ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి) : శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో పీహెచ్‌డీలో ప్రవేశానికి నిర్వహించిన రీసెట్- 2015లో ఒక విద్యార్థి స్థానంలో మరొకరు పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు. ఈ సంఘటనపై ఎస్వీయూ క్యాంపస్ పోలీసులు కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు... ఎస్వీ యూనివర్సిటీలో పీహెచ్‌డీలో ప్రవేశానికి గురువారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. కాగా శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఫిజిక్స్ పాఠ్యాంశానికి సంబంధించిన ప్రవేశ పరీక్షకు ఆనంద్‌రావు అనే విద్యార్థి హాజరుకావాల్సి ఉంది. అయితే అతని స్థానంలో సిద్ధయ్య అనే విద్యార్థి పరీక్ష రాస్తుండగా అధికారులు గుర్తించారు. ఎస్వీయూ వీసీ రాజేంద్ర, రిజిస్ట్రార్ దేవరాజులు, అడ్మిషన్ డెరైక్టర్ భాస్కర్‌రెడ్డి ఈ సంఘటనపై విచారణ జరిపి, ఇంకో విద్యార్థి పరీక్ష రాస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. సదరు విద్యార్థిని ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.
ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ దొరికిపోయారు
Published Thu, Jun 4 2015 8:34 PM | Last Updated on Mon, Jul 29 2019 7:35 PM
Advertisement
Advertisement