![Comedian Rajeev Nigam Son Dies On His Birthday - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/9/son.jpg.webp?itok=gjcRT4Gg)
తల్లిదండ్రుల పుట్టినరోజు నాడు తమ పిల్లలు ఏదైనా గిఫ్ట్ ఇచ్చి వారిని ఆనందింపజేయాలనుకుంటారు. కానీ ఇక్కడ కథ అడ్డం తిరిగింది. కొడుకు ఇచ్చిన షాకింగ్ బర్త్‌డే సర్‌ప్రైజ్ నుంచి తండ్రి ఇంకా కోలుకోలేకపోతున్నాడు. తన పుట్టినరోజు నాడే కన్న కొడుకు మృతి చెందడంతో హాస్య నటుడు రాజీవ్ నిగమ్ ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. ఆదివారం రాజీవ్ నిగామ్ పుట్టినరోజు నాడు తన కుమారుడు దేవరాజ్(8) అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ విషయాన్ని రాజీవ్ తన ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. చదవండి: అవినాష్‌ను వెంటాడుతున్న ఆత్మహత్య ఆలోచనలు?
‘ఎంతటి సర్‌ప్రైజ్ బర్త్‌డే గిఫ్ట్. ఈ రోజు నా కొడుకు నన్ను విడిచి వెళ్లి పోయాడు. కనీసం కేక్ కట్ చేసే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు. ఇలాంటి బహుమతి ఎవరిస్తారు’. అంటూ ఇద్దరు దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ రాజీవ్ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా రెండేళ్ల క్రితం కొడుకు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలిపాడు. అతన్ని వెంటలేటర్‌పై ఉంచినట్లు పేర్కొన్న రాజీవ్ కొడుకు అనారోగ్యానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. కాగా ఈ ఏడాది ఆగష్టులో రాజీవ్ తండ్రి కూడా మరణించారు. చదవండి: పవన్‌తో సినిమా... రానా స్పందన
Comments
Please login to add a commentAdd a comment