సాక్షి, తిరుపతి : శ్రీవేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో ఏడు నూతన పీజీ కోర్సులు ప్రవేశ పెడతున్నట్లు వీసీ ప్రొఫెసర్ ఎస్.సుదర్శన వర్మ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019–20 విద్యా సంవత్సరం నుంచి ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ గణితం, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ జువాలజీ, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిందీ, ఎంఏ తెలుగు కోర్సులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. దరఖాస్తు తుది గడువు ఈనెల 6వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. తొమ్మిదో తేదీ ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఈ ప్రవేశ పరీక్షలో ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్లు ఉంటా యని తెలిపారు. కోర్సులో చేరేవారికి ఉచిత వసతి భోజన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రపంచంలో అనేక విషయాల్లో మార్పులు వచ్చాయని, అయితే మార్పు రానిది వేదం మాత్రమే అన్నారు. అందుకే మన దేశం వేదభూమిగా గుర్తింపు పొందిందని తెలిపారు.
ఆధునిక కోర్సులు కూడా
వేదిక్ వర్సిటీలో వేదానికి సంబంధించిన కోర్సులే కాకుండా ఆధునిక కోర్సులు కూడా ఉన్నాయన్నారు. డిగ్రీ స్థాయిలో బీఎస్సీ, బీఏ కోర్సులు ఉన్నాయన్నారు. ఈ ఏడాది నుంచి పీజీ కోర్సులు ప్రవేశ పెడుతున్నామని తెలిపారు. సంప్రదాయ వర్సిటీలలోని కోర్సులకు వేద విజ్ఞానాన్ని జోడిం చి ఈ కోర్సులకు రూపకల్పన చేశామన్నారు. మహిళా వర్సిటీ, ఎస్వీయూ, ఇతర వర్సిటీల అధ్యాపకులు, నిపుణులతో సిలబస్ రూపొం దించినట్లు తెలిపారు. ఈ కోర్సుల బోధన సిబ్బం ది నియామకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని వీసీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment