CID cheif
-
ఏపీ సీఐడీ చీఫ్‌గా ఎన్ సంజయ్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సీఐడీ డీజీగా ఎన్ సంజయ్ ఐపీఎస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఫైర్ సర్వీసెస్(విపత్తు నిర్వహణ) డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం సీఐడీ చీఫ్‌గా ఉన్న పీవీ సునీల్ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణ పరిపాలనా శాఖ(జీఏడీ)లో రిపోర్ట్ చేయాలని సునీల్‌కుమార్‌ను ఆదేశించింది. అంతర్గత బదిలీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఆ ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవు: సీఐడీ చీఫ్ సునీల్ కుమార్
సాక్షి, విజయవాడ: టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవని ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. అది ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్. దీనిపై కొందరు ఫోరెన్సిక్ రిపోర్ట్ అని విడుదల చేశారు. ఆ వీడియోను ఎవరో షూట్ చేశారు. మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపి రిపోర్ట్ తీసుకున్నారు. వీడియో కంటెంట్ ఒరిజినలా కాదా అనేది ల్యాబ్ చెప్పలేదు. రిపోర్ట్‌ను మార్చి ప్రచారం చేశారు. ప్రైవేట్ ల్యాబ్‌లు ఇచ్చే నివేదికలకు విలువ ఉండదు. మన ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే నివేదికే ప్రామాణికం. వీడియో తనది కాదని ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు. మార్ఫింగ్ చేశారని ఎంపీ ఫిర్యాదు చేశారు. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు. చదవండి: (బాలయ్య ఏందయ్యా ఇది.. పాపం పిల్లలు మాడిపోయారు?) -
ఈడీ చేతికి భూఅక్రమాలు
-
అమరావతి భూముల కొనుగోలు పై ఈడీ దూకుడు
-
అమరావతి భూముల కొనుగోలుపై దూకుడు పెంచిన సీఐడీ
సాక్షి, విజయవాడ : అమరావతి భూముల కొనుగోలు సంబంధించి సీఐడీ దూకుడు పెంచింది. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. అమరావతిలో 4వేల ఎకరాల భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టుగా కేబినెట్ సబ్‌కమిటీ ఇప్పటికే నివేదిక సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక ఆధారంగా భూములు కొనుగోలు చేసిన రాజకీయ నాయకులపై సీఐడీ విచారణ చేస్తోంది. అమరావతి కోర్ ఏరియాలో 720 ఎకరాల భూమిని తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ కొనుగోలు చేసినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. మొత్తంగా 790 మంది తెల్ల రేషన్ కార్డు హోల్డర్లకు అధికారులు నోటీసులు కూడా జారీచేశారు. అలాగే అమరావతి భూముల కొనుగోలుపై విచారణ చేయాలంటూ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఈడీకి లేఖ రాశారు. భూ డాక్యుమెంట్లతోపాటు, తెల్లరేషన్ కార్డు హోల్డర్ల వివరాలను ఈడీకి పంపించారు. ఈ లేఖకు సంబంధించి ఈడీ రెండు రోజుల్లో రంగంలోకి దిగనున్నట్టుగా సమాచారం. -
నారీ గూఢచారి
తొలి మహిళా ప్రైవేట్ డిటెక్టివ్ రజనీ పండిత్ ఇప్పటివరకు 80 వేలకు పైగా కేసులను పరిశోధించి, పరిష్కరించారు. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అనే ప్రసిద్ధ ఫేస్బుక్ పేజీలో రెండు రోజుల క్రితం అక్టోబర్ 31 వతేదీ నాడు ఒక మహిళ ఒక పోస్ట్ పెట్టింది. పదిహేడు గంటల్లో పద్నాలుగు వేల లైక్స్, వెయ్యి షేర్లతో వైరల్ అయింది ఈ పోస్ట్. ఆ పోస్టు సారాంశం ఇదీ. ‘‘చాలా ఏళ్ల కిందట.. ఒక డబుల్ మర్డర్ జరిగింది. తండ్రి, కొడుకు ఇద్దరూ హత్యకు గురయ్యారు. ఛేదించడానికి చిన్న క్లూ కూడా లేదు. ఈ కేస్‌కు సంబంధించి ఎందరో అనుమానితులు. ఫిల్టర్ చేయగా చేయగా ఒక మహిళ మిగిలింది. ఆమే.. కాదో తేల్చుకోవాలి. ఎలా? వాళ్లింట్లో పని మనిషిగా చేరాను. ఓ ఆర్నెల్లు ఉన్నాను. ఆమెకు నమ్మిన బంటుగా మారడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించాల్సి వచ్చిందో. ఆమె జబ్బు పడితే సపర్యలూ చేశా. అట్లా నెమ్మది నెమ్మదిగా ఆమె నమ్మకాన్ని సాధించా. కానీ ఒకసారి.. అంతా నిశ్శబ్దంగా ఉంది. జరగబోయే సంభాషణ రికార్డ్ చేద్దామని రికార్డర్ ఆన్ చేశా.. రహస్యంగా. క్లిక్‌మన్న సౌండ్‌ను విని ఆమె నన్ను అనుమానించడం మొదలుపెట్టింది. బయటకు వెళ్లనివ్వకుండా ఆపేది. దాదాపుగా హౌస్ అరెస్ట్ చేసేసింది.ఒకరోజు.. ఒక వ్యక్తి వచ్చాడు. అతనికి, ఆమెకు జరిగిన సంభాషణను బట్టి అతను కిరాయి హంతకుడు అని తేలింది. ఇక ఆ అవకాశం వదులుకోదల్చుకోలేదు నేను. వంటింట్లోకి వెళ్లి కత్తితో కాలు మీద గాటు పెట్టుకున్నా. అదేదో ప్రమాదవశాత్తు జరిగినట్టు నటించి.. రక్తమోడుతున్న కాలుని ఆమెకు చూపించి వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి కట్టుకట్టించుకుని వస్తానని చెప్పి.. ఆమె పర్మిషన్ కోసం చూడకుండా వడివడిగా బయటకు నడిచాను. గేట్ దాటాక పరిసరాల్లో ఉన్న పబ్లిక్ టెలిఫోన్ బూత్‌కి పరిగెత్తాను. పోలీసులకు ఫోన్ చేసి .. వాళ్లొచ్చేవరకు అక్కడే కాపు కాసి వాళ్లు వచ్చాక వాళ్లతోపాటే మళ్లీ ఆమె ఇంటికి వెళ్లాను. అప్పటికే ఆ కిరాయి హంతకుడికి, ఆమెకు ఏదో వాగ్వివాదం జరుగుతోంది. పోలీసులు ఆ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఇదీ నా కెరీర్లో అత్యంత క్లిష్టమైన, కఠినమైన కేస్..’’ పై పోస్టు పెట్టిన ఆ మహిళ పేరు రజనీ పండిత్. మన దేశపు ఫస్ట్ విమెన్ ప్రైవేట్ డిటెక్టివ్. రజనీ తండ్రి సీఐడీలో పనిచేసేవారు. ఆయన ఇన్స్పిరేషన్, ఇన్‌ఫ్లుయెన్స్‌తోనే ఆమె ఇన్వెస్టిగేషన్ పట్ల ఆసక్తిని పెంచుకుంది. తండ్రి వర్కింగ్ స్టయిల్‌ను దగ్గరగా చూసి, చూసి తనూ నైపుణ్యమూ సంపాదించుకుంది. డిగ్రీలో ఉన్నప్పుడే పార్ట్‌టైమ్‌గా డిటెక్టివ్ వర్క్ మొదలుపెట్టింది. ఆమె చేపట్టిన మొదటికేస్.. తన యజమాని ఇంట్లో జరుగుతున్న వరుస దొంగతనాల దొంగను పట్టుకోవడం. ఆ దొంగ ఎవరో కాదు.. యజమాని కొడుకే అని తన ఇన్వెస్టిగేషన్తో తేల్చేసింది రజనీ. నాటి నుంచి నేటి వరకు రజనీ 80 వేల కేసులకు పైగా పరిశోధించి, పరిష్కరించింది. రెండు పుస్తకాలనూ రాసింది. అందిన పురస్కారాలకు లెక్కేలేదు. 22వ యేట ఆరంభమైన ఆమె పరిశోధన ఇప్పటి దాకా అప్రతిహతంగా సాగుతూనే ఉంది.. పెళ్లి, పిల్లలతో సొంత కుటుంబాన్ని ఏర్పర్చుకోవాలనే ధ్యాస, తలపు లేకుండా. అందుకే అంటుంది.. ‘‘ఇన్వెస్టిగేషనే నా జీవన సహచరుడు’’ అని. అంత నిబద్ధత రజనీకి తన పనిపట్ల. కాబట్టే ఆమెను ‘‘దేశీ షెర్లాక్’’ అంటారంతా! – శరాది -
‘గోల్డ్ స్కామ్’లు రూ.6510 కోట్లకు పైనే
అందరికీ న్యాయం జరిగేలా చర్యలు: సీఐడీ చీఫ్ సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఫర్మ్స్ అండ్ ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అభయ గోల్డ్ ఇన్ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు రూ.6,510 కోట్లకు పైగా కుంభకోణానికి పాల్పడినట్లు గుర్తించామని సీఐడీ చీఫ్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అగ్రిగోల్డ్ కేసులో 32 లక్షల మంది బాధితులు ఉన్నట్లు ఇప్పటివరకు గుర్తించినట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాధితులను రూ.6,380 కోట్ల మేర మోసగించిందన్నారు. అభయ గోల్డ్ ఇన్ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సైతం ఇదే తరహాలో ప్రజల నుంచి రూ.130 కోట్లు సేకరించినట్లు గుర్తించామన్నారు. బాధితులందరికీ న్యాయం చేస్తామన్నారు.