
తరాలపల్లి టూ జమ్మూకాశ్మీర్
- ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు జెడ్పీఎస్‌ఎస్ విద్యార్థులు
- నీటి నుంచి హైడ్రోజన్ తీసే ప్రాజెక్టు ఎంపిక
- పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న టీం లీడర్ రాధిక
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : జిల్లాలోని హన్మకొండ మండలం తరాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు 101వ ఇండియన్ సైన్‌స కాంగ్రెస్‌కు ఎంపికైంది. గత నెలలో హసన్‌పర్తిలోని గ్రీన్‌వుడ్ పాఠశాలల తెలంగాణ పది జిల్లాల రాష్ర్ట స్థాయి సైన్‌స కాంగ్రెస్ జరిగింది. ఇందులో తరాలపల్లి జెడ్పీ ఎస్‌ఎస్ విద్యార్థులు ఎన్.రాధిక, స్రవంతి, శాంతిప్రియ, వీణ, బిందుశ్రీ.. ఫిజిక్స్ ఉపాధ్యాయుడు మనుజేందర్‌రెడ్డి పర్యవేక్షణలో రూపొందించిన సోలార్ విద్యుత్ ద్వారా నీటి నుంచి హైడ్రోజన్ వెలికితీసే ప్రాజెక్టును ప్రదరించారు. ఈ మేరకు రాష్ర్టం నుంచి రెండు ప్రాజెక్టులను ఇండియన్ సైన్‌స కాంగ్రెస్‌కు ఎంపిక చేయగా, అందులో తరాలపల్లి విద్యార్థుల ప్రాజెక్టు కూడా ఉండడం విశేషం.
ఫిబ్రవరి 3వ తేదీ నుంచి..
జమ్మూకాశ్మీర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో వచ్చే నెల 3నుంచి 7వ తేదీ వరకు 101వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరగనుంది. దీనికి తరాలపల్లి జెడ్పీ ఎస్‌ఎస్ విద్యార్థుల ఎగ్జిబిట్ ఎంపిక కాగా, టీం లీడర్‌గా వ్యవహరించిన 8వ తరగతి విద్యార్థిని రాధికకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిం దిగా ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆ మె అదే పాఠశాల ఉపాధ్యాయురాలు తస్లీమా ఫాతి మాతో కలిసి శుక్రవారం బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం డాక్టర్ బి.రాంధన్ విద్యార్థులతో పాటు ఫిజిక్స్ ఉపాధ్యాయుడు మనుజేందర్‌రెడ్డిని గురువారం అభినందించారు.
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రతిభ చూపుతా..
జమ్మూకాశ్మీర్‌లో జరగనున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొననుండడం ఆనందంగా ఉంది. ఇందులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న నేను ప్రతిభ చూపి జిల్లాకు పేరు తీసుకువస్తాననే నమ్మ కం ఉంది. చిన్న గ్రామం నుంచి జమ్మూకాశ్మీర్‌కు వెళ్లే అవకాశం రావ డం గొప్పగా అనిపిస్తోంది. ప్రాజెక్టు రూపకల్పనలో హెచ్‌ఎం రాంధ న్, గైడ్ టీచర్ మనుజేందర్‌రెడ్డి ఎంతగానో ప్రోత్సహించారు.
-రాధిక, విద్యార్థిని
అరుదైన అవకాశం..
మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సైన్‌సపై ఆసక్తి కలిగిస్తున్నాం. రాష్ర్టం నుంచి రెండు ప్రాజెక్టులే ఎంపిక కాగా, అందులో మా పాఠశాల ప్రాజెక్టు కూడా ఉండడం ఆనందం కలిగిస్తోంది. భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రారంభించనున్న ఇండియన్ సైన్‌స కాంగ్రెస్‌లో మా విద్యార్థిని పవర్ ప్రజెంటేషన్ ఇవ్వనుం డడం గర్వకారణంగా భావిస్తున్నాం.
- డాక్టర్ బి.రాంధన్, హెచ్‌ఎం, తరాలపల్లి జెడ్పీఎస్‌ఎస్
హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడుకునే ప్రాజెక్టు..
శాస్త్ర, సాంకేతిక రంగా ల్లో మార్పులకనుగుణంగా విద్యార్థుల్లో సైన్‌సపై ఆసక్తి పెంచేం దుకు ప్రాజెక్టులు చేయిస్తున్నాం. ఇందు లో భాగంగా హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడే ప్రాజెక్టు రూపకల్పనలో విద్యార్థులకు గైడ్‌గా వ్యవహరించాను. జిల్లా స్థాయిలో 250 ప్రాజెక్టులు, రాష్ర్ట స్థాయిలో 30 ప్రాజెక్టుల నుంచి మా పాఠశాల విద్యార్థినుల ప్రాజెక్టు ఇండియన్ సైన్‌స కాంగ్రెస్‌కు ఎంపికవడం ఆనందంగా ఉంది.
- మనుజేందర్‌రెడ్డి, గైడ్ టీచర్