
'కాలుష్యంతో డాల్ఫిన్లకు అంధత్వం'
న్యూఢిల్లీ: లోక్‌సభలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చేసిన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. కాలుష్యం కారణంగా గంగానదిలో డాల్ఫిన్లు అంధత్వానికి గురవుతున్నాయని బుధవారం ఆమె పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన వచ్చిన ఒక దరఖాస్తుకు ఆమె సమాధానం ఇస్తూ.. గంగానదిలో డాల్ఫిన్లు చూపు కోల్పోతున్న ప్రమాదం నేపథ్యంలో ఈ అంశంపై విచారణ ప్రారంభమైందని తెలిపారు.
అయితే, డాల్ఫిన్లు కాలుష్యంతో చూపు కోల్పోతున్నాయనడానికి, దీని వెనుక ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం లేదని నిపుణులు తెలిపారని చెప్పారు. డాల్ఫిన్లకు అంధత్వం రావడం వెనుక అనేక పరికల్పనలున్నాయని పలువురు నిపుణులు పేర్కొన్నారని ఆమె వివరించారు. అయితే నిపుణుల పేర్లను ఆమె వెల్లడించలేదు. లండన్‌లోని జూలాజికల్ సొసైటీ ఆధ్వర్యంలో వీటి ఉనికిని గుర్తించే కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు.