తోట్లవల్లూరు: ప్రమాదవశాత్తు గోడకూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా తోట్ల వల్లూరు మండల కేంద్రంలో సోమవారం ఉదయం జరిగింది. మండల కేంద్రంలో ఓ పాత భవనాన్ని కూలుస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కటారి వెంకటేశ్వరరావు(55) అనే వ్యక్తిపై పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.