Vedic University
-
వేద విజ్ఞానంతోనే భారత్‌కు గుర్తింపు
సాక్షి, అమరావతి/యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): భారతీయ వేద విజ్ఞానాన్ని ఆలంబనగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా మానవాళికి ప్రయోజనం చేకూర్చే ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సూచించారు. ప్రాచీన వేదజ్ఞాన సంపదతోనే భారతదేశం విశ్వగురుగా ప్రపంచవేదికపై విశిష్ట గుర్తింపు సాధించిందని తెలిపారు. తిరుపతిలో గురువారం నిర్వహించిన శ్రీవెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విజయవాడలోని రాజ్‌భవన్ నుంచి వెబినార్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలకోపన్యాసం చేస్తూ.. ప్రాచీన కాలం నుంచి మన గ్రంథాలు, సాంస్కృతిక వారసత్వం, విజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలకు ప్రేరణగా నిలిచిందన్నారు. భారతీయ గణిత, జ్యోతిష్య, వాణిజ్య, ఆర్థిక శాస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ముందంజలో ఉండేవని తెలిపారు. విజ్ఞానాన్ని మౌఖిక ప్రసారం అనే భారతీయ సంప్రదాయాన్ని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం కాపాడుతుండడం అభినందనీయమని ప్రశంసించారు. పరిశోధక విద్యార్థులు వేద గణితం వంటి అంశాలను ఎంపిక చేసుకోవాలని గవర్నర్ సూచించారు. గణేశన్ శౌత్రికి మహా మహోపాధ్యాయ పురస్కారం తిరుపతికి చెందిన వేద పండితుడు గణేశన్ శౌత్రికి మహామహోపాధ్యాయ (గౌరవ డాక్టరేట్ ) పురస్కారం లభించింది. స్నాతక్సోత్సవంలో యూజీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులు పూర్తి చేసిన 180 మందికి డిగ్రీలు అందజేశారు. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్.సుదర్శనశర్మ, టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వేదిక్లో నూతన పీజీ కోర్సులు
సాక్షి, తిరుపతి : శ్రీవేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో ఏడు నూతన పీజీ కోర్సులు ప్రవేశ పెడతున్నట్లు వీసీ ప్రొఫెసర్ ఎస్.సుదర్శన వర్మ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019–20 విద్యా సంవత్సరం నుంచి ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ గణితం, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ జువాలజీ, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిందీ, ఎంఏ తెలుగు కోర్సులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. దరఖాస్తు తుది గడువు ఈనెల 6వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. తొమ్మిదో తేదీ ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఈ ప్రవేశ పరీక్షలో ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్లు ఉంటా యని తెలిపారు. కోర్సులో చేరేవారికి ఉచిత వసతి భోజన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రపంచంలో అనేక విషయాల్లో మార్పులు వచ్చాయని, అయితే మార్పు రానిది వేదం మాత్రమే అన్నారు. అందుకే మన దేశం వేదభూమిగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఆధునిక కోర్సులు కూడా వేదిక్ వర్సిటీలో వేదానికి సంబంధించిన కోర్సులే కాకుండా ఆధునిక కోర్సులు కూడా ఉన్నాయన్నారు. డిగ్రీ స్థాయిలో బీఎస్సీ, బీఏ కోర్సులు ఉన్నాయన్నారు. ఈ ఏడాది నుంచి పీజీ కోర్సులు ప్రవేశ పెడుతున్నామని తెలిపారు. సంప్రదాయ వర్సిటీలలోని కోర్సులకు వేద విజ్ఞానాన్ని జోడిం చి ఈ కోర్సులకు రూపకల్పన చేశామన్నారు. మహిళా వర్సిటీ, ఎస్వీయూ, ఇతర వర్సిటీల అధ్యాపకులు, నిపుణులతో సిలబస్ రూపొం దించినట్లు తెలిపారు. ఈ కోర్సుల బోధన సిబ్బం ది నియామకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని వీసీ వివరించారు. -
రేపు వేదిక్ వర్సిటీ స్నాతకోత్సం
తిరుపతి: శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివర్సటీ నాలుగో స్నాతకోత్సవాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు వీసీ దేవనాథన్ వెల్లడించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాకు చెందిన వేద విద్వాంసుడు విష్ణుభట్ల శ్రీరామమూర్తి శాస్త్రికి గౌరవ డాక్టరేట్ అందజేయనున్నట్లు తెలిపారు. మహతి ఆడిటోరియంలో జరిగే ఈ స్నాతకోత్సవంలో 93 మందికి శాస్త్రి, 154 మందికి ఆచార్య, ముగ్గరురికి ఎంఫిల్, ఇద్దరికి పీహెచ్డీ, నటుగురికి బీఏ, 25 మందికి బీఎస్సీ, 6 మందికి ఎంఏ, 80 మందికి డిప్లొమా సర్టిఫికెట్ కోర్సులకు డిగ్రీ ప్రదానం చేస్తామన్నారు. అదే రోజున వర్సిటీ 11 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. -
వేద విద్యపై టీటీడీ శీతకన్ను
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: వేదాన్ని విశ్వవ్యాప్తం చేయడం, వేద విద్యను ప్రోత్సహించడం కోసం తిరుపతిలో శ్రీవెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని టీటీడీ ఏర్పాటు చేసిం ది. అనంతరం దీనిపై తగినంత శ్రద్ధ చూపకపోవడంతో ఏడాదిగా వీసీ పదవి ఖాళీగా ఉంది. విద్యార్థుల సంఖ్యా తగ్గుతోంది. ప్రస్తుతం దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశ్వరరావు ఇన్చార్జి వీసీగా పనిచేస్తున్నారు. ఎస్వీ యూనివర్సిటీకి వెనుక వైపున సుమారు 300 ఎకరాల్లో అందమైన భవనాల్లో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. వేద విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి దీనిని ప్రారంభించారు. ఈ యూనివర్సిటీకి తొలి వైస్ చాన్సలర్‌గా సుదర్శన శర్మ నియమితులై రెండు పర్యాయాలు పనిచేశారు. ఈయన నిరంకుశ ధోరణితో చాలామంది అధ్యాపకులు వెళ్లిపోయారు. సుదర్శన శర్మ పదవీకాలం 2013 జనవరి 4వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి రెగ్యులర్ వీసీ నియామకం జరగలేదు. అడ్మిషన్ల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతూ వస్తోం ది. ప్రస్తుతం ఏడాది కాలంగా వీసీ లేకపోవడంతో వేదిక్ విశ్వవిద్యాలయం తిరోగమనం పట్టింది. ఈ విశ్వవిద్యాల యంపై టీటీడీ యంత్రాంగం అంతగా శ్రద్ధ చూపడం లేదన్న ఆరోపణలున్నాయి. టీటీడీ చొరవచూపక పోవడం తో ఏడాదిగా వీసీ పదవి భర్తీకావడంలేదు. దీంతో వేదిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన లక్ష్యం దెబ్బతింటోంది. వీసీ పదవి ఎవరికి దక్కేనో.. వేదిక్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పదవికి పలువురు పోటీపడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు సంస్కృత వేద విశ్వవిద్యాలయాల నుంచి దరఖాస్తులు అందాయి. వేదిక్ యూనివర్సిటీ వీసీ భర్తీకోసం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీ ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లతో ప్యానల్ రూపొందించి ప్రభుత్వానికి నివేదించిం ది. వీరిలో ఒకరిని వీసీగా గవర్నర్ నియమించాల్సి ఉంది. సెర్చ్ కమిటీ ప్రతిపాదించిన పేర్లలో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠానికి చెందిన ప్రొఫెసర్ కేఈ. దేవనాధన్, రాజస్థాన్ సంస్కృత విశ్వవిద్యాలయ వీసీ ఆర్.దేవనాధన్, ఎస్వీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ఏ.హయగ్రీవశర్మ ఉన్నారు. వీరిలో కేఈ.దేవనాధన్కు మంచి అకడమిక్ రికార్డు ఉంది. అకడమిక్ పరంగా పలు పదవులను అలంకరించారు. ఆర్.దేవనాధన్ అడ్మినిస్ట్రేషన్ పరంగా వివిధ పదవుల్లో పనిచేశారు. ప్రస్తుతం రాజస్థాన్ సంస్కృత విశ్వవిద్యాలయం వీసీగా పనిచేస్తున్నారు. ఎస్వీయూలో సంస్కృత ప్రొఫెసర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన హయగ్రీవశర్మను వీసీగా నియమించాలని టీటీడీలో పనిచేస్తున్న కొందరు రిటైర్డ్ అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వేద విద్యపైన మంచి పట్టు ఉన్న కేఈ.దేవనాధన్కు వీసీ పదవి దక్కే అవకాశం ఉందని వర్సిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.