అందరికీ న్యాయం జరిగేలా చర్యలు: సీఐడీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఫర్మ్స్ అండ్ ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అభయ గోల్డ్ ఇన్‌ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు రూ.6,510 కోట్లకు పైగా కుంభకోణానికి పాల్పడినట్లు గుర్తించామని సీఐడీ చీఫ్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అగ్రిగోల్డ్ కేసులో 32 లక్షల మంది బాధితులు ఉన్నట్లు ఇప్పటివరకు గుర్తించినట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాధితులను రూ.6,380 కోట్ల మేర మోసగించిందన్నారు. అభయ గోల్డ్ ఇన్‌ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సైతం ఇదే తరహాలో ప్రజల నుంచి రూ.130 కోట్లు సేకరించినట్లు గుర్తించామన్నారు. బాధితులందరికీ న్యాయం చేస్తామన్నారు.
‘గోల్డ్ స్కామ్’లు రూ.6510 కోట్లకు పైనే
Published Tue, Feb 24 2015 8:06 PM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM
Advertisement