Indian Science Congress
-
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వర్ధిల్లాలి!
ఏటా జనవరిలో జరగాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఈసారి రద్దుకావడం అవాంఛనీయ పరిణామం. భారతీయ శాస్త్ర సమాజం ఒక పొందికతో పురోగమించేందుకు... నూటా పదేళ్లుగా సాగుతున్న ఈ సమావేశాలూ ఒక కారణమంటే అతిశయోక్తి కాదు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది ఓ విభిన్న వేదిక. ప్రత్యేక అంశాలు ఇతివృత్తంగా ఏర్పాటు చేసే శాస్త్రీయ సెమినార్లలో ఆ యా రంగాల్లో నిష్ణాతులైన శాస్త్రవేత్తలు మాత్రమే పాల్గొంటారు. సైన్స్ కాంగ్రెస్‌లో మాత్రం అన్ని రంగాలకు సంబంధించిన చర్చోపచర్చలూ జరుగుతాయి. శాస్త్రవేత్తలతో పాటు సామాన్యులు, డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులు కూడా హాజరవుతారు. ఇవి వారికి ఎంతో స్ఫూర్తిదాయకం. అందుకే ఈ సమావేశాలు నిరాటంకంగా కొనసాగాలి. భారతీయ శాస్త్ర పరిశోధన రంగానికి జనవరి నెల చాలా ముఖ్యమైంది. ఏటా ఈ నెల లోనే ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ సమావేశాలు ఘనంగా జరుగు తాయి. భారత ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ వార్షిక ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది శాస్త్రవేత్తలు, విద్యార్థులు హాజరవుతారు. కానీ ఈ ఏడాది సైన్స్ కాంగ్రెస్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ చివరి నిమిషంలో ఊహించని సమస్యల కారణంగా తప్పుకొంది. సమావేశాలకు ఆర్థిక సాయం అందించే కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గడంతో ఈ ఏడాది కార్య క్రమాలు అనివార్యంగా రద్దయ్యాయి. కీలకమైన అంశాలపై మేధోమధనం జరిపేందుకు, ఆ విషయా లపై ప్రభుత్వాలకు సూచనలిచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఉంటాయి. ఇలాంటి సలహా, సూచనలు గతంలో విధాన రూపకల్పనకు ఉపయోగపడిన ఉదాహరణలు కోకొల్లలు. కేంద్రంలో పర్యావరణ విభాగం (తరువాతి కాలంలో మంత్రిత్వ శాఖ స్థాయికి ఎదిగింది) ఏర్పాటుకూ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్ మెంట్ (ప్రస్తుతం ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ) ఏర్పాటుకూ సైన్స్ కాంగ్రెస్ ఇచ్చిన సలహాలే కారణం. వీటన్నింటికీ మించి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేలా అత్యంత కీలకంగా వ్యవహరించింది. నూరేళ్లకు పైగా అప్రతిహతంగా... 1914లో ఏర్పాటైంది మొదలు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఏటా అప్రతిహతంగా కొనసాగాయి. కోవిడ్ కాలం నాటి పరిస్థితులు ఒక్కటే మినహాయింపు. అప్పట్లో లక్నోలోని కానింగ్ కాలేజ్ అధ్యాపకులు పి.ఎస్. మెక్‌మోహన్ , మద్రాస్‌లోని ప్రెసిడెన్సీ కాలేజీ అధ్యాపకులు జేఎల్ సైమన్ సెన్ మానస పుత్రికగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఆవిర్భవించింది. ‘బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్’ తరహాలో వారు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ప్యూర్, అప్లైడ్ సైన్స్ రంగాలపై అభినివేశం ఉన్న వారందరికీ ఒక వేదిక కల్పించడం దీని ప్రధానోద్దేశం. సమాజానికీ, సైన్స్కూ మధ్య ఒక వారధిగానూ ఈ సంస్థ ఉపయోగపడుతుందని వారు భావించారు. గణిత, ఖగోళ, భౌతిక, రసాయన, భౌగోళిక, జీవ శాస్త్రాల్లో పరిశోధనలు చేస్తున్న వారందరికీ తొలి ఉమ్మడి వేదిక కూడా ఇదే. ఆయా శాస్త్ర రంగాలకు సంబంధించిన కొత్త ఆలోచనలు పంచుకునేందుకు సైన్స్ కాంగ్రెస్ ఎంతో ఉపయోగపడింది. దశాబ్దాల సైన్స్ కాంగ్రెస్ సమావేశాల కారణంగా దేశంలో మరిన్ని శాస్త్రీయ సొసైటీలు, వృత్తినైపుణ్యమున్న సంస్థలు ఏర్పడ్డాయి. ఈ వేదిక ఈ కాలానికి సరిపోయేది కాదనీ, పాతకాలపు పద్ధతులనే కొనసాగిస్తోందనీ కొందరు అంటూంటారు. దేశంలో శాస్త్ర రంగాల అభివృద్ధితో పరుగులు పెడుతూనే, వేర్వేరు దశల్లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎలా ఎదిగిందో విస్మరించేవారే ఇలాంటి విమర్శలు చేయగలరు. ప్రాక్ – పశ్చిమాల మేళవింపు... ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రస్థానంలో తొలిదశ 1914–47 మధ్యకాలమని చెప్పవచ్చు. ఈ సమయంలో భారతీయ, యూరోపియన్ శాస్త్రవేత్తల మధ్య సమాచార వినిమయం ఎక్కువగా ఉండేది. యూరోపియన్ శాస్త్రవేత్తలు అనేకులు భారతీయ పరిశోధన సంస్థల్లో పనిచేస్తూండేవారు. తమ ఆలోచనలు పంచుకునేందుకు వీరికి ఉన్న ఒకే ఒక్క వేదిక ఇండియన్ సైన్స్ కాంగ్రెస్సే. దీనికి సమర్పించే అన్ని పరిశోధన వ్యాసాలనూ సమాకాలీన శాస్త్రవేత్తలు సమీక్షించేవారు. ఈ రకమైన సమీక్ష, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు అన్న భావన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ద్వారానే ఏర్పడ్డాయి. భారత్‌లో సైంటిఫిక్ జర్నల్స్ ప్రచురణ కూడా సైన్స్ కాంగ్రెస్ పుణ్యమే. ప్రఖ్యాత శాస్త్రవేత్త మేఘనాథ్ సాహా ప్రచురించిన ‘సైన్స్ అండ్ కల్చర్’ జర్నల్ దీనికి ప్రబల ఉదాహరణ. దేశంలో స్వాతంత్య్ర ఉద్యమం బాగా నడుస్తున్న 1930లలో జాతీయ నాయకత్వం దేశ భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో దేశాభివృద్ధిలో సైన్స్‌ను వినియోగించడంపై దీని వేదికగా అనేక కొత్త ఆలోచనలపై చర్చ జరిగింది. పారిశ్రామికీకరణ, సమాజం పట్ల సైన్స్ బాధ్యత వంటి ఆలోచనలు పురుడు పోసుకున్నది ఇక్కడే. 1937లో జరిగిన సమావేశాల్లోనే జవహర్లాల్ నెహ్రూ ‘‘ఈ కాలపు స్ఫూర్తి సైన్స్. ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తున్నదీ ఇదే. సైన్స్‌తో మిత్రత్వం నెరిపేవారిది, సమాజ పురోభివృద్ధికి దాని సాయం తీసుకునేవారిదే భవిష్యత్తు’’ అన్న వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947లోనూ ఈ సమావేశాలకు నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్నారు. 1964లో ఆయన మరణించేంత వరకూ కొనసాగారు. ఆ తరువాతి కాలంలో ఈ సమావేశాల్లో దేశ ప్రధాని శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించే సంప్రదాయం మొదలైంది. చాలా సందర్భాల్లో దేశ ప్రధానులు ఈ వేదికపై నుంచి కొన్ని కీలకమైన విధాన నిర్ణయాలను కూడా ప్రకటించేవారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో శాస్త్ర పరిశోధనల పునాదులకు శ్రీకారం చుట్టారు. జాతీయ పరిశోధన సంస్థలు, రీసెర్చ్ కౌన్సిళ్లు పనిచేయడం మొదలైంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కూడా ఒక కొత్త దశలోకి అడుగుపెట్టింది. శాస్త్ర పరిశోధనలపై చర్చలకు వేదికగా నిలుస్తూనే ప్రణాళిక, ఆహార సంక్షోభం, ఆరోగ్యాభివృద్ధి వంటి విస్తృత స్థాయి విధానపరమైన అంశాలపై కూడా చర్చలు మొదలయ్యాయి. యూనివర్సిటీ వ్యవస్థలోని పరిశోధకులతో పాటు జాతీయ పరిశోధన సంస్థలు, శాస్త్ర విభాగాలకు చెందినవారు ఇండి యన్ సైన్స్ కాంగ్రెస్ ప్రక్రియలో ఎక్కువగా పాలుపంచుకోవడం మొదలైంది. ఈ క్రమంలోనే కొన్ని దశాబ్దాల తరువాత ఆయా రంగా లకు ప్రత్యేకమైన సంస్థలు ఏర్పడటంతో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ తన ప్రాభవాన్ని కొంత కోల్పోయిందని చెప్పాలి. ఆయా రంగాల పరి శోధన పత్రాలను మునుపటిలా సైన్స్ కాంగ్రెస్‌లో కాకుండా ప్రత్యేక సంస్థలకు సమర్పించడం మొదలైంది. శాస్త్రీయ దృక్పథం పెరగాలంటే... ప్రస్తుతానికి వద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో, సైన్స్ రంగంలో పోటీని దృష్టిలో పెట్టుకుంటే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ఫలితాలను పంచుకోవాలని అను కోవడం అత్యాశే అవుతుంది. అందుకే ఈ సమావేశాలపై కొంతమంది పెదవి విరుస్తున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం అనండి... ఇంకేమైనా కానివ్వండి... సైన్స్ వ్యతిరేకులు కొందరికి ఈ సైన్స్ కాంగ్రెస్ వేదికగా మారడం ఇటీవలి పరిణామం. ఒక్కటైతే నిజం. యువతరంతో తమ పరిశోధనల వివరాలను పంచుకోవాలని అనుకునే శాస్త్రవేత్తలకు, ఇతర రంగాల్లోని సహోద్యో గులతో ఆలోచనలు పంచుకోవాలనుకునేవారికి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అవసరం ఇప్పటికీ ఉంది. నోబెల్ అవార్డు గ్రహీతలు ఇక్కడ చేసే ప్రసంగాలు ఎంతోమంది యువకులు, విద్యార్థులకు స్ఫూర్తినిస్తా యనడంలో సందేహం లేదు. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచు కుంటే ఈ సమావేశాలు భవిష్యత్తులోనూ కొనసాగాలి. సామాజిక మాధ్యమాల ద్వారా సూడోసైన్స్ కూడా సైన్స్ పేరిట చలామణి అవుతున్న ఈ సమయంలో దేశంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఇలాంటి వేదికలు అనేకం అవసరం. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ 2024 సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు ఆర్థిక సాయాన్ని ఎందుకు నిలిపేసిందో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో పీఎస్‌యూలు
నాగ్‌పూర్: అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) పెద్ద ఎత్తున పాలు పంచుకోనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పవర్ ప్లాంట్ల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ కోసం పీఎస్‌యూలతో జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసుకునేలా న్యూక్లియర్ రంగ నిబంధనలను ప్రభుత్వం సరళీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. 108వ భారతీయ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. అణు విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించే దిశగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐఎల్), ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జాయింట్ వెంచర్లకు వెసులుబాటు కల్పిస్తూ 2015లో అటామిక్ ఎనర్జీ చట్టాన్ని ప్రభుత్వం సవరించిందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా దాదాపు అన్ని అణు విద్యుత్ ప్లాంట్లను నిర్వహించే ఎన్పీసీఐఎల్ మరింతగా కార్యకలాపాలు విస్తరించేలా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ న్యూక్లియర్ ఎనర్జీ, నాల్కో పవర్ కంపెనీ మొదలైన వాటితో జేవీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో అణు విద్యుత్ స్థాపిత సామర్థ్యం 6,780 మెగావాట్లుగా ఉంది. మరో 21 యూనిట్ల ఏర్పాటుతో 2031 నాటికి దీన్ని 15,700 మెగావాట్లకు చేర్చుకోవాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. -
అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో పీఎస్‌యూలు
నాగ్‌పూర్: అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) పెద్ద ఎత్తున పాలు పంచుకోనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పవర్ ప్లాంట్ల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ కోసం పీఎస్‌యూలతో జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసుకునేలా న్యూక్లియర్ రంగ నిబంధనలను ప్రభుత్వం సరళీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. 108వ భారతీయ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. అణు విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించే దిశగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐఎల్), ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జాయింట్ వెంచర్లకు వెసులుబాటు కల్పిస్తూ 2015లో అటామిక్ ఎనర్జీ చట్టాన్ని ప్రభుత్వం సవరించిందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా దాదాపు అన్ని అణు విద్యుత్ ప్లాంట్లను నిర్వహించే ఎన్పీసీఐఎల్ మరింతగా కార్యకలాపాలు విస్తరించేలా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ న్యూక్లియర్ ఎనర్జీ, నాల్కో పవర్ కంపెనీ మొదలైన వాటితో జేవీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో అణు విద్యుత్ స్థాపిత సామర్థ్యం 6,780 మెగావాట్లుగా ఉంది. మరో 21 యూనిట్ల ఏర్పాటుతో 2031 నాటికి దీన్ని 15,700 మెగావాట్లకు చేర్చుకోవాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. (క్లిక్ చేయండి: ముడిచమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు) -
ప్రజల చేత ప్రజల కొరకు అవిష్కరణలు జరగాలి
-
కెరీర్ లక్ష్యంగా విద్యాబోధన
ఈ రోజుల్లో విద్య వ్యాపారమే. ఎవరూ కాదనలేని సత్యం ఇది. ధనార్జనే ధ్యేయంగా సంస్థలు నడిపేవాళ్లు ఎందరో ఉన్నారు. కానీ ఒక్క మినహాయింపుగా కనిపిస్తుంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. దేశం నలుమూలల నుంచి దాదాపు 40 వేల మంది విద్యార్థులు జలంధర్ సమీపంలోని 600 ఎకరాల క్యాంపస్‌లో విద్యను అభ్యసిస్తుండటమూ.. ప్రైవేట్ యూనివర్సిటీగానే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ చేపట్టడమూ.. వర్సిటీ రూటు సపరేటు అనేందుకు తార్కాణాలు. 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను కూడా విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో యూనివర్సిటీ కులపతి అశోక్ మిట్టల్‌తో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూ. ప్రశ్న: ఎల్పీయూలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులే 20 శాతం వరకూ ఉన్నారు కదా.. మరింత మందిని ఆకర్షించేందుకు దక్షిణాదిలో రెండో క్యాంపస్ ఏర్పాటు చేయవచ్చు కదా? జవాబు: ప్రపంచం మొత్తమ్మీద ఏ ఉన్నతస్థాయి విశ్వవిద్యాలయానికీ రెండో క్యాంపస్ లేదు. దక్షిణాదిలో ఇంకో క్యాంపస్ పెడితే. ఈ క్యాంపస్ మానవ వనరులను పంచుకోవాల్సి వస్తుంది. ఇది నాణ్యతతో రాజీపడటమే. నాణ్యమైన విద్య అందిస్తున్నందుకే అంత దూరం నుంచి విద్యార్థులు వస్తున్నారు. కాబట్టి రెండో క్యాంపస్ ఎందుకు? ప్ర: మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందంటారు. మరి.. ఇంతమంది విద్యార్థుల కారణంగా బోధన నాణ్యత దెబ్బతింటుంది కదా..? జ: విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం నాణ్యతకు ఏమాత్రం సమస్య కాదు. అందుబాటులో ఉన్న వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేందుకు ఇది సహకరిస్తుంది. ఉదాహరణకు ప్రభుత్వ వ్యవసాయ యూనివర్సిటీలకు వేల ఎకరాల భూమి ఉంది. విద్యార్థుల సంఖ్య తక్కువ. ఇది పరోక్షంగా పన్ను డబ్బులను వృథా చేయడమే. అక్కడ ఫీజులు తక్కువగానే ఉన్నా వనరుల దుర్వినియోగం అవుతున్న మాటేమిటి? ఎల్పీయూలో కరిక్యులం రూపకల్పన మొదలు.. పరీక్షల నిర్వహణ వరకూ అన్నింటినీ స్వతంత్ర వ్యవస్థల ఆధ్వర్యంలో నడుపుతున్నాం. అధ్యాపకుల బోధనకు సంబంధించి ప్రతీ క్లాస్ ఆడియో, వీడియో రికార్డింగ్ జరుగుతుంది. దీనిపై తరచూ సమీక్ష జరిపి వారి లోటుపాట్లను సరిదిద్దే వ్యవస్థనూ ఏర్పాటు చేశాం. వీటన్నింటికీ అదనంగా బయటి సంస్థల నిపుణులు మా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా కట్టేందుకు అవకాశం కల్పిస్తున్నాం కూడా. ప్ర: ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు క్షీణిస్తున్నాయని అంటున్నారు. మీ దృష్టిలో దీనికి కారణాలేమిటి? జ: అవి మా కంటే ముందుగా ఏర్పాటైన సంస్థలు. అంటే మాకు అన్నల్లాంటి వారు. లోపాలు ఉండవచ్చుగానీ.. ఆ తప్పులు ఎంచేందుకు నాకు ఏ హక్కూ లేదు. మాలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి.. ఉంటాయి కూడా. వాటిని గుర్తుంచుకుని దిద్దుకోవడం మేం చేయగలిగిన పని. అదే పని అక్కడ కూడా జరుగుతోందని అనుకుంటున్నాం. ప్ర: విద్యావిధానం విషయంలో ఎల్పీయూ ప్రత్యేకత ఏమిటి? జ: మిగతా విద్యాసంస్థల్లో ముందు చదువు చెబు తారు. డిగ్రీ ఇస్తారు. విద్యార్థులకు ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఎల్పీయూ ప్రణాళిక దీనికి పూర్తిగా భిన్నం. అందుబాటులో ఉన్న అన్ని రకాల ఉద్యోగ అవకాశాల అధ్యయనం తర్వాత వాటికి అవసరమైన నైపుణ్యాలు, అర్హతల ఆధారంగా కరికులం రూపొందిస్తాం. కోర్సు సాగినన్ని రోజులు విద్యార్థులు తమ ఇష్టాఇష్టాలకు తగిన ఉద్యోగాన్ని సంపాదించు కునేందుకు కావాల్సిన అన్ని రకాల శిక్షణకు అవకాశాలు కల్పిస్తాం. తొలి ఏడాదిలో అవకాశాల గురించి వివరిస్తే.. రెండో ఏడాది ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉన్న మార్గాలను చెబుతాం. అవసరమైతే విద్యార్థి తన మునుపటి ఆప్షన్‌ను సరిచేసుకునేందుకూ వీలుంటుంది. ఈ ప్రణాళిక కారణంగానే ఎల్పీయూ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు 70–80 శాతం వరకూ ఉన్నాయి. జాగ్రఫీ డిగ్రీ చేసిన వారు కూడా మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ప్ర: ఎల్పీయూలో 200 కోర్సుల వరకూ ఉన్నాయి. వీటి ఫీజుల గురించి చెబుతారా? జ: సగటున ఒక్కో ఇంజనీరింగ్ విద్యార్థి చెల్లించాల్సిన ఫీజు ఏడాదికి సగటున రూ.1.25 లక్షల వరకూ ఉంటుంది. ఈ వర్సిటీ రూటు సపరేటు అనేందుకు ఒక నిదర్శనం. హాస్టల్ ఫీజు రూ.50 వేల నుంచి మొదలవుతుంది. దేశంలోని ఏ ప్రైవేట్ యూనివర్సిటీ ఫీజులతో పోల్చినా ఇది 20 నుంచి 40 శాతం వరకూ తక్కువ. ఎల్పీయూ నెస్ట్ పరీక్షలో మంచి మార్కులు సంపాదించిన వారికి స్కాలర్‌షిప్పులూ ఇస్తున్నాం. ప్ర: ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సులు ఉండటం చాలా అరుదు? జ: నిజమే. అయితే మానవ వికాసంలో ఆర్ట్స్, హ్యుమానిటీస్ రంగాలు చాలా కీలకమనేది మా నమ్మకం. పైగా విద్య ఏదో ఒక అంశానికి మాత్రమే పరిమితం కాకూడదన్న ఉద్దేశంతో మేము బీఏ, బీకామ్‌లతోపాటు ఫైన్ ఆర్ట్స్ కోర్సులూ ప్రవేశపెట్టాం. పైగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ సబ్జెక్టులు తెలుసుకోవడం అవసరమవుతుంది. ప్ర: ఎల్పీయూలో వైద్య విద్య కోర్సు లేకపోవడానికి ప్రత్యేక కారణమేమైనా ఉందా? జ: కొన్నేళ్ల క్రితం ఈ కోర్సు కోసం ప్రయత్నించాం. అయితే బోలెడన్ని అనుమతులు, నిబంధనలు ఉన్నాయి. పైగా అక్కడ వ్యవస్థ పనితీరు కూడా అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో మా ఆలోచన విరమించుకున్నాం. ఈ ప్రభుత్వ హయాంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రక్షాళనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా.. అవి పూర్తయ్యాక ఆలోచిస్తాం. ప్ర: లవ్లీ మిఠాయి దుకాణం ద్వారా మీ ప్రస్థానం మొదలైంది. విద్యారంగం వైపు మళ్లేందుకు కారణాలు? జ: మిఠాయిల వ్యాపారం ద్వారా ఎంతో సంపాదించాం. సమాజానికి ఎంతో కొంతతిరిగి ఇచ్చేయాలని అనుకున్నాం. ఆస్పత్రులు కట్టడం మొదలుకొని వృద్ధాశ్రమాలు, ఇతర సేవ కార్యక్రమాలన్నింటినీ పరిశీలించాం. ప్రాథమిక స్థాయి విద్యా బోధనలో ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే బాగా రాణిస్తున్న నేపథ్యంలో ప్రమాణాలు తగ్గిపోతున్నాయని భావించి ఉన్నత విద్యారంగంలోకి ప్రవేశించాం. సమాజ అభివృద్ధికి దోహదపడే ఉపాధి అవకాశాలు అందించడమే లక్ష్యంగా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. – గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
‘కౌరవ’ వ్యాఖ్యలతో సంబంధం లేదు
న్యూఢిల్లీ: కౌరవులందరూ టెస్ట్‌ట్యూబ్ బేబీలని ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్ జి.నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు శాస్త్రీయంగా ఆమోదయోగ్యం కావని కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కె విజయ్ రాఘవన్ తెలిపారు. పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో అంశాలను, వక్తలను నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్(ఐఎస్‌సీఏ) వక్తల ప్రసంగాలను వడపోత చేయలేదన్నారు. ఓసారి వక్తను ఎంపిక చేసుకున్నాక, వాళ్లు మాట్లాడే అంశంపై ఎలాంటి తనిఖీలు, వడపోతలు జరగవని తేల్చిచెప్పారు. ‘శాస్త్రవేత్తలు ఏదైనా పిచ్చిమాటలు మాట్లాడినప్పుడు ఆ వర్గం నుంచి నిరసనలు ఎదుర్కొంటారు. ఓ రాష్ట్ర విశ్వవిద్యాలయానికి వీసీగా ఉండీ నాగేశ్వరరావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం’ అని రాఘవన్ వ్యాఖ్యానించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొన్న నాగేశ్వరరావు కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీలనీ, డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతం కంటే దశావతారం మరింత అర్థవంతంగా ఉందనీ, రావణుడికి 24 విమానాలు, విమానాశ్రయాలు ఉన్నాయని సెలవిచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుతమున్న గైడెడ్ మిస్సైల్ టెక్నాలజీని శ్రీరాముడు, విష్ణువు వాడారన్నారు. -
లైసెన్స్‌కూ ‘ఆధార’మే!
జలంధర్: దేశంలో డ్రైవింగ్ లైసెన్సులు పొందేందుకు త్వరలోనే ఆధార్‌ను తప్పనిసరి చేస్తామని కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దీనివల్ల నకిలీ, డూప్లికేట్ లైసెన్సుల జారీకి అడ్డుకట్ట పడుతుందన్నారు. పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరిగిన 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడారు. డ్రైవింగ్ లైసెన్సులను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన బిల్లు ప్రస్తుతం పార్లమెంటులో పెండింగ్‌లో ఉందని ప్రసాద్ వెల్లడించారు. ‘పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న మోటార్ వాహనాల చట్టంలో మరో కీలక సవరణ చేయబోతున్నాం. త్వరలోనే మోటార్ వాహనాల లైసెన్సులకు ఆధార్‌ను అనుసంధానం చేయడం తప్పనిసరి కానుంది. వ్యక్తుల గుర్తింపును ధ్రువీకరించడంలో ఆధార్ అన్నది గొప్ప పరిణామం’ అని పేర్కొన్నారు. ఆధార్–డ్రైవింగ్ లైసెన్సు అనుసంధానంతో వచ్చే ప్రయోజనాలపై మాట్లాడుతూ..‘ఉదాహరణకు ఓ తాగుబోతు వాహనం నడుపుతూ నలుగురు వ్యక్తులను గుద్ది చంపేశాడనుకోండి. ప్రస్తుత పరిస్థితుల్లో అతను పంజాబ్ నుంచి మరో రాష్ట్రానికి పారిపోయి తప్పుడు డాక్యుమెంట్లతో కొత్త డ్రైవింగ్ లైసెన్సు పొందగలడు. కానీ ఆధార్‌తో డ్రైవింగ్ లైసెన్సును అనుసంధానిస్తే.. ఇలాంటి ఘటనలు నిలిచిపోతాయి. ఓ వ్యక్తి మహా అయితే తన పేరును మార్చుకోగలడు తప్ప చేతి వేలిముద్రలను మార్చుకోలేడు. ఎవరైనా వ్యక్తులు నకిలీ పేరుతో డ్రైవింగ్ లైసెన్సు పొందేందుకు యత్నిస్తే.. కొత్త వ్యవస్థ బయోమెట్రిక్ ఆధారంగా సదరు వ్యక్తికి ఇప్పటికే లైసెన్స్ ఉందని హెచ్చరిస్తుంది. అంతేకాకుండా వాహనదారుల ట్రాఫిక్ ఉల్లంఘనలు, జరిమానాలు ఆధార్‌తో అనుసంధానం అవుతాయి. దీనివల్ల జరిమానాలు కట్టకుండా వాహనాలు నడపడం కష్టమవుతుంది. ప్రస్తుతం దేశంలో 124 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి’ అని పేర్కొన్నారు. -
2020లో 5జీ టెక్నాలజీ తెస్తాం: కేంద్రం
జలంధర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: 2020 నాటికి దేశంలో 5జీ మొబైల్ టెక్నాలజీని తీసుకొస్తామని ఐటీ మంత్రి రవిశంకర్ తెలిపారు. దేశంలోని గ్రామ పంచాయతీలను ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌తో అనుసంధానించే ప్రాజెక్టు ఈ ఏడాదిలో పూర్తవుతుందన్నారు. ప్రస్తుతం గ్రామస్థాయిలో ప్రభుత్వ సేవలు అందించే సిటిజన్ సర్వీస్ సెంటర్ల ద్వారా దేశవ్యాప్తంగా 12 లక్షల మందికి ఉపాధిని అందిస్తున్నామని పేర్కొన్నారు. 55 అడుగుల రోబో: సైన్స్ కాంగ్రెస్‌లో శనివారం కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఆవిష్కరించిన భారీ రోబో ప్రతిమ ఇది. 55 అడుగుల ఎత్తున్న ఈ రోబో పేరు మెటల్ మాగ్నా. 25 టన్నుల బరువున్న దీన్ని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ విద్యార్థులు రెండు నెలలు శ్రమించి తయారు చేశారు. -
నేటి నుంచే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
జలంధర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రపంచంలోనే అతిపెద్దదైన సైన్స్ పండగ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్సీ)కు రంగం సిద్ధమైంది. పంజాబ్‌లోని జలంధర్‌లో గురువారం ప్రధాని చేతుల మీదుగా ఈ వేడుక ప్రారంభం కానుందని నిర్వాహకులు తెలిపారు. ‘ఫ్యూచర్ ఇండియా: సైన్స్ అండ్ టెక్నాలజీ’ఇతివృత్తంగా ఐదు రోజులపాటు జరగనున్న ఈ ఉత్సవాలకు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వేదిక కానుంది. దేశ విదేశాలకు చెందిన దాదాపు 30 వేల మంది ఐఎస్సీలో పాల్గొంటారని, ఇందులో పలుదేశాల నోబెల్ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన, భూవిజ్ఞాన శాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, టెక్స్టైల్ శాఖ మంత్రి స్మృతి ఇరానీలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎంపిక చేసిన పాఠశాలల విద్యార్థులు, శాస్త్రవేత్తలు పాల్గొంటారని చెప్పారు. శాస్త్రీయ దృక్పథం పెంపునకు.. ఏటా జనవరి 3వ తేదీన ప్రారంభమయ్యే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు ఘనమైన చరిత్ర ఉంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశం దేశ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడమే. గత ఏడాది ఐఎస్సీ వేడుకలు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా చివరి నిముషంలో రద్దయింది. దీంతో రెండు నెలల తరువాత మణిపూర్‌లో నిర్వహించారు. ఈ ఏడాది జలంధర్‌లో జరగనున్న 106వ సైన్స్ కాంగ్రెస్‌లో పలు వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారని సదస్సు జనరల్ ప్రెసిడెంట్ డాక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థులు సిద్ధం చేసిన సౌరశక్తి బస్సులో ప్రధాని మోదీ సమావేశ కేంద్రానికి విచ్చేస్తారని ఎల్పీయూ ఉపకులపతి అశోక్ మిట్టల్ తెలిపారు. ఐఎస్సీలో ఏర్పాటు చేసిన ఆరు ప్రత్యేక ప్రదర్శనశాలల్లో సీఎస్ఐఆర్, డీఆర్డీవో, డీఏఈ, ఐసీఎంఆర్ వంటి ప్రభుత్వ సంస్థల ప్రదర్శన ఉంటుందని, ఇందులో ప్రైడ్ ఆఫ్ ఇండియా అన్నది దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసేదని ఆయన వివరించారు. యువ ప్రతిభకు వేదిక.. ఐఎస్సీ – 2019 రెండోరోజున జరిగే చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ యువ ప్రతిభకు వేదికగా నిలవనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంపిక చేసిన దాదాపు 150 సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. పది నుంచి 17 ఏళ్ల మధ్య వయస్కులు రూపొందించిన ఈ ప్రాజెక్టులు దేశంలో సైన్స్ ప్రాచుర్యానికి తోడ్పడతాయని అంచనా. మూడోరోజున సైన్స్ కమ్యూనికేటర్స్ మీట్ జరగనుంది. అదేరోజున విమెన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం కానుంది. దీంతోపాటు మొత్తం 14 ప్లీనరీ సెషన్స్ ఐఎస్సీలో భాగంగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. నోబెల్ గ్రహీతలతో ప్రధాని ‘ఛాయ్ పే చర్చ’ భారత సైన్స్ కాంగ్రెస్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోబెల్ గ్రహీతలైన ముగ్గురు శాస్త్రవేత్తలతో ఛాయ్ పే చర్చా పేరిట ఇష్టాగోష్టిగా మాట్లాడనున్నారు. ప్రొఫెసర్ థామస్ సి.సుడాఫ్ (2013 వైద్య శాస్త్ర నోబెల్ గ్రహీత), ప్రొఫెసర్ అవ్రామ్ హెర్ష్కో (2004 కెమిస్ట్రీ నోబెల్ గ్రహీత), ప్రొఫెసర్ ఎఫ్.డంకన్ ఎం.హల్డానే (2016 ఫిజిక్స్ నోబెల్ గ్రహీత) ఈ చర్చలో పాల్గొంటారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముందడుగు వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారి నుంచి ప్రధాని సలహాలు, సూచనలు తీసుకుంటారని సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. -
సైన్స్ కాంగ్రెస్‌పై పంజాబ్ గవర్నర్ సమీక్ష
జలంధర్: పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ)లో వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏర్పాట్లను పంజాబ్ గవర్నర్ వీపీసింగ్ బాద్నోర్ పరిశీలించారు. గవర్నర్ వెంట 40 మందితో కూడిన భారత ప్రభుత్వ ప్రతినిధి బృందం ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఏర్పాట్లపై గవర్నర్, ప్రతినిధి బృందం సంతృప్తి వ్యక్తం చేశారని వర్సిటీ వర్గాలు తెలిపాయి. రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన పనులపై సూచనలు చేశారని తెలిపాయి. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి బాద్నోర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా క్యాంపస్‌లో 106వ సైన్స్ కాంగ్రెస్ విజ్ఞాన్ జ్యోతి ర్యాలీని నిర్వహించారు. -
మీరు స్టూడెంట్స్‌ని కలిస్తే బాగుంటుంది
ఇంఫాల్: విశ్వంపై జరుగుతున్నపరిశోధనల్లో భారత శాస్త్రవేత్తల కృషి ఎనలేనిదని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. దేశం సైన్స్ రంగంలో మరిన్ని విజయాల్ని సాధించాలంటే ప్రతి శాస్త్రవేత్త విద్యార్థులతో తమ అనుభవాల్ని పంచుకోవాలని కోరారు. మణిపూర్ యూనివర్సిటీలో 5 రోజులపాటు జరగనున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వందేళ్లలో ఈశాన్య భారతంలో సైన్స్ కాంగ్రెస్ జరగడం ఇది రెండోసారి అన్నారు. ‘9 నుంచి 11వ తరగతి విద్యార్థులతో ప్రతి సైంటిస్ట్ ఏడాదికి 100 గంటల చొప్పున వారి విజ్ఞానయాత్రా విశేషాల్ని పంచుకోవాల’ని మోదీ ఆకాంక్షించారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ 2030 నాటికి అంతర్జాతీయంగా క్షయ మహమ్మారిని రూపుమాపాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుందని, అయితే, అంతకంటే ముందే భారత్‌లో 2025 నాటికి క్షయను పూర్తిగా నిర్మూలిస్తామని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు పోషకాహార లోపం, మలేరియా, మెదపువాపు వంటి వ్యాధుల నివారణకు తోడ్పాటు అందించాలని కోరారు. -
అలా ఆదేశాలివ్వలేం
సాక్షి, హైదరాబాద్: ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’సమావేశాలను నిర్వహిస్తున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఐఎస్‌సీఏ) ప్రభుత్వానికి చెందిన సంస్థో?... కాదో?.. తెలియజేయాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. అది ప్రభుత్వానికి చెందిన సంస్థ కాని పక్షంలో తాము ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను ఫలానా చోటనే నిర్వహించాలనీ ఆదేశాలు ఇవ్వలేమంది. సమావేశాలపై ప్రభుత్వం తప్పు డు నివేదిక ఇచ్చిందని పిటిషనర్లు ఆరోపిస్తున్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వాన్ని వివరణ కోరుతామంది. తదుపరి విచారణను 23కి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయ మూర్తి జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను అంతకు ముందు నిర్ణయించిన విధంగానే ఓయూలో నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వడంతో పాటు, ఈ సమావేశాలకు సహాయ సహకారాలను అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పీహెచ్డీ విద్యార్థులు కిరణ్‌కుమార్, విజయకుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయ వాది వాదనలు వినిపిస్తూ, సమావేశాలకు ఓయూ రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వెచ్చించి ఏర్పాట్లు చేసిందన్నారు. భద్రత విషయంలో ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు నివే దిక వల్ల సమావేశాల వేదికను నిర్వాహకులు వేరే చోటికి తరలించారన్నారు. సమావేశాలు నిర్వహిస్తున్న ఐఎస్‌సీఏ ప్రభుత్వానికి చెందిన సంస్థా? కాదా? అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో, ఈ విషయంలో స్పష్టతనివ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదిని ఆదేశించింది. -
ఓయూలో నిర్వహించేలా ఆదేశాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ సమావేశాలను ముందుగా నిర్ణయించిన విధంగా ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వడంతోపాటు, ఈ సమావేశాలకు పూర్తి సహాయ సహకారాలు అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ సమావేశాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, నిధులు విడుదల చేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చిందని, దీనివల్ల ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు మరో చోటుకు తరలిపోయాయంటూ పీహెచ్డీ విద్యార్థులు కిరణ్‌కుమార్, విజయకుమార్‌లు హైకోర్టులో ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, ఓయూ వీసీ, డీజీపీ, నగర పోలీస్ కమిషనర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. రూ.50 కోట్లు వెచ్చించి ఓయూలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు యూనివర్సిటీ అన్ని ఏర్పాట్లు చేసిందని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల ఆ డబ్బు, శ్రమ, విద్యార్థుల ప్రయోజనాలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయని పిటిషనర్లు తెలిపారు. ప్రభుత్వ వ్యవహారశైలితో యూనివర్సిటీ ప్రతిష్ట కూడా దెబ్బతిన్నదని వివరించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులపై చర్చించేందుకు గత 70 సంవత్సరాలుగా ప్రతి ఏడాదీ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 3 నుంచి 7 వరకు ఓయూలో జరగాల్సి ఉందన్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు దాదాపు 13వేల మంది శాస్త్రవేత్తలు రిజిష్టర్ చేసుకున్నారని తెలిపారు. ఈ సమావేశాల వల్ల యూనివర్సిటీకి దాదాపు రూ.300 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం ఉండేదని, ప్రభుత్వ తీరు వల్ల ఈ గొప్ప అవకాశం చేజారిపోయిందని పిటిషనర్లు వ్యాజ్యంలో పేర్కొన్నారు. -
ఓయూ ఛాన్స్..మణిపూర్ కొట్టేసింది!
-
ఓయూ చేజేతులా.. చేజార్చుకుంది!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు మణిపూర్‌కు తరలిపోయాయి. ఫిబ్రవరి నెలలో మణిపూర్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఈ సమావేశాలు జరగనున్నాయి. వాస్తవానికి హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరగాల్సి ఉంది. వచ్చే నెల 3 నుంచి 7వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే, ఈ ప్రతిష్టాత్మక సమావేశాలు నిర్వహించలేమంటూ ఓయూ చేతులెత్తేసింది. ఓయూలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, భద్రతా కారణాల రిత్యా ఈ సమావేశాలు నిర్వహించలేమని పేర్కొంది. దీంతో ఓయూలో జరగాల్సిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు మణిపూర్‌కు తరలిపోయాయి. హైదరాబాద్ నగరంలో ఇటీవల అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సును, తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించి ప్రశంసలందుకుంది. అంతేకాకుండా ఓయూలో ఇటీవల వందేళ్ల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను ఓయూలో ఘనంగా నిర్వహిస్తారని అందరూ భావించారు. కానీ, అందుకు భిన్నంగా సమావేశాలు నిర్వహించలేమంటూ ఓయూ చేతులు ఎత్తేయడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. -
ప్రభుత్వ అసమర్థతతోనే సైన్స్ కాంగ్రెస్ వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా పడిందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సైన్స్ కాంగ్రెస్ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం బయటపడిందని విమర్శించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉన్న ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మరోసారి పునరాలోచించి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉస్మానియా వర్సిటీపై ముఖ్యమంత్రికి అయిష్టత ఉందని, అందుకే అక్కడ జరగాల్సిన కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. ఉద్యమకారుల సమస్యలు చూసి సీఎం ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు ఆందోళనలు కలిగిస్తున్నాయని, ఇటీవల సంధ్యారాణిపై దాడి కలచివేసిందన్నారు. -
105 ఏళ్లలో తొలిసారి..
-
ఓయూ అంటే కేసీఆర్‌కు ఇష్టం లేదు...
సాక్షి, హైదరాబాద్: జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జరగాల్సిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వాయిదా వేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. గత ఏడాది తిరుపతిలో ఈ సమావేశాలను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడి వల్లే వాయిదా వేశారని ఆరోపించారు. 62 దేశాలకు సంబంధించిన వారు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఏడుగురు నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అన్ని ఏర్పాట్లు చేసి ప్రతినిధుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తీసుకుని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇపుడు వాయిదా వేసి ఓయూ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన విమర్శించారు. దేశ, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ ప్రభుత్వం నిర్ణయం ఉందన్నారు. సీఎం కేసీఆర్‌కు ఇష్టం లేదు కాబట్టే సభలను వాయిదా వేశారంటూ ఇలాంటి సభలు నిర్వహించకపోవడం తెలంగాణకు అవమానం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. ఓయూ అంటే కేసీఆర్‌కు ఇష్టం లేదని, ద్వేషపూరితంగానే ఓయూలో జరిగే సైన్స్ కాంగ్రెస్‌ను కేసీఆర్ వాయిదా వేశారన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా విద్యార్థులతో బీజేపీ మాట్లాడుతుందని చెప్పారు. టీఆర్ఎస్ మహా సభలా ప్రపంచ తెలుగు మహాసభలు టీఆర్ఎస్ మహా సభలులాగా జరిగాయని, ఒక లక్ష్యం లేకుండా నిర్వహించారని కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలుగు భాష అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. తెలుగు మహాసభ పేరుతో సీఎం సొంత భజన చేసుకున్నారని, రాచరికపు పాలనకు తెలుగు మహాసభ వేదిక అయిందని అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయంకు ఏమైనా ప్రోత్సాహకాలు ప్రకటించిందా అని ప్రశ్నించారు. తెలుగు కళాశాలకు ఒక్క రూపాయి అయినా కేటాయించారా అని నిలదీశారు. టిఆర్ఎస్ నాయకులను ఏ అర్హతతో ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.. కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ వేదిక కింద ఉంటారు.. అసదుద్దీన్ ఒవైసీ వేదిక పైన ఉంటారు.. ఇవి ఏమి తెలుగు మహాసభలోఅర్థం కాలేదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన కవులు, కళాకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, మొదటి పొగడ్త కేసీఆర్‌కు వస్తే రెండో పొగడ్త నిజాంకు వచ్చిందని ఎద్దేవా చేశారు. -
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ) వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు జరగాల్సిన ప్రతిష్టాత్మక 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనూహ్యం గా వాయిదా పడింది. శాంతిభద్రతలు, వర్సిటీలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో సదస్సును వాయిదా వేసినట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సైతం తమ వెబ్సైట్లో సదస్సు వాయిదా పడినట్లు తెలిపింది. సదస్సు ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. వందేళ్లకుపైగా చరిత్రగల సైన్స్ కాంగ్రెస్ సదస్సులు వాయిదాపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సిన సదస్సును చివరి నిమిషంలో వాయిదా వేయడాన్ని విద్యార్థి, అధ్యాపక సంఘాలు తప్పుబట్టాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సదస్సును ఓయూలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక... ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌తోపాటు మహిళా సైన్స్ కాంగ్రెస్, చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్, సైన్స్ కమ్యూనికేటర్, సైన్స్ ఎగ్జిబిషన్ సహా 14 విభాగాల్లో సదస్సులను ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు 62 దేశాల నుంచి ఏడుగురు నోబెల్ అవార్డుగ్రహీతలు, 13,500 మందికిపైగా శాస్త్రవేత్తలు ఇప్పటికే తమ పేర్లను నమోదు కూడా చేసుకున్నారు. ఆరు వేల పరిశోధనా పత్రాలు, ఏడు వేల పోస్టర్లు వచ్చాయి. శాస్త్రవేత్తల కోసం నిర్వాహకులు ఇప్పటికే నగరంలోని ప్రముఖ హోటళ్లలో ఐదొందలకుపైగా గదులను, సదస్సుకు తరలించేందుకు 500 క్యాబ్‌లను బుక్ చేశారు. విదేశాల నుంచి వచ్చే అతిథులకు విమాన టికెట్లు కూడా బుక్ చేశారు. సావనీర్, బ్రోచర్ సహా 15 వేల బ్యాగ్‌ల కొనుగోళ్లకు అడ్వాన్స్ కూడా చెల్లించారు. వేదిక, టెంట్లు, కుర్చీలు, లైటింగ్, వంట మనుషులను సిద్ధం చేశారు. ఇప్పటికే భారీగా ఖర్చు కూడా చేశారు. ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత సదస్సును వాయిదా వేస్తు న్నట్లు ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే రూ. 1,000–2,000 చెల్లించి పేర్లను నమోదు చేసుకున్న ప్రతినిధులకు ఏం చెప్పాలో తెలియని దుస్థితి నిర్వాహకులది. ఇంటెలిజెన్స్ హెచ్చరికతోనే వాయిదా! సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో జరగాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అర్ధంతరంగా వాయిదాపడటానికి శాంతిభద్రతల అంశమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు ఆశించిన రీతిలో లేవని, భద్రతా వ్యవహారాల రీత్యా సైన్స్ కాంగ్రెస్‌ను వాయిదా వేసుకోవాలని రాష్ట్ర నిఘా వర్గాలు, పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. ఒకవైపు ఆదివాసీలు, లంబాడీల మధ్య వివాదం తీవ్ర రూపు దాలుస్తుండటంతోపాటు తాజాగా మంద కృష్ణ మాదిగ అర్ధరాత్రి మెరుపు ర్యాలీ నిర్వహించడాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం, గతంలో శతాబ్ది ఉత్సవాల సందర్భంలోనూ అనేక మంది విద్యార్థి నేతలను నిర్బంధించిన ఘటన నేపథ్యంలో సైన్స్ కాంగ్రెస్ సదస్సు నిర్వహణకు ఆటంకం తలెత్తే అవకాశం ఉందని నిఘా వర్గాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. సదస్సును ప్రధాని ప్రారంభించాల్సి ఉన్న నేపథ్యంలో ఆయన్ను, సీఎం కేసీఆర్‌ను కొన్ని వర్గాల విద్యార్థులు అడ్డగించేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు ఇటు ప్రభుత్వ వర్గాలకు, అటు ఉస్మానియా వర్సిటీ అధికార వర్గానికి చెప్పడంతోనే సదస్సు వాయిదా నిర్ణయం వెలువడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సీఎం ఒత్తిడి మేరకే... సీఎం కేసీఆర్ ఒత్తిడి మేరకే వర్సిటీ వీసీ సదస్సును వాయిదా వేశారు. వందేళ్ల చరిత్ర గల ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికపై ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన జాతీయ సైన్స్ కాంగ్రెస్‌ను హఠాత్తుగా వాయిదా వేయ డం వెనుక సీఎం హస్తం ఉంది. క్యాంపస్‌లో ప్రశాంత వాతావరణం ఉన్నప్ప టికీ శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉన్నట్లు చిత్రీకరించి సదస్సును వాయిదా వేయడం దారుణం. సదస్సు ఓయూలోనే నిర్వహించాలని విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం, వర్సిటీ పాలకవర్గం దాన్ని పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తోంది. – ప్రొ.భట్టు సత్యనారాయణ, ఔటా అధ్యక్షుడు ఓయూకు బ్లాక్‌డే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా ఓయూకు బ్లాక్‌డే. వాయిదా నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చారిత్రక నేపథ్యం ఉన్న వర్సిటీని దేశవ్యాప్తంగా అప్రతిష్టపాలు చేసేందుకే బలవంతంగా సదస్సును వాయిదా వేయించారు. – ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్,ఎస్సీ ఎస్టీ టీచర్స్ అసోసియేషన్ కార్యదర్శి సమష్టి నిర్ణయం మేరకే వాయిదా వర్సిటీలో నెలకొన్న తాజా పరిస్థితుల దృష్ట్యా సదస్సును వాయిదా వేయాల్సి వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, ఉస్మానియా యూనివర్సిటీ సమష్టి నిర్ణయం మేరకే సదస్సు వాయిదా పడింది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై ఈ నెల 27న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. – ప్రొఫెసర్ రామచంద్రం, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ -
జనవరి 3నుంచి ‘భారత సైన్స్ కాంగ్రెస్’
సాక్షి, హైదరాబాద్: జనవరి 3 నుంచి 7 వరకు ఉస్మానియా వర్సిటీలో భారత సైన్స్ కాంగ్రెస్ 105వ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఈ కార్యక్రమానికి 30 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు హాజరుకానున్నారన్నారు. సోమవారం సచివాల యంలో మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి 9 జిల్లా కేంద్రాల్లో రూ.166.40 కోట్ల వ్యయంతో సైన్స్ సెంటర్లు, వరంగల్, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద రేడియేషన్ టెక్నాలజీ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సైన్స్ వ్యాప్తికోసం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా రూ.8.56 లక్షల వ్యయంతో బీసీ గురుకుల పాఠశాలల్లో 20 కిచెన్ వేస్ట్ ఆధారిత బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు. -
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు మోదీ
కోయంబత్తూర్: ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చే ఏడాది జనవరి 3న 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య తదితర రంగాల్లోని సమస్యలపై ఐదు రోజులపాటు చర్చలు జరగను న్నాయి. ఈ సదస్సుకు దేశావిదేశాల నుంచి పలువురు పరిశోధకులు, శాస్త్రవేత్తలు హాజరుకానున్నట్లు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఐఎస్‌సీఏ) తెలిపింది. -
ఇస్కా మాయ ఇంతింత కాదయా
► ఏడు నెలలకే నాణ్యత బట్టబయలు ►కుంగిపోయిన ఫుట్‌పాత్‌లు, ఫ్లోరింగ్ ► రాళ్లు లేచిన తారు రోడ్లు, ► మూలన పడ్డ ఆర్ఓ ప్లాంట్లు ► కోట్ల నిధులు దుర్వినియోగం ► అధికారులు, కాంట్రాక్టర్లు ఖుషీ ఖుషీ ► వెల్లువెత్తిన విమర్శలు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ కోసం ఏడు నెలల కిందట తిరుపతిలో చేపట్టిన కోట్లాది రూపాయల పనుల్లో నాసిరకం బట్టబయలైంది. నాణ్యత లేని పనులు నగర వాసులను వెక్కిరిస్తున్నాయి. లేచిపోయిన తారు, పగిలిపోయిన ఫుట్‌పాత్ టైల్స్, కుంగిపోయిన ఫ్లోరింగ్‌లు, ఊడిపోయిన కుళాయిలు, దెబ్బతిన్న విద్యుత్ వైర్లు, ఎండిపోయిన పూలమొక్కల వంటివన్నీ ఇస్కా పనుల్లో జరిగిన మస్కాకు సాక్షీభూతంగా నిలిచా యి. ఇస్కా పనుల్లో అడ్డగోలు దోపిడీకి తెరలేపారన్న విషయం తేటతెల్లమవుతోంది. రూ. 10 కోట్ల మేర ని«ధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ కేంద్రంగా జనవరి 3 నుంచి 7వ తేదీ వరకూ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సభలు జరిగాయి. దేశ విదేశాల నుంచి పేరున్న సైంటిస్టులు, ప్రొఫెసర్లు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించారు. సైన్స్ కాంగ్రెస్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం రూ.175 కోట్లను కేటాయించింది. డిసెంబర్ రెండో వారం నుంచే సివిల్, ఇంజినీరింగ్ పనులు మొదలయ్యాయి. జాతీయ రహదారులు, మున్సిపల్ రోడ్ల సుందరీకరణ, పార్కుల నిర్మాణం, కూడళ్ల సుందరీకరణ, డివైడర్లు, ఫుట్పాతలకు రిపేర్లు...వంటి పనులన్నీ చేపట్టారు. వర్సిటీ హాస్టళ్ల రిపేర్లు, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులూ వేగంగా జరిగాయి. యూనివర్సిటీలోని సెమినార్ హాళ్లు, హెచ్ఓడీల చాంబర్లు కొత్తగా ముస్తాబయ్యాయి. ఆడిటోరియంలు, పార్కులు రంగులతో మెరిసిపోయాయి. అన్ని రకాల పనుల కోసం రూ.160 కోట్ల దాకా ఖర్చు చేశారు. ఇందులో రూ.100 కోట్ల వరకూ పైన పేర్కొన్న పనులకు కేటాయిం చారు. మిగతా నిధులు వేదికల నిర్మాణం, షామియానాలు, భోజనాలు, వసతులు, కార్లు, హోటళ్ల అద్దెలు ఇతరత్రా వాటికి వినియోగించారు. అయితే సమయం తక్కువన్న కారణంతో నాణ్యతకు తిలోదకాలిచ్చి హడావుడి పనులతో కాంట్రాక్టర్లు చేతులు దులుపుకున్నారు. ఏర్పాట్లకు సంబంధించిన పనులతో పాటు రోడ్లు, సెమినార్హాళ్లు, ఆడిటోరియంలు, ఫుట్‌పాత్‌లు, డివైడర్ల రిపేర్ల వంటి మేజర్ పనులన్నింటినీ అధికార పార్టీ నాయకులు దక్కించుకున్నారు. సీఎం పేరు చెప్పి కొందరు, మంత్రి నారాయణ పేరు చెప్పి మరికొందరు టెండర్లలో పాల్గొన్నారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అధికార పార్టీ నాయకుల ఆశీస్సులతో అందినకాడికి దండుకున్నారు. పలుకుబడితో పనులు దక్కించుకున్న టీడీపీ నేతలు, వారివెనుకనున్న బినామీ కాంట్రాక్టర్లు లక్షల్లో వెనుకేసుకున్నారు. పనులన్నీ నాసిరకంగా చేసి బిల్లులు పొందారు. పనుల్లో మాయాజాలం... ఎయిర్‌పోర్టు జంక్షన్ నుంచి కేఎల్ఎం ఆస్పత్రి వరకూ జాతీయ రహదారి సుందరీకరణ పనులు జరిపారు. తారురోడ్డు పనులు హడావుడిగా చేయడం వల్ల అక్కడక్కడా తారు లేచిపోయి రాళ్లు బయటకు కనిపిస్తున్నాయి. ఎస్వీయూ క్యాంపస్‌లో ఫుట్‌పాత్‌ల నిర్మాణ పనుల్లోనూ నాసిరకం తొంగిచూస్తోంది. పనులు జరిగిన రోజుల్లో ఉదయం సిమెంట్ పనులు చేసి మధ్యాహ్నం టైల్స్ అతికించారు. క్యూరింగ్ లేని కారణంగా చాలా చోట్ల టైల్స్ జారిపోయాయి. ఇస్కా సదస్సులను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లలో భాగంగా 8 చోట్ల ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. రెండు చోట్ల ప్లాంట్లు మూలన పడ్డాయి. శ్రీనివాసా ఆడిటోరియంలోని ఆర్ఓ ప్లాంటుకు ఏర్పాటు చేసిన నీళ్ల కొళాయి ఊడిపోవడంతో నెల రోజులుగా దీన్ని వాడటం లేదు. పనులన్నింటిలోనూ మాయాజాలం కనిపిస్తోంది. నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్లంతా కలిసి ని«ధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. పలు చోట్ల దెబ్బతిన్న టైల్స్ ... ఎస్వీ యూనివర్సిటీలో చాలా చోట్ల ఫుట్‌పాత్ టైల్స్ దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల పగిలిపోగా, మరికొన్ని చోట్ల కుంగిపోయాయి. ఇంకొన్ని చోట్ల మట్టితో కలిసి కొట్టుకుపోయాయి. ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లే దారిలో ఆహ్లాదంగా కనిపించే చెట్ల పక్కన ఫుట్‌పాత్ టైల్స్ పగిలిపోయాయి. సుమారు పది చోట్ల టైల్స్ దెబ్బతిన్నాయి. సిమెంట్ టైల్స్‌తో హడావుడిగా చేసిన పనులన్నీ చాలా చోట్ల నాసిరకంగా కనిపిస్తున్నాయి. పూలతోటలో ఎండిన మొక్కలు... సైన్స్ కాంగ్రెస్‌కు వారం ముందు శ్రీనివాసా ఆడిటోరియం పూలతోటలో రకరకాల పూలమొక్కలను అమర్చారు. గార్డెన్ డెవలప్మెంట్ కోసం వేల రూపాయలు ఖర్చు చేశారు. అయితే ఇక్కడ పెట్టిన పూలమొక్కలు ఎండిపోయాయి. కొన్ని చోట్ల మొక్కలే కానరావడం లేదు. ఆడిటోరియానికి దగ్గరలో క్యాంటీన్‌కు ఎదురుగా రోడ్డు పక్కనున్న గార్డెన్ డివైడర్ రాళ్లు పూర్తిగా ఒరిగిపోయా యి. దీంతో మట్టి జారిపోయి ఇక్కడున్న మొక్కలన్నీ దెబ్బతింటున్నాయి. శ్రీనివాసా ఆడిటోరియం వెలుపల వేసిన సిమెంట్ టైల్స్ చాలా చోట్ల కుంగిపోయాయి -
29 మందికి ‘ఇస్కా’ పురస్కారాలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతిలో జరుగుతున్న 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో భాగంగా 16 మంది శాస్త్రవేత్తలను ఇస్కా 2016–17 బెస్ట్ పోస్టర్ అవార్డులకు ఎంపిక చేశారు. మరో 13 మందికి ఇస్కా యంగ్ సైంటిస్ట్ పురస్కారాలను ప్రకటించారు. కెమికల్ సైన్సెస్‌లో ఏపీకి చెందిన ప్రదీప్‌కుమార్ బ్రాహ్మణ్ బెస్ట్ పోస్టర్ అవార్డును గెలుచుకున్నారు. బెస్ట్ పోస్టర్ అవార్డులు.. పశువైద్య, మత్స్య శాస్త్ర రంగంలో లక్నో వర్సిటీకి చెందిన యషికా అవస్థి, జలగావ్‌లోని నార్త్ యూనివర్సిటీకి చెందిన యోగితా వై ఫలక్... ఆంత్రోపాలజీ, సైకాలజీ విద్యారంగంలో ఢిల్లీ వర్సిటీకి చెందిన సంగీత దే, కోల్‌కతా వర్సిటీకి చెందిన నందినీ గంగూలీ అవార్డులు అందుకున్నారు. కెమికల్ సైన్సెస్‌లో కురుక్షేత్ర యూనివర్సిటీకి చెందిన ఆర్తి దలాల్, ఏపీలోని కేఎల్ వర్సిటీకి చెందిన ప్రదీప్‌కుమార్ బ్రాహ్మణ్... ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సైన్సెస్‌లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వారణాశి)కి చెందిన మయాంక్ అగర్వాల్, మైసూర్‌కు చెందిన అజిత్ కె.అబ్రహం తదితరులు అవార్డులు అందుకున్నారు. యంగ్ సైంటిస్ట్ అవార్డులు వీరికే...: అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ సైన్సెస్‌లో బప్పా దాస్(గోవా), వెటర్నరీ అండ్ ఫిషరీస్ సైన్సెస్‌లో జీబీ శ్రీకాంత్(గోవా), ఆంత్రోపాలజీలో నివేదితా సోమ్(కోల్‌కతా), కెమికల్ సైన్సెస్‌లో సత్యాబడి మోర్తా(భువనేశ్వర్), ఎర్త్ సిస్టమ్ సైన్సెస్‌లో గోవాకు చెందిన షీతల్ పీ గోదాడ్, ఇంజనీరింగ్ సైన్స్‌లో ఖరగ్‌పూర్ యూనివర్సిటీకి చెందిన నందిన బండారు, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్‌లో ప్రవీణ్ ధ్యాని, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో కోల్‌కతా యూనివర్సిటీకి చెందిన అభిరూప్ బెనర్జీ అవార్డులు అందుకున్నారు. అలాగే మెటీరియల్స్ సైన్స్‌లో అంజిలీనా కోర్కెటా(కాన్పూర్), మెడికల్ సైన్స్‌లో సభ్యసాచి దాస్(మెడినిపూర్), న్యూ బయాలజీలో బోధిసత్వ సాహ(కోలకతా), ఫిజికల్ సైన్స్‌లో ధర్మేంద్ర పతాప్ సింగ్(లక్నో), ప్లాంట్ సైన్స్‌లో నేహా పాండే(లక్నో)లు అవార్డులు అందుకున్నట్లు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ పేర్కొంది. -
విజ్ఞానంతోనే వికాసం
• దేశ పురోగమనానికి, యువత వికాసానికి విజ్ఞానమే మూలం • ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ పునరుద్ఘాటన... • ముగిసిన 104వ ప్లీనరీ • 5 ప్రధాన, 30 ఉపభేటీలు..105వ ఇస్కా వేదిక భువనేశ్వర్ • సైన్స్, టెక్నాలజీ ప్రాధాన్యతతో పలు అంశాలపై చర్చలు తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఐదు రోజు ల పాటు జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 104వ సదస్సు శనివారంతో ముగిసింది. యువత వికాసానికి, దేశ పురోగమనానికి విజ్ఞానాభివృద్ధే మూలమని సదస్సు పునరుద్ఘా టించింది. ఈనెల 3న ప్రధాని నరేంద్రమోదీ సదస్సును ప్రారంభించారు. ప్రారంభ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు హర్షవర్దన్, సుజనాచౌదరి, ముగింపు సభలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు తదితరు లు పాల్గొన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా 6వ మహిళా సైన్స్ కాంగ్రెస్, బాలల సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు కూడా జరిగాయి. మైసూర్లో జరిగిన 103వ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో ప్రతిపాదించిన 2035 విజన్ డాక్యుమెంటు ఆధారంగా దేశపురోభివృద్ధికి 12 రంగాలను నీతి ఆయోగ్ గుర్తించిందని, ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించిందని ప్రధాని మోదీ తన ప్రారంభోపన్యాసంలో చెప్పారు. కాగా, ‘సైన్స్ అండ్ టెక్నాలజీ– దేశ పురోభి వృద్ధి’ భావన(థీమ్)తో సాగిన ఈ ప్లీనరీ సమావేశాల్లో రోజుకు 5 ప్రధాన సమావేశాలు, 30 వరకు ఉప భేటీలు జరిగాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అనేక ఆవిష్కరణల గురించి శాస్త్రవేత్తలు వివరించారు. వినూత్న సాంకేతిక పరిజ్ఞానం పోకడలను ప్రతిబింబించడంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నూటికి నూరుపాళ్లు విజయవంతమైందనే చెప్పాలి. వచ్చే ఏడాది నిర్వహించాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల వేదికగా భువనేశ్వర్‌ను ఎంపికచేశారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ 2017–18 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను, కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. పరిశోధనలకు నిధుల కొరత.. భారత్‌లో పరిశోధనలకు లేబొరేటరీలు, ఇతర వనరులతో పాటు నిధుల కొరత తీవ్రంగా ఉందనే అభిప్రాయం ఇస్కా 104 సమా వేశాల్లో వ్యక్తమైంది. రక్షణ, అంతరిక్ష పరిశోధనా రంగాల్లో దేశం సాధిస్తున్న ప్రగతి గురించి తదుపరి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చలు జరిగా యి. ఇంధన, పారిశ్రామిక రంగాల్లో భారత్ ఎదుర్కొంటున్న సమస్యలూ ప్రస్తావనకు వచ్చాయి. ఈ రంగాల్లో భారత్ ఇతర దేశాల కన్నా భిన్నమైన పరిశోధనలు ఏమీ తెరమీదకు రాలేదు. సోలార్ ఎనర్జీలో స్విట్జర్లాండ్, దుబాయ్ వంటి దేశాలు చౌకగా విద్యుత్ ఇచ్చే టెక్నాలజీని సెమినార్లో పరిచయం చేశాయి. కానీ మన దేశంలో మాత్రం ఇంకా సోలార్ సమస్యలే ఉన్నాయని, వీటిపై క్షేత్రస్థాయి పరిశోధనలు జరగాలని మన శాస్త్రవేత్తలు అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధీకరణలో పలు దేశాలు నాణ్యమైన టెక్నాలజీని ఈ సదస్సు ద్వారా పరిచయం చేసే ప్రయత్నం చేశాయి. మన దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలనే అభి వృద్ధి చేసుకోలేదని ఒప్పుకోవాల్సి వచ్చింది. అణుథార్మికతపై జరిగిన సెమినార్లో చాలా మంది విదేశీ టెక్నాలజీని భారత్ ఎలా దిగుమతి చేసుకుంటోంది, వాటివల్ల ప్రయోజ నాలు ఏమిటి అనేది చెప్పారు. జన్యు ఎడిటింగ్ చేరువవుతోంది... ఆహారం నుంచి ఆరోగ్యం వరకూ మానవజాతి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కా రంగా భావిస్తున్న జన్యు ఎడిటింగ్ టెక్నాలజీ ఈ సైన్స్ కాంగ్రెస్ ద్వారా భారతీయులకు ఒకింత చేరువైంది. జన్యువుల్లో అతిసులువుగా మార్పులు చేర్పులు చేసేందుకు అవకాశం కల్పించే క్రిస్పర్ క్యాస్–9 టెక్నాలజీపై కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల్లో ఓ ముసాయిదా విధానాన్ని సిద్ధం చేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సలహాదారు ఎస్.ఆర్.రావు శుక్రవారం ప్రకటించారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిభను, నైపుణ్యతను మరోసారి చాటే భారత న్యూట్రినో అబ్జర్వేటరీపై ఈ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. భవిష్యత్తు అవసరాలకు పవన విద్యుత్తే ఆధారం కానుందని, భౌగోళిక సానుకూలత దృష్ట్యా పవన విద్యుత్తు ఉత్పత్తికి దేశంలో అనేక సానుకూలతలున్నాయని ఆ రంగంలోని శాస్త్రవేత్తలు వివరించారు. శాస్త్ర సాంకేతిక అంశాలతో పాటు ఉన్నత విద్యారంగం ఉన్నతికి తీసుకోవలసిన చర్యలపై యూజీసీ, న్యాక్ అధిపతులు, పలు యూనివర్సిటీల వీసీలు చర్చించారు. పాత తీర్మానాల అమలు ఎక్కడ? ప్రతి ఏటా సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరగడం సంతోషించదగ్గ విషయమే అయినా గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాల అమలు ఎంత అనేది ప్రశ్నార్థకం. సమస్యల్ని ఏకరవు పెడితే సరిపోదని ఏడాది కాలంలో ఏమి సాధించారో తెలియజేయాలని పలువురు కోరారు. కాగా సదస్సులో ఆరుగురు నోబెల్ బహుమతి గ్రహీతలు, పలువురు దేశ, విదేశీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. విలియమ్ ఎస్కో(అమెరికా), టకాకి కజిత(జపాన్), సెర్జి హరోష్ (ఫ్రాన్స్), అడాయి యోనత్ (ఇజ్రాయెల్), మహ్మద్ యూనస్(బంగ్లాదేశ్), జీన్ టిరోలే(ప్రాన్స్), డాక్టర్ స్వామినాథన్, రక్షణ సలహాదారు సతీష్‌రెడ్డితో సహా దేశ, విదేశీ శాస్త్రవేత్తలు, కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థలు, పలు విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు ఇతర ముఖ్యులు హాజరయ్యారు. వ్యవసాయానికి పెద్దపీట.. 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే సుస్థిర వ్యవసా యాభివృద్ధే లక్ష్యంగా పెట్టుకున్నందునేమో గానీ 104వ భారతీయ సైన్స్ కాంగ్రెస్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. పోషకాహారం, పర్యావరణ మార్పుల ప్రభావం, పంట మార్పిడి వంటి పలు అంశాలపై పెద్దఎత్తున చర్చ జరిగింది. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలపై ఏకంగా ఓ ప్లీనరీయే జరిగింది. మిగతా అన్ని అంశాలపై ఉప సద స్సులు జరిగాయి. నోబెల్‌కు రూ. 100 కోట్లపై విమర్శలు కాగా తెలుగు శాస్త్రవేత్తలు నోబెల్ బహుమతి సాధిస్తే రూ. 100 కోట్ల నగదు పురస్కారాన్ని అందిస్తామనడం, నోబెల్ ను సాధించడానికి చిట్కాలు చెప్పాలం టూ సీఎం చంద్రబాబు నోబెల్ గ్రహీత టకాకి కజితను అడగడం విమర్శలకు తావిచ్చింది. భట్రాగర్ అవార్డు గ్రహీత, ఇక్రిశాట్ శాస్త్రవేత్త రాజీవ్ కుమార్ వర్షి ఒకింత తీవ్రంగానే స్పందిస్తూ.. ఏపీలో నోబెల్ బహుమతులు గెలవడానికి అనువైన పరిస్థితులున్నాయో లేవో ముందు చూడాలని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై ఆలోచనలు చేయాలని చురకలంటించారు. పర్స్‌తో మొబైల్ చార్జింగ్! చూడ్డానికి పర్స్‌లా ఉన్నా దీనికో ప్రత్యేకత ఉంది. మీ మొబైల్ ఫోన్‌ను ఇం దులో పెట్టుకుని, జేబులో ఉంచితే చాలు బ్యాటరీ రీచార్జ్ అవుతుంది. దీన్ని శక్తివంతమైన మైక్రాన్స్ తో తయారు చేశారు. థిన్ఫిల్మ్ టెక్నాలజీని జోడించారు. ఇందులోని మాడ్యుల్స్ రేడియేషన్ ద్వారా సూర్యరశ్మిని విద్యుత్‌గా మారుస్తాయి. దీంతో గంటసేపట్లోనే మీ మొబైల్ రీచార్జ్ అవుతుంది. ఇప్పుడే దీన్ని కొనేయాలనే ఆసక్తిగా ఉందా? అయితే మీరు కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇది మార్కెట్లోకి రావడానికి మరింత సమయం పడుతుందని సైన్స్ కాంగ్రెస్‌కు వచ్చిన స్విట్జర్లాండ్ శాస్త్రవేత్త తెలిపారు. – తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ రోబో యూనివర్సిటీ క్యాంపస్: ఇప్పటివరకూ వైద్యులు శస్త్రచికిత్సలు చేస్తుంటే అవసర మైన సందర్భాల్లో రోబోలు సాయం చేస్తుండేవి. కానీ మున్ముందు రోబోలే శస్త్రచికిత్సలు చేస్తుంటే వైద్యులు వాటికి సహకరించే రోజులు రాబోతున్నాయని ఢిల్లీ ఐఐటీకి చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సుభీర్ కుమార్ సాహా పేర్కొన్నారు. సైన్స్ కాంగ్రెస్‌లో శనివారం ‘రోబోటిక్స్’ అంశంపై నిర్వహించిన సదస్సులో సాహా ప్రసంగించారు. మన దేశంలోకి ఇప్పటికే రోబోలు ప్రవేశించాయని, పలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో రోబోటిక్ శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో వీటి వినియోగం పెరగనుందన్నారు. శస్త్రచికిత్సలు చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో వైద్యుల చేతులు వణికే అవకాశం ఉందని, రోబోటిక్ శస్త్ర చికిత్సల్లో ఈ పరిస్థితి ఉండదని చెప్పారు. అలాగే ఇప్పటివరకు శరీర భాగాలను కోసి ఆపరేషన్ చేయాల్సి వచ్చేదని, కానీ రోబోటిక్ విధానంలో సన్నని పరికరాన్ని శరీరంలోకి పంపి సులువుగా ఆపరేషన్ చేయొచ్చని వివరించారు. ముఖ్యంగా కేన్సర్ శస్త్రచికిత్సల్లో రోబోటిక్ విధానం మంచి ఫలితాలు ఇస్తోందని పేర్కొన్నారు. అలాగే డ్రోన్ల వినియోగం ప్రపంచవ్యాప్తంగా ఊపందుకుందని చెప్పారు. మరికొన్ని రోజుల్లో భారత్‌లో కూడా డ్రోన్లను విస్తృతంగా వినియోగించే అవకాశం ఉందన్నారు. రోబోల కృత్రిమ మేధస్సు వల్ల ఎలాంటి నష్టముండదన్నారు. రోబోల వల్ల మానవ వనరుల వినియోగం తగ్గిపోతుందని, ఉపాధికి ప్రమాదం ఉంటుందన్న అనుమానాలున్నాయని, అయితే అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం లేదని చెప్పారు. -
తిరుపతిలో ఆకట్టుకున్న అగ్రికల్చరర్ స్టాల్
-
తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్ సందడే..సందడి
-
ప్రముఖ శాస్త్రవేత్తలకు ‘ఇస్కా’ అవార్డులు
హెచ్‌సీయూ వీసీ అప్పారావుకు మిలీనియం ప్లేగ్ ఆఫ్ హానర్ సాక్షి ప్రతినిధి, తిరుపతి: సైన్స్ కాంగ్రెస్‌లో 20 మంది భారత శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఇస్కా)–2016 పురస్కారాలను ప్రదానం చేశారు. గతంలో ఇస్కా సదస్సులకు జనరల్ ప్రెసి డెంట్‌గా వ్యవహరించిన అశోక్‌కుమార్ సక్సేనా కు శాస్త్రవేత్త అశుతోశ్ ముఖర్జీ మెమోరియల్ అవార్డు లభించింది. బెంగళూర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొ.భైరప్పకు సీవీ రామన్ బర్త్ సెంటినరీ అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని ‘ఎయిమ్స్’ ప్రొఫెసర్ ఎన్ఆర్ జగన్నాథానికి ఎస్కే మిత్ర బర్త్ సెంటినరీ అవార్డు దక్కింది. మణిపూర్ వర్సిటీ ప్రొఫెసర్ అరుణ్‌కుమార్‌కు బీర్బల్ సహానీ బర్త్ సెంటినరీ అవార్డును అంద జేశారు. చెన్నై ఆస్పత్రి కార్డియాలజిస్ట్ ఐ.సత్య మూర్తికి డీఎస్ కేతారి మెమోరియల్ అవార్డు లభించింది. వెస్ట్‌బెంగాల్ వర్సిటీ ఆఫ్ టెక్నాల జీలో ప్రొ.బీపీ చటర్జీకి ఆర్సీ మల్హోత్రా మెమోరి యల్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు దక్కింది. నోబెల్ గ్రహీతలకు గోల్డ్ మెడల్స్ నోబెల్ పురస్కార గ్రహీతలకు ప్రధాని ఇస్కా జనరల్ ప్రెసిడెంట్ గోల్డ్‌మెడల్స్‌ను ప్రదానం చేశారు. ప్రొఫెసర్ మోర్నార్ విలియం ఎస్కో (అమెరికా) మహ్మద్ యూనస్ (బంగ్లాదేశ్), ప్రొఫెసర్ టకాకి కజిటా(జపాన్), ప్రొఫెసర్ సర్జే హరోచి(ఫ్రాన్స్), ఫ్రొఫెసర్ అడా ఇ యెనాత్ (ఇస్రాయిల్), ప్రొఫెసర్ టిరోలే (ఫ్రాన్స్)లకు పతకాలను అందజేశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పొదిలి అప్పారావుకు మిలీనియం ప్లేగ్ ఆఫ్ హానర్ అవార్డు లభించింది. మొక్కల్లో ఇమ్యూనైజేషన్ అభివృద్ధికి విస్తృత పరిశోధనలు చేస్తున్న అప్పారావు స్వస్థలం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం బోరుపాలెం. పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రఖ్యాత శాస్తవేత్త తపతీ బెనర్జీకి కూడా బంగారు పతకాన్ని ప్రదానం చేశారు. మిగతా వారికి నేడుప్రదానం చేయనున్నారు. -
సైన్స్ కాంగ్రెస్‌లో సైన్స్ లేదు
ప్రఖ్యాత శాస్త్రవేత్త డా. పీఎం భార్గవ విమర్శ హైదరాబాద్: తిరుపతిలో ఈ నెల 3 నుంచి 7 వరకు నిర్వహించే భారతీయసైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో సూడో సైన్స్ ను ప్రచారం చేయడం సహించరానిదని, ఈ సమావేశా లను సమర్థించే శాస్త్రజ్ఞుల డిగ్రీలను రద్దు చేయాలని ప్రముఖ శాస్త్రవేత్త, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలుక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) వ్యవస్థాపక డైరెక్టర్ డా. పీఎం భార్గవ అభిప్రాయపడ్డారు. సైన్స్ కాంగ్రెస్‌లో అసలు సైన్స్ యే లేదన్నారు సైన్స్ .. లాజిక్ రీజన్ (కారణం), ప్రూఫ్, ఎవిడెన్స్(సాక్ష్యం) అంశాలకు సంబంధించిందన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో జరుగుతున్న శాస్త్ర పరిశోధనలను అంతర్జాతీయ శాస్త్ర, సాంకేతికతతో బేరీజు వేసుకొని దేశవాళి పరిశోధనలకు దిశానిర్దేశం చేస్తూ.. యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం, శాస్త్ర ప్రగతి ని ప్రజాజీవితంలో అంతర్భాగం చేయడం లాంటి అంశాలతో చర్చ జరగాల్సిన సమా వేశంలో ఆధ్యాత్మికం, చేతబడులు, హోమి యోపతి, జ్యోతిష్యం లాంటి అశాస్త్రీయ విషయాలపై దృష్టి కేంద్రీకరించడం దుర దృష్టకరమన్నారు. ఇలాంటి వాటిని ప్రధాని, ప్రభుత్వం ప్రోత్సహించడం చేటన్నారు. 1940–50 దశకంతో పోల్చితే నేటి సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు దిగజారుడుతనంతో ఉన్నాయన్నారు. నిరంకుశత్వాన్ని ఎదుర్కొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది సైన్సేనని అన్నారు. ప్రస్తుతం విజ్ఞానశాస్త్రాన్ని ఎగతాళి చేస్తూ మూఢనమ్మకాలను ప్రోత్సహించడం ఈ సమావేశ ఉద్దేశంగా కనబడుతోందన్నారు. నేడు భారత్‌లో అంతా అశాస్త్రీయమే తప్ప శాస్త్రీయత గురించి 0.001 శాతం కూడా చర్చించే వారు లేరన్నారు. అనంతరం జనవిజ్ఞాన వేదిక తెలంగాణ అధ్యక్షుడు ప్రొ. ఎం ఆదినారాయణ, ఉపాధ్యక్షుడు బీఎన్ రెడ్డి, జాతీయ నేతలు రమేష్, ప్రొ. వెంక టేశ్వర్‌రావు కోయ, కాశప్ప మాట్లాడారు. -
ఆంధ్రప్రదేశ్‌లో రేపు ప్రధాని మోదీ పర్యటన
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. తిరుపతిలో జరిగే జాతీయస్థాయి 104వ భారత సైన్స్ కాంగ్రెస్ సదస్సును ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని...తిరుమల వెళ్లి వెంకన్న దర్శనం చేసుకుంటారు. కాగా జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సువిశాల ఆవరణలో సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వివిధ దేశాలకు చెందిన ఆరుగురు నోబెల్ బహుమతి గ్రహీతలు హాజరు కానున్నారు. ఈ సదస్సులో ప్రధాని తన సందేశం ఇవ్వడంతో పాటు నోబెల్ గ్రహీతలతో ముఖాముఖిలో పాల్గొంటారు. ‘సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ నేషనల్ డెవలప్మెంట్’ అనే అంశంపై జరుగుతున్న ఈ సదస్సుకు 10,500 మంది రిజిస్టర్ చేసుకోగా, వివిధ దేశాల నుంచి 200 మంది శాస్త్రవేత్తలు హాజరు కానున్నారు. -
సైన్స్ కాంగ్రెస్‌కు ఏర్పాట్లు పూర్తి
తిరుపతి: తిరుపతిలో 104వ భారత సైన్స్ కాంగ్రెస్(ఐఎస్సీ) సమ్మేళనం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఈ సమ్మేళనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఐదు రోజులపాటు జరుగనున్న సైన్స్ కాంగ్రెస్ కోసం శ్రీవేంకటేశ్వరవిశ్వవిద్యాలయ ఆవరణంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. విశ్వవిద్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రధానమంత్రికి స్వాగతం పలికే ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని జనానికి చేరువచేసే దిశగా పలు ప్రదర్శనలు, సదస్సులు, సమావేశాలు నిర్వహించనున్నారు. తొమ్మిది మంది నోబెల్ బహుమతి గ్రహీతలు, శాస్త్ర, సాంకేతిక రంగాలలో నిష్టాతులైన 200 మంది శాస్త్రవేత్తలు, జాతీయ ప్రయోగశాలల శాస్త్రవేత్తలు, ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎస్‌ఇఆర్‌ఎస్ తదితర సంస్థలకు చెందిన 18వేల మంది ప్రతినిధులు సైన్స్ కాంగ్రెస్‌కు హాజరుకానున్నారు. -
ఇస్కా.. చూడిక
రేపటి నుంచి తిరుపతిలో సైన్స్‌కాంగ్రెస్ సదస్సు హాజరుకానున్న ప్రధానమంత్రి సదస్సులో పాల్గొననున్న ఆరుగురు నోబెల్ గ్రహీతలు ఎస్వీ యూనివర్సిటీలో ఏర్పాట్లు పూర్తి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మరో 24 గంటల్లో మొదలుకాబోతుంది. గత రెండు నెలలుగా తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు రూ.175కోట్ల ఖర్చుతో తిరుపతి నగరాన్ని అందంగా ముస్తాబుచేశారు. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును 3వ తేదీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎస్వీయూ స్టేడియంలో ఏర్పాటుచేసిన సభలో ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వివిధ దేశాలకు చెందిన ఆరుగురు నోబెల్ బహుమతి గ్రహీతలు హాజరుకానున్నారు. ఈ సదస్సులో ప్రధాని తన సందేశం ఇవ్వడంతో పాటు నోబెల్ గ్రహీతలతో ముఖాముఖిలో పాల్గొంటారు. యూనివర్సిటీక్యాపంస్: ‘సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ నేషనల్ డెవలప్మెంట్’ అనే అంశంపై జరుగుతున్న 104వ సైన్స్ కాంగ్రెస్‌కు 10,500 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వివిధ దేశాల నుంచి 200 మంది శాస్త్రవేత్తలు హాజరవుతారు. ఈ సందర్భంగా దాదాపు 10 మందికి ప్రధాని వివిధ రకాల అవార్డులను అందజేస్తారు. 3వ తేదీ మధ్యాహ్నం నుంచి శ్రీనివాస ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో నోబెల్ గ్రహీతలు తమ సందేశాలను ఇవ్వనున్నారు. 4 నుంచి 7వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 5 వేదికల్లో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా బ్లూ ఎకానమీ, ఫుడ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, నెట్ జనరేషన్ నెట్వర్క్, క్లైమేట్ చేంజ్, లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పాంట్రియర్స్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్, స్పేస్ టెక్నాలజీ, 5జీ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆఫ్సోర్ విండ్ ఫామ్స్, నానో టెక్నాలజీ, తదితర అంశాలపై 32 ప్లీనరీ ల్లో నిర్వహిస్తారు. వీటిల్లో ఎంఎస్ స్వామినాథన్, సతీష్‌రెడ్డి, ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్, తదితర ప్రముఖులు తమ సందేశాలను, అభిప్రాయాలను అందిస్తారు. మధ్యాహ్నం నుంచి 34 వేదికల్లో టెక్నికల్ సెషన్స్ జరుగుతాయి. వీటిల్లో పరిశోధకులు తమ పరిశోధన పత్రాలు సమర్పిస్తారు. 4 నుంచి చిల్డ్రన్ కాంగ్రెస్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా 4 తేదీ నుంచి 6వ తేదీ వరకు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లో చిల్డ్రన్ కాంగ్రెస్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్, భారత ప్రభుత్వ సాంకేతిక సలహాదారు చిదంబరం, రక్షణశాఖ సలహాదారు సతీష్‌రెడ్డి ఈ సమావేశంలో ప్రసంగిస్తారు. ఇందులో భాగంగా ఉదయం పూట ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిపుణులు ఉపన్యా సం ఇస్తారు. మధ్యాహ్నం నుంచి బాలలను ఉత్తేజపరిచే సైన్స్ సినిమాలు, డాక్యుమెంటరీలు ప్రదర్శిస్తారు. 1,200 మంది పిల్లలు హాజరుకానున్నారు. 4న ఉమెన్ కాంగ్రెస్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా 4వ తేదీన శ్రీనివాస ఆడిటోరియంలో ఉమెన్ కాంగ్రెస్ సమావేశం నిర్వహిస్తారు. ఈ సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. 10మంది మహిళా శాస్త్రవేత్తలు ప్రసంగించి మహిళలను ఉత్తేజపరుస్తారు. 12 వేల మందికి ఏర్పాట్లు ప్రధాని ప్రారంభించే సమావేశంలో 12వేల మంది కూర్చునేవిధంగా స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. వీఐపీలు, వీవీఐపీలు, అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులకు వేర్వేరుగా సీట్లు కేటాయించారు. ఈ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు 10 ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. ఏ బ్లాక్ వద్ద వంటచేసి అన్ని ఫుడ్ కోర్టులకు పంపిణీ చేస్తారు. -
గుడ్ సైన్స్
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రేపు తిరుపతిలో ప్రారంభం అవుతున్న 104వ ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ లో భాగంగా.. జనవరి 4వ తేదీన మహిళా సైన్స్ కాంగ్రెస్ జరుగుతోంది. సైన్స్‌లో నోబెల్ గ్రహీతలు, సైన్స్ శాస్త్రవేత్తలు, సైన్స్ పరిశోధకులు, సైన్స్ ప్రొఫెసర్లు హాజరవుతున్న ఈ మహిళా కాంగ్రెస్‌లో జాతీయ అభివృద్ధిలో మహిళా సైంటిస్టుల పాత్ర; శాస్త్ర, సాంకేతిక రంగాలలో మహిళలకు గల అవకాశాలు అనే అంశాలపై ప్రసంగాలు ఉంటాయి. ఈ సందర్భంగా సాక్షి ‘ఫ్యామిలీ’... ముగ్గురు ఇస్రో మహిళా శాస్త్రవేత్తల ఉద్యోగ జీవితంలోని స్ఫూర్తిదాయకమైన సందర్భాలను మీకు అందిస్తోంది. థ్రిల్స్ : నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనూరాధ ఇస్రోలో సీనియర్ మోస్ట్ ఆఫీసర్. భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తున అంతరిక్షంలోకి సమాచార ఉపగ్రహాలను పంపించడంలో ఎక్స్పర్ట్. 34 ఏళ్లుగా ఇస్రోలో ఉన్నారు. తొమ్మిదేళ్ల వయసులో తొలిసారి స్పేస్ గురించి ఈ అమ్మాయికి సందేహాలు తలెత్తాయి. ‘అపోలో’ లాంచ్ అవుతున్న సమయం అది. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి మీదకు దిగేశాడని భూమ్మీదకు వార్త వచ్చేసింది! అప్పట్లో టీవీ లేదు. పేరెంట్స్, టీచర్స్ చెప్పుకుంటుంటే వినింది అనూరాధ. ఒక్కసారిగా ఎగై్జట్ అయింది. మనిషేంటీ? చంద్రుడి పైకి వెళ్లడం ఏంటి?! గుండెలోంచి ఏదో ఫీలింగ్ తన్నుకొచ్చింది. మనిషి చంద్రుడిపై అడుగుపెట్టిన ఆ దృశ్యాన్ని ఊహించుకుంటూ కన్నడంలో చిన్న కవిత రాసింది. ఇప్పుడు ఆమె ఇస్రో లోని మహిళా సైంటిస్టులకు ఓ రోల్ మోడల్. ‘ఆడవాళ్లకు, సైన్స్కూ సెట్ కాదు’ అనే మాట వినిపిస్తే అనూరాధ అపరకాళి అయిపోతారు! జ్ఞాపకం ఉంచుకోవలసినదేదీ అనూరాధకు ఇష్టమైన సబ్జెక్టు కాదు. లాజిక్ ఉంటే ఇష్టపడతారు. లాజిక్ ఉన్నప్పుడే మర్చిపోవడం, జ్ఞాపకం పెట్టుకోవడం ఉండదు కదా. అందుకే ఆమెకు లాజిక్ చుట్టూ అల్లుకుని ఉండే సైన్స్ మీద అంత ప్రేమ. అనూరాధ ఒక మాట అంటారు.. ‘‘భారతదేశంలోని ఏ అమ్మాయినైనా అడిగి చూడండి, మేథ్స్ తన ఫేవరేట్ సబ్జెక్ట్ అని చెబుతుంది’’ అని. ఆమె అలా అనడం ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుంది. 1982లో అనూరాధ ఇస్రోలో చేరారు. అప్పుడు కొద్ది మంది మహిళలు మాత్రమే ఉండేవారు. ఇంజినీరింగ్ విభాగంలోనైతే మరీ తక్కువ. ఆమె బ్యాచ్‌లో ఐదుగురు మహిళా ఇంజినీర్లు ఉండేవారు. ప్రస్తుతం ఇస్రోలోని 16 వేల మంది ఉద్యోగులలో 20 నుంచి 25 శాతం మందికి పైగా మహిళలే. ‘‘అందుకే మహిళగా మేము ప్రత్యేక గుర్తింపును కోల్పోయాం’’ అని నవ్వుతారు అనూరాధ. కొన్నిసార్లయితే తను మహిళనన్న విషయమే మర్చిపోతారట అనూరాధ. ఇస్రోలో నియామకాలు, పదోన్నతుల విధానాలు అన్నీ ‘మనకెంత వచ్చు, మనమేం చెయ్యగలం’ అనే రెండు ప్రధాన అంశాలను బట్టే ఉంటాయి తప్ప, జెండర్‌ని బట్టి కాదు అని చెబుతున్నప్పుడు ఆమె సగర్వమైన ఎక్స్ప్రెషన్ ఇస్తారు. సైన్స్‌లో కానీ, ఇంకెక్కడైనా కానీ ఎంత ఎక్కువమంది ఉద్యోగినులు ఉంటే అంత ఎక్కువగా మన అమ్మాయిలు స్ఫూర్తి పొందుతారని అనూరాధ బలంగా విశ్వసిస్తున్నారు. అనూరాధ టి.కె. జియోశాట్ ప్రోగ్రామ్ డైరెక్టర్, ఇస్రో శాటిలైట్ సెంటర్ స్క్రీన్ ప్లే : చందమామ రీతూకి నచ్చిన నగరం.. గగనం! పాలపుంతల్లోంచి వచ్చిన పిల్లలా ఎప్పుడూ నింగిలోకే చూస్తుండేది. పుట్టింది లక్నో. ఆమె ఊహలు పుట్టి పెరిగింది ఆకాశంలో. పగలంతా చుక్కలు ఏం చేస్తుంటాయి? చంద్రుడలా ఎందుకు చిక్కిపోతాడు? మళ్లీ ఎందుకలా బొద్దుగా జాబిల్లిలా మారిపోతాడు? ఆకాశంలో ఏముంది? ఆ వెనుక ఇంకా ఏముందీ? ఇవీ.. ఐదూ పదేళ్ల రీతూ ఆలోచనలు. సమాధానాల కోసం సైన్స్ స్టూడెంట్ అయింది. ఫిజిక్స్, మేథ్స్, కెమిస్ట్రీ. అయితే రీతూ డౌట్స్ తీర్చడానికి వాటి శక్తి సరిపోలేదు. న్యూస్ పేపర్లను ముందేసుకునేది! ‘నాసా’ వార్త కనిపిస్తే కట్ చేసి పెట్టుకునేది. రేడియోలో ‘ఇస్రో’ మాటొస్తే చేస్తున్న పని వదిలేసి, రెండు చెవులూ ట్యూన్ చేసుకునేది. స్పేస్ ఆమె శ్వాస. స్పేస్ సైన్స్ ఆమె చూపు! పోస్ట్‌గ్రాడ్యుయేషన్ అయింది. చుట్టూ ఉన్న ఉద్యోగాలను వదిలేసి, ఎక్కడో దూరంగా క్రిస్మస్ చెట్టుకున్న నక్షత్రం లాంటి ఇస్రోలో జాబ్‌కు అప్లై చేసింది. ఇంటర్వూ్య బోర్డులో ఆమె కనబరిచిన విజ్ఞానం, ఆమెలో కనిపించిన జిజ్ఞాస బోర్డు సభ్యుల్ని ఇంప్రెస్ చేశాయి. ‘కంగ్రాచ్యులేషన్స్ మిస్ రీటా. యూ ఆర్ సెలక్టెడ్’! ఎక్కడో విశ్వాంతరాళం నుంచి విన్నట్టున్న అభినందన. ఆ క్షణం నుంచి తనో స్పేస్ సైంటిస్ట్! టార్గెట్‌ను విజయవంతంగా పూర్తి చేసుకొచ్చిన అంతరిక్ష నౌకలా ఇంట్లో ల్యాండ్ అయింది రీతూ. రీతూ పుట్టింది ఎప్పుడైనా కావచ్చు. ఇస్రోలో పుట్టి ఇప్పటికి 18 ఏళ్లు. అదే ఆమెకు లెక్క. మార్స్ మిషన్ సహా, ప్రతి ప్రాజెక్టులోనూ ఆమె వంతు ఉంది. టీమ్ వర్క్ భాగస్వామిగా ఆమె సంతకం ఉంది. 2012లో మార్స్ మిషన్ మొదలైంది. 18 నెలల్లో మార్స్‌ని అంగారక గ్రహం మీదకి పంపాలి. చాలా తక్కువ టైమ్. అప్పటికింకా గ్రహాంతర బృహత్కార్యాలను చేపట్టిన అనుభవం ఇస్రోకి లేదు. మార్స్ మిషనే మొదటిది. పేరైతే ఫిక్స్ అయింది.. ‘మంగళ్యాన్’. అది సక్సెస్ అయితేనే పేరు! ఛాలెంజ్ ఉన్నప్పుడు టెన్షన్ ఉంటుంది. రీతూలోనూ టెన్షన్ మొదలైంది. రీతూ, మిగతా సైంటిస్టులు రోజంతా ఇంజినీర్లతో కలిసి కూర్చోవాలి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలీదు. శని, ఆదివారాలు కూడా తాత్కాలికంగా రద్దయిపోయాయి. నో.. ఫ్యామిలీ. ఓన్లీ ఇస్రో ఈజ్ ద ఫ్యామిలీ. రీతూకి ఇద్దరు చిన్నపిల్లలు. వాళ్లను చూసుకునేదెవరు? మొదట్లో సతమతమైంది. తర్వాత సర్దుకుంది. ‘నేనున్నాను’ అన్నాడు భర్త. ‘మేం లేమా?’ అన్నారు అక్కాచెల్లెళ్లు. అలా పద్దెనిమిది నెలల పాటు భవబంధాలను తెంపేసుకున్నారు రీతూ! భూమ్మీద పనిచేస్తున్నట్లు లేదు ఆమెకు. ఆకాశంలోకి వెళ్లిపోయి, అక్కడేదో దేవుడు అప్పగించిన పనిని చేస్తున్నట్లుగా ఉంది. పనే దైవం అయినప్పుడు, శాస్త్రవేత్తలకు కూడా దేవుడుంటాడా అనే ప్రశ్నే రాదు. రీతూ కొడుక్కి 11 ఏళ్లు. కూతురుకి 5 ఏళ్లు. ఎంత నాన్న చేసినా, ఎంత చిన్నమ్మలు చేసినా అమ్మ ఉండాల్సిందే. రీతూ డ్యూటీ నుంచి రాగానే పిల్లలు మీద పడిపోయేవారు. కదలనిచ్చేవారు కాదు. స్కూల్లో ఏం జరిగిందో అప్పటికప్పుడు ఆ తల్లి వినవలసిందే. అన్నీ అమ్మతో చెప్పుకుంటే వాళ్లకెంత సంతోషంగా ఉండేదో, రీతూకీ అంత రిలీఫ్‌గా ఉండేది. అలా చూస్తే మార్స్ మిషన్ సక్సెస్‌లో రీతూ పిల్లల పార్ట్ కూడా ఉందనుకోవాలి! తల్లికి ముద్దు ముద్దు మాటలతో రిలీఫ్‌ని ఇచ్చి, ఆమెను తిరిగి ఉత్సాహంగా పనికి పంపింది వాళ్లే కాబట్టి. ‘‘మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అంటారు కదా! మార్స్ సక్సెస్ అయింది కాబట్టి ఇక మీదట ఉమెన్ ఫ్రమ్ మార్స్ అనొచ్చా’’ అని ఇటీవల బి.బి.సి. జర్నలిస్టు గీతా పాండే రీతూను అడిగారు. అప్పుడు రీతూ ఏం చెప్పారో తెలుసా? ‘‘ఐ యామ్ ఎ ఉమన్ ఫ్రమ్ ఎర్త్’’ అన్నారు! ‘‘ఒక అద్భుతమైన అవకాశాన్ని పొందిన మహిళను’’ అని చెప్పారు! రీతూ కరిధాల్ డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్, మార్స్ ఆర్బిటర్ మిషన్ ఫిక్షన్ : స్టార్ టెక్ రీతూ.. రాత్రిపూట ఆకాశాన్ని చూసి ఇన్స్పైర్ అయితే, నందిని.. టీవీలో ‘స్టార్ టెక్’ ప్రోగ్రామ్ చూసి సైన్స్ మీద ఇష్టం పెంచుకున్నారు. నందినీ వాళ్లమ్మ మేథ్స్ టీచర్. నాన్న ఇంజినీర్. ఆయనకు ఫిజిక్స్ అంటే ప్రాణం. కుటుంబ సభ్యులంతా కూర్చొని సైన్స్ ఫిక్షన్ ప్రోగ్రామ్ స్టార్ టెక్‌ను చూస్తుండేవారు... కలిసి నక్షత్రాలను చూస్తున్నట్లు! అప్పుడైతే నందిని ఏం అనుకోలేదు. సైంటిస్ట్ అయిపోవాలని. పెద్దయ్యాక అనుకోకుండా ‘ఇస్రో’లో చేరిపోయారు! ‘హౌ లక్కీ కదా’ అనుకుంటారట ఇప్పుడు. ఇరవై ఏళ్ల క్రితం నందిని.. చెయ్యడమే ఇస్రోకి అప్లై చేశారు. ఫస్ట్ అప్లికేషన్. అదే ఇప్పటి వరకు ఫస్ట్ ఉద్యోగం. ఇన్నేళ్ల ఆమె కెరియర్లోని అద్భుతం.. మార్స్ మిషన్కి పనిచేయడం. నందిని దృష్టిలో మార్స్ మిషన్ ఇస్రో కోసం మాత్రమే కాదు. ఇండియా కోసం, ప్రపంచం కోసం కూడా. మాక్కూడా కొంత ‘స్పేస్’ ఇవ్వండి అని విదేశాలు సైతం ఇండియా వైపు చూసేలా చేసిన మార్స్ మిషన్‌లో తన వంతు కృషి కూడా ఉంది కదా అని ఆలోచిస్తే నందినికి అంతరిక్ష విహారం చేసినట్లుగా ఉంటుందట! చిన్నప్పుడు పిల్లలందరం ఆకాశం గురించి మాట్లాడుకుంటాం కదా. అలా ప్రపంచ దేశాలన్నీ ఇస్రో గురించి గొప్పగా చెప్పుకోవాలని, ఇస్రోలో ఏం జరుగుతోందో తెలుసుకోడానికి ఉవ్విళ్లూరుతూ ఉండాలని నందిని ఆశ. మార్స్ మిషన్ సక్సెస్‌ని ఇస్రో సైంటిస్టుగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు నందిని. ‘బెంగళూరులో మా ఆఫీస్‌కి వచ్చిపోతున్నప్పుడు చూడాలి మమ్మల్ని. ఎంత రికగ్నిషనో చెప్పలేను’ అని నవ్వేస్తారు నందిని. థ్రిల్లింగ్ ఉంటుందట.. అందరూ తమను అలా అభినందనగా చూడ్డం. ఇప్పుడు మోదీజీ ఆమెకు ఇంకొక థ్రిల్లింగ్ ఇచ్చారు. రెండు వేల రూపాయల నోటు మీద మార్స్ మంగళ్యాణ్ శాటిలైట్‌ను ముద్రించడం ఇస్రో ఉద్యోగులుగా తమకు దక్కిన గౌరవంగా నందిని భావిస్తున్నారు. మార్స్ మిషన్ ప్రారంభంలో నందిని, ఆమె సహోద్యోగులు రోజూ 10 గంటలు పనిచేసేవారు. లాంచ్ డేట్ దగ్గర పడడంతో ఆ పది గంటలు పద్నాలుగు గంటలు అయ్యాయి. ఉదయాన్నే ఆఫీసుకు వచ్చేవారు. రాత్రి బాగా పొద్దుపోయేవరకు అక్కడే ఉండేవారు. ఒక్కోసారి రెండోరోజు మధ్యాహ్నం మాత్రమే ఇంటికి వెళ్లేందుకు కుదిరేది. అదీ కాసేపు నిద్రపోడానికి . లేచాక టైమ్ చూసుకోవడం, మళ్లీ ఆఫీసుకు పరుగెత్తడం. ప్రాజెక్టులో ఊహించని విధంగా ఏవో సమస్యలు తలెత్తేవి. వాటికి కారణాలు కనుక్కోవడం, పరిష్కారాలు కనిపెట్టడం.. ఇంకో ప్రాజెక్టు నెత్తికి ఎత్తుకున్నంత పని. వీటన్నిటినీ నందిని నెగ్గుకొచ్చారు కానీ, కూతురి ఎగ్జామ్స్‌కి తను దగ్గర లేకపోవడమే ఇప్పటికీ ఆమెకు గుర్తుకొస్తుంటుంది. మార్స్ మిషన్ పనులు డెడ్‌లైన్‌కి సరిగ్గా మధ్యలో ఉన్నప్పుడు.. నందిని కూతురికి స్కూల్ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేశాయి. మంచి కాలేజీలో సీటు రావాలంటే మంచి మార్కులు రావాలి. పక్కనే ఉండి, కూతురికి కావలసినవన్నీ అమర్చిపెడుతూ, ఆమెను చదివించాలని నందినికి ఉండేది కానీ, అలా వీలుకాదని కూడా ఆమెకు తెలుసు. అయినప్పటికీ దొరికిన కొద్ది టైమ్‌లోనే ఆమె కూతురితో ఉన్నారు. ఇంటికీ, ఆఫీసుకీ మధ్య ఒక షటిల్‌లా తిరిగారు. కూతురితో పాటు ఉదయం నాలుగింటికే లేచేవారు నందిని. ఆమె చదువుతున్నంతసేపూ తోడుగా కూర్చొనేవారు. ఇప్పుడు అవన్నీ తలచుకుంటుంటే చాలా సంతోషంగా ఉంటుందట. కూతురికి మంచి మార్కులు వచ్చాయి. మేథ్స్‌లో అయితే నూటికి నూరు! ఇప్పుడా అమ్మాయి మెడిసిన్‌కి ప్రిపేర్ అవుతోంది. ‘‘అయితే మిమ్మల్ని ఇప్పుడు మార్స్ ఉమన్ అనొచ్చా?’’ అని గీతా పాండే అడిగినప్పుడు నందిని కూడా రీతూ చెప్పిన సమాధానమే చెప్పారు. ‘‘నా కాళ్లు భూమి మీదే ఉన్నాయి. మనలోని అత్యుత్తమమైనది బయటికి రావాలంటే మనం డౌన్ టు ఎర్త్ ఉండాలి’’ అన్నారు. ‘‘మార్స్ మిషన్ ఒక అడుగు మాత్రమే. ఇంకా వెయ్యడానికి చాలా అడుగులు ఉన్నాయి’’ అని కూడా నందిని అన్నారు. నందినీ హరినాథ్ డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్, మార్స్ ఆర్బిటర్ మిషన్ -
ఐఎస్సీ అభివృద్ధి పనుల్లో అవినీతి వరద
-
రూ.175 కోట్లతో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
ఈ నెల 26లోగా ఏర్పాట్లన్నీ పూర్తి: సీఎం చంద్రబాబు సాక్షి ప్రతినిధి, తిరుపతి/గుంటూరు (నగరంపాలెం): అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను తిరుపతిలో జనవరి 3 నుంచి 7 వరకు నిర్వహించనున్నామని సీఎం ఎన్.చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం రూ.175 కోట్లు వెచ్చించనున్నామన్నారు. ఈ నెల 26లోగా ఏర్పాట్లన్నీ పూర్తి కానున్నాయన్నారు. తిరుపతిలో స్థానిక బర్డ్, స్విమ్స్ ఆస్పత్రుల్లో నూతనంగా నిర్మించిన అదనపు వైద్య భవనాలను ఆయన శుక్రవారం ఉదయం ప్రారంభించారు. అనంతరం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ పనుల పురోగతిపై అధికారులు, మంత్రులతో సమీక్షించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఎస్వీ యూనివర్సిటీ వీసీ సమావేశ మందిరంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. తిరుపతిలో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నామన్నారు. జనవరి 3న ప్రధాని నరేంద్రమోదీ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ నెల 25 లేదా 26న ఢిల్లీ వెళ్లి ప్రధానిని ఆహ్వానిస్తానని చెప్పారు. సైన్స్ కాంగ్రెస్‌కు మొత్తం 10,500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. 9 మంది నోబెల్ బహుమతి గ్రహీతలైన ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, విదేశాల నుంచి మరో 200 మంది సైంటిస్టులు హాజరవుతున్నారన్నారు. తిరుపతిలోని అలిపిరి దగ్గరున్న 140 ఎకరాల్లో రూ.1,500 కోట్ల అంచనా వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సైంటిఫిక్ మ్యూజియం, సరికొత్త ప్లానిటోరియంల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం చెప్పారు. ఈ నెల 27 నుంచి తిరుపతిలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ సదస్సులు జరుగుతాయన్నారు. సీఎం బస్సులో పొగలు తిరుపతి పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం 11:10 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయంలో దిగి అక్కడినుంచి ప్రత్యేక బస్సు ద్వారా తిరుపతికి బయలుదేరారు. అయితే అవిలాల సర్కిల్ సమీపాన ఆయన ప్రయాణిస్తున్న బస్సులో సాంకేతికలోపం ఏర్పడడంతోపాటు పొగలు వచ్చాయి. దీంతో కాన్వాయ్‌లో ఉన్న సఫారీ కారులోకి సీఎం మారారు. -
జనవరి 3న తిరుపతికి ప్రధాని
► అదే రోజు ఎస్వీయూలో ఐఎస్సీ ప్రారంభం ►ఏర్పాట్లపై ఈనెల 16న తిరుపతిలో సీఎం సమీక్ష ►అధికారులందరూ బాధ్యతగా మెలగాలి ►కమిటీల కన్వీనర్లు,అధికారులతో కలెక్టర్ సమీక్ష సాక్షి ప్రతినిధి, తిరుపతి: జనవరి 3 నుంచి 7 వరకూ తిరుపతిలో జరిగే జాతీయ స్థారుు ఇండియన్స సైన్స్ సభలను అధికారులందరూ విజయవంతం చేయాలనీ, ఇందుకోసం వివిధ కమిటీల కన్వీనర్లు బాధ్యతగా ఏర్పాట్లను పర్యవేక్షించాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ సూచించారు. మొదటి రోజైన జనవరి 3న భారత ప్రధాని నరేంద్రమోదీ తిరుపతి చేరుకుంటారనీ, ఆయన చేతుల మీదుగానే సైన్స కాంగ్రెస్ ప్రారంభం జరుగుతుందన్నారు. ప్రధాని రాకను ధృవీకరిస్తూ పీఎంవో నుంచి ఆమోదం లభించినట్లు పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం తిరుపతి ఎస్వీయూ ఆవరణలో నిర్వహించిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారిక రివ్యూలో కలెక్టర్ పాల్గొన్నారు. సైన్స కాంగ్రెస్ సభల నిర్వహణ కోసం జరుగుతున్న పనుల పురోగతిపై సమీక్షించారు. రిసెప్షన్, రవాణా, బస, భోజనం, విద్యుత్, ప్రచారం, మేనేజ్మెంట్ తదితర కమిటీల్లో ఉన్న కన్వీనర్లు, కోకన్వీనర్లు తమకు కేటారుుంచిన పనులను సకాలంలో పూర్తి చేయాల్సి ఉందన్నారు. రానున్న 15 రోజులు కీలకమైనవి కాబట్టి అధికారులు సాధ్యమైనంత వరకూ సెలవులను పక్కన పెట్టాల్సి ఉంటుందన్నారు. దేశవిదేశాల నుంచి వచ్చే అతిథులు, వీవీఐపీలను అత్యంత జాగ్రత్తగా, ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాల్సి ఉందన్నారు. వారికిచ్చే ఆతిథ్యంలో ఎలాంటి లోపాలు జరగకూడదన్నారు. తిరుపతిలో జరిగేది ప్రపంచస్థారుు సైన్స పండుగగా కలెక్టర్ అభివర్ణించారు. సైన్స కాంగ్రెస్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ డీ. నారాయణరావు మాట్లాడుతూ, ఈనెల 16న సీఎం చంద్రబాబునాయుడు తిరుపతిలో మరోసారి సమీక్ష జరిపే అవకాశముందన్నారు. ఇప్పటివరకూ అన్ని విభాగాల్లోనూ 70 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఈనెల 20 నాటికి నూరు శాతం ఏర్పాట్లు పూర్తవుతాయని వివరించారు. సమీక్షలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి పండాదాస్, అర్బన్ ఎస్పీ జయలక్ష్మి, టీటీడీ జేఈవో ప్రోలా భాస్కర్, మహిళా యూనివర్సిటీ వీసీ డాక్టర్ దుర్గాభవానీతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిపుణుల సలహా మేరకే చెట్లు నరికివేత ఇస్కా సభల నిర్వహణ పేరుతో అధికారులు వర్సిటీ ఆవరణలోని అందమైన, భారీ చెట్లను నరికివేస్తున్నారు. పరిపాలన భవనం పక్కనే ఉన్న 40 ఏళ్ల నాటి వృక్షాలను కూడా నేలకూల్చారు. నీడనిచ్చే చెట్లను నరికివేస్తుంటే చూపరుల ప్రాణం ఉసూరుమంటోంది. ఇదే విషయాన్ని పాత్రికేయులు ఎస్వీయూ వీసీ డాక్టర్ దామోదరం దగ్గర ప్రస్తావించారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన వర్సిటీ భవనాలు కొన్ని చెట్ల కారణంగా పటిష్టత కోల్పోతున్నాయనీ, అంతేకాకుండా వివిధ రకాల అభివృద్ధి పనులకు అడ్డుగా ఉన్నందున వాటిని తొలగిస్తున్నామని వీసీ డాక్టర్ దామోదరం బదులిచ్చారు. అశోక, యూకలిప్టస్ చెట్ల వల్ల భవనాలకు నష్టం వాటిల్లుతుందనీ, ఉద్యానవన శాఖ నిపుణుల సూచనల మేరకు అటువంటి చెట్లను తొలగిస్తున్నామన్నారు. నష్టపోయే పచ్చదనాన్ని భర్తీ చేసేందుకు వర్సిటీ ఆవరణలో 7 వేల మొక్కలను నాటేందుకు ప్రణాళిక తయారు చేశామన్నారు. -
సైన్స్ కాంగ్రెస్‌కు 9 మంది నోబెల్ విజేతలు
జనవరి 3న ప్రారంభించనున్న ప్రధాని మోదీ తిరుపతి, ఎస్వీ యూనివర్సిటీ: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వర్సిటీ వేదికగా జనవరి 3 నుంచి 7వరకు జరిగే భారత సైన్స్ కాంగ్రెస్‌కు 9 మంది నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. వారిలో నలుగురు అమెరికా నుంచి, ఇద్దరు ఫ్రాన్స నుంచి, బంగ్లాదేశ్, జపాన్, ఇజ్రాయెల్ నుంచి ఒక్కొక్కరు రానున్నారు. వారిలో రసాయన శాస్త్రా్తనికి చెందిన వారు ముగ్గురు, ఫిజిక్స్ నుంచి నలుగురు, ఆర్థికశాస్త్రానికి చెందిన వారు ఒకరు, శాంతి బహుమతి పొందిన వారు ఒకరు ఉన్నారు. సైన్స్ కాంగ్రెస్‌ను జనవరి 3న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. నోబెల్ గ్రహీతలు ప్రత్యేక ఉపన్యాసాలు చేస్తారు. తిరుపతిలోనే గతంలో 1983లో ఇండియన్ సైన్స కాంగ్రెస్ నిర్వహించారు. 34 సంవత్సరాల తర్వాత 104వ సైన్స కాంగ్రెస్ జరగనుంది. ‘సైన్స అండ్ టెక్నాలజీ ఫర్ నేషనల్ డెవలప్మెంట్’అంశంపై ఈ సదస్సు నిర్వహించనున్నారు. చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్, ఉమెన్ సైన్స్ కాంగ్రెస్ కూడా ఉంటుంది. 12 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సులో నోబెల్ గ్రహీతలు అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కోబిల్క బ్రెరుున్ కెంట్, స్టాన్ఫోర్డ్ వర్సిటీ శాస్త్రవేత్త మొరానీర్ విలియం ఎస్కో, స్టాన్ఫోర్డ్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ స్టీవెన్ చూ, అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ డేవిడ్ జోనాథన్ గ్రాస్, జపాన్‌లోని టోక్యో వర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ టాకాకి కజిటా, ఫ్రాన్‌సలోని ఫారిస్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ సెర్జ్ హరోచీ, ఫ్రాన్‌సలోని స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌కు చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ జీన్ ట్రివలే, ఇజ్రాయెల్‌లోని వెరుుజమన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్‌సకు చెందిన మహిళా శాస్త్రవేత్త ప్రొఫెసర్ అడా ఏ యోనాథ్, బంగ్లాదేశ్ మీర్పూర్కు చెందిన మహమ్మద్ యూనిస్‌లు పాల్గొంటున్నారు. -
'ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం'
-జనవరిలో 3 నుంచి 7 వరకు , న్యూఢిల్లీ: తిరుపతిలో జనవరి 3 నుంచి 7 వరకు జరగనున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సును అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మానవవనరుల అభివృధ్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లపై వారు ఉన్నతాధికారులతో సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రారంభించే ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. దేశాభివృద్ధిలో శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం అనే ప్రధాన అంశంతో సదస్సు జరుగుతుందని చెప్పారు. ఏపీలోని విద్యార్థులను ఇందులో భాగస్వామ్యులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే 9 మందికి పైగా నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, ప్రపంచ వ్యాప్తంగా 15 వేల మంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారని మంత్రి గంటా తెలిపారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
సైన్స్ కాంగ్రెస్‌కు 9 మంది నోబెల్ విజేతలు
తిరుపతి: ఎస్వీయూనివర్సిటీలో జనవరి 3 నుంచి 7 వరకు నిర్వహించే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు 9 మంది నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు హాజరవుతారని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ జనరల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డీ.నారాయణరావు పేర్కొన్నారు. తిరుపతిలోని ఒక ప్రవేట్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సదస్సుకు 9 మంది నోబెల్ విజేతలు హాజరవుతారన్నారు. వీరిలో ముగ్గురు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన వారే ఉన్నారని తెలిపారు. అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఇజ్రాయిల్, బంగ్లాదేశ్‌కు చెందిన శాస్త్రవేత్తలు కూడా హాజరవుతారని చెప్పారు. సదస్సుకు 10 నుంచి 12 వేల మంది ప్రతినిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతిరోజు ఉదయం నోబెల్ విజేతలతో ఉపన్యాసాలు, మధ్యాహ్నం నుంచి పరిశోధన పత్రాల సమర్పణ ఉంటుందని నారయణరావు అన్నారు. సమావేశంలో ప్రధానంగా ఆహార భద్రత, సౌరశక్తి, ఫోటోవోల్టాయిక్ అండ్ థర్మల్, బ్లూ ఎకానమీ-భారతీయ కృషి, డిజిటల్ ఇండియా అండ్ స్మార్ట్ సిటీలు, సైబర్ సెక్యూరిటీ, స్వచ్చ భారత్, సైన్స్ విద్య- పరిశోధన, జినోమ్ ఎడిటింగ్, హ్యుమన్ మైక్రోనమీ, గ్రావిటేషన్ వేవ్స్, భారతీయ నైరుతి ప్రాంతాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పొరుగుదేశాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, తదితర అంశాలపై సమగ్ర చర్చలు జరుగుతాయన్నారు. వ్యవసాయం, అటవీ శాస్త్రం, పశువులు, పశుసంవర్ధకం, మత్స్య శాస్త్రం, ఇంజనీరింగ్ సెన్సైస్, పర్యావరణ శాస్త్రం, సమాచార ప్రసార సాంకేతికత, మెటీరియల్ సైన్స్, వైద్యశాస్త్రం, భౌతిక శాస్త్రం,రసాయన శాస్త్రం, గణిత శాస్త్రం, బయోటెక్నాలజీ తదితర అంశాలపై సమాంతర సమావేశాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో లోకల్ సెక్రటరీ ఎస్.విజయభాస్కర్‌రావు పాల్గొన్నారు. -
తిరుపతి ఖ్యాతి ఇనుమడించేలా సైన్స్ కాంగ్రెస్
► ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సి.ఎస్. టక్కర్ యూనివర్సిటీక్యాంపస్: తిరుపతిలో జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు ఏర్పాట్లు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్. టక్కర్ పిలుపునిచ్చారు. సైన్స్ కాంగ్రెస్ ఏర్పాట్లపై బుధవారం సాయంత్రం ఎస్వీయూ సెనేట్హాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్వీయూకు వచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జనవరిలో జరిగే 104వ సైన్స్ కాంగ్రెస్ ఎస్వీయూలో జరగడం విశేషమన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, సీఎం చంద్రబాబుతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్న నేపధ్యంలో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వివిధ సైన్స్ సంస్థల నుంచి సుమారు 12వేల మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సైన్స్ కాంగ్రెస్‌లో మహిళా సైన్స్ కాంగ్రెస్ , చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ కూడా నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాల్లో సాంకేతిక ప్రజ్ఞావంతులు, మేథావులు హాజరు అవుతున్నారని తెలిపారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ఈ కార్యక్రమం నిర్వహణకు సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ప్రభుత్వం, అధికారులు ఏఏ కార్యక్రమాలు చేయాలనేదానిపై స్పష్టత ఉండాలన్నారు. విశాఖపట్నం దేశంలోని అత్యంత పరిశుభ్ర నగరంగా అభివద్ధి చెందిందని అక్కడ బ్రిక్స్ సమ్మిట్, ప్లీట్ రివ్యూలు విజయవంతంగా నిర్వహించామన్నారు. అదేస్థాయిలో తిరుపతిలో కూడా సైన్స్ కాంగ్రెస్‌ను విజయవంతం చేసి ఎస్వీ ఖ్యాతిని అంతర్జాతీయస్థాయికి తీసుకుని రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్, ఎస్పీ జయలక్ష్మీ, ఎస్వీయూ వీసీ దామోదరం పాల్గొన్నారు. -
'పర్యావరణవేత్తగా శివుడి'కి చోటు దక్కలేదు!
మైసూర్: ప్రపంచంలో అతిపెద్ద పర్యావరణవేత్త పరమశివుడేనంటూ ఓ వృక్షశాస్త్రవేత్త సమర్పించాల్సిన పరిశోధక పత్రానికి మైసూర్లో జరుగుతున్న 'ఇండియన్ సైన్స్ కాంగ్రెస్'లో చోటు లభించలేదు. ప్రాచీన భారతంలోనే యుద్ధవిమానం ఉందంటూ గత సైన్స్ కాంగ్రెస్ సదస్సులో పేర్కొనడం వివాదం సృష్టించడంతోపాటు తాజా పరిశోధక పత్రంపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ పత్రం సదస్సు ముందుకు రాకపోవడం గమనార్హం. వృక్షశాస్త్రవేత్త డాక్టర్ అఖిలేశ్ పాండే సమర్పించిన ఈ పత్రాన్ని పర్యావరణ సైన్స్ విభాగంలో ఎంపిక చేయడం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. రాజకీయ అజెండాతోనే అశాస్త్రీయమైన అంశాలను సదస్సులో చేర్చారని నిర్వాహకులు, ఆతిథ్యమిస్తున్న మైసూర్ యూనివర్సిటీ బాధ్యులపై విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో సైన్స్ కాంగ్రెస్ సదస్సు ముందుకు ఈ పత్రం రాలేదు. అయితే తన గైర్హాజరికి వివాదంతో ఎలాంటి సంబంధం లేదని, తన కాలుకి దెబ్బతగలడంతోనే తాను సదస్సుకు రాలేకపోయానని బొటనీలో పీహెచ్డీ చేసిన పాండే తెలిపారు. 'నా పరిశోధక పత్రంతో సైన్స్‌తో సంబంధం లేకపోతే ఏంటి? సైన్స్ అంటే ఏమిటి? ఈనాటి కల్పన రేపటి సైన్స్. ఆవిష్కరణలకు మూలం కల్పనే కదా' అని ఆయన చెప్తున్నారు. వృక్షశాస్త్రంలో పరిశోధనలకుగాను పాండే ఇప్పటివరకు పలు అవార్డులు, సత్కారాలు పొందారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగానే తాను పరిశోధక పత్రాన్ని సమర్పించినట్టు తెలిపారు. 'ఈ రోజు సైన్స్ అని చెప్పుకొంటున్న విషయాలన్నీ వేదాలు, పురాణాల్లో ఉన్నవే. ఈ విషయంలో నా వానదతో ఏకీభవించకపోతే.. వారు శాస్త్రీయంగా తమ వాదనను నిరూపించుకోవాలి. మనమంతా శివుడిని కొలువడం లేదా? మరి ఆయన మార్గంలో ప్రయాణిస్తే తప్పేంటి? పర్యావరణ పరిరక్షణ కానీ మరో విషయం కానివ్వండి సమాజం కేవలం నిబంధనలతో నడువదు. అందుకు మతం కూడా ఒక మార్గం చూపించాల్సి ఉంటుంది' అని భోపాల్‌కు చెందిన ఆయన తెలిపారు. -
ఆరెస్సెస్ అనుబంధ సంస్థకు పీఎంవో షాక్
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) తో అనుబంధమున్న విజ్ఞాన భారతి సంస్థకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి ఊహించని షాక్ ఎదురైంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో తమకు ప్రదానం చేయాల్సిన అవార్డును చివరిక్షణంలో పీఎంవో తిరస్కరించడంపై ఆ సంస్థ నిరసన వ్యక్తంచేస్తోంది. దేశీయ విజ్ఞానాన్ని (సైన్స్) అభివృద్ధి పరిచేందుకు కృషిచేస్తున్న విజ్ఞానభారతి సంస్థకు అనిల్ కకోద్కర్, జీ మాధవన్ నాయర్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలు మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 7న ఢిల్లీ ఐఐటీలో భారీస్థాయిలో 'ప్రాక్టికల్ సైన్స్ లెసెన్స్'ను నిర్వహించడం ద్వారా ఈ సంస్థ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సపాదించింది. గతంలో ఈ రికార్డు రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ పేరిట ఉండేది. ఈ ఘనతను గుర్తించిన కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ తమకు అవార్డు ప్రకటించామని, దీనిని అందుకునేందుకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు రావాలని తెలిపిందని విజ్ఞానభారతి ప్రధాన కార్యదర్శి ఏ జయకుమార్ తెలిపారు. కానీ చివరినిమిషంలో ఈ అవార్డుకు పీఎంవో నుంచి అనుమతి రాలేదంటూ తమకు సమాచారమిచ్చారని, ఇది తీవ్ర దిగ్భ్రాంతికరమని, శాస్త్రవేత్తల లోకానికి షాక్ లాంటిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీఎంవో తిరస్కారానికి కారణాలేమిటో కూడా తమకు తెలుపలేదని, ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాల్సిన అవసరముందని ఆయన కోరారు. -
'ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలి'
-
'ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలి'
మైసూరు : ప్రజా సంక్షేమం, ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని శాస్త్రవేత్తలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 103వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను మోదీ ఆదివారం బెంగళూరులో ప్రారంభించారు. అనంతరం దేశవిదేశాలకు చెందిన శాస్త్రవేత్తలను ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.... శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతోనే సుపరిపాలన సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. అలాగే 2030 నాటికి దేశంలో పేదరిక నిర్మూలన, అభివృద్ధిలో భారత్‌ను ఆగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. శాస్త్ర, పరిశోధన రంగాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. మైసూరు విశ్వవిద్యాలయానికి శతాబ్ది ఉత్సవాలు జరగనున్నాయని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. అలాంటి తరుణంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు ఈ విశ్వవిద్యాలయం వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, మైసూరు విశ్వవిద్యాలయం రెండూ ఒకేసారి తమ ప్రయాణాన్ని ప్రారంభించాయని మోదీ పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో దేశ విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలతో కలసి ఈ సదస్సు పాల్గొనడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో భాగస్వాములు కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు మోదీ విజ్ఞప్తి చేశారు. గొప్ప నేతలంతా మైసూరు విశ్వవిద్యాలయంలోనే చదువుకున్నారని చెప్పారు. ఈ సదస్సుకు 10 వేల మంది దేశ విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. 30 మంది శాస్త్రవేత్తలకు మోదీ పురస్కారాలను ప్రదానం చేశారు. -
మంగళయాన్ మన శాస్త్రజ్ఞుల జ్ఞానానికి నిదర్శనం: మోదీ
ముంబయి : భారత్ పరిశోధనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం ముంబయిలో 102వ భారత సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ దేశ, మానవాభివృద్ధి శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆధారపడి ఉందన్నారు. మన శాస్త్రవేత్తలు మొదటి ప్రయత్నంలోనే మంగళయాన్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టారని ఆయన ప్రశంసించారు. మంగళయాన్ మన శాస్త్రవేత్తల జ్ఞానానికి నిదర్శనమన్నారు. శాస్త్ర, సాంకేతికతతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందన్నారు. వ్యర్థాలను డబ్బు ఉత్పత్తి కేంద్రాలుగా మలచాలని మోదీ ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు సూచించారు. ప్రపంచాన్ని ఏకతాటిపై నిలిపే శక్తి శాస్త్ర, సాంకేతిక రంగానికి ఉందని ఆయన ఉద్ఘాటించారు. చైనాలో అభివృద్ధి, శాస్త్ర సాంకేతికత సమానస్థాయిలో అభివృద్ధి చెందాయని మోదీ పేర్కొన్నారు. -
తరాలపల్లి టూ జమ్మూకాశ్మీర్
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు జెడ్పీఎస్ఎస్ విద్యార్థులు నీటి నుంచి హైడ్రోజన్ తీసే ప్రాజెక్టు ఎంపిక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న టీం లీడర్ రాధిక విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : జిల్లాలోని హన్మకొండ మండలం తరాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు 101వ ఇండియన్ సైన్స కాంగ్రెస్‌కు ఎంపికైంది. గత నెలలో హసన్‌పర్తిలోని గ్రీన్వుడ్ పాఠశాలల తెలంగాణ పది జిల్లాల రాష్ర్ట స్థాయి సైన్స కాంగ్రెస్ జరిగింది. ఇందులో తరాలపల్లి జెడ్పీ ఎస్ఎస్ విద్యార్థులు ఎన్.రాధిక, స్రవంతి, శాంతిప్రియ, వీణ, బిందుశ్రీ.. ఫిజిక్స్ ఉపాధ్యాయుడు మనుజేందర్‌రెడ్డి పర్యవేక్షణలో రూపొందించిన సోలార్ విద్యుత్ ద్వారా నీటి నుంచి హైడ్రోజన్ వెలికితీసే ప్రాజెక్టును ప్రదరించారు. ఈ మేరకు రాష్ర్టం నుంచి రెండు ప్రాజెక్టులను ఇండియన్ సైన్స కాంగ్రెస్‌కు ఎంపిక చేయగా, అందులో తరాలపల్లి విద్యార్థుల ప్రాజెక్టు కూడా ఉండడం విశేషం. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి.. జమ్మూకాశ్మీర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో వచ్చే నెల 3నుంచి 7వ తేదీ వరకు 101వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరగనుంది. దీనికి తరాలపల్లి జెడ్పీ ఎస్ఎస్ విద్యార్థుల ఎగ్జిబిట్ ఎంపిక కాగా, టీం లీడర్‌గా వ్యవహరించిన 8వ తరగతి విద్యార్థిని రాధికకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిం దిగా ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆ మె అదే పాఠశాల ఉపాధ్యాయురాలు తస్లీమా ఫాతి మాతో కలిసి శుక్రవారం బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం డాక్టర్ బి.రాంధన్ విద్యార్థులతో పాటు ఫిజిక్స్ ఉపాధ్యాయుడు మనుజేందర్రెడ్డిని గురువారం అభినందించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రతిభ చూపుతా.. జమ్మూకాశ్మీర్‌లో జరగనున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొననుండడం ఆనందంగా ఉంది. ఇందులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న నేను ప్రతిభ చూపి జిల్లాకు పేరు తీసుకువస్తాననే నమ్మ కం ఉంది. చిన్న గ్రామం నుంచి జమ్మూకాశ్మీర్‌కు వెళ్లే అవకాశం రావ డం గొప్పగా అనిపిస్తోంది. ప్రాజెక్టు రూపకల్పనలో హెచ్ఎం రాంధ న్, గైడ్ టీచర్ మనుజేందర్‌రెడ్డి ఎంతగానో ప్రోత్సహించారు. -రాధిక, విద్యార్థిని అరుదైన అవకాశం.. మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సైన్సపై ఆసక్తి కలిగిస్తున్నాం. రాష్ర్టం నుంచి రెండు ప్రాజెక్టులే ఎంపిక కాగా, అందులో మా పాఠశాల ప్రాజెక్టు కూడా ఉండడం ఆనందం కలిగిస్తోంది. భారత ప్రధాని మన్మోహన్సింగ్ ప్రారంభించనున్న ఇండియన్ సైన్స కాంగ్రెస్‌లో మా విద్యార్థిని పవర్ ప్రజెంటేషన్ ఇవ్వనుం డడం గర్వకారణంగా భావిస్తున్నాం. - డాక్టర్ బి.రాంధన్, హెచ్ఎం, తరాలపల్లి జెడ్పీఎస్ఎస్ హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడుకునే ప్రాజెక్టు.. శాస్త్ర, సాంకేతిక రంగా ల్లో మార్పులకనుగుణంగా విద్యార్థుల్లో సైన్సపై ఆసక్తి పెంచేం దుకు ప్రాజెక్టులు చేయిస్తున్నాం. ఇందు లో భాగంగా హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడే ప్రాజెక్టు రూపకల్పనలో విద్యార్థులకు గైడ్‌గా వ్యవహరించాను. జిల్లా స్థాయిలో 250 ప్రాజెక్టులు, రాష్ర్ట స్థాయిలో 30 ప్రాజెక్టుల నుంచి మా పాఠశాల విద్యార్థినుల ప్రాజెక్టు ఇండియన్ సైన్స కాంగ్రెస్‌కు ఎంపికవడం ఆనందంగా ఉంది. - మనుజేందర్‌రెడ్డి, గైడ్ టీచర్