
న్యాయవాది ఆత్మహత్య కేసు...
బనశంకరి: బెంగళూరులో బోవి అభివృద్ధి మండలి అక్రమాల కేసులో నిందితురాలు, న్యాయవాది జీవా (33) ఆత్మహత్య కేసులో సీఐడీ డీఎస్పీ కనకలక్ష్మీని మంగళవారం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మండలికి సామగ్రి సరఫరా చేసే కాంట్రాక్టును ఎస్.జీవా నిర్వహించేది. గత ఏడాది నవంబరు 22 తేదీన తేదీన డెత్‌నోట్ రాసిన జీవా బనశంకరి రాఘవేంద్రలేఔట్‌లోని ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు.
అక్రమాలు జరిగాయన్న కేసులో జీవాను సీఐడీ డీఎస్పీ కనకలక్ష్మి పిలిపించి చిత్రహింసలకు గురిచేసిందని, రూ. 25 లక్షల లంచం ఇవ్వాలని డిమాండు చేసిందని మృతురాలి సహోదరి సంగీత ఆరోపించారు. జీవా రాసిన 10 పేజీలకు పైగా డెత్‌నోట్ తో సమేతంగా సంగీతా బనశంకరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును పోలీస్ కమిషనర్ దయానంద్ ఆదేశంతో సిట్ విచారిస్తోంది. ఎట్టకేలకు కనకలక్ష్మిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment