జనవరి 3న ప్రారంభించనున్న ప్రధాని మోదీ
తిరుపతి, ఎస్వీ యూనివర్సిటీ: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వర్సిటీ వేదికగా జనవరి 3 నుంచి 7వరకు జరిగే భారత సైన్స్ కాంగ్రెస్‌కు 9 మంది నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. వారిలో నలుగురు అమెరికా నుంచి, ఇద్దరు ఫ్రాన్‌స నుంచి, బంగ్లాదేశ్, జపాన్, ఇజ్రాయెల్ నుంచి ఒక్కొక్కరు రానున్నారు. వారిలో రసాయన శాస్త్రా్తనికి చెందిన వారు ముగ్గురు, ఫిజిక్స్ నుంచి నలుగురు, ఆర్థికశాస్త్రానికి చెందిన వారు ఒకరు, శాంతి బహుమతి పొందిన వారు ఒకరు ఉన్నారు. సైన్స్ కాంగ్రెస్‌ను జనవరి 3న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. నోబెల్ గ్రహీతలు ప్రత్యేక ఉపన్యాసాలు చేస్తారు. తిరుపతిలోనే గతంలో 1983లో ఇండియన్ సైన్‌స కాంగ్రెస్ నిర్వహించారు. 34 సంవత్సరాల తర్వాత 104వ సైన్‌స కాంగ్రెస్ జరగనుంది. ‘సైన్‌స అండ్ టెక్నాలజీ ఫర్ నేషనల్ డెవలప్‌మెంట్’అంశంపై ఈ సదస్సు నిర్వహించనున్నారు.
చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్, ఉమెన్ సైన్స్ కాంగ్రెస్ కూడా ఉంటుంది. 12 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సులో నోబెల్ గ్రహీతలు అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కోబిల్క బ్రెరుున్ కెంట్, స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ శాస్త్రవేత్త మొరానీర్ విలియం ఎస్కో, స్టాన్‌ఫోర్డ్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ స్టీవెన్ చూ, అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ డేవిడ్ జోనాథన్ గ్రాస్, జపాన్‌లోని టోక్యో వర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ టాకాకి కజిటా, ఫ్రాన్‌సలోని ఫారిస్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ సెర్జ్ హరోచీ, ఫ్రాన్‌సలోని స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌కు చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ జీన్ ట్రివలే, ఇజ్రాయెల్‌లోని వెరుుజమన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌సకు చెందిన మహిళా శాస్త్రవేత్త ప్రొఫెసర్ అడా ఏ యోనాథ్, బంగ్లాదేశ్ మీర్పూర్‌కు చెందిన మహమ్మద్ యూనిస్‌లు పాల్గొంటున్నారు.