
బాలీవుడ్ టీవీ నటి చారు అసోపా భర్త రాజీవ్ సేన్‌తో విడాకులపై స్పందించారు. ఇప్పటికే లాయర్ ద్వారా విడాకుల నోటీసులు పంపానని, ఇక మళ్లీ అతనితో కలిసుండటం అన్నది అసాధ్యం అని పేర్కొంది. రీసెంట్‌గా రాజీవ్ చారు అసోపాతో కలిసున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంపై స్పందిస్తూ.. అతను అలా ఎందుకు చేశాడో తనకు తెలియదని, ఇప్పటికే తామిద్దం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరం బ్లాక్ చేసుకున్నట్లు తెలిపింది. అంతేకాకుండా రాజీవ్‌తో కలిసి ఉన్న ఫోటోలన్నింటిని తన అకౌంట్ నుంచి తొలిగించినట్లు పేర్కొంది.
'2019లో రాజీవ్‌తో నా వివాహం జరిగింది. ఈ మూడేళ్లలో చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అతను ఇల్లు వదిలి వెళ్లిపోతాడే తప్పా పరిష్కరించాలని ఎప్పుడూ అనుకోడు. ఎన్నోసార్లు విడాకులు తీసుకోవద్దని అనుకున్నా. కానీ పరిస్థితులు చేయిదాటి పోయాయి.ఇక చేసేదీమీ లేదు. అందుకే మా పెళ్లిని రద్దు చేసుకోవాలనుకుంటున్నాం.
ఇక తన మొదటి పెళ్లిని దాచాను అని రాజీవ్ అన్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదు. నా గతం గురించి మొత్తం చెప్పాకే అతడిని పెళ్లి చేసుకున్నా' అని చారు పేర్కొంది. ఇక తన ఆడపడుచు సుష్మితా సేన్‌తో మాత్రం తనకు మంచి అనుబంధం ఉందని, ఆమెతో తరచూ మాట్లాడతానని తెలిపింది. 'విడాకుల సమయంలో చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నా. సుష్మితా నాకు అండగా నిలబడింది. తనతో ఏదైనా షేర్ చేసుకునే ఫ్రెండ్షిప్ మా మధ్య ఉంది' అంటూ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment