యువతి ఆత్మహత్య
తిరువళ్లూరు: వివాహితుడితో ప్రేమ వ్యవహరం నడుపుతున్న కుమార్తెను తల్లిదండ్రులు మందలిండంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు..
తిరువళ్లూరు జిల్లా తన్నీర్‌కులం రామాపురం గ్రామానికి చెందిన శివకుమార్ కుమార్తె ఆర్తి (21). ఈమె చైన్నె భక్తవత్సలం మహిళ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. కాగా ఆర్తికి అదే ప్రాంతంలో ఆటో డ్రైవర్ అయిన వివాహితుడైన వ్యక్తితో గత రెండేళ్ల నుంచి ప్రేమ వ్యవహరం నడుపుతున్న తెలుస్తోంది. వీరి ప్రేమ వ్యవహరం ఇద్దరి ఇంటి పెద్దలకు తెలియడంతో మందలించినట్లు తెలుస్తోంది.
దీంతో యువతి మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బంధువులు ఉరికి వేలాడుతున్న యువతిని కిందకు దింపి స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. కాగా ఆటో డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని మహిళ పోలీసులకు యువతి బంధువులు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment