హెచ్‌సీయూ వీసీ అప్పారావుకు మిలీనియం ప్లేగ్ ఆఫ్ హానర్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సైన్స్ కాంగ్రెస్‌లో 20 మంది భారత శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఇస్కా)–2016 పురస్కారాలను ప్రదానం చేశారు. గతంలో ఇస్కా సదస్సులకు జనరల్ ప్రెసి డెంట్‌గా వ్యవహరించిన అశోక్‌కుమార్ సక్సేనా కు శాస్త్రవేత్త అశుతోశ్ ముఖర్జీ మెమోరియల్ అవార్డు లభించింది. బెంగళూర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొ.భైరప్పకు సీవీ రామన్ బర్త్ సెంటినరీ అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని ‘ఎయిమ్స్’ ప్రొఫెసర్ ఎన్‌ఆర్ జగన్నాథానికి ఎస్‌కే మిత్ర బర్త్ సెంటినరీ అవార్డు దక్కింది. మణిపూర్ వర్సిటీ ప్రొఫెసర్ అరుణ్‌కుమార్‌కు బీర్బల్ సహానీ బర్త్ సెంటినరీ అవార్డును అంద జేశారు. చెన్నై ఆస్పత్రి కార్డియాలజిస్ట్ ఐ.సత్య మూర్తికి డీఎస్ కేతారి మెమోరియల్ అవార్డు లభించింది. వెస్ట్‌బెంగాల్ వర్సిటీ ఆఫ్ టెక్నాల జీలో ప్రొ.బీపీ చటర్జీకి ఆర్‌సీ మల్హోత్రా మెమోరి యల్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు దక్కింది.
నోబెల్ గ్రహీతలకు గోల్డ్ మెడల్స్
నోబెల్ పురస్కార గ్రహీతలకు ప్రధాని ఇస్కా జనరల్ ప్రెసిడెంట్ గోల్డ్‌మెడల్స్‌ను ప్రదానం చేశారు. ప్రొఫెసర్ మోర్నార్ విలియం ఎస్కో (అమెరికా) మహ్మద్ యూనస్ (బంగ్లాదేశ్), ప్రొఫెసర్ టకాకి కజిటా(జపాన్), ప్రొఫెసర్ సర్జే హరోచి(ఫ్రాన్స్), ఫ్రొఫెసర్ అడా ఇ యెనాత్ (ఇస్రాయిల్), ప్రొఫెసర్ టిరోలే (ఫ్రాన్స్)లకు పతకాలను అందజేశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పొదిలి అప్పారావుకు మిలీనియం ప్లేగ్ ఆఫ్ హానర్ అవార్డు లభించింది. మొక్కల్లో ఇమ్యూనైజేషన్ అభివృద్ధికి విస్తృత పరిశోధనలు చేస్తున్న అప్పారావు స్వస్థలం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం బోరుపాలెం. పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రఖ్యాత శాస్తవేత్త తపతీ బెనర్జీకి కూడా బంగారు పతకాన్ని ప్రదానం చేశారు. మిగతా వారికి నేడుప్రదానం చేయనున్నారు.
ప్రముఖ శాస్త్రవేత్తలకు ‘ఇస్కా’ అవార్డులు
Published Wed, Jan 4 2017 3:40 AM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM
Advertisement
Advertisement