
వాషింగ్టన్: అమెరికన్ వ్యోమగాములు సునీతా విలియమ్స్(Sunita Williams), బుచ్ విల్మోర్‌లను సముద్రంలోని డాల్ఫిన్లు స్వాగతించాయి. దాదాపు తొమ్మిది నెలల తర్వాత అంతరిక్షం నుండి భూమికి తిరిగి వచ్చిన ఈ వ్యోమగాములను చూసి అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి డాల్ఫిన్ల ఆనందం కూడా తోడయ్యింది. పలు ఇబ్బందుల అనంతరం అంతరిక్ష నౌక చివరకు వ్యోమగాములతో పాటు ఫ్లోరిడా బీచ్‌లో దిగింది.
There are a bunch of dolphins swimming around SpaceX's Dragon capsule. They want to say hi to the Astronauts too! lol pic.twitter.com/sE9bVhgIi1
— Sawyer Merritt (@SawyerMerritt) March 18, 2025
భారత కాలమానం ప్రకారం ఈ ల్యాండింగ్(Landing) బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఈ సమయంలో నాసా బృందం వ్యోమగాములను స్వాగతించడానికి చిన్నపాటి షిప్‌లతో సిద్ధమయ్యింది. ఈ సమయంలో సముద్రంలో అరుదైన దృశ్యం కనిపించింది. సునీతా విలియమ్స్ ఉన్న క్యాప్స్యూల్‌ను పలు డాల్ఫిన్లు చుట్టుముట్టాయి. డాల్ఫిన్ల గుంపు అంతరిక్ష నౌక చుట్టూ ఈదుతూ కనిపించింది. సునీతా విలియమ్స్‌తో పాటు ఆమె సహచరులను క్యాప్సూల్ నుండి బయటకు తీసుకువస్తున్నప్పుడు పలు డాల్ఫిన్లు క్యాప్సూల్ చుట్టూ గుమిగూడాయి.
దీనికి సంబంధించిన వీడియోను నాసా సిబ్బంది సాయర్ మెరిట్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ చుట్టూ డాల్ఫిన్లు ఈదుతున్నాయి’ అని రాశారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కాగా రికవరీ నౌక వ్యోమగాములను క్యాప్సూల్ నుండి బయటకు తీసుకువచ్చాక, వారిని 45 రోజుల పునరావాస కార్యక్రమం కోసం హ్యూస్టన్‌లోని ఒక కేంద్రానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment