డాల్ఫిన్ల దేశభక్తి.. మరణం వరకూ నిరాహార దీక్ష.. | Ukraine Army Of Spy Dolphins Died After Hunger Strike | Sakshi
Sakshi News home page

డాల్ఫిన్ల దేశభక్తి.. మరణం వరకూ నిరాహార దీక్ష..

Published Sat, May 19 2018 11:42 AM | Last Updated on Sat, May 19 2018 1:47 PM

Ukraine Army Of Spy Dolphins Died After Hunger Strike - Sakshi

ఆపరేషన్లలో భాగంగా డాల్ఫిన్లు

కీవ్‌, ఉ‍క్రెయిన్‌ : డాల్ఫిన్లు ఈ మాట వినగానే మనకు గుర్తుకొచ్చేది సముద్ర జలాల్లో తెల్లటి నీటి వెనుక షిప్పుల వెనుక ఆనందంతో ఉరకలెత్తుతే దాని ఉత్సాహం. అంతేకాదు డాల్ఫిన్లు తెలివైనవి కూడా. ఈ మధ్యే వీటికి కొంచెం శిక్షణనిచ్చి మాటలు నేర్పించారు కూడా. వాస్తవానికి ఇంతకంటే ముందే డాల్ఫిన్లకు సైనిక శిక్షణ ఇచ్చింది ఉక్రెయిన్‌. సముద్ర జలాల గుండా వెళ్లి శత్రువులను అంతం చేయడంలో వాటిని నేర్పరులుగా తీర్చిదిద్దింది. అలాంటి అతి భయంకరమైన ఉక్రెయిన్‌ డాల్ఫిన్లు నిరాహార దీక్ష చేసి మరణించాయి.

డాల్ఫిన్ల వెనుక కథ ఇదీ..
యూఎస్‌ఎస్‌ఆర్‌ విచ్ఛినం కాక ముందు సోవియట్‌ యూనియన్‌లో ఉక్రెయిన్‌ అంతర్భాగం. 1973 ప్రచ్చన్న యుద్ధ సమయంలో నల్ల సముద్రంలో కొన్ని డాల్ఫిన్లకు ఉక్రెయన్లు యుద్ధ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చారు. ప్రధాన ఓడరేవు సెవెస్టోపాల్‌ కేంద్రంగా డాల్ఫిన్లకు మెరెన్లను మోసుకెళ్లడం, సముద్రంలో పెట్టిన మైన్లను కనిపెట్టడం, నౌకల్లో బాంబులు అమర్చడం​వంటి యుద్ధ శిక్షణలను ఉక్రెయిన్‌ నావికులు వాటికి శిక్షణ ఇచ్చేవారు.

1990ల్లో యుఎస్‌ఎస్‌ఆర్‌ విచ్ఛినం తర్వాత ఈ డాల్ఫిన్లు ఉక్రెయిన్‌ ఆర్మీ చేతికి వెళ్లాయి. తర్వాత కూడా ఉక్రెయిన్‌ ఆర్మీ వీటికి శిక్షణ ఇవ్వడం కొనసాగించింది. అయితే 2014లో రష్యా దురాక్రమణ తర్వాత ఈ డాల్ఫిన్లు రష్యా చేతిలోకి వెళ్లాయి. వాటిని మరింత శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు రష్యన్‌ ఆర్మీ ప్రయత్నించింది. వాటికి రష్యన్‌ భాషలో, రష్యన్‌ ఆర్మీ తీరులో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.

ఉక్రెయిన్‌ శిక్షకుల ఏళ్ల తరబడి అలవాటు పడిన డాల్ఫిన్లు రష్యన్‌ శిక్షకులకు స్పందించలేదు. అంతేకాదు, వారు ఇస్తున్న ఆహారాన్ని సైతం తీసుకోకుండా నిరాహార దీక్ష చేయడం ప్రారంభించాయి. ప్రాణాలుపోయే వరకూ అవి ఆహారాన్ని ముట్టుకోలేదని ఉక్రెయిన​ దేశస్థుడు బాబిన్‌ తెలిపారు. అవి ఉక్రెయిన్‌ పట్ల దేశభక్తిని చాటుకున్నాయని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement