Sushmita Sen
-
'అలాంటి వ్యక్తి దొరకాలి.. కచ్చితంగా పెళ్లి చేసుకుంటా': సుస్మితా సేన్
బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్(Sushmita Sen) గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె చివరిసారిగా తాలీ వెబ్ సిరీస్‌లో కనిపించింది. గౌరీ సావంత్ జీవితం ఆధారంగా నిర్మించారు. అంతకుముందు ఆర్య వెబ్ సిరీస్‌తో అభిమానులను అలరించింది ఈ 49 ఏళ్లు బాలీవుడ్ భామ. అయితే తాజాగా తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమెను పెళ్లి గురించి ప్రశ్నించగా దానిపై స్పందించింది. తాను కూడా పెళ్లి చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపింది. అయితే సరైన భాగస్వామి దొరకాలి కదా? అని వెల్లడించింది.తన అభిమాని ప్రశ్నకు స్పందిస్తూ.. "నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నాకు సరైన వ్యక్తి దొరకాలి కదా. మనం అనుకున్న వెంటనే పెళ్లి జరిగదు కదా. ఎందుకంటే ఇది రెండు హృదయాలకు సంబంధించింది. అతనితో ప్రేమ, సంబంధం నా హృదయానికి నచ్చాలి. అప్పుడే నేను కూడా పెళ్లి చేసుకుంటా' అని తెలిపింది సుస్మితా సేన్. కాగా.. గతంలో నటుడు రోహ్మన్ షాల్‌తో ప్రేమాయణం కొనసాగించింది ముద్దుగుమ్మ. (ఇది చదవండి: మూడేళ్లుగా సింగిల్‌గానే.. నా కూతురు పెళ్లి చేసుకోనివ్వట్లేదు)దాదాపు మూడు సంవత్సరాలు డేటింగ్ తర్వాత 2021లో అతనితో బంధానికి గుడ్‌బై చెప్పేసింది. అంతకుముందు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో రిలేషన్లో ఉన్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2022లో లలిత్ మోడీ సుష్మితా సేన్‌ను తన "బెటర్ హాఫ్"గా పరిచయం చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత సుస్మితా సేన్ మాట్లాడుతూ అదంతా గతమని కొట్టిపారేసింది. కాగా.. సుష్మితా సేన్.. 2000వ సంవత్సరంలో రెనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. 2010లో అలీసాను దత్త తీసుకుని పెంచుకుంటోంది. -
సుష్మిత కుటుంబానికి నేనున్నా.. ఏ అవసరం వచ్చినా.: నటుడు
ప్రేమించుకోవడం, బ్రేకప్ చెప్పుకోవడం, తర్వాత మళ్లీ ప్రేమలో పడటం.. ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. బాలీవుడ్ నటి సుష్మితా సేన్ కూడా ఎందరితోనో ప్రేమాయణం నడిపింది. కానీ ఏదీ పెళ్లిదాకా రాలేదు. ఆమె ప్రేమించినవారిలో మోడల్, నటుడు రోహ్మన్ షాల్ కూడా ఒకరు. అయితే మూడేళ్ల క్రితం వీళ్లు కూడా బ్రేకప్ చెప్పుకున్నారు. కానీ తర్వాత కూడా ఎన్నోసార్లు కలిసి కనిపించారు. జనాలేమనునుకున్నా ఓకేఇకపోతే రోహ్మన్ ఇటీవలే అమరన్ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రోహ్మన్ షాల్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు. 'జనాలేమనుకున్నా నేను పెద్దగా పెట్టించుకోను. వాళ్ల మాటలు నన్ను బాధించలేవు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు. నాతో నేను ఎంత నిజాయితీగా ఉంటున్నానో తెలుసు. జనాలు నా గురించి పాజిటివ్‌గా, నెగెటివ్‌గా.. ఎలా మాట్లాడుకున్నా ఓకే..మేమంతా ఒకే కుటుంబంనేను ఏం ఆలోచిస్తున్నాను.. ఇప్పుడేం చేస్తున్నాను అనేదానిపైనే నేను ఎక్కువ ఫోకస్ పెడతాను. నా జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను, అనుభవాలను గౌరవిస్తాను. సుష్మితా సేన్, నేను కలిసి ఉండకపోయినా, నెలల తరబడి మాట్లాడుకోకపోయినప్పటికీ వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనుంటాను. మేమంతా ఒక కుటుంబంలాగే ఉంటాము. వారికోసం నేనున్నాను. కాబట్టి దీని గురించి ఇంక చెప్పడానికి ఏం లేదు అని పేర్కొన్నాడు.చదవండి: నిఖిల్‌ను గెలిపించేందుకు బిగ్‌బాస్ టీమ్ రెడీ? -
అలాంటి పదాలు వాడొద్దని తల్లిదండ్రులు మందలించారు: సుస్మితా సేన్
బాలీవుడ్ నటి సుష్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మాజీ విశ్వసుందరి సినిమాల కంటే ఎక్కువగా ఎఫైర్స్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. పలువురితో ప్రేమాయణం కొనసాగించిన ముద్దుగుమ్మ చివరిసారిగా ఆర్య మూడవ సీజన్ వెబ్ సిరీస్‌లో కనిపించింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన భామ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నానంటూ వెల్లడించింది. తాను 18 ఏళ్ల వయసులో ఉండగా తల్లిదండ్రులు ఇచ్చిన సలహాను గుర్తు చేసుకుంది. రియా చక్రవర్తి ప్రారంభించిన యూట్యూబ్ ఛానెల్‌కు మొదటి అతిథిగా సుస్మితా సేన్ హాజరయ్యారు.సుస్మిత మాట్లాడుతూ...' ఆ రోజుల్లో సమాజం ఇప్పటిలా ఓపెన్‌గా లేదు. ఏదైనా చెప్పాలంటే సంకోచించే వాళ్లు. నాకు 18 ఏళ్ల వయసులో శోభా దేతో ఇంటర్వ్యూ సందర్భంగా ఉద్దేశపూర్వకంగానే సెక్స్ అనే పదాన్ని తీసుకొచ్చా. ఎందుకంటే నేను ఒక మనిషిగా, నిజంగా స్వేచ్ఛ ఉండాలని కోరుకున్నా. కాబట్టి ఆ ప్రయత్నంలో నేను భారతదేశపు మొట్టమొదటి మిస్ యూనివర్స్ అయ్యా. కానీ సెక్స్ అనే పదం వాడినందుకు అమ్మ, నాన్న నన్ను హెచ్చరించారు. నీ భూజాలపై పెద్ద బాధ్యత ఉంది. ఆ పదాన్ని ఇంటర్వ్యూలో ఎందుకు ఉపయోగించావ్? శోభా దే మీ గురించి చెడుగా రాస్తున్నారు.' అని చెప్పారని వెల్లడించింది.కాగా.. సుస్మితా సేన్ 1975లో బెంగాల్లో జన్మించింది. ఆమె 2000వ సంవత్సరంలో రెనీని దత్తత తీసుకుంది. 2010లో అలీసాను దత్త తీసుకుని పెంచుకుంటోంది. -
మూడేళ్లుగా సింగిల్‌గానే.. నా కూతురు పెళ్లి చేసుకోనివ్వట్లేదు
బాలీవుడ్ నటి సుష్మితా సేన్ ఎందరితోనో డేటింగ్ చేసింది. కానీ, ఎవరినీ తన జీవిత భాగస్వామిగా అంగీకరించలేకపోయింది. ఆ మధ్య ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో లవ్‌లో పడ్డప్పటికీ ఈ ప్రేమ ఎంతోకాలం నిలవలేకపోయింది. మాజీ బాయ్‌ఫ్రెండ్, మోడల్ రోహ్మన్ షాతోనే తరచూ బయట కనిపిస్తోంది. తన ఇంట్లోని పార్టీలకు, సెలబ్రేషన్స్‌కు రోహ్మన్ ఉండాల్సిందే! మూడేళ్లుగా సింగిల్గాబయట ఈవెంట్స్, షాపింగ్‌కు వెళ్లినప్పుడు కూడా సుష్మితకు నీడలా తోడుంటున్నాడు. అలా అని వీళ్లిద్దరూ మళ్లీ ప్రేమాయణం నడపడం లేదట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుష్మిత మాట్లాడుతూ.. 'నా జీవితంలో ఇప్పుడు ఏ పురుషుడూ లేడు. మూడేళ్లుగా సింగిల్‌గానే ఉంటున్నాను. ప్రేమ వెంట పరుగులెత్తాలన్న ఆలోచన, ఆసక్తి కూడా లేదు. అంతకుముందు ఐదేళ్లపాటు ఒకరితో రిలేషన్లో ఉన్నాను. దానికి బ్రేకప్ చెప్పి లవ్ లైఫ్‌లో బ్రేక్ తీసుకోవడం బాగుంది.పెళ్లి వద్దంటున్నారుఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా నా పిల్లలు అస్సలు ఒప్పుకోరు. ఫలానా అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? అని అడిగితే నా పెద్ద కూతురు.. అతడే కాదు నువ్వు ఎవరినీ పెళ్లి చేసుకోవద్దు.. అసలు వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నీకు నచ్చినట్లుగా నీ జీవితాన్ని గడిపావు. అలాంటిది పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అని ప్రశ్నిస్తోంది' అని చెప్పుకొచ్చింది.కెరీర్..కాగా సుష్మిత సేన్.. 2000వ సంవత్సరంలో రెనీని దత్తత తీసుకుంది. 2010లో అలీసాను దత్త తీసుకుని పెంచుకుంటోంది. సుష్మిత 2021లో రోహ్మన్ షాకు బ్రేకప్ చెప్పింది. ఆమె చివరగా ఆర్య: అంతిమ్ వార్ సిరీస్‌లో కనిపించింది. ఈ సిరీస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది.చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీరియల్ డైరెక్టర్ ఆత్మహత్య -
మళ్లీ పుట్టానంటున్న స్టార్ హీరోయిన్.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తెలియనివారు ఉండరు. 1990ల్లో స్టార్ హీరోయిన్గా బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. 1994లో విశ్వ సుందరి కిరీటం గెలిచి భారత ప్రతిష్టను పెంచింది. మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయురాలుగా సుస్మిత రికార్డ్ క్రియేట్ చేసింది. సుస్మిత సినిమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు కూడా చేసింది.అయితే తాజాగా ఆమె తన సోషల్ మీడియా ఖాతా బయోలో కీలక మార్పులు చేసింది. ఏకంగా తన రెండో పుట్టినరోజు అంటూ బయోలో రాసుకొచ్చింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అదేేంటని నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలంటే మీరు కూడా ఓ లుక్కేయండి.అయితే గతేడాది సుస్మితా సేన్ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2023లో తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరిన ఆమె... ఆ తర్వాత కోలుకుంది. అందుకే తాజాగా ఆమె తన ఇన్‌స్టా బయోలో బర్త్ డే తేదీని రాసుకొచ్చింది. నా రెండో పుట్టిన రోజు ఇదేనంటూ.. 27 ఫిబ్రవరి 2023 అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే గుండెపోటు నుంచి కోలుకున్న సుస్మితా.. తనకు పునర్జన్మగా భావించి ఆ తేదీని అలా రాసుకొచ్చినట్లు తెలుస్తోంది.కాగా.. 1975, నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో సుస్మితా సేన్ జన్మించింది. తండ్రి షుబీర్ సేన్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పని చేయగా, తల్లి శుభ్రా సేన్ నగల డిజైనర్. సుస్మిత హైదరాబాద్‌లో జన్మించినా చదువంతా ఢిల్లీలో సాగింది.తెలుగులో నాగార్జున సరసన 'రక్షకుడు' చిత్రంలో నటించింది. 2013 సంవత్సరానికి సుస్మితాసేన్ మదర్‌థెరిస్సా ఇంటర్నేషనల్ అవార్డు అందుకుంది. సామాజిక న్యాయం కోసం కృషిచేసేవారిని గుర్తించి గౌరవించేందుకు ద హార్మనీ ఫౌండేషన్ అనే సంస్థ ఈ అవార్డు నెలకొల్పింది. 2015 లోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సుస్మితా సేన్.. ఓటీటీ కోసం ఆర్య, తాళి వంటి వెబ్ సీరిస్‌లలో నటించింది. స్టార్ హీరోయిన్గా ఎదిగిన సుస్మితా సేన్ చివరిసారిగా ఆర్య సీజన్ 3లో కనిపించింది. -
Sushmita Sen Throwback Photos: అందానికి పట్టాభిషేకం.. మిస్ యూనివర్స్‌గా 'సుస్మితా సేన్' 30 ఏళ్ల నాటి ఫోటోలు
-
Miss Universe: సుస్మితా సేన్ అందానికి దక్కిన కిరీటానికి 30 ఏళ్లు పూర్తి
బాలీవుడ్ హీరోయిన్, మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌కు ఈరోజు చాలా ప్రత్యేకం. తాను విశ్వసుందరిగా కిరీటాన్ని గెలుచుకుని నేటితో 30 ఏళ్లు. ఆ రోజులను గుర్తుచేసుకుంటూ ఆమె ఒకఫోటోను షేర్ చేసింది. 1994లో విశ్వ సుందరి కిరీటం గెలిచి భారత జాతి ఖ్యాతి పెంచిన సుస్మిత ఆపై సినిమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ పేరు తెచ్చుకుంది.మే 21, 1994న మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయురాలుగా సుస్మిత రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పటి ఫోటోను షేర్ చేస్తూ సుస్మిత ఇలా చెప్పుకొచ్చింది. 'ఈ ఫొటో తీసినప్పుడు నా వయసు 18ఏళ్లు. నేను అనాథాశ్రమంలో ఈ చిన్నారిని కలిసిన క్షణంలో నేను జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకోవాని నిర్ణయించుకున్నాను. అత్యంత అమాయకమైన ఆ చిన్నారి చూపు నన్ను కట్టిపడేసింది. 30 ఏళ్ల క్రితం నేను ఏదైతే అలాంటి వారికి చేయాలని అనుకున్నానో ఇప్పుడు అదే చేస్తున్నాను.ప్రతి ఏడాది మే 21ని చాలా గర్వంగా సెలబ్రెట్ చేసుకుంటాను. 21 మే 1994 నా జీవిత చరిత్రలో చెరిగిపోని ఒక పేజీ.. ఆ క్షణాలు ఇప్పటికీ నా కళ్లముందు కనిపిస్తున్నాయి. భారతదేశం ఎల్లప్పుడూ నాకు గొప్ప గుర్తింపు, శక్తిని ఇచ్చింది. గత మూడు దశబ్ధాలుగా అభిమానులు అంతులేని ప్రేమను నాకు అందిస్తున్నారు. ఈ సంతోషం సందర్భంగా నాకు మెసేజ్‌లు పంపుతున్న అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది.' అని ఆమె తెలిపింది.1975, నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో సుస్మితా సేన్ జన్మించింది. తండ్రి షుబీర్ సేన్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పని చేయగా, తల్లి శుభ్రా సేన్ నగల డిజైనర్. సుస్మిత హైదరాబాద్‌లో జన్మించినా చదువంతా ఢిల్లీలో సాగింది.తెలుగులో నాగార్జున సరసన 'రక్షకుడు' చిత్రంలో నటించింది. 2013 సంవత్సరానికి సుస్మితాసేన్ మదర్‌థెరిస్సా ఇంటర్నేషనల్ అవార్డు అందుకుంది. సామాజిక న్యాయం కోసం కృషిచేసేవారిని గుర్తించి గౌరవించేందుకు ద హార్మనీ ఫౌండేషన్ అనే సంస్థ ఈ అవార్డు నెలకొల్పింది. 2015 లోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సుస్మితా సేన్.. ఓటీటీ కోసం ఆర్య, తాళి వంటి వెబ్ సీరిస్‌లలో నటించింది. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
ఆ వ్యాధితో...అపుడసలు బుర్ర పని చేయలేదు : స్టార్ హీరోయిన్
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గురించి పరిచయం అవసరం లేదు. కేవలం నటనతోనేకాకుండా బోల్డ్ స్టేట్మెంట్లు, జిమ్‌లో కసరత్తులు చేస్తూ అభిమానులను ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇంత ఫిట్‌గా ఉన్న ఈ అమ్మడు కూడి ఇటీవల గుండెజబ్బు బారిన పడింది. తనకు ఆరోగ్యానికి సంబంధించి కొన్ని విషయాలను ఇటీవల ఒక ఇంటర్య్వూలో వెల్లడించారు. మార్చి 2023లో, ఆమెకు గుండెపోటు రావడంతో స్టెంట్ అమర్చాల్సి వచ్చింది. కానీ కొద్ది రోజుల్లోనే మంచి వ్యాయాయంతో తిరిగి ఫిట్ నెస్‌ను సాధించింది. అప్పటినుంచి వివిధ ఇంటర్వ్యూలలో తన ఆరోగ్య పరిస్థితి గురించి నిస్సంకోచంగా వెల్లడిస్తూ వస్తోంది. సుస్మిత చివరిగా వెబ్ సిరీస్ ఆర్య సీజన్ 3లో కనిపించింది. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తల్లిదండ్రులిద్దరూ హార్ట్ పేషెంట్లని అందుకే తాను కూడా అప్రత్తమంగా ఉండేదాన్ని చెప్పుకొచ్చింది. గుండెపోటు తర్వాత తాను ఆపరేషన్ థియేటర్లో నవ్వుతున్నానని సుస్మిత వెల్లడించింది. అలాగే దీని తర్వాత తన ఆమె జీవనశైలిలో వచ్చిన మార్పుల గురించి కూడా వెల్లడించింది. తాను చాలా హ్యాపీ గోయింగ్ మనిషిని అని తెలిపింది. అలాగే తన ఆటో ఇమ్యూన్ డిసీజ్ గురించి కూడా సుస్మితా సేన్ ఓపెన్ అయింది. తన జీవితంలో పెద్ద సమస్య అని, ఆ సమయంలో తన మెదడు మొద్దు బారి పోయిందనీ, ఇప్పటికీ చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకోలేకపోతున్నానని పేర్కొంది 2014లోనే సుస్మిత ఆడిసన్స్ వ్యాధిబారిన పడిందట. ఆటో ఇమ్యున్ సిస్టంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే డిప్రెషన్‌కు లోనైంది. కార్టిసోల్ వంటి స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల విపరీతమైన సైడ్ ఎఫెక్ట్ లతో బాధపడ్డానని కూడా తెలిపింది సుస్మిత. ప్రస్తుత కఠోర సాధనతో సాధారణ స్థితికి వచ్చానని కూడా తెలిపింది. -
కొండచిలువను పెంచుకుంటున్న హీరోయిన్!
కొండచిలువను ముట్టుకునేంత..కాదు కాదు దగ్గర నుంచి చూసేంత ధైర్యం ఉందా? భలేవాడివి బాసూ.. అదేమైనా కుక్క పిల్లా? లేదా పిల్లి పిల్లనా? ముట్టుకొని ముద్దాడడానికి? అంటారా? మీకే కాదు సహజంగా ఎవరికైనా పాములను చూడగానే భయం వేస్తుంది. ఎక్కడో దూరాన ఉన్న చిన్న పామును చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం. అలాంటిది కొండచిలువలాంటి పాము మన దగ్గరకు వస్తే.. ఊహించుకుంటేనే భయం వేస్తోంది కదా? కానీ ఓ హీరోయిన్ మాత్రం కొండ చిలువను కుక్కపిల్ల మాదిరి ముద్దుగా పెంచుకుంటుందట. దాన్ని పట్టుకొని ముద్దులు కూడా పెడుతుందట. పాములంటే ఇష్టం సాధారణంగా సెలబ్రిటీలు కుక్కపిల్లల్ని.. ఇంకా ముద్దొస్తే పిల్లి పిల్లల్ని పెంచుకోవడం గురించి వినే ఉంటారు! కానీ అలా ముచ్చటపడి పాములను పెంచుకోవడం గురించి విన్నారా? బాలీవుడ్ హీరోయిన్ సుష్మితా సేన్‌కి ఆ సరదా ఉందట. ఆమెకు పాములంటే పిచ్చి ఇష్టమట. ఆ ఇష్టంతోనే ఒక బుజ్జి కొండచిలువను పెంచుకుంటోందని బాలీవుడ్లో టాక్. ఖాలీ సమయం దొరికితే ఆ కొండ చిలువతో సరదాగా ఆడుకుంటుందట. అయితే తన కొండ చిలువకు సంబంధించిన విషయాలను సుష్మిత ఎక్కడా చెప్పలేదు కానీ..ఆమె సన్నిహితుల ద్వారా మీడియాకు ఈ విషయం లీకైంది. దీన్ని సుష్మిత ఖండించకపోవడంతో బాలీవుడ్ జనాలు ఇది నిజమనే నమ్ముతున్నారు. వెబ్ సిరీస్‌లతో బీజీ బీజీ.. 1997లో రత్సగన్ అనే తమిళ్ సినిమాతో తెరంగేట్రం చేసింది సుస్మితా. మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న ఈ బ్యూటీ ఇండస్ట్రీలోని అగ్రకథానాయకులతో నటించింది. ముఖ్యంగా ఒకేఒక్కడు సినిమాలోని షకలకా బేబీ పాటతో సౌత్ ఇండస్ట్రీలోనే ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ రాణించింది. ప్రస్తుతం పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ చేస్తూ కెరీర్ పరంగా ఇప్పటికీ బీజీగా ఉన్నారు. ఆ మధ్య ఆర్య -3 వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చి, తనదైన నటనతో ఆకట్టుకుంది. -
రక్తసంబంధం లేకున్నా ఆ పిల్లల కోసం సుస్మితా సేన్ ఏం చేసిందంటే
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తాజాగా ‘తాలీ’ వెబ్ సీరిస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఇది జియో టీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సీరిస్ ట్రైలర్ విడుదలైనప్పుడు తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్న ఆమె ఇందులో ట్రాన్స్‌జెండర్‌గా అద్భుతంగా నటించి విమర్శించిన వారికి సమాధానం చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ జర్నీ ఎలా ముగిసింది. అప్పుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది. అనే అంశాలపై సుస్మిత కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సుస్మితా సేన్ తన కుమార్తె యొక్క ఆరోగ్య సమస్యల గురించే కాకుండా తన బిడ్డ పట్ల ఎలాంటి విధులను నిర్వహించింది అనే దాని గురించి మాట్లాడారు. ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ.. ఈ సంఘటనతో సినిమాలకు దూరం సుస్మితా సేన్‌కు 24 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక కుమార్తెను దత్తత తీసుకుంది. ఆ సమయంలో తన తల్లి వద్దని వారించినా మెండిగా నిర్ణయం తీసుకుంది. అప్పుడు ఆమెకు పలు భారీ సినిమా అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పలువురు సన్నిహితులు కూడా వద్దని చెప్పినా సుస్మిత మనుసు మార్చుకోలేదు. కుమార్తెను దత్తత తీసుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇలా చెప్పింది. 'రెనీ నా జీవితంలోకి వచ్చినప్పుడు తన ఆరోగ్యం మెరుగ్గాలేదు. అదే సమయంలో నేను కెనడాలో ఉన్నాను. అక్షయ్ కుమార్, కరీనాతో కలిసి ఒక సినిమా చిత్రీకరణలో ఉన్నాను. పాపను అలా వదిలి రావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు.. కానీ తప్పలేదు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి) అలా షూటింగ్లో ఉండగా నా తండ్రి నుంచి ఫోన్ వచ్చింది. పాపకు సీరియస్‌గా ఉంది. ఆస్పత్రిలో చేర్పించామని నాన్న చెప్పాడు. అలాంటి సమయంలో నేను షూటింగ్లో పాల్గొనలేకపోయాను. తనను నేను నవమాసాలు మోసి కనకపోయినా అంతే సమానమైన బంధం రెనీతో ఉంది. దీంతో సినిమా షూటింగ్లో ఒక్క క్షణం ఉండలేకపోయాను.. సెట్లో అందరి ముందు విషయం చెప్పి కెనడా నుంచి తిరిగి ముంబయ్‌కు బయల్దేరాను. విదేశాల్లో షూటింగ్లో ఉన్న నేను సినిమాను మధ్యలో ఆపేసి వచ్చేశాను. ఆ క్షణమే నాకు తెలుసు నా సినిమా కెరీర్ ఇక్కడితో ముగిసిందని. అప్పట్లో నాకు కెరీర్‌పై సీరియస్‌నెస్ లేదని, అందుకే 24 ఏళ్లకే తల్లినయ్యానని కామెంట్స్ చేసేవారు ఎందరో. దీంతో నా పనిలో ఇంకా ఎక్కువ కష్టపడేదానిని కానీ, అప్పటికే నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.’ అని సుస్మిత తెలిపింది. 1994లో విశ్వ సుందరిగా నెగ్గిన సుష్మితా సేన్ బాలీవుడ్‌తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. తర్వాత ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. (ఇదీ చదవండి: అందరిలా నేనెందుకు ఆనందంగా లేనంటే: టాప్ హీరోయిన్) భారత మెగా టీ20 క్రికెట్ లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో కొంత కాలం సుష్మిత డేటింగ్లో ఉన్నారు. సుష్మితా సేన్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా 2013లో మదర్ థెరిసా అంతర్జాతీయ అవార్డును ఆమె పొందింది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరూ కూడా దత్తత తీసుకున్నవారే కావడం విశేషం. -
లలిత్ మోదీతో బ్రేకప్.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన సుష్మితాసేన్!
మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్.. సినిమాలతో పాటు లవ్ ఎఫైర్లతోనూ బాగా ఫేమస్ అయింది. సినిమాల్లో హీరోయిన్గా రాణించిన సమయంలో ఎంతోమందితో ప్రేమాయణం నడిపింది. ఈ క్రమంలో తనకంటే చిన్నవాడైన రోహ్మన్ షాల్తోనూ లవ్వాయణం నడిపింది. కానీ తర్వాత అతడికి బ్రేకప్ చెప్పింది. కొంతకాలానికే ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో ప్రేమలో పడింది. వీరిద్దరూ డేటింగ్లో ఉన్న విషయాన్ని తెలియజేస్తూ లలిత్ మోదీ ట్విటర్లోనూ కొన్ని ఫోటోలు రిలీజ్ చేశాడు. ఇది చూసిన జనాలు.. డబ్బు కోసమే సుష్మిత అతడిని ప్రేమిస్తోందంటూ విమర్శలు గుప్పించారు. ఏదైనా అనుకోండి, డోంట్ కేర్ అయితే ఏమైందో ఏమో కానీ కొంతకాలానికే వీరిద్దరు కూడా బ్రేకప్ చెప్పుకున్నారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ ట్రోలింగ్‌పై, బ్రేకప్‌పై క్లారిటీ ఇచ్చింది నటి. తాలి వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సమయంలో ఆమె మాట్లాడుతూ.. 'నా గురించి మీరెలా మాట్లాడుకున్నా మంచిదే! డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతానని అంటున్నారు.. ఈ అవమానాలను నేను స్వీకరించినప్పుడే అవమానం.. కానీ అలాంటివి నేనసలు పట్టించుకుంటే కదా! నేనిప్పుడు సింగిల్.. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత విషయాలంటూ కొన్నుంటాయి.. వాటితో మీకు సంబంధం లేదు. ప్రతిదాంట్లో దూరే హక్కు మీకు లేదు. ఇంకో విషయం చెప్పాలి, నేనిప్పుడు సింగిల్‌గా ఉంటున్నాను. దాని గురించి కూడా మీకనవసరం!' అని ఘాటుగా వ్యాఖ్యానించింది. లలిత్ మోదీతో బ్రేకప్ అయిన విషయాన్ని చెప్పకనే చెప్పింది సుష్మిత. కాగా ఈ నటి ఈ ఏడాది ఫిబ్రవరిలో గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరగా ఓ మేజర్ సర్జరీ జరిగింది. అప్పుడు సినిమాలకు విరామం పలికిన ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుని తిరిగి షూటింగ్లో పాల్గొంటోంది. ప్రస్తుతం ఆర్య 3, తాలి అనే వెబ్ సిరీస్‌లు చేస్తోంది. చదవండి: మా నాన్న ఎలా ఉంటాడో తెలియదు: ఏడ్చేసిన ధనరాజ్ -
ఇది నాకు మరో జన్మ.. అస్సలు భయపడను: సుస్మితా సేన్
ఇండస్ట్రీలో ఎక్కువగా గుండెపోటు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. యంగ్ యాక్టర్స్ దగ్గర నుంచి సీనియర్ నటీనటుల వరకు ఈ సమస్యతో బాధపడుతుంటారు. కొన్నిసార్లు కన్నుమూస్తుంటారు. అలా గత కొన్నాళ్ల ముందు ప్రముఖ నటి సుస్మితా సేన్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. అయితే లక్కీగా దాన్నుంచి ఆమె బయటపడింది. అప్పుడు అసలేం జరిగింది? ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాలపై స్వయంగా సుస్మితానే స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వీటిని బయటపెట్టింది. ఇది మరో జన్మ 'నా జీవితంలో అది ఓ ప్రమాదకరమైన దశ. దాని నుంచి సురక్షితంగా బయటపడ్డాను. ఇప్పుడు నేను దానికి అస్సలు భయపడను. చెప్పాలంటే ఇది నాకు మరో జన్మతో సమానం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మన జీవితంపై గౌరవం పెరుగుతుంది. ఇంకా జాగ్రత్తగా ఉండాలని అనిపిస్తుంది. హార్ట్ ఎటాక్ నా జీవితాన్ని ఎంతో మార్చేసింది. ఇప్పుడైతే నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను' అని మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: సెట్లో అవమానాలు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!) ట్రాన్స్‌జెండర్ పాత్రలో 2015 నుంచి దాదాపు ఆరేళ్లపాటు నటనకు దూరంగా ఉన్న సుస్మితా సేన్.. మళ్లీ ఓటీటీల్లో యాక్టింగ్ తో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉంది. ఈమె నటించిన 'తాళి' ఫస్ట్ లుక్‌ని తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో సుస్మిత.. ట్రాన్స్‌జెండర్, మానవ హక్కుల కార్యకర్త శ్రీగౌరి సావంత పాత్రని పోషిస్తోంది. దేశంలో హిజ్రాల గుర్తింపు కోసం శ్రీగౌరి చేసిన పోరాటాలని ఈ సిరీస్‌లో చూపించబోతున్నారు. త్వరలో ఇది ఓటీటీలోకి రానుంది. అతడితో రిలేషన్? తన కంటే చిన్నవాడు అయిన రోహ్మాన్ షోల్ తో గత కొన్నాళ్లుగా డేటింగ్ చేసిన సుస్మితా సేన్.. అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఇది జరిగిన కొన్నాళ్లకు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ.. తాను సుస్మితా సేన్ తో రిలేషన్ లో ఉన్నట్లు బయటపెట్టాడు. కానీ ఈ విషయమై సుస్మితా మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీంతో ఇది నిజమా కాదా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఛాన్సుల కోసం కాంప్రమైజ్ అవమన్నారు.. ఈ నటి మాత్రం!) -
మాజీ ప్రియుడితో నటి ఎక్సర్సైజ్.. ఇద్దరూ కలిసిపోయినట్లేనా?
మాజీ విశ్వసుందరి, నటి సుష్మితా సేన్‌కు ఇటీవల గుండెపోటు రావడంతో వైద్యులు యాంజియోప్లాస్టీ చేసి స్టంట్ వేశారు. గత నెలలో తాను గుండెపోటుకు గురైన విషయాన్ని వెల్లడించిన సుష్మితా తాజాగా ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియో షేర్ చేసింది. ఇందులో సుష్మితా, ఆమె కూతురు అలీశా, సుష్మిత మాజీ ప్రియుడు రోహ్మన్ షాల్ ఉన్నారు. వీరందరూ కొన్నిరకాల వ్యాయామాలు చేశారు. ఈ వీడియోను నటి షేర్ చేస్తూ 'సంకల్పం ఒక్కటే మార్గం. మరింత శిక్షణకు అనుమతి లభించింది. నా ప్రియమైన వాళ్లు తిరిగి నేను ఎక్సర్సైజ్ చేసేందుకు సాయం చేస్తున్నారు. అలీశాకు, రోహ్మన్ షాల్‌కు నేను కిసెస్ పంపిస్తున్నాను. ఐ లవ్యూ గయ్స్..' అని క్యాప్షన్ జోడించింది. ఇది చూసిన నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 'మీరిద్దరు మళ్లీ కలిసిపోయారు, మిమ్మల్నిలా చూస్తుంటే సంతోషంగా ఉంది, ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకోండి' అని సూచిస్తున్నారు. ఈ వీడియోకు రోహ్మన్ షాల్ థాంక్యూ టీచర్ అని హార్ట్ ఎమోజీతో కామెంట్ పెట్టడం విశేషం. కాగా సుష్మితా సేన్ తనకంటే దాదాపు 15 ఏళ్లు చిన్నవాడైన రోహ్మన్ షాల్‌తో మూడేళ్లపాటు డేటింగ్ చేసింది. తర్వాత అతడికి బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత కొంతకాలానే ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీతో మాల్దీవుల పర్యటనకు వెళ్లడమే కాక సోషల్ మీడియా వేదికగా అతడిని పార్ట్నర్గా ప్రకటించింది. కానీ ఈ బంధం కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఇలా దాదాపు 10 మందితో డేటింగ్ చేసిన ఆమె ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది. ఇక సుష్మిత ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె ఆర్య వెబ్ సిరీస్ మూడో సీజన్ చేస్తోంది. మరోవైపు తాలి వెబ్‌సిరీస్ డబ్బింగ్ పూర్తి చేసింది. ట్రాన్స్‌జెండర్ శ్రీగౌరి సావంత్ జీవిత కథ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
తీవ్రమైన గుండెపోటు నుంచి కాపాడింది అదే: సుస్మితాసేన్
మాజీ మిస్‌వరల్డ్, నటి సుస్మితాసేన్ ఇటీవల తీవ్ర గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆమెకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేసి, స్టంట్ వేశారు. దీంతో ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. అయితే తన తాజా ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు సుస్మితాసేన్. ‘‘ఇటీవల నేను తీవ్ర గుండెపోటుకు గురయ్యాను. ప్రధాన రక్తనాళం 95 శాతం క్లోజ్ అయ్యింది. వైద్యులు నా కోసం ఎంతో శ్రమించారు. హాస్పిటల్ సిబ్బందికి, నా కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు. నా గొంతు ఇప్పుడు సరిగ్గాలేదు. కానీ భయడాల్సిన పనేంలేదు. చిన్న ఇన్ఫెక్షన్ మాత్రమే. ఇటీవల ఎక్కువగా గుండెపోటు కేసులు నమోదు కావడాన్ని గమనిస్తున్నాం. దయచేసి వ్యాయామాలు చేయండి. జిమ్‌కు వెళ్లడం వల్ల ఏం ఉపయోగం లేదని కొందరు భావిస్తుంటారు. కానీ, నా విషయంలో వ్యాయామాలు చేయడం ఉపయోగపడింది. ఓ యాక్టివ్ లైఫ్‌ను లీడ్ చేస్తున్నందునే ఈ ప్రమాదం నుంచి బయటపడగలిగాను. నా ఆరోగ్యం గురించి వైద్యులు ఓకే చెప్పగానే ‘ఆర్య’ లేటెస్ట్ సీజన్ కోసం జైపూర్ వెళ్తాను. ‘తాలి’ సినిమాకు డబ్బింగ్ చెప్పాల్సి ఉంది’’ అన్నారు సుస్మితాసేన్. -
సుస్మితా హెల్త్ అప్డేట్.. 95 శాతం రక్తనాళం మూసుకుపోయింది: నటి
మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్ ఇటీవల గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఇటీవల ఆమె ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించగా వైద్యులు శస్త్ర చికిత్స చేసి స్టంట్ వేసినట్లు ఆమె తెలిపింది. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సుస్మితా తన ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసింది. చదవండి: భారీ బందోబస్తు మధ్య అత్తారింటికి మనోజ్.. వీడియో, ఫొటోలు వైరల్ ఈ సందర్భంగా తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ‘ఇటీవల నేను తీవ్రమైన గుండెపోటుకు గురయ్యాను. 95 శాతం ప్రధాన రక్తనాళం మూసుకుపోవడంతో ఒక్కసారిగా నొప్పికి కుప్పకూలిపోయాను. దీంతో నన్ను ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు, ఇతర సిబ్బంది ఎంతగానో శ్రమించి.. ప్రమాదం నుంచి బయటపడేలా చేశారు. నా కుటుంబసభ్యులు, ఆప్తులకు మాత్రమే ఈ విషయం తెలుసు. అయితే, చికిత్స పొందుతున్న సమయంలో ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పాలనుకోలేదు. చదవండి: కొత్త జంట మనోజ్-మౌనికలపై మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్ కోలుకున్న అనంతరం సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టాను. దాన్ని చూసి.. ‘గెట్ వెల్ సూన్’ అంటూ ఎంతోమంది పోస్టులు పెట్టారు. నాపై ఇంత ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే నాకు చికిత్స అందించి వైద్యులకు ధన్యవాదాలు. త్వరలోనే ‘ఆర్య-3’ షూటింగ్లో పాల్గొంటాను. మీ అందరిని అలరిస్తా’’ అంటూ సుస్మితా చెప్పుకొచ్చిది. అలాగే గడిచిన కొంతకాలంగా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని , తనపై చూపించినట్టే ప్రతి ఒక్కరిపై ప్రేమ చూపించండిన ఆమె కోరింది. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
సుష్మితా సేన్‌కు గుండెపోటు, వెల్లడించిన నటి
అప్పటిదాకా నవ్వుతూ, తుళ్లుతూ ఉన్నవాళ్లు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. ఏమైందని ఆలోచించేలోపే ప్రాణాలు గాల్లో వదిలేస్తున్నారు. ఇటీవలి కాలంలో గుండెపోటుకు గురయ్యేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. తక్షణమే స్పందిస్తే వారిని కాపాడుకోగలమని పరిస్థితి చేయిదాటిపోతే ఏమీ చేయలేమని వైద్యులంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటి సుష్మితా సేన్ తాను కూడా గుండెపోటుకు గురయ్యానని చెప్తూ బాంబు పేల్చింది. 'మీ గుండెను పదిలంగా కాపాడుకోండి, అప్పుడే అది ఆపత్కాలంలో మిమ్మల్ని కాపాడుతుంది.. ఈ మంచి మాట నాన్న చెప్పేవాడు. కొద్దిరోజుల క్రితం నాకు గుండెపోటు వచ్చింది. ఆంజియోప్లాస్టీ జరిగింది. స్టంట్ వేశారు. డాక్టర్ ఏమన్నాడో తెలుసా? నాకు విశాలమైన హృదయం ఉందట! ప్రస్తుతం నేను బాగున్నాను.. మిగిలిన జీవితాన్ని కొనసాగించేందుకు రెడీగా ఉన్నాను' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన తండ్రితో కలిసి దిగిన ఫోటో షేర్ చేసింది. దీనికి గాడ్ ఈజ్ గ్రేట్ అన్న క్యాప్షన్‌ను జోడించింది. దీనిపై సోఫీ చౌదరి స్పందిస్తూ.. ఓ మై గాడ్.. నీకు అనంతమైన ప్రేమను పంపిస్తున్నాను. నువ్వు, నీ గుండె అన్నింటికన్నా ధృడమైనది అని కామెంట్ చేసింది. మిగతా నెటిజన్లు, సెలబ్రిటీలు సైతం జాగ్రత్తగా ఉండండి, త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా సుష్మితా సేన్ చివరగా ఆర్య 2 వెబ్ సిరీస్‌లో నటించింది. మూడో సీజన్‌కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసేసింది. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
ఖరీదైన కారు కొన్న మాజీ విశ్వసుందరి.. ఎన్ని కోట్లో తెలుసా?
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ గురించి బీ టౌన్లో పరిచయం అక్కర్లేదు. గతంలో ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోదీతో ప్రేమాయణం సాగించింది. అప్పట్లో సోషల్ మీడియాలో వీరి ఫోటోలు కూడా తెగ వైరలయ్యాయి. సుష్మితా సేన్ 1994లో విశ్వ సుందరి పోటీలో విజేతగా నిలిచింది. హిందీ, తమిళ, తెలుగు సినిమాలలో నటించింది. అయితే సుస్మితా సేన్ తాజాగా ఓ ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. తనకు తానే గిఫ్ట్ ఇచ్చుకున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. డ్రైవింగ్‌ను ఇష్టపడే మహిళగా ఈ బహుమతి ఇచ్చుకున్నానని సోషల్ మీడియాలో వెల్లడించింది. సుస్మితా సేన్ కొన్న కారు ధర రూ.1.92 కోట్లుగా ఉంది. సుస్మితా సేన్ ప్రస్తుతం ఆర్య -3 అనే సీరియల్లో నటిస్తోంది. రామ్ మాధ్వాని దర్శకత్వం వహించిన ఈ ధారావాహికలో నమిత్ దాస్, మనీష్ చౌదరి, సికందర్ ఖేర్, వినోద్ రావత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు, ఈ షో రెండో సీజన్ డిసెంబర్ 2021లో విడుదలైంది. మూడో సీజన్ విడుదల తేదీని వెల్లడించలేదు. ఇది కాకుండా, సుస్మిత తాళి అనే కొత్త వెబ్ సిరీస్‌లో నటించనుంది. ట్రాన్స్‌జెండర్ కార్యకర్త గౌరీ సావంత్ పాత్రలో కనిపించనుంది. -
పబ్లిక్‌గా అసభ్యంగా టచ్ చేశాడు, కానీ అరిచి గోల చేయలేదు: సుష్మితా
మాజీ విశ్వసుందరి, నటి సుష్మితా సేన్ నేడు 47వ పడిలోకి అడుగుపెట్టింది. ఎన్నో హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆమెకు ఎప్పుడు? ఎలా? మాట్లాడాలన్నది వెన్నతో పెట్టిన విద్య. ఓసారి ఓ అబ్బాయి తనతో అనుచితంగా ప్రవర్తించినప్పుడు సుష్మితా అతడిని దోషిగా నిలబెట్టకుండా తనలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నించింది. తప్పు చేశాడని దోషిగా నిలబెడితే అతడి భవిష్యత్తు ఏమైపోతుందోనని ఆలోచించి తనకు రెండు మంచి మాటలు చెప్పింది. ఇంతకీ ఆ సంఘటన ఏంటో ఆమె మాటల్లోనే.. 'ఒక ఈవెంట్లో నా చుట్టూ చాలామంది అబ్బాయిలు గుమిగూడి ఉన్నారు. ఒక చేయి పదేపదే నన్ను అసభ్యంగా తాకడానికి ప్రయత్నిస్తోంది. వెంటనే ఆ చెయ్యి పట్టుకుని ముందుకు లాగాను. తీరా పదిహేనేళ్ల పిల్లవాడు నా ముందుండటంతో షాకయ్యాను. అతడు చేసిన పనికి నేను ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. కానీ అలా చేయలేదు. అందరి ముందు అతడికి హలో చెప్పి పక్కకు తీసుకెళ్లాను. ఇప్పుడే, ఈ క్షణమే అరిచి, ఏడ్చి గోల చేశాననుకో.. నీ జీవితమే నీకు లేకుండా పోతుంది. అది నీకు ఓకేనా అంటే అతడు వద్దని అడ్డంగా తలూపాడు. అంతేకాదు, ఇంకెప్పుడూ ఇలా ప్రవర్తించనని మాటిచ్చాడు. పిల్లలకు అలా ప్రవర్తించడం సరదా కాదని, పెద్ద తప్పని చెప్పాలి. అవి మనమే వారికి దగ్గరుండి నేర్పించాలి' అని చెప్పుకొచ్చింది. కాగా సుష్మితా చివరగా ఆర్య వెబ్‌సిరీస్‌లో కనిపించింది. ప్రస్తుతం ఆమె తాళిలో ట్రాన్స్ వుమెన్‌గా నటిస్తోంది. చదవండి: ప్రియురాలి కోసం వంద కోట్లు ఖర్చు చేస్తున్న హృతిక్ రోషన్ మహేశ్‌బాబు పాటకు కృతీసనన్ డ్యాన్స్, వైరల్ -
రాజీవ్ వల్ల నా కెరీర్ నాశనమైంది.. భర్త వేధింపులపై తొలిసారి నోరు విప్పిన నటి
మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ విడాకులు వ్యవహరం మరోసారి వార్తల్లో నిలిచింది. సుష్మితా తమ్ముడు రాజీవ్ సేన్ టీవీ నటి చారు అసోపాను 2019లో జూన్‌లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసింది. ప్రస్తుతం వారికి 11 నెలల కూతురు ఉంది. అయితే పెళ్లయిన ఏడాదిన్నరగే విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చారు. అయితే తమ కూతురి కోసం కలిసి ఉండాలనుకుంటున్నామంటూ ఇటీవల తమ విడాకులను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రకటించిన రెండు నెలలకే మళ్లీ ఈ జంట విడిపోతున్నామంటూ తాజాగా మరో ప్రకటన చేసింది. తాజాగా దీనిపై నటి చారు అసోపా స్పందించింది. ముంబై మీడియాతో ముచ్చటించిన ఆమె తన భర్త రాజీవ్ సేన్ పెట్టిన ఇబ్బందులపై తొలిసారి నోరు విప్పింది. తన భర్త వల కెరీర్ నాశనమైందంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది. అంతేకాదు తన ప్రెగ్నెన్సీ సమయంలో రాజీవ్ తనని మోసం చేశాడంటూ ఆమె వాపోయింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘వివాహమైన నాటి నుంచి రాజీవ్ నన్ను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాడు. అతడి వల్ల మానసికంగా కృంగిపోయాను. పెళ్లయిన కొద్ది రోజులకే మా మధ్య గొడవలు మొదలయ్యాను. అలా గొడవ జరిగిన ప్రతిసారి రాజీవ్ నన్ను వదిలి వెళ్లిపోయేవాడు. కరోనా సమయంలో కూడా మూడు నెలలు నాకు దూరంగా వెళ్లిపోయాడు. ఫోన్ నంబర్లు బ్లాక్ చేశాడు. అతడు ఏమైపోయాడో తెలియక ఆందోళనకు గురయ్యాను’ అని చెప్పింది. అలాగే ‘‘ఆ బాధ నుంచి బయటపడటం కోసం మళ్లీ వర్క్‌పై దృష్టి పెట్టాను. ‘అక్బర్ కా బల్ బీర్బల్’తో తిరిగి షూటింగ్ పాల్గొన్న. అయితే నేను వర్క్ చేయడం మొదలుపెట్టిన కొన్నిరోజులకే రాజీవ్ తిరిగి వచ్చాడు. నా వర్క్ విషయంలో జోక్యం చేసుకోవడం మొదలు పెట్టాడు. నాకు దూరంగా ఉండాలంటూ నా కోస్టార్స్ అందరికీ మెసేజ్‌లు పెట్టడం, బెదిరించడం చేశాడు. రాజీవ్ తీరుకు నన్ను ఓ సమస్యలా భావించిన నిర్మాతలు షో నుంచి తొలగించేశారు. దీంతో నేను విడాకులకు అప్లయ్ చేశాను. విడాకులు వద్దని, నన్ను బాగా చూసుకుంటానని రాజీవ్ మాట ఇవ్వడంతో విడాకుల పత్రాలను వెనక్కి తీసుకున్నా. అయినా రాజీవ్ తన తీరు మార్చుకోలేదు. కొన్నిరోజులకే మళ్లీ నన్ను వేధించడం మొదలు పెట్టాడు. అందుకే ఇప్పుడు అతడితో విడిపోవాలని నిర్ణయించుకున్నా’’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. -
మరోసారి మాజీ ప్రియుడితో సుష్మితా, నటిపై నెటిజన్ల అసహనం
మాజీ విశ్వసుందరి, నటి సుష్మితా సేన్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. నటిగా కంటే కూడా బాయ్‌ఫ్రెండ్స్ వ్యవహరంలోనే ఆమె సోషల్ మీడియాల్లో చర్చనీయాంశం అవుతోంది. తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన రొహ్మాన్ షాల్‌తో కొన్నేళ్ల డేటింగ్ అనంతరం గతేడాది బ్రేకప్ చెప్పినట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీతో ప్రేమలో పడినట్లు రీసెంట్గా వార్తలు వచ్చాయి. అంతేకాదు వారిద్దరు కలిసి మాల్దీవుల పర్యాటనకు వెళ్లిన ఫొటోలను లలిత్ మోదీ షేర్ చేస్తూ.. లైఫ్ పార్ట్నర్ అని పేర్కొన్నాడు. దీంతో మోదీతో సుస్మితా డేటింగ్ అంటూ ఆమె వార్తలోకెక్కింది. చదవండి: న్యూయార్క్‌లో స్కూళ్లకు దీపావళి సెలవు.. ప్రియాంకా చోప్రా హర్షం ఇదిలా ఉంటే వీరి ప్రేమ మున్నాళ్ల ముచ్చటగానే నిలిచింది. లలిత్‌కు సుస్మితా బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె మాజీ ప్రియుడు రొహ్మన్తో కలిసి సుస్మితా తరచూ దర్శనమిస్తోంది. ఫ్యామిలీ ఫంక్షన్స్, ఈవెంట్స్‌తో పాటు ముంబై రోడ్లపై తరుచూ వీరిద్దరు కెమెరాకు చిక్కుతున్నారు. తాజాగా మరోసారి జంటగా దర్శనమిచ్చారు. ఇటీవల జరిగిన ఓ ప్రముఖ డాక్టర్ల కుమార్తె పెళ్లి వేడుకలో సుష్మితా, రోహ్మన్లు హజరయ్యారు. వీరితో పాటు సుష్మితా దత్తత కుమార్తెలు రెనీ, అలీషా కూడా ఉన్నారు. రిసెప్షన్‌కు హాజరై కొత్త జంటతో కలిసి ఫొటోలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అది చూసి నెటిజన్లు సుష్మితాపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకప్ అనంతరం కూడా వీరిద్దరు కలిసే ఉంటున్నారా? ఇంతకీ సుస్మితా, రోహ్మాన్‌కు బ్రేకప్ చెప్పిందా? లేదా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. -
ట్రాన్స్‌జెండర్‌గా ప్రముఖ బాలీవుడ్ నటి.. లుక్ చూశారా?
బాలీవుడ్ పాపులర్ నటి సుష్మితా సేన్ ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తుంది. 'తాలి' అనే వెబ్‌సిరీస్ కోసం ఆమె ప్రముఖ ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ గౌరీ సావంత్ పాత్రను పోషిస్తుంది. తాజాగా ఈ వెబ్‌సిరీస్ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో సుష్మితా ఆకుపచ్చని చీరలో నుదిటిపై ఎర్రటి తిలకంతో బోల్డ్లుక్లో కనిపిస్తుంది. 'అందమైన వ్యక్తి కథను అంతే అందంగా ఈ ప్రపంచంలోకి తీసుకురావడం కన్నా సంతోషం ఏముంటుంది' అంటూ సుష్మితా తాలి ఫస్ట్‌లుక్ పోస్టర్ని తన సోషల్ మీడియా పంచుకుంది. కాగా గౌరీ సావంత్ ముంబైకి చెందిన ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్. గణేష్‌గా పుట్టి ఆ తర్వాత లింగమార్పిడి చేయించుకున్న గౌరీ సావంత్ 2013లో ట్రాన్స్‌జెండర్స్‌ని కూడా పురుషులు, మహిళలు లాగే ఓ ప్రత్యేక క్యాటగిరి కల్పించాలని పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు ట్రాన్స్‌జెండర్స్‌ని థర్డ్‌జెండర్‌గా గుర్తిస్తూ 2014లో తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
ఇద్దరు మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో సుష్మితా సేన్ పార్టీ!
మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్, ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ విడిపోయారంటూ బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు సుష్మితా మొన్నటినుంచి తన మాజీ బాయ్‌ఫ్రెండ్ రోహ్మన్షాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. తాజాగా ఆమె కూతురు రినీ సేన్ బర్త్‌డే గ్రాండ్‌గా జరిగింది. ఈ పార్టీకి రోహ్మన్తో పాటు తన మరో మాజీ ప్రియుడు రితిక్ భాసిన్ కూడా వచ్చాడు. ఈ మేరకు పలు ఫొటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా వదిలింది. 'సెప్టెంబర్ 4న నా ఫస్ట్ లవ్ రినీ సేన్ 23వ పుట్టినరోజు జరుపుకుంది. నా కుటుంబసభ్యులు, రినీ ఫ్రెండ్స్‌తో రాత్రి పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేశాం. రినీ బర్త్‌డేను ఇంత అద్భుతంగా సెలబ్రేట్ చేసిన రితిక్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఐ లవ్యూ గయ్స్' అని రాసుకొచ్చింది. సుష్మిత కూతురు పుట్టినరోజున లలిత్ రాలేదు, కానీ ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్స్ రావడం ఏంటో? వారితో పార్టీ చేసుకోవడమేంటో అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) చదవండి: బిగ్‌బాస్ 6: నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే! ఐశ్వర్యపై నెటిజన్ల ప్రశంసలు -
లలిత్ మోదీకి కూడా సుస్మితా బ్రేకప్ చెప్పిందా? అసలేం జరిగింది!
ఐపీలఎల్ సృష్టికర్త లలిత్ మోదీ, మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ డేటింగ్ ఇటీవల హాట్‌టాపిక్‌గా నిలిచింది. సుష్మితతో తను ప్రేమలో ఉన్నట్లు లలిత్ మోదీ గత జూలైలో ప్రకటించిన సంగతి తెలిసిందే. సుష్మితను తన జీవిత భాగస్వామిగా పేర్కొంటూ వారద్దరు వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలు షేర్ చేశాడు లలిత్ మోదీ. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకోబుతున్నారని అంతా అనుకున్నారు. దీంతో లేటు వయసులో ప్రేమ ఏంటని నెటిజన్లు వీరిని దారుణంగా ట్రోల్ చేయడంతో వీరి ప్రేమయాణంలో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చదవండి: సినీ ప్రియులకు ‘ఐబొమ్మ’ బిగ్ షాక్.. ఆ రోజు నుంచి శాశ్వతంగా సేవలు బంద్ అయితా తాజాగా వీరి ప్రేమ మూన్నాళ్ల ముచ్చట అయినట్లు తెలుస్తోంది. సుస్మితా, లలిత్ మోదీలు బ్రేకప్ చెప్పుకున్నారంటూ బాలీవుడ్ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణంగా లలిత్ మోదీ తన ఇన్‌స్టా బయోలో సుస్మితా పేరు తొలగించడమే. ఇది చూసి వీరిద్దరి విడిపోయారని అంతా అభిప్రాయపడుతున్నారు. కాగా గత జూలై 14న సుస్మితాతో తాను ప్రేమ ఉన్నట్లు ప్రకటించిన లలిత్ మోదీ.. తన ఇన్స్టాబయోలో సుస్మితని తన లైఫ్ పార్ట్నర్ పేర్కొన్నాడు. ఇన్‌స్టా బయోలో ‘ఇండియన్ ప్రిమీయర్ లీగ్ ఫౌండర్ చివరికి తన లైఫ్ పార్ట్నర్ని కనుగొన్నాడు. చదవండి: తిరుమల కొండపై నటి అర్చన రచ్చ.. స్పందించిన టీటీడీ మై లవ్ సుష్మితా’(Founder @iplt20 INDIAN PREMIER LEAGUE - finally starting a new life with my partner in crime. My love @sushmitasen47) అని రాశాడు. ఇర ఈ సోమవారం తన బయోలో సుస్మితా పేరు తొలగించి ‘ఫౌండర్ @iplt20 ఇండియన్ ప్రీమియర్ లీగ్. మూన్’ (Founder @iplt20 INDIAN PREMIER LEAGUE - Moon) అని మాత్రమే పెట్టాడు. అంతేకాదు సుష్మితాతో ఉన్న ఫొటోను ఇన్‌స్టా ప్రోఫైల్గా పెట్టుకున్న లలిత్ మోదీ ఆ ఫొటోని కూడా మర్చేయడం చర్చనీయాంశమైంది. ఇదంతా చూసి వారిద్దరు విడిపోయారా? అసలేం ఏం జరింగింది? అంటూ అంతా సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ బ్రేకప్ రూమర్స్‌పై లలిత్ మోదీ, సస్మితాలు ఎలా స్పందిస్తారో చూడాలి. -
రీసెంట్గా విడాకుల ప్రకటన.. ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పిన బాలీవుడ్ జంట
నటి సుష్మితా సేన్ తమ్ముడు, మోడల్ రాజీవ్ సేన్ తన భార్య, నటి చారు అసోపాతో విడిపోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు రాజీవ్‌తో విడాకులు తీసుకుంటున్న మాట నిజమేనంటూ చారు అసోప సైతం స్పష్టం చేసింది. రాజీవ్‌కు విడాకుల నోటీసులు కూడా పంపానని ఆమె పేర్కొంది. దీంతో వీరిద్దరి విడాకులు ఖాయమని అంతా అనుకుంటున్నా క్రమంలో తాము ఒక్కటయ్యామంటు గుడ్‌న్యూస్ అందించింది ఈ జంట. తమ కూతురు జియానా కోసం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా వేదిక ఈ జంట తెలిపింది. చదవండి: ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం, సింగర్ దుర్మరణం వినాయక చవితి సందర్భంగా ఇంట్లో పూజ నిర్వహించిన ఈ జంట కూతురు జియానాతో ఉన్న ఫొటోను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా తమ విడాకుల ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ‘పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయంటారు. అయితే దానిని మేం అమలు చేయడమే మిగిలి ఉంది. అవును.. మా వివాహ బంధానికి మేం స్వస్తి చెప్పాలనుకున్నాం. మా నిర్ణయాన్ని కూడా ప్రకటించాం. ఇక మా మధ్య ఏం లేదు, మేం చివరి దశకు చేరుకున్నామని అనుకున్నాం. కానీ మా విడాకుల నిర్ణయాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నాం. విడాకులు అనేవి మా ఎంపిక మాత్రమే అని గ్రహించాం’ అన్నారు. చదవండి: అందుకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది: కత్రినా కైఫ్ అలాగే ‘ఇకపై మా వైవాహిక జీవితాన్ని సంతోషంగా కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చాం. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. తల్లిదండ్రులుగా మా కూతురు జియానాకు ఉత్తమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. తన భవిష్యత్తు, సంతోషమే మా మొదటి ప్రాధాన్యత.. జంటగా మాకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూ వస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రేమతో మా కూతురిని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞులం’ అంటూ వారు తమ పోస్ట్‌లో రాసుకొచ్చారు. కాగా గతంలో కూడా ఈ జంట విడాకుల ప్రకటన ఇచ్చి మళ్లీ వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. 2019 జూన్‌లో రాజీవ్-అసోపాల పెళ్లి జరగగా గతేడాది నవంబర్‌లో వీరికి జియానా జన్మించింది. View this post on Instagram A post shared by Charu Asopa Sen (@asopacharu) -
మాజీ బాయ్‌ప్రెండ్‌తో సుష్మితా సేన్ షాపింగ్, వీడియో వైరల్
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుష్మితా సేన్ వృత్తిపరమైన విషయాలకంటే కూడా వ్యక్తిగత విషయాలతోనే తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో లవ్‌లో పడ్డనాటి నుంచి సుష్మిత ప్రతి కదలిక మీద కన్నేసారు నెటిజన్లు. ఈ క్రమంలో పలుమార్లు తన మాజీ బాయ్‌ఫ్రెండ్ రోహ్మన్ షాతో షాపింగ్‌లు, సినిమాలకు వెళ్లడం చూసి ముక్కున వేలేసుకున్నారు. కొందరు మాత్రం బ్రేకప్ తర్వాత ఫ్రెండ్స్‌గా ఉండకూడదా? ఏంటని సుష్మితను సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ నటి తన కూతురు రినీ సేన్, మాజీ ప్రియుడు రోహ్మన్తో కలిసి షాపింగ్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా కెమెరా కంట పడ్డ ఈ బ్యూటీ రినీ, రోహ్మన్తో కలిసి ఫొటోలను పోజులిచ్చింది. కూతురు అలిషా బర్త్‌డే కోసం షాపింగ్ చేస్తున్నామని వెల్లడించింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు పలువిధాలుగా స్పందిస్తున్నారు. 'నువ్విలా నీ మాజీతో తిరుగుతుంటే అది చూసిన లలిత్ మోదీ ఏమైపోవాలి?', 'అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు'', 'అబ్బా.. వాళ్లిద్దరూ ఒకప్పుడు లవర్స్, ఇప్పుడు మంచి ఫ్రెండ్స్' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా సుష్మిత రినీ, అలిషా అనే ఇద్దరు కూతుళ్లను దత్తత తీసుకుని పెంచుకుంటోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె ఇటీవలే ఆర్య 2 వెబ్‌సిరీస్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే! View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: టాలీవుడ్లో విషాదం, సీనియర్ హీరో కన్నుమూత విజయ్‌కు తలపొగరు అన్నాడు, సారీ చెప్పాడు -
ఆమె అంటే క్రష్, ఆ స్టార్ హీరోయిన్‌తో నటించాలని ఉంది: నాగ చైతన్య
అక్కినేను హీరో నాగ చైతన్య బాలీవుడ్ తొలి చిత్రం లాల్ సింగ్ చడ్డా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమాలో చై పాత్రకు మాత్రం మంచి స్పందన వస్తోంది. బాలరాజుగా చై అద్భుతంగా నటించాడంటూ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇక ఈ మూవీ రిలీజ్‌కు ముందు నుంచే చై వరుస ఇంటర్య్వూలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విడాకులు, మాజీ భార్య సమంత గురించి, తన వ్యక్తిగత విషయాలపై చై చేసే వ్యాఖ్యలు ఆసక్తికని సంతరించుకుంటున్నాయి. చదవండి: రూ. 2 కోట్లు ఇస్తే రిటర్న్ పంపించాడు: విజయ్‌పై పూరీ ఆసక్తికర వ్యాఖ్యలు దీంతో అతడి కామెంట్స్ హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ చానల్‌తో ముచ్చటించిన చైకి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. కాగా లాల్ సింగ్ చడ్డా మూవీతో చై బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో భవిష్యత్తులో అక్కడ హీరోగా చేస్తే ఏ హీరోయిన్స్‌తో కలిసి నటించాలని ఉందనే ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు స్పందిస్తూ.. ఆలియా భట్, కత్రీనా కైఫ్, ప్రియాంక చోప్రాల పేర్లు చెప్పాడు. అనంతరం ‘ఇంకా చాలామంది హీరోయిన్లు ఉన్నారు. వారందరితో కలిసి పని చేయాలని ఉంది. అందులో ముఖ్యంగా ఆలియా భట్ నటన అంటే నాకు చాలా ఇష్టం. చదవండి: ఆమిర్‌కు మద్దతు.. స్టార్ హీరోకు బాయ్‌కాట్ సెగ ఐ లవ్ హర్ యాక్టింగ్. ఒకవేళ తనతో నటించే అవకాశం వస్తే అసలు వదులుకోను’ అంటూ మనసులో మాట చెప్పాడు. మనం సినిమా హిందీలో రీమేక్ అయితే తన పాత్ర ఎవరు చేస్తే బాటుందని అడగ్గా.. రణ్‌బీర్ అని సమాధానం ఇచ్చాడు. ఇక సెలబ్రెటీ క్రష్ ఎవరని అడగ్గా.. మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ అని బదులిచ్చాడు చై. కాగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రం విడుదలై వారం రోజులు గడిచిన ఇప్పటికి ఇండియన్ బాక్సాఫీసు వద్ద రూ. 37.96 కోట్లు మాత్రమే వసూలు చేసింది. -
లలిత్ మోదీతో డేటింగ్, మాజీ ప్రియుడితో మీడియాకు చిక్కిన సుష్మితా
గత కొద్ది రోజులుగా మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ వార్తల్లో నిలుస్తోంది. ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఆమెపై తరచూ ఏదోక వార్త నెట్టింట సందడి చేస్తోంది. తామిద్దరం ప్రేమలో ఉన్నామని, త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్లు ఇటీవల లలిత్ మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వీరి డేటింగ్‌పై సోషల్ మీడియా తీవ్ర చర్చ జరిగింది. అంతేకాదు నెటిజన్ల నుంచి వీరు ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుష్మితా తన మాజీ ప్రియుడితో మీడియాకు చిక్కింది. చదవండి: షూటింగ్లో ప్రమాదం.. హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు నేడు(ఆగస్ట్ 11) ఆమిర్ ఖాన్, నాగ చైతన్య ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ రిలీజ్ నేపథ్యంలో నిన్న నిర్వహించిన ప్రీమియర్ షోకు సుష్మితా తన పిల్లలు రినీ సేన్, అలిషా సేన్లతో కలిసి వచ్చింది. అయితే వారితో పాటు ఆమె మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్ కూడా కనిపించాడు. ప్రస్తుం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రోహ్మాన్ సుస్మితా, ఆమె పిల్లలతో కలిసి చాలా సరదాగా కనిపించాడు. కాగా రోహ్మాన్తో బ్రేక్ప్ అనంతరం లలిత్ మోదీతో డేటింగ్ చేస్తున్న సుష్మితా మూవీ షోలో మాజీ ప్రియుడితో కనిపించడంతో మరోసారి ఆమె వార్తల్లో నిలిచింది. చదవండి: నటుడికి గుండెపోటు, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న వైద్యులు కాగా రోహ్మాన్, సుష్మితాలు కొన్నేళ్ల డేటింగ్ అనంతరం గత డిసెంబర్లో బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆగస్ట్ 8న సుష్మితా తల్లి బర్త్‌డే వేడుకులో కూడా రోహ్మాన్ దర్శనం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు కలిసి జరపుకున్న ఈ వేడుకకు సంబంధించి లైవ్ వీడియో షేర్ చేసింది సుష్మితా. ఇందులో రోహ్మాన్, సుష్మితా పిల్లలతో కలిసి మాట్లాడుతూ కనిపించాడు. అయితే అందరు కెమెరా సైడ్ చూడండి అని సుష్మితా అనగానే రోహ్మాన్ ఫ్రేం నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇది చూసి నెటిజన్లంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరి మీ ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ లలిత్ మోదీ ఎక్కడ అంటూ సుస్మితాను ట్రోల్ చేశారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
సుష్మితా సేన్ తమ్ముడితో విడాకులు నిజమే: నటి
బాలీవుడ్ టీవీ నటి చారు అసోపా భర్త రాజీవ్ సేన్‌తో విడాకులపై స్పందించారు. ఇప్పటికే లాయర్ ద్వారా విడాకుల నోటీసులు పంపానని, ఇక మళ్లీ అతనితో కలిసుండటం అన్నది అసాధ్యం అని పేర్కొంది. రీసెంట్గా రాజీవ్ చారు అసోపాతో కలిసున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంపై స్పందిస్తూ.. అతను అలా ఎందుకు చేశాడో తనకు తెలియదని, ఇప్పటికే తామిద్దం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరం బ్లాక్ చేసుకున్నట్లు తెలిపింది. అంతేకాకుండా రాజీవ్‌తో కలిసి ఉన్న ఫోటోలన్నింటిని తన అకౌంట్ నుంచి తొలిగించినట్లు పేర్కొంది. '2019లో రాజీవ్‌తో నా వివాహం జరిగింది. ఈ మూడేళ్లలో చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అతను ఇల్లు వదిలి వెళ్లిపోతాడే తప్పా పరిష్కరించాలని ఎప్పుడూ అనుకోడు. ఎన్నోసార్లు విడాకులు తీసుకోవద్దని అనుకున్నా. కానీ పరిస్థితులు చేయిదాటి పోయాయి.ఇక చేసేదీమీ లేదు. అందుకే మా పెళ్లిని రద్దు చేసుకోవాలనుకుంటున్నాం. ఇక తన మొదటి పెళ్లిని దాచాను అని రాజీవ్ అన్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదు. నా గతం గురించి మొత్తం చెప్పాకే అతడిని పెళ్లి చేసుకున్నా' అని చారు పేర్కొంది. ఇక తన ఆడపడుచు సుష్మితా సేన్‌తో మాత్రం తనకు మంచి అనుబంధం ఉందని, ఆమెతో తరచూ మాట్లాడతానని తెలిపింది. 'విడాకుల సమయంలో చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నా. సుష్మితా నాకు అండగా నిలబడింది. తనతో ఏదైనా షేర్ చేసుకునే ఫ్రెండ్షిప్ మా మధ్య ఉంది' అంటూ వెల్లడించింది. View this post on Instagram A post shared by Rajeev Sen (@rajeevsen9) -
నేనింకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం వారే: హీరోయిన్
మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో పలువురితో డేటింగ్ చేసిన ఈ 40 ఏళ్ల భామ తాజాగా వ్యాపారవేత్త, ఐపిఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో ప్రేమలో పడింది. దీంతో సుస్మితా-లలిత్‌ల ప్రేమ వ్యవహారం బి-టౌన్లో చర్చనీయాంశమైంది. అంతేకాదు ఈ విషయంలో సుష్మితాను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎంతోమందితో డేటింగ్ చేసిన ఆమె ఇప్పటికి పెళ్లి చేసుకోకపోవడం ఏంటని అందరిలో నెలకొన్న సందేహం ఇది. ఈ క్రమంలో తన పెళ్లిపై గతంలో ఓ ఇంటర్య్వూలో సుష్మితా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చదవండి: జాతీయ సినిమా అవార్డులు: ఆకాశం మెరిసింది ‘నేను నా జీవితంలో చాలా ఆసక్తికరమైన పురుషులను కలిశాను. వాళ్లల్లో నెలకొన్న నిరాశ, నిరుత్సాహమే నన్ను పెళ్లిచేసుకోకుండా చేసింది. కానీ, నేను ఎవ్వరితోనైనా రిలేషన్లో ఉన్నప్పుడు, నా పిల్లలు కూడా వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానించేరు. చూడటానికి నాకు ఇది కొత్తగా సంతోషంగా కూడా అనిపించేది. అయితే నా లైఫ్‌లో మూడు సార్లు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యా.. కానీ విధి వల్ల బయటపడ్డ. నన్ను నా ఇద్దరు పిల్లలను దేవుడు సురక్షితంగా చూసుకుంటున్నాడనే నమ్మకం నాకుంది’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా సుస్మితా 24ఏళ్ల వయసులోనే రీనా అనే ఆడపిల్లను దత్తత తీసుకోగా.. 2010లో అలీషా అనే మరో అమ్మయిని దత్తత తీసుకుని వారికి తల్లైంది. చదవండి: గోల్డ్ డిగ్గర్ అంటూ కామెంట్స్.. ట్రోలర్స్‌కి గట్టి కౌంటరిచ్చిన నటి -
సుష్మితను బతకనివ్వండి.. ట్రోలర్స్‌కు డైరెక్టర్ కౌంటర్
పక్కింటి పుల్లకూర రుచి అన్న సామెత తెలిసిందే కదా! పక్కింట్లోని వంటలే కాదు, వారి జీవితాల్లో తొంగి చూడటం కూడా సర్వసాధారణమైపోయింది ఈ రోజుల్లో! మరీ ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల్లో కూడా సాధారణ జనాల జోక్యం ఎక్కువైపోయిందీ రోజుల్లో.. వారు ఏం చేసినా తప్పుపట్టడమే తరువాయి అన్న చందంగా తయారైంది సోషల్ మీడియా. గత కొద్ది రోజులుగా నటి సుష్మితా సేన్, లలిత్ మోదీల ప్రేమ గురించైతే ఎన్ని పోస్టులు, మీమ్స్ వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె నిర్ణయాన్ని విమర్శిస్తూ ఇద్దరినీ తిట్టిపోసినవారే ఎక్కువమంది. అయితే ఈ వైఖరి అంత మంచిది కాదని విమర్శించాడు దర్శకుడు మహేశ్ భట్. అదే సమయంలో సుష్మిత ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. 'ఆమె తనకు నచ్చినట్లుగా బతుకుతోంది. ఎలాంటి కట్టుబాట్లు విధించుకోకుండా స్వేచ్ఛగా జీవిస్తోంది. అంతటి గట్స్ ఆమెకున్నాయి. తనను ఇప్పటికీ అసాధారణమైన వ్యక్తిగానే గుర్తుంచుకున్నాను. తనకు నచ్చినట్లుగా బతుకుతున్న ఆమె గుండె ధైర్యానికి నేను సెల్యూట్ చేయాల్సిందే! ఇంకా ఆమెను వేధించకుండా ఆమె బతుకేదో ఆమెను బతకనివ్వండి' అని ట్రోలర్స్‌కు గట్టి కౌంటరిచ్చాడు. గతంలో విక్రమ్ భట్‌తో నడిపిన ప్రేమాయణం గురించి చెప్తూ.. 'దస్తక్ సినిమా చేద్దామనుకున్నాను. అందుకామె ఓకే చెప్పింది. తర్వాతేం జరిగిందో మీకందరికీ తెలుసు. దస్తక్ షూటింగ్ సమయంలో సుష్మితా సేన్, విక్రమ్ భట్ ప్రేమించుకున్నారు. విక్రమ్ నాకు కుడిభుజంలా ఉండేవాడు. అతడిని ఆధారంగా చేసుకునే నేను నా పని పూర్తి చేసేవాడిని. సెట్స్‌లో ఆమెతో సరదాగా కలిసిపోయేవాడు. అలా వాళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైంది' అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు మహేశ్ భట్. చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో సిద్దార్థ్ షికార్లు.. ఫొటోలు తీసినవారికి హీరో వార్నింగ్! క్యాస్టింగ్ కౌచ్ వల్ల పెద్ద పెద్ద ప్రాజెక్టులు వదులుకున్నా.. -
ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు
Sushmita Sen Brother Rajeev Sen: మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ విషయం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు కారణం వ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో డేటింగ్ చేయడమే. అయితే తాజాగా సుష్మితా సేన్‌కు సంబంధించిన మరో విషయం చర్చనీయాంశమైంది. సుష్మితా తమ్ముడు రాజీవ్ సేన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో తను అన్‌ఫాలో చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాజీవ్, అతని భార్య చారు అసోపాతో వివాహమైన మూడేళ్లకే విడిపోయారు. వీరిద్దరు విడిపోవడంలో తప్పు రాజీవ్‌దేనని, అందుకే సుష్మితా సేన్ అతని మాజీ భార్య చారుకు సపోర్ట్ చేస్తుందని కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై తాజాగా రాజీవ్ స్పందించాడు. 'నా సోదరి నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వట్లేదని మీడియా చెబుతోంది. అసలు ఆమె ఎప్పుడూ నన్ను ఫాలో కాలేదు, కొత్తగా అన్‌ఫాలో చేయడానికి. ఈ వార్త నన్ను కలిచివేసింది. అందుకే ఈ విషయం గురించి నిజం చెప్పాల్సి వచ్చింది. సుష్మితా నన్ను కేవలం ఒక ట్విటర్లోనే ఫాలో అవుతోంది. అది కూడా చాలా కాలంగా. ఇక రెండో విషయం ఏంటంటే ? నా భార్య చారుని ఫాలో అవుతూ ఆమెకు సుష్మితా మద్దతుగా నిలిచిందని మీడియా పేర్కొంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే.. మా అక్క సుష్మితా చాలా తెలివైనది. మేము దేని గురించి నిలబడతామో ఆమెకు చాలా బాగా తెలుసు. అలాగే తను బాధితురాలిగా మెలగడంలో ఎంత గొప్ప నేర్పరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది' అని తెలిపాడు. మరి సుష్మితా సేన్ ఆమెను ఎందుకు ఫాలో అవుతుందని అడిగిన ప్రశ్నకు 'అది ఆమెనే అడిగి తెలుసుకోండి' అని సమాధానమిచ్చాడు. కాగా చారు అసోపా తన మొదటి పెళ్లి గురించి అతని దగ్గర దాచిందని గతంలో ఆరోపణలు చేశాడు రాజీవ్. అయితే ఇప్పుడు ఆమె మూవ్ ఆన్ అయిందని, ముంబైలో సంతోషంగా జీవిస్తున్నందుకు ఆనందిస్తున్నాను చెప్పుకొచ్చాడు. -
గోల్డ్ డిగ్గర్ అంటూ కామెంట్స్.. ట్రోలర్స్‌కి గట్టి కౌంటరిచ్చిన నటి
ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ, మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ డేటింగ్ ప్రస్తుతం బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇటీవల సుష్మితాను తన భాగస్వామిగా పేర్కొంటూ లలిత్ మోదీ ఫొటోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిని త్రీవస్థాయిలో ట్రోల్ చేయడం ప్రారంభించారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తమపై వస్తున్న ట్రోల్స్‌పై లలిత్ మోదీ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చాడు. మనమింకా మధ్య యుగం కాలంలోనే నివసిస్తున్నామా? ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉండకూడదా? ఒకవేళ వారి మధ్య కెమిస్ట్రీ కుదిరి కాలం కలిసి వస్తే.. అద్భుతం జరుగుతుంది కదా!.. నాదొక సలహా మీరు సంతోషంగా జీవించండి’’ అంటూ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నిత్యా మీనన్? ‘గోల్డ్ డిగ్గర్’(డబ్బు కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి) అంటూ సుష్మితను సైతం ట్రోల్ చేస్తున్నారు కొందరు. ఈ క్రమంలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై తాజాగా సుష్మితా సేన్ స్పందించింది. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘ప్రస్తుతం నా జీవితం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. నేను ఏం చేస్తున్నాననేది నా వ్యక్తిగతం. తాత్కాలిక ప్రశంసల కోసం నేను బతకడం లేదు. చూట్టు ఉన్న ప్రపంచం దయనీయకంగా మారుతోంది. అది చూస్తుంటే నాకు జాలేస్తోంది. నేను ఎప్పుడు కలవని, అసలు పరిచయమే లేని మిత్రులు, కొంతమంది మేధావులు నా జీవితంపై హక్కు ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. నేనే ఏం చేయాలి ఎలా ఉండాలో కూడా చెబుతున్నారు. నేను ఓ గోల్డ్ డిగ్గర్ అంటూ నాపై కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. కానీ నేను బంగారం కంటే డైమంట్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. అయితే వాటిని నేను సొంతంగా కొనుక్కోగలను కూడా. ఇప్పటికైనా మీకు అర్థమైందనుకుంటున్నా. ఇక మీ అందరు ఒక విషయం తెలుసుకోండి. మీ సుష్ బాగానే ఉందని తెలుసుకోండి. తాత్కాలిక ప్రశంసల కోసం నేను బతకడం లేదు. అయితే ఇన్ని విమర్శలు వస్తున్నా కూడా నాకు సపోర్ట్‌గా నిలిచిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు’ అంటూ సుష్మితా ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. కాగా లలిత్ మోదీతో సుష్మితా డేటింగ్ చేస్తున్న విషయం చెప్పినప్పటి నుంచి ఆమెపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. డబ్బు కోసమే ఆయన సుష్మితా డేటింగ్ చేస్తుందంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరూ ఆమె గత ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్‌లో చర్చిస్తున్నారు. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్స్‌గా ఉండకూడదా? పుట్టుకతోనే సంపన్నుడిని.. నన్నే అంటారా?
ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో తాను ప్రేమలో ఉన్నట్లు ప్రకటించి క్రీడా, సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాడు. సుస్మితను తన భాగస్వామి అని పేర్కొంటూ ఆయన షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు లలిత్ మోదీపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన లలిత్.. ఇప్పుడేమో కాలేజీ కుర్రాడిలా గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్నానంటూ ఫొటోలు షేర్ చేస్తున్నాడంటూ విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో సుస్మితతో తన రిలేషన్‌షిప్‌పై స్పందించిన లలిత్ మోదీ ఆదివారం ట్విటర్ వేదికగా విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా తన భార్య మినాల్ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ మండిపడ్డాడు. మధ్య యుగ కాలంలో ఉన్నామా? ఈ సందర్భంగా సుస్మితా సేన్, తన దివంగత భార్య మినాల్ మోదీ, కూతురు అలియా మోదీలతో పాటు నెల్సన్ మండేలా, దలైలామా, భారత ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా తదితర ప్రముఖులతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ కౌంటర్ ఇచ్చాడు. ఈ మేరకు.. ‘‘మనమింకా మధ్య యుగం కాలంలోనే నివసిస్తున్నామా? ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉండకూడదా? ఒకవేళ వారి మధ్య కెమిస్ట్రీ కుదిరి కాలం కలిసి వస్తే.. అద్భుతం జరుగుతుంది కదా!.. నాదొక సలహా మీరు సంతోషంగా జీవించండి.. ఇతరులను కూడా వాళ్ల బతుకు వారిని బతకనివ్వండి. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకుని వార్తలు రాయండి.. డొనాల్డ్ ట్రంప్ లాగా నకిలీ వార్తలు వ్యాప్తి చేయకండి’’ అంటూ మీడియాపై కూడా విరుచుకుపడ్డాడు. ఇక తన భార్య మినాల్ మోదీ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ప్రియమైన నా భార్య, దివంగత మినాల్ మోదీ.. మా పెళ్లి కంటే 12 ఏళ్ల ముందు నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్.. అందరూ అనుకుంటున్నట్లుగా తను మా అమ్మ స్నేహితురాలు కాదు. కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి చెత్త వార్తలు రాస్తున్నారు. మెదడు తక్కువ పనులు చేయొద్దు. ఎవరైనా ఓ వ్యక్తి తన దేశం కోసం.. లేదంటే వ్యక్తిగత జీవితంలో ఏదైనా సాధిస్తే ఎంజాయ్ చేయండి. మీ అందరి కంటే నేను బెటర్.. మీకంటే గొప్పగా తలెత్తుకుని తిరిగే అర్హత నాకుంది’’ అంటూ లలిత్ మోదీ సుదీర్ఘ నోట్ షేర్ చేశాడు. అదే విధంగా తనను ఆర్థిక నేరగాడు అని పిలిస్తే పట్టించుకోనన్న లలిత్ మోదీ.. తాను డైమండ్స్పూన్తో పుట్టానని.. పుట్టుకతోనే సంపన్నుడినని పేర్కొన్నాడు. తన వల్లే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుట్టుకొచ్చిందని.. దేశానికి తాను ఓ గొప్ప బహుమతి ఇచ్చానని చెప్పుకొచ్చాడు. కాగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్నాడు. ఇక సుస్మిత సేన్‌తో మాల్దీవుల్లో లలిత్ ఫొటోలు షేర్ చేస్తూ బెటర్ పార్ట్నర్ అనడంతో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. తాము ప్రేమలో ఉన్నామే తప్ప పెళ్లి చేసుకోలేదని వెల్లడించారు. కాగా సుస్మిత సైతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికపుడు తన అప్డేట్లు పంచుకుంటుందన్న సంగతి తెలిసిందే. చదవండి: Lalit Modi- Sushmita Sen: తనకంటే తొమ్మిదేళ్లు పెద్దది.. మినాల్‌ను పెళ్లాడేందుకు లలిత్ ఫైట్! చివరికి ఇలా! Too long to write so I put it on a picture slide. For those who don’t have instagram 🙏🏾 pic.twitter.com/v2sXCvyacn — Lalit Kumar Modi (@LalitKModi) July 17, 2022 View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
లలిత్ మోదీతో డేటింగ్‌పై సుష్మితా మాజీ ప్రియుడి స్పందన
వ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ నటి సుష్మితా సేన్ల డేటింగ్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. వారిద్దరు జంటగా మాల్దీవులు, లండన్ చూట్టేసిన ఫొటోలను షేర్ చేస్తూ తామిద్దరం ప్రేమలో ఉన్నామని ప్రకటించాడు లలీత్ మోదీ. సుష్మితా సైతం లలిత్ కుమార్‌తో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నానని, అయితే ఇప్పటికి పెళ్లి, నిశ్చితార్థం జరగలేదు.. కానీ సంతోషంగా ఉన్నానని చెప్పింది. చదవండి: Aadhi Pinisetty: మొదట్లో నిక్కీకి నాకు గొడవలు, మనస్పర్థలు.. ఆ తర్వాత.. అంతేకాదు షరతులు లేని ప్రేమ తనను చుట్టుముట్టేసిందంటూ లలిత్‌తో డేటింగ్‌పై సోషల్ మీడియాలో స్పష్టం చేసింది. దీంతో వీరిద్దర రిలేషన్‌పై బి-టౌన్లో ఎక్కడ చూసిన చర్చ జరుగుతోంది. అలాగే ఆమె మాజీ ప్రియుడు, మోడల్ రోహ్మాన్ షాల్ సైతం సుష్మితా తాజా ప్రేమపై స్పందించాడు. బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో అతడు మాట్లాడుతూ.. వారి ప్రేమ పట్ల మనం సంతోషంగా ఉందామని పిలుపునిచ్చాడు. చదవండి: లలిత్ మోదీ కంటే ముందు 9 మందితో సుష్మితా డేటింగ్, వారెవరంటే! ‘ప్రేమ చాలా అందంగా ఉంటుంది. సుస్మితా ఎవరినైనా ఎంచుకుందంటే.. ఖచ్చితంగా అతడు చాలా విలువైనవాడు అయ్యింటాడు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా మూడేళ్ల పాటు రిలేషన్లో ఉన్న సుష్మితా సేన్, రోహ్మాన్ షాల్లు ఇటీవల బ్రేకప్ చెప్పికున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సుష్మితా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ.. ‘స్నేహితులుగా మా ప్రయాణం ప్రారంభమైంది. ఇకపైనా అలాగే ఉంటాం. రిలేషన్షిప్ ముగిసి చాలాకాలమైంది. ప్రేమ మాత్రం ఉంది’ అంటూ రాసుకొచ్చింది. -
తనకంటే తొమ్మిదేళ్లు పెద్దదైన మినాల్‌ను పెళ్లాడేందుకు లలిత్ ఫైట్.. ఇప్పుడు ఇలా!
Lalit Modi Love Story With Minal: లలిత్ కుమార్ మోదీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టికర్తగా పేరు ప్రఖ్యాతులు పొందాడు. సినీ సెలబ్రిటీలు, కార్పొరేట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించి.. ప్రపంచ క్రికెటర్లందినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి క్యాష్ రిచ్ లీగ్‌ను సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్‌లు ఉన్నా ఐపీఎల్ విజయవంతం కావడంలో లలిత్ మోదీదే కీలకపాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన లలిత్ మోదీ.. ఒకప్పుడు ప్రపంచంలోని వంద శక్తిమంతుల జాబితాలో కూడా స్థానం సంపాదించడం విశేషం. అయితే, ఎంత వేగంగా కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నాడో అదే తరహాలో పాతాళానికి దిగజారిపోయాడు. ఆర్థిక అవకతవకలకు పాల్పడి దేశం నుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఆయన లండన్‌లో తలదాచుకుంటున్నాడు. మాజీ విశ్వసుందరితో ప్రేమాయణం! ఇక ఇన్నాళ్లూ పెద్దగా లైమ్‌లైట్‌లో లేని 58 ఏళ్ల లలిత్ మోదీ.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో డేటింగ్ అంటూ ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారాడు. ఆమెతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేస్తూ బెటర్ పార్ట్నర్ అంటూ చర్చకు తెరలేపాడు. PC: lalit modi Instagram ఈ క్రమంలో వీళ్లిద్దరి పెళ్లి అయి పోయిందని నెటిజన్లు ఫిక్సైపోగా అలాంటిదేమీ లేదని సుస్మిత, లలిత్ ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రేమలో మునిగితేలుతున్నామని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. కాగా 46 ఏళ్ల సుస్మితాసేన్ ఇప్పటికే ఎంతో మందితో డేటింగ్ చేసింది. సుస్మిత రూటు సెపరేటు! స్థాయి.. వయసుతో సంబంధం లేకుండా తన కంటే చిన్నవాళ్లూ, పెద్దవాళ్లతోనూ ప్రణయ బంధం కొనసాగించింది సుస్మిత. కానీ ఎవ్వరికీ తనను వివాహం చేసుకునే అవకాశం ఇవ్వలేదు. స్వేచ్ఛాయుత జీవనం గడపడానికే ఆమె ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం లలిత్‌తో ప్రేమ వ్యవహారం కూడా అలాంటిదేనా.. లేదంటే పెళ్లిదాకా వెళ్తారా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. PC: lalit modi Instagram కాగా సుస్మిత ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుని తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఇక లలిత్‌తో సుస్మిత పరిచయం ఈనాటిది కాదు. లలిత్ మోదీ దివంగత భార్య మినాల్ మోదీకి కూడా ఆమె ఫ్రెండ్ కావడం విశేషం. వీళ్లు ముగ్గురూ కలిసి ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేవారట. ఇంతకీ మినాల్ ఎవరు? మినాల్ సంగ్రాణి నైజీరియాకు చెందిన సింధీ హిందూ వ్యాపారవేత్త పెసూ అస్వాని కుమార్తె. లలిత్ మోదీతో స్నేహానికి కంటే ముందే ఆమెకు వివాహమైంది. వ్యాపారవేత్త జాక్ సాంగ్రాణిని ఆమె పెళ్లాడింది. వారికి కూతురు సంతానం. అయితే, జాక్ ఓ స్కామ్‌లో ఇరుక్కోవడంతో జైలుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్నాళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది. PC: lalit modi Instagram లలిత్ కంటే తొమ్మిదేళ్లు పెద్ద! భర్తకు విడాకులిచ్చిన మినాల్తో ప్రేమలో పడ్డ లలిత్ మోదీ ఆమెను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. అయితే, మోదీ కుటుంబం ఇందుకు అంగీకరించలేదు. ఆమె డివోర్సీ కావడం ఒక అభ్యంతరమైతే.. లలిత్ కంటే మినాల్ వయసులో దాదాపు తొమ్మిదేళ్లు పెద్దది కావడం మరో కారణం. కుటుంబాన్ని ఎదిరించి! అయినా, అతడు ఆమె చేయిని వీడలేదు. కుటుంబంతో విభేదించాడు. 1991లో మినాల్‌ను పెళ్లిచేసుకున్నాడు. దీంతో తన ఫ్యామిలీకి దూరమయ్యాడు. తమను అందరూ దూరం పెట్టడంతో ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే లలిత్- మినాల్లకు ఇద్దరు సంతానం. PC: lalit modi Instagram కొడుకు రుచిర్, కూతురు అలియా ఉంది. వీరితో పాటు మినాల్ మొదటి కూతురు కరిమా సంగ్రాణిని కూడా చేరదీశాడని జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కాగా క్యాన్సర్ బారిన పడ్డ మినాల్ ఆఖరి వరకు వ్యాధితో పోరాడి 64 ఏళ్ల వయస్సులో 2018లో కన్నుమూశారు. అప్పటి నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న లలిత్ మోదీ సుస్మితతో ప్రేమాయణంతో అటు క్రీడా, ఇటు సినీ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. చదవండి: Ire Vs NZ 3rd ODI: మొన్న టీమిండియాను.. ఇప్పుడు న్యూజిలాండ్‌ను వణికించారు! వరుస సెంచరీలతో.. Ind Vs Eng 2nd ODI: తప్పంతా వాళ్లదే.. అందుకే భారీ మూల్యం.. మైండ్‌సెట్ మారాలి! మూడో వన్డేలో గనుక ఓడితే.. -
లలిత్ మోదీ కంటే ముందు 9 మందితో సుష్మితా డేటింగ్, వారెవరంటే!
ప్రస్తుతం బాలీవుడ్లో సుష్మితా సేన్- లలిత్ మోదీలో ప్రేమ వ్యవహరం హాట్‌టాపిక్‌గా మారింది. తామిద్దరం డేటింగ్లో ఉన్నామని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నామంటూ లలిత్ మోదీ సోషల్ మీడియా వేదిక ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది తెలిసి అంతా అవాక్కవుతున్నారు. ఎన్నో ఏళ్ల కిందటే ఒకరికొకరు తెలుసు.. కానీ సడెన్‌గా వీరిమధ్య ప్రేమ ఏంటని అంతా షాక్ అవుతున్నారు. ఇక కొందరు నెటిజన్లు అయితే లేటు వయసులో ఈ ఘాటూ ప్రేమ ఏంటని ట్రోల్ చేస్తున్నారు. మొన్నటి వరకు తనకంటే 15 ఏళ్ల చిన్నవాడితో సహాజీవనం, ఇప్పుడు ముసలోడితో ప్రేమ అంటూ సుష్మితాపై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. చదవండి: బిగ్‌బాస్ క్రేజ్.. రూ. 1000 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన హీరో? అంతేకాదు ఆమె గతంతో ఎవరెవరితో ప్రేమ వ్యవహారం సాగించిందో కూడా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంతో ఆమె లలిత్ మోదీతో సహా 9 మందితో సహాజీవనం చేసినట్లు తెలుస్తోంది. కాగా ‘విశ్వ సుందరి’ కిరీటాన్ని గెలుచుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది సుష్మితా సేన్. అందాల పోటీల తర్వాత సుష్మితా నేరుగా సినిమా రంగంలో ల్యాండ్ అయింది. అలా స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆమె అందానికి, నటనకు ప్రేక్షకులతో పాటు ఓ క్రికెటర్, నటులు, బడా వ్యాపారవేత్తలు కూడా ఫిదా అయ్యారు. ఈ క్రమంలో సుష్మితా పలువురు నటులు, క్రికెటర్, వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది. చదవండి: ‘దళపతి’ విజయ్ కేసును ముగించిన హైకోర్టు అంతమందితో ప్రేమలో పడ్డ ఆమె కేవలం డేటింగ్ వరకు పరిమితమైంది. మొన్నటి దాక తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్ రోహ్మాన్ షాల్‌తోంది మూడేళ్లు సహాజీవనం చేసిన ఆమె గతంలో క్రికెటర్ వసీమ్ అక్రమ్, నటుడు రణ్‌దీప్ హుడా, డైరెక్టర్ విక్రమ్ భట్, ముద్దాసిర్, మానవ్ మీనన్‌లతో కొన్నేళ్ల పాలు సహాజీవనం చేసింది. ఇక బడా వ్యాపారవేత్తలైన రితిక్ ఖాసిన్, సబీర్, సంజయ్ నారంగ్, ఇంతియాజ్‌లతో కూడా గతంలో ఆమె డేటింగ్ చేసింది. కాగా ప్రస్తుతం సుష్మితా వయసు 46 కాగా.. లలిత్ మోదీ వయసు 56 ఏళ్లు. కాగా సుష్మితా పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలను దత్తకు తీసుకుని తల్లైన సంగతి తెలిసిందే. -
లేటు వయసులో ఘాటు ప్రేమ.. 9 ఏళ్లకు సుష్మిత రిప్లై?!
ప్రేమ పుట్టడాని ఒక్క క్షణం చాలు.. అన్న మాటకు ప్రత్యక్ష నిదర్శనంలా మారారు ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ, మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్. వీరి మధ్య ఉన్న పరిచయం కొత్తేమీ కాదు. ఎన్నో ఏళ్ల కిందటే ఒకరికొకరు తెలుసు. కానీ ఉన్నట్టుండి సడన్‌గా లవ్‌లో జారి పడ్డారు. ఒక్కరోజులోనే డేటింగ్ మొదలు పెట్టారు. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అంటూ ఫొటోలు వదిలారు. ఇది చూసి సోషల్ మీడియా యూజర్స్ విస్తుపోయారు. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారా? త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారా? అంటూ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే కలిసి జీవితాన్ని పంచుకోబోతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో లలిత్ మోదీ గతంలో చేసిన ట్వీట్ ఒకటి వైరల్‌గా మారింది. 2013లో లలిత్ మోదీ.. సుష్మితతో చాట్ చేసిన స్క్రీన్‌షాట్‌ను ట్విటర్లో షేర్ చేశాడు. ఇందులో మోదీ.. 'ఓకే ఐ కమిట్' అంటుంటే సుష్మిత మాత్రం.. 'మీరు చాలా మంచివారు. హామీలను నిలబెట్టుకోలేకపోవచ్చేమోగానీ కమిట్మెంట్లను మాత్రం గౌరవించాల్సిందే' అని రిప్లై ఇచ్చింది. మరో ట్వీట్లో సుష్మితను ట్విటర్లో కాకుండా ఎస్ఎమ్ఎస్ ద్వారా రిప్లై ఇవ్వమన్నాడు లలిత్. ఈ ట్వీట్ కాస్తా ఇప్పుడు వైరల్ కావడంతో నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. '9 ఏళ్లకు సుష్మిత కనికరించింది', 'లేటు వయసులో ఘాటు ప్రేమ', 'మోదీ గట్టిగానే ట్రై చేసినట్లున్నాడే', 'ఓపిక, పట్టుదల, కృషితో లలిత్ మోదీ విజయం సాధించాడు' అంటూ జోకులు పేలుస్తున్నారు. కాగా లలిత్ మోదీ 1991లో మినాల్ మోదీని పెళ్లాడాడు. క్యాన్సర్ కారణంగా మినాల్ 2018 డిసెంబర్ 10న మరణించింది. మనీలాండరింగ్ కేసులో భారత్ నుంచి పారిపోయిన లలిత్ మోదీ 2010 నుంచి లండన్‌లో నివసిస్తున్నాడు. Okay I commit 😋😋"@thesushmitasen: @LalitKModi u r too kind:)) however, promises are meant to be (cont) pic.twitter.com/JrgEwC1btR — Lalit Kumar Modi (@LalitKModi) April 27, 2013 @thesushmitasen reply my SMS — Lalit Kumar Modi (@LalitKModi) April 27, 2013 Just back in london after a whirling global tour #maldives # sardinia with the families - not to mention my #better looking partner @sushmitasen47 - a new beginning a new life finally. Over the moon. 🥰😘😍😍🥰💕💞💖💘💓. In love does not mean marriage YET. BUT ONE THAT For sure pic.twitter.com/WL8Hab3P6V — Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022 చదవండి: లలిత్ మోదీతో డేటింగ్‌పై స్పందించిన సుష్మితా సేన్ నన్ను పెళ్లి చేసుకుంటే నా ప్రియుడి చెల్లికి పెళ్లవదా? -
ఇంక ఆపుతారా? మాకింకా పెళ్లవలేదు: సుష్మితా సేన్
మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్, మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ లవ్‌లో ఉన్నామంటూ ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేశారు. అది కూడా ఒక్కరోజులోనే తమ మధ్య ప్రేమ చిగురించిందని, ప్రస్తుతం డేటింగ్లో ఉన్నప్పటికీ త్వరలో పెళ్లి కూడా చేసుకుంటామని సోషల్ మీడియా వేదికగా వారి మధ్య ఉన్న రిలేషన్‌ను బయటపెట్టాడు లలిత్ మోదీ. అయితే సుష్మితతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ ఆమెను భాగస్వామిగా పేర్కొన్నాడు. దీంతో అయోమయానికి లోనైన నెటిజన్లు ఆల్రెడీ వీళ్లు పెళ్లి చేసుకున్నారనుకుని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో లలిత్ మోదీ తమకింకా పెళ్లవలేదని ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చాడు. తాజాగా సుష్మితా సేన్ సైతం ఈ విషయంపై స్పందించింది. 'ప్రస్తుతం నేను నాకు నచ్చిన ప్రదేశంలో సంతోషంగా ఉన్నాను. ఇంకా ఉంగరాలు మార్చుకోలేదు, పెళ్లి అవలేదు. కేవలం ప్రేమలో మునిగి తేలుతున్నా.. ఈ వివరణ సరిపోతుందనుకుంటా.. ఇక నా పని నేను చూసుకుంటా.. నా సంతోషాన్ని పంచుకునేవారికి థ్యాంక్యూ.. ఎవరైతే పంచుకోరో.. వారికి నా గురించి అవసరం లేదు.. ఏదేమైనా లవ్ యూ గయ్స్..' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) చదవండి: నేనేమైనా ఉగ్రవాదినా? పెళ్లి చేసుకోకూడదా? మాజీ ఐపీఎల్ చైర్మన్‌తో సుష్మితా సేన్ డేటింగ్ -
లలిత్ మోదీ ప్రేమలో సుస్మితా.. ‘లవ్ ఆఫ్ మై లైఫ్’ అంటూ వీడియో..
మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్, తాను డేటింగ్లో ఉన్నామని మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ గురువారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించాడు. వీరిద్దరు మాల్దీవుల్లో షికార్లు చేసిన ఫొటోలు, లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా పిక్స్‌ను లలిత్ మోదీ షేర్ చేశాడు. ఈ సందర్భంగా సుస్మితాను తన బెటర్ హాఫ్(భార్య) అంటూ పరిచయం చేశాడు మోదీ. ఆ తర్వాత ప్రస్తుతం తాము డేటింగ్లో ఉన్నామనీ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశాడు. చదవండి: ప్రముఖ నటుడు, నటి రాధిక మాజీ భర్త మృతి దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహరం మీడియాలో, సోషల్ మీడియాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటి వరకు సుస్మితా దీనిపై స్పందించలేదు. ఈ క్రమంలో మాల్దీవ్స్‌లోని స్వీమ్మింగ్ ఫూల్లో ఆమె ఒక్కతే ఎంజాయ్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనికి బ్యాగ్రౌండ్లో ‘ఐ వాంట్ యు టూ నో.. యూ ఆర్ ద లవ్ ఆఫ్ మై లైఫ్’ అనే ఇంగ్లిష్ సాంగ్‌ను జత చేసింది. కాగా సుస్మితా గతంలో తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్ రోహ్మన్ షాతో మూడేళ్లు డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: నెలకు రూ. 25 లక్షలు ఇస్తాను, భార్యగా ఉండమన్నాడు మూడోసారి ప్రేమలో పడ్డ సుష్మితా సేన్, ప్రియుడు ఎవరో తెలుసా? View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi) -
మూడోసారి ప్రేమలో పడ్డ సుష్మితా సేన్, ప్రియుడు ఎవరో తెలుసా?
మాజీ విశ్వసుందరి, నటి సుష్మితా సేన్ మరోసారి ప్రేమలో పడింది. మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీతో డేటింగ్ చేస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు లలిత్. సుష్మితను తన భాగస్వామిగా పరిచయం చేస్తూ వీరిద్దరూ కలిసి ఉన్న పలు ఫొటోలను షేర్ చేశాడు. 'మాల్దీవుల్లో షికార్లు కొట్టాక లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా. నా జీవిత భాగస్వామి సుష్మిత సేన్‌తో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని రాసుకొచ్చాడు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారేమోననుకున్న నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేశారు. కాసేపటికే లలిత్ మోదీ తమ పెళ్లి గురించి క్లారిటీ ఇస్తూ.. 'ప్రస్తుతానికి తామింకా డేటింగ్‌లోనే ఉన్నామని, ఒక్కరోజులోనే ఒకరితో ఒకరం ప్రేమలో పడిపోయాం' అని చెప్పుకొచ్చాడు. కాగా సుష్మితా సేన్ మొదట్లో పాక్ క్రికెటర్ వసీమ్ అక్రమ్‌తో ప్రేమాయణం నడిపింది. వీరిద్దరూ సహజీవనమూ మొదలుపెట్టారు. కానీ క్షణం తీరికలేని సుష్మితా షెడ్యూల్ వల్ల వసీమ్ తీవ్రమైన అభద్రతకు లోనయ్యాడట. అంతేకాదు ఆ అభద్రత అతనిలో ఆమె పట్ల అనుమానాలను రేకెత్తించి.. సుష్మితాను చిరాకు పరచే వరకు వెళ్లింది. దాంతో ఆ అనుబంధం పెళ్లి దాకా వెళ్లకుండానే బ్రేక్ అయింది. కొన్నాళ్ల తర్వాత.. సుష్మితా సేన్ ప్రముఖ మోడల్ రోహ్మన్తో ప్రేమలో పడింది. కానీ అది కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. Just back in london after a whirling global tour #maldives # sardinia with the families - not to mention my #betterhalf @sushmitasen47 - a new beginning a new life finally. Over the moon. 🥰😘😍😍🥰💕💞💖💘💓 pic.twitter.com/Vvks5afTfz — Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022 Just for clarity. Not married - just dating each other. That too it will happen one day. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 pic.twitter.com/Rx6ze6lrhE — Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022 View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi) చదవండి: గ్లామర్ తప్ప యాక్టింగ్ రాదంటూ టార్చర్ పెట్టారు -
మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో రెస్టారెంట్‌కు వెళ్లిన హీరోయిన్
బాలీవుడ్ మాజీ లవ్ బర్డ్స్ సుష్మితా సేన్- రోహ్మన్షా బ్రేకప్ తర్వాత తొలిసారిగా కలుసుకున్నారు. ముంబైలోని ఓ రెస్టారెంట్‌కి వెళ్లొస్తూ ఈ జంట మీడియా కంట పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక సుష్మితా సేన్ కనపడగానే సెల్ఫీల కోసం అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో అక్కడే ఉన్న మాజీ ప్రియుడు రోహ్మన్ వారిన అడ్డుకొని సుష్మితకు బాడీగార్డ్‌లా నిలిచాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చాలా జాగ్రత్తగా ఆమెను కారు ఎక్కించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో వీరిద్దరూ మళ్లీ కలిసిపోయారా అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్లు ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా సుష్మిత తనకంటే 15 సంవత్సరాలు చిన్నవాడైన రోహ్మన్తో మూడేళ్లపాటు డేటింగ్ చేసింది. అయితే ఏమైందో తెలియదు కానీ తమ బంధం ముగిసిందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. -
భార్య పోయాక సుష్మితతో క్రికెటర్ సహజీవనం, కానీ!
క్రికెట్, సినిమాకున్న క్రేజ్ ఎలాంటిదంటే.. పచ్చగడ్డిని భగ్గున మండించే వైరాన్ని కూడా పక్కకు తోసేసి ప్రేమించేలా చేస్తుంది! మన బాలీవుడ్, పాక్ క్రికెట్టే దీనికి ఉదాహరణ! ఆ ఆటగాళ్లు.. ఈ తారల మధ్య నడిచిన ప్రేమ కథలే ప్రత్యక్ష సాక్ష్యాలు! అవునవును.. జీనత్ అమన్ – ఇమ్రాన్ ఖాన్, రీనా రాయ్ – మొహ్సిన్ ఖాన్... వీళ్ల సరసన ఉన్న మరో జంటే సుష్మితా సేన్, వసీమ్ అక్రమ్! ఆ ఇద్దరిదే ఈ మొహబ్బతే అని అర్థమయ్యే ఉంటుంది. ‘విశ్వ సుందరి’ కిరీటాన్ని గెలుచుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది సుష్మితా సేన్. ఆ ఆకర్షితుల్లో వసీమ్ అక్రమ్ కూడా ఉన్నాడు. క్రికెట్లో ఆల్ రౌండర్ వసీమ్ అక్రమ్‌కు జగమంతా అభిమానులున్నారు. అందులో సుష్మితా సేన్ ఉందో లేదో తెలియదు కానీ.. అతని పేరు మాత్రం ఆమెకు తెలుసు. అందాల పోటీల తర్వాత సుష్మితా నేరుగా సినిమా రంగంలో ల్యాండ్ అయింది. తెర మీద కనిపించిన సుష్మితాకూ, ఆమె నటనకూ అభిమానిగా మారాడు వసీమ్. అప్పటిక్కూడా ఆ ఇద్దరికీ ముఖాముఖి పరిచయం లేదు. సినిమా, క్రికెట్ ఈవెంట్లలో కలవలేదు. మరి ఎక్కడ కలుసుకున్నారు? ‘ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా’ సెట్స్‌లో. అది సినిమా కాదు. ఓ ప్రైవేట్ చానెల్లో ప్రారంభమైన రియాలిటీ షో. దానికి న్యాయనిర్ణేతలుగా సుష్మితా సేన్, వసీమ్ అక్రమే వ్యవహరించారు. ఆ షూటింగ్‌లోనే ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆమె మీద అతనికున్న అభిమానాన్ని ఆ సందర్భంలోనే ఆమెతో చెప్పాడు అతను. అతని ఆదరాన్ని ఆమె స్వీకరించింది. ఆ రియాలిటీ షోతో వాళ్ల మధ్య స్నేహం కుదిరింది. వాళ్లు హాజరవ్వాల్సిన ఫంక్షన్లు, పార్టీలకు కలసే వెళ్లడం.. జంటగా కనిపించడం మొదలుపెట్టారిద్దరూ. దాంతో వాళ్ల మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందనే గుసగుసలు వినిపించసాగాయి బాలీవుడ్లో. దాన్ని మీడియా మరింత ముందుకు తీసుకెళ్లింది.. ఆ ఇద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ. ఆ ప్రచారాన్ని కానీ.. మీడియా కథనాన్ని కానీ ఆ జంట కలసి కానీ.. విడివిడిగా కానీ ఖండించలేదు. అసలు వాటిని వాళ్లు పట్టించుకోనే లేదు. వీళ్ల మౌనాన్ని తమ కథనానికి అంగీకారంగా అనుకుందో ఏమో మరి ఆ జంట త్వరలోనే పెళ్లీ చేసుకోబోతోందనే వార్తనూ వ్యాప్తి చేసింది మీడియా. అప్పుడు ఉలిక్కిపడ్డారు ఆ ఇద్దరూ. ‘వసీమ్ అక్రమ్‌కు, నాకూ పెళ్లంటూ వస్తున్న వార్తలను చదివాను. అందులో రవ్వంత కూడా నిజం లేదు. ఇలాంటి విషయాలను పత్రికల్లో చదివినప్పుడు, టీవీ చానళ్లలో చూసినప్పుడే అనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు మీడియా ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుందోనని. ఇలాంటి వార్తల వల్ల కుటుంబాలు కూలిపోతాయి. వసీమ్ అక్రమ్ నాకు మంచి స్నేహితుడు. అద్భుతమైన సహధర్మచారిణితో చక్కటి కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇలాంటి వార్తలతో వాళ్ల కాపురంలో కలతలు రేపొద్దు. ఇంకో విషయం.. నా జీవితాన్ని పంచుకునే తోడు దొరికినప్పుడు ఆ విషయం మొదట మీకే చెప్తాను’ అంటూ ట్విట్టర్లో తన స్పందనను తెలియజేసింది సుష్మితా. అటు వసీమ్ అక్రమ్ కూడా ‘ఈ వదంతులు వినీ వినీ విసుగొచ్చేసింది. ‘మరో పెళ్లి’ గురించిన ఆలోచనలు నాకు లేవు. నా ఫోకస్ అంతా నా పిల్లల (ఇద్దరు అబ్బాయిలు) మీదే. వాళ్లు పెద్దవాళ్లవుతున్నారు. తండ్రిగా నా అవసరం వాళ్లకిప్పుడు ఎంతో ఉంది. అందుకే ఏడాది పాటు ఐపీఎల్ నుంచి కూడా విరామం తీసుకుని నా పిల్లలతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్నాను’ అంటూ తన మనసులో మాటను మీడియాకు స్పష్టం చేశాడు. నాకు వసీమ్ అంటే చాలా ఇష్టం.. ఓ స్నేహితుడిగా మాత్రమే. నా దృష్టిలో రిలేషన్షిప్ అనేది బిగ్ డీల్. నిజంగానే నా జీవితాన్ని పంచుకునే తోడు దొరికినప్పుడు మీకు తప్పకుండా తెలియజేస్తాను. ఇలా మీ ఊహలకు వదిలేయను – సుష్మితా సేన్ అయితే... ఒక పత్రిక (హిందుస్థాన్ టైమ్స్) కథనం ప్రకారం.. ‘ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా’ మొదలైన కొన్నాళ్లకు అంటే 2009లో వసీమ్ భార్య హుమా చనిపోయింది. అతను విషాదంలో మునిగిపోయాడు.. దిగులుతో కుంగిపోయాడు. ఆ బాధను పంచుకుంటూ వసీమ్‌కు సొలేస్ అయింది సుష్మితా. ఆమె స్వాంతనతో వసీమ్ ఊరట చెందాడు. అది ప్రేమగా మారింది. సహజీవనమూ మొదలుపెట్టారు. కానీ క్షణం తీరికలేని సుష్మితా సేన్ షెడ్యూల్ వల్ల వసీమ్ అక్రమ్ తీవ్రమైన అభద్రతకు లోనయ్యాడట. అంతేకాదు ఆ అభద్రత అతనిలో ఆమె పట్ల అనుమానాలను రేకెత్తించి.. సుష్మితాను చిరాకు పరచే వరకు వెళ్లింది. దాంతో ఆ అనుబంధం పెళ్లి దాకా వెళ్లకుండానే బ్రేక్ అయింది. కొన్నాళ్ల తర్వాత.. సుష్మితా సేన్ .. ప్రముఖ మోడల్ రోహ్మన్తో ప్రేమలో పడింది. వసీమ్ అక్రమ్ ఓ అస్ట్రేలియన్ మోడల్ని పెళ్లి చేసుకున్నాడు. - ఎస్సార్ -
బ్రేకప్ తర్వాత మళ్లీ కలిసిన బాలీవుడ్ జంట!
బాలీవుడ్ జంట సుష్మితా సేన్, రోహ్మన్ షా డిసెంబర్ నెలలో విడిపోయిన విషయం తెలిసిందే! తాజాగా వీరిద్దరూ మళ్లీ కలిశారట! బ్రేకప్ చెప్పుకున్న తర్వాత తొలిసారిగా వీరిద్దరూ కలుసుకోవడమే కాకుండా ఒకే కారులో వెళ్లారంటూ బాలీవుడ్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. ఇద్దరికీ పరిచయమున్న ఒక ఫ్రెండ్‌ను కలవడానికే వీళ్లు సిద్ధం అయ్యారట. ఇందుకోసం రోహ్మన్.. సుష్మిత ఇంటికి చేరుకోగా అక్కడ అరగంట పాటు ఇద్దరూ మాట్లాడుకున్నారని, ఒకరి యోగక్షేమాలను మరొకరు అడిగి తెలుసుకున్నారని సమాచారం. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే కారులో బయలు దేరి వారి కామన్ ఫ్రెండ్‌ను కలిసినట్లు తెలుస్తోంది. కాగా సుష్మిత పిల్లలతో రోహ్మన్కు విడదీయలేని అనుబంధం ఏర్పడింది. వారిని ఆడిస్తూ, ఆలనాపాలనా చూస్తూ తండ్రిలా అండగా ఉండేవాడు. బ్రేకప్ చెప్పుకున్నప్పటికీ రోహ్మన్కు మాత్రం పిల్లలపై ప్రీతి ఏమాత్రం తగ్గలేదు. ఇదిలా వుంటే సుష్మిత తనకంటే 15 సంవత్సరాలు చిన్నవాడైన రోహ్మన్తో మూడేళ్లపాటు డేటింగ్ చేసింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ 'ఫ్రెండ్స్‌గా మొదలైన మా ప్రయాణంలో ఫ్రెండ్స్‌గానే మిగిలిపోతున్నాము. చాలాకాలం క్రితమే రిలేషన్షిప్ ముగిసింది' అంటూ డిసెంబర్లో వారు విడిపోతున్నట్లు ప్రకటించింది. -
మా బంధం ముగిసింది: బ్రేకప్‌పై సుష్మితా సేన్ క్లారిటీ
మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్, ప్రముఖ మోడల్, నటుడు రోహ్మాన్ షాల్ తమ ప్రేమాయణానికి ముగింపు పలికినట్లు ఫిల్మీదునియాలో ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ విడిపోయిన నేపథ్యంలో రోహ్మన్ నేడు(డిసెంబర్ 23) సుష్మిత ఇంటి నుంచి బయటకు వచ్చేసి తన స్నేహితుడి ఇంట్లో ఉంటున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌తో బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది సుష్మిత. 'ఫ్రెండ్స్‌గా మొదలైన మా ప్రయాణంలో ఫ్రెండ్స్‌గానే మిగిలిపోతున్నాము. చాలాకాలం క్రితమే రిలేషన్షిప్ ముగిసింది కానీ ప్రేమ మిగిలింది. ఐ లవ్ యూ గయ్స్' అని రాసుకొచ్చింది. దీనికి రోహ్మాన్తో దిగిన ఫొటోను జత చేసింది. ఇక ఈ పోస్ట్‌పై రోహ్మన్ రియాక్ట్ అవుతూ 'ఎల్లప్పుడూ అలాగే ఉందాం' అని కామెంట్ చేశాడు. కాగా సుష్మిత తనకంటే 15 సంవత్సరాలు చిన్నవాడైన రోహ్మన్తో మూడేళ్లుగా డేటింగ్ చేస్తోంది. వీరిద్దరి జంటను చూసి ముచ్చటపడిన అభిమానులు బ్రేకప్ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
ప్రియుడితో సుస్మితా సేన్ బ్రేకప్.. ఇంట్లోంచి వెళ్లిపోయిన ప్రియుడు!
మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్, బాయ్‌ఫ్రెండ్ కశ్మీరి మోడల్, బాలీవుడ్ నటుడు రోహ్మాన్ షాల్‌తో బ్రేకప్ చెప్పుకున్నట్లు బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. వయసులో తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన రోహ్మన్తో గత కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తూ, లివింగ్ రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్న సుస్మిత తాజాగా ఆ బంధానికి ముగింపు పలికినట్లు ఆంగ్ర పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఇద్దరూ తమ రిలేషన్‌ను బ్రేక్ చేసుకోవడంతో రోహ్మాన్ సుస్మితా ఇంటి నుంచి కూడా వెళ్లిపోయాడని సమాచారం. ప్రస్తుతం అతడు సన్నిహితుల ఇంట్లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సుస్మిత-రోహ్మాన్‌ల మధ్య ఈ ఏడాది నుంచే విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ తమ బంధానికి శాశ్వతంగా ముగింపు పలికినట్లు తెలుస్తుంది. దీనికి తోడు సుస్మితా వరుస ఇన్‌స్టా పోస్టులు కూడా ఇది నిజమే అన్నట్లు కనిపిస్తున్నాయి. బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అనంతరం తీవ్ర మనోవేదనతో కుంగిపోతున్న సుస్మితా..బాధ నుంచి బయటపడేందుకు ఇదే సరైన వైద్యం అంటూ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసుకుంది. దీంతో రోహ్మాన్తో బ్రేకప్ నిజమేనని బాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
దీపావళికి ముందే మహాలక్ష్మి ఇంటికి వచ్చింది: హీరోయిన్
ప్రముఖ టీవీ నటి చారు అసోపా- మోడల్ రాజీవ్ సేన్ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఈ రోజు(నవంబర్ 1)వారికి పండంటి బిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని స్వయంగా బాలీవుడ్ హీరోయిన్, మాజీ మిస్ ఇండియా సుస్మితా సేన్ సోషల్ మీడియాలో ప్రకటిస్తూ మురిసిపోయారు. తన సొదరుడు, మోడల్ రాజీవ్ సేన్- మరదలు చారు అసోపాలకు సోమవారం ఆడబిడ్డ జన్మించిందని ఆమె వెల్లడించారు. అంతేగాక తాను మేనత్తనయ్యానంటూ సుష్మితా పట్టరాని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘దీపావళికి ముందే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. ఆడపిల్ల పుట్టుంది’ అంటూ బేబీ ఫొటోలను షేర్ చేశారు. అలాగే రాజీవ్, అసోపాలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ఫొటోల్లో బేబీ ముఖం కనిపించకుండా సుస్మితా జాగ్రత్త పడ్డారు. సుస్మితా పోస్ట్‌కు అసోపా-రాజీవ్‌లు స్పందిస్తూ.. ‘లవ్ యూ దీదీ. ఎట్టకేలకు మేనత్తా ఫేవరేట్ వచ్చేసింది’ అంటూ అసోపా కామెంట్ చేయగా.. ‘నిజంగా ఇది శుభదినం, తొందరగా రండి అక్క(సుస్మితా) మేం ముగ్గురం వేయిట్ చేస్తున్నాం’ అంటూ రాజీవ్ స్పందించాడు. చదవండి: Urmila Matondkar: నటి ఊర్మిళకు కరోనా..జాగ్రత్తగా ఉండాలని ట్వీట్ View this post on Instagram A post shared by Rajeev Sen (@rajeevsen9) కాగా త్వరలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ అసోపా-రాజీవ్‌లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసోపా బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. 2019 జూన్‌లో రాజీవ్-అసోపాలు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గతేడాది జూలైలో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు ప్రకటించగా.. ఆ తర్వాత మనస్పర్థలు తొలగడంతో వీరిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. ఇక బుల్లితెర నటిగా గుర్తింపు పొందిన చారు అసోపా పలు హిందీ సీరియళ్లలో నటించారు. తర్వాత బాలీవుడ్లో కూడా ప్రవేశించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రాజీవ్ మోడల్‌గా రాణిస్తున్నాడు. చదవండి: ఐశ్వర్య రాయ్‌కు నవ్వు తెప్పించే సెంటిమెంట్ ఏంటంటే? View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
ఊహించని సంఘటన అది: సుస్మిత బాయ్ ఫ్రెండ్
సాక్షి, ముంబై: మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ప్రియుడు కశ్మీరి మోడల్, బాలీవుడ్ నటుడు రోహ్మాన్ షా షూటింగ్లో అనుకోకుండా ఒక చిన్నప్రమాదంలో ఇరుక్కు న్నాడట. దీనికి సంబంధించిన వీడియోను రోహ్మాన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. స్టార్హీరో అమీర్ ఖాన్ 1997 నాటి ఇష్క్ మూవీ షూటింగ్ దృశ్యాలను తాజాగా ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఫన్నీ వీడియోను ఫ్యాన్స్‌కు షేర్ చేశాడు. ఇష్క్ మూవీ షూటింగ్లో కృష్ణుడి వేషంలో కొలనులో గోపికలతో ఒక సన్నివేశం చిత్రీకరణ సందర్భంగా ఈ ఊహించని పరిణామం ఎదురైంది. పువ్వులతో అలంకరించిన ఒక ఊయలలో రోహ్మాన్ షూట్ కొనసాగుతుండగా, ఒకవైపు తాడు తెగిపోయింది. దీంతో అతను పడిపోబోయాడు. కానీ వెంటనే బ్యాలెన్స్ చేసుకొని పడిపోకుండా నొలదొక్కుకున్నాడు. ఈ పరిణామంతో అక్కడున్న సిబ్బంది కాసేపు ఖంగారుపడ్డారని తెలిపాడు. అంతేకాదు త్రిపాఠి నమ్రతా ఆందోళనగా పరిగెత్తుకు రావడాన్నిప్రస్తావించాడు రోహ్మాన్ షా . View this post on Instagram A post shared by rohman shawl (@rohmanshawl) -
భార్యకు విడాకులు, ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం!
‘ఒక అమ్మాయి కలలు కనే ప్రేమికుడిని కాను.. కోరుకునే భర్తను అంతకన్నా కాను. ప్రయత్నించాను కాని వల్ల కాలేదు. అనుబంధం అవగాహనను, రాజీపడడాన్ని ఆశిస్తుంది. ఆ రెండూ నాకు లేవు. అందుకే ప్రేమ, పెళ్లి రెండిట్లో ఫెయిల్ అయ్యాను. తోడు కన్నా ఏకాంతాన్నే ఎక్కువ కోరుకుంటుంది నా మనసు’ అంటూ తనను తాను విశ్లేషించుకుంటాడు బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్. సుష్మితా సేన్ ఆయన జీవన వైఫల్య చిత్రమే ఇది... విశ్వసుందరి సుష్మితా సేన్ మొదటి సినిమా ‘దస్తక్’. దానికి దర్శకుడు విక్రమ్ భట్. అప్పుడు సుష్మితకు 20 ఏళ్లు. విక్రమ్‌కు 27. ఈ ప్రస్తావన ఎందుకంటే ఆ లవ్ ఫెయిల్యూర్‌కి విక్రమ్ తమ వయసునే కారణంగా చూపాడు కాబట్టి. ‘దస్తక్’ సినిమా సెట్స్‌లో విక్రమ్‌ను బాగా పరిశీలించింది సుష్మిత. పని పట్ల అతనికున్న నిబద్ధత ఆమెను ఆశ్చర్యపరిచింది. ఆ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అతణ్ణి సమ్మోహనపరిచింది. ప్రేమ మొదలవడానికి ఈ ప్రారంభం చాలు కదా! ఒకరికోసం ఒకరన్నట్టుగా అయిపోయారు. బాలీవుడ్లో గుసగుసలు పత్రికల్లో గాసిప్స్ కాలమ్‌ను నింపేశాయి. దస్తక్ షూటింగ్ కోసం యూనిట్ అమెరికా వెళ్లింది. అక్కడ స్వేచ్ఛను ఆస్వాదించిందీ జంట. ఆ కబురును ఇక్కడ అందుకుంది అదితి భట్. భార్య అదితితో విక్రమ్ సహించలేదు.. క్షమించలేదు విక్రమ్ భార్య అదితి.. బచ్పన్ కీ దోస్త్.. ఫస్ట్ క్రష్. సుష్మితా సేన్‌తో అతను ప్రేమలో పడేనాటికే రెండేళ్ల వైవాహిక బంధం వాళ్లది. ఒక కూతురు కూడా. ఎన్నో ఆశలతో విక్రమ్ జీవిత భాగస్వామిగా అత్తింట్లోకి అడుగుపెట్టింది అదితి. అత్త, మామలు ఆమెను ఆహ్వానించిన తీరుకు నివ్వెరపోయింది. తన పట్ల వాళ్ల ప్రవర్తనకు నిర్ఘాంతపోయింది. తల్లిదండ్రుల పద్ధతిని విక్రమ్ విమర్శించకపోయినా తనకే అండగా ఉన్నాడు.. ఉంటాడు అన్న భరోసాతో ఆ ఇబ్బందులను భరించింది. బిడ్డ కోసం భర్త నిర్లక్ష్యాన్నీ క్షమించింది. కానీ ఎప్పుడైతే సుష్మితా సేన్‌తో అతని వ్యవహారం తెలిసిందో అప్పుడు సహించలేక ప్రశ్నించింది. ఆమెతో రాజీపడే ప్రయత్నం అతనూ చేయలేదు. దాంతో విడాకులతో వేరైంది ఆ జంట. ప్రేమికుడిగానూ ఓడిపోయాడు ఇటు సుష్మితా సేన్ మీద ప్రేమనూ గెలిపించుకోలేకపోయాడు విక్రమ్. ఆ లవ్ స్టోరీ ఎంత వేగంగా మొదలయిందో అంతే వేగంగా ముగిసిపోయింది. ఎవరికోసం భార్య, బిడ్డను వదులుకున్నాడో ఆ తోడునూ నిలుపుకోలేకపోయాడు. ఒంటరివాడయ్యాడు. నిరాశ పట్టుకొని పీడించసాగింది. నిస్పృహతో తనుండే ఆరవ అంతస్తు ఫ్లాట్ బాల్కనీ నుంచి దూకేయాలనుకున్నాడు. విచక్షణ ఒళ్లు విరుచుకోకపోతే దూకేసేవాడే. సుష్మితాను మరచిపోయి బతుకు మీద ప్రీతి కలగాలంటే పనిమీద దృష్టి పెట్టాలి అనే నిర్ణయానికి వచ్చాడు. అమీషా పటేల్ ఆంఖే... ఆ సమయంలోనే ‘ఆంఖే’ సినిమాకు సిద్ధమయ్యాడు. కథానాయికగా అమీషా పటేల్ సైన్ చేసింది. సెట్స్‌లో ఇద్దరూ స్నేహితులయ్యారు. అతని గుండెలో గూడుకట్టుకున్న దిగులుకు ఆమె సాంత్వన అయింది. ఆమె కెరీర్ సమస్యలకు అతను శ్రోతలా మారాడు. నెమ్మదినెమ్మదిగా అమీషా పటేల్ నవ్వు విక్రమ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపసాగింది. మనసు ఎంత చెడ్డదంటే.. కాస్త ఆప్యాయంగా పలకరించే మనిషి కనపడితే చాలు అల్లుకుపోదామని చూస్తుంది.. మునుపటి అనుభవాల చేదు ఇంకా వీడకున్నా సరే! విక్రమ్.. అమీషాను ప్రేమించసాగాడు. అమీషా కూడా విక్రమ్‌ను ఇష్టపడింది. ఆ ప్రేమ అయిదేళ్ల కాలాన్ని ఇట్టే చుట్టేసింది. ఆ ఇద్దరూ పెళ్లాడతారనే అనుకున్నారు బాలీవుడ్లో అంతా! కానీ వాళ్లిద్దరూ తమ ప్రేమను బ్రేక్ చేసుకున్నారు. అమీషా, విక్రమ్ దీనికి కారణం.. అమీషా తల్లిదండ్రులు పెట్టిన ఒత్తిడి కావచ్చు అంటారు ఆ ఇద్దరికీ సంబంధించిన సన్నిహితులు. విక్రమ్ భట్ మాత్రం ‘ఆమె తన కెరీర్ కోసం తపన పడింది.. నేను తన కోసం తపన పడ్డాను. ఆమె కోసమే ఉన్నాను. ఇంతకన్నా ఏం చేయాలి? అల్రెడీ ఒక రిలేషన్‌ను మనసు మీదకు తీసుకుని కోలుకోలేనంతగా దెబ్బతిన్నాను. ఇప్పుడు మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లదలచుకోలేదు’ అంటాడు. సుస్మితాసేన్ విషయంలో ‘తప్పు మా ఇద్దరిదీ కాదు. మా వయసులది. పరిపక్వతలేని మా మనస్తత్వాలది’ అని చెప్తాడు. భార్య, కూతురికి తను మిగిల్చిన బాధ గురించి ‘జీవితంలో నాకున్న రిగ్రెటల్లా అదొక్కటే. వాళ్లనలా వదిలేయాల్సింది కాదు. ధైర్యం లేని వాడే జిత్తులు పన్నుతాడు. నేను అలాంటి పిరికివాడినే. అదితిని వదిలేసి నేనెంత తప్పు చేశానో, ఎంత వేదనను అనుభవించానో ఆమెతో చెప్పే ధైర్యం నాకు లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ పాఠాలే నాకు’ అంటాడు విక్రమ్ భట్. ప్రస్తుతం అతని కూతురు కృష్ణ.. తండ్రికి అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. కూతురికి ప్రొడక్షన్ మెళకువలు నేర్పిస్తూ ఆమె కెరీర్‌ను తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు విక్రమ్ భట్. - ఎస్సార్ చదవండి: ఈ బ్యాంకులో ఖాతా ఉందా? రేణూ దేశాయ్ షాకింగ్ పోస్ట్ నా మాజీ భర్త వల్లే సినిమాలకు దూరం: నటి -
రోహ్మాన్తో, సుస్మిత బ్రేకప్!.. తొలిసారిగా స్పందించిన ప్రియుడు..
మాజీ విశ్వసుందరి సుస్మిత సేన్, ఆమె బాయ్ ఫ్రెండ్ కశ్మీరి మోడల్ రోహ్మాన్ షాల్లు బ్రేకప్ చెప్పుకున్నారంటు జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేగాక సుస్మిత వరుస పోస్టులు కూడా ఇది నిజమే అన్నట్లుగా కనిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా ఆసక్తికరంగా రోహ్మాన్ ఇన్‌స్టా స్టోరీలు తాజాగా సోషల్ మీడియాలో దర్శనమించాయి. ఇవి చూస్తుంటే నిజంగానే వారి మధ్య ఎదో జరిగినట్లుగా అనిపిస్తుంది. దీంతో వీరి ప్రేమాయణం, బ్రేకప్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా కొన్నేళ్లుగా సుస్మిత, రోహ్మాన్ లివింగ్ రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం రోహ్మాన్ ఇన్‌స్టాలో ఆస్క్ మీ ఎనిథింగ్ సెషన్‌ను నిర్వహించాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అంతేగాక సుస్మిత సేన్ గురించి కూడా అడగ్గా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యాడు. ఈ క్రమంలో సెలబ్రెటీ హోదాను ఎంజాయ్ చేస్తున్నారాని, దీని వల్ల స్వేచ్చగా రోడ్డుపైకి రాలేకపోతున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారని ఓ అభిమాని అడగ్గా.. ‘నిజం చెప్పాలంటే నేను ఇంకా స్వయంగా సెలబ్రేటీ హోదా రాలేదు. అది వేరేవాళ్ల కృషి వల్ల వచ్చింది(సుస్మితను ఉద్దేశించు చెప్పినట్లుగా ఉంది). కానీ ఒకరోజు నేను ఆ స్థాయికి తప్పకుండా చేరుకుంటాను. ఆ రోజున మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను మై ఫ్రెండ్’ అంటు సమాధానం ఇచ్చాడు. అలాగే సుస్మిత సేన్ గురించి ఏదైన చెప్పమని కోరగా.. ఆమె చాలా ఉత్తమైనది అని తెలిపాడు. అంతేగాక తనలో ఆయనను ఆకర్షించేందని అడగ్గా.. తన అవగాహన అంటు సమాధానాలు ఇచ్చాడు. కాగా రోహ్మాన్ తదుపరిగా ఆర్య వెబ్ సిరీస్ సెకండ్ సీజన్లో నటిస్తున్నాడు. మొదటి సీజన్లో సుస్మిత లీడ్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. అయితే సుస్మిత ఇవాళ తాను 45 ఏళ్ల వయసులో కూడా తన ఎంపికలో పొరపాట్లు చేశానంటు ఇన్‌స్టాలో ఓ పోస్టు షేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రోహ్మాన్ తన లైవ్ సెషన్ స్టోరీనీ పంచుకోవడం గమనార్హం. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) చదవండి: సహజీవనం : బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పేసిన నటి 45 ఏళ్ల వయసులో కూడా ఎంపికలో పొరపాటు చేశాను: సుస్మిత సేన్ -
45 ఏళ్ల వయసులో కూడా ఎంపికలో పొరపాటు చేశాను: సుస్మిత సేన్
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మిత సేన్ ప్రస్తుతం కుంగుబాటులో ఉన్నట్లు కనిపిస్తున్నారు. తన ప్రియుడు రోహ్మాన్ షాల్‌తో సుస్మిత విడిపోయినట్లు ఇటీవల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అతడితో డేటింగ్ చేస్తూ, లివింగ్ రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్న ఈ జంట విడిపోవడం అందరికి షాక్ ఇచ్చింది. ఇక ఆమె తాజా పోస్టు చూస్తుంటే సుస్మిత ప్రియుడికి దూరమై మనోవేదనతో కుంగిపోతున్నట్లు కనిపిస్తున్నారు. తన పోస్టులో ఆమె ఇలా రాసుకొచ్చారు. ‘అన్ని పరిస్థితిల్లో నేను సానుకూలంగా ఉంటానని అందరు భావిస్తారు. కానీ అది నిజం కాదు. నా జీవితంలో కూడా నేను తప్పులు చేశాను, వాటి ఫలితాలను అనుభవిస్తున్నాను. ఇప్పటికి 45 ఏళ్ల వయసులో కూడా నేను ఎంపికలో పెద్ద పొరపాటు చేశాను. దాని వల్ల ఇప్పుడు తీవ్ర వేదనకు గురవుతున్న. అయితే దీనికి కారణమైన వాటిని గుర్తుపెట్టుకుని తిరిగి లెక్కలు వేసుకుంటు, అబద్దాలతో, నిరాశలో ఉండిపోవాలనుకోవడం లేదు. తప్పు చేసినవారేవరైన దీని నుంచి తప్పించుకోలేరు’ అంటు ఆమె రాసుకొచ్చారు. అలాగే ‘ఇక దీని నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే.. ఎంత కష్టాన్నైనా దానిని కర్మ రుణంగా చూడాలని, అదే విధంగా పూర్తి ఆశభావంతో తిరిగి దానిని చెల్లించాలి!. ఇక దానికి కారణమైన వారి విషయానికి వస్తే వారి కర్మ ఇప్పుడే ప్రారంభమైంది’ అంటు సుష్మిత తన పోస్టులో పేర్కొన్నారు. ఇది ఉండగా కొద్ది రోజుల కిందట సుష్మిత ఓ పోస్ట్ షేర్ చేస్తూ. ‘సమస్య ఏంటంటే..అతడు మారుతాడని మహిళ భావిస్తుంది. కానీ అతడు మారడు. పురుషులు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తుంది. కానీ అతడిని వదిలి వెళ్లదు అనుకుంటాడు. కానీ ఈ కథలో నీతి ఏంటంటే అతడు ఎప్పటికీ మారడు. ఆమె వెళ్లిపోతుంది’ అంటు రోహ్మాన్తో విడిపోయిన విషయాన్ని చెప్పకనే చెప్పారు. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) చదవండి: సహజీవనం : బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పేసిన నటి -
మేకప్ లేకుండా ఈ స్టార్ హీరోయిన్లను ఎప్పుడైనా చూశారా?
సాధారణంగా సినీ తారలు.. ముఖ్యంగా హీరోయిన్లు అంటే అందానికి ప్రతిరూపాలని, వారికి అసలు మచ్చే ఉండదని కొందరు భావిస్తే, మరికొందరేమో వారు మేకప్‌తో అందాన్ని తెచ్చిపెట్టుకుంటారని చెప్తుంటారు. ఇక చాలా మందికి సినీ తారల అసలు రూపాన్ని చూడాలని ఆసక్తిగా ఉంటుంది. కానీ హీరోయిన్స్ మాత్రం ఎప్పుడు మేకప్‌తోనే దర్శనం ఇస్తుంటారు. మేకప్ లేకుండా వారు బయటకి వచ్చిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. అలా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఐశ్వర్యరాయ్, దీపికా పదుకొనే, అలియా భట్, ప్రియాంక చొప్రా తదితరులకు సంబంధించిన మేకప్ లేని కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. వారు మేకప్‌తో, మేకప్ లేకుండా ఎలా ఉన్నారో ఓ లుక్కేయండి. ఐశ్వర్యరాయ్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ దీపికా పదుకొనే విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ ప్రియాంక చొప్రా విత్ అవుట్ మేకప్- విత్ మేకప్ అలియా భట్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ అనుష్క శర్మ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ జాక్వేలిన్ ఫెర్నాండేజ్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ కరీనా కపూర్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ సోనమ్ కపూర్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ నర్గిస్ ఫఖ్రీ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ అమీషా పటేల్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ సుష్మిత సేన్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ -
తల్లి కాబోతున్న నటి: ఆనందంలో సుస్మిత కుటుంబం!
ముంబై: ప్రముఖ టీవీ నటి చారు అసోపా- మోడల్ రాజీవ్ సేన్ దంపతులు శుభవార్త పంచుకున్నారు. తాము తల్లిదండ్రులం కాబోతున్నటు తెలిపారు. త్వరలోనే తమ జీవితాల్లోకి చిన్నారి రాబోతోందంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన చారు అసోపా.. బేబీ బంబ్తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఇక ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘ఎప్పటి నుంచో ఈ శుభవార్త కోసం ఎదురుచూస్తున్నాం. నేను గర్భవతినయ్యానని తెలియగానే రాజీవ్ చాలా సంతోషించాడు. నిజంగా మాకు ఇదొక సర్ప్రైజ్. మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలుకాబోతుంది. నవంబరులో డెలివరీ ఉంటుందేమో’’ అంటూ నవ్వులు చిందించారు. ఇక రాజీవ్ సోదరి, మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌తో తన అనుబంధం గురించి మాట్లాడుతూ.. ‘‘సుస్మిత దీదీ అయితే చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. అద్భుతమైన మెసేజ్‌లు పంపిస్తున్నారు. బేబీని చూడటం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మా కుటుంబం మొత్తం చిన్నారి రాక కోసం పరితపించిపోతోంది. ప్రస్తుతం నేను బికనీర్‌లో.. మా అమ్మ వాళ్లింట్లో ఉంటున్నా. ముంబైలో పరిస్థితి బాగాలేదు. పైగా అత్తయ్య కూడా మాతోపాటు ఉండటం లేదు. అందుకే ఇక్కడికి వచ్చాను. రాజీవ్ మాత్రం ముంబైలోనే ఉన్నాడు. రోజురోజుకీ నా శరీరంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. మాతృత్వాన్ని ఆస్వాదించే సమయం ఇది’’ అని చెప్పుకొచ్చారు. కాగా అవివాహితగా ఉన్న సుస్మితా సేన్ ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకుని చాలా ఏళ్ల క్రితమే తల్లిగా మారిన విషయం తెలిసిందే. ఇక బుల్లితెర నటిగా గుర్తింపు పొందిన చారు అసోపా పలు హిందీ సీరియళ్లలో నటించారు. తర్వాత బాలీవుడ్లో కూడా ప్రవేశించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజీవ్ మోడల్‌గా రాణిస్తున్నాడు. చదవండి: ఈ ఫోటో.. చిరునవ్వులు తీసుకొచ్చింది : నమ్రత View this post on Instagram A post shared by Charu Asopa Sen (@asopacharu) -
సహజీవనం : బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పేసిన నటి
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి సుస్మిత సేన్ బాయ్‌ఫ్రెండ్ రోహ్మాన్ షాల్‌తో డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా లివింగ్ రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్న ఈ జంట అనూహ్యంగా బ్రేకప్ చెప్పుకున్నట్లు బీ-టౌన్లో టాక్ వినిపిస్తుంది. ఇందుకు సుస్మిత పెట్టిన ఓ పోస్ట్ ఫ్యాన్స్‌ను కలవరపాటుకు గురిచేస్తుంది. సమస్య ఏంటంటే..అతడు మారుతాడని మహిళ భావిస్తుంది. కానీ అతడు మారడు. పురుషులు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తుంది. కానీ అతడిని వదిలి వెళ్లదు అనుకుంటాడు. కానీ ఈ కథలో నీతి ఏంటంటే అతడు ఎప్పటికీ మారడు. ఆమె వెళ్లిపోతుంది' అని సుస్మితా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. (సుస్మితతో పెళ్లి.. ప్రియుడి కామెంట్) అంతేకాకుండా తన ఇద్దరు కూతుళ్లతో దిగిన ఫోటోను కూడా సుస్మిత షేర్ చేస్తూ..ఒకరికొకరం ఎప్పటికీ వెన్నంటే ఉంటామంటూ ఓ క్యాప్షన్‌ను జోడించింది. ఇందులో రోహ్మన్ లేకపోవడంతో వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారని, ఇక కన్మఫర్మేషన్ ఒకటే మిగిలిందంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. కాగా తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన కశ్మీర్ మోడల్‌తో సుస్మిత ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఇదే ఇదే విషయాన్ని ప్రేమకు చిహ్నమైన తాజ్ మహాల్ దగ్గర దిగిన పిక్ ఇన్‌స్టాలో షేర్ చేసి అధికారికంగా ప్రకటించారు కూడా. అంతేకాకుండా ఎప్పటికప్పుడు తమ బంధాన్ని తెలియజేస్తూ వారు దిగిన ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటారీ జంట. ఇటీవలె సుస్మిత పేరును ప్రియుడు రోహ్మాన్ పచ్చబొట్టు వేయించుకున్నాడు. (విడాకులపై స్పందించిన సుష్మితా సేన్ సోదరుడు) View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
సుస్మితతో పెళ్లి.. ప్రియుడి కామెంట్
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి సుస్మిత సేన్ సహజీవనం వార్తలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ప్రియుడు, డిజైనర్ రోహ్మాన్ షాల్‌తో కొన్ని నెలలుగా లివింగ్ రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వారు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో తమ అభిమానుల కోసం షేర్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల రోహన్ ఓ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సుస్మిత పరిచయం, పెళ్లి ఆలోచన గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. కశ్మీర్ మూలాలున్న రోహ్మాన్ పుట్టి పెరిగిందంతా నైనిటాల్లోనని పేర్కొన్నాడు. డెహ్రాడూన్‌లో ఇంజనీరింగ్ తరువాత మోడలింగ్‌లో అడుగుపెట్టినట్లు తెలిపాడు. అయిదు, ఆరు సంవత్సరాల తర్వాత ముంబై వచ్చానని, అనంతరం రెండేళ్లకు సుస్మిత పరిచయం అయ్యిందని రోహ్మాన్ వెల్లడించాడు. సుస్మితతో పరిచయం ఏర్పడ్డాక నా జీవితంలో ప్రతిదీ మారిపోయింది. బయటి వ్యక్తులకు ఓ స్టార్ జీవితం గురించి నిర్ధిష్ట అవగాహన ఉంటుంది. కానీ ఒకసారి మనం వారితో కలిసుంటే దాని వెనుక ఉన్న కష్టం తెలుస్తుంది. సుషు కలిసాక నా వ్యక్తిగత జీవితం మారిపోయింది. ఆ తర్వాతే నేను జీవితాన్ని సీరియస్‌గా చూడటం, ఇతరులు గౌరవించడం మొదలు పెట్టాను. నేను మోడలింగ్ ప్రారంభించినప్పుడు ఒక స్టార్ అవ్వాలనుకున్నాను, కానీ వేర్వేరు ప్లాన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మోడలింగ్‌కు కట్టుబడి ఉండాలని అనుకుంటున్నాను, అది నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఫేమస్ అవ్వాలనే ఆలోచన ఇప్పుడు నా జాబితాలలో లేదు.’ అని పేర్కొన్నాడు. చదవండి: సుష్మితకు సర్ప్రైజ్ ఇచ్చిన ప్రియుడు అదే విధంగా సుస్మితతో పెళ్లి విషయం గురించి మాట్లాడుతూ.. ‘సుష్మిత, తన కుమార్తెలతో ఇప్పటికే నేను ఒక కుటుంబంగా ఏర్పడ్డాం. నేను ఆ పిల్లలకు తండ్రి లాంటివాడినని కొన్నిసార్లు అనుకుంటా. మరి కొన్నిసార్లు వాళ్లకు స్నేహితుడినని ఫీల్ అవుతాను. పిల్లలతో పోట్లాడుతాను. ఇలా అన్ని షేర్ చేసుకుంటాను కాబట్టి మేము కుటుంబంగా చేరి నార్మల్‌గానే జీవిస్తాం. దీన్నే నేను సంతోషిస్తాను. కాబట్టి మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడిగే ప్రశ్నలపే మేము మాట్లాడలేము. పెళ్లి జరిగినప్పుడు దాన్ని దాచము. అందరికీ చెబుతాం. ప్రస్తుతానికి మేము సుషు వెబ్ సిరీస్ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం. దాని తరువాత ఆలోచిస్తాం. సుష్మితతో డేటింగ్ గురించి నేను మా తల్లిదండ్రులతో చెప్పలేదు. వాళ్లే తెలుసుకొని నాకు సపోర్ట్‌గా నిలిచారు. మా పెళ్లికి ఇప్పుడేం తొందర లేదు.’ అని స్పష్టం చేశాడు -
ఆ వీడియో చూసి నవ్వు ఆపుకోలేకపోయా : నటి
టాలెంట్ అనేది ఎవడి అబ్బ సొత్తు కాదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ధనిక, పేద, చిన్నా, పెద్ద, కుల, మత భేదాలు ఉండవు. టాలెంట్ విషయంలో మనం ఎవరిని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది తమ టాలెంట్‌ను ప్రపంచానికి చూపించుకుంటున్నారు. చాలా మంది ప్రముఖులు టాలెంట్ ఉన్నవాళ్లని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. తాజాగా నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ కూడా అలాంటి వీడియోని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాంట్లో ఓ ముగ్గురు నిరుపేద పిల్లలు ప్రొఫిషినల్ డాన్సర్ల మాదిరి చిందులేశారు. కొంత మంది హీరోలు సైతం వేయలేని స్టెప్పులేశారు. పాటకు తగ్గ స్టెప్పులేస్తూ ఔరా అనిపించారు. ఈ వీడియోను సుష్మిత ట్వీట్ చేస్తూ ‘వారి నవ్వును ఒకసారి చూడండి. కల్మషం లేని నవ్వు వారిది,పరిపూర్ణమైన ఆనందం వారిది. ఈ వీడియో చూసి నవ్వు ఆపుకోలేకపోయా. ఐ లవ్యూ గాయ్స్’అని చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ బుడుతల స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 😄❤️😍 Look at these smiles, those moves & the sheer embodiment of happiness!! 👏🎵💃🏻 I can’t stop smiling!! Thank you for sharing this video daddy😁❤️ #celebratelife #sharing #hope #joy #happiness #simplicity #children #Jerusalema by Nomcebo zikode 👏😍 I LOVE YOU GUYS!!! pic.twitter.com/9MOxwMcn6A — sushmita sen (@thesushmitasen) December 3, 2020 -
సుష్మితకు సర్ప్రైజ్ ఇచ్చిన ప్రియుడు
ప్రియుడు రోహ్మాన్ షాల్‌ను నుంచి సర్ప్రైజ్ తీసుకుంది ఒకప్పటి అందాల బామ సుష్మిత సేన్. ఈ మాజీ విశ్వసుందరిని ఇష్టపడేవారంత తనని సుషు అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇదే పేరును ఇన్ఫినిటి సింబల్‌తో కలిపి చేతిమీద టాటూ వేయించుకున్నాడు ఆమె ప్రియుడు. తన ప్రేమ అనంతమైనదని తెలియ జేశాడు కశ్మీర్ మోడల్. దానికి సంబంధించిన ఫోటోను ప్రియుడు ఇన్‌స్టాలో పెట్టగా సుషు షేర్ చేసింది. 'ఇంక్ శాశ్వతం కాదని ప్రేమ మాత్రమే శాశ్వతమని' తన టాటూ ఫోటోలో రాశాడు రోహ్మాన్. ఇదే విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఫోటోను షేర్ చేస్తూ రో'హ'మెన్స్ అని రాసింది సుష్మిత. సోషల్ మీడియా వేదికగా మాటలు కలుపుకున్న వీరిద్దరి మధ్య అతి తక్కువ సమయంలోనే ప్రేమ చిగురించింది. చాలా బంధాలలో విఫలమైన సుష్మిత తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన కశ్మీర్ మోడల్‌తో కొత్త బంధాన్ని ఏర్పరుచుకుంది. ఇదే విషయాన్ని ప్రేమకు చిహ్నమైన తాజ్ మహాల్ దగ్గర దిగిన పిక్ ఇన్‌స్టాలో షేర్ చేసి అధికారికంగా ప్రకటించారీ నవ జంట. చదవండి: (నా కేరాఫ్ అడ్రస్ నాన్నే: ఆకాష్ పూరీ) తమ బంధాన్ని గురించి తెలియజేయడానికి ఎప్పుడూ మొహమాట పడలేదు ఈ అందమైన జంట. ఎప్పటికప్పుడు వారు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో తమ అభిమానుల కోసం షేర్ చేస్తూనే ఉన్నారు. అలాగే సుష్మిత కూతుర్లు రేనీ, అలీషాలతో తనకున్న ప్రేమ, అనుబంధాలను కూడా రోహ్మాన్ తెలుపుతూనే వస్తున్నారు. -
నిన్నెంతగానో మిస్సయ్యాను: నటి
‘నేను.. నా భార్యను ఎంతగానో ప్రేమిస్తున్నా. కలిసి ఉంటేనే బంధం మరింత బలంగా ఉంటుంది’ అంటూ మోడల్ రాజీవ్ సేన్ తన వైవాహిక జీవితం గురించి వస్తున్న రూమర్లకు చెక్ పెట్టాడు. భార్య, నటి చారు అసోపాతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసి తామెంతో సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. చారును ఎంతగానో మిస్సయ్యానని.. అందుకే ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చేశానంటూ భార్య పట్ల తనకున్న భావాలను వ్యక్తీకరించాడు. ఇక చారు సైతం భర్తను హత్తుకుని ఉన్న ఫొటోను షేర్ చేసి.. ‘‘నా భర్తను ప్రేమిస్తున్నా. నిన్నెంతో మిస్సయ్యాను’’ అంటూ ప్రేమను చాటుకున్నారు. (చదవండి: మరోసారి వార్తల్లోకెక్కిన స్టార్ జంట!) దీంతో.. ‘‘మీరిలాగే కలకాలం సంతోషంగా కలిసి ఉండాలి’’ అంటూ ఈ జంట అభిమానులు కామెంట్ల రూపంలో తమ స్పందన తెలియజేస్తున్నారు. కాగా మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్- చారు అసోపాల వివాహం గతేడాది జూన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. సన్నిహితుల సమక్షంలో గోవాలో వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లైన కొన్ని నెలల తర్వాత దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో వెడ్డింగ్ ఫొటోలతో పాటు తాము కలిసి ఉన్న అన్ని ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. అంతేగాక ఒకరినొకరు అన్‌ఫాలో చేశారు. ఈ క్రమంలో వివాహ వార్షికోత్సవానికి ముందే రాజీవ్.. చారును ముంబైలో వదిలేసి ఢిల్లీకి వెళ్లినట్లు వార్తలు వినిపించాయి. దీంతో వీరిద్దరు విడిపోతున్నారంటూ బీ-టౌన్లో వదంతులు వ్యాపించాయి. తొలుత ఈ ప్రచారాన్ని కొట్టిపారేసిన ఈ స్టార్ జంట.. ఆ తర్వాత స్నేహితుల మాటల వల్లే తమ మధ్య దూరం పెరిగిందంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. విడిపోవడం ఖాయమనుకునేలా గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేలా విమర్శలకు దిగారు. అయితే అనూహ్యంగా మరోసారి కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. -
నా భర్త ఎందుకలా చేశాడు?: నటి
ముంబై: తనని ఎవరూ ప్రభావితం చేయలేదని.. రాజీవ్‌తో విడిపోవాలని తనే నిర్ణయించుకున్నానంటూ నటి చారు అసోపా తన భర్త రాజీవ్ సేన్ వ్యాఖ్యలను ఖండించారు. సుష్మితా సేన్ సోదరుడైన రాజీవ్ సేన్-చారు అసోపాల మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై రాజీవ్ స్పందిస్తూ.. తన భార్య అమాయకురాలని, చారు స్నేహితులే ఆమెను ప్రభావితం చేసుంటారని ఆరోపించాడు. దీంతో రాజీవ్ వ్యాఖ్యలపై చారు స్పందిస్తూ... ‘నాకు ఎవరూ బ్రెయిన్ వాష్ చేయలేదు. ఇది నా సొంతంగా తీసుకున్న నిర్ణయం. నా జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకునేంత పరిపక్వత నాకు ఉంది. బహుశా రాజీవ్‌నే తన స్నేహితులు ప్రభావితం చేసుంటారు. అందువల్లే తన సోషల్ మీడియా ఖాతాలో మా ఫొటోలు డిలీట్ చేశాడు’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అంతేగాక తమ వివాహ వార్షికోత్సానికి కొన్నిరోజుల ముందు రాజీవ్ ముంబైలోని తమ నివాసాన్ని వదిలి ఢిల్లీ ఇంటికి వెళ్లిపోయాడని ఆమె ఆరోపించారు. (చదవండి: విడాకులపై స్పందించిన సుష్మితా సేన్ సోదరుడు) ‘‘మా మొదటి వివాహవార్సికోత్సవానికి కొన్ని రోజుల ముందు రాజీవ్ నన్ను ముంబైలోని ఇంటిలో ఒంటరిగా వదిలి న్యూఢిల్లీలోని ఇంటికి వెల్లిపోయాడు. సరే నేను అమాయకురాలిని, నా చూట్టు ఉన్నవారు నన్ను ప్రభావితం చేస్తారని రాజీవ్ భావించినప్పుడు ఎందుకు నన్ను ఆ సమయంలో వదిలి బయటకు వెళ్లిపోయాడు. అది మా మొదటి వివాహ వార్షికోత్సవం. అది మాకెంతో ప్రత్యేకమైనది ఆ సమయంలో భార్యభర్తలుగా మేమిద్దరం ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన సమయం. కానీ రాజీవ్ నన్ను ఒంటరిగా వదిలి వేరే ఇంటికి వెళ్లిపోయాడు. అతడు ఎందుకు అలా చేశాడు’’ అని ఆమె ప్రశ్నించారు. గతేడాది రాజీవ్ సెన్- చారు అపోసాలు గోవాలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వారి పెళ్లైనప్పటి నుంచి ఈ జంట వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నారు. ఇటీవల వారిద్దరూ సోషల్ మీడియాలో తమ ఖాతాలోని ఒకరి ఫొటోలు ఒకరూ డిలీట్ చేసుకోవడంతో ఇద్దరి మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయంటూ వార్తలు వచ్చాయి. (చదవండి: వారిద్దరు విడిపోయారా?!) -
విడాకులపై స్పందించిన సుష్మితా సేన్ సోదరుడు
మాజీ విశ్వ సుందరి సుష్మతా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ అతని భార్య చారు అపోసాతో విడిపోతున్నట్లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వార్తలను ఆయన ఖండించారు. అంతేగాక భార్య చారుతో గొడవపడి రాజీవ్ ముంబై ఇంటిని వదిలి ఢిల్లీ వెళ్లిపోయాడనే పుకార్లను కొట్టి పారేశారు. ఈ క్రమంలో రాజీవ్ సేన్ సోమవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి వార్తలు విన్నప్పుడు నా నవ్వును ఆపుకోలేను. నాకు మూడు ఇళ్లు ఉన్నాయి. ముంబై, ఢిల్లీ మరొకటి దుబాయిలో. చారుకు దగ్గరగా ఉన్న వారెవరైనా ఒత్తిడి తెచ్చి ఆమెను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే ఆమె చాలా అమాయకురాలు, మంచిదని పేర్కొన్నారు. (మరోసారి వార్తల్లోకెక్కిన స్టార్ జంట!) తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న పుకార్లపై మాట్లాడుతూ.. ‘ఈ వార్తల వెనుక ఆమె ఫ్రెండ్ సర్కిల్లోని ఓ వ్యక్తి ఉన్నారు. తన స్నేహితుల మాటలు చారు నమ్మదని నేను నమ్ముతున్నాను. ఆ వ్యక్తి ఎవరో నేను తెలుసుకున్నాక అతని లేదా ఆమె పేరుతో పాటు వాళ్ల పోటో కూడా నేను మీకు చెబుతాను. వాస్తవాలను బయటపెడతాను’. అని వెల్లడించారు. కాగా ఇటీవల తమ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వీరిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో కావడమే కాకుండా పెళ్లి ఫోటోలు కూడా డిలీట్ చేశారు. దీంతో వీరి వివాహ బంధానికి స్వస్తి చెప్పబోతున్నారన్న నెజిటన్ల అనుమానం మరింత బలపడింది. గతేడాది జూన్‌లో మోడల్ అయిన రాజీవ్ సేన్, టీవీ నటి చారు అసోపా గోవాలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. (నెపోటిజమ్‌పై తెలివిగా స్పందించిన సుస్మితా సేన్) -
నెపోటిజమ్‌పై తెలివిగా స్పందించిన సుస్మితా సేన్
ముంబై : బాలీవుడ్లో నెపోటిజమ్‌పై చర్చ రోజురోజుకీ సెగలు రాజేస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఈ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. ఇప్పటి వరకు అనేక మంది బంధుప్రీతిపై తమ అభిప్రాయాన్ని వెలువరించగా.. తాజాగా మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ను నెపోటిజమ్ చర్చల్లోకి లాగారు. సుస్మితా సేన్‌కు ఇండస్ట్రీలో బంధువులు ఎవరూ లేరు. దీంతో ఓ నెటిజన్ ఆమెను..‘బాలీవుడ్‌లోని నెపోటిజమ్ నుంచి ఎలా బయటపడగలిగారు’. అంటూ ట్విటర్లో ప్రశ్నించారు. (‘జింతాత జిత జిత జింతాత తా..’ గుర్తుందా!) ఇక దీనిపై స్పందించిన సుస్మితా.. ‘నేను కేవలం నా అభిమానులపై ద`ష్టి పెట్టడం ద్వారా ఈ సమస్యను దూరం పెట్టాను. మీరు నన్ను ఆదరించినంతకాలం నేను నటిగా నా సేవలు కొనసాగిస్తూనే ఉంటాను’. అంటూ సమాధానమిచ్చారు. కాగా ‘ఆర్య’ వెబ్ సిరీస్‌తో మళ్లీ సినిమాల్లోకి అడుగుపెట్టారు నటి సుస్మితా సేన్. 1994లో మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్న సుస్మితా.. రెండు సంవత్సరాల తర్వాత దస్తక్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. (బాధపడకండి.. నేను చనిపోవడం లేదు: నేహా) 26 ఏళ్లు.. ఐ లవ్ యూ జాన్..! -
26 ఏళ్లు.. ఐ లవ్ యూ జాన్..!
‘‘26 ఏళ్లు అవుతోంది జాన్... మమ్మల్ని అందరినీ గర్వపడేలా చేశావు.. ఇంకా చేస్తూనే ఉన్నావు. ఐ లవ్ యూ’’అంటూ మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ పట్ల ఆమె ప్రియుడు రోహమన్ షాల్ ప్రేమను చాటుకున్నాడు. 1994లో సుస్మితా మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకుని అందాల పోటీల్లో భారత కీర్తిని ఇనుమడింపజేశారు. భారత్ నుంచి ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి సుందరీమణిగా ఆమె చరిత్ర సృష్టించారు. సుస్మిత మిస్ యూనివర్స్‌గా ఎన్నికై ఈ ఏడాదితో 26 ఏళ్లు పూర్తయ్యాయి. (‘అరుదైన వ్యాధితో బాధపడ్డాను’) ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రోహమన్ సుస్మితపై ప్రశంసలు కురిపించాడు. కాగా సుస్మితా సేన్... న్యూఢిల్లీకి చెందిన యువ మోడల్ రోహమన్ షాల్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రతీ వేడుకలోనూ కలిసి సందడి చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఇక రోహమన్ సుస్మితతో రిలేషన్షిప్ వరకే పరిమితం కాలేదు. ఆమె దత్తపుత్రికలు రీనా, అలీషాలకు తండ్రి ప్రేమను పంచుతూ వారిలో ఒకడిగా కలిసిపోయాడు. కాగా సుస్మితా సేన్ కంటే దాదాపు రోహమన్ పదిహేనేళ్లు చిన్నవాడు.(అందగత్తెల అపురూప చిత్రం) View this post on Instagram 26 years My Jaaan 😍😍💃🏻💃🏻 . . . How proud you made all of Us & still continue to do so !!❤️❤️❤️❤️ . . #Mine ❤️ I love you @sushmitasen47 #bestmissuniverseever #amazingwoman #love #India #proudbf #indiasfirst A post shared by rohman shawl (@rohmanshawl) on May 20, 2020 at 11:48am PDT -
‘అరుదైన వ్యాధితో బాధపడ్డాను’
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ జీవితంలో జరిగిన విషయాల గురించి తెలిస్తే ఆమె ఆత్మవిశ్వాసాన్ని తప్పక మెచ్చుకుంటారు. గతంలో తాను ఎదుర్కొన్న అనారోగ్య సమస్య గురించి.. దాని నుంచి బయటపడేందుకు తాను ఎలా శ్రమించిందో వివరిస్తూ... ఓ వీడియో విడుదల చేశారు సుస్మితా సేన్. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లనో స్ఫూర్తిని నింపుతుంది. ఆ వివరాలు.. ‘మన శరీరం గురించి మన కంటే బాగా ఎవరికి తెలియదు. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే మనం దాని మాట తప్పక వినాలి. 2014, సెప్టెంబర్‌లో నేను అడిసన్ అనే అరుదైన వ్యాధికి గురయ్యాను. రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. దాంతో నా శరీరం పూర్తిగా నీరసించిపోయింది. తీవ్ర నిరాశకు లోనయ్యాను. నాకు వ్యాధితో పోరాటం చేసే శక్తి కూడా లేదనిపించింది. తీవ్రమైన ఒత్తిడి వల్ల కళ్ల చుట్టు నల్లని వలయాలు ఏర్పాడ్డాయి. ఆ నాలుగేళ్లు నా జీవితంలో చీకటి రోజులు’ అన్నారు సుస్మిత. సుస్మిత మాట్లాడుతూ.. ‘వ్యాధి నుంచి బయటపడటం కోసం తీవ్రంగా శ్రమించాను. ఒకానొక సమయంలో స్టెరాయిడ్స్ కూడా తీసుకున్నాను. వాటి వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఇక జీవితాంతం ఇలా అనారోగ్యంతోనే ఉండాలేమో అని భయమేసింది. ఆ సమయంలో ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాను. అయ్యిందేదో అయ్యింది.. నాలోని నొప్పినే ఆయధంగా మార్చుకోవాలనుకున్నాను. అందుకే జపనీస్ మార్షల్ ఆర్ట్స్ ‘నాన్‌చాకు’ నేర్చుకున్నాను. అది నాకు మంచి ఫలితాన్నిచ్చింది. 2019నాటికి మళ్లీ నేను మాములు స్థితికి వచ్చాను. ఈ ప్రయాణంలో నేను నేర్చుకున్నది ఏంటంటే.. మన శరీరం గురించి మనకంటే బాగా ఎవరికి తెలియదు.అది చెప్పినట్లు వింటే.. ఆరోగ్యంగా ఉంటాము’ అని చెప్పుకొచ్చారు సుస్మితా.(నా కూతురు కన్నీళ్లు పెట్టించింది) -
అందగత్తెలంతా ఒక్కచోట చేరారు
లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. టైం పాస్ కోసం ఎక్కువ సమయం ఇంటర్నెట్లోనే గడుపుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడ ఏదో ఒక చాలెంజ్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది కదా. తాజాగా ‘థ్రోబ్యాక్’ చాలెంజ్ నడుస్తోంది. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్‌తో వర్తమానం గందరగోళం అయ్యింది.. భవిష్యత్తు ఆగమ్యగోచరంగా తోస్తుంది. మరి గతం.. చేదు,తీపి జ్ఞాపకాలతో నిండి ఉంటుంది కదా. అందుకే ఈ థ్రోబ్యాక్ చాలెంజ్ బాగా ట్రెండ్ అవుతుంది. గతించిన కాలానికి చెందిన ఎన్నో అద్భుతమైన, అందమైన, విలువైన జ్ఞాపకాలు మరో సారి తెర మీదకు వస్తున్నాయి.(రెండు నెలల తర్వాత బయటకు..) ఈ క్రమంలో ఫ్యాషన్ ప్రపంచానికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. భారతీయ అందానికి ప్రతికలుగా నిలిచిన అందాల రాణులంతా ఓ చోట చేరిన ఈ చిత్రం నెటిజనుల మనసు దోచుకుంది. ఈ ఫోటోలో సుస్మితా సేన్(మిస్ యూనివర్స్ 1994), ఐశ్వర్య రాయ్(మిస్ వరల్డ్ 1994), డయానా హేడెన్(మిస్ వరల్డ్ 1997 ), యుక్తా ముఖి(మిస్ వరల్డ్ 1999), లారా దత్తా(మిస్ యూనివర్స్ 2000), ప్రియాంక చోప్రా(మిస్ వరల్డ్ 2000), దియా మీర్జా(మిస్ ఆసియా పసిఫిక్ 2000) ఈ ఫోటోలో ఉన్నారు. చరిత్ర సృష్టించిన మహిళల చిత్రాన్ని మరో సారి తెర మీదకు తెచ్చినందుకు నెటిజనులు కృతజ్ఞతలు తెలిపుతున్నారు.(‘ఆ అద్భుతానికి నేటితో 20 సంవత్సరాలు’) View this post on Instagram 👑 A bevy of beauties! From left to right: Sushmita Sen - Miss Universe 1994 Priyanka Chopra - Miss World 2000 Lara Dutta - Miss Universe 2000 Yukta Mookey - Miss World 1999 Dia Mirza - Miss Asia Pacific 2000 Diana Hayden - Miss World 1997 Aishwarya Rai - Miss World 1994 @sushmitasen47 @priyankachopra @larabhupathi @yuktamookhey @diamirzaofficial @dianahaydensays @aishwaryaraibachchan_arb #missasiapacific #missworld #missuniverse #missindia #missfeminaindia #femina #beautypageant #beautyqueen #beautyqueens #laradutta #laraduttabhupathi #diamirza #diamirzaofficial #priyankachopra #priyankachoprajonas #priyankachoprafans #priyankachopra_nour #priyankachoprateam #aishwaryarai #aishwaryaraibachan #aishwarya #aish #aishwaryaraibachchan #sushmitasen #sushmitasenfanclub #sushmitasen47 #yuktamookhey #dianahayden #missworld1994 #missuniverse1994 A post shared by @ retrobollywood on May 13, 2020 at 12:00am PDT -
పదేళ్ల తర్వాత
కరిష్మా కపూర్, హ్యూమా ఖురేషి, కియారా అద్వానీ.. ఇలా మరికొందరు బాలీవుడ్ హీరోయిన్లు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగంవైపు కూడా దృష్టి సారించారు. తాజాగా ఈ జాబితాలోకి తన పేరు రాసుకున్నారు మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్. రామ్ మాధ్వనీ దర్శకత్వం వహించిన ‘ఆర్య’ అనే వెబ్ సిరీస్‌లో సుస్మితా టైటిల్ రోల్ చేశారు. గత డిసెంబర్లో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ జరిగింది. రాజస్థాన్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ సుస్మితా కెమెరా ముందుకు వచ్చారు. 2010లో వచ్చిన ‘నో ప్రాబ్లమ్’ సినిమా తర్వాత లీడ్ రోల్‌కి నటిగా మేకప్ వేసుకోలేదామె. ఇప్పుడు వెబ్ సిరీస్ ద్వారా కనిపించబోతున్నారు. ‘‘ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకులను పలకరించబోతున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు సుస్మితా సేన్. -
ప్రియుడితో మాజీ విశ్వసుందరి పుట్టినరోజు
ముంబై: బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరీ సుస్మితాసేన్ తన 44వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకొన్నారు. ఆమె వర్కవుట్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లోని అభిమానులతో పంచుకుంటూ తన దినచర్యను ప్రారంభించారు. దీంతో ఆమె అభిమానులు వయసు మీద పడుతున్నా... రోజురోజుకూ మరింత యవ్వనంగా కనిపించడానికి అసలు రహస్యం ఇదే కాబోలు అంటూ అభినందనల వర్షం కురిపించారు. ఆ తర్వాత మరో పోస్ట్ చేసిన సుస్మితా.. చిరకాలం గుర్తుండిపోయేలా తన పుట్టినరోజును ఇంటి టెర్రస్‌పై ప్లాన్ చేసిన బాయ్‌ఫ్రెండ్ రోహమన్ షాల్, కూతుళ్లు అలీసా, రెనీలకు ధన్యవాదాలు తెలిపారు. తన పుట్టినరోజును ఇలా అందంగా అలంకరించిన టెర్రస్‌పై బెలూన్లు, లైట్ల మధ్య జరుపుకుంటానని అస్సలు ఊహించలేదన్నారు. బాయ్‌ఫ్రెండ్ ఇచ్చిన సర్ప్రైజ్ను జీవితాంతం గుర్తుంచుకుంటానంటూ ఆనందం వ్యక్తం చేశారు. View this post on Instagram What a magical #birthday EVERYTHING I COULD’VE WISHED FOR & MORE❤️❤️❤️😁💃🏻🌈 Thank you jaan @rohmanshawl for this ALL HEART Birthday Surprise!!! I love you😍💋Everyone acted sooooo well...I really had no idea!!!😅👏 And there it was...a magical terrace with lights, balloons, tent, yummy cake & heartfelt notes suspended all over...How simply loved you make me feel Alisah, Renée, @rohmanshawl @pritam_shikhare @nupur_shikhare & Rajesh!!!🤗❤️😊Even my other baby, My puddle called #darling came to surprise me!!!😀😇🤗 #sharing #cherished #happiness #love #family #friends #celebrations #44yrs #birthdaygirl 😄💃🏻❤️🎵 I love you guys!! #duggadugga 💃🏻💃🏻💃🏻 A post shared by Sushmita Sen (@sushmitasen47) on Nov 19, 2019 at 12:57pm PST ఇక బాయ్‌ఫ్రెండ్ రోహ్మాన్(27).. ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకుని సుస్మితాకు బర్త్‌డే విషెస్ చెప్పారు. 'సూర్యుడు ఎలాగైతే వెలుగును పంచుతాడో.. అలానే నువ్వు కూడా నా జీవితంలో వెలుగులు పూయిస్తావని ఆశిస్తున్నాను. నిజం చెప్పాలంటే ఈ ప్రత్యేకమైన రోజున నీ గురించి పుంఖాను పుంఖాలు రాయాలని ఉంది. ఓ నా అందమైన ప్రియురాలా..! దేవుణ్ని ఇంకేం కోరుకోవాలి. మొత్తం ప్రపంచాన్నే నాకు ఇచ్చాడు. హ్యాపీ బర్త్‌డే జాన్' అంటూ విష్ చేశాడు. View this post on Instagram Just as the rising sun brings light to the world,you my love, bring light to my life !! . . Truth be told, i wanted to write paragraphs about you on this special day, but hey, when i think about you i am just as awestruck & speechless as i was, when i saw you sitting there while taking this picture!! . . My gorgeous woman, you make me want to be a better MAN each and every day of my life !! . . Ab isse zyada Khuda se aur kya mangu,usne toh puri kaainaat se mujhe nawaaza hain ! ❤️ . . HAPPY BIRTHDAY MY JAAN 😘😘 . . #44 lets rule this number as well !!! . @sushmitasen47 Bring it on !! ☀️❤️😘 A post shared by rohman shawl (@rohmanshawl) on Nov 19, 2019 at 1:03am PST -
నా కూతురు కన్నీళ్లు పెట్టించింది
అలీసా స్కూల్ నుంచి వచ్చింది. వచ్చీ రాగానే, ‘‘మమ్మీ.. స్కూల్లో నేను ఎస్సే రాశాను. ఏం రాశానో వింటావా?!’’ అంది. అలీసా.. సుస్మితాసేన్ కూతురు. వయసు పదేళ్లు. ఆ వయసులో స్కూల్లో ఏం చేసినా, ఇంటికి రాగానే తల్లిదండ్రులకు చెప్పాలన్న తహతహ పిల్లలకు ఉంటుంది. తల్లిదండ్రులకే వినే ఓపిక ఉండదు. లేదా ఆసక్తి ఉండదు. అలీసాకు తండ్రి లేడు. సుస్మితే తల్లీతండ్రి. అలీసాను పదేళ్ల క్రితం అనాథ శరణాలయం నుంచి దత్తత తీసుకున్నారు సుస్మిత. ‘‘ఎస్సే టాపిక్ ఏమిటి?’’ కూతుర్ని అడిగారు సుస్మిత. ‘‘అనాథశరణాలయం నుంచి బిడ్డను దత్తత తీసుకోవడం మీద మమ్మీ. నేను ఎంచుకున్నాను ఆ టాపిక్’’ అంది అలీసా! సుస్మిత నవ్వింది. కూతురు ఉత్సాహంగా చదవడం మొదలుపెట్టింది. అలీసా ఎస్సే చదువుతున్నంత సేపూ సుస్మిత చెంపలపై కన్నీళ్లు. బిడ్డను దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకుంది. అలీసా ఎస్సేను చదువుతున్నప్పుడు తీసిన వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి.. ‘‘నా కూతురు నా చేత కన్నీళ్లు పెట్టించింది’’ అని కామెంట్ రాశారు సుస్మిత. అలీసా తన వ్యాసంలో పెద్ద పెద్ద మాటలేమీ రాయలేదు. దత్తత తీసుకోవడం అంటే జన్మను ఇవ్వడం అని రాసింది! జన్మను ఇవ్వడం అంటే ఒక బిడ్డను కాపాడటం అని రాసింది. శిశువుకు ఉండే జీవించే హక్కును సంరక్షించడం అంటే ఇంట్లోకి సంతోషాన్ని తెచ్చుకోవడం అని రాసింది. అప్పటికే పెద్దగా ఏడ్చేయడం మొదలు పెట్టారు సుస్మిత. భావోద్వేగాలతో ఉబికి ఉబికి వస్తున్న వెచ్చని కన్నీళ్ల చప్పుడు వీడియోలో సుస్మిత గొంతు నుంచి అలీసా ఎస్సే పఠనంతో కలిసి మధ్యలో ఒకసారి వినిపిస్తుంది. ఎస్సేలో ఇంకా ఇలా రాసింది అలీసా. కడుపున పుట్టిన బిడ్డకు, ఎవరి కడుపునో పుట్టిన బిడ్డకు తేడా ఉండదు. తల్లి మనసుకు భేద భావాలు ఉండవు. దత్తత తీసుకోవడం అన్నది.. అదొక అందమైన భావన.. అంటూ ముగిస్తూ దత్తత తీసుకున్న సెలబ్రిటీల జాబితాలో సుస్మిత పేరునూ ప్రస్తావించింది. ఆ చిన్న చిన్న భావనలలో ప్రేమను, ఆత్మీయతను, స్వచ్ఛతను, భద్రతను, భరోసాను, నిజాయితీ, దైవత్వాన్నీ వీక్షించిన సుస్మిత పట్టలేని ఆనందంతో ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. 1994లో ‘మిస్ యూనివర్స్’ ౖటెటిల్ గెలుచుకున్న సుస్మిత మోడలింగ్‌లో కొన్నాళ్లు ఉండి, కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత పూర్తిగా సామాజిక సేవాకార్యక్రమాలకే పరిమితం అయ్యారు. అవివాహితగా ఉండిపోదలచుకున్నారు. అలాగని మాతృత్వపు మధురిమలకు ఆమె దూరం కాదలచుకోలేదు. తన 25 ఏళ్ల వయసులోనే ఒక బాలికను దత్తత తీసుకుని ఆమెకు రెనీ అని పేరు పెట్టుకున్నారు. తర్వాత పదేళ్లకు సుస్మిత తన 35 వ యేట ఇంకో బాలికను దత్తత తీసుకున్నారు. ఆ చిన్నారే అలీసా. బాలికను దత్తత తీసుకున్నాక బాలుడిని మాత్రమే తీసుకోవాలన్న చట్ట నిబంధనపై పోరాడేందుకు ఆమెకు పదేళ్ల సమయం పట్టింది! పెద్ద కూతురు రెనీ వయసు ఇప్పుడు 20 ఏళ్లు. ‘‘సొంత తల్లికి బిడ్డకు పేగు బంధం ఉంటుంది. దత్తత తీసుకున్న బిడ్డకు తల్లికి తెగని బంధం ఉంటుంది. సొంత తల్లి తన కడుపులోంచి బిడ్డను కంటుంది. దత్తత తల్లి తన హృదయంలోంచి జన్మను ఇస్తుంది’’ అని గతంలోనే ఒక ఇంటర్వ్యూలో సుస్మితా సేన్ అన్నారు. -
సుస్మిత, సన్నీ లియోన్లాగే మీరు కూడా..
‘నేను ఎంచుకున్న టాపిక్ అనాథలను దత్తత తీసుకోవడం. ప్రతీ ఒక్క చిన్నారికీ జీవించే హక్కు ఉంటుంది. కాబట్టి మానవత్వంతో అనాథలను దత్తత తీసుకోవడం ఉత్తమం. కన్నబిడ్డలు కాకపోయినా వారితో బంధం ఎంతో అందంగా ఉంటుంది. మీరు వారికి కొత్త జన్మ ఇచ్చినవారు అవుతారు. ఒకరిని రక్షించిన వారవుతారు. పిల్లలు కల్మషం లేనివారు. వారు ఎవరినైనా ఇట్టే ప్రేమించగలుగుతారు. ముఖ్యంగా అనాథ పిల్లలకు ఎన్నడూ ప్రేమ దొరికి ఉండదు. కాబట్టి మీ ప్రేమతో వారిని అక్కున చేర్చుకోండి. సుస్మితా సేన్ ఇద్దరు అనాథ అమ్మాయిలను, సన్నీ లియోన్ ఒకరిని దత్తత తీసుకున్నారు. నిజానికి నేను కూడా ఒకప్పుడు అనాథగా ఉన్నా. కానీ ఇప్పుడు అలా కాదు. నాకు అందరూ ఉన్నారు. ఈ భావన అత్యద్భుతం’ అంటూ మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ పెంపుడు కూతురు అలీషా రాసిన భావోద్వేగపూరిత వ్యాసం నెటిజన్ల మనసు దోచుకుంటోంది. చిన్నతనంలోనే ఇంత గొప్ప ఆలోచన.. అంతకుమించిన అవగాహన అంటూ పలువురు సుస్మిత కూతురిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సుస్మిత తను నన్ను కన్నీళ్లు పెట్టించింది అనే క్యాప్షన్ జతచేశారు. అనాథ చిన్నారుల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై అలీషా రాసిన వ్యాసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లక్షల్లో లైకులు కొట్టి ఆమెను ప్రశంసిస్తున్నారు. కాగా 2000లో సుస్మితా సేన్ రీనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుని తల్లిగా మారారు. ఆ తర్వాత పదేళ్లకు రీనికి తోడుగా అలీషా అనే మరో అమ్మాయిని సైతం దత్తత తీసుకుని.. ఆమెను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరి బాగోగులు చూసుకుంటూ తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక తన కూతుళ్లు ఎంతో తెలివిగలవారని తరచుగా చెప్పే సుస్మితా.. వాళ్లు తన హృదయం నుంచి జన్మించారని ప్రేమను చాటుకుంటారు. అదే విధంగా ఇద్దరూ కూడా దత్తపుత్రికలే అనే విషయం వారికి కూడా తెలుసునని.. వాళ్లు ఎంతో పరిణతితో ఆలోచిస్తూ ప్రతీ విషయాన్ని అర్థం చేసుకోగల వ్యక్తిత్వం గల వారని గతంలో చెప్పుకొచ్చారు. -
వాళ్లిద్దరూ విడిపోలేదా..? ఏం జరిగింది?
బాలీవుడ్ నటి సుష్మితా సేన్ సోదరుడు, మోడల్ రాజీవ్ సేస్ జూన్ 7న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యంత నిరాడంబరంగా జరిగిన రాజీవ్ సేన్, చారు అసోపాల వివాహం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏడాది పాటు ప్రేమలో మునిగితేలిన వీరిద్దరూ పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. అయితే తాజాగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు మరింత బలాన్నిస్తూ రాజీవ్, చారులు ఒకరి సోషల్ మీడియా పేజ్‌లను మరొకరు అన్‌ఫాలో చేయటం చర్చనీయాంశమైంది. అంతేకాదు వారి సోషల్ మీడియా పేజ్‌ల ప్రొఫైల్ ఫోటోలను కూడా మార్చేశారు. గతంలో ఇద్దరూ కలిసున్న ఫోటోలు ప్రొఫైల్ ఫోటోలుగా ఉండగా తరువాత సింగిల్‌గా ఉన్న ఫోటోలను పెట్టారు. దీంతో రాజీవ్, చారుల మధ్య గొడవలు ఉన్నాయన్న వార్తలు మీడియా సర్కిల్స్‌లో హల్చల్ చేశాయి. దీంతో అభిమానులు కామెంట్స్ రూపంలో వారిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రశ్నలకు రాజీవ్ సమాధానం చెప్పకపోగా కామెంట్ చేసిన వారిని బ్లాక్ చేయటంతో చాలా మంది రాజీవ్, చారులు విడిపోయారని నిర్ణయించుకున్నారు. చారు అసోపా కూడా ఈ వార్తలపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే తాజాగా అందరికీ షాక్ ఇస్తూ రాజీవ్, చారుతో కలిసి దిగిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశాడు. ‘మా తొలి ఢిల్లీ డిన్నర్ డేట్’ అనే క్యాప్షన్‌తో ఇద్దరు అన్యోన్యంగా ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. దీంతో ఇన్నాళ్లు ఇద్దరి మధ్య ఏదో జరిగిందంటూ వస్తున్న వార్తలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అంతేకాదు ఒకరి ఇన్స్టాగ్రామ్ పేజ్‌ను మరొకరు తిరిగి ఫాలో అవుతున్నారు. అయితే అసలు ఎందుకు అన్‌ఫాలో చేశారు. ఎందుకు తిరిగి ఫాలో చేస్తున్నారన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. View this post on Instagram Our first delhi dinner date ❤️ #aboutlastnight #rajakibittu A post shared by Rajeev Sen (@rajeevsen9) on Jul 31, 2019 at 7:23am PDT -
‘చట్టబద్ధంగా భార్యను చేసుకున్నా’
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ వివాహ బంధంలో అడుగుపెట్టాడు. తన స్నేహితురాలు, టీవీ నటి అయిన చారు అసోపాను చట్టబద్ధంగా(కోర్టు మ్యారేజీ) పెళ్లాడాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో పూర్తి నిరాడంబరంగా వీరి పెళ్లి జరగడం విశేషం. ఈ విషయాన్ని రాజీవ్ సేన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘నేను.. రాజీవ్ సేన్.. చారు ఆసోపాను చట్టబద్ధంగా భార్యను చేసుకున్నా’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన పెళ్లి ఫొటోలను షేర్ చేశాడు. ఈ సందర్భంగా నూతన దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ఈరోజుల్లో.. అన్ని అవకాశాలు ఉండి ఇంత నిరాండబరంగా పెళ్లి చేసుకున్న మీ జంట నిజంగా ఆదర్శనీయం’ అంటూ నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు. కాగా బుల్లితెర నటిగా గుర్తింపు పొందిన చారు అసోపా పలు హిందీ సీరియళ్లలో నటించారు. తర్వాత బాలీవుడ్లో కూడా ప్రవేశించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గత ఏడాది కాలంగా తనతో డేటింగ్ చేస్తున్న రాజీవ్ సేన్‌ను కోర్టు మ్యారేజీ ద్వారా జూన్ 7న పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. పెళ్లి సందర్భంగా భర్త, అత్తగారితో దిగిన ఫొటోలను షేర్ చేశారు. కాగా రాజీవ్ సేన్ మోడల్ అన్న సంగతి తెలిసిందే. View this post on Instagram i Rajeev sen take Charu asopa as my lawful wife ❤️🔒🧿 🎉🎉🎉🎉🎉 #rajakibittu A post shared by Rajeev Sen (@rajeevsen9) on Jun 8, 2019 at 9:40pm PDT -
లైఫ్ ఈజ్ వండర్ఫుల్
మెరుగైన చికిత్స కోసం జర్మనీ వెళ్లినప్పుడు అక్కడి వైద్యులు సుస్మితకు ‘సినాథెన్’ అనే పరీక్ష చేశారు. స్టెరాయిడ్స్ లేకుండా జీవితాన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నదీ లేనిదీ తేల్చి చెప్పే పరీక్ష అది. ఆ పరీక్షను సుస్మితకు రెండుసార్లు చేసి వైద్యులు చెప్పిందేమిటంటే... ఆమె ఇక ఎప్పటికీ స్టెరాయిడ్స్ వాడుతూనే ఉండాలని! వాడకుంటే బతకడం కష్టమని!! సెలబ్రిటీల జీవితాల్లోని గ్లామర్ ఒక్కటే మనకు కనిపిస్తుంది. తమ జీవితంలోని కల్లోల సమయాల్లో వాళ్లు చేసిన పోరాటం గురించి వాళ్లకై వాళ్లు బయటపెడితే తప్ప ప్రపంచానికి ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు. నాలుగేళ్ల క్రితం దీపికా పడుకోన్ తను డిప్రెషన్లోకి వెళ్లిన బాలీవుడ్ ప్రారంభపు రోజుల గురించి బహిర్గత పరిచినప్పుడు అభిమానులు నిర్ఘాంతపోయారు. ఇంత చలాకీగా, చక్కగా కెరీర్లో ఎదుగుతున్న అమ్మాయి జీవితంలోనూ డిప్రెషన్ ఉందా అని ఆశ్చర్యపోయారు. అయితే అంతకన్నా ఆశ్చర్యం ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు ఆమె చేసిన పోరాటం. అలాంటి స్ఫూర్తిదాయకమైన పోరాటమే ‘విశ్వసుందరి’ సుస్మితా సేన్ జీవితంలో ఉందని ‘ఇండియా టుడే’కి ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడయింది. 2014లో బెంగాలీ సినిమా ‘నిర్బాక్’ చిత్రీకరణ పూర్తి అవుతుండగా సుస్మిత ఒక్కసారిగా కుప్పకూలిపోయి, తీవ్రమైన ఆనారోగ్యానికి గురయ్యారు. అలా ఎందుకయ్యిందో వెంటనే ఎవరూ తెలుసుకోలేకపోయారు. అనేక నిర్థారణ పరీక్షలు జరిపాక ఆమె దేహంలో అడ్రినల్ గ్రంథి.. కార్టిసాల్‌ను ఉత్పత్తి చెయ్యడం ఆగిపోయిందని వైద్యులు కనిపెట్టారు. కార్టిసాల్ అనేది ఒక ఉత్ప్రేరక హార్మోన్. రక్తంలోని గ్లూకోజ్ స్థాయులను, జీర్ణక్రియను నియంత్రిస్తుంది. నొప్పుల్ని, వాపుల్ని నివారిస్తుంది. జ్ఞాపకశక్తికి సహాయకారిగా ఉంటుంది. దేహంలోని ఉప్పును, నీటిని సమన్వయపరిచి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మనిషి ఆరోగ్యానికి ఇంత కీలకమైన కార్టిసాల్‌ను అడ్రినల్ గ్రంథులు మూత్రపిండాల పైభాగంలో ఉంటాయి. అవి కార్టిసాల్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోవడం వల్లనే సుస్మిత అకస్మాత్తుగా పడిపోయి, ఆ వెంటనే పూర్తి అనారోగ్యంలోకి వెళ్లారు. కారణం తెలిసిన వెంటనే వైద్యులు ఆమెకు చికిత్స మొదలు పెట్టారు. ‘హైడ్రోకార్టిసన్’ అనే స్టెరాయిడ్‌ను ఇచ్చి, ప్రతి ఎనిమిది గంటలకొక ఇంజెక్షన్ తీసుకోవాలనీ లేకుంటే కోలుకోవడం కష్టం అని చెప్పారు. ఆ తర్వాత ఇంజెక్షన్లకు ప్రత్యామ్నాయంగా మాత్రల్ని సిఫారసు చేశారు. దాదాపు రెండేళ్ల పాటు (2015–16) ఆ స్టెరాయిడ్‌ను వాడారు సుస్మిత. ఆ సమయంలో ఆమె నరకం అనుభవించారు. అంతకంటే ఎక్కువగా స్టెరాయిడ్ దుష్ప్రభావంతో శారీరకంగా, మానసికంగా ఆమె నలిగిపోయారు. చర్మం మునుపటి మెరుపు కోల్పోయింది. జుట్టు ఊడిపోవడం మొదలైంది. ఒంట్లో స్టెరాయిడ్ నిల్వలు పేరుకుని పోయి ముఖం చిన్నబోయింది. మెరుగైన చికిత్స కోసం జర్మనీ వెళ్లినప్పుడు అక్కడి వైద్యులు సుస్మితకు ‘సినాథెన్’ అనే పరీక్ష చేశారు. స్టెరాయిడ్స్ లేకుండా జీవితాన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నదీ లేనిదీ తేల్చి చెప్పే పరీక్ష అది. ఆ పరీక్షను సుస్మితకు రెండుసార్లు చేసి వైద్యులు చెప్పిందేమిటంటే... ఆమె ఇక ఎప్పటికీ స్టెరాయిడ్స్ వాడుతూనే ఉండాలని! ఆ మాటతో సుస్మిత ప్రపంచం తలకిందులైపోయింది. రోజుకు 60 మిల్లీ గ్రాముల స్టెరాయిడ్స్‌ను వైద్యులు సిఫారసు చేశారు. శక్తి మరీ సన్నగిల్లుతున్నప్పుడు ఆ మోతాదును 100 మిల్లీ గ్రాముల వరకు పెంచుకోవచ్చని చెప్పారు. ప్రెస్ కాన్ఫరెన్సులు అవీ ఉన్నప్పుడు మోతాదును పెంచి వేసుకునేవారు సుస్మిత. ఆ మోతాదుల ప్రభావంతో ఆమె కంటి చూపు మందగించింది. దేహంలోని శక్తి హరించుకుపోయింది. ఆ సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో తన గురించి మొత్తం రాసుకోవాలని భావించి కూడా ఆఖరు నిముషంలో ఆ ప్రయత్నం మానుకున్నారు. ‘సుస్మితాసేన్ ఇలాక్కాదు తన అభిమానులకు గుర్తుండి పోవాలసింది’ అనుకున్నారు. బతుకును ఇచ్చే నెపంతో చావుకు దగ్గర చేస్తున్న స్టెరాయిడ్‌తో ఫైట్ చెయ్యాలనుకున్నారు. డాక్టర్లు గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఏ పనీ చేయకూడదని, అలా చేస్తే బ్రెయిన్‌కు రక్తం సరఫరా అవదని, అది మరింత ప్రమాదం అని డాక్టర్లు హెచ్చరించినప్పటికీ సుస్మిత వినలేదు. తన దేహంలో ఏం జరుగుతోందో తనకై తను తెలుసుకునే ప్రయత్నం చేశారు. తన అనారోగ్యంపై యోగాను ప్రయోగించుకున్నారు. 2016 అక్టోబర్ నాటికి మరీ శిథిలమైపోయారు. వెంటనే ఆమెను అబూధాబి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ కూడా సుస్మితకు సినాథెన్ పరీక్ష జరిపి ఆమెను డిశ్చార్చ్ చేశారు. అక్కడి నుంచి దుబాయ్ వెళుతుండగా.. అబుధాబి డాక్టర్ నుంచి ఫోన్ వచ్చింది.. ‘సుస్మితా మీరు ఈ పూట డోస్ వేసుకున్నారా?’’ అని. ‘‘లేదు. ఏదైనా తిని వేసుకుంటాను’’ అన్నారు. సుస్మిత. ‘‘అక్కర్లేదు. మీరిక పిల్స్ వేసుకోనక్కర్లేదు’’ అన్నాడు డాక్టర్. సుస్మిత ఆశ్చర్యపోయి, ‘‘ఎందుకు?’’ అని అడిగారు.అప్పుడు డాక్టర్ చెప్పిన మాటకు ఆమె కొన్ని క్షణాల వరకు మామూలు మనిషి కాలేకపోయారు. డాక్టర్‌ను అడిగి మళ్లీ అదే మాట చెప్పించుకున్నారు. ‘‘మీరిక కార్టిసాల్ పిల్స్ వేసుకోనక్కర్లేదు సుస్మితా. ఎందుకంటే మీ ఆడ్రినల్ గ్రంథులు కార్టిసాల్‌ను తిరిగి ఉత్పత్తి చెయ్యడం మొదలు పెట్టాయి’’ అని చెప్పారు డాక్టర్. ఒక విధంగా అది వండర్. ఎందుకంటే తన ముప్పై ఐదేళ్ల ప్రాక్టీస్‌లో ఎప్పుడూ అలాంటి అనుభవాన్ని చూడలేదట ఆ డాక్టర్. ఇక సుస్మిత అయితే తన అదృష్టాన్ని తనే నమ్మలేకపోయారు. 2016 అక్టోబర్‌లోనే మందులు మానేశారు. మానేశాక కొంతకాలం మానడం వల్ల సంభవించే దుష్పరిణామాలు ఆమెను బాధించినా, తట్టుకుని నిలబడ్డారు. ఈ విషయాలన్నీ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘వైద్యులు చెయ్యొద్దన్న దానిని చెయ్యడం నా ఉద్దేశం కాదు. మరణాన్ని తప్పించుకునే పోరాటప్రయత్నంలో నేను ఎలా మార్పు చెందుతానో అలా మారడానికి నా మనసు అంగీకరించలేదు కాబట్టి.. వైద్యులు వారిస్తున్నా నేను చెయ్యాలనుకున్నట్లుగా యోగా చేశాను. జిమ్నాస్టిక్స్‌ని కూడా మొదలు పెట్టాను’’ అన్నారు సుస్మిత. ∙ -
పేగు తెంచుకుని కాదు.. హృదయం నుంచి...
కేవలం అందంతో కాకుండా తనకున్న సేవాగుణంతో ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టారు మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్. అందాల రాణిగా కిరీటం దక్కించుకున్న తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ భామ అనతికాలంలోనే మంచి నటిగా గుర్తింపు పొందారు. హిందీతో పాటు పలు బెంగాలీ, తమిళ చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. వెండితెరపై వెలుగులీనిన ఈ అమ్మడు మనసు వెన్న వంటిదని ఆమె స్నేహితులు చెబుతూ ఉంటారు. చారిటీ కోసం నిర్వహించే ఫ్యాషన్ షోల్లో పాల్గొనడమే కాకుండా ఆపదలో ఆదుకునే గుణం ఆమె సొంతం. అయితే అన్నింటి కంటే కూడా 2000లో సుస్మిత చేసిన పని స్నేహితులతో పాటు అభిమానులను ఆశ్చర్యపరిచారు. పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుందనుకున్న తరుణంలో రీనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుని తల్లిగా మారారు. ఆ తర్వాత పదేళ్లకు రీనికి తోడుగా అలీషా అనే చెల్లెల్ని బహుమానంగా ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన కూతుళ్లతో ఉన్న అనుబంధం గురించి సుస్మితా సేన్ ఇటీవల ఓ వెబ్‌సైట్‌తో పంచుకున్నారు. వాళ్లు తన కన్న కూతుళ్లు కాదనే విషయం రీనీ, అలీషాలకు తెలుసునని.. బంధం బీటలు వారకూడదనే ఉద్దేశంతోనే దత్తత గురించి చెప్పానని పేర్కొన్నారు. ‘ నా కూతుళ్లకు 18 ఏళ్లు వచ్చే నాటికి వారి కన్న తల్లిదండ్రుల గురించి నిజం చెప్పాలని అనుకున్నాను. అయితే రీనీ చిన్నతనంలోనే తనను దత్తత తీసుకున్నానే విషయం చెప్పాను. ఆరోజు తను నా ఎదురుగా కూర్చుంది. కొంతమందికి ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారు. ఒకరు కన్నవారైతే మరొకరు పెంచిన వారు అని చెప్పాను. అయితే తానెవరినని రీనీ అడిగింది. నిన్ను దత్తత తీసుకున్నాను అని చెప్పాను. అప్పుడు తన ముఖంలో అభావాన్ని గమనించాను. అప్పుడు.. ‘నువ్వు నా పేగు తెంచుకుని కాదు. నా హృదయం నుంచి పుట్టావు. బయోలాజికల్ పేరెంట్స్ అంటే బోరింగ్. నువ్వు చాలా స్పెషల్ అని చెప్పాను. ఇక అప్పటి నుంచి ఫ్రెండ్స్‌తో తను అలాగే చెప్పేది. అయితే ఓరోజు కోర్టుకు వెళ్లి తన తల్లిదండ్రుల గురించి వివరాలు తెలుసుకోమని, ఇది తన హక్కు అని రీనికి చెప్పాను. కానీ తను వెళ్లనంది. తన తల్లికి క్షణంపాటు దూరం చేసే ఏ హక్కు అయినా తనకు అక్కర్లేదని చెప్పింది’ అని ఈ మాజీ మిస్ యూనివర్స్ కూతురితో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. -
ప్రియురాలి కూతురి కోసం..
-
పందెం గెలిచాడు!
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్... న్యూఢిల్లీకి చెందిన యువ మోడల్ రోహమన్ షాల్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈవెంట్ ఏదైనా సరే అందరీ కళ్లూ తమపైనే ఉండాలి అన్నట్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది ఈ జంట. అయితే సుస్మితతో రిలేషన్షిప్ వరకే రోహమన్ పరిమితం కాలేదు. ఆమె దత్తపుత్రికలు రీనా, అలీషాలకు తండ్రి ప్రేమను పంచుతూ వారి మనసులు కూడా గెలుచుకున్నాడు. తాజాగా అలీషా స్కూళ్లో జరిగిన పరుగు పందెంలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన రోహమన్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వాట్ ఏ మ్యాన్..! రోహమన్ పరుగుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన సుస్మిత.. ‘ వాట్ ఏ మ్యాన్!!! అదీ రోహమన్ అంటే! అలీషా స్కూల్ ఫాదర్ రేసులో పాల్గొని స్వర్ణం సాధించాడు. ఈరోజు నాకెంతో సంతోషంగా ఉంది. రోహ్, అలీషాలను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. లవ్ యూ గయ్స్’ అంటూ క్యాప్షన్ జత చేశారు. ఇందుకు స్పందనగా ‘ రోహమన్ మీకు, మీ పిల్లలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాడు. అతడిని జీవిత భాగస్వామిగా పొందితే మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు’ అని కొంతమంది రోహమన్‌ను పొగుడుతూ ఉంటే.. మరికొందరు మాత్రం.. ‘ చిన్న వయసులో తండ్రి అవడం వల్లే రోహమన్ గెలిచాడు. పాపం ఆ రేసులో ఉన్న తండ్రులు చాలా పెద్ద వయస్సు వాళ్లు. ఇది తొండాట’ అని సరదాగా కామెంట్ చేస్తున్నారు. అన్నట్లు చెప్పలేదు కదూ.. రోహమన్.. సుస్మితా సేన్ కంటే దాదాపు పదిహేనేళ్లు చిన్నవాడు. -
కార్తికేయ పెళ్లి వీడియో షేర్ చేసిన సుస్మితా సేన్
దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం, జగపతి బాబు సోదరుడి కుమార్తె పూజా ప్రసాద్‌తో జరిగిన సంగతి తెలిసిందే. రాజస్తాన్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరై నూతన జంటకు ఆశీస్సులు అందజేశారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వివాహ వేడుకకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. తన పిల్లలతో(దత్తత తీసుకున్న) కలిసి ఈ వివాహ వేడుకకు హాజరైన ప్రముఖ హీరోయిన్ సుస్మితా సేన్ పెళ్లి చాలా అందంగా జరిగిందని పేర్కొన్నారు. పెళ్లిలో కార్తికేయ, పూజాలు తలంబ్రాలు పోసుకుంటున్న వీడియోను ఆమె షేర్ చేశారు. ‘తలంబ్రాల్లోని ప్రతి ధాన్యం గింజ మీ ఇరువురికి దీవెనలు, ప్రేమ, ఆనందం, సిరిసంపదలు తీసుకురావాలని కోరుకుంటున్నాన’ని తెలిపారు. అంతేకాకుండా ప్రభాస్‌తోపాటు, తన బాయ్ ఫ్రెండ్ రోహ్మాన్ షాల్‌తో దిగిన ఫొటోలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. View this post on Instagram May each grain of rice bring abundance of blessings, love, happiness & divine prosperity to you both❤️💋🙏🎉😍 Congratulations Pooja & @sskarthikeya 🥰🎉Your wedding was filled with such beauty, joy & grace👏❤️😇 here’s to a blessed journey of togetherness!!! #duggadugga #sharing #moments #bangaramsaysss #jaipur #babysister #wedding ❤️💃🏻😁😍I love you guys!!!! @ramvee 😇 A post shared by Sushmita Sen (@sushmitasen47) on Jan 1, 2019 at 3:53am PST 2018లో నాకిష్టమైన ఫొటో: రానా రానా కూడా కార్తికేయ, పూజాలకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. వారిద్దరు జీలకర్ర, బెల్లం పెట్టుకున్న ఫొటోను షేర్ చేసిన రానా ఇది 2018లో తనకు ఇష్టమైన ఫొటో అని పేర్కొన్నారు. ఆ ఫొటో తీసింది ఉపాసన కొణిదెల అని తెలిపారు. View this post on Instagram Favorite picture from 2018!! #bangaramsaysss Congratulations to you lovely people @sskarthikeya photo credits: @upasanakaminenikonidela A post shared by Rana Daggubati (@ranadaggubati) on Jan 1, 2019 at 6:47am PST -
పెళ్లి కబురు చెబుతారా?
విశ్వసుందరి సుస్మితాసేన్ (42) ముంబైలో ఎక్కడ కనిపించినా ఆమె పక్కన రోహ్మన్ షాల్ (27) కనిపిస్తున్నారు. దీంతో సస్మిత సేన్, రోహ్మన్ కే బీచ్ మే కుచ్ కుచ్ హోతా హై (ఇద్దరి మధ్యలో ఏదో జరుగుతోంది) అనే వార్తలు బాలీవుడ్లో వినిపించాయి. వీటికి తగ్గట్లే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రోహ్మన్ గురించి సంబోధిస్తూ ‘లవ్’ అన్నారు సుస్మిత. దీంతో వీరిద్దరి లవ్‌ను కన్ఫార్మ్ చేశారు గాసిప్‌రాయుళ్లు. తాజాగా నలుగురు కలిసి ఉన్న ఫొటో పోస్ట్ చేశారు సుస్మిత. దీంతో ఈ జంట పెళ్లి ఫిక్స్ అంటున్నారు ఔత్సాహిక రాయుళ్లు. ‘‘ఓ ఫ్యాషన్ ఈవెంట్లో భాగంగా సుస్మిత, రోహ్మన్లకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఈ పరిచయం ప్రేమగా మారింది. సుస్మితకు రోహ్మన్ ప్రపోజ్ చేశా డు. ఇద్దరూ పెళ్లి గురించి చర్చించు కుంటున్నారు. సుస్మిత దత్త పుత్రికలు రినీ, అలీస్ కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నారు. అన్నీ కుదిరితే సుస్మిత వివాహం వచ్చే ఏడాది ఉండొచ్చు’’ అని ఆమె సన్నిహితులు చెబుతున్నారట. మరి.. సుస్మిత త్వరలో పెళ్లి కబురు చెబుతారా? వెయిట్ అండ్ సీ. ఇక...1994లో విశ్వసుందరిగా నిలిచిన సుస్మితా సేన్ 1996–2015 మధ్యలో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. దత్త పుత్రికలు, రోహ్మన్తో సుస్మితా -
వైరల్ వీడియో : హీరోయిన్స్‌కు ధీటుగా..
సుస్మీతా సేన్, సంజయ్ కపూర్లు జంటగా వచ్చిన ‘సిర్ఫ్ తుమ్’ సినిమాలోని ‘దిల్బర్.. దిల్బర్’ పాట గుర్తుందా..? అప్పట్లో ఈ సాంగ్ ఓ సెన్షేషన్‌ని క్రియేట్ చేసింది. ఈ మధ్య కాలంలో జాన్ అబ్రహాం హీరోగా వచ్చిన ‘సత్యమేవ జయతే’లో కూడా ఈ పాటను రిమేక్ చేశారు. నోరా ఫతేహీ బెల్లీ స్టేప్పులతో ఈ పాటకు మరోసారి క్రేజ్ పెంచేశారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ డ్యాన్సర్ సుస్మీతా సేన్‌కి, నోరాకు గట్టి పోటీ ఇస్తున్నాడు. బెల్లీ మూవ్మెంట్లో నోరానే కాదు ఐటమ్ గర్ల్స్ అందరూ తన ముందు దిగదుడుపే అంటున్నాడు ఈ కాలేజీ యువకుడు. ‘దిల్బర్’ సాంగ్‌కు ఈ అబ్బాయి వేసిన స్టేప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ యువకుడి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ సారి ఈ వీడియో చూడండి. -
ఐటమ్ గర్ల్స్‌కు ధీటుగా..
-
సుస్మితా సేన్ కన్ఫామ్ చేసేశారా!?
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ మరోసారి ప్రేమలో పడ్డారని బీ-టౌన్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. న్యూఢిల్లీకి చెందిన యువ మోడల్ రోహమన్ షాల్‌తో ఆమె డేటింగ్ చేస్తున్నారంటూ రూమర్లు ప్రచారమవుతున్నాయి. అయితే వీటన్నింటికీ బలం చేకూరుస్తూ ఇటీవలే రోహమన్తో కలసి ఫొటోలకు ఫోజులిచ్చారు ఈ బ్యూటీ. అంతేకాకుండా అతడితో కలిసి తాజ్‌మహల్‌ను సందర్శించిన అనంతరం.. ‘మై లవ్ ఆఫ్ లైఫ్’ అంటూ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కూడా. తాజాగా... తన కూతురు రీనీతో కలిసి రోహమన్ సంగీత సాధన చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సుస్మిత.. ‘రీనీ తన గురువు సారథ్యంలో సంగీతం నేర్చుకుంటోంది. ఆమెకు తోడుగా రోహమన్ షాల్ కూడా ఉన్నాడు. నా కూతుళ్లకు సంబంధించిన సంతోషకర సమయాల్లో తనెప్పుడూ భాగమవుతూ ఉంటాడు. లవ్ యూ గయ్స్’ అంటూ క్యాప్షన్ జత చేశారు. కాగా కొన్నాళ్ల క్రితం రితిక్ భాసిన్(నైట్ క్లబ్ యజమాని)తో బ్రేకప్ చేసుకున్న సుస్మిత ప్రస్తుతం రోహమన్తో డేటింగ్లో ఉన్నారట. తనతో పాటు రీనా, అలీషా(సుస్మిత దత్త పుత్రికలు)లకు కూడా రోహమన్ దగ్గరయ్యాడని, వారికి కూడా సమయం కేటాయించి సుస్మిత మనసు గెలుచుకున్నాడని బీ- టౌన్ కోడై కూస్తుంది. సుస్మితా సేన్ సోషల్ మీడియా అప్డేట్స్ చూస్తుంటే రోహమన్తో తన రిలేషన్ కన్ఫార్మ్ చేసినట్టే ఉన్నారంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పదిసార్లు ప్రేమలో పడిన ఆమె ఈసారైనా పెళ్లి పీటలెక్కుతారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. అన్నట్లు.. రోహమన్.. సుస్మితా సేన్ కంటే దాదాపు పదిహేనేళ్లు చిన్నవాడు. View this post on Instagram “Music is a #vibration of happiness”❤️💃🏻😀To witness Renee & her #Guruji do their #riyaz is just magical!!👏😊❤️ And Guruji on his part, makes sure EVERYONE sings😄🙏 So, @rohmanshawl (who already sings beautifully ❤️) & yours truly also share in the happiness!!! 😍💃🏻🎵 Alisah decided to be incharge of #applause 😅❤️ proud of you Renee Shona, May you always have a #song in your heart, with the courage to sing it!!👏😍👍#sharing #happiness #music #feeling #bliss 💋I love you guys!!!😀😘 A post shared by Sushmita Sen (@sushmitasen47) on Oct 28, 2018 at 11:01am PDT -
‘మీటూ’.. మరింత ముందుకు
‘మీటూ’ ఉద్యమ విస్తృతి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా లైగింక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్న వారిలో బాలీవుడ్ దర్శకులు సాజిద్ ఖాన్, వికాస్ బాల్, సుభాష్ కపూర్, నటుడు నానా పటేకర్‌తో పాటు మరికొందరు వృత్తి పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ వైస్ ప్రెసిండెంట్, క్రియేటివ్ హెడ్ ఆశిష్ పాటిల్ చేరారు. ‘ఆశిష్ పాటిల్ తనను లైగింకంగా వేధించాడు’ అని ఓ మహిళ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. బాధితురాలు తమకు సరైన పద్ధతిలో ఫిర్యాదు చేస్తే ఆయనపై తగిన చర్యలు తీసుకుంటామని యశ్‌రాజ్ ఫిల్మ్స్ ప్రతినిధులు అన్నారు. ఆశిష్‌కు అడ్మినిస్ట్రేటివ్ సెలవును ప్రకటించారు. ఆ తర్వాత అతన్ని వి«ధుల నుంచి పూర్తి్తగా తొలగిస్తున్నట్లు మంగ ళవారం ట్వీటర్ వేదికగా పేర్కొన్నారు. క్వాన్ ఎంటర్టైన్మెంట్ ప్రముఖుడు అనిర్భాన్ దాస్ బ్లాహ్పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో అతన్ని విధుల నుంచి తప్పుకోవాలని ఆ సంస్థ ప్రతినిధులు ఓ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘దాస్ బ్లాహ్ను వైదొలగాలని కోరాం. మా ఉద్యోగులకు సేఫ్ అండ్ సెక్యూర్ వాతావరణాన్ని క్రియేట్ చేయడం మా కర్తవ్యం. ‘మీటూ’ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాం’’ అని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. సౌత్‌లోనూ ‘మీటూ’ ఉద్యమ గొంతులు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా నటి సంగీతా బాద్, ఆర్.జే. నేత్ర మాట్లాడుతూ ‘తామూ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం’’ అన్నారు. కథానాయికలు కృతీకర్బందా, శృతీ హరిహరన్, సంయుక్తా హెగ్డేలతో పాటు మరికొందరు కథానాయికలు ‘మీటూ’ ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఆ హక్కు ఎవరికి ఉంది?! మరోవైపు నటి భావనపై లైంగిక దాడి విషయంలో నటుడు దిలీప్ సభ్యత్వంపై వేటు వేయకుండా మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ)లో కొనసాగిస్తుండటంపై ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్(డబ్ల్యూ.సీ.సీ) సభ్యులు తప్పుబట్టారు. బాలీవుడ్లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి నటించబోమని చెప్పిన అక్షయ్‌కుమార్, ఆమిర్‌ఖాన్ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఈ విషయంపై ‘అమ్మ’ కార్యదర్శి సిద్ధిఖీ స్పందిస్తూ...‘‘డబ్ల్యూ.సి.సి సభ్యులు అక్షయ్‌కుమార్, ఆమిర్‌ఖాన్‌లను ఉదాహరణలుగా చెప్పారు. కేవలం ఆరోపణలను ఆధారంగా చేసుకుని ఓ వ్యక్తిని ఒక వృత్తి నుంచి నిషేధించమనే హక్కు ఎవరికి ఉంది? ఇది ఎంత వరకు సమంజసమైంది. నిందితులుగా తమ పేర్లు జాబితాలో ఉంటే అప్పుడు కూడా అక్షయ్, ఆమిర్ తాము నటిస్తున్న సినిమాల గురించి ఇలానే చేస్తారా?’’ అని షూటుగా విమర్శించారు. ఇదొక ఆరంభం ‘మీటూ’ ఉద్యమంపై తాజాగా నటి సుస్మితా సేన్ స్పందించారు. ‘‘ కొన్నిసార్లు ఇలాంటి విషయాలు షాకింగ్‌లా ఉంటాయి. కానీ, మనం అమాయకులం ఏమీ కాదు. ఇదొక ఆరంభం. ‘మీటూ’ ఉద్యమంలో మాట్లాడిన బాధిత మహిళల మాటలను వినాలి. నమ్మాలి. వ్యాప్తి చేయాలి’’ అన్నారు. దుర్వినియోగం కాకూడదు రకుల్‌ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్లో ‘దేదే ప్యార్ దే’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు లవ్ రంజన్‌పై లైగింక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై రకుల్‌ను అడగ్గా...‘బాధిత మహిళల మాటలను ప్రజలు వింటున్నారు. కొంతమంది శిక్షించ బడుతున్నారు కూడా. రాబోయే కాలంలో వర్క్ ప్లేస్ మరింత సౌకర్యంగా ఉండాలంటే ‘మీటూ’ ఉద్యమం మిస్ యూజ్ కాకూడదు’’ అని పేర్కొన్నారు రకుల్. కాగా ‘‘లైంగిక వేధింపుల గురించి ఎప్పటికీ చెప్పకపోవడం కన్నా కాస్త ఆలస్యంగానైనా ఇప్పుడు చెప్పడం ఉత్తమమే’’ అని సల్మాన్‌ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ పేర్కొన్నారు. ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా తాజాగా మరికొందరిపైనా ఆరోపణలు వస్తున్నాయి. -
ర్యాంప్‌వాక్‌తో మెస్మరైజ్
-
డిజిటల్ ఫీవర్
నోట్ల పాట శింబు నోట! ఐదువందలు, వెయ్యిరూపాయల నోట్లు రద్దు చేసి ఏడాది అయింది. ఈ సందర్భంగా శింబూ సరదాగా ఓ పాట పాడాడు. అది ఇప్పుడు వైరల్ అయింది. అంతేకాదు, నోట్లరద్దు వల్ల సామాన్య ప్రజలపై పడ్డ ప్రభావాన్ని వీడియోలుగా తీసి డీ మానిటైజేషన్ యానివర్సరీ పేరుతో ఐదు ఫన్నీ వీడియోలు తీశారు. అందులో మోడీ సర్కస్ ఒకటి. వాటిలో కొందరు రెండువేల నోటుకు పుట్టినరోజు జరుపుతుంటే, ఇంకొందరు ఐదువందలు, వెయ్యినోట్లకు వర్ధంతి జరుపుతున్నారు. ఇప్పుడు ఈ విడియోలన్నీ హల్ చల్ చేస్తున్నాయి. చూసినవాళ్లు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏ మాటకా మాట చెప్పుకోవాలంటే... వీటన్నిటిలో సినీనటుడు శింబూ పాటదే హైలైట్. స్టెప్పు అదిరింది ధోనీ! సెలబ్రిటీలయినంత మాత్రాన మేం మనుషులం కామా, మాకూ సరదాలుండవా అంటున్నాడు ఇండియన్ క్రికెటర్ ఎం.ఎస్. ధోని. క్రికెట్ ఆటలోనే కాదు, డాన్స్‌లో కూడా తానేమీ తీసిపోనంటున్నాడు. అందుకు ఉదాహరణగా, ఓ పాటకు స్టెప్పులు కూడా వేశాడు ఈ ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్. సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ సప్నా మోతీ భావ్నాని ఇటీవల పోస్ట్ చేసిన ఈ వీడియో దాన్ని బలపరుస్తోంది. 2011లో విడుదలైన హిందీ చిత్రం దేశీ బాయ్స్‌లోని ఝాక్ మార్ కే పాటకు ధోనీ సరదాగా స్టెప్పులు వేసిన ఈ వీడియోలో దోని భార్య సాక్షి కూడా ఉన్నారు. ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేయని వాళ్లు, కామెంట్లు పెట్టని వాళ్లూ లేరు. వాళ్లలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ ఉన్నారు. ది ట్రంప్ డాగ్! మనిషిని పోలిన మనుషులుంటారని మనం విన్నాం. కొండొకచో కన్నాం కూడా. అయితే, కుక్క చెవిలో మనిషిని పోలిన కణితి ఉండడం ఎంత వింత! అందునా ఆ మనిషి ఒక ప్రముఖ వ్యక్తి కావడం ఇంకెంత విడ్డూరం! అందుకే ఇది వైరల్ అయి కూచుంది మరి.యూకేకు చెందిన జేడ్ రాబిన్సన్ తన పెంపుడు కుక్క చెఫ్, గత కొద్దికాలంగా చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్తో బాధపడుతుండడంతో, దాని చెవిలోపలి భాగాన్ని ఫొటో తీసి, పెట్ డాక్టర్‌కు పంపింది. అది చూసిన ఆ వైద్యురాలు, షాకయ్యింది. ఆమెను అంతగా షాక్‌కు గురి చేసిన విషయమేమిటంటే, ఆ పెంపుడు కుక్క చెవిలో ఒక గడ్డ ఉంది. ఆ గడ్డ మూలంగానే దానికి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇంతకీ సదరు డాక్టర్ షాక్ తిన్న విషయం అది కాదు... ఆ గడ్డ అచ్చం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముఖాన్ని పోలి ఉండటమే! చెఫ్, అదేనండీ, ఆ కుక్కగారు.. మేలుకుని ఉన్నప్పుడు దాని చెవిని కనీసం తాకనివ్వను కూడా తాకనిచ్చేది కాదు. దాంతో, జేడ్ అది గాఢంగా నిద్రపోయేటప్పుడు కనీసం 20 సార్లయినా వివిధ భంగిమలలో దాని చెవిని ఫొటోలు తీసి, తన ఫ్రెండ్‌కు పంపింది. ఆమె ఆ ఫొటోలను జూమ్ చేసింది. అందులో ఆమెకు ట్రంప్ ముఖం కనిపించింది. వెంటనే ఆమె ఆ విషయాన్నే జేడ్ చెవిన వేసింది. జేడ్ ఊరుకోలేదు. తన ముద్దుల చెఫ్ వైద్యానికయ్యే ఖర్చులకోసం సాయం చేయవలసిందిగా అర్థిస్తూ ట్విటర్లో పోస్ట్ చే సింది. దానికోసం ఓ పేజ్ కూడా క్రియేట్ చేసింది. దీనిపై నలుగురూ నాలుగు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అదే ఇప్పుడు వైరల్ అయ్యింది. సుస్మితా లుక్సూపర్! నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ త్వరలో 42వ ఏట అడుగు పెట్టబోతోంది. గతంలో ఆమె నిర్ణయం తీసుకుంది. అదేమంటే, బాడీ షేపవుట్ కాకుండా ఫిట్‌గా ఉంచుకోవాలని...ముఖంపై ఏమాత్రం ముడతలు పడకుండా చూసుకోవాలని. వీటిని కాస్మటిక్ ట్రీట్మెంట్లు, శస్త్రచికిత్సలతో కాకుండా ఎక్సర్సైజ్లు, డైటింగ్ ద్వారా మాత్రమే సాధించాలని. ఈ 19న బర్త్‌డే చేసుకోబోతున్న సుస్మిత ప్రస్తుతం షార్జాలో ఉంది. తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. కుర్చీని తొడిగేసుకోవచ్చు విలన్ విలాసంగా కుర్చీలో కూర్చుని ఉంటాడు. ఎదురుగా హీరో నిలబడి ఉంటాడు. హీరోని కూర్చోమని కుర్చీ చూపించే కనీస మర్యాద మన తెలుగు విలన్‌కు ఉండదు. కనుచూపు మేరలో ఉన్న కుర్చీని కండువాతో లాగి, దాని మీద కూర్చుని కాలు మీద కాలేసుకుని దర్పాన్ని ఒలకబోస్తాడు మన హీరో. ఇకపై మన హీరోలు కుర్చీ కోసం లేనిపోని ఫీట్లు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కుర్చీని తొడిగేసుకోవచ్చు. అదేంటి ఫ్యాంటా? కోటా? తొడిగేసుకోవడానికి అని ఆశ్చర్యపోకండి. ఇంచక్కా ఫ్యాంటులాగానే ఒంటికి తొడిగేసుకునే కుర్చీ అందుబాటులోకి వచ్చేసింది. ఈ కుర్చీలాంటి కుర్చీని ఫ్యాంటుకు తొడిగేసుకుని ఎక్కడికైనా ఈజీగా వెళ్లొచ్చు. కూర్చోమని ఎవరూ కుర్చీ చూపించకపోయినా, దర్పానికి లోటు రాకుండా ఎక్కడంటే అక్కడ కాలు మీద కాలేసుకుని భేషుగ్గా కూర్చోవచ్చు. ‘నూనీ ఏజీ’ అనే స్విస్ కంపెనీ ఈ తొడుక్కునే కుర్చీని రూపొందించింది. దీని ధర దాదాపు వెయ్యి డాలర్లు. మన లెక్కల్లో చెప్పుకోవాలంటే సుమారు రూ.60 వేలు. -
‘మై బాడీ.. మై రూల్స్’: నటి సెల్ఫీ వైరల్
న్యూఢిల్లీ : నాలుగు పదుల వయసులోనూ ఏ విషయంలోనూ రాజీ పడకుండా ధైర్యంగా తన ముందు సవాళ్లను ఎదుర్కొంటోంది బాలీవుడ్ నటి సుస్మితాసేన్. తన పుట్టినరోజు లోగా తాను ఏం కోరుకున్నాదో అది సాధిస్తానంటూ మాజీ విశ్వసుందరి సుస్మిత ఇటీవల చేసిన ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్‌గా మారింది. ఎందుకంటే.. ఆమె పోస్ట్ చేసిన ఫొటోనే అందుకు కారణం. స్లిమ్ ఫిట్‌గా ఉండాలని భావించిన సుస్మితా సేన్.. తాను ఫిట్నెస్ కోసం ఎక్కడికి వెళ్లినా అక్కడ ఫొటోలు దిగి ఫాలోయర్లతో ఏ భయం లేకుండా షేర్ చేసుకుంటానని తెలిపింది. ‘మై బాడీ.. మై రూల్స్’ అంటూ ఆ పోస్ట్ చేసిన ఈ బ్యూటీ నవంబర్ 19న 42వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. పుట్టినరోజును తన బాడీ లేక ముఖానికి సంబంధించిన విషయాలు షేర్ చేసి సెలబ్రేట్ చేసుకోవాలని నటి భావిస్తోంది. తాజాగా షార్జా చేరుకున్నాక దిగిన ఓ సెల్పీని పోస్ట్ చేయడంతో కేవలం 12 గంటల్లోనే లక్షన్నర లైక్స్ రావడం గమనార్హం. ఇక్కడి అల్ ఖాసిమా స్ట్రీట్‌లో ఓ స్టోర్‌ను నేటి (బుధవారం) రాత్రి ఏడు గంటలకు ప్రారంభించనున్నట్లు సుస్మితా వెల్లడించారు. విక్రమ్ భట్ విడాకులకు కారణం సుస్మితానే అంటూ ఇటీవల వదంతులొచ్చినా తన తప్పు లేదని పేర్కొన్న ఆమె, ధైర్యంగా అలాంటి సమస్య నుంచి బయటపడిన విషయం తెలిసిందే. -
చెన్నై కోర్టుకు హాజరైన నటి
సాక్షి, చెన్నై: నటి, మాజీ ప్రపంచసుందరి సుస్మితాసేన్ సోమవారం ఎగ్మూర్ కోర్టులో హాజరయ్యారు. కారు కొనుగోలు వ్యవహారంలో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో ఆమె న్యాయస్థానం ముందుకు వచ్చారు. 2005లో విదేశాల నుంచి దిగుమతి అయిన ల్యాండ్ క్రూజ్ బ్రాండ్ కారును రూ. 55 లక్షలకు ఆమె కొనుగోలు చేశారు. అయితే ఈ కారు 2004లో తయారైనట్లు చెన్నై హార్బర్లో నమోదు చేయబడింది. అదీకాకుండా ఆ కారు టాక్స్‌కు సంబంధించి తప్పుడు లెక్కలు చూపినట్లు హార్బర్ కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దీంతో ఆ కారును దిగుమతి చేసిన ముంబాయికి చెందిన హరన్, బండారి తమలాలపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ఎగ్మూర్ న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. అయితే ఆ కారుకు సంబంధించి సుస్మితాసేన్ రూ.20.31 లక్షలను పన్నును చెల్లించారు. ఈ విషయంలో ఆమెను కస్టమ్స్ అధికారులు సాక్షిగా పేర్కొనడంతో గతంలో ఒకసారి ఎగ్మూర్ కోర్టుకు హాజరై తాను చెల్లించిన పన్ను ఆధారాలను సమర్పించి వివరణ ఇచ్చారు. ఆ తరువాత ఈ కేసులో నిందితులను క్రాస్ ఎగ్జామ్ చేయడానికి మరోసారి కోర్టుకు హాజరవ్వాల్సిందిగా సుస్మితాసేన్‌కు పలుసార్లు ఉత్తర్వులు జారీ చేసినా ఆమె హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో సుస్మిత తాను కారుకు సంబంధించి పన్నును చెల్లించానని అందువల్ల తనపై అరెస్ట్ వారెంట్‌ను రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని చెన్నై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు నటి సుస్మితాసేన్ నేరుగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. దీంతో సోమవారం ఉదయం సుస్మితాసేన్ ఎగ్మూర్ కోర్టుకు హాజరయ్యారు. -
అప్డేట్గా ఉన్నా.. అది లేకపోతే వేస్ట్: నటి
హైదరాబాద్: ‘అన్ని రకాల ఫ్యాషన్లను ఫాలో అవుతూ అప్డేట్గా ఉన్నా ముఖంలో సంతోషం లేకపోతే అవన్నీ నిరుపయోగం. సంతోషంగా ఉన్న మనిషి ఎల్లప్పుడూ స్టైలిష్‌గా ఉంటార’ని మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితాసేన్ అన్నారు. నగర డిజైనర్ శశి వంగపల్లి ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్టాడుతూ... ఎందరో డిజైనర్ల ప్రతిభను దగ్గర నుంచి గమనించిన తనకు మహిళలను శక్తివంతంగా చూపించే ఫ్యాషన్ బాగా మెప్పిస్తుందని చెప్పారు. అలాంటి డిజైన్లను శశి వంగపల్లి సృష్టిస్తుందంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా గత లాక్మె ఫ్యాషన్ వీక్‌లో ఆమె కోసం తాను ర్యాంప్‌వాక్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. తాజాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో సైతం శశి డిజైన్లను మెరిపించి దక్షిణాది డిజైనర్లలో ఎవరికీ దక్కని ఘనతను సాధించుకున్నారని అభినందించారు. డిజైనర్ శశి వంగపల్లి మాట్లాడుతూ తన ‘కేన్స్’ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. త్వరలోనే నగరంలో అతిపెద్ద డిజైనర్ షోరూమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సుస్మితాసేన్‌తో కలిసి ‘ఫర్ ది బ్యూటిఫుల్ షి’ పేరుతో కొన్ని సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి పలువురు మోడల్స్, నగర ప్రముఖులు హాజరయ్యారు. -
డైవర్స్ తర్వాత చనిపోవాలనుకున్నా..విక్రమ్ భట్
ముంబై : ప్రముఖ దర్శకుడు, నిర్మాత విక్రమ్ భట్ తన జీవితంలో చేసిన తప్పులపై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తన పెళ్లి, విడాకులు, ఇతరులతో కొనసాగించి అఫైర్స్‌పై తనదైన శైలిలో ప్రస్తావించాడు. ఏదో ఒక సింగిల్ రిలేషన్ షిప్ తనను శిథిలం చేయలేదని పేర్కొన్నాడు. తన జీవితమే శిథిలాల సమూహం కంటే పెద్దదిగా అభివర్ణించాడు. తన చిన్ననాటి నుంచి ఎంతగానో ఇష్టపడ్డ అధితిని ఏరికోరి పెళ్లి చేసుకున్నాడు విక్రమ్ భట్. కానీ, నటి సుస్మితా సేన్‌తో కొనసాగించిన వివాహేతర సంబంధం అధితిని అతని నుంచి దూరం చేసింది. తన భార్యతో డైవర్స్ తీసుకున్న తర్వాత విక్రమ్ భట్ ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసినట్టు తెలిపాడు. ఆ సమయంలో తన భార్య, కూతురును వదిలేయడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. 'అదంతా సుస్మితా సేన్ వల్ల జరగలేదు. నా జీవితంలో నాకు నేనుగా చేసుకున్న అతిపెద్ద తప్పులు అవి. నేను డైవర్స్ తీసుకున్నా, అప్పుడే నా చిత్రం గులాం విడుదలైంది. నేను కేవలం సుస్మితా సేన్ బోయ్ ఫ్రెండ్‌ని మాత్రమే. అధితితో డైవర్స్ తర్వాత నేను చాలా బాధపడ్డాను. నా కూతురుని మిస్సయ్యాను. నా జీవితాన్ని గందరగోళంగా చేసుకున్నాను. నా తప్పిదాలతో వాళ్లు ఎంతగానో బాధ అనుభవించారు' అంటూ తను చేసిన తప్పులపై తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు విక్రమ్ భట్. నీకు ధైర్యం లేకపోతేనే, మోసగాడిగా మారుతావని బలంగా నమ్మేవాడిని నేను. నేనెలా బాధపడ్డానో అధితికి చెప్పడానికి ఆ సమయంలో నాకు ధైర్యం సరిపోలేదు. గజిబిజిగా జరిగిన పరిణామాలు మా ఇద్దరిని దూరం చేశాయి. ఆ సమయంలో నేను చాలా వీక్‌గా ఉన్నందుకు చింతిస్తున్నా. ప్రస్తుతం పరిణామాలు చాలా మారాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలో చేసిన ప్రతి తప్పు ఓ గుణ పాఠాన్ని నేర్పించిందని విక్రమ్ భట్ చెప్పారు. విక్రమ్ భట్ విడుదల చేసిన 'ఏ హ్యాండ్‌ఫుల్ సన్ షైన్' నవల వీర్, మీరా అనే క్యారెక్టర్ల చుట్టు తిరుగుతుంది. ఇద్దరూ ఎంతగా ఇష్టపడి ప్రేమించుకున్న వ్యక్తులు ఓ కారణంతో విడిపోతారు. అయితే అతని నిజజీవితానికి దగ్గరగా ఉన్న ఈ నవలలో సుస్మితా సేన్, అమీషా పటేల్ గురించి ఏమీలేదన్నారు. సుస్మితాసేన్, అమిషాపటేల్లతో కొనసాగించిన ప్రేమయాణంపై పెదవి విప్పాడు. వాళ్లు నాతో రిలేషన్షిప్లో ఉన్న సంగతి అందరికీ బాగా తెలిసిన విషయం కావొచ్చు. కానీ, వాళ్లు కేవలం తాత్కాలికం మాత్రమే. వాళ్లను ఏరోజు కూడా పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని విక్రమ్ భట్ వ్యాఖ్యానించారు. -
నేను మగాడిని అయి ఉంటే!: నటి
ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ అభిమాని మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితాసేన్ కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా అజయ్ కేఆర్ శుక్లా అనే ఫాలోయర్ నటిని ఓ ప్రశ్న అడిగాడు. ఒకవేళ మీరు మగవారు అయితే మహిళలు, మహిళా సాధికారత కోసం ఎలాంటి పనులు చేస్తారు, మీ ఆలోచన విధానం ఎలా ఉండేదని సుస్మితాను సమాధానం అడుగుతూ ట్వీట్ చేశాడు. అభిమాని ట్వీట్ కు కొన్ని నిమిషాల్లోనే సుస్మితాసేన్ బదులిచ్చారు. మొదటగా ఆ ప్రశ్న అడిగినందుకు మెచ్చుకున్నారు. 'ఒకవేళ తాను పురుషుడు అయితే మాత్రం కచ్చితంగా ఆడవాళ్ల సాధికారత కోసం పోరాటం చేయనని.. మగవారితో పాటు మహిళలు కూడా సమానమేనని గుర్తుంచుకుంటాను. అదేవిధంగా ఆడవారికి సమాన అవకాశాలు ఉండాలని భావిస్తానని' నటి సుస్మితాసేన్ మరో ట్వీట్ లో ఇలా తన అభిప్రాయాన్ని అజయ్ కేఆర్ శుక్లా అనే ఫాలోయర్ తో షేర్ చేసుకున్నారు. ఇటీవల తన పెళ్లి ప్రస్తావనపై వచ్చే అంశాలపై మాట్లాడుతూ.. నిప్పుతో చెలగాటం ఆడే మగాడు తనకు కనిపించలేదని అందుకే తాను సింగిల్ గా ఉంటున్నానని చమత్కరించిన విషయం తెలిసిందే. Faaaab question!!! -
అందుకే పెళ్లి చేసుకోలేదు: నటి
ముంబై: సినీ ఇండస్ట్రీలో నటీమణుల వయసు, పెళ్లి విషయాలు ఎప్పుడూ ఏదో రకంగా చర్చ వస్తున్నాయి. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్(41) కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఆమెను ఎప్పుడూ వెంటాడే ప్రశ్న.. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? సరిగ్గా ఇదే ప్రశ్నను ప్రతి ఈవెంట్లోనూ ఆమెను మీడియా సహా ఆమె సన్నిహితులు అడుగుతుంటారు. అందుకు భిన్నంగా తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. తనను నిప్పుతో పోల్చుకున్న సుస్మితా.. ఇప్పటివరకూ నిప్పుతో చెలగాటం ఆడేందుకు ఇష్టపడే వ్యక్తి తారస పడలేదని దీటు జవాబును ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 'సింగిల్ గా ఉండటమా.. లేక జంటగా ఉండటమా అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత అభిప్రాయం. ఇతరులు ఒక్కరిగా ఉన్నా, జంటగా ఉన్నా నా అభిప్రాయం ఒకేలా ఉంటుంది. అందరినీ గౌరవించడం నా పాలసీ. ఇప్పటివరకూ నాకు తగిన వ్యక్తి కనిపించలేదు. నిప్పులాంటి తనతో కలిసి జీవించేందుకు ఇష్టపడే వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదని' నటి సుస్మితా తన పోస్టులో రాసుకొచ్చింది. ఫిలిప్పీన్స్ లో ఇటీవల జరిగిన మిస్ యూనివర్స్ పోటీలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. సింగిల్ గా ఉన్న సుస్మితా రెనీ(16), అలీసా(8)లను దత్తత తీసుకుని పెంచుకుంటున్న విషయం తెలిసిందే. -
సుస్మిత.. రోష్మిత
మిస్ యూనివర్స్ పేర్లు కలిశాయి.. ‘టైటిల్’ కూడా కలిసొస్తుందా? విశ్వసుందరిగా ఎంపికైన వేదిక నుంచే ‘విశ్వసుందరి’ పోటీలకు న్యాయనిర్ణేతగా వెళ్లడం అపురూపమైన సంగతే! ‘అయితే ఇది అపురూపం మాత్రమే కాదు. పరిపూర్ణం కూడా. నా లైఫ్ ఇప్పుడు ఫుల్ సర్కిల్ తిరిగినట్లుగా ఉంది’ అంటున్నారు మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్. 1994లో ఫిలిప్పీన్‌లో మనీలాలో జరిగిన అందాల పోటీలలో సుస్మిత ‘విశ్వ సుందరి’గా ఎన్నికయ్యారు. 23 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ఫిలిప్పీన్స్‌లో జనవరి 30న జరగబోతున్న మిస్ యూనివర్స్ పోటీలకు జడ్జీలలో ఒకరిగా హాజరవుతున్నారు! ఆ ఈవెంటుకు సుస్మిత.. డాన్సింగ్ హార్ట్‌తో సిద్ధం అవుతున్నారట. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, తన కూతురు అలీషా సేన్ ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు సుస్మిత. ఈ తల్లీకూతుళ్లిద్దరితో పాటు మిస్ యూనివర్స్ టైటిల్ కోసం మనదేశం నుండి పోటీపడుతున్న రోష్మిత హరిమూర్తి.. ఆ రోజున భారతీయతకు నిండుదనం తేబోతున్నారు. లక్కీగా రోష్మితకు గానీ టైటిల్ వచ్చిందా... మళ్లీ అదో రికార్డ్ అవుతుంది. -
హీరోయిన్ బర్త్‌డే స్పెషల్ ఫొటోలు!
ప్రముఖ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ శనివారం (నవంబర్ 19) 41వ వసంతంలో అడుగుపెట్టింది. దుబాయ్‌లో విహరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తన పుట్టినరోజు వేడుకలు కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య ఆనందంగా జరుపుకొంది. కూతుళ్లు రీనా, ఆలీషా, తల్లి సుభ్రాతోపాటు పలువురు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దుబాయ్‌లో కలర్ఫుల్గా జరిగిన ఈ పుట్టినరోజు వేడుకల ఫొటోలను సుస్మిత తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది. చాలా క్యూట్‌గా ఉన్న ఈ ఫొటోలు నెటిజన్లను అలరిస్తున్నాయి. నాగార్జున ‘రక్షకుడు’ సినిమాతో తెలుగువారిని కూడా పలుకరించిన సుస్మితా సేన్ హిందీలో ‘మై హు నా’ వంటి సూపర్‌హిట్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. తన మరిన్ని పుట్టినరోజు ఫొటోలు ఇక్కడ చూడొచ్చు. -
అమ్మా... అమ్మోరు తల్లీ...
దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్లు ‘అమ్మా.. అమ్మోరు తల్లీ..’ అంటూ అమ్మవారిని పూజిస్తున్నారు. హిందీ తారలైతే ఇంట్లో పూజలు చేయడంతో పాటు వీధుల్లో అక్కడక్కడా పెట్టే అమ్మవారి విగ్రహాలను దర్శిస్తుంటారు. ప్రతి ఏడాదీ అమితాబ్ బచ్చన్ కుటుంబం, కాజోల్, సుస్మితా సేన్, రాణీ ముఖర్జీ వంటి తారలు తప్పనిసరిగా అమ్మవారిని సందర్శిస్తుంటారు. అందరూ ఒకే ఏరియాకి కాకపోయినా ఎవరి సౌకర్యానికి తగ్గట్టుగా వాళ్లు వెళుతుంటారు. కొడుకు, కోడలు, మనవరాలు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, ఆరాధ్యా బచ్చన్, భార్య జయాబచ్చన్, కూతురు శ్వేతానందాతో కలిసి అమితాబ్ బచ్చన్ అమ్మవారికి పూజలు నిర్వహించారు. అభి, ఐష్, ఆరాధ్యలను జనాలు చుట్టుముట్టేసి, ఫొటోలు తీయడానికి ప్రయత్నించారు. ఇక, కాజోల్ విషయానికొస్తే, కూతురు నైసా, కొడుకు యుగ్, తల్లి తనూజలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఎప్పటిలానే సందడి సందడిగా ప్రసాదం పంచారు. దత్త పుత్రికలు రీనీ సేన్, అలీషా సేన్‌తో సుస్మితా సేన్ అమ్మోరు తల్లికి పూజలు నిర్వహించారు. డింపుల్ బ్యూటీ ఆలియా భట్ కూడా అమ్మవారిని దర్శించుకుని, తన భక్తిని చాటుకున్నారు. ఇంకా బాలీవుడ్‌కి చెందిన పలువురు స్టార్స్‌అమ్మోరు తల్లిని భక్తి శ్రద్ధలతో పూజించారు. -
పులితో ఆట...ఆ తర్వాత ఈత...
‘రేయ్.. పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో.. చూస్కో. పులితో ఫొటో దిగాలనిపించింది అనుకో.. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ట్రై చేయొచ్చు. సరే.. చనువిచ్చింది కదా అని పులితో ఆడుకోవాలనుకుంటే మాత్రం వేటాడేస్తది’.. అని ‘యమదొంగ’లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది. ఏదో సినిమా కాబట్టి ఫొటో దిగొచ్చని అన్నారు కానీ, నిజమైన పులితో ఎవరైనా ఆ పని చేయాలనుకుంటారా? ఒకవేళ అవి ఏమీ చేయవని తెలిసినా ఫొటో దిగే సాహసం చేయరు. కానీ, సుష్మితా సేన్ ఇక్కడ. వెరీ బోల్డ్. ఈ అందాల సుందరికి ఎప్పట్నుంచో పులిని దగ్గరగా చూడాలని కోరిక. వీలైతే పులిని ప్రేమగా నిమరాలని, ఫొటో దిగాలని కూడా అనుకున్నారు. తన చిరకాల కోరికను ఇటీవల సుష్మిత తీర్చేసుకున్నారు. దత్త పుత్రికలు పదహారేళ్ల రీనీ, ఆరేళ్ల అలీషాలు ఎక్కడైనా హాలిడే ట్రిప్ వెళదామని కన్నతల్లిలా చూసుకుంటున్న పెంపుడు తల్లి సుష్మితాని అడిగారట. అంతే.. థాయ్‌ల్యాండ్ తీసుకెళ్లారు. అక్కడ పుకెట్ జూకి ఈ తల్లీకూతుళ్లు వెళ్లారు. పులి దగ్గరకు వెళ్లి దాన్ని ప్రేమగా నిమిరి, ఫొటో దిగారు సుష్మిత. రీనీ కూడా ఆ సాహసం చేసింది. అలీషా మాత్రం ముందు భయపడిందట. కానీ, ఆ తర్వాత నాలుగు నెలల పులి పిల్ల దగ్గర కూర్చుని, ప్రేమగా నిమిరింది. పులితో తాము దిగిన ఫొటోలను సుస్మిత సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. ‘‘నాకు మూగజీవాలంటే ప్రేమతో పాటు గౌరవం. పెట్ యానిమల్స్‌ని పెంచుకుంటుంటాను. ఇప్పుడు పులిని దగ్గరగా చూడటం, ఫొటోలు దిగడం చాలా హ్యాపీగా అనిపించింది. నా కూతుళ్లు కూడా చాలా ఆనందపడ్డారు’’ అని సుష్మిత పేర్కొన్నారు. -
బాలీవుడ్ బ్యూటి సాహసాలు
తన ఇద్దరు కూతుళ్లతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది బాలీవుడ్ బ్యూటి సుస్మితా సేన్. కొంత కాలంగా సినిమాలకు కూడా దూరంగా ఉంటున్న ఈ భామ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్ మీద డైనమిక్ క్యారెక్టర్స్‌తో ఆకట్టుకున్న ఈ విశ్వ సుందరి, రియల్ లైఫ్‌లోనూ తాను సాహసినే అంటూ ప్రూవ్ చేసుకుంది. తన కూతుళ్లు రినీ, అలీషాలతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న సుస్మితా పులితో ఫోటో దిగి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సుస్మిత మాత్రమే కాదు తన కూతుళ్లు కూడా ఆ పులితో ఫోటోలు దిగటం విశేషం. ప్రస్తుతం హ్యాపి యానివర్సరీతో పాటు మరో బాలీవుడ్ సినిమాలో నటిస్తున్న సుస్మితా సేన్, ఎక్కువ సమయం తన పిల్లలతో గడిపేందుకు వరుసగా సినిమాలు అంగీకరించటం లేదంది. Big one on my #bucketlist #tick -
300 జతల ‘సోనూ’ వేర్
సిక్స్ ప్యాక్ బాడీ... ఫ్యాషనబుల్ డ్రెస్... స్టయిల్... ఫిట్నెస్ ఫ్రీక్ అంటే - బాలీవుడ్ నటుడు సోనూ సూద్. ‘వదల బొమ్మాళీ వదల’ అన్న ఈ బాబుగారి గురించి కొత్త సంగతి ఒకటి బయటకొచ్చింది. అయ్యగారి ఇంటి నిండా... షూసే అట! విషయం ఏంటంటే, కొత్త రకం చెప్పులు... రకరకాల బూట్లు... రంగురంగుల చెప్పులు... ఎక్కడ కనిపించినా సోనూ సూద్ కాళ్ళు పీకేస్తాయట! ఆ బూట్లు, చెప్పులు కొని ఇంటికి పట్టుకెళ్ళేదాకా అయ్యగారి చేతులూరుకోవు. ఈ పాదరక్షల పిచ్చి ఎక్కడి దాకా వెళ్ళిందయ్యా అంటే, ఏకంగా ఇంట్లో 300కు పైగా జతల షూస్ వచ్చి చేరాయి. అరల్లో, బ్యాగుల్లో నిండా అవే! అసలు ప్యాక్ విప్పని చెప్పులే సోనూ ఇంట్లో రెండు సూట్‌కేసుల నిండా ఉన్నాయట. ఇదే స్పీడ్‌లో వెళితే... రాబోయే రోజుల్లో షూస్ పెట్టుకోవడానికే వేరే ఫ్లాట్ కావాల్సి ఉంటుందేమో! ఈ మాట ఎవరో కాదు... సోనూయే స్వయంగా చెప్పారు. అన్నట్లు, అచ్చం ఇలాగే కొత్త షూస్ వ్యామోహం ఉన్న అందాల రాశి సుస్మితాసేన్ సైతం సోనూ దెబ్బకు ఢామ్మంది. ఈ పిచ్చిలో సోనూతో తాను పోటీపడలేనం టోంది. పనిలో పనిగా... ఫిట్నెస్, ఫ్యాషన్‌లో మాత్రం సోనూ మియాకు సాటి లేరంటోంది. సరే.. ఆ సంగతలా ఉంచితే, వందల కొద్దీ చెప్పులు చూడాలంటే, షోరూమ్‌కే కాదు.. సోనూ ఇంటికి కూడా వెళ్లొచ్చేమో! గిట్టనివాళ్ళు మాత్రం ఇవన్నీ ‘సోనూ మియా కొనుక్కొచ్చినవా? కొట్టుకొచ్చినవా? ఎవరైనా కొడితే వచ్చినవా’ అంటున్నారట. హతవిధీ! -
ఐశ్వర్యా రాయ్... ఆ ముగ్గురూ నై
కొంతమంది ఇట్టే ఫ్రెండ్స్ అయిపోతారు. మరికొంతమంది ఎంత కాలం కలిసి పని చేసినా ఉప్పూ నిప్పులాగానే ఉంటారు. ఇందుకు రకరకాల కారణాలు. అసూయ.. ఎక్స్ట్రా... ఎక్స్ట్రా... బాలీవుడ్లో ఇలా ఆగర్భ శత్రువుల్లా ప్రవర్తించే జాబితా చాలా ఎక్కువ. మాట్లాడుకోవడం సంగతలా ఉంచితే, ఎక్కడైనా తారసపడితే కనీసం పలకరింపుగా కూడా ఈ ముద్దుగుమ్మలు నవ్వుకోరట. ఇక.. ఈ ఆగర్భ శత్రువుల గురించి తెలుసుకుందాం... ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురంటే ఐశ్వర్యా రాయ్‌కి పడదు. వాళ్లే సుస్మితా సేన్, రాణీ ముఖర్జీ, సోనమ్ కపూర్. ముందుగా సుస్మితా సేన్, ఐష్ గురించి చెప్పాలంటే... వృత్తిపరమైన పోటీ కారణంగా ఈ ఇద్దరూ ఎప్పుడూ స్నేహంగా మెలగలేదు. మోడలింగ్ డేస్ అప్పుడే వీళ్లిద్దరి మధ్య వైరం మొదలైంది. టాప్ మోడల్ అనిపించుకోవడానికి ఇద్దరూ పోటీపడేవారట. ఆ తర్వాత ‘ఫెమీనా మిస్ ఇండియా’ కిరీటం పొందే విషయంలో ఈ సుందరీమణులు పోటీపడ్డారు. చివరకు ఆ కిరీటం సుస్మితా గెల్చుకున్నారు. ఆ తర్వాత ‘మిస్ యూనివర్శ్’ కిరీటం కూడా దక్కించుకున్నారామె. ఐష్ ఏమో ‘మిస్ వరల్డ్’ టైటిల్ మాత్రమే గెల్చుకున్నారు. ఈ కిరీటాలే ఈ ఇద్దరి మధ్య నిప్పు రాజేశాయి. సుస్మితా ప్రతిష్ఠాత్మక బిరుదులు సొంతం చేసుకోవడం ఐష్‌కి మింగుడుపడలేదని బాలీవుడ్లో చెప్పుకుంటుంటారు. ఏది ఏమైనా 1990లలో మొదలైన వీరి శత్రుత్వానికి ఇప్పటివరకూ ఫుల్స్టాప్ పడకపోవడం విశేషం. ఐష్, రాణీ ముఖర్జీ కూడా ఎడమొహం పెడమొహంగా ఉంటారు. వీరిద్దరి మధ్య మొట్టమొదటిసారి మనస్పర్థలు నెలకొడానికి కారణం ‘చల్తే చల్తే’ సినిమా. షారూక్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో ముందు ఐశ్వర్యా రాయ్‌ని నాయికగా తీసుకున్నారు. కానీ, ఆ తర్వాత ఐష్ స్థానంలో రాణీ ముఖర్జీని ఎంపిక చేశారు. ఇక, వ్యక్తిగతంగా అభిషేక్ బచ్చన్ విషయంలో ఇద్దరూ శత్రువులయ్యారు. అభిషేక్ బచ్చన్‌తో రాణి డేటింగ్ చేశారనే వార్త అప్పట్లో ప్రచారమైంది. కానీ, మధ్యలో ఐష్ ఇన్వాల్వ్ అయిపోయి, అభిషేక్ బచ్చన్‌తో డేటింగ్ మొదలుపెట్టారట. ఆ విధంగా రాణీతో డేటింగ్‌కి అభిషేక్ రామ్ రామ్ చెప్పేశారట. ఆ తర్వాత అభిషేక్, ఐష్ పెళ్లి చేసుకుని సెటిలవ్వడం తెలిసిందే. కానీ, రాణీ, ఐష్ మధ్య ఉన్న మనస్పర్థలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఐశ్వర్యా రాయ్, సుస్మితా, రాణీ ముఖర్జీ.. ఈ ముగ్గురూ అటూ ఇటూగా సమ వయస్కులే. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా వీళ్ల మధ్య పొరపొచ్ఛాలు రావడం సహజం. కానీ, ఐష్కన్నా దాదాపు పదిహేనేళ్లు చిన్నదైన సోనమ్ కపూర్‌తో వైరం ఏర్పడటం విచిత్రం. అయితే, దీనికి పూర్తి బాధ్య సోనమ్‌దే. ఈ ఇద్దరూ ఓ సౌందర్య సాధనానికి ప్రచారకర్తలుగా చేశారు. దానికి సంబంధించిన సమావేశంలో ఐశ్వర్యా రాయ్‌ని సోనమ్ ‘ఆంటీ’ అని సంబోధించారు. గ్లామర్ ప్రపంచంలో ఉన్నవాళ్లు ఆంటీ, అంకుల్ అనే పిలుపుని ఇష్టపడరు. సోనమ్ అలా పిలవడం ఐష్ అంగీకరించలేకపోయారు. అప్పట్నుంచీ ఇద్దరి మధ్య మాటలు కట్. -
నాలుగు ప్రేమకథల సమ్మేళనం
ముంబై: బెంగాలీ చిత్రం 'నిర్బాక్' హిందీలో రీమేక్ చేసే ఉద్దేశం తనకు లేదని వెండి తెరకు రీఎంట్రీ ఇచ్చిన మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ చెప్పారు. సుస్మితా సేన్ మాతృభాషలో నటించిన తొలి చిత్రం ఇది. నాలుగు ప్రేమకథల సమ్మేళనంతో నిర్మించిన చిత్రం ఇది. నాలుగు ప్రేమ కథలు ఓ మహిళతో కనెక్ట్ అవుతాయి. చిత్రంలో ప్రాధాన్యతగల ఆ మహిళ పాత్రను సుస్మిత పోషించారు. బాలీవుడ్‌లోని తన మిత్రుల కోసం ఈ సినిమాను శుక్రవారం ఇక్కడ ప్రిమియర్ షో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ చిత్రం పూర్తిగా బెంగాలీ ఇతివృత్తంతో కూడుకున్నదన్నారు. నిర్బాక్ అంటే అర్ధం మూగ అని చెప్పారు. ఈ మూవీలో అతి తక్కువ డైలాగ్స్ మాత్రమే ఉన్నాయని తెలిపారు. మనదేశంలోనే కాదు, ప్రపంచంలోని అందరికీ ఈ సినిమా అర్ధం అవుతుందన్నారు. ఏ భాషలోనూ రీమేక్ చేయవలసిన అవసరంలేదని చెప్పారు. మాతృ భాషలో ఒక్క సినిమాలోనైనా నటించాలన్నది తన తండ్రి కోరిక అని ఆమె చెప్పారు. అందుకే ఈ సినిమాలో నటించినట్లు తెలిపారు. సుస్మితా సేన్ చివరిసారిగా 2010లో 'నో ప్రాబ్లం' చిత్రంలో నటించారు. ఇంతకాలం తరువాత మళ్లీ ఈ బెంగాలీ చిత్రంలో నటించారు. జాతీయ అవార్డు గ్రహీత సృజిత్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమాను 22 రోజుల్లోనే పూర్తి చేశారు. మే 1న కోల్‌కతాలో విడుదలైన ఈ సినిమా దేశమంతటా శుక్రవారం విడుదలైంది. -
'క్రిమినల్‌కు, మనిషికి చాలా వ్యత్యాసం ఉంది'
ముంబై: ఒక నేరస్తుడిగా ఉండటానికి, ఒక మనిషిగా ఉండటానికి చాలా వ్యత్యాసం ఉందని నటి సుస్మితాసేన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. దానిని పరిశీలించినప్పుడే నిజమైన న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు అయిదేళ్ల జైలు శిక్ష పడిన తరువాత ఆమె ఈ వ్యాఖ్యలు ట్విట్ చేశారు. ''సల్మాన్ పైకోర్టుకు వెళ్లాలి. సల్మాన్ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. సల్మాన్‌కు, ఆయన కుటుంబానికి మానసిక స్థైర్యం కలగాలని కోరుకుంటున్నాను'' అని సుస్మితా సేన్ ట్విట్ చేశారు. సల్మాన్ ఖాన్‌తో కలిసి సుస్మిత పలు చిత్రాలలో నటించారు. -
ర్యాంప్‌పై కాంతులీనే కెరీర్‌కు.. మోడలింగ్
ఐశ్వర్యారాయ్, సుస్మితాసేన్, కత్రినా కైఫ్, లారా దత్తా, జాన్ అబ్రహం, అర్జున్ రాంపాల్... వెండితెరపై దేదీప్యమానంగా వెలిగిపోతున్న తారలు. కానీ, ఒకప్పుడు మోడలింగ్ రంగంలో పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్నవారే. మోడల్స్‌గా కెరీర్‌ను ప్రారంభించివారు టీవీ, సినిమాల్లో అగ్రతారలుగా మారిపోతున్నారు. దేశవిదేశాల్లో మంచి గుర్తింపు, అధిక ఆదాయం, లక్షల మంది అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు. అందుకే నేటి యువత దృష్టిలో మోస్ట్ గ్లామరస్ కెరీర్.. మోడలింగ్. మార్కెటింగ్ యుగంలో మోడలింగ్‌కు విపరీతమైన గిరాకీ ఉంది. దీన్ని కెరీర్‌గా ఎంచుకొని, కష్టపడి పనిచేస్తే అద్భుతమైన అవకాశాలను చేజిక్కించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవకాశాలు ఎన్నెన్నో... టూత్‌పేస్ట్, సబ్బుల నుంచి ఇల్లు, కారు వరకు ప్రతి వస్తువుకు ప్రచారం చేసిపెట్టడానికి మోడళ్లను ఉపయోగించుకుంటున్నారు. ఇక ప్రసార మాధ్యమాల వ్యాప్తితో వీరికి డిమాండ్ భారీగా పెరిగింది. నగరాల్లో తరచుగా ఏదోఒక చోట ఫ్యాషన్ షోలు జరుగుతూనే ఉంటాయి. కార్పొరేట్ సంస్థల సదస్సుల్లో క్యాట్‌వాక్‌లు సర్వసాధారణమయ్యాయి. అందమైన శరీర సౌష్టవం, ఆకట్టుకొనే రూపం కలిగిన మోడల్స్ ర్యాంప్‌పై పిల్లి నడకలతో ఆహూతులను అలరిస్తున్నారు. అదేసమయంలో సంస్థల ఉత్పత్తులకు తగినంత ప్రచారం కల్పిస్తున్నారు. ఇక టీవీ చానళ్లలో వాణిజ్య ప్రకటనలు లేని కార్యక్రమాలే కనిపించడం లేదు. మోడలింగ్ రంగంలో రాణించినవారికి ఇలాంటి ప్రకటనల్లో నటించే అవకాశం కలుగుతోంది. టీవీలో గుర్తింపు పొందిన మోడళ్ల తర్వాతి అడుగు వెండితెరవైపే ఉంటోంది. ఎత్తు అడ్డంకి కాదు జాతీయ, అంతర్జాతీయ అందాల పోటీల్లో నెగ్గి, వజ్రాల కిరీటాలను సగర్వంగా ధరించిన మోడల్స్ ఎందరో ఉన్నారు. వార్తా పత్రికలు, మేగజైన్లలో వచ్చే అడ్వర్టైజ్మెంట్లలోనూ మోడళ్ల హొయలు కనిపించాల్సిందే. అంటే అవకాశాలకు కొదవే లేదని చెప్పొచ్చు. మోడల్‌గా మారాలంటే ఇప్పుడు ఎత్తు అడ్డంకి కాదని నిపుణులు అంటున్నారు. ఒకప్పుడు ఆరు అడుగులకు పైగా ఉన్నవారే ఇందులో కనిపించేవారు. ఇటీవలి కాలంలో ఐదు అడుగులు ఉన్నవారికి కూడా అవకాశాలు లభిస్తున్నాయి. తీర్చిదిద్దినట్లుగా శరీర సౌష్టవం, ఆరోగ్యవంతమైన చర్మం, జుట్టు ఉన్నవారు ఇందులో రాణించొచ్చు. మోడలింగ్‌లో ఆడ, మగ భేదం లేదు. ఎవరి అవకాశాలు వారికి ఉంటున్నాయి. ఈ రంగంలో అనుభవం సంపాదించి, సొంతంగా మోడలింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవచ్చు. కావాల్సిన స్కిల్స్: మోడల్స్‌కు ప్రధానంగా కావాల్సిన లక్షణం.. బిడియాన్ని వదిలేయడం. సందర్భానికి తగిన దుస్తులు ధరించడానికి సిద్ధపడాలి. ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిత్యం వ్యాయామంతో శరీర బరువును నియంత్రించుకోవాలి. ఒక కిలో బరువు పెరిగినా అవకాశాలు దెబ్బతింటాయి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. పబ్లిక్ రిలేషన్స్ పెంచుకోవాలి. మేకప్, కెమెరా, ఫ్యాషన్ ట్రెండ్స్‌పై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. పగలు, రాత్రి.. ఏ సమయంలోనైనా పనిచేయగలగాలి. అర్హతలు: మోడలింగ్ రంగంలో కాలు మోపేందుకు ప్రత్యేకంగా విద్యార్హతలంటూ లేవు. అయినా కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తిచేయడం మంచిది. తగిన అర్హతలుండి మోడల్‌గా మారాలనుకునేవారు మొదట ఏదైనా మోడలింగ్ ఏజెన్సీ లేదా ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్‌ను సంప్రదించి, ఆకర్షణీయమైన ప్రొఫెషనల్ పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలి. ఇందుకు రూ.20 వేలకు పైగానే ఖర్చవుతుంది. ఈ పోర్ట్‌ఫోలియోను సాధ్యమైనన్ని ఎక్కువ మోడలింగ్, అడ్వర్టైజ్మెంట్ సంస్థలకు పంపించాలి. అవసరాన్ని బట్టి ఆయా సంస్థల నుంచి అవకాశాలు వస్తాయి. మొదట చిన్నపాటి ఫ్యాషన్ వీక్ ఆడిషన్లు, ర్యాంప్ షోలలో పాల్గొనొచ్చు. ఒకసారి గుర్తింపు(బ్రేక్) వస్తే ప్రొఫెషనల్ మోడల్‌గా వృత్తిలో స్థిరపడొచ్చు. కష్టపడితే ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. కొన్ని మోడలింగ్ ఏజెన్సీలు ఔత్సాహికులకు అవసరమైన శిక్షణ ఇస్తున్నాయి. వేతనాలు: మోడళ్లకు డిమాండ్‌ను బట్టి ఆదాయం లభిస్తుంది. ప్రారంభంలో ఒక్కో కార్యక్రమానికి రూ.4 వేల నుంచి రూ.6 వేలు అందుకోవచ్చు. మూడు నాలుగేళ్ల అనుభవం సంపాదిస్తే ఒక్కో షో/షూట్‌కు రూ.30 వేల నుంచి రూ.40 వేలు పొందొచ్చు. టీవీలో వాణిజ్య ప్రకటనల్లో నటిస్తే ఒక రోజుకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మోడలింగ్ శిక్షణ ఇస్తున్న సంస్థలు: - లఖోటియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-హైదరాబాద్ వెబ్సైట్: www.lakhotiainstituteofdesign.com - గ్లిట్జ్ మోడలింగ్-ఢిల్లీ వెబ్సైట్: www.glitzmodelling.in - ద ఎలైట్ స్కూల్ వెబ్సైట్: http://elitemodelschoolindia.com/ - ద మెహర్ భాసిన్ అకాడమీ వెబ్సైట్: http://meharbhasin.com/ మోడలింగ్‌తో కలర్‌ఫుల్ లైఫ్ ‘‘రొటీన్‌కు భిన్నంగా ఉండాలనుకునే యువత తమ కెరీర్ కూడా వైవిధ్యభరితంగా మలచుకుంటున్నారు. ఇదే కోవలోని కెరీర్.. మోడలింగ్. నగర ర్యాంప్‌లపై నడక ప్రారంభించి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు తెచ్చుకున్న వారెందరో ఉన్నారు. ప్రస్తుతం నగరంలో మోడల్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఫ్యాషన్ షోల కోసం గతంలో ముంబై, కోల్‌కతా నుంచి మోడల్స్‌ను రప్పించేవారు. కానీ ప్రస్తుతం ఇక్కడే మోడలింగ్, ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్స్ ఏర్పాటు కావడంతో మనవాళ్లే బయటకెళ్లి ప్రదర్శనలిస్తున్నారు. క్యాట్ వాక్‌లతో కెరీర్‌ను ప్రారంభించిన ఎందరో మోడల్స్ వ్యాపార, వాణిజ్య ప్రకటనలు, సీరియల్స్, సినిమాలలో అవకాశం దక్కించుకున్నారు’’ - శ్రావణ్‌కుమార్, మోడల్ డిజైనర్ -
పుట్టినింటి తెరపై... సుస్మితా సేన్
మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ ఎట్టకేలకు ఇప్పుడు సొంత భాష, సొంత రాష్ట్రం వైపు దృష్టి పెట్టారు. అదేమిటంటారా? అవునండీ! ఇప్పటి దాకా ఇతర భాషా చిత్రాల్లోనే నటిస్తూ వచ్చిన ఆమె ఇన్నాళ్ళకు తొలిసారిగా తన మాతృభాష అయిన బెంగాలీలో వెండితెర మీద మెరవనున్నారు. ఈ వారంలో సెట్స్ మీదకు వెళుతున్న బెంగాలీ చిత్రం ‘నిర్బాక్’తో పుట్టింటికి వచ్చినట్లుగా ఉందని సుస్మితా సేన్ వ్యాఖ్యానించారు. ‘‘నా తొలి చిత్రం షూటింగ్ నిమిత్తం కోల్‌కతాకు వెళుతున్నాను. నాకెంతో ఉద్వేగంగా ఉంది. నా మూలాలు వెతుక్కుంటూ వెళుతున్నట్లుగా అనిపిస్తోంది’’ అని 38 ఏళ్ళ ఈ మాజీ మిస్ యూనివర్స్ మెరుస్తున్న కళ్ళతో చెప్పారు. గతంలో బెంగాలీ సినీ అవకాశాలు వచ్చినప్పటికీ, భయపడి ఆగిపోయిన ఆమె ఇప్పుడు దాన్ని అధిగమించి, ఈ సినిమా ఒప్పుకున్నారు. ‘‘తెలుగు, తమిళం, ఇంకా ఇతర భాషల్లో నటించిన నేను బెంగాలీ అనగానే భయపడేదాన్ని. కానీ, ఇప్పుడు ఆ భయం వదిలించుకున్నాను. ఈ చిత్రంలో కొందరు అద్భుతమైన నటీనటులతో కలసి నటించనున్నాను’’ అని ఆమె చెప్పారు. జాతీయ అవార్డు గ్రహీత సృజిత్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. అలాగే, ఐశ్వర్యారాయ్‌తో కలసి నటించనున్నట్లు చాలా కాలంగా వినిపిస్తున్న వార్తల గురించి కూడా సుస్మితా సేన్ వివరణ ఇచ్చారు. ‘‘ఓ స్క్రిప్టు గురించి మేమిద్దరం ఆలోచిస్తున్న మాట నిజం. అది ఎప్పుడు కార్యరూపం ధరిస్తుందన్నది మాత్రం నిర్మాత గౌరాంగ్ దోషీయే చెప్పాలి’’ అని ఈ అందాల నటి తెలిపారు. -
తెలుగు తెరపై మరో అందాల సుందరి
అందాల సుందరి టైటిల్ గెల్చుకున్న ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్ వంటివారు సినిమాల్లో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో అందాల సుందరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. ఈ బ్యూటీ పేరు శిల్పా సింగ్. రెండేళ్ల క్రితం ‘ఐయామ్ షి-మిస్ యూనివర్శ్ ఇండియా టైటిల్ గెల్చుకున్న ఆమె ఓ తెలుగు చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. ఎమ్.జి. మరియు ఎమ్.ఎస్. సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అనూప్ బండారీ దర్శకుడు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘శిల్పా సింగ్ ప్రధాన పాత్ర చేయనున్న ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో కీలక పాత్ర చేయనున్నారు. నిరూప్, అవంతికా శెట్టి, రాధికా చేతన్ హీరో, హీరోయిన్లు. ‘వర్డ్స్’ అనే షార్ట్ ఫిలింతో పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న అనూప్‌ని మా సంస్థ ద్వారా దర్శకునిగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: మురళి గంధర్వ, సంగీతం: ఆగం రాక్ బ్యాండ్. -
సుస్మిత మళ్లీ మెరవనుంది
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ మళ్లీ తెరపై కనిపించనుంది. చివరిసారిగా ‘నో ప్రాబ్లం’ (2010)లో తెరపై కనిపించిన సుస్మితా, తాజాగా బెంగాలీ చిత్రం ‘నిర్బాక్’లో ప్రధాన పాత్ర పోషించనుంది. ప్రముఖ బెంగాలీ దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ జూలై 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఎక్కువ భాగం షూటింగ్ ముంబైలో జరుగుతుందని, మిగిలిన భాగం కోల్‌కతాతో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. -
నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను: సుస్మితా సేన్
నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని సుస్మితా సేన్ అన్నారు. అంతేకాకుండా ఓ అందమైన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాను మీడియాకె వెల్లడించింది. ఈ సమాజంలోని ఆచారాలను పాటించను. మన సమాజమే ఈ వ్యవస్థను రూపొందించింది. 18 ఏళ్లకు డిగ్రీ పూర్తి చేసి.. 22 ఏళ్లకు పెళ్లి చేసుకుని.. 27 ఏళ్లకు పిల్లల్ని కనే పద్దతి తనకు నచ్చదని సుస్మితా అన్నారు. ఆచారాలు, సాంప్రదాయాలను తాను పాటించను అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రతి ఒక్క వ్యక్తి డీఎన్ ఏ వేర్వేరుగా ఉంటుంది. ఏదో ఒకరోజు పెళ్లి చేసుకుంటానని అన్నారు. మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకుని 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుస్మిత క్యాన్సర్ రోగుల మధ్య ఓ వేడుకను జరుపుకుంది. రణదీప్ హుడా, విక్రమ్ భట్ బాలీవుడ్ నటులతోనూ, పాకిస్థాన్ క్రికెటర్ వసీం అక్రమ్ తో డేటింగ్ చేసినట్టు మీడియాలో రూమర్లు షికారు చేసిన సంగతి తెలిసిందే. -
మళ్లీ నటిస్తున్న సుస్మితాసేన్
దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత సుస్మితాసేన్ ఓ చిత్రంలో నటించబోతున్నారు. ‘నో ప్రాబ్లమ్’ తర్వాత ఆమె వేరే ఏ సినిమాలోనూ నటించ లేదు. ఈ ఏడాది నుంచి వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ బెంగాలీ సినిమాలో నటించడానికి అంగీకరించారు సుస్మిత. తొమ్మిదేళ్ల క్రితం ‘ఇట్ వాస్ రెయినింగ్ దట్ నైట్’ అనే బెంగాలీ సినిమాలో నటించారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆమె ఆ భాషలో సినిమా అంగీకరించడానికి కారణం కథ బాగా నచ్చడమే. లేడీ డెరైక్టర్ రూపాలీ గుహ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రకథ నచ్చి, ఓ నిర్మాతగా కూడా వ్యవహరించాలనుకుంటున్నారట సుస్మిత. అలాగే, ఈ చిత్రం రీమేక్ హక్కులను చేజిక్కించుకుని, హిందీలో నిర్మించాలనుకుంటున్నారట. ఒకవైపు బెంగాలీ సినిమాకి సన్నాహాలు చేసుకుంటూనే మరోవైపు ‘హ్యాపీ యానివర్శరీ’ అనే హిందీ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పలు వాణిజ్య ప్రకటనలకు దర్శకత్వం వహించిన ప్రహ్లాద్ కక్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో అభిషేక్‌బచ్చన్, ఐశ్వర్యారాయ్ జంటగా నటించనున్నారట. ఒకప్పుడు ఐష్, సుష్ల మధ్య అంత సఖ్యత ఉండేది కాదనే వార్తలు వచ్చాయి. అయితే, అవేం మనసులో పెట్టుకోకుండా ఈ ఇద్దరూ ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారట. సుస్మితా అయితే.. ‘ఐశ్వర్యాతో సినిమా చేయడానికి నేను రెడీ’ అని ఇటీవల ఓ సందర్భంలో బహిరంగంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. -
మిస్ వరల్డ్ తర్వాతే బాలీవుడ్..
ముంబై: ‘నాకేం కావాలో నాకు బాగా తెలుసు.. నా తదుపరి టార్గెట్ మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకోవడం.. ఈ మధ్యలో బాలీవుడ్ నుంచి మంచి అవకాశాలు వచ్చినా వాటిపై దృష్టిపెట్టను..’ అని స్పష్టం చేసింది ఫెమినా మిస్ ఇండియా -2014 టైటిల్ గెలుచుకున్న జైపూర్ అందాలభామ కోయల్ రాణా. ‘నేను ప్రపంచంలోనే అత్యున్నతస్థానంలో ఉన్నానని భావిస్తున్నా. నాకు జీవితంలో ఏం కావాలనేది స్పష్టమైన అవగాహన ఉంది.. మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న తర్వాత ఇప్పుడు నా దృష్టి మొత్తం మిస్ వరల్డ్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంపైనే కేంద్రీకరించా..’ అని ఆమె పేర్కొన్నారు. గత శనివారం జరిగిన 51వ ఎడిషన్ ఫెమినా మిస్ ఇండియా-2014 అందాల పోటీల్లో ఈ జైపూర్ భామ కిరీటాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, తనకు మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ఆదర్శమని రాణా తెలిపింది. ‘మెదడును ఉపయోగించే అందాల సుందరీమణిగా సుస్మితా సేన్‌ను చెప్పవచ్చు. ఆమె మిస్ ఇండియా, మిస్ యూనివర్స్‌గా కీర్తి గడించినా అంతకన్న ఎక్కువ సమాజ సేవ చేయడంలో ముందుంది. ఆమె జీవితాన్ని నేను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా..’ అని కోయల్ రాణా వివరించింది.‘నా జీవితంలో ఇంకా సుదీర్ఘ ప్రయాణం ఉంది.. చాలా విజయాలను సొంతం చేసుకోవడానికి ఇంకా కష్టపడాల్సి ఉంది..’ అని ఆమె అంది. సినిమాల్లో నటించడం గురించి ప్రశ్నిస్తే ‘ప్రస్తుతం నా దృష్టి మొత్తం మిస్ వరల్డ్ టైటిల్ పైనే ఉంది.. భవిష్యత్తులో బాలీవుడ్లో మంచి అవకాశాలు వస్తే నటిస్తానేమో.. ఇప్పుడే ఆ విషయాలు చెప్పేంత వయస్సు, అనుభవం నాకు లేవు..’ అని ముద్దుగా చెప్పింది. జైపూర్‌లో పుట్టా.. ఢిల్లీలో పెరిగానని, మిస్ ఇండియా కన్నా తనకు చదువు ఎక్కువ ఇష్టమని కోయల్ వివరించింది. మున్ముందు తాను ఇంకా చదువుకుంటానని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో డిగ్రీ చదువుతున్నానని చెప్పింది. -
పెళ్లి కాని తల్లి.. విశ్వసుందరి!
పెళ్లి కాకుండానే ఇద్దరు ఆడ పిల్లలకు తల్లిగా బాధ్యతలు నిర్వహించటం సాధ్యమేనా? అవును.. మనసున్న మనిషిగా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని, వారిలో ఒకరికోసం న్యాయపోరాటం కూడా చేసిన ధీర.. మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్. అందాల పోటీల్లో విజేత కావడం, బాలీవుడ్ అభిమానుల హృదయాలు కొల్లగొట్టడమే కాదు.. సేవా కార్యక్రమాల్లో ముందుండి మహిళలకు స్ఫూర్తినిచ్చిన సుస్మిత.. 38వ పడిలోకి అడుగుపెట్టింది. 1994లో విశ్వ సుందరి కిరీటం గెలిచి భారత జాతి ఖ్యాతి పెంచిన సుస్మిత.. ఎన్‌జివోలతో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సొంతంగా తనూ కొన్ని సేవా సంస్థలను నిర్వహిస్తోంది. సుమారు పదకొండేళ్ల క్రితం యానీ అనే చిన్నారిని సుస్మితా దత్తత తీసుకుంది. రెండేళ్ల క్రితం అలీషా అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. అలీషా కోసం కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. అయినా తను లెక్కచేయలేదు. న్యాయస్థానంలో పోరాటం చేసి విజయం సాధించింది. అయితే వీరిని దత్తత బిడ్డలంటే మాత్రం సుస్మిత ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. కంటేనే తల్లా? అని ఎదురు ప్రశ్నిస్తుంది. చట్టం కోసం దత్తత అన్న పదం తప్ప, తమ మధ్య అది ఎప్పటికీ అడ్డు కాదని స్పష్టం చేసింది. 1975, నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో సుస్మితా సేన్ జన్మించింది. తండ్రి షుబీర్ సేన్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పని చేయగా, తల్లి శుభ్రా సేన్ నగల డిజైనర్. సుస్మిత హైదరాబాద్‌లో జన్మించినా చదువంతా ఢిల్లీలో సాగింది. ఆ తర్వాత మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకుని సినిమాల్లోకి ప్రవేశించింది. తెలుగులో నాగార్జున సరసన 'రక్షకుడు' చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు కొంత విరామం ఇచ్చి తన కుటుంబంతో సంతోషంగా గడుపుతోంది. సమయమంతా పిల్లలకే కేటాయిస్తోంది. 2013 సంవత్సరానికి సుస్మితాసేన్ మదర్‌థెరిస్సా ఇంటర్నేషనల్ అవార్డు అందుకుంది. సామాజిక న్యాయం కోసం కృషిచేసేవారిని గుర్తించి గౌరవించేందుకు ద హార్మనీ ఫౌండేషన్ అనే సంస్థ ఈ అవార్డు నెలకొల్పింది. పద్దెనిమిదేళ్ళ వయసులో విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకుని భారతదేశ సౌందర్య సౌరభాన్ని ప్రపంచ దేశాలకు రుచి చూపించిన సుస్మితా సేన్, ఇప్పుడు ఇద్దరు బిడ్డలకు తల్లిగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మాతృత్వ మాధుర్యాన్ని అనుభవించాలన్నా, బిడ్డలకు రుచి చూపాలన్నా పేగు తెంచుకున్న బంధమే అక్కర్లేదని నిరూపిస్తోంది సుస్మిత. ఇప్పటికీ అప్పుడప్పుడు లవ్ ఎఫైర్స్‌తో వార్తల్లో కనిపిస్తూనే ఉంది. ఆ ఊహాగానాలకు పుల్‌స్టాప్ పెడుతూ ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సుస్మితానే ఓ కార్యక్రమంలో ప్రకటించింది కూడా. అయితే వరుడు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. -
సుస్మితా సేన్‌కు మదర్ థెరిసా అవార్డు
మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌కు అరుదైన గౌరవం దక్కింది. సుస్మిత చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఓ స్వచ్ఛంద సంస్థ మదర్ థెరిసా అంతర్జాతీయ అవార్డును ఆమెకు బహూకరించింది. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో అవార్డును అందజేశారు. సుస్మిత ఈ విషయాన్ని సోమవారం ఉదయం ట్విట్టర్లో పేర్కొంటూ సంతోషం వ్యక్తం చేశారు. సుస్మిత పలు స్వచ్ఛంద సంస్థలతో కలసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అనాథ పిల్లలను దత్తత తీసుకున్నారు. 37 ఏళ్ల సుస్మిత బీవీ నెంబర్‌వన్, మైన్ హూ నా వంటి హిందీ సినిమాల్లో మెప్పించారు. టాలీవుడ్‌లోనూ ఆమె నటించారు. 'రక్షకుడు' సినిమాలో నాగార్జున సరసన నటించారు. -
పెళ్లి చేసుకోమని ఒకటే పోరు: రణదీప్ హుడా
బాలీవుడ్ లో సుస్మితా సేన్, నీతూ చంద్రల డేటింగ్ తో కాలం గడిపిన బాలీవుడ్ హీరో రణదీప్ హుడా కు ఈ మధ్య ఇంటిపోరు ఎక్కువైంది. ప్రస్తుతం ఒంటరిగా కాలం గడుపుతూ.. కెరీర్ పైనే కన్నేసిన రణదీప్ ను ఓ ఇంటివాడైతే చూడాలని తల్లి కోరుకునేదటా! అయితే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ అవకాశాలు పెరగడంతో పరిస్థితిని అర్ధం చేసుకున్న తన తల్లి ప్రస్తుతం పెళ్లి విషయం ఎత్తడం లేదని రణదీప్ తెలిపాడు. తన కుటుంబమే తనకు అతిపెద్ద విమర్శకులని.. తన కుటుంబానికి ఎలాంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా.. తనకు పూర్తి సహకారాన్నిఅందిస్తున్నారని రణదీప్ మీడియాతో అన్నాడు. మాన్సూన్ వెడ్డింతో కెరీర్ ప్రారంభించిన రణదీప్ హుడా డర్నా జరూరీ హై, రిస్క్, రంగ్ రసియా, లవ్ కిచిడి,జన్నత్ 2, మర్డర్ 3 చిత్రాల్లో నటించాడు. -
శ్రీదేవి బర్త్ డే పార్టీలో తారల హడావిడి!
బాలీవుడ్ అందాల తార శ్రీదేవి 50 జన్మదినాన్ని పురస్కరించుకుని భర్త బోని కపూర్ ఇచ్చిన విందు బాలీవుడ్ తారలతో కళకళలాడింది. బోని కపూర్ ఏర్పాటు చేసిన విందుకు బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు, తారలు తరలివచ్చారు. సద్మా, హిమ్మత్ వాలా, చాల్ బాజ్, జుదాయి, మిస్టర్ ఇండియాలాంటి హిట్ లతో అగ్రతార వెలుగొంది.. కొంత కాలం బాలీవుడ్ కు దూరమైన శ్రీదేవి తాజాగా ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. విందుకు హాజరైన వారిలో బాలీవుడ్ తారలు శిల్పా శెట్టి, సుస్మితా సేన్, హేమా మాలిని, ఇషా డియోల్, జూహీ చావ్లాలతోపాటు దర్శకులు అబ్బాస్ మస్తాన్, బంటీవాలియా, రమేశ్ తరానీ, గిరిష్ తరానీ, మధుర్ బండార్కర్, రాజ్ కుమార్ సంతోషి, జయ్ మెహతా, రిషి కపూర్, మనోజ్ బాజ్ పేయ్, వినోద్ ఖన్నా, అనుపమ్ ఖేర్, అనిల్ కపూర్ లు సంగీత దర్శకులు అను మాలిక్, బప్పిల హరి లుహాజరయ్యారు. -
ముంబైలోని ర్యాంప్ షోలో బాలీవుడ్ తారలు
అధితిరావు జూహీ చావ్లా సుస్మితా సేన్