Rajeev
-
'ఆమెతో నటించడం అద్భుతం'.. శోభిత ధూళిపాళ్లపై నటుడు ప్రశంసలు!
టాలీవుడ్ హీరో నాగచైతన్యకు కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. తెలుగమ్మాయి అయినప్పటికీ ఎక్కువగా బాలీవుడ్లోనే రాణిస్తోంది. ఇటీవల లవ్-సితార మూవీతో ప్రేక్షకులను పలకరించింది శోభిత. ఇందులో బాలీవుడ్ నటుడు రాజీవ్ సిద్ధార్థ్‌తో జంటగా నటించింది. ప్రస్తుతం హానీమూన్ ఫోటోగ్రాఫర్ వెబ్ సిరీస్‌లో నటించిన రాజీవ్ సిద్ధార్థ్.. శోభితతో కలిసి పనిచేయడంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనతో కలిసి నటించడం ఓ మంచి అనుభవమని అన్నారు.రాజీవ్ మాట్లాడుతూ.. 'ఆమెతో కలిసి పనిచేయడం చాలా మంచి అనుభవం. వర్క్‌షాప్ మొదటి రోజు నుంచి సినిమా చివరి దాకా సమష్టింగా పనిచేశాం. శోభిత చాలా అద్భుతమైన సహనటి. మేమిద్దరం సినిమా ఎలా ఉంటుందనే దానిపైనే శ్రద్ధ పెట్టాం. మా సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయి. ప్రతి సీన్‌ని మెప్పించేలా పని చేశాం. ఈ క్రెడిట్ అంతా మా దర్శకురాలు వందనా కటారియాకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆమెకు సినిమా అంటే ప్రాణం. ఈ చిత్రం సిబ్బందిలోని ప్రతి ఒక్కరూ ఆమె విజన్ కోసం చాలా కష్టపడ్డారు.' అని చెప్పుకొచ్చారు.(ఇది చదవండి: కాబోయే భార్యతో నాగచైతన్య.. పెళ్లికి ముందే చెట్టాపట్టాల్!)కాగా.. శోభిత ధూళిపాళ్లకు, హీరో నాగచైతన్యకు ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. వీరద్దరూ త్వరలోనే వివాహబంధంలోకి అడుగు పెట్టనున్నారు. నిశ్చితార్థం తర్వాత ఈ జంట తొలిసారి బయట కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. మరోవైపు నాగ చైతన్య తండేల్ మూవీలో నటిస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. -
జోగి రాజీవ్ కు బెయిల్
-
జోగి రాజీవ్‌కు బెయిల్ మంజూరు
సాక్షి, అమరావతి : అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్‌కు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో అరెస్టయి, రిమాండ్ ఖైదీగా ఉన్న జోగి రాజీవ్ బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం (ఆగస్ట్23) విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగిందిరాజీవ్ను అక్రమంగా అరెస్ట్ చేశారని, వెంటనే బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రాజీవ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు జోగి రాజీవ్‌తో పాటు, సర్వేయర్ రమేష్‌కు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. జోగి రాజీవ్ కస్టడీ కోరుతూ ఏసీబీ వేసిన పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్, సర్వేయర్ రమేష్‌ను ఈ నెల 13న ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
మా 175 మందిని అరెస్ట్ చేసుకో..
-
జోగి రాజీవ్ అరెస్ట్ పై.. చెల్లుబోయిన వార్నింగ్
-
కొడుకు అరెస్ట్ పై కన్నీళ్లు పెట్టుకున్న జోగి రమేష్ భార్య
-
‘న్యూయార్క్ సెంట్రల్ పార్క్’ హైదరాబాద్‌లో
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ‘రాజీవ్ పార్క్’ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. పట్టణ ఉద్యానవనంగా పిలిచే న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో రాజీవ్ పార్క్‌ను అభివృద్ధి చేయాలని ఆయన సంకల్పించారు. దీంతో అనువైన ప్రాంతం, స్థల సమీకరణ కోసం అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. పశ్చిమ హైదరా బాద్‌లో కొలువుదీరనున్న రాజీవ్ పార్క్‌లో సందర్శకులు సిటీ వ్యూ చూసేందుకు వీలుగా ఎత్తయిన అబ్జర్వేటరీ డెక్ కూడా ఏర్పాటు చేయా లనుకుంటున్నారు. రీ ఇమేజినింగ్ హైదరాబాద్ పేరిట ఇటీవల ఓ హోటల్లో సీఎం రేవంత్ నిర్వహించిన సమావేశంలో పలువురు బిల్డర్లతో ఈ అంశాన్ని వెల్లడించినట్లు తెలిసింది.న్యూయార్క్ సెంట్రల్ పార్క్ ఇలా..న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో 843 ఎకరాల్లో సెంట్రల్ పార్క్ ఉంది. అమెరికాలో తొలి ల్యాండ్‌స్కేప్ పార్క్ ఇదే. 2016 అంచనాల ప్రకారం ఏటా సుమారు 4.2 కోట్ల మంది పర్యాటకులు ఈ పార్క్‌ను సందర్శి స్తున్నారు. ఇందులో సినిమా షూటింగ్ స్పాట్లు, అభయారణ్యం, థియేటర్, ఫుడ్ జోన్స్, జూ, కిడ్స్ ప్లే ఏరియా వంటి వినోద కేంద్రాలు ఉన్నాయి. సైక్లింగ్, వాక్‌వేలు, ఇతరత్రా క్రీడా సౌకర్యాలు, సాంస్కృతిక కార్య క్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు. సంస్కృతీ సంప్రదాయాలు, చర్రితను తెలియజెప్పే విభిన్న ఆకృతులతో మాన్యుమెంట్స్ ఉన్నాయి.బిలియనీర్ల కోసం 4,100 ఎకరాలురాజీవ్ పార్క్ చుట్టూ బిలియనీర్లు, అల్ట్రా లగ్జరీ ప్రముఖుల నివాస, వాణిజ్య సముదాయాల కోసం 4,100 ఎకరాలను అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారు. సాధారణంగా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), ప్రవాసులు, బహుళజాతి సంస్థల అధినేతలు, సెలబ్రిటీలు ఎక్కువగా ఉబర్ లగ్జరీ నివాస సముదాయాల్లో ఉండేందుకు ఇష్టపడతారు.ఈ తరహా భవనాల్లో విశాలమైన లాంజ్‌లు, ఇంట్లోనే జిమ్, స్పా, సెలూన్, కట్టుదిట్టమైన భద్రత, ప్రైవేట్ ఔట్‌డోర్ స్పేస్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆధునిక వసతులుంటాయి. ప్రభుత్వం తలపెట్టిన రాజీవ్ పార్క్ కార్యరూపంలోకి వస్తే ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉంటాయని స్థిరాస్తి నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంపన్న వర్గాలు ఎక్కువగా ఈ తరహా ప్రాంతాల్లో నివసించేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో విలాసవంతమైన గృహాలు, ఆఫీసు భవనాలు వెలుస్తాయని చెబుతున్నారు.చైనాలో అర కిలోమీటర్‌కన్నా ఎత్తైన అబ్జర్వేటరీ డెక్⇒ ఎత్తయిన ప్రదేశం నుంచి సిటీ వ్యూ, సుదూర ప్రాంతాలను చూసేందుకు వీలుగా ఉండే ప్లాట్‌ఫామ్‌ను అబ్జర్వేటరీ డెస్క్ అంటారు. సాధారణంగా హైరైజ్ నివాస, వాణిజ్య సముదాయాలలో ఈ తరహా డెక్‌లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కనుచూపు మేరలో సిటీ వ్యూ కనిపిస్తూ, ధారాళమైన గాలి, వెలుతురుతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.అబ్జర్వేటరీ డెక్‌లు షాంఘై, దుబాయ్, మలేషియా, టోక్యో వంటి దేశాలలో ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అబ్జర్వేటరీ డెక్ చైనాలోని షాంఘై టవర్‌లో ఉంది. 632 మీటర్ల (2,073 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ భవనంలో మొత్తం 128 అంతస్తులుంటాయి. 118వ అంతస్తులో అంటే 562 మీటర్లు (1,841 అడుగులు) ఎత్తులో అబ్జర్వేటరీ డెక్ ఉంది. -
వాహనాల ధర ఎందుకు పెరుగుతుందో తెలుసా..?
పుణే, బిజినెస్ బ్యూరో: కాలుష్యాన్ని కట్టడి చేసే పేరిట అతి నియంత్రణలు, అధిక స్థాయి జీఎస్టీలను అమలు చేయడం వల్లే వాహనాల రేట్లకు రెక్కలు వచ్చాయని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. బ్రెజిల్ వంటి దేశాల్లో మోటార్‌సైకిళ్లపై పన్నులు 8–14 శాతం శ్రేణిలో ఉండగా దేశీయంగా మాత్రం అత్యధికంగా 28 శాతం జీఎస్టీ ఉంటోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనాల ధరలను తగ్గించే పరిస్థితి ఉండటం లేదని, దీంతో నిర్వహణ వ్యయాలైనా తగ్గే విధంగా వాహనాలను రూపొందించడం ద్వారా కొనుగోలుదారులకు కొంతైనా ఊరటనిచ్చే ప్రయత్నం జరుగుతోందని బజాజ్ చెప్పారు. 125 సీసీ పైగా సామర్ధ్యం ఉండే స్పోర్ట్స్ మోటార్‌సైకిళ్ల విభాగంలో తమకు ముప్ఫై రెండు శాతం మేర వాటా ఉందని, దీన్ని మరింతగా పెంచుకునే దిశగా డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం తరహాలో డబుల్ ఇంజిన్ కారోబార్ (కార్యకలాపాలు) వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాజీవ్ చెప్పారు.బజాజ్ పల్సర్ 400 ధర రూ. 1,85,000బజాజ్ ఆటో తాజాగా పల్సర్ ఎన్ఎస్ 400జీ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. ప్రారంభ ఆఫర్ కింద దీని ధర రూ. 1,85,000గా (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటుంది. డెలివరీలు జూన్ మొదటివారం నుంచి ప్రారంభమవుతాయని సంస్థ ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. స్పోర్ట్స్ సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు పల్సర్ బైకులు 1.80 కోట్ల పైచిలుకు అమ్ముడైనట్లు బజాజ్ వివరించారు. పరిమిత కాలం పాటు వర్తించే ఆఫర్ కింద కొత్త పల్సర్‌ను రూ. 5,000కే బుక్ చేసుకోవచ్చు. నాలుగు రంగుల్లో ఇది లభిస్తుంది. శక్తివంతమైన 373 సీసీ ఇంజిన్, 6 స్పీడ్ గేర్ బాక్స్, ఎల్రక్టానిక్ థ్రోటిల్ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. సీఎన్జీ మోటార్‌సైకిల్‌ను జూన్ 18న ఆవిష్కరించనున్నామని రాజీవ్ చెప్పారు. ఇది ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ అన్నారు. -
నాన్నగారి ప్యాషన్ మమ్మల్ని నిలబెట్టింది
‘‘మా నాన్నగారు (అల్లు రామలింగయ్య) సినిమా ఇండస్ట్రీలో పని చేయాలనే లక్ష్యంతో పెట్టె సర్దుకుని అమ్మని ఊళ్లోనే వదిలేసి చెన్నై వెళ్లారు. ఆ ప్యాషనే ఈరోజు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది. దాన్ని ప్యాషన్ అనో, పిచ్చి అనో అనుకున్నా పర్లేదు. అలాంటి పిచ్చి ఉన్న రాజీవ్ అంటే నాకు తెలియని ప్రేమ, అభిమానం. ఆయన చిత్ర పరిశ్రమలోకి రావడం సంతోషంగా ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. యానిమేషన్ రంగంలో గుర్తింపు సంపాదించుకున్న గ్రీన్ గోల్డ్ గ్రూప్ అధినేతలు రాజీవ్ చిలక, శ్రీనివాస్ చిలక ‘చిలకప్రోడక్షన్’ బ్యానర్ పేరుతో చిత్ర నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ బ్యానర్ లోగోను నిర్మాతలు అల్లు అరవింద్, శరత్ మరార్ విడుదల చేశారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘రాజీవ్ చేసిన ‘చోటా భీమ్’ని నేను తెలుగులో రిలీజ్ చేశాను. రాజమౌళి దగ్గరున్న ప్యాషన్‌ని రాజీవ్లో చూశాను’’ అన్నారు. ‘‘సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న శ్రీనివాస్, రాజీవ్‌లకు అభినందనలు’’ అన్నారు శరత్ మరార్. రాజీవ్ చిలక మాట్లాడుతూ– ‘‘లయన్ కింగ్’ సినిమా చూసి ఇలాంటి సినిమాను ఇండియాలో ఎందుకు తీయకూడదు?అనిపించింది. అలాంటి యానిమేషన్ సినిమా చేయాలనే లక్ష్యంతోనే ‘గ్రీన్ గోల్డ్ సంస్థ’ని ప్రారంభించాం. మా చిలకప్రోడక్షన్లో ప్రస్తుతానికి రెండు తెలుగు సినిమాలు, హిందీలో ఓ చిన్న పిల్లల సినిమా నిర్మిస్తున్నాం’’ అన్నారు. ‘ ‘2004లో కృష్ణ యానిమేషన్ సిరీస్‌ను ఆరంభించాం. 2008లో ఆరంభించిన ‘చోటా భీమ్’ ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ ప్రయాణంలో భాగంగా సినిమాలు నిర్మించడానికి చిలకప్రోడక్షన్స్ని స్టార్ట్ చేశాం’’ అని శ్రీనివాస్ చిలక అన్నారు. -
అర్ధ వార్షిక పరీక్షలో భేష్!
జీ20 అధ్యక్ష స్థానాన్ని భారతదేశం చేపట్టి మే 31తో సరిగ్గా ఆరు నెలలు అయ్యింది. ఉక్రెయిన్ ఘర్షణ వల్ల సభ్యదేశాలు స్పష్టంగా చీలిపోవడంతో అధ్యక్ష బాధ్యత మరింత క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనూ భారత్ చక్కగా పనిచేసిందనే చెప్పాలి. అంతర్జాతీయ రంగంలో బాధ్యతాయుతమైన కీలక భాగస్వామిగా, ప్రస్తుత సవాళ్లను గుర్తించి స్పష్టంగా ప్రకటించడమే కాకుండా పరిష్కారాలను రూపొందించడంలో కూడా నాయకత్వం వహించింది. దీనిగురించే జీ20 యంత్రాంగం ఇంతవరకూ 120 సమావేశాలు నిర్వహించింది. అసలు సవాల్ ఏమిటంటే, సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరగనున్న శిఖరాగ్ర సదస్సులో విభిన్నమైన పాత్రధారులతో ఘర్షణ పడటమే. అలాంటప్పుడు ‘ఢిల్లీ డిక్లరేషన్ ’పై ఒక ఏకాభిప్రాయ రూపకల్పన చేయగలరా? సంవత్సరం పాటు కొనసాగే భారత్ జీ20 (గ్రూప్ ఆఫ్ 20) అధ్యక్ష పదవి మే 31తో దాని మధ్య బిందువును దాటేసింది. అంటే దాని పదవీ కాలంలో ఆరు నెలలు గడిచిపోయాయి. సెప్టెంబర్ 9, 10 తేదీలలో ఢిల్లీలో జరగ నున్న శిఖరాగ్ర సదస్సుపై దృష్టి సారించడంతో తదుపరి సగం కాలం ఇప్పుడు ఆవిష్కృతమవుతుంది. జీ20 అధ్యక్షత గత పనితీరు, దాని అవకాశాలపై భావోద్వేగ రహితంగా మూల్యాంకనం చేసుకోవడానికి ఇదే సరైన తరుణం. భారత్ జీ20 అధ్యక్ష స్థానం... కోవిడ్ మహమ్మారి, ఆర్థిక మంద గమనం, పదునెక్కుతున్న భౌగోళిక, రాజకీయ పోటీ ప్రభావాన్ని అధిగమించలేకపోయింది. జీ20 దుర్బలత్వాన్ని బహిర్గతపర్చేలా, ఉక్రెయిన్ ఘర్షణ ద్వారా ప్రేరేపితమైన ధ్రువీకరణ కూడా దీనికి తోడయింది. తీవ్రమైన సవాళ్లతో పోరాడుతున్న సమయంలో ఈ గ్రూప్ చీలిపోయింది. అందుకే, జీ20 అధ్యక్ష బాధ్యత ఇప్పుడు మరింత క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో గ్రూపు కీలక లక్ష్యాలను పరిరక్షించుకోడానికి జీ20 అధ్యక్ష స్థానాన్ని సమతుల్యం చేయడంలో భారత్ చక్కగా పని చేసిందనే చెప్పాలి. మొదటగా, అంతర్జాతీయ రంగంలో బాధ్యతాయు తమైన కీలక భాగస్వామిగా, భారతదేశం ప్రస్తుత సవాళ్లను గుర్తించి స్పష్టంగా ప్రకటించడమే కాకుండా పరిష్కారాలను రూపొందించ డంలో కూడా నాయకత్వం వహించింది. దీనిగురించే జీ20 యంత్రాంగం ఇంతవరకూ 120 సమావేశాలు నిర్వహించింది. రాబోయే నెలలు మంత్రుల స్థాయిలో, చివరకు నాయకుల స్థాయిలో జరిగే చర్చలకు సాక్షీభూతంగా నిలుస్తాయి. రెండవది, భారతదేశ ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని, దాని వైవిధ్యం, విజయాలను, ప్రజాస్వామ్య నమూనాతో సాధించిన అభి వృద్ధి, రాజకీయ సుస్థిరత ఫలాలను, బలమైన నాయకత్వాన్ని, సమీకృత ఆర్థిక పురోగతిని ప్రదర్శించడమే లక్ష్యం. పర్యాటక రంగాన్ని, వాణిజ్యాన్ని, టెక్నాలజీని, ప్రపంచంతో పెట్టుబడి ఆధార సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో భారత్‌కు ఇది ఉపకరిస్తుందన్న అంచనా దీని వెనుక ఉంది. మూడవది, ప్రపంచరంగంలో న్యూఢిల్లీ నాయకత్వ పాత్రను నొక్కి చెప్పడానికి మరింత సంక్లిష్టమైన ప్రేరణ ఉంది. పశ్చిమ దేశాలతో వ్యవహరించడంలో (తేడాలు ఉన్నప్పటికీ) భారత్ సౌకర్య వంతమైన దేశంగా ఉంటుందనీ, రష్యాతో, చివరకు చైనాతో కూడా (విభేదాలు కొనసాగుతున్నప్పటికీ) పొత్తులు నిర్వహిస్తుందనీ,ప్రపంచ దక్షిణ దేశాలకు సలహాదారుగా పనిచేస్తుందనీ ఇది చూపు తుంది. ఈ కత్తి మీద సాము చేయడానికి తెలివైన దౌత్యం, చురుకు దనం, సృజనాత్మకతతో పాటు కాస్త అదృష్టానికి చెందిన సమ్మేళనం కూడా అవసరం. ప్రభుత్వ, ప్రభుత్వేతర స్థాయిల్లో జరిగిన చర్చలతో సహా జీ20 సంబంధిత పరిణామాలకు భారత మీడియా విస్తృతంగా ప్రచారం కల్పించింది. ఈ క్రమంలో ప్రజలకు దీనిగురించి చక్కటి అవగాహన కలిగేలా చేసింది. అయితే అసలు సవాల్ ఏమిటంటే, సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరగనున్న శిఖరాగ్ర సదస్సులో విభిన్నమైన పాత్రధారులతో ఘర్షణ పడటమే. ఈ ఢిల్లీ సదస్సు ఫలితాలను న్యాయబద్ధంగా అంచనా వేయడానికి ఏకాభిప్రాయం, జోడింపు, ఆచరణ అనే త్రిముఖ కోణా లను ఉపయోగించడం మంచిది. మొదటగా, భారతీయ అతి«థేయులు ఢిల్లీ శిఖరాగ్ర సదస్సు ముగింపులో ‘ఢిల్లీ డిక్లరేషన్ ’పై ఒక ఏకాభిప్రాయ రూపకల్పన చేయగలరా? లేదా మార్చి నెలలో 20 మంది విదేశాంగ మంత్రుల సమావేశంలో, ఉక్రెయిన్ సమస్యకు చెందిన పేరాలతో మిగిలిన 18 మంది సభ్యులతో కలిసి వెళ్లడానికి రష్యా, చైనాలు తిరస్కరించిన విధంగానే దీని ఫలితం ఉంటుందా? పైగా, ఢిల్లీలో జీ20 దేశాల నాయకులందరూ కనబడటంపై కూడా అనిశ్చితి నెలకొంది. నాయ కులు భౌతికంగా హాజరు కాలేకపోవడంతో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) ఢిల్లీలో సదస్సు నిర్వహణకు అశక్తత వ్యక్తం చేయడం దీన్ని మరింత పెంచింది. రెండు, జోడింపు అనేది ఢిల్లీ డిక్లరేషన్ ప్రతిపాదించే విషయాలను సూచిస్తుంది. మునుపటి సదస్సుకు సంబంధించిన ‘బాలి డిక్లరే షన్’తో పోల్చినప్పుడు, ఢిల్లీ సదస్సులో ప్రత్యేకించి ప్రపంచ పరిష్కారాలకు సంబంధించిన విషయాలు మరింత దృఢంగా, కొత్తగా ఉంటాయా? చివరగా, ప్రధాన ఒప్పందాల ఆచరణకు సంబంధించి: ఏకాభిప్రాయ ప్రాతిపదికన మాత్రమే నిర్ణయాలను అమలు చేయ డానికి రాజకీయ సంకల్పంతో కూడిన ఆచరణ జీ20ని ఒక సమర్థమైన నిర్దేశక కార్యాలయంగా చూపిస్తుందా లేక చర్చల దుకాణంగా మాత్రమే చూపుతుందా? బహువిధ ఆర్థిక వ్యవస్థల్లో సంస్కరణల కోసం నినాదాలు ఇస్తున్నట్టుగా, జీ20 తనను తాను కూడా సంస్కరించుకోగల సమర్థు రాలనే సూచన ఢిల్లీ సదస్సులో వెలువడవచ్చు. అలా అయితే తమ కొత్త సభ్యురాలిగా ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ)ను చేర్చుకోవడంలో కొంచెం కూడా సందేహం ఉండకూడదు. అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విస్తరణ, ప్రజాస్వామికీకరణను వేగవంతం చేయడం కోసం పిలుపునిస్తుందా అన్నది కూడా ప్రత్యేక శ్రద్ధతో గమనించాల్సి ఉంది. చర్చల్లో పురోగతిని నమోదు చేయడానికి జీ20 అధ్యక్ష పదవి ప్రాధాన్యతలలో రెండు అంశాలు తప్పనిసరి. అవి వాతావరణం, శక్తి పరివర్తిత ఆర్థికం. వీటికి సంబంధించి జీ20 నిబద్ధత నిర్దిష్టంగా ఉండవచ్చు. దీనికి మరిన్ని జోడింపులు చేర్చవచ్చు. ప్రపంచంలో భారతీయ డిజిటల్ పబ్లిక్ గూడ్స్ (డీపీజీ) ప్రాసంగికతను నొక్కి చెప్పడంలో, భారత ప్రభుత్వం అసాధారణ క్రియాశీలతను ప్రదర్శించింది. కాబట్టి ఢిల్లీ సదస్సు తుది ప్రకటనలో ఒక బలమైన సూత్రీకరణ ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ పరిధిలో సహకారం పొందడం కోసం బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్ వంటి ఎనిమిది అధ్యక్ష అతిథి దేశాలతో ద్వైపాక్షిక చర్చల దిశగా అధికారులు పని చేస్తే బాగుంటుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తితో, విమర్శకుల అభిప్రాయాలను, భిన్నా భిప్రాయాలను గమనించాలి. ఒక మాజీ సీనియర్ అధికారి ఇటీవల ప్రపంచం అంతర్జాతీయ ఘర్షణకు ‘ప్రమాదకరంగా దగ్గరవుతోంద’ని పేర్కొంటూ– జీ20, ‘ఎస్సీఓ’ శిఖరాగ్ర సదస్సుల నుంచి గరిష్ఠ ప్రయోజనాలు పొందాలన్న ఆశలను తగ్గించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. ప్రజాస్వామ్యం, వైవిధ్యం గురించిన అధికారిక సిద్ధాంతం దేశీయ రాజకీయాలకు అనుగుణంగా లేదని వాదిస్తూ ఒక సీనియర్ ప్రతిపక్ష నాయకుడు ‘జీ20 కపటత్వం’ గురించి మాట్లా డారు. ఇకపోతే మూడో విమర్శకుడు జీ20 పౌర సమాజ వేదిక హైజాక్ కావడం గురించి రాశారు. కొంతమంది విదేశీ పరిశీలకులు ‘థింక్20’ ప్రక్రియ గురించి ఫిర్యాదు చేశారు. భారతదేశ జీ20 అధ్యక్షతకు సంబంధించి బహుముఖ ప్రయాణ క్రమంలో కొన్ని చికాకులు సమానంగా ఉంటాయి. వస్తుగతంగా చెప్పాలంటే, జీ20 అధ్యక్ష పదవీకాలంలో భారత్ ఇప్పటివరకూ బాగా పనిచేసింది. ప్రత్యేకించి ప్రపంచంలో భారత్ పాత్ర గురించి విశ్వ వ్యాప్తంగా అపూర్వ సందడిని సృష్టించింది. శ్రద్ధ, దౌత్య చతురత, రాజకీయ దృష్టి, కాస్త అదృష్టంతో ఈ బిడారు విజయవంతంగా తన గమ్యాన్ని చేరుకోవాలి. భారతదేశానికీ, జీ20కీ గొప్ప కీర్తిని తెచ్చి పెట్టాలి. రాజీవ్ భాటియా వ్యాసకర్త మాజీ రాయబారి; డిస్టింగ్విష్డ్ ఫెలో, గేట్‌వే హౌజ్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
మనుషులు కాదోయ్ మాటలోయ్!
దేశమంటే ఏమిటి? సరిహద్దులతో ఉండేదా? మనసులలో అడ్డుగోడలు లేని మనుషులతో నిండి ఉండేదా? లేక... జాతులు, మతాలు, భాషలు,సంప్రదాయాలు వేర్వేరుగా వేటికవిగా ఉండేదా? కలివిడిగా, కలబోతగా కట్టుబడి ఉండేదా? లేక ఒకే గతం, ఒకే వర్తమానం కలిగి ఉండి ఒకే విధమైన భవిష్యత్తును నిర్మించుకుంటూ ఉండేదా? దేశానికి ఎన్నో నిర్వచనాలు! భౌగోళికమైనవి, చారిత్రకమైనవి, సాంస్కృతికమైనవి. ఇవేవీ కాని ఒక వినూత్నమైన నిర్వచనాన్ని ‘బిట్వీన్ హోప్ అండ్ డెస్పైర్’ పుస్తక రచయిత రాజీవ్ భార్గవ ఇచ్చారు. ‘‘దేశమంటే, సంభాషణలో ఉన్న మనుషులు’’ అన్నారు భార్గవ ఈ పుస్తకంలో. మరి ఈ నిర్వచనం భారతదేశానికి కూడా వర్తిస్తుందా? తప్పకుండా వర్తిస్తుంది. అది మన దేశాన్ని గురించిన కచ్చితమైన అవగాహన! ఇప్పటికే చదివి ఉండనందుకు చింతిస్తూ నేనొక పుస్తకం చదువుతూ ఉన్నాను. ‘బిట్వీన్ హోప్ అండ్ డెస్పైర్’ అనే పుస్తకం సమకాలీన భారతదేశంపై రాజీవ్ భార్గవ ప్రతిఫలింపజేసిన నైతికతల సమాహారం. వాటిలో కొన్ని నిస్సందేహంగా నిస్తేజమైనవి. అరకొరగా కొన్ని బహుశా అర్థంలేనివి. చాలావరకు మాత్రం లోతైనవీ, ఆలోచన రేకెత్తించేవీ. ముఖ్యంగా ఒకటైతే తన నవ్యత వల్ల నా ధ్యాసను తనపైకి మర ల్చుకున్నది. ఇంకా చెప్పాలంటే, అది మన దేశం గురించి కచ్చితమైన అవగాహన. పుస్తకంలో ‘ఎ నేషన్ ఈజ్ ఎ పీపుల్ ఇన్ కాన్వర్సేషన్’ అనే శీర్షికతో ఉన్న ఒక వ్యాసంలో... ‘‘దేశం అంటే ఏమిటి?’’ అనే ప్రశ్నకు సమాధానంగా, ‘దేశమంటే సంభాషణలో ఉన్న ప్రజలు’ అంటారు భార్గవ. మీరసలు ఊహించనే లేని భిన్నమైన జవాబు అది. దేశమంటే ఏమిటి అన్న ప్రశ్నకు స్కూల్లో మనకు నేర్పించిన జవాబు కచ్చితంగా ఇది మాత్రమైతే కాదు. దేశాలను మనం జాతులు, భాషలు, మతాల వారీగా, ఇంకా... చారిత్రకంగా, భౌగోళికంగా, సాంస్కృతికంగా ఏర్పడిన మనుషుల సమూహంగా అవగాహన పరచుకున్నాం. కొన్నిసార్లు ఈ భిన్నత్వాల జోడీకి కూడా దేశం అనే ఏక రూపత స్థిరపడుతుంది. ఇందుకు స్ఫురించే ఉదాహరణలు... ఇజ్రాయిల్, కుర్దిస్తాన్, పాలస్తీనా, లిక్టన్స్టయిన్; జులు, బెర్బెర్ జాతులు, ఎస్కిమోలు, రెడ్ ఇండియన్లు, మావోరీలు. దేశాలన్నీ కూడా వీటిల్లో ఒకటీ లేదా అంతకంటే ఎక్కువగా వైవిధ్యాల కలబోత స్వభావాన్ని కలిగి ఉంటాయి. భార్గవ ఒక దేశాన్ని చాలా భిన్నమైన కోణంలో చూస్తారు. ‘‘అన్నిటì కంటే వారి గతం, వర్తమానం, భవిష్యత్తులను గురించిన సాధారణ, లేదా అతివ్యాప్త ఆందోళనల వల్ల స్వీయ స్పృహతో జట్టు కట్టిన ప్రజాసమూహమే దేశం. ఆ ఏకతలోని చేతన జన్యుపరమైనది కాదు. ఆకాశం నుండి ఊడి పడినదీ కాదు. నోటితో, రాతలతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఒకరు చెప్పింది ఒకరు వినడం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం వల్ల వృద్ధి చెందినది’’ అంటారు. అందుకే భార్గవ, దేశమంటే సంభాషణలో ఉన్న ప్రజలు అన్నారు. అయితే భారతదేశాన్ని అర్థం చేసుకోడానికి అది కచ్చితమైన ఉత్తమ నిర్వచనం అవుతుందా? లొడలొడమని కబుర్లు చెప్పడం, మాట్లాడటం, మాట్లాడేవాళ్లకు అంతరాయం కలిగించడం, కేకలు వేయడం, పెద్దగా అరవడం, విని వదిలేయడం, వినాలని పట్టుపట్టడం... ఇవేగా మనం ఎప్పుడూ చేసేది. ఇవన్నీ చేస్తున్నందుకు ఇంకెవరైనా అయితే మనల్ని ‘టవర్ ఆఫ్ బాబెల్’ అనేవారు. కానీ భార్గవ మన ఎడతెగని ఈ సంభాషణను మన జాతీయతలోని ప్రధానాంశంగా గుర్తించారు. ఈ వినూత్న నిర్వచనాన్ని దాటి చూస్తే, ఆ వెనుక... నేడు మన దేశంలో ఏం జరుగుతోంది అనే విషయమై కలవరం కలిగించే ముఖ్యాంశాలు ఉండటం కనిపిస్తుంది. ‘‘వార్తాపత్రికలు, ఆ తర్వాత టీవీ ఛానళ్లు ప్రేరేపించనిదే ప్రజల మధ్య సంభాషణలు ఉండటం లేదు. సమస్యలపై ఉమ్మడి ఆందోళనలు వృద్ధి చెందడం అన్నది కనిపించడం లేదు. కనుక దేశం అన్నదే లేదు’’ అంటారు భార్గవ. అంటే, మనం ఒకరితో ఒకరం మాట్లాడుకోవడం లేదు. మీడియా ద్వారా మాత్రమే మాట్లాడుకుంటున్నాం. కనుక మన మీడియా ఆరోగ్యం – పారదర్శకత, నిష్పాక్షికత, వాక్స్వేచ్ఛా నిబద్ధత – మన జాతీయతకు ఎంతో కీలకమైనది. భార్గవ అడగని ఒక ప్రశ్న, ఆవేశాన్ని రేకెత్తించే ప్రశ్న... మనం వార్తాపత్రికను చేతిలోకి తీసుకున్న ప్రతి సారీ, లేదంటే వార్తా చానెల్‌ను పెట్టగానే తలెత్తు తుంది... భారతీయ మీడియా భారతదేశాన్ని అణగదొక్కుతోందా అని! ఈ పుస్తకం మరొక ప్రశ్నను కూడా లేవనెత్తింది, బహుశా అది మరింతగా కలవరపెట్టే ప్రశ్న. మళ్లీ కూడా భార్గవ నేరుగా ప్రశ్నించడం లేదు. ప్రశ్న వైపుగా మనల్ని మళ్లిస్తున్నారు. ‘‘ఒక దేశం అన్నది సంభాషించుకునే ప్రజా సమూహం అయినప్పుడు ఆ సంభాషణను ఎవరైనా అడ్డుకుంటే దేశాన్ని దెబ్బతీసినట్లు అవుతుంది’’ అంటారు. ఈ వేలు ఎటువైపు చూపిస్తోందో నాకు తెలుసు. మీకూ తెలుసు. ఆ వేలు ఎవరి వైపు అయితే తిరిగి ఉందో వారికీ తెలుసు. ఇంతకన్నా వివరంగా చెప్పాల్సిన పని లేదని దీని అర్థం. భార్గవ మరింత ముందుకు వెళ్లారు. సంభా షణను ఆపేయడం మాత్రమే మన దేశానికి ప్రమాదకరం కాదు. ‘‘ఎట్టి పరిస్థితిలోనూ ప్రజల సంభాషణను ప్రభుత్వం లాగేసుకోకూడదు. ప్రజా సంభాషణను నిర్దేశించకూడదు. నియంత్రించ కూడదు. సంభాషణలో ప్రభుత్వం కూడా ఒక భాగమే తప్ప తనే శాశ్వతంగా సంభాషణను నడపాలని చూడకూడదు. వాస్తవానికి సంభాషణకు అంతరాయం కలిగించే వారిని, నిరోధించే వారిని నియంత్రించడం ప్రభుత్వ విధి. దానినే దేశం ఆశిస్తోంది’’ అంటారు భార్గవ. ఈ చివరి వాక్యం నాకు నచ్చింది. మన టెలివిజన్ యాంకర్లు చెప్పేది గుర్తొచ్చింది, వాళ్లు వేరే అర్థంలో చెప్పి నప్పటికీ. భార్గవ వాళ్ల మాటల్ని వాళ్ల నెత్తిపైనే కుమ్మరించారు. దేశం అంటే ఏమిటో భార్గవ ఇచ్చిన నిర్వచనంలోని అందం... వేర్వేరు జాతులు, మతాలు, భాషలు, ప్రాంతాలు, సంస్కృతులు, ఆహార సంప్రదాయాలు, భౌగోళికతలు, చారిత్రక నేపథ్యాలు కలిగివున్న వాళ్లంతా కలిసి ఉండటంలో ఉన్న ప్పటికీ... ఈ వ్యత్యాసాలు కేవలం వివరణా త్మకమైనవి. అసలైనది ఏమంటే... కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, రాన్ ఆఫ్ కచ్ నుంచి అగర్తల వరకు మనం ఒకరితో ఒకరం సంభాషించుకుంటున్నాం. తగాదాలు ఉంటే ఉండొచ్చు. అంత రాయం కలిగించుకుంటూ ఉండొచ్చు. లేదంటే ఒక సుదీర్ఘ ప్రసంగానికి, పాండిత్యానికి, అజ్ఞానానికి, వట్టి సమాచారానికి, నీరసం కలిగించే మాటలకు చెవి ఒగ్గుతూ ఉండొచ్చు. ఇవేవీ కాదు, మనమైతే మాటల్లో ఉన్నాం. అదీ ముఖ్యం. ఈ సంభాషణ ఆగిపోతే ఏం జరుగుతుందన్నది ఆలోచించాల్సిన విషయం. భార్గవ చెప్పడం, దేశం ‘విడివడడానికి’ దారి ఏర్పడుతుందని! మన దేశం గురించే ఆయన చెబుతున్నారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఈవీ విక్రయాలపై ఎంజీ మోటార్ కన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ మొబిలిటీపై దృష్టిపెట్టిన ఎంజీ మోటార్స్ ఈ ఏడాది ఈవీ విక్రయాల్లో 30 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా వచ్చే నెలలో ఈవీ విభాగంలో మరో మోడల్‌ను విడుదల చేయనుంది. ప్రస్తుతం స్థానిక మార్కెట్లో జెడ్ఎస్ ఈవీని విక్రయిస్తున్న కంపెనీ రెండు డోర్ల ఈవీ మోడల్ కామెట్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మే నెల నుంచి దశలవారీగా దేశమంతటా వాహ నాలను విడుదల చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు కంపెనీ ఎండీ రాజీవ్ చాబా పేర్కొన్నారు. వెరసి ఈ ఏడాది రెండు ఈవీ మోడళ్ల ద్వారా 80, 000–90,000 యూనిట్ల విక్రయాలను సాధించగలమని విశ్వసిస్తున్నట్లు తెలియజేశారు. -
రాజీవ్ వల్ల నా కెరీర్ నాశనమైంది.. భర్త వేధింపులపై తొలిసారి నోరు విప్పిన నటి
మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ విడాకులు వ్యవహరం మరోసారి వార్తల్లో నిలిచింది. సుష్మితా తమ్ముడు రాజీవ్ సేన్ టీవీ నటి చారు అసోపాను 2019లో జూన్‌లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసింది. ప్రస్తుతం వారికి 11 నెలల కూతురు ఉంది. అయితే పెళ్లయిన ఏడాదిన్నరగే విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చారు. అయితే తమ కూతురి కోసం కలిసి ఉండాలనుకుంటున్నామంటూ ఇటీవల తమ విడాకులను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రకటించిన రెండు నెలలకే మళ్లీ ఈ జంట విడిపోతున్నామంటూ తాజాగా మరో ప్రకటన చేసింది. తాజాగా దీనిపై నటి చారు అసోపా స్పందించింది. ముంబై మీడియాతో ముచ్చటించిన ఆమె తన భర్త రాజీవ్ సేన్ పెట్టిన ఇబ్బందులపై తొలిసారి నోరు విప్పింది. తన భర్త వల కెరీర్ నాశనమైందంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది. అంతేకాదు తన ప్రెగ్నెన్సీ సమయంలో రాజీవ్ తనని మోసం చేశాడంటూ ఆమె వాపోయింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘వివాహమైన నాటి నుంచి రాజీవ్ నన్ను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాడు. అతడి వల్ల మానసికంగా కృంగిపోయాను. పెళ్లయిన కొద్ది రోజులకే మా మధ్య గొడవలు మొదలయ్యాను. అలా గొడవ జరిగిన ప్రతిసారి రాజీవ్ నన్ను వదిలి వెళ్లిపోయేవాడు. కరోనా సమయంలో కూడా మూడు నెలలు నాకు దూరంగా వెళ్లిపోయాడు. ఫోన్ నంబర్లు బ్లాక్ చేశాడు. అతడు ఏమైపోయాడో తెలియక ఆందోళనకు గురయ్యాను’ అని చెప్పింది. అలాగే ‘‘ఆ బాధ నుంచి బయటపడటం కోసం మళ్లీ వర్క్‌పై దృష్టి పెట్టాను. ‘అక్బర్ కా బల్ బీర్బల్’తో తిరిగి షూటింగ్ పాల్గొన్న. అయితే నేను వర్క్ చేయడం మొదలుపెట్టిన కొన్నిరోజులకే రాజీవ్ తిరిగి వచ్చాడు. నా వర్క్ విషయంలో జోక్యం చేసుకోవడం మొదలు పెట్టాడు. నాకు దూరంగా ఉండాలంటూ నా కోస్టార్స్ అందరికీ మెసేజ్‌లు పెట్టడం, బెదిరించడం చేశాడు. రాజీవ్ తీరుకు నన్ను ఓ సమస్యలా భావించిన నిర్మాతలు షో నుంచి తొలగించేశారు. దీంతో నేను విడాకులకు అప్లయ్ చేశాను. విడాకులు వద్దని, నన్ను బాగా చూసుకుంటానని రాజీవ్ మాట ఇవ్వడంతో విడాకుల పత్రాలను వెనక్కి తీసుకున్నా. అయినా రాజీవ్ తన తీరు మార్చుకోలేదు. కొన్నిరోజులకే మళ్లీ నన్ను వేధించడం మొదలు పెట్టాడు. అందుకే ఇప్పుడు అతడితో విడిపోవాలని నిర్ణయించుకున్నా’’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. -
రీసెంట్గా విడాకుల ప్రకటన.. ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పిన బాలీవుడ్ జంట
నటి సుష్మితా సేన్ తమ్ముడు, మోడల్ రాజీవ్ సేన్ తన భార్య, నటి చారు అసోపాతో విడిపోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు రాజీవ్‌తో విడాకులు తీసుకుంటున్న మాట నిజమేనంటూ చారు అసోప సైతం స్పష్టం చేసింది. రాజీవ్‌కు విడాకుల నోటీసులు కూడా పంపానని ఆమె పేర్కొంది. దీంతో వీరిద్దరి విడాకులు ఖాయమని అంతా అనుకుంటున్నా క్రమంలో తాము ఒక్కటయ్యామంటు గుడ్‌న్యూస్ అందించింది ఈ జంట. తమ కూతురు జియానా కోసం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా వేదిక ఈ జంట తెలిపింది. చదవండి: ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం, సింగర్ దుర్మరణం వినాయక చవితి సందర్భంగా ఇంట్లో పూజ నిర్వహించిన ఈ జంట కూతురు జియానాతో ఉన్న ఫొటోను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా తమ విడాకుల ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ‘పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయంటారు. అయితే దానిని మేం అమలు చేయడమే మిగిలి ఉంది. అవును.. మా వివాహ బంధానికి మేం స్వస్తి చెప్పాలనుకున్నాం. మా నిర్ణయాన్ని కూడా ప్రకటించాం. ఇక మా మధ్య ఏం లేదు, మేం చివరి దశకు చేరుకున్నామని అనుకున్నాం. కానీ మా విడాకుల నిర్ణయాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నాం. విడాకులు అనేవి మా ఎంపిక మాత్రమే అని గ్రహించాం’ అన్నారు. చదవండి: అందుకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది: కత్రినా కైఫ్ అలాగే ‘ఇకపై మా వైవాహిక జీవితాన్ని సంతోషంగా కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చాం. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. తల్లిదండ్రులుగా మా కూతురు జియానాకు ఉత్తమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. తన భవిష్యత్తు, సంతోషమే మా మొదటి ప్రాధాన్యత.. జంటగా మాకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూ వస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రేమతో మా కూతురిని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞులం’ అంటూ వారు తమ పోస్ట్‌లో రాసుకొచ్చారు. కాగా గతంలో కూడా ఈ జంట విడాకుల ప్రకటన ఇచ్చి మళ్లీ వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. 2019 జూన్‌లో రాజీవ్-అసోపాల పెళ్లి జరగగా గతేడాది నవంబర్‌లో వీరికి జియానా జన్మించింది. View this post on Instagram A post shared by Charu Asopa Sen (@asopacharu) -
సుష్మితా సేన్ తమ్ముడితో విడాకులు నిజమే: నటి
బాలీవుడ్ టీవీ నటి చారు అసోపా భర్త రాజీవ్ సేన్‌తో విడాకులపై స్పందించారు. ఇప్పటికే లాయర్ ద్వారా విడాకుల నోటీసులు పంపానని, ఇక మళ్లీ అతనితో కలిసుండటం అన్నది అసాధ్యం అని పేర్కొంది. రీసెంట్గా రాజీవ్ చారు అసోపాతో కలిసున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంపై స్పందిస్తూ.. అతను అలా ఎందుకు చేశాడో తనకు తెలియదని, ఇప్పటికే తామిద్దం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరం బ్లాక్ చేసుకున్నట్లు తెలిపింది. అంతేకాకుండా రాజీవ్‌తో కలిసి ఉన్న ఫోటోలన్నింటిని తన అకౌంట్ నుంచి తొలిగించినట్లు పేర్కొంది. '2019లో రాజీవ్‌తో నా వివాహం జరిగింది. ఈ మూడేళ్లలో చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అతను ఇల్లు వదిలి వెళ్లిపోతాడే తప్పా పరిష్కరించాలని ఎప్పుడూ అనుకోడు. ఎన్నోసార్లు విడాకులు తీసుకోవద్దని అనుకున్నా. కానీ పరిస్థితులు చేయిదాటి పోయాయి.ఇక చేసేదీమీ లేదు. అందుకే మా పెళ్లిని రద్దు చేసుకోవాలనుకుంటున్నాం. ఇక తన మొదటి పెళ్లిని దాచాను అని రాజీవ్ అన్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదు. నా గతం గురించి మొత్తం చెప్పాకే అతడిని పెళ్లి చేసుకున్నా' అని చారు పేర్కొంది. ఇక తన ఆడపడుచు సుష్మితా సేన్‌తో మాత్రం తనకు మంచి అనుబంధం ఉందని, ఆమెతో తరచూ మాట్లాడతానని తెలిపింది. 'విడాకుల సమయంలో చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నా. సుష్మితా నాకు అండగా నిలబడింది. తనతో ఏదైనా షేర్ చేసుకునే ఫ్రెండ్షిప్ మా మధ్య ఉంది' అంటూ వెల్లడించింది. View this post on Instagram A post shared by Rajeev Sen (@rajeevsen9) -
దీపావళికి ముందే మహాలక్ష్మి ఇంటికి వచ్చింది: హీరోయిన్
ప్రముఖ టీవీ నటి చారు అసోపా- మోడల్ రాజీవ్ సేన్ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఈ రోజు(నవంబర్ 1)వారికి పండంటి బిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని స్వయంగా బాలీవుడ్ హీరోయిన్, మాజీ మిస్ ఇండియా సుస్మితా సేన్ సోషల్ మీడియాలో ప్రకటిస్తూ మురిసిపోయారు. తన సొదరుడు, మోడల్ రాజీవ్ సేన్- మరదలు చారు అసోపాలకు సోమవారం ఆడబిడ్డ జన్మించిందని ఆమె వెల్లడించారు. అంతేగాక తాను మేనత్తనయ్యానంటూ సుష్మితా పట్టరాని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘దీపావళికి ముందే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. ఆడపిల్ల పుట్టుంది’ అంటూ బేబీ ఫొటోలను షేర్ చేశారు. అలాగే రాజీవ్, అసోపాలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ఫొటోల్లో బేబీ ముఖం కనిపించకుండా సుస్మితా జాగ్రత్త పడ్డారు. సుస్మితా పోస్ట్‌కు అసోపా-రాజీవ్‌లు స్పందిస్తూ.. ‘లవ్ యూ దీదీ. ఎట్టకేలకు మేనత్తా ఫేవరేట్ వచ్చేసింది’ అంటూ అసోపా కామెంట్ చేయగా.. ‘నిజంగా ఇది శుభదినం, తొందరగా రండి అక్క(సుస్మితా) మేం ముగ్గురం వేయిట్ చేస్తున్నాం’ అంటూ రాజీవ్ స్పందించాడు. చదవండి: Urmila Matondkar: నటి ఊర్మిళకు కరోనా..జాగ్రత్తగా ఉండాలని ట్వీట్ View this post on Instagram A post shared by Rajeev Sen (@rajeevsen9) కాగా త్వరలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ అసోపా-రాజీవ్‌లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసోపా బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. 2019 జూన్‌లో రాజీవ్-అసోపాలు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గతేడాది జూలైలో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు ప్రకటించగా.. ఆ తర్వాత మనస్పర్థలు తొలగడంతో వీరిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. ఇక బుల్లితెర నటిగా గుర్తింపు పొందిన చారు అసోపా పలు హిందీ సీరియళ్లలో నటించారు. తర్వాత బాలీవుడ్లో కూడా ప్రవేశించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రాజీవ్ మోడల్‌గా రాణిస్తున్నాడు. చదవండి: ఐశ్వర్య రాయ్‌కు నవ్వు తెప్పించే సెంటిమెంట్ ఏంటంటే? View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
విషాదం: నటుడి పుట్టినరోజు నాడే కొడుకు మృతి
తల్లిదండ్రుల పుట్టినరోజు నాడు తమ పిల్లలు ఏదైనా గిఫ్ట్ ఇచ్చి వారిని ఆనందింపజేయాలనుకుంటారు. కానీ ఇక్కడ కథ అడ్డం తిరిగింది. కొడుకు ఇచ్చిన షాకింగ్ బర్త్‌డే సర్ప్రైజ్ నుంచి తండ్రి ఇంకా కోలుకోలేకపోతున్నాడు. తన పుట్టినరోజు నాడే కన్న కొడుకు మృతి చెందడంతో హాస్య నటుడు రాజీవ్ నిగమ్ ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. ఆదివారం రాజీవ్ నిగామ్ పుట్టినరోజు నాడు తన కుమారుడు దేవరాజ్(8) అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ విషయాన్ని రాజీవ్ తన ఫేస్బుక్లో వెల్లడించారు. చదవండి: అవినాష్‌ను వెంటాడుతున్న ఆత్మహత్య ఆలోచనలు? ‘ఎంతటి సర్ప్రైజ్ బర్త్‌డే గిఫ్ట్. ఈ రోజు నా కొడుకు నన్ను విడిచి వెళ్లి పోయాడు. కనీసం కేక్ కట్ చేసే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు. ఇలాంటి బహుమతి ఎవరిస్తారు’. అంటూ ఇద్దరు దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ రాజీవ్ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా రెండేళ్ల క్రితం కొడుకు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలిపాడు. అతన్ని వెంటలేటర్‌పై ఉంచినట్లు పేర్కొన్న రాజీవ్ కొడుకు అనారోగ్యానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. కాగా ఈ ఏడాది ఆగష్టులో రాజీవ్ తండ్రి కూడా మరణించారు. చదవండి: పవన్‌తో సినిమా... రానా స్పందన -
నిన్నెంతగానో మిస్సయ్యాను: నటి
‘నేను.. నా భార్యను ఎంతగానో ప్రేమిస్తున్నా. కలిసి ఉంటేనే బంధం మరింత బలంగా ఉంటుంది’ అంటూ మోడల్ రాజీవ్ సేన్ తన వైవాహిక జీవితం గురించి వస్తున్న రూమర్లకు చెక్ పెట్టాడు. భార్య, నటి చారు అసోపాతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసి తామెంతో సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. చారును ఎంతగానో మిస్సయ్యానని.. అందుకే ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చేశానంటూ భార్య పట్ల తనకున్న భావాలను వ్యక్తీకరించాడు. ఇక చారు సైతం భర్తను హత్తుకుని ఉన్న ఫొటోను షేర్ చేసి.. ‘‘నా భర్తను ప్రేమిస్తున్నా. నిన్నెంతో మిస్సయ్యాను’’ అంటూ ప్రేమను చాటుకున్నారు. (చదవండి: మరోసారి వార్తల్లోకెక్కిన స్టార్ జంట!) దీంతో.. ‘‘మీరిలాగే కలకాలం సంతోషంగా కలిసి ఉండాలి’’ అంటూ ఈ జంట అభిమానులు కామెంట్ల రూపంలో తమ స్పందన తెలియజేస్తున్నారు. కాగా మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్- చారు అసోపాల వివాహం గతేడాది జూన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. సన్నిహితుల సమక్షంలో గోవాలో వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లైన కొన్ని నెలల తర్వాత దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో వెడ్డింగ్ ఫొటోలతో పాటు తాము కలిసి ఉన్న అన్ని ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. అంతేగాక ఒకరినొకరు అన్‌ఫాలో చేశారు. ఈ క్రమంలో వివాహ వార్షికోత్సవానికి ముందే రాజీవ్.. చారును ముంబైలో వదిలేసి ఢిల్లీకి వెళ్లినట్లు వార్తలు వినిపించాయి. దీంతో వీరిద్దరు విడిపోతున్నారంటూ బీ-టౌన్లో వదంతులు వ్యాపించాయి. తొలుత ఈ ప్రచారాన్ని కొట్టిపారేసిన ఈ స్టార్ జంట.. ఆ తర్వాత స్నేహితుల మాటల వల్లే తమ మధ్య దూరం పెరిగిందంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. విడిపోవడం ఖాయమనుకునేలా గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేలా విమర్శలకు దిగారు. అయితే అనూహ్యంగా మరోసారి కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. -
నా భర్త ఎందుకలా చేశాడు?: నటి
ముంబై: తనని ఎవరూ ప్రభావితం చేయలేదని.. రాజీవ్‌తో విడిపోవాలని తనే నిర్ణయించుకున్నానంటూ నటి చారు అసోపా తన భర్త రాజీవ్ సేన్ వ్యాఖ్యలను ఖండించారు. సుష్మితా సేన్ సోదరుడైన రాజీవ్ సేన్-చారు అసోపాల మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై రాజీవ్ స్పందిస్తూ.. తన భార్య అమాయకురాలని, చారు స్నేహితులే ఆమెను ప్రభావితం చేసుంటారని ఆరోపించాడు. దీంతో రాజీవ్ వ్యాఖ్యలపై చారు స్పందిస్తూ... ‘నాకు ఎవరూ బ్రెయిన్ వాష్ చేయలేదు. ఇది నా సొంతంగా తీసుకున్న నిర్ణయం. నా జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకునేంత పరిపక్వత నాకు ఉంది. బహుశా రాజీవ్‌నే తన స్నేహితులు ప్రభావితం చేసుంటారు. అందువల్లే తన సోషల్ మీడియా ఖాతాలో మా ఫొటోలు డిలీట్ చేశాడు’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అంతేగాక తమ వివాహ వార్షికోత్సానికి కొన్నిరోజుల ముందు రాజీవ్ ముంబైలోని తమ నివాసాన్ని వదిలి ఢిల్లీ ఇంటికి వెళ్లిపోయాడని ఆమె ఆరోపించారు. (చదవండి: విడాకులపై స్పందించిన సుష్మితా సేన్ సోదరుడు) ‘‘మా మొదటి వివాహవార్సికోత్సవానికి కొన్ని రోజుల ముందు రాజీవ్ నన్ను ముంబైలోని ఇంటిలో ఒంటరిగా వదిలి న్యూఢిల్లీలోని ఇంటికి వెల్లిపోయాడు. సరే నేను అమాయకురాలిని, నా చూట్టు ఉన్నవారు నన్ను ప్రభావితం చేస్తారని రాజీవ్ భావించినప్పుడు ఎందుకు నన్ను ఆ సమయంలో వదిలి బయటకు వెళ్లిపోయాడు. అది మా మొదటి వివాహ వార్షికోత్సవం. అది మాకెంతో ప్రత్యేకమైనది ఆ సమయంలో భార్యభర్తలుగా మేమిద్దరం ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన సమయం. కానీ రాజీవ్ నన్ను ఒంటరిగా వదిలి వేరే ఇంటికి వెళ్లిపోయాడు. అతడు ఎందుకు అలా చేశాడు’’ అని ఆమె ప్రశ్నించారు. గతేడాది రాజీవ్ సెన్- చారు అపోసాలు గోవాలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వారి పెళ్లైనప్పటి నుంచి ఈ జంట వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నారు. ఇటీవల వారిద్దరూ సోషల్ మీడియాలో తమ ఖాతాలోని ఒకరి ఫొటోలు ఒకరూ డిలీట్ చేసుకోవడంతో ఇద్దరి మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయంటూ వార్తలు వచ్చాయి. (చదవండి: వారిద్దరు విడిపోయారా?!) -
విడాకులపై స్పందించిన సుష్మితా సేన్ సోదరుడు
మాజీ విశ్వ సుందరి సుష్మతా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ అతని భార్య చారు అపోసాతో విడిపోతున్నట్లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వార్తలను ఆయన ఖండించారు. అంతేగాక భార్య చారుతో గొడవపడి రాజీవ్ ముంబై ఇంటిని వదిలి ఢిల్లీ వెళ్లిపోయాడనే పుకార్లను కొట్టి పారేశారు. ఈ క్రమంలో రాజీవ్ సేన్ సోమవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి వార్తలు విన్నప్పుడు నా నవ్వును ఆపుకోలేను. నాకు మూడు ఇళ్లు ఉన్నాయి. ముంబై, ఢిల్లీ మరొకటి దుబాయిలో. చారుకు దగ్గరగా ఉన్న వారెవరైనా ఒత్తిడి తెచ్చి ఆమెను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే ఆమె చాలా అమాయకురాలు, మంచిదని పేర్కొన్నారు. (మరోసారి వార్తల్లోకెక్కిన స్టార్ జంట!) తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న పుకార్లపై మాట్లాడుతూ.. ‘ఈ వార్తల వెనుక ఆమె ఫ్రెండ్ సర్కిల్లోని ఓ వ్యక్తి ఉన్నారు. తన స్నేహితుల మాటలు చారు నమ్మదని నేను నమ్ముతున్నాను. ఆ వ్యక్తి ఎవరో నేను తెలుసుకున్నాక అతని లేదా ఆమె పేరుతో పాటు వాళ్ల పోటో కూడా నేను మీకు చెబుతాను. వాస్తవాలను బయటపెడతాను’. అని వెల్లడించారు. కాగా ఇటీవల తమ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వీరిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో కావడమే కాకుండా పెళ్లి ఫోటోలు కూడా డిలీట్ చేశారు. దీంతో వీరి వివాహ బంధానికి స్వస్తి చెప్పబోతున్నారన్న నెజిటన్ల అనుమానం మరింత బలపడింది. గతేడాది జూన్‌లో మోడల్ అయిన రాజీవ్ సేన్, టీవీ నటి చారు అసోపా గోవాలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. (నెపోటిజమ్‌పై తెలివిగా స్పందించిన సుస్మితా సేన్) -
అయోధ్య కేసు; ధావన్‌కు ఉద్వాసన
న్యూఢిల్లీ: రామ జన్మభూమి –బాబ్రీమసీదు కేసులో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్‌కు ముస్లిం పక్షాలు ఉద్వాసన పలికాయి. అనారోగ్యంతో ఉన్నానంటూ అర్థం లేని కారణం చూపి ఈ కేసు నుంచి తప్పించారని న్యాయవాది రాజీవ్ ధావన్ మంగళవారం వెల్లడించారు. ‘బాబ్రీ కేసు నుంచి నన్ను తప్పించినట్లు కక్షిదారైన జమియత్ ఉలేమా– ఇ– హింద్ ప్రతినిధి ఏవోఆర్ (అడ్వొకేట్ ఆన్ రికార్డు) ఎజాజ్ మక్బూల్ తెలపగా వెంటనే అంగీకరించా. ఈ కేసులో నా జోక్యం ఉండదు’అని అన్నారు. ‘నన్ను తొలగించేందుకు ఎజాజ్‌కు అధికారం ఉంది. కానీ, నాకు ఆరోగ్యం బాగోలేని కారణంగానే తీసేసినట్లు పేర్కొనడం అర్థం లేనిది. అనారోగ్యంతో ఉంటే ఇతర కేసులను ఎలా డీల్ చేస్తున్నా?’అని ప్రశ్నించారు. కాగా, అయోధ్యలో రామ జన్మభూమి– బాబ్రీమసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలైంది. తీర్పులో కొన్ని తప్పులున్నాయని, వాటిని సవరించాలని కోరుతూ సోమవారం మౌలానా సయ్యద్ అషాద్ రషీది, జామియత్ ఉలేమా ఇ హింద్ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. -
వాళ్లిద్దరూ విడిపోలేదా..? ఏం జరిగింది?
బాలీవుడ్ నటి సుష్మితా సేన్ సోదరుడు, మోడల్ రాజీవ్ సేస్ జూన్ 7న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యంత నిరాడంబరంగా జరిగిన రాజీవ్ సేన్, చారు అసోపాల వివాహం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏడాది పాటు ప్రేమలో మునిగితేలిన వీరిద్దరూ పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. అయితే తాజాగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు మరింత బలాన్నిస్తూ రాజీవ్, చారులు ఒకరి సోషల్ మీడియా పేజ్‌లను మరొకరు అన్‌ఫాలో చేయటం చర్చనీయాంశమైంది. అంతేకాదు వారి సోషల్ మీడియా పేజ్‌ల ప్రొఫైల్ ఫోటోలను కూడా మార్చేశారు. గతంలో ఇద్దరూ కలిసున్న ఫోటోలు ప్రొఫైల్ ఫోటోలుగా ఉండగా తరువాత సింగిల్‌గా ఉన్న ఫోటోలను పెట్టారు. దీంతో రాజీవ్, చారుల మధ్య గొడవలు ఉన్నాయన్న వార్తలు మీడియా సర్కిల్స్‌లో హల్చల్ చేశాయి. దీంతో అభిమానులు కామెంట్స్ రూపంలో వారిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రశ్నలకు రాజీవ్ సమాధానం చెప్పకపోగా కామెంట్ చేసిన వారిని బ్లాక్ చేయటంతో చాలా మంది రాజీవ్, చారులు విడిపోయారని నిర్ణయించుకున్నారు. చారు అసోపా కూడా ఈ వార్తలపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే తాజాగా అందరికీ షాక్ ఇస్తూ రాజీవ్, చారుతో కలిసి దిగిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశాడు. ‘మా తొలి ఢిల్లీ డిన్నర్ డేట్’ అనే క్యాప్షన్‌తో ఇద్దరు అన్యోన్యంగా ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. దీంతో ఇన్నాళ్లు ఇద్దరి మధ్య ఏదో జరిగిందంటూ వస్తున్న వార్తలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అంతేకాదు ఒకరి ఇన్స్టాగ్రామ్ పేజ్‌ను మరొకరు తిరిగి ఫాలో అవుతున్నారు. అయితే అసలు ఎందుకు అన్‌ఫాలో చేశారు. ఎందుకు తిరిగి ఫాలో చేస్తున్నారన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. View this post on Instagram Our first delhi dinner date ❤️ #aboutlastnight #rajakibittu A post shared by Rajeev Sen (@rajeevsen9) on Jul 31, 2019 at 7:23am PDT -
దీపక్ తల్వార్,రాజీవ్ సక్సేనాకు ఈడీ కస్టడీ
-
క్వార్టర్స్‌లో అజయ్, రాజీవ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో అజయ్ భూషణ్, రాజీవ్ ఇనుగంటి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో అజయ్ 4–3 (21–63, 65–35, 43–44, 59–7, 76–38, 11–65, 87–38)తో రషీద్ ఖురేషిపై గెలుపొందగా, రాజీవ్ 4–2 (69–43, 73–01, 25–67, 65–17, 42–92, 61–34)తో ఖైజర్ రవూఫ్‌ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో బాలకృష్ణ 4–1 (70–25, 56–21, 58–51, 44–64, 77–32)తో పి. హేమంత్ కుమార్‌పై, ఇ. పాండురంగయ్య 4–0 (65–26, 61–32, 59–37, 72–45)తో సయ్యద్ అహ్మద్ హుస్సేన్‌పై గెలుపొందారు. అంతకుముందు జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో లక్కీ వత్నానీ 4–3 (51–78, 69–34, 59–24, 45–56, 71–55, 45–57, 49–37)తో జేమ్స్ సుందర్ రాజ్‌పై, నరేశ్ కుమార్ 4–3 (70–43, 45–59, 47–17, 49–35, 51–60, 54–13)తో క్లింటన్‌పై, కె. వెంకటేశం 4–3 (53–66, 82–33, 82–37, 54–12, 27–60, 52–62, 57–22)తో మొహమ్మద్ గౌస్‌పై, విశాల్ అగర్వాల్ 4–1 (87–33, 54–32, 51–63, 67–22, 60–58)తో బీఎల్ ధీరజ్‌పై, మీర్ అబిద్ అలీ 4–2 (62–24, 79–08, 54–32, 23–58, 30–60, 57–28)తో అశ్విన్ రావుపై గెలుపొంది ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించారు. -
‘ఎవరు మీలో కోటీశ్వరుడు?’ సొమ్ము సేవలకే..
-టీవీ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల యానాం : సేవా దృకృథంతో వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు టీవీ యాంకర్ కనకాల సుమ పేర్కొన్నారు.శనివారం స్ధానిక కనకాలపేట ప్రభుత్వ హైస్కూల్‌కు రూ.60 వేల విలువచేసే ప్రొజెక్టర్, స్క్రీన్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హీరో, తనభర్త రాజీవ్ కనకాల, తాను కలిసి మాటీవీలో ప్రసారమైన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ కార్యక్రమంలో పాల్గొని గెలిచిన సొమ్ముతో వివిధ సేవాకార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్పారు. దీనిలో భాగంగానే పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే ప్రొజెక్టర్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కనకాల రాజీవ్ మాట్లాడుతూ తన స్వగ్రామంలో ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందాన్నిస్తోందన్నారు. ఇప్పటికే హైదరాబాద్, రాజమండ్రి తదితర చోట్ల ప్రొజెక్టర్లు ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కేఎన్ లక్ష్మి, ఉపాధ్యాయులు లక్ష్మణరావు, సూర్యప్రకాష్, నళినీకుమారి,మహ్మద్ యాకూబ్ తదితరులు పాల్గోన్నారు.