
స్పేస్ ట్రావెల్ టాస్క్ ముందు పురుషులకే పరిమితమై దాన్ని ‘మ్యాన్ మిషన్’గా వ్యవహరించేవాళ్లు. కానీ ఆస్ట్రనాట్స్‌కిచ్చే ట్రైనింగ్‌లో ఆడ, మగ అనే తేడా ఉండదు. ఇద్దరూ ఒకేరకమైన శక్తితో ఉంటారు. ఇంకా చెప్పాలంటే శారీరకంగా, మానసికంగా పురుషుల కన్నా స్త్రీలే బెటర్. అందుకే ఇప్పుడు దాన్ని ‘హ్యుమన్ మిషన్’ పేరుతో జెండర్ న్యూట్రల్ (Gender Neutral) చేశారు. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్లనే స్పేస్‌కి సెలెక్ట్ చేసుకుంటారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ దగ్గర్నుంచి అక్కడ పరిస్థితి, అనుకోని అవాంతరాలను ఎదుర్కోవడం వరకు ట్రైనింగ్ చాలా టఫ్‌గా ఉంటుంది.
ఆస్ట్రనాట్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. అందుకే ఒకవేళ మిషన్ ఫెయిలైతే స్పేస్ షిప్ (Space Ship) నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా శిక్షణ ఇస్తారు. ఇదీ వాళ్ల మానసిక, శారీరక దారుఢ్యం మీదే ఆధారపడి ఉంటుంది. వీటన్నిటిలో సునీతా విలియమ్స్ (Sunita Williams) పర్‌ఫెక్ట్. కాబట్టే స్పేస్ స్టేషన్‌కి వెళ్లారు. అయితే ఎనిమిది రోజులు మాత్రమే ఉంటామనే మైండ్‌సెట్‌తో వెళ్లిన వాళ్లు తొమ్మిది నెలలు ఉండిపోవాల్సి వచ్చింది. అలా స్పేస్ స్టేషన్‌లో చిక్కుకుపోయిన విలియమ్స్, మరో ఆస్ట్రోనాట్‌ను నాసా వాళ్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తునే ఉన్నారు.
ఆహారం దగ్గర్నుంచి వాళ్ల అవసరాలన్నీ కనిపెట్టుకున్నారు. ఫిజికల్ ఫిట్‌నెస్‌కి సంబంధించి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందుకే వాళ్లక్కడ క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజెస్ చేశారు. వాళ్లు తమ హెల్త్ కండిషన్స్‌ను చెక్ చేసుకునేందుకు కావల్సిన సౌకర్యాలన్నీ స్పేస్ స్టేషన్‌లో ఉన్నాయి. నాసా డాక్టర్స్ సలహాలు, సూచనల మేరకు వాళ్లు తమ హెల్త్ కండిషన్స్‌ను చెక్ చేసుకుంటూ ఉన్నారు. మూడు నెలలకోసారి ఫుడ్, మెడిసిన్స్‌ను స్పేస్ స్టేషన్‌కి పంపారు. వాళ్ల మానసిక స్థితిని కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ మనోస్థైర్యం కోల్పోకుండా చూసుకున్నారు.
స్విమ్మింగ్ పూల్... లిక్విడ్ ఫుడ్
తొమ్మిది నెలలు భారరహిత స్థితికి అలవాటు పడిన వాళ్లు ఇప్పుడు ఒక్కసారిగా భూమి మీది వాతావరణంలో ఇమడ లేరు. ఎముకలు, కండరాలు బలహీనమైపోతాయి. ఫ్యాట్ కనీస స్థాయికి తగ్గిపోయుంటుంది. భూమి మీదకు రాగానే ముందు వాళ్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎముకలు, కండరాల పటుత్వానికి మెడిసిన్స్ ఇస్తారు. ఇన్నాళ్లూ భారరహిత స్థితిలో ఉండటం వల్ల వాళ్లు నిలబడలేరు.. కూర్చోలేరు.. పడుకోలేరు. అలా ఫ్లోటింగ్ స్థితిలోనే ఉండిపోతారు.
అందుకే వాళ్లకు బెల్ట్ లాంటిది పెట్టి.. కూర్చోబెడతారు. దాని సాయంతోనే పడుకోబెడతారు. నిలబడ్డానికీ అలాంటి సపోర్ట్‌నే ఏర్పాటు చేస్తారు. ఈ వాతావరణానికి వీలైనంత త్వరగా అలవాటుపడేందుకు ఎక్కువ సమయం వాళ్లను స్విమ్మింగ్ పూల్‌లో ఉంచుతారు. నీళ్లలో తేలుతూ స్పేస్‌లో ఉన్నట్టే ఉంటుంది కాబట్టి.. వాళ్లను వాళ్లు సంభాళించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దాదాపు మూడు నెలల వరకు ఇలాంటి ప్రాసెసే ఉంటుంది. దాన్నుంచి వాళ్లు నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తారు. ఆహారం విషయంలోనూ అంతే! కొన్నాళ్లపాటు స్పేస్‌లో తీసుకున్నట్టే సెమీ లిక్విడ్ ఫామ్‌లోనే ఫుడ్ ఇస్తారు.
– డాక్టర్ ఎస్వీ సుబ్బారావు, సీనియర్ సైంటిస్ట్, అసోసియేట్ డైరెక్టర్, రేంజ్ ఆపరేషన్, ఇస్రో
భూమికి తిరిగి వచ్చిన తరువాత... రివర్స్!
సునీతా విలియమ్స్‌కు ఇష్టమైన సినిమా... టామ్ క్రూజ్ ‘టాప్ గన్’. ‘టాప్ గన్’ కిక్‌తో జెట్‌లు నడపాలనుకుంది. హెలికాప్టర్ నడపాలనుకుంది. ‘టెస్ట్ పైలట్ స్కూల్’కు హాజరై, ఆస్ట్రోనాట్స్‌తో మాట్లాడిన తరువాత తన మీద తనకు నమ్మకం వచ్చింది.
చదవండి: గురుత్వాకర్షణ లేని కురుల అందం
ఒకానొక సందర్భంలో అంతరిక్ష వాతావరణంలో ఉన్నవారిపై చోటు చేసుకునే ఆశ్చర్యాల గురించి ఇలా చెప్పింది... ‘అంతరిక్షంలో శారీరక మార్పులు ఆసక్తికరంగా ఉంటాయి. నా జుట్టు, గోర్లు వేగంగా పెరగడాన్ని గమనించాను. ముఖంపై కొన్ని మడతలు తాత్కాలికంగా తొలగిపోతాయి. వెన్నెముకకు సంబంధించి కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే భూమికి తిరిగి వచ్చిన తరువాత ఈ మార్పులు రివర్స్ అవుతాయి. వెన్ను కొద్దిగా నొప్పిగా ఉంటుంది’ అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment