
ప్రధాని నరేంద్ర మోదీ
ఇంఫాల్: విశ్వంపై జరుగుతున్నపరిశోధనల్లో భారత శాస్త్రవేత్తల కృషి ఎనలేనిదని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. దేశం సైన్స్ రంగంలో మరిన్ని విజయాల్ని సాధించాలంటే ప్రతి శాస్త్రవేత్త విద్యార్థులతో తమ అనుభవాల్ని పంచుకోవాలని కోరారు. మణిపూర్ యూనివర్సిటీలో 5 రోజులపాటు జరగనున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వందేళ్లలో ఈశాన్య భారతంలో సైన్స్ కాంగ్రెస్ జరగడం ఇది రెండోసారి అన్నారు. ‘9 నుంచి 11వ తరగతి విద్యార్థులతో ప్రతి సైంటిస్ట్ ఏడాదికి 100 గంటల చొప్పున వారి విజ్ఞానయాత్రా విశేషాల్ని పంచుకోవాల’ని మోదీ ఆకాంక్షించారు.
ప్రపంచ ఆరోగ్యసంస్థ 2030 నాటికి అంతర్జాతీయంగా క్షయ మహమ్మారిని రూపుమాపాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుందని, అయితే, అంతకంటే ముందే భారత్‌లో 2025 నాటికి క్షయను పూర్తిగా నిర్మూలిస్తామని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు పోషకాహార లోపం, మలేరియా, మెదపువాపు వంటి వ్యాధుల నివారణకు తోడ్పాటు అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment