తోట్లవల్లూరు: ఓ వృద్ధుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని బద్దిరాజు పాలెంకు చెందిన తుమ్మా లక్ష్మయ్య (64) గ్రామ శివారులోని వంతెనకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని, పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.