Childrens Science Congress
-
నా టాలెంట్‌ను ఎలా గుర్తించాలి సార్?
పిల్లలు సంధించిన ప్రశ్నలు.. తికమకపడ్డ పెద్దలు (తిరుమల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): సార్, నా పేరు శ్రీకాంత్. ప్రతి ఒక్కరికీ దేవుడు ఏదో ఒక టాలెంట్ ఇచ్చారంటారు గదా.. మరి నాలో ఏ టాలెంట్ ఉందో ఎలా గుర్తించడం..? బాలల సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా ప్రముఖ విద్యావేత్తలతో నిర్వహించిన ముఖాముఖిలో పిల్లలు సంధించిన ప్రశ్నలివి. పిల్లలు అడిగే ప్రశ్నలకు వేదికపైనున్న పెద్దలు సహా హాలంతా నవ్వులతో ఘొల్లుమంది. విద్యార్థులు– జ్ఞాపకశక్తి, అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు మార్గాలు అనే అంశంపై గురువారం మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శినీ ఆడిటోరియంలో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు కాకినాడ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎస్ఎస్ కుమార్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దుర్గాభవానీ, స్విమ్స్ డైరెక్టర్ టీఎస్ రవికుమార్ సహా పలువురు విద్యా వేత్తలు హాజరయ్యారు. కుమార్ ప్రసంగం అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. వాటిలో నవ్వులు పూయించిన ప్రశ్నలు, సమాధానాల్లో కొన్ని.. విద్యార్థి: మనిషి మెదడులో మూడు భాగాలుంటాయి కదా సార్.. ఏ భాగంలో జ్ఞాపకశక్తికి సంబంధించినది ఉంటుంది సార్? వీసీ: నీవు ఎన్నో తరగతి చదువుతున్నావు.. (ఏడో తరగతి సార్.. విద్యార్థి సమాధానం) నీకు ఎవరు చెప్పారు మూడు మెదళ్లు ఉంటాయని.. దేవుడు మనకిచ్చిన వరం మన మెదడు. అందులో చాలా స్వల్ప శాతమే మనం వినియోగించుకుంటున్నాం. మనం దేన్నయితే గుర్తుపెట్టుకుంటామో దానికి మనం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న మాట. గుర్తు లేదు అంటే మనం ప్రాధాన్యత ఇవ్వడం లేదని అర్థం. మన మెదడుకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఏక కాలంలో మనం సమాంతరంగా ఆలోచనలు కూడా చేస్తుంటాం. యోగా చేస్తున్నప్పుడు సైతం మనకు అనేక ఆలోచనలు వస్తుంటాయి. మీరు పిల్లలు గనుక మీరు చదువుకు సంబంధించిన వస్తుంటాయి. అదే పెద్దవాళ్లకయితే వాళ్ల కుటుంబం, ఆఫీసు వ్యవహారాలు, ఎవరితోనైనా ఏదైనా పని ఉంటే ఆ పనికి సంబంధించిన విషయాలు గుర్తుకువస్తుంటాయి. విద్యార్థి: దేవుడు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక టాలెంట్ ఇచ్చాడంటారు గదా. మరి నాలో ఏ టాలెంట్ ఉందో ఎలా గుర్తించాలి సార్? వీసీ: అవునమ్మా.. నీలో ఏమి టాలెంట్ ఉందో చిన్నప్పుడే గుర్తించడం కష్టం. అయితే కొందరిలో అవి చిన్నతనంలోనే బయటపడతాయి. మిగతా వాళ్లకు ఓ వయస్సు వచ్చే వరకు తెలియదు. మన దేశంలో దురదృష్టవశాత్తు మీ తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలే మీ భవిష్యత్‌ను నిర్దేశిస్తున్నాయి. ఆ పరిస్థితి పోవాలి. పదో తరగతి లోపు మీరు ఏమి కావాలనుకుంటున్నారో మీకు అర్థమవుతుంది. దాన్ని మీ తల్లిదండ్రులకు, టీచర్లకు చెప్పండి. మీకు ఏది ఇష్టమో ఆవైపు పోయేలా చూసుకోండి. -
ప్రయోగాత్మక విద్యతో మంచి భవిష్యత్
– సహజ వనరులను కాపాడుదాం – డబ్బు కంటే ప్రకృతి సంపద కీలకం – 24వ జిల్లా స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌లో డీఈఓ కర్నూలు సిటీ: ప్రయోగాత్మక విద్యతో మంచి భవిష్యత్ సొంతమవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఏ క్యాంపులోని మాంటిస్సోరి స్కూల్లో 24వ జిల్లా స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనలను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఢిల్లీలో వాతావరణంలో కార్బైన్ డయాక్సైడ్ శాతం పెరిగి పొగమంచు తీవ్రమై స్కూళ్లకు కొద్ది రోజులు సెలవులు ఇచ్చారన్నారు. ప్రతి ఒక్కరు భవిష్యత్తు తరాలకు ఆస్తుల కన్నా మెరుగైన సహజ వనరులను, వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఐఐటీ, నీట్, ట్రిపుల్ఐటీ సీట్లు 3100 మందికి వచ్చాయన్నారు. దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన వారికి రాని సీట్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు సీట్లు దక్కడం ప్రతిభకు నిదర్శనమన్నారు. అయితే సీట్లు అయితే సాధిస్తున్నారని, కానీ పరిశోధన చదువులకు మాత్రం చాలా తక్కువ మంది ఎంపిక అవుతున్నారన్నారు. ఇందుకు విద్యార్థి దశ నుంచే పాఠ్యాంశాలను నిజ జీవితంతో సంబంధం ఉండేటట్లు ప్రయోగాల ద్వారా అభ్యసిస్తేనే రీసెర్చ్ స్డడీస్కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థుల ప్రదర్శనలలో 10 జిల్లా స్థాయిలో ఎంపిక చేశారు. వీరు వచ్చే నెల 3,4 తేదీలో్ల విజయవాడలో నిర్వహించే రాష్థ్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత డాక్టర్ రాజశేఖర్, అబ్జర్వరర్స్ డీవీఎస్ నాయుడు, మురళీకృష్ణ, సైన్స్ కో–ఆర్డినేటర్లు కేవీ సుబ్బారెడ్డి, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా ప్రభుత్వ పురుషుల, కేవీఆర్ డిగ్రీ కాలేజీ, సిల్వర్ జూబ్లీ కాలేజీలకు చెందిన అధ్యాపకులు వ్యవహారించారు. రాష్ట్ర స్థాయికి 10 ప్రాజెక్టులు ఎంపిక జిల్లా స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌కు జిల్లాలోని నలుమూలల నుంచి మొత్తం 174 ప్రాజెక్టులు వచ్చాయి. వీటిలో 10 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి ప్రదర్శనలకు ఎంపిక చేశారు. ఎంపికైనా వారు.. – బీఎస్. పరహానా, జెడ్పీ హైస్కూల్, ఆత్మకూరు – బి.సౌమ్య, సిస్టర్ స్టాన్సిలా స్కూల్ కర్నూలు – ఉషాశ్రీ, గుడ్ షెప్పర్డ్ హైస్కూల్, కర్నూలు – ఎస్.బాలయ్య, జెడ్పీ హైస్కూల్, బనగానపల్లె – సి.నరేష్, నెహ్రూ హైస్కూల్, బనగానపల్లె – జె. చైతన్య నాయుడు, కట్టమంచి రామలింగారెడ్డి హైస్కూల్, కర్నూలు – ఏ.అనన్య రెడ్డి, మాంటిస్సోరి, ఏ క్యాంపు, కర్నూలు – ఏ.నందిని, కస్తూర్బాగాంధీ విద్యాలయ, సంజామల – బీవీ. సుమంత్ కూమార్ రెడ్డి, గురురాజా కాన్సెప్ట్ స్కూల్, నంద్యాల – పీవీ.సాల్మా, ఇండస్ హైస్కూల్, కర్నూలు -
సైన్స్ కాంగ్రెస్‌కు 9 మంది నోబెల్ విజేతలు
జనవరి 3న ప్రారంభించనున్న ప్రధాని మోదీ తిరుపతి, ఎస్వీ యూనివర్సిటీ: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వర్సిటీ వేదికగా జనవరి 3 నుంచి 7వరకు జరిగే భారత సైన్స్ కాంగ్రెస్‌కు 9 మంది నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. వారిలో నలుగురు అమెరికా నుంచి, ఇద్దరు ఫ్రాన్స నుంచి, బంగ్లాదేశ్, జపాన్, ఇజ్రాయెల్ నుంచి ఒక్కొక్కరు రానున్నారు. వారిలో రసాయన శాస్త్రా్తనికి చెందిన వారు ముగ్గురు, ఫిజిక్స్ నుంచి నలుగురు, ఆర్థికశాస్త్రానికి చెందిన వారు ఒకరు, శాంతి బహుమతి పొందిన వారు ఒకరు ఉన్నారు. సైన్స్ కాంగ్రెస్‌ను జనవరి 3న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. నోబెల్ గ్రహీతలు ప్రత్యేక ఉపన్యాసాలు చేస్తారు. తిరుపతిలోనే గతంలో 1983లో ఇండియన్ సైన్స కాంగ్రెస్ నిర్వహించారు. 34 సంవత్సరాల తర్వాత 104వ సైన్స కాంగ్రెస్ జరగనుంది. ‘సైన్స అండ్ టెక్నాలజీ ఫర్ నేషనల్ డెవలప్మెంట్’అంశంపై ఈ సదస్సు నిర్వహించనున్నారు. చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్, ఉమెన్ సైన్స్ కాంగ్రెస్ కూడా ఉంటుంది. 12 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సులో నోబెల్ గ్రహీతలు అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కోబిల్క బ్రెరుున్ కెంట్, స్టాన్ఫోర్డ్ వర్సిటీ శాస్త్రవేత్త మొరానీర్ విలియం ఎస్కో, స్టాన్ఫోర్డ్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ స్టీవెన్ చూ, అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ డేవిడ్ జోనాథన్ గ్రాస్, జపాన్‌లోని టోక్యో వర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ టాకాకి కజిటా, ఫ్రాన్‌సలోని ఫారిస్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ సెర్జ్ హరోచీ, ఫ్రాన్‌సలోని స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌కు చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ జీన్ ట్రివలే, ఇజ్రాయెల్‌లోని వెరుుజమన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్‌సకు చెందిన మహిళా శాస్త్రవేత్త ప్రొఫెసర్ అడా ఏ యోనాథ్, బంగ్లాదేశ్ మీర్పూర్కు చెందిన మహమ్మద్ యూనిస్‌లు పాల్గొంటున్నారు.