Space science
-
భూమి మీదకు రాగానే.. స్విమ్మింగ్ పూల్‌లోనే ఎక్కువ సమయం ఎందుకు?
స్పేస్ ట్రావెల్ టాస్క్ ముందు పురుషులకే పరిమితమై దాన్ని ‘మ్యాన్ మిషన్’గా వ్యవహరించేవాళ్లు. కానీ ఆస్ట్రనాట్స్కిచ్చే ట్రైనింగ్‌లో ఆడ, మగ అనే తేడా ఉండదు. ఇద్దరూ ఒకేరకమైన శక్తితో ఉంటారు. ఇంకా చెప్పాలంటే శారీరకంగా, మానసికంగా పురుషుల కన్నా స్త్రీలే బెటర్. అందుకే ఇప్పుడు దాన్ని ‘హ్యుమన్ మిషన్’ పేరుతో జెండర్ న్యూట్రల్ (Gender Neutral) చేశారు. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్లనే స్పేస్‌కి సెలెక్ట్ చేసుకుంటారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ దగ్గర్నుంచి అక్కడ పరిస్థితి, అనుకోని అవాంతరాలను ఎదుర్కోవడం వరకు ట్రైనింగ్ చాలా టఫ్‌గా ఉంటుంది.ఆస్ట్రనాట్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. అందుకే ఒకవేళ మిషన్ ఫెయిలైతే స్పేస్ షిప్ (Space Ship) నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా శిక్షణ ఇస్తారు. ఇదీ వాళ్ల మానసిక, శారీరక దారుఢ్యం మీదే ఆధారపడి ఉంటుంది. వీటన్నిటిలో సునీతా విలియమ్స్ (Sunita Williams) పర్ఫెక్ట్. కాబట్టే స్పేస్ స్టేషన్‌కి వెళ్లారు. అయితే ఎనిమిది రోజులు మాత్రమే ఉంటామనే మైండ్‌సెట్‌తో వెళ్లిన వాళ్లు తొమ్మిది నెలలు ఉండిపోవాల్సి వచ్చింది. అలా స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన విలియమ్స్, మరో ఆస్ట్రోనాట్‌ను నాసా వాళ్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తునే ఉన్నారు.ఆహారం దగ్గర్నుంచి వాళ్ల అవసరాలన్నీ కనిపెట్టుకున్నారు. ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందుకే వాళ్లక్కడ క్రమం తప్పకుండా ఎక్సర్సైజెస్ చేశారు. వాళ్లు తమ హెల్త్ కండిషన్స్‌ను చెక్ చేసుకునేందుకు కావల్సిన సౌకర్యాలన్నీ స్పేస్ స్టేషన్లో ఉన్నాయి. నాసా డాక్టర్స్ సలహాలు, సూచనల మేరకు వాళ్లు తమ హెల్త్ కండిషన్స్‌ను చెక్ చేసుకుంటూ ఉన్నారు. మూడు నెలలకోసారి ఫుడ్, మెడిసిన్స్‌ను స్పేస్ స్టేషన్‌కి పంపారు. వాళ్ల మానసిక స్థితిని కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ మనోస్థైర్యం కోల్పోకుండా చూసుకున్నారు.స్విమ్మింగ్ పూల్... లిక్విడ్ ఫుడ్తొమ్మిది నెలలు భారరహిత స్థితికి అలవాటు పడిన వాళ్లు ఇప్పుడు ఒక్కసారిగా భూమి మీది వాతావరణంలో ఇమడ లేరు. ఎముకలు, కండరాలు బలహీనమైపోతాయి. ఫ్యాట్ కనీస స్థాయికి తగ్గిపోయుంటుంది. భూమి మీదకు రాగానే ముందు వాళ్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎముకలు, కండరాల పటుత్వానికి మెడిసిన్స్ ఇస్తారు. ఇన్నాళ్లూ భారరహిత స్థితిలో ఉండటం వల్ల వాళ్లు నిలబడలేరు.. కూర్చోలేరు.. పడుకోలేరు. అలా ఫ్లోటింగ్ స్థితిలోనే ఉండిపోతారు.అందుకే వాళ్లకు బెల్ట్ లాంటిది పెట్టి.. కూర్చోబెడతారు. దాని సాయంతోనే పడుకోబెడతారు. నిలబడ్డానికీ అలాంటి సపోర్ట్‌నే ఏర్పాటు చేస్తారు. ఈ వాతావరణానికి వీలైనంత త్వరగా అలవాటుపడేందుకు ఎక్కువ సమయం వాళ్లను స్విమ్మింగ్ పూల్‌లో ఉంచుతారు. నీళ్లలో తేలుతూ స్పేస్‌లో ఉన్నట్టే ఉంటుంది కాబట్టి.. వాళ్లను వాళ్లు సంభాళించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దాదాపు మూడు నెలల వరకు ఇలాంటి ప్రాసెసే ఉంటుంది. దాన్నుంచి వాళ్లు నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తారు. ఆహారం విషయంలోనూ అంతే! కొన్నాళ్లపాటు స్పేస్‌లో తీసుకున్నట్టే సెమీ లిక్విడ్ ఫామ్‌లోనే ఫుడ్ ఇస్తారు. – డాక్టర్ ఎస్వీ సుబ్బారావు, సీనియర్ సైంటిస్ట్, అసోసియేట్ డైరెక్టర్, రేంజ్ ఆపరేషన్, ఇస్రోభూమికి తిరిగి వచ్చిన తరువాత... రివర్స్!సునీతా విలియమ్స్‌కు ఇష్టమైన సినిమా... టామ్ క్రూజ్ ‘టాప్ గన్’. ‘టాప్ గన్’ కిక్‌తో జెట్లు నడపాలనుకుంది. హెలికాప్టర్ నడపాలనుకుంది. ‘టెస్ట్ పైలట్ స్కూల్’కు హాజరై, ఆస్ట్రోనాట్స్‌తో మాట్లాడిన తరువాత తన మీద తనకు నమ్మకం వచ్చింది. చదవండి: గురుత్వాకర్షణ లేని కురుల అందంఒకానొక సందర్భంలో అంతరిక్ష వాతావరణంలో ఉన్నవారిపై చోటు చేసుకునే ఆశ్చర్యాల గురించి ఇలా చెప్పింది... ‘అంతరిక్షంలో శారీరక మార్పులు ఆసక్తికరంగా ఉంటాయి. నా జుట్టు, గోర్లు వేగంగా పెరగడాన్ని గమనించాను. ముఖంపై కొన్ని మడతలు తాత్కాలికంగా తొలగిపోతాయి. వెన్నెముకకు సంబంధించి కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే భూమికి తిరిగి వచ్చిన తరువాత ఈ మార్పులు రివర్స్ అవుతాయి. వెన్ను కొద్దిగా నొప్పిగా ఉంటుంది’ అని పేర్కొంది. -
2023 హాటెస్ట్ వేసవి
2023లో ఎండలు అక్షరాలా మండిపోయా యి. ఎంతగా అంటే, మానవ చరిత్రలో రికార్డయిన అత్యంత హెచ్చు ఉష్ణోగ్రతలు ఈ ఎండాకాలంలోనే నమోదయ్యాయి. ఈ ఏడాదే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రికార్డులు బద్దలయ్యేంతటి వడ గాడ్పులు, వాటి అనంతర పరిణామాలు ఇందుకు మరింతగా దోహదం చేశాయి. కొన్ని దశాబ్దాలుగా భూగోళం అంతటా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్న పరిణామానికి ఇది ప్రమాదకరమైన కొనసాగింపేనని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు... 2023 వేసవి 1880లో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ వివరాలు నమోదు చేయడం మొదలు పెట్టిన నాటినుంచి అత్యంత వేడిమితో కూడినదిగా రికార్డు సృష్టించింది. ఈ ఆందోళనకర గణాంకాలను న్యూయార్క్‌లోని నాసాకు చెందిన గొడార్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ (జీఐఎస్ఎస్) వెల్లడించింది. ‘ఇప్పటికైనా మేలుకుని గ్లోబల్ వారి్మంగ్‌కు, ముఖ్యంగా విచ్చలవిడిగా సాగిస్తున్న పర్యావరణ విధ్వంసానికి అడ్డుకట్ట వేయడం ప్రపంచ దేశాల ముందున్న తక్షణ కర్తవ్యం’ అని పర్యావరణ ప్రియులు, శాస్త్రవేత్తలు∙ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పులి మీద పుట్రలా... ఈ వేసవిలో ఎండలు గత రికార్డులన్నింటిన్నీ బద్దలు కొట్టడం వడ గాడ్పుల పాత్ర చాలా ఎక్కువే. ఈ ఏడాది ప్రపంచంలో చాలా ప్రాంతాలను అవి తీవ్రంగా వణికించాయి... ► ఇటు అమెరికా నుంచి అటు జపాన్ దాకా, యూరప్ నుంచి దక్షిణ అమెరికా ఖండం దాకా కానీ వినీ ఎరగని స్థాయిలో వేడి గాలులు అతలాకుతలం చేసి వదిలాయి. ► ఇటలీ, గ్రీస్ తో పాటు పలు మధ్య యూరప్ దేశాల్లో విపరీతమైన వర్షపాతానికి కూడా ఈ గాలులు కారణమయ్యాయి. ► ఈ వడ గాడ్పుల దుష్పరిణామాలను ఏదో ఒక రూపంలో ప్రపంచమంతా చవిచూసింది. ఇవీ రికార్డులు... ఈ ఏడాది ఎండలు అన్ని రికార్డులనూ బద్దలు కొట్టి పర్యావరణ ప్రియుల ఆందోళనలను మరింతగా పెంచాయి. ► ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్ట్ ఉమ్మడి ఉష్ణోగ్రతలు నాసా రికార్డుల్లోని గత అన్ని గణాంకాల కంటే 0.23 డిగ్రీ సెంటిగ్రెడ్ ఎక్కువగా నమోదయ్యాయి. ► అదే 1951–1980 మధ్య అన్నీ వేసవి కా సగటు ఉష్ణోగ్రత కంటే ఏకంగా 1.2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎక్కువగా తేలాయి! మేలుకోకుంటే అంతే... గ్రీన్ హౌస్, కర్బన ఉద్గారాలు ఉష్ణోగ్రతల్లో విపరీతమైన పెరుగుదలకు ప్రధాన కారణమని నాసా జెట్ ప్రొపల్షన్ లేబోరేటరీలో క్లైమేట్ సైంటిస్ట్, ఓషనోగ్రఫర్ జోష్ విల్లిస్ అంటున్నారు. ‘ కొన్నేళ్లుగా భూగోళం స్థిరంగా వేడెక్కుతూ వస్తోంది. ప్రధానంగా మనిషి నిర్వాకమే ఈ వాతావరణ అవ్యవçస్థకు దారి తీస్తోంది. సాధారణంగా కూడా ఎల్ నినో ఏర్పడ్డప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం రివాజు’ అని ఆయన అన్నారు. ఎలా నమోదు చేస్తారు? నాసా ఉష్ణోగ్రతల రికార్డు పద్ధతిని జిస్ టెంప్ అని పిలుస్తారు. ► దీనిలో భాగంగా భూ ఉపరితల ఉష్ణోగ్రతలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల వాతావరణ కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు సేకరిస్తారు. ► నౌకలు తదితర మార్గాల ద్వారా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను కూడా సేకరిస్తారు. ► 1951–1980 మధ్య కాలాన్ని సూచికగా తీసుకుని, ఆ 30 ఏళ్ల సగటుతో పోలిస్తే ఏటా ఉష్ణోగ్రతల తీరుతెన్నులు ఎలా ఉన్నదీ లెక్కిస్తారు. మరీ విపరీతమైన మార్పులుంటే తక్షణం అన్ని దేశాలనూ అప్రమత్తం చేస్తారు. ‘ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల దు్రష్పభావం మున్ముందు కూడా ప్రపంచం మొత్తం మీదా చెప్పలేనంతగా ఉండనుంది’ – బిల్ నెల్సన్, నాసా అడ్మినిస్ట్రేటర్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో అత్యంత హెచ్చుదల నమోదవడమే ఈసారి కనీ వినీ ఎరుగని ఎండలకు ప్రధాన కారణం. – జోష్ విల్లిస్, క్లైమేట్ సైంటిస్ట్, ఓషనోగ్రఫర్, నాసా జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
సౌర వలయాలు
ఫొటోల్లో కన్పిస్తున్నది సూర్యుని చుట్టూ ఏర్పడ్డ వెలుతురు వలయం (సన్ హాలో). రెండో ఫొటోలోది భూమ్మీద నుంచి కన్పిస్తున్నది కాగా, మొదటి ఫొటోలోనిదేమో అంగారకునిపై నుంచి కన్పించిన సన్ హాలో. అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను అన్వేషించే క్రమంలో పెర్సెవరెన్స్ రోవర్ ఈ అరుదైన దృగ్విషయాన్ని గత డిసెంబర్లో అనుకోకుండా క్లిక్‌మనిపించింది. 2021 డిసెంబర్ 15న వాటిని నాసాకు పంపింది. సన్ హాలో భూమి పై నుంచి తరచూ కనిపిస్తూనే ఉంటుంది గానీ అంగారకునిపై నుంచి కంటబడటం ఇదే తొలిసారని స్పేస్ సైన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్లానెటరీ సైంటిస్టు మార్క్ లేమన్ చెప్పారు. 2020లో నాసా ఈ రోవర్‌ను అంగారకునిపైకి పంపించడం తెలిసిందే. ఏమిటీ సన్ హాలో...? మేఘాల్లో అసంఖ్యాకమైన సూక్ష్మ మంచు స్ఫటికాలుంటాయి. కాంతి వాటి గుండా సాగే క్రమంలో అప్పడప్పుడూ విడిపోవడంతో పాటు వక్రీభవనం కూడా చెందుతుంటుంది. ఫలితంగా ఒక్కోసారి ఇంద్రధనుస్సును తలపించే కాంతి వలయాలు ఏర్పడతాయి. నిర్దిష్ట కోణం నుంచి చూసినప్పుడు ఇవి వృత్తాకారంలో కనువిందు చేస్తాయి. వాటిని సన్ హాలోగా పిలుస్తారు. ఇలా భూమ్మీది నుంచి కన్పించే వలయాలు సాధారణంగా 22 డిగ్రీల కోణంలో ఏర్పడేవి అయుంటాయని అమెరికాలోని ఇల్లినాయీ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. అయితే భూమితో పోలిస్తే అంగారకునిపై నీటి శాతం అత్యల్పం. అక్కడ అత్యధికంగా ఉండేది కార్బన్ డయాక్సైడే. కాబట్టి పెర్సెవరెన్స్ రోవర్ అందించిన ఫొటోలు నిజంగా సన్ హాలోకు సంబంధించినవేనా అని శాస్త్రవేత్తలు మీమాంసలో పడ్డారు. బహుశా రోవర్ తాలూకు కెమెరా కోణం వల్ల అలాంటి వెలుతురు వలయం ఏర్పడి ఉండొచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. అయితే చివరికి ఇది దుమ్మూ ధూళి వల్ల ఏర్పడ్డది కాదని, సన్ హాలోయేనని తేల్చారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
మీరు స్టూడెంట్స్‌ని కలిస్తే బాగుంటుంది
ఇంఫాల్: విశ్వంపై జరుగుతున్నపరిశోధనల్లో భారత శాస్త్రవేత్తల కృషి ఎనలేనిదని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. దేశం సైన్స్ రంగంలో మరిన్ని విజయాల్ని సాధించాలంటే ప్రతి శాస్త్రవేత్త విద్యార్థులతో తమ అనుభవాల్ని పంచుకోవాలని కోరారు. మణిపూర్ యూనివర్సిటీలో 5 రోజులపాటు జరగనున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వందేళ్లలో ఈశాన్య భారతంలో సైన్స్ కాంగ్రెస్ జరగడం ఇది రెండోసారి అన్నారు. ‘9 నుంచి 11వ తరగతి విద్యార్థులతో ప్రతి సైంటిస్ట్ ఏడాదికి 100 గంటల చొప్పున వారి విజ్ఞానయాత్రా విశేషాల్ని పంచుకోవాల’ని మోదీ ఆకాంక్షించారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ 2030 నాటికి అంతర్జాతీయంగా క్షయ మహమ్మారిని రూపుమాపాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుందని, అయితే, అంతకంటే ముందే భారత్‌లో 2025 నాటికి క్షయను పూర్తిగా నిర్మూలిస్తామని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు పోషకాహార లోపం, మలేరియా, మెదపువాపు వంటి వ్యాధుల నివారణకు తోడ్పాటు అందించాలని కోరారు. -
అంతరిక్ష విజ్ఞానంపై దృష్టిసారించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులు దృష్టి సారించాలని పాఠశాల విద్య ఆర్జేడీ పి.పార్వతి పేర్కొన్నారు. స్పేస్ క్లబ్ ఆఫ్ విజయ ఎడ్యుకేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 30న అంతరిక్ష విజ్ఞానంపై రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న పోటీ పరీక్షకు సంబంధించిన పోస్టర్‌ను పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షాభవన్‌లో శుక్రవారం విడుదల చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్జేడీ పార్వతి మాట్లాడుతూ దేశ ప్రగతిలో భాగస్వాములై ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాలనుకునేవారికి అంతరిక్ష పరిశోధనా రంగం ప్రధానమైనదన్నారు. ప్రతి విద్యార్థి పోటీ పరీక్షలో పాల్గొని ప్రతిభ చూపాలని సూచించారు. మన దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్ష పరిశోధన, శాటిలైట్ ప్రయోగాల్లో ఎన్నో విజయాలను నమోదు చేశారని పేర్కొన్నారు. సంస్థ కార్యదర్శి జి.శాంతమూర్తి మాట్లాడుతూ అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంపొందించి విద్యార్థుల్లోని క్రియాశీల ఆలోచనలు, సృజనాత్మక భావాలు వెలికితీయాలనేది ఈ పోటీ పరీక్ష ఉద్దేశమని తెలిపారు. 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ఈనెల 30న నిర్వహించే పోటీ పరీక్షకు ఆసక్తి గల కళాశాలస్థాయి విద్యార్థులు హాజరుకావచ్చని తెలిపారు. వివరాలకు సెల్ నం: 94924 64329, 73961 98709 లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎం అండ్ ఎం షోరూమ్ ఎండీ సాధిక్, పర్యావరణ విద్యావేత్త డి.తిరుపతిరెడ్డి, విశ్రాంత డీఈవో ఫ్రాంక్లిన్, సువర్ణరాజు, కోస్టల్ కేర్ ఎండీ డాక్టర్ జాన్‌బాబు, సలీంబాబు తదితరులు పాల్గొన్నారు.