
సాక్షి, విజయవాడ : విజయవాడలోని తోటవల్లూరు కరకట్ట వద్ద టీడీపీ గూండాలు మరోసారి దౌర్జన్యానికి దిగారు. పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌పై టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. విజయవాడ వెళ్తున్న కైలే అనిల్‌కుమార్ కారును అడ్డుకొని టీడీపీ గూండాలు ఆయనపై దాడికి యత్నించారు. టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై అక్కడి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కైలే అనిల్ కుమార్ స్పందిస్తూ.. తనపై దాడి చేసేందుకు టీడీపీ గూండాలు ప్రయత్నించారు. మాపై దాడులుకు పాల్పడుతుంది రైతులు కాదు.. టీడీపీ గుండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గూండాలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్లాన్ ప్రకారమే శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు.