Dolphins
-
డాల్ఫిన్ల దీవి
సాక్షి, అమరావతి: సాగర సంగమ తీరంలో డాల్ఫిన్లు కనువిందు చేస్తున్నాయి. కృష్ణాజిల్లా హంసలదీవిలో ఇవి తరచూ కనిపిస్తున్నాయి. ఇది కృష్ణా నది సముద్రంలో కలిసేచోటు కావడంతో అవి ఎక్కువగా ఈ ప్రాంతంలో కనిపిస్తాయని స్థానికులు చెబుతున్నారు. ఇవి గుంపులు గుంపులుగా తిరుగుతూ అప్పుడప్పుడు సముద్ర తీరానికి దగ్గరగా వస్తున్నాయని.. ఒక్కో గుంపులో 15 నుంచి 30 వరకూ ఉంటూ కనిపిస్తాయని వారంటున్నారు. విశాఖపట్నం, బాపట్లలోని సూర్యలంక, కాకినాడ బీచ్‌ల్లోనూ ఈ డాల్ఫిన్లు ఎక్కువగా కనిపిస్తాయి. తాజాగా.. ఆదివారం విజయవాడ నేచర్ క్లబ్‌కు చెందిన డాక్టర్ కిషోర్ హంసలదీవి వద్ద సముద్రంలో రెండు డాల్ఫిన్లను తన కెమెరాలో బంధించారు.తూర్పు తీరంలో సర్వ సాధారణంహిందూ మహా సముద్రంలో కనిపించే వీటిని హంప్ బ్యాక్ డాల్ఫిన్లుగా పిలుస్తారు. మన దేశ తూర్పు, పశ్చిమ తీరాల్లో ఇవి కనిపించడం చాలా సాధారణం. అయితే, తూర్పు, పశ్చిమ తీరాల్లో కనిపించే డాల్ఫిన్ల మధ్య జన్యుపరంగా స్వల్ప తేడాలుంటాయి. హంప్ బ్యాక్ డాల్ఫిన్లు ముదురు బూడిద రంగులో ఉంటాయి. వాటి ఉపరితల భాగం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. వాటికి ఎత్తయిన మూపురం ఉంటుంది. సముద్రంలో డాల్ఫిన్ల మూపురం బయటకు కనిపిస్తుంది. వాటి ఆధారంగానే డాల్ఫిన్లను గుర్తిస్తారు. ఒక పెద్ద హంప్ బ్యాక్ డాల్ఫిన్ పొడవు సుమారు 3.5 మీటర్లు ఉంటుంది. కొత్తగా పుట్టిన డాల్ఫిన్లు కూడా ఒక మీటర్ పొడవు ఉంటాయి. వాటిలో ఆడ, మగ గురించి మాత్రం సరైన అధ్యయనాల్లేవు.తీరానికి దగ్గరగా వచ్చే డాల్ఫిన్లు ఇవే..డాల్ఫిన్లు మన తీరంలో కనిపించడం సాధారణం. అయితే, వాటిల్లో తీరానికి దగ్గరగా కనిపించేవి హంప్‌బ్యాక్ డాల్ఫిన్లు మాత్రమే. మిగిలిన డాల్ఫిన్ జాతులు సముద్రంలోనే ఇంకా లోతులో ఉంటాయి. డాల్ఫిన్ల గురించి అధ్యయనం చేసేవాళ్లు, చూసేవాళ్లు లేకపోవడంవల్ల వాటి గురించి పెద్దగా బయటకు తెలీడంలేదు. చూసేవాళ్లకు మాత్రం అవి రెగ్యులర్‌గా కనిపిస్తూనే ఉంటాయి. సూర్యుడు ఉదయించే సమయాల్లో అవి తీరానికి దగ్గరగా వస్తాయి. శీతాకాలంలో స్పిన్నర్ డాల్ఫిన్లు (పైకి ఎగిరి నీటిలో పడేవి) విశాఖలో తీరంలో కనిపిస్తాయి. డాల్ఫిన్లు, తిమింగలాలు చనిపోయి లేదా దెబ్బతగిలి ఒడ్డుకు కొట్టుకువస్తే వాటి వివరాలు సేకరించి అటవీ శాఖకు సమాచారం ఇస్తున్నాం. – ప్రణవ్, ఈస్ట్ కోస్ట్ కన్జర్వేషన్ టీమ్ -
Covert Creatures: పావురాల నుంచి డాల్ఫిన్ల దాకా..
బెలుగా జాతికి చెందిన అరుదైన పెద్ద గూఢచారి తిమింగలం ‘హవాల్దిమీర్’దక్షిణ నార్వే తీరంలో బుల్లెట్ గాయాలతో విగతజీవిగా కనిపించడం ఇటీవల అంతర్జాతీయ వార్తాంశంగా నిలిచింది. దీంతో అసలు మనిషి ఇంతవరకు ఏ జాతుల జీవులను నిఘా కోసం గూఢచారులుగా వినియోగించుకున్నాడన్న చర్చ మొదలైంది. గూఢచారులుగా ఈ జంతువులు నిర్వర్తించిన విధుల్లేంటి. వాటిల్లో అత్యుత్తమ గూఢచారి ఏది? వంటి ఆసక్తికర అంశాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.. గూఢచార జీవులు... అత్యాధునిక పరికరాలు, చిన్న నిఘా కెమెరాలు రాకముందు సుదూర ప్రాంతాలకు రహస్య సమాచారాన్ని సురక్షితంగా చేరవేయడం ఓ సవాలుగా ఉండేది. దీంతో సందేశాలు పంపడానికి పావురాలను ఉపయోగించేవారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో నిఘా కోసం జర్మన్ సైన్యం ప్రత్యేకంగా బుల్లి కెమెరాలు రూపొందించి వాటిని పావురాలకు కట్టింది. వాటిల్లో రికార్డయ్యే సమాచారంతో శత్రు జాడ తెల్సుకునేది. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలూ గూఢచర్యానికి పావురాలనే నమ్ముకున్నాయి. 1970లలో అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) తన ప్రత్యేక నిగా ఆపరేషన్ ‘టకానా’లో భాగంగా బుల్లి కెమెరాలు అమర్చిన పావురాలను సోవియట్ రష్యాలోకి పంపింది. ఇలా పావురాలు మాత్రమే కాదు.. పిల్లులు, తిమింగలాలు, డాల్ఫిన్లు, ఇంకొన్ని రకాల పక్షులు, చనిపోయిన జంతువులు కూడా కోవర్ట్ ఆపరేటర్లుగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాయి. డాల్ఫిన్లతో ప్రత్యేకంగా.. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్ నావికాదళం సముద్ర క్షీరదాలతో వివిధ కార్యక్రమాలను చేపట్టింది. వీటిలో ఒకటి డాల్ఫిన్లకు శిక్షణ ఇవ్వడం. అమెరికా నావికాదళం సముద్ర క్షీరదాల కార్యక్రమం(ఎంఎంపీ) కింద సముద్రజలాల్లో నిఘా కోసం డాల్ఫిన్లను ఉపయోగించింది. 1960లలో ప్రాజెక్ట్ ఆక్సిగాస్లో భాగంగా శత్రు నౌకలకు పేలుడు పరికరాలను అమర్చేందుకు సీఐఏ డాల్ఫిన్లకు శిక్షణ ఇచి్చంది. ఈ కార్యక్రమానికి సముద్రాల్లో స్వేచ్ఛగా తిరిగే రెండు ‘బాటిల్‌నోస్’డాల్ఫిన్లను ఉపయోగించారు. ప్రపంచంలోని అత్యంత తెలివైన జంతువులుగా డాల్ఫిన్లు ప్రసిద్ధి చెందాయి. క్రిమియాలోని సెవాస్టోపోల్ నల్లసముద్రంలోని నౌకాదళ స్థావరంలో శత్రు డైవర్లను గుర్తించడానికి, ఎదుర్కోవడానికి డాల్ఫిన్లకు శిక్షణ ఇచ్చేందుకు రష్యా గత సంవత్సరం ఒక క్షీరద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నివేదిక బహిర్గతంచేసింది. 2023 ఏప్రిల్ నుంచి జూన్ వరకు సెవాస్టోపోల్ నౌకాశ్రయంలో తేలియాడే క్షీరదాల బోనుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు బ్రిటిష్ సైనిక నిఘా ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. పిల్లుల చెవులకు మైక్రో ఫోన్లు పిల్లులను తెలివైన జంతువులుగా భావిస్తారు. సీఐఏ 1960వ దశకంలో పిల్లులను ఉపయోగించి ‘ఆపరేషన్ అకౌస్టిక్ కిట్టీ’అనే ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. దీని కోసం 2 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. ప్రాజెక్టులో భాగంగా పిల్లుల చెవుల్లో మైక్రోఫోన్లను ఏర్పాటు చేసింది. ఇవి సోవియట్ దౌత్యవేత్తలు, ఏజెంట్ల సంభాషణలను రహస్యంగా రికార్డ్ చేస్తాయి. పిల్లి పెంపుడు జంతువు. అది బహిరంగ ప్రదేశాలు, కొన్ని రహస్య ప్రదేశాల్లో అవి ప్రత్యక్షమవడం శత్రు దేశాలకు అనుమానాలు పెంచే అవకాశం ఉంటుంది. అదీగాక పిల్లులను నియంత్రించడం అంత సులభం కాదు. శిక్షణాసమయంలో వాటిని శిక్షకులు నియంత్రించలేక చేతులెత్తేశారు. పిల్లులు వాటికి సూచించిన ప్రాంతాలకు కాకుండా తమకిష్టమైన ప్రదేశాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో చేసేదిలేక చివరికి 1967లో ఈ కార్యక్రమానికి ఫుల్స్టాప్ పెట్టేశారు. టాప్ ఏజెంట్.. పావురం పిల్లులు, చనిపోయిన ఎలుకల వంటివాటిని రంగంలోకి దింపి పని కానిచి్చనప్పటికీ వివిధ దేశాల నిఘా సంస్థలు శతాబ్దాలుగా ఎక్కువ నమ్మకం పెట్టుకున్నది పావురం మీదనే. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నిర్వహించిన అత్యంత విజయవంతమైన గూఢచారి కార్యక్రమం ‘ఆపరేషన్ కొలంబా’పావురాలతోనే విజయంవంతమైంది. జర్మన్ సైనిక కార్యకలాపాలను, సున్నితమైన సైనిక స్థానాలపై నిఘాను హోమింగ్ జాతి పావురాలు సేకరించాయి. పేపర్‌పై రాసిన సందేశాలను సూక్ష్మ డబ్బాల్లో పెట్టి పక్షి కాలికి కట్టేశారు. ఈ రహస్య సందేశాలలో నాజీ దళాల కదలికలు, నాజీల కొత్త ఆయుధాలపై నివేదికలు, ప్రణాళికాబద్ధమైన రాకెట్ దాడుల వివరాలను వేగులు సేకరించి పావురాల ద్వారా ప్రధాన కేంద్రానికి రహస్యాన్ని పంపేవారు. రచయిత గోర్డాన్ కోరేరా ‘ఆపరేషన్ కొలంబా: ది సీక్రెట్ పీజియన్ సరీ్వస్’పుస్తకంలో ఇలాంటి ఎన్నో వివరాలు ఉన్నాయి. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ 1941 నుంచి 1944 మధ్య నాజీ ఆక్రమిత ఐరోపాపై 16,000 హోమింగ్ జాతి పావురాలను వాడారు. అన్నింటికన్నా ముఖ్యంగా పక్షుల ద్వారా గూఢచర్యం విజయవంతంకావడంతో నూతన టెక్నాలజీలకూ కపోతమే స్ఫూర్తిగా నిలిచింది. గత నెలలో చైనా అచ్చం పావురంలాగా ఉండే చిన్నపాటి నిఘా డ్రోన్‌ను ఆవిష్కరించడం తెల్సిందే. గూఢచార పావురాలని... భారత ఉపఖండంలో సందేశాలను పంపించడానికి పావురాలను ఉపయోగించినట్టుగా చరిత్ర చెబుతోంది. 2020 మేలో కశ్మీర్‌లోని ఓ గ్రామంలో నంబర్ల సెట్ ఉంగరం కలిగిన పావురం కనిపించింది. దానిని పట్టుకున్న గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. పాకిస్తాన్‌కు చెందిన గూఢచారి పావురమై ఉంటుందని, దానిపై ఉన్నది కోడ్ అని అనుమానించిన పోలీసులు.. డీ క్రిప్ట్ చేయడానికి ప్రయట్నించారు. చివరికది గూఢచారి పావురం కాదని తేలడంతో విడిచిపెట్టారు. 2016 అక్టోబర్‌లో భారత ప్రధానిని బెదిరిస్తూ మరో పావురం కనిపించింది. పంజాబ్‌లోని పఠాన్ కోట్లో ఈ పావురాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 2023 మేలో ముంబైలో దొరికిన పావురాన్ని చైనా గూఢచారిగా అనుమానిస్తూ ఎనిమిది నెలల పాటు బోనులో ఉంచి దాని ఆనుపానాలు సేకరించారు. ఆ పావురం కాలుకు ఉంగరాలు కట్టి, దాని రెక్కల కింది భాగంలో చైనీస్ భాషలో ఏదో రాశారు. అయితే అది తైవాన్‌లో రేసింగ్ పోటీలో పాల్గొన్న పక్షి అని ఫిబ్రవరిలో తేలడంతో ఎట్టకేలకు దానిని అధికారులు వదిలేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతరిస్తున్న డాల్ఫిన్లు..!
బరంపురం: చిలికా ఉప్పునీటి సరస్సులో డాల్ఫిన్లు క్రమంగా అంతరిస్తున్నట్లు తెలుస్తోంది. అసియాలోనే అతి పెద్దదైన ఈ సరస్సులో ఉన్న డాల్ఫిన్లను ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది లెక్కించారు. అయితే ప్రస్తుతం వాటి సంఖ్య 113 ఉన్నట్లు నిర్ధారించారు. గతేడాది వీటి సంఖ్య 154 ఉండగా, ఈ ఏడాది 113కు తగ్గింది. సరస్సులోని బిత్తరకొనికా, సతపడా, కృష్ణప్రసాద్, నూవపడా, బోయికులా, బల్లగాం, టాంగి మరియు బల్లుగాం రేంజ్‌ల పరిధుల్లో 10 అటవీ బృందాలు వీటిని లెక్కించాయి. లెక్కింపులో అటవీ, పర్యావరణ, చిలికా అభివృద్ధి సంస్థ, వన్యప్రాణుల సంరక్షణ విభాగాల అధికారులు పాల్గొన్నట్లు చిలికా డివిజినల్ ఫారస్ట్ అఫీసర్ బి.ఆర్.దాస్ తెలియజేశారు. అయితే ప్రతి ఏడాదీ వీటి సంఖ్య క్రమేపీ తగ్గుతుండడంతో పర్యావరణ ప్రేమికులు, సందర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సరస్సులో మోటార్ బోట్లు సంచరించడం కారణంగానే డాల్ఫిన్లు అంతరిస్తున్నట్లు వన్యప్రాణుల సంరక్షణ విభాగం పరిశోధనలో తేలినట్లు స్పష్టమవుతోంది. -
అత్యంత అరుదైన డాల్ఫిన్లు.. ఎక్కడో తెలుసా?
ఈ విషయాలు మీకు తెలుసా? డాల్ఫిన్లు సాధారణంగా శరీరంపై వైపున బూడిదరంగులోను, పొట్ట భాగంలో తెలుపు రంగులోను ఉంటాయి. అరుదుగా నలుపు తెలుపు మచ్చలతో కూడా ఇవి కనిపిస్తుంటాయి. ఫొటోలో కనిపిస్తున్న చారల డాల్ఫిన్లు అంత్యంత అరుదైనవి. ఇటీవల ఇవి ఇంగ్లండ్ తీరానికి ఆవల సముద్రంలో కనిపించాయి. ‘ఏకే వైల్డ్‌లైఫ్ క్రూజెస్’ పడవలో సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు పడవ కెప్టెన్ కీత్ లీవ్స్ వీటిని గమనించాడు. సముద్రంలో ఈ చారల డాల్ఫిన్లు సయ్యాటలాడుతుండగా, తన కెమెరాను క్లిక్‌మనిపించాడు. ఫాల్ముత్ తీరానికి ఆవల ఇవి కనిపించినట్లు కీత్ వెల్లడించాడు. వీటి ఫొటోలను అతడు ‘సీ వాచ్ ఫౌండేషన్’కు అందించాడు. వీటిని పరిశీలించిన ‘సీ వాచ్ ఫౌండేషన్’ నిపుణులు, ఇవి అంత్యంత అరుదైనవని తెలిపారు. -
కోన ప్రాణంతో విశాఖ తీరానికి కొట్టుకు వచ్చి న డాల్ఫిన్
-
విశాఖ సాగర్ తీరంలో డాల్ఫిన్స్ సందడి
-
రుషికొండ తీరంలో డాల్ఫిన్ల సందడి
సాక్షి, విశాఖపట్నం: వివిధ దేశాల సముద్ర తీరాల్లో విరివిగా కనిపించే డాల్ఫిన్లు.. విశాఖ జిల్లా రుషికొండ తీరంలో సందడి చేశాయి. రుషికొండలోని లివిన్ అడ్వెంచర్ సంస్థకు చెందిన స్కూబా డైవర్లు ఆదివారం ఉదయం స్పీడ్ బోట్లో తీరం నుంచి సుమారు మైలు దూరం వెళ్లగానే డాల్ఫిన్లు కనిపించాయి. సుమారు 15కిపైగా డాల్ఫిన్లు అలలతో పోటీపడుతున్నట్లు ఎగురుతూ సందడి చేశాయి. ఈ దృశ్యాలను లివిన్ అడ్వెంచర్స్ ప్రతినిధులు తమ కెమెరాల్లో బంధించారు. రెండేళ్ల కిందట కూడా ఇదే మాదిరిగా డాల్ఫిన్లు కనిపించాయని..మళ్లీ ఇప్పుడు అవి కనబడ్డాయని స్కూబా డైవింగ్ ప్రతినిధి బలరాంనాయుడు తెలిపారు. ఇవీ చదవండి: అండ్రు అరాచకాలు: కొండను తవ్వేసి.. అడవిని మింగేసి.. ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు -
వైరల్: టూర్ బోటుతో 400 డాల్ఫిన్ల పోటీ.. 95 మిలియన్ల వ్యూస్!
వాషింగ్టన్: నీటిలో ఉండేవన్నీ చేపలు కాదు. నీటిలో క్షీరదాలుకూడా ఉంటాయి. తిమింగలాలు, డాల్ఫిన్లు, పోర్పోయిస్ నీటిలో నివసిస్తాయి. కానీ అవి సెటాసియన్స్ (సెహ్-టే-షున్స్) అని పిలిచే నీటిలో ఉండే క్షీరదాలు. అయితే సముద్ర జీవుల్లో డాల్ఫిన్లు తెలిగలవిగా పలు పరిశోధనలు పేర్కొంటున్నాయి. డాల్ఫిన్లు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు లోతులలో డైవింగ్ చేయగలవు. టూర్ బోటుతో పోటీ తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విటర్ ద్వారా ఓ టూర్ బోటుతో పోటీ పడుతున్న డాల్ఫిన్లకు సంబంధించిన వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియో కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్ తీరంలో తీశారు. దీన్ని డాల్ఫిన్ టూర్ క్రూయిజ్లను అందించే న్యూపోర్ట్ వేల్ అనే సంస్థ ట్విట్టర్లో పోస్ట్ చేయగా.. హర్ష్ గోయెంకా షేర్ చేశారు. ప్రస్తుతం ఆయన షేర్ చేసిన వీడియోను 84.6 వేల మంది నెటిజన్లు వీక్షించగా.. దీని న్యూపోర్ట్ వేల్స్ షేర్ చేసిన వీడియోను 95 మిలియన్ల నెటిజన్లు వీక్షించారు. 46 సెకన్ల నిడివి గల వీడియోలో.. టూర్ బోటుతో సుమారు 400 డాల్ఫిన్లు డైవ్ చేస్తూ పోటీ పడ్డాయి. దీన్ని బోటులో ఉన్న వారు ఎగబడి మరీ చూశారు. తమ సెల్ ఫోన్ కెమెరాల్లో బంధిస్తూ.. తెగ ఎంజాయ్ చేశారు. ఈ దృష్యం చాలా అందంగా ఉంది. నిజంగా ఇది చూడటం ఓ అదృష్టం అంటూ కామెంట్ చేశారు. ‘‘సముద్రంలో డాల్పిన్ల పోటీ.. మరి గెలుపెవరిది.’’ అంటూ రాసుకొచ్చారు. ఆక్సిజన్‌ను గ్రహించలేని జలచరాలు ఇక నీటిలోనే ఉన్నప్పటికీ నీటిలోని ఆక్సిజన్‌ను గ్రహించలేని జలచరాలు నీటి పాములు, తాబేళ్లు, మొసళ్లు, సీల్స్, డాల్ఫిన్లు, తిమింగలాలు. ఈ జీవులకు మొప్పలు ఉండవు. చర్మపు నిర్మాణం కూడా నీటిలోని ఆక్సిజన్‌ను తీసుకోగల స్థితిలో ఉండదు. గాలిలోని ఆక్సిజన్‌ను ఊపిరి ద్వారా గ్రహించగలిగే శ్వాస వ్యవస్థ (పల్మనరీ శ్వాసక్రియ) మాత్రమే వీటిలో ఉంటుంది. అందువల్లనే ఇలాంటివి సముద్రంలోనే ఉన్నా పదేపదే నీటి ఉపరితలం పైకి వచ్చి గాలిని వదిలి, కావలసినంత గాలిని పీల్చుకుని తిరిగి నీటిలోకి వెళ్లిపోతూ ఉంటాయి. This is a race I would have loved to participate in…pic.twitter.com/5aPtTj4Bsp — Harsh Goenka (@hvgoenka) June 25, 2021 చదవండి: టీకాకు భయపడి.. భార్య ఆధార్‌తో రోజంతా చెట్టుపైనే.. ఈ ఫోటోలో మరో చిరుత కూడా ఉందండోయ్.. గుర్తుపట్టారా? -
అరుదైన ఆ డాల్ఫిన్స్‌కు ఏమైంది?
కొమ్మాది (భీమిలి): అరుదైన జీవ సంతతికి చెందిన డాల్ఫిన్స్ మృత్యువాత పడటంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. ఇంతవరకు సముద్రంలో పెరుగుతున్న కాలుష్యానికి చేపలు, తాబేళ్లు తరచూ తీరానికి కొట్టుకుని రావడం చూశాం. గత కొద్ది రోజులుగా డాల్ఫిన్లు మృత్యువాత పడి తీరానికి కొట్టుకుని వస్తున్నాయి. మంగళవారం సాయంత్రం సాగర్‌నగర్ తీరానికి డాల్ఫిన్ కళేబరం ఒకటి కొట్టుకొచ్చింది. గురువారం మరో డాల్ఫిన్ కళేబరం కొట్టుకొచ్చింది. వరుసగా డాల్ఫిన్లు మృత్యువాత పడటంపై జిల్లా మత్య్సశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి.శ్రీనివాసరావును వివరణ కోరగా శీతల వాతావరణంలో జీవించే ఈ డాల్ఫిన్లు ప్రస్తుతం ఉష్ణాగ్రతలు అధికమవడం వల్ల మృత్యువాత పడుతున్నాయని, వీటిపై సీఎమ్ఎఫ్ఆర్ఐ సైంటిస్ట్‌లతో కలసి పరిశీలించనున్నట్లు తెలిపారు. చదవండి: ‘కూన’ గణం.. క్రూర గుణం బాబు చెప్పినా వినలేదు.. టీడీపీ నేతల హల్చల్ -
చాథమ్ తీరంలో 100 తిమింగలాలు మృతి
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ తూర్పు తీరానికి 800 కిలోమీటర్ల (497 మైళ్ళు) దూరంలో ఉన్న చాథమ్ దీవులలో సుమారు 100 పైలట్ తిమింగలాలు, బాటిల్‌నోస్ డాల్ఫిన్లు చనిపోయినట్లు బుధవారం మెరైన్ అధికారులు తెలిపారు. ఈ ద్వీపం మారుమూల ప్రదేశంలో చిక్కుకున్న కారణంగా తక్షణ సహాయక చర్యలు చేపట్టలేకపోయామని అన్నారు. మొత్తం 97 పైలట్ తిమింగలాలు, 3 డాల్ఫిన్లు తీవ్ర అవస్థలు పడుతూ మరణించిన విషయం తమకు ఆదివారం తెలిసిందని న్యూజిలాండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జర్వేషన్ (డీఓసీ) తెలిపింది. (ఉటా ఎడారిలో మిస్టరీ దిమ్మె!) 'ఇంకా అక్కడ 26 తిమింగలాలు మాత్రమే సజీవంగా ఉన్నాయి. వాటిలో ఎక్కువ భాగం చాలా బలహీనంగా కనిపిస్తున్నాయి. సముద్రంలో చోటుచేసుకున్న పరిస్థితుల కారణంగా అవి అస్వస్థతకు గురయ్యాయి. సముద్రంలో గొప్ప తెల్ల సొరచేపలు కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి' అని బయోడైవర్శిటీ రేంజర్ జెమ్మ వెల్చ్ అన్నారు. చాథమ్ దీవులలో జంతువులు గుంపులుగా ఉండటం సర్వసాధారణం. చాథమ్ ఐలాండ్ లో 1918లో అత్యధికంగా 1000కి పైగా తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకురావడమే చరిత్రలో భారీ ఘటన. కాగా చివరగా 1985లో 450కి పైగా వేల్స్ ఆక్లాండ్ లో ఇదే రీతిలో తీరానికి వచ్చాయి. అయితే ఇప్పుడు మరలా అదే పునరావృతం కావడంతో.. ఇలా ఎందుకు జరుగుతుంది? అనే ప్రశ్న సముద్ర జీవశాస్త్రజ్ఞులను కలవరపెడుతోంది. కాగా, సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియన్ తీరంలో సామూహికంగా నివశించే అనేక వందల తిమింగలాలు మరణించిన సంగతి తెలిసిందే. -
వివాదాల్లో చెన్నై చిన్నది
సినిమా: అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా.. మంచి టీజింగ్ సాంగ్ గుర్తుందా? ఆ పాట గురించి ఇప్పుడెందుకు అంటారా? సంచలన నటి త్రిష అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. వినోదానికి పోయిందో, లేక ప్రచారాన్ని కోరుకుందో గానీ, అది కాస్తా బెడిసికొట్టి ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. ఈ అమ్మడు తరచూ విదేశాలు చుట్టొస్తున్న విషయం తెలిసిందే. అలా ఇటీవల దుబాయ్‌కు రౌండ్ వేసింది. అక్కడ ఒక అందమైన ఈత కొలను (స్మిమ్మింగ్ పూల్)లో చక్కగా ఈదేసింది. పనిలో పనిగా అదే కొలనులో చక్కగా విన్యాసాలు చేస్తున్న డాల్ఫిన్లను చూడగానే అమ్మడు తెగ ముచ్చట పడిపోయింది. అంతటిలో ఆగితే ఆమె త్రిష ఎందుకవతుంది. అందులో ఒక డాల్ఫిన్ తెగ ముద్దొచ్చేస్తుంటే, ఆగలేక దాన్ని సమీపించి పట్టుకుని ముద్దెట్టేసింది. అంతే ఆ డాల్ఫిన్‌కు కూడా త్రిషను చూడగానే ప్రేమ పుట్టుకొచ్చినట్టుంది. అదీ ఈ సుందరి బుగ్గపై చుంబనాలు పెట్టేసింది. లేదా త్రిషనే దానితో ముద్దు పెట్టించుకుని ఉండవచ్చు. ఏదైతేనేమీ త్రిష, డాల్ఫిన్ల ముద్దు ముచ్చట్ల ప్రహసనం ఒక రేంజ్లో జరిగిపోయింది. అక్కడితో ఆగలేదు. ఇంత చేసి డాల్ఫిన్‌తో తన ముద్దు ముచ్చట్లను ప్రపంచానికి తెలిపి ప్రచారం పొందాలి కదా! అవును ఆ దృశ్యాలను ఈ చెన్నై చిన్నది తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంతే అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక్కడి వరకూ త్రిష బాగానే ఎంజాయ్ చేసింది. ఆమె అభిమానులు సూపర్ అంటూ తెగ లైక్ చేసేస్తున్నారు. ఇంకేంటి అంతా బాగానే ఉందిగా, త్రిషకు మంచి ఫ్రీ ప్రచారం లభించిందిగా అనేగా మీ ప్రశ్న. రండి చూద్దాం. త్రిష పెటా అనే జీవ ప్రాణుల సంరక్షణ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే వివాదాల్లో పడేసింది. అలాంటి పెటా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండి డాల్ఫిన్ లాంటి జల జీవాలను హింసిస్తుందా అంటూ జీవ ప్రాణుల సంరక్షణ సంస్థకు చెందిన వారు త్రిషపై మండిపడుతున్నారు. స్వేచ్ఛగా జీవించే డాల్ఫిన్లతో తన సరదాలు తీర్చుకోవడం? అసలు వాటి స్వేచ్ఛను హరించే హక్కు త్రిషకు ఎవరిచ్చారు? అంటూ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా నిర్వాహకురాలు పరిదా తంబల్ నటి త్రిష చర్యలను తీవ్రంగా విమర్శించారు. సముద్రంలో జీవించే ప్రాణులైన డాల్ఫిన్లు కాలక్షేప ఈత కొలనుల్లో ఎలా సహజమైన పరిస్థితి అమరుతుంది? అని ప్రశ్నించారు. అసలు డాల్ఫిన్లకు మనుషుల అలవాట్లను ఎందుకు నేర్పించాలి? వాటిని వాటి మానాన జీవించనీయండి అని ఆవేశంగా అన్నారు. దీంతో ఒక పక్క అభిమానులు డాల్ఫిన్లలో తన ముద్దు దృశ్యాలను చూసి చాలా క్యూట్‌గా ఉన్నాయని మెచ్చుకుంటుంటే మరో పక్క విమర్శకులేంటి తనపై దాడి చేస్తున్నారు? అని త్రిష తల పట్టుకుందట. ఈ అమ్మడిప్పుడు రజనీకాంత్‌కు జంటగా పేట చిత్రంలో నటిస్తోంది. -
డాల్ఫినైనా కాకపోతిని
త్రిషాకు చేపలంటే ఇష్టం. గుండెల నిండా ప్రేమను నింపుకున్నారు. అంతెందుకు ‘నీమో ఫిష్’ ట్యాటూని వేసుకున్నారు. త్రిష లో నెక్ డ్రెస్ వేసుకున్నప్పుడు పరీక్షగా చూస్తే మీకే అర్థం అవుతుంది ఆ ట్యాటూ ఎక్కడ ఉందో. ఇప్పుడీ చేప గోల ఏంటీ? అంటే.. వరుసగా షూటింగ్స్ బిజీ నుంచి రిలాక్స్ అవ్వడానికి చిన్న హాలీడే బ్రేక్ తీసుకున్నారు త్రిష. దాంట్లో భాగంగా దుబాయ్ వెళ్లారామె. అక్కడ ఎంచక్కా డాల్ఫిన్స్‌తో ఆడుకునే వీలు కుదిరింది. అంతే.. డాల్ఫిన్స్‌ను ముద్దాడుతూ, హగ్గాడుతూ కాలక్షేపం చేశారామె. అంతేనా.. తన అభిమానుల కోసం ఆ ఫొటోలను ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అంటూ షేర్ చేశారు. ఫొటోలను చూసి డాల్ఫిన్ అయినా కాకపోతిని అని కుర్రకారు అనుకునే అవకాశం ఉంది. -
డాల్ఫిన్ల దేశభక్తి.. మరణం వరకూ నిరాహార దీక్ష..
కీవ్, ఉక్రెయిన్ : డాల్ఫిన్లు ఈ మాట వినగానే మనకు గుర్తుకొచ్చేది సముద్ర జలాల్లో తెల్లటి నీటి వెనుక షిప్పుల వెనుక ఆనందంతో ఉరకలెత్తుతే దాని ఉత్సాహం. అంతేకాదు డాల్ఫిన్లు తెలివైనవి కూడా. ఈ మధ్యే వీటికి కొంచెం శిక్షణనిచ్చి మాటలు నేర్పించారు కూడా. వాస్తవానికి ఇంతకంటే ముందే డాల్ఫిన్లకు సైనిక శిక్షణ ఇచ్చింది ఉక్రెయిన్. సముద్ర జలాల గుండా వెళ్లి శత్రువులను అంతం చేయడంలో వాటిని నేర్పరులుగా తీర్చిదిద్దింది. అలాంటి అతి భయంకరమైన ఉక్రెయిన్ డాల్ఫిన్లు నిరాహార దీక్ష చేసి మరణించాయి. డాల్ఫిన్ల వెనుక కథ ఇదీ.. యూఎస్ఎస్ఆర్ విచ్ఛినం కాక ముందు సోవియట్ యూనియన్‌లో ఉక్రెయిన్ అంతర్భాగం. 1973 ప్రచ్చన్న యుద్ధ సమయంలో నల్ల సముద్రంలో కొన్ని డాల్ఫిన్లకు ఉక్రెయన్లు యుద్ధ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చారు. ప్రధాన ఓడరేవు సెవెస్టోపాల్ కేంద్రంగా డాల్ఫిన్లకు మెరెన్లను మోసుకెళ్లడం, సముద్రంలో పెట్టిన మైన్లను కనిపెట్టడం, నౌకల్లో బాంబులు అమర్చడంవంటి యుద్ధ శిక్షణలను ఉక్రెయిన్ నావికులు వాటికి శిక్షణ ఇచ్చేవారు. 1990ల్లో యుఎస్ఎస్ఆర్ విచ్ఛినం తర్వాత ఈ డాల్ఫిన్లు ఉక్రెయిన్ ఆర్మీ చేతికి వెళ్లాయి. తర్వాత కూడా ఉక్రెయిన్ ఆర్మీ వీటికి శిక్షణ ఇవ్వడం కొనసాగించింది. అయితే 2014లో రష్యా దురాక్రమణ తర్వాత ఈ డాల్ఫిన్లు రష్యా చేతిలోకి వెళ్లాయి. వాటిని మరింత శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు రష్యన్ ఆర్మీ ప్రయత్నించింది. వాటికి రష్యన్ భాషలో, రష్యన్ ఆర్మీ తీరులో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఉక్రెయిన్ శిక్షకుల ఏళ్ల తరబడి అలవాటు పడిన డాల్ఫిన్లు రష్యన్ శిక్షకులకు స్పందించలేదు. అంతేకాదు, వారు ఇస్తున్న ఆహారాన్ని సైతం తీసుకోకుండా నిరాహార దీక్ష చేయడం ప్రారంభించాయి. ప్రాణాలుపోయే వరకూ అవి ఆహారాన్ని ముట్టుకోలేదని ఉక్రెయిన దేశస్థుడు బాబిన్ తెలిపారు. అవి ఉక్రెయిన్ పట్ల దేశభక్తిని చాటుకున్నాయని పేర్కొన్నారు. -
మెక్సికో బీచ్‌లో విషాదం
-
మెక్సికో బీచ్‌లో విషాదకర దృశ్యం!
మెక్సికో: మెక్సికో సరిహిద్దు బీచ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దాదాపు యాభై డాల్ఫిన్లు గాయాలతో బాజా కాలిఫోర్నియా సర్ బీచ్ ఒడ్డుకు కొట్టుకువచ్చాయని మెక్సికో అధికారులు తెలిపారు. పెద్ద డాల్ఫిన్లు దాడి చేయడం వల్లనే ఇవి ఒడ్డుకు వచ్చి ఉంటాయని వారు భావిస్తున్నారు. అయితే స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, జంతు ప్రేమికులు హుటాహుటిన బీచ్ తీరానికి చేరుకున్నారు. మొత్తం 54 డాల్ఫిన్లు తీరానికి కొట్టుకురాగా, వాటిపై దాడిచేసిన గాయాలు కనిపించాయని వారు చెబుతున్నారు. ఎంతగానో శ్రమించి తిరిగి సముద్రంలోకి వెళ్లేలా చూడగా 33 డాల్ఫిన్ల ప్రాణాలు దక్కాయట. మరో 21 డాల్ఫిన్లు బాటిల్ నోస్ డాల్ఫిన్ల దాడిలో గాయపడటం వల్లే మరణించి ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. అవి తీరానికి వచ్చిన వెంటనే వాటికి సాయం చేసి ఉంటే మరికొన్ని డాల్ఫిన్లు ప్రాణాలతో ఉండేవంటూ జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రమాదవశాత్తూ ఎన్నారై టెకీ మృతి
వాషింగ్టన్: అమెరికాలోని సౌత్‌ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ వాసి మృతి చెందారు. భరత్‌రెడ్డి నరహరి (37) అనే టెకీ బాప్తిస్ట్ హెల్త్ సౌత్ ఫ్లొరిడాలో విధులు నిర్వహిస్తుండేవారు. సైక్లిస్ట్ అయిన భరత్‌రెడ్డి డాల్ఫిన్స్ క్యాన్సన్ ఛాలెంజ్ ఈవెంట్ కోసం ఏర్పాటు చేయనున్న పోటీలో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో గత శనివారం నైరుతి మియామి డేడ్‌లో జరిగిన ట్రయథ్లాన్ (సైక్లింగ్, రన్నింగ్, స్విమ్మింగ్) పోటీలో పాల్గొన్నారు. 236 స్ట్రీట్ 87 ఎవెన్యూకు మరికాసేపట్లో చేరుకుంటారనగా లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భరత్‌రెడ్డితో పాటు మరో సైక్లిస్ట్ గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ భరత్‌రెడ్డి మృతిచెందారని బాప్తిస్ట్ ఐటీ విభాగం వెల్లడించింది. ఇప్పటివరకూ ఆయన పలు 5కే రన్, సైక్లింగ్ పోటీల్లో పాల్గొని ఎంతో మందిలో స్ఫూర్తినింపారని టీమ్ హామర్ హెడ్స్ మేనేజ్మెంట్ తెలిపింది. భరత్‌రెడ్డి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భరత్‌రెడ్డి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. టీమ్ హామర్ హెడ్స్‌లో భరత్‌రెడ్డి యాక్టీవ్ సభ్యుడు. మియామి గో రన్ రన్నింగ్ క్లబ్లో ట్రయాథ్లాన్లో శిక్షణ తీసుకున్న ఆయన వచ్చే నెల 10న నిర్వహించనున్న డాల్ఫిన్స్ క్యాన్సర్ ఛాలెంజ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. 2010లో మొదలుపెట్టిన ఆ ఛారిటీ ఈవెంట్లో ఈ ఏడాదికిగానూ 22.5 మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం నిర్వహించిన ఓ సన్నాహక ఈవెంట్లో పాల్గొని భరత్‌రెడ్డి మృతిచెందడం ఇతర సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. భరత్‌రెడ్డి పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కుమారుడు. భరత్‌రెడ్డి మరణవార్తతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. -
ఒడ్డుకు కొట్టుకొచ్చిన 40 డాల్ఫిన్లు
చెన్నై: ఆర్ముగనేరి సమీపంలోని పున్నకాయలో 40 పైగా డాల్ఫిన్లు ఒడ్డుకు చేరటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. తూత్తుకుడి జిల్లా ఆత్తూర్ సమీపంలో ఉన్న పున్నకాయల్ సముద్రతీర జాలర్ల గ్రామం ఉంది. తామరభరణి నది సంగమించే ఈ ప్రాంతంలో సముద్రతీరం నుంచి సముద్రానికి పడవలు సులభంగా వెళ్లే రీతిలో రెండు వేలాడే వంతెనలను (పడవలు వెళ్లేటప్పుడు తెరచుకుంటాయి) నిర్మించారు. సోమవారం రాత్రి ఈ వంతెనల సమీపంలో సుమారు 40 డాల్ఫిన్లు ఒడ్డుకు కొట్టుకువచ్చి ప్రాణాలకు పోరాడుతున్నాయి. వెంటనే ఆ ప్రాంతపు జాలర్లు నాటుపడవల్లో వెళ్లి ఆ డాల్ఫిన్లను చేతులతో పట్టుకుని తాడుతో కట్టి సముద్రంలోకి లాక్కుని వెళ్లి లోతైన ప్రాంతంలో వదిలారు. అయితే అవి మళ్లీ ఒడ్డుకు వచ్చాయి. కొద్ది సేపట్లో నాలుగు డాల్ఫిన్లు మృతి చెందాయి. అప్పుడు వర్షం పడుతుంది. అయినా కాని వర్షాన్ని లెక్క చేయకుండా ఒడ్డుకు చేరుకున్న డాల్ఫిన్లను జాలర్లు సముద్రానికి తీసుకుని వెళ్లి వదిలే పనిలో నిమగ్నలయ్యారు. సముద్రంలో ఏర్పడ్డ మార్పుల కారణంగా డాల్ఫిన్లు లోతు తక్కువ గల సముద్రతీర ప్రాంతంలో ఒడ్డు చేరి ఉండవచ్చునని భావిస్తున్నారు. గత ఏడాది జనవరి నెలలో కూడా ఇదే విధంగా పెద్ద సంఖ్యలో డాల్ఫిన్లు ఒడ్డుకు వచ్చాయి. -
డాల్ఫిన్లు ఆడుకోవడానికి టచ్‌ప్యాడ్!
వాషింగ్టన్: డాల్ఫిన్లు ఆడుకోవడానికి అమెరికా శాస్త్రవేత్తలు నీటి అడుగుభాగంలో ఏర్పాటు చేయడానికి 8 అడుగుల కంప్యూటర్ టచ్‌ప్యాడ్‌ను తయారు చేశారు. హంటర్ కాలేజ్, రాక్ఫెల్లర్ యూనివర్సిటీ వారు దీన్ని రూపొందించారు. వీటి ద్వారా డాల్ఫిన్ల తెలివితేటలను, భావ ప్రసార నైపుణ్యాలను తెలుసుకోవచ్చని భావిస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా డాల్ఫిన్ల కోసమే తయారుచేసిన యాప్‌లు ఉంటాయి. ఇప్పటికే ఇందులో ఉన్న యాప్స్‌కు సంబంధించి డాల్ఫిన్లకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. దీనికి వారు కీబోర్డును కూడా తయారుచేశారు. -
'కాలుష్యంతో డాల్ఫిన్లకు అంధత్వం'
న్యూఢిల్లీ: లోక్‌సభలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చేసిన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. కాలుష్యం కారణంగా గంగానదిలో డాల్ఫిన్లు అంధత్వానికి గురవుతున్నాయని బుధవారం ఆమె పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన వచ్చిన ఒక దరఖాస్తుకు ఆమె సమాధానం ఇస్తూ.. గంగానదిలో డాల్ఫిన్లు చూపు కోల్పోతున్న ప్రమాదం నేపథ్యంలో ఈ అంశంపై విచారణ ప్రారంభమైందని తెలిపారు. అయితే, డాల్ఫిన్లు కాలుష్యంతో చూపు కోల్పోతున్నాయనడానికి, దీని వెనుక ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం లేదని నిపుణులు తెలిపారని చెప్పారు. డాల్ఫిన్లకు అంధత్వం రావడం వెనుక అనేక పరికల్పనలున్నాయని పలువురు నిపుణులు పేర్కొన్నారని ఆమె వివరించారు. అయితే నిపుణుల పేర్లను ఆమె వెల్లడించలేదు. లండన్‌లోని జూలాజికల్ సొసైటీ ఆధ్వర్యంలో వీటి ఉనికిని గుర్తించే కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. -
భూకంపాల్ని డాల్ఫిన్స్ ముందే గ్రహిస్తాయా..?
-
అయ్యో పాపం.....!
-
చాంపియన్స్ లీగ్-20: కోల్‌కతా ఘనవిజయం
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అభిమానులను మరోసారి చాంపియన్స్ లీగ్ కనువిందు చేసింది. సోమవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో డాల్ఫిన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 36 పరుగులతో ఘన విజయం సాధించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన డాల్ఫిన్స్ పూర్తి ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లు నరైన్ మూడు, యూసుఫ్ పఠాన్ రెండు వికెట్లు తీశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన కోల్‌కతా.. రాబిన్ ఊతప్ప (55 బంతుల్లో 85), మనీష్ పాండే (47 బంతుల్లో 76) అజేయ మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. డాల్ఫిన్స్ బౌలర్లు అలెగ్జాండర్, ఫ్రిలింక్ చెరో వికెట్ తీశారు. -
చాంపియన్స్ లీగ్-20: ఊతప్ప ఉతుకుడు.. మనీష్ మెరుపులు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అభిమానులను మరోసారి చాంపియన్స్ లీగ్ కనువిందు చేసింది. సోమవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో డాల్ఫిన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన కోల్‌కతా.. రాబిన్ ఊతప్ప (55 బంతుల్లో 85), మనీష్ పాండే (47 బంతుల్లో 76) అజేయ మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. డాల్ఫిన్స్ బౌలర్లు అలెగ్జాండర్, ఫ్రిలింక్ చెరో వికెట్ తీశారు. -
లాహోర్‌కు తొలి విజయం
బెంగళూరు: ఆరంభంలో తడబడ్డా తర్వాత పుంజుకున్న లాహోర్ లయన్స్... చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో డాల్ఫిన్స్ జట్టుపై విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఉమర్ అక్మల్ (45 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), నజీమ్ (26 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడారు. ఆసిఫ్ రజా (12 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించాడు. డాల్ఫిన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లాహోర్ 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే అక్మల్, నజీమ్‌లు ఐదో వికెట్‌కు 92 పరుగులు జోడించడంతో లాహోర్ గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. ఫ్రిలింక్ 3 వికెట్లు తీశాడు. అనంతరం డాల్ఫిన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫ్రిలింక్ (27 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) వాయు వేగంతో బ్యాటింగ్ చేశాడు. వాన్ విక్ (29 బంతుల్లో 36; 6 ఫోర్లు), వాండియార్ (24 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. 93 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన దశలో ఫ్రిలింక్స్ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. సుబ్రయెన్ (1 నాటౌట్)తో కలిసి పదో వికెట్‌కు అజేయంగా 55 పరుగులు జోడించినా జట్టును గెలిపించలేకపోయాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన డాల్ఫిన్స్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఉమర్ అక్మల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. -
చెన్నై విశ్వరూపం
-
చెన్నై విశ్వరూపం
బెంగళూరు: కొడితే ఫోర్... లేదంటే సిక్సర్... టి20ల ద్వారా అభిమానులు కోరుకునే వినోదం ఇది. చెన్నై జట్టు సోమవారం సరిగ్గా ఇలాంటి వినోదాన్నే అందించింది. డాల్ఫిన్స్‌తో మ్యాచ్‌లో ఏకంగా 16 సిక్సర్లు... 17 ఫోర్లు బాది 20 ఓవర్లలోనే 242 పరుగులు సాధించింది. చాంపియన్స్ లీగ్‌లో అత్యధిక స్కోరు (2013లో ఒటాగో జట్టు కూడా ఇన్నే పరుగులు చేసింది) రికార్డును చెన్నై సమం చేసింది. సురేశ్ రైనా (43 బంతుల్లో 90; 4 ఫోర్లు; 8 సిక్సర్లు), రవీంద్ర జడేజా (14 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు; 3 సిక్సర్లు)ల సంచలన హిట్టింగ్తో సూపర్ కింగ్స్... 54 పరుగుల తేడాతో డాల్ఫిన్స్‌పై నెగ్గింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ధోని సేన 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 242 పరుగులు చేసింది. ఓపెనర్ మెకల్లమ్ (29 బంతుల్లో 49; 5 ఫోర్లు; 3 సిక్సర్లు), డు ప్లెసిస్ (19 బంతుల్లో 30; 3 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. ఈ మ్యాచ్ ద్వారా రైనా టి20ల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఫ్రిలింక్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డాల్ఫిన్స్ 20 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ డెల్పోర్ట్ (9 బంతుల్లో 34; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) విధ్వంసకర ఆటతీరు చూపినా ఫలితం లేకపోయింది. వాన్ విక్ (7 బంతుల్లో 17; 2 ఫోర్లు; 1 సిక్స్), డెల్పోర్ట్ కలిసి తొలి మూడు ఓవర్లలోనే 56 పరుగులు చేయడంతో మ్యాచ్‌పై ఆసక్తి పెరిగినా... చెన్నై బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లతో మ్యాచ్ చేజారకుండా చూశారు. మోహిత్ శర్మకు నాలుగు, బ్రేవో, నెహ్రాలకు రెండేసి వికెట్లు పడ్డాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సురేశ్ రైనాకి దక్కింది. స్కోరు వివరాలు: చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) జోండో (బి) మహరాజ్ 7; మెకల్లమ్ (సి) స్మిత్ (బి) జోండో 49; రైనా (సి) డెల్పోర్ట్ (బి) ఫ్రిలింక్ 90; డు ప్లెసిస్ (సి) వాన్ జార్స్‌వెల్డ్ (బి) అలెగ్జాండర్ 30; ధోని (బి) ఫ్రిలింక్ 0; బ్రేవో (సి) వాన్ జార్స్‌వెల్డ్ (బి) అబోట్ 11; జడేజా నాటౌట్ 40; అశ్విన్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో ఆరు వికెట్లకు) 242. వికెట్ల పతనం: 1-8; 2-99; 3-164; 4-174; 5-190; 6-222. బౌలింగ్: మహరాజ్ 4-0-54-1; అబోట్ 4-0-37-1; అలెగ్జాండర్ 3-0-40-1; ఫ్రిలింక్ 4-0-52-2; ఫెలుక్వాయో 1-0-19-0; జోండో 2-0-19-1; స్మిట్ 2-0-17-0. డాల్ఫిన్స్ ఇన్నింగ్స్: వాన్ విక్ (బి) ఎల్బీడబ్ల్యు అశ్విన్ 17; డెల్పోర్ట్ (బి) మోహిత్ 34; చెట్టి (సి) మోహిత్ (బి) బ్రేవో 37; మహరాజ్ (బి) మోహిత్ 8; వాన్ జార్స్‌వెల్డ్ (సి) స్మిత్ (బి) బ్రేవో 30; జోండో (సి) రైనా (బి) నెహ్రా 9; స్మిట్ (రనౌట్) 0; ఫెలుక్వాయో (బి) మోహిత్ 22; ఫ్రిలింక్ (బి) నె హ్రా 6; అబోట్ (బి) మోహిత్ 5; అలెగ్జాండర్ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 188. వికెట్ల పతనం: 1-34; 2-56; 3-90; 4-115; 5-138; 6-139; 7-139; 8-152; 9-165; 10-188. బౌలింగ్: నెహ్రా 4-0-42-2; అశ్విన్ 4-0-38-1; మోహిత్ 4-0-41-4; జడేజా 3-0-35-0; రైనా 1-0-14-0; బ్రేవో 4-0-17-2. -
చెన్నై సూపర్ విన్
బెంగళూరు: చాంపియన్స్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయం నమోదు చేసింది. సోమవారమిక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 54 పరుగులతో డాల్ఫిన్స్‌పై నెగ్గింది. 243 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన డాల్ఫిన్స్ పూర్తి ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. కాగా డాల్ఫిన్స్ లక్ష్యఛేదనను దీటుగా ఆరంభించింది. డెల్పోర్ట్ (34), చెట్టీ (37), జార్స్‌వెల్డ్ (30) రాణించారు. ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో ఓటమి తప్పలేదు. అంతకుముందు ఫోర్లు, సిక్సర్లతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం హోరెత్తింది. పరుగుల సునామీకి అభిమానులు తడిసిముద్దయ్యారు. సురేష్ రైనా (43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 90) మెరుపు విన్యాసాలతో చెలరేగడంతో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. పూర్తి ఓవర్లలో ఆరు వికెట్లకు 242 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నైతొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డ్వెన్ స్మిత్.. మహారాజ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత చెన్నై బ్యాట్స్‌మెన్ డాల్ఫిన్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. బ్రెండన్ మెకల్లమ్, రైనా దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. దీంతో తొమ్మిదో ఓవర్లోనే స్కోరు 100 పరుగులు దాటింది. రైనా 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మెకల్లమ్ పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. రైనా అదే దూకుడు కొనసాగించగా, అతనికి డూప్లెసిస్ అండగా నిలచాడు. కాగా సెంచరీకి చేరువలో రైనా వెనుదిరగడంతో చెన్నై జోరు కాస్త తగ్గింది. చివర్లో రవీంద్ర జడేజా (14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 నాటౌట్) రెచ్చిపోవడంతో చెన్నై భారీ స్కోరు నమోదు చేసింది. -
2 బంతుల్లో 2 సిక్సర్లు
- పెర్త్‌ను గెలిపించిన మార్ష్ - 6 వికెట్లతో డాల్ఫిన్స్ ఓటమి మొహాలి: పెర్త్ స్కార్చర్స్ విజయలక్ష్యం 165 పరుగులు... గెలుపు కోసం చివరి 6 బంతుల్లో 16 పరుగులు చేయాలి. ఫ్రైలింక్ వేసిన ఆఖరి ఓవర్ మొదటి నాలుగు బంతుల్లో నాలుగు పరుగులే వచ్చాయి. ఇక మిగిలిన 2 బంతుల్లో 12 పరుగులు చేస్తేనే విజయం దక్కుతుంది. సాధారణంగా చివరి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్‌ను గెలిపించిన సందర్భాలు టి20ల్లో చాలా కనిపిస్తాయి. కానీ ఇన్నింగ్స్ చివరి 2 బంతులకు సిక్సర్లతో విజయాన్నందించడం విశేషమేనని చెప్పాలి. క్రీజ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ మిచెల్ మార్ష్ దానిని చేసి చూపించాడు. రెండు లో ఫుల్‌టాస్ బంతులను భారీ సిక్సర్లుగా మలిచి డాల్ఫిన్స్‌ను ముంచాడు. ఫలితంగా ఇక్కడి పీసీఏ మైదానంలో శనివారం జరిగిన ఈ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో స్కార్చర్స్ 6 వికెట్ల తేడాతో డాల్ఫిన్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన డాల్ఫిన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఖాయా జోండో (50 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కేశవ్ మహరాజ్ (22 బంతుల్లో 29; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం పెర్త్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసి విజయాన్నందుకుంది. సిమన్స్ (36 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వైట్మన్ (32 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్ష్ (26 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.