
సాక్షి, అమరావతి : అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్‌కు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో అరెస్టయి, రిమాండ్ ఖైదీగా ఉన్న జోగి రాజీవ్ బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం (ఆగస్ట్23) విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది
రాజీవ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని, వెంటనే బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రాజీవ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు జోగి రాజీవ్‌తో పాటు, సర్వేయర్ రమేష్‌కు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. జోగి రాజీవ్ కస్టడీ కోరుతూ ఏసీబీ వేసిన పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్, సర్వేయర్ రమేష్‌ను ఈ నెల 13న ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment