యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: వేదాన్ని విశ్వవ్యాప్తం చేయడం, వేద విద్యను ప్రోత్సహించడం కోసం తిరుపతిలో శ్రీవెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని టీటీడీ ఏర్పాటు చేసిం ది. అనంతరం దీనిపై తగినంత శ్రద్ధ చూపకపోవడంతో ఏడాదిగా వీసీ పదవి ఖాళీగా ఉంది. విద్యార్థుల సంఖ్యా తగ్గుతోంది. ప్రస్తుతం దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశ్వరరావు ఇన్‌చార్జి వీసీగా పనిచేస్తున్నారు. ఎస్వీ యూనివర్సిటీకి వెనుక వైపున సుమారు 300 ఎకరాల్లో అందమైన భవనాల్లో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. వేద విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి దీనిని ప్రారంభించారు.
ఈ యూనివర్సిటీకి తొలి వైస్ చాన్సలర్‌గా సుదర్శన శర్మ నియమితులై రెండు పర్యాయాలు పనిచేశారు. ఈయన నిరంకుశ ధోరణితో చాలామంది అధ్యాపకులు వెళ్లిపోయారు. సుదర్శన శర్మ పదవీకాలం 2013 జనవరి 4వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి రెగ్యులర్ వీసీ నియామకం జరగలేదు. అడ్మిషన్ల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతూ వస్తోం ది. ప్రస్తుతం ఏడాది కాలంగా వీసీ లేకపోవడంతో వేదిక్ విశ్వవిద్యాలయం తిరోగమనం పట్టింది. ఈ విశ్వవిద్యాల యంపై టీటీడీ యంత్రాంగం అంతగా శ్రద్ధ చూపడం లేదన్న ఆరోపణలున్నాయి. టీటీడీ చొరవచూపక పోవడం తో ఏడాదిగా వీసీ పదవి భర్తీకావడంలేదు. దీంతో వేదిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన లక్ష్యం దెబ్బతింటోంది.
వీసీ పదవి ఎవరికి దక్కేనో..
వేదిక్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పదవికి పలువురు పోటీపడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు సంస్కృత వేద విశ్వవిద్యాలయాల నుంచి దరఖాస్తులు అందాయి. వేదిక్ యూనివర్సిటీ వీసీ భర్తీకోసం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీ ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లతో ప్యానల్ రూపొందించి ప్రభుత్వానికి నివేదించిం ది. వీరిలో ఒకరిని వీసీగా గవర్నర్ నియమించాల్సి ఉంది. సెర్చ్ కమిటీ ప్రతిపాదించిన పేర్లలో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠానికి చెందిన ప్రొఫెసర్ కేఈ. దేవనాధన్, రాజస్థాన్ సంస్కృత విశ్వవిద్యాలయ వీసీ ఆర్.దేవనాధన్, ఎస్వీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ఏ.హయగ్రీవశర్మ ఉన్నారు. వీరిలో కేఈ.దేవనాధన్‌కు మంచి అకడమిక్ రికార్డు ఉంది. అకడమిక్ పరంగా పలు పదవులను అలంకరించారు.
ఆర్.దేవనాధన్ అడ్మినిస్ట్రేషన్ పరంగా వివిధ పదవుల్లో పనిచేశారు. ప్రస్తుతం రాజస్థాన్ సంస్కృత విశ్వవిద్యాలయం వీసీగా పనిచేస్తున్నారు. ఎస్వీయూలో సంస్కృత ప్రొఫెసర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన హయగ్రీవశర్మను వీసీగా నియమించాలని టీటీడీలో పనిచేస్తున్న కొందరు రిటైర్డ్ అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వేద విద్యపైన మంచి పట్టు ఉన్న కేఈ.దేవనాధన్‌కు వీసీ పదవి దక్కే అవకాశం ఉందని వర్సిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
వేద విద్యపై టీటీడీ శీతకన్ను
Published Thu, Jan 2 2014 6:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement
Advertisement