thotavallur
-
ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌పై టీడీపీ గూండాల దౌర్జన్యం
సాక్షి, విజయవాడ : విజయవాడలోని తోటవల్లూరు కరకట్ట వద్ద టీడీపీ గూండాలు మరోసారి దౌర్జన్యానికి దిగారు. పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌పై టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. విజయవాడ వెళ్తున్న కైలే అనిల్‌కుమార్ కారును అడ్డుకొని టీడీపీ గూండాలు ఆయనపై దాడికి యత్నించారు. టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై అక్కడి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కైలే అనిల్ కుమార్ స్పందిస్తూ.. తనపై దాడి చేసేందుకు టీడీపీ గూండాలు ప్రయత్నించారు. మాపై దాడులుకు పాల్పడుతుంది రైతులు కాదు.. టీడీపీ గుండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గూండాలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్లాన్ ప్రకారమే శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు. (ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం) -
వృద్ధుడి బలవన్మరణం
తోట్లవల్లూరు: ఓ వృద్ధుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని బద్దిరాజు పాలెంకు చెందిన తుమ్మా లక్ష్మయ్య (64) గ్రామ శివారులోని వంతెనకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని, పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
గోడకూలి వ్యక్తి మృతి
తోట్లవల్లూరు: ప్రమాదవశాత్తు గోడకూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా తోట్ల వల్లూరు మండల కేంద్రంలో సోమవారం ఉదయం జరిగింది. మండల కేంద్రంలో ఓ పాత భవనాన్ని కూలుస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కటారి వెంకటేశ్వరరావు(55) అనే వ్యక్తిపై పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.