SV university
-
‘దూర’మవుతున్న విద్య
వివిధ కారణాలతో చదువుకోలేకపోయిన వారికి దూరవిద్య ఓ మంచి అవకాశంగా మారింది. తమకు నచ్చిన కోర్సుల్లో డిగ్రీ చేసి, వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో చాలామంది ఈ బాట పడుతున్నారు. కానీ.. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో దూరవిద్యలో చేరిన అభ్యర్థులకు మాత్రం విద్య ‘దూర’మయ్యే పరిస్థితి ఏర్పడింది. సమయానికి పరీక్షలు నిర్వహించకపోవడంతో డిగ్రీలు ఎప్పటికి చేతికొస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. – సాక్షి, అమరావతితిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ దూరవిద్య పరీక్షల్లో గందరగోళం నెలకొంది. గడిచిన విద్యా సంవత్సరానికి సంబంధించి పరీక్షల షెడ్యూల్ ఆలస్యంగా ఇచ్చారు. అంతేకాకుండా పదేపదే మార్పులు చేస్తున్నారు. జనవరి, ఫిబ్రవరిలో పరీక్షల తేదీలను మూడుసార్లు ప్రకటించి.. వివిధ కారణాలతో వాయిదా వేయడం వర్సిటీ అధికారుల నిర్లక్ష్య వైఖరిని స్పష్టం చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వర్సిటీల పాలన దిగజారింది. అప్పటి వరకు ఉన్న వీసీలతో బలవంతంగా రాజీనామా చేయించడం, అనంతరం వీసీల నియామకంలో ఆలస్యం జరిగింది. ఇప్పటికీ వైస్చాన్సలర్లను నియమించడంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు ఎస్వీ వర్సిటీ దూర విద్య ద్వారా అందించే యూజీ, పీజీ, ఎంబీఏ వంటి కోర్సుల్లో రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులూ ప్రవేశాలు పొందారు. అలా 2023–24 విద్యా సంవత్సరానికి సుమారు 32 వేలమందికి పైగా అభ్యర్థులు వివిధ దశల్లో పరీక్షలు రాయాల్సి ఉంది. గతేడాది ఎన్నికల కారణంగా పరీక్షల షెడ్యూల్‌నే ప్రకటించలేదు. ఈ కారణంగా సెపె్టంబర్లో దూరవిద్య పరీక్షలు జరగాల్సి ఉండగా కూటమి ప్రభుత్వ కనుసన్నల్లో నడిచిన వర్సిటీ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అభ్యర్థుల నుంచి ఒత్తిడి పెరగడంతో జనవరిలో పరీక్షలంటూ డిసెంబర్ చివరిలో షెడ్యూల్ విడుదల చేసింది.అయితే యూజీసీ కమిటీ పర్యటన కారణంగా పరీక్షలను సంక్రాంతి తర్వాత అంటూ వాయిదా వేసింది. అనంతరం ఫిబ్రవరి మొదటివారం మరో షెడ్యూల్ ఇచ్చింది. దాన్ని కూడా వాయిదా వేసింది. తాజాగా ఫిబ్రవరి 24 నుంచి పరీక్షలంటూ షెడ్యుల్ ఇచ్చింది. అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. పరీక్ష పత్రాలు ఎగ్జామ్ సెంటర్‌కు కూడా చేరిపోగా... ఒక్కరోజు ముందు ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వాయిదా వేస్తున్నామంటూ వర్సిటీ ప్రకటించింది. పరీక్షలు నిర్వహించే ఉద్దేశమే లేదు ఎస్వీ వర్సిటీ అధికారులకు దూరవిద్య పరీక్షలను నిర్వహించే ఉద్దేశమే లేదని అభ్యర్థులు మండిపడుతున్నారు. పదేపదే పరీక్షల షెడ్యూల్ వాయిదా వేయడంతో ఇబ్బందులు గురవుతున్నామని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టభద్రులై బయటకు వస్తే ఉద్యోగాలు వచ్చేంత వరకు వారందరినీ నిరుద్యోగులుగా గుర్తించాలని... దీంతో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుందనే దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం పరీక్షలను అడ్డుకుంటోందని మండిపడుతున్నారు. వ్యయప్రయాసల కోర్చి, ఫీజులు చెల్లించి... సకాలంలో డిగ్రీ పూర్తి చేయాల్సిన తాము.. ఎనిమిదినెలలకు పైగా ఆలస్యంగా పరీక్షలు రాసి... డిగ్రీలు పొంది ప్రయోజనమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల కోసం ఆత్మహత్యాయత్నం వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఓ ఏఎన్ఎం ఎస్వీ వర్సిటీ దూరవిద్యలో చేరారు. ఈనెల 24 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని వైద్యాధికారిని సెలవులు అడిగారు. కానీ సెలవు మంజూరు చేయకపోవడంతో తాను పరీక్షలు రాయలేనన్న బాధతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించారు. దూరవిద్యలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్థులు వాస్తవానికి దూర విద్య కోర్సులను అభ్యసించే వారిలో సాధారణ విద్యార్థులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకునే వాళ్లు అధికంగా ఉంటారు. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులూ ఉన్నారు. వర్సిటీ దూరవిద్య పరీక్షల షెడ్యూల్ ఫిబ్రవరి 24న ప్రకటించడంతో చాలామంది ఉద్యోగులు సెలవులు పెట్టుకుని మరీ పరీక్షలకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. తీరా పరీక్షలు వాయిదా పడటంతో గందరగోళానికి గురయ్యారు.అయోమయంలో ఒడిశా అభ్యర్థులు మరోవైపు ఒడిశా రాష్ట్రానికి చెందిన దాదాపు 30మంది అభ్యర్థులు రెండేళ్ల క్రితం ఎస్వీ యూనివర్సిటీ దూరవిద్యలో పీజీ కోర్సులో చేరారు. వారంతా ఈనెల 24నుంచి పరీక్షలుండటంతో చిత్తూరు చేరుకున్నారు. తీరా 22న పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ ప్రకటించింది. ఎప్పుడు నిర్వహించేది చెప్పలేదు. దీంతో వారంతా ఏపీలో ఉండాలో... ఒడిశా వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. -
ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు
సాక్షి, తిరుపతి: ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. హ్యూమన్ ఐఈడీ బాంబ్ పేరుతో పేల్చేస్తామంటూ గురువారం ఉదయం కళాశాలకు ఆగంతకుడు మెయిల్ చేశాడు. కళాశాల అధికారులు తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అగ్రికల్చర్ కళాశాలకు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. కేరళ రాష్ట్రం నుంచి మెయిల్ వచ్చినట్టు కాలేజీ సిబ్బంది చెబుతున్నారు.గత రెండు నెలల క్రితం కూడా తమిళనాడు రాష్ట్రం నుంచి మెయిల్ వచ్చింది. తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వరసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. గతంలో కూడా పలు హోటళ్లు, ఆలయాలకు వచ్చిన బాంబ్ బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
తిరుమల, ఎస్వీ యూనివర్సిటీలో చిరుతల సంచారం
సాక్షి, తిరుపతి: తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. గురువారం రాత్రి సమయంలో యూనివర్సిటీ ఆవరణలో చిరుత.. ఓ కుక్కను వేటాడి ఎత్తుకెళ్లడంతో విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు.వివరాల ప్రకారం.. ఎస్వీ యూనివర్శిటీలో చిరుత సంచారం కలకలం రేపింది. తాజాగా క్యాంపస్ ఆవరణలో కుక్కను వేటాడి చిరుత ఎత్తుకెళ్లింది. దీంతో, యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది, స్కాలర్స్ , హాస్టల్ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. అయితే, గత నెల రోజులుగా యూనివర్సిటీలో చిరుత కదలికలు ఉన్నాయంటూ ఫ్లెక్సీలు అక్కడ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా చిరుతను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు.ఇక, తిరుమలలో కూడా చిరుత సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. చిరుత సంచారం భక్తులను మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే, ప్రస్తుతం సర్వదర్శన టోకెన్ల క్యూలైన్ సమీపంలోని అటవీ ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో, భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. -
ప్రియుడి మోసానికి యువతి బలి
ఒంగోలు టౌన్: ప్రేమ పేరుతో ఓ యువకుడి చేతిలో వంచనకు గురైన యువతి చివరకు ప్రాణాలొదిలింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో నమ్మించడంతో పాటు శారీరకంగా దగ్గరై యువతిని గర్భిణిని చేశాడు. ఆ యువతి ఆరోగ్యం క్షీణించడంతో ఒంగోలు జీజీహెచ్‌లో అడ్మిట్ చేసి పరారయ్యాడు. చికిత్స పొందుతూ యువతి మృతిచెందింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు రాజీవ్‌కాలనీకి చెందిన చప్పిడి రాజేంద్రప్రసాద్, అరుణకుమారి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులిద్దరూ పనిచేస్తున్నారు. తండ్రి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా, తల్లి కూలి పనులకు వెళ్లి పిల్లలను చదివించుకుంటోంది. పెద్ద కూతురు ప్రియ తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. మిగతా ఇద్దరు కూతుళ్లు చీమకుర్తిలో పదో తరగతి చదువుకుంటున్నారు. ప్రియ కూడా 3వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చీమకుర్తి గురుకుల పాఠశాలలో చదివింది. తన క్లాస్మేట్, దూరపు బంధువైన శివకళ్యాణ్తో ఏడాది క్రితం ఆమెకు పరిచయమైంది. సంతనూతలపాడు మండలంలోని తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన శివకళ్యాణ్ పెయింటర్‌గా పనిచేస్తుంటాడు. వారి పరిచయం ప్రేమగా మారింది. ఎస్వీ యూనివర్శిటీలో బీటెక్ చదువుకుంటున్న ప్రియ.. తన తల్లిదండ్రులకు తెలియకుండా తక్కెళ్లపాడు వచ్చి తరచూ ప్రియుడితో కలుస్తుండేది. ఈ క్రమంలో శారీరకంగా కూడా దగ్గరైంది. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ప్రియుడు శివకళ్యాణ్కు చెప్పింది. జూలై చివరి వారంలో యూనివర్శిటీ నుంచి వచ్చేసి తక్కెళ్లపాడులో ప్రియుడితో కలిసి జీవిస్తోంది. శుక్రవారం రాత్రి ప్రియ ఆరోగ్యం దెబ్బతింది. ఎగశ్వాస వస్తుండటంతో ఆమెను ఒంగోలులోని జీజీహెచ్‌కి శివకళ్యాణ్ తీసుకొచ్చాడు. హాస్పిటల్లో చేర్పించి ప్రియ తండ్రి రాజేంద్ర ప్రసాద్‌కు గుర్తు తెలియని వ్యక్తిలా ఫోన్ చేశాడు. తిరుపతి నుంచి రైలులో వస్తుండగా మీ అమ్మాయికి ఫిట్స్ వచ్చాయని, ఆమెను ఒంగోలు జీజీహెచ్‌లో జాయిన్ చేశానని చెప్పాడు. ఆందోళనకు గురైన రాజేంద్ర ప్రసాద్ హడావిడిగా జీజీహెచ్‌కి వచ్చాడు. ఆస్పత్రిలో వాకబు చేయగా, మీ కూతురు ఆరో నెల గర్భిణి అని, ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంతనూతలపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ప్రియ ప్రియుడు శివకళ్యాణ్ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.నా బిడ్డను చంపిన హంతకులను శిక్షించండి సారూ...నా బిడ్డతో రెండు రోజుల క్రితమే మాట్లాడాను. బాగానే మాట్లాడింది. కాస్త దగ్గు వస్తుందని చెప్పింది. ఇంతలో ఇలా చనిపోతుందని అనుకోలేదంటూ ప్రియ తల్లి అరుణకుమారి గుండెలవిసేలా రోదిస్తోంది. తన బిడ్డను మోసం చేసి ఆమె చావుకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని, తన బిడ్డలాగా మరొకరి బిడ్డ బలికాకూడదని కన్నీరు పెట్టింది. ప్రియ కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు కోరుతున్నారు. ప్రియ నోటి నుంచి నురగ వస్తుండటంతో ఆమె మరణం సహజ మరణం కాదన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమైపె హత్యా ప్రయత్నం జరిగి ఉండవచ్చని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు పూర్తిగా విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. -
తిరుపతి ఎస్వీయూలో టీడీపీ నేతల వీరంగం
-
తాళపత్రాల్లోని విజ్ఞానం భావితరాలకు అందాలి
తిరుపతి సిటీ/తిరుమల: తాళపత్ర గ్రంథాల్లోని విజ్ఞానాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ వేదిక్ యూనివర్సిటీని బుధవారం ఆయన సందర్శించి తాళపత్ర గ్రంథాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేల సంవత్సరాల పూర్వం మహర్షులు, రుషులు, మేధావులు అపారమైన విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక అంశాలను తాళపత్రాల్లో లిఖించారన్నారు. అటువంటి విజ్ఞానాన్ని సంరక్షించి, పరిశోధనలు చేసి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వేదిక్ వర్సిటీలో తాళపత్ర గ్రం«థాల సంరక్షణ, డిజిటలైజేషన్ చేయడం ప్రశంసనీయమన్నారు. పురాతన న్యాయ శాస్త్ర గ్రంథాల్లో చాలా విలువైన సమాచారం ఉందని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. పురాతన నాగరికతలో న్యాయశాస్త్ర విద్యాభ్యాసం, న్యాయవ్యవస్థల సమాచారం తాళపత్రాల్లో ఉండటం విశేషమన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న తాళపత్ర గ్రంథాలను సంరక్షించి, పరిశోధనలు, ప్రచురణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో వేదిక్ వర్సిటీ నడవడం, తాళపత్ర గ్రంథాల పరిరక్షణకు పెద్దపీట వేయడం శుభపరిణామమన్నారు. అనంతరం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో కలసి ఆయన వర్సిటీలోని వేద, వేదాంగ, ఆగమ, పురాణ, ఇతిహాస, న్యాయ శాస్త్ర తాళపత్రగంథాల సంరక్షణ, డిజిటలైజేషన్ ప్రక్రియను, ప్రచురణను పరిశీలించారు. అనంతరం వర్సిటీ, టీటీడీ అధికారులు సీజే దంపతులను, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులను ఘనంగా సన్మానించారు. శ్రీవారి సేవలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న సుప్రీం కోర్ట్, హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తులకు టీటీడీ ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అధికారులు శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, డైరీ, క్యాలెండర్ అందజేశారు. సీజేఐని కలిసిన టీటీడీ చైర్మన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తిరుమల పుష్పగిరి మఠంలో జరిగిన మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భాను ప్రకాష్ వివాహానికి టీటీడీ చైర్మన్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. -
ఎస్వీ వర్సిటీలో నుంచి రహదారులు వద్దు
సాక్షి, అమరావతి: తిరుమల వెళ్లే భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని ఎస్వీ వర్సిటీలో నుంచి రహదారులు నిర్మాణం చేపట్టేందుకు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. వర్సిటీలో నుంచి రోడ్లు ఏర్పాటుకు అభ్యంతరం లేదని వీసీ చెప్పడాన్ని తప్పుబట్టింది. వర్సిటీలో నుంచి రహదారి నిర్మాణాలను చేపట్టవద్దని ఆదేశిస్తూ ఇలాంటి విషయానికి అంగీకారం తెలిపే ముందు విద్యార్థుల ప్రయోజనాల గురించి ఆలోచించాలని వీసీకి హితవు పలికింది. తిరుమల వెళ్లే వారి కోసం వర్సిటీలో నుంచి రోడ్డు వేయడం సరికాదని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి శ్రీకాకుళం జిల్లా సింగూపురం పంచాయతీ పరిధిలోని చెరువును స్థానిక సర్పంచ్ కబ్జా చేసి పూడ్చేస్తున్నారంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకుని, దీనిపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని కలెక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేస్తూ సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. సింగుపురంలోని చెరువును సర్పంచ్ ఆదిత్య నాయుడు కబ్జా చేసి పూడ్చేస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సింగుపురం ఎంపీటీసీ బగ్గు అప్పారావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నెల రోజుల్లో రూ.8వేల కోట్లను జమ చేస్తా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరించబోమని కేంద్రం ప్రకటిస్తే పలువురు బిలీనియర్లతో పాటు తన వంతు కింద నెల రోజుల్లో రూ.8 వేల కోట్లను జమ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టుకు నివేదించారు. విదేశాల నుంచి నిధులు స్వీకరించేందుకు వీలుగా ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ కింద ప్రత్యేక ఖాతాను కేంద్రం అనుమతిస్తే, ఆ నిధులను అందులో జమ చేస్తానన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములను విక్రయించకుండా స్టే ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న జస్టిస్ గుహనాథన్ నరేందర్, న్యాపతి విజయ్‌ల ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించిన దాఖలైన పిల్లను పాల్ వ్యాజ్యంతో జత చేసే విషయంలో సీజే నుంచి పాలనాపరమైన ఆదేశాలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించింది. యంత్ర సామగ్రిని జప్తు చేయండి విశాఖ జిల్లా భీమునిపట్నం సముద్ర తీరం సమీపంలో చేపడుతోన్న నిర్మాణాలను తక్షణమే నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) పరిధిలో చేపడుతోన్న ఈ నిర్మాణాలకు ఎలా అనుమతులిస్తారని అధికారులను ప్రశ్నించింది. అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపడుతుంటే అవి అక్రమ నిర్మాణాలవుతాయని, నిర్మాణ ప్రదేశంలో ఉన్న యంత్ర సామాగ్రిని తక్షణమే జప్తు చేయాలని ఆదేశించింది. తీసుకున్న చర్యలపై నివేదికివ్వాలని ఆదేశించింది. విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. -
క్రమంగా సేంద్రియ సాగువైపు మళ్లుతున్న రైతులు
-
వాస్తవ సంఘటనలే యూనివర్సిటీలో చూపించాం: ఆర్.నారాయణమూర్తి
దేశంలో విద్య, వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలనే అంశంపై తీసిన ఆర్ నారాయణమూర్తి తెరకెక్కించిన సందేశాత్మక చిత్రం యూనివర్సిటీ. ఈ చిత్రానికి నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా వ్యహరించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడారు. మనిషికి విద్య, వైద్యం ఎంతో అవసరమని, ఇవి ప్రైవేట్ రంగంలో ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. యూనివర్సిటీ చిత్రాన్ని విద్యార్థులందరూ ఆదరించాలని ఆయన కోరారు. అక్టోబర్ 4వ తేదీన సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆర్ నారాయణ మూర్తి విద్యార్థులతో మాట్లాడతూ.. 'సినిమాలో పదో తరగతి పేపర్ లీకేజీ దగ్గర నుంచి గ్రూప్స్ పరీక్షల పేపర్ లీకేజీలపై చూపించాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు సాక్షిగా రూ. 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాం. భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల కోటా ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. తల్లిదండ్రుల కలలన్నీ ప్రభుత్వాలు కల్లలు చేస్తున్నాయి. సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలను సినిమాను తెరకెక్కించాం. ' అని అన్నారు. -
ప్రతి జిల్లాకు యూనివర్సిటీ తెచ్చిన మహానేత వైఎస్ఆర్..!
-
తిరుపతిలో సీఎం కప్ పోటీలు
తిరుపతి అర్బన్: తిరుపతి నగరంలో సోమవారం నుంచి ఈనెల 5వ తేదీ వరకు ఏపీ సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా సంస్థ ముఖ్య కార్యనిర్వాహణాధికారి వి. మురళీకృష్ణ ఆదివారం పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 4700 మంది క్రీడాకారులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీతోపాటు పలు కళాశాలల్లోనూ పోటీలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఉదయం 8గంటల నుంచే క్రీడలు ప్రారంభమవుతాయని వివరించారు. ఆ మేరకు క్రీడాకారులకు అవసరం అయిన ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. -
ప్రపంచంలోనే అత్యంత అరుదైన పక్షి.. లంకమలలో కలివి కోడి జాడేది?
వైఎస్సార్ జిల్లాలో ఓ వైపు శేషాచలం.. మరోవైపు నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. అదే జిల్లాలోని సిద్ధవటం–బద్వేలు ప్రాంత అడవిని ‘లంకమల’గా పిలుస్తారు. ప్రపంచంలో ఎక్కడా కనిపించని ఓ పక్షి ‘ట్విక్–టూ.. ట్విక్–టూ’ అని అరుస్తోంది. ఎంత అన్వేషించినా దాని జాడ మాత్రం కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో పెరిగే కలివి పొదల్లో నివసించే ఈ నిశాచర పక్షిని ‘కలివి కోడి’ అని పిలుస్తున్నారు. ఈ పక్షి జాతి పూర్తిగా అంతరించిపోయిందని ప్రపంచం పక్షిశాస్త్ర నిపుణులు తేల్చేయగా.. ఇప్పటికీ సిద్ధవటం అటవీ ప్రాంతంలోని పొదల్లో ఇవి సజీవంగా ఉన్నాయని ఎస్వీ యూనివర్సిటీ బృందం చెబుతోంది. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో కలివి కోడి జాడను కనిపెట్టవచ్చంటోంది. కలివికోడి ఆవాసం కోసం సిద్ధవటం ప్రాంతంలో సుమారు 3 వేల ఎకరాలను రూ.28 కోట్లతో సేకరించి 177 కెమెరాలతో పరిశోధకులు అన్వేషిస్తున్నారు. సాక్షి, అమరావతి: ‘కలివి కోడి’.. నిజానికి ఇది కోడి కాదు. కానీ.. ప్రపంచంలోనే అత్యంత అరుదైన పక్షి. రంగు రంగుల ఈకలు.. చిన్నపాటి ఆకారం.. వినసొంపైన కూతలతో ఆకట్టుకునే కలివి కోడి (జర్డాన్స్ కోర్సర్) సంక్షోభంలో పడింది. అత్యంత అరుదైన ఈ పక్షి అంతరించిపోతున్న జాతుల్లో మొదటి స్థానంలో ఉంది. మన రాష్ట్రంలోని లంకమల అడవుల్లో తప్ప ప్రపంచంలో మరెక్కడా కలివి కోడి కనిపించదు. ఇది వందేళ్ల క్రితమే అంతరించిపోయిందని ప్రపంచ పక్షి శాస్త్రవేత్తలు భావించినా.. లంకమల అడవుల్లో ఇంకా సంచరిస్తూనే ఉందని అడపాదడపా వార్తలు వెలువడుతున్నాయి. వైఎస్సార్ జిల్లా రెడ్డిపల్లి ప్రాంతంలోని చిట్టడవుల్లో వీటి జాడ కనిపించడంతో ఆ ప్రాంతాన్ని లంకమల్లేశ్వర అభయారణ్యం పేరిట కలివికోడి నివాసంగా ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్లపాటు శోధించినా.. కలివి కోళ్ల ఆచూకీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.50 కోట్లు ఖర్చు చేసి రెండేళ్లపాటు అలుపెరగని ప్రయత్నాలు జరిపినా ఫలితం కనిపించలేదని ఎస్వీ వర్సిటీ జువాలజీ విభాగానికి చెందిన మాణిక్యం తెలిపారు. అన్నీ కాలాలు, అన్ని ప్రాంతాల్లో శోధించి, పరిశోధనలు చేస్తే తప్ప కలివి కోడి పూర్తిగా అంతరించిందని చెప్పలేమంటున్నారు. లంకమల అభయారణ్యంలోని వీటి ఆవాసాలను పోలిన ఆవాసాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని సమగ్ర సర్వే చేస్తే ఈ పక్షి జాతిని గుర్తించే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ పక్షి కోసం అన్వేషణను కొనసాగించి.. వీటిని పరిరక్షించడం అందరి బాధ్యతని పక్షి ప్రేమికులు చెబుతున్నారు. పదేళ్ల క్రితం కడపటి చూపు కలివి కోడిని 1848లో పెన్నా నది పరీవాహక ప్రాంతంలో థామస్ జర్డాన్స్ మొదటిసారి కనుగొన్నారు. 1985 జనవరి 5న అట్లూరు మండలం రెడ్డిపల్లె వాసి చిన్న ఐతన్నకు ఈ పక్షి కనిపించగా.. దాన్ని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. ఈ విషయం తెలిసి ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ వెంటనే వచ్చి ఆ పక్షిని పరిశీలించారు. 1998 నుంచి 2002 వరకు తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం జంతు శాస్త్ర విభాగం పరిశోధకులు ప్రొఫెసర్ నందకుమార్, అమీర్‌బాషా, మారం రాజశేఖర్ బృందం దాదాపు 8 పక్షులను గుర్తించింది. వీటి ఆవాసాన్ని రిమోట్ సెన్సింగ్ విధానంలో పరిశీలించి ఏ పరిసరాల్లో ఎక్కువగా ఉంటాయి, వాటి అభివృద్ధికి అక్కడ చేయాల్సిన మార్పులు ఏమిటనేది ఆ బృందం సూచించింది. ఆ తర్వాత 2002లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, రాయల్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్స్ సహకారంతో బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ కలివి కోడి పాద ముద్రను, కూతను నమోదు చేసింది. ఈ పక్షి ‘ట్విక్–టూ.. ట్విక్–టూ’ అంటూ అరుస్తుంది. పగలు నిద్రించి.. రాత్రి వేటాడుతుంది వీటి జాడ 2002 తర్వాత కనిపించలేదు. ఈ పక్షుల సమగ్ర గణన సైతం జరగలేదు. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో వీటి ఆవాసాల్లో గత రెండు దశాబ్దాలుగా వచ్చిన మార్పులను గమనిస్తే.. అరుదైన ఈ పక్షి జాతి ఉనికిని తెలుసుకునే అవకాశం ఉంటుందని తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ జువాలజీ ప్రొఫెసర్ ఎం.రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. ఈ పక్షి ముదురు గోధుమ రంగులో.. పొడవాటి కాళ్లతో ఉంటుంది. మెడలో రెండు వెండి గొలుసుల వంటి చారలతో ఉంటుంది. ఇతర పక్షుల్లా ఎత్తుకు ఎగరలేవు. పగటిపూట నిద్రపోతూ.. రాత్రి పూట ఆహార సేకరణ కోసం బయటకు వస్తాయి. 2 నుంచి 10 అడుగుల ఎత్తు వరకు కలివి పొదలు (ముళ్లతో ఉండేవి) వీటి ఆవాసాలు. పొదల మాటున దాగి ఉంటూ వాటి మధ్యలోని ఖాళీ ప్రదేశాల నుంచి ఆహారాన్ని సేకరిస్తాయి. చెదలు, పురుగులు, చీమలు, కీటకాలను తింటూ పంట పొలాలకు వ్యాధుల రాకుండా సంరక్షించడంతో పాటు పర్యావరణ సమతుల్యతకు ఇవి దోహదపడతాయి. ఇవి గులక రాళ్లను సేకరించి.. వాటి మధ్యలో గుడ్లు పెట్టి ఇతర జంతువులు గుర్తించకుండా జాగ్రత్తపడతాయి. -
Narala Rama Reddy: అవధాన ఉద్దండుడు
సాక్షి, ప్రొద్దుటూరు : ఆయన అవధానంలో పాండిత్య ప్రదర్శన ఉండదు. అందమైన కవిత్వం ఉంటుంది. సాహిత్యంలో బరువైన పదసంపద ఉండదు. సున్నితమైన భావాలతో హృదయ స్పందన కలిగించడమే ఆయన శైలి. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు 1980 ప్రాంతంలో సరస్వతి పుత్రుడు పుట్టపర్తి నారాయణాచార్యులకు సాహిత్య రంగంలో గౌరవ డాక్టరేట్‌ను బహూకరించారు. 42 ఏళ్ల తర్వాత వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన అవధాని నరాల రామారెడ్డికి ఇదే యూనివర్సిటీ వారు గత నెల 24న గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. 1948 జూన్ 22న నరాల బాలిరెడ్డి, వెంకటమ్మ దంపతులకు రెండో సంతానంగా రామారెడ్డి జన్మించారు. ఐదో తరగతి తర్వాత 6 నుంచి 11వ తరగతి వరకు శ్రీకృష్ణ గీర్వాణ ఉన్నత పాఠశాలలో చదివారు. అక్కడ తన పెద్దనాన్న కుమారుడు నరాల వెంకటరామిరెడ్డి ప్రధానోపాధ్యాయుడు. 1959లో గీర్వాణ పాఠశాలలో చేరినప్పుడే జీవితం మలుపు తిరిగింది. సంస్కృతాంధ్ర భాషలపై పట్టు సాధించారు. 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకు పల్లె వెంకటరెడ్డి తెలుగు పాఠాలు బోధించారు. తెలుగు పండితులైన పల్లె వెంకటరెడ్డి పారిజాతపహరణం నాటకాన్ని రచించారు. ఆయనలాగే పద్యాలు రాయాలని రామారెడ్డి ప్రయత్నం చేశారు. 1964లో 11వ తరగతి ఉత్తీర్ణుడైన తర్వాత ఉన్నత చదువులు చదివేందుకు ప్రొద్దుటూరులో డిగ్రీ కళాశాల లేదు. స్థానికంగా పాలిటెక్నిక్ కళాశాల మాత్రమే ఉండగా.. ఆ చదువుపై ఇష్టం లేకపోవడంతో తిరుపతిలోని టీటీడీ నిర్వహిస్తున్న ప్రాచ్య కళాశాలలో ఏ విద్వాన్ చదవడానికి సిద్ధపడ్డారు. చదువుతోపాటు ఉచిత భోజన వసతి కల్పిస్తుండటంతో ప్రాచ్య కళాశాలలో చేరారు. ప్రాచ్య కళాశాలలో ప్రవేశించిన తర్వాత సంస్కృతాంధ్ర భాషలపై మక్కువ పెంచుకుని పద్యాలను అలవోకగా అల్లే శక్తిని సంపాదించారు. 16వ ఏటనే అవధానం 1965లో తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో బులుసు వెంకటరామమూర్తి అష్టావధానం జరిగింది. ఈ అవధానాన్ని చూసిన రామారెడ్డి హాస్టల్ గదుల్లోనే తోటి విద్యార్థులతో అవధానం నిర్వహించేవారు. అదే ఏడాది స్థానిక రామేశ్వరంలోని ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రప్రథమ అవధానం జరిగింది. విజయవంతంగా నిర్వహించినందుకు పండితులు ఆయనను ప్రశంసించారు. విద్యార్థి దశలోనే శ్రీకాళహస్తి, పాకాల, చిత్తూరు, పుత్తూరు ప్రాంతాల్లో 20 అవధానాలు నిర్వహించారు. 1968లో ఎ.విద్వాన్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. తాను విద్యాభ్యాసం చేసిన శ్రీవెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగ బాధ్యతలను చేపట్టాలనుకున్నారు. తండ్రి అకాల మరణంతో కుటుంబ బాధ్యతలు నిర్వహించడానికి, తండ్రి చేసిన రూ.10 వేలు అప్పు తీర్చడానికి సోదరుడైన నరాల వెంకటరామారెడ్డి ప్రోద్బలం వల్ల ప్రొద్దుటూరులోని శ్రీమలయాళస్వామి ఓరియంటల్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. అధ్యాపకునిగా పని చేస్తూ.. ప్రైవేటుగా ఎంఏ (తెలుగు) పూర్తి చేశారు. 1972 మార్చి 30న కర్నూలు జిల్లా కోవెలకుంట్ల గ్రామానికి చెందిన గువ్వల యల్లారెడ్డి, పుల్లమ్మ ఏకైక పుత్రిక సరోజను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు సతీష్, కుమార్తెలు మనస్విని, ఉదయని ఉన్నారు. వీరు ఉన్నత చదువులు చదివి అమెరికాలో స్థిరపడ్డారు. అధ్యాపకునిగా, ప్రిన్సిపాల్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి 2006లో పదవీ విరమణ చెందారు. చంధస్సు, అలంకారాలు, ప్రబంధాలను బోధించి విద్యార్థుల హృదయాల్లో చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించుకున్నారు. దేశ, విదేశాల్లో అవధానాలు దేశ, విదేశాల్లో వందల అవధానాలు నిర్వహించారు. 1968లో అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లెలో చేసిన అవధానం జయప్రదం కావడం వల్ల.. అవధాన రంగంలో గుర్తింపు లభించింది. 1969లో బెంగళూరు ఆంధ్ర విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో, 1972లో జిల్లా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నెల్లూరులో, 1974లో గుంటూరులో ప్రముఖుల సమక్షంలో అవధాన కార్యక్రమాలు నిర్వహించారు. 1973లో చెన్నైలో తాజ్కోరమండల్, అశోక్ హోటల్లో వేర్వేరుగా ప్రముఖల సమక్షంలో నిర్వహించారు. ఓ కార్యక్రమానికి పద్మశ్రీ డి.భానుమతి, మరో కార్యక్రమానికి సినీ నిర్మత ఎంఎస్ రెడ్డి అధ్యక్షత వహించారు. దేశ విదేశాల నుంచి ఆహ్వానాలు అందాయి. అమెరికాలో... 1992లో జూలైలో ‘ఆటా’ అధ్యక్షుడు టి.సదాశివారెడ్డి ఆహ్వానం మేరకు 9 వారాలపాటు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అష్టావధానాలను నిర్వహించి ప్రవాసాంధ్రుల ప్రశంసలు అందుకున్నారు. న్యూయార్క్‌లో శిరోమణి అవార్డు, న్యూజెర్సి, శాన్ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలెస్, వాషింగ్టన్, హ్యూస్టన్, సెయింట్‌లూయిస్, డెట్రాయిట్ నగరాల్లో ప్రతిభ చాటారు. తర్వాత నాటా ఆహ్వానంతో మూడు మార్లు, ఆటా ఆహ్వానంతో నాలుగు మార్లు, తానా ఆహ్వానంతో ఒక సారి మొత్తం 8 సార్లు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అవధాన నైపుణ్యం ప్రదర్శించారు. డాలస్‌లో అష్టావధానం నిర్వహించి ‘అవధాన కౌస్తుభ’ బిరుదు పొందారు. చికాగోలో అష్టావధానం నిర్వహించి కనకాబి సత్కారంతోపాటు ‘అవధాని సౌరభౌమ’ బిరుదు పొందారు. ► నరాల రామారెడ్డి 1965 నుంచి 2018 వరకు సుమారు వెయ్యి అష్టావధానాలు నిర్వహించారు. ► 2012లో సంస్కృతంలో ప్రసిద్ధి గాంచిన శాలివాహన గాథాసప్తశతిలోని 300 శ్లోకాలను అనువాదం చేసి భావకవితా శైలిలో 300 తేటగీతులను తెలుగు పాఠకులకు అందించారు. 2018లో 400 పద్యాలతో ‘అవధాన సౌరభం’ గ్రంథాన్ని ప్రచురించారు. సంస్కృత సాహిత్యంలో అలంకార శాస్త్రంలో సుప్రసిద్ధ సంస్కృత శ్లోకాలు, కొన్ని చాటు శ్లోకాలు, ప్రసిద్ధం సంస్కృత కవుల శ్లోకాలను తెలుగులో అనువాదం చేసి ‘అనువాద మాధురి’ పేరుతో ప్రచురిస్తున్నారు. కర్ణుని జీవితంలో విశిష్ట ఘట్టాల ఆధారంగా కర్ణ జననం నుంచి సూర్యునిలో కలిసిపోవు వరకు ఇతివృత్తాన్ని తీర్చిదిద్ది ‘కర్ణభారతం’ అనే కావ్య రచన చేశారు. ► 978–80 ప్రాంతంలో శోభన్‌బాబు నటించి న ‘కార్తీక దీపం’, కృష్ట నటించిన ‘కలవారి సంసారం’ సినిమాలకు పాటలు రాశారు. ► 2000లో డాక్టర్ సి.నారాయణరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు, బండారు దత్తాత్రేయ సమక్షంలో రసమయి అవార్డు అందుకున్నారు. ► 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా హంస అవార్డు అందుకున్నారు. ► తిరుపతిలో చదివిన నరాల రామారెడ్డి 1971లో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ అధ్యక్షతన, 1980లో దివాకర్ల వెంకట అవధాని, ఆ ఏడాదిలోనే శ్రీనివాస ఆడిటోరియంలో బీఎన్ రెడ్డి, 1981లో యూనివర్సిటీ రజతోత్సవం సందర్భంగా మహాకవి దాశరథ అధ్యక్షతన అవధాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన ప్రతిభను గుర్తించిన శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం గత నెల 24న గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. -
కిసాన్ కాల్‌సెంటర్‌తో సమస్యలకు చెక్
సాక్షి, అమరావతి: పశుపోషణను లాభసాటిగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పం మేరకు శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం (ఎస్వీవీయూ) పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమాలు చేపడుతోంది. పశుఆరోగ్య పరిరక్షణ, యాజమాన్య పద్దతులపై శాస్త్రీయ విషయ పరిజ్ఞానం కల్పించడం, శాస్త్రవేత్తల సూచనల మేరకు ఆధునిక పశుపోషణపై అవగాహన పెంచి ఇతర వృత్తులకు దీటుగా ఆదాయం పెంచడమే లక్ష్యంగా టోల్‌ఫ్రీ నంబరు 1800–120–4209తో ఏర్పాటు చేసిన కిసాన్ కాల్‌సెంటర్ పాడిరైతులు, విద్యార్థుల అవసరాలను తీరుస్తోంది. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్న ఈ కాల్సెంటర్లో కేవీకే సిబ్బంది సేవలందిస్తున్నారు. పాడిపశువుల పోషణ, యాజమాన్యం, పునరుత్పత్తి, పశుగ్రాసాల సాగు, వ్యాధులు–నివారణ, విలువ ఆధారిత పదార్థాల తయారీ తదితర అంశాలపై రైతుల సందేహాలను నివృత్తి చేయడమేగాక పశువైద్య కళాశాలల్లో కొత్త కోర్సులు, ప్రవేశాలపై విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. కాల్‌సెంటర్ ద్వారా గడిచిన ఏడాదిన్నరలో 3,429 మంది సమస్యలను పరిష్కరించారు. పునరుత్పత్తి, గర్భకోశ సంబంధిత వ్యాధుల నివారణ కోసం 759, ఇతర వ్యాధుల నివారణ కోసం 593, పశుపోషణ, యాజమాన్య పద్ధతుల కోసం 370, చేపల పెంపకంపై 106, పాలు, మాంస పదార్థాల తయారీ కోసం 287, అడ్మిషన్స్ కోసం 1,314 మంది కిసాన్ కాల్‌సెంటర్‌కు ఫోన్‌చేశారు. ఫోన్లో విషయం చెప్పగానే క్షణాల్లో వారి సమస్యలకు పరిష్కారమార్గాలు చూపారు. -
ఆ కాలేజీలకు అనుబంధ గుర్తింపుపై కౌంటర్ వేయండి
సాక్షి, అమరావతి: శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీ వర్సిటీ) పరిధిలో అర్హతలు లేకున్నా 138 ప్రైవేట్ కాలేజీ లకు అనుబంధ గుర్తింపు ఇవ్వడంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, సీఐడీ లేదా విజిలెన్స్ విచారణకు ఆదేశిం చాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. చిత్తూరు జిల్లాకు చెందిన విలేకరి బి.దొరస్వామి దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమాన్లు, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ దర్మాసనం విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎస్వీ వర్సిటీని ఆదేశించింది. తదుపరి విచారణను 24కు వాయిదా వేసింది. అర్హత లేకపోయినా అనుబంధ గుర్తింపు పొందిన 138 కళాశాలలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాల వల్ల లబ్ధి పొందాయని పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ తెలిపారు. దీని వల్ల ప్రభుత్వానికి రూ.150 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. -
దైవ దర్శనానికి వెళుతూ..!!
తిరుపతి క్రైం (చిత్తూరు జిల్లా): శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చిన కర్ణాటక బృందం ప్రయాణిస్తున్న వాహనం నీట మునిగిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది భక్తుల్లో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. శనివారం తెల్లవారు జామున సుమారు ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగింది. ఎస్వీ యూనివర్సిటీ పోలీసుల వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం, రాయచూరు ప్రాంతం, ముదిగళ్‌కు చెందిన ఎనిమిది మంది కుటుంబ సభ్యులు శ్రీవారి దర్శనార్థం శనివారం రాత్రి తిరుపతికి చేరుకున్నారు. అప్పటికే పట్టణంలో భారీ వర్షం కురుస్తోంది. బాలాజీ కాలనీ నుంచి ఎమ్మార్‌పల్లి వెళ్లే దారిలో వెంగమాంబ కూడలి వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద ఏడడుగులు మేర వర్షపునీరు నిలిచిపోయింది. ఆ దారి గురించి అవగాహన లేని డ్రైవర్ వాహనాన్ని అలాగే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. వాహనం వేగంగా వెళ్లి నీటి మధ్యలో ఆగిపోయింది. డోర్లు తెరుచుకోకపోవడంతో అందులో ఉన్న భక్తులు నీటిలో చిక్కుకున్నారు. హాహాకారాలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో చిక్కుకున్న కుటుంబ సభ్యులను ఒక్కొక్కరినీ బయటకు తీసుకొచ్చారు. వాహనం పూర్తిగా నీట మునిగిపోవడంతో సంధ్య(30) అనే మహిళ ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒక చిన్నారి ఉంది. మృతురాలికి నాలుగు నెలల క్రితమే వివాహమైనట్టు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్వీయూలో పదోన్నతుల వివాదం
యూనివర్సిటీ క్యాంపస్: యూనివర్సిటీల్లో పదోన్నతులకు తప్పనిసరిగా డిపార్డ్మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి. ఎస్వీయూ పాలకమండలి నిర్ణయం మేరకు డిపార్డ్మెంట్ పరీక్షలు పాసైన వారికే పదోన్నతులు ఇస్తున్నారు. ఈ విధానంలో ఇప్పటికే మూడు పర్యాయాలు ఉద్యోగోన్నతులు ఇచ్చారు. నాన్‌టీచింగ్ అసోసియేషన్ మాత్రం ఈ పద్ధతిని వ్యతిరేకిస్తోంది. సీనియారిటీ ప్రాతిపదికన ప్రమోషన్లు ఇవ్వాలని పట్టుబడుతోంది. సోమవారం నుంచి సమ్మెకు ది గాలని పిలుపునిచ్చింది. ఈ సమ్మెకు మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఫలితంగా ఉద్యోగులు రెండు వర్గాలుగా విడిపోయి ఆందోళన బాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. 2017లోనే ఆదేశాలు.. యూనివర్సిటీల్లో పదోన్నతులకు ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంట్ టెస్ట్‌లు పాస్ కావాలనే నిబంధనతో 2017లో అప్పటి ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. అప్పటి నుంచి రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో ఈ ఆదేశాలు అమలులోకి వచ్చాయి. ఎస్వీయూలో మాత్రం అప్పటి అధికారులు పట్టించుకోలేదు. 2018లో ఉన్నత విద్యామండలి మరోసారి ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది మాత్రం ఈ ఆదేశాలను అమలు చేయాలని వర్సిటీ పాలకమండలి నిర్ణయించింది. ఇన్చార్జ్ వీసీగా ఉన్న ఐఏఎస్ అధికారి సతీ‹Ùచంద్ర మూడు పర్యాయాలు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. తాజాగా ఏడుగురు ఉద్యోగులకు ప్రమోషన్ ఇచ్చారు. ఈ నిర్ణయంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పదోన్నతులను ఓ వర్గం వ్యతిరేకిస్తుండగా మరో వర్గం స్వాగతిస్తోంది. సమ్మె అర్థ రహితం ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. నిబంధనలను అతిక్రమిస్తే సమ్మె చేయాలి. అంతే కానీ, నిబంధనలను పాటించినందుకు ఆందోళనకు దిగడం అర్థరహితం – ఎం.రెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎస్వీయూ అధ్యాపక సంఘం కార్యదర్శి నిబంధనల మేరకే పదోన్నతులు ఎస్వీయూలో నిబంధనల మేరకే ఉద్యోగులకు పదోన్నతులు కలి్పంచాం. జనవరిలో పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్నాం. అయితే నిబంధనలు పక్కాగా అమలు చేసినా ఉద్యోగ సంఘ నాయకులు ఆందోళనకు పిలుపు ఇవ్వడం బాధాకరం. – పి.శ్రీధర్‌రెడ్డి, ఎస్వీయూ రిజిస్ట్రార్ -
ఎస్వీయూ: డబ్బు కావాలంటూ..
సాక్షి, తిరుపతి: శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ(ఎస్వీయూ)లో నకిలీ ఇ-మెయిల్స్ ఘటన కలకలం రేపింది. డబ్బు కావాలంటూ వివిధ విభాగాల ప్రిన్సిపల్స్ పేరిట అధ్యాపకులకు మెయిల్స్ రావడం గందరగోళానికి దారి తీసింది. అనుమానం వచ్చిన అధ్యాపకులు ప్రిన్సిపల్స్‌కు కాల్ చేసి విషయం గురించి ఆరా తీశారు. డబ్బు కోసం తామెవరికీ మెయిల్స్ పంపలేదని వారు స్పష్టం చేయడంతో.. ఇవన్నీ నకిలీ మెయిల్స్ అని తేలింది. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. (పేరుకు పెద్ద సాయం.. కానీ, అంతా మోసం) -
ఎస్వీయూ డిగ్రీ పరీక్షల్లో గందరగోళం
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా పీలేరులో అధికారుల నిర్లక్ష్యంతో డిగ్రీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాల్ టికెట్ల జారీ విషయంలో సాంకేతిక సమస్యలు రావడంతో తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షల్లో గందరగోళం తలెత్తింది. హాల్ టికెట్లలో పరీక్షా కేంద్రాల చిరునామాలు తప్పుగా ముద్రించటం వల్ల తాము సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతో ఈ నెల 14, 15 వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. శనివారం నుంచి యధావిథిగా పరీక్షలు జరగాల్సి ఉండగా, ఇప్పుడు కూడా పరీక్ష కేంద్రాల చిరునామాలు తప్పుగా ముద్రించడంతో 399 మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ జీవితాలతో ఆటలాడుకుంటున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరారు. -
తిరుపతి ఎస్వీయూలో ఘోర తప్పిదం!
ఎస్వీయూ పరీక్షల విభాగం చాలా కాలం నుంచి సమస్యల్లో ఉంది. ఈ విభాగంలో నిత్యం ఏవో తప్పులు దొర్లుతూనే ఉంటాయి. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాల్లో తప్పులు దొర్లడం క్యాంపస్‌లో హాట్ టాఫిక్‌గా నిలిచింది. ఎక్కువమంది విద్యార్థుల ఫలితాల్లో తప్పులు దొర్లాయి. ఇదే సమయంలో పుత్తూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థి హరి(19) రెండో సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల విభాగం తప్పువల్లే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందులో నిజం లేదని ఎస్వీయూ అధికారులు చెపుతున్నారు. ఫలితాల తప్పు వ్యవహారంలో ఇప్పటికే నల్గురు ఉద్యోగులకు మెమో జారీచేశారు. ఈ అంశంపై లోతైన విచారణ జరపాలని, సంబంధిత ఉద్యోగులను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సాక్షి, యూనివర్సిటీ క్యాంపస్(చిత్తూరు) : ఎస్వీయూలో ఏప్రిల్, మేనెలలో నిర్వహించిన రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు శనివారం రాత్రి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో తప్పులు దొర్లాయి. ఈ పరీక్షలకు సంబంధించి ఇంటర్నల్, ఎక్స్టర్నల్ మార్కులు విడివిడిగా ఉంటాయి. ఇంటర్నల్ మార్కులను సంబంధిత కళాశాలలు పంపుతాయి. ఎక్స్టర్నల్ మార్కులను యూనివర్సిటీలో మూల్యాంకనం చేయిస్తుంది. ఫలితాల విడుదల సమయంలో రెండింటినీ కలిపి ఫలితాలు విడుదల చేస్తారు. శనివారం రాత్రి విడుదల చేసిన రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను చూసుకున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది ఫెయిల్ కావడంతో లబోదిబోమంటున్నారు. విద్యార్థులకు సంబంధించిన ప్రాక్టికల్స్ మార్కులు కొంత మందికి కలపలేదు. కొంతమందికి సంబంధించిన ఇంటర్నల్ మార్కులు కలపలేదు. ఇంగ్లిషు సబ్జెక్ట్‌కు సంబంధించి సుమారు 270 మందికి ఇంటర్నల్ మార్కులు కలుపకపోవడం వల్ల ఫెయిల్ అయ్యారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రాక్టికల్ మార్కులు కలపకపోవడం వల్ల కొంతమందికి గైర్హాజర్ అని వచ్చింది. దీనిపై ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు సోమ, మంగళవారాల్లో ఆందోళన చేశారు. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ సంఘాలు కూడా ఈ వ్యవహారంపై ఆందోళనలు చేపట్టాయి. విద్యార్థి ఆత్మహత్య డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ కావడంతో పుత్తూరుకు చెందిన విద్యార్థి శనివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరీక్షల విభాగం తప్పిదం వల్లే విద్యార్థి ఫెయిల్ అయ్యాడని, అందుకే ఆత్మహత్మకు పాల్పడ్డారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆ సంఘటనకు బా«ధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ సంఘాలు మంగళవారం పరిపాలన భవనం ఎదుట నిరసన తెలిపాయి. ఈ సంఘటనపై పూర్తిస్థాయి జరపాలని పట్టుబడుతున్నాయి. నలుగురికి మెమో ఎస్వీయూ రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాల్లో తప్పులు దొర్లిన సంఘటనకు సంబంధించి నలు గురు ఉద్యోగులకు మెమో ఇచ్చారు. ఒక అసిస్టెం ట్ రిజిస్ట్రార్, సూపరిండెంట్, ఇద్దరు క్లర్క్‌లకు మె మో జారీ చేశారు. కాగా ఈ సంఘటనపై విచారణ జరిపి సంబంధిత ఉద్యోగులను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆత్మహత్మకు సంబంధంలేదు పరీక్షల్లో ఫెయిల్ అయి చనిపోయిన విద్యార్థి హరి ఆత్మహత్యకు, సెమిస్టర్ పరీక్ష ఫలితాల్లో దొర్లిన తప్పులకు ఎలాంటి సంబంధం లేదు. రికార్డులు పరిశీలించాం. హరికి ఇంటర్నల్ మార్కులు కలిపి ఉన్నాయి. అన్ని సబ్జెక్టుల్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. పరీక్షల విభాగం తప్పు ఎంతమాత్రం లేదు. –ఏ.సునీత, పరీక్షల నియంత్రణాధికారి -
వేదిక్లో నూతన పీజీ కోర్సులు
సాక్షి, తిరుపతి : శ్రీవేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో ఏడు నూతన పీజీ కోర్సులు ప్రవేశ పెడతున్నట్లు వీసీ ప్రొఫెసర్ ఎస్.సుదర్శన వర్మ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019–20 విద్యా సంవత్సరం నుంచి ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ గణితం, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ జువాలజీ, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిందీ, ఎంఏ తెలుగు కోర్సులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. దరఖాస్తు తుది గడువు ఈనెల 6వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. తొమ్మిదో తేదీ ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఈ ప్రవేశ పరీక్షలో ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్లు ఉంటా యని తెలిపారు. కోర్సులో చేరేవారికి ఉచిత వసతి భోజన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రపంచంలో అనేక విషయాల్లో మార్పులు వచ్చాయని, అయితే మార్పు రానిది వేదం మాత్రమే అన్నారు. అందుకే మన దేశం వేదభూమిగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఆధునిక కోర్సులు కూడా వేదిక్ వర్సిటీలో వేదానికి సంబంధించిన కోర్సులే కాకుండా ఆధునిక కోర్సులు కూడా ఉన్నాయన్నారు. డిగ్రీ స్థాయిలో బీఎస్సీ, బీఏ కోర్సులు ఉన్నాయన్నారు. ఈ ఏడాది నుంచి పీజీ కోర్సులు ప్రవేశ పెడుతున్నామని తెలిపారు. సంప్రదాయ వర్సిటీలలోని కోర్సులకు వేద విజ్ఞానాన్ని జోడిం చి ఈ కోర్సులకు రూపకల్పన చేశామన్నారు. మహిళా వర్సిటీ, ఎస్వీయూ, ఇతర వర్సిటీల అధ్యాపకులు, నిపుణులతో సిలబస్ రూపొం దించినట్లు తెలిపారు. ఈ కోర్సుల బోధన సిబ్బం ది నియామకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని వీసీ వివరించారు. -
ఏపీ ఎడ్‌సెట్-2019 ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని బీఈడీ కళాశాల్లో ప్రవేశానికి ఈ నెల 6న నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్-2019 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. పరీక్ష ఫలితాలను ఇవాళ ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 11,650మంది రాయగా 11,490మంది అర్హత సాధించారు. 18వ తేదీ నుంచి ర్యాంక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని, జూలై మొదటివారం నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుందని ఏపీ ఎడ్‌సెట్ చైర్మన్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఏపీ ఎడ్‌సెట్‌ను ఈ ఏడాది ఎస్వీ యూనివర్శిటీ నిర్వహించిన విషయం తెలిసిందే. -
ఎస్వీయూ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
చిత్తూరు, యూనివర్సిటీ క్యాంపస్/తిరుపతి క్రైం: ఎస్వీ యూనివర్సిటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి హర్షవర్ధన్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి అనంతరం వెస్ట్ రైల్వేస్టేషన్లో సమీపంలో చోటుచేసుకుంది. ప్రిన్సిపల్ ప్రదీప్‌కుమార్, పోలీసులు తెలిపిన వివరాలు..పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుజబుజ నెల్లూరుకు చెందిన హర్షవర్ధన్ చదువులో చురుగ్గా ఉండేవాడు. వ్యవసాయ కూలీ అయిన అతడి తండ్రి రెక్కల కష్టంతో అతడిని చదివిస్తున్నాడు. ఇంటర్లో కూడా హర్షవర్ధన్ 90 శాతం పైగా మార్కులు సాధించాడు. ఇక్కడ బీటెక్ చేస్తున్న అతడు బుధవారం ఉదయం ప్రాక్టికల్ పరీక్షకు హాజరై బాగా రాశాడు. అయితే ఇదేరోజు రాత్రి నుంచి ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల అనుబంధ వసతి గృహంలో హర్షవర్ధన్ కనిపించకపోవడంతో విద్యార్థులు అతడి కోసం గాలించసాగారు. వెస్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై బుధవారం అర్ధరాత్రి హర్షవర్ధన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇది తెలుసుకున్న కళాశాల ప్రిన్సిపల్ రాత్రి ఒంటి గంట సమయంలో అక్కడికి చేరుకుని పోలీసులతో పాటు పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కళాశాల మార్చురీకి తరలించారు. గురువారం ఉదయం పోస్టుమార్టం అనంతరం హర్షవర్ధన్ మృతదేహాన్ని అతని తల్లిదండ్రులకు అప్పగించారు. చదువులో చురుకైన ఈ విద్యార్థి బలవన్మరణం తనను కలచివేసిందని, ఆత్మహత్యకు దారితీసిన కారణాలేమిటో తనకు తెలియదని ప్రిన్సిపల్ చెప్పారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘సాక్షి’ పాత్రికేయుడు రాంబాబుకు వ్యవసాయ అవార్డు
యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): ‘సాక్షి’దినపత్రికలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్న సీనియర్ పాత్రికేయుడు పంతంగి రాంబాబుకు ‘ప్రకృతి వ్యవసాయ విద్యారత్న’ అవార్డు లభించింది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో శనివారం దేశీయ విత్తన మేళా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ మేళాను సౌత్ ఏసియన్ రూరల్ రీకన్స్ట్రక్షన్ అసోసియేషన్(సారా), ఎస్వీయూ పర్స్ సెంటర్ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. పంతంగి రాంబాబు ‘సాక్షి’ దినపత్రికలో ‘ఇంటి పంట’ పేరుతో కథనాలతో పాటు ‘సాగుబడి’ శీర్షికన ప్రతి వారం వ్యవసాయ వార్తలను అందిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ అనేక కథనాలు రాశారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు వరించింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ వి.దామోదరం నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. అలాగే బెంగళూరుకు చెందిన సహజ సీడ్స్ సంస్థ యజమాని జి.కృష్ణ ప్రసాద్‌కు ‘దేశవాళీ విత్తన సంరక్షక’ అవార్డు లభించింది. కృష్ణప్రసాద్ దక్షిణ భారతదేశంలోని 786 సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లకు వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాలను అందిస్తున్నారు. -
తిరుపతిలో నవంబర్ 17–18 తేదీల్లో దేశీ విత్తనోత్సవం
ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం తెలుగు రాష్ట్రాల్లో పుంజుకుంటున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన వివిధ రాష్ట్రాలకు చెందిన దేశవాళీ విత్తనాలను అందుబాటులోకి తెచ్చేందుకు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో నవంబర్ 17–18 తేదీల్లో దేశీయ విత్తనోత్సవం జరగనుంది. సౌత్ ఆసియా రూరల్ రీకన్స్ట్రక్షన్ అసోసియేషన్(సార) ఈడీ కోడె రోహిణీరెడ్డి, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన ప్రమోషన్ ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చ్–సైంటిఫిక్ ఎక్స్‌లెన్స్(పర్స్) సమన్వయకర్త ప్రొ. సాయిగోపాల్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సీడ్ ఫెస్టివల్లో 14 రాష్ట్రాలకు చెందిన దేశీయ విత్తన సంరక్షకులు 50కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. సుసంపన్నమైన భారతీయ వ్యవసాయ జీవవైవిధ్యానికి ఈ ప్రదర్శన అద్దంపడుతుందని రోహిణీరెడ్డి తెలిపారు. 500 రకాల దేశీ వరి, 48 రకాల కూరగాయలు, 30 రకాల పప్పుధాన్యాలు, రాజస్తాన్ ఆల్వర్ నాటు సజ్జలతోపాటు 15 రకాల చిరుధాన్యాల రకాల దేశీ వంగడాలు అందుబాటులోకి తేనున్నారు. వివరాలకు.. 99859 47003, 98496 15634. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. -
ఎంతపని చేశావు తల్లీ..!
కడప అర్బన్ : తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో రెండవ సంవత్సరం వైద్య విద్యను అభ్యసిస్తున్న గీతిక (19) ఈనెల 12న సాయంత్రం తాను ఉంటున్న శివజ్యోతి నగర్‌లోని ఇంటిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సహచర విద్యార్థుల్లో తీవ్ర ఆవేదనను మిగిల్చింది. గీతిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం సోమవారం సాయంత్రం కడప నగరంలోని మారుతీనగర్‌కు తీసుకుని వచ్చారు. గీతిక తల్లి, సమీప బంధువులు, చుట్టు పక్కల వారు ఆమె మృతదేహాన్ని పట్టుకుని ‘ఎంతపని చేశావు గీతికా’ అంటూ బోరున విలపించారు. ఇంతకాలం తమ కళ్లముందే ఆడుతూ, పాడుతూ కనిపించిన గీతిక ఉన్నట్లుండి బలవన్మరణం చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. పరీక్షల భయంతోనో.. వ్యక్తిగత కారణాల వల్లనో ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ఆమె తల్లి హరితాదేవి, బంధువులు మీడియాకు వెల్లడించారు. ఇలాంటి సంఘటన ఎవరికి జరగకూడదని వారు కన్నీటి పర్యంతమయ్యారు. సంఘటన జరిగిన వెంటనే అక్కడి ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కడపలోని మారుతీనగర్‌లో ఉన్న తమ బంధువుల ఇంటికి గీతిక మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకునివచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్మశాన వాటికలో బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య గీతిక మృతదేహానికి అంత్యక్రియలను పూర్తి చేశారు. జిల్లాకు చెందిన ఇద్దరు మెడికోలు అకాల మరణం జిల్లాకు చెందిన వారే ఇద్దరు మెడికోలు అకాల మరణం చెందారు. జిల్లాలోని సింహాద్రిపురానికి చెందిన శ్రీనివాసుల రెడ్డి కుమారుడు హర్షప్రణీత్ రెడ్డి కర్నూలు మెడికల్ కళాశాలలో వైద్యవిద్యను అభ్యసిస్తూ అనుమానాస్పద స్థితిలో హాస్టల్లో మృతి చెందాడు. తర్వాత ఆ సంఘటనపై విచారణలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. తాజాగా కడప మారుతీనగర్‌కు చెందిన విజయభాస్కర్ రెడ్డి, హరితాదేవిల ఏకైక కుమార్తె గీతిక బలవన్మరణం ఆ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మెడికల్ కాలేజీలో విషాద ఛాయలు తిరుపతి అర్బన్: తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు మెడికోలు ఆత్మహత్యలు చేసుకోవడంతో కాలేజీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తక్కువ కాల వ్యవధిలో ఇద్దరు తనువు చాలించడంపై విస్తృత చర్చ జరుగుతోంది. వరుస సంఘటనలు జరగడంతో కళాశాలలో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని తిరుపతి మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆత్మహత్య చేసుకున్న ఎంబీబీఎస్ విద్యార్థిని పి.గీతిక మృతదేహాన్ని సోమవారం ఆయన రుయా మార్చురీలో పరిశీలించారు. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. రుయా ప్రభుత్వ వైద్యులు, జూడాల సంఘం నాయకులు సోమవారం మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్, ప్రభుత్వ వైద్యుల సంఘం కోశాధికారి డాక్టర్ శ్రీనివాసరావు, జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వెంకటరమణ, సభ్యురాలు లావణ్య తదితరులు హాజరై ఇద్దరు వైద్య విద్యార్థుల చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించారు. దర్యాప్తు చేస్తున్నాం: డీఎస్పీ గీతిక మృతదేహానికి రుయా సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్ ఆధ్వర్యంలో సోమవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. తిరుపతి ఈస్ట్ డీఎస్పీ మునిరామయ్య మీడియాతో మాట్లాడుతూ గీతిక మృతి పూర్తిగా వ్యక్తిగతమని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ డివిజన్ మెజిస్ట్రేట్(ఆర్డీవో), తహసీల్దార్ల పర్యవేక్షణలో పోస్టుమార్టం పూర్తి చేసినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. గీతిక మృతికి మెడికల్ కాలేజీలో ఎలాంటి వేధింపులు గానీ, ఇతర సమస్యలు గానీ లేవని, విద్యలో వెనుకబాటుతనం మాత్రమే ఉందని ఆమె తల్లి చెప్పినట్లు స్పష్ట్టం చేశారు. ఆమె రాసిన సూసైడ్ నోట్లో కూడా ఎవరిపేర్లు లేవని, ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదని డీఎస్పీ పేర్కొన్నారు. -
ఎస్వీ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థిని ఆత్మహత్య
-
ఎస్వీ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, తిరుపతి : శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో మరో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎస్వీ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న గీతిక బలవన్మరణానికి పాల్పడింది. గీతిక ఆత్మహత్యకు వెనుక గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. గత వారం ఎస్వీ మెడికల్ కాలేజీలో శిల్ప ఆత్మహత్య ఉదంతం మరిచిపోక ముందే మరో ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రొఫెసర్ల వేధింపులపై గత కొంతకాలంగా మెడికోలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. పీలేరులో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య సీనియర్ డాక్టర్లు వర్సెస్ జూనియర్ డాక్టర్లు -
హోదా సాధనలో టీడీపీకి చిత్తశుద్ధి లేదు
-
నాట్య మయూరాలను ఆదుకోరూ..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) : గిరిపుత్రికల కళలకు ఆంధ్రప్రదేశ్ సర్కార్‌సాయం అందడం లేదు. ఉజ్వల భవిష్యత్ ఉన్న నాట్యమయూరాలు చదువుసగంలోనే ఆపి ఇంటిదారిపట్టారు. ఫీజులు చెల్లించేందుకు ఆర్థిక స్థోమత లేక మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులు సంగీతవిద్యకు దూరవుతున్నారు. వీర్నపల్లి మండల కేంద్రం పరిధి గోల్యాతండాకు చెందిన బట్టు సుజాత, బట్టు లలిత స్థానికంగా డిగ్రీ చదివారు. పీజీ కోసం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో(ఎస్వీ) ఫార్ఫమెన్స్ ఆర్ట్స్‌లో సంగీతవిద్యను అభ్యసిస్తున్నారు. రెండేళ్ల ఈ కోర్సును పూర్తి చేయాల్సి ఉండగా మొదటి సంవత్సరం పూర్తయింది. సంవత్సరం పాటు వీరికి ప్రభుత్వ పరంగా అందాల్సిన రియింబర్స్‌మెంట్ అక్కడి ప్రభుత్వం వర్తింపజేయలేదు. దీంతో యూనివర్సిటీ వారు ఏడాదికి రూ.20వేల చొప్పున ఒక్కొక్కరు ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఈ ఫీజు కట్టలేని నిరుపేద కుటుంబాలకు చెందిన గిరిజన బాలికలు ఇంటికి వచ్చారు. ప్రైవేట్ హాస్టల్లో ఖర్చుల మోత ఒకవైపు చదువుకోవడానికి యూనివర్సిటీలో ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతూనే మరోవైపు ప్రైవేట్ హాస్టల్లో నెలకు రూ.2వేల మెస్‌బిల్లుతో పాటు పరీక్షల ఫీజు, పుస్తకాలు, నాట్యం, పాటలు, ఇతర సంగీత వి ద్య కోసం అధనంగా నెలకు రూ.5వేల చొప్పున ఖర్చు చేస్తూ ఏడాది పాటు నెట్టుకొచ్చారు. తిరుపతిలో యూ నివర్సిటీ తరఫున నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో ఈ విద్యార్థినులు తమ ప్రతిభ కనబర్చారు. ప్రతిభకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లభించడం లేదని ఆ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదివించే స్థోమత లేని వ్యవసాయ కుటుంబాలు ఆడపిల్లలను దూరంగా ఉంచి వారికి సంగీతవిద్యనందించే స్థితిలో తల్లిదండ్రులు లేరు. కూలీ, వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉన్నంతలో వారికి హాస్టల్ ఫీజులు చెల్లించేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి. దీంతో తమ పిల్లలను రెండోసంవత్సరం చదివించలేక పీజీ విద్యను మధ్యలోనే ఆపివేసి ఇంటికి రప్పించుకున్నారు. తమతోపాటే తమ పిల్లలు కూడా కూలీ నాలీ పనులు చేస్తూ ఇంటివద్ద ఉంటారని తల్లిదండ్రులు బట్టు హరిచంద్, హింగవ్వ, బట్టు భూమయ్య, వీరవ్వ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎస్వీయూలో డ్రగ్స్ కలకలం
-
కెవ్వు.. కేక
-
భార్య రాలేదని, వాట్సప్ లో చెప్పి..
తిరుపతి : తనను వదిలి పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ భర్త ప్రేమికుల దినోత్సవం రోజునే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదీ తన డెత్ డేట్ అంటూ స్నేహితులకు మెసేజ్‌లు పంపించి మరీ ఉరితాడుకు వేలాడాడు. చనిపోయే ముందు జనన, మరణ తేదీలు, ఉరితాడుతో వాట్సప్ ప్రొఫైల్ పిక్చర్ తయారు చేసి అందరికి షేర్ చేశాడు. మెసేజ్ చూసి ఇంటికి రావాలని.. ఇది చివరి కోరిక అని అందులో పేర్కొన్నాడు. కుటుంబ సభ్యులు రావడానికి వీలుగా ముందురోజే విమాన టికెట్లు కూడా తీశాడు. మంగళవారం తిరుపతిలో జరిగిన ఈ విషాదాంతం వివరాలిలా ఉన్నాయి. ఎస్వీయూ వీసీ చాంబర్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎన్.శ్రీహరి 2006లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరాడు. బీటెక్ చదివిన శ్రీహరికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో, 2015 అక్టోబర్‌లో వీసీ దామోదరం పీఏగా నియమించుకున్నారు. శ్రీహరికి ఆరు సంవత్సరాల క్రితం నెల్లూరుకు చెందిన విద్యాలతతో వివాహమైంది. కొంతకాలం తిరుపతిలోని ఎస్వీనగర్‌లో నివాసం ఉండేవారు. వీసీ పీఏగా నియమితులయ్యాక రెడ్ బిల్డింగ్ క్వార్టర్స్‌లోని హౌస్ నెంబర్ 42కు షిఫ్ట్ అయ్యారు. పెళ్లి అయి ఆరు సంవత్సరాలైనా పిల్లలు లేకపోవడంతో నిత్యం భార్యభర్తలు గొడవలు పడేవారని సన్నిహితులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితం విద్యాలత పుట్టింటికి వెళ్లి పోయింది. మళ్లీ తిరిగిరాలేదు. అప్పటి నుంచి బాధ పడుతూ వచ్చిన శ్రీహరి మంగళవారం తనువు చాలించాడని వారు తెలిపారు. శ్రీహరి ఆత్మహత్మకు ముందు వాట్సప్‌లో డిస్ప్లే పిక్చర్లో పుట్టిన తేదీ.. మరణించిన తేదీ అని, ఫోటోల మధ్యలో ఉరితాడు పెట్టి పిక్చర్ తయారు చేశాడు. కొంత మంది మిత్రులకు పోస్ట్ చేశాడు. హైదరాబాద్‌లో ఉన్న తమ్ముడు, చిన్నాన్నకు మంగళవారం మధ్యాహ్నం తిరుపతికి రావడడానికి వీలుగా ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు. మెసేజ్‌కు స్పందించి శ్రీహరి ఇంటికి చేరిన మిత్రులకు ఉరితాడుపై వేలాడుతూ కన్పించాడు. వీసీ దామోదరం తదితరులు శ్రీహరి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.l -
నేటితో ముగియనున్న ఇస్కా సదస్సు
తిరుపతి ఎడ్యుకేషన్: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ వేదికగా ఈ నెల 3న ప్రారంభమైన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సులు శనివారంతో ముగియనున్నాయి. ముగింపు సభకు ముఖ్యఅతిథిగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ హాజరవనున్నారని ఎస్వీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆవుల దామో దరం తెలిపారు. నాలుగు రోజులుగా ఇస్కాలోని అన్ని ప్లీనరీ, పార్లర్ సెషన్స్‌లో శాస్త్రవేత్తలు, మేధావుల ప్రసంగాలు అందరిని ఆకటు ్టకోవడంతో పాటు ఆలోచింపజేశాయని తెలిపారు. 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పా టుచేసిన మెగా ఎగ్జిబిషన్‌ను ఆశించిన స్థాయి కంటే ఎక్కువ మంది తిలకించారన్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో రేపు ప్రధాని మోదీ పర్యటన
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. తిరుపతిలో జరిగే జాతీయస్థాయి 104వ భారత సైన్స్ కాంగ్రెస్ సదస్సును ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని...తిరుమల వెళ్లి వెంకన్న దర్శనం చేసుకుంటారు. కాగా జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సువిశాల ఆవరణలో సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వివిధ దేశాలకు చెందిన ఆరుగురు నోబెల్ బహుమతి గ్రహీతలు హాజరు కానున్నారు. ఈ సదస్సులో ప్రధాని తన సందేశం ఇవ్వడంతో పాటు నోబెల్ గ్రహీతలతో ముఖాముఖిలో పాల్గొంటారు. ‘సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ నేషనల్ డెవలప్మెంట్’ అనే అంశంపై జరుగుతున్న ఈ సదస్సుకు 10,500 మంది రిజిస్టర్ చేసుకోగా, వివిధ దేశాల నుంచి 200 మంది శాస్త్రవేత్తలు హాజరు కానున్నారు. -
రూ.175 కోట్లతో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
ఈ నెల 26లోగా ఏర్పాట్లన్నీ పూర్తి: సీఎం చంద్రబాబు సాక్షి ప్రతినిధి, తిరుపతి/గుంటూరు (నగరంపాలెం): అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను తిరుపతిలో జనవరి 3 నుంచి 7 వరకు నిర్వహించనున్నామని సీఎం ఎన్.చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం రూ.175 కోట్లు వెచ్చించనున్నామన్నారు. ఈ నెల 26లోగా ఏర్పాట్లన్నీ పూర్తి కానున్నాయన్నారు. తిరుపతిలో స్థానిక బర్డ్, స్విమ్స్ ఆస్పత్రుల్లో నూతనంగా నిర్మించిన అదనపు వైద్య భవనాలను ఆయన శుక్రవారం ఉదయం ప్రారంభించారు. అనంతరం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ పనుల పురోగతిపై అధికారులు, మంత్రులతో సమీక్షించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఎస్వీ యూనివర్సిటీ వీసీ సమావేశ మందిరంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. తిరుపతిలో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నామన్నారు. జనవరి 3న ప్రధాని నరేంద్రమోదీ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ నెల 25 లేదా 26న ఢిల్లీ వెళ్లి ప్రధానిని ఆహ్వానిస్తానని చెప్పారు. సైన్స్ కాంగ్రెస్‌కు మొత్తం 10,500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. 9 మంది నోబెల్ బహుమతి గ్రహీతలైన ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, విదేశాల నుంచి మరో 200 మంది సైంటిస్టులు హాజరవుతున్నారన్నారు. తిరుపతిలోని అలిపిరి దగ్గరున్న 140 ఎకరాల్లో రూ.1,500 కోట్ల అంచనా వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సైంటిఫిక్ మ్యూజియం, సరికొత్త ప్లానిటోరియంల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం చెప్పారు. ఈ నెల 27 నుంచి తిరుపతిలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ సదస్సులు జరుగుతాయన్నారు. సీఎం బస్సులో పొగలు తిరుపతి పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం 11:10 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయంలో దిగి అక్కడినుంచి ప్రత్యేక బస్సు ద్వారా తిరుపతికి బయలుదేరారు. అయితే అవిలాల సర్కిల్ సమీపాన ఆయన ప్రయాణిస్తున్న బస్సులో సాంకేతికలోపం ఏర్పడడంతోపాటు పొగలు వచ్చాయి. దీంతో కాన్వాయ్‌లో ఉన్న సఫారీ కారులోకి సీఎం మారారు. -
విద్యార్థులతో చెలగాటం
మరోమారు ఎస్వీయూలో నిర్లక్ష్యం సిలబస్ లేని పాఠాల నుంచి ప్రశ్నలు కేవలం 15 మార్కులకే {పస్తుత పాఠ్యాంశాల ప్రశ్నలు డిగ్రీ ఫస్టియర్ విద్యార్థుల ఆందోళన మదనపల్లె అర్బన్: ఎస్వీ యూనివర్శిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏమాత్రం అవగాహన లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నారుు. మూడురోజుల క్రితం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలలో ఇంగ్లీషు ప్రశ్నపత్రం సిలబస్‌కు విరుద్ధంగా వచ్చిందని విద్యార్థులు గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇంగ్లీషు ప్రశ్నపత్రంలో జరిగిన తప్పులపై రిజిస్ట్రార్ దేవరాజులు విద్యార్థులకు న్యాయం చేస్తామని ప్రకటించిన 24 గంటలలోపే మరో తప్పిదం జరిగింది. శుక్రవారం మొదటి సంవత్సరం తెలుగు పరీక్ష ప్రశ్నపత్రం ప్రస్తుత సిలబస్ పాఠం కాకుండా గత పుస్తకం నుంచి ఇచ్చారు. దీంతో విద్యార్థులు బిక్కముఖం వేశారు. తెలియని పాఠాల నుంచి ప్రశ్నలు ఇచ్చారంటూ ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకువచ్చారు. వాస్తవానికి మొదటి సెమిస్టర్‌కు సంబంధించి గంగాశంతనుల కథ, మూషిక మార్జాల వృత్తాంతం, దేశచరిత్రలు, మా కొద్దీ తెల్లదొరతనం, బిడ్డలు, ఆకలి అనే పాఠాలు ఉన్నా రుు. వీటిలో నుంచి కేవలం 15 మార్కులకు గంగాశంతనుల కథ, దేశచరిత్రలు, వ్యాకరణంపై ప్రశ్నలు అడిగారు. మిగిలిన 60 మార్కులకు పాఠ్యపుస్తకంలో లేని ద్రౌపదీ పరిదేవనం, కన్యక, చింతలతోపు, సావుకూడు పాఠాల నుంచి ప్రశ్న లు వచ్చారుు. ప్రశ్నపత్రంలోని సెక్షన్-ఎలో 5 మార్కులకు ఇచ్చిన 2,3,4,5,6 ప్రశ్నలు, సెక్షన్-బిలో 10 మార్కులకు ఇచ్చిన 1లో ఆ), 2,3,లోని ఛారుుస్ ప్రశ్నలు, 4వ ప్రశ్నపై విద్యార్థులకు ఏ మాత్రం అవగాహన లేకపోవడం, అధ్యాపకులు బోధించకపోవడంతో పరీక్ష రాయలేకపోయారు. డిగ్రీ స్థారుులో ప్రవేశపెట్టిన సెమిస్టర్ విధానంలో మొదటి సంవత్సరం పుస్తకాలు కాదని, రెండో సంవత్సరంలో వేరే పుస్తకాలు పెట్టడం వల్లే ఇలాంటి గందరగోళం చోటు చేసుకుందని తెలిసింది. విద్యార్థులకు న్యాయం చేస్తాం ప్రశ్నపత్రంలోని ప్రశ్నల గందర గోళంపై పరీక్షల నియంత్రణాధికారి చంద్రయ్య వివరణ ఇస్తూ బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ నుంచి నివేదిక కోరుతామని తెలిపారు. సిలబస్‌లోని ప్రశ్నలు ఇచ్చినట్టు గుర్తిస్తే విద్యార్థులకు మార్కులు ఇచ్చి న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
డిగ్రీ పరీక్ష
పరీక్ష సెంటర్ సూచికల డిస్ప్లేతో సమస్య ఒకేసారి వచ్చిన విద్యార్థులు ఆత్రుతలో పరస్పరం తోపులాట కొందరికి స్వలంగా గాయాలు ఆలస్యంగా ప్రారంభమైన పరీక్ష సౌకర్యాలు లేక ఇబ్బందులు పలమనేరు/యూనివర్సిటీక్యాంపస్: పలమనేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద బుధవారం ఎస్వీ యూనివర్సిటీ డిగ్రీ మొదటి సంవత్సర తొలి సెమిస్టర్ పరీక్షలు గందరగోళంగా మారారుు. హాల్టిక్కెట్ల కాపీలను కళాశాల సిబ్బంది ఒకేచోట అది కూడా కిందిభాగంలో అంటించారు. దీంతో విద్యార్థుల మధ్య తొక్కిసలాట జరిగింది. కొందరు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష గంట ఆలస్యంగా ప్రారంభమైంది. సమయం మీరిపోవడంతో విద్యార్థులను ఎక్కడబడితే అక్కడ కూర్చోబెట్టి పరీక్షలు రారుుంచారు. నోటీస్‌బోర్డులు పెట్టకపోవడమే కారణం... పలమనేరులోని ఎనిమిది ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, ఓ ప్రభుత్వ డిగ్రీ కళాశాలం బెరైడ్డిపల్లె, వీకోటలకు చెందిన చెందిన 12 కళాశాల 2300 మంది విద్యార్థులకు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరీక్ష కేంద్రంగా ఎస్వీయూ నిర్ణరుుంచిం ది. తొలిరోజు ఇంగ్లిష్ పరీక్షకోసం 80 గదులు ఏర్పాటు చేశారు. ఏ గదిలో ఎవరికి పడిందో తెలుసుకునేందుకు హాల్ టికెట్ల నెంబర్లను ఒకేచోట.. అది కూడా విద్యార్థులకు కనిపించకుండా అంటించారు. బుధవారం ఉదయం 8-45కు లోనికి పంపగానే వారంతా తమ సెంటర్లను చూ సేం దుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఎక్కువ మంది విద్యార్థినులు కావడంతో గాజులు పగిలినవారు, ఒకరిపై మరొకరుపడి, దుస్తులు చిరిగినవారు ఉన్నారు. ఇంకొందరు గాయపడ్డారు. తొక్కిసలాట జరుగుతుంటే ఒక కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. విద్యార్థులు, తల్లిదండ్రులపట్ల అతడు అతిగా ప్రవర్తించడం మరింత గందరగోళానికి కారణమైంది. ఇక్కడి డిగ్రీ కళాశాలలోని గదుల్లో 300మంది మాత్రమే పరీక్ష రాసే అవకాశం ఉంది. 2300 మందితో ఎలా పరీక్ష రా రుుంచాలో అధ్యాపకులకు అర్థం కాలేదు. కళాశాల వరండాలు, ల్యాబ్, లైబ్రరీ, స్టోర్‌రూమ్, చివరకు అధ్యాపకుల విశ్రాం తిగదితోపాటు కొంత ఖాళీస్థలం లోనూ కూర్చోబెట్టారు. గందరగోళానికి కారణమేమిటంటే... ఎస్వీ యూనివర్సిటీ అనుబంధానికి సంబంధించి ఈ యేడాది యూనివర్సిటీ అధికారులు నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. మే నెలలోనే అనుబంధానికి దరఖాస్తులు ఆహ్వానించారు. జూన్‌లో తనిఖీలు నిర్వహించి సెప్టెంబర్‌లో అనుబంధం ఇచ్చారు. పాత పద్ధతికి అలవాటు పడిన కొన్ని కళాశాలలు అనుబంధానికి దరఖాస్తు కూడా చేసుకోలేదు. మరి కొన్ని ’ రిటర్న్ ఆఫ్ మెట్రిక్లేట్స్’ యూనివర్సిటీకి సమర్పించలేదు. విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే సమయంలో అనుబంధం లేని కళాశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయలేదు. సాఫ్ట్వేర్ సంస్థ తప్పిదాల వల్ల అనుబంధం లేని విద్యార్థులు సైతం పరీక్ష ఫీజు చెల్లించారు. ఫీజు చెల్లించిన విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చిపరీక్షలు రారుుంచాలి. కొన్ని కళాశాలలు తప్పును సరిదిద్దుకున్నారుు. రెండు కళాశాలలు మినహా అన్ని కళాశాలల విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చారు. బి.కొత్త కోటలోని రెండు ప్రయివేట్ కళాశాలలు మాత్రం అఫిలియేషన్‌కు దరఖాస్తు చేయలేదు. ఈ రెండు కళాశాలల విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేయలేదు. ఈ రెండు కళాశాలల్లోని విద్యార్థులు బుధవారం పరీక్ష రాయలేక పోయారు. దీంతో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎస్వీయూలో ఆందోళన చేశారు. రిజిస్ట్రార్ చాం బర్ ముట్టడించారు. కళాశాలల యాజమాన్యాలతో ఎస్వీయూ అధికారులు చర్చిం చారు. ఆ రెండు కళాశాలలకు లక్ష రూపాలయల జరిమానాతో పాటు, 40 వేల రూపాయల అఫిలియేషన్ ఫీజు చెల్లించాలని ఆదేశించారు. గురువారం నుంచి జరిగే పరీక్షలకు అనుమతించారు. -
ఎస్వీయూలో రెండున్నర నెలలు తరగతులు రద్దు
–నవంబర్ 1 నుంచి జనవరి 16 వరకు తరగతులు ఉండవు –సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు విద్యార్థులకు సెలవులు యూనవర్సిటీక్యాంపస్ (తిరుపతి): ఎస్వీయూనివర్సిటీలో అధికారులు వివాదస్పద నిర్ణయం తీసుకున్నారు. రెండున్నర నెలల పాటు తరగతులు రద్దు చేసి సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. జనవరి 3 నుంచి 7 వరకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో 75 రోజుల పాటు తరగతులు రద్దుచేశారు. నవంబర్ 1 నుంచి జనవరి 16 వరకు తరగతులు రద్దు చేయనున్నారు. ఎస్వీయూలో జనవరిలో జరిగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ ఏర్పాట్లపై గురువారం అధికారులు క్యాంపస్‌లోని భవనాలు, వసతి గృహాలను పరిశీలించారు. అనంతరం సాయంత్రం వీసీ దామోదరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమవేశంలో రెక్టార్ భాస్కర్, రిజిస్ట్రార్ దేవరాజులు, యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, పరీక్షల నియంత్రణాధికారి, ఇతర అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఎస్వీయూ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తుండటం, ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన ముఖ్య అధికారులు హాజరుకానున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే అతిథులకు, ప్రముఖలకు ఎస్వీయూలో వసతి, భోజనం, ఇతర వసతులు కల్పించాల్సి ఉంది. అంతే కాకుండా 30 సెమినార్ హాళ్లు అవసరమని గుర్తించారు. ఈ నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలంటే వసతి గృహాలు, తరగతి గదుల ఆధునికీకరణ, భవనాలకు రంగులు, విద్యుత్ రిపేర్లు, రోడ్ల నిర్మాణం, చెట్ల పెంపకం చేపట్టాల్సి ఉంది. భద్రతకు సంబంధించి ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఏర్పాట్లపై బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ టక్కర్ అధికారులతో సమీక్ష చేశారు. డిసెంబర్ 15 లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని టక్కర్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వీసీ గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 లోపు మొదటి, మూడవ సెమిస్టర్ సిలబస్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జనవరిలో తిరిగి తరగతులు పునః ప్రారంభిస్తామని ఎస్వీయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రిన్సిపాళ్లు ఆర్.అబ్బయ్య, మునిరత్నం, భగవాన్ రెడ్డి, మల్లికార్జున, పరీక్షల నియంత్రణాధికారి చంద్రయ్య, పరీక్షల ప్రత్యేకాధికారి సుబ్రమణ్యం నాయుడు పాల్గొన్నారు. ఇదే మొదటి సారి: ఎస్వీయూ రెండున్నర నెలల పాటు తరగతులు రద్దు చేసి సెలవులు ప్రకటించటం ఇదే తొలిసారని కొందరు రిటైర్డ్ అధ్యాపకులు పేర్కొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను చూసే అదృష్టాన్ని విద్యార్థులు కొల్పోతారని అన్నారు. అంతే కాకుండా దీనివల్ల వారి చదువులకు ఆటంకం కలుగుతుందన్నారు. అధికారుల ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. -
క్యాంపస్‌లో భయం..భయం
ఎస్వీయూలో చిరుత సంచారం యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థులకు చిరుత భయం పట్టుకుంది. వారం రోజులుగా అప్పుడప్పుడు క్యాంపస్‌లోకి చిరుత వస్తుండడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. వారం క్రితం ఐ–బ్లాక్ సమీపంలో చిరుతను కొందరు విద్యార్థులు చూశారు. తాజాగా సోమవారం రాత్రి 12 గంటల సమయంలో కొందరు పరిశోధక విద్యార్థులు హెచ్–బ్లాక్ సమీపంలో చిరుతను చూశారు. విషయాన్ని పోలీసులు, ఎస్వీయూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు, ఎస్వీయూ సెక్యూరిటీ సిబ్బంది సోమవారం రాత్రంతా క్యాంపస్ చుట్టూ చిరుత కోసం గాలించారు. అన్ని హాస్టళ్లకు వెళ్లి రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని హెచ్చరించారు. మంగళవారం కూడా క్యాంపస్ సెక్యూరిటీ సిబ్బంది హాస్టల్ విద్యార్థులను అప్రమత్తం చేశారు. ఎస్వీయూ హెచ్–బ్లాక్ ఫార్మశీ భవనం, వేదిక్ వర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ శేషాచలం అడవులకు దిగువ ప్రాంతంలో ఉండడంతో అప్పుడప్పుడు జింకలు, కుందేళ్లు వస్తుంటాయి. వాటికోసం చిరుత తరచూ వస్తోంది. చిరుత రాకుండా చర్యలు తీసుకోవాలి.. క్యాంపస్‌లో అప్పుడప్పుడు చిరుత సంచారం కనిపిస్తోంది. సోమవారం రాత్రి 12గంటల సమయంలో నేను సినిమాకు వెళ్లి వస్తుండగా ఐ–బ్లాక్, హెచ్–బ్లాక్ మధ్య చిరుత కనిపించింది. కుక్కలు అరుస్తూ ఉన్నాయి. దూరంగా చూస్తే చెట్ల మధ్య చిరుత కనిపించింది. భయంతో హాస్టల్‌కు వెళ్లిపోయాను. తర్వాత సెక్యూరిటీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాను. – డి.లోకనాథం, పరిశోధక విద్యార్థి -
ఎస్వీయూలో ఫీజు పోరు
– అందని రీయింబర్స్మెంట్ – ఆందోళనకు దిగిన విద్యార్థులు – సీఎంను అడ్డుకుంటామని హెచ్చరిక యూనివర్సిటీక్యాంపస్ : ఎస్వీ యూనివర్సిటీలో సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సుల్లో పీజీ చేస్తున్న విద్యార్థులకు 2015–16 విద్యాసంవత్సరానికి సంబంధించిన పీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు రాలేదు. అంతే కాకుండా 2016–17 సంవత్సరానికి రెన్యువల్ చేసుకోవటానికి ఈ–పాస్‌లో సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సుల వారు దరఖాస్తు చేసుకోవటానికి వీలుగా సంబంధిత ఆప్షన్ రావడం లేదు. దీంతో విద్యార్థులు రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోలేక పోతున్నారు. 10 విభాగాలకు చెందిన సుమారు 500మంది విద్యార్థులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ అంశాన్ని పలుమార్లు అధికారుల దష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు గురువారం ఎస్వీయూ పరిపాలన భవనం ఎదుట ఆందోళన చేశారు. ప్రభుత్వానికి, యూనివర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ భవిష్యత్‌తో అధికారులు ఆడుకుంటున్నారని విద్యార్థులు ఆరోపించారు. రెన్యువల్‌కు తుది గడువు శుక్రవారం(30వ తేదీ)తో ముగుస్తుందని, తాము దరఖాస్తు చేయలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ–పాస్ వెబ్సైట్ పర్యవేక్షిస్తున్న అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతోందని వారు వాపోయారు. అధికారులు తక్షణం చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించకపోతే అక్టోబర్ 2న ఎస్వీయూ స్టేడియంలో జరిగే సీఎం చంద్రబాబునాయుడు పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం క్యాంపస్ కమిటీ అధ్యక్షుడు మురళీధర్, విద్యార్థి నాయకులు హేమంత్ కుమార్‌రెడ్డి, నరేంద్ర, నవీన్‌గౌడ్, అభిషేక్, సోమునాయక్, కోటీనాయక్, సాయి,రవి పాల్గొన్నారు. -
తక్షణమే ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేయాలి
తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీలో మంగళవారం ఫార్మసీ విద్యార్థులు నిరసనకు దిగారు. ఫార్మసీ విద్యార్థిని పట్ల ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆందోళనకు దిగారు. ప్రొఫెసర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఎస్పీయూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
అమ్మకు ప్రేమతో..
► ఎస్వీయూ పీజీసెట్‌లో ► 4వ ర్యాంక్ సాధించిన ఈశ్వర్ ► కూలిపనులు చేస్తూ కుమారున్ని చదివించిన అమ్మ కర్నూలు సీక్యాంప్: తాను చదువుకోకపోయినా కుమారున్ని మాత్రం ఉత్తమంగా చదివిస్తోంది ఆ తల్లి. కూలి పనులు చేస్తూ వచ్చినంతలోనే కుమారుని చదువుకు ఏ ఆటంకం లేకుండా చూస్తోంది. కుమారుడు కూడా తల్లి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎంత మాత్రం ఒమ్ము చేయడం లేదు. ఎస్వీ యూనివర్సిటీ పీజీ సెట్ కామర్స్ విభాగంలో 4వ ర్యాంకు సాధించి అమ్మకు ప్రేమతో కానుకగా ఇచ్చాడు. 20 ఏళ్లుగా క్యాంప్‌లోని పూరిగుడిసెలో ఉంటున్న పుల్లమ్మ ఏమీ చదువుకోలేదు. కొడుకు ఈశ్వర్‌ను మాత్రం కూలి డబ్బుతోనే చిన్నప్పటి నుంచి చదివించింది. ఈ నెల 25న విడుదలైన ఎస్వీ యూనివర్శిటీ పీజీ సెట్ కామర్స్ ఫలితాల్లో ఈశ్వర్ 4వ ర్యాంక్ సాధించడంతో సంతోషం వ్యక్తం చేస్తోంది. -
మే 29 న ఎస్వీయూ బాసెట్
తిరుపతి: దూర విద్య ద్వారా ఓపెన్ యూనివర్సిటీ విధానంలో డిగ్రీలో ప్రవేశానికి నిర్వహించే ఎస్వీయూ బాసెట్-2016 ను ఈ నెల 29న నిర్వహిస్తున్నట్లు ఎస్వీయూ దూర విద్యావిభాగం డెరైక్టర్ ప్రొపెసర్ ఎంపి నరసింహరాజు తెలిపారు. ఎలాంటి విద్యార్హతలేని వారు ఈ ప్రవేశపరీక్ష రాయవచ్చు. తిరుపతిలోని ఎస్వీయూ కాలేజ్ ఆప్ ఆర్ట్స్‌లో జరిగే ఈ ప్రవేశపరీక్షకు సుమారు 1000 మంది దరఖాస్తు చేశారన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన వారందరికి తిరుపతిలోనే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోనివారు కూడా 3 పోటోలు, గుర్తింపు కార్డుతో నేరుగా వచ్చి 300 రూపాయల పరీక్ష పీజు చెల్లించి ప్రవేశ పరీక్షకు హాజరుకావచ్చన్నారు. పీజీ దరఖాస్తు గడువు పుంపు ఎస్వీయూనివర్సిటీలో దూరవిద్య విభాగంలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి అడ్మిషన్ దరఖాస్తు గడువును జూన్ 10 వతేదీ వరకు పొడిగించామన్నారు. అసక్తి కల్గిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు దగ్గరలోని ఎస్వీయూ దూరవిద్య కేంద్రం అధ్యయన కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు. -
అభద్రతా భావంలో చదువులు
► ఎస్వీయూలో పెరుగుతున్న లైంగిక వేధింపుల ఆరోపణలు ► ఆందోళన చెందుతున్న విద్యార్థినులు యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థినుల చదువులు అభద్రతా భావంలో సాగుతున్నాయి. ప్రొఫెసర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. వారు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా పరిశోధనలు చేస్తున్న మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎస్వీయూలో లైంగిక వేధింపుల ఆరోపణలు చాలా కాలం నుంచి వస్తున్నాయి. 2011లో జువాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ రాజేశ్వరరావు జైలు పాలయ్యారు. రసాయనశాస్త్ర విభాగంలో ఓ ప్రొఫెసర్‌పై గత ఏడాది డిసెంబర్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఇంగ్లిషు విభాగంలో ఓ ప్రొఫెసర్‌పై అదే విభాగానికి చెందిన ఒక పోస్టు డాక్టర్ ఫెలో ఫిర్యాదు చేశారు. సివిల్ ఇంజినీర్ విభాగానికి చెందిన ఓ ప్రొఫెసర్‌పై అదే విభాగానికి చెందిన పరిశోధన విద్యార్థిని ఫిర్యాదు చేశారు. సాంఖ్యక శాస్త్ర విభాగానికి చెందిన మరో ప్రొఫెసర్‌పై పీజీ విద్యార్థిని సుజాత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన క్యాష్ కమిటీ తన నివేదికను సమర్పించింది. అందులో ఏమి పేర్కొంది ఇంతవరకు బహిర్గతం కాలేదు. తాజాగా తెలుగు అధ్యయన శాఖకు చెందిన కె.మునిరత్నం తన వద్ద ఉన్న పరిశోధక విద్యార్థినులను వేధిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ ఉమెన్ ప్రొటెక్షన్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.రజని ఎస్వీయూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్వీయూ అధికారుల ఆదేశాల మేరకు క్యాష్ కమిటీ ఈనెల 23న విచారణ జరిపింది. విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయన్న అంశాన్ని బహిర్గతం చేయడం లేదు. విద్యార్థినులకు వసతి కల్పించాల్సిన అధికారులే వారిపట్ల నిర్దయగా వ్యవహరించడంతో వారిలో అభద్రత నెలకొంది. ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం కల్పించాల్సి ఉంది. ప్రిన్సిపల్‌ను కొనసాగిస్తారా? ఎస్వీయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా తెలుగు విభాగం ప్రొఫెసర్ మునిరత్నం పనిచేస్తున్నారు. ఈయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రస్తుతం విచారణ సాగుతోంది. ఈయన ప్రిన్సిపాల్‌గా కొనసాగడం వల్ల సాక్షులపై ప్రభావం చూపే అవకాశముందన్న వాదన వినిపిస్తోంది. సాంఖ్యక శాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ రాజశేఖరరెడ్డి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయనకు దక్కాల్సిన ప్రిన్సిపాల్ పదవిని ఇవ్వలేదు. ఇదే సందర్భంలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న మునిరత్నంను మాత్రం పదవిలో కొనసాగించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
ఎంబీఏ ప్రశ్నపత్రం తారుమారు
ఎస్వీయూలో పరీక్ష వాయిదా యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఎంబీఏ పరీక్షల్లో ప్రశ్నపత్రం తారుమారు కావడంతో పరీక్ష వాయిదావేశారు. ఎస్వీయూనివర్సిటీలో ప్రస్తుతం ఎంబీనీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. మంగళవారం ఇండస్ట్రియల్ మార్కెటింగ్ పరీక్ష జరగాల్సి ఉంది. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకుని ఆన్సర్ షీట్ తీసుకున్నారు. ఇక ప్రశ్న పత్రం తీసుకుని పరీక్ష రాయడమే మిగిలింది. ఆ సమయంలో ప్రశ్నపత్రం తెరిచి చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. ఇండస్ట్రియల్ మార్కెటింగ్ ప్రశ్నపత్రం స్థానంలో రిటైల్ మార్కెటింగ్ ఉండటంతో ఏంచేయాలో తోచక పరీక్షల విభాగానికి తెలియజేశారు. వారు ప్రశ్న పత్రం కోసం వెతకగా కన్పించలేదు. ఇండస్ట్రియల్ మార్కెటింగ్ ప్రశ్నపత్రం స్థానంలో రిటైల్ మార్కెటింగ్ ప్రశ్నపత్రం రూపొందించినట్లు గుర్తించారు. చేసేదేమిలేక పరీక్ష వాయిదా వేశారు. అదేవిధంగా బుధవారం ఇంటర్నేషనన్ ఫైనాన్స్ అనే సబ్జెక్ట్‌పై పరీక్ష జరగాల్సి ఉంది. ఆ ప్రశ్నపత్రం కూడా సిద్ధంగా లేదని గుర్తించారు. బుధవారం పరీక్షను కూడా వాయిదా వేశారు. ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటిస్తారు. ప్రీపీహెచ్‌డీ పరీక్షలు వాయిదా ఎస్వీయూలో ఈనెల 28 నుంచి జరగాల్సిన ప్రీ పీహెచ్డీ పరీక్షలను వాయిదావేశారు. అనివార్య కారణాల వల్ల ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల విభాగపు డీన్ ఎం.సురేష్ బాబు తెలిపారు. పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ప్రశ్నపత్రాలు రాక పోవడం వల్లే వీటిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. -
పదోన్నతులకు పచ్చజెండా
యూనివ ర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీలో అధ్యాపక పదోన్నతులకు పాలకల మండలి పచ్చజెండా ఊపింది. కెరీర్ అడ్వాన్స్ స్కీమ్(సీఏఎస్) కింద అసిస్టెంట్ నుంచి అసోసియేట్, అసోసియేట్ నుంచి ప్రొఫెసర్‌కు పదోన్నతుల కోసం ఫిబ్రవరి చివరి వారంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో అర్హత పొందినవారికి పదోన్నతులు ఇవ్వడానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. ఎస్వీ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం దాదాపు సంవత్సరం తర్వాత జరిగింది. ఇటీవలే పాలకమండలి పునరుద్ధరణ అనంతరం జరిగిన తొలి సమావేశం ఇదే. కొత్తగా పాలకమండలి సభ్యులుగా నియమితులైన 9 మందిలో 8 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. అమరరాజా గ్రూపు సంస్థల చైర్మన్ గల్లా రామచంద్రనాయుడు ఈ సమావేశానికి రాలేదు. ఎస్వీయూ వీసీ దామోదరం అధ్యక్షత వహించారు. పదోన్నతుల విషయంలో కోర్టు ఉత్తర్వులకు లోబడి అర్హులైన అధ్యాపకలకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని తీర్మానించారు. ఎస్వీయూ 54వ స్నాతకోత్సవాన్ని ఏప్రిల్‌లో జరపాలని పాలకమండలి నిర్ణయించింది. రూ.163.8 కోట్లతో బడ్జెట్ రూ.163.8 కోట్లతో యూనివర్సిటీ బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది. యూనివర్సిటీ నిధుల వినియోగంపై ఫైనాన్స్ సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఈ కమిటీకి వీసీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పాలకమండలి సభ్యులు గురుప్రసాద్, బాలసిద్ధముని ఈ కమిటీలు సభ్యులుగా కొనసాగనున్నారు. ఈ కమిటీ యూనివర్సిటీలో నిధుల వినియోగాన్ని పర్యవేక్షిస్తుంది. 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో ఏపనికి ఎంత ఖర్చు చేశారో పూర్తి వివరాలతో పాలకమండలి ముందు ఉంచాలని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి సూచించారు. అకడమిక్, అడ్మినిస్ట్రేషన్, డెవలప్మెంట్ అంశాలపై వచ్చే సమావేశంలో పూర్తిస్థాయి చర్చ జరగాలని సభ్యులు సూచించారు. రెక్టార్ ఎం.భాస్కర్, రిజిస్ట్రార్ దేవరాజులు, పాలక మండలి సభ్యులు ప్రొఫెసర్ అబ్బయ్య, బాలసిద్ధముని, గురుప్రసాద్, రెడ్డిల్యాబ్స్ సీఈవో జీవీ ప్రసాద్, హరి, చంద్రయ్య, అరుణ, బాబు పాల్గొన్నారు. -
మే 23న ఎడ్‌సెట్
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి) : రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఎడ్‌సెట్-2016ను మే 23న 18 పట్టణాల్లో నిర్వహించనున్నట్టు ఎడ్‌సెట్ కన్వీనర్ టి.కుమారస్వామి తెలిపారు. ఎస్వీ యూనివర్సిటీ ఏపీ ఎడ్‌సెట్-2016 ను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రవేశ పరీక్ష కోసం ఫిబ్రవరి 10న నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. ఓసీ, బీసీలు రూ.400, ఎస్సీ, ఎస్టీలు రూ.200 ఫీజు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చునని తెలిపారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. 2013-16 సంవత్సరాల్లో డిగ్రీ సిలబస్ ఆధారంగా ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. గణితం, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ స్టడీస్, ఇంగ్లీషు సబ్జెక్టులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. మే 23న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, చిత్తూరు, తిరుపతి, కుప్పం, కడప, ప్రొద్దుటూరు, అనంతపురం, నంద్యాల, కర్నూలు పట్టణాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలను www.aped-cet-org వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు. -
నేటి నుంచి ఎస్వీయూ డిగ్రీ పరీక్షలు
యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు బుధవారం నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 25 వరకు జరిగే ఈ పరీక్షలకు ఎస్వీయూ పరీక్షల విభాగం అవసరమైన ఏర్పాట్లుచేసింది. ఎస్వీయూ పరిధిలో 136 డిగ్రీ కళాశాలల విద్యార్థులు పరీక్షలు రాయడానికి వీలుగా అధికారులు 20 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కళాశాలల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. 39,583 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఆమేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు పరీక్షల విభాగం డీన్ ఎం.సురేష్‌బాబు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రానికీ ఇతర కళాశాలలకు చెందిన అధ్యాపకుడిని పరిశీలకుడిగా నియమించినట్లు చెప్పారు. మూడు బృందాలను ఫ్లయింగ్ స్క్వాడ్‌గా ఏర్పాటు చేశామన్నారు. -
'SVUను టీడీపీ ఆఫీస్‌గా మారుస్తున్నారు'
-
హోదా కోసం SVU విద్యార్ధుల నిరసన
-
హోదా కోసం విద్యార్థి ఆత్మహత్యాయత్నం
-
ప్రత్యేకహోదా కోసం విద్యార్థి ఆత్మహత్యాయత్నం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షకు మద్దతుగా జరుగుతున్న రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగంగా.. తిరుపతిలో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్న మాసుమయ్య అనే విద్యార్థి గత నాలుగు రోజులుగా ప్రత్యేక హోదా ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నాడు. సోమవారం కూడా విద్యార్థులు తరగతులను బహిష్కరించి.. ఏడీ బిల్డింగ్ వద్దకు చేరుకున్నారు. ఇదే సందర్భంలో మాసుమయ్య తన ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, సమయానికి తోటి విద్యార్థులు అతడిని అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. పెద్ద ఎత్తున అతడి ఒంటిపై పెట్రోలు పడినా.. సమయానికి విద్యార్థులు చూడటంతో మాసమయ్య ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే.. గతంలో ప్రత్యేక హోదా కోసం మునుకోటి ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా వైఎస్ జగన్ స్పష్టంగా ఒకటే చెప్పారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని, పోరాడేందుకు, అవసరమైతే ప్రాణాలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కానీ భావోద్వేగంతో మాసుమయ్య లాంటివాళ్లు ఇలా చేస్తున్నారు. మహిళ ఆత్మహత్యాయత్నం రైల్వే కోడూరు రూరల్: జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తుండడంతో పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసింది. జగన్ దీక్షకు మద్దతుగా ప్రత్యేకహోదా కోసం సోమవారం వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో జరిగింది. ఈ సందర్భంగా రంగమ్మ అనే మహిళా కార్యకర్త సూపర్ వాస్మాల్ అనే ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కార్యకర్తలు ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
ఎస్వీయూలో ఉద్రిక్తత
తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన దీక్షకు మద్దతు తెలుపుతూ శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ (ఎస్వీయూ) విద్యార్థులు గురువారం యూనివర్శిటీ ప్రధాన ద్వారం వద్ద దీక్ష చేపట్టారు. అయితే ఈ దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు టెంట్‌ను పీకి వేశారు. దీంతో విద్యార్థులు ఆగ్రహించారు. శాంతియుతంగా తాము దీక్ష చేస్తుంటే భగ్నం ఎందుకు చేస్తున్నారని పోలీసులను విద్యార్థులు ప్రశ్నించారు. పోలీసుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ లాఠీలకు పోలీసులు పని చెప్పారు. పోలీసుల చర్యలకు నిరసనగా యూనివర్శిటీ విద్యార్థులు అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ...గుంటూరు నగరంలోని నల్లపాడు రోడ్డులో బుధవారం నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. -
ఎస్వీయూలో ఉద్రిక్తత
-
మా హీరో జగన్ జగన్...
-
‘హోదా’ ఉద్యమంపై ఉక్కుపాదం
ఎస్వీ వర్సిటీలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం సదస్సుకు అనుమతి నిరాకరణ సాక్షి, హైదరాబాద్: ఉద్యమ రూపం దాలుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రత్యేక హోదా ఆకాంక్షపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రత్యేక హోదా కోసం గళం విప్పుతున్న గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తోంది. ప్రజల ఆకాంక్షల మేరకు అందరినీ కలుపుకుపోయి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ప్రత్యేకహోదాను సాధించుకు రావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం... ఈ అంశంపై పోరాట దృక్పథాన్ని ఎంచుకున్న ప్రతిపక్ష పార్టీకి ఆటంకాలు కలిగిస్తూ అమానుషంగా వ్యవహరిస్తోంది. తిరుపతి ఎస్వీవర్సిటీ ప్రాంగణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఈ నెల 15న నిర్వహించ తలపెట్టిన సదస్సుకు అనుమతి నిరాకరిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో సదస్సును పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించడానికి వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం సన్నద్ధమవుతోంది. జగన్ పాల్గొననున్నారని తెలిశాకే... తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో ఈ నెల 15వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నిర్వహించ తలపెట్టిన ‘రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక హోదా ఆవశ్యకత’ సదస్సుకు మొదట ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ సదస్సులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారని, ‘ప్రత్యేక హోదా-ఉద్యోగ అవకాశాలు- రాష్ట్ర అభివృద్ధి’ అనే అంశం గురించి ఆయన ప్రసంగిస్తారనే విషయం తెలియగానే ప్రభుత్వం అనుమతి రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. యూనివర్సిటీల్లో సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించరాదని, ఇందుకు అనుమతులు ఇవ్వరాదని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్ని విశ్వవిద్యాలయాలకు ఆదివారం ఆగమేఘాలమీద ఆదేశాలు జారీచేశారు. మంత్రి నుంచి ప్రకటన వచ్చిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తలపెట్టిన సదస్సుకు అనుమతి తిరస్కరిస్తున్నట్లు ఎస్వీ వర్సిటీ అధికారులు ప్రకటించారు. అప్పుడు ముద్దు.. ఇప్పుడు వద్దు! గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తెలుగుదే శం పార్టీ విద్యార్థి విభాగమైన టీఎన్ఎస్ఎఫ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, అన్ని రాజకీయ పార్టీలూ తమ విద్యార్థి విభాగాలను రద్దు చేయాలని ప్రతిపాదించారు. ఇందుకు ఇతర పార్టీలు తిరస్కరించాయి. అయితే 2004 ఎన్నికల్లో ఓడిపోయాక చంద్రబాబు టీఎన్ఎస్ఎఫ్ను పునరుద్ధరించి తమ తీరును చాటుకున్నారు.ఇప్పుడు యూటర్న్ తీసుకుని యూనివర్సిటీలను రాజకీయ వేదికలుగా మార్చవద్దని తెలుగుదేశం నేతలంటున్నారు. వాటికి అనుమతించారు.. : సార్వత్రిక ఎన్నికల సమయంలో గత ఏడాది మే నెలలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారానికి వచ్చిన నరేంద్రమోదీ ఎన్నికల సభను ఎస్వీయూ స్టేడియంలో నిర్వహించారు. గత ఏడాది జూన్ 4న చంద్రబాబును టీడీఎల్పీనేతగా ఎన్నుకోవడం కోసం సమావేశాన్ని వర్సిటీ సెనేట్ హాలులో నిర్వహించారు. గత నెలలో ఏఐఎస్ఎఫ్ జాతీయ సభలకు శ్రీనివాస ఆడిటోరియం కేటాయించారు. జూన్ 14వ తేదీన బాహుబలి ఆడియో ఫంక్షన్‌కు అనమతించారు. వీటిని పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నిర్వహించ తలపెట్టిన సదస్సుకు అనుమతి నిరాకరిస్తూ ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తమ ధృక్పథాన్ని ఇలా స్పష్టం చేసింది. -
ఎస్వీయూలో వైఎస్ జగన్ సభకు అనుమతి నిరాకరణ
-
ఎస్వీయూలో వైఎస్ జగన్ సభకు అనుమతి నిరాకరణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థులతో తలపెట్టిన సమావేశానికి అనుమతి నిరాకరించారు. ప్రత్యేక హోదా కోసం యూనివర్సిటీల్లో ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని ప్రభుత్వం హుకుం జారీ చేసింది. మంత్రి గంటా శ్రీనివాసరావు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధి విషయాలపై ఎస్వీయూలో విద్యార్థులతో సదస్సు నిర్వహించాలని వైఎస్ జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు యూనివర్సిటీ అధికారుల అనుమతి కోరారు. అయితే, ప్రత్యేక హోదా, రాజకీయ సభలకు యూనివర్సిటీల్లో అనుమతి ఇవ్వరాదంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. అర్ధాంతరంగా యూనివర్సిటీల్లో కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. -
ఎస్వీయూ వీసీ పదవిపై కుదరని ఏకాభిప్రాయం
యూనవర్సిటీక్యాంపస్ : ఎస్వీ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఫలితంగా ఈ కమిటీ సమావేశం అర్ధంతరంగా ముగిసింది. వీసీ నియామక ప్రక్రియ కోసం ఏర్పాటైన సెర్చ్ కమిటీ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో సమావేశమైంది. సభ్యులు గోవర్ధన్‌మెహతా, సీవీ రాఘవులు, సునీతదావ్రాలు రాత్రి 6.30 గంటల వరకు వీసీ పదవికి ఎవరిని సిఫారసు చేయాలన్న అంశంపై చర్చిం చారు. అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలిసింది. ఈ కమిటీలో సభ్యులు ముంబైలోని ఓ పరిశోధనా సంస్థకు చెందిన ఓ ప్రొఫెసర్ ను ప్రతిపాదించగా మిగిలిన సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. సత్యనారాయణకే అవకాశం ? మాజీ రిజిస్ట్రార్ ఈ.సత్యనారాయణకే ఎస్వీయూ వీసీ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. డెప్యూటీ సీఎం కృష్ణమూర్తితో సన్నిహిత సంబంధాలు కలిగిన సత్యనారాయణ ఎస్వీయూలో సీడీసీ డీన్, రిజిస్ట్రార్‌గా పని చేశారు. దీంతో ఈయనను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చినట్టు తెలుస్తోంది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఈయన పేరును ఖరారు చేయాలన్న ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ఎస్వీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కిరణ్ క్రాంత్ చౌదరి, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దయానంద్, ఎస్కేయూ వీసీ రాజగోపాల్, ఎస్వీయూ రిటైర్డ్ ప్రొఫెసర్లు దేవసేననాయుడు, జయసింహలు నాయుడు, పీ.గోవిందురాజులు పేర్లు కూడా పరిశీలనకు వ చ్చినట్లు విశ్వసనీయ సమాచారం. -
హాస్టల్ గదులు కేటాయించాలంటూ ధర్నా
-
'నెలలోపు వీసీల నియామకం'
తిరుపతి: నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏడు విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు ప్రకటించారు. హాస్టల్ నిర్వహణ బాధ్యతలను ఔట్సోర్సింగ్ అధికారులకు అప్పగించే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. ఈ మేరకు ముందుగా ఎస్వీ యూనివర్సిటీలో ఒక హాస్టల్‌ను ఔట్సోర్సింగ్ అధికారులకు ఫెలైట్ ప్రాజెక్టుగా ఇచ్చి పరిశీలిస్తామని చెప్పారు. ఇది విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల హాస్టల్స్ నిర్వహణ బాధ్యతలు ఔట్సోర్సింగ్ అధికారులకు అప్పగిస్తామని మంత్రి తెలిపారు. వైస్చాన్స్లర్ల పదవీకాలాన్ని రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు పొడగిస్తూ చర్యలు తీసుకుంటామన్నారు. రెండేళ్లలో తర్వాత పనితీరును పరిశీలించి ఆశాజనకంగా లేకపోతే పదవి నుంచి తొలగిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు. -
నీటి కోసం నిరసన స్వరం
చిత్తూరు రహదారిపై ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థినుల రాస్తారోకో యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని మహిళా హాస్టల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ కె.రాజగోపాల్‌ను విద్యార్థినులు బుధవారం ఘెరావ్ చేశారు. హాస్టల్లో నీటి సమస్యను తీర్చాలంటూ మంగళవారం రాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో బుధవారం వర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చారు. ఉదయం 9 గంటలకే తరగతులను బహిష్కరించి పరిపాలన భవనం వద్దకు చేరుకున్నారు. చిత్తూరు-తిరుపతి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అధికారులతో చర్చించి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామని ఇన్చార్జి వీసీ చెప్పడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. తాగునీరు అందించండి: మంత్రి గంటా మహారాణిపేట(విశాఖపట్నం): ఎస్వీ యూనివర్సిటీలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లను ఆదేశించారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు చేసిన నిరసనపై ఆయన స్పందించారు. -
ఎస్వీయూలో విద్యార్థుల ఆందోళన
-
సారూ.. ఎండుతోంది మా నోరు!
క్యాంపస్‌లో నీటి సమస్య తీవ్రమైంది. రోజువారీ అవసరాలకు కాదుకాదా... కనీసం తాగడానికి కూడా గుగ్గెడు నీరు కరువైంది. 48 గంటలుగా చుక్కనీరు రాకున్నా అధికారులు కనీస చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థినులు మంగళవారం రాత్రి నిరసనకు దిగారు. సారూ... ఎండుతోంది నోరు... మమ్మల్ని కాస్త పట్టించుకోరూ.. అంటూ నినాదాలు చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ బుధవారం ఎస్వీయూ బంద్‌కు పిలుపునిచ్చారు. - రెండు రోజులుగా మహిళా హాస్టల్లో నీటికొరత - మంగళవారం రాత్రి విద్యార్థులు ఆందోళన - నచ్చజెప్పే ప్రయత్నం చేసిన రిజిస్ట్రార్ - శాంతించని విద్యార్థినులు, నేడు ఎస్వీయూ బంద్ యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీ మహిళా హాస్టల్లో రెండు రోజులుగా నీటికొరత తీవ్రమైంది. మంగళవారం చుక్కనీరు కూడా దొరకని పరిస్థితి. తాగడానికి, బాత్రూమ్లో వాడకానికి నీరు లేవు. దీంతో మంగళవారం రాత్రి భోజనం తినేందుకు కూడా చుక్కనీరు లేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థునులు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. ప్రకాశం భవన్‌కు వెనుకవైపున ఉన్న మహిళ హాస్టళ్ల సముదాయ ప్రాంగణంలో విద్యార్థులు బైఠాయించి నినాదాలు చేశారు. చాలారోజులగా హాస్టల్లో ఇదే పరిస్థితి ఉన్నా.. వార్డన్లు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 1000 మంది ఉన్న హాస్టల్లో 9 మంది తాగునీటి కుళాయిలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అలాగే గదికి ఇద్దరు ఉండాల్సిన రూముల్లో 7 నుంచి 9 మందికి కేటాయించారని చెప్పారు. దోమల భాద ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హాస్టల్లో భోజనం సరిగా లేదని ఆరోపించారు. వార్డన్‌ను తొలగించాలని డిమాండ్ చేశా రు. 2 గంటల పాటు ఆందోళన కొనసాగింది. మహి ళా హాస్టల్లో ఈ తరహా ఆందోళన జరగడం ఇదే మొదటిసారి. దీంతో రిజిస్ట్రార్ దేవరాజులు, హాస్టల్‌కు చేరుకుని విద్యార్థులతో చర్చించారు. అయినా వారు శాంతించలేదు. దీంతో ఆయన నీరు తెప్పించే ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఈ అంశంపై వార్డన్ శకుంతల మాట్లాడుతూ నీటి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఈ ఆందోళనకు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు హేమంత్ యాదవ్, తేజ, కిశోర్, హేమంత్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సమస్యల పరిష్కరానికి బుధవారం పరిపాలనాభవనం వద్ద ఆందోళన చేస్తున్నట్లు , యూనివర్సిటీలో బంద్ పాటిస్తున్నట్లు విద్యార్థినులు పేర్కొన్నారు. -
'ఎస్వీయూలో ర్యాగింగ్ వాస్తవమే'
-
'ఎస్వీయూలో ర్యాగింగ్ వాస్తవమే'
తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ వాస్తవమేనని రిజిస్ట్రార్ దేవరాజులు, ఆర్డీవో వీరబ్రహ్మయ్య తెలిపారు. ఎస్వీ వర్సిటీలో కలకలం సృష్టించిన ర్యాగింగ్‌పై తిరుపతి ఆర్డీవో సోమవారం విచారణ ప్రారంభించారు. ఆర్డీవో వీరబ్రహ్మం వర్సిటీలోని డీ-బ్లాక్‌కు వెళ్లి ర్యాగింగ్ సంఘటనపై విద్యార్థులు, అధికారులతో చర్చించారు. అనంతరం వారు 'సాక్షి' మీడియాతో మాట్లాడారు. ఐదుగురు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్టు గుర్తించామన్నారు. అదే విధంగా ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెడుతున్నట్టు తెలిపారు. ర్యాగింగ్ ఘటనపై విచారణకు ఏడుగురు సభ్యులతో కమిటీ వేశామని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించినట్లు ఆర్డీవో వీరబ్రహ్మయ్య, రిజిస్ట్రార్ దేవరాజులు మీడియాకు తెలిపారు. -
సోమవారం నుంచి సినిమా చూపిస్తాం
యూనివర్సిటీక్యాంపస్ (తిరుపతి): ‘‘మాకు సోమవారంతో సెమిస్టర్ పరీక్షలు అయిపోతాయి, తీరుబడి దొరుకుతుంది. ఈ రోజు చేసిం ది జస్ట్ శాంపిల్ మాత్రమే. మండే నుంచి సినిమా చూపిస్తాం’’ ఇదీ తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఎంసీఏ విద్యార్థులు జూనియర్లకు చేస్తున్న హెచ్చరిక. యూనివర్సిటీ వసతి గృహాల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్లను తమ గదులకు పిలిపించుకుని యథేచ్ఛగా ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు. ర్యాగింగ్ నివారణకు చర్యలు తీసుకోవాలని, జరగకుండా చూడాలని ఉన్నతాధికారులు చేసిన ఆదేశాలను వార్డెన్లు, అధ్యాపకులు పట్టించుకోకపోవడంతో ర్యాగింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దీం తో శనివారం ఇద్దరు విద్యార్థులు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకులను ఆశ్రయించారు. తమకు టీసీలు ఇప్పిస్తే వెళ్లిపోతామని మొరపెట్టుకున్నారు. అసలేం జరిగిందని వారిని విచారిస్తే.. ర్యాగింగ్ భూతాలు తమను వేధించిన తీరును వివరించారు. అసలేం జరిగిందంటే.. ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 10 నుంచి తరగతులు ప్రారంభమయ్యా యి. దీంతో నూతన విద్యార్థులకు డీ-బ్లాక్‌లో వసతి కల్పించారు. సీనియర్ విద్యార్థులు తమ హాస్టల్లో రెండో ఫ్లోర్లో వసతి పొందుతున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో సీనియర్ విద్యార్థులు జూనియర్లను తమ గదులకు పిలిపించుకుని ర్యాగింగ్ చర్యలకు పాల్పడ్డారు. చేతులు చాపి 2 గంటల పాటు అదే పొజిషన్ నిలబడాలంటూ కొంతమంది విద్యార్థులను ఆదేశించారు. ఇది ట్రైలర్ మాత్రమేనని సోమవారం నుంచి సినిమా చూపిస్తామని వారు హెచ్చరించారు. టేబుల్ కింద క్రికెట్ ఆడిస్తామని, నేల మీద ఫ్రాక్ నడక నేర్పుతామని, స్విమ్మింగ్ పూల్ లేకపోయినా ఈతకొట్టే విధానం చేసి చూపించాల్సి ఉంటుందని జూనియర్లకు చెప్పారు. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే విభాగాధిపతికి చెప్పి అన్ని సబ్జెక్టులు ఫెయిల్ చేయిస్తామని భయపెట్టారు. పట్టించుకోని కమిటీలు.. నాగార్జున వర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో ఎస్వీయూలో ర్యాగింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి వీసీ రాజగోపాల్, రిజిస్ట్రార్ దేవరాజులు.. వర్సిటీ అధ్యాపకులు, వార్డెన్లు, ప్రిన్సిపాళ్లకు ఆదేశాలిచ్చారు. ఆ మేరకు కమిటీలను వేశారు. ఒక విభాగానికి చెందిన నలుగురు ఈ కమిటీలేసి నిత్యం పర్యవేక్షించాలన్నారు. కానీ ఈ ఆదేశాల్ని కమిటీ సభ్యులు లెక్కచేయలేదని ఆరోపణలొస్తున్నా యి. దీంతో వసతిగృహాల్లో ర్యాగింగ్ కొనసాగుతూనే ఉందని విద్యార్థులు వాపోతున్నారు. -
యూనివర్సిటీలో ర్యాగింగ్‌పై మేల్కొన్న ప్రభుత్వం
-
మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కండి
ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవంలో విద్యార్థులకు వక్తల పిలుపు తిరుపతి కల్చరల్: విద్యారంగ పరిరక్షణకు విద్యార్థులు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలని వక్తలు పిలుపునిచ్చారు. ఏఐఎస్ఎఫ్ 80వ వార్షికోత్సవం బుధవారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ప్రారంభమైంది. ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య జెండాను ఆవిష్కరించారు. మృతవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ద్రవిడ వర్సిటీ మాజీ వీసీ కేఎస్.చలం సభను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారీ వ్యవస్థ బలపడడంతో సేవా రంగాలు సైతం వ్యాపారంగా మారాయన్నారు. దీనికి విద్యారంగాన్ని ఉదాహరణగా చెప్పొచ్చన్నారు. దీన్ని రక్షించుకునేందుకు విద్యార్థులు నడుం బిగించాలని కోరారు. ఎస్వీయూలో విద్యార్థి నాయకుడిగా ఎదిగిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక విద్యార్థి సంఘాలు అవసరం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి విశ్వజిత్‌కుమార్, కేరళ మాజీ మంత్రి, మాజీ ఏఐఎస్ఎఫ్ నేత బినయ్ విశ్వం, ఏఐఎస్ఎఫ్ జాతీయ గర్ల్స్ కన్వీనర్ కరమ్ వీర్ కౌర్, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లే ప్రభుత్వ విద్య నిర్వీర్యమవుతోందని, వాటికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు నడిపిన పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఎయిర్ బైపాస్ రోడ్డు నుంచి ఎమ్మార్ పల్లి సర్కిల్, బాలాజీ కాలనీ మీదుగా ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియం వరకు విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ప్రజా నాట్యమండలి కళాకారులు ఆలపించిన ఉద్యమ గీతాలు విద్యార్థులను ఉత్తేజపరిచాయి. -
రిషితేశ్వరికి మద్ధతుగా ఎస్వి విద్యార్థుల బంద్
-
ఎస్వీయూలో రాసలీలలు.. ఇద్దరి సస్పెన్షన్
ఎస్వీ యూనివర్సిటీలో ఓ ఉద్యోగి సహచర ఉద్యోగితో రాసలీలలు కొనసాగిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ శృంగార లీలలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పుటేజీలను పరిశీలించిన అధికారులు సంబంధిత ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నా యి. ఎస్వీయూ కోఆపరేటివ్ స్టోర్స్ ఇండేన్ గ్యాస్ కార్యాలయంలోని ఓ క్లర్కు అక్కడి స్వీపర్ తో కార్యాలయంలోనే కొంత కాలంగా రాసలీలలు కొనసాగిస్తున్నాడు. జూన్ 28న కార్యాలయంలోనే రాసలీలలు సాగి స్తుండగా అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ ఉద్యోగి వ్యవహారంపై స్టోర్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. కోఆపరేటివ్ స్టోర్స్ ఉపాధ్యక్షుడు జానకిరామయ్య, మిగిలి న ఆరుగురు డైరెక్టర్ల సమక్షంలో సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. పుటేజీల్లో ఉన్నది స్టోర్స్ ఉద్యోగులేనని నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న జానకిరామయ్య వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మళ్లీ ప్రయత్నాలు ఈ వ్యవహారంలో సస్పెన్షన్‌కు గురైన క్లర్క్ విధుల్లో చేరడానికి అధికార పార్టీ నేతల ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. రాజకీయ ఒత్తిడితో ఆ క్లర్క్ ను తిరిగి విధుల్లోకి చేర్చుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. దాంతో విద్యార్థులు మండిపడుతున్నారు. వారిద్దరినీ సస్పెండ్ చేయడం కాదని, విధుల నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఉద్యోగుల రాసలీలలు.. సీసీ కెమెరాలో రికార్డు
చిత్తూరు(తిరుపతి): ఎస్వీ యూనివర్సిటీలో ఓ ఉద్యోగి సహచర ఉద్యోగితో రాసలీలలు కొనసాగిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ శృంగార లీలలు కార్యాలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పుటేజీలను పరిశీలించిన అధికారులు సంబంధిత ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జూన్ 29న ఉత్తర్వులు జారీ చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఎస్వీయూ కోఆపరేటివ్ స్టోర్స్ ఇండియన్ గ్యాస్ కార్యాలయంలోని ఓ ఉద్యోగి, సహచర ఉద్యోగితో కార్యాలయంలోనే కొంత కాలంగా రాసలీలలు కొనసాగిస్తున్నాడు. జూన్ 28న కార్యాలయంలోనే రాసలీలలు సాగిస్తుండగా అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ ఉద్యోగుల వ్యవహారంపై స్టోర్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. కోఆపరేటివ్ స్టోర్స్ ఉపాధ్యక్షుడు జానకిరామయ్య, మిగిలిన ఆరుగురు డెరైక్టర్ల సమక్షంలో సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. పుటేజీల్లో ఉన్నది స్టోర్స్ ఉద్యోగులేనని నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న జానకిరామయ్య వారిద్దరినీ విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మళ్లీ ప్రయత్నాలు : ఈ వ్యవహారంలో సస్పెన్షెన్కు గురైన క్లర్క్ విధుల్లో చేరడానికి అధికార పార్టీ నేతల ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. రాజకీయ ఒత్తిడితో ఆ క్లర్క్‌ను తిరిగి విధుల్లోకి చేర్చుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. -
ఎస్వీయూలో ఫీజుల మోత
పెరిగిన డిగ్రీ ఫీజులు బెంబేలెత్తున్న విద్యార్థులు ఎస్వీ యూనివర్సిటీ అధికారులు పేద విద్యార్థులతో చెడుగుడు ఆడేస్తున్నారు. అడపాదడపా ఫీజులు పెంచుతూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. గత ఏడాది ఫీజు తరగుతుల ఫీజులు రెట్టింపు చేసి, ఇప్పుడు డిగ్రీ కళాశాలల్లో మరింత మోత మోగిస్తున్నా రు. భారీ మొత్తంలో ఫీజులు చెల్లించలేక విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులకు ఫీజుల రూపంలో వాతపెడుతున్నారు. కోటి ఆశలతో కళాశాలల్లో అడుగుపెట్టాలని భావిస్తున్న విద్యార్థులను ఫీజుల మోత బాధిస్తోంది. గత ఏడాది క్యాంపస్‌లోని హాస్టల్ ఫీజులు, పరీక్ష ఫీజులు, వివిధ రకాల సర్టిఫికెట్లకు ఫీజులను యూనివర్సిటీ యంత్రాంగం భారీగా పెం చింది. ఈ ఏడాది పీజీ, ఫీజుల రూపంలో వాతపెట్టిన అధికారులు ఇప్పుడు డిగ్రీ ఫీజులను కూడా పెంచింది. డిగ్రీ చేరాలని కళాశాలకు అడ్మిషన్ కోసం అడుగుపెట్టిన విద్యార్థులకు పగలే చుక్కలు కన్పిస్తున్నాయి. ప్రభుత్వ కళాశాలలో ఫీజులను 50 శాతం పెంచిన యూనివర్సిటీ పెంచిన ఫీజులను వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పెట్టలేదు. పత్రికా ముఖంగా విద్యార్థులకు తెలియచెప్పలేదు. గత ఏడాది ఫీజులు చూసి అంతే ఫీజు ఉంటుందని భావించిన అడ్మిషన్ కోసం వెళ్లితే పెంచిన ఫీజులను చల్లగా చెబుతుంటే తల్లిదండ్రుల గుండెలు జారి పోతున్నాయి. 50 శాతం పెంపు ఎస్వీయూ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చేరేందుకు గత ఏడాది రూ.4500 వసూలు చేసేవారు. ఈ ఫీజు ప్రభుత్వ కళాశాలల్లో వసూలు చేసే ఫీజు. ఆ ఫీజును ఈ ఏడాది రూ.7070కి పెంచారు. అంటే రూ.2570 ఫీజు పెరిగింది. అంటే దాదాపు 57 శాతం పెరుగుదల ఉంది. ఇక ప్రైవేటు కళాశాలల్లో ఫీజు నియంత్రణ లేకపోవడంతో ఆ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎస్వీయూ పరిధిలో 135 కళాశాలలు ఉన్నాయి. ఇందులో 15 ప్రభుత్వ కళాశాలలు, 5 టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మిగిలిన 116 డిగ్రీ కళాశాలలు ప్రైవేట్ యాజమాన్యాలకు చెందినవి. వీటిలో దాదాపు 50 వేల మంది విద్యార్థులు ఉన్నారు. బీకాంలో 30 వేలు, బీఎస్సీలో 16 వేలు, బిఏలో 4500 మంది విద్యార్థులు చదువుతున్నారు. అంటే మొదటి సంవత్సరంలో దాదాపు 17 వేల మంది కొత్తగా డిగ్రీలో చేరుతున్నారు. యూనివర్సిటీ పెంచిన ఫీజుల వల్ల ఒక్కో విద్యార్థిపై రూ.2570 భారం పడుతుంది. అంటే ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చేరే విద్యార్థులపై యూనివర్సిటీ రూ.4.3 కోట్ల భారం మోపుతోంది. పీజీ కోర్సులకు పెంపు ఎస్వీయూలో ఈనెల నుంచి పీజీ అడ్మిషన్లు మొదలు కానున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను వెబ్సైట్లో పెట్టారు. దీని ప్రకారం ఎంఏలో చేరేవారు రూ.6,315, ఎంకాం అభ్యర్థులు రూ.8 వేలు, ఎంఎస్సీ విద్యార్థులు రూ.10,185 చెల్లించాలి.కొన్ని సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులకు మెయింటెన్స్ పేరిట ఏకంగా రూ.10 వేలు పెరిగింది. ఎస్వీయూ, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో దాదాపు 4 వేల మంది చేరతారు. పెంచిన ఫీజులతో విద్యార్థులపై మరో రూ.2 కోట్ల భారం పడనుంది. అంటే ఏడాది కాలంలో ఎస్వీయూ పరిధిలో పీజీ, డిగ్రీ విద్యార్థుల పైన, దాదాపు రూ.6.5కోట్ల భారం మోపుతున్నారు. -
ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా సురేశ్ బాబు బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా సురేశ్ బాబు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. 1979 ఐఆర్ఎస్ బ్యాచ్ అధికారి అయిన సురేశ్ బాబు.. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పీజీ పూర్తి చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈయన గతంలో ఐఆర్ఎస్ అధికారిగా ఏపీ, ముంబై, చెన్నై, నాగ్‌పూర్, విశాఖపట్నంలో పలు హోదాల్లో పని చేశారు. 2012లో చీఫ్ కమిషనర్‌గా పదోన్నతి పొంది తొలుత బెంగళూరు అనంతరం హైదరాబాద్‌లో పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ లకు ఐటీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా నియమితులయ్యారు. -
కాటేసిన విద్యుత్ తీగ
ఎస్వీ యూనివర్సిటీలో శుక్రవారం విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా షాక్ తగిలి ఓ ఉద్యోగి మృత్యువాత పడ్డాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. - ఎస్వీయూలో విద్యుదాఘాతంతో ఉద్యోగి మృతి - మరో ఉద్యోగి పరిస్థితి ఆందోళనకరం - బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతదేహంతో ఆందోళన యూనివ ర్సిటీ క్యాంపస్ : ఎస్వీ యూనివర్సిటీలో విద్యుదాఘాతంతో విధి నిర్వహణలో ఉన్న ఓ ఉద్యోగి మృత్యువాత పడ్డాడు. మరో ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు... ఎస్వీయూలోని టెన్నిస్ కోర్టు వద్ద శుక్రవారం వీధిలైట్ వెలగకపోవడంతో రిపేరు చేయాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అక్కడి హెల్పర్లు, టైమ్ స్కేల్ ఉద్యోగులైన మురళి, జగదీష్‌ను ఆదేశించారు. వారి ద్దరూ విద్యుత్ సరఫరా ఆఫ్ చేసి ఆపై స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తున్నారు. ఇంతలో మురళి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. పక్కనే ఉన్న జగదీష్(38) అతన్ని రక్షించబోయి పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై పడిపోయాడు. ఆపై కొంతసేపటికే గిలాగిలా కొట్టుకుంటూ జగదీష్ ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న స్థానికులు మురళిని స్విమ్స్‌కు తరలించి, చికిత్స అందిస్తున్నారు. జగదీష్ మృతదేహాన్ని నిచ్చెన నుంచి అతి కష్టంమీద కిందికి దింపారు. ఇలావుండగా మురళి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఆ నిర్లక్ష్యమే కారణమా? ఎస్వీయూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం సంభవించిందని సిబ్బంది భావిస్తున్నారు. 13న ఎస్వీయూ స్టేడియంలో బాహుబలి ఆడియో వేడుకకు ఎస్వీయూ నుంచి 11 కేవీ విద్యుత్ లైను నుంచి కనెక్షన్ ఇచ్చారు. ఫంక్షన్ అనంతరం దానిని తొలగించలేదు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులు మరిచిపోయారు. మరమ్మతుల సమయంలో సిబ్బంది కరెంట్ ఆఫ్ చేసినా స్టేడియం నుంచి వచ్చే వైర్‌కు విద్యుత్ రావడంతో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఉద్యోగుల ఆందోళన మృతుడి కుటుంబానికి రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియో, కుటుంబ సభ్యులకు పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ ఉద్యోగులు శుక్రవారం సాయంత్రం పరిపాలనా భవనం వద్ద జగదీష్ మృతదేహంతో ఆందోళన చేశారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. మృతుని కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు. టైమ్‌స్కేల్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సుబ్రమణ్యంరెడ్డి, మధుసూదన్‌నాయుడు, ఎన్ ఎంఆర్‌ల అధ్యక్షుడు నాగవెంకటేశ్, వైఎస్ఆర్ సీపీ విద్యార్థి జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, హే మంతకుమార్, మురళీధర్ పాల్గొన్నారు. రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా జగదీష్ కుటుంబాన్ని ఆదుకుంటామని వీసీ రాజేంద్ర, రిజిస్ట్రార్ దేవరాజులు, రెక్టార్ జయశంకర్, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ హామీ ఇచ్చారు. మృతుని కుటుంబానికి రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా, జగదీష్ భార్యకు టైంస్కేల్ ఉద్యోగాన్ని ప్రకటించారు. -
ఎస్వీయూ లో షార్ట్ సర్క్యూట్ : ఉద్యోగి మృతి
తిరుపతి: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఈ ప్రమాదంలో యూనివర్సిటీ ఉద్యోగి జగదీష్ మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. శుక్రవారం విద్యుత్ వైర్లు రిపేర్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. విద్యుత్ సరఫరా నిలిపివేయకుండానే సిబ్బందిని అధికారులు కరెంట్ పోల్ ఎక్కించినట్టు సమాచారం. ఈ ప్రమాదానికి అధికారులే కారణమంటూ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ నెల 13 న ఎస్వీ లో జరిగిన బాహుబలి ఆడియో రిలీజ్ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా విద్యుత్ లైన్ ను ఏర్పాటు చేశారు. ఆ విద్యుత్ లైన్ ను తొలిగించే క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. -
స్నాతకోత్సాహం
యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీ 54వ స్నాతకోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. మూడేళ్ల తర్వాత జరిగిన స్నాతకోత్సవానికి విద్యార్థులు హాజరై, డిగ్రీలు తీసుకున్నారు. 1,297 మంది ప్రత్యక్షంగా, 18,762 మంది పరోక్షంగా పట్టాలు పొందారు. స్నాతకోత్సవంలో 117 మంది పీహెచ్‌డీలు, 12 ఎంపీల్, 18 మంది ఎంటెక్, 14 ఎంబీఏ, 7 ఎంసీఎ, 30 ఎంఈడీ, 4 ఎంఎల్ఐసీ, 17 ఎంఫార్మసీ, 6 ఎల్ఎల్ఎం, 677 ఎమ్మెస్సీ, 302 ఎంఏ, 72 ఎంకాం, 6 ఎంఎఫ్‌ఎం, 15మంది ఎంబీఈ డిగ్రీలు పొందారు. పతకాల పంపిణీ గందరగోళం ఎస్వీయూ స్నాతకోత్సవంలో బంగారు పతకాలు పంపిణీ చేసే సమయంలో గందరగోళం ఏర్పడింది. పరీక్షల విభాగం సరైన ఏర్పాట్లు చేయకపోవడం, పలువురు స్నాతకోత్సవానికి హాజరుకాకపోవడం, బంగారుపతకాలు అందుకోవాల్సిన జాబితాను సిబ్బంది సరిగా పెట్టుకోకపోవడంతో ఆటంకాలు తలెత్తాయి. ఒకరి డి గ్రీలు మరొకరికి ఇచ్చేశారు. పలుమార్లు అంతరాయం ఏర్పడి గందరగోళం ఏర్పడింది. దీంతో వైస్‌చాన్సలర్ నేరుగా వెళ్లి సిబ్బందితో మాట్లాడి, సరిగా డిగ్రీలు ప్రదానం చేయాలని సూచించారు. డిగ్రీలు అందించే సమయంలో గవర్నర్ చాలాసేపు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎక్కువ సార్లు ఆటంకం ఏర్పడడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో వీసీ రాజేంద్ర, రెక్టార్ జయశంకర్, రిజిస్ట్రార్ ఎం.దేవరాజులు, డీన్ ఉషారాణి, కేవీ శర్మ, భగవాన్‌రెడ్డి, కార్తికేయన్, కృష్ణయ్య, ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవానికి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, పీఆర్వో రవి, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి ,మాజీ స్పీకర్ అగరాల ఈశ్వరరెడ్డి హాజరయ్యారు. పసిడి వీరులు వీరే ఎస్వీయూ స్నాతకోత్సవంలో బంగారు పతకాలు పొందినవారి వివరాలిలావున్నాయి. జోహారాభాను (గణితం), సునీతా(గణితం), మీనాకుమారి (బయోకెమిస్ట్రీ), సి.అలే ఖ్య (బోటనీ), కె.స్వాతి, సుధామణి, గీతారాణి, హేమలత, విజయలక్ష్మి (కెమిస్ట్రి), జాహ్నవి(కంప్యూటర్‌సైన్స్), కె.మహేశ్వరి (హోంసైన్స్), సోమశేఖర్( జియాలజీ), ఎం.ప్రియదర్శిని, పవన్‌కుమార్ (ఫిజిక్స్), శ్రీనప్ప(ఆంథ్రోపాలజీ), పి.శ్రీహరిత, ఎవి ప్రసాద్(స్టాటిస్టిక్స్), వెంకటరామయ(జువాలజీ), వీరేష్ (ఎకనామిక్స్), జయపద్మ( ఇంగ్లి షు), పి.రవి(హిస్టరీ), లక్ష్మీప్రసన్న (హిందీ), శ్రీకాంతమ్మ (సోషియాలజీ), రాజేష్(తమిళం), నాగరాజు , బిందు (తెలుగు), ఈశ్వరయ్య (కామర్స్), కె.అనిత (ఎంఎఫ్‌ఎం), ఎం.జయశంకర్ (ఎల్ఎల్ఎం), కె.రమ్యకృష్ణ, ప్రత్యూష(ఏంబీఏ), వి.సతీష్‌కుమార్ (ఎంఎల్ఐసీ), ఫణికుమార్ (ఎంటెక్)లు బంగారు పతకాలు పొందారు. -
ఘనంగా ఎస్వీయూ స్నాతకోత్సవం
-
ఎస్వీయూ స్నాతకోత్సవంలో గందరగోళం
తిరుపతి: శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ(ఎస్వీయూ) స్నాతకోత్సవంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం జరిగిన యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ఒకరికి అందించాల్సిన పట్టాను మరొకరికి ప్రదానం చేయడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో ఈ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యూనివర్శిటీ స్నాతకోత్సవంలో అధికారులు వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ నరసింహన్, వెంకయ్యలు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ దొరికిపోయారు
ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి) : శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో పీహెచ్‌డీలో ప్రవేశానికి నిర్వహించిన రీసెట్- 2015లో ఒక విద్యార్థి స్థానంలో మరొకరు పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు. ఈ సంఘటనపై ఎస్వీయూ క్యాంపస్ పోలీసులు కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు... ఎస్వీ యూనివర్సిటీలో పీహెచ్‌డీలో ప్రవేశానికి గురువారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. కాగా శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఫిజిక్స్ పాఠ్యాంశానికి సంబంధించిన ప్రవేశ పరీక్షకు ఆనంద్‌రావు అనే విద్యార్థి హాజరుకావాల్సి ఉంది. అయితే అతని స్థానంలో సిద్ధయ్య అనే విద్యార్థి పరీక్ష రాస్తుండగా అధికారులు గుర్తించారు. ఎస్వీయూ వీసీ రాజేంద్ర, రిజిస్ట్రార్ దేవరాజులు, అడ్మిషన్ డెరైక్టర్ భాస్కర్‌రెడ్డి ఈ సంఘటనపై విచారణ జరిపి, ఇంకో విద్యార్థి పరీక్ష రాస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. సదరు విద్యార్థిని ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. -
ఎడ్‌సెట్‌కు 83 శాతం హాజరు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల ప్రవేశానికి గురువారం నిర్వహించిన ఎడ్‌సెట్-2015 ప్రశాంతంగా జరిగింది. ఈ ప్రవేశ పరీక్షకు 83.4 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన ఈ పరీక్షను 21,286 మంది రాశారు. రాష్ట్రంలోని 31 పట్టణాల్లో 59 పరీక్ష కేంద్రాల్లో ప్రవేశపరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 25,539 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 4,253 మంది గైర్హాజరయ్యారు. మ్యాథమేటిక్స్‌కు 6,247 మంది దరఖాస్తు చేయగా 5,021 మంది హాజరయ్యారు. ఫిజికల్ సైన్స్‌కు 2,532గాను 2,094 మంది, బయాలజీ సైన్స్‌కు 5,086గాను 4,237 మంది, సోషల్ స్టడీస్‌కు 11,062గాను 9,420 మంది హాజరయ్యారు. ఇంగ్లిషుకు 612 మంది దరఖాస్తు చేస్తే 514 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల తనిఖీ తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్వీ జూనియర్ కళాశాల, ఎస్వీయూ క్యాంపస్ స్కూల్లోని పరీక్ష కేంద్రాలను ఎడ్‌సెట్ చైర్మన్, ఎస్వీయూ వీసీ డబ్ల్యు రాజేంద్ర, కన్వీనర్ కుమారస్వామి, ఎస్వీయూ రిజిస్ట్రార్ ఎం.దేవరాజులు, రీజినల్ కోఆర్డినేటర్ చెండ్రాయుడు, సిటీ కోఆర్డినేటర్ ఎం.సుబ్రమణ్యం తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణను పరిశీలించారు. 12న ఫలితాలు: ఎడ్‌సెట్-2015 ఫలితాలను జూన్ 12న విడుదల చేయనున్నట్టు కన్వీనర్ టీ కుమారస్వామి తెలిపారు. -
అనంత, కర్నూలు, తిరుపతిలో చిరుతల హల్చల్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో చిరుతలు హల్చల్ చేస్తున్నాయి. చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో చిరుతల సంచారం కలకలం సృష్టిస్తున్నాయి. గురువారం ఉదయం చిత్తూరు జిల్లా తిరుపతిలోని వేదిక్ వర్సిటీ, రుయా ఆస్పత్రి ప్రాంగణాల్లో చిరుత కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. వేదిక్ యూనివర్సిటీ వద్ద చిరుతల దాడిలో రెండు జింకలు మృతి చెందాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. చిరుతల కోసం బోనులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా తిరుపతిలోనే కాదు.. అనంతపురం జిల్లా పెనుకొండలోని.. రాజేశ్వరి కాలనీలో కూడా చిరుత సంచరిస్తున్న్లు తెలుస్తోంది. పెనుకొండలో గొర్రెల మందపై చిరుత దాడి చేసింది. రెండు గొర్రెలు మృతి చెందాయి, అలాగే కర్నూలు జిల్లా చిరుతన్కల్లో కూడా చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తుంది. చిరుతల సంచారంతో స్థానికులు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. -
ఎస్వీయూ నాక్ కో-ఆర్డినేటర్ రాజీనామా
యూనివర్సిటీ క్యాంపస్ : ఎస్వీ యూనివర్సిటీలో నాక్ కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ డీసీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఎస్వీయూ ఆక్వా కల్చర్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డీసీ రెడ్డి 2013 ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేశారు. అనంతరం నాక్ కో-ఆర్డినేటర్‌గా నియమితులై 20 నెలలపాటు పనిచేశారు. రెండు నెలలుగా రాజీనామా విషయమై తర్జనభర్జన పడుతున్నారు. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం వీసీ రాజేంద్రను కలిసి రాజీనామా పత్రం సమర్పించారు. రాష్ట్రంలో పది సంవత్సరాల తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. క్యాంపస్‌లోని టీడీపీ సానుభూతిపరులు పదవుల పట్ల ఆశలు పెట్టుకున్నారు. అప్పటి వరకు పదవుల్లో కొనసాగిన అధికారులు ఒక్కొక్కరే తప్పుకుంటున్నారు. ఫైనాన్స్ సలహాదారుగా ఉన్న ప్రొఫెసర్ వీ.కోదండరామిరెడ్డి జూలైలో రాజీనామా చేశారు. మీడియా డీన్‌గా పనిచేసిన ప్రొఫెసర్ పేట శ్రీనివాసులురెడ్డి గత నెలలో రాజీనామా చేశారు. ఇప్పుడు డీసీ రెడ్డి కూడా వారిబాటనే అనుసరించారు. మరికొంతమంది అధికారులు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు క్యాంపస్‌లో ప్రచారం జరుగుతోంది. కొత్త అధికారుల నియామకం ఎస్వీయూలో కొత్త అధికారుల నియామకం కొనసాగుతోంది. రిజిస్ట్రార్‌గా పనిచేసిన సత్యవేలురెడ్డి స్థానంలో ప్రొఫెసర్ ఎం.దేవరాజులు నియమితులయ్యారు. సీడీసీ డీన్‌గా పనిచేసిన శ్రీకాంత్‌రెడ్డి స్థానంలో త్యాగరాజు నియమితులయ్యారు. పరీక్షల విభాగం గౌరవ డెరైక్టర్‌గా ప్రొఫెసర్ కిరణ్కాంత్ చౌదరి, డీడీఈ ఆన్లైన్ ఎగ్జామ్స్, ఆన్లైన్ అడ్మిషన్ గౌరవ డెరైక్టర్‌గా ప్రొఫెసర్ పీ.గోవిందరాజులు నియమితులయ్యారు. ఈ ఇద్దరు ప్రొఫెసర్లు సర్వీసు నుంచి రిటైర్డ్ అయ్యారు. ఉచితంగా సేవ చేసేందుకు ముందుకు రావడంతో వారిని పై పదవుల్లో నియమించారు. మీడియా డీన్ పోస్టుకు తీవ్ర పోటీ ఎస్వీ యూనివ ర్సిటీలో మీడియా డీన్ పోస్టుకు తీవ్ర పోటీ నెలకొంది. ఈ పదవిలో కొనసాగిన పేట శ్రీనివాసులురెడ్డి గత నెలలో రాజీనామా చేశారు. ఈ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. అకడమిక్ స్టాఫ్ కళాశాలకు చెందిన వెంకటరమణ, ప్రాచ్య పరిశోధనకు చెందిన పీసీ.వెంకటేశ్వర్లు మధ్య పోటీ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. -
పాచిన అన్నం మీరు తింటారా?
యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీ వీసీ బంగ్లా ఎదుట మంగళవారం రాత్రి విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ‘డీ’ మెస్‌కు చెందిన ‘ఈ’ బ్లాక్ విద్యార్థులు వీసీ బంగ్లా వద్దకు వచ్చి బైఠాయించారు. పాచిపోయిన భోజనం ప్లేట్లో తీసుకొచ్చి అక్కడ ప్రదర్శించారు. పాచిపోయిన భోజనం పెట్టారంటూ విద్యార్థులు ఆరోపించారు. మంగళవారం ఉదయం వండిన ఆహారాన్ని రాత్రి పెట్టడంతో ఆ భోజనం చెడిపోయి దుర్వాసన వస్తోందని విద్యార్థులు చెప్పారు. పాచిపోయిన భోజనాన్ని మీడియాకు చూపించారు. హాస్టల్ వార్డెన్, కళాశాల ప్రిన్సిపాల్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేసే అధికారులు విద్యార్థులకు సరైన భోజనం పెట్టడంలో విఫలమయ్యారని ఆరోపించారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో వార్డెన్ చలపతి వీసీ బంగ్లా వద్దకు వచ్చారు. దీంతో అగ్రహించిన విద్యార్థులు ఈ పాచిపోయిన భోజనాన్ని మీరు తిని చూపించాలని కోరారు. ఆ భోజనం తనకు వద్దని వార్డెన్ అనడంతో విద్యార్థులు ఆగ్రహించారు. మాకు మాత్రం పాచిపోయిన భోజనం పెడతారు. మీరు ఎందుకు తినరని ప్రశ్నించారు. వార్డెన్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. దాదాపు 2 గంటల పాటు ఆందోళన కొనసాగింది. అనంతరం రెక్టార్ జయశంకర్, రిజిస్ట్రార్ దేవరాజులు ‘ఈ’ బ్లాక్‌ను సందర్శించారు. భోజనాన్ని పరిశీలించారు. భోజనం పాచిపోయిందని నిర్ధారించి, మళ్లీ భోజనం వండించారు. రాత్రి పదకొండు గంటల వరకూ వరకు అక్కడే ఉండి అన్నం వడ్డించాకే వెళ్లారు. -
ఈ ఏడాదికి పాత ఫీజులే!
వారం రోజుల్లో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ అధికారుల నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ ఫీజుల వ్యవహారం ఇప్పటికీ తేలకపోవడంతో పాత ఫీజులనే నిర్ణయిస్తూ ఈ నెల 30 లేదా ఆగస్టు 2లోగా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయూన్ని ఆదేశించినట్టు ఓ అధికారి తెలిపారు. భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనల ప్రకారం సెప్టెంబర్ నెలాఖరులోగా మూడు దశల ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ పూర్తి కావాల్సి ఉంది. ఐదారు రోజుల్లో జూలై ముగిసిపోనుంది. ఈ పరిస్థితుల్లో వారంలోగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ రాకపోతే సీట్ల భర్తీ సకాలంలో పూర్తి చేయలేరు. సీట్లు భర్తీ కాని పక్షంలో ఎంసీఐ ఆ ఎంబీబీఎస్ సీట్లను రద్దు చేస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఉన్నా.. రెండు రాష్ట్రాలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సిన ఈ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఫీజుల నిర్ణయంపై అధికారులు, ప్రైవేటు యాజమాన్యాల సమావేశం రెండు దఫాలుగా వాయిదా పడింది. ఇంకా జాప్యం చేస్తే సీట్లను కోల్పోయే ప్రమాదం ఉన్న దృష్ట్యా ఈ ఏడాదికి పాత ఫీజులతోనే నోటిఫికేషన్ జారీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. మూడు ప్రాంతాల్లో కౌన్సెలింగ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు మూడు ప్రాంతాల్లో కౌన్సెలింగ్ జరిగేది. ఎస్వీ యూనివర్సిటీ తిరుపతి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని జెఎన్టీయూలో కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ జరిగేది. ఇప్పుడు కూడా అదే మూడు ప్రాంతాల్లో కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎన్టీఆర్‌వర్సిటీ అధికారులు నిర్ణయించారు. -
కొత్త బంగారు లోకం!
క్యాంపస్ ఓ అందమైన ప్రపంచం. సువిశాలమైన పకృతి ఒడిలో నెలకొల్పిన ప్రదేశం. భూలోక స్వర్గంగా అభివర్ణించవచ్చు. ఇక్కడ చదువులో పరిణితి సాధించడంతోపాటు కళలకు సానపెట్టకోవచ్చు. ఎటుచూసినా పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇవన్నీ చూస్తే ఎవరికి మాత్రం క్యాంపస్‌లో అడుగుపెట్టాలనిపించదు. ఇది నిజమే. ప్రతి విద్యార్థీ ఈ క్యాంపస్‌ను ఒక్కసారి చూస్తే తాను అందులో చదవాలని, అక్కడ గడపాలని భావించక తప్పదు. అలాంటి సుందరస్వప్నం వచ్చింది. సోమవారం నుంచి పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులు క్యాంపస్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఎన్నో ఆశల్ని, మరెన్నో ఆశయాల్ని, అందమైన ఊహల్ని, తల్లిదండ్రుల కలల్ని మోసుకొని వస్తున్నారు. ఇలాంటి కొత్తబంగారు లోకానికి స్వాగతం పలకడానికి ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ సిద్ధమైంది. - రేపటి నుంచి పీజీ తరగతులు - తరలిరానున్న విద్యార్థులు యూనివర్సిటీక్యాంపస్ : ఎస్వీ యూనివర్సిటీకి 62 సంవత్సరాల చరిత్ర ఉంది. 1952లో రాయలసీమ ప్రాంతంలో ఉన్నత విద్యను అందించడానికి ఏర్పాటైన విద్యాలయం. జవహర్లాల్ నెహ్రూ స్వయంగా వచ్చి దీన్ని ప్రారంభించారు. సుమారు 1500 ఎకరాల్లో ఏర్పాటైన రాష్ట్రంలోనే రెండో అత్యుత్తమ విశ్వవిద్యాలయం. ప్రవేశం అంత సులువు కాదు ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్‌లో మూడు కళాశాలలున్నాయి. ఆర్ట్స్ కళాశాల్లో 25 సబ్జెక్ట్‌లు, సైన్స్‌లో 33 , కామర్స్‌లో 4 సబ్జెక్టులున్నాయి. వీటి ద్వారా 2305 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశం కోసం సుమారు 12 వేల మంది ప్రవేశపరీక్ష రాశారు. ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు నిర్వహించారు. ఈ నెల 4 నుంచి 11వరకు నిర్వహించిన కౌన్సెలింగ్ ద్వారా 1327 మంది క్యాంపస్ కళాశాలల్లో చేరారు. వీరందరికి సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. అందమైన భవనాలు ఎంతో ఆకర్షణీయమైన, దృఢమైన భవన నిర్మాణాలు ఎస్వీయూ సొంతం. తాజ్‌మహల్‌ను తలపించే గ్రంథాలయం.. దేశం గర్వించే ఇంజనీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆలోచనతో రూపొందించిన శ్రీని వాస ఆడిటోరియం.. నాలుగువైపులా గడియారాలతో సమయాలను సూచిస్తూ, నిటారుగా, హుందాగా కన్పించే పరిపాలనా భవనం.. ఇవి మతసామరస్యానికి చిహ్నంగా చెప్పవచ్చు. శ్రీనివాస ఆడిటోరియం ఒక్క పిల్లర్ కూడా లేకుండా నిర్మించడం ఎవరి మేథస్సు, అంచనాలకు అందని అద్భుత కట్టడం. దీనిపై శాస్త్రవేత్తల బొమ్మలు అద్భుతంగా చిత్రీకరించారు. పరిపాలనా భవనంలోని సెనేట్హాల్లో ప్రతినిత్యం ఏదో ఒక సదస్సులు జరుగుతుంటాయి. శ్రీనివాస ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఒకేసారి 1500 మంది ఇందులో కార్యక్రమాల్ని తిలకించవచ్చు. కంప్యూటర్ సెంటర్ ఎస్వీయూనివర్సిటీలోని విద్యార్థుల కోసం కంప్యూటర్ సెంటర్ ఉంది. ఇందులో ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉంది. బాలుర వసతిగృహాలవద్ద ఇంటర్నెట్ హబ్ ఉంది. దీన్ని రాత్రి వేళల్లో కూడా వాడవచ్చు. హెల్త్ సెంటర్ ఎస్వీయూ విద్యార్థుల కోసం చక్కటి ఆరోగ్య కేంద్రం ఉంది. ఇందులో ఐదుగురు వైద్యులు ఉన్నారు. క్యాంపస్‌లో చేరిన వెంటనే విద్యార్థులందరికీ ఓపీ కార్డులు ఇస్తారు. అనారోగ్యం కల్గితే చికిత్స కోసం వెళ్లవచ్చు. రక్తపరీక్ష, ఎక్స్‌రేతో పాటు ఇతర పరీక్షలు నిర్వహించుకోవడానికి ఆధునిక పరికరాలు ఉన్నాయి. హెల్త్‌సెంటర్‌లో ఒక వైద్యుడు, ఒక నర్సు 24 గంటలు అందుబాటులో ఉంటారు. అత్యవసర కేసుల్లో వైద్య సేవలందించడానికి వీలుగా రెండు అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. చక్కటి తరగతి గదులు క్యాంపస్‌లోని విద్యార్థులు విద్యనభ్యసించడం కోసం చక్కటి తరగతి గదులు, పర్నిచర్ ఉన్నాయి. కొన్ని విభాగాల్లో అత్యాధునిక సౌకర్యాలతో సెమినార్ హాళ్లు ఈ-తరగతి గదులు ఉన్నాయి. విద్యార్థులకు బోధించడం కోసం సుమారు 300 మంది నైపుణ్యం, సుదీర్ఘ అనుభవం కల్గిన అధ్యాపకులున్నారు. అధ్యాపకులు లేనిచోట అర్హత కల్గిన తాత్కాలిక అధ్యాపకులు విద్యార్థులకు విద్య అంది స్తున్నారు. ఎస్వీయూ ఆర్ట్స్ కళాశాలకు ప్రకాశం భవన్, వామనరావు భవనాల్లో తరగతి గదులున్నాయి. సైన్స్ కళాశాల రెండు సైన్స్ బ్లాకుల్లో విస్తరించి ఉంది. క్రీడా సదుపాయాలు పలు క్రీడా సౌకర్యాలున్నాయి. సుమారు 50 ఎకరాల్లో స్టేడియం ఉంది. చక్కటి జిమ్, షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్‌బాల్, వాలీబాల్ కోర్టులున్నాయి. పలు మైదానాలు అందుబాటులో ఉన్నాయి. అన్నమయ్య భవన్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ పొందడానికి అన్నమయ్యభవన్‌లో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. వ్యక్తిత్వ వికాస శిక్షణ, భావప్రకటన నైపుణ్యాల పెంపుపై ఇక్కడ శిక్షణ ఇస్తారు. మూడు క్యాంటీన్లు విద్యార్థులు సేదతీరడానికి, సరదాగా గడపడానికి పూర్ణ, అన్నపూర్ణ, సంపూర్ణ అనే మూడు క్యాంటీన్లు ఉన్నాయి. లైబ్రరీ చూడచక్కని రూపం, ఎదురుగా కూర్చొని చదవడానికి వీలుగా బల్లలు, హెమాస్లైట్లు, వాటిచుట్టూ వాటర్ ఫౌంటెన్లు, ఇవన్నీ దగ్గరగా పరిశీలిస్తే ఆగ్రాలోని తాజ్‌మహల్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా అనిపిస్తుంది. ఇందులో దా దాపు 4 లక్షల పుస్తకాలున్నాయి. డిజిటల్ లైబ్ర రీ, కాంపిటేటివ్ సెల్, రెఫరెన్స్ సెల్ ఉన్నాయి. అలానే ఎన్నోరకాల దిన, వార, మాస పత్రిక లు, జర్నల్స్, అందుబాటులో ఉంటాయి. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు దీన్ని విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు. హాస్టల్ వసతి ఎస్వీయూక్యాంపస్లో చేరిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. బాలురు కోసం పది, బాలికల కోసం 8 వసతిగృహాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా సుమారు ఐదు వేలమంది విద్యార్థులకు వసతి కల్పిస్తున్నా రు. వీరు భోజనం చేయడానికి వీలుగా అనుబంధ మెస్‌లు ఉన్నాయి. క్యాంపస్‌లో పీజీలో చేరిన విద్యార్థులందరికీ వసతి కల్పిస్తారు. ఇందులో చేరాలంటే ముందుగా దరఖాస్తు చేయాలి. ఓసీ విద్యార్థులు రూ.6,750, బీసీ లైతే రూ.5,750, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.4,750 కాషన్ డిపాజిట్ చెల్లిం చాలి. అలానే మెస్ కార్డుకోసం అదనంగా రూ.2100 చెల్లించి వసతి, మెస్‌లో భోజన సౌకర్యం పొందవచ్చు. లైబ్రరీని ఉపయోగించుకోవాలి ఎస్వీయూనివర్సిటీలో చక్కటి లైబ్రరీ ఉంది. వీటిలో నాలుగు లక్షల పుస్తకాలున్నాయి. దిన, వార, మాస పత్రికలతో పాటు ఎన్నో జర్నల్స్ ఉన్నాయి. అలానే పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న వారికోసం కాంపిటెటివ్ సెల్ ఉంది. ఇందులో అన్నిరకాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం అవసరమైన పుస్తకాలున్నాయి. డిజిటల్ లైబ్రరీ ద్వారా ఆన్లైన్ జర్నల్స్ చూసుకోవచ్చు, నూతన విద్యార్థులు లైబ్రరీని బాగా ఉపయోగించుకోవాలి. - వి.షణ్ముగం, లైబ్రరీ ఉద్యోగి సరైన వేదిక డిగ్రీ వరకు ఇంటిపట్టునే ఉండి చదువుకున్న విద్యార్థులు తొలిసారిగా తల్లిదండ్రులను వదలి క్యాంపస్‌లో అడుగు పెడుతున్నారు. యూనివర్సిటీల్లో ఎన్నో వసతులు, సౌకర్యాలున్నాయి. ఇంట్లో ఉన్న వాతావరణాన్ని ఇది తలపిస్తుంది. పీజీలో చేరిన విద్యార్థులు రెండు సంవత్సరాలు ఇక్కడి సౌకర్యాలు వినియోగించుకొని బాగా చదివితే స్థిరపడవచ్చు. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగవచ్చు. - ప్రొఫెసర్ సీ.ఈశ్వర్‌రెడ్డి, రిటైర్డ్ అధ్యాపకులు ఉన్నత లక్ష్యాలను సాధించొచ్చు ఎస్వీయూనివర్సిటీలో విద్యానభ్యసించిన వారు ఎంతో మంది ఉన్నత స్థానాలకు ఎదిగారు. సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో పాటు మరెంతో మంది గొప్పవారు ఇక్కడి విద్యార్థులే. రాష్ట్రంలోని నాలుగు విశ్వవిద్యాలయాల్లో ఎస్వీయూనివర్సిటీ ప్రొఫెసర్లు వైస్‌చాన్స్‌లర్లుగా పనిచేస్తున్నారు. ప్రస్తుత వీసీ రాజేంద్ర కూడా ఇదే విశ్వవిద్యాలయంలో చదివిన వారే. - ప్రొఫెసర్ పి.శ్రీనివాసులరెడ్డి, తెలుగు అధ్యయనశాఖ అధ్యక్షులు ఇక్కడ చదవడం అదృష్టం ఎస్వీయూనివర్సిటీకి 60 సంవత్సరాలు చరిత్ర ఉంది. రాష్టం లోనే రెండో పెద్ద విశ్వవిద్యాల యం. ఇందులో చదవడం ఎంతో అదృష్టం. ఈ విశ్వవిద్యాలయం లో విద్యార్థులకు అన్ని వసతులు ఉన్నాయి. చక్కటి లైబ్రరి ఉంది. వీటి ద్వారా విద్యార్థులు ఎంతో జ్ఞానం పొందవచ్చు. మరెన్నో పరిశోధన సంస్థలు ఉన్నాయి. చదువులో వెనుక బడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారి ఎదుగుదలకు తోడ్పడుతున్నాము. - ప్రొఫెసర్ ఉదయగిరి రాజేంద్ర, వైఎస్చాన్స్లర్, ఎస్వీయూ -
రిజిస్ట్రార్ తప్పుకోవాలంటూ ఆందోళన
నేడు కూడా బంద్ కొనసాగుతుందన్న ఎస్వీయూ విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్ : ఎస్వీ యూనివర్సిటీలో అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్న రిజిస్ట్రార్ కె.సత్యవేలురెడ్డి పదవి నుంచి తప్పుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రిజిస్ట్రార్‌ను తొలగించాలని విద్యార్థి సంఘాలు రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం విద్యార్థులు తరగతులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ చరిత్రలో ఏ రిజిస్ట్రార్ చేయని విధంగా ప్రస్తుత రిజిస్ట్రార్ విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని విమర్శించారు. ఆయన పదవిని చేపట్టిన రోజు నుంచి అన్నింటిలో అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఓఎంఆర్ షీట్లలో లక్షల రూపాయలను కమీషన్ల రూపంలో దండుకున్నారని ఆరోపించారు. అధ్యాపకుల నియామకాల్లో నోటిఫికేషన్‌కు ముందే అడ్వాన్స్ రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ పదవి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మెస్‌లు ఎందుకు తెరవరు? ఎస్వీ యూనివర్సిటీలో కళాశాలలు పునఃప్రారంభించి నెల రోజులు కావస్తున్నా మెస్‌లు ఎందుకు తెరవలేదని విద్య్రార్థులు ప్రశ్నించారు. కార్డు విధానం ప్రవేశపెట్టి విద్యార్థులను అవమానిస్తున్నారన్నారు. ముందుగా కాషన్ డిపాజిట్ కట్టించుకున్న అధికారులు మళ్లీ మెస్‌లలో భోజనం చేయడానికి కార్డుల విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టారని ప్రశ్నించారు. మెస్‌లు తెరవకపోవడం వల్ల కొందరు విద్యార్థులు హోటళ్లలో తిని ఆరోగ్యం పాడుచేసుకోవాల్సి వస్తుందన్నారు. మరికొందరు పేద విద్యార్థులు గుళ్లలో ప్రసాదాలతో పొట్టనింపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రార్ ఎన్ని అక్రమాలకు పాల్పడినా ఆయనకు మళ్లీ పదవి ఇవ్వాలని చూడడం దారుణమన్నారు. జాయింట్ రిజిస్ట్రార్ నాగమ్మ, ప్రిన్సిపాళ్లు కేవీఎస్.శర్మ, డి.ఉషారాణి విద్యార్థులతో చర్చించారు. వీసీ వచ్చిన తర్వాత చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందని విద్యార్థులు మంగళవారం కూడా బంద్ కొనసాగిస్తామని చెప్పారు. బంద్‌లో విద్యార్థినాయకులు వెంకటరమణ, నాదముని, రామ్మోహన్, లోకనాదం, సురేష్‌నాయక్, భాస్కర్‌యాదవ్, హేమాద్రియాదవ్, ఏజే.సూరి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన
-
ఎస్వీయూలో పీజీ సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
యూనివర్సిటీ క్యాంపస్ : ఎస్వీ యూనివర్సిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. తొలిరోజు బాటనీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, ఆక్వాకల్చర్, ఆంథ్రోపాలజీ కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. తొలుత బాటనీ, కెమిస్ట్రీ కోర్సులకు కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వీసీ ముఖ్య అతిథిగా హాజరై అడ్మిషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. బాటనీలో మొదటి ర్యాంకు సాధించిన సి.ముబారిషా, రెండో ర్యాంకు సాధించిన ఎన్.శాంతికి ఆయన అడ్మిషన్ ఇచ్చారు. కెమిస్ట్రీలో మూడవ ర్యాంకు సాధించిన జ్యోతిర్మయి, నాల్గవ ర్యాంకు సాధించిన ఎన్.లీలకు రిజిస్ట్రా ర్ కె.సత్యవేలురెడ్డి అడ్మిషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎస్వీ యూనివర్సిటీ ఎంతో మంది విద్యార్థులను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిందన్నారు. ఇక్కడ చదివిన వారు దేశ, విదేశాల్లో రాణిస్తున్నారన్నారు. పలు సంస్థల్లో కీలక పదవుల్లో కొనసాగుతున్నారన్నారు. శ్రీవారి పాదాల చెంత వెలసిన ఎస్వీయూ క్యాంపస్‌లో సీటు రావడం ఎంతో అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిషన్ డెరైక్టర్ పి.భాస్కర్‌రెడ్డి, పరీక్షల విభాగం డీన్ ఎం.సురేష్‌బాబు, మాజీ డెరైక్టర్ బి.కోదండరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 424మందికి అడ్మిషన్ల: శుక్రవారం 424 మందికి అడ్మిషన్లు ఇచ్చామని అడ్మిషన్ల విభాగం డెరైక్టర్ పాటూరి భాస్కర్‌రెడ్డి తెలిపారు. 297 మంది క్యాంపస్ కళాశాలల్లో చేరారన్నారు. సైన్స్ కళాశాలలో 195 మంది, ఆర్ట్స్‌లో 102 మంది చేరారన్నారు. హెల్ప్‌లైన్ డస్క్‌లు : పీజీ కౌన్సెలింగ్ కు హాజరైనవారి కోసం విద్యార్థి సంఘా లు హెల్ప్‌లైన్ డస్క్‌లు ఏర్పాటు చేశా యి వైఎస్సార్సీపీ, టీఎన్ఎస్ఎఫ్, ఏబీ వీపీ, ఐఎస్ఎఫ్, జీవీఎఫ్, టీఎస్ఎఫ్ హెల్ప్‌లైన్ డస్క్‌లు ఏర్పాటు చేశాయి.పీసీలు లేక ఇక్కట్లు : కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు ప్రొవిజన్ సర్టిఫికెట్లు, మార్కుల జాబితాలు లేక ఇబ్బం ది పడ్డారు. డిగ్రీ ఫలితాలు విడుదల చేసి రెండు వారాలు గడిచినా విద్యార్థులకు ప్రొవిజన్ సర్టిఫికెట్లు, మార్కుల జాబితాలు పంపలేదు. ప్రైవేటు బేజారు : శుక్రవారం కెమిస్ట్రీ సబ్జెక్టుకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కోర్సు పలు ప్రైవేటుకళాశాలల్లో నిర్వహిస్తున్నారు. ఆ కళాశాలల్లో వసతులు సరిగా లేకపోవడంతో చాలా మంది ప్రైవేటు కళాశాలల్లో చేరడంలేదు. దీంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు, సిబ్బంది కౌన్సెలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని తమ కళాశాలల్లో చేరాలంటూ విద్యార్థులపై ఒత్తిడి చేశారు. -
వేదాలే మార్గదర్శకాలు
వేదాలను పాటించేవారు సమాజంలో అందరికీ మార్గదర్శకులుగా నిలుస్తారని కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తెలిపారు. యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: వేదాలను పాటించేవారు సమాజంలో అందరికీ మార్గదర్శకులుగా నిలుస్తారని కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అన్నారు. ఎస్వీ యూనివర్సిటీలోని ప్రాచ్య పరిశోధన సంస్థలో మహాభారతంపై మంగళ వారం అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. శ్రీనివాస ఆడిటోరియంలో ప్రారంభమైన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తన సందేశం అందించారు. సనాతన ధర్మం ఎంతో గొప్పదన్నారు. గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు, సనాతన ధర్మ విశిష్టతను తెలియపరుస్తున్నాయన్నారు. సనాతన ధర్మం వేదాల నుంచి వచ్చిందన్నారు. ఈ ధర్మమే అన్ని యుగాల్లో గొప్పగా నిలిచిందన్నారు. ధర్మ పరిరక్షణ కోసం మహావిష్ణువు పది అవతారాలు ఎత్తారన్నారు. శ్రీకృష్ణుడు ధర్మపరిరక్షణలో కీలక పోత్ర పోషించాడన్నారు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడుకి చేసిన గీతోపదేశం సారాంశం అన్ని కాలాలకు అనువర్తితం అవుతుందన్నారు. మహాభారతంలో లేని అంశాలే లేవన్నారు. అంద రూ ధర్మమార్గంలో నడిస్తే భారతదేశం విదేశాలకు ధీటుగా నిలుస్తుందన్నారు. మనది పవిత్ర దేశం విశిష్ఠ అతిథిగా హాజరైన రామానుజ మిషన్ ట్రస్ట్(చెన్నై)కు చెందిన చతుర్వేదస్వామి ప్రసంగిస్తూ భారతదేశం పవిత్రమైనదన్నారు. దేవుడు గొప్పవాడన్నారు. అలానే మానవులు ధర్మ పరిరక్షణ ధర్మాలు పాటించడం ద్వారా దైవత్వాన్ని పొందుతారన్నారు. పురాణాలు, శాస్త్రాలు దేవుడి గొప్పతనాన్ని వివరిస్తాయన్నారు. మహాభారతం, రామాయణం మహాకావ్యాలే కాకుండా అందులో సైన్స్‌కు సంబంధించిన అనేక అంశాలున్నాయన్నారు. ఏ యుగంలోనైనా ఏ కాలంలోనైనా ధర్మ పరిరక్షణే పరమార్థమని మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పారన్నారు. అలానే మానవీయ విలువలు, నీతినియమాలు పాటించలేని వారు సమాజానికి అవసరం లేదన్నారు. భీమిలిలోని శివమహా పీఠాధిపతి కందుకూరి శివానందమూర్తి ప్రసంగిస్తూ ఎప్పటికైనా ధర్మమే విజయం సాధిస్తుందని మహాభారతం ద్వారా తెలుస్తుందన్నారు. 41 రోజుల పాటు అంపశయ్యపైన నిలిచిన భీష్ముడు చనిపోతూ అర్జునుడికి బోధించిన హితోపదేశంలో అనేక అంశాలు ఉన్నాయని ఇవి ఏ కాలానికైనా అచరించదగినవని చెప్పారు. టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్ మాట్లాడుతూ రామాయణ, మహాభారతాలు ప్రస్తుత సమాజంలో నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కారం చూపుతాయన్నారు. మహాభారతాన్ని మేనేజ్మెంట్ పుస్తకంగా ఉపయోగించవచ్చన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్వీయూ వీసీ రాజేంద్ర అధ్యక్షత వహించారు. రెక్టార్ సుకుమార్, రిజిస్ట్రార్ కె. సత్యవేలురెడ్డి, ఎస్వీయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కిరణ్ క్రాంత్ చౌదరి, సదస్సు నిర్వహణ కార్యదర్శి వేమూరి వెంకటరమణారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
సమైక్య శంఖారావానికి తరలివస్తాం:ఎస్వీయూ విద్యార్ధులు