
సీనియర్ ఎడిటర్ పి. వెంకటేశ్వరరావు (72) చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆరు నెలలుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు రెండొందల చిత్రాలకు పైగా వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా వర్క్ చేశారు. ‘యుగంధర్’, ‘మొండిమొగుడు పెంకి పెళ్ళాం’, ‘కెప్టెన్ కృష్ణ’, ‘ఇద్దర అసాధ్యులే’ వంటి పలు హిట్ చిత్రాలకు ఎడిటర్‌గా చేశారు వెంకటేశ్వరరావు.
ఆయన భార్య కొన్నేళ్ల క్రితం మరణించారు. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా వెంకటేశ్వరరావు మృతికి పలువురు సినీ ప్రముఖులు, తెలుగు ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోటగిరి వెంకటేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి మార్తాండ్ కె. వెంకటేష్ సంతాపం వ్యక్తం చేశారు. వెంకటేశ్వరరావు అంత్యక్రియలు ఈ నెల 22న చెన్నైలో జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment