
ఋతుక్రమం లేదా పీరియడ్స్‌ను భరించడం, ఆ మూడు రోజులు జాగ్రత్తగా ఉండటం సాధారణ మహిళలు లేదా అమ్మాయిలకే చాలా కష్టం. ముఖ్యంగా ఉద్యోగినులు, విద్యార్థినులకు ఇది ఇంకా కష్టం. మూడు రోజుల శారీరక బాధలతోపాటు, డ్రెస్‌కు ఏదైనా మరకలు ఉన్నాయా చూడవే బాబూ.. అని తోటి ఫ్రెండ్స్‌ను అడగడం మొదలు, ప్యాడ్ మార్చుకోవడానికి రిమైండర్‌లను సెట్ చేసుకోవడం, పగలు వినియోగానికి ఒక రకం, రాత్రి వినియోగానికి మరో రకం ప్యాడ్స్‌ను ఎంచుకోవడం, మంచంపైన దుప్పటికి మరకలైతే, అమ్మ తిడుతుందేమోనన్న భయం వరకు ఇలా చాలానే ఉంటాయి. ఆకాశమే హద్దు అంటూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు అంతరిక్షంలో కూడా అడుగు పెట్టారు. మరి అంతరిక్షంలో మహిళా వ్యోమగాములకు పీరియడ్స్ వస్తాయా? వస్తే ఎలా మేనేజ్ చేస్తారు?
అంతరిక్షంలో చిక్కుకున్న నాసా( NASA) వ్యోమగామి సునీతా విలియం (Sunita Williams) బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు రానున్నారు. కేవలం ఎనిమిది రోజులు అనుకున్న ఈ ప్రయాణం తొమ్మిది నెలలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మరి సునీతా విలియమ్స్ లాంటి మహిళలు అంతరిక్షంలో ఉన్నప్పుడు పీరియడ్స్‌ను ఎలా మేనేజ్ చేశారు అనేది సందేహం కలుగక మానదు. గ్లాస్ సీలింగ్స్‌ను బ్రేక్ చేస్తూ మహిళలు అంతరిక్షం వెళ్లాలనుకున్నపుడు వచ్చిన మొదటి సవాల్ ఇదే.హార్మోన్ల మార్పులు, సూక్ష్మ గురుత్వాకర్షణ (Microgravity) ప్రభావాలు చర్చకు వచ్చాయి. మార్గదర్శక మహిళా వ్యోమగాములలో ఒకరైన రియా సెడాన్, అసలు ఇది సమస్యే కాదని వాదించారు. అలా మహిళలు సాహసయాత్రకు పూనుకున్నారు.
Astronaut Periods: అలా అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొదటి మహిళ వాలెంటినా తెరేష్కోవా. ఇది 1963లో జరిగింది. అప్పటి నుండి మరో 99 మంది ఆమె అడుగుజాడలనుఅనుసరించి అతరిక్షంలోకి ప్రయాణించారు. అయితే పీరియడ్స్ విషయంలో రేకెత్తిన అన్ని ఆందోళనలకు, ఊహాగానాలకు విరుద్ధంగా మహిళా వ్యోమగాములకు అంతరిక్షంలో కూడా సాధారణంగానే పీరియడ్స్ వస్తాయి. ఋతుస్రావం భూమిపై ఉన్నట్లే సాధారణంగా పనిచేస్తుంది. వారు భూమిపై ఉన్న మాదిరిగానే ప్రామాణిక శానిటరీ, పరిశుభ్రత ఉత్పత్తులను ఉపయోగిస్తారు , అవి అంతరిక్షంలో ప్రభావవంతంగా ఉంటాయి కూడా.
చదవండి : ఇన్నాళ్ళ బాధలు చాలు, రూ.5 కోట్ల సంగతి తేల్చండి : బాంబే హైకోర్టు
మహిళల అంతరిక్ష యాత్రలో ఉన్నపుడు పీరియడ్స్ సమస్యలొస్తాయని రక్తం గాల్లో తేలుతుందని, హార్మోన్ల సమస్య వస్తుందని భయపడ్డారు. స్త్రీలు ఋతుస్రావం కావాలని ఆపితే తప్ప, ఈ ప్రక్రియ అంతరిక్షంలో సాధారణంగా జరుగుతుందని వాస్తవ అనుభవాల ద్వారా తేలింది. అయితే పీరియడ్స్ వాయిదా వేసుకోవాలా? వద్దా? అనే నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైనది. మహిళా వ్యోమగాములు తమ అంతరిక్ష యాత్ర కొనసాగినన్నాళ్లూ నెలసరిని వాయిదా వేసుకుంటారు. పీరియడ్స్ రాకుండా హార్మోన్ల మాత్రలు(Birth control pills) వంటి గర్భనిరోధకాల (Hormonal contraceptives)ను ఎంచుకుంటారు. అయితే ఈ తరహా మాత్రల వల్ల మహిళల ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని సైంటిస్టుల మాట. పైగా అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు స్త్రీపురుషుల్లో కండరాల సామర్థ్యం తగ్గిపోతుందని, ఇలాంటప్పుడు గర్భనిరోధక మాత్రల్లోని ఈస్ట్రోజెన్ కండర సామర్థ్యాన్ని కోల్పోకుండా కాపాడుతుందని అంటున్నారు.
అంతేకాదు ఎక్కువ కాలం అంతరిక్ష ప్రయాణాలకు వీటిని రికమెండ్ చేస్తున్నారు. తద్వారా శానిటరీ ప్యాడ్స్ వాడకం, నీరు ఆదా అవుతాయి. శుభ్రత కూడా సులభవుతుంది. అలా కాని పక్షంలో నెలసరిని ఆపకూడదు అనుకుంటే, భూమిపై ఎలా మేనేజ్ చేస్తారో, అంతరిక్షంలోనూ అలాగే మేనేజ్ చేసుకోవచ్చు. అయితే పరిమితంగా లభించే నీరు, తక్కువ స్టోరేజీ స్పేస్ కారణంగా వ్యోమగాములు వ్యర్థాల తొలగింపు, పరిశుభ్రత విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
సలాం మీకు!
అయితే పీరియడ్స్ నిర్వహణలో మహిళా వ్యోమగాముల సమస్యలు అన్నీ ఇన్నీ కావు. శ్యానిటరీ ఉత్పత్తుల అదనపు భారం, అలాగే భార రహిత స్థితిలో శ్యానిటరీ ఉత్పత్తులు మార్చుకోవడం అతి పెద్ద సవాలు అనడంలో ఎలాంటి సందేహంలేదు. దీనికి తోడు మూత్రాన్నే రీసైకిల్ చేసుకొని తాగే పరిస్థితులున్న రోదసిలో నీటి కొరత ఎంత సమస్యో ఊహించుకోవచ్చు. ఇలాంటి ఎన్నో సవాళ్లను అధిగమించి అంతరిక్షంలోకి అడుగుపెట్టి, ఎన్నో విజయవంతమైన ప్రయోగాలకు, పరిశోధనలకు మూలమవుతున్న మహిళా వ్యోమగాములకు సలాం!
ఇదీ చదవండి: 60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్
Comments
Please login to add a commentAdd a comment