
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా పడిందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సైన్స్ కాంగ్రెస్ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం బయటపడిందని విమర్శించారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉన్న ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మరోసారి పునరాలోచించి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉస్మానియా వర్సిటీపై ముఖ్యమంత్రికి అయిష్టత ఉందని, అందుకే అక్కడ జరగాల్సిన కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. ఉద్యమకారుల సమస్యలు చూసి సీఎం ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు ఆందోళనలు కలిగిస్తున్నాయని, ఇటీవల సంధ్యారాణిపై దాడి కలచివేసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment