టీచర్‌ పైశాచికం : చదవడంలేదని గొడ్డలితో.. | Teacher Threatens To Slaughter Student With Axe In Kashmir | Sakshi
Sakshi News home page

టీచర్‌ పైశాచికం : చదవడంలేదని గొడ్డలితో..

Published Wed, Jul 3 2019 1:00 PM | Last Updated on Wed, Jul 3 2019 1:05 PM

Teacher Threatens To Slaughter Student With Axe In Kashmir - Sakshi

కశ్మీర్‌ : సరిగ్గా చదవడంలేదని, చెప్పినట్లు వినడంలేదని విద్యార్థిని గొడ్డలితో బెదిరించాడు ఓ ప్రైవేట్‌ ఉపాధ్యాయుడు‌. మైనర్‌ బాలుడని చూడకుండా గొడ్డలి మెడభాగంపై పెట్టి భయభ్రాంతులకు గురిచేశాడు. జమ్మూ-కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోలో జరిగిన ఈ  దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.  వీడియో ప్రకారం.. ఓ పదేళ్ల విద్యార్థిని ఒకరు చేతులతో గట్టిగా పట్టుకోగా.. టీచర్‌ పదునైన గొడ్డటిని మెడపై ఉంచి బెదిరిస్తున్నారు. ‘ నీ ప్రవర్తన మార్చుకోకుంటే గొడ్డలితో నరుకుతా’ అంటూ విద్యార్థిని బెదిరిస్తున్నాడు. బాలుడు భయంతో గట్టిగా ఏడుస్తున్నా కూడా అతన్ని వదిలిపెట్టలేదు. తరగతి గదిలోని మిగతా విద్యార్థుల వైపు చూస్తూ .. ‘మీరు కళ్లు మూసుకోండి.. నేను వీడిని గొడ్డలితో నరికి చంపుతా’  అని హెచ్చరించాడు.

వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ఘటనపై స్థానిక నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ పైశాచిక ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అతను గురువు కాదు  నరరూప రాక్షసుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై జమ్మూ-కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ కూడా ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ఈ వీడియో చూడగానికే భయంగా ఉంది. ఆ సమయంలో ఆ విద్యార్థి ఎంత భయానికి లోనైయ్యాడో ఉహించుకోలేం. నిందితులను గుర్తించి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని’ డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement