ఆంధ్రప్రదేశ్‌లో రేపు ప్రధాని మోదీ పర్యటన | PM Narendra modi to inaugurate 104 Indian science congress in tirupati | Sakshi
Sakshi News home page

సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రారంభించనున్న ప్రధాని

Published Mon, Jan 2 2017 3:12 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

ఆంధ్రప్రదేశ్‌లో రేపు ప్రధాని మోదీ పర్యటన - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో రేపు ప్రధాని మోదీ పర్యటన

హైదరాబాద్‌ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. తిరుపతిలో జరిగే జాతీయస్థాయి 104వ భారత సైన్స్ కాంగ్రెస్ సదస్సును ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని...తిరుమల వెళ్లి వెంకన్న దర్శనం చేసుకుంటారు. కాగా జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సువిశాల ఆవరణలో సైన్స్‌ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వివిధ దేశాలకు చెందిన ఆరుగురు నోబెల్‌ బహుమతి గ్రహీతలు హాజరు కానున్నారు. ఈ సదస్సులో ప్రధాని తన సందేశం ఇవ్వడంతో పాటు నోబెల్‌ గ్రహీతలతో ముఖాముఖిలో పాల్గొంటారు. ‘సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫర్‌ నేషనల్‌ డెవలప్‌మెంట్‌’ అనే అంశంపై జరుగుతున్న ఈ సదస్సుకు 10,500 మంది రిజిస్టర్‌ చేసుకోగా, వివిధ దేశాల నుంచి 200 మంది శాస్త్రవేత్తలు హాజరు కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement