Venkateswara Rao
-
శిలాశాసనులు ఈ తండ్రీకొడుకులు
తెనాలి: శిలాశాసనులీ తండ్రీ కొడుకులు...వారసత్వంగా వస్తున్న శిల్పకళను ఏడుతరాలుగా కొనసాగిస్తున్న సృజనకారులు. ఫైబర్, కాంస్యం, ఐరన్‌స్క్రాప్, త్రీడీ విగ్రహాలతో తమ సృజనకు టెక్నాజలీని జోడిస్తున్నారు. వైవిధ్యమైన శిల్పాలను రూపొందిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని గడిస్తున్నారు. ఆ క్రమంలో భారత రాజ్యాంగ ఆమోద వజ్రోత్సవాల వేళ ‘భారతరత్న’ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలతో ప్రదర్శన ఏర్పాటుచేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌తో సహా పలు రికార్డుల సాధనకు ప్రయత్నిస్తున్నారు.తెనాలికి చెందిన సూర్య శిల్పశాల అధినేత కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు రవిచంద్ర, శ్రీహర్షలు శిల్పకళను కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. ఫైబర్, కాంస్య విగ్రహాలతో కాటూరి వెంకటేశ్వరరావు రాణిస్తుంటే, కోల్‌కతాలో ఫైనార్ట్స్‌లో పీజీ చేసిన కొడుకు రవిచంద్ర ఆ కళకు మరింత వన్నెలు తెస్తున్నారు. ఇనుప వ్యర్థ్యాలతో భారీ విగ్రహాలను తయారుచేస్తూ దేశవిదేశీయులను ఆకర్షిస్తున్నారు. అతడి సోదరుడు శ్రీహర్ష త్రీడీ టెక్నాలజీలో అతి సూక్ష్మ విగ్రహాల్నుంచి భారీ విగ్రహాల వరకు తీర్చిదిద్దుతున్నారు. వీరి విగ్రహాలు దేశంలోని అనేక నగరాల్లో ప్రతిష్టకు నోచుకోవటమే కాకుండా, విదేశాల్లోనూ కొలువుదీరాయి. తమ విగ్రహాలతో తెనాలిలో కాటూరి ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటుచేసి, తమ కళానైపుణ్యాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నారు.ప్రస్తుతం భారత రాజ్యాంగ ఆమోద వజ్రోత్సవాలను దేశమంతటా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలతో ప్రదర్శన నిర్వహించాలని తలపోశారు. అనుకున్నదే తడవుగా గత కొద్దినెలలుగా తీవ్రంగా శ్రమించారు. యాభై విగ్రహాలతో కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనను బుధవారం సాయంత్రం ఏర్పాటుచేశారు. ఫైబర్, కాంస్య విగ్రహాలు రకరకాల సైజుల్లో ఇందులో కొలువుదీర్చారు. అడుగు ఎత్తు నుంచి 30 అడుగు ఎత్తు వరకు అంబేడ్కర్ విగ్రహాలను ఇందులో చేర్చారు. వీటిలో అడుగు ఎత్తులో ఉన్న బస్ట్ సైజువి త్రీడీ టెక్నాలజీతో రూపొందించారు. వీటితోపాటు కుర్చీలో కూర్చున్న భంగిమ నుంచి నిలుచున్న విగ్రహాలూ రకరకాల సైజుల్లో ఈ ప్రదర్శనలో చోటుచేసుకుని చూపరులను ఆకర్షిస్తున్నాయి. తమ శిల్పకళా నైపుణ్యానికి కాటూరి శిల్పకారులు అభినందనలు అందుకుంటున్నారు.సూర్య శిల్పశాలతో విగ్రహాల రూపకల్పనలో కొనసాగుతున్న కాంటూరి వెంకటేశ్వరరావు ఆ వంశంలో ఆరోతరం వారు. ఏడోతరానికి చెందిన ఆయన ఇద్దరు కుమారులూ, వారసత్వంగా వస్తున్న శిల్పకళనే వృత్తిగా చేసుకోవటం విశేషం! వెంకటేశ్వరరావు తాత చంద్రయ్య సిమెంటు విగ్రహాలు, దేవాలయాల నిర్మాణం, దేవతా విగ్రహాలను తయారుచేసేవారు. తండ్రి కోటేశ్వరరావు రాజకీయ నేతల విగ్రహాలను కేవలం సిమెంటుతోనే చేసేవారు. వెంకటేశ్వరరావు ఆ విగ్రహాలతోనే ఆరంభించి, తన సృజనతో ఫైబర్, కాంస్య విగ్రహాల తయారీని ఆరంభించారు. కొడుకులు అందివచ్చాక నైపుణ్యం పెరిగింది. ఐరన్‌స్క్రాప్ వ్యర్థాలతో భారీ విగ్రహాలను తయారుచేస్తూ రవిచంద్ర, త్రీడీ టెక్నాజీలతో శ్రీహర్షలు తమ శిల్పకళకు ఆధునిక హంగులు అద్దారు. అంతర్జాతీయ గుర్తింపును సాధిస్తున్నారు. తాజా ప్రదర్శనలో ఉంచిన శిల్పాల్లో అధికశాతం హ్యాండ్వర్క్తోనే చేశారు. ఇందుకోసం 50 మందికిపైగా వర్కర్లతో 5–6 నెలలుగా కృషిచేసినట్టు చెబుతున్నారు.గిన్నిస్ బుక్ రికార్డు కోసం...– కాటూరి వెంకటేశ్వరరావు, శిల్పకారుడుశిల్పకళలో తెనాలి ఖ్యాతిని ఇనుమడింపజేయటం...గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాలనే ప్రయత్నంతోనే ఈ ప్రదర్శన ఆరంభించాం. వీడియోలు, ఫొటోలు పంపాం. పరిశీలిస్తున్నట్టు సమాచారం పంపారు. అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ ఆఫ్ రికార్డ్స్ వారు తమ సంసిద్ధతను తెలియజేశారు. త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాం. -
బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నిర్దేశించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ (ప్రత్యేక) కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావు ఈ కమి షన్‌కు చైర్మన్‌గా వ్యవ హరిస్తారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యం, రిజర్వేషన్లలో లోటుపాట్లు, ఇతర అంశాలపై కమిషన్ సమగ్ర విచారణ చేపట్టనుంది. రాజ్యాంగంలో ని నిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నెలరోజుల్లో నివేదిక సమరి్పంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఉత్తర్వులుజారీ చేశారు. బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్య దర్శి బి.సైదులు ఈ కమిషన్‌కు కార్యదర్శిగా వ్యవహరిస్తూ సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యాయస్థానం ఆదేశాలకు కట్టుబడి.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సెపె్టంబర్ 6వ తేదీన జి.నిరంజన్ చైర్మన్‌గా బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అధ్యయనం కోసం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కానీ రాజ్యాంగ నిబంధనలకు లోబడి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ల అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో ఆదివారం తన నివాసంలో లోతుగా చర్చించి ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ సమాచారాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి తాజాగా ఏర్పాటైన ప్రత్యేక కమిషన్ అధ్యయనం పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించే క్రమంలో గతంలో నియమించిన బీసీ కమిషన్లు సేకరించిన సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కమిషన్లు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలు, ప్రముఖులు, కీలక వ్యక్తుల నుంచి సమాచారం సేకరించడంతో పాటు గణాంకాలు తీసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. అవసరాన్ని బట్టి నిపుణులు, పరిశోధకులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, అధ్యయనానికి సంబంధించి పర్యటనలు చేపట్టవచ్చని, పరిశోధన సంస్థల నుంచి సమాచారం తీసుకోవచ్చని తెలిపింది. డెడికేటెడ్ కమిషన్‌కు అవసరమైన సిబ్బంది, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. వివిధ శాఖల్లో విశేష సేవలు వెనుకబడిన తరగతులకు చెందిన బూసాని వెంకటేశ్వరరావు బీఈ (ఎలక్ట్రానిక్స్), ఎంఈ (సాలిడ్ స్టేట్ ఎల్రక్టానిక్స్), ఎల్ఎల్బీ చదివారు. ఈయన 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 1987లో గ్రూప్–1 (స్టేట్ సివిల్ సరీ్వసు) టాపర్‌గా నిలిచి ప్రభుత్వ అధికారిగా ప్రస్థానం ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో విజయనగరం జిల్లా కలెక్టర్‌గా, పర్సనల్ అడ్మిని్రస్టేషన్ అండ్ వెల్ఫేర్ విభాగం డైరెక్టర్‌గా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యదర్శిగా, ఏపీ హ్యాండీక్రాఫ్టŠస్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీసీఎండీగా, రెవెన్యూ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా, మత్స్య శాఖ కమిషనర్‌గా, జీఏడీ (సర్వీసెస్–హెచ్ఆర్ఎం) కార్యదర్శిగా, చివరిగా తెలంగాణ ప్రభుత్వంలో రెవెన్యూ(డిజాస్టర్ మేనేజ్మెంట్) విభాగం ముఖ్య కార్యదర్శిగా సేవలందించి 2019 డిసెంబర్–31న పదవీ విరమణ పొందారు. -
పందెం కోళ్లను ఈతకు తీసుకెళ్లి..తండ్రీ, ఇద్దరు కొడుకులు మృతి
పెదవేగి : పందెం కోళ్ల పెంపకం సరదా ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. వాటికి ఈతలో శిక్షణను ఇద్దామనుకున్న ఆ తండ్రీ కొడుకులు ప్రమాదవశాత్తూ కాల్వలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వగుంటలో చోటుచేసుకున్న ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. కవ్వగుంట గ్రామానికి చెందిన శెట్టిపల్లి వెంకటేశ్వరరావు (45) రైతు. సంక్రాంతికి ఏలూరు జిల్లా కోడిపందేలకు ప్రసిద్ధి. దీంతో వెంకటేశ్వరరావు తన పందెం కోళ్లను తన వ్యవసాయ క్షేత్రంలో పెంచుతున్నాడు. వాటికి శిక్షణలో భాగంగా ఈతకూ తీసుకెళ్తుంటారు. దీంతో తమకు సమీపంలో ఉన్న పోలవరం కుడికాలువలో ఈత శిక్షణ ఇచ్చేందుకు వాటిని తీసుకువెళ్లాడు. వెంకటేశ్వరరావుతోపాటుగా అతని ఇద్దరు కుమారులు శెట్టిపల్లి మణికంఠ (16), శెట్టిపల్లి సాయి (14)లు సైతం తోడుగా వెళ్లారు. కాలువలో లోతును గ్రహించని ముగ్గురూ కాలువలో ఉన్నపళంగా మునిగిపోయారు. ఈత రాకపోవడంతో వారు ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకునేలోపే వారు మృతిచెందారు. సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై రాజేంద్రప్రసాద్ ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందం, స్థానికుల సాయం మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పండగ సమయంలో ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకులు చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. భర్త, ఇద్దరు కుమారులు విగత జీవులుగా కళ్లముందు కనిపించడంతో భార్య దేవి, ఇతర కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. -
ఆడబిడ్డలపై ఆగని అఘాయిత్యాలు
ప్రత్తిపాడు/ఫిరంగిపురం/టి.నరసాపురం: బాలికలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో ఒకేరోజు రెండు కేసులు.. ఏలూరు జిల్లాలో ఓ కేసు నమోదైంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు గ్రామానికి చెందిన దళిత బాలిక (13) నడింపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతుంది. ఈ నెల 12న అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గండికోట వెంకటేశ్వరరావు ఉరఫ్ వెంకట్ పాఠశాలకు సమీపంలోని పంట పొలాల్లోకి బాలికను తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మంగళవారం బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ చేసిన ఎస్ఐ రవీంద్ర వెంకట్‌పై పోక్సో యాక్ట్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంకట్‌ను అదుపులోకి తీసుకున్నారు.వేధింపులతో బాలిక ఆత్మహత్య ఫిరంగిపురం మండలంలో యువకుడి వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. సీఐ వీరేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (17) ఇంటి వద్ద ఉంటుంది. ఈమెకు కొన్నాళ్ల కిందట బంధువుల అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో బాలిక తన బంధువులతో ఫిరంగిపురం తిరునాళ్లకు వచ్చింది.ఆ సమయంలో ఆ యువకుడు తన మిత్రులతో వెళ్లి బాలిక గురించి అసభ్యంగా మాట్లాడటంతో బాలిక తండ్రి యువకుడిని మందలించాడు. ఆ యువకుడు మరికొంతమందితో ఆ గ్రామానికి వెళ్లి బాలిక తండ్రిపై దాడి చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక పురుగుమందు తాగింది. ఆమెను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు బంధువులు తరలించగా..చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు యువకుడితో పాటు మరికొంతమందిపై మంగళవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా, బాలికను వేధిస్తున్న యువకుడు ఆదివారం అర్థరాత్రి ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.హోటల్ గదిలో బంధించి లైంగిక దాడిబాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురు యువకులపై టి.నరసాపురం పోలీసులు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు మంగళవారం మీడియాకు తెలిపారు. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలంలోని బొర్రంపాలేనికి చెందిన బాలిక (16) జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఈ నెల 6న బాలిక అదృశ్యం కావడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యం కేసు దర్యాప్తు దర్యాప్తు జరుగుతుండగానే బాలిక ఈ నెల 15న టి.నరసాపురం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తనపై లైంగిక దాడి జరిగిందని, దీనికి నలుగురు యువకులు బాధ్యులని చెప్పి ఫిర్యాదు చేసింది. దీంతో అదృశ్యం కేసును పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మార్పు చేశారు. ఆమె ఫిర్యాదు వివరాలను పోలీసులు వెల్లడిస్తూ.. బాలిక హైసూ్కల్లో చదువుతున్న సమయంలోనే గ్రామానికి చెందిన యువకుడు (20) ప్రేమిస్తున్నానని వెంటపడుతూ ఆమెను వేధించేవాడని తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆమెను జంగారెడ్డిగూడెంలోని ఓ హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. ఆ హాస్టల్ నుంచే బాలిక ప్రైవేట్ కళాశాలలో విద్యను అభ్యసిస్తోంది. ఈ క్రమంలో ఇంటికి వచ్చిన బాలిక ఈ నెల 6 నుంచి కనిపించలేదు. ప్రేమిస్తున్నానన్న యువకుడికి మరో ముగ్గురు యువకులు సహకరించడంతో..వారంతా కలిసి బాలికను కిడ్నాప్ చేసి విశాఖకు తీసుకువెళ్లారు. అక్కడ ఓ హోటల్ గదిలో బాలికను బంధించిన యువకుడు ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. -
ఆ ముగ్గురు అధికారులపై వెంటనే నిర్ణయం తీసుకోండి
సాక్షి, అమరావతి: మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అధికార విధుల నుంచి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్ త్రిపాఠీ, ఎస్పీ మలికా గార్గ్, కారెంపూడి ఇన్స్పెక్టర్ నారాయణ స్వామిని దూరంగా ఉంచేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమర్పించిన వినతిపత్రంపై రేపటికల్లా (శుక్రవారంలోగా) నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ పోలీసు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున, పిన్నెల్లి వినతిపై వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ధర్మాసనం స్పష్టంచేసింది.త్రిపాఠీ, గార్గ్, నారాయణ స్వామిలపై చర్యలు తీసుకోవాలని, వారు పని చేస్తున్న స్థానాల నుంచి మార్చాలంటూ తానిచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోకపోవడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురించి పిన్నెల్లి తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి గురువారం కోర్టు విచారణ మొదలు కాగానే న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ధర్మాసనం ముందు ప్రస్తావించారు.లంచ్‌మోషన్ రూపంలో అత్యవసర విచారణకు అభ్యర్థించారు. లంచ్‌మోషన్ అవసరం లేదని ధర్మాసనం మొదట చెప్పింది. అయితే నిరంజన్‌రెడ్డి అత్యవసరాన్ని వివరించారు. ఈ ముగ్గురు అధికారులు పిన్నెల్లికి వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన్ని కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా చేసేందుకు కోర్టుకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. ఈవీఎంల కేసులో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తరువాత తిరిగి హత్యాయత్నం కేసులు పెట్టిన విషయాన్ని వివరించారు.ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న ఈ అధికారులను పిటిషనర్‌పై నమోదు చేసిన కేసుల దర్యాప్తు నుంచి దూరంగా ఉంచాలన్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు వారిని విధుల నుంచి దూరంగా ఉంచితే సరిపోతుందని వివరించారు. దీంతో ధర్మాసనం లంచ్‌మోషన్ ద్వారా అత్యవసర విచారణకు అనుమతినిచ్చింది.ఏబీ వెంకటేశ్వరరావు చెప్పినట్లే ఐజీ చేస్తున్నారుగురువారం సాయంత్రం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, పిన్నెల్లి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఐజీ త్రిపాఠీ, ఇన్స్పెక్టర్ నారాయణస్వామిలపైనే తమకు అభ్యంతరం ఉందన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సర్వశ్రేష్ట త్రిపాఠీ అత్యంత సన్నిహిత మిత్రుడుని, ఆయన చెప్పినట్లే చేస్తున్నారని తెలిపారు. అలాగే నారాయణ స్వామి ఓ పార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పారు.వీరిద్దరూ పిన్నెల్లి పట్ల దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ తప్పుడు కేసులతో వేధిస్తున్నారని, కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఈ నెల 4 వరకు పిటిషనర్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా, ఆ కేసుల దర్యాప్తులో వీరు భాగం కాకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎన్నికల సంఘం, పోలీసుల తీరును చూస్తుంటే రాష్ట్రంలో న్యాయ పాలన ఉందా అన్న సందేహం కలుగుతోందన్నారు. కోర్టు మాత్రమే తమకు రక్షణగా ఉందని, అందుకే మరోసారి కోర్టును ఆశ్రయించామని నిరంజన్‌రెడ్డి వివరించారు.ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పిన్నెల్లి వినతిపత్రంపై మీరేం చేస్తున్నారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. దీనికి ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ స్పందిస్తూ.. తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచిస్తానన్నారు. వినతిపత్రం తమకు ఇవ్వలేదని, డీజీపీకి ఇచ్చారని చెప్పారు. దీంతో ధర్మాసనం హోంశాఖ న్యాయవాదిని వివరణ కోరింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున డీజీపీ కూడా ఎన్నికల సంఘం పరిధిలోనే పని చేస్తుంటారని తెలిపారు. నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల సంఘమేనన్నారు.పిన్నెల్లి తన పిటిషన్లో కొందరు పోలీసు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశారని, అందువల్ల ఆయన వినతిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. రేపటికల్లా తగిన నిర్ణయం వెలువరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల ప్రధాన అధికారిని, డీజీపీని ఆదేశించింది. పిన్నెల్లి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని వినతి పత్రంగా పరిగణించాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. -
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దుపై పిటిషన్
-
‘ఏబీవీ’ అవినీతి నిజం
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుట్రల్లో భాగస్వామిగా ఉన్న అత్యంత వివాదాస్పద ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)కి ఉచ్చు బిగుసుకుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో చట్టాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా ఆయన చేసిన అవినీతి పాపం పండింది. చంద్రబాబుకు రాజకీయ లబ్ధి కలిగించేందుకు దేశ భద్రత చట్టాలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఆయన అవినీతికి పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ నిర్ధారించింది.ఏబీ వెంకటేశ్వరరావుపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఈ నెల 2న జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఏబీ వెంకటేశ్వరరావు అవినీతి వ్యవహారాలపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయన్ని సస్పెండ్ చేసింది. ఇప్పుడు కేంద్ర హోం శాఖ కూడా ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తునకు అనుమతించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలోనే సంచలనం సృష్టించిన ఈ వ్యవహారం కథ కమామిషు ఇదీ.. బాబు కుట్రల్లో భాగస్వామి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వంలో ఏబీ వెంకటేశ్వరరావు రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు వినియోగించాల్సిన నిఘా వ్యవస్థను ఆయన దురి్వనియోగం చేసి, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు కలిగించేందుకు అడ్డదారులు తొక్కారు. వైఎస్సార్సీపీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి టీడీపీలో చేరేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు.అంతేకాదు.. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలోని ఓటర్ల వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీకి చెందిన సేవా మిత్ర యాప్‌నకు అనుసంధానం చేసి, డేటా చౌర్యానికి పన్నిన పన్నాగంలోనూ ప్రధాన పాత్రధారిగా మారారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి అడ్డదారిలో విజయం చేకూర్చాలన్న కుట్రల్లో కీలకంగా వ్యవహరించారు. అందుకోసం వైఎస్సార్సీపీ కీలక నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయాలన్న చంద్రబాబు ఆదేశాలతో పకడ్బందీ పన్నాగం పన్నారు. ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కొనుగోలు కుట్ర వైఎస్సార్సీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు కొనాలని ఇంటెలిజెన్స్ చీఫ్ హోదాలో ఏబీ వెంకటేశ్వరరావు నిర్ణయించారు. ఇందుకోసం నిబంధనలను ఉల్లంఘించారు. నిఘా పరికరాలు కొనుగోలుకు ముందుగా కేంద్ర రక్షణ శాఖ అనుమతి తప్పనిసరి. కానీ కేంద్ర రక్షణ, హోం శాఖలకు తెలియకుండానే ఈ వ్యవహారాన్ని ముగించాలని ఆయన నిర్ణయించారు. రాష్ట్ర పోలీసు శాఖ ఆధునీకరణ ముసుగులో మానవ రహిత వాహనం (యూఏవీ), ఏరో్రస్టాట్ పరికరాలు, ఇతర నిఘా పరికరాలను రూ.25.50 కోట్లతో కొనాలని నిర్ణయించారు.ఈ వ్యవహారంలోనూ ఆయన కుమారుడు చేతన సాయి కృష్ణ కంపెనీకి టెండరు కట్టబెట్టడం ద్వారా అవినీతికి తెరలేపారు. ఏబీవీ కుమారుడు చేతన సాయి కృష్ణ, అతని స్నేహితుడు భాగస్వామిగా 2017 జులై 11న ఆకాశ్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని విజయవాడలో ఏర్పాటు చేశారు. అనంతరం ఇజ్రాయెల్‌కు చెందిన ఆర్టీ ఇన్‌ఫ్లేమబుల్ ఆబ్జెక్ట్ లిమిటెడ్ (ఆర్టీఎల్టీఏ) అనే కంపెనీ ద్వారా నిఘా పరికరాలు కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు.అనంతరం 2017 డిసెంబర్ 19న ఆర్టీఎల్టీఏ కంపెనీ భారత్‌లో తమ ప్రతినిధిగా ఏబీవీ కుమారుడు చేతన సాయికృష్ణను నియమించడం గమనార్హం. అంటే ఏఆర్టీఎల్టీఏ కంపెనీ ముసుగులో ఏబీ వెంకటేశ్వరావు తన కుమారుడి కంపెనీకి టెండర్లు కట్టబెట్టాలని పథకాన్ని పక్కాగా అమలు చేశారు. అందుకోసం టెండర్ నిబంధనలను ఉల్లంఘించారు. కచి్చతంగా అవినీతి దందానే అని నిర్ధారించిన సీవీసీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం పూర్తిగా వెలుగులోకి వచ్చింది. దేశ భద్రతకు మప్పు కలిగించే అవకాశం ఉన్న నిఘా పరికరాలను కేంద్ర రక్షణ శాఖ అనుమతి లేకుండా కొనడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అవినీతి నిరోధక చట్టాన్ని కూడా ఉల్లంఘించిన ఏబీవీపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఆయన్ని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. ఐపీఎస్ అధికారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటే కేంద్ర హోం శాఖ అనుమతి తీసుకోవాలి.అందుకే నిఘా పరికరాల కొనుగోలులో ఏబీ వెంకటేశ్వరావు అవినీతిపై కేంద్ర హోం శాఖ అనుమతి కోరుతూ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ నివేదికను కేంద్ర హోం శాఖ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) పరిశీలనకు పంపింది. ఆ వ్యవహారాన్ని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించింది. ఏబీ వెంకటేశ్వరరావు అవినీతికి పాల్పడినట్టు నిర్ధారించి, ఆయనపై చర్యలు తీసుకునేందుకు అనుమతించాలని పేర్కొంటూ ఈ ఏడాది ఏప్రిల్ 15న కేంద్ర హోం శాఖకు నివేదించింది. అంటే ఆయన అవినీతికి పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలున్నాయని నిరూపితమైంది.దాంతో ఏబీ వెంకటేశ్వరరావుపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1)(ఎ), రెడ్ విత్ సెక్షన్ 15, 7(ఎ) కింద కేసు నమోదు చేసేందుకు కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. ఆయనపై ఏసీబీ త్వరలోనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఏబీవీకి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశించే అవకాశాలున్నాయని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. -
కొత్త గ్రూపులకు ‘సారథి’!
నూజివీడు: ఇంకా టీడీపీలో చేరనేలేదు... ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించలేదు... టికెట్ ఇస్తామని ప్రకటించలేదు... కానీ, అప్పుడే కొలుసు పార్థసారథి నూజివీడులో గ్రూపు రాజకీయాలు మొదలు పెట్టారు. దీంతో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వర్గం మండిపడుతోంది. ఇప్పటికే ఇక్కడ టీడీపీలో ఉన్న గ్రూపుల గోల సరిపోదన్నట్లు... పార్థసారథి రాకముందే మరో కొత్త గ్రూపును తయారు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మొదట ప్రగల్బాలు.. చివరకు సొంత సామాజికవర్గ నేతకు ఎసరు గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పెనమలూరు నియోజకవర్గం నుంచి కొలుసు పార్థసారథి పోటీ చేసి విజయం సాధించారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ పెనమలూరు నుంచి సీటు ఇవ్వడం సాధ్యం కాదని, ప్రత్యామ్నాయం ఆలోచిద్దామని వైఎస్సార్సీపీ అధిష్టానం పార్థసారథికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. ఇందుకు ఆయన అంగీకరించకుండా తాను పెనమలూరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. అదే సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును రహస్యంగా కలిసి ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. కానీ, అక్కడ టీడీపీ ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అడ్డం తిరగడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. పెనమలూరు తనకు కావాల్సిందేనని బోడే ప్రసాద్ గట్టిగా పట్టుపట్టారని, బీసీ నేత ముద్దరబోయిన అయితే మౌనంగా వెళ్లిపోతారని పార్థసారథిని నూజివీడు నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించినట్లు ప్రచారం సాగుతోంది. చివరకు తాను పెనమలూరు నుంచే పోటీ చేసి గెలుస్తానని ప్రగల్బాలు పలికిన పార్థసారథి కూడా అస్త్రసన్యాసం చేశారు. పెనమలూరులో బోడే ప్రసాద్‌ను తప్పించి తనకు సీటు ఇవ్వాలని చంద్రబాబును అడిగే ధైర్యం చేయలేక నూజివీడు వచ్చి పదేళ్లుగా టీడీపీని నమ్ముకుని ఉన్న తన సొంత సామాజికవర్గ నేతకు అన్యాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ముద్దరబోయిన ఫొటోల తొలగింపు నూజివీడు మండలం రావిచర్లలోని ఓ టీడీపీ నాయకుడి ఇంట్లో బుధవారం జరిగే శుభకార్యానికి పార్థసారథి హాజరుకానున్నట్లు తెలిసింది. ఆయనకు స్వాగతం పలుకుతూ మంగళవారం నూజివీడు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిలో ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఫొటో కూడా ఉంది. పార్థసారథి కనీసం టీడీపీలో చేరకుండానే ఆయనకు స్వాగతం పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ముద్దరబోయిన వర్గం కంగుతింది. దీనిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యక్తిని వారు నిలదీయగా.. తనకు ఇద్దరు నాయకులు కావాలని, అందుకే ఇద్దరి ఫొటోలు వేశానని అతను చెప్పినట్టు సమాచారం. ఇద్దరి ఫొటోలు ఉండటానికి వీల్లేదని ముద్దరబోయిన వర్గం స్పష్టం చేసింది. ముద్దరబోయిన ఫొటోను తీసేయాలని, లేకపోతే తామే తమ నాయకుడి ఫొటోను తొలగిస్తామని హెచ్చరించింది. ఆ తర్వాత ఫ్లెక్సీలపై ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఫొటోను వారే కట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం నూజివీడులో హాట్ టాపిక్‌గా మారింది. పార్థసారథి అధికారికంగా టీడీపీలోకి రాకముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఈ గ్రూపుల గోల మరింత పెరిగే అవకాశం ఉందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పదేళ్ల నుంచి పార్టీ ఇన్చార్జిగా ఉన్న నేతను అధిష్టానం విస్మరించడం, మరోసారి వలస నేతను తీసుకురావడం, ఆయన మరో కొత్త వర్గాన్ని తయారు చేసుకునే పని ప్రారంభించడంపై నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్ నాయకులు సైతం మండిపడుతున్నారు. నియోజకవర్గంలో గ్రూపుల గోల వల్ల ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఓడిపోయామని, తాజా పరిణామాలు కూడా రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
ఇల్లెందులో వీగిన అవిశ్వాసం
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై కొందరు కౌన్సిలర్లు ప్రతిపాదించిన అవిశ్వాసం వీగిపోయింది. సమావేశానికి త గిన కోరం లేనందున అవిశ్వాసం వీగిపోయినట్టుగా ఎన్నిక ల అధికారిగా వ్యవహరించిన కొత్తగూడెం ఆర్డీఓ శిరీష ప్రక టించారు. కౌన్సిలర్ల అవిశ్వాసం నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఈవో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మొత్తం 24 మంది కౌన్సి లర్లకు గాను కోరం సరిపోవాలంటే 17 మంది హాజరు కావా ల్సి ఉంది. అయితే సమావేశ సమయానికి ఇద్దరు తక్కువగా 15 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో కొంత సమయం ఇస్తూ సమావేశం వాయిదా వేశారు. తర్వాత 12 గంటలకు మరోమారు సమావేశపర్చగా అప్పటికీ 15 మంది మాత్రమే ఉండడంతో కోరం లేదని ఈవో ప్రకటించారు.17 మంది రాత్రికే చేరుకున్నా..: అవిశ్వాస పరీక్ష నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న పెన్షనర్ భవన్ లోకి ఆదివారం రాత్రికే 17 మంది కౌన్సిలర్లు చేరుకున్నారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో వారంతా మున్సిపల్ కార్యాలయంలోకి పరుగులు తీశారు. అయితే మున్సిపల్ కార్యాలయం ఎదుట వేచి ఉన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ వారిని గమనించారు. కొక్కు నాగేశ్వరరావు అనే కౌన్సిలర్‌ను కాంగ్రెస్ శ్రేణులు ఎత్తుకుని ఎదురుగా ఉన్న ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్లి, వెనుక నుంచి రోడ్డుపైకి తీసుకెళ్లి అప్పటికే సిద్ధంగా ఉంచిన ఓ కారులో హైదరాబాద్‌కు తరలించారు. ఇదే క్రమంలో పెన్షనర్ భవన్లో దాక్కుని ఉన్న సీపీఐ కౌన్సిలర్ కుమ్మరి రవీందర్ బయటకు రాగానే కాంగ్రెస్, దాని మిత్రపక్ష సీపీఐ శ్రేణులు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అడ్డుకుని విడిపించారు. అయితే అప్పటికే మున్సిపాలిటీలో తమ సభ్యుడి కోసం కాచుకుని కూర్చున్న సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా రవీందర్‌తో మాట్లాడటంతో ఆయన కార్యాలయం వెనుక గోడ దూకి పారిపోయారు. ఇలా ఇద్దరు సభ్యులు తక్కువ కావడంతో కోరం చాలక అవిశ్వాసం వీగిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులతో బీఆర్ఎస్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తదితరులు వాగ్వాదానికి దిగారు. గంట పాటు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యే కోరం కనకయ్య, చైర్మన్ వెంకటేశ్వరావుపై ఫిర్యాదు చేశారు. కోరం కనకయ్యపై కేసు నమోదు తన భర్తను కిడ్నాప్ చేశారంటూ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొక్కు నాగేశ్వరరావు సతీమణి వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు 17 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. ఎంపీపీ నాగరత్నమ్మ, ఆమె భర్త జానీ తదితరులపై కేసు నమోదైందని వివరించారు. -
బాబు నన్ను వాడుకొని వదిలేసాడు..మోసాలను దగ్గరనుండి చూసినవాడిని
-
వధూవరులకు సీఎం జగన్ ఆశీస్సులు
సాక్షి, అమరావతి/కంకిపాడు: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) మేనకోడలు వివాహ వేడుకలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. కోనేరు లీలాప్రసాద్, రాజ్యలక్ష్మి విజయ చాముండేశ్వరిదేవి కుమార్తె డాక్టర్ స్నేహ, డాక్టర్ అనురాగ్ దీపక్‌ల వివాహం గురువారం కృష్ణా జిల్లా కంకిపాడులోని అయాన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఈ వేడుకకు హాజరైన సీఎం వైఎస్ జగన్ నూతన వధూవరులకు ఆశీస్సులు అందించారు. ఈ వేడుకలో మంత్రి జోగి రమేశ్, కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ జాషువా, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, కైలే అనిల్‌కుమార్, దూలం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అఫిడవిట్లో అలసత్వం వద్దు
తాము ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవడం ఓటర్ల హక్కుగా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అందువల్లే పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పులు, ఉన్న కేసులు, జైలు జీవితం అనుభవిస్తే ఆ వివరాలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు, కుటుంబ సభ్యుల వివరాలన్నీ నామినేషన్ సందర్భంగా లిఖితపూర్వకంగా ఎన్నికల అధికారికి తెలపాలని పేర్కొంది. అయితే కొందరు అభ్యర్థులు అఫిడవిట్లో అన్ని వివరాలు తెలపడంలో అవలంబిస్తున్న నిర్లక్ష్యంపై సుప్రీం కోర్టులో కేసు దాఖలైంది. దీనిపై 2013లో న్యాయస్థానం తీర్పును వెలువరించింది. దాని ప్రకారం అఫిడవిట్లో ఏ ఒక్క కాలమ్‌ను నింప కుండా ఖాళీగా ఉంచవద్దంటూ పేర్కొంది. ఎవరైనా అభ్యర్థి పొరపాటున ఎక్కడైనా ఖాళీగా వదిలేస్తే దాన్ని పూర్తిగా నింపాలంటూ తేల్చి చెప్పింది. ఓటర్ల హక్కు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సతీమణి వనమా పద్మావతి పేరిట ఉన్న ఇన్నోవా వాహనంపై హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.135 ట్రాఫిక్ చలాన్ పెండింగ్‌లో ఉంది. ఆయన కుటుంబం పాల్వంచ మున్సిపాలిటీకి రూ.3,120 వాటర్ బిల్లు బకాయి ఉంది. వీటితో పాటు వివిధ ఆస్తులు, తనపై నమోదైన పోలీసు కేసుల వివరాలను 2018 ఎన్నికల్లో నామినేషన్ దాఖలు సందర్భంగా వనమా అఫిడవిట్లో పేర్కొనలేదు. పారదర్శకత పాటించడంలో విఫలమైనందున వనమా ఎన్నికను రద్దు చేయాలంటూ ఆయన ప్రత్యర్థి జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించి చుక్కలు చూపించారు. చిన్న ట్రాఫిక్ చలానాయే కదా అనే నిర్లక్ష్యం, ప్రజాజీవితంలో ఉన్నోళ్లపై పోలీసు కేసులు సహజమే అనే ఏమరుపాటు ఇబ్బంది తెచ్చి పెట్టగా కేసు ఇంకా సుప్రీంలో కొనసాగుతోంది. ప్రజా జీవితంలో ఉన్నోళ్లు ప్రతీ అంశాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందే. ఆస్తులు, అప్పులు, కేసుల వివరాల వెల్లడిలో అలసత్వముంటే ఇబ్బందులు ఎదురవుతాయనేందుకు వనమా ఉదంతం ఉదాహరణగా నిలుస్తోంది. వనమా తరహాలోనే నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో వివరాలను టాంపరింగ్ చేశారనే ఆరోపణలతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి సైతం న్యాయపరమైన చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. పత్రికా ప్రకటనలు అభ్యర్థులు తమపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను ప్రజలకు బహిరంగా తెలపాలనే నిబంధన సైతం 2013 నుంచి అమల్లోకి తెచ్చారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత పోలింగ్‌కు రెండు రోజుల ముందులోపు స్థానికంగా ఉన్న పేపర్లు/టీవీల్లో ప్రకటనల ద్వారా క్రిమినల్ కేసుల వివరాలను ప్రజలకు తెలపాల్సి ఉంటుంది. అది కూడా ఏ మూలనో కాకుండా ప్రముఖంగా కనిపించేలా మూడు సార్లు ప్రకటనలు ఇవ్వాలి. ఇలా ప్రజలకు అన్ని వివరాలను తెలియజేయకుండా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్టయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం –1951 ప్రకారం అనర్హతకు గురవుతారు. బీ ఫామ్ అందుకోగానే బీ ఫామ్ అందుకోవడమే ఆలస్యం నామినేషన్ దాఖలు చేయడం, ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడమే తరువాయి అనుకుంటే పొరపాటే. నామినేషన్ సందర్భంగా అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్ (లిఖిత వాంగ్మూలం) విషయంలో జాగ్రత్త పడకపోతే చిక్కులు తప్పవు. అక్కడ రాసే ప్రతీ అక్షరం, పొందు పరిచే ప్రతీ విషయం ఆ అభ్యర్థిని నీడలా వెంటాడుతాయి. ఏమైనా పొరపాట్లు జరిగితే ఎన్నిక రద్దవ్వడమే కాదు తదుపరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వీలుండదు. -
ఇంటికి వెళ్లినా గది నుంచి బయటకు రాలేదు!
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ బీఆర్ఎస్ లో అసమ్మతి చల్లారడం లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌కు మాజీ ఎమ్మెల్యే చందర్రావు ఇంట చేదు అనుభవం ఎదురైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్లీ టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చందర్రావుతో సర్దుబాటు చేసుకునేందుకు మల్లయ్యయాదవ్ గురువారం ఆయన ఇంటికి వెళ్లారు బొల్లం వెంట అనంతగిరి ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, మునగాల మండల నాయకులు సుంకర అజయ్‌కుమార్, తొగరు రమేశ్ తదితరులు ఉన్నారు. ఇంటిలోపలే ఉన్న చందర్రావు తన ఇంటికి ఎమ్మెల్యే బొల్లం వచ్చారని చెప్పినా గది నుంచి బయటికి రాలేదు. దీంతో హాల్లోనే ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ దాదాపు 20 నిమిషాలు ఎదురుచూశారు. అప్పటికీ చందర్రావు బయటికి రాకపోవడంతో వెనుదిరిగి వచ్చేశారు. -
హరిప్రియకు టికెట్ ఇవ్వొద్దు
ఇల్లెందు: ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియకు మరోమారు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వొద్దని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అధిష్టానాన్ని కోరారు. ఎమ్మెల్యే భర్త, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బానోతు హరిసింగ్ అరాచకాలు మితిమీరాయని, సెటిల్మెంట్లు, భూదందాలేకాక సొంత పార్టీ నేతలపైనే కేసులు నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో హరిప్రియకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా వారిని గెలిపించుకుంటామని అన్నారు. ఈ మేరకు శనివారంరాత్రి ఇల్లెందులోని మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు గృహంలో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఉన్న ఇల్లెందు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నేతలు సమావేశమయ్యారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ అ«ధికార ప్రతినిధి పులిగళ్ల మాధవరావు, ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, ఇల్లెందు, బయ్యారం సొసైటీల చైర్మన్లు మెట్ల కృష్ణ, మూల మధుకర్‌రెడ్డి, మహబూబాబాద్ జెడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు తండ్రి శ్రీకాంత్ తదితరులు మాట్లాడారు. ఇల్లెందులో ఎమ్మెల్యే భర్త తీరుతో బీఆర్ఎస్కు నష్టం చేకూరుతోందని తెలిపారు. గత ఐదేళ్లలో ఇల్లెందు అభివృద్ధి నిధులను ఇతర ప్రాంతాల కాంట్రాక్టర్లకు కట్టబెట్టి కమీషన్లు పొందారని ఆరోపించారు. మున్సిపల్ అధికారులను పక్కనబెట్టి పీఆర్ శాఖ ఇంజనీర్లతో సుమారు రూ.30 కోట్ల నిధులతో పనులు చేయించాలని ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీని కాపాడుకునేందుకు సీఎంను కలిసే అవకాశం తమకు లేనందున మీడియా ద్వారా ప్రజలు, సీఎం దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. అభ్యరి్ధని మారిస్తే తప్ప ఇల్లెందులో పార్టీ గెలిచే అవకాశం లేదని, అయితే, ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఆదేశాలను శిరసా వహిస్తామని స్పష్టం చేశారు. -
టాలీవుడ్లో విషాదం.. సీనియర్ ఎడిటర్ వెంకటేశ్వరరావు మృతి
సీనియర్ ఎడిటర్ పి. వెంకటేశ్వరరావు (72) చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆరు నెలలుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు రెండొందల చిత్రాలకు పైగా వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా వర్క్ చేశారు. ‘యుగంధర్’, ‘మొండిమొగుడు పెంకి పెళ్ళాం’, ‘కెప్టెన్ కృష్ణ’, ‘ఇద్దర అసాధ్యులే’ వంటి పలు హిట్ చిత్రాలకు ఎడిటర్‌గా చేశారు వెంకటేశ్వరరావు. ఆయన భార్య కొన్నేళ్ల క్రితం మరణించారు. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా వెంకటేశ్వరరావు మృతికి పలువురు సినీ ప్రముఖులు, తెలుగు ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోటగిరి వెంకటేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి మార్తాండ్ కె. వెంకటేష్ సంతాపం వ్యక్తం చేశారు. వెంకటేశ్వరరావు అంత్యక్రియలు ఈ నెల 22న చెన్నైలో జరుగుతాయి. -
విశాఖ కిడ్నాప్ కేసు: లవర్‌కు 40 లక్షలు పంపిన హేమంత్
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 48 గంటలపాటు ఎంపీ కుటుంబ సభ్యులకు కిడ్నాపర్లు నరకం చూపించారు. రూ.20 కోట్లు ఇవ్వాలంటూ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ)ను చిత్ర హింసలు పెట్టారు. ఈ వ్యవహారంపై పోలీసులు చేపట్టిన దర్యాప్తులో అనేక కీలక అంశాలు వెలుగు చూశాయి. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. భీమిలి ప్రాంతానికి చెందిన కోలా వెంకట హేమంత్ కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మధుసూదనరావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసిన కేసులో జైలుకు వెళ్లాడు. చోరీలు చేసే రాజేష్, ఇతర గ్యాంగ్‌తో అక్కడ అతనికి పరిచయం ఏర్పడింది. చిన్న చిన్న చోరీలు చేసే కంటే ఒకేసారి బిగ్‌షాట్‌ను కిడ్నాప్ చేస్తే సెటిల్ అయిపోవచ్చని హేమంత్ వారికి ఆశపెట్టాడు. టార్గెట్ ఎంపీ కుటుంబం బయటకు వెళ్లాక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయాలని నిర్ణయించారు. హేమంత్‌కుమార్, రాజేష్, సాయి, చిన్న సాయి, గోవర్ధన్, మరో వ్యక్తి కలిసి ఎంపీ కొత్త ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. ఇంట్లోకి చొరబడి ఎంపీ కుమారుడు శరత్‌పై దాడి చేశారు. కాళ్లు, చేతులు కట్టేశారు. శరత్‌తో ఫోన్ చేయించి సెక్యూరిటీ గార్డును పంపించేశారు. శరత్ ఒంటిపై ఉన్న బంగారం దోచుకున్నారు. మరుసటి రోజు ఉదయం శరత్‌తో ఫోన్ చేయించి ఒంట్లో బాగోలేదని చెప్పించి, తల్లి జ్యోతిని ఆ ఇంటికి రప్పించారు. ఆమె వద్ద ఉన్న బంగారాన్ని తీసుకుని, ఆమెనూ బంధించారు. అనంతరం ఎంపీ ఎంవీవీ స్నేహితుడు జీవీ వద్ద డబ్బులు ఉంటాయని భావించి అతనికి బలవంతంగా ఫోన్ చేయించి రప్పించారు. హేమంత్ రాజేష్‌లు అతడిపై దాడి చేసి.. చేతులు, కాళ్లు కట్టేశారు. కారు డ్రైవర్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఫోన్ చేయించారు. రూ.20 కోట్లు ఇస్తావా? లేదా ఇల్లు, స్థలం రాసిస్తావా? అసలు ఎందుకు తమను నిర్బంధించారని, ఏం కావాలో చెబితే ఇస్తామని జీవీ కిడ్నాపర్లకు చెప్పగా.. రూ.100 కోట్లు కావాలి ఇస్తావా? అని హేమంత్ ప్రశ్నించాడు. అంత డబ్బు ఉండదని, తమను వదిలేస్తే రూ.5 కోట్ల వరకు సమకూరుస్తామని చెప్పారు. దానికి హేమంత్ అంగీకరించలేదు. ఎవరికి ఫోన్ చేస్తే డబ్బులు వస్తాయో వారి పేర్లను హేమంత్కుమారే సూచించి, ఫోన్లు చేయించారు. ఇలా జీవీ రూ.కోటి వరకు సమకూర్చి డ్రైవర్ ద్వారా ఆ డబ్బు తెప్పించారు. వచ్చిన డబ్బులో హేమంత్‌కుమార్, రాజేష్‌లకు 40 శాతం చొప్పున, సాయికి 10 శాతం, ఇతర ఖర్చుల కోసం 10 శాతం పంపకాలు చేసుకున్నారు. శరత్ బ్యాంక్ అకౌంట్లో రూ.65 లక్షలు జీవీ అకౌంటెంట్ ద్వారా విత్‌డ్రా చేయించి తెప్పించుకున్నారు. వచ్చిన డబ్బులో రూ.21 లక్షలు బెయిల్ కోసం రాజేష్ అనే లాయర్‌కు పంపించారు. లవర్‌కు రూ.40 లక్షలు నజరానా హేమంత్‌కుమార్ తన వాటాలో వచ్చిన డబ్బులో రూ.40 లక్షలు తన లవర్ సుబ్బలక్ష్మికి ఇవ్వాలని భావించాడు. అయితే గతంలో చేసిన కిడ్నాప్ వ్యవహారంలో ఇతనితో పాటు సుబ్బలక్ష్మి కూడా జైలుకు వెళ్లింది. ఫలితంగా వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. రూ.40 లక్షలు ఇచ్చి మళ్లీ ఆమెకు దగ్గరవ్వాలని భావించాడు. నేరుగా డబ్బులు ఇస్తానంటే అంగీకరించదని జీవీతో ఫోన్ చేయించి.. రెండు గంటల సేపు మాట్లాడి ఒప్పించేలా చేశాడు. జీవీ కారు డ్రైవర్‌ను రప్పించి రూ.40 లక్షలు ఆమెకు అందేలా చేశారు. రెండు రోజుల పాటు కిడ్నాపర్లు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టారు. వారికి పెరుగన్నం పెట్టి, కిడ్నాపర్లు మాత్రం బిర్యానీ తినేవారు. రూ.20 కోట్లు ఇవ్వాలంటూ రాజేష్.. వారి చేతులపై కత్తితో కొడుతూ.. దుర్భాషలాడుతూ వారి చేతికి ఉన్న ఉంగరాలను లాక్కున్నాడు. డబ్బు లేదంటే ఎంపీ ఇల్లు, జీవీకి ఉన్న స్థలాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని హేమంత్ డిమాండ్ చేశాడు. శరత్‌ను డిక్కిలో కుక్కి.. ఫోన్ చేసినప్పుడు జీవీ పొంతన లేని సమాధానాలతో ఎంపీకి అనుమానం వచ్చింది. వెంటనే పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే పోలీసులు జీవీ నెంబర్‌కు వరుసగా ఫోన్ చేస్తుండటంతో.. అనుమానం వస్తుందని భావించిన కిడ్నాపర్లు ఫోన్లో మాట్లాడించారు. పోలీసులకు అనుమానం వచ్చినట్లు గ్రహించిన హేమంత్‌కుమార్ గ్యాంగ్ వెంటనే అక్కడి నుంచి శరత్ కారులోనే తప్పించుకోవాలని చూసింది. చేతులు, కాళ్లు కట్టేసి శరత్‌ను డిక్కీలో కుక్కారు. హేమంత్ కార్ డ్రైవ్ చేయగా ముందు సీట్లో రాజేష్ ఎక్కాడు. జ్యోతి, జీవీతో పాటు సాయి కూర్చున్నాడు. మధ్యలో వీరు తమ వద్ద ఉంటే ప్రమాదమని భావించిన హేమంత్‌కుమార్.. వారిని ఆనందపురం మండలంలో దించేశాడు. దీంతో జ్యోతి, జీవీలు జాతీయ రహదారి వరకు నడుచుకుంటూ వచ్చి ఆటో ఎక్కారు. అనంతరం కారు ఆపి మధ్యలోనే సాయి దిగిపారిపోయాడు. అంతలో పోలీసులు వారి కారును వెంబడించి హేమంత్, రాజేష్‌లను పట్టుకుని.. శరత్‌ను విడిపించిన విషయం తెలిసిందే. ముగ్గురి అరెస్ట్.. రూ.86.6 లక్షలు రికవరీ దొండపర్తి (విశాఖ దక్షిణ): ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటనలో ముగ్గురు కిడ్నాపర్లను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వాస్తవానికి గురువారమే కోలా వెంకట హేమంత్‌కుమార్, రాజేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా కిడ్నాప్‌లో పాల్గొన్న వారి వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం శుక్రవారం గాజువాకకు చెందిన సాయిని షీలానగర్ ప్రాంతంలో పట్టుకున్నారు. వీరి ముగ్గురి నుంచి రూ.86.6 లక్షలు రికవరీ చేశారు. ఈ ముగ్గురిని సాయంత్రం కేజీహెచ్‌కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. కాగా, మరో ముగ్గురు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. -
తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలో డీజీపీ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు 9 తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏసీబీ విభాగం టోల్‌ఫ్రీ నంబర్ 14400, ఏసీబీ యాప్ 14400లకు వచ్చిన ఫిర్యాదులపై స్పందించి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. బద్వేల్(వైఎస్సార్ జిల్లా), తిరుపతి రూరల్, అనంతపురం రూరల్, విశాఖపట్నం జగదాంబ, తుని(కాకినాడ జిల్లా), నర్సాపురం, ఏలూరు, కందుకూరు (నెల్లూరు జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, మేడికొండూరు(గుంటూరు), జలుమూరు(శ్రీకాకుళం) తహశీల్దార్ కార్యాలయాల్లో దాదాపు 35 మంది అధికారుల బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. కాగా, గుంటూరు జిల్లా మేడికొండూరు తహసీల్దార్ కరుణకుమార్ కారులో అనధికారికంగా ఉన్న రూ.లక్షా, 4 వేల, 7 వందలు నగదును, çకారు డ్యాష్ బోర్డులో ఉన్న పలు రికార్డులు, సర్టిఫికెట్లను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం పట్టుబడ్డ నగదుపై పూర్తి స్థాయి వివరాలు చెప్పకపోవడంతో తహసీల్దార్‌ను కార్యాలయానికి తీసుకొచ్చి కంప్యూటర్ డేటాను తనిఖీ చేశారు. ఇదే తహసీల్దార్ కరుణకుమార్ మేడికొండూరు కార్యాలయంలోనే సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయం(2009)లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ వీరవెంకటప్రతాప్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ మేడికొండూరు తహసీల్దార్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలిపారు. తహశీల్దార్ కార్యాలయాల్లో పలు రికార్డుల్లో అక్రమాలను గుర్తించినట్టు తెలిసింది. నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాల్సిన అర్జీలను కూడా ఉద్దేశపూర్వకంగా పక్కనబెడుతున్నట్టు గుర్తించారు. తనిఖీలు గురువారం కొనసాగనున్నాయి. అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించనున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లెక్కల్లో చూపని నగదు స్వాధీనం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏబీసీ దాడులు చేసి లెక్కల్లో చూపని నగదు భారీగా స్వా«దీనం చేసుకున్నారు. అనంతపురం రూరల్ (రుద్రంపేట) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై జరిగిన సోదాల్లో రిజిస్ట్రేషన్ చలానాల పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ అలీ స్వయాన అల్లుడు, ఆయన వాహన డ్రైవరుగానూ ఉన్న షేక్ ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద అక్రమంగా దాచుకున్న రూ.2.27 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జగదాంబ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన సోదాల్లో ఇటీవల కాలంలో జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన దస్త్రాలను ఏసీబీ పరిశీలించారు. బుధవారం జరిగిన రిజిస్ట్రేషన్ లావాదేవీలకు మించి అధికంగా నగదు, అలాగే అనధికార వ్యక్తులు కార్యాలయంలో ఉండటంపైనా ఆరా తీశారు. తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై జరిగిన సోదాల్లో లెక్కల్లో చూపకుండా ఉన్న మొత్తం రూ.1,53,410 నగదును సీజ్ చేశారు. ‘నవరత్నాలు–పేదలు అందరికీ ఇళ్ల’ పథకం కింద ఇంటి బిల్లులను మంజూరు చేసేందుకు ఓ లబ్ధిదారు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ గృహనిర్మాణ శాఖ ఏఈ బుధవారం ఏసీబీకి చిక్కారు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం గృహనిర్మాణ శాఖ ఏఈ ఎం.వెంకటేశ్వరరావు బిల్లు మంజూరు చేసేందుకు రూ.20వేలు లంచం డిమాండ్ చేశారు. దీనిపై లబ్దిదారుడు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 14400కు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన లబ్దిదారు నుంచి లంచం తీసుకుంటుండగా ఏఈ వెంకటేశ్వరరావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన్ని విశాఖపట్నం ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. -
‘మేడారం గోవిందరాజుల’ పూజారి హత్య
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని గోవిందరాజుల గద్దె వద్ద పూజారిగా వ్యవహరిస్తున్న గబ్బగట్ల రవి(45)ని సోమవారంరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామానికి చెందిన దబ్బగట్ల రవి అత్తగారి గ్రామమైన మేడారంలో స్థిరపడ్డారు. వీరిది గోవిందరాజుల గద్దె పూజారుల కుటుంబం. ఈ కుటుంబీకులు వారానికి ఒకరు చొప్పున గద్దె వద్ద పూజలు నిర్వహిస్తుంటారు. తనవంతు వారంలో రవి భక్తులకు బొట్టు పెట్టి పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే రవి హత్య జరగడం మేడారంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పస్రా సీఐ శంకర్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావులు మంగళవారం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా వివరాలు సేకరించారు. బైక్‌పై తిరిగిన వారే హత్య చేశారా? గోవిందరాజుల పూజారి రవి హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తు లు రవిని బైక్‌పై ఎక్కించుకుని సోమవారం మేడారంలో తిరిగారని, మద్యం కూడా సేవించారని స్థానికులు చెబుతున్నారు. ఆ ఇద్దరిలో ఓ మహిళ కూడా ఉందని అంటున్నారు. తమ పర్సు పోయిందని, దానిని వెతుకుదామంటూ రవిని బైక్‌పై తీసుకెళ్లారని, ఆ పర్సు విషయమై స్థానికంగా పలువురిని వాకబు కూ డా చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో మేడారం రోడ్డు పక్కన ఉన్న ఓ షెడ్డు వద్ద రాత్రి వంట కూడా చేసుకున్నారని, మద్యం తాగించిన అనంతరం రవి తలపై బండరాళ్లతో కొట్టి చంపి ఉంటారని, ఆయన చెప్పులు ఘటనాస్థలానికి దూరంగా పడి ఉండటంతో అంతకుముందు పెనుగులాట కూడా జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులతో పూజారి రవికి ఇంతకుముందే పరిచయముందా అనే విషయంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సోమవారం రాత్రి స్థానికంగా కరెంట్ సరఫరా లేదని, ఇదే అదనుగా రవిని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటనాస్థలంలో క్వార్టర్ మందు సీసా, పచ్చడి ప్యాకెట్ పడి ఉన్నాయి. -
80 ఏళ్ల వయసులో వెంటాడిన జైలు శిక్ష
సాక్షి, అమరావతి: ఓ ప్రధానోపాధ్యాయుడి నుంచి రూ.5 వేల లంచం డిమాండ్ చేసినందుకు ఏసీబీ అధికారులు 25 ఏళ్ల క్రితం పెట్టిన కేసు ఓ మాజీ ఎంపీడీవోను వృద్ధాప్యంలోనూ వెంటాడింది. 80 ఏళ్ల వయసులో ఆ అధికారి జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఎదురైంది. తన వయసు 80 ఏళ్లని.. అనారోగ్యంతో బాధపడుతున్నానని తెలిపిన ఆ మాజీ ఎంపీడీవో.. తనను కనికరించాలని అభ్యర్థించాడు. నిర్ధ్వందంగా తిరస్కరించిన హైకోర్టు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే గరిష్ట శిక్షతో కాకుండా కనిష్ట శిక్షతో సరిపెట్టింది. లంచం తీసుకున్నందుకు ఏసీబీ పెట్టిన కేసును కొట్టేస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది. అప్పటి అధికారికి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద 6 నెలల జైలు, రూ.5వేల జరిమానా విధించింది. అలాగే సెక్షన్ 13(1)(డీ) కింద ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. ఈ రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు శుక్రవారం తీర్పు వెలువరించారు. విధుల్లోకి చేర్చుకునేందుకు లంచం డిమాండ్ కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన యూవీ శేషారావు అప్పట్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసే వారు. ఆయనకు అదే జిల్లాలోని నడిమ తిరువూరు పాఠశాలకు బదిలీ కావడంతో.. విధుల్లో చేరేందుకు వెళ్లిన శేషారావును విధుల్లో చేర్చుకోలేదు. దీంతో ఆయన పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ)ను ఆశ్రయించగా.. ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ట్రిబ్యునల్ ఉత్తర్వులను అమలు చేయడంతో పాటు జీతం బకాయిలను ఇప్పించాలని కోరుతూ శేషారావు అప్పటి తిరువూరు ఎంపీడీవో బత్తిన వెంకటేశ్వరరావు వద్దకు వెళ్లారు. ఇందుకు వెంకటేశ్వరరావు రూ.5 వేల లంచం అడిగారు. ఇవ్వలేనని చెప్పినా వినలేదు. దీంతో శేషారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శేషారావు నుంచి లంచం తీసుకుంటుండగా ఎంపీడీవో వెంకటేశ్వరరావును ఏసీబీ అధికారులు 1998లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు లంచం తీసుకున్నారనేందుకు ఎలాంటి సాక్ష్యాలు లేవంటూ వెంకటేశ్వరరావుపై ఏసీబీ పెట్టిన కేసును కొట్టేస్తూ 2005లో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ అధికారులు 2007లో హైకోర్టులో అప్పీల్ చేశారు. అప్పటి తీర్పును తప్పుపట్టిన హైకోర్టు ఈ అప్పీల్‌పై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు విచారణ జరిపి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పును తప్పుపట్టారు. వెంకటేశ్వరరావు లంచం తీసుకున్నారనేందుకు ఆధారాలు ఉన్నాయని తేల్చారు. లంచం డిమాండ్ చేశారనేందుకు, లంచం తీసుకున్నారనేందుకు ఏసీబీ అధికారులు పూర్తి సాక్ష్యాధారాలను కోర్టు ముందుంచారని తెలిపారు. ఈ సాక్ష్యాధారాలను ఏసీబీ ప్రత్యేక కోర్టు సరైన కోణంలో విశ్లేషించలేదని ఆక్షేపించారు. వాదనల సమయంలో తన వయసు 80 ఏళ్లని, అనారోగ్యంతో బాధపడుతున్నానని వెంకటేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనను తోసిపుచ్చుతున్నట్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే అవినీతి నిరోధక చట్టంలో నిర్దేశించిన గరిష్ట శిక్షకు బదులు కనిష్ట శిక్ష విధిస్తున్నట్టు పేర్కొన్నారు. సెక్షన్ 7 కింద 6 నెలల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా, సెక్షన్ 13(1)(డీ) కింద ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. -
Blind T20 World Cup 2022: భారత జట్టు కెప్టెన్‌గా అజయ్
స్వదేశంలో ఈ ఏడాది డిసెంబర్ 6 నుంచి 17 వరకు జరిగే అంధుల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. 17 మంది సభ్యులుగల టీమిండియాకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అజయ్ కుమార్ రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన వెంకటేశ్వర రావును వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ మెగా ఈవెంట్‌కు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. గతంలో భారత జట్టు రెండుసార్లు (2012, 2017) ప్రపంచకప్ టైటిల్‌ను సాధించింది. భారత జట్టు: అజయ్ కుమార్ రెడ్డి (కెప్టెన్), వెంకటేశ్వర రావు (వైస్ కెప్టెన్), దుర్గా రావు, ఎ.రవి (ఆంధ్రప్రదేశ్), లలిత్ మీనా (రాజస్తాన్), ప్రవీణ్, దీపక్ (హరియాణా), సుజీత్ (జార్ఖండ్), నీలేశ్ యాదవ్, , ఇర్ఫాన్ (ఢిల్లీ), సోనూ (మధ్యప్రదేశ్), సొవేందు (బెంగాల్), నకులా (ఒడిశా), లోకేశ, సునీల్, ప్రకాశ్ (కర్ణాటక), దినగర్ (పాండిచ్చేరి). -
నెలకు 3 లక్షల రూపాయల జీతం వదిలేసి..
ఆయన ఓ విశ్రాంత ఉద్యోగి. నెలకు రూ.3 లక్షలు జీతం. ప్రైవేటు కంపెనీలో డిజిఎంగా పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్నారు ఘట్రాజు వెంకటేశ్వరరావు. వ్యవసాయంపై ఉన్న ఆసక్తితో అమ్మమ్మ గారి ఊరు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామానికి వచ్చి తమ 4.5 ఎకరాల పొలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో దేశీ వరి రకాల సాగు చేపట్టారు. సుమారు రెండేళ్లు నిల్వ చేసిన ధాన్యాన్ని ఆరోగ్యదాయకమైన దేశీ బియ్యం విక్రయిస్తూ లాభాలతో ఆత్మసంతృప్తిని ఆర్జిస్తున్నారు. ఆయన అనుభవాల సారం ఆయన మాటల్లోనే.. ‘‘ప్రముఖ కంపెనీలో ముంబైలో ఉద్యోగం చేశాను. డీజీఎంగా బాధ్యతలు నిర్వహణ. ఐదేళ్ల క్రితం వీఆర్ఎస్ తీసుకుని హైదరాబాద్‌కు వచ్చేశాను. అప్పటికే ప్రకృతి సేద్యంపై ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ప్రకతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ శిక్షణా తరగతుల్లో పాలొని మెళకువలు నేర్చుకున్నా. ఆచరణలో పెట్టేందుకు అమ్మమ్మ వాళ్ల ఊరైన కోలవెన్ను వచ్చి స్థిరపడ్డా. 4.5 ఎకరాల్లో తులసీబాణం, నారాయణ కామిని, నవారా, కాలాభట్, మార్టూరు సన్నాలు, రత్నచోడి, బహురూపి వంటి దేశీ వరి రకాలు సాగు చేస్తున్నా. రెండు ఆవులను తెచ్చుకున్నా. ఏటా సాగు ఆరంభంలో 40 ట్రక్కుల ఘన జీవామృతాన్ని పొలంలో చల్లుతున్నా. పంటకు అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తున్నాయి. వర్రలతో బావిని కట్టించి 1200 లీటర్ల జీవామృతం తయారుచేసి 15 రోజులకోసారి చల్లుతున్నా. పంట ఆరోగ్యంగా ఎదుగుతున్నది. తెగుళ్ల బెడద లేదు. ఆవ పిండి చెక్క కూడా జీవామృతంలో కలిపి వాడుతున్నా. ఎకరాకు రూ. 25–30 వేల వరకూ పెట్టుబడి అవుతుంది. 25–28 బస్తాల వరకూ ధాన్యం దిగుబడి వస్తున్నది. పంటను ఆశించే పురుగు నివారణకు వేపపిండి చల్లుతాను. పోషకాలు జీవామతం ద్వారా అందుతాయి. మరీ అవసరం అయితే, అగ్ని అస్త్రం చల్లుతాను. ఎలాంటి పురుగైనా నాశనం అవుతుంది. దేశవాళీ విత్తన పంట నిల్వ, మార్కెటింగ్ విషయాలు చాలా ప్రధానమైనవి. పంట చేతికి వచ్చాక కనీసం 10 నెలల నుంచి రెండేళ్ల వరకూ పంటను మాగబెట్టిన ధాన్యాన్ని మిల్లులో ఆడించి నాణ్యమైన బియ్యాన్ని బెంగుళూరు, హైదరాబాద్, కొచ్చిన్, చెన్నై ప్రాంతాల్లో ఉన్న నేరుగా విక్రయిస్తున్నా. నవారా, కాలాభట్ స్థానికంగా కిలో రూ. 90కి, బయట ప్రాంతాలకు రూ. 120కే అందిస్తున్నా, రవాణా ఖర్చు కూడా కలిపి. ఇతర రకాల బియ్యం కిలో రూ.75కే ఇస్తున్నా. ప్రతి రైతూ ప్రకృతి విధానం వైపు అడుగులు వేస్తే దిగుబడులు, ఆరోగ్యం, ఆదాయం, భూసారం పెంపుదల సాధ్యమే. ప్రభుత్వం రైతు భరోసా, ఇతర సబ్సిడీలు అందిస్తున్నది. వీటితో పాటు ప్రకృతి విధానంలో పండించిన పంటకు అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని మార్కెటింగ్ సదుపాయాలు విస్తరించి, అదనపు వసతులు కల్పిస్తే కొత్త రైతులు కూడా ఈ విధానంలోకి వచ్చేస్తారు.’’ – ఈ.శివప్రసాద్, సాక్షి, కంకిపాడు, కృష్ణా జిల్లా వడ్లు ఎంత మాగితే అన్నం అంత ఒదుగుతుంది. ధాన్యం నిల్వ చేయకుండా తినటం వల్ల కడుపు నొప్పి, అజీర్ణ సమస్యలు ఏర్పడతాయి. పంట నాణ్యంగా ఉంటే ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అలాగే ప్రకృతి విధానం వల్ల భూసారం పెంపొందుతుందని గుర్తించాను. (క్లిక్: కొబ్బరి పొట్టుతో సేంద్రియ ఎరువు! ఎలా తయారు చేసుకోవాలంటే!) – ఘట్రాజు వెంకటేశ్వరరావు (92255 25562), కోలవెన్ను -
జనశక్తి రాష్ట్ర నేత నర్సింహ్మ అరెస్టు
సాక్షి, హైదరాబాద్/చౌటుప్పల్: సీపీఐ (ఎంఎల్) జనశక్తి రాష్ట్ర నేత, ఒడిశా రాష్ట్ర మాజీ కార్య దర్శి బొమ్మని నర్సింహ్మ అలియాస్ ఆనంద్‌ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో ఉంటున్న భార్యా పిల్లల వద్దకు వెళ్లారు. నర్సింహ్మను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయడంతోపాటుగా ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. గతంలోనూ సిరిసిల్ల పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసి వారం రోజులు హింసించి గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేసినట్లు చూపించారని, ఇప్పుడు కూడా సిరిసిల్ల పోలీసులే ఆయనను అరెస్టు చేసినట్లు భార్య పద్మ ఆరోపించారు. పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిన నర్సింహ్మకు ఆరోగ్యం బాగోలేదని, ఆయనను వెంటనే కోర్టులో హాజరు పరచాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్రావు ఓ ప్రకటన లో డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంకు చెందిన బొమ్మని చంద్రయ్య–పెంటమ్మ దంపతులకు తొలి సంతానంగా నర్సింహ్మ(59) జన్మించారు. వరంగల్‌లో విద్యాభ్యాసం చేసే క్రమంలో వైద్య విద్యలో వచ్చిన సీటును వదులుకుని ఉద్యమాలకు ఆకర్షితుడై అడవిబాటపట్టారు. -
బ్యాంకులకు రూ.402 కోట్లు బురిడీ
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి కొనుగోళ్లు లేకపోయినా ఉన్నట్టు సృష్టించి బ్యాంకులను రూ.402 కోట్లు బురిడీ కొట్టించిన సర్వో మ్యాక్స్ ఇండియా ప్రెవేట్ లిమిటెడ్ ఎండీ, ప్రమోటర్ అవసరాల వెంకటేశ్వర్రావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం అరెస్ట్ చేసింది. నకిలీ అకౌంట్ బుక్కులు, నకిలీ కొనుగోళ్లతో ఎక్కువ లాభాలు చూపించి పలు బ్యాంకులను మోసం చేసినందుకు వెంకటేశ్వర్రావుపై సీబీఐ 2018లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఈడీ, కోర్టు అనుమతితో మనీలాండరింగ్ కింద విచారణ ప్రారంభించింది. విచారణలో ఈడీ అధికారులు అనేక లోపాలను గుర్తించారు. సర్వోమ్యాక్స్ ఇండియా లిమిటెడ్ పేరుతో బ్యాంకుల నుంచి రూ.402 కోట్లు రుణం తీసుకొని ఎలాంటి కొనుగోళ్లు చేయకుండానే నష్టం వచ్చినట్టు మోసానికి పాల్పడ్డారని, కొనుగోళ్లు చేసినట్టు నకిలీ పత్రాలు సృష్టించారని, ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించి అకౌంట్ బుక్కులో నమోదు చేశారని గుర్తించారు. రుణంగా పొందిన డబ్బును ఇతర కంపెనీలకు మళ్లించి మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ అధికారులు దర్యాప్తులో వెలుగులోకి తీసుకువచ్చారు. ఆర్థిక నేరాలపై సాక్ష్యాలతో వెంకటేశ్వరరావును కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు 14రోజుల రిమాండ్ విధించినట్టు ఈడీ వెల్లడించింది. -
టీడీపీలో సస్పెన్షన్ల కలకలం..
-
టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు
సాక్షి, కృష్ణా : టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నా ఇల్లు- నా సొంతం కార్యక్రమం పేరుతో మల్లాయపాలెం పంచాయతీ పరిధిలో నిర్మాణంలో ఉన్న టీడ్కో గృహల వద్ద టీడీపీ నేతలు వివాదానికి దిగారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న గృహాల వద్దకు టీడీపీ నేతలు భారీ సంఖ్యలో వచ్చి గొడవకు దిగారు. సైట్ ఇంజనీర్లుగా పని చేస్తున్న తలారి గోపి, వెంగళ నాగేంద్ర బాబులను కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు దిగారు. దీంతో సైట్ ఇంజనీర్లు ఇద్దరు రావి వెంకటేశ్వరరావుతో పాటు మరో ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురిపై ఎస్సీ , ఎస్టీ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. -
రామోజీరావు, కిరణ్‌పై ‘అనంత’ కోర్టులో కేసు
సాక్షి, అనంతపురం : ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు, ఎండీ కిరణ్‌పై రిటైర్డ్ ఏఎస్పీ వెంకటేశ్వరరావు శుక్రవారం అనంతపురం మొబైల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రామోజీరావు, కిరణ్ వ్యక్తిగతంగా హాజరై అఫిడవిట్ సమర్పించాలని, లేదంటే స్టే గడువు పెంచుకోవాలని సూచిస్తూ...తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. కాగా రామోజీరావుతో పాటు ఆయన కుమారుడు కిరణ్‌పై వెంకటేశ్వరరావు గతంలో హైకోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఇరువురిపై క్రిమినల్, సివిల్ కేసులు నమోదు చేయాలని అభ్యర్థించారు. అయితే ఈ కేసులో రామోజీరావు, కిరణ్‌లు 2012 నుంచి వ్యక్తిగత మినహాయింపు పొందారు. ఇటీవల సుప్రీంకోర్టు సుదీర్ఘ కాలంగా ఉన్న స్టేలపై కీలక ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీర్ఘ కాలంలో ఉన్న స్టేలను ఎత్తివేయాలంటూ ఉన్నత న్యాయస్థానం నిర్దేశించడంతో ...వెంకటేశ్వరరావు మరోసారి మొబైల్ కోర్టును ఆశ్రయించారు. -
హాయ్‌ల్యాండ్ ఎండీ వెంకటేశ్వరరావు అరెస్ట్
సాక్షి, విజయవాడ: హాయ్‌ల్యాండ్ ఎండీ అల్లురి వెంకటేశ్వరరావును సీఐడీ అధికారులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ చైర్మన్ వెంకట రామరావుతో కలిసి హాయల్యాండ్‌పై కుట్ర చేశాడనే అభియోగంపై అతన్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్వరరావు గతంలో అగ్రిగోల్డ్ మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేశారు. అతడు 2005 ఆగస్టు 29న హాయ్‌ల్యాండ్‌కు చెందిన ఆర్ కాలేజ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ బాధ్యతలు చేపట్టారు. వెంకటేశ్వరరావు అరెస్ట్‌తో అగ్రిగోల్డ్ కేసులో నిందితుల సంఖ్య 27కు చేరింది. గురువారం వెంకటేశ్వరరావును అధికారులు సీఐడీ కోర్టులో హాజరుపర్చనున్నారు. -
నల్లగొండ జిల్లా TRSలో భగ్గుమన్న అసమ్మతి
-
నాన్చుడో.. తేల్చుడో..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు డెయిరీ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. నెలరోజుల క్రితం డెయిరీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన శిద్దా వెంకటేశ్వరరావు పట్టుమని పది రోజులు కూడా సీట్లో కూర్చోకుండానే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఈ నెల 17 ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించారు. సీఎం ఓకే అంటేనే చైర్మన్‌గా కొనసాగుతానని వద్దంటే రాజీనామా ఆమోదించాలని శిద్దా బంతిని సీఎం కోర్టుకు నెట్టారు. ఇక సీఎం నిర్ణయమే తరువాయి. అయితే డెయిరీ విషయం మళ్లీ మాట్లాడదామని చైర్మన్ శిద్దాతో చెప్పిన ముఖ్యమంత్రి ఆ తరువాత వీరిని పిలవలేదు. ఒకటి రెండుమార్లు జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు, ఇన్చార్జ్ మంత్రి నారాయణతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌లు సమావేశమై డెయిరీ విషయం చర్చించారు. ముఖ్యమంత్రితో మాట్లాడి ఆయన సూచన మేరకు తరుపరి నిర్ణయం తీసుకుందామని మంత్రులు శిద్దా,నారాయణ, జనార్దన్‌లు చైర్మన్ శిద్దాకు చెబుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎప్పుడు స్పందిస్తారో తెలియని పరిస్థితి. ఇంట్లో చిచ్చుకు యత్నం.. మంత్రి శిద్దా రాఘవరావుకు తెలియకుండానే ఆయన సమీప బంధువైన వెంకటేశ్వరరాను రాత్రికి రాత్రే చైర్మన్ చేయడం వివాదంగా మారింది. దీని వెనుక టీడీపీకి చెందిన ముఖ్యనేతతో పాటు మరికొందరు నేతల ప్రమేయమున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే విషయాన్ని జిల్లాలకు చెందిన కొందరు టీడీపీ నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. మరోవైపు మంత్రి శిద్దా సైతం తనకు తెలియకుండా తన కుటుంబ సభ్యుడిని చైర్మన్ చేసి తన కుటుంబంలో విబేధాలు సృష్టించే ప్రయత్నం చేయడంపై ముఖ్యమంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి పాత, కొత్త చైర్లన్లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇన్ని గొడవల నేపథ్యంలో డెయిరీ కొత్త చైర్మన్ విషయం ముఖ్యమంత్రి ఇప్పట్లో తేల్చే పరిస్థితి కనిపించడం లేదు. పైగా వెంకటేశ్వరరావును చైర్మన్ గా ముఖ్యమంత్రి ఆమో పరిస్థితి లేదన్నది స్పష్టం. ఆయన రాజీనామాను ఆమోదించకుండా.. విషయాన్ని ఎటూ తేల్చకుండా ముఖ్యమంత్రి నాన్చుడు ధోరణి అవలంబించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అడకత్తెరలో పోకచెక్క.. డెయిరీ చైర్మన్ వెంకటేశ్వరరావు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. పాత చైర్మన్ చల్లా శ్రీనివాసరావు ప్రోద్భలంతో శిద్దా కొత్త చైర్మన్‌గా ఎన్నికయ్యారు. రూ.20 కోట్లు సొంత డబ్బులు ఇచ్చి డైరీని ముందుకు నడిపిస్తానన్నారు. ఈ పరిస్థితిలో ఎవరో ఒకరు డెయిరీని నడిపిస్తే చాలని భావించిన పాలకవర్గం, ఉద్యోగ, రైతు సంఘాలు శిద్దాను చైర్మన్‌గా ఆమోదించాయి. తమకు తెలియకుండానే డెయిరీ చైర్మన్‌గా శిద్దా వెంకటేశ్వరరావును ఎలా ఎన్ను కుంటారంటూ అధికార పార్టీలోని ఓ వర్గం సీఎంకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. డెయిరీకి చైర్మన్ డుమ్మా..: ముఖ్యమంత్రి ఎటూ తేల్చక పోవడంతో డెయిరీకి రూ. 20 కోట్లు ఇస్తానన్న చైర్మన్ పైసా ఇవ్వలేదు. తన సొంత డబ్బులు ఇచ్చేది లేదని, బ్యాంకు రుణమొస్తేనే ఇస్తానని మాటమార్చారు. ఆ తరువాత ముఖ్యమంత్రి ఓకే అంటేనే చైర్మన్‌గా ఉంటానని లేకపోతే లేదని ప్రకటించారు. తాజాగా ముఖ్యమంత్రికి ఈ నెల 17నే రాజీనామా లేఖను ఇచ్చినట్లు వెల్లడించారు. చైర్మన్ డెయిరీకి రాకపోవడం, ఉద్యోగులు, రైతుల బకాయిలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఆ వర్గాల్లో ఆందోళన మొదలైంది. మళ్లీ ఆందోళనకు సిద్ధం... ఒంగోలు డెయిరీ పరిధిలో పాడి రైతులకు రూ.13 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగుల 5 నెలల జీతాలు రూ.2.5 కోట్లు, పీఆర్సీ అరియన్స్, గ్రాడ్యూటీ, ఎల్ఐసీ డబ్బులు కలిపితే మొత్తం రూ.8 కోట్లు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. కరెంట్ బిల్లులు రూ.2 కోట్లు, ట్రాన్స్‌పోర్టేషన్ రూ.2 కోట్లు చెల్లించాలి. ఇప్పటికే ఉద్యోగులు, రైతు సంఘాలు మంత్రి శిద్దా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీ కరణం బలరాం తదితర నేతలను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సోమవారం కలెక్టర్‌ను కలిసి విన్నవించి మరోమారు ఆందోళనకు దిగేందుకు ఉద్యోగులు, రైతులు సిద్ధమౌతున్నారు. -
ఆ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి..
సాక్షి, హైదరాబాద్ : మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వం వహిస్తున్న సూర్యాపేట నియోజకవర్గంలో వందలకోట్ల అవినీతి జరుగుతోందని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్ రావు ఆరోపించారు. తెలంగాణ 31 జిల్లాలో లేని అవినీతి సూర్యాపేటలో ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కలెక్టర్ కార్యాలయం కోసం ఇప్పటి వరకూ స్థల సేకరణ జరగలేదని తెలిపారు. సూర్యపేటలో 70 ఎకరాల స్థలం కేటాయించి బోర్డు పెట్టారు కానీ ప్రస్తుతం అది కబ్జాకు గురువతుందని ఆయన పేర్కొన్నారు. ‘ఈ విషయంపై సీఎం చంద్రశేఖర్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థల సేకరణ గురించి కలెక్టర్‌ను అడిగారు. ఆ సమయంలో అతను కేసు కోర్టులో ఉన్నట్టుగా చెప్పారు. గతంలో సీఎం కూడా వచ్చారు.. అప్పుడు కలెక్టర్ సీఎంకి మూడు ప్రతిపాదనాలు ఇచ్చారు. స్థానికంగా సూర్యాపేటలో 200 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు చెప్పారు. నల్ల చెరువు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉన్న 200 ఎకరాలు పేదవారి ఇళ్ల స్థలాలు చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంతేకాక అమాయక ప్రజల భూములు కొని కలెక్టర్ కార్యాలయం కోసం ఇస్తున్నారు. దీంట్లో మంత్రి హస్తం కూడా ఉంది’ అని సంకినేని వెంకటేశ్వర రావు మండిపడ్డారు. అవే కాకుండా పేదల భూములు, ప్రైవేట్ భూములు కొని రూ. 300 కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ఇది నిరూపణ అయితే మంత్రి పదవి నుంచి తప్పుకుంటారా అని సక్కినేని సవాల్ విసిరారు. 18 లక్షల చొప్పున నాలుగున్నర కోట్లు కావాలని సీఎస్ ఎస్పీ సింగ్‌ని అడిగారు. ఇందులో మంత్రి, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హస్తం కూడా ఉందని ఆయన అన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలి.. లేదా సీబీఐ ఎంక్వైరీ వేయాలని అన్నారు. వైద్యశాఖలో అవినీతి జరిగిందని ఎమ్మెల్యే రాజయ్యను బర్తరఫ్ చేసినట్టుగా.. మంత్రి జగదీష్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది నిరూపణ కాకపోతే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతానని సక్కినేని వెంకటేశ్వర్ రావు చెప్పారు. -
అటవీ అధికారి రాసలీలలు
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో ఓ అటవీ శాఖ అధికారి రాసలీలల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అటవీ శాఖలో పనిచేస్తున్న డీఎఫ్ఓ వెంకటేశ్వరరావు గెస్ట్ హౌస్‌లో ఓ మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు దొరికిపోయాడు. కొంత కాలంగా మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని వెంకటేశ్వరరావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు ఆయనపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా పై స్థాయి నుంచి స్పందించ లేదు. దీంతో విద్యార్థి నేతలు డీఎఫ్‌ఓపై నిఘా పెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా సోమవారం అర్థరాత్రి గెస్ట్‌హౌస్‌పై పోలీసులు దాడులు చేసి వెంకటేశ్వరరావుతో పాటు ఆయనతో ఉన్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్టు సమాచారం. డీఎఫ్ఓ రాసలీలల వ్యవహారంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా డిఎఫ్ఓ వేంకటేశ్వర రావును సస్పెండ్ చేస్తున్నట్టు కమిషనర్ తెలిపారు. ఘటనపై తదుపరి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. -
అక్కడ అలా.. ఇక్కడ ఇలా..
సాక్షి, రాజమహేంద్రవరం: అభివృద్ధి పనుల్లో భాగంగా నష్టపోతున్న ప్రజలకు నష్ట పరిహారం చెల్లించే చర్యలు చేపట్టాల్సిన ప్రజా ప్రతినిధులు తమ రాజకీయ అనుభవాన్నంతా రంగరించి సరికొత్త డ్రామాలకు తెరదీస్తున్నారు. ఓ పక్క రోడ్డు విస్తరణకు అధికారుల వద్ద సమ్మతం వ్యక్తం చేసి, కట్టడాలు తొలగించే సమయంలో మాత్రం ప్రజలల్లో వ్యతిరేకత రాకుండా తొలగించడానికి వీలు లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ వ్యవరిస్తున్న తీరును అర్థం చేసుకుంటున్న ప్రజలు, అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. మధురపూడి విమానాశ్రయ రోడ్డులో దోసకాయలపల్లి గ్రామంలో కొద్దిమేర రోడ్డు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 19 నుంచి 21 తేదీ వరకు కాకినాడ బీచ్ ఫెస్టివల్ నేపథ్యంలో వీఐపీలు, రాజకీయ నేతల కాన్వాయ్ రాకపోకలకు అడ్డంకి లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జారీ చేసిన ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ సాయికాంత్ వర్మ చర్యలు చేపట్టారు. ముందుగా ఈ విషయం రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే పెందుర్తి వెకంటేష్తో చర్చించారు. అందుకు ఆయన సమ్మతించారు. అనంతరం దోసకాయలపల్లిలో సర్వే చేయించారు. రోడ్డు విస్తరించాల్సిన ప్రాంతంలో 63 గృహాలను తొలగించాల్సిన పరిస్థితి. ఈ సమయంలోనే ఎమ్మెల్యే పెందుర్తి తనలోని రాజకీయ నాయకుడిని నిద్రలేపారు. ఒక్కసారిగా విస్తరణ పనులు వద్దకు వచ్చి ‘చేయడానికి వీలు లేదంటూ’ చిందులేశారు. ఎలా చేస్తారోనంటూ సబ్‌కలెక్టర్ సాయికాంత్ వర్మపై ఫైర్ అయ్యారు. తమ ఎమ్మెల్యే తమకు అండగా ఉంటున్నారని బాధితులు సంబరపడ్డారు. ఈ సంతోషం కొద్దిసేపు కూడా నిలబడలేదు. పనులు ఎలా చేస్తారో చూస్తానన్న ఎమ్మెల్యే ఆనక చిన్నగా స్వరం మార్చి క్రిస్మస్ పండగ దాకా ఆగండంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీతానగరంలోనూ ఇదే తీరు.. ఇరుకైన రోడ్డులో ఇసుక లారీల రాకపోకల వల్ల సీతానగరం మండలంలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 8 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో చిన్నారులు కూడా ఉన్నారు. కారణాలను విశ్లేషించిన నూతన సబ్‌కలెక్టర్ సాయికాంత్ వర్మ రోడ్డు విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు రోడ్డు, భవనాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముగ్గళ్ల నుంచి సీతానగరం వరకు రోడ్డు సర్వే 15 రోజుల కిందట పూర్తి చేశారు. అయితే సీతానగరంలో రోడ్డువైపున ఉన్న తన అనుచరుల స్థలాలు, ఆస్తులు కొంత మేర కొల్పోయే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యే పెందుర్తి రోడ్డు విస్తరణను వ్యతిరేకిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనుల కోసం బాధితులకు ఉపసమన చర్యలు చేపట్టి ఒప్పించాల్సిన ప్రజా ప్రతినిధి ఇలా వ్యవహరిస్తుండడంతో అధికారులు అవాక్కవుతున్నారు. పని చేయాలని తపన ఉన్నా నియోజకవర్గ ప్రజా ప్రతినిధే సహకరించకపోతుండడంతో ఉన్నతాధికారులు మిన్నకుండిపోతున్నారు. మాటల మర్మం తెలిసి అవాక్కైన ప్రజలు సబ్‌కలెక్టర్ వద్ద రోడ్డు విస్తరణకు ఒప్పుకుని, ప్రజల వద్దకు వచ్చి పనులు చేయడానికి వీలు లేదని, ఆ తర్వాత కొద్దిసేపటికే పండగ వరకూ ఆగండిని.. ఇలా రెండు రకాల మాటలు మాట్లాడడాన్ని ప్రజలు నిదానంగా పసిగట్టారు. పండుగ వరకు ఆగండి అంటే ఆ తర్వాత రోడ్డు విస్తరణ చేయమనే కదా అన్న విషయం అర్ధం కావడంతో తమ ఎమ్మెల్యే తెలివి తేటలను గుర్తు చేసుకుని విస్తుబోతున్నారు. ఇల్లు కోల్పోతున్న 63 మందికి నూతన ఇళ్లు కట్టించి ఇవ్వడం, అప్పటి వరకు తాత్కాలికంగా ఉపశమన చర్యలు చేపట్టే విధంగా అధికారులతో మాట్లాడే అవకాశం ఉన్నా ఎమ్మెల్యే ఆ దిశగా ఆలోచించకపోడం గమనార్హం. ప్రతిపక్ష పార్టీలు బాధితులకు నష్టపరిహారం, లేదా ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కానీ ఆ డిమాండ్లను నెరేవేర్చ గలిగే అవకాశం ఉన్న అధికారపార్టీ ఎమ్మెల్యే ప్రజలను మోసగించే చర్యలపై స్థానికులు మండిపడుతున్నారు. తమ నాయకుడు వ్యవహరిస్తున్న తీరుతో ఆయన అనుచరులు కూడా విస్తుబోతున్నారు. -
ఆ అనుబంధానికి సాక్ష్యం ఇదే..
దేవరపల్లి: గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు కాంట్రాక్టర్ రాజేష్ బినామీగా వ్యవహరిస్తున్నట్టు ఇటీవల అధికారపార్టీ నాయకులు బాహాటంగా ఆరోపించారు. రాజేష్ ఎవరో తనకు తెలియదని, అతను తన బంధువు కాదని ఇటీవల ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ప్రకటించారు. ‘అభివృద్ధి ముసుగులో అవినీతి దందా’ శీర్షికన ‘సాక్షి’లో గత వారం కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు తనకు రాజేష్‌తో ఎటువంటి అనుంబంధం లేదని విలేకరుల సమావేశం నిర్వహించి మరీ చెప్పారు. అయితే ఎమ్మెల్యే ముప్పిడితో రాజేష్‌కు గల అనుబం«ధానికి నిదర్శనంగా ఈ చిత్రం చూడవచ్చు. మరి ఇదే రకమైన అనుబంధమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
నాకు నచ్చిన ఐదు పుస్తకాలు
బుద్ధ చరిత్రము (తిరుపతి వేంకటకవుల అనువాదం) ఎడ్విన్ ఆర్నాల్డ్ రాసిన The Light of Asiaకి అనువాదం ఇది. తిరుపతి కవులు శంకరాద్వైతం లోనూ, వేదాలలోనూ, యజ్ఞయాగాది క్రతువుల్లోనూ నమ్మకం ఉన్నవాళ్ళు. బుద్ధుడు వేదాలను తిరస్కరించి ఏ క్రతువుకీ బలి కూడదనే అహింసావాది. ప్రబంధ పక్కీలో రాసినా ఈ పుస్తకంలో స్త్రీ వర్ణనలు మోతాదు మించలేదు. ఈ పుస్తకం తిరుపతి కవులని మార్చిందా? ఏ మిష మీదైనా సరే జీవహింస కూడదనే బౌద్ధవాదాన్ని ఒక వ్యాసంలో బలపరిచారు. బుద్ధ చరిత్రములో ఆఖరిగా శంకరాచార్యులు ఎంత తొక్కిపట్టినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బుద్ధుని మతం ప్రచారంలోకి వచ్చిందని వక్కాణించారు. Blindness (Jose Saramago) హఠాత్తుగా ఏకకాలంలో ఊరందరూ గుడ్డివాళ్ళైపోతే ఏమవుతుందో ఊహించండి! అటువంటి విపత్సమయంలో ఊరిజనాన్ని ఒక వైద్యుని భార్య, తను గుడ్డిదానిగా నటిస్తూ, అందరినీ ఒక కొలిక్కి ఎలా తెచ్చిందో ‘చూపించే’ సుఖాంత రూపకం, ఈ నవల. పొడుగాటి గొలుసుకట్టు వాక్యాలతో, ఉత్తమ పురుష ప్రథమ పురుషల మేలుకలయికతో అన్యాపదేశంగా చైతన్య స్రవంతికీ, కలవరపెట్టే యథార్థతకీ మధ్య పాఠకుణ్ణి వడివడిగా నడిపించే నవల. చూడగలగడం అంటే నిజంగా ఏమిటి? అన్నది ఆఖరిప్రశ్న. మానవనైజాన్ని అన్ని కోణాలనుంచీ ‘కళ్ళకి కట్టినట్టు’ చూపిస్తాడు సరమగొ. ప్రేమ, విశ్వాసం, భయం, పిరికితనం, హింస, దౌర్జన్యం, ఈర‡్ష్య, నిస్పృహ, ఆనందం – ఇవన్నీ. సరమగొ పోర్చుగల్ కమ్యూనిస్టు పార్టీ మెంబరు. అయితేనేం! తన పార్టీ గురించి ఇలా రాస్తాడు: ‘నా పార్టీకి, సాహిత్యానికి సంబంధించిన విషయాలపై, కళాత్మక వివాదాంశాలపై నిర్ణయించటానికి అర్హత ఉన్నదని నేను అనుకోను’. పచ్చ నాకు సాక్షిగా (నామిని సుబ్రహ్మణ్యం నాయుడు) చాలా ఏళ్ళక్రితం ‘సినబ్బ కతలు’ చదవటం మొదలెట్టా. నిజం చెప్పొద్దూ? ఆ బాస, ఆ యాస, మొదట్లో కొంచెం ఇబ్బంది పెట్టాయి. ‘రామ బజినా సేయరా! ఆడపిల్లతో పని ఏమిరా!!’ కత, ఒక పేరా చదవాను. అంతే! విడిచిపెట్టకుండా, ఆఖరి కత ‘చిత్తానూరులో పెండ్లి భోజనాలు’ పూర్తయ్యేవరకూ ఒకే బిగిన చదివేసాను, ఒక్కోసారి పగలబడి నవ్వుతూ, చాలాసార్లు కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. ఈ కతలు ఆంధ్రావాళ్ళ భాషలో చెప్పినా, మరో భాషలోకి అనువదించినా (ఆ ప్రయత్నం చేసి విఫలుణ్ణయ్యాను!) రసం తీసేసిన చెరుకుపిప్పి నమిలినట్టుంటుంది. ఆ మిట్టూరోడి మాటల్లోనే అవి చదవాలి; కతల్లో నిజమైన సంతృప్తి, ధైర్యం, ప్రేమ, బాధ, విషాదం, కన్నీరు, హాస్యం – అన్నీ సరిపాళ్ళల్లో కావాలంటే. SrInatha: The Poet Who Made Gods and Kings (Velcheru Narayana Rao and David Shulman) ఈ పుస్తకం, క్రీ.శ. 1370–1450 మధ్య జీవించిన శ్రీనాథ కవిసార్వభౌముని జీవిత చరిత్ర (Literary Biography). కావ్యాలు రాసిన శ్రీనాథుడినీ, చాటువుల్లో కనిపించే శ్రీనాథుణ్ణీ ఒకడుగానే పరిగణించి సాహిత్య పరిశోధనలు చేసిన చాలామంది నిజమైన ‘సాహిత్య జీవిత చరిత్ర’కి కొంత అపచారం చేసి ఉండవచ్చు. ఒక కవి రాసిన కావ్యాలన్నీ నిశితంగా పరిశీలించి ఆ కవి జీవిత చరిత్రని చెప్పిన మొట్టమొదటి పుస్తకం ఇది. శివరాత్రి మాహాత్మ్యం దక్షిణ ఆసియాలో వచ్చిన తొలి నవలిక అని సాధికారంగా నిరూపించిన పుస్తకం. భీమఖండం చాలా భాగం శ్రీనాథ కల్పితం. ఈ పుస్తకం చదివిన తరువాత, శ్రీనాథుని కల్పనా సౌందర్యం మెచ్చని వారుండరు. Collected Stories by Raymond Carver రేమండ్ కార్వర్ అమెరికన్ కథకి 1960 – 1980లలో ఒక కొత్త రూపం ఇచ్చాడు. మినిమలిజం అని, రియలిజం అని ఏ పేర్లు పెట్టినప్పటికీ, అతనిపై పరోక్షంగా షెహోవ్ ప్రభావం ఉన్నదన్నది నిర్వివాదం. ఆయన కథా సంకలనాలన్నీ కలిపి, ఒక బృహత్సంకలనం (1020 పేజీలు)గా అచ్చు వేసారు. కెథెడ్రల్ గొప్ప కథ. ఒక గుడ్డివాడికి కెథెడ్రల్ ఎలా వుంటుందో చెప్పటం ఎంత కష్టమో, ఎంత అలసట పుట్టించే విషయమో సూచించే కథ. ఈ ఒక్క కథపై కొన్ని వందల వ్యాఖ్యలు వచ్చాయి. ఈయన కథలలో అనాసక్తత, ఆవేదన అతి సున్నితంగా మలచబడటం కనిపిస్తుంది. మొదట్లో కార్వర్ కథలన్నీ అతని ఎడిటర్ గోర్డన్ లిష్ కత్తిరించి చాలా మార్పులు చేసి ప్రచురించాడు. కార్వర్‌కి పేరు వచ్చిన తరువాత వారిద్దరి మధ్య స్నేహం చెడింది. రెండు కథలు – కార్వర్ రాసింది రాసినట్టుగానూ, గోర్డన్ లిష్ మార్పులతోనూ కలిపి ప్రచురించారు. ఈ భాగం ఎడిటర్లకి నచ్చవచ్చు. రచయితలకి చిరాకు కలిగించవచ్చు. వేలూరి వేంకటేశ్వర రావు vrveluri@gmail.com -
ఏసీబీకి చిక్కిన సీటీవో
నరసన్నపేట : అవినీతి నిరోధక శాఖ వలలో వాణిజ్యపన్నుల శాఖ అధికారి (సీటీవో) చిక్కారు. ఓ హోటల్‌కు సంబంధించి వ్యాట్ లైసెన్స్, ఇద్దరు పేరున ఉన్న వ్యాట్ లెసెన్స్ రద్దు కోసం ఊణ్ణ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నుంచి మంగళవారం పది వేల రూపాయల లంచం తీసుకుంటూ నరసన్నపేట సీటీవో కె.నాగరాజు అడ్డంగా దొరికిపోయారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. నరసన్నపేటలోని లక్ష్మీ టాకీస్ వద్ద ఊణ్ణ వెంకటేశ్వరరావు పేరున అన్నపూర్ణ గార్డెన్ రెస్టారెంట్ ఉంది. దీన్ని ఎన్.గోవిందరావు అనే వ్యక్తి ఇటీవల లీజుకు తీసుకున్నారు. ఈయన పేరున వ్యాట్ లైసెన్స్ కావాలని సీటీఓను వెంకటేశ్వరరావు సంప్రదించారు. అయితే అప్పటికే గోవిందరావు పేరున మరో చిరునామాతో వ్యాట్ లైసెన్స్ ఉంది. దీన్ని రద్దు చేస్తేనే కొత్తది ఇవ్వగలమని సీటీఓ స్పష్టం చేశారు. అలాగే వెంకటేశ్వరరావు, గోవిందుల పేరున ఉన్న వ్యాట్ లైసెన్స్‌లు రద్దు చేస్తూ కొత్తగా అన్నపూర్ణ గార్డెన్ రెస్టారెంట్ పేరుతో గోవింద్‌కు కొత్తగా వ్యాట్ రిజిస్టేషన్ కావాలని వీరు కోరారు. ఈ పనులన్నీ పూర్తికావాలంటే 25 వేల రూపాయలు లంచంగా ఇవ్వాలని సీటీవో నాగరాజు డిమాండ్ చేయగా.. పది వేల రూపాయలు ఇచ్చేందుకు హోటల్ నిర్వాహకులు అంగీకరించినట్టు డీఎస్పీ చెప్పారు. తరువాత లంచం డిమాండ్ చేస్తున్న విషయాన్ని తమ దృష్టికి వెంకటేశ్వరరావు తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. దీంతో ఆయన చేతికి పది వేల రూపాయలు ఇచ్చి.. సీటీవోకు ఇవ్వాలని మంగళవారం మధ్యాహ్నం పంపించామన్నారు. కార్యాలయంలోనే వెంకటేశ్వరరావు నుంచి సీటీవో నాగరాజు లంచం తీసుకుంటుండగా.. దాడి చేసి రెడ్‌హ్యాడెడ్‌గా పట్టుకున్నట్టు వివరించారు. సీటీవోను అరెస్టు చేశామని..విశాఖపట్నంలోని ఏసీబీ కోర్టులో బుధవారం హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. స్థానికంగా సంచలనం అవినీతి నిరోధక శాఖ అధికారులకు సీటీవో చిక్కిన విషయం నరసన్నపేటలో సంచలనమైంది. సీటీఓ నాగరాజు ఉదయం 11 గంటలకే కార్యాలయానికి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ విధులు నిర్వహించుకుంటున్నారు. ఒంటి గంట సమయంలో హోటల్ యజమాని వెంకటేశ్వరరావు సీటీవో కార్యాలయానికి రావడం, కొద్ది సమయానికే ఏసీబీ అధికారులు దాడి చేసి సీటీవోను అదుపులోకి తీసుకోవడంతో మిగిలిన సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఏసీబీ దాడుల్లో సీఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు
జిల్లా దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారుల సంఘం రాజమహేంద్రవరం కల్చరల్ : పెద్ద నోట్ల రద్దు తరువాత, జిల్లాలోని దేవాలయ హుండీల ద్వారా, కోట్లాది రూపాయల నల్లధనం మార్పిడి జరిగినట్లు కొన్ని పత్రికలలో (సాక్షి కాదు) వచ్చిన వార్తలలో వాస్తవం లేదని జిల్లా దేవాలయ కార్యనిర్వహణాధికారుల సంఘం అధ్యక్షుడు బొక్కా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం మెయిన్ రోడ్డులోని నాగవరపు బుచ్చబ్బాయి సత్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దనోట్లు రద్దయ్యాక, జిల్లా వ్యాప్తంగా గల 48 దేవాలయాల్లో హుండీలు తెరచి లెక్కించగా వచ్చిన సొమ్ము రూ3,43,72,913/ కాగా, కోట్లాది రూపాయల నల్లధనం మార్పిడి జరిగినట్టు కొన్ని పత్రికలు నిరాధార అరోపణలు చేయడం శోచనీయమన్నారు. ఈ ఆరోపణలు హిందూ మత విశ్వాసాలను కించపరిచేటట్టు అసత్య కథనాలు వెలువరించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నోట్ల లెక్కింపు ధర్మకర్తల మండలి సభ్యులు, బ్యాంకు ప్రతినిధులు, పోలీసులు, స్థానికుల సమక్షంలో, సీసీ కెమేరాల పర్యవేక్షణలో జరుగుతుందని, లెక్కించిన సొమ్మును బ్యాంకులలో జమ చేస్తారన్నారు. మంగళవారం జాయింట్ కలెక్టర్–2 సమక్షంలో జరిగిన విచారణలో ఏ ఒక్క ఈవో ఉన్నతాధికారుల ఒత్తిడికి తాము గురయ్యామని పేర్కొనలేదన్నారు. ఈ విషయంలో ఒక ప్రముఖ ఆలయ ఈవో ఫిర్యాదు చేసినట్టు వచ్చిన వార్తలు నిరాధారమన్నారు. పెద్దనోట్ల మార్పిడి జరిగిన తరువాత నెలరోజులలో వచ్చిన సొమ్ము రూ.3,43,72,913 కాగా, రోజుకు రెండు కోట్ల మార్పిడి జరిగిందనడం శోచనీయమన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా కార్యనిర్వహణాధికారుల సంఘం కార్యదర్శి బి.కృష్ణ చైతన్య, ప్రతినిధులు తారకేశ్వరరావు, వీరవెంకటేశ్వరరావు, ఆకెళ్ల భాస్కర్, రాష్ట్ర సంఘం సంయుక్త కార్యదర్శి వి.పళ్లంరాజు, అర్చక సమాఖ్య ప్రతినిధులు ఖండవిల్లి కిరణకుమారాచార్యులు, ఎస్.వి.జనార్దనాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
రా రమ్మని.. రారా రమ్మని...!
పర్యాటక శాఖ సరికొత్త ప్యాకేజీలు ఆన్లైన్లో బుకింగ్ ఏపీ టూరిజం డీఎం వెంకటేశ్వరరావు సాగర్‌నగర్ : దసరా సెలవులు దగ్గర పడడంతో రాష్ట్ర పర్యాటక శాఖ సరికొత్త ప్యాకేజీలను సిద్ధం చేసింది. ఇప్పటికే దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, చ త్తీస్‌ఘడ్ పర్యాటకులు విశాఖ అందాలను ఆస్వాదించడానికి ఆన్లైన్ బుకింగ్‌లు కోసం ఎగబాకుతున్నారు. దీంతో ఏపీ టూరిజంశాఖ పర్యాటకులకు ఆకట్టుకునేందుకు కొన్ని ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. వీటి వివరాలను రాష్ట్ర టూరిజం సెంట్రల్ రిజర్వేషన్ డిప్యూటీ మేనేజర్ పి. వెంకటేశ్వరరావు వివరించారు. అరకు ప్యాకేజీ టూర్ (రైలు కమ్ రోడ్డు) విశాఖపట్నం నుంచి అరకు (వెళ్లేటప్పుడు రైల్లో..వచ్చేటప్పుడు బస్సులో) వెళ్లిరావడానికి పెద్దలకు రూ.875, పిల్లలకు రూ.700లు. విశాఖ రైల్వేస్టేషన్లో ఉదయం ఆరు గంటలకు ట్రైన్ ఎక్కి అరకు చేరుకుంటుంది. అక్కడ ఏపీటూరిజం బస్సులో అరకు పర్యాటక ప్రదేశాలైన పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం,అనంతగిరి హిల్స్, కాఫీతోటలు, బొర్రా గుహలను తిలకించవచ్చు. అన్నీ పర్యాటక ప్రదేశాలు ప్రవేశ రుసుం, టిఫిన్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం కాఫీ,స్నాక్స్,మినరల్ వాటర్ బాటిల్స్ ఇస్తారు. వైజాగ్ నైట్ లీజర్‌కు.. సాయంత్రం ఖాళీ సమయంలో నగర పర్యాటక ప్రదేశాలను వీక్షించే పర్యాటకుల కోసం వైజాగ్ నైట్ లీజర్ ప్యాకేజీ టూర్‌ను ప్రకటించింది. సాయంత్రం 4 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఉంటుంది. బోట్ ఫిషింగ్ హార్బర్, సబ్‌మెరైన్ మ్యూజియం, కైలాసగిరి, శిల్పారామం, రుషికొండ బీచ్ రిసార్ట్స్‌లో డిన్నర్. ప్రవేశ రుసుము కలుపుకుని ప్యాకేజీ ఉంటుంది. పెద్దలకు రూ. 400, పిల్లలకు రూ. 300లు. ఇతర సమాచారం కోసం డిప్యూటీ మేనేజర్ సెల్ నంబర్లో 98480 07022 సంప్రదించవచ్చు. బై రోడ్డు ప్యాకేజీ విశాఖ నుంచి దట్టమైన అడవుల మధ్యలో పాము మెలికలు తిరిగేలా ఘాట్ రోడ్డుపై బస్సులో ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి పర్యాటకుల కోసం బై రోడ్డుపై ఒక్కరోజు ప్యాకేజీని కేటాయించారు. పెద్దలకు రూ. 1130,పిల్లలకు రూ.900లు. ఉదయం ఏడు గంటలకు బయలు దేరి రాత్రి తొమ్మిది గంటలకు తిరిగి విశాఖ చేరుకుంటారు. మినరల్ వాటర్, లంచ్, సాయంత్రం కాఫీ, స్నాక్స్ ఇస్తారు. అరకులో పద్మాపురం గార్డెన్స్, బొర్రా రైల్వేస్టేషన్, బొర్రా గుహలు, కటిక జలపాతం, అరకు గిరిజన మ్యూజియాన్ని సందర్శించవచ్చు. ప్రవేశం ఉచితం. వైజాగ్ సిటీ టూర్ నగరంలోని పర్యాటక పర్యాటక ప్రదేశాలను వీక్షించేందుకు ఒక రోజు సిటీ టూర్‌ను ప్యాకేజీని ప్రకటించారు. పెద్దలకు రూ. 475, పిల్లలకు రూ. 380(3-10 వయస్సు) సెంట్రల్ రిజర్వేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉదయం తొమ్మిది గంటలకు బయలు దేరి సింహాచలం, కైలాసగిరి, తెలుగు మ్యూజియం, జాతర శిల్పారామం (మధురవాడ),తొట్లకొండ, పిషింగ్ హార్బర్, బోట్ షికార్, రుషికొండ బీచ్, రామానాయుడు స్టూడియో, విశాఖ మ్యూజియం, సబ్‌మెరైన్ మ్యూజియం,విశాఖ మ్యూజియం వంటి ప్రదేశాలు తిలకించవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు బయలు దేరి ప్రదేశంలోనే దింపుతారు. ఇదే టూర్ ఏసీ బస్సుల్లో అయితే పెద్దలకు రూ.600, పిల్లలకు రూ.500లు శాఖహార భోజనం అందిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అశ్వారావు పేట మండలం ఉట్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలోఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు బండారుగుంపు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు(33)గా గుర్తించారు. బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా అదుపు చెట్టును ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలో పడ్డాడు. తీవ్రగాయాలై నీటిలో ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలవరం కాలువలో యువకుడి గల్లంతు
నల్లజెర్ల మండలం అనంతపల్లి శివారులో ఓ బ్రిడ్జి పోలవరం కాలువలో ఈతకు దిగి ఓ యువకుడు ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి కొయ్యలగూడెం మండలం శ్రీరంగపట్నానికి చెందిన దప్పసాని వెంకటేశ్వరరావు(25)గా గుర్తించారు. గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయి. -
215 ప్యాకెట్ల పత్తి విత్తనాల సీజ్
ఖమ్మం అర్బన్ మండలం చిమ్మపుడిలో ఎలాంటి అనుమతి లేకుండా కొందరు వ్యాపారులు వీధుల్లో, రైతుల ఇళ్ల వద్ద పత్తి విత్తన ప్యాకెట్లు విక్రయిస్తుండగా, వ్యవసాయ శాఖ ఏడీ కొంగర వెంకటేశ్వరరావు, ఏఓ అరుణ శుక్రవారం అడ్డుకున్నారు. గుంటూరు నుంచి తీసుకొచ్చి బయటి మార్కెట్ కంటే రూ.40 తగ్గించి జాదు, ఏటీఎం, అజిత్, తదితర పేర్లతో ఉన్న 75 ప్యాకెట్లను రైతులకు అమ్మినట్లు గుర్తించారు. అందుబాటులో ఉన్న 215 ప్యాకెట్లను సీజ్ చేశారు. వ్యాపారులు ఉన్నం నాగేశ్వరరావు, కుసు అనిల్, కొంటెముక్కల నిఖిల్‌లపై కేసు నమోదు చేశారు. ఈ విత్తనాల నాణ్యత పరీక్షించేందుకు ల్యాబ్‌కు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. -
ఏసీబీ అధికారులు వచ్చారని...
ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు సోదాలకు వెళ్లగా.. సినీ ఫక్కీలో పారిపోయాడో అవినీతి అధికారి. సినిమా స్టోరీని తలపించిన.. ఈ ఘటన గుంటూరు నగరంలో చోటుచేసుకుంది. ఆర్ అండ్ బీ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న వెంకటేశ్వరరావు నగరంలోని ఏటీఆగ్రహారం జీరోలైన్‌లో నివాసం ఉంటున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆయన ఆరోపణలు రావటంతో శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే, విషయం ముందుగానే పసిగట్టిన వెంకటేశ్వరరావు ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. ఎక్కడికి వెళ్లాడో తేలక పోవడంతో.. అధికారులు అతని నివాసం వద్దే విచి ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇది రొటీన్ కథనం కాదు!
గతంలో ‘థియేటర్లో’ అనే సినిమా నిర్మించిన సాయి కిరణ్ ముక్కామల దర్శకునిగా మారారు. మాంత్రిక్స్ మీడియా పతాకంపై రంజిత్, అర్చన జంటగా ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కథనం’. సాబు వర్గీస్ స్వరపరచిన పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. మోషన్ పోస్టర్‌ను రచయిత పరుచూరి వెంకటేశ్వర రావు, టీజర్‌ను సీనియర్ దర్శకులు ఎ.కోదండరామి రెడ్డి, బిగ్ సీడీని డెరైక్టర్ పూరీ జగన్నాథ్, పాటల సీడీని నటుడు తనికెళ్ల భరణి విడుదల చేశారు. ‘‘ప్రతి మనిషికీ ఓ కథ, కథనం ఉంటుంది. ఈ చిత్రంలో కథ రొటీన్‌గా ఉండదు. కథనం ఏంటో తెరపైనే చూడాలి’’ అన్నారు దర్శక-నిర్మాత. ‘‘పోస్టర్స్, ప్రోమో, టైటిల్, ట్యాగ్ లైన్ బాగున్నాయి. ప్రతి మనిషికీ బిగ్గెస్ట్ పెయిన్ ప్రకృతి నుంచే వస్తుంది. దేవుడు అందరితో ఫుట్‌బాల్ ఆడుకుంటాడు’’ అని పూరీ జగన్నాథ్ అన్నారు. రంజిత్, అర్చన తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: ఐ.సునీల్ కుమార్. -
కూతురిపై తండ్రి అమానుషం
మానసిక పరిణతి లేని కూతురిని కంటికి రెప్పలా చూసుకోవలసిన తండ్రే ఆమెపై లైంగికదాడికి పాల్పడిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం వెలుగు చూసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అంబాజీపేటలోని నెల్లివారిపేటకు చెందిన చింతపల్లి వెంకటేశ్వరరావు (శ్రీను) వడ్రంగి పని చేసుకుని జీవిస్తున్నాడు. అతడి భార్య ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లింది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె (17) మానసిక పరిణతి లేదు. తొమ్మిదో తరగతి వరకూ చదివిన ఆ బాలిక రెండేళ్లుగా తన పెద్దమ్మ ఇంటివద్దనే ఉండేది. ఆరు నెలల క్రితం తండ్రి వద్దకు తిరిగి వచ్చింది. రోజూ తాగి వచ్చే శ్రీను కూతురితో అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఆమె కేకలు వేసేదని స్థానికులు చెబుతున్నారు. రెండు రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుంటే స్థానికులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక మూడో నెల గర్భిణి అని ధ్రువీకరించారు. దీంతో స్థానికులు బాలికను నిలదీసి అడిగారు. ఆమె తన తండ్రి ప్రవర్తన గురించి వివరించడంతో అతడి అకృత్యం వెలుగు చూసింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
బావిలో పడి ముగ్గురు మృతి
నీరు తాగటానికి బావిలోకి దిగి జారిపడ్డ భర్తను రక్షించబోయి భార్య కూడా పడిపోయింది. వారిని కాపాడేందుకు యత్నించిన మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదం కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం మాధవరం సమీపంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వ గ్రామానికి చెందిన కొరకుప్పల కోటయ్య(50), నాగేంద్రమ్మ(45) దంపతులు తమ గొర్రెలను తోలుకుని బుధవారం మాధవరం సమీపంలోని పొలాల్లోకి వెళ్లారు. సాయంత్రం సమయంలో కోటయ్య మంచినీరు తెచ్చేందుకని సమీపంలోని నేలబావిలోకి దిగాడు. అయితే, కాలుజారి నీటిలో పడిపోయిన కోటయ్య కేకలు వేయటంతో నాగేంద్రమ్మ వచ్చి భర్తను రక్షించేందుకు చీర కొంగును అందించింది. కోటయ్యను పైకి లాగే క్రమంలో నాగేంద్రమ్మ కూడా పడిపోయింది. వారి కేకలు విని సమీపంలోనే ఉన్న మాధవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు(60) పరుగున అక్కడికి చేరుకుని, రక్షించేక్రమంలో అతడు కూడా పట్టుతప్పి నీళ్లలో పడిపోయాడు. ముగ్గురూ నీట మునిగి చనిపోయారు. గురువారం ఉదయం వరకు వారి జాడ లేకపోవటంతో కుటుంబసభ్యులు వెతకగా.. బావిలో వారి శవాలు తేలియాడుతూ కనిపించాయి. సమాచారం అందుకున్న సీఐ వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నతండ్రే కాలయముడు
అనుమానంతో కుమార్తెపై తండ్రి కత్తితో దాడి హాస్పటల్‌కు తరలిస్తుండగా మృతి ఉత్తరచిరువోలులంక (మోపిదేవి) : వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో తండ్రే కాలయముడయ్యాడు. కన్నకుమార్తెపై కత్తితో దాడిచేయడంతో ఆమె మృతిచెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. మోపిదేవి మండలం ఉత్తరచిరువోలులంకకు చెందిన నడకుదుటి మాధవి (35)పై తండ్రి చింతా వెంకటేశ్వరరావు శుక్రవారం ఉదయం కత్తితో దాడిచేశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆమెను చూసి తండ్రి కూడా సృహ తప్పి పడిపోవడంతో స్థానికులు హాస్పటల్‌కు తరలించారు. 108లో మాధవిని అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరిలించగా అక్కడి వైద్యుల సూచనల మేరకు మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. సమాచారం అందుకున్న అవనిగడ్డ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ వెంకట్‌కుమార్ ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మనమరాలి వివాహం ఆగిపోవడానికి కుమార్తె కారణమని.. మృతురాలి మాధవికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు పెండ్లి సంబంధం రాగా మాధవి ప్రవర్తన వల్లే చెడిపోయిందని, ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకోవాలని తండ్రి వెంకటేశ్వరరావు హెచ్చరించినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం మృతురాలి ఇంటివద్ద వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో మాధవి గొడవపడుతుండగా తండ్రి కల్పించుకోవడంతో తోపులాట జరిగిందని, ఆవేశంతో తం డ్రి కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడని సమాచారం. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి పరారైనట్లు తెలిసింది. పుట్టింటి వద్దే ఉంటూ.. మాధవిని తొలుత గ్రామంలో బంధువుకే ఇచ్చి వివాహం చేయగా కొద్దికాలంలోనే అతనికి విడాకులు ఇచ్చి పుట్టింటికి వచ్చేసింది. అనంతరం ఆమె కోరుకున్న వ్యకి ్తతో స్థానిక పెద్దలు రెండో వివాహం చేశారు. అతనితో ఇద్దరు ఆడపిల్లలను కన్న తరువాత గొడవలు పడి పుట్టింటి వద్దనే ఉంటూ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలుస్తోంది. మాధవి మృతి చెందగా ఆమె కుమార్తెలు ఇద్దరూ తల్లిదండ్రులకు దూరం అయి అనాధలుగా మిగిలిపోయారని గ్రామస్తులు విచారం వ్యక్తంచేస్తున్నారు. -
రాఘవేంద్రుని సన్నిధిలో ఆప్కాబ్ చైర్మన్
మంత్రాలయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు(ఆప్కాబ్) చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు గురువారం ఉదయం మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. సతీ సమేతంగా మంత్రాలయం చేరుకున్న ఆయన ముందుగా గ్రామ దేవతలకు పూజలు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీమఠం అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. -
వేటకు వెళ్లి మత్స్యకారుడు గల్లంతు
పి. గన్నవరం: తూర్పుగోదావరి జిల్లాలో ఓ మత్స్యకారుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన జిల్లాలోని పి.గన్నవరం మండలంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మండలంలోని కె.ముంజవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు(38 ) ఈ రోజు ఉదయం చేపల వేటకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు సముద్రంలో పడి గల్లంతయ్యాడు. దీంతో బాధితుడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గోడకూలి వ్యక్తి మృతి
తోట్లవల్లూరు: ప్రమాదవశాత్తు గోడకూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా తోట్ల వల్లూరు మండల కేంద్రంలో సోమవారం ఉదయం జరిగింది. మండల కేంద్రంలో ఓ పాత భవనాన్ని కూలుస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కటారి వెంకటేశ్వరరావు(55) అనే వ్యక్తిపై పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
14 స్కూల్ బస్సుల సీజ్
భవానీపురం : నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్కూల్ బస్‌లపై డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావు నేతృత్వంలో మంగళవారం తనిఖీలు నిర్వహించి, 14 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని పాఠశాలల బస్సుల డ్రైవర్లు, యాజమాన్యాలు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను విస్మరిస్తున్నారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా సుమారు 400 బస్‌లను తనిఖీ చేశామని, డ్రైవరక్లు లెసైన్స్‌లు, బస్‌కు పర్మిట్లు లేకపోవడం, టాక్స్‌లు చెల్లించక పోవడం వంటి కారణాలతో 25 బస్‌లపై కేసులు నమోదు చేశామన్నారు. అందులో 14 బస్‌లను సీజ్ చేశామని వివరించారు. నగరంలోని పటమట, వారధి, చుట్టుగుంట ప్రాంతాలలో మూడు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు నిర్వహించామని తెలిపారు. డ్రైవర్ల ప్రవర్తనకు సంబంధించి పలు అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నామని చెప్పారు. పిల్లలను బస్‌లలో పంపే తల్లిదండ్రులు నెలకొకసారైనా వాటిలో ప్రయాణించాలని సూచించారు. అలా చేస్తే బస్ కండిషన్, డ్రైవర్ ప్రవర్తన తెలుస్తాయన్నారు. బస్‌లలో ఏర్పాటు చేసే ఫస్ట్‌ఎయిడ్ బాక్స్‌లో ప్రాథమిక చికిత్సకు సంబంధించిన మందులు ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో బస్లోపల నుంచి బయటకు ఎలా రావాలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ బస్ పర్మిట్ తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఇతర పనులకు వినియోగిస్తున్నాయన్నారు. అటువంటివారిపై కేసులు నమోదు చేస్తామని, అప్పటికీ వారిలో మార్పు రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో రవాణా శాఖ అధికారులు వి.ఆర్.రవీంద్రనాథ్, జి.సంజీవకుమార్, బి.చెల్లారావు, వి.వి.ఎస్.ఎన్.మూర్తి, ఎన్.ఎల్ సుబ్బలక్ష్మి, ఎం.రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
భీమవరం అర్బన్ : స్థానిక 32వ వార్డులో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది. తన కుమార్తెను ఉరివేసి చంపేశారని తండ్రి, బంధువులు ఆరోపిస్తున్నారు. సంఘటనకు సంబంధించి మృతురాలి తండ్రి పోలీసులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాళ్ళ మండలం సీసలి గ్రామానికి చెందిన వాసుకూరి వెంకటేశ్వరరావు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని పెద్ద కుమార్తె రామలక్ష్మిని పట్టణానికి చెందిన శంకు సత్యనారాయణ కుమారుడు శంకు రాంబాబుకు ఇచ్చి తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేశారు. రాంబాబు కాంట్రాక్టర్. వారికి ఒక ఒక కుమార్తె కలిగింది. రెండేళ్ల క్రితం రామలక్ష్మి మృతిచెందింది. అయితే అమె మృతి చెందడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. అప్పటికే వారిద్దరికీ ఏడేళ్ల కుమార్తె ఉండటంతో రామలక్ష్మి తండ్రి వెంకటేశ్వరరావు తన రెండో కుమార్తె ఉమామహేశ్వరిని రాంబాబుకు ఇచ్చి వివాహం చేశారు. వారికి ప్రస్తుతం ఏడాది కుమార్తె ఉంది. రాంబాబు, ఉమామహేశ్వరిలు ఇద్దరూ 32వ వార్డులోని ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం అద్దెకు ఉంటున్న ఇంట్లోని గదిలో ఫ్యాన్‌కు చీర కట్టి ఉమామహేశ్వరి ఉరి వేసుకుంది. విషయం తెలుసుకున్న ఉమామహేశ్వరి తండ్రి వెంకటేశ్వరరావు, అతని భార్య, బంధువులు హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి చేరుకుని పోలీసులకు సమాచారమందించారు. టూటౌన్ ఎస్సై శ్రీనివాసకుమార్, ఏఎస్సై ఖాన్ తదితరులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. తన కుమార్తె చావుకు భర్తే కారణమని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నాడు. కట్నం కింద పెద్ద కుమార్తెకు ఎకరం పొలం, చిన్న కుమార్తెకు ఎకరం పొలం ఇచ్చామని, పెద్ద కుమార్తె వివాహ సమయంలో రూ.1,70,000, చిన్న కుమార్తె సమయంలో రూ.1,40,000లు నగదు ఇచ్చానని, ఇవి కాకుండా బంగారం, వెండి వస్తువులు పెద్దఎత్తున పెట్టానని, ఇద్దరు కుమార్తెలను చంపేశారని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అప్పులున్నాయని, పొలం అమ్ముకుని రమ్మని ఇటీవల తన కుమార్తెను భర్త రాంబాబు వేధిస్తున్నాడని కన్నీరుమున్నీరయ్యాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని ఉమామహేశ్వరి తన సూసైడ్ లేఖలో పేర్కొంది. సంఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని, సూసైడ్ నోట్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని ఎస్సై శ్రీనివాసకుమార్ తెలిపారు. -
‘పుష్కర’ రహదారులకు రూ.110 కోట్లు..
వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి ఖమ్మం జెడ్పీసెంటర్: గోదావరి పురష్కరాల నేపథ్యంలో భద్రాచలం పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణానికి రూ.110 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి కోరారు. గోదావరి పుష్కరాల నిర్వహణపై కలెక్టర్లతో రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ బి.వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి బుధవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 14న ప్రారంభం కానున్న పుష్కరాలకు భద్రాచలానికి కోటి మందికిపైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. ప్రతి ఏడాది భద్రాచలం పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోందని, అక్కడికి చేరుకునే వంతెన ఇవతల వైపు రద్దీని అదుపు చేసేందుకు బూర్గంపాడు-ఏటూరునాగారం మార్గాన్ని నాలుగు వరుసలుగా వెడల్పు చేయాల్సి ఉందని అన్నారు. అదనంగా స్నానపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. గత పుష్కరాలోల ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాకపోకలకు వేర్వురుగా రహదారుల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినట్లు వివరించారు. ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు రూ.110 కోట్లలో రూ. 65 కోట్లు ఆర్అండ్బీ, రూ.45 కోట్లు పంచాయతీరాజ్ రహదారులకు ఖర్చు అవుతాయన్నారు. భద్రాచలం పినపాక నియోజకవర్గాల పరిధిలో 14 స్నానపు ఘట్టాలు నిర్మాణానికి రూ.34 కోట్లు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. పుష్కరాల పనుల పర్యవేక్షణకు ఒక ప్రత్యేకాధికారిని నియిమించాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో ఎస్పీ షానవాజ్ ఖాసిం, ఆర్అండ్బీ ఎస్ఈ సతీష్, దేవాదాయ ఏసీ రాజేంధర్ తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర భూ సర్వేకు సంసిద్ధం
భూసేకరణ రికార్డుల మోడలైజేషన్ 1950 నుంచి 2014 వరకు వివరాల సేకరణ వచ్చే మార్చి 30 నాటికి శాటిలైట్ సర్వే పూర్తి ఏప్రిల్ నుంచి ప్రత్యక్ష పరిశీలన సర్వే పూర్తయితే భవిష్యత్తులో వివాదాలకు చోటుండదు సర్వేయర్ అండ్ ల్యాండ్ ఆర్డీడీ కందుల వెల్లడి నూజివీడు రూరల్ : భవిష్యత్‌తో భూవివాదాలు నెలకొనకుండా ఉండేలా సమగ్ర భూసర్వేకు సంసిద్ధమవుతున్నామని సర్వేయర్ అండ్ ల్యాండ్ రీజనల్ డిప్యూటీ డెరైక్టర్ కందుల వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నేషనల్ ల్యాండ్ రికార్డు మోడలైజేషన్ ప్రాజెక్టు కింద సమగ్ర భూసర్వేకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా 1950 నుంచి 2014 వరకు ఇచ్చిన అసైన్డ్ భూముల వివరాలను సేకరించి సమగ్ర మార్పులు చేస్తున్నామన్నారు. భూసేకరణ రికార్డులను తీసివేసి మోడలైజేషన్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఒక సర్వే నంబర్లో ఎన్ని సబ్డివిజన్లు ఉన్నాయనే సమాచారం సేకరించి.. గతంలో ఉన్న సబ్డివిజన్లకు ప్రస్తుతం ఉన్న సబ్డివిజన్లను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2015 మార్చి 30 నాటికి శాటిలైట్ సర్వే వివరాలను పూర్తిచేసి ఏప్రిల్ నుంచి ప్రత్యక్ష పరిశీలన ప్రారంభించాల్సి ఉందన్నారు. ప్రత్యక్ష భూపరిశీలనకు ఒక్కొక్క మండలానికి ఐదుగురు సర్వేయర్లు, ఇద్దరు వీఆర్వోలు, ముగ్గురు లెసైన్స్ సర్వేయర్లు అవసరమవుతారని చెప్పారు. భూ సర్వేకు ఇబ్బందిగా మారనున్న సర్వేయర్ల కొరత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రత్యక్ష భూసర్వేలు నిర్వహించడానికి సర్వేయర్ల కొరత ఇబ్బందికరంగా మారుతుందని ఆర్డీడీ చెప్పారు. రీజనల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలోని 277 మండలాలకు గాను 92 మండలాల్లో సర్వేయర్లను ప్రభుత్వం నియమించలేదన్నారు. భవిష్యత్‌లో భూవివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం నిర్వహించే ప్రత్యక్ష భూసర్వేకు సుమారు రూ.400 కోట్లు ఖర్చవుతుందని, కాని అందుకు తగినట్లుగా సర్వేయర్ల నియామకం లేకపోవడం ఇబ్బందికరంగా మారుతుందని చెప్పారు. అందుకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేశామన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యక్ష భూసర్వే నిర్వహించారని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూసర్వేకు సిద్ధమవుతోందని ఆయన వివరించారు. ప్రభుత్వం నిర్వహించే సమగ్ర భూసర్వే పూర్తయితే భవిష్యత్‌లో భూవివాదాలకు చోటుండదని ఆయన తెలిపారు. -
జైలుకు పంపిన రూ. 20
బట్టబయలైన విశాఖ పోర్టు ట్రస్టు ఉద్యోగి మోసం.. కింది కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: మోసగాళ్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో చిన్న తప్పు చేసి దొరికిపోతుంటారు. ఈ కేసులో కూడా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఉద్యోగి ఒకరు రూ.20 విషయంలో చేసిన పొరపాటు అతని మోసాన్ని బట్టబయలు చేసింది. ఆ ఉద్యోగి జైలు ఊచలు లెక్కించాల్సి వచ్చింది. పోర్ట్ ట్రస్ట్ ఆర్థిక సలహాదారు కార్యాలయంలో క్యాష్ సెక్షన్లో 1995-98 మధ్య వెంకటేశ్వరరావు సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేశారు. సిబ్బందికి, పెన్షనర్లకు చెల్లింపులు చేయడం అతని బాధ్యత. పెన్షన్ చెల్లింపు విషయంలో 137 నకిలీ క్లెయిమ్స్ సృష్టించి రూ.19.80 లక్షలు స్వాహా చేశారు. ఇందులో భాగంగా ఓ క్లెయిమ్ ఫారమ్‌లో రూ.18,558కి బదులు రూ.18,578గా రాశారు. ఆడిట్ సమయంలో రూ.20 ఎక్కువగా చెల్లించినట్లు ఆడిట్ అధికారులు గుర్తించి, దాని గురించి పోర్ట్ ట్రస్ట్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అధికంగా చెల్లించిన మొత్తాన్ని రికవరీ చేయాలని పోర్ట్ ట్రస్ట్ అధికారులను కోరారు. దీంతో వారు పెన్షన్ ఖాతాలను పరిశీలించగా వెంకటేశ్వరరావు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. మొత్తం 137 నకిలీ క్లెయిమ్స్ సృష్టించి రూ.19.80 లక్షలు స్వాహా చేసినట్లు గుర్తించారు. దీనిపై విచారణ జరిపిన విశాఖపట్నం సీబీఐ కోర్టు నిందితుడు వెంకటేశ్వరరావుకు జైలు శిక్ష విధిస్తూ మార్చి 31, 2005లో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ వెంకటేశ్వరరావు అదే ఏడాది హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు కింది కోర్టు వెంకటేశ్వరరావుకు విధించిన జైలుశిక్షను ఖరారు చేస్తూ ఇటీవల తీర్పునిచ్చారు. అయితే అవినీతి నిరోధక చట్టంతోపాటు ఐపీసీలో మరికొన్ని సెక్షన్ల కింద విధించిన అదనపు జైలు శిక్షను మూడు నెలలకు తగ్గించారు. రూ.20 విషయంలో తాను చేసిన పొరపాటు అతన్ని జైలుపాలు చేస్తుందని పిటిషనర్ సైతం ఊహించి ఉండడని న్యాయమూర్తి ఈ సందర్భంగా తన తీర్పులో వ్యాఖ్యానించారు. -
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం
వెస్ట్‌జోన్ కొత్త డీసీపీ వెంకటేశ్వరరావు అబిడ్స్: నగరంలోని వెస్ట్ జోన్ డీసీపీగా ఎ.వెంకటేశ్వరరావు ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఏడాది కాలంగా వెస్ట్‌జోన్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న వి.సత్యనారాయణ సౌత్‌జోన్‌కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో వరంగల్ జిల్లా ఎస్పీగా పని చేస్తున్న వెంకటేశ్వరరావును ప్రభుత్వం ఇటీవల నియమించింది. ఈయన గతంలో వరంగల్ సీఐడీ ఎస్పీగా, రెండేళ్లు వరంగల్ ఎస్పీ, మెదక్, మంచిర్యాల్ డీఎస్పీ, కాచిగూడ ఏసీపీ, నల్లగొండ జిల్లా ఓఎస్డీ, హైదరాబాద్ జిల్లా విజిలెన్స్ ఎస్పీ, హైదరాబాద్ రూరల్ విజిలెన్స్ ఎస్పీగా పనిచేశారు. ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ జోన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వడంతో పాటు వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానన్నారు. బాధితులకు వారి కేసుల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామన్నారు. అన్ని ఠాణాల పరిసరాల్లో పచ్చదనం- పరిశుభ్రత పాటించేలా కృషి చేస్తానన్నారు. అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. తమ జోన్ పరిధిలోని రౌడీషీటర్లందరికీ ముందుగా కౌన్సిలింగ్ నిర్వహించి హెచ్చరికలు జారీ చేస్తామన్నారు. వారి కదలికల్లో మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పేరుమోసిన రౌడీషీటర్లపై పీడీ యాక్టు ప్రయోగిస్తామన్నారు. మహిళలకు రక్షణగా... ఇటీవల నగరంలో ప్రవేశపెట్టిన ‘షీ’ టీంకు తమ పోలీస్ స్టేషన్ల సిబ్బంది కూడా వెంట ఉండి మహిళలకు రక్షణగా పనిచేస్తారని డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. బస్టాప్‌లు, కళాశాల పరిసరాలలో మఫ్టీలో ఉన్న షిటీంలు ఈవ్ టీజింగ్‌కు పాల్పడే వారితో కఠినంగా వ్యవహరిస్తారన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా... జోన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధుల్లో సీసీ కెమెరాల ద్వారా నిఘా ముమ్మరం చేస్తామన్నారు. ఇప్పటికే పలు చౌరస్తాలు, కీలక ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా మరిన్ని కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. కాలనీలు, బస్తీలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా దొంగలు, స్నాచర్లు, ఇతర వివరాలను ఆ కెమెరాల్లో బంధించడం ద్వారా ప్రజారక్షణ సులభమవుతుందన్నారు. వ్యాపారస్తులు, వాణిజ్య సంస్థలు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ వెంకటేశ్వరరావు సూచించారు. -
‘‘నా భర్త కనిపించడం లేదు’’
బూరుగుపూడి(మధురపూడి) : కోరుకొండ మండల బూరుగుపూడి రైతు సహకార సేవా సంఘంలో సీఈఓ(కార్యదర్శి)గా పని చేస్తున్న తన భర్త బోలగొండ వెంకటేశ్వరరావు కనిపించడం లేదని భార్య వెంకటగిరి కోరుకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆదివారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ తన కుమార్తె వివాహ సందర్భంగా తన భర్త వెంకటేశ్వరరావు సెలవు పెట్టారని, సెలవులో ఉండగానే తన భ ర్తను సస్పెండ్ చేశారని ఆమె వాపోయారు. కాగా సొసైటీలో ఆర్థిక లావాదేవీలకు నా భర్తను, గుమస్తాను బాధ్యులను చేసి ఏకపక్షంగా సస్పెండ్ నిర్ణయం తీసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో రిలీవింగ్ ఆర్డర్ ఇస్తే శ్రీరంగపట్నం సొసైటీలో చేరడానికి అక్కడి అధ్యక్షులు అంగీకరించారని, కాని బూరుగుపూడి సొసైటీ అధ్యక్షుడు రిలీవింగ్ ఆర్డర్ ఇవ్వలేదన్నారు. ఫలితంగా బూరుగుపూడి సొసైటీ నుంచి రెండు నెలలగా జీతం కూడా రావడం లేదని, ఉద్యోగం చేయడానికి అవకాశం లేకుండా పోయిందని, దీంతో నా భర్త తీవ్ర నిరాశతో మనోవేదనకు గురయ్యారని ఆమె పేర్కొన్నారు. దీంతో అక్టోబర్ 28 తేదీ తెల్లవారు జామున ఇంటి నుంచి చెప్పకుండా బయటకు వెళ్లిపోయారని, సాయంత్రం వరకూ చూసి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నారా? అని అడగగా సమాధానం లేదని ఆమే తెలిపారు. అప్పటి నుంచి ఫోన్ పనిచేయడం లేదని ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, తనకు, తనకుటుంభానికి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
కొత్త డీటీసీ బసిరెడ్డి
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం:రవాణాశాఖ జిల్లా ఉపకమిషనర్ (డీటీసీ) ఎస్.వెంకటేశ్వరరావుకు బదిలీ అయింది. ఆయన స్థానంలో చిత్తూరు డీటీసీ ఎం.బసిరెడ్డిని నియమించారు. ఈ మేరకు జీవో నెంబరు 734ను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పది మంది డీటీసీలను బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందులో భాగంగా ప్రస్తుతం పని చేస్తున్న వెంకటేశ్వరరావును విజయవాడ డీటీసీగా బదిలీ చేశారు. ఈయన శ్రీకాకుళం జిల్లాకు మార్చి 2013లో ఏలూరు నుంచి డీటీసీగా వచ్చారు. 1993లో ఆర్టీవోగా ఎంపికైన ఆయన పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు విశేష కృషి చేశారు. ఇతర ప్రభుత్వ విభాగాలను కలుపుకుపోతూ లెసైన్స్‌లు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిర్వహణలో లక్ష్యసాధన కోసం కృషి చేశారు. కాగా అనంతపురం జిల్లాకు చెందిన ఎం.బసిరెడ్డి తొలుత ఆర్టీవోగానే ఎంపికై ఐదేళ్ల క్రితం డీటీసీగా పదోన్నతిపై చిత్తూరు వెళ్లారు. ప్రస్తుతం బసిరెడ్డిని శ్రీకాకుళం డీటీసీగా ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే వెంకటేశ్వరరావు మాత్రం తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదని స్పష్టం చేశారు. -
ఆపరేషన్ డెరైక్టర్
సీఈ స్థాయితోపాటు రిటైర్డ్ విద్యుత్ ఇంజనీర్ల క్యూ పోటాపోటీగా ఆశావహుల పైరవీలు అమాత్యులతో పలువురి రాయ‘బేరాలు’ హన్మకొండ సిటీ : ఎన్పీడీసీఎల్ యాజమాన్యం నిర్ణయాలు తీసుకోవడంలో డెరైక్టర్లది కీలకపాత్ర. ఇందులోనూ రూ.లక్షల్లో జీతం... మరిన్ని అలవెన్సులు. ఒక్కసారి డెరైక్టర్‌గా నియామకమైతే పొడిగింపు పేరిట మరి కొన్నేళ్లు ఈపదవిలో కొనసాగవచ్చు. ఈ నేపథ్యంలో ఎన్పీడీసీఎల్లో ఖాళీగా ఉన్న కీలకమైన డెరైక్టర్ (ఆపరేషన్) పోస్టుపై పలువురు కన్నేశారు. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న సీఈ స్థాయి అధికారులతోపాటు, సీఈ స్థాయిలో రిటైర్ అయిన విద్యుత్ ఇంజనీర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకుముందు ఆపరేషన్ డెరైక్టర్‌గా ఉన్న చంద్రశేఖర్ కాలపరిమితి ఈ ఏడాది జూన్‌తో ముగిసింది. అప్పట్లో ప్రభుత్వం మూడు నెలల పాటు కాలపరిమితిని పొడిగించింది. ఈ మేరకు సెప్టెంబర్ 30తో ఆయన పదవీ కాలం ముగిసింది. మరోసారి కాలపరిమితిని పెంచకపోవడంతో చంద్రశేఖర్.. డెరైక్టర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ప్రాజెక్ట్ డెరైక్టర్ వెంకటేశ్వర్రావుకు ఆపరేషన్ డెరైక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో సీజీఎంలుగా పనిచేస్తున్న ఎండీ యూనస్, రాజారావుతోపాటు విద్యుత్ శాఖలో సీఈలుగా పని చేసి రిటైర్ అయిన వారు, ఎస్పీడీసీఎల్లో సీఈ స్థాయిలో పనిచేస్తున్న అధికారులు పలువురు రేసులో ఉండడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఎలాగైనా ఈ పోస్టును దక్కించుకునేందుకు ఆశావహులు... అమాత్యుల వద్దకు క్యూ కడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో పైరవీలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కుల, మత, సామాజిక, రాజకీయ సమీకరణాలను ఆసరాగా చేసుకుని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చేతిలో... ఎన్పీడీసీఎల్లో ఒక సీఎండీతో పాటు, నాలుగు డైరక్టర్ పదవులున్నాయి. ఇందులో సీఎండీగా కొంటే వెంకటనారాయణతో పాటు ఫైనాన్స్ డెరైక్టర్‌గా సుదర్శన్, ప్రాజెక్ట్ డైరక్టర్‌గా బి.వెంకటేశ్వర్రావు, హెచ్ఆర్డీ డెరైక్టర్‌గా జాన్‌ప్రకాశ్‌రావు కొనసాగుతున్నారు. మరో డెరైక్టర్ (ఆపరేషన్) పదవి ఖాళీగా ఉంది. రెండేళ్ల కాలం పాటు ఉండే ఈ డెరైక్టర్ పోస్టును భర్తీ డెరైక్టర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం జూన్ మాసంలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టు కోసం 15 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్పీడీసీఎల్ యాజమాన్యం వీటిని పరిశీలించి ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించింది. పోటాపోటీగా యత్నాలు ఆపరేషన్ విభాగం సీజీఎంగా ఉన్న యూనస్, వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సీజీఎం, ప్రస్తుతం సెలవులో ఉన్న రాజారావు డెరైక్టర్ కుర్చీ కోసం దరఖాస్తు చేసుకొన్న వారిలో ఉన్నట్లు తెలిసింది. వీరితో పాటు దరఖాస్తు చేసుకున్న వారిలో మరికొందరు ప్రభుత్వ పెద్దలతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు అమాత్యులతో రాయ‘బేరాలు’ నడుపుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన జరిగి అధికారులు కేటాయింపు పూర్తి కాలేదు. దీంతో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోంది. ఇటీవల కేంద్రం ఐఏఎస్ అధికారులను కేటాయించినట్లు జాబితా విడుదల చేసినప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎలాంటి శాఖలు అప్పగించలేదు. దీంతో డెరైక్టర్ (ఆపరేషన్) నియామకంలో మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు ఎన్పీడీసీఎల్ వర్గాలు చెబుతున్నారుు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న విధాన నిర్ణయాలే కొనసాగుతున్నాయి. ఇందులో మార్పు చేయాలని ప్రభుత్వం భావిస్తే డెరైక్టర్ పదవీ భర్తీలో తీవ్ర జాప్యం జరిగే అవకాశముందని అంచని వేస్తున్నారు. -
కబ్జాలు చేస్తే ఖబడ్దార్
సివిల్ వివాదం అనుకోవద్దు చట్టంలో అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగులనూ వదలం సీపీ ఎ.బి.వెంకటేశ్వరరావు విజయవాడ సిటీ : భూ కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. కబ్జాదారుల పనిపట్టేందుకు చట్టంలో అన్ని రకాల ప్రొవిజన్స్ ఉన్నాయని ఆయన తెలిపారు. సోమవారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసు కమిషనర్ మాట్లాడుతూ..రాజధాని నేపథ్యంలో పెరిగిన భూముల ధరలను ఆసరాగా చేసుకుని నయా బ్రోకర్లు తయారయ్యారని చెప్పారు. ఏదో విధంగా వివాదం సృష్టించి కబ్జాకు పాల్పడడం..లేదంటే రాజీపేరిట డబ్బు గుంజడం చేస్తున్నారన్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్ల అవతారం ఎత్తినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఖాళీ భూములకు ఫోర్జరీ డాక్యుమెంట్లు, లేని భూములకు పట్టాలు సృష్టించి క్రయ విక్రయాలు జరుపుతున్నట్టు గుర్తించామన్నారు. ఇందుకు డాక్యుమెంటు రైటర్లు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు సహకరిస్తున్నారని చెప్పారు. ఇటీవల కానూరులో జరిగిన భూ వివాదంలో ప్రభుత్వ ఉద్యోగులు సహా పలువురిపై చట్టపరంగా చర్యలు చేపట్టామన్నారు. ఓ మతిస్థిమితం లేని వృద్ధురాలి ఆస్తికి జీపీఏ తయారు చేసి విక్రయించిన వైనం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో సివిల్ వివాదంగా పరిగణించి వదిలేస్తామనుకుంటే పొరపాటని, కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టంలో అన్ని అవకాశాలు ఉన్నాయనే విషయం గుర్తించాలని సీపీ హెచ్చరించారు. చిట్‌ఫండ్ సంస్థల్లో డిపాజిట్ చేయొద్దు.. రిజిస్టర్ చిట్‌ఫండ్ సంస్థల్లో చిట్స్ మాత్రమే వేయాలి తప్ప.. డిపాజిట్లు చేయరాదని పోలీసు కమిషనర్ సూచించారు. కేవలం చిట్స్ మాత్రమే నిర్వహించే సంస్థలు దివాళా తీయడం లేదని, అలా కాక డిపాజిట్లు సేకరించి ఇతర వ్యాపారాల్లో మదుపు చేసే సంస్థలు మాత్రమే మూతపడుతున్నాయన్నారు. 498(ఎ) కేసులపై ప్రత్యేక శ్రద్ధ వివాహ వ్యవస్థ అపహాస్యం కాకుండా మహిళల రక్షణను దృష్టిలో ఉంచుకొని వేధింపుల కేసు(సెక్షన్ 498(ఎ))ల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఏటా సగటున 1200 వరకు వేధింపుల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే పరిణామమన్నారు. వ్యక్తిగత ప్రతిష్టకు పోయి 70శాతం మంది తప్పుడు కేసులు పెడుతున్నారని గుర్తించినట్టు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుని సమాజనిర్మాణానికి, వ్యక్తిత్వ వికాసానికి కారణమైన వివాహ వ్యవస్థను ఛిన్నాభిన్నం కాకుండా చూడాలనేది తమ అభిప్రాయమన్నారు. నేరాల నియంత్రణపై చర్యలు నగరంలో ఆస్తి నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్మాని తెలిపారు.సీసీఎస్‌లోని నేర నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కాలనీలు, రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్ వద్ద నేరాలు జరిగే విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇదే విధంగా నేరాలు జరిగే విధానాలపై పోస్టర్లు, కరపత్రాలు ముద్రించి ప్రజల్లో అవగాహనకు కృషి చేస్తున్నామని చెప్పారు. విలేకరుల సమావేశంలో డీసీపీ(పరిపాలన) జి.వి.జి.అశోక్‌కుమార్, అదనపు డిసీపీ(క్రైం) యం.నాగేశ్వరరావు, ఎసిపి(సిసియస్) గుణ్ణం రామకృష్ణ, సెంట్రల్ టి.లావణ్యలక్ష్మీ పాల్గొన్నారు. సమస్యల నివారణ వ్యవస్థకు స్పందన నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని సిబ్బంది, అధికారుల శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి గత నెల 8వ తేదీన నెలకొల్పిన పోలీసు సమస్యల నివారణ వ్యవస్థ(పోలీసు గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టమ్)కు మంచి స్పందన వచ్చిందన్నారు. పరిపాలనా డీసీపీ జి.వి.జి.అశోక్‌కుమార్ నేతృత్వంలో రూపొందించిన ఈ విధానం ద్వారా ప్రత్యేక ఫోన్ నంబర్‌కు 102మంది సంక్షిప్త సందేశాలు పంపగా, 94 సమస్యలను పరిష్కరించి తగిన సమాధానాలు పంపడం జరిగిందన్నారు. హెచ్ఆర్ఎ, జీపీఎఫ్, రుణాల మంజూరు, ట్రావెలింగ్ అలవెన్స్‌లు సహా ఇతర సమస్యల పరిష్కారానికి సిబ్బంది, అధికారులు కమిషనరేట్‌కు రాకుండానే యస్యంయస్ ద్వారా పరిష్కరించుకునేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తున్నట్టు తెలిపారు. -
మాదాపూర్ శివారులో చిరుత సంచారం
మాక్లూర్ : మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి చిరుత పులి సంచరించింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొందరికి అటవీ ప్రాంతం వైపు గుట్టపై బండరాయి మీద చిరుత పులి కన్పిచింది. వారు వెంటనే మాక్లూర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిజామాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్వర్రావు, మాక్లూర్ ఎస్సై సంతోష్‌కుమార్, ఫారెస్టు రెంజ్ ఆఫీసర్ రవిమోహన్ సిబ్బందితో కలిసి చిరుత పులి ఉన్న ప్రాంతానికి వెళ్లారు. చికటి పడిన తర్వాత చిరుత పులి రాయి పైనుంచి కిందికి దిగడంతో పోలీసులు, గ్రామస్తులు పరుగులు పెట్టారు. మాదాపూర్ అటవీ ప్రాంతం నుంచి జక్రాన్‌పల్లి మండలంలోని సికింద్రాపూర్ అటవీ ప్రాంతం వరకు చిరుతపులులు ఉన్నట్లు ఫారెస్టు రెంజ్ అధికారి రవిమోహన్ తెలిపారు. చీకటి పడినందున రాళ్లు, చుట్టూ ముళ్ల పొదలు ఉన్నందున చిరుత పులిని పట్టుకునే పరిస్థితి లేదని, మంగళవారం ఉదయం చిరుత పులిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాత్రి వేళలో చుట్టు ప్రక్కల గ్రామల ప్రజలు బయటకు రావద్దని సూచించారు. చిరుత పులికి చాలా భయం ఉంటుందని,అయితే ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. చిరుత పులిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాత్రి వేళలో ప్రజలు బయటకు వెళ్లవద్దని గ్రామాల్లో ఫారెస్టు, పోలీసు అధికారులు దండోర వేయించారు. చిరుత పులి అడవిలో కన్పించడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
ఇక సీసీఎస్ నిఘా
విజయవాడ సిటీ : నగర పోలీస్ కమిషనరేట్‌లో నేర పరిశోధక విభాగం పటిష్టతకు చర్యలు ప్రారంభమయ్యాయి. నేరాల నియంత్రణకు సీసీఎస్, క్రైం విభాగాలున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. సోమవారం జరిగిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఇదే విషయంపై అధికారుల అభిప్రా యాలను కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు స్వీకరించారు. ఈ మేరకు సీసీఎస్ (సెంట్రల్ క్రైం స్టేషన్)ను పునర్వవ్యవస్థీకరించారు. క్రైం విభాగంలో సమూల మార్పులు తీసుకొచ్చి కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటుచేస్తే నేరాల కట్టడి సాధ్యమవుతుందని ఆయన భావిస్తున్నారు. ఈ కేంద్రీకృత వ్యవస్థ పరిధిలోకి పోలీసుస్టేషన్లలో పని చేస్తున్న క్రైం సిబ్బందితోపాటు సీసీఎస్ విభాగం సిబ్బందిని కూడా తీసుకొచ్చి సమాచార సేకరణ, విచారణ, నియంత్రణ విభాగాలుగా విభజించారు. వీరికి అవసరమైన వాహనాలు, కంప్యూటర్లు, ఇతర సామగ్రి, నగదు అందజేశారు. వీరు మంగళవారం నుంచి విధులు ప్రారంభించారు. కేంద్రీకృత వ్యవస్థ పనితీరు ఇలా.. సమాచార సేకరణ విభాగం : ఆస్తి దొంగతనాలకు అలవాటుపడిన నేరస్తుల సమాచారాన్ని ఈ విభాగంలో పనిచేసేవారు సేకరిస్తారు. ఇదే సమయంలో నేరస్తులపై నిఘా ఉంచడంతో పాటు వారిని గుర్తించేందుకు, పొరుగు జిల్లాల నేరస్తుల ఆచూకీ తెలుసుకునేందుకు వేగుల ఏర్పాటు సహా వివిధ పద్ధతులు అమలు చేస్తారు. ఏదైనా పోలీసు స్టేషన్ పరిధిలో నేరం జరిగితే వీరు వెళ్లి కేసు పూర్వాపరాలు విశ్లేషించడంతో పాటు నేరానికి పాల్పడేందుకు అవకాశం ఉన్న వారిని గుర్తిస్తారు.తద్వారా విశ్లేషించిన సమాచారాన్ని దర్యాప్తు విభాగానికి అందజేస్తారు. దర్యాప్తు విభాగం : విశ్లేషణ విభాగం నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ విభాగం సిబ్బంది దర్యాప్తు చేస్తారు. వీరికి వచ్చిన సమాచారంలో తమ అనుభవాన్ని జోడించి నేరస్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు చోరీకి గురైన సొత్తును రాబడతారు. నియంత్రణ విభాగం : నగరవాసులను అప్రమత్తం చేస్తూ నేరాల నియంత్రణకు ఈ విభాగం కృషిచేస్తుంది. తమకు ఇచ్చిన ప్రచార సాధనాల (రికార్డెడ్ సూచనలు)తో కాలనీలు, అపార్టుమెంట్లు, హోటళ్లలో చోరీల నియంత్రణకు తీసు కోవాల్సిన చర్యలను వివరిస్తారు. ప్రజలు సంచరించే షాపులు, థియేటర్లు, హోటళ్లు తదితర ప్రాంతాల్లో సీసీ కెమేరాల ఏర్పాటు వంటి చర్యలను ఈ విభాగమే చూసుకుంటుంది. -
రసాయన ఎరువుల వాడకానికి స్వస్తి
ఘన జీవామృతం.. దుక్కిలో ఎకరాకు వంద కిలోల ఘన జీవామృతాన్ని వేస్తే డీఏపీలాంటి ఎరువుల అవసరం ఉండదు. ట్రాక్టర్ పశువుల పేడలో 50 లీటర్ల ఆవు మూత్రం, 16 కిలోల బెల్లం, 16 కిలోల శనగపిండి, 4 కిలోల పుట్ట మట్టిని బాగా కలిపి పైన నీళ్లు కొద్దిగా చల్లి 15 రోజుల పాటు మాగపెట్టాలి. ఆ తర్వాత ఆ ఎరువును ఉపయోగించుకోవచ్చు. జీవామృతాన్ని రెండు కిలోల చొప్పున బెల్లం, శనగపిండి, 5 నుంచి పది కిలోల ఆవు పేడ, 5 నుంచి 10 లీటర్ల ఆవు మూత్రం, పిడికెడు పుట్టమట్టిని 200 లీటర్ల నీటిలో కలిపి ఉదయం సాయంత్రం కలుపుతూ రెండు రోజులు నానబెట్టాలి. దానికి మరో 200 లీటర్ల నీరు కలుపుకోవాలి. మూడో రోజు నుంచి 15 రోజుల్లోపు వాడుకోవాలి. ఆ జీవామృతాన్ని పైరుపై పిచికారీ చేయడానికి లీటర్ నీటికి 20 మి.లీ. కలుపుకోవాలి. దీంతో చీడపీడలు దరిచేరవు. మొక్కకు 10 మి.లీ. చొప్పున నేరుగా పోసుకోవచ్చు. దీంతో యూరియా అవసరమే ఉండదు. పదిహేనురోజులకోసారి పైరుపై పిచికారీ చేసుకోవడంతో పాటు మొక్కకు నేరుగా ఇదే తరహాలో అందిస్తే పంట దిగుబడి ఆశించిన విధంగా వస్తుంది. బంతి పూల వంటి పంటకు ఎకరాకు 15 రోజులకు వెయ్యి లీటర్ల జీవామృతం సరిపోతుంది. వరి పైరుకు 600 లీటర్ల జీవామృతాన్ని నెలకోసారి నీటి ద్వారా పారిస్తే సరిపోతుంది. అవసరాన్ని బట్టి అగ్నిఅస్త్రం, పుల్లటి మజ్జిగను పైరుపై పిచికారీ చేయాలి. ఐదెకరాల్లో ఏడాదికి రూ.3 లక్షల ఆర్జన.. సచివాలయ విశ్రాంత ఉద్యోగి వెంకటేశ్వరరావుకు మా గ్రామంలో వ్యవసాయ పొలం ఉంది. ఆయన సూచనలతో రెండేళ్ల నుంచి సేంద్రి య సాగు చేపట్టాను. చాలా బాగా అనిపించింది. ఖర్చులు తగ్గాయి. ఇప్పుడు 5 ఎకరాల్లో ఏడాదికి పెట్టుబడి పోను రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్నాను. ఒక దేశీయ ఆవుతో 5 ఎకరాల్లో ఈ తరహా సాగు చేపట్టవచ్చు. చాలా సులభమైన విధానం ఇది. చాలా మందిని ప్రోత్సహిస్తున్నాను. అధికారుల ప్రోత్సాహంతో డ్రమ్ సీడర్‌తో వరి సాగు చేస్తున్నాను. ఆయా పద్ధతులను ఇతర రైతులకు చూపిస్తున్నాను. -
గ్రౌండ్ వాటర్ డీడీపై నేడు, రేపు విచారణ
సాక్షి, కాకినాడ :అసిస్టెంట్ డెరైక్టర్లు, కార్యాలయ సిబ్బందిని వేధిస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా భూగర్భ జల శాఖ డిప్యూటీ డెరైక్టర్ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. భూగర్భ జల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌దాస్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం డిప్యూటీ డెరైక్టర్ ప్రసాదరావును విచారణాధికారిగా నియమిస్తూ ఆ శాఖ డెరైక్టర్ కె.వేణుగోపాలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసాదరావు సోమ, మంగళవారాల్లో జిల్లాలో విచారణ చేపట్టనున్నారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లోని ఏడీ కార్యాలయంలోను, మంగళవారం రాజమండ్రిలోను విచారణ జరపనున్నారు. జిల్లాలో ఈ శాఖ పరిధిలో ముగ్గురు ఏడీలు ఉండగా, ఇటీవల ఒకరు పని ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందారు. కాగా కాకినాడ ఏడీ విజయ్‌కుమార్‌ను కార్యాలయంలోకి రానివ్వకుండా తాళాలు వేయడంతోపాటు రాజమండ్రి ఏడీని కాకినాడలో డెప్యూటేషన్‌పై నియమించారు. వీరితోపాటు రాజమండ్రి, కాకినాడ కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బందిని వేధిస్తున్నారంటూ వెంకటేశ్వరరావుపై తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఈ వేధింపులు తట్టుకోలేక ఈ రెండు కార్యాలయాల్లోని పలువురు సిబ్బంది దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయినట్టు చెబుతున్నారు. దీనిపై న్యాయం చేయాలని కోరుతూ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో డీడీ వెంకటేశ్వరరావుపై ఈ విచారణ జరగనుంది. -
వీక్లీ ఆఫ్‌ను సద్వినియోగం చేసుకోండి
వరంగల్‌క్రైం : పోలీసు సిబ్బంది తమ కుటుంబ అభివృద్ధికై వారాంతపు సెలవులను ఉపయోగించుకోవాలని అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు సిబ్బందికి సూచించారు. పోలీసులకు పని భారం తగ్గించి సిబ్బంది పనితీరును మెరుగుపరిచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీ సు సిబ్బందికి ఇచ్చిన హామీ మేరకు అర్బన్ పోలీస్ విభాగంలో వారాంతపు సెలవులను ఈ నెల ఒకటో తారీఖు నుంచి అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై స్థాయి వరకు వీక్లీ ఆఫ్‌ను వినియోగించుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది సంఖ్యను దృష్టిలో పెట్టుకుని స్టేషన్ పరిధిలోని డ్యూటీలను కూడా అధికారులు దృష్టిలో ఉంచుకొని సిబ్బందికి వారానికి ఒక రోజు సెలవు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీకి సిబ్బంది గురువారం పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పోలీసు సిబ్బందికి కూడా వారంలో ఒక రోజు సెలవును ఇవ్వడంతో తమ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఎస్పీకి సిబ్బంది చెప్పారు. జిల్లా పోలీసు సిబ్బంది తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ అరవిందశర్మకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీని కలిసిన వారిలో అర్బన్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్, మహిళా హెడ్ కానిస్టేబుల్ పులి శ్రీలత, ఏఆర్ కానిస్టేబుల్ ఈ. శ్రీనివాస్, హన్మకొండ కానిస్టేబుళ్లు ఎ.నవీన్, ఇ.నరేష్ ఉన్నారు. -
తెలంగాణ వేడుకలు వారం రోజులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న అధికారులకు సూచించారు. శుక్రవారం ప్రగతి భవన్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లా అవతరణ ఉత్సవాలను అధికారి కంగా నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. జూన్2న ఉదయం 8.45 గంటలకు నిజామాబా ద్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. వారం రోజుల పా టు జరిగే ఉత్సవాల్లో జిల్లా చరిత్ర, చారిత్రక కట్టడాలు, సంస్కృతి ప్రతిబింబించే కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు నిర్వహించడానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారులచే నాటికలు, ఒగ్గుకథ, బుర్రకథ, చిందు యక్షగానం, బోనాలు, బతుకమ్మ, సామాజిక జానపద గేయాలు, కోలాటం, ఒగ్గుడోలుపై ప్రదర్శనలు ఉంటాయి. తెలంగాణ ప్రాచీన వైభవంపై డాక్యుమెం టరీ ప్రదర్శిస్తారు. సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడు తూ జిల్లాలోని ప్రజల జీవన విధానం, స్థితిగతులపై ప్రదర్శనలు వారోత్సవాలలో చోటు చేసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి, డ్వామా పీడీ శివలింగయ్య, ఐకేపీ పీడీ వెంకటే శం,డీఈఓ శ్రీనివాసచారి, సీఈఓ రాజారాం తదితరులు పాల్గొన్నారు. -
దుకాణాల్లో వరుస చోరీలు
ఉలిక్కిపడ్డ కలిదిండి రూ.48 వేల నగదు అపహరణ ఆందోళనలో వ్యాపారులు కలిదిండి, న్యూస్‌లైన్ : దొంగల బీభత్సంతో ఒక్కసారిగా కలిదిండి ఉలిక్కిపడింది. గతంలో ఎన్నడూ జరగని రీతిలో ఒకేసారి దొంగలు షాపులపై పడి నగదు దోచుకున్నారు. దీంతో వ్యాపారులు భయాందోళనలకు గురవుతున్నారు. కలిదిండి సెంటరులోని ఆరు షాపుల షట్టర్ తాళాలు పగలగొట్టి రూ.48 వేల నగదును దొంగలు దోచుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోజూమాదిరిగానే గురువారం రాత్రి 10 గంటలకు వ్యాపారులు తమ దుకాణాలు మూసి ఇళ్లకు వెళ్లిపోయారు. తిరిగి శుక్రవారం ఉదయాన్నే షాపులు తెరిచేందుకు రాగా షట్టర్ల తాళాలు పగలగొట్టి ఉండటం చూసి ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కలిదిండి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన వాటిలో సబిశెట్టి ధనవీరవెంకట వరప్రసాద్‌కు పురుగు మందుల షాపు, సత్యపాండురంగ గుప్తకు చెందిన రొయ్యలమేత షాపు, సోము భూషణానికి చెందిన కిరాణా షాపు, చాదళ్ల కృష్ణమూర్తికి చెందిన రొయ్యల మేత దుకాణం, నీలి దుర్గా వెంకట సత్యనారాయణకు చెందిన మందుల షాపు, హిమాలయ బ్రాందీ షాపు ఉన్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ చోరీలు జరిగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న గుడివాడ డీఎస్పీ డి.నాగన్న, కైకలూరు సీఐ వెంకటేశ్వరరావు, కలిదిండి ఎస్సై యేసేబు శుక్రవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు స్పెషల్ టీంలు ఏర్పాటు చేశామని డీఎస్పీ డి.నాగన్న తెలిపారు. గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా పోలీసు గస్తీ పెంచుతామన్నారు. మచిలీపట్నం నుంచి క్లూస్ టీం వచ్చి వేలుముద్రలను సేకరించింది. -
పొట్టకూటికోసం వచ్చి..మృత్యువాత
ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మహిళా కూలీల మృతి పలువురికి గాయాలు శోకసంద్రంలో బత్తులవారిగూడెం రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబాల్లో వీడని విషాదం అలముకుంది. కూలి పనుల కోసం వచ్చినవారిలో ఇద్దరు మహిళలతో పాటు ఇంటర్ విద్యార్థిని మృతిచెందటంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి స్వగ్రామమైన బత్తులవారిగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గన్నవరం, న్యూస్‌లైన్ : పొట్టకూటి కోసం కూలి పనులకు వచ్చిన ముగ్గురు మహిళా కూలీల నిండు ప్రాణాలు ట్రాక్టర్ ప్రమాదంలో గాలిలో కలిసిపోయాయి. మామిడి కాయలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి గోతిలోకి బోల్తా కొట్టడంతో ఈ ఘటన జరిగింది. మండలంలోని కొండపావులూరు గ్రామసమీపంలో బుధవారం జరిగిన ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నూజివీడు మండలం బత్తులవారిగూడెం గ్రామానికి చెందిన 23 మంది కూలీలు మామిడికోతల పనుల నిమిత్తం రెండు రోజులుగా మండలంలోని కొండపావులూరు గ్రామ సమీపంలోని వెంకట తిరుమల కృష్ణారావు తోటలోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నున్న మామిడి మార్కెట్‌కు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌పై సూరంపల్లి వరకు వెళ్లేందుకు ఎక్కారు. కొంతమంది లోడుపై ఎక్కగా, మరికొంతమంది ట్రాక్టర్ ఇంజన్ భాగంలో కూర్చున్నారు. ట్రాక్టర్ తోటలో నుంచి కొంతదూరం వెళ్లిన తర్వాత ఎత్తుగా ఉన్న గట్టు ఎక్కించే క్రమంలో డ్రైవర్ గంగుల బుడ్డయ్య తడబడ్డాడు. దీంతో ట్రాక్టర్ అదుపుతప్పి గట్టుపై నుంచి ఒక్కసారిగా వెనక్కి జారిపోయి ట్రక్కుతో సహా పక్కనే ఉన్న గోతిలోకి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇంజిన్ భాగంలో కూర్చున్న బత్తుల కాసులు (34) తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ట్రక్కుపై ఉన్న కొంతమంది కూలీ లు కిందకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. మిన్నంటిన హాహాకారాలు... ఈ ప్రమాదంలో మరికొంత మంది కూలీలు ట్రాక్టర్ లోడు సహా గోతిలోకి పడిపోయారు. దీంతో రక్షించమంటూ హాహాకారాలు చేశారు. కిందకు దూకిన కూలీలు షాక్ నుంచి తేరుకుని ట్రక్కులో చిక్కుకున్న కూలీలను బయటకు లాగే ప్రయత్నం చేశారు. లోడు కింద చిక్కుకున్న చెన్ను కుమారి, చెన్ను సునీత లను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికి సాధ్యం కాలేదు. విషయం తెలుసుకున్న కొంతమంది గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో వారి సహాయంతో తిరగబడిన ట్రక్కును పైకి లేపారు. మామిడికాయల మధ్య చిక్కుకుని కుమారి, సునీతలు ఊపిరాడక అప్పటికే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన తిరుపతమ్మ (45), మురళీ (40)లను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. విషాదఛాయలు... తల్లిదండ్రులకు సహాయపడేందుకు వేసవి సెలవుల్లో బంధువులతో కలిసి మామిడికోత పనులకు వచ్చిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తిచేసుకున్న సునీత మృత్యువాతకు గురవడం అందరినీ కలచివేసింది. సమాచారం తెలుసుకున్న ఆమె తండ్రి వెంకటేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకుని విగతజీవిగా ఉన్న కుమార్తెను భోరున విలపించారు. మృతి చెందిన కాసులు, కుమారి కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బత్తులవారిగూడెంలో విషాదఛాయలు నూజివీడు రూరల్ : ట్రాక్టర్ ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు మహిళల స్వగ్రామమైన నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో విషాదఛాయలు అలముకున్నాయి. పేద కుటుంబాలకు చెందిన వీరు కూలి పనులు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతుండగా ట్రాక్టర్ ప్రమాదం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రమాదంలో మృతిచెందిన బత్తుల వడ్డీకాసులుకు భర్త సాంబశివరావుతో పాటు ఇద్దరు పిల్లలు, చెన్ను కుమారికి భర్త నాగేశ్వరరావుతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెన్ను సునీత పట్టణంలోని ఒక కాలేజీలో ఇంటర్ చదువుతూ సెలవులు కావడంతో మామిడి కోతలకు వెళుతోంది. -
‘ఎన్నికల’ డాక్యుమెంటేషన్ చేయండి
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నిర్వహణ విధానాలపై డాక్యుమెంటేషన్ చేయాలని రాష్ర్ట అదనపు ముఖ్య ఎన్నికల అధికారి వి.వెంకటేశ్వరరావు జాయింట్ కలెక్టర్లకు సూచించారు. విజయవాడ నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఏఎస్పీలతో మంగళవారం ప్రాంతీయ సమీక్ష సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన, మద్యం, నగదు పట్టివేత సంబంధిత కేసుల నమోదు, పరిష్కార చర్యలు, ఎన్నికల నివేదిక తదితర విషయాలపై సమీక్షించారు. తొలుత కృష్ణా జాయింట్ కలెక్టర్ జె.మురళి మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి జిల్లాలో 340 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నగదు పట్టివేతకు సంబంధించి రూ.9.71 కోట్ల నగదు సీజ్ చేశామని, దీనికి సంబంధించి 305 కేసులు నమోదు చేయగా 252 కేసుల్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామని చెప్పారు. రూ.30.90 లక్షల విలువైన 61,791 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని, 367 కేసులు నమోదు చేశామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.బాబూరావు నాయుడు మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై 330 కేసులు నమోదయ్యాయని, రూ.5.62 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 8,900 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని 93 కేసులు నమోదు చేశామని వివరించారు. గుంటూరు జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి 395 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి గుంటూరు రూరల్‌లో 851 లిక్కర్ కేసులు, అర్బన్‌లో 127 కేసులు నమోదైనట్లు పోలీస్ అధికారులు వివరించారు. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ వై.యాకూబ్‌నాయక్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రూ.7.32 కోట్ల నగదు సీజ్‌చేసి బాధ్యులపై కేసులు నమోదు చేశామని చెప్పారు. సమీక్ష అనంతరం అదనపు సీఈవో మాట్లాడుతూ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు అందరికీ అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, నగదు, మద్యం సీజ్‌కు సంబంధించి నమోదైన కేసులపై సత్వర పరిష్కార చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సంఘం అడిగిన ఎన్నికల తుది నివేదికలను సత్వరమే పంపాలని చెప్పారు. ఈ ఎన్నికలలో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల నిర్వహణ, ముఖ్య సంఘటనలపై అన్ని జిల్లాల్లో డాక్యుమెంటేషన్ చేయాలని సూచించారు. పోలింగ్‌కు ఉపయోగించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరచిన విధంగానే ఉపయోగించని ఈవీఎంలకు కూడా తగిన భద్రత కల్పించాలన్నారు. పెయిడ్ న్యూస్‌గా గుర్తించిన వాటిపై సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, ఎస్పీ జె.ప్రభాకరరావు, అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు, ప్రకాశం జిల్లా ఏఎస్పీ బి.రామనాయక్, గుంటూరు అర్బన్ ఏఎస్పీ శ్రీనివాసులు, పశ్చిమ గోదావరి జిల్లా ఏఎస్పీ పి.చంద్రశేఖర్, విజయవాడ నగర డీసీపీలు వి.గీతాదేవి, ఎ.ఎస్.ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ పాపం బాబుదే
ఎన్టీఆర్ ఆశయానికి తూట్లు పొడిచి నిషేధాన్ని ఎత్తేశారు ఆనాడు ఎంత వద్దన్నా వినిపించుకోలేదు టీడీపీ మాజీ ఎమ్మెల్యే డా.వెంకటేశ్వర్రావు ‘‘చంద్రబాబునాయుుడు మద్య నిషేధాన్ని ఎత్తివేసి గ్రామాల్లోచిచ్చు పెట్టారు. టీడీపీ ఆవిర్భావం, ప్రజల్లో వచ్చిన ఆదరణకు ప్రధాన కారణం మూడు అంశాలే. ఒకటి రెండు రూపాయలకు కిలో బియ్యం, మరోటి సంపూ ర్ణ మద్య నిషేధం, ఇంకోటి రూ.50కి పేదలకు ఉచిత విద్యుత్. కానీ... ఈ మూడింటికీ చంద్రబాబు పాలనలో చరమగీతం పాడారు. దీనికోసం పార్టీలోని సిన్సియర్ లీడర్లను దూరం చేసుకున్నారు. అన్నగారు ఉన్నప్పుడు నిషేధం కచ్చితంగా అమల్లో పెట్టారు. చాలా ఇబ్బందులు, ఒత్తిళ్లు వచ్చినా.. సారా దుకాణాలను రద్దు చేశారు. సరిగ్గా 1995 జనవరి 16న మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తెచ్చారు. తర్వాత సీఎం పీఠం కోసం వైస్రాయ్ హోటల్ నుంచి చక్రం తిప్పిన చంద్రబాబు.. 1995 సెప్టెంబర్ 1న కుర్చీ ఎక్కారు. అప్పటి నుంచి మద్యం వ్యాపారులు, సారా కాంట్రాక్టర్లు బాబుగారి కోటరీలో చేరిపోయారు. చంద్రబాబు అధికార పగ్గాలు చేతబట్టుకుని అన్నగారి ఆశయాలన్నీ బురదలో పోశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే మద్యం సరఫరాపై కాంట్రాక్టర్లు, వ్యాపారులకు చాటుమాటుగా అవకాశం కల్పించారు. చివరికి 1997 జూలై 7న మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సరిగ్గా 12 రోజుల ముందు పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశానికి నేను కూడా వెళ్లా. ఆ మీటింగ్‌లో నేనొక్కడినే చాలా వాదించాను. నిషేధాన్ని ఎత్తి వేయరాదని చెప్పా. కానీ... నన్ను బయటకు వెళ్లాలన్నట్లుగా పరిగణించారు. ఆ తర్వాత నిషేధం ఎత్తివేస్తున్నారని తెలియగానే చంద్రబాబుకు దాదాపు 4 పేజీల లేఖ రాశా. దీంతో నన్ను పార్టీలో వ్యతిరేకుడిగా చూశారు. నాకు మళ్లీ టికెట్ కూడా ఇవ్వలే. టికెట్ కోసం వెళ్తే కూడా పట్టించుకోలేదు. మద్య నిషేధం ఎత్తివేశాక.. ఊరూరా వుద్యాన్ని విచ్చలవిడిగా దొరికేలా చేశారు. బెల్ట్ దుకాణాలకు పర్మిషన్ ఇప్పించారు. ఇప్పుడు మద్యం ప్రతీ ఊళ్లో దొరికేందుకు ఆద్యుడు అక్షరాలా నూటికి నూరుపాళ్లు చంద్రబాబే కారణం. -
భూకబ్జాల అనకొండబాబు
సాక్షి, కాకినాడ :అవి పేదల భూములా, ప్రభుత్వ భూములా..అనే తేడా లేదు- కన్నుపడితే అన‘కొండ’లా దిగమింగాల్సిందే. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కబ్జా చేయాల్సిందే. బ్లాక్‌మెయిలింగ్‌లు, సెటిల్మెంట్లతో అందినకాడికి దోచుకోవడంతో పాటు కోట్లాది రూపాయల విలువైన భూములను కబ్జా చేయడమే లక్ష్యంగా సాగిన అన‘కొండ’ హయాంను గుర్తుకు తెచ్చుకుంటున్న కాకినాడ నగరవాసులు.. మళ్లీ ఓటడుగుతున్న ఆయనను చూసి విస్తుపోతున్నారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) తన హయాంలో సాగించిన భూ కబ్జాలు ఎన్నో. నిరుపేద విద్యార్థులకు విద్యాదానం చేసే లక్ష్యంతో ఏర్పాటైన ట్రస్ట్ భూములను సైతం నిస్సంకోచంగా తమ కుటుంబం పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకొని, దర్జాగా అనుభవిస్తున్న చరిత్ర కొండబాబుది. కాకినాడలో పైండా సూర్యనారాయణమూర్తి అనే వితరణశీలి తన తాతగారైన పైండా వెంకట రామకృష్ణ (పీవీఆర్ ట్రస్ట్) పేరిట పేద విద్యార్థుల చదువుకు చేయూతనిచ్చే నిమిత్తం 16.29 ఎకరాల భూమిని ఉదారంగా దానమిచ్చారు. అక్కడ 1968 నుంచి సంస్కృత కళాశాల నిర్వహించగా, 1972లో పైండా ఆండాళ్లమ్మ జూనియర్ కాలేజీని, 1974లో డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. సూర్యనారాయణమూర్తి ఇచ్చిన భూముల్ని ల్యాండ్ సీలింగ్‌లో చూపించి ప్రభుత్వం స్వాధీన పర్చుకునేందుకు ప్రయత్నించగా వివాదం ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ కెళ్లింది. 1983లో సూర్యనారాయణమూర్తి గిఫ్ట్ డీడ్‌ను ఆమోదిస్తూ ట్రిబ్యునల్ తీర్పు వచ్చింది. ఈ భూములపై తామే హక్కుదార్లమంటూ కౌలుదార్లు 1986లో కోర్టును ఆశ్రయించగా..వారికి, ట్రస్ట్‌కు మధ్య మున్సిఫ్ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. కారుచౌకగా ఆరెకరాలు సొంతం.. వాస్తవం ఇలా ఉంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ భూముల్లో ఆరెకరాలను బినామీ హక్కుదార్ల ద్వారా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తన భార్య శ్రీదేవి పేరిట సర్వే నంబర్ 197/9లో 1.50 ఎకరాలను డాక్యుమెంట్ నం: 6460/ 2001తో 2001 ఆగస్టు ఆరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇదే సర్వే నెంబర్లో 1.50 ఎకరాల భూమిని డాక్యుమెంట్ నంబర్ 6459/ 2001తో తన సోదరుడు వనమాడి సత్యనారాయణ పేరిట, 1.50 ఎకరాల భూమిని డాక్టుమెంట్ నంబర్ 6458/2001తో తల్లి సుబ్బాయమ్మ పేరిట, 1.50 ఎకరాల భూమిని డాక్యుమెంట్ నంబర్ 6457/2001తో తండ్రి లోవరాజు పేరిట కొండబాబు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కొండబాబు కాకినాడ ద్వారకానగర్‌కు చెందిన యనమండ్ర మహాలక్ష్మి, నర్సమాంబ, బాలాత్రిపుర సుందరిల నుంచి ఈ ఆరెకరాల భూమిని కేవలం ఎకరం రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.30 లక్షలకు కారు చౌకగా కొట్టేశారు. ఈ భూములను ఆనుకొని ఉన్న స్థలాల్లో నేడు గజం రూ.10 వేలకు పైగా పలుకుతోంది. అంటే కొండబాబు కుటుంబ సభ్యుల పేరిట ఉన్న భూముల విలువ ఎంత తక్కువ లెక్కేసుకున్నా నేడు పాతిక కోట్లకు పైమాటే. ఈ భూములు పీవీఆర్ ట్రస్ట్‌కు చెందినవి కావని కొండబాబు కుటుంబసభ్యులు వాదిస్తుండగా, కౌలుదారుల చేతుల్లో ఉన్న తమ భూములనే ఇలా బినామీ హక్కుదార్ల పేరిట రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ట్రస్ట్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిథిల భవనాల్లోనే వెయ్యి మంది చదువు.. ఈ భూముల్లో తన భార్య పేరిట ఉన్న 1.50 ఎకరాలకు సంబంధించిన వివరాలను ప్రస్తుత ఎన్నికల అఫిడవిట్లో పొందుపర్చిన కొండబాబు వాటి మార్కెట్ విలువ కేవలం రూ.40 లక్షలుగానే పేర్కొనడం గమనార్హం. ఒకపక్క విలువైన భూములు కబ్జాకారుల కోరల్లో చిక్కుకోవడం, మరో పక్క మిగిలిన భూములన్నీ కోర్టు వివాదాల్లో నలిగిపోతుండడంతో కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాల్లోనే పీవీఆర్ ట్రస్ట్ నిర్వహణలోని సంస్కృత, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న వెయ్యి మంది విద్యార్థులు మగ్గాల్సి వస్తోంది. కోట్లాది విలువైన భూములున్నా.. వాటి ద్వారా ఆదాయం లేకపోవడంతో దాతలిచ్చే విరాళాలతోనే విద్యార్థులు చదువులు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. దాతలు ఉదాత్త ఆశయంతో ఇచ్చిన భూములను దొడ్డిదారిన కాజేసిన కొండబాబు తీరును గర్హిస్తున్న నగర ప్రజలు.. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని గెలిపించండని కోరుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. -
అంగరంగ వైభవంగా శిడిబండి ఉత్సవం
ఉయ్యూరు, న్యూస్‌లైన్ : అమ్మా వీరమ్మ.. శరణు శరణు.. కోర్కెలు తీర్చే కల్పవల్లి రక్షమామ్.. రక్షమామ్.. అంటూ భక్తుల శరణుగోష ఉయ్యూరులో ప్రతిధ్వనించింది. వేలాది మంది భక్తులు పసుపుకుంకుమలు సమర్పించి శిడిబండికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో భాగంగా 11వ రోజైన గురువారం నిర్వహించిన శిడిబండి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. 15 రోజులపాటు జరిగే ఉయ్యూరు వీరమ్మతల్లి ఉత్సవాల్లో శిడిబండికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ కారణంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేకంగా రూపొందించిన శిడిబండి శివాలయం రోడ్డు నుంచి వీరమ్మతల్లి ఆలయానికి చేరుకుంది. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పసుపు కుంకుమలు, అరటిపళ్లు, హారతులు సమర్పించారు. భక్తుల కోలాహలం మధ్య పోలీసు బలగాలు శిడిబండిని కాలేజీ రోడ్డు నుంచి ప్రధాన సెంట ర్ మీదుగా ఆలయానికి చేర్చాయి. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు పూర్తి చేసిన పిదప శిడి మహోత్సవం ప్రాంగణానికి బండిని చేర్చారు. పెళ్లికొడుకు బంధువుల నిరసన... ఈ తరుణంలో శిడిబుట్టలో కూర్చునేందుకు దళితవాడ నుంచి ఉయ్యూరు వంశీకులు ఈ ఏడాది పెళ్లి అయ్యే ఉయ్యూరు వెంకటేశ్వరరావును స్థానికులు, బంధువులు మేళతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. మార్గమధ్యంలో ఓ ఎస్ఐ పెళ్లికొడుకు బంధువుపై చేయిచేసుకోవడంతో శిడి ఉత్సవానికి పెళ్లికొడుకు రాడంటూ బంధువులు ఓ బ్యాంక్ కార్యాలయం ప్రాంగణం వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసుల జులుం నశిం చాలి.. పోలీసులు క్షమాపణ చెప్పాలి.. అంటూ నిరసన వ్యక్తం చేశారు. పట్టణ ఎస్ఐగా గతంలో పనిచేసిన శివప్రసాద్ పెళ్లికొడుకు బంధువులతో సంప్రదింపులు జరిపి తనపై నమ్మకం ఉంచి తనవెంట కలిసి రావాలని, ఉత్సవాన్ని సజావుగా సాగేలా సహకరించాలని కోరడంతో బంధువులు ఆందోళన విరమించి శిడి ఉత్సవానికి కదిలారు. అనంతరం ఆలయ ప్రదక్షణ పూర్తి చేసిన తరువాత శిడిబుట్టలో కూర్చున్న యువకుడు వెంకటేశ్వరరావు మరో మారు ఆలయ ప్రదక్షిణ పూర్తి చేసుకున్న అనంతరం మూడు పర్యాయాలు శిడి ఆడించటంతో ఉత్సవం ముగుస్తుంది. శిడిబండికి తగిలిన అరటిపళ్లు దొరికితే పిల్లలు లేని వారికి పిల్లలు, పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుందని భక్తుల నమ్మకం. డీసీపీ రవిప్రకాష్, ఏసీపీ మహేశ్వరరాజు, సీఐలు, ఎస్ఐలు భద్రతా చర్యలు చేపట్టారు. -
మార్మోగిన సమైక్య నాదం
ఏలూరు, న్యూస్‌లైన్ :పార్లమెంట్లో తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్జీవోలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం ఆరో రోజుకు చేరింది. పంచాయతీరాజ్, సబ్ ట్రెజరీ మినహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఉద్యోగులు లేక కార్యాలయాల్లో ఫైళ్లు పేరుకుపోతున్నాయి. విధులకు హాజరు కాని ఉద్యోగుల వివరాలతో కూడిన నివేదికలను ఆయా శాఖల అధికారులు ప్రతిరోజు ఉదయం కలెక్టరేట్‌కు పంపుతున్నారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మం త్రులు ఇప్పటికైనా తెలంగాణ బిల్లును అడ్డుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఎన్జీవోలు హెచ్చరించారు. బైక్‌లపై ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ కార్యాలయాలను, పలుచోట్ల పెట్రోల్ బంకులను మూయించివేశారు. ఎన్జీవో అసోసియేషన్ జిల్లా శాఖ నాయకులు టి.యోగానందం, ఆర్ఎస్ హరనాథ్, కె.రమేష్‌కుమార్, సతీష్, నెర్సు రామారావు, క్రిష్టవరపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ర్యాలీలు.. రాస్తారోకోలు భీమవరం ప్రకాశ్ చౌక్‌లో విద్యార్థులు, ఎన్జీవోలు, సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించారు. ఎన్జీవోలు, టీడీపీ నాయకులు పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లను మూయించివేశారు. కేంద్ర మంత్రులు వెంటనే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. తణుకులో బంద్ ప్రశాంతంగా సాగింది. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి, పెట్రోల్ బంకులను ఎన్జీవోలు మూయించివేశారు. సాయంత్రం నరేంద్ర సెంటర్లో దిగ్విజయ్‌సింగ్, షిండే దిష్టి బొమ్మలను దహనం చేశారు. పెనుగొండలో విద్యార్థులు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. రాజ్యసభలో విభజన బిల్లును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. నిడదవోలు సినిమా హాల్స్‌లో ఉదయం ఆటను ఎన్జీవోలు నిలిపివేరుుం చారు. బైక్ ర్యాలీ నిర్వహించి ఓవర్ బ్రిడి ్జసెంటర్లో రాస్తారోకో చేశారు. కొవ్వూరులో దుకాణాలను, సినీ థియేటర్లను, మండల పరిషత్ కార్యాలయాన్ని మూయించివేశారు. చాగల్లు, తాళ్లపూడిలలో విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు. పాలకొల్లులో వ్యాపార, విద్యాసంస్థలను, ప్రభుత్వ కార్యాలయాలు, పెట్రోల్ బంకులను సమైక్యవాదులు, ఎన్జీవోలు మూయించేశారు. దీంతో పట్టణంలో బంద్ వాతావరణం నెలకొంది. గాంధీబొమ్మల సెంటర్లో ఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. గారపాటి గోపాలరావు, గుడాల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. నరసాపురంలో పెట్రోల్ బంకులను మూయించారు. గోపాలపురంలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆకివీడులో సినిమా థియేటర్లలో రెండు ఆటలను నిలుపుదల చేశారు. పెట్రోల్ బంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డారుు. భీమడోలు మండలం పొలసానిపల్లి గీతాంజలి కళాశాల విద్యార్థులు భీమడోలు సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. నమూనా రాజ్యసభ సమావేశం నిర్వహించి రాష్ట్ర విభజన విషయంలో రాజకీయ పార్టీల తీరుపై ధ్వజమెత్తారు. చింతలపూడిలో బంద్ జరిగింది. పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లను మూయించివేశారు. బోసుబొమ్మ సెంటర్లో రాస్తారోకో చేశారు. -
మీ సేవ కోసం...
వనం బాట పట్టిన అధికారులు ఐదు రోజులూ అక్కడే బసకు ప్రత్యేక ఏర్పాట్లు అధికారుల ఖర్చు రూ.5కోట్లు జిల్లా కేంద్రం ఖాళీ హన్మకొండ, న్యూస్‌లైన్ : కలెక్టర్ మొదలు... పోలీస్ బాస్‌లు... ఇతర అధికారులు మొత్తం వనం బాట పట్టారు. మహా జాతర ప్రారంభ ఘట్టానికి ఒక్క రోజే మిగిలి ఉండడంతో మేడారానికి పయనమయ్యూరు. సోమవారం నుంచి అధికారులందరూ మేడారం మహాజాతర విధులు నిర్వర్తించనున్నారు. 36 ప్రభుత్వ విభాగాలకు చెందిన సుమారు 14 వేల మంది అధికారులు, సిబ్బంది మళ్లొచ్చే సోమవారం వరకు భక్తులకు సేవలందించనున్నారు. కలెక్టర్ ఆదేశాలతో... జిల్లా అధికారులు మొత్తం సోమవారం నుంచి మేడారంలోనే ఉండాలని కలెక్టర్ జి.కిషన్ ఆదేశించిన నేపథ్యంలో చేతిలో వైర్లెస్ సెట్లు, వాకీటాకీలతో తమ కు కేటాయించిన స్థానాల్లో విధులు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే 39 మంది సెక్టోరియల్ అధికారులు మేడారం వెళ్లారు. ఇక కలెక్టర్ కిషన్, జేసీ పౌసుమిబసు, ఎస్పీలు లేళ్ల కాళిదాసు రంగారావు, వెంకటేశ్వర్రావు, ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా, ఇద్దరు ఓఎస్డీలు, దేవాదాయ శాఖ డీసీ, ఎక్సైజ్ డీసీ, ఈఎస్, నలుగురు ఆర్డీఓలు, 9 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు... ఇలా అధికారులంతా మేడారంలో మకాం పెట్టారు. మొత్తంగా 36 శాఖల నుంచి 14 వేల మంది అధికారులు, సిబ్బంది మేడారం తరలివెళ్లగా, వీరిలో 9 వేల మంది పోలీసులు ఉన్నారు. మిగిలిన రెవెన్యూ, వైద్య, ఆరోగ్యం, పంచాయతీ, ఫారెస్ట్, విద్యుత్, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాతోపాటు పలు శాఖలకు చెందిన 2500 మంది సిబ్బందికి మేడారంలో డ్యూటీ వేశారు. వీరుకాకుండా ప్రత్యేకంగా 2500 మంది పారిశుద్ధ్య కార్మికులను ఇప్పటికే మేడారంలో దింపగా.. జాతర పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, శుభ్రం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అతిథిగృహాలు, ప్రత్యేక క్యాంపులు మేడారం జాతరలో విధులు నిర్వర్తించేందుకు జిల్లా నుంచి వెళ్లే అధికారులతోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన అధికారులు ఉండేందుకు బస ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మేడారంలోని ఐటీడీఏ అతిథి గృహం, ఇంగ్లీష్ మీడియం స్కూల్‌తో పాటు వివిధ ప్రాంతా ల్లో అధికారుల కోసం ఏర్పాట్లు చేశారు. ఉన్నతాధికారులు బస చేసేందుకు వీలుగా కార్యాలయాలు, అతిథి గృహాలను తీర్చిదిద్దగా, పోలీసులకు ప్రత్యేక క్యాంప్ కేటాయించారు. వివిధ విభాగాల సిబ్బంది కోసం ఎక్కడికక్కడే తాత్కాలిక క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. విద్యుత్ శాఖ కొత్తగా నిర్మించిన గెస్ట్‌హౌస్‌లో సీఎండీ కార్తికేయ మిశ్రా ఉంటున్నారు. గద్దెల పక్కనే ఉన్న వైద్యశాలలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పీహెచ్సీ వైద్యులకు విధులు అప్పగించారు. అధికారులు, ఉద్యోగుల భోజనాలు, ఇతర ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయిం చింది. ఇందులో రెవెన్యూ విభాగం తరఫున రూ.3 కోట్లు, పోలీసు శాఖకు రూ.2 కోట్లు కేటాయించింది. ఈ మేరకు రూ.3కోట్లలో కలెక్టర్ ఇప్పటికే వివిధ విభాగాలకు నిధులు విడుదల చేశారు. కాగా, పోలీసు శాఖకు ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రూ.2కోట్లు కేటాయించగా, మేడారంలో క్యాంపులఏర్పాటు, ఇతరత్రాపనులు పూర్తయ్యాయి. పాలన యంత్రాంగం మొత్తం.. జాతర విధుల్లో భాగంగా సోమవారం నుంచి జిల్లా పాలన యంత్రాంగం మొత్తం వనంలోనే కొలువు దీరనుంది. దీంతో జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన కార్యాలయాలన్నీ ఖాళీ అయినట్లే. మళ్లొచ్చే సోమవారం వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక్క అధికారి, సిబ్బంది కూడా దొరకరు. దీంతో ఈ వారం రోజుల పాటు ఏదైనా అవసరం నిమిత్తం కార్యాల యాలకు రావాలనుకునే వారు పనులు వాయిదా వేసుకోవాల్సిందే. కాగా, జాతర విధులు నిర్వర్తించి న వారికి ప్రత్యేక సెలవులు ఇవ్వనుండడంతో వచ్చే సోమవారం కూడా కార్యాలయాల్లో విధులు నిమిత్తం అధికారులు, సిబ్బంది రావడం కష్టమేనని తెలుస్తోంది. -
వేద విద్యపై టీటీడీ శీతకన్ను
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: వేదాన్ని విశ్వవ్యాప్తం చేయడం, వేద విద్యను ప్రోత్సహించడం కోసం తిరుపతిలో శ్రీవెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని టీటీడీ ఏర్పాటు చేసిం ది. అనంతరం దీనిపై తగినంత శ్రద్ధ చూపకపోవడంతో ఏడాదిగా వీసీ పదవి ఖాళీగా ఉంది. విద్యార్థుల సంఖ్యా తగ్గుతోంది. ప్రస్తుతం దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశ్వరరావు ఇన్చార్జి వీసీగా పనిచేస్తున్నారు. ఎస్వీ యూనివర్సిటీకి వెనుక వైపున సుమారు 300 ఎకరాల్లో అందమైన భవనాల్లో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. వేద విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి దీనిని ప్రారంభించారు. ఈ యూనివర్సిటీకి తొలి వైస్ చాన్సలర్‌గా సుదర్శన శర్మ నియమితులై రెండు పర్యాయాలు పనిచేశారు. ఈయన నిరంకుశ ధోరణితో చాలామంది అధ్యాపకులు వెళ్లిపోయారు. సుదర్శన శర్మ పదవీకాలం 2013 జనవరి 4వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి రెగ్యులర్ వీసీ నియామకం జరగలేదు. అడ్మిషన్ల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతూ వస్తోం ది. ప్రస్తుతం ఏడాది కాలంగా వీసీ లేకపోవడంతో వేదిక్ విశ్వవిద్యాలయం తిరోగమనం పట్టింది. ఈ విశ్వవిద్యాల యంపై టీటీడీ యంత్రాంగం అంతగా శ్రద్ధ చూపడం లేదన్న ఆరోపణలున్నాయి. టీటీడీ చొరవచూపక పోవడం తో ఏడాదిగా వీసీ పదవి భర్తీకావడంలేదు. దీంతో వేదిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన లక్ష్యం దెబ్బతింటోంది. వీసీ పదవి ఎవరికి దక్కేనో.. వేదిక్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పదవికి పలువురు పోటీపడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు సంస్కృత వేద విశ్వవిద్యాలయాల నుంచి దరఖాస్తులు అందాయి. వేదిక్ యూనివర్సిటీ వీసీ భర్తీకోసం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీ ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లతో ప్యానల్ రూపొందించి ప్రభుత్వానికి నివేదించిం ది. వీరిలో ఒకరిని వీసీగా గవర్నర్ నియమించాల్సి ఉంది. సెర్చ్ కమిటీ ప్రతిపాదించిన పేర్లలో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠానికి చెందిన ప్రొఫెసర్ కేఈ. దేవనాధన్, రాజస్థాన్ సంస్కృత విశ్వవిద్యాలయ వీసీ ఆర్.దేవనాధన్, ఎస్వీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ఏ.హయగ్రీవశర్మ ఉన్నారు. వీరిలో కేఈ.దేవనాధన్కు మంచి అకడమిక్ రికార్డు ఉంది. అకడమిక్ పరంగా పలు పదవులను అలంకరించారు. ఆర్.దేవనాధన్ అడ్మినిస్ట్రేషన్ పరంగా వివిధ పదవుల్లో పనిచేశారు. ప్రస్తుతం రాజస్థాన్ సంస్కృత విశ్వవిద్యాలయం వీసీగా పనిచేస్తున్నారు. ఎస్వీయూలో సంస్కృత ప్రొఫెసర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన హయగ్రీవశర్మను వీసీగా నియమించాలని టీటీడీలో పనిచేస్తున్న కొందరు రిటైర్డ్ అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వేద విద్యపైన మంచి పట్టు ఉన్న కేఈ.దేవనాధన్కు వీసీ పదవి దక్కే అవకాశం ఉందని వర్సిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
కూలీల దరిచేరని ఉపాధి
=రూ.325 కోట్లకు ఖర్చు చేసింది రూ.160 కోట్లే =14.7 శాతం మంది కూలీలకు పనుల్లేవు =ఏపీవోలపై వేటుకు రంగం సిద్ధం సాక్షి, చిత్తూరు: మండల స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కూలీలకు ఉపాధి హామీ పనులు దరిచేరడం లేదు. ఉపాధి హామీ అమలులో రాష్ర్టస్థాయిలో చిత్తూరు జిల్లా ఒకప్పుడు ప్రథ మ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. జిల్లా అధికారు లు వేగంగా స్పందిస్తున్నా చాలాచోట్ల రాజ కీయ పలుకబడి కలిగిన ఏపీవోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా కూలీలకు పనులు కరువవుతున్నాయి. జిల్లాకు 2013- 14 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధిశాఖ రూ.325 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో జిల్లాలోని 66 మండలాల్లో ఉపాధిహామీ పథకం కింద నిర్ణయించిన వివిధ పనులతో కూలీలకు ఉపాధి కల్పించాల్సి ఉంది. డిసెంబర్ 31, 2013 నాటికి ఖర్చుచేసిన మొత్తం 160 కోట్ల రూపాయలే. కూలీల్లో 14.7 శాతం మందికి ఉపాధి దొరకడం లేదు. ఈ పరిస్థితి ఎక్కువగా మదనపల్లె, చిత్తూరు డివిజన్లలో ఉంది. మామిడితోటల పెంపకం, ఇతర అభివృద్ధి పనులు గ్రామాల్లో 80 శాతం ఇంత వరకు జిల్లా వ్యాప్తంగా జరగలేదు. ఏపీవోలపై వేటుకు రంగం సిద్ధం జిల్లా వ్యాప్తంగా అవినీతి ఆరోపణలతో తొలగించిన వా రు, అవకతవకలకు పాల్పడి క్రమశిక్షణ చర్యలకు గురైనవారు ఏపీవోలుగా చాలామంది ఉన్నారు. వీరిలో ఎక్కు వమంది కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని కొనసాగుతున్నారు. మరికొందరు అధికార పార్టీ నేతల పలుకుబడితో సస్పెన్షన్ ఎత్తివేయించుకుని ఉద్యోగాల్లో ఉంటున్నారు. 23 మంది రోజువారి విధుల్లో సక్రమంగా వ్యవహరించడం లేదని జిల్లా డ్వామా పీడీ గుర్తించారు. వీరిపై చర్యలు తీసుకోవాలని డ్వామా అధికారులు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌కు వివరాలు పంపనున్నారు. నిర్మల్‌భారత్ అభయాన్ అంతంతమాత్రమే నిర్మల్‌భారత్ అభయాన్ కింద ఉపాధిహామీ పనుల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి జిల్లాకు 10 వేల యూనిట్లు మంజూరయ్యాయి. జాబ్‌కార్డు ఉన్న లబ్ధిదారులు మరుగుదొడ్డి లేకపోతే దరఖాస్తు చేసుకుని పనులు చేసుకోవచ్చు. వీరికి ఉపాధి హామీ కింద నిధులు చెల్లిస్తారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు నిర్మించిన యూనిట్లు 500 మాత్రమే. నిర్మల్ భారత్ అభయాన్ పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేసి అమలులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, హౌసింగ్, ఉపాధిహామీ శాఖలు ఈ పనులు పర్యవేక్షించాలి. నాలుగుశాఖల అధికారుల మధ్య సమన్వయలోపంతో ఒకరిపై మరొకరు సాకులు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు. తోటల పెంపకానికి కొత్త మార్గదర్శకాలు ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు 2 ఎకరాల వరకు అర్హతగా మామిడి తోటల పెంపకానికి దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధిశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఎర్రవారిపాళెం, తంబళ్లపల్లె, ఇతర కొన్ని మండలాల్లో అనర్హులకు, పెద్ద భూస్వాములకు ఉపాధిహామీలో తోటల పెంపకానికి స్కీమ్‌లు ఇచ్చారు. దీనిపై విచారణ జరిపి కొందరు ఫీల్డ్స్టాఫ్ను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో తోటల పెంపకానికి అర్హతలను నిర్ణయిస్తూ ఆర్వోసీ నం కే5/5868 కింద నిబంధనలు జారీ చేశారు. వీటి ప్రకారం ప్రతి రైతూ రెండు ఎకరాలకు లోబడి పండ్లతోటలు పెంచుకునేందుకు అర్హులు. లబ్ధిదారుడు కచ్చితంగా ఉపాధి జాబ్‌కార్డు హోల్డర్ అయి ఉండాలి. తహశీల్దారు నుంచి సన్నకారు రైతు అనే సర్టిఫికెట్ తీసుకురావాలి. మొక్కలు నాటదలచిన పొలానికి సంబంధించిన టెన్‌వన్ అడంగల్‌ను విధిగా నమోదు చేయాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల కారణంగా ప్రాథమిక దశలోనే ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా అధికారులు చెబుతున్నారు. -
అన్నీ తానై...
కోడూరు, న్యూస్‌లైన్: కోడూరు సంతమార్కెట్ సమీపంలో నివసిస్తున్న తిరుపతమ్మ తల్లిదండ్రులు కుంభా కృష్ణ, నాంచారమ్మలకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు సాంబశివరావు (22) పుట్టుక తోనే మూగ, చెవిటివాడు, చిన్నకుమారుడు వెంకటేశ్వరరావు (14) పుట్ట్టు గుడ్డి. కుమార్తె తిరుపతమ్మ (20) ఆరోగ్యంగా ఉండడంతో కుమార్తెలోనే కొడుకును చూసుకుని ఆ కుటుంబం కాలం వెళ్లదీస్తోంది. ఇంట్లో పుట్టెడు కష్టం ఉన్నా పెదవి మాటునే బాధను దిగమింగుకొని కూలీనాలీ చేసుకుని సంపాదించిన దాంట్లో తలాకాస్తా తిని బతుకును భారంగా కొనసాగిస్తున్నారు. వేటాడి చేపలు పట్టి వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బుతో కుటుం బాన్ని తండ్రి పోషించేవాడు. మూడు సంవత్సరాల కిందట ప్రమాదవశాత్తు కాలువలోపడి తండ్రి మృతి చెందా డు. అప్పట్నుంచి అమ్మ నాంచారమ్మ చేపలు కొనుగోలు చేసి, వాటిని అమ్ముకుని కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తండ్రి మరణంతో కుంగిపోయిన తిరుపతమ్మపై విధి మరింత కన్నెర్ర చేసింది. తల్లి నాంచారమ్మను కూడా వారం రోజుల కిందట దూరం చేసింది. అనారోగ్యంతో బాధపడుతూ తల్లి మృతిచెందింది. దీంతో ముగ్గురు పిల్లలూ దిక్కులేని పక్షుల్లా మిగిలారు. నాంచారమ్మ అంత్యక్రియలను గ్రామస్తులు తలో చేయి వేసి పూర్తి చేయించారు. అప్పటివరకూ ఇల్లు కదలని తిరుపతమ్మ వికలాంగ సోదరులకు పట్టెడన్నం పెట్టేందుకు తల్లి మరణించిన మరుసటి రోజు నుంచే కూలిపనుల కోసం కాలు బయటపెట్టక తప్పలేదు. మార్కెట్లో దొరికిన పని చేసుకుంటూ అన్నీ తానై ముందుకు సాగుతోంది. అన్నకు నెలకు వచ్చే వికలాంగ పింఛను రూ.500 ఈమె సంపాదనకు చన్నీళ్లకు వేడినీళ్లలా సాయపడుతోంది. కనీసం గూడు కల్పించాలని, ఎస్టీ కోటాలో గృహం కట్టించాలని, రెండో సోదరుడికి వికలాంగుల పింఛన్ ఇప్పించాలని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా వీరి వేదన అరణ్యరోదనగానే మిగిలిపోయింది. ఆదుకోరూ... స్వచ్ఛంద సంస్థలు, దాతలు తమ పరిస్థితి అర్థం చేసుకుని అండగా నిలవాలని కోరుకుంటోంది ఈ బాలిక. వికలాంగులైన అన్న, తమ్ముడ్ని పోషించడం చాలా కష్టంగా ఉందని, తన చిట్టి చేతులు ఇంతటి భారాన్ని మోయలేకపోతున్నాయని .. తన కష్టాన్ని గమనించి ప్రభుత్వ అధికారులు చేయూతనివ్వాలని అభ్యర్థి స్తోంది తిరుపతమ్మ. -
లెక్క తప్పింది
=చక్కెర నిల్వల్లో తేడా =చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీలో మాయాజాలం =నోరు మెదపని అధికారులు =ఆగ్రహించిన కలెక్టర్ చిత్తూరు(గిరింపేట), న్యూస్‌లైన్: చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీలో తయారైన చక్కెర నిల్వల లెక్క తప్పినట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీ అధికారులు చెబుతున్న లెక్కలకు, అక్కడున్న స్టాక్‌కూ పొంతన కుదరడం లేదు. వారి లెక్కల ప్రకారంగా తీసుకున్నా సుమారు 1,500 బస్తాల చక్కెర లెక్కల్లోకి రావడం లేదు. ఈ విషయం పత్రికల్లో రావడంతో ఫ్యాక్టరీ పర్సన్ ఇన్చార్జి అయిన కలెక్టర్ సీరియస్ అయినట్లు తెలిసింది. లెక్కలు సరిపెట్టకపోతే అందరూ ఇళ్లకు వెళ్లిపోతారంటూ సంబంధిత అధికారులపై ఆయన తీవ్రంగా మండిపడినట్లు విశ్వనీయ సమాచారం. పొంతన కుదరని లెక్క చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీలో నవంబర్ 27 నుంచి ఈ నెల 12వ తేదీ వరకు 21 వేల టన్నుల చెరుకు క్రషింగ్ చేయగా 7.5 శాతం చక్కెర రికవరీ అయిందని అధికారులు లెక్క చెబుతున్నారు. వారి లెక్క ప్రకారం పదిశాతం రికవరీ అయితే టన్ను చెరుకుకు క్వింటాలు చక్కెర ఉత్పత్తి కావాలి. ప్రస్తుతం 7.5 శాతం రికవరీ కావడంతో 21 వేల టన్నుల చెరుకుకు 15,750 క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి కావాల్సి ఉంది. అధికారులు మాత్రం 14 వేల క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి అయినట్లు చెబుతున్నారు. ఇందులో 11 వేల క్వింటాళ్లు గోడౌన్లో, ఆరేడు వందల క్వింటాళ్లు రీమెల్టింగ్ కోసం ఫ్యాక్టరీలో, మరో రెండున్నర వేల క్వింటాళ్ల చక్కెరకు సంబంధించిన చెరుకురసం ఫ్యాక్టరీ జూస్ కంటైనర్లలోనూ స్టాక్ ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఇవి మొత్తం కలిపినా 14 వేల క్వింటాళ్లకు మించడం లేదు. దీన్నిబట్టి చూస్తే 1,500 బస్తాలు లెక్కకు రావడం లేదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తే సంబంధిత అధికారులు నోరు మెదపడం లేదు. పైగా అక్రమాలను వెలుగులోకి తెస్తున్న పత్రికలపైకి రైతులు, రైతు నాయకులను ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలావుండగా ఫ్యాక్టరీలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై పత్రికల్లో కథనాలు వెలువడడంతో కొంతమంది రైతులు, రైతునాయకులు ఫ్యాక్టరీకి వెళ్లి అధికారులతో శనివారం చర్చించారు. బిజీబిజీగా అధికారులు చక్కెర బస్తాల లెక్క సరిపెట్టే ప్రయత్నంలో అధికారులు శనివారం బిజీబిజీగా కనిపించారు. గతఏడాది తయారైన చక్కెర నిల్వలు సుమారు 55 వేల క్వింటాళ్లు పక్కనే గోడౌన్లో ఉన్నాయి. దాన్ని కొత్తస్టాక్లోకి చేర్చి లెక్క సరిచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని తెలిసింది. అంతేకాకుండా గత ఏడాది స్టాక్‌లో వేస్టేజీగా ఉన్న చక్కెరను కొత్తబస్తాల్లో నింపి దాన్ని కొత్తస్టాక్లో కలుపుతున్నారని తెలిసింది. ఏదోఒక రకంగా తేడా వస్తున్న లెక్కను సరిచేసే క్రమంలో అధికారులు తలమునకలైనట్లు సమాచారం. ఈ విషయమై ఫ్యాక్టరీ ఎండీ వెంకటేశ్వరరావును వివరణ కోరేందుకు ‘న్యూస్‌లైన్’ ఫోన్లో ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఇదిలావుండగా ఫ్యాక్టరీ ఎండీ ఉద్యోగులు, కార్మికులతో శనివారం విడివిడిగా సమావేశమయ్యారు. ఫ్యాక్టరీలోని విషయాలను ఇక్కడి వారే పత్రికలకు లీక్ చేస్తున్నారని, వారెవరో తేలితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం. ఫ్యాక్టరీ పర్సన్ ఇన్చార్జి అయిన కలెక్టర్ చొరవ తీసుకుంటే తప్ప అక్రమాలు వెలుగులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. -
మహమ్మద్ రఫీని విస్మయానికి గురి చేసిన ఘంటసాల పాట
వాయిద్యానికి ప్రాణం వచ్చి సాహిత్యాన్ని పలుకుతున్నట్లుంటుంది ఘంటసాల మాస్టారి గాత్రం. దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు లోగిళ్లను పునీతం చేసిన కంఠం ఆయనది. తెలుగు సినిమా స్వర్ణయుగ వైభవానికి ప్రతీక ఘంటసాల పాట. గాయకునిగా, సంగీత దర్శకునిగా, నిర్మాతగా తెలుగు సినీ చరిత్రలో ఘంటసాలది ఓ సువర్ణాధ్యాయం. నేడు ఆ గానగంధర్వుడి జయంతి. ఈ సందర్భంగా ఆయన స్మృతుల్ని కాసేపు నెమరువేసుకుందాం. అక్కినేని, అంజలీదేవి జంటగా వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో రూపొందిన ‘సువర్ణసుందరి’(1957) సినిమా ఆ రోజుల్లో ఓ సంగీత సంచలనం. ఆదినారాయణరావు స్వరపరిచిన ఈ సినిమా గీతాలు శ్రోతల్ని శ్రవణానందభరితుల్ని చేశాయి. ఇందులోని ప్రతి పాటా ఆణిముత్యమే అయినా... అందులో మేలిముత్యం మాత్రం ‘హాయి హాయిగా ఆమని సాగె’ పాట. రాగమాలికలో స్వరపరిచినఈ పాటను ఘంటసాల, జిక్కీ ఆలపించారు. సంగీత జ్ఞానుల ప్రశంసలందుకున్న పాట ఇది. ఘంటసాల గురించి మాట్లాడుకునే ముందు ఈ పాట గురించి తప్పకుండా చెప్పుకోవాలి. ఎందుకంటే.. గాయకునిగా ఘంటసాల సామర్థ్యాన్ని తెలియజేసిందీ పాట. 1958లో ‘సువర్ణసుందరి’ చిత్రాన్ని హిందీలో నిర్మించడానికి తలపెట్టారు ఆ చిత్రానికి నిర్మాత కూడా అయిన ఆదినారాయణరావు. మద్రాసులో పాటల రికార్డింగ్ మొదలైంది. ‘హాయి హాయిగా ఆమని సాగె’ పాట హిందీ వెర్షన్‌ని మహమ్మద్ఫ్రీ, లతామంగేష్కర్లపై రికార్డ్ చేస్తున్నారు ఆదినారాయణరావు. ఎంతటి కష్టతరమైన గీతాన్నైనా సునాయాసంగా పాడేయగల మహా గాయకుడు రఫీ... రాగమాలికలో స్వరపరిచిన ఈ పాటను పాడటానికి ప్రారంభంలో కాస్త ఇబ్బంది పడ్డారు. ఈ పాటను ఘంటసాల రెండే టేకుల్లో ఓకే చేశారని తెలిసి ఆయన విస్మయానికి లోనయ్యారు. ఈ పాటను అంత తేలిగ్గా ఘంటసాల ఎలా పాడగలిగారో రఫీకి అంతుపట్టలేదు. యాదృచ్ఛికంగా.. అప్పుడే... అదే రికార్డింగ్ థియేటర్లోకి అడుగుపెట్టారు ఘంటసాల. వేరే సినిమా పాటల రికార్డింగ్ పనిమీద ఆయన అక్కడకు రావడం జరిగింది. ఒక్కసారిగా అక్కడ ఘంటసాలను చూడగానే రఫీ ఉద్వేగానికి లోనయ్యారు. గట్టిగా ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు. అక్కడే ఉన్న లతాజీ అయితే... ఆ పాటను ఒక్కసారి తనతో కలిసి ఆలపించాలని ఘంటసాలను అభ్యర్థించారు. అయితే.. లతామంగేష్కర్ అభ్యర్థనను ఘంటసాల తోసిపుచ్చారు. ఆమె ఎంత బతిమాలినా ఘంటసాల ఏదో ఒక సాకు చెప్పి అక్కడ్నుంచీ తప్పుకున్నారు. ఇంటికెళ్లి ఈ విషయాన్ని తన భార్య సావిత్రమ్మకు చెప్పారు ఘంటసాల. ‘లతాజీ స్వయంగా పాడమని అడిగినప్పుడు... పాడొచ్చు కదా..’ అని అమె అంటే.. ‘‘రఫీగారు ఓ వైపు ఆ పాట పాడుతున్నప్పుడు.. నేనెళ్లి అదే పాటను లతాజీతో పాడటం రఫీగారిని అవమానించడమే అవుతుంది. అది సంస్కారం కాదు’’ అన్నారట ఘంటసాల. సరిగ్గా ఇది జరిగిన 11ఏళ్ల తర్వాత ఘంటసాల, రఫీల మధ్య మరో సంఘటన చోటుచేసుకుంది. ఎన్టీఆర్ ‘భలేతమ్ముడు’ సినిమాలోని పాటలను కొన్ని కారణాలవల్ల ఘంటసాలతో గాక, మహమ్మద్ఫ్రీతో పాడించాలని నిర్ణయించుకున్నారు ఆ చిత్ర నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య. ‘భలేతమ్ముడు’ పాటల పనిమీద మద్రాస్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన రఫీ.. సరాసరి ఘంటసాల ఇంటికే వెళ్లారు. ‘మీరుండగా తెలుగు సినిమాకు నేను పాడటం నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది’ అని రఫీ వాపోయారు. ‘మీ గొంతునుంచి జాలువారే తెలుగు పాట వినాలన్న ఆకాంక్ష.. మా శ్రోతలతో పాటు, నాకూ ఉంది. ఇంకేమీ ఆలోచించకుండా పాడండి’ అని నచ్చజెప్పి రఫీని రికార్డింగ్ థియేటర్‌కి పంపారట ఘంటసాల. రఫీ పాటకు ఘంటసాల ఎలాగైతే అభిమానో... ఘంటసాల పాటకు రఫీ కూడా అంతే అభిమాని. పలు సందర్భాల్లో ఈ విషయాన్ని మహమ్మద్ రఫీ వ్యక్తం చేశారు. తెలుగు భాష ఉన్నంతవరకూ ఘంటసాల పాట ఉంటుంది. తెలుగు శ్రోతల హృదయాల్లో ఘంటసాల ఎప్పటికీ చిరంజీవే. -
ఉపాధి కోసం వెళ్లి జైలుపాలు
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్), న్యూస్‌లైన్ : విజిటింగ్ వీసాపై ఉపాధి కోసం మలేషియా వెళ్లిన ఓ యువకుడు గడువు ముగియడంతో అక్కడ అధికారులకు చిక్కి జైలు పాలయ్యూడు. స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఎట్టకేలకు సొంతూరికి చేరుకున్నాడు. వివరాల్లోకి వెళితే... తాడేపల్లిగూడెం 31వ వార్డు కడకట్లకు చెందిన యర్రంశెట్టి వెంకటేశ్వరరావు ఈ ఏడాది జూన్ 8న ఉపాధి కోసం మలేషియా వెళ్లాడు. వేలాది రూపాయలు వసూలు చేసిన ఏజెంట్లు అతని చేతిలో విజిటింగ్ వీసా పెట్టి పంపారు. వీసా గడువు ముగిసినా అక్కడే ఉన్న వెంకటేశ్వరరావును మలేషియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షెహరంబో జైలులో ఉంచారు. అతని వెంట ఉన్న మరో వ్యక్తి వెంకటేశ్వరరావు భార్య చైతన్యకు సమాచారం అందించాడు. ఆమె తన భర్తను ఇండియాకు రప్పించాలని కోరుతూ కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావుకు సెప్టెంబర్ 17న విన్నవిం చుకుంది. స్పందించిన ఆయన సమస్యను మలేషియా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అక్కడ అధికారులు వెంకటేశ్వరరావును విడుదల చేయించి భారత దేశానికి పంపారు.