుమతి చేస్తామని అమెరికా యూరప్‌కు హామీ ఇస్తోంది. అయితే రష్యా నుంచి సరఫరా అయినంత సులభంగా అమెరికా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకోవడం కుదరదు. ఈ నేపథ్యంలో యూరప్‌లో ఇంధన సంక్షోభ భయాలు పెరుగుతున్నాయి. గతేడాది శీతాకాలం తీవ్రత అధికంగా ఉండడంతో యూరప్‌లోని సహజవాయు నిల్వలు చాలావరకు ఖర్చయ్యాయి. పలు దేశాల్లో పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి తక్కువగా ఉంది. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దూసుకుపోతున్నాయి. ఇవన్నీ కలిసి తమను అంధకారంలోకి నెట్టవచ్చని పలు చిన్నాచితకా యూరప్ దేశాలు భయపడుతున్నాయి. పూర్తి నిలుపుదల సాధ్యం కాదా? ఆంక్షలను వ్యతిరేకిస్తూ రష్యా సహజవాయు సరఫరా నిలిపివేయాలనుకున్నా, పూర్తి ఎగుమతులను నిలిపివేయడం సాధ్యం కాదని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు రష్యా అధికారులు గ్యాస్ సరఫరా నిలిపివేయడంపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రష్యాకు గ్యాస్ ఎగుమతుల వల్ల చాలా ఆదాయం వస్తోంది. ఇటీవలే ఆ దేశం చైనాతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. అయినా యూరప్ నుంచే రష్యాకు అధికాదాయం లభిస్తోంది. అలాంటప్పుడు పూర్తిగా యూరప్‌కు ఎగుమతి ఆపితే అది తిరిగి రష్యా ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసే ప్రమాదం ఉందన్నది నిపుణుల మాట. గతేడాది యూరప్‌కు రష్యా 1.75 లక్షల కోట్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను సరఫరా చేసింది. ఇందులో పావుభాగాన్ని పైప్‌లైన్స్ ద్వారా పంపింది. ఆంక్షలు ముమ్మరమైతే ఉక్రెయిన్ నుంచి వెళ్లే పైప్‌లైన్ సరఫరాను మాత్రం రష్యా నిలిపివేయవచ్చని యూఎస్ మాజీ దౌత్యాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇది నేరుగా జర్మనీపై ప్రభావం చూపుతుంది. అప్పుడు జర్మనీకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రష్యా నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్ గుండా గ్యాస్‌ను సరఫరా చేసేందుకు ముందుకువస్తుందని, ఇది యూఎస్‌కు మరింత కోపాన్ని తెప్పించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. యూఎస్ సాయం ప్రపంచంలో అత్యధిక సహజవాయువు ఉత్పత్తిదారుల్లో ఒకటైన అమెరికా, గ్యాస్ ఎగుమతుల్లో కూడా ముందంజలో ఉంది. కానీ యూరప్‌కు అమెరికా సాయం పరిమితంగానే ఉండవచ్చని నిపుణుల అంచనా. రష్యా సరఫరాలను మించి యూరప్‌కు అమెరికా గ్యాస్‌ను పంపాలన్నా భౌగోళిక ఇబ్బందులున్నాయి. అందువల్ల ప్రస్తుతం కన్నా కొంతమేర ఎగుమతులను పెంచడం మాత్రమే యూఎస్ చేయగలదు. అందుకే ఉత్తర ఆఫ్రికా, మధ్యాసియా, ఆసియాల్లోని తన మిత్రపక్షాల నుంచి యూరప్‌కు సరఫరా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పేద దేశాలకు ఎగుమతి చేసే నిల్వలను అధిక ధరల ఆశ చూపి యూరప్‌కు మరలిస్తోంది. ఉక్రెయిన్ పైప్‌లైన్ సరఫరాను రష్యా నిలిపివేస్తే యూరప్ దేశాలకు రోజుకు 1.27 షిప్పుల గ్యాస్‌ను యూఎస్ అదనంగా అందించాల్సిఉంటుంది. యూరప్‌కు సరఫరా పెంచితే స్వదేశంలో కొరత ఏర్పడవచ్చని కొందరు అమెరికా సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యా ఇప్పటికే పరోక్షంగా గ్యాస్ సరఫరాను నియంత్రిస్తోందని, అందుకే మార్కెట్లో సహజవాయువు ధర పెరుగుతోందని ఇంధన రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే చాలారోజులుగా యూరప్ దేశాల్లో ఇంధన బిల్లులు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఈ సమస్యను ప్రజలపై పడకుండా చూసేందుకు పలు దేశాలు సబ్సిడీలను అందిస్తున్నాయి. పరిస్థితులను చక్కదిద్దేందుకు గ్యాస్ ఉత్పత్తి మరింత పెంచాలని అమెరికా యత్నిస్తోంది. అమెరికా ప్రయత్నాలు ఫలిస్తాయా? రష్యా నిజంగానే గ్యాస్ సరఫరా నిలిపివేస్తుందా? తేలాలంటే ఉక్రెయిన్ పీటముడి వీడాల్సిఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్‌తో సంబంధాలపై ఉక్రెయిన్ ప్రభావం లేదు
వాషింగ్టన్: భారత్‌తో తమ సంబంధాలపై రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతల ప్రభావం ఉండబోదని అమెరికా స్పష్టం చేసింది. ద్వైపాక్షికాంశాలు మాత్రమే ఇరు దేశాల సంబంధాలకు ప్రాతిపదికగా ఉంటాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్తతపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గత సోమవారం చేపట్టిన ప్రొసీజరల్ ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండటం తెలిసిందే. ఈ నిర్ణయం ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపిందా అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన నేరుగా బదులివ్వలేదు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దూకుడుకు సంబంధించి భారత్‌తో పాటు డజన్ల కొద్ది దేశాలతో ఎప్పటికప్పుడు పలు స్థాయిల్లో మాట్లాడుతున్నట్టు చెప్పారు. వాటి మధ్య యుద్ధమే జరిగితే దాని ప్రభావం భారత్‌తో పాటు అన్ని దేశాలపైనా ఉంటుందన్నారు. ఉక్రెయిన్–రష్యా వివాదం కొంతకాలంగా అంతర్జాతీయంగా నలుగుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై దాడికి రష్యా సర్వసన్నద్ధంగా ఉందని, కనీసం లక్షకు పైగా బలగాలను సరిహద్దుల సమీపానికి తరలించిందని అమెరికా, యూరప్ దేశాలు ఆరోపిస్తున్నాయి. దాన్ని తక్షణం సరిహద్దుల నుంచి ఉపసంహరించాలని, కాదని ఉక్రెయిన్‌పై దాడికి దిగితే భారీ మూల్యం తప్పదని రష్యాను హెచ్చరిస్తున్నాయి. ఉక్రెయిన్ తమతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ గౌరవించాలని, ఆ దేశానికి నాటో సభ్యత్వం ఇవ్వొద్దని రష్యా డిమాండ్ చేస్తోంది. వివాదం శాంతియుతంగా పరిష్కారం కావాలన్నదే తమ ఉద్దేశమని చెబుతూ భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. రంగంలోకి జర్మనీ, ఫ్రాన్స్ బెర్లిన్: ఉద్రిక్తతలను తగ్గించేందుకు త్వరలో రష్యా, ఉక్రెయిన్లలో పర్యటించాలని జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ నిర్ణయించారు. మాక్రన్ సోమవారం మాస్కో, మంగళవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ వెళ్లనున్నారు. స్కోల్జ్ 14న కీవ్, 15న మాస్కోలో పర్యటిస్తారు. నాటో సభ్య దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్ ఉన్నట్టుండి తీసుకున్న ఈ నిర్ణయాలపై అంతటా ఆసక్తి వ్యక్తమవుతోంది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ కూడా తాజాగా ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చారు. -
తలనొప్పిగా మారనున్న రష్యా-ఉక్రెయిన్ టెన్షన్..! ఇంధన ధరలు రయ్ అంటూ..!
అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు రయ్‌మంటూ పెరిగిపోతున్నాయి. 2014 తరువాత బ్యారెల్ బ్రెంట్ ముడిచమురు ధర ఏకంగా 90 డాలర్లకు చేరుకుంది. ఇది ఏడేళ్ల గరిష్టం. తలనొప్పిగా ఆయా దేశాల మధ్య పరిస్థితులు...! ఏడేళ్ల గరిష్ట స్థాయికి బ్యారెల్ చమురు ధరల పెంపుకు పలు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులే కారణంగా ఉన్నాయి. ఐరోపా, మధ్యప్రాచ్యంలోని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు చమురు మంటలకు ప్రధాన కారణంగా ఉన్నాయి. వీటితో పాటుగా డిమాండ్ కంటే చమురు సరఫరా తక్కువగా ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తే వ్యక్తిగత ఆంక్షలను పరిశీలిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం రష్యాను హెచ్చరించారు. ఇదిలా ఉండగా యెమెన్ హౌతీ ఉద్యమకారులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్థావరంపై క్షిపణి దాడి చేశారు. ఆయా దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు ఇతర దేశాలకు తలనొప్పిగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. సరఫరా పెంపుపై నిర్ణయం..! ఆయా దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు చమురు సరఫరాపై ప్రతికూలతను చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో చమురు ఉత్పత్తిని ఒపెక్ దేశాలు పూర్తిగా తగ్గించేశాయి. క్రమంగా ఆయా దేశాలు లాక్డౌన్ ఎత్తివేయడంతో అంతర్జాతీయంగా ఒక్కసారిగా చమురకు భారీ డిమాండ్ ఏర్పడింది. డిమాండ్‌కు తగ్గ చమురు ఉత్పత్తిపై ఒపెక్ దేశాలు, ఇతర మిత్రదేశాలు ఫిబ్రవరి 2న సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో చమురు ఉత్పత్తి పెంపు ఒపెక్ దేశాలు నిర్ణయం తీసుకోనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2020లో చమురు ఉత్పత్తిని గణనీయంగా తగ్గించిన దేశాలు రోజుకు 4 లక్షల బ్యారెళ్ల చమురును అదనంగా విడుదల చేయాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. రోజువారి ఉత్పత్తిని మరింత పెంచితే భారత్‌తో సహా చమురు అధికంగా వినియోగించే దేశాలకు భారీ ఉపశమనం కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: జీఎస్టీ పరిధిలోకి నేచురల్ గ్యాస్..! -
డాల్ఫిన్ల దేశభక్తి.. మరణం వరకూ నిరాహార దీక్ష..
కీవ్, ఉక్రెయిన్ : డాల్ఫిన్లు ఈ మాట వినగానే మనకు గుర్తుకొచ్చేది సముద్ర జలాల్లో తెల్లటి నీటి వెనుక షిప్పుల వెనుక ఆనందంతో ఉరకలెత్తుతే దాని ఉత్సాహం. అంతేకాదు డాల్ఫిన్లు తెలివైనవి కూడా. ఈ మధ్యే వీటికి కొంచెం శిక్షణనిచ్చి మాటలు నేర్పించారు కూడా. వాస్తవానికి ఇంతకంటే ముందే డాల్ఫిన్లకు సైనిక శిక్షణ ఇచ్చింది ఉక్రెయిన్. సముద్ర జలాల గుండా వెళ్లి శత్రువులను అంతం చేయడంలో వాటిని నేర్పరులుగా తీర్చిదిద్దింది. అలాంటి అతి భయంకరమైన ఉక్రెయిన్ డాల్ఫిన్లు నిరాహార దీక్ష చేసి మరణించాయి. డాల్ఫిన్ల వెనుక కథ ఇదీ.. యూఎస్ఎస్ఆర్ విచ్ఛినం కాక ముందు సోవియట్ యూనియన్‌లో ఉక్రెయిన్ అంతర్భాగం. 1973 ప్రచ్చన్న యుద్ధ సమయంలో నల్ల సముద్రంలో కొన్ని డాల్ఫిన్లకు ఉక్రెయన్లు యుద్ధ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చారు. ప్రధాన ఓడరేవు సెవెస్టోపాల్ కేంద్రంగా డాల్ఫిన్లకు మెరెన్లను మోసుకెళ్లడం, సముద్రంలో పెట్టిన మైన్లను కనిపెట్టడం, నౌకల్లో బాంబులు అమర్చడంవంటి యుద్ధ శిక్షణలను ఉక్రెయిన్ నావికులు వాటికి శిక్షణ ఇచ్చేవారు. 1990ల్లో యుఎస్ఎస్ఆర్ విచ్ఛినం తర్వాత ఈ డాల్ఫిన్లు ఉక్రెయిన్ ఆర్మీ చేతికి వెళ్లాయి. తర్వాత కూడా ఉక్రెయిన్ ఆర్మీ వీటికి శిక్షణ ఇవ్వడం కొనసాగించింది. అయితే 2014లో రష్యా దురాక్రమణ తర్వాత ఈ డాల్ఫిన్లు రష్యా చేతిలోకి వెళ్లాయి. వాటిని మరింత శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు రష్యన్ ఆర్మీ ప్రయత్నించింది. వాటికి రష్యన్ భాషలో, రష్యన్ ఆర్మీ తీరులో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఉక్రెయిన్ శిక్షకుల ఏళ్ల తరబడి అలవాటు పడిన డాల్ఫిన్లు రష్యన్ శిక్షకులకు స్పందించలేదు. అంతేకాదు, వారు ఇస్తున్న ఆహారాన్ని సైతం తీసుకోకుండా నిరాహార దీక్ష చేయడం ప్రారంభించాయి. ప్రాణాలుపోయే వరకూ అవి ఆహారాన్ని ముట్టుకోలేదని ఉక్రెయిన దేశస్థుడు బాబిన్ తెలిపారు. అవి ఉక్రెయిన్ పట్ల దేశభక్తిని చాటుకున్నాయని పేర్కొన్నారు. -
విదేశీ సంకేతాలవైపు చూపు...
న్యూఢిల్లీ: దేశీయంగా మార్కెట్లను ప్రభావితం చేయగల ప్రధాన అంశాలేవీ లేకపోవడంతో ఈ వారం విదేశీ పరిణామాలే కీలకంగా నిలవనున్నాయని స్టాక్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఇరాక్- అమెరికా, ఉక్రెయిన్-రష్యా మధ్య గత వారంలో ఏర్పడ్డ యుద్ధ మేఘాలు, వాటి పరిణామాలు వంటి అంశాలు ఈ వారం దేశీ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని తెలిపారు. మరోవైపు దేశీయ స్టాక్స్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికల తీరు కూడా కీలకం కానున్నాయని వివరించారు. కాగా, విదేశీ పరిణామాలకు అనుగుణంగా కదులుతున్న ముడిచమురు ధరలకూ ప్రాధాన్యత ఉన్నదని చెప్పారు. దేశీయ చమురు అవసరాల్లో 80% వరకూ దిగుమతులపైనే ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల కదలికలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని నిపుణులు తెలిపారు. అక్కడక్కడే... ప్రాధాన్యత కలిగిన అంశాలేవీ లేని కారణంగా ఈ వారం ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ అక్కడక్కడే సంచరించే అవకాశమున్నదని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ పేర్కొన్నారు. వెరసి రానున్న సెషన్లలో నిఫ్టీకి 7,750 పాయింట్ల స్థాయి కీలకంగా నిలవనున్నదని చెప్పారు. ఈ స్థాయికి ఎగువన కొనుగోళ్లు పుంజుకోగలవని అంచనా వేశారు. గడిచిన శుక్రవారం దేశీ మార్కెట్లకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెలవు అయినప్పటికీ, ఆ రోజు ప్రధాని చేసిన ప్రసంగాన్ని ట్రేడర్లు నిశితంగా పరిశీలిస్తారని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌధరి చెప్పారు. ఈ ప్రసంగం ద్వారా మోడీ భవిష్యత్‌లో చేపట్టబోయే సంస్కరణల ప్రణాళికలను మార్కెట్లు అంచనా వేస్తాయన్నారు. బిజినెస్‌కు స్నేహపూర్వక వాతావరణం బిజినెస్‌కు స్నేహ పూర్వక వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నట్లు మోడీ ప్రసంగం స్పష్టం చేసిందని జిగ్నేష్ చెప్పారు. శుక్రవారం మోడీ ప్రకటించిన ఆర్థిక ఎజెండాలో తయారీ రంగానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన విషయం విదితమే. దీనిలో భాగంగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లను దేశీ తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. తద్వారా మేడిన్ ఇండియా విజన్‌ను ఆవిష్కరించారు. దీంతోపాటు పేదప్రజలకూ అభివృద్ధిలో భాగాన్ని కల్పించేలా ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ప్రణాళికలను ప్రకటించారు. ఈ అంశాలతోపాటు, విదేశీ సంకేతాలను కూడా ఇన్వెస్టర్లు పరిగణిస్తారని అత్యధిక శాతంమంది నిపుణులు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ఆందోళనలు కాస్త ఉపశమించడంతో గత వారం చివర్లో చమురు ధరలు తగ్గడంతోపాటు, దేశీ మార్కెట్లు పురోగమించాయి. పరిస్థితులు కుదురుకుంటే... ఇరాక్, ఉక్రెయిన్, మధ్యప్రాచ్యాలలో తలెత్తిన ఆందోళనలు మరింత తగ్గుముఖంపడితే సెంటిమెంట్‌కు జోష్ లభిస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఉక్రెయిన్ సరి హద్దులవద్ద రష్యా యుద్ధ విమానాలు కవాతులు నిలి పివేయడం, మరో ఐదు రోజులమేర కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య ఒప్పందం కుదరడం వంటి అంశాలతో గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి. వారం మొత్తంమీద సెన్సెక్స్ 774 పాయింట్లు ఎగసి 26,103 పాయింట్ల వద్ద నిలవగా, నిఫ్టీ సైతం 223 పాయింట్లు జమ చేసుకుని 7,792 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
4 వారాల కనిష్టం
ఇరాక్ మిలటెంట్లపై వైమానిక దాడులు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ఒబామా సైన్యానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్ బలహీనపడింది. మరోవైపు ఉక్రెయిన్-రష్యా ఆందోళనలు, గాజాపై ఇజ్రాయెల్ దాడులు వంటి అంశాలు సైతం దీనికి జత కలిశాయి. ఇప్పటికే రష్యాపై అమెరికా, యూరప్ ఆంక్షల నేపథ్యంలో పశ్చిమ దేశాల నుంచి ఆహార సరుకుల దిగుమతులను రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తాజాగా నిషేధించడం ప్రపంచ ఇన్వెస్టర్లలో భయాలు రేపింది. వెరసి ఇండియాసహా ప్రపంచ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు పెరిగాయి. సెన్సెక్స్ 260 పాయింట్లు క్షీణించి 25,329 వద్ద ముగిసింది. ఇది నాలుగు వారాల కనిష్టంకాగా, నిఫ్టీ సైతం 81 పాయింట్లు పతనమై 7,569 వద్ద స్థిరపడింది. వరుసగా మూడు రోజుల్లో సెన్సెక్స్ 579 పాయింట్లు కోల్పోయింది. సెన్సెక్స్‌లో ఐదు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. మరిన్ని సంగతులివీ... బీఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ నష్టపోగా... రియల్టీ, పవర్, మెటల్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, ఆయిల్ రంగాలు 4-1.5% మధ్య నీరసించాయి. సెన్సెక్స్‌లో ఐదు షేర్లు మాత్రమే లాభపడగా భారతీ ఎయిర్టెల్ 2% ఎగసింది. ఇతర దిగ్గజాలలో సెసా స్టెరిలైట్ దాదాపు 6% దిగజారింది. ఈ బాటలో టాటా పవర్, భెల్, టాటా స్టీల్, హిందాల్కో, ఎల్అండ్టీ, గెయిల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 4-2% మధ్య క్షీణించాయి. బీఎస్ఈ-500లో పుర్వంకారా 15% పడిపోగా, భూషణ్ స్టీల్, సి.మహీంద్రా, వర్ధమాన్, బాంబే డయింగ్, జిందాల్ స్టెయిన్లెస్, రేమండ్, హెచ్‌సీసీ, ధనలక్ష్మీ బ్యాంక్, బీజీఆర్ 10-6% మధ్య పతనమయ్యాయి.